Hyderabad police filed case against Actress madhavi latha: నటి మాధవీలత ఇటీవల తరచుగా కాంట్రవర్సీలలో ఉంటున్నారు. గతంలో ఏడాది క్రితం అచ్చం ఇలానే న్యూ ఇయర్ వేళ తాడిపత్రిలో మహిళలు రాత్రిపూట న్యూ ఇయర్ సంబరాల్లో మహిళలు పాల్గొనడంపై మాట్లాడారు. రాత్రిపూట ఏదైన జరిగితే ఎవరు బాధ్యులని అన్నారు. ఈవెంట్లకు రాత్రిపూట వెళ్లడం అవసరమా..?. అంటూ మాట్లాడారు .దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి నటి మాధవీలత మధ్య వివాదం పీక్స్ కు చేరింది. దీనిపై తాడిపత్రిలో మాధవీలతపై మహిళలు కేసు నమోదుచేశారు. ఇదిలా ఉండగా.. మరోవైపు మాధవీలత మరోసారి చిక్కుల్లో పడ్డారు.
ఇటీవల మహా రాష్ట్రలో ప్రసిద్దమైన ఆలయమైన షిర్డీసాయిపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. సాయి బాబా ఒక ముస్లిం ఫకీరు అని, ఆయనను ముస్లింవారు కొలవరని అన్నారు. అంతే కాకుండా..మన హిందువులే సిగ్గులేకుండా సాయిబాబాను పూజిస్తున్నారని మండిపడ్డారు.
అంతేకాకుండా.. వీరికి అసలు బుద్దిలేదని ఎందుకు పూజిస్తారో వారికి తెలియదని అన్నారు. చాలా మంది తమ జీవితాల్లో సాయిబాబా వల్ల ఏదో అద్బుతం జరిగిందని అంటారని, అది అవాస్తవమని మీ టైమ్ బాగుండి మంచి జరిగిందని మాధవీలత మాట్లాడారు. దీనిపై ప్రస్తుతం వివాదం రాజుకుంది.
నటి మాధవీలతపై కొంత మంది సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాధవీలతతో పాటు, మరికొంత మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వివాదంపై రేపు తమ ఎదుట విచారణకు హజరు కావాలని మాధవీలతతో పాటు మరో 14 మంది యూట్యూబర్ లపై పోలీసులు నోటీసులు జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
EPFO Big Update: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఈ ఏడాది మంచి శుభవార్త అందే అవకాశం ఉంది. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమయ్యే వార్షిక వడ్డీ ఈసారి భారీగా ఉండే అవకాశం ఉంది. సుమారు 8.75 శాతం వడ్డీ రేటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పీఎఫ్ అకౌంట్లో రూ. 5లక్షలు ఉన్న ఉద్యోగులకు వేలల్లో లాభం దక్కనుంది.
ఉదాహరణకు.. ఒక ఉద్యోగి PF ఖాతాలో రూ.5 లక్షల బ్యాలెన్స్ ఉంటే.. ఏడాదికి దాదాపు రూ.44,000 వరకు వడ్డీ జమ అవుతుంది. ఇదే బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఉంటే.. వడ్డీ మొత్తం సుమారు రూ.51,000 వరకు చేరుతుంది. అంటే బ్యాలెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే.. వడ్డీ రూపంలో వచ్చే ప్రయోజనం కూడా అంతగా పెరుగుతుందన్న మాట. ఈ విధంగా EPF దీర్ఘకాలంలో ఉద్యోగుల పదవీ విరమణ పొదుపును మరింత బలోపేతం చేస్తోంది.
ప్రతి సంవత్సరం EPFO వడ్డీ రేటును ప్రకటించినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాతే ఖాతాల్లో వడ్డీ మొత్తం జమ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. వడ్డీ మొత్తం ఆటోమెటిగ్గా PF పాస్‌బుక్‌లో కనిపిస్తుంది. ఇందుకోసం సభ్యులు ఎలాంటి ప్రత్యేక దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
తమ PF బ్యాలెన్స్.. వడ్డీ వివరాలను ఉద్యోగులు చాలా సులభంగా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. UMANG యాప్ లేదా EPFO సభ్యుల పోర్టల్ ద్వారా ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. UMANG యాప్‌లోకి వెళ్లి EPFO సేవలను ఎంచుకుని పాస్‌బుక్ వ్యూ.. అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీ UAN నంబర్ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చిన OTP ద్వారా ధృవీకరణ పూర్తిచేస్తే, సభ్యుల IDని ఎంచుకుని పాస్‌బుక్‌ను చూడవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎటువంటి అదనపు పెట్టుబడి చేయకుండానే ప్రతి ఏడాది వడ్డీ రూపంలో వచ్చే ఈ ఆదాయం ఉద్యోగులకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు. భద్రత, స్థిరత్వం, పన్ను ప్రయోజనాల పరంగా EPF ఇప్పటికీ జీతం పొందే ఉద్యోగులకు అత్యంత నమ్మకమైన పొదుపు పథకాలలో ఒకటిగా కొనసాగుతోంది. ముఖ్యంగా వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉన్నప్పుడు, EPF ఖాతా భవిష్యత్తుకు బలమైన ఆర్థిక ఆధారంగా నిలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
KTR Chit Chat: జీహెచ్‌ఎంసీ విభజనపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 'జీహెచ్ఎంసీని మూడు చేస్తారు. ఫోర్త్ సిటీ అని పెట్టాడు కదా దాన్ని కూడా ఏదో కార్పొరేషన్ చేస్తాడు కావచ్చు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకుంటారా? అన్నింటికి సమాధానం చెప్పాలి' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చ పెట్టాలి.. చర్చలో మేము అన్ని మాట్లాడతామని తెలిపారు.
Also Read: KTR Chit Chat: కేసీఆర్‌కు పేరు.. చంద్రబాబుకు కోపం వస్తుందని రేవంత్ రెడ్డి డ్రామాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ సోమవారం కేటీఆర్ మీడియాతో కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిపాలన యంత్రాంగం విభజనపై స్పందించిన కేఈఆర్.. 'జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేసుకుంటారో..? ఎవరికి లాభం చేకూర్చేలా చేసుకుంటారో వాళ్ల ఇష్టం. మాకు 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక చరిత్రాత్మక ఎన్నిక. అలాంటి ఎన్నిక ఇప్పటివరకు చూడలేదు. మళ్లీ చూడబోము' అని తెలిపారు. కేవలం డబ్బులు సేకరణ కోసం మర్చంట్ బ్యాంకర్ బ్రోకర్లు చెప్పినట్లు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 'ఈ డిలిమిటేషన్ కేవలం డబ్బుల కోసం చేస్తున్నదే. అడ్డగోలుగా విభజన చేశారు. గతంలో ఓల్డ్ సిటీలో కూడా మేము రెండో స్థానంలో గెలవడం జరిగింది. గతంలో మేం గెల్చిన సీట్లు ఇంకా ఎవరు గెలవలేరు' అని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.
Also Read: Tirumala Temple: ఇల వైకుంఠంగా తిరుమల ఆలయం.. శ్రీవారికి ఎవరూ దిష్టి పెట్టొద్దు
టెలిఫోన్ ట్యాపింగ్‌పై నానా హడావుడి చేస్తున్న రేవంత్ రెడ్డి తీరుపై కేటీఆర్ స్పందిస్తూ.. 'ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వస్తుంది. గుడాచారి వ్యవస్ధ నెహ్రు నుంచి నేటి దాకా ఉంది. శాంత్ర భద్రతలు, రాష్ట్ర రక్షణ కోసం చేస్తున్నారు. ఈ రోజు నిఘా వ్యవస్ధ లేదా? ఫోన్ ట్యాపింగ్ నడుస్తలేదా? ప్రతిపక్షనాయకుల ఫోన్ ట్యాప్ చేయడం లేదా?' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదని రేవంత్ రెడ్డి చెప్పగలడా? అని సవాల్ చేశారు.
Also Read: KTR: రైతుబంధు పాలన పోయింది రాబందు పాలన వచ్చింది: కేటీఆర్
'ట్యాపింగ్ నిజం అయితే అధికారులు ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టడం లేదా? ఇప్పుడున్న డీజీపీ కూడా అప్పుడు అధికారులుగా ఉన్నారు. అయనకు కూడా నిఘా వ్యవస్ధ గురించి తెలుసు. ఏ విధంగా నిఘా వ్యవస్ధ పనిచేస్తుందో ముఖ్యమంత్రికి అధికారులు చెప్పరు. వారికున్న నిబంధనల మేరకు ఎలాం సమాచారం వస్తుందో కూడ సీఎం అడగరు' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. 'ఈ సిట్ వంటి డ్రామాలతో ఎన్ని రోజులు ప్రజల దృష్టిని తప్పిస్తారు. ఈ అటెన్షన్ డైవర్షనతో ఎన్ని రోజులు కాలం వెల్లదీస్తారు? ఇన్ని సిట్‌లు, విచారణలు, కేసుల పేరుతో సాధించింది ఏమిటి?' అని కేటీఆర్ ప్రశ్నించారు.
కనీసం ఒక్క దాంట్లో అయినా నిజం ఉందని తేలిందా? అని కేటీఆర్ నిలదీశారు. 'ప్రజలు ఈ డైవర్షన్లను గ్రహిస్తున్నారు. అందుకే మాకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు మాకు ఒటు వేశారు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన రాదు అని తేలిపోయింది. కాంగ్రెస్ అప్పుల ప్రచారం కూడా ప్రజలు నమ్మడం లేదు. కాగ్ లెక్కలు నిజాల కూడా ప్రజలకు తెలుసు. 24 నెలల్లో చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పుతో ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Dmart: డీమార్ట్..ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది తక్కువ ధరలకు వస్తువులు లభిస్తాయని. సామాన్యుల నుంచి మధ్య తరగతి వరకు అందరూ డీమార్ట్ లోనే షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ప్రతిరోజూ అనేక రకాల వస్తువులపై డిస్కౌంట్లు, ఆఫర్లు లభిస్తాయి. అంతేకాదు అన్ని రకమైన వస్తువులు, ఇతర సూపర్ మార్కెట్ల కంటే తక్కువ ధరలకు లభిస్తాయి. మార్ట్ మొత్తం తిరుగుతూ అవసరమైన వస్తువులన్నీ ఒకేచోట కొనుగోలు చేయవచ్చు. దీన్ని క్యాష్ చేసుకున్న డీమార్ట్ దేశవ్యాప్తంగా మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తక్షణ లాభాలకన్నా దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెట్టి భారీ స్టోర్ విస్తరణను కొనసాగిస్తోంది. జియో మార్ట్, బ్లింకెట్ వంటి యాప్స్ దూకుడు చూపిస్తున్న వేళ డీమార్ట్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని.. CLSA నివేదిక పేర్కొంది.
CLSA ఇండియా విడుదల చేసిన తాజా వీకెండర్ ఆల్ థింగ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. భారతీయ రిటైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న డీమార్ట్ (DMart) తక్షణ లాభాలకన్నా దీర్ఘకాలిక వృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం సంస్థ భారీ స్థాయిలో స్టోర్ విస్తరణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ దూకుడు విస్తరణ వల్ల సమీప కాలంలో కంపెనీకి పెద్దగా ఫ్రీ క్యాష్ ఫ్లో లభించకపోవచ్చని నివేదిక పేర్కొంది.
డీమార్ట్ ప్రస్తుతం వేగవంతమైన విస్తరణ దశలో ఉందని CLSA రిపోర్టు పేర్కొంది. కంపెనీ ప్రతి ఏడాది సుమారు 15 నుంచి 20 శాతం వరకు కొత్త స్టోర్లు కొత్త ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. రిటైల్ రంగంలో విస్తరణ ప్రారంభ దశలో ఉన్న పెద్ద సంస్థలకు ఇది సాధారణమైన వ్యూహమేనని నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం డీమార్ట్ మేనేజ్‌మెంట్‌కు దాదాపు 2,200 స్టోర్లు ఏర్పాటు చేయాలన్న ప్లాన్ లో ఉన్నట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. కంపెనీ స్వల్పకాలిక ఫ్రీ క్యాష్ ఫ్లో తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాల్‌మార్ట్, కాస్ట్‌కో వంటి దిగ్గజ సంస్థలను పరిశీలిస్తే.. స్టోర్ విస్తరణ వేగం తగ్గి అది సాధారణ స్థాయికి చేరుకున్నప్పుడు క్యాష్ ఫ్లో గణనీయంగా మెరుగుపడుతుందని CLSA నివేదిక చెబుతోంది.
పోటీకి ఎదురొడ్డి నిలవడానికి డీమార్ట్ తన ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఉత్పత్తుల ధరలు పేరొందిన బ్రాండ్‌లతో పోలిస్తే 40 నుంచి 50 శాతం వరకు తక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే బ్రాండెడ్ ఉత్పత్తుల ధరలో మూడో వంతు మాత్రమే ఉండడం డీమార్ట్‌కు పెద్ద ప్రయోజనంగా మారుతోంది. ఇక స్పీడ్ డెలివరీ కోసం క్విక్ కామర్స్ యాప్‌ల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. 2035 నాటికి ఈ సేవలు పట్టణ వినియోగంలో 20 శాతం కంటే తక్కువగానే ఉంటాయని CLSA అంచనా వేస్తోంది. దీని వల్ల డీమార్ట్ వంటి భౌతిక దుకాణాలకు భవిష్యత్తులో కూడా మంచి డిమాండ్ కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల పనితీరును కూడా ఈ నివేదిక విశ్లేషించింది. డిసెంబర్ 8తో ముగిసిన వారంలో జియోమార్ట్ వారపు యాక్టివ్ యూజర్ల సంఖ్యలో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. దాని తర్వాత స్థానంలో బ్లింకిట్ నిలిచింది. చాలా వరకు ప్రధాన ఈ-కామర్స్ యాప్‌లకు యూజర్లు తగ్గినప్పటికీ.. మీషో మాత్రం తన యూజర్ బేస్‌ను పెంచుకుని 169.8 మిలియన్లకు చేరుకుంది.
ఫుడ్, కిరాణా డెలివరీ రంగంలో పోటీ మరింత తీవ్రంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఫుడ్ డెలివరీలో జొమాటో, స్విగ్గీ ప్రధాన పోటీదారులుగా కొనసాగుతుండగా.. క్విక్ కామర్స్ విభాగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ డిజిటల్ వృద్ధి ఉన్నప్పటికీ, డీమార్ట్ వంటి సంప్రదాయ రిటైలర్లు భవిష్యత్ లాభాల కోసం తమ భౌతిక స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించడంపైనే దృష్టి సారిస్తున్నారని CLSA నివేదిక తేల్చి చెప్పింది.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Hindustan Copper Share Price: సోమవారం భారత స్టాక్ మార్కెట్లు ప్రారంభం నుంచే మందకొడిగా ట్రేడ్ అయ్యాయి. ప్రధాన సూచీలు.. పెద్దగా కదలిక చూపకుండా.. పరిమిత శ్రేణిలోనే కొనసాగాయి. అయితే ఈ నమ్మది మార్కెట్ వాతవరణంలో కూడా హిందూస్థాన్ కాపర్ షేర్లు మాత్రం ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. ఉదయం ట్రేడింగ్ లో ఈ షేర్ ఒక్కసారిగా దాదాపు 11శాతం లాభపడింది. బీఎస్ఈలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో హిందూస్థాన్ కాపర్ షేర్ ధర రూ. 11.13శాతం పెరిగి రూ. 528.55 వద్ద ట్రేడ్ అవుతోంది.
అయితే హిందూస్థాన్ కాపర్ షేర్ల ర్యాలీ అనేది ఒక్కరోజుకే పరిమితం కాలేదు. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో గమనిస్తే.. ఈ షేర్ ధర దాదాపు 32శాతం మేర పెరిగింది. దలాల్ స్ట్రీట్ లో ఈ మధ్యకాలంలో అత్యధిక రాబడులు అందించిన షేర్లలో ఒకటిగా నిలిచింది. మొత్తం మార్కెట్ ఒత్తిడిలో ఉన్నా.. హిందూస్థాన్ కాపర్ షేర్లు బలంగా ముందుకు సాగడంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు.
ఇక ఈ బలమైన పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో రాగి ధరలు పెరగడమేనని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాగికి డిమాండ్ వేగంగా పెరుగుతుండటంతోపాటు సరఫరా పరిమితంగా ఉండటం వల్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ఫలితంగా రాగి భారీ స్థాయిలో పెరిగింది. ఈ పరిస్థితి హిందూస్థాన్ కాపర్ వంటి మైనింగ్, లోహ రంగ సంస్థలకు ప్రత్యక్ష లాభాలను తెచ్చిపెడుతోంది.
ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యుత్ ప్రసార నెట్ వర్క్స్, సౌరశక్తి ప్రాజెక్టులు..పెద్దెత్తున మౌలిక సదుపాయల అభివ్రుద్ధిలో కాపర్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ రంగాల విస్తరణలో రాగి డిమాండ్ మరింత పెరుగుతోంది. రాగి ధరలు పెరగడంతో హిందూస్థాన్ కాపర్ వంటి కంపెనీలకు కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గ్లోబల్ అంశాలతో పాటు, కంపెనీ అంతర్గతంగా చేపడుతున్న చర్యలు కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతున్నాయి. హిందుస్తాన్ కాపర్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంపై, విస్తరణ ప్రణాళికలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది. ఉత్పత్తి పెరిగితే ఆదాయం, లాభదాయకత మెరుగవుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగానే పెట్టుబడిదారులు ఈ షేరుపై సానుకూల దృక్పథంతో ఉన్నారు.
ఇటీవలి ర్యాలీకి రిటైల్ పెట్టుబడిదారులతో పాటు సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి వచ్చిన బలమైన కొనుగోళ్లు కూడా కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బలమైన డిమాండ్, స్థిరంగా కొనసాగుతున్న గ్లోబల్ రాగి ధరలు, కంపెనీ విస్తరణ ప్రణాళికలపై ఉన్న అంచనాలు కలిసి హిందుస్తాన్ కాపర్ షేర్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. లోహ రంగంపై సానుకూల సెంటిమెంట్ కొనసాగితే.. అంతర్జాతీయ మార్కెట్లలో రాగి ధరలు బలంగా ఉంటే.. హిందుస్తాన్ కాపర్ షేర్లు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని లాభాలు సాధించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే.. ప్రపంచ మార్కెట్ పరిణామాలు లోహ ధరల్లో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడిదారులు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Silver Cobra Video Viral News: థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరంలో ఆహారం కోసం మాంసం మార్కెట్‌లోకి సంచారం చేసిన సిల్వర్ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు చాండ్లర్స్ వైల్డ్ లైఫ్ అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియోలో కింగ్ కోబ్రా అత్యంత విచిత్రంగా ఉండడం నెటిజన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆహారం కోసం మాంసం మార్కెట్‌లో ఈ పాము హల్‌చల్ చేయడానికి సంబంధించిన ఘటన వైరల్‌గా మారింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నాగుపాములు అంటే ప్రజలు ఎంతగానో భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది వాటిని చూసి వణికిపోతారు. అలాంటిది బ్యాంకాక్‌లోని ఒక స్థానిక మాంసం మార్కెట్‌లో ఇప్పుడు ఓ వింతమైన సిల్వర్ కలర్ నాగుపాము దర్శనమిచ్చింది. అంతేకాకుండా ఈ పాము శరీరం వింతగా దగదగ మెరిపోవడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. అయితే, ఈ వీడియో చూసిన కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు ఇది కాలికో మర్ఫ్ మోనోక్లెడ్ కోబ్రా గుర్తించారు. ప్రకృతిలో ఇలాంటి పాములు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అందులో ఇది ఒకటని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు తెలుపుతున్నారు.
బ్యాంకాక్‌లోని ఈ పాము పాముల మాంసం విక్రయించే షాపుల సమీపంలోకే రావడం వల్ల అక్కడే ఉన్న కొంతమంది దీనిని పట్టుకుని చంపేందుకు ప్రయత్నించారు. అయితే, ఓ యుకుడు ఈ పామును వారి నుంచి కొనుగోలు చేసి, రెస్క్యూ చేసినట్లు తెలుస్తోంది. దీనికి అక్కడున్న కొంతమంది స్థానికులు కూడా ప్రశంసించినట్లు సమాచారం.. నిజానికి ఇలాంటి అరుదైన జీవులను రక్షించడం ప్రకృతికి చాలా మంచిదని.. వీటివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని కొంతమంది స్నేక్ క్యాచర్స్ తెలుపుతున్నారు.
ఈ సిల్వర్ కింగ్ కోబ్రా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండడం మీరు చూడొచ్చు. ఇది చూడడానికి చాలా బాగున్నప్పటికీ ఎంతో డేంజర్ అని కొంతమంది వన్యప్రాణి నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి పాములు అత్యంత దూకుడు స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి. అలాగే శక్తివంతమైన కింగ్ కోబ్రాలకు ఉండే విషమే వీటికి కూడా ఉంటుంది. కానీ ఇలాంటి కొన్ని పాములు మాత్రం స్వల్ప పరిమాణంలో విషాన్ని కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hindus Safety Muslim country: మనకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో.. హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు తరచుగా వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన దాడుల్లో ఒక హిందూ యువకుడు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు అక్కడి పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య.. ప్రపంచంలోనే ఒక ముస్లిం దేశం మాత్రం హిందువులకు అసాధారణ స్థాయిలో భద్రత, గౌరవం కల్పిస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది.ఆ దేశం ఏదో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.
హిందువులకు అత్యంత భద్రమైన ముస్లిం దేశం:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) హిందువులకు అత్యంత సురక్షితమైన ముస్లిం దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.ఇతర దేశాల్లో మైనారిటీలు భయం.. వివక్షను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నప్పటికీ.. UAEలో మాత్రం హిందువులు తమ మతాన్ని స్వేచ్ఛగా.. బహిరంగంగా ఆచరిస్తున్నారు. ఇక్కడ మత స్వేచ్ఛను కేవలం మాటలకే పరిమితం చేయకుండా.. కఠినమైన చట్టాల ద్వారా అమలు చేస్తున్నారు.
2023లో అమల్లోకి వచ్చిన ఫెడరల్ లా నంబర్ 34 ప్రకారం.. ఏ మతానికైనా వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం, మతపరమైన అవమానం లేదా వివక్ష ప్రదర్శించడం నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం హిందువులతో పాటు అన్ని మతాలకు సమానంగా రక్షణ కల్పిస్తుంది. నేరానికి పాల్పడిన వారికి భారీ జరిమానాలు, జైలు శిక్ష విధిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో కూడా ఈ చట్టం కఠినంగా అమలు అవుతుంది. దీనివల్ల UAEలో నివసిస్తున్న హిందువులకు భద్రతపై గట్టి నమ్మకం ఏర్పడింది.
అబుదాబి హిందూ దేవాలయం ..సహనానికి ప్రతీక:
UAEలో మత సహనానికి నిలువెత్తు నిదర్శనంగా అబుదాబిలోని BAPS హిందూ దేవాలయం నిలుస్తోంది. ఫిబ్రవరి 2024లో ప్రారంభమైన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది. అంతకుముందే, దుబాయ్‌లోని జెబెల్ అలీ హిందూ దేవాలయం 2022లో ప్రారంభమై ప్రతిరోజూ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. అంతేకాదు.. బుర్ దుబాయ్‌లోని శ్రీ కృష్ణ దేవాలయం 1958 నుంచే కొనసాగుతూ రావడం.. UAEలో హిందూ ఆరాధనకు దశాబ్దాలుగా ఉన్న అంగీకారాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
ప్రభుత్వ విధానాల్లో సహజీవనానికి ప్రాధాన్యం:
ప్రపంచంలోనే సహనం, సహజీవనానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఏకైక దేశం UAE. వివిధ మతాలు, సంస్కృతులు కలసి జీవించాలనే దృక్పథంతో ప్రభుత్వం పనిచేస్తోంది. 200కి పైగా దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తున్న UAEలో ఐక్యతను పెంపొందించేందుకు 2025 సంవత్సరాన్ని కమ్యూనిటీల సంవత్సరంగా ప్రకటించారు.
హిందువుల పండుగలను కూడా ఇక్కడ అధికారికంగా.. బహిరంగంగా జరుపుకుంటారు. దీపావళి, హోలీ, నవరాత్రి వంటి వేడుకలకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది. దీపావళి సందర్భంగా బుర్జ్ ఖలీఫా వంటి ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలను వెలుగులతో అలంకరించడం UAEలో మత గౌరవానికి ఇచ్చే విలువను ప్రతిబింబిస్తుంది.
భద్రతా సూచికల్లో UAE స్థానం:
ప్రపంచవ్యాప్తంగా భద్రతను అంచనా వేసే సూచికల్లో UAE ఎప్పటికప్పుడు అగ్రస్థానాల్లో నిలుస్తోంది. 2025 నంబియో భద్రతా సూచిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల్లో UAE ఒకటిగా నిలిచింది. దేశ జనాభాలో భారతీయుల వాటా దాదాపు 30 నుంచి 35 శాతం వరకు ఉండటం విశేషం. వ్యాపారం, నిర్మాణ రంగం, ఆరోగ్య సేవలు, ఐటీ, సేవా రంగాల్లో భారతీయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
మొత్తంగా.. మత భేదాలను దాటి సహజీవనాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా UAE ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తోంది. హిందువులకు భద్రత, గౌరవం కల్పించే ముస్లిం దేశంగా ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Harish rao fires on cm revanth reddy govt on employees benefits: తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మొత్తంగా అసెంబ్లీలో సమావేశాలు ప్రస్తుతం వాడి వేడిగా జరుగుతున్నాయి. అయితే.. హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. పెండింగ్ డీఏ హైక్ లు, పీఆర్సీ హైక్ ల జాప్యంపై మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన హరీష్ రావు
పోలీసులకు అనేక సరెండర్ లీవులు, డీఏలు, టీఏలు పెండింగ్ ఉన్నాయి, వారికి రావాల్సిన ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది
రిటైర్డ్… pic.twitter.com/rWw1me8oB8
— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025
అంతే కాకుండా.. రెండెళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వారికి అందాల్సిన బెనిఫిట్ ల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హమీలు ఇంకా అమలులో జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో కేసీఆర్ హయాంలో పీఆర్సీ 43.39 శాతం ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి రెండెళ్ల నుంచి ఆరు డీఏలు పెండింగ్ లో పెట్టారని, పీఆర్సీ, ఆరోగ్య స్కీమ్ లను అమలుచేయలేదన్నారు.
అదే విధంగా జీపీఎఫ్ బకాయిలు అలానే ఉన్నాయన్నారు. ఇటీవల 39 మంది రిటైర్డు ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ అందక సరిగ్గా వైద్యం చేయించుకోలేక చనిపోయారన్నారు. చాలా మంది ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు నరకం అనుభవిస్తున్నారంటూ హరీష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
గతంలో.. సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్ గా మారుస్తామన్నారు. అదే విధంగా రాష్ట్రం ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రీబ్యూషన్ కూడా ఏమిచేయలేదన్నారు. పోలీసుల సరెండర్ లీవ్ లు, స్టేషన్ అలవెన్సులు, టీఏల విషయంలో ప్రభుత్వం ఇంకా పట్టించుకోవడంలేదన్నారు. గతంలో ఎప్పటికప్పుడు ఉద్యోగులకు, రిటైర్డు అయిన వారికి పెండింగ్ బకాయిలు జారీచేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Railway stocks: గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో రైల్వే రంగానికి చెందిన స్టాక్స్ స్టాక్ మార్కెట్‌ను షేక్ చేశాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే PSU షేర్లు ఒక్కసారిగా జోరుగా పరుగులు పెట్టాయి. ముఖ్యంగా RVNL, IRFC, IRCON, RailTel, Texmaco Rail వంటి కంపెనీల షేర్లు పెట్టుబడిదారులకు తక్కువ సమయంలోనే డబుల్ డిజిట్ రాబడులు అందించాయి. ఐదు రోజుల్లోనే ఈ స్టాక్స్ 20 శాతం నుంచి 26 శాతం వరకు లాభాలను నమోదు చేయడం మార్కెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఈ ర్యాలీలో ముందంజలో నిలిచింది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL). ఈ కంపెనీ షేరు ధర సుమారు రూ. 306 స్థాయి నుంచి రూ. 387.25 వరకు ఎగబాకింది. అంటే కేవలం ఐదు సెషన్లలోనే 26.5 శాతం లాభం. ఇదే సమయంలో IRFC షేరు రూ. 110.81 నుంచి రూ.133.60కి చేరి దాదాపు 20 శాతం రాబడిని ఇచ్చింది. IRCON ఇంటర్నేషనల్ కూడా రూ.150 నుంచి రూ.178.25 వరకు పెరిగి సుమారు 19 శాతం లాభాన్ని నమోదు చేసింది. వీటితో పాటు RailTel, Texmaco Rail, IRCTC షేర్లలో కూడా కొనుగోళ్ల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.
అయితే.. ఇక్కడ ఒక కీలక ప్రశ్న ఏంటంటే.. కంపెనీల ప్రాథమిక అంశాల్లో పెద్ద మార్పులు లేనప్పటికీ రైల్వే స్టాక్స్ ఎందుకు ఇంత వేగంగా పెరిగాయి? మార్కెట్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ర్యాలీకి ప్రధాన కారణం కంపెనీల ఫండమెంటల్స్ కంటే మార్కెట్ సెంటిమెంట్‌లో వచ్చిన మార్పే . గత ఏడాది అధిక విలువలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా రైల్వే స్టాక్స్ తీవ్రంగా పడిపోయాయి. ఆ దిద్దుబాటు తర్వాత ఇప్పుడు పెట్టుబడిదారులు ఈ రంగంలో కొత్త అవకాశాలను వెతుకుతున్నారు.
ఇక మరో కీలక అంశం బడ్జెట్ ముందు ఏర్పడిన అంచనాలు. ఫిబ్రవరి 2026లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రైల్వే మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తారనే ఆశలు మార్కెట్‌లో బలంగా ఉన్నాయి. నెట్‌వర్క్ విస్తరణ, కొత్త కోచ్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, భద్రతా అప్‌గ్రేడ్‌లు, ఆధునీకరణ వంటి ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు ఉంటాయనే భావన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోంది. చరిత్రలోనూ బడ్జెట్ ముందు రైల్వే స్టాక్స్ బలంగా ర్యాలీ చేసిన సందర్భాలు ఉన్నాయి.
దీనికి తోడు.. FY26లో రెండో దశ ప్రయాణీకుల ఛార్జీల పెంపు కూడా తక్షణ ఉత్సాహానికి కారణమైంది. డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఛార్జీల పెంపు ప్రయాణ తరగతిని బట్టి కిలోమీటరుకు 1 నుంచి 2 పైసల మేరే అయినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 600 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇది రైల్వే ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందనే సంకేతంగా మార్కెట్ భావిస్తోంది.
అయితే.. ఈ ర్యాలీ మధ్య పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న లాభాలు ఎక్కువగా అంచనాలు, భావోద్వేగాల ఆధారంగా నడుస్తున్నాయని వారు చెబుతున్నారు. దీర్ఘకాలంలో నిజమైన రాబడులు రావాలంటే బడ్జెట్‌లో వచ్చే వాస్తవ కేటాయింపులు, ప్రాజెక్టుల అమలు వేగం, నగదు ప్రవాహం, ఛార్జీల సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, తక్షణ లాభాలకే ఆకర్షితులవకుండా, కంపెనీల ప్రాథమిక బలాలు మరియు అమలు సామర్థ్యాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మేలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Gold Rate Today: మన దేశానికి ప్రతి ఏడాది భారీ మొత్తంలో బంగారం దిగుమతి అవుతుంది. ఏడాది పొడవునా బంగారం కొనుగోళ్లు కొనసాగుతుంటాయి. భారతీయుల జీవితంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. వందల ఏళ్లుగా బంగారు ఆభరణాలు ధరించే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో ఆభరణాలకే కాకుండా.. పెట్టుబడి సాధనంగా కూడా బంగారంపై ఆసక్తి గణనీయంగా పెరిగింది.
అయితే 2025లో బంగారం ధరలు ఊహించని స్థాయిలో దూసుకుపోతున్నాయి. గత కొన్ని నెలలుగా పసిడి ధరలు కొత్త కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ అంశాలు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా విధిస్తున్న సుంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
ఇటీవల ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు బలపడటంతో గత వారం రోజులుగా బంగారం ధరలు వేగంగా పెరిగాయి. అయితే వరుస పెరుగుదల తర్వాత ఈ వారం ప్రారంభంలో ధరలు కొంత శాంతించాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 18 డాలర్లకు పైగా పడిపోయింది. దాదాపు 0.41 శాతం మేర తగ్గడంతో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,501 డాలర్ల వద్దకు దిగివచ్చింది. మరోవైపు వెండి ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 76.88 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.
ఈ అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర తులంపై ఏకంగా రూ.7,040 పెరిగింది. అయితే వరుస పెరుగుదల తర్వాత ఈరోజు ధరల్లో స్వల్ప ఊరట కనిపించింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,220 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,450గా ఉంది.
వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగానే ఉన్నాయి. నిన్న ఒక్కరోజులోనే కిలో వెండిపై రూ.20,000 పెరిగి ఆల్‌టైమ్ హై స్థాయిని తాకిన వెండి, ఈరోజు అదే ధర వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,74,000గా నమోదైంది.
పసిడి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం దేశీయ ధరలకు ప్రధాన కారణంగా మారింది. అమెరికాలో గత శుక్రవారం బంగారం ధర ఒక ఔన్స్ (సుమారు 31.2 గ్రాములు) 4,530 డాలర్ల స్థాయిని తాకి ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని రాయిటర్స్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయంగా నమోదైన ఈ రికార్డు ప్రభావం భారత మార్కెట్‌పై నేరుగా పడింది.
ఇదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అంచనాలు కూడా బంగారానికి మద్దతుగా మారాయి. 2026లో కూడా వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న వార్తలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించబోయే కొత్త ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ వడ్డీ రేట్ల విషయంలో సాఫ్ట్ దృక్పథం కలిగి ఉంటారన్న అంచనాలు కూడా పసిడి ధరలను మరింత బలపరిచాయి.
డాలర్ పతనం, ఆర్థిక మందగమనం ప్రభావం:
అమెరికా డాలర్ విలువ భారీగా తగ్గడం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు. 2020 సంవత్సరంలో డాలర్ ఇండెక్స్ దాదాపు 9 శాతం మేర నష్టపోయింది. 2017 తర్వాత ఇదే అతిపెద్ద పతనంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్ బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం చౌకగా కనిపిస్తుంది. దీంతో అనేక దేశాలు బంగారం కొనుగోళ్లను పెంచుతాయి. ఈ డిమాండ్ పెరుగుదల ధరలను మరింత పైకి నెట్టేస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం సంకేతాలు కనిపించడం కూడా పసిడి ధరలకు అనుకూలంగా మారింది. ఉద్యోగాల తగ్గుదల, వ్యాపార వృద్ధి మందగిస్తుందన్న అంచనాలతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉంటూ సురక్షిత పెట్టుబడులైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
వెండి ధరలు కూడా రికార్డుల బాట:
బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు భారీ నష్టాలను ఎదుర్కొనడం, ప్రపంచవ్యాప్తంగా మెటల్ మార్కెట్‌లో బలమైన డిమాండ్ ఉండటంతో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. వెండితో పాటు ప్లాటినం వంటి ఇతర విలువైన లోహాల ధరలు కూడా పెరుగుతున్నాయి. కిలో వెండి ధర రూ.2.50 లక్షలు దాటడం దేశీయ బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత గరిష్ట స్థాయిగా నిపుణులు పేర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Tirumala Lands: తిరుపతి అలిపిరి సమీపంలోని దేవలోక్ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) చెందిన పవిత్ర భూములను కార్పొరేట్ హోటల్‌కు కేటాయించడం ఘోర అపచారంగా సీపీఐ జాతీయ నాయకుడు కె. నారాయణ విమర్శించారు. దేవస్థానం భూములను కాపాడిన ఫలితంగానే నేడు ఆ భూములు విద్యాలయాలు, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అలాంటి భూములు ఇప్పుడు కార్పొరేట్‌లకు అప్పగించడాన్ని తప్పుబట్టారు.
తిరుపతి అలిపిరి సమీపంలోని దేవలోక్ వద్ద ఒబెరాయ్ హోటల్‌కు కేటాయించిన భూమిని ఆదివారం సీపీఐ పార్టీ నాయకులతో కలిసి కె. నారాయణ పరిశీలించారు. భూమి వివరాలు ఆరా తీసి ఇక్కడ హోటల్ కట్టరాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతి అలిపిరి వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణంపై తమ అభ్యంతరాలను నారాయణ స్పష్టంగా వెల్లడించారు.
Also Read: KCR In Assembly: తెలంగాణ అసెంబ్లీ షెడ్యూల్ ఇదే!.. అసెంబ్లీకి కేసీఆర్ సారూ వచ్చేస్తున్నాడు
ఈ భూమంతా పూర్తిగా టీటీడీ పరిధిలోదేనని.. నేరుగా ఇవ్వలేక టూరిజం లేదా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు ఇచ్చినట్లు చూపించి, అక్కడి నుంచి ఒబెరాయ్ హోటల్ గ్రూప్‌కు సుమారు 25 ఎకరాలు కేటాయిస్తున్నారని కె. నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ధర ఎంత, లంచాలు ఎంత అన్నది పక్కనపెడితే.. అసలు దేవస్థానానికి చెందిన భూమిలో స్టార్ హోటల్ ఎలా కడతారని ప్రశ్నించారు. స్టార్ హోటల్ అంటే పబ్‌లు, బార్లు, మాంసాహారం ఉంటాయని, ఇలాంటి వాటిని దేవుడు ఒప్పుకుంటాడా అని నిలదీశారు.
Also Read: Drugs Case: పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? బండి సంజయ్ ఆగ్రహం
స్టార్ హోటల్‌కు అలిపిరిలో భూమి కేటాయింపు నిర్ణయం తీసుకునే హక్కు టీటీడీ బోర్డుకు ఉందా? లేక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉందా? అని నారాయణ ప్రశ్నించారు. దీనికి అసలు రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉందని తమకు స్పష్టమవుతోందని విమర్శించారు. ఢిల్లీ కార్పొరేట్ కంపెనీల అధిపతులు.. వారికి మద్దతుగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సంబంధం లేకుండా ఇలాంటి నిర్ణయాలు జరగవని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు తిరుపతిలోనే చదువుకుని, ఈ ప్రాంతాన్ని బాగా తెలిసిన వ్యక్తి అని నారాయణ తెలిపారు. దేవుడిపై నిజమైన భక్తి ఉంటే ఇలాంటి పవిత్ర భూమిని కార్పొరేట్ హోటల్‌కు ఇచ్చే ఆలోచన రాదని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతిని కార్పొరేట్ పరం చేయరాదని.. ఇక్కడ హోటల్ నిర్మాణం ఆపివేయాలని నారాయణ డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Congress Loots Telangana: తన ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ పోరాడి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణను చేస్తే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దోచుకుంటోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చిన ఘనత రేవంత్‌కే దక్కుతుందని ప్రకటించారు. పాలమూరు నీళ్ల కోసం కేసీఆర్ పోరాటానికి సిద్ధమని తెలిపారు. రైతు బంధు పోయి రాబంధు పాలన వచ్చిందని.. యూరియా క్యూలైన్లే దీనికి నిదర్శనం అని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్‌పై కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని.. దీంతో కాంగ్రెస్–బీజేపీ చీకటి స్నేహం బయటపడిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
నాగర్ కర్నూల్ సభలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని తెలిపారు. 'తట్టెడు మట్టి కూడా తీయకుండా నికృష్టపు మాటలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెసోళ్లు పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చారు' కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను పండబెట్టి పాలమూరు జిల్లాను ఎండబెట్టారని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేశామని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టును పండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి రాజీ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకుని రైతులకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని.. ఆయన చేయబోయే ఈ పోరాటానికి పాలమూరు బిడ్డలంతా అండగా నిలబడాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
కమీషన్ల మీద ఉన్న ప్రేమ రేవంత్ రెడ్డికి రైతుల మీద లేదని.. ఈ సమయంలో ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతు బంధు పాలన పోయి రేవంత్ రాబంధు పాలన వచ్చిందని ఎద్దేవా చేశారు. రైతులు యూరియా బస్తాల కోసం కాళ్ల మీద పడి గోస పడుతున్నారని, చలిలో చెప్పులు క్యూలైన్‌లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. రేవంత్‌కు రైతుల పట్ల ప్రేమ లేదని, కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని వచ్చాయని గుర్తు చేశారు.
రేవంత్ ఎక్కడికి పోయినా కేసీఆర్ మీద ఏడుపే కనిపిస్తోందని.. రేవంత్ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే రేపోమాపో కరుస్తాడేమో అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. దమ్ముంటే యూరియా బస్తాలు దొరికేలా చేస్తా అని రేవంత్ రెడ్డి శపథం చేయాలని, రూ.4000 పెన్షన్ ఇస్తానని శపథం చేయాలని సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేస్తున్నారని.. కేసీఆర్ కంటే అన్ని ఎక్కువిస్తామని ఆశ పెట్టారని, హామీల అమలు ఏమైందని నిలదీస్తే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారని వెల్లడించారు. పథకాలు అడిగితే రేవంత్ బూతులు మాట్లాడుతున్నాడని, మహాలక్ష్మి పథకం ఏమైందంటే గుడ్లు పీకి గోటీలాడతానంటున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామాలను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, వైకుంఠధామాలు కట్టారని, డంప్ యార్డ్‌లు నిర్మించారని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రతి గ్రామాన్ని దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ అని గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
LIC New Jeevan Shanti: ఉద్యోగం, వ్యాపారం ఇలా జీవితాంతం కష్టపడి ఎన్నో బాధ్యతలను భుజాన వేసుకుని డబ్బు సంపాదించేవారు ఎంతో మంది ఉన్నారు. పెళ్లి, పిల్లలు, కుటుంబం, పిల్లలు చదువు, పెళ్లిళ్లు ఇలా సంపాదించిన డబ్బంతా ఖర్చు అవుతుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తు ఏంటి? వయస్సు ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు.. వయస్సు మీద పడిన తర్వాత ఆర్థిక కష్టాలు రాకుండా ఉండేందుకు చాలా మంది పలు రకాలుగా పెట్టుబడి పెడుతుంటారు. మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ ప్లాన్ ఒకేసారి పెట్టుబడి పెడితే జీవితాంతం పెన్షన్ లభిస్తుంది. అదే ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పథకం. ఈ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే నెల నెలా చేతికి డబ్బు అందుతుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ అందించే స్కీములపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుంది. భద్రతతోపాటు స్థిరమైన రాబడి కోరుకునేవారికి న్యూ జీవన్ శాంతి స్కీమ్ ప్రత్యేకంగా రూపొందించింది ఎల్ఐసీ. రిటైర్మెంట్ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే విధంగా ఈ స్కీమ్ పనిచేస్తుంది.
LIC న్యూ జీవన్ శాంతి అంటే ఏమిటి?
ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ఒక డిఫర్డ్ యాన్యుటీ పెన్షన్ ప్లాన్. అంటే మీరు ఈ స్కీము తీసుకునే సమయంలో ఒకేసారి డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత నిర్ణీత కాలం తర్వాత లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. ఒకసారి పెన్షన్ ప్రారంభం అవుతే.. జీవితాంతం అంతే మొత్తాన్ని పొందుతారు. ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. పెన్షన్ ఎంత రావాలి.. ఏవిధంగా రావాలనే విషయాలను మొదట్లోనే నిర్ణయించుకోవచ్చు. ఆ తర్వాత మార్చుకునేందుకు అవకాశం ఉండదు. అందుకే ఇది రిటైర్మెంట్ అయిన వారికి మంచి భరోసానిస్తుంది.
5 సంవత్సరాల లాక్-ఇన్ తోపాటు రెండు పెన్షన్ ఎంపికలు:
ఈ స్కీములో 5ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఐదేళ్ల వరకు లాక్ లోనే ఉంటుంది. ఈ కాలం పూర్తి అయిన తర్వాత మీకు పెన్షన్ వస్తుంది.
ఈ ప్లాన్‌లో రెండు ఎంపికలు ఉన్నాయి:
- సింగిల్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ – ఒకే వ్యక్తికి జీవితాంతం పెన్షన్
- జాయింట్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ – దంపతుల కోసం, ఒకరు లేనప్పుడు మరొకరికి పెన్షన్ కొనసాగుతుంది
- మీ అవసరాన్ని బట్టి ఈ రెండింటిలో ఏదైనా ఎంచుకోవచ్చు.
యాన్యుటీ ఎలా పని చేస్తుంది?
-ఈ పథకంలో పెన్షన్ జీవితాంతం వస్తుంది.
- సింగిల్ లైఫ్ ప్లాన్ తీసుకుని పాలసీదారు మరణిస్తే, పెట్టుబడి చేసిన మొత్తం నామినీకి చెల్లిస్తారు.
- జాయింట్ లైఫ్ ప్లాన్‌లో ఒకరు మరణించినా, రెండో వ్యక్తికి పెన్షన్ కొనసాగుతుంది. ఇద్దరూ మరణిస్తే, మొత్తం డబ్బు నామినీకి ఇస్తారు.
-అందువల్ల పెట్టుబడి చేసిన డబ్బు సురక్షితంగా ఉంటుంది.
వయోపరిమితి..ఇతర ముఖ్యమైన ప్రయోజనాలు:
ఈ పాలసీ తీసుకోవాలంటే.. కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 79 సంవత్సరాలుగా ఉండాలి. ఇందులో లైఫ్ రిస్క్ కవర్ ఉండదు. స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఈ పథకంలో మరో ముఖ్యమైన లాభం ఏమిటంటే:
-మీరు కావాలంటే పాలసీని మధ్యలో సరెండర్ చేయవచ్చు
-పెన్షన్‌ను నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షికంగా తీసుకోవచ్చు
రూ.1 లక్ష వార్షిక పెన్షన్ ఎలా వస్తుంది?
ఉదాహరణకు..55 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తి ఈ ప్లాన్‌లో సుమారు రూ. 11 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెట్టి, 5ఏళ్ల లాక్-ఇన్ పూర్తి చేసినట్లయితే వార్షికంగా సుమారు రూ. 1,01,880 పెన్షన్ వస్తుంది. అర్ధవార్షికంగా రూ.49,911..నెలవారీగా సుమారు రూ. 8,149 పెన్షన్ పొందవచ్చు. అలాగే, కనీసంగా రూ. 1.5 లక్షల పెట్టుబడితో కూడా సుమారు రూ. 1,000 హామీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం పొందాలనుకునేవారికి ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి స్కీమ్ ఒక సురక్షితమై.. నమ్మదగిన పెన్షన్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఒకేసారి ఇన్వెస్ట్ చేసి.. జీవితాంతం ఆదాయం పొందాలనుకునేవారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.