Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500033
Venus And Saturn: శని, సూర్యగ్రహాల అద్భుత కలయిక.. ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్‌, డబ్బే.. డబ్బు!
DDDharmaraju Dhurishetty
Feb 12, 2026 06:01:56
Hyderabad, Telangana

Venus And Saturn Conjunction Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహసంచారాలు, వాటి సంయోగాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా శుక్రుడు, శని కలయిక  మార్చి 8వ తేదీన జరగబోతోంది. ఈ రోజున ఎంతో శుభప్రదమైన గ్రహంగా భావించే శుక్రుడు.. కర్మలకు అధిపతిగా చెప్పుకునే శని రెండు ఒకే చోట కలయిక జరుగుతాయి. దీంతో ఈ సమయంలో అద్భుతమైన సంయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. 

మార్చి 8వ తేదీన జరిగే శని శుక్రుల సంయోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టబోతోంది. ముఖ్యంగా ఈ సంయోగంతో ఆర్థిక పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక పురోగతి లభించి.. సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో  అనేక బాధల నుంచి విముక్తి లభించబోతోంది.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్!
వృషభ రాశి 
ముఖ్యంగా ఈ సమయంలో శుక్రుడి ప్రభావంతో వృషభ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరికి నిలిచిపోయిన ప్రతి ఒక పని పూర్తవుతుంది అలాగే పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులు కూడా ఈ సమయంలో పొందగలుగుతారు. ఉద్యోగాలు చేసే వారు పదోన్నతులు పొందడమే కాకుండా.. జీతాలు కూడా పెంచుకోగలుగుతారు.

మిధున రాశి 
ఈ సంయోగంతో మిధున రాశి వారికి అదృష్టం ఊహించని స్థాయిలో కలిసి రాబోతోంది. ముఖ్యంగా ఎలాంటి పనులు చేసిన భారీ మొత్తంలో లాభాలు పొంది లగ్జరీ లైఫ్ అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు ఈ సమయంలో తప్పకుండా మంచి ప్రేమ సంబంధాలు కలిగి ఉంటారు. ఒంటరిగా ఉన్న వ్యక్తులందరికీ వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి.

తులారాశి 
తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు.. కాబట్టి వీరికి కూడా ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో వీరికి ఊహించని స్థాయిలో గౌరవం పెరుగుతుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారికి ఒప్పందాలు కూడా ఖరారు అవుతాయి. అలాగే భౌతిక సౌకర్యాలు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కన్యారాశి 
కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకు బుధుడు అధిపతిగా వ్యవహరించడమే కాకుండా.. శుక్రుడు ఎల్లప్పుడూ అద్భుతమైన ఫలితాలు అందిస్తారు. కాబట్టి వీరికి ఈ సమయం కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందగలుగుతారు. అంతేకాకుండా వ్యాపారాలు కూడా భారీగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

కుంభరాశి 
కుంభరాశి వారికి శని అధిపతి.. శుక్రుడు సంచారం చేయడం కారణంగా వీరికి కూడా ఊహించని స్థాయిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. దీంతోపాటు బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Feb 12, 2026 06:18:57
Nunna, Vijayawada, Andhra Pradesh:

Visakhapatnam Vijayawada Metro Funding: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు సఫలమవ్వడంతో, ఈ ప్రాజెక్టుల డీపీఆర్ (DPR)లకు త్వరలోనే ఆమోదం లభించనుంది.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మెట్రో రైలు కల సాకారం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్రం డీపీఆర్‌లను ఆమోదించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మెట్రో ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.42 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా.

తొలి దశ: రూ.22 వేల కోట్లు (విశాఖకు రూ.12 వేల కోట్లు, విజయవాడకు రూ.11 వేల కోట్లు).

నిధుల పంపిణీ: కేంద్రం 20%, రాష్ట్రం 20% చొప్పున ఈక్విటీ షేర్లను పంచుకోనున్నాయి.

రుణాలు: మిగిలిన 60% నిధులను ప్రపంచ బ్యాంకు (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB)ల నుండి రుణంగా తీసుకోనున్నారు. ఈ రుణాలకు కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది.

విశాఖపట్నం మెట్రో - మార్గాలు
విశాఖ మెట్రోను రెండు దశల్లో నిర్మించనున్నారు. మొత్తం పొడవు సుమారు 76.9 కిలోమీటర్లు. తొలి దశ 46.23 కి.మీ. పనులు చేపట్టనున్నారు. ఈ దశలో  స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది కూడలి వరకు.. గురుద్వారా నుండి పాత పోస్టాఫీసు వరకు.. తాటిచెట్లపాలెం నుండి చినవాల్తేరు వరకు మెట్రో ప్రాజెక్టును చేపట్టనున్నారు. అలాగే రెండో దశలో 30.67 కి.మీ. మేర కొమ్మాది నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పనులు జరగనున్నాయి.

విజయవాడ మెట్రో - కారిడార్లు
విజయవాడ మెట్రో కారిడార్లలో కేంద్రం సూచనల మేరకు కొన్ని సవరణలు జరగనున్నాయి. తొలి దశలో పండిట్ నెహ్రూ బస్టాండ్ (PNBS) నుండి గన్నవరం విమానాశ్రయం వరకు ఉండగా.. రెండో దశలో బస్టాండ్ నుండి రాజధాని ప్రాంతం అమరావతి వరకు కనెక్టివిటీ ఉండనుంది.

ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు ఖరారు అయినప్పటికీ, కేంద్రం నుండి డీపీఆర్‌ల ఆమోదం పెండింగ్‌లో ఉంది. ఇటీవల జరిగిన చర్చల నేపథ్యంలో, డీపీఆర్‌లకు తుది ఆమోదం లభించిన వెంటనే భూసేకరణ, నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభం కానున్నాయి.

విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోనుంది. ట్రాఫిక్ కష్టాలు తగ్గడమే కాకుండా, పారిశ్రామిక, ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టులు ఊతమివ్వనున్నాయి.

Also Read: Gold Price Trend: బంగారం వెండి ధరలు రానున్న రోజుల్లో తగ్గుతాయా? పెరుగుతాయా? భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే?

Also Read: EPFO Ceiling Hike: ఉద్యోగులకు శుభవార్త.. EPFO కనీస జీతం భారీగా పెంపు?! రూ.15,000 నుంచి రూ.25,000కి?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 12, 2026 06:15:44
Hyderabad, Telangana:

Budhaditya Raja Yoga 2026 Effect On Zodiac Telugu: వచ్చే శుక్రవారం ఫిబ్రవరి 13వ తేదీ చాలా శుభప్రదమైనదిగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే సౌరమండల రాజుగా భావించే సూర్యుడు మకర నుంచి కుంభంలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడు ఇప్పటికే శని పాలించే కుంభరాశిలో సంచార దశలో ఉన్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల శక్తివంతమైన సంయోగం జరగబోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగానే ఎంతో శుభప్రదమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతోంది. 

ముఖ్యంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల దీని ప్రభావం కొన్ని రాశుల వారి తెలివితేటలతో పాటు విద్యాభివృద్ధి ఆర్థిక విషయాలపై పడే అవకాశాలున్నాయి. దీని కారణంగా ఏకకాలంలో మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 13 నుంచి నాలుగు రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా ఊహించని అదృష్టం కూడా లభించబోతోంది.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేషరాశి 
మేష రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి కొత్త ఆదాయ వనరులు రావడం ప్రారంభమవుతాయి. దీనివల్ల వీరు ఆర్థికంగా మెరుగుపడతారు. అలాగే సామాజిక సంబంధాలు కూడా భారీ మొత్తంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. తోబుట్టుల నుంచి మంచి సపోర్టు పొంది అద్భుతమైన లాభాలు కూడా పొందుతారు. 

మిథున రాశి 
మిధున రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఈ బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. దీంతోపాటు చదువులతో పాటు పోటీ పరీక్షలు అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా ఒత్తిడి నుంచి కూడా ఎంతో సులభంగా ఉపశమనం కలుగుతుంది.

సింహరాశి 
సింహరాశి వారికి బుధాదిత్య రాజయోగ ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలపరంగా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఒపందాలు విజయాలు సాధించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవంతో పాటు హోదా కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. వీరికి ఈ సమయంలో సృజనాత్మకత కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. 

తులారాశి 
మహారాష్ట్రలో జన్మించిన వ్యక్తులకు బుధాదిత్య రాజయోగ ప్రభావం అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో ప్రేమ జీవితం చాలా సానుకూలంగా మారుతుంది. తెలివితేటలు కూడా చాలా వరకు పెరుగుతాయి. దీనివల్ల వీరు అనుకోని లాభాలు కూడా పొందుతారు. వైవాహిక జీవితంలో వస్తున్న అన్ని రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 12, 2026 05:32:09
Hyderabad, Telangana:

Gold Silver Price Prediction: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఒక రేంజ్ బౌండ్‌లో కదులుతున్నాయి. జనవరిలో ఆకాశాన్ని తాకిన ధరలు, ఫిబ్రవరి నాటికి కొంత దిగివచ్చినప్పటికీ, మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ఈ హెచ్చుతగ్గులకు ప్రధాన కారణం. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఇన్వెస్టర్లను ఊగిసలాటలో ఉంచుతున్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు గరిష్ట స్థాయిల కంటే కొంత తక్కువగానే ట్రేడవుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) రూ.14,965గా ఉండగా..  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.16,325 లకు అమ్మకం జరుగుతుంది. మరోవైపు కిలో వెండి కూడా రూ.2,80,000 నుంచి రూ.3,00,000ల మధ్య ట్రేడ్ అవుతోంది.

ధరలు తగ్గడానికి గల కారణాలు
జనవరిలో బంగారం 10 గ్రాములు రూ.2 లక్షలు, వెండి కిలో రూ.4 లక్షలు దాటి రికార్డు సృష్టించాయి. ఆ తర్వాత ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో పాటు అలాగే అమెరికా రాజకీయాలు కూడా బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు పరోక్ష కారణం అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్ నామినీని ప్రకటించిన తర్వాత మార్కెట్‌లో కొంత స్థిరీకరణ కనిపించింది. యుద్ధ మేఘాలు కొంత సడలడంతో సురక్షిత పెట్టుబడిగా ఉన్న బంగారంపై ఒత్తిడి తగ్గింది.

రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయా?
స్వల్పకాలికంగా మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ధరలు పెరిగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు బంగారం ధరకు బలాన్ని ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 17.5% వృద్ధిని నమోదు చేసింది.

అసలైన పెరుగుదల ఇంకా ముందుందని, రానున్న రోజుల్లో వెండి, బంగారం మళ్లీ పాత రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని బులియన్ నిపుణుల అంచనా. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమ వ్యూహమని విశ్లేషకులు సూచిస్తున్నారు. మార్కెట్ అస్థిరత కొనసాగే అవకాశం ఉన్నందున, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ప్రస్తుత ధరలను అనుకూలంగా మార్చుకోవచ్చు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ద్వారా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Usman Tariq Controversy: పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్..ధోనికి పి*చ్చ ఫ్యాన్..స్పిన్నర్ బయోగ్రఫీ ఇదే!

Also Read: Gas Cylinder Saving Tips: గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి? సిలిండర్ ఆదా చేయడానికి సూపర్ చిట్కాలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Feb 12, 2026 05:06:29
Gollet, Telangana:కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 44 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె గురువారం బెల్లంపల్లి ఏరియాలో విజయవంతమైంది. బెల్లంపల్లి ఏరియాలోని ఏకైక కైరిగూడ ఓపెన్ కాస్ట్ గని, వర్క్ షాప్, సిహెచ్ పి తదితర డిపార్ట్మెంట్ల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యంగా 44 జీవోల స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల వలన కార్మిక వర్గానికి ఎనలేని నష్టం జరుగుతుందని ఏఐటియుసి, ఐ ఎన్ టి యు సి, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ తదితర కార్మిక సంఘాలు గత రెండు మూడు రోజుల నుంచి కార్మికులకు వివరిస్తూ సమ్మెకు సమాయత్తం చేశాయి. దీంతో కార్మిక వర్గం సమ్మె చేయడానికి ముందుకు వచ్చింది. గురువారం సమ్మె సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్ తిరుపతి, ఐ ఎన్ టి సి ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, టీబీజీకేస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసరావు, పలువురు కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ల నాయకులు మాట్లాడుతూ సమ్మె ఎందుకు చేస్తున్నామో కార్మికులకు వివరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు ఎస్ తిరుపతి, టీబీజీకేఎస్ నాయకులు ఏం శ్రీనివాసరావులు, ఐ ఎన్ టి యు సి నాయకులు పేరం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జి ఓ ల వల్ల కార్మికులకు నష్టం కలిగించే అవకాశాలు అధికంగా ఉన్నాయని కలిసికట్టుగా సమ్మె చేస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 11, 2026 19:28:21
Hyderabad, Telangana:

New Health Scheme: ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించుకోకపోవడం.. డిమాండ్లు నెరవేర్చుకోకపోవడం జరుగుతోంది. తమకు న్యాయపరంగా.. హక్కుగా దక్కాల్సిన పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించిబోతున్నట్టు తెలుస్తోంది. నేడు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Govt Employees: ప్రభుత్వానికి ఉద్యోగుల సంచలన లేఖ.. పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏల కోసం ఆల్టిమేటం

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కొత్త ఆరోగ్య పథకం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే నేడు గురువారం కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోతోపాటు ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం కానున్నారు. పాత ఆరోగ్య పథకంలో ఉన్న పలు లోపాలు, సమస్యలను సవరించనున్నారు. అనంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులకు కొత్త ఆరోగ్య పథకం ప్రభుత్వం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయనుంది.

Also Read: Municipal Elections: సంగారెడ్డిలో రెచ్చిపోయిన జగ్గారెడ్డి.. కరీంనగర్‌లో బీజేపీ శ్రేణులపై పోలీసుల దాడి

కొత్త ఆరోగ్య పథకాన్ని‘న్యూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం’గా పిలవనున్నారు. ఈ పథకం అమలు కోసం ఎంప్లాయీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటు కానుంది. నగదు రహిత ఆరోగ్య సేవలను రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు అమలవుతున్నాయి. ఇప్పటివరకు ఈ సేవలను ఉచితంగా అందించినప్పటికీ అవి నామమాత్రంగా అందుతున్నాయి.  ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య కార్డులు చెల్లుబాటు కావడం లేదు. ఎందుకంటే సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఉద్యోగుల కార్డులు ఆసుపత్రుల్లో పనిచేయడం లేదు. దీంతో ఆస్పత్రిలో చేరిన తర్వాత బిల్లులు చెల్లించి అనంరం రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నాయి. అయితే అలా చేస్తుండగా బిల్లుల్లో సగం మొత్తం కూడా తిరిగి రాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: Tomorrow Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు రేపు సెలవు.. ఎందుకో తెలుసా?

ఉద్యోగ వర్గాల ఇబ్బందులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆరోగ్య పథకం అమలుచేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా నేడు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనుంది. అయితే కొత్తగా తీసుకువచ్చే ఆరోగ్య పథకంలో ఉద్యోగుల బేసిక్‌ నుంచి ఒకటిన్నర శాతం నగదు తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నేటి సమావేశంలో కొత్త ఆరోగ్య పథకంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 11, 2026 18:42:56
Hyderabad, Telangana:

Govt Employees Demands: సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు, డిమాండ్లపై తెలంగాణ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం కమిటీలు, చర్చలు అంటూ కాలయాపన చేస్తుండడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయపరంగా.. హక్కుగా దక్కాల్సిన వాటిని కూడా ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లు, సమస్యలపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. అందులో భాగంగా ప్రభుత్వానికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీఓసీఏ) సంచలన లేఖ రాసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Municipal Exit Polls: తెలంగాణ మున్సిపల్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఆధిక్యం

తమ ప్రధాన డిమాండ్లు, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీఓసీఏ) అధ్యక్షుడు ఏలూరి  శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు  చేయాలి, ఏప్రిల్/ మే  నెలలో  సాధారణ బదిలీలు  చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం డిమాండ్‌ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు, బదిలీల అంశాన్ని లేఖలో గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రస్తావించింది. తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించిన వినతి పత్రాల వివరాలను గెజిటెడ్‌ అధికారుల సంఘం విడుదల చేసింది.

Also Read: Municipal Elections: సంగారెడ్డిలో రెచ్చిపోయిన జగ్గారెడ్డి.. కరీంనగర్‌లో బీజేపీ శ్రేణులపై పోలీసుల దాడి

ప్రధాన డిమాండ్లు ఇవే..

వేతన సవరణ సంఘం
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఒకటే పీఆర్‌సీ అమలు చేశారు. రెండో వేతన సవరణ సంఘం ఏర్పాటుచేయాల్సి ఉండగా నిధుల కొరతతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పీఆర్‌సీ జోలికి మాత్రం వెళ్లడం లేదు. వెంటనే రెండో పీఆర్‌సీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీఓసీఏ) డిమాండ్‌ చేసింది. పీఆర్‌సీకి బడ్జెట్  కేటాయింపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రెండో వేతన సవరణ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు వినతిపత్రంలో వివరించి ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదిక గడువు ముగిసి ఇప్పటికే 22 నెలలు దాటిపోయిందని, దీనివల్ల ఉద్యోగులు పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు మరియు ఈఎంఐలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వివరించింది. రానున్న 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో పీఆర్సీ అమలుకు అవసరమైన నిధులను కేటాయించాలని ఆర్థిక మంత్రిగా ఉన్నఉప ముఖ్యమంత్రిని సంఘం కోరింది.

Also Read: AP Budget Session: విధ్వంసం నుంచి అభివృద్ధి- సంక్షేమంపై పరుగులు: ఏపీ గవర్నర్

42 శాతం ఫిట్‌మెంట్
ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని గెజిటెడ్‌ అధికారుల సంఘం కోరింది. ప్రస్తుతం ఇస్తున్న 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ఏమాత్రం సరిపోదని వినతిపత్రంలో సంఘం స్పష్టం చేసింది.

పెండింగ్‌ డీఏలు
ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. రేవంత్‌ రెడ్డి 1-1-2024 నుంచి 1-7-2025 వరకు నాలుగు డీఏలు ఉద్యోగులకు బకాయిపడ్డారు. నాలుగు పెండింగ్‌ డీఏలను వెంటనే విడుదల చేయాలని గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీఓసీఏ) డిమాండ్‌ చేసింది.

Also Read: Tomorrow Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు రేపు సెలవు.. ఎందుకో తెలుసా?

బదిలీలు
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బదిలీలపై నిషేధం ఎత్తివేతను తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీఓసీఏ) ప్రస్తావించింది. ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కోసం బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని సంఘం విజ్ఞప్తి చేసింది. 6 ఏళ్ల నుంచి 13 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులకు ఈసారి తప్పకుండా బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేసింది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బదిలీల నిషేధాన్ని ఎత్తివేసి ఉత్తర్వులు జారీ చేయాలని సంఘం విన్నవించింది. గతంలో 40 శాతం పరిమితి విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా చాలా మంది ఉద్యోగులు బదిలీలకు దూరమయ్యారని గుర్తు చేసింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి, వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని  గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీఓసీఏ) ప్రభుత్వానికి కోరింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 11, 2026 18:09:18
Mahbubnagar, Telangana:

BRS Party vs Congress: తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్న సమయంలో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ నెలకొన్నాయి. కాంగ్రెస్‌ గూండాలు.. పోలీసులు అధికార పార్టీకి సహకరించడంతో చాలా చోట్ల వివాదం రాజుకుంది. మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ జోరుగా ప్రలోభాలకు గురి చేయగా.. బహిరంగంగా డబ్బులు, కానుకలు పంచింది. ఎదురు తిరిగిన వారిపై కాంగ్రెస్‌ గూండాలతోపాటు స్వయంగా అగ్ర నాయకులు రంగంలోకి దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఉత్కంఠ మధ్య జరిగిన ఓటింగ్‌ భారీగా నమోదు కాగా ఈ పోలింగ్‌పై ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వచ్చాయి. ప్రధానంగా పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ప్రజలు బాగా విశ్వసిస్తారు. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Also Read: Schools Holiday: రేపు తెలంగాణలో స్కూళ్లకు సెలవు.. ఉత్తర్వులు జారీ!

తెలంగాణలో మొత్తం 116 మున్సిపాలిటీలతోపాటు 7 మున్సిపల్‌ కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీలతోపాటు కార్పొరేషన్‌లలో కూడా అత్యధికంగా కాంగ్రెస్‌ గెలుస్తుందని పీపుల్స్‌ పల్స్‌ సంస్థ తన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో వెల్లడించింది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు తెలపడం కానీ క్లీన్‌ స్వీప్‌ దిశగా కాంగ్రెస్‌కు ఓట్లు పడలేదని స్పష్టమవుతోంది. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా విజయవంతమైందని.. కాంగ్రెస్‌ పోటీగా వార్డులు గెలుచుకుంటుందని తేలింది. అయితే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీకి ఈసారి ప్రాధాన్యం లేదని స్పష్టమవుతోంది. మొత్తం 7 కార్పొరేషన్లలో రాజకీయ పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ మధ్య జరిగిందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే అంచనా వేసింది. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో బీజేపీ ఆధిక్యం సాధిస్తుందని.. మిగిలిన ఐదు కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల్లో తేలుతోంది.

Also Read: Municipal Exit Polls: తెలంగాణ మున్సిపల్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఆధిక్యం

మహబూబ్‌నగర్ మున్సిపల్‌ కార్పొరేషన్‌
అతిపెద్ద మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతుందని అంచనా. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం కొన్ని స్థానాలు సాధించే అవకాశం ఉండగా.. కాంగ్రెస్‌కు పీఠం దక్కే అవాకాశాలు ఉన్నాయి.

నిజామాబాద్
నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. మేజిక్ ఫిగర్ 31 మంది కౌన్సిలర్లు కావాలి. ఇందూరు గడ్డపై కాషాయ జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ గణనీయమైన స్థానాలు పొందే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభావం ఉండదని.. ఎంఐఎం, కాంగ్రెస్ ప్రభావం చూపాయని ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు అంచనా వేశాయి.

కరీంనగర్
కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా.. మేజిక్ ఫిగర్ 34. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. బీజేపీకి స్వల్ప ఆధిక్యంతో కార్పొరేషన్‌ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలకు కొన్ని స్థానాలు దక్కే అవకాశం ఉంది.

Also Read: AP Budget Session: విధ్వంసం నుంచి అభివృద్ధి- సంక్షేమంపై పరుగులు: ఏపీ గవర్నర్

నల్గొండ
నల్లగొండ కార్పొరేషన్‌లో 48 డివిజన్లు ఉండగా.. మేజిక్ ఫిగర్ 25 ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంటుందని అంచనా. బీఆర్‌ఎస్ పార్టీ రెండో స్థానంలో.. బీజేపీకి ఒక్క కార్పొరేటర్‌ కూడా లభించే అవకాశాలు లేవు.

మంచిర్యాల
మంచిర్యాల కార్పొరేషలో 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ తర్వాత అధిక స్థానాలు.. బీజేపీకి అతి తక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

కొత్తగూడెం
ఇక్కడ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో వెల్లడైంది. అయితే అనూహ్యం సీపీఐ/ సీపీఎం కూడా అధిక స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉండగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. బీజేపీ ఇక్కడ బలహీనంగా ఉంటుందని తెలుస్తోంది.

రామగుండం
రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇక్కడ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ పార్టీ తర్వాత.. ఇక మిగతా పార్టీలకు ఒక్కో స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Municipal Elections: సంగారెడ్డిలో రెచ్చిపోయిన జగ్గారెడ్డి.. కరీంనగర్‌లో బీజేపీ శ్రేణులపై పోలీసుల దాడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 11, 2026 17:15:16
Hyderabad, Telangana:

Municipal Exit Poll Results: పంచాయతీ ఎన్నికల్లో ఎదురుగాలి వీయగా.. మున్సిపల్‌ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలస్యంగా నిర్వహించినా తీవ్ర ఉత్కంఠతో ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బుధవారం పోలింగ్‌ ముగిసింది. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు గూండాల్లా రెచ్చిపోయి పోలింగ్‌ కేంద్రాల వద్ద దాడులు చేయగా.. పలుచోట్ల తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బ్యాలెట్‌ పత్రాల్లో ఓటర్లు తమ నిర్ణయాన్ని ఉంచారు. ఎల్లుండి ఫలితాలు విడుదల కానుండగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. యథావిధిగా అధికార పార్టీకి అత్యధిక స్థానాలు దక్కుతుండగా.. అంతే పోటీగా బీఆర్ఎస్‌ పార్టీకి స్థానాలు దక్కుతున్నాయి. బీజేపీకి సింగిల్‌ డిజిట్‌ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Schools Holiday: రేపు తెలంగాణలో స్కూళ్లకు సెలవు.. ఉత్తర్వులు జారీ!

మున్సిపాలిటీల్లో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు
మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి పీపుల్స్‌ పల్స్‌తోపాటు మరికొన్ని సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదల చేశాయి. వాటిలో అత్యధికంగా మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుంటుండగా.. గులాబీ పార్టీ కూడా ఇంచుమించు అదే స్థాయిలో స్థానాలు దక్కించుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో వెల్లడైంది. ఇక బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీగా ఉన్నాయని స్పష్టమవుతోంది.

Also Read: Municipal Elections: సంగారెడ్డిలో రెచ్చిపోయిన జగ్గారెడ్డి.. కరీంనగర్‌లో బీజేపీ శ్రేణులపై పోలీసుల దాడి

==> 116 మున్సిపాలిటీల్లో అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీ 68-76 దక్కించుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో తేలింది.
==> ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీ 29-36 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని తెలిసింది.
==> బీజేపీ 3-5 సింగిల్‌ డిపాజిట్‌ దక్కించుకుంటుందని వెల్లడైంది.
==> ఎంఐఎం ఒక్కటీ లేకుంటే సున్నా ఉండే అవకాశం.

ఓట్ల శాతం
కాంగ్రెస్‌: 36 శాతం
బీఆర్ఎస్ పార్టీ: 29.7 శాతం
బీజేపీ: 19.3 శాతం
ఎంఐఎం: 2 శాతం

Also Read: AP Budget Session: విధ్వంసం నుంచి అభివృద్ధి- సంక్షేమంపై పరుగులు: ఏపీ గవర్నర్

ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొందని.. ఈ ఫలితాలు కొద్దితేడాలతో అటు ఇటు మారుతాయని అంచనా వేశారు. 8 నుంచి 14 మున్సిపాలిటీల్లో ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా రాజకీయం నడిచినట్లు తెలుస్తోంది.

పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ వార్డుల వారీగా ఫలితాలు
కాంగ్రెస్: 1,210 నుంచి 1,290
బీఆర్ఎస్ పార్టీ: 860 నుంచి 930
బీజేపీ: 250 నుంచి 270
ఎంఐఎం: 35-44
సీపీఐ: 12 నుంచి 17
సీపీఎం: 10 నుంచి 14
ఇతరులు: 90 నుంచి 110

మున్సిపల్‌ కార్పొరేషన్ల ఫలితాలు
మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ హోరాహోరీగా తలపడగా.. కొన్ని చోట్ల ఎంఐఎం కింగ్‌ మేకర్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ రెండు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 11, 2026 13:32:00
Hyderabad, Telangana:

Moto G57 Power 5G Price Cut: ఇటీవల మోటరోలా కంపెనీ విడుదల చేసిన సరికొత్త మొబైల్స్‌లో Moto G57 Power 5G స్మార్ట్‌ఫోన్ ఒకటి. ఇది అద్భుతమైన భారీ బ్యాటరీ సెట్ అప్ తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లతో విడుదల చేసింది. ముఖ్యంగా చాలా ప్రత్యేకమైన డిస్ప్లే సెటప్ ను కలిగి ఉంటుంది. కాబట్టి అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా భావించవచ్చు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారు భారీ తగ్గింపుతో దీనిని సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ మొబైల్‌పై ఉన్న స్పెషల్ ఆఫర్స్ ఏంటో? ఎంత తగ్గింపు ధరకు ఈ  స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ Moto G57 Power 5G స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ బ్రైట్నెస్ తో లభిస్తోంది. ఈ మొబైల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఎంతో శక్తివంతమైన 7,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్లస్ పాయింట్ ఇదే అని చెప్పొచ్చు. అయితే ఇందులో ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కోసం 33W టర్బోపవర్ (TurboPower) ఫాస్ట్ చార్జర్ ని కూడా అందిస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 60 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన Snapdragon 6s Gen 4 (ఇది 4nm చిప్‌సెట్ ప్రాసెసర్ పై లాంచ్ అయింది. ఇది 8gb ర్యామ్ సపోర్టుతో అందుబాటులో ఉంది. అలాగే రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంపై ఈ రన్ అవుతుంది. దీంతోపాటు Sony LYT-600 సెన్సార్‌తో 50MP మెయిన్ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ లో అదనంగా 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇందులో డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ 5G సపోర్ట్, బ్లూటూత్ 5.1, USB టైప్-సి కనెక్టివిటీ ఫీచర్లను కూడా అందిస్తోంది.

Moto G57 Power 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బేస్ వేరియంట్ ధర రూ.17,999 కాగా.. ఇప్పుడే ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి 22 శాతం తగ్గింపుతో కేవలం రూ.13, 999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి అదనంగా రూ.700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ఇదే తగ్గింపు లభిస్తుంది. ఇక అదనంగా మరింత చీపు ధరకే ఈ మొబైల్ పొందాలనుకునే వారు ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగిస్తే ఏకంగా రూ.13 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌కి కేవలం రూ.999 లోపే పొందవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 11, 2026 13:15:25
Hyderabad, Telangana:

Nothing Phone 3a Pro Price: నథింగ్ ఫోన్ (3a) ప్రో (Nothing Phone 3a Pro) స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ 2025 సంవత్సరం మార్చి నెలలో విడుదల చేసింది. ఇది అత్యంత శక్తివంతమైన మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్‌గా లాంచ్ అయింది. అయితే, ఇప్పుడే కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మొబైల్ ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే అదనంగా ప్రత్యేకమైన కూపన్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగిస్తే ఈ మొబైల్ గతంలో ఎన్నడు లభించని ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ  స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Nothing Phone 3a Pro స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 6.77-అంగుళాల Flexible AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 7s Gen 3 (4nm) చిప్‌సెట్‌ ప్రాసెసర్ పై విడుదలైంది. ఇది 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు మార్కెట్‌లో 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. అదేవిధంగా వెనక భాగంలో ఇది త్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని ప్రధాన కెమెరా అద్భుతమైన సెన్సార్‌తో లభిస్తుంది. 

ఈ Nothing Phone 3a Pro మొబైల్‌కు సంబంధించిన బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ OIS సెన్సార్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరాతో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతోపాటు అదనంగా 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే  అదనంగా మరో 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్రంట్ భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా, ఇది 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైన 5000 mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది. 

అంతేకాకుండా ఈ Nothing Phone 3a Pro స్మార్ట్‌ఫోన్‌ చాలా ప్రత్యేకమైన Android 15 ఆధారిత Nothing OS 3.1 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే దీనికి కంపెనీ మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్‌ను కూడా అందిస్తోంది. ఆరేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్ సపోర్టును కూడా అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో 128Gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.29 వేల రూపాయలతో అందుబాటులో ఉంది. ఇక దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ.3000 వరకు కూపన్ లభిస్తుంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,300 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్ని వినియోగిస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.25 వేల లోపే వస్తుంది. అలాగే దీనిని ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ.20 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.5 వేల లోపే సొంతం చేసుకోవచ్చు. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 11, 2026 12:05:30
Hyderabad, Telangana:

White King Cobra Video Watch: ప్రకృతి ఒడిలో ఎన్నో వింత జీవులు జీవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల జీవులు అందర్నీ ఎంతగానో ఆశ్చర్యపరిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఇటీవల ఓ అందమైన నదిలో కనిపించిన అరుదైన పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా పాములు మనం నలుపు గోధుమ రంగుల్లో చూస్తూ ఉంటాం. కానీ ఈ వీడియోలో మాత్రం ఆ పాము తెలుపు రంగులో నదిలో పాకుతూ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారుల ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇక వీడియో వివరాల్లోకి వెళ్తే.. ప్రకృతి ఒడిలో ఎంతో అందంగా ప్రవహిస్తున్న ఒక నది కనిపిస్తుంది.. అందులో నీరు ఎంతో నిర్మలంగా.. నది అడుగులో ఆకుపచ్చని రంగులో మెరుస్తూ ఉండడం మీరు చూడొచ్చు. కొందరు పర్యాటకులు నీటిలో కేరింతలు కొడుతూ స్నానం చేస్తున్నారు. ఇంతలోనే నీటిలో నుంచి అనుకోకుండా ఒక భారీ పాము ప్రవేశించింది. ఆ పాము తెలుగులోని రంగులో ఉండడం మీరు గమనించవచ్చు. అయితే, అది చాలా పొడవుగా చూడడానికి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది..

ఈ పాము అక్కడ ఈదుతున్న పర్యాటకుల వైపుగా రావడం మీరు గమనించవచ్చు. ఆ పాము రావడం గమనించిన పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొందరు ఆ పామును చూసి నీటిలో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. మరికొందరు ఒడ్డు పైనే ఉండి.. ఆ పామును మొబైల్‌లో చిత్రీకరిస్తున్నారు. అయితే, ఆ పాము మాత్రం ఎంతో వేగంగా పర్యాటకుల వైపు గానే దూసుకు రావడం మీరు గమనించవచ్చు. ఈ పాము ఎవరికీ హాని చెయ్యకుండా ఈదుతూ నెమ్మదిగా ముందుకు వస్తోంది. 

అయితే, అక్కడే ఉన్న కొంతమంది ఆ పాముకు భయపడి ఒడ్డు పైకి చేరుకున్నారు. ఆ పాము వారికి అతి సమీపంలోకి రావడం వల్ల ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ పాము నదిలోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. పర్యాటకుల ఆనందానికి మాత్రం అంతరాయం కలిగించింది. ప్రకృతిలో మనతోపాటు ఇలాంటి ఎన్నో జీవులు నివసిస్తూ ఉంటాయి. ఇలా అప్పుడప్పుడు అనుకోకుండా దర్శనమిస్తాయి.. ఇలాంటి సందర్భాలను చిత్రీకరించి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 11, 2026 11:55:35
Hyderabad, Telangana:

Preconception Care Importance: మహిళలు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడం అనేది గర్భం దాల్చిన తర్వాత మొదలయ్యే ప్రక్రియ కాదు. అది గర్భధారణకు ముందే ప్రారంభం కావాలి. తల్లి కావాలనుకునే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను ఫెర్నాండెజ్ హాస్పిటల్ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీలేఖ A.R అందించిన కొన్ని సలహాలు, సూచనలు  తెలుసుకుందాం.

చాలామంది మహిళలు గర్భం దాల్చిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ, గర్భం దాల్చడానికి ముందే చేసే పరీక్షలు, పోషకాహార మార్పులు పుట్టబోయే బిడ్డలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నిరోధించగలవు.

ముందస్తు స్క్రీనింగ్ ఎందుకు అవసరం?
సాధారణ రక్త పరీక్షల ద్వారా శరీరంలోని కొన్ని నిశ్శబ్ద సమస్యలను గుర్తించవచ్చు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే (రక్తహీనత) అలసట రావడమే కాకుండా, అకాల ప్రసవం, శిశువు తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉంది.

చికిత్స చేయని థైరాయిడ్ వల్ల గర్భం దాల్చడంలో ఇబ్బందులు, గర్భస్రావం, శిశువు మెదడు అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకుంటే గర్భం దాల్చిన తొలి వారాల్లోనే శిశువు అవయవాల అభివృద్ధిలో లోపాలు తలెత్తవచ్చు.

జీవనశైలి, బరువు నిర్వహణ
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఉన్నవారిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల గర్భం దాల్చడం ఆలస్యం కావచ్చు. బరువు తక్కువగా ఉన్నా లేదా అధిక బరువు ఉన్నా అండోత్సర్గము లో సమస్యలు వస్తాయి. అధిక బరువు గర్భధారణ సమయంలో మధుమేహం, బిపి ప్రమాదాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దీనిని అధిగమించవచ్చు.

పోషకాహారం, సప్లిమెంట్లు
గర్భధారణ ప్రణాళికలో ఉన్న మహిళలు కింది పోషకాలపై దృష్టి పెట్టాలి.

ఫోలిక్ యాసిడ్: శిశువు మెదడు, వెన్నెముక లోపాలను నివారించడానికి ప్రతిరోజూ కనీసం 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి.

ఐరన్, విటమిన్ సి: రక్తహీనతను తగ్గించడానికి ఆకుకూరలు, బెల్లం, ఖర్జూరాలు, గుడ్లు తీసుకోవాలి. ఐరన్ గ్రహించడానికి విటమిన్ సి (నిమ్మ, నారింజ) తోడవ్వాలి.

విటమిన్ డి: సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి ఎండలో గడపడం లేదా వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవడం అవసరం.

ఇవే కాకుండా వారసత్వంగా వచ్చే రక్త రుగ్మతలైన తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి వంటి వాటిని గుర్తించడానికి ముందే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. దీనివల్ల అవసరమైనప్పుడు జన్యు కౌన్సెలింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

చివరిగా.. ఫిబ్రవరి నెలలో పాటించే పునరుత్పత్తి ఆరోగ్య మాసం (Reproductive Health Month) సందర్భంగా, మహిళలందరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి. ఆరోగ్యకరమైన తల్లి ద్వారానే ఆరోగ్యకరమైన కుటుంబం సాధ్యమవుతుంది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం నిపుణుల అభిప్రాయాన్ని అనుసరించి రాసినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని వ్యక్తిగతంగా కలవడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Usman Tariq Controversy: పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్..ధోనికి పి*చ్చ ఫ్యాన్..స్పిన్నర్ బయోగ్రఫీ ఇదే!

Also Read: Silver Price Prediction: వెండి ధరకు రెక్కలు..కిలో రూ.5 లక్షలకు చేరువలో? ఇన్వెస్టర్లు అప్రమత్తం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 11, 2026 11:52:40
Sangareddy, Telangana:

Police Attack On BJP Leaders: మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా అధికార పక్షం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులను అని కూడా చూడకుండా రెచ్చిపోయి పోలీసులపై దాడులకు తెగబడ్డారు. పోలీసులకు వార్నింగ్‌ ఇస్తూ పోలింగ్‌ బూతుల్లో యథేచ్చగా ప్రలోభాలకు గురిచేస్తూ.. డబ్బులు పంచుతూ కాంగ్రెస్‌ శ్రేణులు దాడి చేశారు. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీ నాయకులపై కాంగ్రెస్‌ గూండాలు, పోలీసులు కూడా దాడులకు పాల్పడ్డారు. 

Also Read: Schools Holiday: రేపు తెలంగాణలో స్కూళ్లకు సెలవు.. ఉత్తర్వులు జారీ!

సంగారెడ్డి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. పోలీసులతో కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డిలో 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. కాంగ్రెస్‌ అభ్యర్థిని సీఐ దూషించారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలింగ్‌ బూత్‌లోకి చొచ్చుకెళ్లి పోలీసులతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇందిరా కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అడ్డుకోవడంతో జగ్గారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులను బూతులు తిడుతూ జగ్గారెడ్డి రెచ్చిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతోనే అడ్డుకున్నామని పోలీసులు చెప్పగా అయినా కూడా జగ్గారెడ్డి వినిపించుకోలేదు. దీంతో అదనపు ఎస్పీ రఘునందన్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెడుతున్నారు.

Also Read: Govt Employees: 33 ఏళ్ల సర్వీస్‌కే ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ రిటైర్మెంట్‌.. కొత్త సర్వీస్‌ రూల్స్‌పై ఆగ్రహం

బీజేపీ కార్యకర్తలపై పోలీసుల దాడి
కరీంనగర్‌లో పోలీసులు రెచ్చిపోయారు. కరీంనగర్‌ జిల్లా పరిషత్ వద్ద బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. విచక్షణరహితంగా దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆరుగురు బీజేపీ కార్యకర్తల చేతులు విరిగాయి. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. తాము చెబుతుంటే పోలీసులు తమపై లాఠీఛార్జి చేయడం ఏమిటని మండిపడ్డారు.

Also Read: AP Budget Session: విధ్వంసం నుంచి అభివృద్ధి- సంక్షేమంపై పరుగులు: ఏపీ గవర్నర్

మెట్‌పల్లిలో ఉద్రిక్తత
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపల్ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం వద్ద వివాదం రాజుకుంది. పోలింగ్ కేంద్రం ముందు పలువురు అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్వతంత్ర అభ్యర్థి మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్య మాటల యుద్ధం ప్రారంభమై అది కాస్త ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఇరు వర్గాల మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకుని ఒకరిపై ఒకరు నినాదాలు చేస్తూ గొడవ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

పోలింగ్ కేంద్రం సమీపంలో జరిగిన వివాదానికి గొడవ విషయం తెలుసుకున్న ఎస్పీ అశోక్ కుమార్ హుటాహుటిన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అప్పటికే ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. పోలింగ్ కేంద్రం సమీపంలో ఎవరూ గుంపులుగా ఉండనివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. 'జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరిగినా వెంటనే స్పందించి అదుపులోకి తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరూ గుంపులుగా ఉండనివ్వము. ప్రజలు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి' అని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 11, 2026 11:46:51
Hyderabad, Telangana:

Usman Tariq Bowling Action Legal Or Illegal: పాకిస్థాన్ క్రికెట్ మరో మిస్టరీ స్పిన్నర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. టీ20 ప్రపంచకప్ 2026లో తన విభిన్నమైన బౌలింగ్ శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ ఆటగాడే ఉస్మాన్ తారిక్. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత, ఇప్పుడు భారత బ్యాటింగ్ లైనప్‌ను సైతం ఇబ్బంది పెట్టగల సామర్థ్యం ఉన్న 'ఎక్స్-ఫాక్టర్' (X-Factor)గా అతను మారాడని విశ్లేషకులు భావిస్తున్నారు. 

అయితే ఉస్మాన్ తారిక్ ఎదుగుదల వెనుక అంతులేని పట్టుదల, కఠినమైన గతం దాగి ఉందట. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఉస్మాన్, కుటుంబాన్ని పోషించడానికి అనేక రకాల ఉద్యోగాలు చేశాడు. ఆ కష్టాలే ఈరోజు అతనికి మైదానంలో ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇచ్చాయి. 

ఎం.ఎస్. ధోనీ జీవిత చరిత్ర చూసిన తర్వాత, ఉస్మాన్ విదేశాల్లో స్థిరమైన జీవితాన్ని వదులుకుని ప్రొఫెషనల్ క్రికెట్‌ను ఎంచుకున్నాడు. భద్రత కంటే ఆశయం మిన్న అని నిరూపించాడు. సాంప్రదాయక పద్ధతుల్లో కాకుండా, ఇతని బౌలింగ్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సెలెక్టర్ల కంట్లో పడ్డాడు.

'త్రో బౌలింగ్' వివాదం
ఉస్మాన్ బౌలింగ్ చేసేటప్పుడు క్రీజు దగ్గర ఒక్క క్షణం ఆగి, వింతైన స్లింగ్ మోషన్‌తో బంతిని వదులుతాడు. ఈ అసాధారణ యాక్షన్ చూసి చాలామంది ఇది 'త్రో బౌలింగ్' (అక్రమ బౌలింగ్) అని విమర్శించారు.

అయితే, ఐసీసీ (ICC) నిర్వహించిన బయోమెకానికల్ పరీక్షల్లో ఉస్మాన్ ఉత్తీర్ణత సాధించాడు. మోచేయి వంపు నిబంధనల లోపే ఉందని నిర్ధారణ కావడంతో అతను చట్టబద్ధంగా బౌలింగ్ చేయడానికి అనుమతి పొందాడు.

టీమ్ ఇండియాకు ఇతను ప్రమాదకరమా?
భారత్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్‌ను తారిక్ ఎలా ఇబ్బంది పెట్టగలడో ఈ అంశాలు వివరిస్తాయి. ఇతని బౌలింగ్‌లో ఎకానమీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పరుగులు అవసరమైన మిడిల్ ఓవర్లలో బ్యాటర్లను కట్టడి చేయగలడు.

బంతి రిలీజ్ అయ్యే పాయింట్ సాధారణ బౌలర్ల కంటే భిన్నంగా ఉండటంతో, బ్యాటర్లకు బంతి దిశను అంచనా వేయడానికి సమయం పడుతుంది. తన తొలి ప్రపంచకప్ మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండగలనని నిరూపించుకున్నాడు.

పాకిస్థాన్ జట్టు అతన్ని ఒక 'వైల్డ్ కార్డ్' లాగా వాడుకుంటోంది. కొత్త స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడే జట్లకు తారిక్ ఒక పెద్ద సవాలుగా మారనున్నాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇతను పాకిస్థాన్ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది.

వివాదం నుండి ప్రభావం వైపు ఉస్మాన్ తారిక్ ప్రయాణం సాగుతోంది. తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా, 2026 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ప్రధాన బలమైన వ్యూహాత్మక ఆస్తిగా అతను నిలుస్తున్నాడు.

Also Read: SA vs AFG Match: అహ్మదాబాద్‌లో నరాలు తెగే ఉత్కంఠ..సౌతాఫ్రికా Vs అఫ్ఘానిస్థాన్ డబుల్ సూపర్ ఓవర్..ఎవరు గెలిచారంటే?

Also Read; Rohit Kohli BCCI Contract: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాక్..జీతంలో భారీ కోత..ఎంత ఇస్తున్నారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top