Operation Epic Fury Weapons: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ప్రపంచ సైనిక చరిత్రలోనే అత్యంత భారీ వైమానిక దాడుల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆపరేషన్‌లో అమెరికా తన అమ్ములపొదిలోని అత్యున్నత సాంకేతికత కలిగిన ఆయుధాలను ప్రయోగించింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఇరాన్‌లోని 2000కు పైగా వ్యూహాత్మక లక్ష్యాలను ధ్వంసం చేశారు. ఇందులో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివాసం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ప్రధాన కార్యాలయం కూడా ఉన్నాయి.
అమెరికా ఈ దాడుల కోసం అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, నిఘా పరికరాలను మోహరించింది. బి-2 స్టెల్త్ బాంబర్లు, ఎఫ్-22, ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్స్, ఎఫ్-18, ఎఫ్-16, శత్రు ట్యాంకులను ధ్వంసం చేసే ఎ-10 అటాక్ జెట్స్. ఇరాన్ ఎదురుదాడిని అడ్డుకోవడానికి థాడ్ (THAAD) యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్, పేట్రియాట్ క్షిపణులను వాడారు.
అలాగే ఎంక్యూ-9 రీపర్స్, లూకస్ డ్రోన్లు, ఆర్‌సీ-135 నిఘా విమానాలు, పి-8 మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా వినియోగించారు. నౌకాదళంలో అణుశక్తితో పనిచేసే విమాన వాహక నౌకలు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు వాడగా.. రవాణా కోసం సి-17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానాలు, ఆకాశంలోనే ఇంధనం నింపే రీఫ్యూయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు.
బి-2 స్టెల్త్ బాంబర్లు
ఈ ఆపరేషన్‌లో బి-2 స్టెల్త్ బాంబర్లు కీలక పాత్ర పోషించాయి. రాడార్లకు చిక్కకుండా భారీ బాంబులను చేరవేసే ఈ విమానాలు అమెరికాలోని వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి బయలుదేరి, దాడుల అనంతరం టెక్సాస్‌లోని డయిస్ ఎయిర్ బేస్‌కు చేరుకున్నాయి.
సైప్రస్‌లోని బ్రిటన్ స్థావరంపై ఇరాన్ దాడి చేయడంతో యూకే ప్రభుత్వం అమెరికాకు మద్దతుగా నిలిచింది. ఇరాన్ సమీపంలో ఉన్న తమ అత్యంత శక్తివంతమైన డియాగో గార్సియా సైనిక స్థావరాన్ని వాడుకోవడానికి అమెరికాకు అనుమతి ఇచ్చింది. ఈ బేస్ బి-2 స్టెల్త్ బాంబర్ల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనువైన రన్‌వేను కలిగి ఉండటం అమెరికాకు అదనపు బలంగా మారింది.
IRGC కోలుకోలేని దెబ్బ
గత 47 ఏళ్లలో దాదాపు 1000 మంది అమెరికన్ల మరణానికి కారణమైన IRGCని ఈ దాడులతో నిర్వీర్యం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. "ప్రస్తుతం IRGCకి కనీసం ఒక ప్రధాన కార్యాలయం కూడా మిగలలేదు" అంటూ ఎక్స్ (X) వేదికగా ఎద్దేవా చేసింది. అత్యాధునిక ఆయుధాలతో అమెరికా జరిపిన ఈ మెరుపు దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, మధ్యప్రాచ్యంలో అగ్రరాజ్యం పట్టును మరోసారి నిరూపించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Moto G57 Power 5g Price Cut Telugu: ప్రముఖ మొబైల్ కంపెనీ మోటరోలా నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్ విడుదలవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో లాంచ్ అయిన moto g57 power 5G స్మార్ట్‌ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. అయితే, ఇది ఇప్పుడు హోలీ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్‌లో భాగంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో? ఇది ఎలాంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మోటోరోలా (Motorola) నుంచి విడుదలైన moto g57 power 5G స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్స్ ను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది ఎంతో ప్రత్యేకమైన 6.72 అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే ఇది డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం చాలా ప్రత్యేకమైన Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రాసెసర్ వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచంలోనే మొట్టమొదటి Snapdragon 6s Gen 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకమైన 5జి కనెక్టివిటీ తో పాటు గేమింగ్, మల్టీ టాస్కింగ్ చేసేందుకు వీలుంటుంది.. కాబట్టి బాగా గేమ్స్ ఆడుకోవాలని ఈ మొబైల్ చాలా ఉపయోగపడుతుంది.
అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 7000 mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఫుల్ బ్యాటరీ చార్జ్ చేస్తే ఏకంగా రెండు నుంచి మూడు రోజుల వరకు ప్లే బ్యాక్‌ను అందిస్తుంది. ఇక కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం దీనికి 33W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక వెనక భాగంలోని కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇందులో వెనుక భాగంలో ఎంతో శక్తివంతమైన Sony LYTIA 600 సెన్సార్‌తో కూడిన 50 MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 8 MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో 8 MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. దీంతోపాటు లేటెస్ట్ Android 16 (Hello UI) ఆపరేటింగ్ సిస్టంతో లభిస్తోంది..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్
ప్రస్తుతం భారతదేశంలో ఈ మొబైల్ వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే (8GB/128GB) స్టోరేజ్ బేరియంట్ ధర మార్కెట్లో రూ.14,999గా ఉంది.. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఫ్లిప్‌కార్ట్ అనుసంధానే యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి.. రూ.1,600 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే సాధారణ ఎస్బిఐ బ్యాంకు తోపాటు హెచ్డీఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ చేసి.. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఏకంగా రూ.13 వేల బోనస్‌తో పాటు అదనంగా.. రూ.1 వెయ్యి బోనస్ కూడా లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.999 లోపే హోలీ సందర్భంగా సొంతం చేసుకోవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Moto G35 5g Price Cut In India Telugu: బడ్జెట్ ధరలో ఏదైనా మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశం గా భావించవచ్చు.. ఎందుకంటే హోలీ సందర్భంగా ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి రూ.10 వేల లోపే 5G స్మార్ట్ ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తుంది. ముఖ్యంగా మోటరోలా బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని ఒక మొబైలైతే, ఎప్పుడు పొందలేని స్పెషల్ ఆఫర్స్‌తో లభిస్తోంది. అయితే, ఏ మొబైల్ అత్యంత చీప్ ధరకు లభిస్తుందో? దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హోలీ సందర్భంగా Moto G35 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫీస్‌తో లభిస్తోంది.. అయితే, ఈ మొబైల్ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది 6.72-అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను కలిగి ఉండడమే కాకుండా చాలా ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్టుతో అందుబాటులో ఉంది. అలాగే ఈ మొబైల్ డిస్ప్లే ఎంతో శక్తివంతమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 (Corning Gorilla Glass 3) ప్రొటెక్షన్ సపోర్టుతో అందుబాటులో ఉంది. దీంతోపాటు ఇది చాలా ప్రత్యేకమైన Unisoc T760 (6nm) Octa-core Processor ప్రాసెసర్ తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్ మార్కెట్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళితే.. ఇందులోని వెనక కెమెరా 50MPతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అదనంగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 16 MP కెమెరాతో లభిస్తుంది. ఇక ఇది ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. అలాగే ఇది Android 14 (Hello UI) ఆపరేటింగ్ సిస్టంతో లభిస్తోంది. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన హైలెట్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ప్రీమియం వేగన్ లెదర్ (Vegan Leather) ఫినిష్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఇది చాలా ప్రత్యేకమైన Dolby Atmos సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ లభిస్తున్నాయి.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ ధర మార్కెట్‌తో రూ.12,999తో అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో హోలీ సందర్భంగా కొనుగోలు చేసే వారికి.. అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ ను వినియోగించు కొనుగోలు చేసే వారికి.. రూ.650 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా లభిస్తుంది. హోలీ సందర్భంగా మీ దగ్గర ఉన్న ఏదైనా పాత మొబైల్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తే.. ఏకంగా రూ.11 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.1,999 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరెన్నో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వాటన్నిటిని తెలుసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iran Israel War Telugu News: మిడిలిస్ట్ దేశాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గడ్డి హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.. అమెరికాతో తిరిగి చర్చలు జరిపే ఆలోచన తమకు లేదని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. అలాగే అతను మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను తెలియజేశారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గత కొన్ని రోజుల నుంచి ఇరాన్, అమెరికా మధ్య దౌత్య పరమైన సంబంధాలను మెరుగుపరచడానికి.. ఇరాన్ నుంచి చర్చల కోసం ప్రతిపాదనలు వెళ్లాయన్న వార్తలను ఇరాన్ దేశ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ తీవ్రంగా ఖండించారు. అమెరికాతో మేము చర్చలు కోరుకున్నామన్న. వార్తలు కేవలం కల్పితమేనని.. అలాంటి ప్రతిపాదనలు మా వైపు నుంచి అస్సలు వెళ్లలేదని.. అలాగే భవిష్యత్తులోనూ వెళ్లే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా తన వైఖరి మార్చుకోనంత వరకు సంప్రదింపులకు తావు లేదని ఆయన తేల్చి చెప్పారు..
ఈ సందర్భంగా ఆయన డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానంపై విరుచుకుపడ్డారు. ఇజ్రాయిల్ ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు పావులు కదపటం ప్రపంచానికే మంచిది కాదని విమర్శించారు. ఇజ్రాయిల్ ఆధిపత్యం కాంక్షను నెరవేర్చడానికి ట్రంప్ తన దేశ సైనికుల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నాడని.. తన అనాలోచిత నిర్ణయాలతో అమెరికా సైనికులను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.. ఇవే కాకుండా ఈ సందర్భంగా ఆయన వివిధ అంశాలపై కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.
Also Read: Iran -Israel - US War: ఇరాన్ భీకర దాడుల ఎఫెక్ట్.. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పారిపోయాడా..?
అమెరికా తన ఆకాంక్షల ద్వారా ఇరాన్ ను లొంగ తీసుకోవాలని చూస్తోందని.. కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన తెలిపారు.. అగ్రరాజ్యాధిపతి భ్రమలో బ్రతుకుతున్నారని.. బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గే దేశం ఇరాన్ కాదని.. వాస్తవ పరిస్థితులను గ్రహించకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాకే నష్టం చేకూరుస్తాయని.. ఆయన అన్నారు.. పశ్చిమ ఆసియాలో ఇజ్రాయిల్ దుందుడుగు చర్యలకు అమెరికా సత్తా పలకడాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంటుంది.
Also Read: Iran -Israel - US War: ఇరాన్ భీకర దాడుల ఎఫెక్ట్.. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పారిపోయాడా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
PCB Fines Pakistani Players: ఇటీవలే జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి పాకిస్థాన్ క్రికెట్ జట్టు వైదొలగిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆటగాళ్లపై రూ.50 లక్షల జరిమానా విధించినట్లు జాతీయ మీడియాలో వార్తాకథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీ ఈవెంట్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకోలేకపోవడంతో పాక్ జట్టులోని ఒక్కో ఆటగాడిపై రూ.50 లక్షల జరిమానా విధించినట్లు తెలుస్తోంది.
వెలువడిన కొన్ని నివేదికల ప్రకారం.. T20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్స్‌కు చేరుకోలేకపోవడం వల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ దేశ ఆటగాళ్లపై కొరడా ఝళిపించింది. ఒక్కో ఆటగాడు పాకిస్థాన్ కరెన్సీలో 50 లక్షల పాకిస్తానీ రుపియా అనగా భారత కరెన్సీ ప్రకారం ఒక్కో ఆటగాడు రూ.16.28 లక్షలను బోర్డుకు జరిమానా కట్టాల్సి ఉంది. అయితే టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలోనే టీమ్ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు ఓటమి పాలవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మ్యాచ్ ఓటమి కారణంగా టోర్నీలో గెలుపు ఆశలు చెమ్మగిల్లినట్లు వెల్లడించింది.
పాకిస్థాన్ జట్టు మరోసారి నాకౌట్ స్టేజ్‌కు చేరుకోలేకపోయింది. ఆ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కోసం ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, టీమ్ఇండియా సిద్ధమవుతున్నాయి. గ్రూప్ మ్యాచ్‌ల్లో పాక్ జట్టులో పోటీతత్వం కనిపించినా.. చివరికి ఓటమి పాలవ్వడం వల్ల నాకౌట్ దశకు చేరుకోలేకపోయిందని నివేదికలు అంటున్నాయి. సూపర్-8 దశలో కూడా తీవ్ర ఒత్తిడికి లోనయ్యి మ్యాచ్‌లను చేతులారా చేజార్చుకుందని చెబుతున్నాయి.
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. దీని వల్ల పాకిస్తాన్ జట్టు గెలుపు అవకాశాలు భారీగా కుప్పకూలిపోయాయి. ఒకవేళ ఆ మ్యాచ్ జరిగి ఉంటే ఫలితం వేరేలా ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అదిలా ఉండగా ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఓటమి పాలవ్వగా.. అప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకున్నట్లు అయ్యింది. చివరిగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రన్‌రేట్ ఆధారంగా గెలిచి ఉండాల్సింది. కానీ, లంక బ్యాటర్లు పాక్ సెమీస్ చేరే అవకాశాన్ని నీరుగార్చారు.
దీంతో టీ20 ప్రపంచకప్ మొత్తంగా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది. వారి ప్రదర్శన కారణంగా తీవ్ర అసంతృప్తి నడుము ఆటగాళ్లకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అయితే టోర్నీలో పాక్ ప్రయాణం ముగిసినప్పటికీ, టోర్నమెంట్ మొత్తం ప్రదర్శన నిరాశ కలిగించింది. సెమీ-ఫైనల్స్ చేరుకోలేకపోవడం ప్రపంచ వేదికపై ఆ జట్టు ప్రదర్శనల చుట్టూ పరిశీలనను తీవ్రతరం చేసింది. ఇప్పుడు ఆ జట్టు ఆటగాళ్లపై జరిమానా విధించడం పట్ల ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
B-2 Bomber Plane Telugu News: ప్రస్తుతమున్న యుద్ద తంత్రంలో టెక్నాలజీ కీలకమైన పాత్ర పోషిస్తుంది.. ఇదే అసలైన ఆయుధంగా మారింది.. శత్రువు కు కనబడకుండానే వారిని దెబ్బతీయడం యుద్ద నీతిలో అత్యున్నత స్థాయిగా అందరూ భావిస్తారు. ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ.. దశాబ్దాలుగా గగనతలంలో తిరుగులేని రారాజుగా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అమెరికాకు చెందిన బీటు స్పిరిట్ స్టెల్త్ బాంబర్.. ప్రపంచ రక్షణ చరిత్రలో ఇదొక అద్భుతంగా భావించవచ్చు.. ఈ విమానం కేవలం బాంబర్ మాత్రమే కాదు శత్రువుల పాలిట ఒక కంటికి కనిపించే మృత్యువుగా భావించవచ్చు..
B-2 బాంబర్ అతిపెద్ద బలం దాని స్టెల్త్ టెక్నాలజీ.. దీని అద్భుతమైన ఫ్లయింగ్ వింగ్ డిజైన్ కారణంగా రేడియో తరంగాలు దానిని తాకి తిరిగి వెళ్ళలేవు.. దీంతో ఆత్యాధునిక రాడార్లు కూడా దీని ఉనికిని అస్సలు గుర్తించలేవని యుద్ధ నిపుణులు చెబుతున్నారు.. ఆకాశంలో ఒక చిన్న పక్షుల మాత్రమే రాడార్స్ స్క్రీన్ పై కనిపిస్తూ.. నిశ్శబ్దంగా లక్ష్యాన్ని చేరుకోవడం దీని అసలైన ప్రత్యేకత.. అంతేకాకుండా శత్రువులపై గురి చూసి ఎక్కు పెట్టడమే దీని అసలైన పని.
ఈ యుద్ధ విమానం విధ్వంసానికి మారుపేరని యుద్ధ నిపుణులు చెబుతున్నారు.. దాదాపు 20 టన్నుల బరువున్న అనుబాంబులను ఇది ఎంతో సులభంగా మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా శత్రువుల బంకర్లను ఛేదించే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ వంటి భారీ బాంబులను కూడా ఇది ఎంతో సింపుల్ గా ప్రయోగిస్తుంది.. 50వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ.. భూమిపై ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో నేలమట్టం చేయగలుగుతుంది. అంతేకాకుండా ఎంతటి గమ్యానైనా చేరుకోగలుగుతుంది..
B-2 బాంబర్ పరిధి సామాన్యమైనది కాదని యుద్ద నిపుణులు తెలుపుతున్నారు. ఒక్కసారి ఇంధనం నింపితే ఏకధాటిగా 9,600 కిలోమీటర్ల వరకు సింపుల్‌గా ప్రయాణిస్తుంది.. గాలిలోనే ఇంధనాన్ని నింపుకునే సదుపాయం ఉండడంతో ప్రపంచంలో ఏ మూల ఉన్న లక్ష్యాన్ని అయినా.. అమెరికాలోని తన బేస్ నుంచి వెళ్లి ధ్వంసం చేసి తిరిగి రాగల సామర్థ్యం దీనికి ఉంటుంది.. అంతేకాకుండా గురి చూసి ఎక్కువ పెడితే తప్పకుండా అది ధ్వంసం అవ్వాల్సిందే.. శత్రువులకు బాంబు పడిన శబ్దం వినిపించే వరకు.. తమపై దాడి జరుగుతుందన్న విషయం కూడా తెలియదు.. అంతటి నిశ్శబ్ద విధ్వంసం దీని సొంతం..
Also Read: Iran -Israel - US War: ఇరాన్ భీకర దాడుల ఎఫెక్ట్.. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పారిపోయాడా..?
ఒక్కొక్క విమానం తయారీకి దాదాపు రెండు బిలియన్ డాలర్ల ఖర్చవుతుంది అంటే.. దీని విలువ అర్ధం చేసుకోవచ్చు ఎంత మొత్తం అని.. అమెరికా గగనతల ఆధిపత్యానికి వెన్నుముకగా నిలుస్తున్న బీటు స్పిరిట్ యుద్ధ రంగంలో టెక్నాలజీకి ఇదొక పరాకాష్టం.. అందుకే దీనిని ఆకాశంలో అజయ్ మృత్యుపాశం అని పిలుస్తారు..
Also Read: Iran -Israel - US War: ఇరాన్ భీకర దాడుల ఎఫెక్ట్.. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పారిపోయాడా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
AP Govt Teachers Salary Cut: ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఇకపై ఆలస్యంగా పాఠశాలలకు వస్తే మాత్రం వేతనాల్లో కోత పడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నాళ్లు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చేలా గ్రేస్ పీరియడ్ అవకాశం ఉంది. ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు జీతం కట్ చేస్తామని ప్రభుత్వం ఆదేశించింది. ఉపాధ్యాయుల హాజరు నిబంధనలను పాఠశాల విద్యా శాఖ కఠినతరం చేసింది.
Also Read: Free Bus Scheme: ఫ్రీ బస్సుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఉత్తర్వులు జారీ!
ఉపాధ్యాయులు పాఠశాలలకు ఉదయం 9 గంటల తరువాత వస్తే ఆలస్యంగా (లేట్ ఇన్) ప్రభుత్వం ఇకపై వేతనాల్లో కోత పడేలా విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల వెసులుబాటు సమయం (గ్రేస్ పీరియడ్) ఉన్నప్పటికీ అది నెలలో ఒకట్రెండు రోజులు మాత్రమేనని స్పష్టం చేసింది. ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం పాఠశాలకు వచ్చేవారు ఒంటి గంట లోపు రావాలని.. ఆ తర్వాత హాజరు నమోదు చేస్తే లేట్ ఇన్ అని వస్తుంది.
Also Read: Gold Fruad: మేడమ్ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు
ఉదయం పాఠశాలకు హాజరై.. మధ్యాహ్నం సెలవు పెట్టిన టీచర్లు మధ్యాహ్నం 12.30 గంటల కంటే ముందుగా ఔట్ టైం నమోదు చేస్తే వేగంగా వెళ్లిపోయినట్లు విద్యా శాఖ గుర్తించింది. ఉపాధ్యాయులు చేస్తున్న టీచర్లు అలా చేయకుండా జీతం నుంచి కోత పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. నెలలో రెండు రోజులు మాత్రమే ఇలా చేస్తే సరిపోతుంది. అంతకు మించి అలా చేస్తే ఉపాధ్యాయుల వేతనాల్లో కోత పడే అవకాశం ఉంది.
ప్రాథమిక పాఠశాలల్లో సాయంత్రం 3.30 గంటల కంటే ఒక నిమిషం ముందు, ఉప ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం 4 గంటల కంటే ఒక్క నిమిషం ముందు ఔట్ టైం నమోదు చేసినా అది ఏర్లీ ఔట్ పరిగణిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఎవరైనా ఉదయం ఇన్ టైమ్ నమోదు చేసి.. ఔట్ టైం నమోదు చేయకపోతే ఉదయం హాజరు నమోదు చేసిన వెంటనే పాఠశాల ప్రాంగణాన్ని విడిచి వెళ్లి పోయినట్లుగా పరిగణించింది. దీంతో ఉపాధ్యాయులు ఇకపై ఆలస్యంగా వెళ్లినా.. తొందరగా వెళ్లినా ఉపాధ్యాయులు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే జీతం కట్ అవుతుంది.
ప్రభుత్వ టీచర్ల ఆగ్రహం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వస్తే జీతం కట్ చేసే ప్రభుత్వం మరి తమ డిమాండ్లు, సమస్యలు పరిష్కారంలో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే చర్యలు తీసుకునే ప్రభుత్వం మరి ఆలస్యంగా ఇచ్చే జీతాలు, ఆలస్యంగా ఇచ్చే డీఏలు, ఆలస్యంగా ఇచ్చే ఐఆర్, ఆలస్యంగా ఇచ్చే పీఆర్‌సీ, ఆలస్యంగా ఇచ్చే ఏరియర్లు, ఆలస్యంగా ఇచ్చే మెడికల్ బిల్లులు, ఆలస్యంగా ఇచ్చే రిటైర్డ్ బెనిఫిట్స్ వీటికి ఎవరు బాధ్యులు? అని టీచర్లు నిలదీస్తున్నారు. ఇవన్నీ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ప్రభుత్వం ఇచ్చిన రోజు మాత్రమే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఉద్యోగులపై చర్యలు తీసుకునే నైతిక అర్హత ఉంటుందని ప్రభుత్వ టీచర్లు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Stock Market Middle East tensions: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, గ్లోబల్ ఇంధన ధరలు ఎగసిపడటం వంటి అంశాలు పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీశాయి. ఫలితంగా భారత ఈక్విటీ సూచీలు గణనీయంగా క్షీణించాయి.
ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఉదయం 9:25 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 1,048 పాయింట్లు పడిపోయి 80,238 స్థాయిలో కొనసాగింది. అదే సమయంలో నిఫ్టీ 50 సుమారు 307 పాయింట్లు తగ్గి 24,871 వద్ద ట్రేడ్ అయింది. ప్రీ-ఓపెనింగ్ సెషన్‌లోనే సెన్సెక్స్ సుమారు 2,700 పాయింట్లు, నిఫ్టీ 530 పాయింట్ల వరకూ క్షీణించడం పెట్టుబడిదారుల్లో ఆందోళనకు కారణమైంది. ఆ తరువాత కొంతమేర కోలుకున్నప్పటికీ నష్టాలు పూర్తిగా తగ్గలేదు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 80 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతున్నాయి. సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో ధరలు మరింత పెరిగే అవకాశమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా చమురు ఆధారిత రంగాలపై స్పష్టంగా కనిపించింది. విమానయాన రంగానికి చెందిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లు దాదాపు 5 శాతం మేర పడిపోయాయి. అలాగే మారుతీ సుజుకీ, ఏషియన్ పేయింట్స్ వంటి ప్రముఖ సంస్థల షేర్లు కూడా నష్టాల్లోనే కొనసాగాయి.
కరెన్సీ మార్కెట్‌లోనూ ఒత్తిడి కనిపించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 24 పైసలు తగ్గి 91.32 వద్ద ట్రేడ్ అయింది. విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కూడా మార్కెట్ భావోద్వేగాలను దెబ్బతీశాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో వారు సుమారు రూ.7,536 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఈ పరిణామాలు మొత్తం మీద మార్కెట్లలో అస్థిరతను పెంచుతూ పెట్టుబడిదారులను జాగ్రత్త వైఖరికి మళ్లిస్తున్నాయి.
Also Read: Gold Rate: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే ఛాన్స్…ఇరాన్ - అమెరికా యుద్ధం దెబ్బతో గోల్డ్, సిల్వర్ కొత్త రికార్డులు తాకుతాయా..? ఇన్వెస్టర్లు ఏం చేయాలి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rahu Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చితో పాటు మే నెలకు కూడా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మే 31 తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఛాయాగ్రహంగా చెప్పుకునే రాహువు శతభిషా నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు సంచారం కొన్నిసార్లు జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అంతేకాకుండా అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ రాహువు సంచారం చాలా కీలకమైంది గా చెప్పవచ్చు. ఈ సంచారం కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆ శుభ ఫలితాలకు బదులుగా.. అదృష్టం లభించబోతోంది. ముఖ్యంగా ఆయన రాశుల వారికి అనుకూలమైన ప్రయోజనాలు అన్ని కలుగుతాయి. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. అయితే, రాహువు నక్షత్ర సంచారంతో ఏ రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.
ముఖ్యంగా రాహువు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఆకస్మికతను లాభాలు కలుగుతాయి.. అవసరమైన ఖర్చులు కూడా పూర్తిగా తగ్గే ఛాన్సులు ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించడమే కాకుండా.. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు విదేశీ పర్యటనలు మంచి లాభాలు కూడా పొందుతారు. అలాగే కొన్ని పనుల్లో అద్భుతమైన విజయాలు పొందుతారు. చట్టపరమైన సమస్యలేవైనా ఉంటే ఈ సమయంలో ఆయా రాశుల వారు పరిష్కారం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి ఊహించని ప్రయోజనాలు:
కన్యా రాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహు అద్భుతమైన సానుకూలమైన ప్రయోజనాలను అందించబోతున్నాడు. ముఖ్యంగా వ్యాపారాల్లో లాభాలు పెరగడమే కాకుండా ఆర్థిక స్థితిలో చాలావరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాకాలంలో పెండింగ్లో ఉన్న అప్పులు కూడా ఈ సమయంలో తప్పకుండా తీర్చగలుగుతారు దీని వల్ల వీరికి ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలున్నాయి అలాగే విపరీతమైన శాంతి పెరుగుతుంది.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా రాహు ప్రభావంతో జీవితంలో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. ఆదాయం భారీ మొత్తంలో పెరగడం వల్ల అప్పులు తీర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి. అదనంగా ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వివాహం కాని వారికి కొత్త ప్రతిపాదనలు కూడా వస్తాయి.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు జీతాలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి. అలాగే ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. వ్యాపార భాగస్వాములకు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాస్తున్న వ్యక్తులకు మంచి మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. దీంతోపాటు ఆర్థికంగా జీవితంలో ముందుకు సాగుతారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Guru Aditya Raja Yoga Effect On Zodiac Telugu: మీనరాశిలో అరుదైన గ్రహాల సంయోగం జరగబోతోంది. ముఖ్యంగా గురు ఆదిత్య యోగం మార్చి 15న ఏర్పడబోతోంది. ఈ యోగం అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటి. దేవ గురు బృహస్పతి ప్రస్తుతం మీనరాశిలో సంచార దశలో ఉన్నాడు.. మార్చి 15వ తేదీన సౌర వ్యవస్థకు రాజుగా భావించే సూర్యుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తాడు.. ఫలితంగా సూర్యుడితో పాటు బృహస్పతి గ్రహాల కలయిక జరుగుతుంది. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన గురువు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగ ప్రభావం మొత్తం ఐదు రాశుల వారికి అనుగ్రహాన్ని అందించబోతోంది. కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ ఫలితాలను అందిస్తుంది.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి
చాలాకాలంగా మేషరాశి వారికి సానుకూలమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. సామాజిక హోదా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనులు చేసే వ్యక్తులకు పదోన్నతులు లభించబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.
మిథున రాశి
మిథున రాశి వారికి కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. గొప్ప పురోగతి లభించడమే కాకుండా. వ్యాపారవేత్తలకు ఆర్థిక లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా కొత్త కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా.. అద్భుతమైన పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వీరు కొన్ని రకాల నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా అద్భుతంగా విజయవంతం అవుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించే వ్యక్తులకు కూడా అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాలు చేస్తున్న వ్యక్తులకు మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా ఉన్నత విద్యా లేదా పరిశోధనల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఊపందుకుంటాయి.
వృశ్చిక రాశి
గురు ఆదిత్య రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి అద్భుతమైన శుభవార్త లభిస్తాయి. విద్యతో పాటు పిల్లలకు ఎన్నో రకాలు ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు పెరగడమే కాకుండా.. ఈ రాశి వారికి సృజనాత్మకత కూడా పెరుగుతుంది. అనుకున్న పనుల్లో ఊహించని ధన లాభాలు పొందుతారు.
మీనరాశి
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ శక్తివంతమైన రాజయోగంతో చాలావరకు కలిసి రాబోతోంది. మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడడమే కాకుండా.. ఆరోగ్య పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. సామాజిక ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Power Cut Today: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్.. ఫుల్ డీటెయిల్స్..!
Power Cut Today In Hyderabad: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యవసర నిర్వహణ పనులు, మరమ్మతుల కారణంగా మార్చి 2, సోమవారం రోజున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రధానంగా ఆసిఫ్‌నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మధ్యాహ్నం సమయంలో వేర్వేరు సమయాల్లో కరెంట్ కట్ చేయనున్నట్లు తెలిపారు.
విద్యుత్ అధికారులు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. ఆయా కాలనీల్లో కోతలు విధించే సమయాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు నీరజా కాలనీ, చిత్రా ఎన్‌క్లేవ్, అక్బర్ బాగ్, మహబూబ్‌గార్డెన్, గ్రామర్ కాలనీ ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు హకీంపేట, యూసఫ్ టేకి, మీరా కాలనీ, అల్ హసనత్ కాలనీ, మిలిటరీ ఏరియా, టోలిచౌకి, డీలక్స్ కాలనీ, దౌలత్ గుల్షన్ కాలనీ, నిజాం కాలనీ, బడేజా నకి నగర్, మందార్ రెస్టారెంట్, కేఎఫ్‌సీ పరిసర ప్రాంతాల్లో కరెంట్ ఉండదు.
ఇక మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నదీమ్ కాలనీ, జ్యా కాలనీ, ఎస్ఏ కాలనీ, ఆదిత్య నగర్, రాయల్ పార్క్, జమాలి కుంట, అరుణ కాలనీ, రాహుల్ కాలనీ, కులీకుతుబ్ షా నగర్, సఫా హోటల్, గ్రామర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మెహదీపట్నం మిలిటరీ ఏరియా, పిల్లర్ బస్తీ, దాని పరిసర ప్రాంతాల్లో కరెంట్ ఉండదు.
కాగా ఎండా కాలం దృష్ట్యా కరెంట్ వినియోగం పెరగనుంది. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, క్రిందికి వేలాడుతున్న కరెంట్ తీగలను సరిచేయడం, సబ్‌స్టేషన్ల మరమ్మతుల కోసం ఈ ముందస్తు కోతలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత పెరిగే లోపే ఈ పనులను పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో అంతరాయం లేని సరఫరాను అందించవచ్చని విద్యుత్ శాఖ భావిస్తోంది. మరిన్ని వివరాల కోసం లేదా ఏవైనా అత్యవసర ఫిర్యాదుల కోసం సంబంధిత ఏఈ లేదా విద్యుత్ శాఖ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.
Also Read: Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు మంగళ ఆదిత్య యోగం ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..!
Also Read: IND vs WI Live Score: విండీస్‌పై భారత్ ఎలా గెలిచింది..? ఏ ఓవర్‌లో ఏం జరిగింది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Ind vs WI T20 World Cup 2026 Highlights: టీ20 ప్రపంచకప్‌లో చివరి సూపర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్ పై భారత్ మరోసారి ఆధిపత్యం చలాయించింది. సెమీస్ చేరాలనుకుంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కరీబియన్లు పోరాడి ఓడి టోర్నీ నుంచి వైదొలగగా.. టీమిండియా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. టీ 20 ప్రపంచకప్ గెలవడానికి సెమీ ఫైనల్‌లో చేరాల్సిన మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. సంజూ శామ్ సన్ తుఫాను ఇన్నింగ్స్ తో ప్రత్యర్థి మెగా టోర్నీ నుంచి వైదొలిగింది. నాకౌట్‌లో ఓటమి లేకుండా ఆడిన భారత్.. సూపర్ 8లో మాత్రం ఒక ఓటమి, రెండు విజయాలతో టీ20 ప్రపంచకప్ సాధించడానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది.
AlsO Read: IND vs ZIM: చెపాక్‌లో భారత్ చేతిలో జింబాబ్వే చిత్తు.. టీ20 ప్రపంచకప్ సెమీస్ ఆశలు సజీవం
జింబాబ్వేను ఓడించి జోరు మీదున్న భారత జట్టు ఎలాగైనా ఓడించాలని కసితో ఆడింది. క్వార్టర్ ఫైనల్స్‌లాంటి ఈ మ్యాచ్ లో భారత్ అన్నింటా చక్కటి ప్రదర్శన కనబర్చింది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో లోపాలన్ని సరిదిద్దుకున్న టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో గత రికార్డులను భయాన్ని తుడిచిపెట్టేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి భారత జట్టు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
Also Read: Schools Holiday: విద్యార్థులకు పండగ మీద పండుగ.. మార్చిలో మొత్తం 13 సెలవులు
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లకు విండీస్ 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. తొలి పది ఓవర్లు పొదుపుగా ఆడిన విండీస్ బ్యాటర్లు ఓవర్లు ముగుస్తున్న కొద్దీ భారీగా పరుగులు తీశారు. తొలి ఆరంభం భారత్ పైచేయి సాధించగా.. ద్వితీయార్థం విండీస్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఇక పరుగులపరంగా చూస్తే.. కెప్టెన్ షాయ్ హోప్ 32 పరుగులతో పర్వాలేదనిపించగా.. రోస్టన్ చేజ్ చేసిన 40 పరుగులు విండీస్ బ్యాటర్‌లలో అత్యధిక స్కోర్. షిమ్రోన్ హెట్‌మెయిర్ 27 పరుగులతో కట్టుదిట్టంగా ఆడుతున్న సమయంలో బుమ్రా వికెట్ తీశాడు. రూథర్ ఫోర్డ్ తక్కువ స్కోర్ (14) చేయగా.. పావెల్ 34, జేసన్ హోల్డర్ 37 పరుగులతో రాణించారు.
భారత ఔలింగ్ మళ్లీ అదుపు తప్పిందని కనిపించింది. ప్రారంభ ఓవర్లు పొదుపుగా వేస్తూ వికెట్లు తీయకపోయినా పరుగులను కూడా నియంత్రించారు. కానీ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి చేతులెత్తేయడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. కుదుకున్న బ్యాటర్లను బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి ఔట్ చేశాడు. ఒక ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు.
భళా సంజూ శామ్‌సన్
టీ20 ప్రపంచకప్ సూపర్ 8 చివరి మ్యాచ్‌లో సంజూ శామ్‌సన్ అద్భుతంగా ఆడాడు. ఈ మెగాటోర్నీలో సంజూకు ఇదే భారీ ఇన్నింగ్స్. వరుస వైఫల్యాల తర్వాత విండీస్ మ్యాచ్‌లో గొప్ప ప్రదర్శన చేశాడు. వన్ డౌన్ వచ్చిన సంజూ శామ్‌సన్ ఆఖరు వరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఈ ప్రదర్శనతో జట్టులో తన స్థానం విలువ ఏమిటో సంజూ చూపించాడు.
విండీస్‌పై భారత్ ఆధిపత్యం
వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో రెండు జట్లు తలపడగా.. విండీస్ మూడుసార్లు గెలుపొందగా.. భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. చివరిసారి 2016 వరల్డ్ కప్ సెమీస్‌లో తలపడి వెస్టిండీస్ గెలుపొంది ఫైనల్‌కు చేరగా.. తాజాగా సూపర్ 8లో ఓడిపోయి ఇంటికి వెళ్లగా.. భారత జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
Also Read: B Naidu Videos: అశ్లీల వీడియోలు నావి కావు.. అవి ఫేక్ డీప్ వీడియోలు: టీటీడీ చైర్మన్ నాయుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Karimnagar: తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పంచాయతీలను ఏకం చేస్తే తాను ప్రత్యేకంగా నిధులు ఇస్తానని చెప్పిన మాట ప్రకారం బండి సంజయ్ నిధులు ఇచ్చారు. తాను మాట నిలబెట్టుకున్నానని.. ఇక కాంగ్రెస్‌ను, రేవంత్ రెడ్డిని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులేవి? అని ప్రశ్నించారు. హామీలిచ్చి మోసం చేయడంలో రేవంత్ రెడ్డి రికార్డు సృష్టిస్తున్నాడని ఎద్దేవా చేశారు.
Also Read: Schools Holiday: విద్యార్థులకు పండగ మీద పండుగ.. మార్చిలో మొత్తం 13 సెలవులు
ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సహకాన్ని ఇస్తానంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏకగ్రీవమైన పీచుపల్లి, విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీలకు తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సహక నిధులు విడుదల చేశారు. గ్రామస్తుల సమక్షంలో నిధులకు సంబంధించి ప్రతులను సర్పంచ్‌లకు అందజేశారు.
Also Read: Sharadha Peetham Lands: శారద పీఠం భూముల వివాదంపై తెలంగాణ మంత్రి వివరణ ఇదే!
అనంతరం విజయనగర్ కాలనీ గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రసంగం చేశారు. భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని ప్రకటించారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని.. వీటితోపాటు ప్రజల కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన 1,203 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.120.30 కోట్లు ఇవ్వాలని కోరారు. పంచాయతీ ఎన్నికలు ముగిసినా రేవంత్ రెడ్డి ఇంతవరకు నయాపైసా ఇయ్యలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
Also Read: TTD: బీఆర్ నాయుడు కాదు కామనాయుడు.. వెంటనే రాజీనామా చేయాలి: టీటీడీ మాజీ చైర్మన్
హామీలిచ్చి మోసం చేయడంలో రేవంత్ రెడ్డి అందరినీ మించిపోయాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రోత్సాహక నిధులు ఎందుకు ఇవ్వడం లేదనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి రేవంత్ రెడ్డి చిల్లీగవ్వ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులివ్వాలని తిరిగి తిరిగి ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు
మాజీ సర్పంచుల బిల్లులతోపాటు గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రం ఇప్పటి వరకు పంచాయతీల అభివృద్ధి కోసం దశల వారీగా దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులు మంజూరు చేసిందని వెల్లడించా. ఆ నిధులతో కాస్తో కూస్తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
AP SSC Digital Automation 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. పరీక్షల ప్రక్రియలో అత్యంత పారదర్శకతను పెంచేందుకు, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ఈ ఏడాది 'డిజిటల్ ఆటోమేషన్' విధానాన్ని ప్రవేశపెట్టింది.
మార్చి 16, 2026 నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారుల కేటాయింపులో మానవ ప్రమేయం లేకుండా సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆటోమేషన్ విధానాన్ని అమలు చేస్తోంది.
డిజిటల్ కేటాయింపులు
చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు (DO), ఇన్విజిలేటర్ల నియామకాలను కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా యాదృచ్ఛికంగా చేపట్టింది. ఎంపికైన అధికారుల నియామక ఉత్తర్వులను నేరుగా వారి వ్యక్తిగత ఈ-మెయిల్స్‌కు పంపారు. ఒకసారి విధులకు ఎంపికైన వారు తప్పనిసరిగా హాజరు కావాలని, అత్యవసరమైతే తప్ప ఎవరికీ మినహాయింపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆటోమేషన్ విధానం వల్ల కొందరు ఉపాధ్యాయులకు 100 కిలోమీటర్ల దూరంలో కూడా విధులు పడ్డాయి. ఉదాహరణకు పొదిలి ఉపాధ్యాయులకు గిద్దలూరులో విధులు కేటాయించడంతో సర్దుబాటు కోసం వారు డీఈవో (DEO) కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
వీరికి మినహాయింపు..
మానవీయ కోణంలో పరీక్షల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో విద్యాశాఖ కింది వారికి విధుల నుండి మినహాయింపు ఇచ్చింది. కుటుంబ, వ్యక్తిగత కారణాలు.. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు.. పదో తరగతి పరీక్ష రాస్తున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు (ఉపాధ్యాయులు).. గతంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన వారు లేదా క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారు.. ప్రైవేట్ ట్యూషన్లు చెబుతున్న వారికి మినహాయింపులు ఇచ్చారు.
ఆరోగ్య కారణాలు..
వీటితో పాటు క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడి, మేజర్ న్యూరోసర్జరీ చేయించుకున్న వారు.. టీబీ (TB), వెన్నెముక సమస్యలు.. 70-90 శాతం వినికిడి లోపం.. 75 శాతం వైకల్యం ఉన్న పిల్లలు లేదా మానసిక వైకల్యం ఉన్న స్పౌజ్ (భార్య/భర్త) కలిగిన వారికి కూడా ఈ డ్యూటీ నుంచి మినహాయింపుని ఇచ్చారు. ఇక్కడ పేర్కొన్న మినహాయింపు పరిధిలోకి వచ్చేవారు పొరపాటున విధులకు ఎంపికైతే, తగిన వైద్య ధృవీకరణ పత్రాలతో డీఈవోను కలిసి మినహాయింపు పొందవచ్చు.
పేపర్ లీకేజీలకు కళ్లెం పడుతుందా?
డిజిటల్ ఆటోమేషన్ వల్ల ఏ అధికారి ఏ సెంటర్‌కు వెళ్తారో చివరి నిమిషం వరకు తెలియదు. దీనివల్ల స్థానిక ప్రభావం తగ్గి, పారదర్శకత పెరుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది. అలాగే అత్యవసర పరిస్థితుల కోసం ప్రతి మండలానికి ఇద్దరు అధికారులను రిజర్వ్‌లో ఉంచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sharadha Peetham Lands Issue: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శారదా పీఠానికి ఇచ్చిన భూములను మరో శాఖకు అప్పగించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర దుమారానికి తెరలేపింది. ఈ విషయం రాజకీయంగా వివాదాస్పదమవడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. శారదా పీఠం భూముల అంశంపై ప్రభుత్వం వెనక్కి తిరిగి పాత నిర్ణయమే అమలవుతుందని ప్రకటించింది. ఇంతలా వివాదాస్పదం కావడానికి గల కారణాలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం తలెత్తిందని వివరణ ఇచ్చారు.
Also Read: TTD: బీఆర్ నాయుడు కాదు కామనాయుడు.. వెంటనే రాజీనామా చేయాలి: టీటీడీ మాజీ చైర్మన్
'పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు. మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా ప్రభుత్వం ఉంటుంది' అని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ శివారు కోకాపేట్‌లోని నియో పోలీస్ ప్రాంతంలో జరుగుతున్న శారదా పీఠం నిర్మాణాలను పరిశీలించారు. శారదా పీఠాన్ని సందర్శించి అక్కడి రాజ శ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను చూశారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూమి లాక్కుంటామని ప్రకటించిన అధికారుల తరఫున మంత్రి శ్రీధర్ బాబు శారద పీఠం నిర్వాహకులతో మాట్లాడారు.
Also Read: B Naidu Videos: అశ్లీల వీడియోలు నావి కావు.. అవి ఫేక్ డీప్ వీడియోలు: టీటీడీ చైర్మన్ నాయుడు
కోకాపేట్‌లోని శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపంతోనే గందరగోళం తలెత్తిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అసలు విషయం తెలిసిన వెంటనే శారదా పీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామని శ్రీధర్ బాబు వివరించారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మతాన్ని అడ్డు పెట్టుకొని కొందరు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాది బుల్డోజర్ సంస్కృతి కాదని... కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడటం చూసి ఓర్వలేకే కొందరు తమపై కావాలనే బురద చల్లుతున్నారని విమర్శించారు. బాపుఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
