Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500070

వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్ యువతిపై చిన్ననాటి స్నేహితుల అత్యాచారం

Jul 30, 2024 11:33:44
Vanasthalipuram, Telangana

వనస్థలిపురంలో ఒక సాఫ్ట్‌వేర్ యువతిపై ఆమె చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి మరియు మరో వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి ఇటీవలే ఉద్యోగం రావడంతో నిర్వహించిన పార్టీ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మత్తులో ఉన్నప్పుడు హోటల్ గదిలో ఈ దారుణం జరిగింది. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 26, 2026 05:54:27
Hyderabad, Telangana:

Bank Strike On 27 JAN 2026: తమ దీర్ఘకాల డిమాండ్‌ అయిన 'వారానికి ఐదు రోజుల పని' విధానాన్ని అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్త బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో జనవరి 27, 2026న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.

ఎందుకు ఈ సమ్మె?
ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, ఈ నిరసనకు ప్రధాన కారణాలను వెల్లడించారు.

అమలు కాని ఒప్పందం: మార్చి 2024లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యూనియన్ల మధ్య కుదిరిన వేతన సవరణ ఒప్పందంలో 'ఐదు రోజుల పని వారం' అంశాన్ని ఆమోదించినప్పటికీ, ప్రభుత్వం దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

స్పందించని ప్రభుత్వం: గత కొన్ని నెలలుగా విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆందోళనను తీవ్రతరం చేయాలని యూనియన్లు నిర్ణయించాయి.

యూనియన్ల ప్రధాన డిమాండ్లు.. 
ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగులకు కేవలం 2వ, 4వ శనివారాల్లో మాత్రమే సెలవు లభిస్తోంది. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పని గంటల సర్దుబాటు: ఐదు రోజుల పని విధానం వల్ల పని గంటలు తగ్గకుండా ఉండేందుకు, సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ అదనంగా 40 నిమిషాలు పని చేయడానికి ఉద్యోగులు ఇప్పటికే అంగీకరించారు.

మిగతా సంస్థల మాదిరిగానే: ఇప్పటికే RBI, LIC, స్టాక్ ఎక్స్ఛేంజీలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఐదు రోజుల పని విధానాన్ని అనుసరిస్తున్నాయని, బ్యాంకులకు కూడా అదే వర్తింపజేయాలని వారు వాదిస్తున్నారు. ఇటీవల 'X' (ట్విట్టర్)లో నిర్వహించిన ప్రచారానికి దాదాపు 18.8 లక్షల ఇంప్రెషన్లు రావడం, ఉద్యోగుల్లో ఉన్న అసహనానికి నిదర్శనమని యూనియన్లు పేర్కొన్నాయి.

బ్యాంకింగ్ సేవలపై ప్రభావం
జనవరి 27న జరగబోయే ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలు నిలిచిపోవచ్చు.

"ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే సమ్మెను విజయవంతం చేయడమే మా లక్ష్యం" అని AIBOC స్పష్టం చేసింది. ఒకవేళ ఈ లోపు ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తే తప్ప, జనవరి 27న బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది.

Also REad: EPS 95 Pension Budget: ఉద్యోగులకు బడ్జెట్ ధమాకా! కనీస పెన్షన్ రూ.7,500 పక్కా?! ఎప్పటి నుంచి అంటే?

Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 28న పాఠశాలలకు సెలవు..ఎందుకంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 26, 2026 05:17:51
Hyderabad, Telangana:

EPS 95 Pension Hike Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టేందుకు సమయం దగ్గరపడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఈపీఎఫ్‌వో (EPFO) ఖాతాదారుల దృష్టి ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రకటించబోయే నిర్ణయాలపైనే ఉంది. ముఖ్యంగా కనీస పెన్షన్ పెంపుపై ఈసారి బడ్జెట్‌లో కీలక ప్రకటన ఉండవచ్చని గట్టిగా వినిపిస్తోంది. వచ్చే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈపీఎఫ్‌వో పెన్షనర్ల దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరపడనుందని సమాచారం.

1. 11 ఏళ్ల తర్వాత పెన్షన్ పెంపు?
ప్రస్తుతం ఈపీఎస్ (EPS) కింద రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు అందుతున్న కనీస పెన్షన్ కేవలం రూ.1,000. దీనిని 2014లో నిర్ణయించారు. అప్పటి నుండి ద్రవ్యోల్బణం పెరిగినా, పెన్షన్ మాత్రం పెరగలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దీనిని కనీసం రూ.7,500 నుంచి రూ.10,000 వరకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

2. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం..
కనీస పెన్షన్ పెంపు విషయంలో జాప్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని కోర్టు ఆదేశించడంతో, ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ఒక వేదికగా చేసుకుని పెన్షనర్లకు ఊరటనిచ్చే అవకాశం ఉంది.

3. ఫెసిలిటేషన్ అసిస్టెంట్ల వ్యవస్థ..
పెన్షనర్లకు సేవలను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం 'ఫెసిలిటేషన్ అసిస్టెంట్లను' నియమించాలని యోచిస్తోంది. వీరు నామమాత్రపు రుసుముతో పెన్షనర్లకు అవసరమైన డాక్యుమెంటేషన్, ఇతర సహాయం అందిస్తారు. దీనివల్ల వృద్ధులు, సీనియర్ సిటిజన్లు పదేపదే ఈపీఎఫ్‌వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

4. బడ్జెట్ పై అంచనాలు..
పెన్షన్ పెంపుతో పాటు ఆదాయపు పన్ను (Income Tax) మినహాయింపుల్లో కూడా మార్పులు ఉంటాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇటీవల కార్మిక మంత్రితో జరిగిన సమావేశంలో భారతీయ మజ్దూర్ సంఘం పెన్షన్ పెంపుపై గట్టిగా ఒత్తిడి తెచ్చింది.

కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 1న వెలువడే బడ్జెట్ ప్రకటనలో ఈ 'భారీ శుభవార్త' ఉంటుందో లేదో వేచి చూడాలి.

Also Read: ICC Warns Pakistan: జైషా దెబ్బకి భయపడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు..టీ20 ప్రపంచకప్‌కు ముందు ఏం చేసిందంటే?

Also REad: Motorola Edge 50 Price: కేవలం రూ.668 లకే మోటరోలా 5G స్మార్ట్‌ఫోన్..ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఆఫర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 26, 2026 05:12:32
Lakshmapur, Telangana:

Rare Earth Stocks: దేశంలో  అరుదైన భూమి మూలకాలు (Rare Earth Elements)పై డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా విద్యుత్ వాహనాలు (EVలు) స్వచ్ఛమైన ఇంధన రంగాల విస్తరణ దీనికి ప్రధాన కారణంగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా సుమారు 19.6 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదు కావడం గతంతో పోలిస్తే 17 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ పెరుగుదల అరుదైన ఖనిజాల అవసరాన్ని మరింత పెంచుతోంది.

EV మోటార్లు, బ్యాటరీ వ్యవస్థలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల్లో అరుదైన భూమి పదార్థాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే, పవన విద్యుత్ టర్బైన్ల వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు అవసరమైన అధిక సామర్థ్య అయస్కాంతాల తయారీలో కూడా ఇవి తప్పనిసరి. అందుకే.. ఈ రంగం దేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమవుతోంది.

ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం అరుదైన భూమి ఖనిజాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, రూ. 72.8 బిలియన్లతో అరుదైన భూమి శాశ్వత అయస్కాంతాల తయారీ కార్యక్రమానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్, రక్షణ, పునరుత్పాదక ఇంధనం వంటి కీలక రంగాల్లో దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. ఇది భారతదేశం ఈ రంగాన్ని దీర్ఘకాలికంగా బలోపేతం చేయాలనుకుంటోందని స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు.

ఈ విధానాల ప్రభావంతో, అరుదైన ఖనిజాలకు సంబంధం ఉన్న కంపెనీలపై పెట్టుబడిదారుల దృష్టి పడింది. ప్రస్తుతం ఈ రంగంపైనే పూర్తిగా దృష్టి సారించిన లిస్టెడ్ కంపెనీలు లేనప్పటికీ, కొన్ని సంస్థలు పరోక్షంగా లేదా విస్తృతంగా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.ఒవైస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ లోహాలు, ఖనిజాల రంగంలో పనిచేస్తోంది. మాంగనీస్ ఆక్సైడ్, ఫెర్రోమాంగనీస్, క్వార్ట్జ్ స్లాబ్‌లు, స్లాగ్ వంటి పదార్థాల నుంచి యాజమాన్య సాంకేతికత ద్వారా అరుదైన భూమి ఖనిజాలను రీసైక్లింగ్ చేస్తోంది. ఇవి ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, రక్షణ, కెపాసిటర్ పరిశ్రమల్లో వినియోగంలో ఉంటాయి. జనవరి 24న ఈ కంపెనీ షేర్ రూ.248.25 వద్ద ముగియగా, ఇది దాని 52 వారాల గరిష్ట స్థాయి నుంచి భారీగా తగ్గిన స్థాయిలో ఉంది.

Also Read: EPF–EPS: పదవీ విరమణ తర్వాత మీకు ఎంత పెన్షన్ లభిస్తుంది? కొత్త ఫార్ములా, నియమాలను తెలుసుకోండి..!!

ప్రభుత్వ రంగ సంస్థ అయిన NLC ఇండియా ప్రధానంగా లిగ్నైట్ మైనింగ్, థర్మల్ పవర్ ఉత్పత్తిలో ఉన్నప్పటికీ, కీలక ఖనిజాల అన్వేషణ వైపు అడుగులు వేస్తోంది. మాలీలో లిథియం బ్లాక్‌లు, కాంగోలో రాగి–కోబాల్ట్ గనులపై ప్రాథమిక చర్చలు మొదలయ్యాయి. అరుదైన భూమి మూలకాల అన్వేషణను దూకుడుగా కొనసాగించాలని గనులు, బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు సంస్థ వెల్లడించింది.

ఇక ఎకో రీసైక్లింగ్ దేశంలో ప్రముఖ ఈ-వ్యర్థాల నిర్వహణ సంస్థ. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి లోహాలను తిరిగి పొందే సౌకర్యాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. లిథియం-అయాన్ బ్యాటరీలు, PCBలు, హార్డ్ డ్రైవ్‌ల నుంచి కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలను రికవరీ చేయడం ద్వారా దేశీయ సరఫరాను పెంచాలన్నది దీని లక్ష్యం. దీంతో దిగుమతులపై ఆధారం తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా EVలు, స్వచ్ఛమైన శక్తి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అరుదైన భూమి ఖనిజాలు భారతదేశానికి అత్యంత కీలకమైన వనరులుగా మారుతున్నాయి. ఈ రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కంపెనీల ప్రయత్నాలు రాబోయే రోజుల్లో మరింత కీలకంగా మారనున్నాయి.

Also Read: EPFO: ఇలా చేస్తే ఇంటి నుంచే PF డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఆధార్ ఉంటే సరిపోతుంది..!!

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 25, 2026 16:44:26
Kurnool, Andhra Pradesh:

HIV Injection Incident: మానవ సంబంధాలు మంటగలుస్తున్న వేళ ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. భేదాభిప్రాయాలతో విడిపోయిన వారు.. వివాహేతర సంబంధాలు కలిగి ఉండడంతో కాపురాలు కుప్పకూలుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక సంచలన సంఘటన చోటుచేసుకుంది. తనను వదిలేసి విడాకులు తీసుకున్న భర్త మరో వివాహం చేసుకోవడంతో మాజీ భార్య తన సవతికి హెచ్‌ఐవీ వైరస్‌ ఇంజెక్షన్‌ ఇచ్చింది. సినిమాను మించి రేంజులో ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Pamda Awards 2026: పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌ అవార్డులు ఎవరెవరికి ఇచ్చారంటే..?

ఏపీలోని కర్నూలుకు చెందిన డాక్టర్ కరుణాకర్, ఆదోనికి చెందిన వసుంధర కొన్ని సంవత్సరాల కిందట ప్రేమించుకొని కొన్ని కారణాలతో విడిపోయారు. ఆమెతో విడిపోయిన తర్వాత డాక్టర్ కరుణాకర్ తర్వాత మరో మహిళ డాక్టర్ శ్రావణిని ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఆమె కర్నూలు మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలులోని విశ్వభారతి ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ కరుణాకర్ పనిచేస్తున్నారు.  తనతో విడిపోయిన తర్వాత ఈ క్రమంలో తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో మాజీ లవర్‌ వసుంధర జీర్ణించుకోలేకపోయింది. వారిద్దరిపై అక్కసు పెంచుకున్న వసుంధర వారిని విడదీయాలని ఓ కుట్ర పన్నింది. సినిమా రేంజులో ఆమె పథకం రచించింది. ఆ పథకంలో భాగంగా ఈనెల 9వ తేదీ తన మాజీ ప్రియుడి భార్య డాక్టర్ శ్రావణి విధులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు వచ్చి ఆమె ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు.

Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీ చేరికలు

ఢీకొట్టడంతో శ్రావణి కిందపడిపోవడంతో వెంటనే వేరే బైక్‌పై వచ్చిన వారు ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించారు. శ్రావణిని ఆటో ఎక్కిస్తున్నట్లు నటించి ఆమెకు ఓ వైరస్ హెచ్‌ఐవీ ఎక్కించారు. ఈ ఘటనపై భాదితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న కర్నూలు త్రీటౌన్ పోలీసులు దర్యాఫ్తు చేశారు. ఘటన స్థలం వద్ద సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించారు. వెంటనే వారిని అరెస్ట్ చేసినట్లు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో మాజీ ప్రియురాలు వసుంధరతోపాటు ఆమెకు సహకరించిన జ్యోతి, జశ్వంత్, శృతి అనే నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని సినీ ఫక్కీలో జరిగిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Harish Rao: సింగరేణి కుంభకోణం సూత్రధారి రేవంత్ రెడ్డి.. అల్లుడు పాత్రధారి: హరీశ్‌ రావు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
AMAruna Maharaju
Jan 25, 2026 14:26:19
Hyderabad, Telangana:

Secunderabad Traffic Restrictions: భారతదేశం 77వ గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జనవరి 26న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కారణంగా ఆ రూ‌ట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రహదారులను మూసి వేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరవాసులు అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది.

టివోలి ఎక్స్‌ రోడ్స్ నుంచి ప్లాజా ఎక్స్‌ రోడ్స్ మధ్య రహదారి మూసివేయనున్నారు. సంగీత్ ఎక్స్‌ రోడ్స్, వైఎంసీఏ, ప్యాట్నీ, ఎస్​బీఐ, ప్లాజా, సీటీవో, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉపకార్, సికింద్రాబాద్ క్లబ్, తాడ్‌బండ్, బాలమ్రాయ్, రసూల్‌పురా, ప్యారడైజ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.

ప్రయాణికులు రైల్వే, బస్ స్టేషన్లకు ముందుగానే బయలుదేరాలని సూచించారు. మెట్రో సేవలను వాడుకోవాలని కోరారు. బేగంపేట, కార్ఖానా, జేబీఎస్, ప్యాట్నీ, సంగీత్ ఎక్స్‌ రోడ్స్, టివోలి, బోయిన్​పల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను ఇతర మార్గాలకు డైవర్షన్​ చేసేలా ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 8712662999 నెంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
 
Also Read: 
Padma Awards: 2026 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. 45 మందికి పద్మశ్రీ, తెలంగాణ నుంచి ఇద్దరికి అవార్డు..!

Also Read: IPL 2026: ఐపీఎల్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. 14 కోట్ల ప్లేయర్ ఔట్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 25, 2026 13:03:35
Hyderabad, Telangana:

BRS Party Joinings: 'వృద్ధులకు 4 వేల రూపాయల పింఛన్‌ ఎప్పుడు ఇస్తారని అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని సునీత లక్ష్మారెడ్డి అడిగారు. మోసం చేసిన వాళ్లకి ఎప్పుడైనా బుద్ధి చెప్పాలి. అందుకే గ్రామాల్లో చర్చ పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. బీజేపీ తెలంగాణకు చేసింది ఏం లేదు. బీజేపీ అంటేనే ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశంలో పండే గోధుమలకు ధర పెంచారు. దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు ధర పెంచడం లేదు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. తెలంగాణలో బీజీపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటవడంతో ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Also Read: Govt Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఉత్తర్వులు జారీ!

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీకి రాజీనామా చేసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక ప్రసంగం చేశారు. 'బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణకు మంచి జరుగుతుంది. పదేండ్ల తెలంగాణ ఎలా అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసు. 200 పింఛన్లు 2 వేలకు పెంచిన ఘనత కేసీఆర్‌ది. అనేక మంచి కార్యక్రమాలు కేసిఆర్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన కల్యాణలక్ష్మికి తులం బంగారం ఇస్తామనీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. వృద్ధులకు పింఛన్లు పెంచుతామని చెప్పి వృద్ధులను మోసం చేశారు. బతుకమ్మ చీరలు ఇవ్వకుండానే పోయారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Also Read: Janasena Party: తెలంగాణలో సంచలన పరిణామం.. సినీ నటుడు ఆర్‌కే సాగర్‌ కీలక ప్రకటన

'ప్రజలు చాలా తెలివైన వాళ్లు ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి. బావుల దగ్గర కరెంట్ సరిగా ఇవ్వలేకపోతున్నారు. రైతుల ఇబ్బందులు పడుతున్నారు. నర్సాపూర్‌లో మంచి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. పాలన తక్కువ ప్రతిపక్షాల నాయకులపై కేసులు ఎక్కువ. రైతులకు రైతుబంధు సకాలంలో ఇవ్వడం లేదు. కేసీఆర్ హయాంలో నాట్లకు నాట్లు మధ్య రైతు బంధు పడేది' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు.

Also Read: Harish Rao: సింగరేణి కుంభకోణం సూత్రధారి రేవంత్ రెడ్డి.. అల్లుడు పాత్రధారి: హరీశ్‌ రావు 

'రేవంత్ రెడ్డి హయాంలో ఓట్లకు ఓట్ల మధ్య రైతుబంధు అది కూడా సమయానికి ఇవ్వడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలి. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీని.. కర్రు కాల్చివాత పెట్టారు అని రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. రైతుబంధు ఇవ్వకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. 'రెండేళ్లలో ఉపకార వేతనాలు ఒక్క రూపాయి ఇవ్వకుండా పిల్లలను ఆగం చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి' అని సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 25, 2026 13:01:42
Lahore, Punjab:

ICC Ultimatum To Pakistan: 2026 టీ20 ప్రపంచకప్ వేదికల విషయంలో ఇన్నాళ్లూ డ్రామా నడిపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటామంటూ ఊదరగొట్టిన పాక్, ఇప్పుడు యూ-టర్న్ తీసుకుని ఏకంగా తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.

బంగ్లాదేశ్ జట్టు టోర్నీ నుంచి వైదొలగడంతో పాక్ కూడా అదే దారిలో వెళ్తుందని భావించినప్పటికీ, ఐసీసీ నుంచి ఎదురయ్యే తీవ్ర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలో పాక్ తన వేటను ప్రారంభించనుంది.

1. పాత సామార్థ్యం.. కొత్త వ్యూహం..
జట్టులో అత్యంత కీలకమైన మార్పు బాబర్ ఆజం, షహీన్ షా అఫ్రిదిల పునరాగమనం జట్టుకు ఊరట కలిగించే విషయం. గత కొన్ని సిరీస్‌లకు దూరంగా ఉన్న బాబర్, బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేయడానికి మళ్లీ జట్టులోకి వచ్చారు. నసీమ్ షా, షహీన్ అఫ్రిదిలు పాక్ పేస్ అటాక్‌కు వెన్నెముకగా నిలవనున్నారు.

2. హారిస్ రవూఫ్‌కు భారీ షాక్..
పాక్ ఎక్స్‌ప్రెస్ పేసర్ హారిస్ రవూఫ్‌ను సెలక్టర్లు పక్కన పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆసియా కప్ 2025లో పేలవమైన ఫామ్, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతనికి జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు, ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న మొహమ్మద్ రిజ్వాన్‌కు మాత్రం వికెట్ కీపర్ కోటాలో ఊరట లభించింది.

పాకిస్తాన్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్..
ఫిబ్రవరి 7 – పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ (కొలంబో)

ఫిబ్రవరి 10 – పాకిస్తాన్ vs అమెరికా (కొలంబో)

ఫిబ్రవరి 15 – భారత్ vs పాకిస్తాన్ (కొలంబో)

ఫిబ్రవరి 18 – పాకిస్తాన్ vs నమీబియా (కొలంబో).

టీ20 ప్రపంచకప్ 2026 కోసం పాకిస్థాన్ జట్టు..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్.

బంగ్లాదేశ్ తోడవ్వకపోయినా, భారత్‌లో జరిగే వరల్డ్ కప్ ఆడటానికి పాక్ మొగ్గు చూపడం వెనుక భారీ ఆర్థిక జరిమానాల భయం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బాబర్, షహీన్ రాకతో పాక్ జట్టు కాగితంపై బలంగా కనిపిస్తోంది.

Also Read: Motorola Edge 50 Price: కేవలం రూ.668 లకే మోటరోలా 5G స్మార్ట్‌ఫోన్..ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఆఫర్!

Also REad: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 28న పాఠశాలలకు సెలవు..ఎందుకంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 25, 2026 12:28:56
Hyderabad, Telangana:

Giant Cobra Video Viral: ప్రకృతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి సాధ్యము కాదు. అయితే, గత కొద్ది రోజుల నుంచి ప్రకృతిలో మార్పులు సంభవిస్తూ వస్తున్నాయి ముఖ్యంగా కొన్నిచోట్ల అడవులు పూర్తిగా తగ్గిపోతున్నాయి. దీనివల్ల అందులో జీవించే జీవరాశులకు ఆహార కొరత ఏర్పడుతూ వస్తోంది. దీని కారణంగా పాములతో పాటు కొన్ని జీవులు జనావాసాల్లోకి సంచారం చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా పాములయితే పెద్ద ఎత్తున జనాలుండే ప్రదేశాల్లోకి చొరబడుతున్నాయి. ఇలా సంచారం చేసిన పాములు మనుషులతో పాటు జంతువులపై దాడి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటికైనా జరిగాయి.. తాజాగా కూడా ఇలాంటి వీడియో వైరల్ అవుతూ వస్తోంది. 

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ గొర్రె పిల్లను పని ప్రమాదకరమైన కింగ్ కోబ్రా.. చుట్టేసి ఉండడం మీరు చూడొచ్చు. అయితే ఆ పా ము గొర్రెపిల్లను కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చూడొచ్చు మీరు. ఇదే సమయంలో ఆమెని ఆ ప్రమాదం నుంచి తప్పించేందుకు ఓ స్నేక్ క్యాచర్ బైక్ పై వచ్చి ఆ గొర్రె పిల్లను రక్షించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ వస్తుంది..

వీడియోలు స్నేక్ క్యాచర్ కొద్ది దూరం నుంచి బైక్‌పై రావడం కూడా మీరు చూడొచ్చు. వెంటనే అతను మోటార్ సైకిల్‌పై వచ్చి.. తన చేతిలో ఉన్న ప్లాస్టిక్ పైపుతో గొర్రె పిల్ల మెడకు చుట్టుకొని ఉన్న ఆ ప్రమాదకరమైన కింగ్ కోబ్రాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఈ సమయంలో ఆ పాము గొర్రె పిల్ల పై ఎలాంటి దాడి చేయకుండా.. స్నేక్ క్యాచర్‌కు కూడా లొంగిపోవడం మీరు చూడొచ్చు. వెంటనే దానిని అతను ప్లాస్టిక్ పైపు ద్వారా పట్టుకొని.. సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టాడు. దీంతో ఆ గొర్రె పిల్ల యజమాని ఊపిరి పీల్చుకున్నాడు..

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

గత కొద్ది రోజుల నుంచి అడవుల్లో నుంచి వచ్చిన పాములు ఇలా జంతువులపై దాడి చేస్తున్నాయని.. అలాగే కొన్ని పాములు మనుషులపై దాడికి కూడా పాల్పడుతున్నాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నిదర్శనంగా నిలుస్తుంది.. ఈ వీడియోని ఎవరు తీశారో కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  చూసిన వారంతా కామెంట్‌లో స్పందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా వారి మిత్రులకు షేర్ చేస్తున్నారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 25, 2026 12:22:54
Hyderabad, Telangana:

Motorola Edge 50 Fusion Discount: ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న రిపబ్లిక్ డే సేల్ (Republic Day Sale) స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగ తీసుకువచ్చింది. ముఖ్యంగా మోటరోలా నుంచి వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్ Motorola Edge 50 Fusion పై కనీవినీ ఎరుగని ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మీరు రూ.20,000 లోపు బడ్జెట్‌లో ప్రీమియం లుక్, అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం చూస్తుంటే, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ సరైన ఛాయిస్.

ధర, డిస్కౌంట్ వివరాలు..
అసలు ధర: రూ.25,999
ఫ్లాట్ డిస్కౌంట్: సేల్‌లో భాగంగా 26% తగ్గింపుతో ఈ ఫోన్ కేవలం రూ.18,999 కే లభిస్తోంది. అంటే నేరుగా రూ.7,000 ఆదా అవుతుంది.

EMI ఆఫర్: ఒకేసారి అంత డబ్బు చెల్లించలేని వారు కేవలం నెలకు రూ.668 సులభ వాయిదాల పద్ధతి (EMI) లో ఈ ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్: మీ పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్ బాగుంటే, దానిని ఇచ్చి అదనంగా రూ.15,350 వరకు తగ్గింపు పొందవచ్చు.

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫీచర్స్..
డిజైన్ & డిస్‌ప్లే: 6.7-అంగుళాల P-OLED కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని 144Hz రిఫ్రెష్ రేట్ గేమింగ్, వీడియోలకు సూపర్ స్మూత్ అనుభూతిని ఇస్తుంది. దీనికి IP68 రేటింగ్ ఉండటం వల్ల నీరు, దుమ్ము నుంచి రక్షణ ఉంటుంది.

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్: ఇందులో Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ ఉంది. 12GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభిస్తుంది.

కెమెరా క్వాలిటీ: వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా (Sony LYTIA 700C సెన్సార్), 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు వైపు 32MP కెమెరా కలదు.

బ్యాటరీ & ఛార్జింగ్: 5,000mAh బ్యాటరీతో పాటు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీనివల్ల నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.

స్టైలిష్ డిజైన్‌తో పాటు స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునే వారికి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఒక బెస్ట్ డీల్. రిపబ్లిక్ డే సేల్ ముగిసేలోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 28న పాఠశాలలకు సెలవు..ఎందుకంటే?

Also REad: White Hair Remedy: తెల్ల జుట్టుకు చెక్..ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాస్తే 20 నిమిషాల్లో తెల్ల జుట్టు మాయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top