Oppo K14x 5g Launch Date In India Telugu: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో వచ్చేవారం భారత మార్కెట్‌లోకి తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ ఒప్పో k14 ఎక్స్ అనే పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికీ ఈ మొబైల్‌కు సంబంధించిన కొన్ని వివరాలను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని రకాల ఫీచర్స్‌తో పాటు వేరియన్స్ వివరాలు లీకయ్యాయి. అవేంటో? ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఒప్పో K14x స్మార్ట్‌ఫోన్ గతంలో విడుదల చేసిన అన్ని మొబైల్స్ డిస్ప్లే కంటే ప్రత్యేకమైన పెద్ద 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గతంలో విడుదల చేసిన ఒప్పో K13x 5G మొబైల్‌కి సక్సెస్‌గా విడుదల చేయబోతోంది.
ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం కంపెనీ ఒప్పో k14 ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది గత మోడల్స్ కంటే అద్భుతమైన డిజైన్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కె సిరీస్ స్మార్ట్ ఫోన్స్ మాదిరిగానే కొన్ని ప్రత్యేకమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉంటుంది.
ముఖ్యంగా ఈ మొబైల్ వెనక భాగంలో పిల్ ఆకారపు కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు రెండు ప్రత్యేకమైన కెమెరాలతో పాటు LED ఫ్లాష్ లైట్ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ColorOS 15 పై రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ కెమెరాలు ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ని కూడా కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన రెండు కెమెరాలు వివరాల్లోకి వెళితే.. ఇందులో రెండు 50-మెగాపిక్సెల్ కెమెరా ప్రధాన కెమెరాలు ఉంటాయి. అలాగే 45 W ఛార్జింగ్ సపోర్టుతో ఎంతో శక్తివంతమైన 6,500 mAh బ్యాటరీతో విడుదల కాబతునట్లు తెలుస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17 గంటల వరకు నాన్ స్టాప్ వీడియో ప్లే బ్యాక్ అందిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్లను ఒప్పో కంపెనీ అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా మాత్రం కాస్త కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని కొత్త కలర్స్లో ఈ మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Mancherial Latest Telugu News: మంచిర్యాల జిల్లాలోని క్యాతంపల్లి మున్సిపాలిటీ వేదికగా రాజకీయం ఒక్కసారిగా ఊహించని స్థాయిలో వేడెక్కింది.. అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష BRS శ్రేణుల మధ్య పోటాపోటీ నినాదాలు.. పోలీసుల జోక్యంతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. అయితే, ఈ సమయంలో పోలీసులంతా కాంగ్రెస్ కార్యకర్తలు లాగా వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు..
అసలు విషయం ఇదే..
క్యాతంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 21వ వార్డుకు చెందిన BRS కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలత మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఆమెను ఒక్కసారిగా పోలీసులు అడ్డుకున్నారు.. అయితే, ఆమెపై కేసు నమోదు కావడంతో లోపలికి వెళ్లను ఇవ్వకపోవడంతో అక్కడ ఈ వివాదం ప్రారంభమైంది.. అయితే, వెంటనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మీతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంటనే అక్కడికి చేరుకోవడంతో పాటు పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు.
BRS అభ్యర్థులను భయభ్రాంతులను గురి చేసేందుకు ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని వారు మండిపడ్డారు.. అంతేకాకుండా పోలీసులు కాకి దుస్తుల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్య బద్దంగా పోటీ చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు పెడితే, అసలు ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు.
Also Read: మూడేళ్ల బాలుడిపై అంగన్‌వాడీ టీచర్ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
అయితే, ఇదే సమయంలో ఖతంపల్లి ఫ్లై ఓవర్ మీదుగా వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌ను BRSకు సంబంధించిన కార్యకర్తలు అడ్డుకున్నారు.. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అలాగే వారు రోడ్డుపై బైఠాయించారు.. దీంతో అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఒక పెద్ద వాగ్వాదమే చోటుచేసుకుంది.. గో బ్యాక్ వివేక్ వెంకటస్వామి అంటూ టిఆర్ఎస్ శ్రేణులు.. జై కాంగ్రెస్ అంటూ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నినాదం చేయడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
Also Read: మూడేళ్ల బాలుడిపై అంగన్‌వాడీ టీచర్ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Praying Dead Body In House Since 4 Days: ఏసు కాపాడతాడు.. ప్రాణం పోస్తాడు.. ప్రార్థనలు చేస్తున్నామంటూ హైదరాబాద్‌లో ఓ కుటుంబం వింతగా ప్రవర్తించింది. కూకట్‌పల్లిలోని రామకృష్ణ నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం డెడ్ బాడీని ఇంట్లోనే నాలుగు రోజులుగా పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. 40 ఏళ్ల క్రితం ఏసురత్నం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఏఎస్ఐగా పనిచేసి ఆయన పదవీ విరమణ కూడా పొంది మృతి చెందాడు. అయితే ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణి, ఇద్దరు కుమార్తెలు సునీత, శైలజ కుమారుడు జయరాజులు కూడా ఉన్నారు.
అయితే వారం రోజులుగా చిన్న కుమార్తె శైలజ అనారోగ్యం బారిన పడింద. ఈ నేపథ్యంలో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ఆమె రక్తహీనతతో బాధపడింది. కుటుంబ సభ్యులను రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించినా.. పరిశుద్ధమైన రక్తం మాత్రమే ఎక్కించాలంటూ వారు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో శైలజ ఈ నెల 13వ తేదీన చనిపోయింది. అయితే మృతదేహాన్ని కూడా అదే రోజు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. కానీ అప్పటి నుంచి నేటి వరకు ఆమె అంత్యక్రియలు మాత్రం నిర్వహించలేరు. ఆ మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్ పేటికలో అలాగే పెట్టి ఇంట్లోనే పెట్టుకొని తలుపులు బిగించుకొని ఉన్నారు.
ఇక ఎప్పటి మాదిరిగానే ఇంటి నుంచి బయటకు వెళ్తూ వస్తున్నారు . అయితే ఈ విషయం తెలిసిన స్థానికులు అంత్యక్రియలు చేయడం లేదు ఏంటని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం చెబుతున్నారు. మేము ప్రార్థనలు చేస్తున్నాం.. యేసు కాపాడుతాడు.. అంత్యక్రియలు మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం. అడగడానికి మీరు ఎవరు? అంటూ వారు అపార్ట్‌మెంట్ వాసులతో గొడవలకు దిగారు. దీంతో దుర్వాసన కూడా ఇంట్లోంచి ఎక్కువగా రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా సోమవారం సమాచారం అందుకున్న పోలీసులు ఆ కుటుంబం వద్దకు వచ్చి ఆరా తీయగా కాసేపు ఎంతకీ తలుపులు తీయకుండా అలాగే ఉన్నారు . వారితో కూడా వాగ్వాదానికి దిగారు. అయితే చివరికి పోలీసులకు అంత్యక్రియలు జీహెచ్‌ఎంసీ వారికి అప్పగిస్తామని హెచ్చరించడంతో ఇక ఆ మృతదేహాన్ని తీసుకొని సొంతూరు వెళ్లారు. అయితే ఆ కుటుంబం కాస్త వింతగా ప్రవర్తిస్తుందని.. ఆ ముగ్గురు పిల్లలకు 40 ఏళ్లు పైబడినా ఎవరూ వివాహం చేసుకోకుండా తల్లి వద్దే ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఎవరితో మాట్లాడారని మానసిక ఆరోగ్యంతో కూడా బాధపడుతున్నారని సమాచారం. అయితే, చనిపోయిన శైలజ కూడా మానసికంగా పరిస్థితి బాగా లేకపోవడం వల్ల అలా జరిగిందన్నారు.
Also Read: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. టైమ్ టేబుల్ పీడీఎఫ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!
Also Read: మూడేళ్ల బాలుడిపై అంగన్‌వాడీ టీచర్ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mars And Mercury Transit Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడితో పాటు బుధుల సంచారం చాలా ప్రభావవంతమైందిగా భావిస్తారు. ధనిష్ట నక్షత్రంలో కుజుడు ఉండటం వల్ల ధైర్యంతో పాటు సంపాదన పెరుగుతుంది. అలాగే బుధుడు పూర్వభద్రపాదనక్షత్రంలో సంచార దశలో ఉండటం వల్ల మేధో వికాసం ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతుంది. ఈ రెండు గ్రహాల సంచారం చాలా శుభ్రమైందిగా భావిస్తారు. ఎందుకంటే ఫిబ్రవరి 15వ తేదీన కుజుడితో పాటు బుధ గ్రహాలు సంచారం చేశాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారికి అపారమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోంది.
ఈ రాశులవారికి ఊహించని లాభాలు:
మేషరాశి
మేష రాశి వారికి కుజుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ధనిష్ట నక్షత్రం లోకి కుజుడు సంచారం చేయడం కారణంగా ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఏదైనా చట్టపరమైన కేసుల్లో ఇరుక్కున్న వారికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అంతేకాకుండా వాటిల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. నాయకత్వ లక్షణాలున్నవారు పనుల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. కొత్త భాగ్యదలు పొందడమే కాకుండా.. ఈ సమయంలో ఊహించని లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. వ్యాపారాల్లో ఆర్థిక విస్తరణ కూడా సాధ్యమవుతుంది. ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిథున రాశి
మిధున రాశికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడు.. అయితే, నక్షత్ర మార్పుల కారణంగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అలాగే కొన్ని రకాల కీరకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ రంగంలో పనులు చేస్తున్న వ్యక్తులకు.. ఈ సమయం అద్భుతమైన అవకాశాలను అందించబోతోంది. రచనల్లో కూడా మిమ్మల్ని మించిన వారు లేకుండా ఉంటారు. అంతేకాకుండా ఆకస్మికంగా ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అలాగే గణనీయమైన పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఆర్థికంగా ఊహించని స్థాయిలో బలం పెరుగుతుంది. అదృష్టం కూడా చాలా వరకు సహకరించి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పూర్వీకుల ఆస్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందగలుగుతారు. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు పదోన్నతులు పొందే అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు కూడా పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో స్థిరపడిన వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతోంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడు ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా ధైర్యం పెరగబోతుంది. ముఖ్యంగా వీరికి చాలా రకాల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. శత్రువులపై ఊహించని విజయాలు సాధించగలుగుతారు. సామాజిక స్థితి కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా.. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ardha Kendra Raja Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఎంతో శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు.. ఈ గ్రహం రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచార దశలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాల సంయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం శని మీనరాశిలో సంచార దశలో ఉంది. ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో కుజుడు శని గ్రహం ఒకదానికొకటి 45 డిగ్రీల కోణం లోకి వచ్చి సంయోగం జరిపాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఇలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈ సమయంలోనే ఎంతో శక్తివంతమైన అర్థకేంద్ర రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇది చాలా శుభప్రదమైనదిగా చెప్పుకుంటారు.. ఈ యోగ ప్రభావం వల్ల అన్ని రాశుల వారికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అనుకోకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, అర్థ కేంద్ర రాజయోగం వల్ల ఊహించని లాభాలు పొందుపై రాశులేవో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి ప్రయోజనాలు:
మేషరాశి
మేషరాశి వారికి అర్థ కేంద్ర రాజయోగ ప్రభావంతో ఎన్నో రకాల అనుకూలమైన సంఘటనలు ఎదురవుతాయి. ముఖ్యంగా కుజుడు వీరికి ఉన్నత స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం మంచి అవకాశాలను కలిగిస్తుంది. కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. వృత్తిపరమైన జీవితం కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో హోదా కూడా పెరిగి ఊహించని స్థాయిలో ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా అనుకున్నంత స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతుంది. జీవితం ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉన్నతాధికారుల నుంచి పనుల్లో సంతృప్తి కూడా లభిస్తుంది. దీంతోపాటు పదోన్నతులు పెరిగి జీతం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ జీవితం కూడా చాలా వరకు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం కూడా అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది. జీవితంలో ఊహించని ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి అర్థ కేంద్ర రాజయోగం కారణంగా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. దీంతోపాటు సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahalakshmi Raja Yoga Effect On Zodiac: ఫిబ్రవరిలోని కొత్త వారంలో మకర రాశిలో చంద్రుడి గుజుడి కలయిక జరిగింది. అయితే ప్రారంభ సమయంలోనే ఈ రెండు గ్రహాల కలయిక జరగడం వల్ల ఎంతో ప్రత్యేకమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది. ఈ యోగాన్ని అత్యంత అరుదైనదిగా భావిస్తారు. అయితే దీని ప్రభావం కొన్ని రోజులపాటు కొనసాగుతూ వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనిని చంద్ర మంగళ రాజయోగంగా కూడా చెప్పుకుంటారు. ఈ వారం ఎంతో శక్తివంతమైన మహాపురుష రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ధైర్యం పెరగడమే కాకుండా.. రాజకీయాల్లో అపారమైన విజయాలు లభించబోతున్నాయి. మేష రాశి వారికి అన్నింటి పరంగా విపరీతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. డబ్బు కూడా భారీ మొత్తంలో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశుల వారికి బంపర్ జాక్పాట్..
మేషరాశి
మేష రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం (Mahalakshmi Raja Yoga) కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పనుల్లో సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రయాణాలు చేయడం వల్ల విపరీతమైన ఆనందం కూడా లభిస్తుంది. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఆర్థికంగా ఖర్చులు విపరీతంగా ఉన్నప్పటికీ.. ఈ సమయంలో కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలకు కాస్త పరిష్కారం కూడా దొరుకుతుంది.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో కొన్ని రకాల ఆర్థికపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితం చాలా వరకు ప్రశాంతంగా ముందుకు కొనసాగుతుంది. దీంతోపాటు కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. ఈ వారం ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు విశేషమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కాస్త వీరు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే ఆహార సంబంధిత సమస్యలు కూడా రావచ్చు.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం విశేషమైన ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా వీరికి కార్యాలయాల్లో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరమైన శ్రేయస్సు లభించడమే కాకుండా.. ప్రయాణాలు చేయడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ఇక భాగస్వామ్య జీవితంలో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. వ్యాపారాల్లో భాగస్వాములు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబ విషయాలపై అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ సమయంలో కాస్త రిస్కు తీసుకున్నప్పటికీ ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
HBD KCR: కాంగ్రెస్ అధికార బలం.. గూండాగిరి.. దౌర్జన్యం చేసినా కూడా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదుకు ఐదు మున్సిపాలిటీలు గెలిచి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తామని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రకటించారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మునిసిపాలిటీల గెలుపును కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బిఆర్ఎస్‌కే పట్టం కట్టింది' అని తెలిపారు. ప్రభుత్వం 420 హమీలు గుప్పించి ఇప్పటికీ ఏం వాగ్దానం నెరవేర్చలేదని చెప్పారు.
Also Read: Seethakka: వెన్నుపోటుదారులను వదల.. కాంగ్రెస్ రెబెల్స్‌కు సీతక్క మాస్ వార్నింగ్!
'అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా గెలిచిన కౌన్సిలర్లను కౌంటింగ్ కేంద్రాల నుంచి కిడ్నాప్ చేయటం ఎంత వరకు సమంజసం?' రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. అవినీతికి, గతంలో జరిగిన అభివృద్ధికి మధ్య జరిగిన పోరులో అభివృద్ధి విజయం సాధించిందని తెలిపారు. 'ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాం' అని ప్రకటించారు.
Also Read: India vs Pakistan: పాకిస్థాన్ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయం
'పోలీస్, అధికార విభాగం ప్రభుత్వానికి కట్టుబానిసగా పనిచేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్లలు, ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయి. విలువైన భూములపై రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులకు తమ భూమిలో కన్నుపడింది. అవినీతికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీయే' అని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. 'పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయటం సంతోషంగా ఉంది. ఈ విజయానికి బాటలు వేసిన మాజీ మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు. ప్రతిపక్షంలో ఉండి కూడా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మునిసిపాలిటీలలో విజయం సాధించటం ఆనందంగా ఉంది. అన్ని మునిసిపాలిటీలలో ఇస్నాపూర్ మునిసిపాలిటీ గెలుపు చాలా ప్రత్యేకమైనది' అని తెలిపారు.
Also Read: IND vs PAK: చెలరేగిన పాకిస్థాన్.. ఇషాన్ కిషన్ శ్రమించినా భారత్ స్కోర్ ఏడు వికెట్లకు 175
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chiranjeevi Shoulder Surgery Update: మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని రోజులుగా చేతికి కట్టు కట్టుకుని కనిపిస్తుండటంతో అభిమానుల్లో నెలకొన్న ఆందోళనకు ఆయన స్వయంగా తెరదించారు. సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇస్తూ, సర్జరీ జరిగిన విషయాన్ని ధృవీకరించారు.
ఇటీవల అల్లు అరవింద్ కుటుంబం అల్లు శిరీష్ వివాహ ఆహ్వాన పత్రికను చిరంజీవికి అందించిన సమయంలో, ఆయన చేతికి కట్టు ఉండటాన్ని గమనించిన అభిమానులు కంగారు పడ్డారు. దీనిపై చిరు స్పందిస్తూ అసలు విషయం చెప్పారు.
ఏం జరిగింది?
చిరంజీవి తన భుజానికి సంబంధించి ఒక చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన భుజానికి ఆర్థోస్కోపీ జరిగినట్లు వెల్లడించారు. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ నితిన్‌కు చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారి నైపుణ్యం వల్ల సర్జరీ ప్రక్రియ అంతా చాలా సౌకర్యవంతంగా సాగిందని పేర్కొన్నారు.
Several well-wishers have enquired about my health after noticing the arm sling.
It was just a minor shoulder keyhole surgery. I am recovering well and already getting back to my routine.
My heartfelt thanks to Dr. Nithin, one of the finest arthroscopy surgeons, for his care… pic.twitter.com/txLNH2yNFQ
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2026
అంతకుముందు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌ను సందర్శించినప్పుడు కూడా చేతికి కట్టుతోనే కనిపించారు. నొప్పి ఉన్నప్పటికీ అభిమానులతో ఫోటోలు దిగుతూ ఎంతో ఓపికగా గడిపారు. తాజాగా అల్లు అరవింద్ దంపతులు, శిరీష్ స్వయంగా చిరు ఇంటికి వెళ్లి మొదటి శుభలేఖ అందించారు. మెగా-అల్లు కుటుంబాలు కలిసి కనిపించిన ఆనందంలో ఉన్న ఫ్యాన్స్‌కు చిరు చేతి కట్టు మాత్రం టెన్షన్ పెట్టింది.
ప్రస్తుత పరిస్థితి
చిరంజీవి ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారు. ఇప్పటికే తాను సాధారణ జీవితానికి తిరిగి వస్తున్నానని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో పనుల్లో నిమగ్నమవుతానని భరోసా ఇచ్చారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన శ్రేయోభిలాషులకు, దీవెనలు అందించిన అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. మెగాస్టార్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Solar Eclipse 2026: రేపే సూర్యగ్రహణం..సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసా? భారతదేశంలో ప్రభావం ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Srisailam Bus Accident Today: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోతైన గుంతలోకి ఒరిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం జరిగిన తీరు
శ్రీశైలం ఘాట్ రోడ్డులోని దోర్నాల సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. సరిగ్గా అదే చోట పెద్ద గుంత ఉండటంతో బస్సు అమాంతం అందులోకి ఒరిగిపోయింది. బస్సు గుంతలోకి ఒరిగిపోవడాన్ని గమనించిన తోటి వాహనదారులు వెంటనే స్పందించారు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకుండానే ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు మరియు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంతలో ఇరుక్కుపోయిన బస్సును బయటకు తీసేందుకు క్రేన్ల సహాయంతో ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఘాట్ రోడ్లలో ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మలుపుల వద్ద వేగాన్ని నియంత్రించాలని అధికారులు సూచిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Solar Eclipse 2026: రేపే సూర్యగ్రహణం..సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసా? భారతదేశంలో ప్రభావం ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tata Motors EV Offers: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ అదిరిపోయే శుభవార్త అందించింది. పర్యావరణ హితమైన వాహనాలను ప్రోత్సహించే దిశగా, ఫిబ్రవరి నెలలో తన ఎలక్ట్రిక్ వాహనాలపై (EVs) భారీ తగ్గింపులను ప్రకటించింది. మోడల్‌ను బట్టి ఏకంగా రూ.3.80 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. భారత ఈవీ మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్, ఈ నెలలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.
ఈ నెలకు సంబంధించి అత్యధిక తగ్గింపు టాటా కర్వ్ EV పైనే ఉంది. గరిష్టంగా ₹3.80 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. పాత స్టాక్ (మోడల్ ఇయర్) ఉన్న వాహనాలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. కేవలం కర్వ్ మాత్రమే కాకుండా, మిగిలిన ప్రధాన ఈవీలపై కూడా టాటా ఆకర్షణీయమైన ధరలను అందిస్తోంది.
నెక్సాన్ EV ఫ్యామిలీ ఈవీ సెగ్మెంట్లో టాప్ లో ఉండే ఈ కారుపై కూడా మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే పంచ్ EV మైక్రో ఎస్‌యూవీ విభాగంలో క్రేజ్ సంపాదించుకున్న పంచ్ ఈవీపై ఈ నెల ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. చివరిగా టియాగో EV బడ్జెట్ ఈవీ ప్రియులకు ఇది ఒక మంచి అవకాశం.
డిస్కౌంట్లు ఎలా నిర్ణయిస్తారు?
ఈ తగ్గింపులు అన్ని కార్లపై ఒకేలా ఉండవు, కింద పేర్కొన్న అంశాలపై ఆధారపడి ఉంటాయి. 2024 లేదా అంతకంటే పాత మోడల్ ఇయర్ స్టాక్ (MY24) వాహనాలపై డిస్కౌంట్లు అత్యధికంగా ఉంటాయి. ఆఫర్లు నగరాలు, డీలర్‌షిప్‌ల ఆధారంగా స్వల్పంగా మారుతుంటాయి. అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా లభించే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ కారు ఎందుకు కొనాలి?
పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే ఈవీ ఖర్చు చాలా తక్కువే కాకుండా కాలుష్యం లేని ప్రయాణాన్ని అందిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులను కల్పిస్తున్నాయి.
మీరు టాటా ఎలక్ట్రిక్ కారు కొనే ఆలోచనలో ఉంటే, మీ సమీప టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సందర్శించి అక్చువల్ స్టాక్, ఫైనల్ ప్రైస్ గురించి తెలుసుకోవడం ఉత్తమం. ఈ నెలలో లభించే భారీ తగ్గింపులను వినియోగించుకుని లక్షల రూపాయలు ఆదా చేసుకోండి.
Also Read: Solar Eclipse 2026: రేపే సూర్యగ్రహణం..సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసా? భారతదేశంలో ప్రభావం ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Congress Party Rebels: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన రెబెల్స్‌కు మంత్రి సీతక్క అలియాస్ ధనసరి అనసూయ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచిన వారిని తాను క్షమించనని ప్రకటించారు. 'వెన్నుపోటు రాజకీయాలు చేసిన వాళ్లను సహించేది లేదు. సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరం. వెన్నుపోటు రాజకీయాలు ఎవరు చేశారో మాకు తెలుసు. పద్ధతి మార్చుకోండి..ఇదే చివరి హెచ్చరిక' అని సీతక్క హెచ్చరించారు.
Also Read: Telangana: తెలంగాణ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక.. దౌర్జన్యం చేస్తున్న కాంగ్రెస్
ములుగు మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ భిక్షపతితోపాటు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన అనంతరం మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ను గెలిపించిన కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని ఆలోచించి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింత నిప్పుల చంద్రకళను ఎన్నుకున్నట్లు వివరించారు. 'అందరికీ చైర్ పర్సన్ కావాలని ఉంటుంది.. కానీ ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. అవకాశాలు రానివారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి' అని కాంగ్రెస్ కార్యకర్తలకు సీతక్క భరోసా ఇచ్చారు. 'వెన్నుపోటు రాజకీయాలతో ములుగు మున్సిపాలిటీలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. వెన్నుపోటు రాజకీయాలు చేసిన వాళ్లను సహించేది లేదు' అని స్పష్టం చేశారు.
Also Read: India vs Pakistan: పాకిస్థాన్ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయం
'సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరం. వెన్నుపోటు రాజకీయాలు ఎవరు చేశారు మాకు తెలుసు. పద్ధతి మార్చుకోండి.. ఇదే చివరి హెచ్చరిక' అని సీతక్క తెలిపారు. 'ములుగు పట్టణ అధ్యక్షుడు చింత నిప్పుల భిక్షపతికి గతంలో ఎన్ని ఒత్తిడిలు వచ్చిన పార్టీ మారలేదు. మనిషిలో చిత్తశుద్ధి ఉంది. కమిట్‌మెంట్‌తో పని చేశాడు. ములుగు జిల్లా మాజీ అధ్యక్షుడు నల్లెల కుమార్ అన్నలాంటివారు. ఆయన కుమారుడు నల్లెల భరత్‌కు ఇంకా చాలా వయసు ఉంది.. మంచి అవకాశాలు వస్తాయి' అని సీతక్క ఓదార్చారు.
Also Read: Revanth Reddy: బంజారాలకు తెలంగాణ సీఎం శుభవార్త.. నల్లమలలో సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రం
'మనల్ని ఓడగొట్టేందుకు రియల్ ఎస్టేట్ మాఫియా పనిచేసింది. కోట్లు కుమ్మరించినా ప్రజలు మనకే పట్టం కట్టారు. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నా' అని సీతక్క తెలిపారు. తనకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని.. అందరూ తనకు సమానమేనని ప్రకటించారు. అన్ని ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే విజయం మనదే అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Solar Eclipse 2026 Time In India: ఈ ఏడాదిలో సంభవించబోయే మొదటి సూర్యగ్రహణం రేపు (ఫిబ్రవరి 15, 2026) ఏర్పడనుంది. ఈ గ్రహణం విశేషాలు, సమయాలు, భారత్‌లో దీని ప్రభావంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు దీనిని ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యంగా అభివర్ణిస్తున్నారు. ఈ గ్రహణం సమయంలో సూర్యుడు ఒక మెరిసే ఉంగరంలా కనిపిస్తాడు.
సూర్యగ్రహణం అంటే ఏమిటి?
సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకాంతి భూమిపై పడకుండా చంద్రుని నీడ అడ్డుకుంటుంది. ఈ స్థితిని సూర్యగ్రహణం అంటారు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పకుండా, కేవలం మధ్య భాగాన్ని మాత్రమే కప్పి ఉంచడం వల్ల సూర్యుడు ఒక అగ్ని వలయంలా కనిపిస్తాడు. దీనినే వార్షిక సూర్యగ్రహణం అంటారు.
గ్రహణం సమయాలు
భారత కాలమానం ప్రకారం.. గ్రహణం ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 12:31 గంటలకు ప్రారంభంకానుంది. గ్రహణ కాలం సుమారు 2 నిమిషాల 20 సెకన్ల పాటు అగ్ని వలయంగా కనిపిస్తుంది. సాయంత్రం వేళకు గ్రహణం పూర్తిగా తొలగిపోతుంది.
భారతదేశంలో కనిపిస్తుందా?
అయితే ఈ అగ్ని వలయ సూర్యగ్రహణం భారత్‌లో నేరుగా కనిపించదు. అంటార్కిటికాలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దక్షిణ ఆఫ్రికా, చిలీ, అర్జెంటీనా వంటి దేశాల్లో దీనిని వీక్షించవచ్చు. భారతదేశంలోని కొన్ని అత్యంత దక్షిణ ప్రాంతాల్లో చాలా స్వల్పంగా పాక్షిక గ్రహణం కనిపించే అవకాశం ఉంది, కానీ అగ్ని వలయ దృశ్యం మాత్రం కనిపించదు.
సూతక కాలం, నియమాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యగ్రహణానికి 12 గంటల ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. సూతక కాలంలో, గ్రహణ సమయంలో శుభకార్యాలు నిషిద్ధం. పండితుల ప్రకారం.. ఈ సమయంలో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీయడం, ఆహారం తీసుకోవడం వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకూడదని మరియు పదునైన వస్తువులను వాడకూడదని పెద్దలు చెబుతుంటారు.
రాశులపై ప్రభావం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహణాలు వ్యక్తుల రాశిచక్రాలపై ప్రభావం చూపుతాయి. ఈ గ్రహణం ఫాల్గుణ అమావాస్య నాడు ఏర్పడుతుండటంతో కొన్ని రాశుల వారు ఆర్థిక, మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
భారత్‌లో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి సూతక కాల నియమాలను పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత, మతపరమైన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఖగోళ దృశ్యాన్ని ఇష్టపడే వారు ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ 'రింగ్ ఆఫ్ ఫైర్'ను వీక్షించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Married Woman sales her husband to his lover for 15 crores in Bhopal: ఇటీవల భార్యభర్తల బంధం మరీ ప్రశ్నార్థకంగామారింది. ఒకప్పుడు పెళ్లిళ్లు చేసుకుని ఒకరితో మరోకరు అన్యోన్యంగా ఉండేవారు. ఏదైన గొడవలు జరిగితే నాలుగు గోడల మధ్య సర్దుకుని పోయేవారు . కానీ ఇప్పుడు ప్రతిదానికి గొడవలు పడుతున్నారు. చిన్న చిన్న గొడవలకే డైవర్స్ వరకు వెళ్తున్నారు. కొంత మంది హత్యలు చేయడం లేదా సుపారీలు ఇచ్చి చంపించడం చేస్తున్నారు. మరికొంత మంది ఈ బాధలుభరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇంకొంత మంది అయితే పెళ్లి చేసుకుని వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తమ సంబంధంకు అడ్డువస్తే ఏ పనిచేయడానికి కైన వెనుకాడటంలేదు.
పెళ్లై, పిల్లలు ఉన్న, 20 ఏళ్ల పాటు కలిసున్న వారితో కూడా విడిపోతున్నారు.ఈ క్రమంలో భోపాల్ లో జరిగిన ఒక దంపతుల గొడవ వార్తలలో నిలిచింది. భోపాల్ లో ఒక మహిళ తన 23 ఏళ్ల రిలేషన్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. అంతేకాకుండా రూ. 1.5 కోట్లకు తన మొగుడ్ని అతని ప్రియురాలికి అప్పగించింది. గతంలో టాలీవుడ్ లో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన శుభలగ్నం మూవీలో ఆమని తన భర్త జగపతి బాబును అతని ప్రియురాలికి అమ్మేస్తుంది. అచ్చం ఈ మూవీ సీన్ భోపాల్ లో రిపీట్ అయ్యింది.
23 ఏళ్ల క్రితం భోపాల్ కు చెందిన భార్యాభర్తలకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయనకు 42 ఏళ్లు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, తన భర్త ఆయనతో పాటు పని చేస్తున్న 54 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఇకతనభార్యతో ఉండలేదని భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
వీరిని కోర్టు కౌన్సెలింగ్ నిర్వహించింది. కానీ డైవర్స్ కావాలని భర్త పట్టుపట్టాడు. దీంతో భార్య తనకు 1. 5 కోట్లిస్తే డైవర్స్ ఇస్తానని చెప్పింది. ఈ డిమాండ్ కు భర్త,అతని ప్రియురాలు అంగీకరించడంతో ఒప్పందం జరిగింది.తన భార్యకు ఒక డూప్లెక్స్ ఇల్లు ఇవ్వడంతో పాటు, రూ.27 లక్షల నగదు చెల్లించారు. దీంతో ఫ్యామిలీ కోర్టులో వీరి డైవర్స్ కు మార్గం సుగమమైంది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంకా ఎన్ని అరాచకాలు చూడాలని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Preethi Mukundan In Chiru Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ముఖ్యంగా డైరెక్టర్ బాబీతో చేయబోయే సినిమాలో చిరంజీవి కూతురి పాత్ర కోసం ఒక ఆసక్తికరమైన పేరు వినిపిస్తోంది.
'వాల్తేరు వీరయ్య' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కీలకమైన కూతురి పాత్ర కోసం చాలా రోజులుగా సెర్చ్ జరుగుతోంది.
రేసులో నిలిచిన భామలు
ఈ సినిమాలో చిరు కూతురిగా నటించే ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపించాయి. మొదట 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత 'ఛాంపియన్' ఫేమ్ అనస్వర రాజన్ దాదాపు ఖరారైందని అందరూ భావించారు.
ఫైనల్ రేసులో ప్రీతీ ముకుందన్!
తాజా సమాచారం ప్రకారం.. కృతి శెట్టి లేదా అనస్వర రాజన్ కాకుండా, ప్రీతీ ముకుందన్ ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా 'కన్నప్ప' సినిమాలో నటించిన ప్రీతీ ముకుందన్ తన అందం, నటనతో మెప్పించింది. మెగాస్టార్ సినిమాలో కూతురిగా నటించడం అంటే అది కెరీర్ కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మెగాస్టార్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' సోషియో ఫాంటసీ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఇది రాబోతోంది.'విశ్వంభర' తర్వాత బాబీ దర్శకత్వంలో చేసే సినిమా పట్టాలెక్కనుంది. ఇందులో చిరంజీవిని మళ్లీ వింటేజ్ మాస్ లుక్‌లో చూపించేందుకు బాబీ ప్లాన్ చేస్తున్నారు.
'మన శంకరవరప్రసాద్ గారు'తో కామెడీ, వింటేజ్ మ్యానరిజమ్స్‌తో అలరించిన చిరు, బాబీ సినిమాలో తండ్రి పాత్రలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. ప్రీతీ ముకుందన్ ఈ మెగా ఆఫర్‌తో స్టార్ హీరోయిన్ రేసులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook