Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
Khamenei Net Worth: ట్రంప్, నెతన్యాహు కంటే ఖమేనీ ధనవంతుడా? ఎంత ఆస్తి వదిలి పోయాడో తెలుసా?
HDHarish Darla
Mar 01, 2026 06:14:28
Hyderabad, Telangana

Ayatollah Ali Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం మధ్యప్రాచ్య రాజకీయాల్లోనే కాకుండా, అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. సాధారణ ఆధ్యాత్మికవేత్తగా కనిపించే ఖమేనీ వెనుక ఉన్న అపారమైన ఆర్థిక సామ్రాజ్యం గురించి ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇరాన్‌ను మూడు దశాబ్దాలకు పైగా నిరంకుశంగా పాలించిన ఖమేనీ మరణవార్తను అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీడియా ధృవీకరించాయి. ఈ క్రమంలో ఆయన నియంత్రణలో ఉన్న భారీ సంపదపై ప్రపంచ దేశాల దృష్టి పడింది.

ఖమేనీ నికర విలువ
ఖమేనీ వ్యక్తిగతంగా నిరాడంబర జీవితం గడుపుతున్నట్లు ప్రచారం ఉన్నప్పటికీ, ఆయన గుప్పిట్లో ఉన్న సంస్థల విలువ కళ్లు చెదిరేలా ఉంది. 'ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇమామ్ ఖొమేనీస్ ఆర్డర్' అనే శక్తివంతమైన ఆర్థిక సంస్థ ద్వారా ఆయన ఇరాన్ ఆర్థిక వ్యవస్థను శాసించారు. జప్తు చేసిన ఆస్తులు, భారీ రియల్ ఎస్టేట్, ప్రభుత్వ రంగ సంస్థలపై ఈ సంస్థకు గుత్తాధిపత్యం ఉంది.

వివిధ అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఖమేనీ నియంత్రణలో ఉన్న సంపద విలువ సుమారు 95 బిలియన్ డాలర్ల నుండి 200 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.16 లక్షల కోట్లు) వరకు ఉంటుందని అంచనా. 1989 నుంచి సుప్రీం లీడర్‌గా ఉన్న ఆయన అణు కార్యక్రమాలకు, ప్రాంతీయ యుద్ధాలకు అవసరమైన నిధులను తన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల నుండే మళ్లించేవారని సమాచారం.

ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజకీయ నేతలతో పోల్చి చూస్తే ఖమేనీ సంపద ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఆస్తుల విలువ సుమారు 95 - 200 బిలియన్ డాలర్ల (రూ.18.22 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తి మాత్రం రూ.66 వేల కోట్లు ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంపద సుమారు రూ.118 కోట్ల విలువ ఉంటుందని సమాచారం.

ఈ గణాంకాలను గమనిస్తే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆస్తులను కలిపినా ఖమేనీ సంపదలో కనీసం 10 శాతం కూడా ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు.

యుద్ధం, అంక్షలు, అంతర్గత కల్లోలాల మధ్య కూడా దేశ ఆర్థిక వనరులను తన కనుసన్నల్లో ఉంచుకున్న ఖమేనీ మరణం, ఇరాన్ భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టింది. ఆయన తర్వాత ఈ భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తారు? అది ప్రజల సంక్షేమానికి అందుతుందా లేదా మరో యుద్ధానికి ఇంధనంగా మారుతుందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

గమనిక: ఖమేనీ సంపద వివరాలు అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు, మీడియా నివేదికల అంచనాలపై ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ అధికారికంగా వీటిని ఎప్పుడూ ధృవీకరించలేదు.

Also Read: Iran Israel Defense Comparison: రణరంగంగా మారిన పశ్చిమాసియా..అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ సైనిక బలాబలాలు ఎంతంటే?

Also Read: PAK Vs SL Match Fixing: పాకిస్థాన్‌తో శ్రీలంక మ్యాచ్‌ ఫిక్సింగ్? టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు..సోషల్ మీడియాలో ట్రెండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Mar 01, 2026 05:44:22
Hyderabad, Telangana:

Pakistan Vs Sri Lanka Match Fixing: 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన సూపర్ స్టేజ్ మ్యాచ్ ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని దృశ్యాలు, మ్యాచ్‌లో జరిగిన నాటకీయ పరిణామాలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా 'మ్యాచ్ ఫిక్సింగ్' అని నెటిజన్లు మండిపడుతున్నారు. 

పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కనీసం 65 పరుగుల భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీలంక ఆటగాళ్లు ప్రదర్శించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.

వివాదానికి కారణమైన ప్రధాన అంశాలు..
11వ ఓవర్‌లో మహేష్ తీక్షణ వేసిన బంతి పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ బ్యాట్‌కు తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. స్నికోమీటర్‌లో స్పష్టమైన 'స్పైక్' కనిపించినప్పటికీ, శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక రివ్యూ తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

పాక్ ఓపెనర్లు ఫఖర్ జమాన్, సాహిబ్జాదా ఫర్హాన్ ఇచ్చిన అత్యంత సులభమైన క్యాచ్‌లను దునిత్ వెల్లలాగే, చరిత్ అసలంక వంటి మేటి ఫీల్డర్లు వదిలేశారు. ఇది కావాలని చేసిన తప్పిదంలా ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు. శ్రీలంక బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాక్ ఓపెనర్లు మొదటి వికెట్‌కు 170 పరుగులు జోడించారు. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పాకిస్థాన్ తరపున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం.

ఒక దశలో పాకిస్థాన్ 250 పైచిలుకు పరుగులు చేస్తుందని భావించినప్పటికీ, చివరి 5 ఓవర్లలో శ్రీలంక బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. కేవలం 34 పరుగులకే 8 వికెట్లు పడగొట్టడంతో పాక్ 20 ఓవర్లలో 212/8 పరుగులకే పరిమితమైంది. సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీ బాదడమే కాకుండా, ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

నెటిజన్ల డిమాండ్..
శ్రీలంక ఆటగాళ్లు పాకిస్థాన్‌ను గెలిపించేందుకే ఆడుతున్నట్లుగా ఉందని, ఐసీసీ (ICC) వెంటనే దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం, హోస్టింగ్ హక్కుల కోసమే శ్రీలంక ఇలా చేసిందని కొందరు ఆరోపిస్తుండగా, మరికొందరు దీనిని క్రికెట్ చరిత్రలో ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచినప్పటికీ, సెమీఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది. అయితే, శ్రీలంక ఆటగాళ్ల వైఖరి మాత్రం ఈ టోర్నీలో పెద్ద మచ్చగా మిగిలిపోయింది. ఈ ఆరోపణలపై శ్రీలంక క్రికెట్ బోర్డు లేదా ఐసీసీ ఇంకా స్పందించాల్సి ఉంది.

Also Read: Iran Israel Defense Comparison: రణరంగంగా మారిన పశ్చిమాసియా..అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ సైనిక బలాబలాలు ఎంతంటే?

Also Read: Baba Vanga World War 3: బాబా వంగా చెప్పినట్టే జరుగుతోందా? 2026 'మూడో ప్రపంచ యుద్ధం' మొదలైనట్టేనా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
BBhoomi
Mar 01, 2026 05:10:15
Lakshmapur, Telangana:

US Iran Tensions Indias Economy Trouble: ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు పశ్చిమాసియాలో భద్రతా ఆందోళనలను తీవ్రతరం చేశాయి. ఈ పరిణామాలు ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇంధన దిగుమతులపై భారీగా ఆధారపడే భారత్‌కు ఇది ఆర్థికంగా కీలకమైన దశగా మారింది.

హార్ముజ్ జలసంధి.. ప్రపంచ చమురు గుండెపోటు:
ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా కలిగిన Strait of Hormuz జలసంధి ప్రస్తుత ఉద్రిక్తతల కేంద్రబిందువుగా మారింది. ఇరాన్‌ను ఒమన్, యూఏఈల నుంచి వేరు చేసే ఈ మార్గం ద్వారా భారత్ తన ముడి చమురు దిగుమతుల్లో సగానికి పైగా తెచ్చుకుంటోంది. ప్రస్తుతం రోజుకు సుమారు 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి ఈ మార్గంలోనే దిగుమతి చేస్తోంది. అంతేకాదు, రోజుకు దాదాపు 74 వేల బ్యారెళ్ల శుద్ధి చేసిన ఉత్పత్తులను కూడా ఇదే మార్గం ద్వారా ఎగుమతి చేస్తోంది. ఇక్కడ ఏ చిన్న ఆటంకం వచ్చినా రవాణా ఖర్చులు పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడే ప్రమాదం ఉంది.

చమురు ధరల ఎగిసే ప్రమాదం:
అమెరికా బలగాల మోహరింపుతోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇప్పటికే పెరుగుదల దిశగా కదులుతున్నాయి. విశ్లేషణల ప్రకారం, ఇరాన్ ఉత్పత్తిలో అంతరాయం కలిగితే బ్యారెల్ ధర గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధిలో రవాణా అంతరాయం మరింత తీవ్రమైతే, ధరలు మరింత ఎగసే ముప్పు ఉంది. ఇది భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలకు ప్రతికూల పరిణామమే అని చెబుతున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం:
భారత్ వినియోగించే చమురులో సుమారు 85 శాతం దిగుమతులే. అంతర్జాతీయ ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుంది. దీంతో కరెంట్ అకౌంట్ లోటు మరింత విస్తరించే ప్రమాదం ఉంది. చమురు కొనుగోళ్లకు డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉండటంతో డాలర్ డిమాండ్ పెరిగి, రూపాయి విలువపై ఒత్తిడి పడుతుంది. రూపాయి బలహీనత మరోవైపు దిగుమతులను మరింత ఖరీదుగా మారుస్తుంది.

పెట్రోల్, డీజిల్ ధరలు: 
దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే రవాణా వ్యయాలు అధికమవుతాయి. ఎర్ర సముద్రం వంటి మార్గాల్లో భద్రతా సమస్యలు తలెత్తితే నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరగాల్సి రావచ్చు. దీంతో సరుకు రవాణా సమయం 15–20 రోజులు, ఖర్చులు 40–50 శాతం పెరిగే అవకాశముంది. ఈ ప్రభావం చివరకు వినియోగదారుడి జేబుపై పడుతుంది. గగనతలాల పరిమితులతో విమానయాన సంస్థలు మార్గమార్పులు చేపడితే టికెట్ ధరలు కూడా పెరగవచ్చు.

Also Read: Gold Price: భారీగా పెరగనున్న బంగారం ధర.. ఇరాన్‌ సంక్షోభంతో పెట్రోల్‌ మంట కూడా తప్పదా?  

ఎగుమతులు, స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్:
ఇరాన్‌కు భారత్ నుంచి వెళ్లే బాస్మతి బియ్యం, ఔషధాలు, టీ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులపై కూడా ప్రభావం ఉండొచ్చు. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లు అనిశ్చితి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగితే అంతకాలం మార్కెట్ల అస్థిరత పెరిగే ప్రమాదం ఉంది.

బంగారం, వెండి ధరలు: 
సురక్షిత పెట్టుబడుల వైపు మదుపర్లు మొగ్గు చూపడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ.1.70 లక్షల వరకు, కిలో వెండి రూ.3 లక్షల వరకు చేరే అవకాశముంది. మొత్తంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్‌కు ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, మార్కెట్ విశ్వాసం ఇవన్నీకూడా మూడు రంగాల్లో సవాళ్లను సృష్టించే పరిస్థితి ఏర్పడింది. యుద్ధ మేఘాలు త్వరగా వీడితేనే మార్కెట్లకు ఊరట లభించే అవకాశం ఉంది.

Also Read:  EPFO CBT Meeting: హోలీకి ముందు గుడ్‌న్యూస్.. 31కోట్ల మందికి ప్రయోజనం.. EPFO కీలక నిర్ణయం..!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
comment0
Report
BBhoomi
Mar 01, 2026 03:37:52
Lakshmapur, Telangana:

UP Free Cylinder: హోలీ పండుగకు ముందుగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు యోగి ప్రభుత్వం  శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి  ఆదిత్యనాథ్ , ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులైన ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. ఈ సౌకర్యాన్ని హోలీతో పాటు దీపావళి పండుగల సందర్భాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తొమ్మిది సిలిండర్లకు సబ్సిడీ అందించే విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. సిలిండర్ రీఫిల్ చేసినప్పుడు సుమారు రూ. 335.40 మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా పారదర్శకతను పెంచుతున్నామని చెప్పారు. ఈ విధానం దుర్వినియోగాన్ని అరికట్టడమే కాకుండా.. పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇది కేవలం పండుగ కానుక మాత్రమే కాదని, గౌరవప్రదమైన జీవన విధానానికి ప్రభుత్వ నిబద్ధత అని సీఎం స్పష్టం చేశారు. హోలీ, దీపావళి వంటి సందర్భాల్లో ఇంధన అవసరాలు పెరుగుతాయని, ఆ సమయంలో కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మహిళల భద్రత, ఆరోగ్యం అంశాలపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో మహిళల స్వావలంబన, గౌరవం, రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి బజ్రేష్ పతాక్ ఆధ్వర్యంలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. సాధారణంగా రూ. 2100 విలువ చేసే ఈ టీకాను కేవలం రూ. 300కే అందుబాటులో ఉంచడమే కాకుండా, అవసరమైతే ఉచితంగా అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.  మా కుమార్తె సురక్షితంగా ఉంటేనే కుటుంబం సురక్షితంగా ఉంటుంది  అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Gold Rate Today: అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన పసిడి ధర.. మార్చి 1వ తేదీ ఆదివారం ధరలు ఇవే..!!  

ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై కూడా సీఎం యోగి ఆదిత్య నాథ్  విమర్శలు గుప్పించారు. గతంలో పాలన కుటుంబ కేంద్రంగా మారిందని, అభివృద్ధి కొద్దిమందికే పరిమితమైందని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని 25 కోట్ల ప్రజలను ఒక కుటుంబంగా భావిస్తోందని, వారి భద్రత, గౌరవం, సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

Also Read:  China Currency Explainer: ప్రపంచ కరెన్సీ మార్కెట్లో ప్రకంపనలు.. చైనా చేసిన పనితో కంగుతిన్న అగ్రరాజ్యం..!!   

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 02:44:20
:

Israel Vs Iran Military Power Comparison: పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ ఒకవైపు, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మరోవైపు నిలిచి తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ మూడు దేశాల మధ్య ఉన్న సైనిక సామర్థ్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధ సంపత్తి కలిగిన అమెరికా, సంఖ్యాపరంగా బలమైన ఇరాన్, సాంకేతికతలో మేటి అయిన ఇజ్రాయెల్ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.

అమెరికా
అమెరికా తన ప్రయోజనాల కోసం పశ్చిమాసియాలో సుమారు 40,000 మంది సైనికులను, అత్యాధునిక యుద్ధనౌకలను మోహరించింది. యూఎస్‌ఎస్‌ జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్, యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్ వంటి భారీ విమానవాహక నౌకలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి.

ముఖ్య స్థావరాలు..
బహ్రెయిన్‌లో అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఖతార్ (అల్ ఉదైద్)లో సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్, 10 వేల మంది సైనికులు ఉండగా.. యూఏఈ & కువైట్‌లో డ్రోన్లు, నిఘా విమానాలకు కీలకంగా ఉన్నాయి. దీంతో పాటు థాడ్, పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ శత్రు క్షిపణులను అడ్డుకోవడానికి మోహరించారు.

ఇరాన్
దీర్ఘకాలిక ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో భారీ క్షిపణి వ్యవస్థను నిర్మించుకుంది. 6.1 లక్షల మంది క్రియాశీల సైనికులు, 2 లక్షల మంది సుశిక్షిత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ దళం దీని ప్రధాన బలంగా మారింది. ఇరాన్‌లో 2,000 కిలోమీటర్ల పరిధితో 3,000కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ వద్ద వేల సంఖ్యలో ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయి. దాదాపు 6,000 నౌకాదళ మందుపాతరలతో హోర్ముజ్ జలసంధిని మూసివేసే సత్తా ఇరాన్‌కు ఉంది.

ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ సంఖ్యాబలం కంటే నాణ్యత, వేగంపై ఆధారపడుతుంది. ఎఫ్-35, ఎఫ్-16 వంటి 600కు పైగా అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి. కచ్చితమైన లక్ష్యాలను ఛేదించడంలో ఇవి ప్రపంచంలోనే మేటి. క్షిపణి రక్షణ, ఐరన్ డోమ్ స్వల్ప శ్రేణి రాకెట్లను అడ్డుకుంటుంది. డేవిడ్ స్లింగ్, యారోలు మధ్యంతర, సుదూర క్షిపణులను గగనతలంలోనే ధ్వంసం చేస్తాయి. అణ్వాస్త్రాలు గురించి అధికారికంగా ప్రకటించకపోయినా, ఇజ్రాయెల్ వద్ద 90కి పైగా అణ్వాస్త్రాలు, 6,500 కి.మీ పరిధి గల జెరికో-3 క్షిపణులు ఉన్నాయి.

అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి సాంకేతికత, వైమానిక శక్తి కలిసొచ్చే అంశం అయితే, ఇరాన్‌కు దాని క్షిపణి సంపత్తి, భౌగోళిక వ్యూహం (హోర్ముజ్ జలసంధి) ప్రధాన ఆయుధాలుగా ఉన్నాయి. ఈ ఘర్షణ పెరిగితే అది ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Also Read: Khamenei Death: "ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ చనిపోయారు!" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

Also Read: Baba Vanga World War 3: బాబా వంగా చెప్పినట్టే జరుగుతోందా? 2026 'మూడో ప్రపంచ యుద్ధం' మొదలైనట్టేనా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 02:25:39
Hyderabad, Telangana:

Baba Vanga Predictions 2026: ప్రస్తుత యుద్ధ పరిణామాలు ప్రపంచాన్ని వణికిస్తుండగా, బల్గేరియన్ ప్రవక్త బాబా వంగా ఏళ్ల క్రితం చెప్పిన జోస్యాలు ఇప్పుడు నిజమవుతున్నాయా? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. 2026 నాటి పరిస్థితులపై ఆమె చేసిన విస్తుపోయే అంచనాలు ఇప్పుడు నిజంగానే భయం కలిగిస్తున్నాయి. ప్రపంచ గమనాన్ని ముందుగానే ఊహించే 'నోస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్స్'గా పేరుగాంచిన బాబా వంగా, భవిష్యత్తుపై చేసిన కొన్ని కీలక ప్రకటనలు ప్రస్తుత ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులతో సరిపోలుతున్నాయి.

బాబా వంగా ప్రధాన జోస్యాలు..
2026లో భారీ యుద్ధం: తూర్పు దేశాల నుండి ఉద్భవించే ఉద్రిక్తతలు 2026 నాటికి ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని ఆమె గతంలోనే అంచనా వేశారు. ప్రస్తుత ఇరాన్ సంక్షోభం ఆ యుద్ధానికి నాంది అని ఆమె అనుచరులు భావిస్తున్నారు.

బంజరుగా మారనున్న యూరప్: ఈ మహా యుద్ధం తర్వాత యూరప్ దేశాలు తీవ్రంగా దెబ్బతింటాయని, ఆ భూభాగం జనవాసం లేని బంజరు ప్రాంతంగా మారుతుందని ఆమె హెచ్చరించారు. అంటే యూరప్ తన ప్రాభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అర్థం.

రష్యా అగ్రరాజ్యం: యుద్ధం తర్వాత ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని, అగ్రరాజ్యంగా రష్యా వెలుస్తుందని ఆమె ప్రవచించారు. రష్యా ప్రభావం ప్రపంచ దేశాలపై అపరిమితంగా పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుత భయానక వాస్తవాలు..
బాబా వంగా ప్రవచనాలను బలపరిచేలా పశ్చిమాసియాలో తాజా పరిణామాలు ఉన్నాయి.

1) ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో గ్లోబల్ ఎకానమీ, భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.

2) ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేయడం, అమెరికా బేసుల పై దాడులు చేయడం యుద్ధ వాతావరణాన్ని పతాక స్థాయికి చేర్చాయి.

3) టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ కార్యాలయాలే లక్ష్యంగా దాడులు జరగడం పరిస్థితి చేయి దాటిపోయిందని సూచిస్తోంది.

బాబా వంగా చెప్పిన విషయాల్లో గతంలో కొన్ని నిజమయ్యాయి (ఉదాహరణకు 9/11 దాడులు, సునామీ). అయితే, ఆధ్యాత్మిక ప్రవచనాలు, రాజకీయ విశ్లేషణల మధ్య చాలా సార్లు యాదృచ్ఛికతలు కూడా ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం అంచున ఉందనేది మాత్రం నిష్ఠుర సత్యం.

(గమనిక: ఈ సమాచారం బాబా వంగా ప్రవచనాలు, సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్న కథనాల ఆధారంగా రూపొందించబడింది. దీనిని కేవలం ఒక ప్రత్యేక దృక్కోణంగా మాత్రమే చూడాలి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Khamenei Death: "ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ చనిపోయారు!" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

Also Read: Ind Vs WI Match Preview: టీమ్ ఇండియాకు చావో-రేవో..వెస్టిండీస్‌తో నేడు 'క్వార్టర్ ఫైనల్' సమరం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 01:21:46
Kolkata, West Bengal:

India Vs West Indies Match Preview: టీ20 ప్రపంచకప్‌లో నేడు జరగబోయే అత్యంత కీలకమైన సమరానికి కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. సూపర్‌-8లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్‌ను తలపిస్తోంది. ఈ పోరులో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

జింబాబ్వేపై విజయంతో భారత్, దక్షిణాఫ్రికా చేతిలో విండీస్ ఓటమి పాలవ్వడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు నిర్ణయాత్మకంగా మారింది. నేడు గెలిచిన జట్టు మార్చి 5న ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్‌లో తలపడుతుంది.

టీమ్ ఇండియా బలాబలాలు..
గత మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద ఊరట. టాప్-6 బ్యాటర్లు అందరూ సమష్టిగా రాణించారు. ఓపెనర్‌గా సంజు శాంసన్ ఆత్మవిశ్వాసం, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ, తిలక్ వర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టం చేశాయి.

అయితే బౌలింగ్ విభాగం ఇంకా స్థిరంగా లేదు. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ లేమి జట్టును వేధిస్తోంది. అలాగే సీమ్ ఆల్ రౌండర్ దూబే భారీగా పరుగులు సమర్పించుకోవడం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. బుమ్రా కట్టుదిట్టంగా వేస్తున్నా, వికెట్ల వేటలో వెనుకబడ్డాడు.

వెస్టిండీస్ బలాబలాలు..
కరీబియన్ జట్టు ఏ క్షణమైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల హిట్టర్లతో నిండి ఉంది. 9వ స్థానంలో వచ్చే షెపర్డ్ కూడా అర్ధ సెంచరీ బాదగలగడం వారి బ్యాటింగ్ లోతును తెలియజేస్తోంది. ఇన్నింగ్స్ మధ్య వరకు వికెట్లు కాపాడుకుంటూ, ఆఖరి ఓవర్లలో విధ్వంసం సృష్టించడం విండీస్ శైలి.

ఈడెన్ గార్డెన్స్ భారత్‌కు అచ్చొచ్చిన మైదానంగా వస్తోంది. గణాంకాల ప్రకారం చూస్తే ఈ మైదానంలో భారత్ పైచేయి సాధించింది. 1983 నుంచి ఇక్కడ వెస్టిండీస్ జట్టు ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ భారత్‌ను ఓడించలేదు. ఇక్కడ జరిగిన గత నాలుగు టీ20ల్లోనూ టీమ్ ఇండియానే విజయం సాధించింది.

పిచ్ రిపోర్ట్, వాతావరణం
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. క్యురేటర్ ప్రకారం బౌలర్లకు కూడా కొంత సహకారం అందుతుంది. సాయంత్రం వేళ మంచు (డ్యూ) ప్రభావం చూపే అవకాశం ఉంది. వర్షం ముప్పు లేకపోవడం క్రికెట్ ప్రేమికులకు మంచి వార్త.

టీమ్ఇండియా తుదిజట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

వెస్టిండీస్ తుదిజట్టు (అంచనా)
బ్రెండన్ కింగ్, షై హోప్(కెప్టెన్, వికెట్ కీపర్), హెట్మయర్, రోమన్ పావెల్, రోస్టన్ చేజ్, రూథర్‌ఫర్డ్,  రోమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, గుడకేశ్ మోటీ, షామర్ జోసెఫ్.

 

Also Read: Khamenei Death: "ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ చనిపోయారు!" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

Also Read: Samarlakota Blast: ఏపీలో భారీ పేలుడు..18 మంది దుర్మరణం, చెల్లాచెదురుగా పడిన శరీర భాగాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 00:54:00
:

Iran Supreme Leader Khamenei Death: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్‌పై 'మేజర్ కాంబాట్ ఆపరేషన్స్' ప్రారంభమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై జరిపిన మెరుపు దాడులు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ మరణించారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. టెహ్రాన్‌తో సహా తొమ్మిది ప్రధాన నగరాల్లోని అణు కేంద్రాలు, బాలిస్టిక్ మిసైల్ సైట్లు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి.

ఖమైనీ చనిపోయారు?!
"చరిత్రలో అత్యంత దుష్ట వ్యక్తులలో ఒకరైన ఖమైనీ కథ ముగిసింది. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి గెలుచుకోవాల్సిన సమయం వచ్చింది" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ప్రకటించారు. ఖమైనీ సురక్షిత భవనంపై జరిగిన దాడిలో ఆయనతో పాటు IRGC కమాండర్లు, రక్షణ మంత్రి కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు.

ఈ వార్తలను ఇరాన్ అధికారిక మీడియా తీవ్రంగా ఖండించింది. సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారని, దేశాన్ని సమర్థవంతంగా నడుపుతున్నారని స్పష్టం చేసింది. అయితే, దీనిపై ఇంకా స్వతంత్ర వెరిఫికేషన్ రావాల్సి ఉంది.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు..
అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ తక్షణమే స్పందించింది. కేవలం ఇజ్రాయెల్‌పైనే కాకుండా, అమెరికా సైనిక బేసులు ఉన్న గల్ఫ్ దేశాలపై కూడా బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. యూఏఈ (దుబాయ్, అల్ ధఫ్రా బేస్), ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాల్లోని అమెరికా బేస్‌లపై ఇరాన్ దాడులు చేస్తోంది. యూఏఈలో ఒక పౌరుడు మరణించినట్లు సమాచారం. చాలా మిసైల్స్‌ను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ, కొన్ని చోట్ల ఆస్తి నష్టం సంభవించింది.

గల్ఫ్ దేశాల ఆగ్రహం..
తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ జరిపిన దాడులను సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ తీవ్రంగా ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని, తమను తాము రక్షించుకునే హక్కు తమకు ఉందని ప్రకటించాయి. గల్ఫ్ ప్రాంతంలో విమాన సర్వీసులు రద్దు కావడంతో పాటు ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేశారు.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒమాన్ వంటి దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నాయి.

ఈ దాడులు వారం రోజులు లేదా అవసరమైనంత కాలం కొనసాగుతాయని ట్రంప్ హెచ్చరించడంతో, ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌లో అత్యవసర పరిస్థితి నెలకొంది. ఖమైనీ మరణవార్త నిజమైతే, అది ఇరాన్ రాజకీయ భవిష్యత్తును, మధ్యప్రాచ్య సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తుంది.

Also Read: Samarlakota Blast: సామర్లకోట భారీ పేలుడు..ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..మృతులకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా!

Also Read: Samarlakota Blast: ఏపీలో భారీ పేలుడు..18 మంది దుర్మరణం, చెల్లాచెదురుగా పడిన శరీర భాగాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 18:30:56
Amaravathi, Andhra Pradesh:

AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు అమలవుతున్న ఉచిత బస్సుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉచిత బస్సును మహిళలతోపాటు దివ్యాంగులకు కూడా అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దివ్యాంగులకు సంబంధించి ఉచిత బస్సు అమలు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దివ్యాంగులకు ఉచిత బస్సు అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR: రెండేళ్లలో రాజధాని హైదరాబాద్‌ను రేవంత్ రెడ్డి కుప్పకూల్చాడు: కేటీఆర్

దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని.. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులకు ఉచిత బస్సు అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి మంత్రి డీఎస్ బీవీ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దివ్యాంగుల సంక్షేమం కోసం ఇంద్ర ధనస్సులో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Also Read: Gold Fruad: మేడమ్‌ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు

ఈ నేపథ్యంలో స్త్రీ శక్తి పథకంతో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీ శక్తి పథకం వర్తించే అన్ని బస్సుల్లోనూ దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దివ్యాంగుల తరఫున దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి డోలా  బాల వీరాంజనేయస్వామి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా మంత్రి డోలా  బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. దివ్యాంగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.6 వేలు పింఛన్ ఇస్తున్నట్లు గుర్తుచేశారు. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు మార్చిలోపు భర్తీ చేస్తామని  మంత్రి వీరాంజనేయ స్వామి చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 17:15:20
Kakinada, Andhra Pradesh:

Vetlapalem Blast Victims: బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం రేపింది. పెద్ద ఎత్తున శబ్దాలతో పేలుడు సంభవించడంతో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘోర ప్రమాదం సంభవించింది. మొత్తం 23 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో క్షతగాత్రులకు గురయ్యారు. ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించారు.

వేట్లపాలెం దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చారు. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నారని.. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇస్తూ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.

వేట్లపాలెం దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనలో పేలుడు పదార్థాల వద్ద జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్వాహకులు విఫలమయ్యారని తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన యాజమాన్యానికి సంబంధించిన ఆస్తులు కూడా జప్తు చేస్తామని.. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని వివరించారు. అనుమతి లేకుండా బాణసంచా తయారు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 16:36:28
Hyderabad, Telangana:

Telangana Industrialization: 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక లోగో తయారు చేస్తున్నాం. కేంద్రం ఏర్పాటు చేసిన ఏఐ సమావేశం నిర్వహణపై కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రణాళికా బద్ధంగా జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించాం. కోర్ అర్బన్ రీజియన్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులు దృష్టిపెట్టాలి' అని రేవంత్ రెడ్డి సూచించారు.

Also Read: KTR: రెండేళ్లలో రాజధాని హైదరాబాద్‌ను రేవంత్ రెడ్డి కుప్పకూల్చాడు: కేటీఆర్

'ప్యూర్ అర్బన్ రీజియన్ 10 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ మాన్యుఫాక్చరింగ్ రంగం విస్తరించాలి. పారిశ్రామికీకరణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలి. దీనిపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సేవా రంగంలో వస్తున్న పెను మార్పులు గమనంలోకి తీసుకోవాలి. శాఖలపైన ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉండాలి. శాఖలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలి.

'ప్రభుత్వ  కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీలు లేదు. ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలి. బడ్జెట్ ప్రతిపాదనలో వీటిని చేర్చాలి' అని అధికారులకు సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల పైన ప్రతి శాఖ దృష్టి పెట్టాలి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సర్వీస్ సెక్టార్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఆన్‌లైన్ విధానంలో అన్ని పనులు జరిగేలా చూడాలి. ఈ ఫైల్ విధానం ఉండాలి. నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందే' అని స్పష్టం చేశారు.

'పాత కాలం సర్వర్‌లను అప్డేట్ చేసుకోవాలి. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి. ఇందులో సాంకేతికతను వినియోగించుకోవాలి. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందాలి. 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీపై దృష్టి పెట్టాలి. ఫ్యూచర్ సిటీ దేశ ఆర్ధిక స్థితిని మార్చబోతోంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ వచ్చే మార్పులను ప్రజలకు వివరించాలి. డిజిటల్ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి. నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి సారించాలి' అని సూచించారు.

'వంద నియోజకవర్గాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్  ప్రారంభించుకోబోతున్నాం. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తాం. ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలు మెరుగుపడాలి. ప్రాంతాల వారీగా మెడికల్ డేటా తయారు చేయాలి. ప్రతి సెక్రటరీ తమ శాఖ లల్లో బెస్ట్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసుకోవాలి' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'మార్చి 6 నుంచి 99 రోజుల ప్రణాళిక జూన్ 12వ తేదీ వరకు జరగబోతుంది. జూన్ 2వ తేదీ వరకు ప్రతి ఆఫీస్ పరిశుభ్రంగా కావాల్సిందే. జూన్ 2వ తేదీ తెలంగాణకు పండుగను అంతా ఘనంగా చేసుకోవాలి. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 15:34:20
Tirupati Urban, Andhra Pradesh:

Lunar Eclipse Tirumala SSD Tokens: భారతదేశంలో చంద్రగ్రహణం ప్రభావం తీవ్రంగా ఉండడంతో ప్రముఖ ఆలయాలన్నీ మూసివేయనున్నారు. ఈ క్రమంలో దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయం కూడా మూత పడనుంది. ఆలయం మూసివేయనుండగా చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2వ తేదీల్లో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు చేశారు. ఆ రెండు రోజులు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయమని టీటీడీ ప్రకటించింది. ఇదివరకే టీటీడీ ప్రకటించిన విధంగా మార్చి 3వ తేదీన చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి దర్శనాలకు సంబంధించి తిరుపతిలో జారీ చేసే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయమని టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

Also Read: KTR: రెండేళ్లలో రాజధాని హైదరాబాద్‌ను రేవంత్ రెడ్డి కుప్పకూల్చాడు: కేటీఆర్

మార్చ్ 2, 3వ తేదీలకు సంబంధించిన ‌ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ముందురోజు అనగా మార్చి 1, 2వ తేదీల్లో జారీ చేయమని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ప్రకటన చేశారు. తిరిగి మార్చి 4వ తేది దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను మార్చి 3వ తేదీన జారీ చేస్తామని తెలిపారు. మార్చి 3వ తేది వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశామని వెల్లడించారు. ఈ కారణంగా మార్చి 2వ తేదీన వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించలేమని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

రుక్మిణి సమేత శ్రీకృష్ణుడి విహరం
తిరుమల వేంకటేశ్వర స్వామి వార్షిక తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా శనివారం మూడో రోజు శ్రీవారు రుక్మిణి సమేత శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలోని స్వామి పుష్కరిణిలో భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఈ వేడుక కనువిందుగా సాగింది. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్తూ భక్తులకు అభయమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవం సాగింది. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ఆలపించిన సంకీర్తనలు భక్త జనాన్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్ విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి.

రీల్స్‌పై టీటీడీ కీలక నిర్ణయం?
పవిత్రమైన తిరుమల ఆలయం.. ఆలయ పరిసరాల్లో రెచ్చిపోతున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, భక్తులపై టీటీడీ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవ‌ల చాలామంది త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం తిరుమ‌ల‌లో అస‌త్య క‌థ‌నాల‌తో రీల్స్ చేసి సోషియ‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎంతో భ‌క్తితో తిరుమ‌ల పుణ్య‌క్షేత్రానికి వ‌చ్చే భ‌క్తుల మ‌నోభావాలను దెబ్బ‌తినేలా పోస్టు పెట్టేవారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టీటీడీ హెచ్చ‌రించింది. దీనిపై బోర్డులో ఆమోదం తీసుకుందని తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 14:58:45
Hyderabad, Telangana:

Neopolis Rajashyamala Temple: ఇన్నాళ్లు పేదల భూములపై పడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు గుడులు, పీఠాలపై పడ్డాడని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రేవంత్ రెడ్డి కళ్లు దేవుడి మాన్యాల మీద పడ్డాయి. విశాఖ శారద పీఠం, రాజశ్యామల ఆలయాన్ని కూల్చేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో భయాందోళనలు సృష్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి అల్లుడి క్రషర్ దందా కోసం దేవుడి భూములను లాక్కుంటారా? కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం అంటే.. గుళ్లు, గోపురాలు కూల్చడమేనా?' అని ప్రశ్నించారు. ప్రతి ఆలయానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

Also Read: KTR: రెండేళ్లలో రాజధాని హైదరాబాద్‌ను రేవంత్ రెడ్డి కుప్పకూల్చాడు: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లతో పాటు ఇప్పుడు దేవాలయాలు, మఠాలను కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ హరీశ్‌ రావు మండిపడ్డారు. కోకాపేట్ నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు బెదిరిస్తుండడంతో హరీశ్‌ రావు అక్కడికి చేరుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

'వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన తయారైంది. అడ్డగోలు వ్యవహారాలు, అక్రమాలకు పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా దేవాలయాలు, మఠాలను కూడా కూల్చే స్థాయికి దిగజారింది' అని మాజీ మంత్రి హరీవశ్‌ రావు మండిపడ్డారు. '2019లో కేసీఆర్ ప్రభుత్వంలో కోకాపేట సర్వే నెంబర్ 240లో విశాఖ శారద పీఠానికి చట్టబద్ధంగా మంత్రివర్గ ఆమోదంతో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాం' అని గుర్తుచేశారు. 'పీఠం నిర్వాహకులు ప్రభుత్వానికి రూ.కోటి 5 లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హెచ్ఎండీఏకు రూ.23 లక్షలు చెల్లించి అనుమతులు, విద్యుత్ కనెక్షన్ అన్నీ తీసుకున్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా అంటూ.. కేసీఆర్ కట్టిన గుళ్లు, గోపురాలు, మఠాలను కూల్చడమేనా రేవంత్ రెడ్డి ఉద్దేశం. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చావు, ఖమ్మంలో ఇళ్లు కూల్చి 800 మందిని రోడ్డున పడేశావు. నీ పాలనలో అంతా కూల్చడమే తప్ప, నిర్మాణం లేదా? వాటర్ వర్క్స్ హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ కోసం ఈ స్థలం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. వాటర్ వర్క్స్ కట్టాలంటే ఈ దేవాలయం స్థలమే దొరికిందా? సరిగ్గా ఈ ఆలయానికి రోడ్డు అవతలే సర్వే నెంబర్ 239, 240 లలో 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా, వాటర్ వర్క్స్ అక్కడ కట్టుకోవచ్చు కదా?' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు.

'ఆ 17 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి తన అల్లుడికి, మేనల్లుళ్లకు, వాళ్ల అనుచరులకు భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ అక్రమంగా కట్టబెట్టారు. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం ఓఆర్ఆర్‌కు కిలోమీటర్‌ లోపల ఎలాంటి క్రషర్లు ఉండకూడదు. కానీ రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం ఇక్కడ ఏకంగా 5 రెడీమిక్స్ ప్లాంట్లు, క్రషర్లు పెట్టించారు. పక్కన ఉన్న బిల్డర్లంతా తన అల్లుడి దగ్గరే కంకర కొనాలని.. లేకపోతే అనుమతులు ఇవ్వమని బెదిరిస్తూ దందా చేస్తున్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

'అల్లుడికి వ్యాపారం చేసుకోవడానికి 17 ఎకరాలు ఇస్తావు కానీ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే శారద పీఠానికి ఉన్న రెండు ఎకరాలను మాత్రం లాక్కుని కూలుస్తావా? భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే నీ ధర్మమా.. తక్షణమే ఆ అక్రమ క్రషర్లను క్యాన్సిల్ చేయాలి. ఆలయం వద్ద పీఠాధిపతిని, నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేస్తారా..? మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే ముందు పీఠాధిపతులతో మాట్లాడే కనీస సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదా?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు.

'దొంగల్లా దాక్కోవాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది..? ఉదయం స్వాములు పూజలు చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయంలో ఏళ్ల తరబడి జరుగుతున్న పూజలను ఆపే హక్కు, ధైర్యం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారు.. స్వామీజీ వాగ్వాదానికి దిగాక అరగంట తర్వాత పూజకు అనుమతించారు. కేసీఆర్ ఆనవాళ్లని చెప్పి రైతుబంధు, కేసీఆర్ కిట్, ఫీజు రీయింబర్‌మెంట్ బంద్ చేశావు? ఇప్పుడు గుళ్లను కూడా వదులుతలేవు. దేవుని మీద పడ్డవాడు ఎవడూ బాగుపడలేదు.. నీకేదో పోయేగాలం దాపురించింది, ఆ దేవుడి శాపం నీకు తప్పక తగులుతుంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 28, 2026 14:09:09
Samarlakota, Andhra Pradesh:

Modi on Samarlakota Blast: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ప్రమాదంపై దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం ప్రకటించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి బాధితులకు కింది విధంగా పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, అలాగే క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. "వేట్లపాలెం పేలుళ్ల వార్త నన్ను కలచివేసింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని పేర్కొన్నారు.

రంగంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రమాద వార్త తెలిసిన వెంటనే తన పర్యటనను మార్చుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేట్లపాలెం చేరుకున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం, ప్రమాద తీవ్రతను చూసి చలించిపోయారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? నిబంధనల ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలపై అధికారులను ఆరా తీశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 21కి చేరినట్లు తాజా సమాచారం. పోలీసులు ఇప్పటివరకు 13 మృతదేహాలను గుర్తించారు.

మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో, పోస్టుమార్టం నిమిత్తం వాటిని కాకినాడ జీజీహెచ్ (GGH) ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 9 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాణసంచా కేంద్రాల్లో భద్రతా ప్రమాణాల లోపం ఇంతమంది నిరుపేద కూలీల ప్రాణాలను బలి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Also Read: Samarlakota Blast: ఏపీలో భారీ పేలుడు..18 మంది దుర్మరణం, చెల్లాచెదురుగా పడిన శరీర భాగాలు!

Also Read: Unseen Friend In Virosh Marriage: విజయ్-రష్మిక ఫోటోల్లో ఆ మూడో వ్యక్తి ఎవరు? వైరల్ అవుతున్న 'అన్‌సీన్ ఫ్రెండ్' పోస్ట్‌లు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 13:46:53
Hyderabad, Telangana:

GHMC Elections BRS Party Planning: రాజధాని హైదరాబాద్‌ని కాంగ్రెస్, రేవంత్ రెడ్డినే కుప్పకూల్చాడు. రెండు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో హైదరాబాద్‌ని దెబ్బ కొట్టారు' అని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి అవినీతి, అక్రమాలు, స్కామ్‌ల వల్లనే హైదరాబాద్‌కి ఈ పరిస్థితి దాపురించిందని వాపోయారు. పారిశుద్ధ్యం నుంచి ప్రజా రవాణా దాకా అన్ని రంగాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. పారిశ్రామిక ప్రగతి నుంచి వ్యాపార వాణిజ్యాలు అన్నీ నగరంలో క్షీణించాయని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు.

Also Read: Gold Fruad: మేడమ్‌ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్‌ నగరానికి సంబంధించి లేవనెత్తాల్సిన అంశాలు విస్తృతంగా చర్చించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం కార్యకలాపాల సమన్వయం కోసం జీహెచ్ఎంసీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కోసం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికు పార్టీ బాధ్యతలు అప్పగించింది.

Also Read: BRS Party: పేదల ఇళ్లు కూల్చడమే పనిగా పెట్టుకున్న రేవంత్‌ రెడ్డి: కొప్పుల ఈశ్వర్‌

అనంతరం కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిని అంతర్జాతీయ మెట్రో నగరంగా తీర్చిదిద్దాం. కేవలం ఇక్కడి ప్రజలు ఓట్లు వేయలేదన్న ఏకైక కక్షతో, కోపంతో హైదరాబాద్‌కి ఈ దుస్థితి రేవంత్ రెడ్డి తీసుకువచ్చారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఉన్న నగరాన్ని వదిలిపెట్టి తన రియల్ ఎస్టేట్ కోసం ఫోర్త్ సిటీని, ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి ప్రమోట్ చేస్తున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్ నగర ప్రజల అంశాలను, ప్రభుత్వ పక్షపాత వైఖరిని అన్ని విధాలా ఎండగడతామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.

రెండు సంవత్సరాల కాలంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అధఃపాతాళానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుపోయారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం తన ఆర్థిక ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడని, అందుకే హైదరాబాద్ నగరంలో భూములే లక్ష్యంగా అక్రమ సంపాదన కోసమే పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని పతనానికి పడగొట్టారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

'రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు, అనుచరుల కోసం వేల కోట్ల రూపాయలను హైదరాబాద్‌ నుంచి దోచుకోవడానికి హైడ్రా మొదలుకొని పారిశ్రామిక భూముల స్కామ్, టీడీఆర్ పేరిట మరొక కుంభకోణం, ఇలా ఫోర్త్ సిటీ భూముల కుంభకోణం రేవంత్ రెడ్డి 24 నెలలుగా చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారమే' అని కేటీఆర్ విమర్శించారు. కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత దుర్మార్గమైన పరిపాలనా వైఫల్యం రేవంత్‌ రెడ్డి పాలనలో ఉందని.. ఎప్పుడూ లేనటువంటి కరెంట్ కోతలు, తాగునీటి ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్యలు అన్ని తిరిగి హైదరాబాద్‌లో దర్శనమిస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. 

అవగాహన రాహిత్యంతో, అక్రమ సంపాదన లక్ష్యంగా తన భూములకు విలువ తీసుకురావడం కోసం రేవంత్‌ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఉన్న సిటీని పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పన చేయకుండా.. కనీస పౌర సేవలు అందించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో తిరోగమనంలోకి తీసుకువెళ్తుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top