Vijayawada Longest Flyover: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరంగా ఉన్న విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బెజవాడలో అతి పెద్ద ఫ్లైఓవర్ రానున్నట్లు సమాచారం. ఫ్లైఓవర్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం మార్గంలో అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 14 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్ నిర్మాణం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అది కుదరకపోతే రెండు ఫ్లైఓవర్ల చొప్పున నిర్మించాలా? అని ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.
Also Read: Telangana Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 3 నెలలు భారీ ఉద్యమం
ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరంగా ఉన్న విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తొలగించడంతోపాటు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించే ప్రతిపాదనలు అధికారులు చేస్తున్నారు. విజయవాడ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ పార్క్ నుంచి మచిలీపట్నం మార్గంలో గంగూరు చౌరస్తా వరకు మొత్తం 14 కిలోమీటర్ల అతి పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. అతి పెద్ద ఫ్లైఓవర్‌ను ఏకంగా ఆరు వరుసలతో నిర్మించాలని భావిస్తోంది.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం కావడంతో ఈ ప్రాజెక్టుపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)తో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆరు లేన్లుగా తయారవుతోంది. కొంత మార్గం కూడా పూర్తయ్యింది. మచిలీపట్నం వరకు ఇదే రీతిన ఆరు లేన్లతో రహదారి విస్తరణ జరగనుంది. ఆ రహదారి విజయవాడ మధ్యలో ఉండడంతో బెజవాడలో కూడా రోడ్డు విస్తరణ జరగాల్సి ఉంది.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
ఆరు లేన్ల రోడ్డు నిర్మిస్తే రాష్ట్రాల మధ్య ప్రయాణం సులభం కానుంది. వేగంగా వాహనాల ప్రయాణం ఉంటుంది. ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణంతో విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణంతో విజయవాడలో వాహనాల రద్దీ తగ్గనుంది. ఇరుకు రోడ్లు కాస్త పెద్దగా మారుతాయి. దీంతో విజయవాడ ప్రజలు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు.
14 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ప్రతిపాదనలు
హైదరాబాద్-విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారి నంబర్ 65పై ఉంది. ఈ ఫ్లైఓవర్ జాతీయ రహదారిపై నిర్మించనున్నారు.
ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానీపురం, కనకదుర్గ ఫ్లైఓవర్, కృష్ణలంక, వారధి జంక్షన్, బెంజ్ సర్కిల్, ఆటోనర్, కానూరు, పోరంకి, పెనమలూరు
అతి పొడవున ఫ్లైఓవర్ కావడంతో అప్రోచ్ ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంది. వీటికోసం భూసేకరణ చేయాల్సి ఉంది.
Also Read: Telangana BJP: ఎవరు అడ్డుకున్నా.. కామారెడ్డి, బాన్సువాడకు వెళ్లి తీరుతాం: తెలంగాణ బీజేపీ
సుదీర్ఘంగా 14 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యసాధ్యాలు అధికారులు, ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒకవేళ 14 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్ సాధ్యం కాని పక్షంలో రెండు ఫ్లైఓవర్ల చొప్పున నిర్మించే యోచన కూడా ప్రభుత్వం చేస్తోంది.
రెండు ఫ్లైఓవర్లు ఇలా
1. కనకదుర్గ వారధి నుంచి కృష్ణలంక, వారధి చౌరస్తా మీదుగా బెంజ్‌సర్కిల్ వరకు 5 కిలో మీటర్ల మేర ఫ్లైఓవర్
2. బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు చౌరస్తా వరకు 9 కిలోమీటర్ల ఫ్లైఓవర్
ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు సంబంధించి ఇంకా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం ఆమోదం పొందితే విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతోపాటు తెలంగాణకు సులువుగా రాకపోకలు జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంపై కొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Musi River Project: మూసీ ప్రాజెక్టు పేరిట ప్రజల ఇల్లు కూల్చడంతోపాటు రూ.లక్ష కోట్లు ఖర్చు ఎందుకు అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. మూసీ సుందరీకరణ పేరిట మీ ఇండ్లు కూల్చి, మీ భూములు లాక్కొని.. వాటిని అంబానీకో, అదానీకో, మెగా కృష్ణారెడ్డికో కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ఆరోపించారు. జేబులు నింపుకోవడానికి చేసే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పూర్తిగా వ్యతిరేకమని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
మూసీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లోని బాపుఘాట్ ప్రాంతంలో భూసేకరణలో కోల్పోనున్న మధు పార్క్ అపార్ట్‌మెంట్‌వాసులతో బీఆర్‌ఎస్ పార్టీ సమావేశమైంది. బాధితుల పక్షాన నిలిచి వారి తరఫున పోరాటం చేస్తామని ప్రతిపక్ష పార్టీ భరోసా ఇచ్చింది. ఈ సందర్భంగా బాధితుల మొర విన్న అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. 'రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్‌లో కట్టిన ఇల్లు ఒక్కటీ లేదు. కూల్చిన బతుకులు, కూల్చిన ఇండ్లు తప్ప మరేమీ లేవు. చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బుల్లేవంటాడు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, రైతులకు రైతుబంధు అడిగితే డబ్బుల్లేవంటాడు. గురుకులాల్లో అన్నం పెట్టక 162 మంది విద్యార్థులు చనిపోయారు. అడిగితే రాష్ట్రం దివాలా తీసింది, నా దగ్గర పైసల్లేవు నన్ను కోసుకు తింటారా అంటాడు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు గుర్తు చేశారు.
Also Read: Boggula Srinivas: 'పవన్ కల్యాణ్ హఠావో' పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై వీడిన మిస్టరీ
'మరి పైసలు లేకపోతే మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జూబ్లీహిల్స్‌లో రూ.వంద కోట్లతో సీఎం క్యాంపు ఆఫీస్, రూ.5 కోట్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మూడో క్యాంపు ఆఫీస్ కట్టుకోవడానికి పైసలు ఎక్కడివి?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. 'బడా కాంట్రాక్టర్లకు రూ. 20,000 కోట్లు బిల్లులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదలకు ఇవ్వమంటే మాత్రం రేవంత్ రెడ్డికి డబ్బులు ఉండవా?' అని ప్రశ్నించారు.
Also Read: 14 KM Flyover: విజయవాడలో 14 కిలోమీటర్ల అతి పొడవైన ఫ్లైఓవర్? ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!
'మూసీ శుద్ధికి వ్యతిరేకం కాదు. ఎస్టీపీలు కట్టి మురుగునీరు రాకుండా చెయ్. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పైపులైన్లతో గోదావరి నీళ్లతో మూసీని శుద్ధి చేయాలి. కానీ మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని మాత్రమే మేం వ్యతిరేకిస్తున్నాం' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు స్పష్టం చేశారు. బాపుఘాట్ వద్ద అహింసా మూర్తి గాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలి తప్ప.. ఆ విగ్రహం, నిర్మాణం పేరిట ప్రజల ఇండ్లు కూల్చుతూ, హింసాత్మక మార్గంలో భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.
'ఇండ్లు ఖాళీ చేస్తారా, లేక జేసీబీ పంపి కూల్చమంటారా అని అధికారులు బెదిరిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఈ అపార్ట్‌మెంట్ అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కావచ్చు.. కానీ ఒక మధ్యతరగతి వాడికి రెక్కలు ముక్కలు చేసుకుని, బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు తెచ్చుకుని కట్టుకున్న జీవితకాలపు సొంతింటి కల అది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'ఇండ్లు కూల్చడమంటే ఇక్కడి బతుకులను కూల్చడమే. పసిపిల్లలు కంటిమీద కునుకు లేకుండా రేపు పరీక్షలు ఎలా రాస్తారు? నీకేంటి రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. రోడ్డున పడేది ఈ పేదలు' అని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు అసలు డీపీఆర్ లేదు. ఎఫ్‌టీఎల్ ఫిక్స్ కాలేదు. ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ రాలేదు. కనీసం సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ కూడా జరగలేదు. అలాంటప్పుడు నోటీసులు ఎలా ఇస్తారు?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని బాగు చేసి చూపిస్తామని ప్రకటించారు.
'కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల రేట్లు పడిపోయాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. ఎక్కడ చూసినా దోపిడీయే. హైడ్రా ముసుగులో దోపిడీ, మూసీ ప్రాజెక్టు విషయంలో దోపిడీ, ఫ్యూచర్ సిటీ పేరిట, సెంట్రల్ యూనివర్సిటీ పేరిట, భూముల అమ్మకాల పేరిట అంతా దోపిడీ చేస్తున్నారు. మేం కేవలం రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే మేం మాట్లాడుతున్నాం. ప్రభుత్వం బేషజాలకు, పట్టింపులకు పోకుండా.. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు డిమాండ్ చేశారు.
'మా ఇండ్లు కూలగొట్టే బదులు.. మా నీళ్ల ట్యాంకులో విషం కలిపితే మేమంతా తాగి చచ్చిపోతాం.. మమ్మల్ని చంపండి అని ఇక్కడ ఒక తల్లి అన్న మాట నన్ను ఎంతగానో కలచివేసింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అక్రమాలపై ఎంత దూరమైనా వెళతామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Boggula Srinivas Death Case: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన పుస్తకం తీసుకువచ్చిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణించడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆయనను హత్య చేసి పాలేరు రిజర్వాయర్‌లో పడేశారని తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖమ్మం పోలీసులు అత్యంత వేగంగా విచారణ చేశారు. బొగ్గుల శ్రీనివాస్ హత్య ఆర్థిక లావాదేవీల కారణంగా జరిగిందని పోలీసులు ప్రకటించారు. బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యనేనని ధ్రువీకరించారు. ఖమ్మం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యగా పోలీసులు ధ్రువీకరిస్తూ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ తిరుపతి రెడ్డి వివరాలు వెల్లడించారు. బొగ్గుల శ్రీనివాస్‌ను అతడి స్నేహితుడు హత్యకు పాల్పడ్డారని ధ్రువీకరించారు.
Also Read: Telangana Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 3 నెలలు భారీ ఉద్యమం
ఈనెల 14వ తేదీన పాలేరు రిజర్వాయర్‌లో కారు పడటంతో మృతి చెందిన బొగ్గుల శ్రీనివాస్ ని ఆర్ధిక లావాదేవీల కారణంగా హత్య చేశారని ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు. బొగ్గుల శ్రీనివాస్‌కు boggula bbq పేరుతో జీఎస్టీ లైసెన్స్ ఉంది. శ్రీనివాస్ స్నేహితుడు వేణు మాధవ్ రెడ్డి సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తుంటాడు. దీంతో శ్రీనివాస్‌కు ఉన్న జీఎస్టీ లైసెన్స్‌తో కలిసి పని చేద్దామని చెప్పడంతో తనకు 50 శాతం వాటా ఇవ్వాలని శ్రీనివాస్ కోరాడు. దీంతో 2022 నుంచి2025 వరకు వీరిద్దరూ కలిసి వ్యాపారం చేశారు.
Also Read: 14 KM Flyover: విజయవాడలో 14 కిలోమీటర్ల అతి పొడవైన ఫ్లైఓవర్? ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!
వ్యాపారంలో రూ.90 లక్షలు లాభం రావడంతో వాటి పంపకాల్లో తేడాలు వచ్చాయి. వచ్చిన లాభంలో శ్రీనివాస్‌కు రూ.15 లక్షలు మాత్రమే వేణుమాధవ్ రెడ్డి ఇచ్చాడు. మిగతా రూ.30 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పాడంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి. జీఎస్టీ మోసం చేశారని శ్రీనివాస్ లైసెన్స్ క్యాన్సిల్ కావడంతో రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో వారిద్దరి మధ్య వివాదం మొదలైంది. ఆ డబ్బులు అడుగుతున్న శ్రీనివాస్‌ను హత్య చేయాలని వేణుమాధవ్ రెడ్డి నిర్ణయించారు.
బొగ్గుల శ్రీనివాస్ హత్యకు సంబంధించి వేణుమాధవ్ రెడ్డి ప్రణాళిక రూపొందించాడు. ఈనెల 13వ తేదీన శ్రీనివాస్‌కు విజయవాడలో డబ్బులు ఇస్తామని చెప్పి వేణుమాధవ్ రెడ్డి మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి తన కారులో తీసుకెళ్లాడు. నకిరేకల్ నుంచి జనగామ వైపు వెళ్లే దారిలో శ్రీనివాస్‌ను కత్తులు, ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. అనంతరం ప్రమాదంగా చూపించేందుకు కారును పాలేరు రిజర్వాయర్‌లో వేణుమాధవ్ రెడ్డి పడేసి జారుకున్నాడు. అయితే మృతుడి ఒంటిపై ఉన్న గాయాలతో అది ప్రమాదం కాదు హత్యగా పోలీసులు అనుమానించి విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఇతర సాక్ష్యాలతో శ్రీనివాస్‌ను హత్య చేసిన నలుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Siddipet Latest Telugu News: సిద్ధిపేట జిల్లాలోని మిట్టపలి పరిధిలో ఉన్న ఓ మెడికల్ కళాశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫ్యూచర్‌లో మంచి వైద్యురాలిగా మారి సమాజానికి సేవ చేయాల్సిన కలలుగన్న ఓ మెడికల్ విద్యార్థి అర్థాంతరంగా తనువు చాలించడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తోటి విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం దిబ్రాంతికి గురయ్యేలా కళాశాల హాస్టల్ గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్దపెల్లి జిల్లాకు చెందిన శ్రీజ సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి శివారులో ఉన్న ఒక ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుకుంటుంది. సండే కావడంతో విద్యార్థులంతా సెలవుల మూడ్ లో ఉండి ఇంటికి వెళ్ళిపోయారు.. శ్రీజ మాత్రం తను హాస్టల్ గదిలో ఒంటరిగా ఉంది.. మధ్యాహ్నం సమయంలో గదిలో ఎవరూ లేని విషయాన్ని గమనించిన ఆమె.. ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది..
ఎంతో సేపయినప్పటికీ శ్రీజ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు గది వద్దకు వెళ్లి చూడగా ఆమె ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది.. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు వెంటనే కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు.. అయితే, వారు పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. ఘటనా స్థలానికి చేరుకున్న ఏరియా పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో.
శ్రీజ మరణ వార్త తెలిసిన వెంటనే పెద్దపల్లిలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ.. ఉన్నత చదువుల కోసం సిటీకి పంపిస్తే ఇలా శివమై తిరిగి వస్తుందని ఊహించలేదని వారు శోకసముద్రంలో మునిగారు.. శ్రీజ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.. చదువులో ఒత్తిడి కారణమా లేక ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ప్రత్యేకమైన దర్యాప్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు శ్రీజ ఉంటున్న గదిలో ఏవైనా సూసైడ్ నోట్లు ఉన్నాయా అని తనిఖీలు చేశారు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Karimnagar Latest News: మావోయిస్టు అగ్రనాయకత్వంలో ఇప్పుడు పెను సంచలనం మొదలైంది గా భావించవచ్చు. దశాబ్ద కాలంగా అండర్ గ్రౌండ్ లో ఉద్యమం నడుపుతున్న కేంద్ర కమిటీకి సంబంధించిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ.. ఇప్పుడు పోలీసులకు లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ కగార్ టు నేపథ్యంలో ఈ కీలకమైన పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కి సంబంధించిన కీలకమైన వ్యక్తి లొంగిపోవడం ఆ పార్టీకి పెద్ద ఊహించని షాక్ గా మారింది..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిరుపతి ప్రస్థానం 1980 సంవత్సరం నుంచి మొదలైంది. కాలేజీ రోజుల్లోనే రాడికల్ విద్యార్థి సంఘంలో అత్యంత చురుకుగా పనిచేసే ఆయన.. అప్పటి రాజకీయ ఘర్షణల నేపథ్యంలో 1884లో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. ముక్క వెంకటేష్‌తో పాటు నిజాముద్దీన్ వంటి సహచరులతో కలిసి ఉద్యమ బాట పట్టారు. అంచెలంచెలుగా పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మకమైన విభాగంగా భావించే కేంద్ర కమిటీలో కీలకమైన బాధ్యతలు కూడా చేపట్టినట్లు సమాచారం. నంబాల కేశవరావు తర్వాత పార్టీ పగ్గాలు ఈయన చేపట్టారన్న ప్రచారం కూడా ఉంది..
దేవ్జీ లొంగిపోయాడన్న వార్తలు రావడంతోనే ఆయన తమ్ముడితో పాటు కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.. దీర్ఘకాలంగా అన్నయ్య కుటుంబానికి దూరంగా ఉన్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలియదని.. ప్రభుత్వం ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టకుండా.. చట్టబద్ధంగా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు.. ముఖ్యంగా ఆయన వయస్సు, ఆరోగ్యరీత్యా మానవీయ కోణంలో చూడాలని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కోరారు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో బలగాల కూబీంగ్ ఎంతో ముమ్మరంగా ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో తిరుపతి తో పాటు కీలక నేత రాజిరెడ్డి మరికొందరు సభ్యులు తెలంగాణ SIB ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది.. ఒకవేళ ప్రధాన కార్యదర్శి స్థాయిలో వ్యక్తి లొంగిపోవడం నిజమైతే.. అది మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఒక శకం ముగిసినట్లు అవుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. అయితే దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Gandhi Sarovar Project: 'మూసీ సుందరీకరణ కాదు.. ఇది రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ. ఆయన వేసే ప్రతి అడుగు వెనుకా భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే. పేదల ఇండ్లు కూల్చి.. మేఘా కృష్ణారెడ్డికి భూములు కట్టబెట్టే కుట్ర ఇది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. పేదలకు డబ్బుల్లేవనే రేవంత్ రెడ్డికి.. రూ.వందల కోట్లతో క్యాంపు ఆఫీసులకు పైసలెక్కడివి? అని ప్రశ్నించారు. కేసీఆర్ తాగునీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే.. రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నాడని మండిపడ్డారు.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇళ్లు కోల్పోతున్న హైదరాబాద్‌లోని మధు పార్క్ అపార్ట్‌మెంట్ బాధిత కుటుంబాలను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. 'డీపీఆర్ లేదు, ఎఫ్‌టీఎల్ తేలలేదు, అనుమతులు లేవు. ఏ చట్టం ప్రకారం ఇళ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇస్తున్నారు? ఇళ్లు కూల్చే బదులు నీళ్ల ట్యాంకులో విషం కలిపి చంపండి అని తల్లులు ఆవేదన చెందుతున్నా ఈ ప్రభుత్వానికి కనీస కనికరం లేదా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
మధుపార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు. 'కేసీఆర్ మమ్మల్ని ఇక్కడికి పంపించారు. కేసీఆర్‌కు మధు పార్క్ అపార్ట్‌మెంట్‌తో మర్చిపోలేని అనుబంధం ఉంది. కేసీఆర్ ఈ అపార్ట్‌మెంట్‌కు మూడుసార్లు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ పాలసీ విజన్ డాక్యుమెంట్‌ను ఇక్కడి వార్ రూముల్లో కూర్చునే తయారు చేశారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.
Also Read: Rs 151 Talambralu: రూ.151 చెల్లిస్తే భక్తుల ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
'కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఇక్కడ తాగునీళ్లు లేక మీరు అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి వెళ్లిపోతామంటే అప్పటికప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించి ప్రత్యేక పైపులైన్ వేశారు. అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో బటన్ ఆన్ చేయించి మరీ మీకు నీళ్లు ఇచ్చారు. సబితక్కకు మీరు ఒక్క ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే మీ ముందు రోడ్డు వేయించారు. నాడు మూసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సుధీర్ రెడ్డి గారు మూసీని క్లీన్ చేయించి మీకు దోమల బెడద లేకుండా చేశారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు.
'కేసీఆర్ ఎప్పుడూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా పెంచాలి? ప్రజలకు ఎలా మేలు చేయాలి అని ఆలోచించారు. ఈ అపార్ట్‌మెంట్‌ను నిలబెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం జేసీబీలతో దీన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదు. పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు విమర్శించారు.
'మూసీని శుద్ధి చేయాలని అందరూ కోరుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా అప్పట్లోనే రూ.3,800 కోట్లతో ఎస్టీపీలను నిర్మించి ఆ పని ప్రారంభించింది. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలోకి వదిలేందుకు డీపీఆర్‌లను కూడా కేసీఆర్ ప్రభుత్వం తయారు చేయించింది. అప్పుడు మా ప్రభుత్వానికి ఏ ఒక్క ఇల్లూ కూల్చే ఆలోచన రాలేదు. రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక కచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉంటుంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
'రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుందామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఎల్టీపీఎస్ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆలోచన చేశాడు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ 14,000 ఎకరాలు సేకరిస్తే.. దాన్ని ఫోర్త్ సిటీ అని పేరు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Netflix Scam Telugu: సినీ గ్లామర్ వరల్డ్‌పై ఉన్న మోజును ఆసరాగా చేసుకుని.. అమాయక పడచు యువతులతో పాటు యువకులను నిలువునా ముంచేస్తున్న ఒక భారీ నెట్వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఇటీవల చేదించారు. Netflixతో పాటు దిగ్గజ ఓటిటి సంస్థలు, టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల సంస్థల పేర్లతో మోసాలకు పాల్పడుతున్న ఓ లేడీ నిందితురాలు మాధవి అలియాస్ సిరి చందనను శనివారం పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ లేడీ కిలాడి చేసిన మోసాలు చూసి పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఆమె చేసిన మోసాలేంటి? అసలు యువతులను ఎలా ట్రాప్ చేసింది.? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దర్యాప్తులో భాగంగా తేలిన కొన్ని అంశాలు పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసేలా చేశాయంటే మామూలు మాట కాదు.. ఈ మూట కేవలం వ్యక్తులను మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమలోని దిగ్గజ సంస్థలైన అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు దిల్ రాజు ప్రొడక్షన్స్ డివివి దానయ్య, మైత్రి మూవీ మేకర్స్ వంటి బ్యానర్ల పేర్లను వాడుకొని నకిలీ ఆఫర్ లెటర్లను సృష్టించింది. అంతటితో ఆగకుండా తెలుగుతో పాటు సౌత్ ఇండియా, ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో ముద్రలను కూడా ఫోర్జరీ చేసి బాధితులను నమ్మించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం..
ఈ కుంభకోణం వెనక మరో 12 మంది నకిలీ దర్శకుల హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. వీరంతా ప్రముఖ దర్శకుల పేర్లను వాడుకుంటూ ప్రాజెక్టులు ఉన్నాయని అమాయకులను నమ్మిస్తూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 12 మంది హీరో ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్న బాధితులు వీరి ట్రాప్‌లో పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నట్లు సమాచారం.. అంతేకాకుండా పోలీసులు త్వరలోనే ఈ నకిలీ దర్శకులతో పాటు బాధితుల పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారికంగా తెలిపినట్లు సమాచారం.
ఈ ముఠా కేవలం ఒకటి రెండు సినిమాలతో ఆగకుండా.. దాదాపు 50 నుంచి 60 వరకు నకిలీ చిత్రాల పేర్లతో కొత్త కొత్త స్కామ్‌లకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.. వీరి నెట్వర్క్ హైదరాబాద్‌కి పరిమితమే కాకుండా దేశంలో ఇతర మెట్రోపాలిటన్ సిటీలో కూడా విస్తరించినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. సినిమా ఆఫర్స్ ఇస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే.. 100 శాతం మోసంగా గ్రహించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.. ప్రముఖ సంస్థలు ఎప్పుడు నటుల నుంచి డబ్బులు వసూలు చేయమని.. ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kamareddy Political Row: బాన్సువాడ, కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. తమను గృహ నిర్బంధం చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పందిస్తూ.. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసులతో నిర్బంధకాండ చేస్తోందని.. పోలీసులు కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పింది వింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Telangana Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 3 నెలలు భారీ ఉద్యమం
బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని ఈ సందర్భంగా ఎన్ రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి, అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధకాండ బయటపడిందని తెలిపారు. బాన్సువాడ, కామారెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం పూర్తిగా అక్రమం, అన్యాయం అని తెలిపారు. 'శాంతియుతంగా బాన్సువాడ వెళ్లి మా ఎమ్మెల్యేకు సంఘీభావం తెలుపుతామంటే వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. బాన్సువాడలో మా పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం' అని ఎన్. రాంచందర్ రావు ప్రకటించారు.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
'మా ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలను నిరూపించమని ప్రశ్నిస్తే, చర్చకు సిద్ధంగా లేక దాడులకు దిగడం కాంగ్రెస్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులను “నిరూపించండి” అని అడిగినందుకే దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చట్టాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే వ్యవహారం అని పోలీసులపై మండిపడ్డారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
'ఈ ఘటనలో తిరిగి బీజేపీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని సుమారు 70 మందిని అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారు. దాడి చేసినవారిని వదిలేసి, బాధితులైన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పక్షపాత వైఖరిని స్పష్టంగా చూపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్బంధకాండ కొనసాగుతోంది. ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా, అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తున్నారు' అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. కాంగ్రెస్ నేతలు చెప్పిందే వినాలి, వారి ఇష్టానుసారంగా నడుచుకోవాలనేలా వ్యవహరించడం సిగ్గుచేటు అని పోలీసుల తీరును ఖండించారు.
'బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే. ఆ తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో పబ్లిక్‌లో కాంగ్రెస్ నాయకులకు చెందినదని చెబుతున్న కారును కాంగ్రెస్ నేతలే ధ్వంసం చేసి, ఆ నేరాన్ని బీజేపీ నేతలపై మోపే ప్రయత్నం చేశారు. కామారెడ్డికి వెళ్లకుండా నన్ను, ఇతర బీజేపీ రాష్ట్ర నాయకులను ముందస్తు హౌస్ అరెస్టులు చేయడం, గృహ నిర్బంధాలకు పాల్పడడం తీవ్ర అన్యాయం. ఈ అక్రమ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం' అని మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు తెలిపారు.
'ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని దారిలోనే పోలీసులు అరెస్ట్ చేయడం మరో దుర్మార్గ చర్య. ఈ పరిణామాలపై పోలీసు అధికారులతో మేం మాట్లాడాం. మేము బాన్సువాడకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఎలాగైనా వెళ్తాం' అని ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రజాస్వామ్య పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Constituency Redivision In Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరిగేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మార్పులు జరిగితే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
పెరగనున్న స్థానాల అంచనా
ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. విభజన చట్టంలోని హామీల మేరకు స్థానాల పెంపు ఇలా ఉండవచ్చనే అంచనా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 175 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఇప్పుడు కొత్తగా 50 స్థానాలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మొత్తంగా ఏపీలో 225 శాసనసభ స్థానాలు అయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా 25 నుంచి పెరిగి కొత్తగా మరో 7 స్థానాలు.. అనగా మొత్తం 32 స్థానాలు వరకు వచ్చే అవకాశం ఉంది.
రాజకీయ సమీకరణాలు
నియోజకవర్గాల పెంపు అనేది ప్రస్తుత తెలుగుదేశం- జనసేన - బీజేపీ కూటమికి పెద్ద ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే.. గత ఎన్నికల్లో పొత్తుల వల్ల సీట్లు త్యాగం చేసిన ముగ్గురు పార్టీల నేతలకు, కొత్తగా చేరిన వారికి రాజకీయ భవిష్యత్తు కల్పించడం సులభమవుతుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో ప్రజలకు ప్రజాప్రతినిధులు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది.
వైసీపీకి సవాల్‌గా మారనున్న పునర్విభజన?
గతంలో (2009లో) జరిగిన పునర్విభజన అప్పటి అధికార పార్టీకి మేలు చేసిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ విభజన జరిగితే.. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల సరిహద్దులు మారిపోయే ప్రమాదం ఉంది. బలమైన ఓటు బ్యాంక్ కలిగిన ప్రాంతాలు విడిపోవడం వల్ల ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.
గమనిక: నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా లెక్కల ఆధారంగా జరగాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితేనే ఈ ప్రక్రియ అధికారికంగా వేగవంతం అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Catching Video Watch Here: ప్రకృతిలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో ఒకటిగా భావించే కింగ్ కోబ్రా పాములు ఎప్పుడు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అడవికి దగ్గరగా ఉన్న కొన్నిచోట్ల నిత్యం జనావాసాల మధ్య తిరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది ఇళ్లలోకి చేరి నానా హంగామా సృష్టిస్తున్నాయి. అయితే ఇటీవల కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు ఇలా జనావాసాల మధ్య సంచారం చేస్తున్న పాములను రక్షించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా కొంతమందైతే రోజులో రెండు నుంచి మూడు ప్రమాదకరమైన కోబ్రాలను పట్టుకొని సురక్షితంగా అడవుల్లో వదిలేస్తున్నారు. తాజాగా ఓ స్నేక్ క్యాచర్ అత్యంత ప్రమాదకరమైన కోబ్రాను ప్లాస్టిక్ డబ్బాలో అందిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
సాధారణంగా ఇళ్ల మధ్యలోకి వచ్చే అత్యంత ప్రమాదకరమైన కోబ్రాలను స్నేక్ క్యాచర్స్ ఎంతో సులభంగా పట్టుకుంటున్నారు. వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జనావాసాల్లోకి ఒక ప్రమాదకరమైన పాము చొరబడుతుంది.. అయితే, వెంటనే విషయం తెలుసుకున్న స్థానికులు ఒక స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందిస్తారు. వెంటనే వారు అక్కడికి చేరుకొని.. ఆ పాము ఉన్న ప్రాంతంలో శోధాలు చేపట్టారు.. అయితే, ఆ పాము అక్కడే వారికి కనిపించడంతో రెస్క్యూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇందులో భాగంగా ఓ స్నేక్ క్యాచర్ ఒక కాళీ ప్లాస్టిక్ నీళ్ల డబ్బాను ఉపయోగించి..త కోబ్రాను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ పాము ఈ సమయంలో పడగవిప్పి వారిపై దాడి చేయడం మీరు గమనించవచ్చు.. నిపుణుడు ఏమాత్రం ఆ పాముకు భయపడకుండా డబ్బాను ఆ పాము తలభాగం వైపు మళ్ళించి.. లోపలికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా కొద్దిసేపు ప్రయత్నించి చివరికి ఆ పాము తలభాగాన్ని అందులో ఉంచి.. బంధించేసేసాడు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
అయితే, ఈ దృశ్యాలను చూసేందుకు స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.. ఆ పామును బంధిస్తున్న సమయంలో స్థానికులంతా భయాందోళన చెందినట్లు తెలుస్తోంది. ఇలా పట్టుకున్న పామును వన్యప్రాణి సంరక్షకులు సురక్షితమైన ప్రదేశంలో వదిలి పెట్టేందుకు తీసుకెళ్లారు. సాధారణంగా ఇలాంటి పాములను పట్టుకునే క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం.. కాబట్టి ఎంతో నైపుణ్యం ఉన్న వారు మాత్రమే ఇలాంటి పాములను పట్టుకోవాల్సి ఉంటుంది..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tamil Nadu Terrorism: తమిళనాడులో పెను ముప్పు తప్పింది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడంతో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది.
ఆపరేషన్ వివరాలు
తమిళనాడులోని తిరుప్పూర్ సహా ఐదు ప్రాంతాల్లో నిఘా వర్గాల పక్కా సమాచారంతో 'Q' బ్రాంచ్ స్పెషల్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది. వీరంతా నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి, తిరుప్పూర్‌లోని గార్మెంట్ (దుస్తుల) పరిశ్రమలో కార్మికులుగా చలామణి అవుతున్నారు.
పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థల కోసం వీరు సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. కేవలం ప్రచారమే కాకుండా, పేలుళ్లకు కూడా కుట్ర పన్నినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. నిందితుల వద్ద నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన ఆరుగురిని తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు ఢిల్లీకి తరలించారు. నకిలీ గుర్తింపు కార్డులతో అతి సామాన్యుల్లా కలిసిపోయి దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్న ఈ ముఠా అరెస్ట్ కావడంతో భద్రతా దళాలు ఊపిరి పీల్చుకున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Employees Movement: తమ సమస్యలు, డిమాండ్లపై తెలంగాణ ఉద్యోగులు భారీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా ఉద్యమం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మూడు నెలల పాటు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. జిల్లాల నుంచి ఢిల్లీ స్థాయి దాకా ఉద్యమం చేస్తామని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
ప్రభుత్వ వ్యవస్థలో ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని.. ప్రభుత్వమే నేరుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు పద్మ, జ్యోతి, బాలకృష్ణారెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల తరబడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ప్రభుత్వ శాఖలలో చాలీచాలని వేతనాలతో తాము పని చేస్తున్నట్లు వాపోయారు. అరకొర జీతాలతో తమ జీవితాలు వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
వేతనాలు సరైన సమయానికి ఇవ్వకపోవడంతో నానాటికి ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నామని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్య తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఔట్ సోర్సింగ్ వ్యవస్థ రద్దువుతుందని ఆశించినా.. తమకు ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేసింది.
Also Read: AP Govt: నిధులు విడుదల చేయాలి.. కేంద్రానికి ఏపీ వ్యవసాయ మంత్రి కీలక విజ్ఞప్తులు
తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు ఈనెల 28వ తేదీన హైదరాబాద్ కేంద్రంగా భిక్షాటన కార్యక్రమం, మార్చి 7వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో మానవహారాలు, మార్చ్ 14వ తేదీన ఇందిరాపార్క్ వేదికగా మహాధర్నా, ఏప్రిల్ 11వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్య తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు, పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. తమ డిమాండ్‌ల సాధన కోసం దశల వారీగా ఉద్యమం చేయనున్నట్లు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Irrigation Dept: వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం పలు విజ్ఞప్తులు చేసింది. మైక్రో ఇరిగేషన్ నిధులు విడుదల చేయాలని కోరింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేసిన పథకాల కింద కేంద్ర వాటాగా రావాల్సిన మొత్తం రూ.695 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిగిలిన కేంద్ర వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Also Read: Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళన.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మాజీ ఎస్సై మృతి
తిరుమల ఆలయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం సందర్శించారు. తిరుమలకు వచ్చిన ఆయనను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యాంశాలపై చర్చించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమ కార్యక్రమాల అమలు, కేంద్ర పథకాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై ఇరు మంత్రులు విస్తృతంగా చర్చించారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
రాష్ట్రంలో రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, నిధులు, వివిధ పథకాల అమలుపై కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ఆదాయ వృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు దిశగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతోందని వివరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న మైక్రో ఇరిగేషన్ పథకానికి సంబంధించిన కేంద్ర వాటా నిధుల విడుదల అంశాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేసిన పథకాల కింద కేంద్ర వాటాగా మొత్తం రూ.695 కోట్లు రావాల్సి ఉండగా.. కేవలం రూ.50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, ఇంకా రూ.645 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిగిలిన కేంద్ర వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం మరో రూ.400 కోట్లు సెంట్రల్ షేర్ నిధులు విడుదల చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఈ నిధులను ఆర్‌కేవీవై- పీడీఎంసీ పథకం మంజూరు చేయాలని తెలిపారు. మైక్రో ఇరిగేషన్ విస్తరణతో నీటి వనరుల సమర్థ వినియోగం, సాగు వ్యయాల తగ్గింపు, రైతుల ఆదాయ వృద్ధి సాధ్యమవుతాయని చెప్పారు. త్వరితగతిన నిధుల విడుదలకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Free Govt Schemes: మనదేశంలో పథకాలు ఎన్నో లాభాలు పేదవారికి అందిస్తున్నాయి. ప్రధానంగా రైతులు, మహిళలు, పేద వర్గాలకు చెందిన వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చాలామందికి ఈ పథకాల గురించి తెలియక లాభాలను కోల్పోతున్నారు. ఆయుష్మాన్ భారత్ నుంచి పీఎం కిసాన్, మహిళలకు సంబంధించిన పథకాలు ఉన్నాయి. వీటితో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆ ఏడు పథకాలు ఏంటో తెలుసుకుందాం ..
ఆయుష్మాన్ భారత్..
ఆయుష్మాన్ భారత్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగకరం. రూ. 5 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య చికిత్స పొందుతారు. అర్హత గల కుటుంబాలకు ఇందులో సర్జరీ, క్యాన్సర్, గుండె సమస్యలు కూడా చికిత్స లభిస్తుంది. మీకు ఆయుష్మాన్ కార్డు లేకపోతే అధికారిక వెబ్‌సైట్లో మీరు మీ అర్హతను తెలుసుకొని పొందవచ్చు. దీంతో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు చికిత్స ఉచితం తీసుకోవచ్చు. దీనికి ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన...
ఇల్లు లేని వారికి సొంతింటిని కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు రూ. 2.67 లక్షల వరకు సబ్సిడీ హోమ్ లోన్ లో లభిస్తుంది. డబ్బును నేరుగా జమ చేస్తారు. దీంతో మీ ఈఎంఐ భారం తగ్గుతుంది.
ముద్ర లోన్...
ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకం. మహిళలకు సొంతంగా వ్యాపారాలు చేసే వారికి ఇది బెస్ట్ ఇందులో రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తారు. శిశు, కిషోర్, తరుణ్ మూడు కేటగిరీల్లో లోన్ అందిస్తారు. దీనికి ఎలాంటి తనఖా లేకుండా లోన్ సులభంగా పొందవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన...
మీకు పదేళ్ల లోపు అమ్మాయి ఉంటే ఈ పథకం ఒక వరం అని చెప్పవచ్చు. ఇందులో అత్యధిక స్థాయిలో వడ్డీ రేట్లు లభిస్తాయి. మెచ్యూరిటీ సమయానికి మీరు ఎక్కువ మొత్తంలో డబ్బు పొందవచ్చు. 100 శాతం ఎలాంటి టాక్స్ కూడా విధించారు. మీ పాప విద్య లేదా పెళ్లికి ఎంతగానో ఉపయోగపడతాయి.
నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP)..
చాలామంది డబ్బులు లేకుండా విద్యార్థులు పాఠశాల చదువును మధ్యలోనే ఆపేస్తారు. అయితే ఈ ఎన్‌ఎస్‌పీ పోర్టల్ అనేక స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. స్కూలు నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు సులభంగా ఇందులో స్కాలర్‌షిప్ పొందవచ్చు. మైనారిటీ, వెనుకబడిన కులాలకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తుంది. ఆన్‌లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పీఎం ఉజ్వల యోజన..
పీఎం ఉజ్వల యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఉచిత సిలిండర్ లభిస్తుంది. ఎల్‌పీజీ కనెక్షన్ పొందిన తర్వాత సిలిండర్ కూడా సబ్సిడీ ధరలో పొందవచ్చు. ఈ స్కీమ్ లో మీ అడ్రస్ ప్రూఫ్ తో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ లేని వారు పొందవచ్చు.
పీఎం కిసాన్..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ చేస్తుంది. మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతులు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇది వారి సాగు ఖర్చులకు ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: విద్యార్థులకు UGC కీలక అలెర్ట్.. ఆ 32 యూనివర్సిటీలు ఫేక్, ఆంధ్రప్రదేశ్‌లో రెండు..!
Also Read: మరో బాంబు పేల్చిన ట్రంప్.. గ్లోబల్ టారీఫ్స్ 15 శాతానికి పెంపు, భారత్‌కు ఇదే వర్తిస్తుందంటూ క్లారిటీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Rahu Transit 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు గ్రహాన్ని నీడ గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం సెప్టెంబర్ రెండవ తేదీన కదలికలు జరపబోతోంది. చాలాకాలం సాధారణంగా ఉన్న ఈ గ్రహం మళ్లీ కదలికలు జరపడం విశేషం. అంతకుముందే మే 18వ తేదీన రాహు కుంభరాశిలోకి ప్రవేశించి దాదాపు 18 నెలల పాటు అదే రాశిలో సంచార దశలో కొనసాగుతాడు. అయితే, ఫలితంగా అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించని ఫలితాలు లభిస్తాయి. రాహు కుంభరాశి లోనే ఉండడం వల్ల జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ఆర్థికంగా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి
రాహువు ఎఫెక్ట్‌తో వృషభ రాశి వారికి అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగాల్లో పెద్ద ప్రమోషన్స్ లభించడమే కాకుండా.. అనేక అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు కూడా రావడం ప్రారంభమవుతాయి. దీంతోపాటు భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి పరిష్కారం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం కలగబోతోంది.
మిథున రాశి
రాహువు ప్రభావంతో మిధున రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఎంతో సులభంగా పూర్తవుతాయి. పనుల కోసం సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాలు కూడా లాభసాటిగా మారవచ్చు. రాహు ప్రభావంతో ఆర్థికంగా అద్భుతమైన పురోగతి లభించే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి కూడా లభించబోతోంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులపై కూడా ఈ సమయంలో రాహువు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పనిలో అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా సువర్ణ అవకాశాలు కూడా కలుగుతాయి. ఆర్థిక పునాదులు కూడా చాలా బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రణాళికలు విజయవంతం అవ్వడమే కాకుండా భారీ లాభాలను తెచ్చిపెట్టబోతున్నాయి.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా రాహు ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీంతోపాటు కొత్త ఉద్యోగాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా మారే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో కుంభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook