Amaravati: దేశ అభివృద్ధికి కమ్యూనికేషన్, టెక్నాలజీ అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇంటర్నెట్, డిజిటల్ విప్లవం ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్‌గా మార్చిందని.. కానీ అప్పట్లో భారత్ ఆ రంగంలో ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. వైద్య సేవల డేటా ప్రాసెసింగ్ వంటి పనులకే పరిమితమయ్యామని, ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. 1995లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజులను ఒకసారి గుర్తు చేసుకున్నారు.
Also Read: Boggula Srinivas: 'పవన్ కల్యాణ్ హఠావో' పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై వీడిన మిస్టరీ
భారత్‌నెట్‌పై ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరగ్గా.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. 'అప్పట్లో కేవలం 2 ఎంబీపీఎస్ బ్యాండ్‌విడ్త్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చింది. అదే బ్యాండ్‌విడ్త్‌తో జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read: 14 KM Flyover: విజయవాడలో 14 కిలోమీటర్ల అతి పొడవైన ఫ్లైఓవర్? ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు సాధించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 4జీ, 5జీ విస్తరణతో కోట్లాది మంది డిజిటల్ సేవల లాభాలు పొందుతున్నారని.. ప్రపంచంతో పోలిస్తే భారత్ డేటా ఖర్చు కేవలం 5 శాతం మాత్రమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ స్తంభాలపై ఫైబర్ వేయడంతో తక్కువ ఖర్చుతో వేగంగా నెట్‌వర్క్ విస్తరణ సాధ్యమైందని వివరించారు. ఒకప్పుడు దాదాపు 9.78 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేశామని.. ఆ తర్వాత ప్రభుత్వ మార్పుతో ఆ సంఖ్య తగ్గినా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్లీ వేగం పుంజుకుంటోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Also Read: Harish Rao: మూసీ పునరుజ్జీవనం పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ: హరీశ్ రావు
డిజిటల్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ముందుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే 970 ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని, భూ రికార్డులను బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భద్రపరచేలా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్య, పాలన రంగాల్లో ఏఐ వినియోగం విస్తరించనుందని.. భవిష్యత్తులో ఏఐ డాక్టర్, ఏఐ ఎకనామిస్ట్ వంటి వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షలాది మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తున్నారని, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లలో భారత్ కీలకంగా మారిందని చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నం కేంద్రంగా సముద్రపు కేబుల్ లింకులతో డేటా హబ్‌గా ఏపీ ఎదుగుతోందని పేర్కొన్నారు. గూగుల్ సంస్థ రాష్ట్రంలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనమని ఉదాహరించారు.
భవిష్యత్తు రంగాలైన గ్రీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ, డ్రోన్లు, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, మెడ్‌టెక్‌లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. త్వరలో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలోనే ప్రైవేట్ టెలికాం సంస్థలను మించి నంబర్ వన్‌గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సరైన నాయకత్వం, బాధ్యతాయుత పాలన ఉంటే అద్భుతాలు సాధ్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి భారత్ అడ్డుకోలేని ఆర్థిక శక్తిగా మారుతుందని.. దీనికి అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇది చారిత్రాత్మక దశ అని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తే దేశం ప్రపంచానికి దారి చూపుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
India Vs South Africa Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక పోరులో టీమ్ ఇండియా 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సఫారీలు నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 111 పరుగులకే కుప్పకూలింది.
మ్యాచ్ హైలైట్స్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు అభిషేక్ శర్మ (15), తిలక్ వర్మ (1) నిరాశపరిచారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18), వాషింగ్టన్ సుందర్ (11) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు ఆగలేకపోయారు.
కేశవ్ మహరాజ్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి భారత వెన్ను విరిచారు. చివర్లో శివమ్ దూబె (36*) సిక్సర్లతో విరుచుకుపడినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 17వ ఓవర్ నుంచి సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ స్కోరు 111 వద్దే ఆగిపోయింది.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (63) అర్ధశతకంతో రాణించగా, డేవాల్డ్ బ్రెవిస్ (45), ట్రిస్టన్ స్టబ్స్ (44*) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో రాణించగా, అర్ష్‌దీప్ 2 వికెట్లు తీశారు. అయితే ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్య 20 పరుగులు సమర్పించుకోవడం సఫారీలకు భారీ స్కోరునందించింది. దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం, మధ్య ఓవర్లలో రన్ రేట్ పెరిగిపోవడం భారత్ కొంపముంచింది. సఫారీ బౌలర్లు యాన్సన్, రబాడ, మహరాజ్ ప్రణాళికాబద్ధంగా బంతులేసి భారత్‌ను కట్టడి చేశారు.
Also Read: Lunar Eclipse Astrology: చంద్రగ్రహణం ఎఫెక్ట్..జాక్‌పాక్ కొట్టే రాశులు ఇవే..దోష నివారణలు ఎలా చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bullet Coffee For Weight Loss: ప్రస్తుతం సోషల్ మీడియాలో 'బుల్లెట్ కాఫీ' ట్రెండ్ నడుస్తోంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మ్యాజిక్ డ్రింక్ అని చాలామంది నమ్ముతున్నారు. ఇంతకీ బుల్లెట్ కాఫీ అంటే ఏంటి? ఇది నిజంగా బరువు తగ్గిస్తుందా? అసలు విషయమేంటో నిపుణుల సూచనలను తెలుసుకుందాం.
బుల్లెట్ కాఫీ అంటే ఏమిటి?
సాధారణంగా మనం తాగే కాఫీలో పాలు, చక్కెర ఉంటాయి. కానీ బుల్లెట్ కాఫీ తయారీ విధానం వేరు. నీటిలో కాఫీ పొడిని వేసి మరిగించి, అందులో 2 టీస్పూన్ల నెయ్యి లేదా వెన్న కలిపి దీనిని తయారు చేస్తారు. ఇందులో పాలు గానీ, చక్కెర గానీ అస్సలు ఉండవు.
కొందరు ఆరోగ్య నిపుణుల వివరణ ప్రకారం.. బుల్లెట్ కాఫీ తాగడం వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే నెయ్యి లేదా వెన్న వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల అనవసరమైన స్నాక్స్ తినాలనిపించదు. ఇది తాగిన తర్వాత చాలా మందికి మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. తద్వారా అల్పాహారం (ఇడ్లీ, దోశ వంటి కార్బోహైడ్రేట్లు) ద్వారా వచ్చే కేలరీలను తగ్గించుకోవచ్చు.
ఎవరు తాగకూడదు? (హెచ్చరిక)
బుల్లెట్ కాఫీ అందరికీ మంచిది కాదని డాక్టర్ హెచ్చరిస్తున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇందులోని కొవ్వు స్థాయిలు కొలెస్ట్రాల్‌ను మరింత పెంచే ప్రమాదం ఉంది. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది.
గుర్తుంచుకోవాల్సిన విషయం
కేవలం బుల్లెట్ కాఫీ తాగేసి, సాయంత్రం వేళల్లో సమోసాలు, బజ్జీలు తింటే బరువు తగ్గడం అసాధ్యం. "తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కేలరీలు, సరైన ప్రోటీన్లు, కూరగాయలు, వ్యాయామంతో కూడిన జీవనశైలిని పాటిస్తూ.. ఆకలిని నియంత్రించుకోవడానికి మాత్రమే బుల్లెట్ కాఫీని ఒక సాధనంగా వాడాలి" నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Lunar Eclipse Astrology: చంద్రగ్రహణం ఎఫెక్ట్..జాక్‌పాక్ కొట్టే రాశులు ఇవే..దోష నివారణలు ఎలా చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Latest Crime News: రాజస్థాన్‌లోని జోగ్‌పూర్ జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.. ఒకే వేదికపై మరికొద్ది గంటల్లో వివాహం చేసుకోవలసిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడడం ఇప్పుడు తీవ్ర చర్చనీ అంశానికి దారితీస్తోంది. శనివారం జరగాల్సిన తమ పెళ్లిళ్లకు ముందే వారు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు వీరిద్దరికీ ఏం జరిగి ఉంటుంది? పెళ్లి జరగాల్సిన మరికొద్ది గంటల్లోనే ఇలా చనిపోవడానికి గల అసలైన కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి వివరాల్లోకి వెళితే.. శోభ, విమల ఇద్దరు ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.. వీరిద్దరికీ ఒకే రోజు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.. అయితే శనివారం తెల్లవారుజామున వీరిద్దరి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు..
ప్రాథమిక విచారణలో భాగంగా.. వీరిద్దరూ విషపూరిత పదార్థాలు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. అయితే వీరి మరణానికి కుటుంబ సభ్యుల ఒత్తిడే కారణమని మృతుల మేనమామ జస్వంత్ సింగ్ ఆరోపిస్తూ వస్తున్నారు.. దీప్ సింగ్ సోదరులు గతంలో ఇష్టం లేని పెళ్లి సంబంధాలను మళ్లీ ఖరారు చేయాలని ఒత్తిడి చేయడంతో.. తండ్రి తమ్ముడి వేధింపుల వాళ్లే యువతులు ఈ నిర్ణయం తీసుకున్నారని అతను ఆరోపిస్తూ వస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. అప్పటికే కుటుంబ సభ్యులు అంతక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు అడ్డుకొని మృతదేహాలను తరలించారని సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగానే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని.. కుటుంబ సభ్యుల ఆరోపణల దిశగా కూడా విచారణలు జరుగుతున్నాయని ఉన్నత అధికారులు వెల్లడించారు. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lunar Eclipse Zodiac Predictions: 2026 మార్చి 3న తొలి చంద్రగ్రహణం సంభవించనుంది. అయితే ఈ గ్రహణం ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయాన్ని ప్రముఖ జోతిష్యులు చెబుతున్న వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహణ సమయం
తేదీ: మార్చి 3, 2026.
సమయం: సాయంత్రం 6:15 నుండి 6:45 వరకు (స్వల్ప వ్యవధి).
విశేషం: ఇది పాక్షిక చంద్రగ్రహణం. సింహ రాశిలోని పుబ్బ నక్షత్రంలో సంభవిస్తుంది. భారతదేశంలో ఇది పాక్షికంగా కనిపిస్తుంది.
ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
జాగ్రత్త వహించాల్సిన రాశులు..
సింహ రాశి: కీర్తి ప్రతిష్టల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
మేషం: గర్భిణీలు, షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు జాగ్రత్త.
కర్కాటకం: ఆర్థిక లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.
కన్య: రాబోయే 40 రోజుల పాటు పెట్టుబడులు, ఖర్చులపై నియంత్రణ అవసరం.
ధనస్సు: తండ్రి ఆరోగ్యం, బ్యాంకింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం.
కుంభం: వివాహ నిర్ణయాలు, భాగస్వామ్య వ్యాపారాల్లో ఆవేశపడకూడదు.
శుభ ఫలితాలు పొందే రాశులు..
మిధునం: పట్టుదలతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.
తులా: ఈ గ్రహణం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది.
వృశ్చికం: కెరీర్ పరంగా మెరుగైన అవకాశాలు ఉంటాయి.
మీనం: శత్రువులపై విజయం సాధిస్తారు.
సామాన్య ఫలితాలు..
వృషభం: అనవసర మనస్తాపాలకు దూరంగా ఉండాలి.
మకరం: ఫలితాలు సాధారణంగా ఉంటాయి, ఆస్తి వివాదాలు వచ్చే అవకాశం ఉంది.
దోష నివారణకు పరిహారాలు
గ్రహణ ప్రభావం 40 రోజుల వరకు ఉంటుంది. దోష నివారణకు ఈ క్రింది చర్యలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. గ్రహణం మరుసటి రోజు బియ్యం, గోధుమలు, ఉలవలు, మినుములు, నువ్వులు, ఆవు నెయ్యితో కూడిన ఇత్తడి గిన్నెను దానం చేయాలి. గ్రహణ సమయంలో ఇష్టదైవ మంత్రం లేదా గురు మంత్రం జపించడం వల్ల వేల రెట్ల ఫలితం ఉంటుంది.
ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి. ఆర్థిక వృద్ధికి "ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధినీ నమః".. రుణ విముక్తికి "ఓం అపర్ణాయ నమః".. వివాహం కోసం "ఓం కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కందరాయే నమః" వంటి ఉపకరిస్తాయి.
రాజకీయ, సామాజిక ప్రభావం
ఈ చంద్రగ్రహణం రాజకీయ నాయకులకు, దేశాధినేతలకు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. ప్రభుత్వాల్లో మార్పులు, రాజకీయ విమర్శలు, ప్రముఖుల ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Uber Driver Success Story Telugu News: పట్టుదలతో పాటు ఓర్పు ఉంటే ఏ రంగంలోనైనా ఎంతో సులభంగా రాణించవచ్చని ఓ ఉబర్ డ్రైవర్ నిరూపించారు.. గత 8 సంవత్సరాలుగా క్యాబ్ నడుపుతూ ఏకంగా 50 వేల ట్రిప్పులను పూర్తి చేసి హజ్రత్ అలీ అనే డ్రైవర్ ఉబర్ తన ఎక్స్పీరియన్స్‌ను పంచుకున్నారు. ఉబర్ ఇండియా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఆయన ప్రయాణం ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే, ఆ డ్రైవర్ కష్టానికి ప్రతిఫలం లభించిందా? ఆయన ప్రతి నెల ఎంత సంపాదిస్తున్నాడు? అనే అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
హజ్రత్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం.. తను ఉబర్‌లో జాయిన్ అయి 8 ఏళ్లు అయ్యిందని.. ఒక్కొక్క నెలలో గరిష్టంగా రూ.1.2 వరకు సంపాదించారని తెలిపారు. అంతేకాకుండా ప్రతి నెల ఇంత మొత్తంలో రాలేదని.. సీజన్‌తో పాటు గిరాకీని బట్టి ఆదాయం మారుతూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా రోజుకు 20 నుంచి 30 ట్రిప్పులు పూర్తిచేస్తూ.. పిల్లలను ప్రైవేటు స్కూల్లో చదివించే స్థాయికి ఎదిగారని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఇంటికి సంబంధించిన కొన్ని రకాల సామాగ్రిలను కూడా కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన.. హజ్రత్ అలీ పదేళ్ల క్రితం ఢిల్లీకి వలస వచ్చారట.. మొదట్లో బైక్ రిపేర్ షాప్‌లో జీతం ఉండే వారట. అంతేకాకుండా కొట్టు పనులు చేయడం వంటి చిన్న చిన్న పనులు రోజు చేసే వారట. 2014లో మొదటిసారిగా ఆటో కొనుగోలు చేసి ఉబర్‌లో చేరారు.. కరోనా సమయంలో ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.. దీంతో ఇల్లు గడవడానికి ఆ ఆటో అమ్మాల్సి వచ్చినప్పటికీ.. పట్టు వదలకుండా రాత్రి పగలు ఎంతగానో శ్రమించారు. 2024లో తన ఆటోను విక్రయించి.. కొత్త కారును కొనుగోలు చేసి ప్రస్తుతం గుర్గావ్ ప్రాంతంలో కారు నడుపుతున్నట్లు నడుపుతున్నారు..
ఆయన ఉదయం ఏడు గంటలకే తన డ్యూటీని ప్రారంభించే వారట.. రాత్రి 9 లేదా 10 గంటల వరకు అంటే రోజుకు 14 గంటలపాటు పనిచేస్తూ ఉండేవారట. వంద మంది కస్టమర్లతో ఎవరో ఒకరు కోపంగా ఉన్నప్పటికీ.. ఎంతో అపురూపంగా పలకరిస్తూ క్యాబ్‌ను నడిపే వారట.. కష్టపడి పని చేస్తే ఉబెర్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గౌరవప్రదమైన జీవనాన్ని సాగించవచ్చని.. తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో ఈ వృత్తి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు.. ప్రస్తుతం ఈ డ్రైవర్‌కు సంబంధించిన సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Musi River Project: మూసీ ప్రాజెక్టు పేరిట ప్రజల ఇల్లు కూల్చడంతోపాటు రూ.లక్ష కోట్లు ఖర్చు ఎందుకు అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. మూసీ సుందరీకరణ పేరిట మీ ఇండ్లు కూల్చి, మీ భూములు లాక్కొని.. వాటిని అంబానీకో, అదానీకో, మెగా కృష్ణారెడ్డికో కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ఆరోపించారు. జేబులు నింపుకోవడానికి చేసే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పూర్తిగా వ్యతిరేకమని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
మూసీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లోని బాపుఘాట్ ప్రాంతంలో భూసేకరణలో కోల్పోనున్న మధు పార్క్ అపార్ట్‌మెంట్‌వాసులతో బీఆర్‌ఎస్ పార్టీ సమావేశమైంది. బాధితుల పక్షాన నిలిచి వారి తరఫున పోరాటం చేస్తామని ప్రతిపక్ష పార్టీ భరోసా ఇచ్చింది. ఈ సందర్భంగా బాధితుల మొర విన్న అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. 'రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్‌లో కట్టిన ఇల్లు ఒక్కటీ లేదు. కూల్చిన బతుకులు, కూల్చిన ఇండ్లు తప్ప మరేమీ లేవు. చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బుల్లేవంటాడు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, రైతులకు రైతుబంధు అడిగితే డబ్బుల్లేవంటాడు. గురుకులాల్లో అన్నం పెట్టక 162 మంది విద్యార్థులు చనిపోయారు. అడిగితే రాష్ట్రం దివాలా తీసింది, నా దగ్గర పైసల్లేవు నన్ను కోసుకు తింటారా అంటాడు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు గుర్తు చేశారు.
Also Read: Boggula Srinivas: 'పవన్ కల్యాణ్ హఠావో' పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై వీడిన మిస్టరీ
'మరి పైసలు లేకపోతే మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జూబ్లీహిల్స్‌లో రూ.వంద కోట్లతో సీఎం క్యాంపు ఆఫీస్, రూ.5 కోట్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మూడో క్యాంపు ఆఫీస్ కట్టుకోవడానికి పైసలు ఎక్కడివి?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. 'బడా కాంట్రాక్టర్లకు రూ. 20,000 కోట్లు బిల్లులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదలకు ఇవ్వమంటే మాత్రం రేవంత్ రెడ్డికి డబ్బులు ఉండవా?' అని ప్రశ్నించారు.
Also Read: 14 KM Flyover: విజయవాడలో 14 కిలోమీటర్ల అతి పొడవైన ఫ్లైఓవర్? ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!
'మూసీ శుద్ధికి వ్యతిరేకం కాదు. ఎస్టీపీలు కట్టి మురుగునీరు రాకుండా చెయ్. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పైపులైన్లతో గోదావరి నీళ్లతో మూసీని శుద్ధి చేయాలి. కానీ మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని మాత్రమే మేం వ్యతిరేకిస్తున్నాం' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు స్పష్టం చేశారు. బాపుఘాట్ వద్ద అహింసా మూర్తి గాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలి తప్ప.. ఆ విగ్రహం, నిర్మాణం పేరిట ప్రజల ఇండ్లు కూల్చుతూ, హింసాత్మక మార్గంలో భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.
'ఇండ్లు ఖాళీ చేస్తారా, లేక జేసీబీ పంపి కూల్చమంటారా అని అధికారులు బెదిరిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఈ అపార్ట్‌మెంట్ అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కావచ్చు.. కానీ ఒక మధ్యతరగతి వాడికి రెక్కలు ముక్కలు చేసుకుని, బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు తెచ్చుకుని కట్టుకున్న జీవితకాలపు సొంతింటి కల అది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'ఇండ్లు కూల్చడమంటే ఇక్కడి బతుకులను కూల్చడమే. పసిపిల్లలు కంటిమీద కునుకు లేకుండా రేపు పరీక్షలు ఎలా రాస్తారు? నీకేంటి రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. రోడ్డున పడేది ఈ పేదలు' అని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు అసలు డీపీఆర్ లేదు. ఎఫ్‌టీఎల్ ఫిక్స్ కాలేదు. ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ రాలేదు. కనీసం సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ కూడా జరగలేదు. అలాంటప్పుడు నోటీసులు ఎలా ఇస్తారు?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని బాగు చేసి చూపిస్తామని ప్రకటించారు.
'కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల రేట్లు పడిపోయాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. ఎక్కడ చూసినా దోపిడీయే. హైడ్రా ముసుగులో దోపిడీ, మూసీ ప్రాజెక్టు విషయంలో దోపిడీ, ఫ్యూచర్ సిటీ పేరిట, సెంట్రల్ యూనివర్సిటీ పేరిట, భూముల అమ్మకాల పేరిట అంతా దోపిడీ చేస్తున్నారు. మేం కేవలం రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే మేం మాట్లాడుతున్నాం. ప్రభుత్వం బేషజాలకు, పట్టింపులకు పోకుండా.. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు డిమాండ్ చేశారు.
'మా ఇండ్లు కూలగొట్టే బదులు.. మా నీళ్ల ట్యాంకులో విషం కలిపితే మేమంతా తాగి చచ్చిపోతాం.. మమ్మల్ని చంపండి అని ఇక్కడ ఒక తల్లి అన్న మాట నన్ను ఎంతగానో కలచివేసింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అక్రమాలపై ఎంత దూరమైనా వెళతామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Boggula Srinivas Death Case: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన పుస్తకం తీసుకువచ్చిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణించడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆయనను హత్య చేసి పాలేరు రిజర్వాయర్‌లో పడేశారని తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖమ్మం పోలీసులు అత్యంత వేగంగా విచారణ చేశారు. బొగ్గుల శ్రీనివాస్ హత్య ఆర్థిక లావాదేవీల కారణంగా జరిగిందని పోలీసులు ప్రకటించారు. బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యనేనని ధ్రువీకరించారు. ఖమ్మం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యగా పోలీసులు ధ్రువీకరిస్తూ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ తిరుపతి రెడ్డి వివరాలు వెల్లడించారు. బొగ్గుల శ్రీనివాస్‌ను అతడి స్నేహితుడు హత్యకు పాల్పడ్డారని ధ్రువీకరించారు.
Also Read: Telangana Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 3 నెలలు భారీ ఉద్యమం
ఈనెల 14వ తేదీన పాలేరు రిజర్వాయర్‌లో కారు పడటంతో మృతి చెందిన బొగ్గుల శ్రీనివాస్ ని ఆర్ధిక లావాదేవీల కారణంగా హత్య చేశారని ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు. బొగ్గుల శ్రీనివాస్‌కు boggula bbq పేరుతో జీఎస్టీ లైసెన్స్ ఉంది. శ్రీనివాస్ స్నేహితుడు వేణు మాధవ్ రెడ్డి సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తుంటాడు. దీంతో శ్రీనివాస్‌కు ఉన్న జీఎస్టీ లైసెన్స్‌తో కలిసి పని చేద్దామని చెప్పడంతో తనకు 50 శాతం వాటా ఇవ్వాలని శ్రీనివాస్ కోరాడు. దీంతో 2022 నుంచి2025 వరకు వీరిద్దరూ కలిసి వ్యాపారం చేశారు.
Also Read: 14 KM Flyover: విజయవాడలో 14 కిలోమీటర్ల అతి పొడవైన ఫ్లైఓవర్? ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!
వ్యాపారంలో రూ.90 లక్షలు లాభం రావడంతో వాటి పంపకాల్లో తేడాలు వచ్చాయి. వచ్చిన లాభంలో శ్రీనివాస్‌కు రూ.15 లక్షలు మాత్రమే వేణుమాధవ్ రెడ్డి ఇచ్చాడు. మిగతా రూ.30 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పాడంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి. జీఎస్టీ మోసం చేశారని శ్రీనివాస్ లైసెన్స్ క్యాన్సిల్ కావడంతో రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో వారిద్దరి మధ్య వివాదం మొదలైంది. ఆ డబ్బులు అడుగుతున్న శ్రీనివాస్‌ను హత్య చేయాలని వేణుమాధవ్ రెడ్డి నిర్ణయించారు.
బొగ్గుల శ్రీనివాస్ హత్యకు సంబంధించి వేణుమాధవ్ రెడ్డి ప్రణాళిక రూపొందించాడు. ఈనెల 13వ తేదీన శ్రీనివాస్‌కు విజయవాడలో డబ్బులు ఇస్తామని చెప్పి వేణుమాధవ్ రెడ్డి మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి తన కారులో తీసుకెళ్లాడు. నకిరేకల్ నుంచి జనగామ వైపు వెళ్లే దారిలో శ్రీనివాస్‌ను కత్తులు, ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. అనంతరం ప్రమాదంగా చూపించేందుకు కారును పాలేరు రిజర్వాయర్‌లో వేణుమాధవ్ రెడ్డి పడేసి జారుకున్నాడు. అయితే మృతుడి ఒంటిపై ఉన్న గాయాలతో అది ప్రమాదం కాదు హత్యగా పోలీసులు అనుమానించి విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఇతర సాక్ష్యాలతో శ్రీనివాస్‌ను హత్య చేసిన నలుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Vijayawada Longest Flyover: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరంగా ఉన్న విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బెజవాడలో అతి పెద్ద ఫ్లైఓవర్ రానున్నట్లు సమాచారం. ఫ్లైఓవర్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం మార్గంలో అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 14 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్ నిర్మాణం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అది కుదరకపోతే రెండు ఫ్లైఓవర్ల చొప్పున నిర్మించాలా? అని ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.
Also Read: Telangana Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 3 నెలలు భారీ ఉద్యమం
ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరంగా ఉన్న విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తొలగించడంతోపాటు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించే ప్రతిపాదనలు అధికారులు చేస్తున్నారు. విజయవాడ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ పార్క్ నుంచి మచిలీపట్నం మార్గంలో గంగూరు చౌరస్తా వరకు మొత్తం 14 కిలోమీటర్ల అతి పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. అతి పెద్ద ఫ్లైఓవర్‌ను ఏకంగా ఆరు వరుసలతో నిర్మించాలని భావిస్తోంది.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం కావడంతో ఈ ప్రాజెక్టుపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)తో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆరు లేన్లుగా తయారవుతోంది. కొంత మార్గం కూడా పూర్తయ్యింది. మచిలీపట్నం వరకు ఇదే రీతిన ఆరు లేన్లతో రహదారి విస్తరణ జరగనుంది. ఆ రహదారి విజయవాడ మధ్యలో ఉండడంతో బెజవాడలో కూడా రోడ్డు విస్తరణ జరగాల్సి ఉంది.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
ఆరు లేన్ల రోడ్డు నిర్మిస్తే రాష్ట్రాల మధ్య ప్రయాణం సులభం కానుంది. వేగంగా వాహనాల ప్రయాణం ఉంటుంది. ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణంతో విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణంతో విజయవాడలో వాహనాల రద్దీ తగ్గనుంది. ఇరుకు రోడ్లు కాస్త పెద్దగా మారుతాయి. దీంతో విజయవాడ ప్రజలు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు.
14 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ప్రతిపాదనలు
హైదరాబాద్-విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారి నంబర్ 65పై ఉంది. ఈ ఫ్లైఓవర్ జాతీయ రహదారిపై నిర్మించనున్నారు.
ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానీపురం, కనకదుర్గ ఫ్లైఓవర్, కృష్ణలంక, వారధి జంక్షన్, బెంజ్ సర్కిల్, ఆటోనర్, కానూరు, పోరంకి, పెనమలూరు
అతి పొడవున ఫ్లైఓవర్ కావడంతో అప్రోచ్ ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంది. వీటికోసం భూసేకరణ చేయాల్సి ఉంది.
Also Read: Telangana BJP: ఎవరు అడ్డుకున్నా.. కామారెడ్డి, బాన్సువాడకు వెళ్లి తీరుతాం: తెలంగాణ బీజేపీ
సుదీర్ఘంగా 14 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యసాధ్యాలు అధికారులు, ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒకవేళ 14 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్ సాధ్యం కాని పక్షంలో రెండు ఫ్లైఓవర్ల చొప్పున నిర్మించే యోచన కూడా ప్రభుత్వం చేస్తోంది.
రెండు ఫ్లైఓవర్లు ఇలా
1. కనకదుర్గ వారధి నుంచి కృష్ణలంక, వారధి చౌరస్తా మీదుగా బెంజ్‌సర్కిల్ వరకు 5 కిలో మీటర్ల మేర ఫ్లైఓవర్
2. బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు చౌరస్తా వరకు 9 కిలోమీటర్ల ఫ్లైఓవర్
ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు సంబంధించి ఇంకా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం ఆమోదం పొందితే విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతోపాటు తెలంగాణకు సులువుగా రాకపోకలు జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంపై కొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Siddipet Latest Telugu News: సిద్ధిపేట జిల్లాలోని మిట్టపలి పరిధిలో ఉన్న ఓ మెడికల్ కళాశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫ్యూచర్‌లో మంచి వైద్యురాలిగా మారి సమాజానికి సేవ చేయాల్సిన కలలుగన్న ఓ మెడికల్ విద్యార్థి అర్థాంతరంగా తనువు చాలించడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తోటి విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం దిబ్రాంతికి గురయ్యేలా కళాశాల హాస్టల్ గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్దపెల్లి జిల్లాకు చెందిన శ్రీజ సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి శివారులో ఉన్న ఒక ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుకుంటుంది. సండే కావడంతో విద్యార్థులంతా సెలవుల మూడ్ లో ఉండి ఇంటికి వెళ్ళిపోయారు.. శ్రీజ మాత్రం తను హాస్టల్ గదిలో ఒంటరిగా ఉంది.. మధ్యాహ్నం సమయంలో గదిలో ఎవరూ లేని విషయాన్ని గమనించిన ఆమె.. ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది..
ఎంతో సేపయినప్పటికీ శ్రీజ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు గది వద్దకు వెళ్లి చూడగా ఆమె ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది.. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు వెంటనే కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు.. అయితే, వారు పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. ఘటనా స్థలానికి చేరుకున్న ఏరియా పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో.
శ్రీజ మరణ వార్త తెలిసిన వెంటనే పెద్దపల్లిలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ.. ఉన్నత చదువుల కోసం సిటీకి పంపిస్తే ఇలా శివమై తిరిగి వస్తుందని ఊహించలేదని వారు శోకసముద్రంలో మునిగారు.. శ్రీజ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.. చదువులో ఒత్తిడి కారణమా లేక ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ప్రత్యేకమైన దర్యాప్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు శ్రీజ ఉంటున్న గదిలో ఏవైనా సూసైడ్ నోట్లు ఉన్నాయా అని తనిఖీలు చేశారు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Karimnagar Latest News: మావోయిస్టు అగ్రనాయకత్వంలో ఇప్పుడు పెను సంచలనం మొదలైంది గా భావించవచ్చు. దశాబ్ద కాలంగా అండర్ గ్రౌండ్ లో ఉద్యమం నడుపుతున్న కేంద్ర కమిటీకి సంబంధించిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ.. ఇప్పుడు పోలీసులకు లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ కగార్ టు నేపథ్యంలో ఈ కీలకమైన పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కి సంబంధించిన కీలకమైన వ్యక్తి లొంగిపోవడం ఆ పార్టీకి పెద్ద ఊహించని షాక్ గా మారింది..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిరుపతి ప్రస్థానం 1980 సంవత్సరం నుంచి మొదలైంది. కాలేజీ రోజుల్లోనే రాడికల్ విద్యార్థి సంఘంలో అత్యంత చురుకుగా పనిచేసే ఆయన.. అప్పటి రాజకీయ ఘర్షణల నేపథ్యంలో 1884లో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. ముక్క వెంకటేష్‌తో పాటు నిజాముద్దీన్ వంటి సహచరులతో కలిసి ఉద్యమ బాట పట్టారు. అంచెలంచెలుగా పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మకమైన విభాగంగా భావించే కేంద్ర కమిటీలో కీలకమైన బాధ్యతలు కూడా చేపట్టినట్లు సమాచారం. నంబాల కేశవరావు తర్వాత పార్టీ పగ్గాలు ఈయన చేపట్టారన్న ప్రచారం కూడా ఉంది..
దేవ్జీ లొంగిపోయాడన్న వార్తలు రావడంతోనే ఆయన తమ్ముడితో పాటు కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.. దీర్ఘకాలంగా అన్నయ్య కుటుంబానికి దూరంగా ఉన్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలియదని.. ప్రభుత్వం ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టకుండా.. చట్టబద్ధంగా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు.. ముఖ్యంగా ఆయన వయస్సు, ఆరోగ్యరీత్యా మానవీయ కోణంలో చూడాలని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కోరారు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో బలగాల కూబీంగ్ ఎంతో ముమ్మరంగా ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో తిరుపతి తో పాటు కీలక నేత రాజిరెడ్డి మరికొందరు సభ్యులు తెలంగాణ SIB ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది.. ఒకవేళ ప్రధాన కార్యదర్శి స్థాయిలో వ్యక్తి లొంగిపోవడం నిజమైతే.. అది మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఒక శకం ముగిసినట్లు అవుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. అయితే దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Gandhi Sarovar Project: 'మూసీ సుందరీకరణ కాదు.. ఇది రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ. ఆయన వేసే ప్రతి అడుగు వెనుకా భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే. పేదల ఇండ్లు కూల్చి.. మేఘా కృష్ణారెడ్డికి భూములు కట్టబెట్టే కుట్ర ఇది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. పేదలకు డబ్బుల్లేవనే రేవంత్ రెడ్డికి.. రూ.వందల కోట్లతో క్యాంపు ఆఫీసులకు పైసలెక్కడివి? అని ప్రశ్నించారు. కేసీఆర్ తాగునీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే.. రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నాడని మండిపడ్డారు.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇళ్లు కోల్పోతున్న హైదరాబాద్‌లోని మధు పార్క్ అపార్ట్‌మెంట్ బాధిత కుటుంబాలను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. 'డీపీఆర్ లేదు, ఎఫ్‌టీఎల్ తేలలేదు, అనుమతులు లేవు. ఏ చట్టం ప్రకారం ఇళ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇస్తున్నారు? ఇళ్లు కూల్చే బదులు నీళ్ల ట్యాంకులో విషం కలిపి చంపండి అని తల్లులు ఆవేదన చెందుతున్నా ఈ ప్రభుత్వానికి కనీస కనికరం లేదా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
మధుపార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు. 'కేసీఆర్ మమ్మల్ని ఇక్కడికి పంపించారు. కేసీఆర్‌కు మధు పార్క్ అపార్ట్‌మెంట్‌తో మర్చిపోలేని అనుబంధం ఉంది. కేసీఆర్ ఈ అపార్ట్‌మెంట్‌కు మూడుసార్లు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ పాలసీ విజన్ డాక్యుమెంట్‌ను ఇక్కడి వార్ రూముల్లో కూర్చునే తయారు చేశారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.
Also Read: Rs 151 Talambralu: రూ.151 చెల్లిస్తే భక్తుల ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
'కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఇక్కడ తాగునీళ్లు లేక మీరు అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి వెళ్లిపోతామంటే అప్పటికప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించి ప్రత్యేక పైపులైన్ వేశారు. అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో బటన్ ఆన్ చేయించి మరీ మీకు నీళ్లు ఇచ్చారు. సబితక్కకు మీరు ఒక్క ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే మీ ముందు రోడ్డు వేయించారు. నాడు మూసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సుధీర్ రెడ్డి గారు మూసీని క్లీన్ చేయించి మీకు దోమల బెడద లేకుండా చేశారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు.
'కేసీఆర్ ఎప్పుడూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా పెంచాలి? ప్రజలకు ఎలా మేలు చేయాలి అని ఆలోచించారు. ఈ అపార్ట్‌మెంట్‌ను నిలబెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం జేసీబీలతో దీన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదు. పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు విమర్శించారు.
'మూసీని శుద్ధి చేయాలని అందరూ కోరుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా అప్పట్లోనే రూ.3,800 కోట్లతో ఎస్టీపీలను నిర్మించి ఆ పని ప్రారంభించింది. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలోకి వదిలేందుకు డీపీఆర్‌లను కూడా కేసీఆర్ ప్రభుత్వం తయారు చేయించింది. అప్పుడు మా ప్రభుత్వానికి ఏ ఒక్క ఇల్లూ కూల్చే ఆలోచన రాలేదు. రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక కచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉంటుంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
'రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుందామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఎల్టీపీఎస్ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆలోచన చేశాడు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ 14,000 ఎకరాలు సేకరిస్తే.. దాన్ని ఫోర్త్ సిటీ అని పేరు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Netflix Scam Telugu: సినీ గ్లామర్ వరల్డ్‌పై ఉన్న మోజును ఆసరాగా చేసుకుని.. అమాయక పడచు యువతులతో పాటు యువకులను నిలువునా ముంచేస్తున్న ఒక భారీ నెట్వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఇటీవల చేదించారు. Netflixతో పాటు దిగ్గజ ఓటిటి సంస్థలు, టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల సంస్థల పేర్లతో మోసాలకు పాల్పడుతున్న ఓ లేడీ నిందితురాలు మాధవి అలియాస్ సిరి చందనను శనివారం పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ లేడీ కిలాడి చేసిన మోసాలు చూసి పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఆమె చేసిన మోసాలేంటి? అసలు యువతులను ఎలా ట్రాప్ చేసింది.? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దర్యాప్తులో భాగంగా తేలిన కొన్ని అంశాలు పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసేలా చేశాయంటే మామూలు మాట కాదు.. ఈ మూట కేవలం వ్యక్తులను మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమలోని దిగ్గజ సంస్థలైన అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు దిల్ రాజు ప్రొడక్షన్స్ డివివి దానయ్య, మైత్రి మూవీ మేకర్స్ వంటి బ్యానర్ల పేర్లను వాడుకొని నకిలీ ఆఫర్ లెటర్లను సృష్టించింది. అంతటితో ఆగకుండా తెలుగుతో పాటు సౌత్ ఇండియా, ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో ముద్రలను కూడా ఫోర్జరీ చేసి బాధితులను నమ్మించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం..
ఈ కుంభకోణం వెనక మరో 12 మంది నకిలీ దర్శకుల హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. వీరంతా ప్రముఖ దర్శకుల పేర్లను వాడుకుంటూ ప్రాజెక్టులు ఉన్నాయని అమాయకులను నమ్మిస్తూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 12 మంది హీరో ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్న బాధితులు వీరి ట్రాప్‌లో పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నట్లు సమాచారం.. అంతేకాకుండా పోలీసులు త్వరలోనే ఈ నకిలీ దర్శకులతో పాటు బాధితుల పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారికంగా తెలిపినట్లు సమాచారం.
ఈ ముఠా కేవలం ఒకటి రెండు సినిమాలతో ఆగకుండా.. దాదాపు 50 నుంచి 60 వరకు నకిలీ చిత్రాల పేర్లతో కొత్త కొత్త స్కామ్‌లకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.. వీరి నెట్వర్క్ హైదరాబాద్‌కి పరిమితమే కాకుండా దేశంలో ఇతర మెట్రోపాలిటన్ సిటీలో కూడా విస్తరించినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. సినిమా ఆఫర్స్ ఇస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే.. 100 శాతం మోసంగా గ్రహించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.. ప్రముఖ సంస్థలు ఎప్పుడు నటుల నుంచి డబ్బులు వసూలు చేయమని.. ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి