Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
Super Over Rules In Cricket: సూపర్ ఓవర్ రూల్స్ తెలుసా? అది టై అయితే విజేతని ఎలా డిసైడ్ చేస్తారు?
HDHarish Darla
Feb 12, 2026 07:43:09
Hyderabad, Telangana

SA Vs AFG Super Over Highlights: టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన 'డబుల్ సూపర్ ఓవర్' మ్యాచ్ తర్వాత, ఐసీసీ (ICC) సూపర్ ఓవర్ నిబంధనలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు సూపర్ ఓవర్ నియమాలు ఏమిటి? ఒకవేళ రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే పరిస్థితి ఏంటి? అనే సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాం.

గతంలో మ్యాచ్ టై అయితే 'బౌండరీ కౌంట్' (ఎక్కువ ఫోర్లు, సిక్సర్లు కొట్టిన జట్టు విజేత) ఆధారంగా ఫలితాన్ని నిర్ణయించేవారు. కానీ 2019 వరల్డ్ కప్ ఫైనల్ వివాదం తర్వాత, ఐసీసీ ఈ నిబంధనను మార్చి, కేవలం ఆట ద్వారానే విజేతను తేల్చే సరికొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది.

అపరిమిత సూపర్ ఓవర్లు
ఒకవేళ మొదటి సూపర్ ఓవర్ టై అయితే, ఫలితం తేలే వరకు రెండో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. రెండోది కూడా టై అయితే మూడోది.. ఇలా విజేత ఎవరో తెలిసే వరకు అపరిమితంగా సూపర్ ఓవర్లు కొనసాగుతాయి. వాతావరణం అనుకూలించని పక్షంలో మాత్రమే దీనిని నిలిపివేస్తారు.

1) అయితే ఈ సూపర్ ఓవర్లలో ప్రతి జట్టు ముగ్గురు బ్యాటర్లను నామినేట్ చేస్తుంది. రెండు వికెట్లు పడిపోతే ఆ ఓవర్ ముగిసినట్లే. ఒక బౌలర్ కేవలం ఒక ఓవర్ మాత్రమే వేయాలి.

2) మొదటి సూపర్ ఓవర్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు, రెండో సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల రెండు జట్లకు సమాన అవకాశం లభిస్తుంది.

3) మునుపటి సూపర్ ఓవర్‌లో అవుట్ అయిన బ్యాటర్ తర్వాతి సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేయడానికి అనర్హుడు. అంటే, కొత్త బ్యాటర్లు రావాలి. ఒకవేళ నాటౌట్‌గా నిలిచిన వారుంటే వారు మళ్లీ ఆడవచ్చు.

4) ఒక సూపర్ ఓవర్ వేసిన బౌలర్, వరుసగా రెండో సూపర్ ఓవర్ వేయడానికి వీల్లేదు. కెప్టెన్ కచ్చితంగా వేరే బౌలర్‌ను ఎంచుకోవాలి.

5) సూపర్ ఓవర్‌లో వేసే వైడ్లు (Wides), నో-బాల్‌లు (No-balls) బ్యాటింగ్ జట్టుకు అదనపు పరుగులు ఇవ్వడమే కాకుండా, బౌలర్ ఆ బంతిని మళ్లీ వేయాల్సి ఉంటుంది. కేవలం ఆరు బంతులే కాబట్టి, ప్రతి పరుగు విలువైనదే.

6) వాతావరణం వల్ల సూపర్ ఓవర్ సాధ్యం కాకపోతే, మ్యాచ్‌ను 'టై'గా ప్రకటించి ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు.

7) సూపర్ ఓవర్ సాధ్యం కాకపోతే, సూపర్-8 దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు చేరుతుంది.

8) ఒకవేళ ఫైనల్‌లో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేల్చడం సాధ్యం కాకపోతే, ఇరు జట్లను 'సంయుక్త విజేతలు'గా ప్రకటిస్తారు.

ఆధునిక టీ20 క్రికెట్‌లో బ్యాటర్ల జోరు పెరుగుతున్న కొద్దీ, మ్యాచ్‌లు టై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఐసీసీ రూపొందించిన ఈ అపరిమిత సూపర్ ఓవర్ నిబంధన క్రీడా స్ఫూర్తిని కాపాడుతూ, నిజమైన విజేతను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

Also Read: Vizag Vijayawada Metro Projects: ఏపీలో జోరందుకున్న మెట్రో..రూ.42 వేల కోట్లతో విశాఖ, విజయవాడ ప్రాజెక్టులు..ఏఏ రూట్లలో వెళ్తుందంటే?

Also Read: Usman Tariq Controversy: పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్..ధోనికి పి*చ్చ ఫ్యాన్..స్పిన్నర్ బయోగ్రఫీ ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 12, 2026 10:33:38
Hyderabad, Telangana:

BRS Party: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అరచేతుల వైకుంఠం చూపి అధికారం దక్కించుకుందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మరోవైపు బీజేపీ 12 ఏళ్లుగా తెలంగాణకు 12 పైసల పని కూడా చేయలేదు. అది 'పూజకు పనికిరాని పువ్వు'' అని ఎద్దేవా చేశారు. వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి అనే నానుడిని గుర్తు చేస్తూ.. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని కేటీఆర్‌ ప్రకటించారు. ఎమ్మెల్యేలు పోయినా.. బీఆర్‌ఎస్‌ పార్టీకి వెన్నెముక కార్యకర్తలేనని స్పష్టం చేశారు.

Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు భారీ శుభవార్త.. నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం?

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానం పలికిన అనతరం మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరినా.. కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా కేసీఆర్ నాయకత్వంలోనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. 'హైదరాబాద్‌లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నంబర్ వన్ కోటగా నిలిచింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లినా.. బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. శేరిలింగంపల్లిలోని 24 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేసే సత్తా బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉంది' అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Govt Employees: ప్రభుత్వానికి ఉద్యోగుల సంచలన లేఖ.. పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏల కోసం ఆల్టిమేటం

కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలే సుల్తాన్‌బజార్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో దోపిడీలు, చందానగర్‌లో జ్యువెలరీ షాపులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు కుదేలయ్యాయని, కొత్త కొలువులు రాకపోగా ఉన్నవి పోయే పరిస్థితి ఏర్పడిందని రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

Also Read: Municipal Elections: సంగారెడ్డిలో రెచ్చిపోయిన జగ్గారెడ్డి.. కరీంనగర్‌లో బీజేపీ శ్రేణులపై పోలీసుల దాడి

త్వరలో రాబోయే మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల కోసం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత పటిష్టం చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎమ్మెల్యే లేడని భయపడవద్దని.. అందరికీ అండగా తాను, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు ఉంటారని తెలిపారు. ఏ అవసరమొచ్చినా తాము అందుబాటులో ఉంటామని గులాబీ శ్రేణులకు హామీ ఇచ్చారు. 'తప్పుడు ఓటు వేస్తే ఐదేళ్ల పాటు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి' అని ప్రజలకు కేటీఆర్ విన్నవించారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 12, 2026 09:22:39
Amaravati, Andhra Pradesh:

Pawan Kalyan Balakrishna In Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఒక ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. టాలీవుడ్‌లోని ఇద్దరు అగ్ర కథానాయకులు, రాజకీయ దిగ్గజాలు అయిన నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఛాంబర్‌కు వెళ్లి పలకరింపు
సాధారణంగా అధికారిక కార్యక్రమాల్లో ఈ ఇద్దరు నేతలు ఎదురుపడినప్పుడు పలకరించుకోవడం సహజం. అయితే, ఈసారి బాలకృష్ణ నేరుగా అసెంబ్లీలోని పవన్ కళ్యాణ్ ఛాంబర్‌కు వెళ్లి ఆయనతో సమావేశమవ్వడం విశేషం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరిద్దరూ ఇలా ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే తొలిసారి.

చర్చకు వచ్చిన అంశాలు
సుమారు కొంతసేపు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గమైన హిందూపురంలోని పెండింగ్ పనులు, తాజా అభివృద్ధి కార్యక్రమాలపై బాలయ్య డిప్యూటీ సీఎంతో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్' టాక్ షోలో పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చినప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఈ ఇద్దరు 'పవర్ ప్యాక్డ్' నేతలు కలిసి కనిపించడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సినిమా వెండితెరపైనే కాకుండా, రాజకీయాల్లోనూ ఈ ఇద్దరు నేతలు ఒకే తాటిపై నడుస్తూ ప్రభుత్వ అభివృద్ధి అజెండాలో భాగస్వాములవ్వడం విశేషం.

Also Read: EPFO UPI Withdrawal: PF విత్‌డ్రా ఇక చిటికెలో! UPI ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి..ఏప్రిల్ 2026 నుండి కొత్త యాప్!

Also Read: Vizag Vijayawada Metro Projects: ఏపీలో జోరందుకున్న మెట్రో..రూ.42 వేల కోట్లతో విశాఖ, విజయవాడ ప్రాజెక్టులు..ఏఏ రూట్లలో వెళ్తుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 12, 2026 09:21:29
Hyderabad, Telangana:

Realme 16 Pro Price Cut: ఎప్పటినుంచో మంచి స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా ప్రీమియం బడ్జెట్ రేంజ్‌లో.. అయితే, మీకు సమయం రానే వచ్చేసింది. ముఖ్యంగా రియల్ మీ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన ప్రీమియం మొబైల్ అత్యంత తక్కువ ధరలోనే పొందవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రియల్‌మీ 16 ప్రో మొబైల్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై ఎన్నో రకాల స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ  స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మార్కెట్లో రియల్‌మీ 16 ప్రో స్మార్ట్ ఫోన్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. 6.7 అంగుళాల AMOLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 120Hz లేదా 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఎండలో కూడా ఈ మొబైల్ డిస్ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 

ఈ మొబైల్ వెనక భాగంలో చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50MP Sony సెన్సార్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా వేరియంట్స్‌ను బట్టి అదనంగా 32MP లేదా 50MP పెరిస్కోప్ లెన్స్ కెమెరా కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫ్రంట్ భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 లేదా 7+ Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ తో పాటు మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్‌గా చేయొచ్చు. ఇందులో కంపెనీ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 512 జిబి  ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 5200mAh బ్యాటరీతో లభిస్తోంది. 

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీని సులభంగా చార్జ్ చేసేందుకు ఎంతో ప్రత్యేకమైన 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తుంది. దీనివల్ల కేవలం 20 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అవుతుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అదేవిధంగా ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంటుంది. 

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ రూ.39,999తో అందుబాటులో ఉంది. అలాగే ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా ఈ మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రూ.2 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధానం ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసినప్పటికీ కూడా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్ ను ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి పేమెంట్ చేస్తే ఏకంగా రూ.36 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్ని పోను మొబైల్ కేవలం రూ.3,999 లోపే పొందవచ్చు. ఇక ఇవే కాకుండా ఈ  స్మార్ట్‌ఫోన్ పై ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 12, 2026 08:36:56
Jagtial, Telangana:

Electricity Workers Protest Telugu Latest News: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జగిత్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగులు రణభేరీ మోగించారు.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..గురువారం జిల్లా కేంద్ర విద్యుత్ భవన్ వద్ద విద్యుత్ కార్మికులంతా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు సంబంధించిన వివిధ విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. 

ఉద్యోగులంతా మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో తమ విధులను పక్కనపెట్టి.. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రత్యేకమైన నిరసన వ్యక్తం చేశారు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేపట్టారు.. ఈ సందర్భంగా మీడియాతో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మాట్లాడారు.. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్రం వ్యవహరిస్తూ వస్తుందని.. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని మండిపడ్డారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న సూపరింటెండెంట్ ఇంజనీర్ సుదర్శనం మాట్లాడుతూ.. కేంద్రం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలు కేవలం యజమానులకు మాత్రమే లాభం చేకూర్చేలా ఉన్నాయని.. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులకు, ఉద్యోగులకు ఇవి ఏవిధంగా పనికి రావని.. అలాగే కొంతమంది ఉద్యోగులకు ఇవి శాపంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న కార్మిక చట్టాలను ఇలా నీరుగార్చడం అత్యంత దుర్మార్గమని.. ఈ చట్టాలు అమల్లోకి వస్తే, ఉద్యోగుల భద్రతకు ప్రశ్నార్ధకంగా మారుతుందని.. వెంటనే కేంద్ర ప్రభుత్వం వీటిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించడంపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్త చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టుపెట్టే ప్రయత్నాలు అడ్డుకుంటామని ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది విద్యుత్ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకవేళ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకుండా చట్టాలను సవరించకపోతే.. రాబోయే రోజుల్లో.. ఊహించని స్థాయిలో అన్నిచోట్ల ఆందోళన ఉదృతం చేస్తామని ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 12, 2026 08:32:43
Hyderabad, Telangana:

Japanese Instant Cheesecake Hack: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక 'స్వీట్' హ్యాక్ తెగ వైరల్ అవుతోంది. అదే జపనీస్ ఇన్‌స్టంట్ చీజ్‌కేక్. సాధారణంగా చీజ్‌కేక్ తయారు చేయాలంటే ఓవెన్, గుడ్లు, క్రీమ్ చీజ్ వంటి ఎన్నో పదార్థాలు కావాలి. కానీ, ఈ వైరల్ పద్ధతిలో కేవలం రెండు పదార్థాలతో, అదీ వండాల్సిన అవసరం లేకుండానే నోరూరించే డెజర్ట్‌ను సిద్ధం చేయవచ్చు. వంటరాని వారు కూడా ఎంతో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ రెసిపీ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

కావలసిన పదార్థాలు..
గ్రీక్ పెరుగు (Greek Yogurt): ఒక కప్పు.

బిస్కెట్లు: ఓరియో (Oreo) లేదా బిస్కాఫ్ (Biscoff) వంటి మీకు నచ్చిన 5-6 బిస్కెట్లు.

తయారీ విధానం..
స్టెప్ 1: ఒక చిన్న గిన్నె లేదా కప్పు తీసుకుని అందులో గ్రీక్ యోగర్ట (పెరుగు)ను వేయండి.

స్టెప్ 2: ఇప్పుడు బిస్కెట్లను తీసుకుని, పెరుగులో ఒకదాని పక్కన ఒకటి నిలువుగా (Vertical) అమర్చండి. బిస్కెట్లు పూర్తిగా పెరుగులో మునిగిపోయేలా మెల్లగా నొక్కండి.

స్టెప్ 3: దీనిపై మూత పెట్టి కనీసం 6 గంటలు లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచండి.

అసలు మ్యాజిక్ ఇక్కడే..
ఫ్రిజ్‌లో ఉంచిన సమయంలో, బిస్కెట్లు పెరుగులోని తేమను గ్రహించి చాలా మృదువుగా మారుతాయి. పెరుగు కూడా గట్టిపడి, చీజ్‌కేక్‌కు ఉండాల్సిన 'క్రీమీ' ఆకృతిని పొందుతుంది. మరుసటి రోజు కప్పు నుండి దీనిని బయటకు తీస్తే, అచ్చం బేకరీలో దొరికే సాఫ్ట్ చీజ్‌కేక్ లాగే కనిపిస్తుంది.

గ్యాస్ లేదా ఓవెన్ వాడాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో ఖరీదైన క్రీమ్ చీజ్ అవసరం లేకుండానే అదే రుచిని ఆస్వాదించవచ్చు. బ్యాచిలర్స్ లేదా పిల్లలు కూడా దీన్ని ఈజీగా చేసేయొచ్చు. తక్కువ శ్రమతో కొత్తగా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ జపనీస్ ఇన్స్టంట్ చీజ్‌కేక్ హ్యాక్ ఒక బెస్ట్ ఆప్షన్. మీరూ ఒకసారి ట్రై చేసి చూడండి!

Also REad: EPFO UPI Withdrawal: PF విత్‌డ్రా ఇక చిటికెలో! UPI ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి..ఏప్రిల్ 2026 నుండి కొత్త యాప్!

Also Read: Jaahnavi Kandula Case: ఎట్టకేలకు జాహ్నవి కందుల మృతిపై దిగొచ్చిన అమెరికా..ఆమె కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 12, 2026 08:13:12
Hyderabad, Telangana:

EPFO Digital Reforms 2026: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కోట్లాది మంది చందాదారులకు విప్లవాత్మకమైన వార్తను అందించింది. ఇకపై పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం మొబైల్ రీఛార్జ్ చేసినంత సులభం కాబోతోంది. 2026 ఏప్రిల్ నాటికి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా నేరుగా పీఎఫ్ నిధులను పొందే సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని తొలగించి, సాంకేతికతను జోడించడం ద్వారా EPFO తన సేవలను ఆధునీకరిస్తోంది.

కొత్త మొబైల్ యాప్ ప్రత్యేకతలు
కార్మిక మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తున్న ఈ కొత్త యాప్ ద్వారా చందాదారులు కింది సదుపాయాలను పొందవచ్చు. తమ ఖాతాలో ఎంత నగదు ఉందో సులభంగా చూడవచ్చు. అర్హత కలిగిన మొత్తాన్ని విత్‌డ్రా చేయడానికి కేవలం తమ UPI PIN ఉపయోగిస్తే సరిపోతుంది. నిధులు నేరుగా లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలోకి సురక్షితంగా బదిలీ అవుతాయి.

ఎందుకు ఈ మార్పు?
ప్రతి సంవత్సరం EPFOకి 5 కోట్లకు పైగా క్లెయిమ్‌లు వస్తున్నాయి. ఈ రద్దీని తగ్గించడానికి ఆటోమేటెడ్ వ్యవస్థ అవసరమని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం డబ్బులు చేతికి అందడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా చూడటానికి ప్రస్తుతం 100 డమ్మీ ఖాతాలతో ప్రయోగాత్మక పరిశీలనలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం చందాదారులు UAN పోర్టల్ లేదా UMANG యాప్‌ను ఉపయోగిస్తున్నారు. 2026 నుండి రాబోయే కొత్త యాప్ వీటికి అదనం. దీనివల్ల చందాదారులకు సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి. బ్యాంకులతో సమానంగా డిజిటల్ సేవల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

EPFOకి స్వయంగా బ్యాంకింగ్ లైసెన్స్ లేదు, కాబట్టి నిధుల బదిలీ ప్రక్రియను సులభతరం చేయడానికి బ్యాంకులతో అనుసంధానం చేస్తూ ఈ UPI గేట్‌వేను రూపొందిస్తున్నారు.

ఏప్రిల్ 2026 నుండి ఈ విధానం అమల్లోకి వస్తే, అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఇది సామాన్య ఉద్యోగులకు డిజిటల్ ఇండియా అందించే అతిపెద్ద కానుకగా మారుతుంది.

Also Read: Super Over Rules In Cricket: సూపర్ ఓవర్ రూల్స్ తెలుసా? అది టై అయితే విజేతని ఎలా డిసైడ్ చేస్తారు?

Also REad: Jaahnavi Kandula Case: ఎట్టకేలకు జాహ్నవి కందుల మృతిపై దిగొచ్చిన అమెరికా..ఆమె కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 12, 2026 06:18:57
Nunna, Vijayawada, Andhra Pradesh:

Visakhapatnam Vijayawada Metro Funding: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు సఫలమవ్వడంతో, ఈ ప్రాజెక్టుల డీపీఆర్ (DPR)లకు త్వరలోనే ఆమోదం లభించనుంది.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మెట్రో రైలు కల సాకారం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్రం డీపీఆర్‌లను ఆమోదించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మెట్రో ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.42 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా.

తొలి దశ: రూ.22 వేల కోట్లు (విశాఖకు రూ.12 వేల కోట్లు, విజయవాడకు రూ.11 వేల కోట్లు).

నిధుల పంపిణీ: కేంద్రం 20%, రాష్ట్రం 20% చొప్పున ఈక్విటీ షేర్లను పంచుకోనున్నాయి.

రుణాలు: మిగిలిన 60% నిధులను ప్రపంచ బ్యాంకు (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB)ల నుండి రుణంగా తీసుకోనున్నారు. ఈ రుణాలకు కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది.

విశాఖపట్నం మెట్రో - మార్గాలు
విశాఖ మెట్రోను రెండు దశల్లో నిర్మించనున్నారు. మొత్తం పొడవు సుమారు 76.9 కిలోమీటర్లు. తొలి దశ 46.23 కి.మీ. పనులు చేపట్టనున్నారు. ఈ దశలో  స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది కూడలి వరకు.. గురుద్వారా నుండి పాత పోస్టాఫీసు వరకు.. తాటిచెట్లపాలెం నుండి చినవాల్తేరు వరకు మెట్రో ప్రాజెక్టును చేపట్టనున్నారు. అలాగే రెండో దశలో 30.67 కి.మీ. మేర కొమ్మాది నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పనులు జరగనున్నాయి.

విజయవాడ మెట్రో - కారిడార్లు
విజయవాడ మెట్రో కారిడార్లలో కేంద్రం సూచనల మేరకు కొన్ని సవరణలు జరగనున్నాయి. తొలి దశలో పండిట్ నెహ్రూ బస్టాండ్ (PNBS) నుండి గన్నవరం విమానాశ్రయం వరకు ఉండగా.. రెండో దశలో బస్టాండ్ నుండి రాజధాని ప్రాంతం అమరావతి వరకు కనెక్టివిటీ ఉండనుంది.

ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు ఖరారు అయినప్పటికీ, కేంద్రం నుండి డీపీఆర్‌ల ఆమోదం పెండింగ్‌లో ఉంది. ఇటీవల జరిగిన చర్చల నేపథ్యంలో, డీపీఆర్‌లకు తుది ఆమోదం లభించిన వెంటనే భూసేకరణ, నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభం కానున్నాయి.

విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోనుంది. ట్రాఫిక్ కష్టాలు తగ్గడమే కాకుండా, పారిశ్రామిక, ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టులు ఊతమివ్వనున్నాయి.

Also Read: Gold Price Trend: బంగారం వెండి ధరలు రానున్న రోజుల్లో తగ్గుతాయా? పెరుగుతాయా? భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే?

Also Read: EPFO Ceiling Hike: ఉద్యోగులకు శుభవార్త.. EPFO కనీస జీతం భారీగా పెంపు?! రూ.15,000 నుంచి రూ.25,000కి?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 12, 2026 06:15:44
Hyderabad, Telangana:

Budhaditya Raja Yoga 2026 Effect On Zodiac Telugu: వచ్చే శుక్రవారం ఫిబ్రవరి 13వ తేదీ చాలా శుభప్రదమైనదిగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే సౌరమండల రాజుగా భావించే సూర్యుడు మకర నుంచి కుంభంలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడు ఇప్పటికే శని పాలించే కుంభరాశిలో సంచార దశలో ఉన్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల శక్తివంతమైన సంయోగం జరగబోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగానే ఎంతో శుభప్రదమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతోంది. 

ముఖ్యంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల దీని ప్రభావం కొన్ని రాశుల వారి తెలివితేటలతో పాటు విద్యాభివృద్ధి ఆర్థిక విషయాలపై పడే అవకాశాలున్నాయి. దీని కారణంగా ఏకకాలంలో మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 13 నుంచి నాలుగు రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా ఊహించని అదృష్టం కూడా లభించబోతోంది.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేషరాశి 
మేష రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి కొత్త ఆదాయ వనరులు రావడం ప్రారంభమవుతాయి. దీనివల్ల వీరు ఆర్థికంగా మెరుగుపడతారు. అలాగే సామాజిక సంబంధాలు కూడా భారీ మొత్తంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. తోబుట్టుల నుంచి మంచి సపోర్టు పొంది అద్భుతమైన లాభాలు కూడా పొందుతారు. 

మిథున రాశి 
మిధున రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఈ బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. దీంతోపాటు చదువులతో పాటు పోటీ పరీక్షలు అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా ఒత్తిడి నుంచి కూడా ఎంతో సులభంగా ఉపశమనం కలుగుతుంది.

సింహరాశి 
సింహరాశి వారికి బుధాదిత్య రాజయోగ ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలపరంగా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఒపందాలు విజయాలు సాధించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవంతో పాటు హోదా కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. వీరికి ఈ సమయంలో సృజనాత్మకత కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. 

తులారాశి 
మహారాష్ట్రలో జన్మించిన వ్యక్తులకు బుధాదిత్య రాజయోగ ప్రభావం అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో ప్రేమ జీవితం చాలా సానుకూలంగా మారుతుంది. తెలివితేటలు కూడా చాలా వరకు పెరుగుతాయి. దీనివల్ల వీరు అనుకోని లాభాలు కూడా పొందుతారు. వైవాహిక జీవితంలో వస్తున్న అన్ని రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 12, 2026 06:01:56
Hyderabad, Telangana:

Venus And Saturn Conjunction Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహసంచారాలు, వాటి సంయోగాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా శుక్రుడు, శని కలయిక  మార్చి 8వ తేదీన జరగబోతోంది. ఈ రోజున ఎంతో శుభప్రదమైన గ్రహంగా భావించే శుక్రుడు.. కర్మలకు అధిపతిగా చెప్పుకునే శని రెండు ఒకే చోట కలయిక జరుగుతాయి. దీంతో ఈ సమయంలో అద్భుతమైన సంయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. 

మార్చి 8వ తేదీన జరిగే శని శుక్రుల సంయోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టబోతోంది. ముఖ్యంగా ఈ సంయోగంతో ఆర్థిక పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక పురోగతి లభించి.. సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో  అనేక బాధల నుంచి విముక్తి లభించబోతోంది.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్!
వృషభ రాశి 
ముఖ్యంగా ఈ సమయంలో శుక్రుడి ప్రభావంతో వృషభ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరికి నిలిచిపోయిన ప్రతి ఒక పని పూర్తవుతుంది అలాగే పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులు కూడా ఈ సమయంలో పొందగలుగుతారు. ఉద్యోగాలు చేసే వారు పదోన్నతులు పొందడమే కాకుండా.. జీతాలు కూడా పెంచుకోగలుగుతారు.

మిధున రాశి 
ఈ సంయోగంతో మిధున రాశి వారికి అదృష్టం ఊహించని స్థాయిలో కలిసి రాబోతోంది. ముఖ్యంగా ఎలాంటి పనులు చేసిన భారీ మొత్తంలో లాభాలు పొంది లగ్జరీ లైఫ్ అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు ఈ సమయంలో తప్పకుండా మంచి ప్రేమ సంబంధాలు కలిగి ఉంటారు. ఒంటరిగా ఉన్న వ్యక్తులందరికీ వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి.

తులారాశి 
తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు.. కాబట్టి వీరికి కూడా ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో వీరికి ఊహించని స్థాయిలో గౌరవం పెరుగుతుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారికి ఒప్పందాలు కూడా ఖరారు అవుతాయి. అలాగే భౌతిక సౌకర్యాలు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కన్యారాశి 
కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకు బుధుడు అధిపతిగా వ్యవహరించడమే కాకుండా.. శుక్రుడు ఎల్లప్పుడూ అద్భుతమైన ఫలితాలు అందిస్తారు. కాబట్టి వీరికి ఈ సమయం కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందగలుగుతారు. అంతేకాకుండా వ్యాపారాలు కూడా భారీగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

కుంభరాశి 
కుంభరాశి వారికి శని అధిపతి.. శుక్రుడు సంచారం చేయడం కారణంగా వీరికి కూడా ఊహించని స్థాయిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. దీంతోపాటు బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 12, 2026 05:32:09
Hyderabad, Telangana:

Gold Silver Price Prediction: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఒక రేంజ్ బౌండ్‌లో కదులుతున్నాయి. జనవరిలో ఆకాశాన్ని తాకిన ధరలు, ఫిబ్రవరి నాటికి కొంత దిగివచ్చినప్పటికీ, మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ఈ హెచ్చుతగ్గులకు ప్రధాన కారణం. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఇన్వెస్టర్లను ఊగిసలాటలో ఉంచుతున్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు గరిష్ట స్థాయిల కంటే కొంత తక్కువగానే ట్రేడవుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) రూ.14,965గా ఉండగా..  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.16,325 లకు అమ్మకం జరుగుతుంది. మరోవైపు కిలో వెండి కూడా రూ.2,80,000 నుంచి రూ.3,00,000ల మధ్య ట్రేడ్ అవుతోంది.

ధరలు తగ్గడానికి గల కారణాలు
జనవరిలో బంగారం 10 గ్రాములు రూ.2 లక్షలు, వెండి కిలో రూ.4 లక్షలు దాటి రికార్డు సృష్టించాయి. ఆ తర్వాత ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో పాటు అలాగే అమెరికా రాజకీయాలు కూడా బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు పరోక్ష కారణం అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్ నామినీని ప్రకటించిన తర్వాత మార్కెట్‌లో కొంత స్థిరీకరణ కనిపించింది. యుద్ధ మేఘాలు కొంత సడలడంతో సురక్షిత పెట్టుబడిగా ఉన్న బంగారంపై ఒత్తిడి తగ్గింది.

రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయా?
స్వల్పకాలికంగా మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ధరలు పెరిగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు బంగారం ధరకు బలాన్ని ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 17.5% వృద్ధిని నమోదు చేసింది.

అసలైన పెరుగుదల ఇంకా ముందుందని, రానున్న రోజుల్లో వెండి, బంగారం మళ్లీ పాత రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని బులియన్ నిపుణుల అంచనా. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమ వ్యూహమని విశ్లేషకులు సూచిస్తున్నారు. మార్కెట్ అస్థిరత కొనసాగే అవకాశం ఉన్నందున, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ప్రస్తుత ధరలను అనుకూలంగా మార్చుకోవచ్చు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ద్వారా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Usman Tariq Controversy: పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్..ధోనికి పి*చ్చ ఫ్యాన్..స్పిన్నర్ బయోగ్రఫీ ఇదే!

Also Read: Gas Cylinder Saving Tips: గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి? సిలిండర్ ఆదా చేయడానికి సూపర్ చిట్కాలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Feb 12, 2026 05:06:29
Gollet, Telangana:కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 44 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె గురువారం బెల్లంపల్లి ఏరియాలో విజయవంతమైంది. బెల్లంపల్లి ఏరియాలోని ఏకైక కైరిగూడ ఓపెన్ కాస్ట్ గని, వర్క్ షాప్, సిహెచ్ పి తదితర డిపార్ట్మెంట్ల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యంగా 44 జీవోల స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల వలన కార్మిక వర్గానికి ఎనలేని నష్టం జరుగుతుందని ఏఐటియుసి, ఐ ఎన్ టి యు సి, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ తదితర కార్మిక సంఘాలు గత రెండు మూడు రోజుల నుంచి కార్మికులకు వివరిస్తూ సమ్మెకు సమాయత్తం చేశాయి. దీంతో కార్మిక వర్గం సమ్మె చేయడానికి ముందుకు వచ్చింది. గురువారం సమ్మె సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్ తిరుపతి, ఐ ఎన్ టి సి ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, టీబీజీకేస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసరావు, పలువురు కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ల నాయకులు మాట్లాడుతూ సమ్మె ఎందుకు చేస్తున్నామో కార్మికులకు వివరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు ఎస్ తిరుపతి, టీబీజీకేఎస్ నాయకులు ఏం శ్రీనివాసరావులు, ఐ ఎన్ టి యు సి నాయకులు పేరం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జి ఓ ల వల్ల కార్మికులకు నష్టం కలిగించే అవకాశాలు అధికంగా ఉన్నాయని కలిసికట్టుగా సమ్మె చేస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 11, 2026 19:28:21
Hyderabad, Telangana:

New Health Scheme: ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించుకోకపోవడం.. డిమాండ్లు నెరవేర్చుకోకపోవడం జరుగుతోంది. తమకు న్యాయపరంగా.. హక్కుగా దక్కాల్సిన పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించిబోతున్నట్టు తెలుస్తోంది. నేడు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Govt Employees: ప్రభుత్వానికి ఉద్యోగుల సంచలన లేఖ.. పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏల కోసం ఆల్టిమేటం

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కొత్త ఆరోగ్య పథకం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే నేడు గురువారం కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోతోపాటు ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం కానున్నారు. పాత ఆరోగ్య పథకంలో ఉన్న పలు లోపాలు, సమస్యలను సవరించనున్నారు. అనంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులకు కొత్త ఆరోగ్య పథకం ప్రభుత్వం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయనుంది.

Also Read: Municipal Elections: సంగారెడ్డిలో రెచ్చిపోయిన జగ్గారెడ్డి.. కరీంనగర్‌లో బీజేపీ శ్రేణులపై పోలీసుల దాడి

కొత్త ఆరోగ్య పథకాన్ని‘న్యూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం’గా పిలవనున్నారు. ఈ పథకం అమలు కోసం ఎంప్లాయీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటు కానుంది. నగదు రహిత ఆరోగ్య సేవలను రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు అమలవుతున్నాయి. ఇప్పటివరకు ఈ సేవలను ఉచితంగా అందించినప్పటికీ అవి నామమాత్రంగా అందుతున్నాయి.  ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య కార్డులు చెల్లుబాటు కావడం లేదు. ఎందుకంటే సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఉద్యోగుల కార్డులు ఆసుపత్రుల్లో పనిచేయడం లేదు. దీంతో ఆస్పత్రిలో చేరిన తర్వాత బిల్లులు చెల్లించి అనంరం రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నాయి. అయితే అలా చేస్తుండగా బిల్లుల్లో సగం మొత్తం కూడా తిరిగి రాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: Tomorrow Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు రేపు సెలవు.. ఎందుకో తెలుసా?

ఉద్యోగ వర్గాల ఇబ్బందులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆరోగ్య పథకం అమలుచేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా నేడు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనుంది. అయితే కొత్తగా తీసుకువచ్చే ఆరోగ్య పథకంలో ఉద్యోగుల బేసిక్‌ నుంచి ఒకటిన్నర శాతం నగదు తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నేటి సమావేశంలో కొత్త ఆరోగ్య పథకంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top