icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
RKRavi Kumar Sargam1 Mar 2026, 09:21 am

B Naidu Videos: అశ్లీల వీడియోలు నావి కావు.. అవి ఫేక్‌ డీప్‌ వీడియోలు: టీటీడీ చైర్మన్‌ నాయుడు

Tirupati, Andhra Pradesh:

TTD Chairman Videos With Women: 'నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఏఐ సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించేలా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం' అని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని.. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై నేను చట్ట ప్రకారం ముందుకెళ్తానని ప్రకటించారు.

Also Read: Free Bus Scheme: ఫ్రీ బస్సుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఉత్తర్వులు జారీ!

అనూహ్యంగా తెరపైకి వచ్చిన అతడి రాసలీలల వీడియోలపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశా. నా వ్యక్తిత్వాన్ని  హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదు' అని హెచ్చరించారు. 'పని పాట లేకుండా పరంబోకుల వ్యవహరించారు. హిందూ ధర్మం చానల్‌కి డబ్బులు మళ్లించానని నా మీద ఆరోపణలు. అన్ని రికార్డులు పెడతాం. మొత్తం మార్ఫింగ్ కాదు కొన్ని దగ్గర మార్ఫింగ్ చేశారు' అని బీఆర్‌ నాయుడు తెలిపారు.

'వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ ఘోరాతి ఘోరంగా నా మీద దాడి చేస్తున్నారు. మొదటి రోజు నుంచే నన్ను రాజీనామా చేయి అని కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎందుకంటే టీటీడీ చైర్మన్‌గా ఉన్నన్ని రోజులు కుంభకోణాలు చేశాడు. అవి ఎక్కడ బయట పెడతానో అని ఇలా మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నాడు' అని టీటీడీ చైర్మన్‌ బిఆర్‌ నాయుడు ఆరోపించారు. కరుణాకర్ చేసిన అవినీతిని తాను బయట పెడతానిని భయపడుతూ నన్ను రాజీనామా చేయాలని ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. 'ఐదు సంవత్సరాలుగా వేల టికెట్స్ అమ్ముకున్నారు ప్రూఫ్ ఉంది. నేను భయపడేవాడిని కాదు గుర్తుపెట్టుకో' అని భూమన కరుణాకర్‌ రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.

'టీటీడీ హిందూ ధర్మం కించపరచడం ఇష్టం లేక చంద్రబాబు చెప్పడంతో నిశ్శబ్దంగా ఉన్నా. కొన్ని వందల కుంభకోణాలు ఉన్నాయి. అన్ని రికార్డ్స్ ఉన్నాయి' అని బీఆర్‌ నాయుడు తెలిపారు. ఫేక్ డీప్ వీడియోలు ఎలా పెడతారు? అని మండిపడ్డారు. 'రాజకీయంగా ఇరు కుటుంబాలు 30 సంవత్సరాలుగా ఉన్నాం. మరి ఎలా చేస్తారు? అని నిలదీశారు. వైఎస్‌ జరరిఐలతైతౌఐతైఐతైటగన్‌ను ప్రశ్నించా. సతీసమేతంగా తిరుమలకు రారని ప్రశ్నించాను. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలానే చేశారు. అందుకే నామీద ఎలాంటి నీచపు పని చేస్తున్నారు' అని బీఆర్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఈ విషయంపై మా కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఇవ్వాలి. వీళ్లకి ఏమి మా మీద పడి ఏడుస్తున్నారు. వీళ్లకి ఏమి పని లేదా? కరుణాకర్ రెడ్డి మద్రాస్‌లో ఏం చేశావో అన్నీ నాకు తెలుసు. నిన్ను, వైవీ సుబ్బారెడ్డిని వదలను' అని బీఆర్‌ నాయుడు హెచ్చరించారు. టీటీడీలో అన్ని అక్రమాలు చేశారు బయట పెడతా. వారికి మంచిది కాదని హితవు పలికారు.

'రేపు వన్ మ్యాన్ కమిటీ వస్తుండడంతో డైవర్ట్ పొలిటికల్ ట్రిక్స్ ఇవన్నీ. మార్ఫింగ్ వీడియోలు చేసి నన్ను భయపెట్టడం అనేది నా దగ్గర పని చేయవు' అని బీఆర్‌ నాయుడు తెలిపారు. కొత్తగా కరుణాకర్ రెడ్డి, వైఎస్‌ జగన్ మీద ఆరోపణలు చేయాల్సిన పనిలేదు. అందరికి తెలుసు రూ.లక్షల కోట్లు అవినీతి చేశారు. నాకు ఎన్నో అవకాశాలు ఉన్న టీటీడీలో సేవలు అందించాలని వచ్చా' అని బీఆర్‌ నాయుడు తెలిపారు. భగవద్గీత ప్రింట్‌లలో 50 కోట్లు అవినీతి చేసి వాటిని ఎవరికి ఇవ్వకుండా లక్ష యాభై వేలు కాపీలు గోడౌన్‌లో పెట్టేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి' అని బీఆర్ నాయుడు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిరసన.. పీఆర్‌సీ, డీఏ కోసం పోరాటం

Baddipadaga, Telangana:

Telangana Govt Employees: రెండున్నరేళ్లుగా తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఉద్యమ బాట పట్టనున్నారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం రేపు కలెక్టరేట్‌ ఎదుట భారీ నిరసనకు దిగనున్నారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో భోజన విరామ నిరసనను భారీ స్థాయిలో నిరసన చేపట్టనున్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్, కన్వీనర్ కృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు.

Also Read: Tejaswi Surya Apology: తెలంగాణపై విషం చిమ్మిన తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

ఈ నిరసన కార్యక్రమ ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్‌ నాంపల్లిలోని గృహకల్ప సముదాయంలోని టీఎన్‌జీఓ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేపటి నిరసన కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. తమ సంఘాలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి రేపటి నిరసనను విజయవంతం చేయాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించే ఈ నిరసన కార్యక్రమంలో గెజిటెడ్ అధికారులు, నాన్-గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, క్లాస్-IV ఉద్యోగులు హాజరవ్వాలని జేఏసీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

Also Read: Employees Jackpot: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్!

ఈ సందర్భంగా ఉద్యోగుల జేఏసీ చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఇవే

==> 2 జూన్ 2026లోపు వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) అమలు చేయాలి
==> పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలి
==> ఉద్యోగులందరికీ వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలి
==> పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి

Also Read: Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదు: కవిత హెచ్చరిక

రేపటి నిరసన ప్రదర్శనలో పాల్గొనే సంఘాలు ఇవే..
టీఎన్‌జీఓస్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ రాష్ట్ర క్లాస్-IV ఉద్యోగుల సంఘం, పీఆర్‌టీయూ, టీఎస్‌యూటీఎఫ్‌, ఎస్‌టీయూ, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం, డీఏఓ సంఘం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Employees Jackpot: తీపి కబురు అందించిన ఏపీ ప్రభుత్వం.. ఆర్టీసీ ఉద్యోగులకు జాక్‌పాట్!

Nuzendla, Andhra Pradesh:

Jackpot To APSRTC Employees: ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వం రద్దు చేసిన ఒక పథకాన్ని తాజాగా కూటమి ప్రభుత్వం తిరిగి తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్‌ పొందిన తర్వాత భారీ ఆర్థిక ప్రయోజనం కల్పించేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Tejaswi Surya Apology: తెలంగాణపై విషం చిమ్మిన తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం (ఎస్‌ఆర్‌బీఎస్‌) అనే పథకం ఉండేది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఆ పథకాన్ని నిలిపివేశారు. దానికి సంబంధించిన నిధులు విడుదల చేయలేదు. ఈ పథకం లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్‌ తర్వాత తమకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనం దక్కడం లేదు. దీంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎస్‌ఆర్‌బీఎస్‌ నిధులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిధులను తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఎస్‌ఆర్‌బీఎస్‌ సభ్యులై పొదుపు చేసిన ఉద్యోగుల డబ్బును తిరిగి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయించడమే కాకుండా నిధులను కూడా విడుదల చేసింది. నిధుల విడుదలతో ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం దక్కనుంది.

Also Read: Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదు: కవిత హెచ్చరిక

ఆర్టీసీలోని ఎస్​ఆర్​బీఎస్ సభ్యులై పొదుపు చేసిన ఆర్టీసీ ఉద్యోగుల డబ్బు వాపస్ చేయాలని.. 2030 మే నెల వరకు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు చెల్లింపులు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 8,450 మంది ఆర్టీసీ ఉద్యోగులకు రూ.75 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఆర్టీసీ విలీనం తరువాత రద్దు చేసిన ఈ పథకంలో తాము పొదుపు చేసిన మొత్తం తిరిగి ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల విజ్ఞప్తులు పరిశీలించిన ప్రభుత్వం ఆ మేరకు తాజాగా ఆ నిధులను విడుదల చేసింది. 

Also Read: KTR On Delimitation: దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గితే ఊరుకోం.. పోరాటం చేస్తాం: కేటీఆర్‌

ఆర్టీసీలో రిటైర్మెంట్ తర్వాత పింఛన్ కోసం ఎస్‌ఆర్‌బీఎస్‌ పథకం ఉండేది. ఈ పథకంలో ఆర్టీసీ ఉద్యోగులు నెల నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ ఉండేవారు. రిటైరయ్యాక తాము పొదుపు చేసుకున్న డబ్బు పింఛన్‌ రూపంలో నెలనెలా అందుతుండేది. గత ప్రభుత్వం రద్దు చేసిన పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్ధరణ చేసింది. ఈ నిర్ణయంతో పొదుపు చేసిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం లభించనుండగా.. 2030 వరకు ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Revanth Reddy vs KCR: కేసీఆర్ జైత్రయాత్రకు.. రేవంత్ రెడ్డి మేడిగడ్డ కౌంటర్?

Karimnagar, Telangana:

Revanth Reddy vs KCR Latest News: తెలంగాణ గడ్డపై వచ్చే సోమవారం ఎంతో ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ అగ్ర నేతలు ఒకేరోజు యుద్ధక్షేత్రంలోకి దిగుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జైత్రయాత్రతో ప్రజల్లోకి వస్తుండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనతో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైనారు. వీరిద్దరూ ఒకే రోజు కీలకమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది..  

BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు జగిత్యాల వేదికగా భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత KCR పాల్గొంటున్న కీలక సభ కావడంతో దీనికి జగిత్యాల జైత్రయాత్ర అని పేరు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండ కట్టడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రసంగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతు రుణమాఫీతో పాటు కరువు పరిస్థితి, విద్యుత్ కోతలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గులాబీ దళం వ్యూహరచన చేస్తోంది..

KCR సభకు దీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేరోజు కాలేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించబోతున్నారు.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతితో పాటు కుంగిపోయిన పిల్లలను ప్రజలకు వివరించేలా రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అనంతరం నిర్వహించే సభలు కేసిఆర్ పదేళ్ల పాలనపై రేవంత్ నిప్పులు చెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కెసిఆర్ కు సంబంధించిన వివిధ వైఫల్యాలను కూడా ఈ సభాముఖంగా తెలంగాణ ప్రజలకు వివరించబోతున్నట్లు సమాచారం.

Read more: Karimnagar: నిప్పుల కొలిమిలా ఉమ్మడి కరీంనగర్.. రికార్డులు బద్దలు కొడుతున్న భానుడు!

ఈ పర్యటన నేపథ్యంలో మీరు పార్టీల నేతల మధ్య డైలాగ్ పీక్స్‌కు చేరింది. అవుట్ డేటెడ్ నేత జీవన్ రెడ్డి కోసం కేసీఆర్ సభలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. ప్రజలు తిరస్కరించిన కేసీఆర్ ఇంకా భ్రమలోనే ఉన్నారు అని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.. KCR గర్జన వింటేనే రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుంది. ఇన్ని రోజులు పట్టించుకోని మేడిగడ్డను.. కెసిఆర్ సభ రోజే రేవంత్ సందర్శిస్తున్నారంటే అది భయం కాక.. మరి ఏమిటై ఉంటుందని BRS శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఒకే రోజు ఇద్దరు ఆగ్రనేతలు తలపడుతుండడంతో ఏప్రిల్ 20న తెలంగాణ రాజకీయంగా ఎవరు పై చేయి సాధిస్తారో అన్నది ఆసక్తిగా మారింది. ఈ బిగ్ డే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు దారి తీయబోతోందని రాజకీయ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి..

Read more: Karimnagar: నిప్పుల కొలిమిలా ఉమ్మడి కరీంనగర్.. రికార్డులు బద్దలు కొడుతున్న భానుడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Karimnagar: నిప్పుల కొలిమిలా ఉమ్మడి కరీంనగర్.. రికార్డులు బద్దలు కొడుతున్న భానుడు!

Mannegudem, Telangana:

Karimnagar Heatwave Alert Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తూ వస్తోంది.. సాధారణంగా మే నెలలో కనిపించే ఎండ తీవ్రత ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలోని కనిపిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. మూను పెన్నడూ లేని విధంగా ఈసారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అదనంగా నమోదవుతూ వస్తున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ పాత రికార్డులను తిరగరాస్తున్నాడు. ఈ ఎండల తీవ్రత చూస్తుంటే మే నెలలో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని మొదలు పెడుతూ ఉన్నాడు. ఉదయం 11 గంటలు దాటితే చాలు.. రోడ్లన్నీ జనసంచారం లేక నిర్జనంగా మారుతూ వస్తున్నాయి. ప్రధాన కూడల్లో కర్ఫ్యూ వాతావరణం కూడా కనిపిస్తుంది. గాలిలో ఫేమస్ శాతం తగ్గిపోవడమే కాకుండా వడగలుపులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా నిర్మాణరంగ కార్మికులతో పాటు వీధి వ్యాపారస్తులు, రైతులు ఈ ఎండల ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

వాతావరణ మార్పుల ప్రభావంతో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అడవుల విస్తీర్ణత తగ్గిపోవడమే కాకుండా పట్టణీకరణ పెరగడం వల్ల హీట్ ఐలాండ్ ప్రభావం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా వారు ప్రజలకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు.. పగటివేల అవసరమైతే తప్ప బయటకి రావద్దని.. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా శరీరంలో నీటి శాతం తగ్గకుండా కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ వంటి డ్రింక్స్ కూడా తీసుకోవడం చాలా మంచిది. అలాగే లేత రంగుతో కూడిన దుస్తులు కూడా ధరిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?

ఎండల తీవ్రతకు తోడు భూగర్భ జలమట్టం తగ్గిపోవడంతో తాగునీటి ఎద్దండి తలితే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అడవుల్లో జంతువులు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నాయట. చెరువులతోపాటు గుంటలు అప్పుడే అడుగంటడంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనగా మారింది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై పట్టణాల్లో చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని.. అలాగే వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు ప్రత్యేకమైన సూచనలు చేయాలని.. వారిని తక్షణమే చికిత్స అందించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Xiaomi నుంచి సంచలనం.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro..!

Hyderabad, Telangana:

Xiaomi 18 Pro Price Cut: స్మార్ట్‌ఫోన్‌ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ దిగ్గజ కంపెనీ షావోమీ (Xiaomi) త్వరలో మార్కెట్లోకి మరో అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ తమ ఫ్లాగ్‌షిప్ సిరీస్ లో భాగంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా ఎన్నో రకాల శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది. ఇది షావోమీ 18 ప్రో పేరుతో విడుదల కాబోతోంది. ముఖ్యంగా ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బటన్ అందుబాటులోకి రావడం విశేషం. అయితే అతి త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోయే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

లీకైన వివరాల ప్రకారం..షావోమీ 18 ప్రో స్మార్ట్‌ఫోన్‌ బాడీ పై ప్రత్యేకమైన ఫిజికల్ బటన్లను అమర్చినట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం పవర్ బటన్ లేదా వాల్యూమ్ బటనే కాకుండా ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ యాక్సెస్‌కు సంబంధించిన బటన్ కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. సింగిల్ క్లిక్‌తో స్మార్ట్‌ఫోన్‌ హోమ్ గ్యాడ్జెట్‌లను, కనెక్టెడ్ కార్లను నియంత్రించే విధంగా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ బటన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ Miclaw కూడా యాక్టివేట్ చేసుకునే విసులుబాటును అందించడం విశేషం.

లీకైన ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. షావోమి 18 ప్రో కేవలం సాఫ్ట్వేర్ పరంగానే కాకుండా హార్డ్వేర్ పరంగా కూడా శక్తివంతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీని వెనక భాగంలో వచ్చే కెమెరా మాడ్యూల్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఇది డ్యూయల్ 200 మెగాపిక్సెల్ (200MP + 200MP) కెమెరా సెటప్ ఉండబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగం కెమెరా చాలా ప్రత్యేకంగా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఈ మొబైల్ బ్యాటరీ 7,000mAhతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వెనక భాగంలో అదనంగా ఈ మొబైల్ కు మరో డిస్ప్లే కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కూడా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 (Snapdragon 8 Elite Gen 6) ప్రాసెసర్‌తో లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ధరతో పాటు మరికొన్ని వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ మార్కెట్లోకి విడుదల అయితే సంచలనం సృష్టించే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన ఫీచర్స్తో విడుదల కాబోతోంది.

Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Tejaswi Surya Apology: తెలంగాణపై విషం చిమ్మిన తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

Baddipadaga, Telangana:

Tejaswi Surya Hate Speech: 'తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్ముతోందని.. దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పాటు దేశ విభజనతో పోల్చినా… తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన తీరును తెలంగాణ సమాజం గుర్తిస్తున్నది. తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరనరాన నిండి ఉంది' అని తెలిపారు.

Also Read: Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదు: కవిత హెచ్చరిక

పార్లమెంట్‌లో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని.. ఆ పార్టీ నాయకులకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వం. ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం' అని కేటీఆర్‌ తెలిపారు.

Also Read: KTR On Delimitation: దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గితే ఊరుకోం.. పోరాటం చేస్తాం: కేటీఆర్‌

బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. నరేంద్ర మోదీ మొదలుకొని తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతూ… బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు.

Also Read: Raghav Chadha In To BJP: వదులుకుంటున్న ఆమ్‌ ఆద్మీ.. రాఘవ్‌ను రా రమ్మంటున్న బీజేపీ

తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరి దయాదాక్షిణ్యాలతో.. ఎవరి భిక్షతో ఏర్పడింది కాదని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా తెలంగాణ గడ్డ విముక్తి పొందిందని గుర్తు చేశారు. అస్తిత్వం కోసం ప్రజలు చేసిన ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని దేశ విభజన లాంటి విషాదకర సంఘటనలతో పోల్చడంతో బీజేపీ తన కుసంస్కారాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.

తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా.. అక్కడే ఉన్న ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటు అని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం దారుణమని మండిపడ్డారు. కళ్ల ముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేకపోయిన వీరు ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని కేటీఆర్‌ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తోంది. తెలంగాణను కించపరిచిన తేజస్వి సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ డిమాండ్ చేశారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు బిజెపి పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Tirumala: తిరుమలలో శ్రీవారి ఆలయంలో ప్రముఖులు.. పీవీ సింధు, చాగంటి కోటేశ్వరరావు

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala VIPs Darshan: తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. సామాన్య భక్తులతోపాటు ప్రముఖులు స్వామివారి సేవలో తరిస్తున్నారు. నేడు తిరుమల వేంకటేశ్వర స్వామిని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, టీటీడీ మాజీ ఈఓ ఎల్వీ సుబ్రమణ్యం, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన వీరు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

Also Read: Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదు: కవిత హెచ్చరిక

తన భర్తతో కలిసి దర్శించుకున్న అనంతరం పీవీ సింధు మీడియాతో మాట్లాడారు. 'స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఇస్తుంది. లోక కల్యాణం కోసం అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ వేంకటేశ్వరుని ప్రార్థించా' అని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలింపిక్ విజేత పీవీ సింధు తెలిపారు.

Also Read: KTR On Delimitation: దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గితే ఊరుకోం.. పోరాటం చేస్తాం: కేటీఆర్‌

'తిరుమలలో శ్రీవారు స్వచ్ఛందంగా ఆయనకు ఆయనే అక్కడ నిలబడ్డారు. ప్రపంచమంతా యుద్ధ వాతావరణంలో నలిగిపోతుంటే మనము ఇంతటి ప్రశాంతంగా ఇక్కడ ఉన్నాము అంటే దానికి ప్రధాన కారణం ఆ దేవదేవుడే. ప్రతి ఒక్కరం స్వామి వారు చెప్పినట్టు ధార్మికంగా జీవించడం ఉత్తమమైనది' అని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, టీటీడీ మాజీ ఈఓ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. 'స్వామివారి నేత్ర దర్శనం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. స్వామివారి ఆశీర్వచనంతోనే విశ్వశాంతి చేకూరుతుంది. సనాతన వైభవం కోసం ప్రతి ఒక్కరం స్వామివారిని ప్రార్థిద్దాం. విశాలమైనటువంటి దృక్పథంతో స్వామివారిని ప్రార్థిద్దాం, మానవాళి సుఖ శాంతి కోసం కూడా ప్రార్థిద్దాం. ఆ సందేశాన్ని స్వామివారి దర్శన సమయంలో ఆయన వక్షస్థలం నుంచి నాకు చేరినట్టు నేను భావిస్తున్నా' అని ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు.

నిన్న లోకేశ్‌తో భేటీ
తిరుపతి గొల్లవానిగుంటలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో పీవీ సింధు సమావేశమయ్యారు. నారా లోకేశ్‌తో జరిగిన ఈ సమావేశంలో పీవీ సింధు కీలక ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని.. క్రీడాకారులు, క్రీడారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరణలో భాగంగా పీవీ సింధు తన అభిప్రాయాలు పంచుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదు: కవిత హెచ్చరిక

Hyderabad, Telangana:

Womens Reservation Bill: 'మహిళ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్‌ బిల్లును కాల్చే ప్రయత్నం చేస్తున్నారు' అని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్లమెంట్‌లో 3.13 శాతంగా ఉన్న తెలంగాణ ప్రాతినిధ్యం డీలిమిటేషన్ తర్వాత కూడా అంతే ఉండాలని స్పష్ఠం చేశారు. లేదంటే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని కవిత ప్రకటించారు. మహిళ బిల్లులో బీసీ సబ్ కోటా ఉండాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

Also Read: KTR On Delimitation: దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గితే ఊరుకోం.. పోరాటం చేస్తాం: కేటీఆర్‌

మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ బిల్లుపై హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరగడం కచ్చితంగా మహిళలకు చాలా ముఖ్యమైన రోజు. నియోజకవర్గాల పెంపుపై కూడా చర్చిస్తున్నారు. కానీ మహిళ బిల్లును ఇప్పటికే పాస్ చేశారు. ఇప్పుడు డిలిమిటేషన్‌ను మహిళ బిల్లుకు లింక్ చేస్తూ కేంద్రం కుట్ర చేస్తోంది' అని ఆరోపించారు. మహిళ బిల్లు, డిలిమిటేషన్ అనేవి రెండు వేర్వేరు అంశాలని చెప్పారు. మహిళల భుజంపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం భావిస్తోందని మాజీ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

Also Read: Raghav Chadha In To BJP: వదులుకుంటున్న ఆమ్‌ ఆద్మీ.. రాఘవ్‌ను రా రమ్మంటున్న బీజేపీ

'నియోజకవర్గాలను బ్లాంకెట్‌గా 50 శాతం పెంచుతామని చెబుతోంది. చూడటానికి ఇది కరెక్టే అనిపించినప్పటికీ చాలా నష్టం జరగుతుంది. బీహార్ లాంటి రాష్ట్రంలో పెరిగిన సీట్లతో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ సీట్లు ఉంటాయి. కచ్చితంగా తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుంది' అని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. 'ప్రస్తుతం పార్లమెంట్‌లో తెలంగాణకు 3.13 శాతం ప్రాతినిధ్యం ఉంది డిలిమిటేషన్‌కు ఏ ప్రాతిపదికన తెచ్చిన సరే తెలంగాణకు 3.13 శాతం వాటా తగ్గొద్దు' అని డిమాండ్‌ చేశారు. లేదంటే తెలంగాణ ప్రజలు మరో తెలంగాణ మాదిరి ఉద్యమం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Also Read: Delimitation Protest: దక్షిణాదికి అన్యాయం జరిగితే కేసీఆర్‌ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం: కేటీఆర్‌

'ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. ఏ ప్రాజెక్ట్‌కు కూడా జాతీయ హోదా ఇవ్వటం లేదు. ఇంకా మన రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే మరింత నష్టపోవాల్సి ఉంటుంది. మహిళా బిల్లుకు డిలిమిటేషన్‌ను లింక్ చేయటం కాదు. మహిళ బిల్లుకు బీసీ సబ్ కోటాను లింక్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా' అని మాజీ ఎమ్మెల్సీ కవిత కోరారు.

ఆర్టిజన్ల సమ్మెపై స్పందన
'న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టిజన్లపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు బెదిరింపులకు పాల్పడటం దారుణం. ఈరోజు ఉదయం 11 గంటల లోపు విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తామని బెదిరింపులకు పాల్పడటం వారి ప్రాథమిక హక్కులను హరించడమే. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను వంచిస్తోంది. ఆర్థిజన్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి.. వారిపై విద్యుత్ సంస్థలు బెదిరింపులకు పాల్పడకుండా రక్షణ కల్పించాలి' అని మాజీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Hair Loss Control: ఈ నూనె తలకి రాసుకుంటే..నెత్తిమీద ఒక్క వెంట్రుక రాలదు..వారంలో అంతా సెట్ అయిపోతుంది..ఎలానో తెలుసా?

Hyderabad, Telangana:

Hair Loss Control With Bhringraj Oil: ఏ సీజన్‌లోనైనా వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు జుట్టు ఆరోగ్యం కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. వర్షకాలం, వేసవి కాలం, చలికాలంతో సంబంధం లేకుండా పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు ఆరోగ్యం తరచూ దెబ్బతింటుంది. ఎండాకాలంలో కూడా జట్టు మురికితో జుట్టు రాలిపోవడం, చుండ్రు, వెంట్రుకల చిట్లిపోవడం వంటి అనేక సమస్యలు ఎదురవతాయి. ప్రస్తుతం శీతాకాలంలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని సహజమైన చిట్కాలు ఉపయోగించడం ఎంతో ఉత్తమమైన మార్గంగా నిలుస్తోంది. 

అలాంటి సహజవంతమైన చిట్కాల్లో భృంగరాజ్ ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో ఒకటి. కాలంతో సంబంధం లేకుండా మీ జుట్టును రక్షించుకోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. జుట్టు పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను దూరం చేసేందుకు భృంగరాజ్ ఆకులతో తయారు చేసిన నూనె ఎంతగానో సహయపడుతుంది. భృంగరాజ్ ఆకుల్లో మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు పోషణకు సాకారం..
భృంగరాజ్ నూనె జుట్టు మూలాలకు అవసరమైన పోషకాలు, విటమిన్లను సమర్థవంతంగా అందజేస్తుంది. అంతే కాకుండా జుట్టు కుదుళ్ల నుంచి బలోపేతం చేస్తుంది. కొత్త జుట్టు పెరిగేందుకు సహకరిస్తుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడమే కాకుండా.. జుట్టు రాలడాన్ని క్రమంగా తగ్గిస్తూ వస్తుంది.

చుండ్రు నివారణ, షైనింగ్ జుట్టు..
భృంగరాజ్ ఆకుతో తయారు చేసిన నూనెను రోజువారీ ఉపయోగించడం వల్ల జుట్టు దాని సహజత్వాన్ని కాపాడుకుంటుంది. అదే విధంగా జుట్టు నల్లగా మారి.. సహజంగా మెరిసేలా (షైనింగ్) కనిపిస్తుంది. తెల్ల జుట్టు అధికంగా ఉందని బాధపడే వారు కూడా వారానికి రెండుసార్లు ఈ భృంగరాజ్ నూనెను వాడటం ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల తెల్ల జుట్టు నివారణ సాధ్యమవుతుంది.

పొడిబారిన నెత్తికి ఉపశమనం..
మీ తలపై చర్మం (స్కాల్ప్) పొడిగా, దురదగా లేదా చుండ్రుతో బాధపడే వారికి కూడా ఈ భృంగరాజ్ ఆయిల్ ఔషధంలా పనిచేస్తుంది. చుండ్రు లేదా దురద నుంచి పూర్తిగా ఉపశమనం అందిస్తుంది. అదే విధంగా తలపై తేమ ఉండేలా చేస్తుంది. 

డ్రైయర్, స్ట్రెయిట్నర్ వేడి, రసాయనాలు, కాలుష్యం కారణంగా బలహీనపడిన జుట్టును పునరుజ్జీవింపజేయడానికి భృంగరాజ్ బాగా ఉపయోగపడుతుంది. భృంగరాజ్‌లోని శోథ నిరోధక లక్షణాలు నెత్తిమీద వచ్చే వాపు, దురదను తగ్గిస్తాయి. జుట్టు ఆరోగ్యం కోసం భృంగరాజ్ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం శీతాకాలంలో మీ జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవడానికి ఒక అద్భుతమైన సహజ పరిష్కారంగా మారింది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Viral Pool Video: భర్త లేనప్పుడు ప్రియుడితో రొమాన్స్..స్విమ్మింగ్‌ పూల్‌లో ఏకంతంగా..సడెన్‌గా భర్త ఎంట్రీ!

Also Read: Gold Reserves In World: రూ.3,418 లక్షల కోట్ల బంగారం..బయటకు తీస్తే అందరూ ధనవంతులే! ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Dhoni Re-Entry Match: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు 'తలా' దూరం! రీఎంట్రీ మ్యాచ్ ఫిక్స్!

Chennai, Tamil Nadu:

Dhoni Re-Entry Match IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ లీగ్‌లో ఏకంగా 5 సార్లు ట్రోఫీ ని గెలుచుకొని..మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీగా నిలిచింది. కానీ, గత రెండు సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశలో మ్యాచ్ గెలిచేందుకే తీవ్రంగా శ్రమిస్తోంది. కొన్ని సందర్భాల్లో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగుభాగన ఉండి ట్రోల్స్ కు గురవుతోంది. అయితే చెన్నై గెలుపులోనూ ధోనీ ఉండగా.. ఇప్పుడు టీమ్‌లో ధోనీ లేకపోవడమే జట్టు వైఫల్యానికి ప్రధాన కారణమని ఫ్యాన్స్ అంటున్నారు. 

ఈ సీజన్‌లో గాయం కారణంగా రెండు వారాల పాటు దూరమైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. లేకపోవడం చెన్నై టీమ్ వైఫల్యానికి కారణంగా తెలుస్తోంది. దీంతో ధోనీ ఎప్పుడొస్తాడని సీఎస్కే టీమ్ సహా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే శనివారం ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ధోనీ ఆడబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ, ఈ మ్యాచ్‌కు కూడా ధోనీ అందుబాటులో ఉండడం లేదని సమాచారం. 

సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఏప్రిల్ 23న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడని తాజా సమాచారం. పిక్క కండరాల గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ధోనీ లేకుండా చెన్నై ఆడిన మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 3 ఓటములతో సతమతమవుతోంది. అయితే సీఎస్కే తరువాతి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఏప్రిల్ 18న జరగనుంది. అయినా కూడా ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నాడని తెలుస్తోంది.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. సీఎస్కే వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ధోనీ పూర్తి ఫిట్‌నెస్‌కు దగ్గరగా ఉన్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను భారత్‌కు అందించిన వాంఖడే మైదానంలో జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఐదు మ్యాచ్‌లలో రెండు విజయాలతో సీఎస్కే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. 

ఇటీవలే కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో మ్యాచ్‌కు ముందు, ధోనీ సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీతో కలిసి శిక్షణ తీసుకున్నాడు. కానీ, అతను మైదానంలోకి రాలేదు. అదే విధంగా స్పిన్నర్ నూర్ అహ్మద్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మహేంద్ర సింగ్ ధోనీ చివరిసారిగా ఏప్రిల్ 20, 2025న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే తరఫున ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను ఆరు బంతుల్లో 4 పరుగులు చేశాడు. 

ఈ సీజన్‌లో ధోనీ లేకపోవడంతో.. సంజు సామ్సన్ సీఎస్కే తరఫున వికెట్ కీపర్-బ్యాటర్ గా ఉన్నాడు. ధోనీ తిరిగి వచ్చిన తర్వాత, శాంసన్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడతాడని, ధోనీ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడని భావిస్తున్నారు. అంతేకాకుండా మాజీ సీఎస్‌కే కెప్టెన్‌ను కేవలం బ్యాటింగ్ కోసమే బరిలోకి దించే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది.

Also Read: MI Vs PBKS Preview: ముంబై Vs పంజాబ్..ప్రతీకారం తీర్చుకుంటుందా? చతికల పడుతుందా? కచ్చితంగా గెలుపు వాళ్లదే!

Also Read: Maharashtra Exploitation: 350 అశ్లీల వీడియోలు..180 మంది మైనర్ బాలికలతో శృంగారం..కేటుగాడు అరెస్టు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

MI Vs PBKS Preview: ముంబై Vs పంజాబ్..ప్రతీకారం తీర్చుకుంటుందా? చతికల పడుతుందా? కచ్చితంగా గెలుపు వాళ్లదే!

Mumbai, Maharashtra:

MI Vs PBKS Match Preview: ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 16న మరో సరవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆతిథ్య ముంబై ఇండియన్స్‌ జట్టుతో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఈ లీగ్‌లో ఇప్పటికే ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో ఓటమి పొంది గెలుపు కోసం ముంబై సతమతమవుతుంటే.. ఓటమి లేకుండా అజేయంగా పోరాడుతూ పాయింట్ల పట్టికలో తొలిస్థానంపై పంజాబ్ కన్నేసింది.  ఈ మ్యాచ్ నేటి రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఇరు జట్లు గతేడాది రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో తలపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్ ను ఓడించి పంజాబ్ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత ముంబై, పంజాబ్ జట్లు తలపడడం ఇదే మొదటిసారి.

అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా పంజాబ్ మరోసారి ఆధిపత్యం చలాయిస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటల వేచిచూడాల్సిందే. ప్రస్తుత లీగ్‌ దశలోని మొదటి మ్యాచ్‌లో గెలుపొందిన ముంబై జట్టు.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండగా.. పంజాబ్ జట్టు వరుసుగా మూడు విజయాలు, ఓ మ్యాచ్‌ డ్రా కారణంగా 7 పాయింట్లతో టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచింది.  

వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుకు ఇప్పుడు మరో సమస్య వచ్చిపడింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయంతో రిటైర్ అయిన తర్వాత రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కూడా సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ జట్టు  అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతోంది.

ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటి వరకు ముంబై, పంజాబ్ జట్లు 34 సార్లు తలపడగా.. చెరో 17 విజయాలతో సమంగా నిలిచాయి. ఇది టోర్నమెంట్‌లోని అత్యంత సమతుల్యమైన పోటీలలో ఒకటిగా నిలుస్తుంది. పంజాబ్‌పై ముంబై 223 అత్యధిక స్కోరును నమోదు చేసింది. అలాగే ముంబై ఇండియన్స్‌ పై పంజాబ్ 230 అత్యధిక పరుగులను రాబట్టింది. అయితే ముంబై అత్యల్ప స్కోరు 87 అయితే పంజాబ్ అత్యల్పంగా 119కి ముంబై పై ఆలౌట్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం పంజాబ్ జట్టుదే పైచేయి అనే విధంగా గత మ్యాచ్‌ల ప్రదర్శన కనిపిస్తోంది.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 అంచనా..
రోహిత్ శర్మ లేదా క్వింటన్ డి కాక్ (ఇంపాక్ట్ ప్లేయర్) ర్యాన్ రికెల్టన్ ఓపెన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 అంచనా..
ప్రియాంశ్ ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్, కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్, నెహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయకుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్ (ఇంప్లాక్ట్ ప్లేయర్).

Also Read: Maharashtra Exploitation: 350 అశ్లీల వీడియోలు..180 మంది మైనర్ బాలికలతో శృంగారం..కేటుగాడు అరెస్టు!

Also Read: Standup Comedian Arrest: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కామెడీ చేసిన వ్యక్తి అరెస్టు..ఉత్తరప్రదేశ్‌లో వెంటాడి మరీ అరెస్టు చేసిన ఏపీ పోలీసులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?

Hyderabad, Telangana:

Best Used Car Showrooms In Delhi: సొంత కారు ఉండాలనేది ప్రతిఒకరి కల.. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో కార్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా సాధారణ బ్రాండ్‌లకు సంబంధించిన హ్చాచ్‌బ్యాక్‌ కార్ల ధరలే రూ.10 లక్షలు దాటుతున్న తరుణంలో.. మధ్యతరగతి ప్రజలు కొనడం చాలా కష్టమైపోయింది. అయితే, దీని కారణంగా సాధారణ మధ్యతరగతి వారి కారు కల.. కలగానే మిగిలిపోతూ వస్తోంది. కానీ అక్కడక్కడ సెంకండ్‌ హ్యాండ్‌ షోరూమ్స్‌లో మాత్రం, కార్లు చాలా చీప్‌ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీతో అత్యంత చీప్‌ ధరలకే లభిస్తున్నాయి. అయితే వీటిపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివవారలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 ఢిల్లీలోని పితంపురా, నేతాజీ సుభాష్ ప్లేస్ (NSP) మెట్రో స్టేషన్ సమీపంలో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌లో అత్యంత ఛీప్ ధరలకే లభిస్తున్నాయి. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ మార్కెట్‌లో రూ.3 లక్షల నుంచే కార్లు అందుబాటులో ఉండటం విశేషం. ముఖ్యంగా ఇక్కడ ఎంజీ హెక్టార్ (MG Hector), జీప్ కంపాస్ (Jeep Compass), టాటా సఫారీ వంటి ఎస్‌యూవీలు సగం ధరలకే అందుబాటులో ఉండడం విశేషం.. ఇక్కడ రూ.30 లక్షలు కలిగిన కార్లు.. కేవలం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలోపే అందుబాటులో ఉన్నాయి.  

ఇక్కడ ఉన్న కార్లకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 2019-20 మోడల్ ఎంజీ హెక్టార్ డీజిల్ వేరియంట్లు ఇక్కడ కేవలం రూ.8.40 లక్షల నుంచే అందుబాటులో ఉన్నాయి.. అంతేకాకుండా జీప్ కంపాస్ వాహనాలు రూ. 5.21 లక్షలకే లభించడం విశేషం.. ఇక రూ. 85 లక్షల విలువైన బీఎండబ్ల్యూ (BMW) కారును ఇక్కడ కేవలం రూ. 14.90 లక్షలకే కొనుగోలు చేయోచ్చు. దీంతో పాటు ఆడి (Audi A4) కారు రూ. 7.50 లక్షలకే లభించడం విశేషం..

Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!

పెరుగుతున్న పెట్రోల్ ధరల దృష్ట్యా.. కిలోమీటరుకు కేవలం 50 పైసల ఖర్చుతో నడిచే ఈవీ (EV) కార్లు రూ. 6.90 లక్షల నుంచి ప్రారంభమవ్వడం విశేషం.. అలాగే సీఎన్‌జీ ఆల్టో కార్లు రూ.3.99 లక్షలకే లభిస్తున్నాయి. ఇక కుటుంబ అవసరాల కోసం టాటా సఫారీ, స్కార్పియో, ఎంజీ గ్లోస్టర్ వంటి భారీ వాహనాలు కూడా అద్భుతమైన ధరల్లో లభిస్తున్నాయి. ఇక్కడ మార్కెట్‌లో కొనుగోలు చేసే ప్రతి కారు ఇంజన్‌పై 5000 కిలోమీటర్ల వరకు వారంటీని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉండడం విశేషం..

Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

LSG vs RCB: ఐపీఎల్‌ 2026లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు జోరు.. లక్నో బేజారు

Bengaluru, Karnataka:

RCB Beat LSG By 5 Wickets: డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌ 2026లో ఆధిపత్యం చలాయిస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బెంగళూరు జోరు కనపడుతోంది. లక్నో సూపర్‌ జియాంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విజయం సాధించి మొత్తం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి లక్నోను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR On Delimitation: దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గితే ఊరుకోం.. పోరాటం చేస్తాం: కేటీఆర్‌

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ జియాంట్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు 146 పరుగులు చేసి ఆలౌటైంది. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా భారీ స్కోర్‌ సాధించలేకపోవడంతో తక్కువ స్కోర్‌కు పరిమితమైంది. బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి పరుగులు నియంత్రించడమే కాకుండా వికెట్లన్నింటిని తీసేశారు. తక్కువ లక్ష్యాన్ని బెంగళూరు బ్యాటర్లు 15.1 ఓవర్‌లలో 5 వికెట్లు కోల్పోయి సాధించారు. విరాట్‌ కోహ్లీ అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. తక్కువ స్కోర్‌ను లక్నో బౌలర్లు ఏమాత్రం కాపాడలేకపోయారు.

Also Read: Raghav Chadha In To BJP: వదులుకుంటున్న ఆమ్‌ ఆద్మీ.. రాఘవ్‌ను రా రమ్మంటున్న బీజేపీ

లక్నో తరఫున మిచెల్‌ మార్ష్‌ 32 బంతుల్లో 40 పరుగులు చేయగా.. మార్‌క్రమ్‌ (12), కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (1), అబ్దుల్‌ సమద్‌ (0), జార్జ్‌ లిండే (7), మహ్మద్‌ షమీ (0), అవేశ్ ఖాన్‌ (1) ఇలా అందరూ అతి తక్కువ స్కోర్‌ నమోదు చేశారు. ఆయూశ్‌ బదౌనీ 24 బంతుల్లో 38 పరుగులతో రాణించగా.. ముకుల్‌ చౌదరి మరోసారి తన బ్యాట్‌తో సత్తా చాటాడు. 28 బంతుల్లో 39 పరుగులు సాధించి ప్రత్యర్థికి గౌరవ ప్రదమైన లక్ష్యం ఇచ్చాడు. బెంగళూరు బౌలర్లు మ్యాజిక్‌ చేశారు. లక్నో బ్యాటర్లను ఏమాత్రం ఆడకుండా చేసి తక్కువ స్కోర్‌కు పరిమితం చేశారు. రసిక్‌ సలామ్‌ 4 వికెట్లతో లక్నో నడ్డి విరవగా.. సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతమైన బంతులతో మూడు వికెట్లు తీశాడు. కృనాల్‌ పాండ్యా రెండు, జోష్‌ హేజిల్‌వుడ్‌ ఒక వికెట్‌ తీశాడు.

Also Read: Bike Stunts: నిబంధనలు బేఖాతర్‌.. ఔటర్‌ రింగురోడ్డుపై ప్రేమజంటల హల్‌చల్‌

తక్కువ లక్ష్యాన్ని బెంగళూరు పది ఓవర్లకు పూర్తి చేస్తుందని భావించగా.. కొంత గట్టిగానే పోరాడాల్సి వచ్చింది. ఫిల్‌ సాల్ట్‌ 7 పరుగులకే పరిమితమవగా.. విరాట్‌ కోహ్లీ మరోసారి బ్యాట్‌తో సత్తా చాటాడు. 34 బంతుల్లో 49 పరుగులు చేసి అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు. ఆరు ఫోర్లు బాదగా.. ఒక సిక్సర్‌ నమోదు చేశాడు. దేవదత్‌ పడిక్కల్ తక్కువ స్కోర్‌ (10) చేయగా.. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (27), జితేశ్‌ శర్మ (23) పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. టిమ్‌ డేవిడ్‌, రొమారియా షెఫర్డ్‌ సమాన స్కోర్‌ (14) నమోదు చేసి విజయం అందించారు. తక్కువ స్కోర్‌ను కాపాడేందుకు లక్నో బౌలర్లు ఏమాత్రం శ్రమించలేదు. మొదట దూకుడుగా కనిపించినా బెంగళూరు బ్యాటర్ల ధాటికి అది ఏమాత్రం సరిపోలేదు. అయినా కూడా ప్రి్స్‌ యాదవ్‌ అద్భుతమైన 3 వికెట్లు తీయగా.. అవేశ్‌ ఖాన్‌ దూకుడు మీద ఉన్న కోహ్లీతోపాటు మరొకరిని ఔట్‌ చేశాడు.

ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఒక ఓటమితో బెంగళూరు అగ్రస్థానంలోకి దూసుకెళ్లగా.. ఓటమితో లక్నో 3 ఓటములు, రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి ఉనంచి నాలుగో స్థానానికి పరిమితమైంది. రేపు ముంబై, పంజాబ్‌ మధ్య కీలక పోరు నడవనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top