Realme p4 power 5g స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపు ధరికే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా దీనిపై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ లభించడమే కాకుండా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఈ ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఇది చాలా చీప్ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో Real me P4 Power 5G స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన 6.8-అంగుళాల 1.5K AMOLED HyperGlow 4D కర్వ్డ్ డిస్ప్లేతో లభిస్తోంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 6500 nits గరిష్ట బ్రైట్‌నెస్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ భారత దేశంలో 10,001mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయింది.
అంతేకాకుండా ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన 80W సూపర్ ఊక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్లతో కూడా అందుబాటులో ఉంది. ఇక దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా (MediaTek Dimensity 7400 Ultra - 4nm) ప్రాసెసర్ తో విడుదల చేసింది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ వెనక భాగంలో ఎంతో ప్రత్యేకతతో కూడిన 50MP Sony IMX882 (OIS) ప్రధాన కెమెరా ను కలిగి ఉంటుంది. దీనికి తోడు అదనంగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా లభిస్తుంది. ఇక ఫ్రంట్ భాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది. దీంతోపాటు 5 Android 16 ఆధారిత Realme UI 7.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే IP66, IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ను కూడా కలిగి ఉంది.
Real me P4 Power 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ జనవరి 29వ తేదీన భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో 128 Gb ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ మొబైల్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. దీని అసలు ధర రూ.35,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసేవారికి.. రూ.25, 999కే పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తగ్గింపు ధరకే పొందాలనుకునేవారు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా రూ.3,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పేటీఎంతో పాటు కెనరా బ్యాంకు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసే వారికి రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
అలాగే ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేసి దీనిని కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు. దీనికోసం ఏదైనా ప్రీమియం బ్రాండ్‌కి సంబంధించిన మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌కు ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.23 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీనిని కొత్త మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే.. ఇది కేవలం రూ. 2,999కే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Jagtial Congress Telugu News: తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన తేదీలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. జగిత్యాల మున్సిపల్ ఎన్నికలవేళ అధికార కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు ఒక్కసారిగా పగమన్నాయి.. టికెట్ల కేటాయింపులో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పార్టీ అధిష్టానం ప్రాధాన్యతను ఇవ్వడంతో పాత కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాలలో మున్సిపల్ వార్డుల వారిగా అభ్యర్థుల ఎంపికలు ఇప్పటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రతిపాదించిన అభ్యర్థుల పేర్లకే అధిష్టానం టికెట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేకు అగ్ర పీఠం వెయ్యడం, గత కొన్ని ఏళ్ల నుంచి పార్టీ జెండా మోసిన తమను కాదని ఎలా టికెట్లు ఇస్తారని సీనియర్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తమను విస్మరించి టికెట్లు కేటాయించడం పెద్ద అన్యాయమని వారు అంటున్నారు.
అయితే టికెట్ల ప్రకటన నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలు అందరూ భారీ సంఖ్యలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముందు ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టారు. గత కొన్నేళ్ల నుంచి కష్టపడుతూ వస్తున్న వారిని కాకుండా.. కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం పెద్ద అన్యాయమని అంటూ కార్యకర్తలు మాజీ మంత్రి ఇంటి ముందు నినాదాలు చేశారు.
మరోవై మొత్తం 50 సీట్లలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 30, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు కేటాయించారనే సమాచారం నేపథ్యంలో జీవన్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ-ఫామ్ల పంపిణీలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కార్యకర్తలు సంజయ్ నివాసం వద్ద నిరసన చేపట్టారు.
పార్టీ మారిన వారికి టికెట్లు ఇవ్వడంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల నియోజకవర్గంలో గత కొన్ని ఏళ్ల నుంచి క్రియాశీలకంగా కాంగ్రెస్కు పని చేస్తున్న జీవన్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, తన దగ్గరగా ఉన్న అనుచరులకు టికెట్లు దక్కకపోవడంతో అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీ అంతర్గత రాజకీయ పోరు జగిత్యాల మున్సిపల్ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం జగిత్యాల కాంగ్రెస్ లో పాత వర్సెస్ కొత్త అన్నట్లు పరిస్థితులు మారాయి. అయితే ఈ పరిస్థితిని తొందర్లోనే చక్కదిద్దే ఎందుకు రాష్ట్రస్థాయి నేతలు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nara Lokesh Latest News Telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సహాయక సహకారాలు మరింత పొందేందుకు మంత్రి లోకేష్ ఈరోజు రాజధాని ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. నేడు అమరావతిలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం తర్వాత ఆయన తన పర్యటనను ప్రారంభించబోతున్నారు. మంత్రి లోకేష్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి.. సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.. రాత్రి ఆయన ఢిల్లీలోనే బస చేసి. బుధవారం ఉదయం నుంచి ఆయన కేంద్ర మంత్రులతో కలిసే అవకాశాలున్నాయి.
రేపు ఉదయం లోకేష్ పార్లమెంట్ భవనానికి వెళ్లి అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో వరస బేటీలు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐటీ రంగ విస్తరణతో పాటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుపై పలువురు మంత్రులతో చర్చించనున్నారు. అలాగే విద్యాసంష్కరణలతో పాటు నూతన విద్యాసంస్థల మంజూరుపై సంబంధిత మంత్రులతో మాట్లాడబోతున్నట్లు అధికారిక సమాచారం. ఇదే సమయంలో రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల మంజూరును కూడా కోరబోతున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన రాయితీలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన అనుమతుల కోసమే ఈ పర్యటన ప్రధాన అంశమని కొంతమంది రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వ బలోపేతానికి సంబంధించిన అంశాలపై కూడా మంత్రులతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చర్చలు ముగిసిన తర్వాత మంత్రి నారా లోకేష్ రేపు అర్ధరాత్రికి తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
రాష్ట్రానికి భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించడంలో ఈ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంతేకాకుండా మంత్రి లోకేష్ జరిపిన చర్చల గురించి గురువారం లేదా శుక్రవారం ప్రత్యేకమైన ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీలో చర్చించిన వివిధ అంశాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Aditya Mangal Yoga Effect On Zodiac 2026: ఫిబ్రవరి నెల గ్రహ సంచారాల పరంగా చాలా అద్భుతమైన భావించవచ్చు. ఎందుకంటే శతభిష నక్షత్రంలోకి కొన్ని ప్రత్యేకమైన గ్రహాల సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో గ్రహ సంయోగం జరగబోతోంది. దీంతో ఈనెల మరింత కీలకం కాబోతో ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఫిబ్రవరి 19వ తేదీన శతభిషా నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు.. ఆ తర్వాత మార్చి మూడున కుజుడు ప్రవేశిస్తాడు దీని కారణంగా ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది.
శతభిషా నక్షత్రంలో సూర్యుడితో పాటు కుజుడి కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన మంగళదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం మార్చి మూడవ తేదీ నుంచి ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో ఈ సమయం నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా.. ఎన్నో రకాల ఆర్థికమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేషరాశి
కుజుడు మేషరాశి వారికి అధిపతిగా వ్యవహరిస్తాడు.. కాబట్టి శతభిషా నక్షత్రంలో సూర్యుడితో పాటు కుజుడు కలయిక జరపడం వల్ల మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో కార్యాలయాల్లో క్రొత్త బాధ్యతలు లభిస్తాయి. అంతేకాకుండా ఈసారి అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేసే వ్యక్తులకు విశేషమైన లాభాలు కలుగుతాయి.
మిథున రాశి
మంగళదిత్య రాజయోగంతో మిథున రాశి వారికి ఊహించని మేలు జరగబోతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన అన్ని రకాల పనులు ఈ సమయంలో ఊపందుకుంటాయి. ముఖ్యంగా సంపాదన అధికంగా ఉంటుంది. అలాగే పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సంపాదించగలుగుతారు. విదేశీ పర్యటనలు చేయాలనుకుంటున వ్యక్తులకు ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.. సుదీర్ఘ ప్రయాణాలు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు.
సింహరాశి
మంగళదిత్య రాజయోగంతో సింహ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి ఈ సమయంలో అత్యంత సానుకూలమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో పెద్ద పెద్ద ఒప్పందాలు కూడా కుదురుచుకుంటారు. అంతేకాకుండా కార్యాలయాల్లో అనుకుంటున్న పనులు ఎంతో సులభంగా చేసి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా పరిపాలన సేవా రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన ఒప్పందాలు కలుగుతాయి.
తులారాశి
మంగళదిత్య యోగం ప్రభావంతో తులా రాశి వారికి కెరీర్ వరంగా పెద్దపెద్ద మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ప్రత్యర్ధుల నుంచి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఎంతో మేలు జరగబోతోంది. అలాగే సంబంధాలు ఇతరులతో మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mercury And Rahu Transit Effect On Zodiac Telugu: 2026 సంవత్సరం రెండవ నెల ఫిబ్రవరి ప్రారంభంకానే అయింది. జనవరి నెల కంటే ఈ నెలకు మరింత ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకోబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఎందుకంటే అనేక ప్రధాన గ్రహాలు ఈ నెలలోనే రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణంగా కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో అనేకమైన మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రధానమైన గ్రహాలు సంచారం చేయడంతో ఆయా రాశుల వారికి ఆర్థికంగా చాలా మేలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని వారు అంటున్నారు.
ఫిబ్రవరి మూడవ తేదీన 9 గంటలకు బుధుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళాడు. రాహువు ఇప్పటికే అక్కడ సంచారదశలో ఉన్నాడు.. దీని కారణంగా ఈ రెండు గ్రహాల సంయోగం జరుగుతుంది. బుధుడు రాహు గ్రహాలు దాదాపు ఒకే రాశిలో 25 రోజులపాటు కలిసి ఉంటాయి. ఈ రెండు గ్రహాల సంచార ప్రభావం దాదాపు 60 రోజులు పాటు ఉంటుంది.. అంటే ఏప్రిల్ 11 వరకు ఈ రెండు గ్రహాల ప్రభావం కొనసాగుతూ ఉంటుంది. అప్పటివరకు కొన్ని రాశుల వారికి చాలా మేలు జరగబోతోంది.. అయితే, ఈ సమయంలో అత్యంత లాభాలు పొందబోయే రాశులేవో తెలుసుకోండి.
కర్కాటక రాశి
ఎనిమిదవ స్థానంలో ఈ రెండు గ్రహాలు కర్కాటక రాశి వారికి ఉండబోతున్నాయి. దీని కారణంగా వీరికి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పరిశోధన తయారీ పరిశ్రమల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు ఇది మంచి సమయంగా భావించవచ్చు.. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా అత్తమామలతో వివాదాలు కూడా ఏర్పడవచ్చు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి రెండవ స్థానంలో ఈ రెండు గ్రహాలు సంచార దశలో ఉండబోతున్నాయి. కాబట్టి మీరు మాట్లాడే మాటలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి.. అలాగే ఏవైనా మాట్లాడేటప్పుడు కఠినంగా ఉండడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వీరి సంపాదన ఊహించని స్థాయిలో పెరుగుతుంది.. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
తులారాశి
తులా రాశి వారికి ఐదవ స్థానంలో బుధుడు రాహు గ్రహాలు సంచార దశలో ఉండబోతున్నాయి దీని కారణంగా వీరికి సృజనాత్మకత ఊహించని స్థాయిలో పెరుగుతుంది. స్టాక్ మార్కెట్, రచన, సినిమా పరిశ్రమల్లో ఉన్నవారికి పెద్దపెద్ద ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లల చదువుల నుంచి కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధాలు ఉన్నవారికి ఈ సమయంలో గందరగోళం ఏర్పడవచ్చు. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మేషరాశి
రాహువు బుధుడు సంచారంతో మేష రాశి వారికి అంతా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఆదాయం పెరిగి సంపాదనలో మార్పులు కూడా సంభవిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు. అలాగే ప్రేమ సంబంధాల్లో బాగోద్వేగా ఆకర్షణ పెరుగుతుంది. విద్యార్థులకు ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఈ సమయంలో విద్యార్థులు ఎలాంటి పనులు చేసిన మంచి ఫలితాలు పొందగలుగుతారు సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వ్యక్తులకు బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mercury Transit 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని మనందరికీ తెలుసు. ఇలాంటి ప్రధాన గ్రహం ఒకే నెలలో రెండు నుంచి మూడుసార్లు కదలికలు జరపడం విశేషం. అయితే, ఫిబ్రవరి నెలలో ఈ బుధుడు మూడుసార్లు సంచారం చేయబోతున్నాడు.. దీని కారణంగా కొన్ని రాశుల వారికి వ్యాపారం ఆర్థిక సంపదపరంగా విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి. ఈ గ్రహాన్ని కమ్యూనికేషన్ తెలివితేటలు అకౌంటింగ్ సూచికగా భావిస్తారు. అలాంటి ఈ గ్రహం మూడుసార్లు సంచారం చేయడం అరుదని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని రాశుల వారి జీవితాల్లో వేగంగా మార్పులు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీన కుంభ రాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన శతభిషా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు.. మరికొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 15న పూర్వ భాద్రపదద నక్షత్రంలోకి పరవేశిస్తాడు. ఇలా మూడుసార్లు సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై గణనీయమైన ప్రభావం పడుతుంది. బుధుడి నిరంతర మార్పుల కారణంగా కొన్ని రాశుల వారు ఈ సమయంలో వ్యాపారం, ఉద్యోగాలు, ఆదాయం, వ్యక్తిగత నైపుణ్యంలో పెద్ద సానుకూలమైన మార్పులు పొందగలుగుతారు.
ఈ రాశుల వారికి దిమ్మతిరిగే జాక్పాట్..
వృషభ రాశి
ముఖ్యంగా బుధ గ్రహం సంచారంతో వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందడమే కాకుండా. సరైన ప్రణాళికలతో ముందుకు సాగుతారు అకౌంటింగ్ రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో గ్రాఫ్ పెరుగుతుంది. అలాగే పనుల్లో అద్భుతమైన బాధ్యతలు లభించడమే కాకుండా నాయకత్వ లక్షణాలు పెరిగి.. మీ అధికారులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇక ఎప్పటినుంచో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు మంచి పదోన్నతులు కూడా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి బుధుడి సంచారంతో అదృష్టం ఒక్కసారిగా రాబోతోంది. సుదీర్ఘ కృషి ఫలాలు ఇప్పుడు వీరి చేతికి రాబోతున్నాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభించబోతోంది. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు రావడానికి కారణంగా ఆరోగ్యం కూడా మెరుగుపడబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక పాత పనుల్లో ఆగిపోయిన డబ్బులు కూడా వెంటనే తిరిగి పొందగలుగుతారు. దీంతోపాటు అన్ని రకాల సమస్యలకు ఈ సమయం విముక్తి కలిగిస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి కూడా ఫిబ్రవరి నెల ఎన్నో సమస్యల నుంచి గొప్ప ఉపశమనాన్ని కలిగించబోతోంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందిన వార్తలు కూడా పొందగలుగుతారు. అలాగే వృత్తిపరమైన అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఆర్థిక సంబంధాలు మరింత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు బాకీ ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక వైవాహిక జీవితంలో సంబంధాలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. అంతేకాకుండా ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తులు మంచి భాగస్వామితో స్నేహం కుదుర్చుకుంటారు..
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ghatkesar Mother And Two Children Suicide Mistery: జనవరి 31 తేదీ తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య ఘటన హైదరాబాద్ వ్యాప్తంగా కలకలం రేపింది. భర్త పుట్టిన రోజే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పిల్లలతో సహా తల్లి విజయ ఆత్మహత్య కేసు ఇప్పటికి మిస్టరీగానే మిగిలింది. దుబాయ్ నుంచి భర్త సురేందర్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. కానీ అసలు విషయం మాత్రం వెలుగులోకి రావడం లేదు. తన భార్య ఎంతో స్ట్రాంగ్ ఉమెన్.. అలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావడం లేదని ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక జనవరి 29వ తేదీ ఫోన్లో తన కూతురు ఐఐటీ సీట్ కొడతా అని చెప్పింది.. ఆ మాటలు తలుచుకుంటే నాకు బాధగా ఉందని ఆయన బోరున విలపిస్తున్నారు. నా పుట్టినరోజు ఇలా జరగడం తట్టుకోలేక పోతున్న.. ఇక ఎవరికోసం బతకాలి అంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి కూడా గురయ్యారు.
అయితే చక్కటి సంసారం.. ముత్యాలు లాంటి ఇద్దరు పిల్లలు.. భార్యాభర్తలు ఇద్దరికీ లక్షల్లో జీతం. ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా లేవు. ఏ అనారోగ్య సమస్యలు ఎదురుకాలేదు. అయినా కానీ ఆ తల్లి తీసుకున్న నిర్ణయంతో కుటుంబమే ముక్కలైంది. ఇద్దరు పిల్లలతో కలిసి విజయ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన హైదరాబాద్ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే పోలీసుల దర్యాప్తులోనూ ఇప్పటికీ కారణం అంత చిక్కడం లేదు. ఒంటరితనమే కారణమా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫోన్ డేటాతోనే అసలు నిజం తేలాల్సింది.
అసలు ఏం జరిగింది?
హైదరాబాద్ శివారులో జనవరి 31వ తేదీ శనివారం తెల్లవారుజామున విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. చర్లపల్లి నుంచి ఘట్ కేసర్ వెళ్లే రైల్వే స్టేషన్ వద్ద ఎంఎంటీఎస్ డౌన్ లోడింగ్ పై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల ప్రకారం మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన విజయ, చేతనా రెడ్డి, విశాల్ రెడ్డి గా గుర్తించారు. దీంతో రైల్వే పోలీసులకు సమాచారం అందించగా పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఏ కారణం లేకుండా ఇలా ఆత్మహత్యకు పాల్పడిన అవసరం ఏం వచ్చిందని కూడా దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 11:30 గంటలు సమయంలో విజయ పిల్లల హాస్టల్ వద్దకు వెళ్లి వారిని తీసుకువచ్చింది. కారులో వారు చర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అక్కడే పార్కింగ్ చేసి కారులో ఒక సూసైడ్ లెటర్ కూడా రాసి ఉంచింది. ఎక్కువ ఒత్తిడి గురవుతున్నా క్షమించండి అని బంధువులకు రాసింది. అయితే అంతకుముందు వారి ఆత్మహత్యకు ముందే విజయా తమ్ముడు కూడా ఫోన్లో మాట్లాడాడు. కానీ అతనికి ఎలాంటి అనుమానం కలగలేదు అన్నారు.
అయితే, విజయ రెడ్డి గత నెల 28వ తేదీన వారి పెళ్లి రోజు సందర్భంగా భర్తతో గంటల కొద్ది ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత 31వ తేదీ ఈ దారుణం జరిగింది. ఉప్పల్ నివాసం నుంచి ఘట్‌కేసర్, పటాన్‌చేరు కళాశాల హాస్టల్స్ నుంచి సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మార్గమధ్యంలో ఎక్కడైనా ఆగారా? అనే అంశాలపై వారు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ఏ కారణాలై ఉంటాయా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read: విదేశాల నుంచి బంగారం తెస్తున్నారా? కొత్త రూల్స్ తెలియకపోతే ఇబ్బందే! లిమిట్ ఎంతంటే?
Also Read: భారత్‌కు ట్రంప్ భారీ గిఫ్ట్.. గొప్ప స్నేహితుడంటూ టారిఫ్ కట్, ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Arava Sridhar Affairs Issue: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలల వ్యవహారం తీవ్ర సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర వివాదం రాజుకోగా.. జనసేన పార్టీపై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. గతంలో మీడియా ముందు ఈ వ్యవహారం రాగా.. సమాధానం చెప్పలేక పారిపోయిన పవన్ కల్యాణ్ తాజాగా పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఈ పరిణామం జనసేన పార్టీలో కలకలం రేపింది.
Also Read: Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో 10 భారీ ప్రకటనలు.. ప్రజల డబ్బులు భారీ సేఫ్
జనసేన పార్టీ నాయకులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ మాట్లాడుతూ రాష్ట్ర పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా తిరమల కల్తీ లడ్డూ వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదని జనసేన పార్టీ నాయకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే పార్టీ నుంచి స్పందన లేదని మండిపడ్డారు. 'అందరి చిట్టా నా దగ్గర ఉంది. ఏం చేస్తారు.. రిపోర్ట్ ఇవ్వాలి' అని నాదెండ్ల మనోహర్‌కి చెప్పి పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులకు ఫుల్ క్లాస్ పీకారు.
Also Read: Revanth Reddy: తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎలా అవుతాడు?: రేవంత్ రెడ్డి
'లడ్డూ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదు? అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నది ఎందుకు?' అని సమావేశంలో నాయకులపై పవన్ కల్యాణ్ చిందులు తొక్కారు. వైఎస్సార్‌సీపీ నాయకుల ట్రాప్‌లో చిక్కుకోవద్దని సూచించారు. 'మీపై, మీ కుటుంబసభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. జాగ్రత్త!' అని హెచ్చరించారు. జనసేన నాయకులు మాత్రం సిద్ధాంతపరంగా.. సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలని చెప్పారు. మహిళల విషయంలో పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉండాలని.. అరవ శ్రీధర్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సూచించారు. మహిళలకు మీ చేయి తగిలినా రేప్ చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రచారం చేస్తారని పవన్ కల్యాణ్ తెలిపారు. 'వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతోంది' అని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో 10 భారీ ప్రకటనలు.. ప్రజల డబ్బులు భారీ సేఫ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tablet Sheet Wedding Card: సాధారణంగా పెళ్లి పత్రికలు అంటే దేవుళ్ల బొమ్మలు, రంగురంగుల డిజైన్లు, పట్టు వస్త్రాల అలంకరణలతోపాటు వధూవరుల ఫొటోలతో కనిపిస్తుంటాయి. శుభలేఖ విషయంలో వినూత్నంగా ఆలోచనలు చేస్తున్న యువత ఈ క్రమంలో సరికొత్తగా.. ఆసక్తికరంగా ఓ జంట రూపొందించింది. తమ వృత్తికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించేలా పెళ్లి పత్రిను రూపొందించారు. తమ వైద్య వృత్తిలో కనిపించే ట్యాబ్లెట్ల షీట్ రూపంలో తమ పెళ్లి పత్రికను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆ పత్రికకు సంబంధించిన వీడియో వైరల్‌గా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో 10 భారీ ప్రకటనలు.. ప్రజల డబ్బులు భారీ సేఫ్
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన యువకుడు కిన్నెర నవీన్ ఎంబీఏ పూర్తి చేసి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. అతడికి వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన శిరీషతో వివాహం నిశ్చయమైంది. ఆమె ఎం ఫార్మసీ పూర్తి చేసి విజయవాడలోని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్‌లో ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. వధూవరులిద్దరూ మెడికల్ రంగానికి చెందిన వారు కావడంతో తమ వివాహ ఆహ్వానాన్ని కూడా అదే శైలిలో ఉండాలని భావించారు.
Also Read: Ministers Salaries: కేంద్ర మంత్రుల జీతాలు డబుల్.. బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు
వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 4వ తేదీన కందుకూరు గ్రామంలో జరగనుంది. ఈ సందర్భంగా తమ పెళ్లికి సంబంధించిన శుభలేఖను ప్రత్యేకంగా ఉండేలా రూపొందించారు. తమ వృత్తిపై ఉన్న మమకారాన్ని చాటుకోవడమే కాకుండా ప్రత్యేకంగా ఉండేలా ఏదైనా చేయాలని నవీన్ ఆలోచించారు. తన పెళ్లి పత్రికను ఒక టాబ్లెట్ స్ట్రిప్పు (ట్యాబ్లెట్ షీట్) ఆకారంలో డిజైన్ చేయించాడు. పత్రిక ముందటి భాగంలో సాధారణంగా టాబ్లెట్ షీట్‌పై ఉండే వివరాల తరహాలోనే పెళ్లి తేదీ, సమయం, వేదిక, వధూవరుల డిగ్రీల ముద్రించారు.
Also Read: AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. సీపీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే వార్త
పెళ్లి పత్రిక వెనుక భాగంలో టాబ్లెట్లు ఉండే ఖాళీలను చూపిస్తూ ఇది ఒక మెడికల్ స్ట్రిప్పు అనే అనుభూతిని కలిగించేలా నవీన్ తమ పెళ్లి పత్రికను రూపొందించారు. ఈ కార్డులో వాడిన పదాలు కూడా మెడికల్ టెర్మినల్‌లో ఉన్నాయి. ప్రియమైన స్నేహితులు మా వివాహాన్ని అస్సలు మిస్స్ కాకండి అంటూ సరదాగా హెచ్చరిస్తూ పత్రికలో రాయించి తమ వివాహానికి ఆహ్వానం పలికారు. ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న ఈ వివాహానికి సంబంధించిన ఈ వెరైటీ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని, ప్రత్యేకతను చాటుకున్న ఈ జంటను స్థానికులు, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభినందిస్తున్నారు. తన పెళ్లి పత్రికను అత్యంత వినూత్నంగా, తాను చేస్తున్న వృత్తికి అద్దం పట్టేలా రూపొందించి ఆ జంట అందరినీ ఆశ్చర్యపరిచారు. అది పెళ్లి పత్రికా లేక టాబ్లెట్ షీటా అని భ్రమపడేలా ఉన్న ఆ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్.. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PF New Rules For Employee: 2026 కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక మార్పులను ప్రతిపాదించారు. ముఖ్యంగా పీఎఫ్ అర్హతకు ఉండాల్సిన కనీస వేతన పరిమితిని పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నిర్ణయం మీ నెలవారీ ఖర్చులు, చేతికి వచ్చే జీతం, దీర్ఘకాలిక పొదుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. నెలకు రూ. 15,000 కనీస ప్రాథమిక వేతనం ఉన్న వారు తప్పనిసరిగా పీఎఫ్ ఖాతా కలిగి ఉండాలి. గత 11 ఏళ్లుగా ఈ పరిమితిలో మార్పు లేదు. అయితే సుప్రీంకోర్టు సూచనల మేరకు, దీనిని రూ.25,000 కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
పీఎఫ్ లెక్కింపు ఎలా మారుతుంది?
సాధారణంగా మీ ప్రాథమిక వేతనంలో 12% పీఎఫ్ ఖాతాకు మళ్లిస్తారు. యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. అయితే ప్రస్తుతం మీ జీతం రూ.30,000 అయినా, పీఎఫ్ కటింగ్ కేవలం రూ.15,000 ప్రాథమిక వేతన పరిమితిపైనే (అంటే రూ.1,800) జరుగుతుంది. భవిష్యత్తులో వేతన పరిమితిని రూ.25,000 కు పెంచితే, రూ. 3,000 (25,000లో 12%) నేరుగా పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది.
మీ టేక్-హోమ్ జీతంపై ప్రభావం
వేతన పరిమితి పెరిగితే, ప్రతి నెలా మీ జీతం నుండి కట్ అయ్యే మొత్తం పెరుగుతుంది. దీనివల్ల మీ చేతికి వచ్చే నగదు తగ్గుతుంది. ఇది మీ నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపవచ్చు. మీ పీఎఫ్ ఖాతాలో నిల్వ పెరగడం వల్ల పదవీ విరమణ సమయంలో భారీ మొత్తం అందుతుంది. అలాగే, పెన్షన్ మరియు బీమా ప్రయోజనాలు కూడా మెరుగుపడతాయి.
బడ్జెట్‌లో పీఎఫ్ ట్రస్టులకు సంబంధించి పాత, కఠినమైన నిబంధనలను ప్రభుత్వం తొలగించింది. సెక్షన్ 17 మార్పుల్లో భాగంగా యజమాని జమ చేసే చందాలపై పన్ను మినహాయింపులను సులభతరం చేశారు. కంపెనీలు తమ విరాళాలను అందించే ప్రక్రియను సరళీకరించడం ద్వారా వ్యవస్థీకృత రంగంలో మరిన్ని ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
పీఎఫ్ విత్‌డ్రా రూల్స్..
డబ్బును విత్‌డ్రా చేసుకునే విషయంలో పాత నిబంధనలే కొనసాగుతున్నప్పటికీ, కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. 5 ఏళ్ల సర్వీసు తర్వాత తీసుకునే పీఎఫ్ సొమ్ముపై పన్ను ఉండదు. ఇల్లు కొనడం, పిల్లల చదువు, పెళ్లి లేదా అనారోగ్యం వంటి సందర్భాల్లో పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. పదవీ విరమణకు ముందే పీఎఫ్ మొత్తాన్ని మరింత సులభంగా ఉపసంహరించుకునే కొత్త వ్యవస్థపై ఈపీఎఫ్‌వో (EPFO) పని చేస్తోంది.
వేతన పరిమితి పెంపు వల్ల తక్షణమే చేతిలో డబ్బు తగ్గినట్లు అనిపించినా, సామాజిక భద్రత, భవిష్యత్తు పొదుపు రీత్యా ఇది ఉద్యోగులకు లాభదాయకం. అయితే, ఇది కంపెనీలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉండటంతో కొత్త నియామకాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.
Also REad: Allu Arjun Tweet: మెగా కాంపౌండ్‌కు ఐకాన్ స్టార్..చరణ్-ఉపాసనలకు బన్నీ విషెస్..సెలబ్రేషన్స్ షురూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Union Budget 2026 Highlights: కేంద్ర బడ్జెట్ 2026 27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టగా.. ఈ బడ్జెట్‌పై అందరూ లెక్కలు వేసుకుంటున్నారు. ఎంత లెక్కలు వేస్తున్నా తమకు ఎలాంటి ప్రయోజనం లభించలేదని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. ఈ బడ్జెట్ విధాన ప్రకటనలకే పరిమితమైందని చర్చ జరుగుతుండగా.. కానీ కొన్ని ప్రకటనలతో ప్రజలపై నేరుగా ప్రభావం చూపిస్తోంది. ఈ పది కీలక నిర్ణయాలు ప్రజల డబ్బులను కొంత కాపాడుతోంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Ministers Salaries: కేంద్ర మంత్రుల జీతాలు డబుల్.. బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు
కేంద్ర బడ్జెట్‌లో సామాన్యుల జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. రైతుల ఆదాయం పెంచడం, కొత్త ఉద్యోగాల కల్పన, నైపుణ్య అవకాశాలు, సరసమైన మెరుగైన చికిత్స, సులభమైన రుణాలు, చిన్న వ్యాపారాలకు ఉపశమనం, మహిళల ఆదాయానికి కొత్త మార్గాలు, వేగవంతమైన ప్రయాణం వంటి అంశాలపై కేంద్ర బడ్జెట్ కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. ఖర్చులు తగ్గించడం, ఆదాయాన్ని పెంచడంపై ఈ బడ్జెట్ దృష్టి పెడుతుంది.
Also Read: AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. సీపీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే వార్త
ఆదాయం పెంచడం
బడ్జెట్ 2026లో గ్రామీణ శాఖకు ప్రాధాన్యం ఇచ్చింది. 500 జలాశయాలు, అమృత సరోవర్ సమగ్ర అభివృద్ధికి ప్రోత్సాహం కల్పిస్తోంది. దీంతోపాటు మత్స్య సంపదను ప్రోత్సహిస్తుంది. పశుపోషణలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడంతో గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఉద్యోగాలు లభిస్తాయి. కొబ్బరి, జీడిపప్పు, కోకో వంటి తోటల పంటలకు ప్రత్యేక పథకాలు సుమారు 30 మిలియన్ల మందికి ప్రయోజనం లభించనుంది. గంధపు పరిశ్రమను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుంది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్.. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంపు
డిజిటల్ వ్యవసాయం
వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించేలా బడ్జెట్‌లో ఒక నిర్ణయం ఉంది. రైతుల కోసం ఏఐ ప్లాట్‌ఫామ్ భారత్-విస్తార్ ప్రారంభించనుంది. ఈ ప్లాట్‌ఫామ్ వ్యవసాయ నష్టాలను తగ్గించడానికి, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఉత్పాదకతను పెంచడంతోపాటు ఖర్చులను తగ్గించనుంది. ఈ డిజిటల్ సలహా వ్యవస్థ చిన్న రైతులకు గేమ్-ఛేంజర్‌గా పనిచేయనుంది.
మహిళల కోసం షీ-మార్ట్‌లు
గ్రామీణ మహిళల కోసం కేంద్ర బడ్జెట్‌లో ఓ కానుక ఉంది. మహిళల కోసం షీ-మార్ట్‌లను తీసుకురానుంది. మహిళలు నడిపించే సంస్థలకు మార్కెట్‌ను అనుసంధానిస్తారు. లఖ్‌పతి దీదీ పథకం విజయంపై ఆధారపడి మహిళలు వ్యాపారస్తులుగా చేయడానికి షీ మార్ట్ దోహదం చేయనుంది.
Also Read: YS Jagan: ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వైఖరి అత్యంత ప్రమాదకరం: వైఎస్ జగన్
కొత్త సంస్థలు
విద్యా వ్యవస్థపై బడ్జెట్‌లో కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. పారిశ్రామిక కారిడార్లకు సమీపంలో ఐదు విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌లు నిర్మించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. ప్రతి జిల్లాలో స్టెమ్ ఇన్‌స్టిట్యూట్‌ల కోసం బాలికల హాస్టళ్లు, ఖగోళ శాస్త్రానికి కొత్త టెలిస్కోప్ సౌకర్యాలు కూడా చేర్చారు.
ఎంఎస్‌ఎంఈలకు భారీ మద్దతు
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను బలోపేతం చేయడానికి కేంద్ర బడ్జెట్ భారీ ప్రకటన చేసింది. రూ.10,000 కోట్ల ఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్ ప్రారంభిస్తారు. ట్రెడ్స్ ద్వారా రూ.7 లక్షల కోట్ల విలువైన లిక్విడిటీ అందుబాటులోకి వస్తుంది. టైర్-2, టైర్-3 నగరాల్లో కార్పొరేట్ ఫ్రెండ్స్‌కు సహకారం అందించనుంది.
ఆరోగ్య సంరక్షణ
రానున్న ఐదు సంవత్సరాలలో 100,000 అనుబంధ ఆరోగ్య నిపుణులు, 150,000 మంది సంరక్షకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించారు. మూడు కొత్త ఆయుర్వేద ఎయిమ్స్, జిల్లా ఆసుపత్రులు సామర్థ్యాన్ని 50 శాతం విస్తరించాలని ప్రతిపాదించారు. దీంతో ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గనున్నాయి.
బ్యాంకింగ్, ఆర్థిక సంస్కరణలు
బ్యాంకింగ్ రంగాన్ని సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించింది. మున్సిపల్ బాండ్లను జారీ చేసే నగరాలకు రూ.100 కోట్ల ప్రోత్సాహకం లభిస్తుంది. పెట్టుబడి పరిమితులు కూడా పెంచనున్నారు.
ఐటీ రంగానికి ఊరట
ఐటీ సేవలను సేఫ్ హార్బర్ మార్జిన్‌ను 15.5 శాతంగా నిర్ణయించారు. రూ.300 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పరిమితిని పెంచడంతో మధ్య తరహా ఐటీ కంపెనీలకు ఉపశమనం లభించనుంది.
హై-స్పీడ్ రైలు కారిడార్
దేశంలో ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులు ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. హైదరాబాద్‌తోపాటు పట్టణ అభివృద్ధి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను పెంచుతాయి.
వైకల్యం, క్రీడలు
వైద్య, వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. దివ్యాంగుల కోసం నైపుణ్యం, మద్దతు పథకాలు, క్రీడల కోసం ఖేలో ఇండియా మిషన్ ప్రారంభించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Salaries And Allowances: జాతీయ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా లెక్కలు బేరీజు వేసుకుంటున్నారు. ఎవరికి ఎంత వచ్చాయి? ఏయే శాఖలు కేటాయింపులు ఎంత జరిగాయని తీరిగ్గా లెక్కించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొందరికి మాత్రం భారీగా కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపులతో కొందరి జీతాలు భారీగా పెరగనున్నాయి. ఎవరి జీతాలు పెరుగుతున్నాయో.. దీనికి సంబంధించిన వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Also Read: AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. సీపీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే వార్త
పార్లమెంట్‌లో నిన్న నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను చదివి వినిపించిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ప్రత్యక్షంగా ఎలాంటి ప్రయోజనం చేకూరేటట్టు లేదు. కానీ పరోక్షంగా.. దేశ అభివృద్ధికి మార్గనిర్దేశకత్వంగా ఈ బడ్జెట్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో కొన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం చేయగా.. మరికొన్ని వర్గాలకు భారీ ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు ఉన్నాయి. వాటిలో కేంద్ర మంత్రులు, అతిథుల ఖర్చులకు సంబంధించి నిర్మల సీతారామన్ తన పద్దులో కేటాయింపులు చేశారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్.. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంపు
కేంద్ర మంత్రిమండలి, కేబినెట్ సచివాలయంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం, విదేశీ అతిథుల మర్యాదలకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో రూ.1,102 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులు రూ.978.20 కోట్లు ఉన్నాయి. గతేడాది కన్నా ఈ ఏడాది అధిక కేటాయింపులు చేశారు. మంత్రిమండలికి సంబంధించి ఖర్చులకు రూ.620 కోట్లు కేటాయించగా.. 2025-26లో రూ.483.54 కోట్లుగా కేటాయింపులు ఉన్నాయి. ఈ కేటాయింపుల్లో కేంద్ర మంత్రుల జీతభత్యాలకు చెల్లించడంతోపాటు మాజీ ప్రధానమంత్రుల జీతభత్యాలు, ప్రయాణాలకు సంబంధించి ఈ బడ్జెట్‌ను ఖర్చు చేయనున్నారు. ఈ కేటాయింపుల్లోనే వీవీఐపీల ప్రత్యేక విమాన ఖర్చులు కూడా ఉన్నాయి. కేటాయింపులు పెంచడంతో మంత్రుల జీతాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
Also Read: YS Jagan: ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వైఖరి అత్యంత ప్రమాదకరం: వైఎస్ జగన్
కేంద్ర మంత్రుల జీతాలకు సంబంధించి భారీగా కేటాయింపులు చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ఉపశమనం లేదని.. కానీ బడ్జెట్‌లో మాత్రం కేంద్ర మంత్రులు తమకు భారీగా కేటాయింపులు చేసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వకుండా వారికి వేతనాల కోసం కేటాయింపులు పెంచడం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Allu Arjun Congratulates Ram Charan Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. క్లిన్ కారా రాకతో ఇప్పటికే సందడిగా ఉన్న మెగా ఇంట, ఇప్పుడు మరో ఇద్దరు బుజ్జీ అతిథులు అడుగుపెట్టారు. ఈ క్రేజీ అప్‌డేట్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఉపాసన కవలలకు (ఒక బాబు, ఒక పాప) జన్మనిచ్చారు. ఈ వార్తతో కొణిదెల, కామినేని కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది.
అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్
మెగా వారసులు అడుగుపెట్టిన శుభ సందర్భాన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
"మరోసారి తల్లిదండ్రులైన నా ప్రియమిత్రుడు రామ్ చరణ్, ఉపాసనలకు హృదయపూర్వక అభినందనలు. ఈ వార్త విన్నప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. చిరంజీవి గారి ముఖంలోనూ, చిన్నారి క్లిన్ కారా కళ్లలోనూ కనిపిస్తున్న ఆ గర్వం, సంతోషం చూడముచ్చటగా ఉన్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఇలా నవ్వుతూ ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది" అని బన్నీ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో 'మెగా' ట్రెండింగ్
ఈ వార్త బయటకు వచ్చిన నిమిషాల్లోనే నెట్టింట #MegaCelebrations అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అల్లు అర్జున్ చేసిన పోస్ట్ చూసి ఇటు మెగా ఫ్యాన్స్, అటు అల్లు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చరణ్-బన్నీ మధ్య ఉన్న బలమైన అనుబంధం ఈ విషెస్‌తో మరోసారి స్పష్టమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
క్లిన్ కారాతో పాటు ఇప్పుడు మరో ఇద్దరు తోడవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి ఇల్లు సందడిగా మారిపోయింది. చిరు ఇప్పుడు 'ట్రిపుల్ గ్రాండ్‌పా' అంటూ అభిమానులు జోకులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ముగించుకుని ఈ సంతోషకరమైన సమయంలో తన కుటుంబంతో గడుపుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు చిన్నారి వారసుల పేర్లు, ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Also Read: EPF Changes In Budget: పీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు..కంపెనీలకు, ఉద్యోగులకు భారీ ఊరట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bharat Gas Lite Cylinder Price: గ్యాస్ సిలిండర్ల వాడకంలో సరికొత్త విప్లవం మొదలైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) అత్యంత తేలికైన, సురక్షితమైన ప్లాస్టిక్ సిలిండర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పాత ఇనుప సిలిండర్ల బరువుతో ఇబ్బంది పడే గృహిణులకు ఇది గొప్ప ఊరట. మీరు కేవలం రూ.300 కే ఈ సరికొత్త 'భారత్ గ్యాస్ లైట్' సిలిండర్లను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటివరకు ఎరుపు రంగు ఇనుప సిలిండర్లనే చూసిన మనకు, ఇకపై ఆకర్షణీయమైన రంగుల్లో ప్లాస్టిక్ సిలిండర్లు కనిపించనున్నాయి.
కంపోజిట్ ప్లాస్టిక్ సిలిండర్ ప్రత్యేకతలు
ఈ సిలిండర్లు హై డెన్సిటీ పాలిథిలిన్ (HDPE) అనే అత్యాధునిక మెటీరియల్‌తో తయారయ్యాయి. ఇనుప సిలిండర్ గ్యాస్ నింపితే దాదాపు 30 కిలోల బరువు ఉంటుంది. కానీ, ఈ కొత్త సిలిండర్ గ్యాస్‌తో కలిపి కేవలం 15.9 కిలోలు మాత్రమే ఉంటుంది. అంటే బరువు సగానికి సగం తగ్గుతుంది.
ఇందులో గ్యాస్ ఎంత మిగిలి ఉందో చూసుకోవడానికి ఒక ట్రాన్స్‌లూసెంట్ (కిటికీ వంటి) భాగం ఉంటుంది. దీనివల్ల గ్యాస్ అయిపోయే సమయాన్ని ముందే తెలుసుకోవచ్చు. ఇవి ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారవ్వడం వల్ల తుప్పు పట్టవు, నేలపై మరకలు పడవు.
అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్లు
ఈ మోడరన్ సిలిండర్లు అధిక పీడనాన్ని తట్టుకుంటాయి. పాత సిలిండర్లు 80 కిలోల ప్రెజర్ తట్టుకుంటే, ఈ కొత్తవి 120 కిలోల ప్రెజర్ వరకు తట్టుకోగలవు.
అలాగే దీనికి లీకేజీ భయం లేదు. పొరపాటున అగ్ని ప్రమాదం జరిగినా, ఇవి పేలిపోకుండా గ్యాస్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం చాలా తక్కువ.
రూ.300కే పొందే విధానం
ఈ కొత్త సిలిండర్ అసలు సెక్యూరిటీ డిపాజిట్ ధర సుమారు రూ.3,350 ఉంటుంది. అయితే వినియోగదారులకు BPCL ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది.
మీ దగ్గర ఉన్న పాత ఇనుప సిలిండర్‌ను వెనక్కి ఇచ్చేసి, దానికి బదులుగా ఈ కొత్త ప్లాస్టిక్ సిలిండర్‌ను తీసుకోవాలనుకుంటే, కేవలం రూ.300 అదనంగా చెల్లిస్తే సరిపోతుంది.
ప్రస్తుతం బీపీసీఎల్ ఈ సేవలను గోవాలో ప్రారంభించింది. త్వరలోనే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలతో పాటు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది.
Also Read: EPF Changes In Budget: పీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు..కంపెనీలకు, ఉద్యోగులకు భారీ ఊరట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook