Man Smokes With Nose Video Watch: గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఫన్నీ ఫన్నీ గా రోడ్ల పైన చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో యువత ఎక్కువగా చూసి ఎందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది ఫన్నీ వీడియోలను తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించారు. కొంతమంది మగవారు లేడీ డ్రెస్‌లో వచ్చి రోడ్లపై ఫన్నీగా చేయడం.. ఇలాంటి వీడియోలు మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అయితే తాజాగా ఓ ఫన్నీ వీడియో అందరినీ ఎంతగానో అలరిస్తోంది. ఈ వీడియోలో ఆ వ్యక్తి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..
నేటి యువతలు చాలామందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది.. చాలామంది రోజులు రెండు నుంచి మూడుసార్లు అయినా తప్పకుండా సిగరెట్ తాగుతూ ఉంటారు.. కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ దీనిని తాగకుండా ఉండలేరు.. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఫన్నీ ఘటన కూడా దీనికి సంబంధించిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ రీల్ చూసి అందరూ పగలబడి నమ్ముకుంటున్నారు.. ఈ రీల్‌లో ఒక యువకుడు సిగరెట్ తాగడం మీరు గమనించవచ్చు.. అయితే అతను నోరు తో కాకుండా ఏకంగా ముక్కుతో సిగరెట్ తాగుతున్నాడు..
సాధారణంగా అందరూ సిగిరెట్ పొగను నోటితో పీల్చుకొని కొన్ని కొన్ని సందర్భాల్లో ముక్కుతో బయటికి వదులుతూ ఉంటారు.. కానీ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ముక్కు ఎడమ రంధ్రంలో సిగరెట్ పెట్టుకొని.. దాని నుంచి నేరుగా పీల్చుకొని నోటి నుంచి పొగను బయటికి వదులుతుండడం మీరు వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తి వీడియోకు ఫోజులిస్తూ మరి.. రెచ్చిపోయి ముక్కుతో సిగిరెట్ పొగని ఎక్కువగా పీల్చుకోవడం మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ దృశ్యాలు చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఇదేం వింతరా బాబు అని.. కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే ఈ వీడియో చూసి బీభత్సంగా నవ్వుకుంటున్నారు..
అయితే, ఈ వీడియో చూసిన చాలా మంది వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.. కొంతమంది ఇలాంటి మనుషులు మన భారతదేశంలోనే ఉంటారని కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది ఇలా సిగరెట్ తాగడం చాలా డేంజర్ అని వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోని కొన్ని లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది వారి అభిప్రాయాలు కామెంట్లలో రాసుకొచ్చారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Congress Fake Promises: 'ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్. ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పుమోపారు. రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదు' అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు అందరినీ మోసం చేశారని ఆరోపించారు. 'కాంగ్రెస్ నాయకులు ఒకరిని మించి ఒకరు ఫేక్ తున్నారు. అందుకే ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం' అని అభివర్ణించారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్ బడ్జెట్‌తో ఆరు గ్యారెంటీలకు ఘోరీ.. అందరికీ మొండి'చేయి': హరీశ్ రావు
తెలంగాణ బడ్జెట్‌పై శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డ, రాహుల్‌గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. 'రాహుల్ గాంధీ మా హైదరాబాదీ సలీం ఫేక్ లాంటి వ్యక్తి. సలీం ఫేక్ తన ఫేక్ తో కనీసం ప్రజలను నవ్విస్తాడు.. రాహుల్ మా ప్రజలను ఏడిపిస్తున్నాడు. అందుకే ఇక నుంచి రాహుల్ గాంధీకి రాహుల్ ఫేక్ అని నామకరణం చేస్తున్నాం' అని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. 'రైజింగ్ తెలంగాణ అంటే నిరుద్యోగంలో రైజింగ్ అవుతున్నాం. మోడీ బడే భాయ్ అని ఢిల్లీకి పోయి వంద రూపాయలు కూడా తేలేదు. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు ఇచ్చింది 4 శాతం నిధులే. తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించారు' అని కవిత ఏకరువు పెట్టారు.
Also Read: RK Roja: ఉగాది రోజు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీఆర్ నాయుడు గాడిదలు కాస్తున్నారా?
'తెలంగాణ బడ్జెట్ ఏ మాత్రం ప్రజామోదం పొందేలా లేదు. బీసీలు 56 శాతం ఉంటే వారికి 4 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు అంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడకు వచ్చి ఫేకారు. ఎంబీసీ మినిస్ట్రీ, ఎంబీసీలో వెనుబడిన కులాలకు కార్పొరేషన్లు అన్నారు. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు' అని కవిత గుర్తుచేశారు. ఈ రాష్ట్రంలో గిరిజన మంత్రి లేని మొదటి ప్రభుత్వం ఇది అని.. కచ్చితంగా లంబాడా మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.
'పేదల మీద ప్రేమ ఉన్నట్లు రాహుల్ గాంధీ మాట్లాడేదంతా ఫేక్. చాలా అంశాల్లో గతేడాది ఎంత కేటాయింపులు జరిపారో మళ్లీ వాటినే అక్షరం మార్చకుండా కేటాయించారు. మైనార్టీ, రైతు భరోసా, రైతు కూలీలకు ఇచ్చే సాయం, గృహా జ్యోతి ఇలా గతేడాది బడ్జెటే పెట్టారు. అందుకే ఇది విజన్ బడ్జెట్ కాదు. రీ విజన్ బడ్జెట్ మాత్రమే అంటున్నా' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 'బడేభాయ్ మోడీ అంటూ వందల సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ లను తెచ్చుకోలేకపోయారు. ఎందుకు ప్రధానితో బీసీ బిల్లు, అఖిలపక్షం భేటీ గురించి మాట్లాడటం లేదు. పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలి?' అని కవిత ప్రశ్నించారు.
పైరవీలతో తమ వాళ్లకు పదవులు తెచ్చుకుంటున్నారు.. కానీ ప్రజలకు మాత్రం పైసలు తేవటం లేదని అని మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు బడ్జెట్ పైసా కేటాయించలేదు.. కొత్త పింఛన్లు లేవు.. కొత్త ఉద్యోగాల భర్తీ ఊసేలేదని వివరించారు. అంటే ఇది ఫేక్, ఫ్యాబ్రికేటేడ్ బడ్జెట్ అని స్పష్టంగా తెలిసిపోతోందని పేర్కొన్నారు. 'మొత్తంగా రాష్ట్రం అప్పు...8 లక్షల 64 వేల 198 కోట్లకు చేరింది. అంటే ఒక్కో వ్యక్తిపై రూ.2. 16 వేలు అప్పు ఉంది. ఒక్కో కుటుంబంపై దాదాపు రూ.9 లక్షల అప్పు ఉన్నట్లే' అని వివరించారు. అప్పు తెచ్చిన డబ్బులు ఏమైనా సంక్షేమ పథకాలు అమలు చేశారా అంటే అది లేదని మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Girl Drinks Full Bottle Video: సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్యకాలంలో వింతలతో పాటు విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యూస్ కోసం, లైకుల కోసం కొందరు యువత ప్రాణాలకు తెగించి స్టంట్‌లు చేస్తుంటే.. మరికొందరు తమ ఆరోగ్యాన్నిపణంగా పెట్టి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఓ యువతకి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. చూస్తుండగానే ఒక నిండు మద్యం చేశాను ఆమె ఖాళీ చేసిన తీరు చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. యువతులంతా ఓ చిన్న ప్రైవేట్ పార్టీ చేసుకుంటున్నారు.. అక్కడ ఒక యువతి తన ఫ్రెండ్స్ అందరూ చూస్తుండగానే Old Monk రమ్ ఫుల్ బాటిల్‌ను చేతిలోకి తీసుకుంది. సాధారణ ఆల్కహాల్ను నీళ్లు లేదా సోడా కడుక్కొని తాగుతారు.. కానీ ఈ యువతి మాత్రం ఏకంగా బాటిల్ మూత తీసి.. నోట్లో పెట్టుకుని ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా తాగడం మొదలుపెట్టడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు..
కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోని ఆ బాటిల్‌లోని మధ్యాన్ని మొత్తం కడుపులో పోసేసుకుంది.. పక్కనున్న స్నేహితులు ఆమెను ఆపాల్సింది పోయి.. తాగుమంటూ ప్రోత్సహించడం ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూడొచ్చు. బాటిల్ పూర్తయ్యాక ఆ యువతి ఏదో సాధించినట్లు నవ్వుతూ కనిపించడం గమనార్హం.. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
ఈ వీడియో సోషల్ మీడియాలోకి రాగానే నిమిషాల్లో వైరల్‌గా మారడం విశేషం. అయితే దీనిపై కొంతమంది నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇది ప్రతిభ కాదు ఆత్మహత్యతో సమానం.. అంటూ కొంతమంది కామెంట్ చేయగా.. మరి కొంతమంది అంత మోతాదులో ఆల్కహాల్ ఒక్కసారిగా శరీరంలోకి వెళ్తే లివర్ దెబ్బ తినే ప్రమాదం ఉందని.. మరి కొంతమంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. అయితే గతంలో కూడా కొంతమంది యువత ఇలా లిక్కర్ ఛాలెంజ్ లో భాగంగా.. గబగబా ఫుల్ బాటిల్ తాగి ప్రాణాల మీదికి తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. మరి ఈ యువతి పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Water Melon For Diabetic Patients: వేసవిలో ఎండ నుంచి తట్టుకునేందుకు పుచ్చకాయ మంచి ప్రయోజనకారిగా పనిచేస్తుంది. ఎంతో ఇష్టంగా ఈ పండును తింటుంటారు. అయితే మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను తినేందుకు ఎంతో భయపడతారు. మధుమేహ రోగులు పుచ్చకాయ తినవచ్చా లేదా అనే విషయంపై మనలో చాలా మందికి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. అయితే దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
పుచ్చకాయలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 72. ఇది అధిక వర్గంలోకి వస్తుంది. సాధారణంగా మధుమేహం ఉన్నవారు తక్కువ GI (గ్రైసెమిక్ ఇండెక్స్) ఉన్న ఆహారాలను తినాలి. కానీ పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఈ కారణంగా దీని గ్లైసెమిక్ లోడ్ (GL) కేవలం 5 మాత్రమే. అంటే, దీనిని తక్కువ పరిమాణంలో తీసుకుంటే, రక్తంలో చక్కెరపై దీని ప్రభావం పెద్దగా ఉండదు.
మధుమేహ వ్యాధిగ్రస్తులైన రోజుకు 100 నుండి 150 గ్రాముల కంటే ఎక్కువ పుచ్చకాయ ముక్కలను తినకపోవడం మంచిది. పుచ్చకాయ రసం తీయడం వల్ల దానిలోని పీచుపదార్థం తగ్గిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవచ్చు. అందువల్ల.. షుగర్ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ జ్యూస్ కంటే ముక్కలను తినడం ఎంతో మంచిది.
పుచ్చకాయ ముక్కలను బాదం, వాల్‌నట్‌లు లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఇతర ఆహారాలతో కలిపి తినడం వల్ల సహజ చక్కెర శోషణ నెమ్మదిస్తుంది. అయితే పుచ్చకాయను తినే సమయం కూడా ఎంతో ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో అయినా పుచ్చకాయను ఉదయం లేదా మధ్యాహ్నం తినడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాత్రిపూట పండ్లు తినడం మంచిది కాదని చెబుతున్నారు.
పుచ్చకాయ ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ పండులో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుందట. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. అలాగే, దీనిలోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. అయితే, వారి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి వారు దీనిని పరిమితంగా తీసుకోవాలి. తీవ్రమైన మధుమేహం ఉన్నవారు తమ వైద్యుని సలహా మేరకు మాత్రమే ఈ పండును తినాలి.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల నుంచి సంగ్రహించింది. దీన్ని పాటించే సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OnePlus Nord 6 Price: స్మార్ట్‌ఫోన్ ప్రజలకు వన్‌ప్లస్ సంస్థ మరో అద్భుతమైన శుభవార్త అందించబోతోంది. మధ్యతరగతి వినియోగదారుల కోసం త్వరలోనే మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది OnePlus Nord 6 పేరుతో మార్కెట్లోకి రాబోతోంది. అయితే, అధికారిక ప్రకటనకు ముందే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి.. అంతేకాకుండా ఇది మార్కెట్లోకి ఎంతో శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
లీకైన సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ 6 ను భారత మార్కెట్లోకి ఏప్రిల్ ఏడవ తేదీన విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే కంపెనీ విడుదల చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లీకైన సమాచారం ప్రకారం ఈ మొబైల్ చాలా అద్భుతమైన డిజైన్తో పాటు కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ ఫీచర్స్ తో ఇది అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా వినియోగదారులకు అత్యుత్తమ లుక్కున అందించేందుకు మొబైల్ స్టైల్ కూడా మార్చినట్లు తెలుస్తోంది.
సాధారణ స్మార్ట్‌ఫోన్స్‌లో వన్‌ప్లస్ కంపెనీ ఇప్పటికీ కేవలం 5000mAh బ్యాటరీతో మాత్రమే మార్కెట్‌లోకి మొబైల్స్‌ను విడుదల చేసింది.. కానీ త్వరలో రాబోయే వన్ ప్లస్ నార్డ్ 6 ఏకంగా మోస్ట్ పవర్ఫుల్ 9000mAh భారీ బ్యాటరీతో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇది నిజమైతే ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం మూడు నుంచి నాలుగు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీనికి తోడు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తే అతి తక్కువ సమయంలోనే బ్యాటరీని ఎంతో సులభంగా ఫిల్ చేయొచ్చు..
లీకైన వివరాల ప్రకారం.. ఈ మొబైల్ 12GB ర్యామ్ వేరియంట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. గేమింగ్ ప్రియులకు ఈ మొబైల్ ఎంతగానో సరిపోతుంది. అంతేకాకుండా ఇది 6.7 అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ మొబైల్‌లోని వెనుక భాగం కెమెరా 108MP అద్భుతమైన సెన్సార్‌తో విడుదల కాబోతోంది. దీంతోపాటు ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ రూ.30 వేల లోపే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Budget: 'రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది. ఆరు గ్యారెంటీలకు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి విజయవంతంగా ఘోరీ కట్టారు' అని బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. '20 పేజీలు పెంచారు, రూ.20 వేల కోట్ల బడ్జెట్ పెంచారు తప్ప ఆరు గ్యారెంటీల ప్రస్తావన, నిధుల కేటాయింపు చేయలేకపోయారు. కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప, ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు' అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
Also Read: RK Roja: ఉగాది రోజు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీఆర్ నాయుడు గాడిదలు కాస్తున్నారా?
బడ్జెట్ 2026-27పై అసెంబ్లీ మీడియా హాల్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల అభివృద్ది కోసం కాదన్నది బడ్జెట్ నిరూపించింది. గత బడ్జెట్‌లో చెప్పిన పథకాలు అమలు చేయలేదు, ఈసారి అవే పెట్టారు. పోయిన బడ్జెట్ మాదిరి ఈ బడ్జెట్‌లో రాజీవ్ యువ వికాసం కోసం రూ.6 వేల కోట్లు పెట్టారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనే అదే జరిగింది. ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క పైసా ఖర్చు చేయలేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.
Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!
'ఈ బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరేదీ కాదు. కేటాయింపుల విషయంలో.. ఖర్చు విషయంలో చిత్తశుద్ది లేదు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేరు చెప్పి వారి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు. భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్, బడా జూటా బడ్జెట్, ఇదొక వట్టి బడ్జెట్' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 'అభయహస్తం కాదు రిక్త హస్తం అని అర్థమైంది. తెలంగాణను, హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేయడం తప్ప విషయం లేదు. పింఛన్ల పెంపు లేదు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ లేదు' అని గుర్తుచేశారు.
Also Read: Devuni Kadapa: ఉగాది ప్రత్యేకం.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లిం భక్తులు
'ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులకు మొండి చేయి. ముదిరాజులకు, గౌడన్నలకు, గొల్ల కుర్మలకు ఇలా అన్నబీసీ వర్గాలకు మొండిచేయి. ఎస్సీ, ఎస్టీలకు మొండి చేయి, మహిళలకు మొండి చేయి
ఆశా, అంగన్ వాడీలకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి చూపారు. సకల జనులకు దక్కింది గుండు సున్నా' అని బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. అంకెల గారడీ మాటల గారడీ తప్ప పేదల పట్ల చిత్తశుద్ది లేదని ప్రకటించారు. 'మూడేళ్లు నిండకముందే రూ.మూడున్నర లక్షల కోట్ల అప్పలు చేశారు. కేసీఆర్ తెచ్చిన అప్పులను మూల ధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించాడు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మెడికల్ కాలేజీలు కట్టాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.
'మీరేం చేశారు? చరిత్రలో ఎన్నడూ లేనంత అప్పు పెరిగింది. 27 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చొబెట్టుకొని అంబేడ్కర్ సూక్తులు మాట్లాడటం సిగ్గుచేటు' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పదేండ్ల కాలంలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరింపచేసింది. ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం మీది' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కుంభకోణాలు తప్ప పథకాలు ఉన్నాయా? మేడారం టెండర్లలో ఏం జరిగిందో మీ క్యాబినెట్ మంత్రి కుమార్తెనే చెప్పింది. నాసిరకం పనులతో నాలుగు రోజులకే బయటపడ్డది. గురుకులాల్లో తిండి పెట్టే దిక్కు లేదు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూల్లు అంటూ ఆర్భాటాలు చేస్తున్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 'పెట్టుబడుల విషయంలో అవే కట్టు కథలు
ఏ కంపెనీ, ఎన్ని ఉద్యోగాలు, ఎంత పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలి' అని డిమాండ్ చేశారు. 'విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు అక్రమ సంపాదన భద్రపరుచుకోవడానికి. దేశ సగటు కన్నా తెలంగాణ జీఎస్డీపీ అధికంగా ఉందని భట్టి విక్రమార్క చెబుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రం దివాళా తీసింది అంటాడు' అని గుర్తుచేశారు.
వంద రోజుల్లో చేస్తానన్న ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదు? అని బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'ఆరు గ్యారెంటీల విషయంలో గతేడాది రూ.56 వేల కోట్లు పెడితే ఈ బడ్జెట్‌లో రూ.50 వేల కోట్లకు కుదించారు' అని తెలిపారు. 'దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9శాతం ఎక్కువ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో 14 శాతం ఉంటే కాంగ్రెస్ పాలనలో 10 శాతం. అంటే నాలుగు శాతం తగ్గింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రస్తావించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ వేళ హారీష్ రావు మాస్ వార్నింగ్..రాజీనామా చేయాలంటూ రేవంత్‌కు సవాల్!
IPL Commentators Salary Per Match: మరో వారంలో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్ కేవలం ఆటగాళ్లు, ఫ్రాంఛైజీలు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కే కాకుండా మ్యాచ్ వ్యాఖ్యాతలకు కూడా కోట్లు డబ్బు వచ్చివాలనుంది. ఆటగాళ్ల గ్రౌండ్‌లో బౌండరీలతో స్టేడియంలో ప్రేక్షకులను ఉత్సాహ పరుస్తుంటే.. టీవీల్లో చూసేవారికి మాత్రం కామెంటేటర్స్ (వ్యాఖ్యాతలు) ఉత్సాహాన్ని నింపుతారు. అయితే కామెంటరీ బాక్స్‌లో వ్యాఖ్యాతలుగా ఉన్న వారికి ఎంత జీతం వస్తుందో తెలుసా? నిజం తెలిస్తే అవాక్కవాల్సిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ప్రపంచంలోనే అత్యంత ధనిక టీ20 లీగ్‌గా పరిగణిస్తారు. ఈ లీగ్ ద్వారా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఏటా వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తుంది. టీమ్ ఫ్రాంఛైజీలతో పాటు స్టార్ క్రికెటర్లు, మ్యాచ్‌లను టెలికాస్ట్ చేసే ఛానల్స్ భారీ మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తారు. సాధారణంగా దృష్టి ఆటగాళ్లపైనే ఉన్నప్పటికీ, ప్రత్యక్ష మ్యాచ్‌లకు జీవం పోసే వ్యాఖ్యాతల జీతాలు కూడా తక్కువేమీ కావు.
ప్రేక్షకులకు మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడం బుల్లితెరలో ఉండే కామెంటేటర్ల బాధ్యత. ఆటగాళ్లలోని ఒత్తిడి, ఉత్సాహం, వ్యూహం, మానసిక స్థితిని ప్రేక్షకులు అర్థం చేసుకోగలిగే రీతిలో తెలియజేయడం వ్యాఖ్యాతల బాధ్యతగా వస్తుంది. అందుకే వారి అనుభవం, భాషపై పట్టు, ఆటపై అవగాహన ఆధారంగా వారికి భారీ జీతం చెల్లిస్తారు.
హిందీ వ్యాఖ్యాతల జీతం ఎంతంటే?
కొన్ని జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. హిందీ వ్యాఖ్యాతలకు ఒక్కో ఐపీఎల్ సీజన్‌కు రూ.60 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. అలాగే జూనియర్ వ్యాఖ్యాతలకు ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.35,000 చెల్లిస్తున్నట్లు తెలిసింది. తెలుగుతో పాటు ఇతర తమిళ, కన్నడ వ్యాఖ్యాతలకు కూడా అనుభవాన్ని బట్టి సుమారు రూ.35,000 నుంచి రూ.1 లక్ష వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది.
ఐపీఎల్ ప్రసారాల్లో ఆంగ్ల వ్యాఖ్యాతలకు భారీగా డిమాండ్ ఉంది. వారి అంతర్జాతీయ గుర్తింపు, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల కారణంగా వారికి అధిక జీతాలు చెల్లిస్తారు. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఒక్కో సీజన్‌కు సుమారు రూ.4.17 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.
గవాస్కర్ తర్వాత ఆ స్థాయిలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్, వెస్టిండీస్ మాజీ పేసర్ ఇయాన్ బిషప్ వంటి వ్యాఖ్యాతలకు ఒక్కో ఐపీఎల్ సీజన్‌కు రూ.4.17 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. వారి కామెంట్రీ స్టైల్, అంతర్జాతీయ అనుభవం, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే సామర్థ్యం వారికి ఈ స్థాయి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.
కామెంట్రీ అనేది కేవలం మ్యాచ్ వివరణ మాత్రమే కాదు. అది ప్రేక్షకుల భావోద్వేగాలతో మమేకమయ్యే ఒక స్వరం. ఒక మంచి వ్యాఖ్యాత మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చగలడు. అందుకే ఐపీఎల్ వంటి లీగ్‌లో వ్యాఖ్యాతల ఎంపికకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది. ఐపీఎల్‌లో ఆటగాళ్ల మైదానంలో బౌండరీలు దంచికొడుతుంటే.. వ్యాఖ్యాతలు తమ మాటలతో దానికి మరింత వాల్యూ జోడిస్తారు. అందుకే వారికి కూడా కోట్ల రూపాయల పారితోషికం లభిస్తుంది. స్టార్ ఆటగాళ్లలాగే, స్టార్ వ్యాఖ్యాతలు కూడా ఐపీఎల్ వంటి వేదికలపై కీలక పాత్ర పోషిస్తారని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan Ugadi: హిందూత్వంపై తమ నాయకుడు వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేసే చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీఆర్ నాయుడు ఉగాది పండుగ రోజు ఏం చేశారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా నిలదీశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సతీ సమేతంగా ఉగాది పండుగను చేసుకుంటుంటే ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. మాట్లాడితే జగన్ మతంపై వివాదం సృష్టించే ముగ్గురిపై ఆర్‌కే రోజా తీవ్ర విమర్శలు చేశారు.
Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!
తిరుపతిలో జరిగిన ఓ సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్ చేశారు. 'ఉగాది రోజున వైఎస్ జగన్ ,వైఎస్ భారతీ గారు కుటుంబ సమేతంగా పండుగ చేసుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా బీఆర్ నాయుడు ఏం చేశారు? ఈ గాడిదలు నిన్న ఎక్కడికి పోయాయి? ఏమి చేస్తున్నాయి?' అని ఆర్‌కే రోజా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య కలసి ఎందుకు ఉగాది చేసుకోలేదు? అని నిలదీశారు.
Also Read: Devuni Kadapa: ఉగాది ప్రత్యేకం.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లిం భక్తులు
'ఉగాది రోజు చంద్రబాబు ఆయన భార్యతో కలసి ఎందుకు చేసుకోలేదు? పండుగ రోజు లేకుండా చంద్రబాబు భార్య హెరిటేజ్‌లో కూర్చుని పాలు పిసుకుతున్నారా?' అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'సిగ్గు లేని బీఆర్ నాయుడు రాజకీనామా చేయకుండా ఉన్నాడు. తిరుమలకు ఒక మహిళతో, షిరిడీకి మరో మహిళలతో పోతాడు. తిరుమలలో ఉగాది పండుగను ఎందుకు చేయలేదు? బీఆర్ నాయుడు ఎక్కడికి పోయాడు?' అని ప్రశ్నించారు.
Also Read: Telangana CM Gift: ఉగాది పండుగ కానుక ప్రకటించిన తెలంగాణ సీఎం.. రైతులకు అదిరిపోయే వార్త
'నిన్న (ఉగాది పండుగ రోజు) ఈ ముగ్గరు గాడిదలు గాస్తున్నారా? కుటుంబ సమేతంగా వచ్చి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పక పోవడానికి ఏమిటి వీళ్లకు రోగం' అని రోజా సెల్వమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్, భారతి సంతోషంగా ఉగాది పండుగను చేసుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. ఆడబిడ్డ నిధి రూ.1,500 ఇస్తామని మహిళలను మోసం చేస్తున్నాడు అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. 'కూటమి ప్రభుత్వంలో ఆశ కార్యకర్తలు, రైతులు, మహిళలు ఏ ఒక్కరు సంతోషంగా లేదు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు' అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Premium Petrol Price Hike Today: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ధరలపై ప్రత్యక్షగా ప్రభావం చూపుతోంది. ముడిచమురు ధరగా భారీగా పెరిగిన నేపథ్యంలో భారత్‌లోని పెట్రోలియం సంస్థలు కూడా ప్రీమియం ధరలను భారీగా పెంచేశాయి. నేటి నుంచి అనగా మార్చి 20 నుంచి స్పీడ్, పవర్ పెట్రోల్ కోసం అదనంగా చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడింది.
కొత్త పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. 'స్పీడ్', 'పవర్' వంటి ప్రీమియం పెట్రోల్ ధరలను పెట్రోలియం కంపెనీలు అమాంతం పెంచేశాయి. స్పీడ్, పవర్ పెట్రోల్‌పై ఇప్పుడు లీటరుకు రూ.2.09 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపుతో ఇంతకు ముందు రూ.111.68గా ఉన్న ధరలు రూ.113.77కు చేరాయి. అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి.
పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగాయి?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ ముడిచమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడిచమురు ధరల పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరలు కూడా పెరుగుతున్నాయి. ఆయా దేశాల మధ్య యుద్ద తీవ్రత పెరగడం వల్ల చమురు ఉత్పత్తి, పంపిణీపై ప్రభావం చూపింది. గత కొద్ది రోజులుగా ముడిచమురు ఉత్పత్తి చేసే విద్యుత్ ప్లాంట్లపై దాడులు పెరిగాయి. ఇది ప్రపంచ చమురు మార్కెట్‌లో భారీగా అస్థిరతను సృష్టించినట్లు అయ్యింది.
మరోవైపు మధ్యప్రాచ్యం నుంచి ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా అయ్యే హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాలపై ఇరాన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఏవైనా అంతరాయాలు ఏర్పడితే, చమురు సరఫరాలపై మరింత తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి అవసరమైన ముడిచమురు రవాణాలో 20 శాతం ఈ మార్గంలో జరుగుతుంది. ఇరాన్ - ఇజ్రాయెల్ సంఘర్షణ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iqoo Z11 Launch Date: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐకూ మార్కెట్‌లోకి వచ్చే వారం iQOO Z11 స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ను కూడా వెల్లడించింది.. చైనాలో ఈ మోడల్‌లో పాటు కొత్త iQOO Z11x మోడల్ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఈ మోడల్ కూడా భారత మార్కెట్‌లోకి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, రాబోయే మోడల్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
iQOO Z11 ఫోన్‌తో పాటు iQOO Z11x స్మార్ట్‌ఫోన్‌లు మార్చి 26న చైనాలో విడుదల కానున్నాయని కంపెనీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. iQOO Z11 ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన 9,020 mAh బ్యాటరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది చాలా ప్రత్యేకమైన 165 Hz గేమింగ్ డిస్‌ప్లేతో వస్తున్న కంపెనీ తెలిపింది.. iQOO Z11లో 6.83-అంగుళాల 1.5K OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని, అలాగే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16 GB వరకు ర్యామ్‌తో పాటు 512 GB వరకు స్టోరేజ్‌తో లాంచ్ కాబోతోంది.
ఈ iQOO Z11 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6తో అందుబాటులోకి రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు వరకు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ భారత మార్కెట్‌లోకి విడుదలైతే.. 6GB RAM వేరియంట్ కలిగిన మోడల్ ధర రూ. 18,999 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రెండవ వేరియంట్ 8 GB ర్యామ్‌తో ధర రూ. 20,999 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక చివరి వేరియంట్ 256 GB వేరియంట్ ధర రూ. 22,999తో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ రంగుల్లో విడుదల కానుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
iQOO Z11 ఫోన్ 6.76-అంగుళాల (1,080 x 2,344 పిక్సెల్స్) LCD డిస్ల్పేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ OS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో విడుదల కాబోతోంది. దీని వెనక భాగంలోని ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అదనంగా 2-మెగాపిక్సెల్ బోకె కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇందులో వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung Galaxy A57 5g Price: సాంసంగ్ గెలాక్సీ A57 త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. అయితే, లాంచింగ్‌కి ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ మొబైల్ చాలా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో విడుదల చేసిన మోడల్స్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపించబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాంసంగ్ గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్ లీక్ అయిన వివరాలను బట్టి చూస్తే.. ఇది మార్చి నెలాఖరులో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.. విడుదలకు ముందే, ఈ ఫోన్‌కు సంబంధించిన ఒక హ్యాండ్స్-ఆన్ వీడియో కూడా లీక్ అయింది. అయితే, ఈ వీడియోను మారుఫ్ మీర్జాయెవ్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియోలో స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను స్పష్టంగా చూడొచ్చు. ఈ గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్‌లో ఎక్సినోస్ 1680 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత UI 8.5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
సాంసంగ్ గెలాక్సీ A57 లీక్ అయిన ఫీచర్స్:
సాంసంగ్ గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లీక్ అయిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కూడిన 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉంటాయని, ఇది ఒక ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్‌గా నిలుస్తుందని ఇప్పటికే సోషల్ మీడియాల్లో వార్తలు విపరీతంగా వస్తున్నాయి.. ఈ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ కూడా అందుబాటులో ఉంది.. ఇది చూడడానికి సన్నని డిజైన్‌ను కలిగి ఉండడమే కాకుండా.. 6.9mm మందంతో అందుబాటులో ఉంది..
గెలాక్సీ A57 5G కెమెరాకు సంబంధించిన వివరాలు కూడా ఇటీవలే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో 50MP ప్రధాన కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే అదనంగా 13MP కెమెరా సెన్సార్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో మూడవ సెన్సార్ 5MP మాక్రో కెమెరా కూడా లభిస్తోంది. ఈ ఫోన్‌లో ఉన్న కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ కూడా చేసుకునే సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌లో ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో పాటు 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతున్నట్లు సమాచారం.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPS-95 Pension Hike 2026: దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగులకు ముఖ్యగమనిక. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లోని ముఖ్యమైన ఈపీఎస్-95 కింద కనీస పెన్షన్‌ను పెంచాలని ఎప్పటినుంచో పెన్షనర్లు డిమాండ్ చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టతనిచ్చింది.
గత వారం పార్లమెంటులో పెన్షనర్ల చిరకాల డిమాండ్‌ను ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ లేవనెత్తారు. ఈపీఎఫ్ పెన్షన్ సవరణ కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి ప్రభుత్వానికి ఏమైనా ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించారు. ఈ సిఫార్సులను అధ్యయనం చేశారా అనే విషయాలతో సహా ఐదు కీలక ప్రశ్నలు అడిగారు. దీనిపై కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సమాధానమిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే EPS-95 పథకం కింద నెలకు రూ.1,000 కనీస పింఛను అందిస్తోందని మంత్రి మన్సుఖ్ మాండవీయా తెలియజేశారు. ప్రతి ఏడాది EPSకు ప్రభుత్వం '1.16%' వాటాను అందిస్తోందని కార్మిక శాఖ మంత్రి పునరుద్ఘాటించారు. లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలో కూడా EPFO, EPS-95 కింద కనీస పింఛను పెంపుపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. పింఛను పెంపు అమలు, నిధుల స్థిరత్వం వంటి కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించింది.
పెన్షనర్ల నెలవారి అవసరాలను తీర్చడానికి నెలకు రూ.1,000 కనీస పింఛను సరిపోదని పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే, పింఛను నిధికి సంబంధించిన ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్ బాధ్యతలను సమాకాలీనం చేసేందుకు ఏ పెంపు అయినా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈపీఎస్-95 పెన్షన్ కింద రూ.1,000 నుంచి రూ.7,500కి పెంపు ఇప్పట్లో లేదనే సంకేతాలను మంత్రి లోక్‌సభ వేదికగా స్పష్టం చేశారు.
(గమనిక: ఈ పోస్ట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించింది. ఇది ఎలాంటి ప్రభుత్వ జీతాల పెంపు లేదా పింఛను పెంపునకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. తాజా, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సంప్రదించమని సిఫార్సు చేస్తున్నాము.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kallur Donkey Race Telugu Latest News: రాయలసీమ గడ్డకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది.. అద్భుతమైన సంప్రదాయాలకు పెట్టింది పేరు.. ఆధునిక కాలంలో యంత్రాలను వినియోగించి పనులు చేయడం పెరిగినప్పటికీ.. మూగజీవాల అవసరం తగ్గుతున్నా.. తమ మూలాలను మర్చిపోని కర్నూలు వాసులు ఒక అరుదైన వేడుకను దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం కల్లూరులోని చౌడేశ్వరి దేవి ఆలయం వద్ద నిర్వహించే గాడిదల బురద పరుగు పందెం స్థానిక సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తూ వస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ వింత ఆచారానికి దాదాపు 150 ఏళ్ల ఘన చరిత్ర ఉన్నట్లు సమాచారం.. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. మానవులకు ఎంతగానో అండగా నిలిచిన మూగజీవాల పట్ల కృతజ్ఞత చాటుకునేందుకు యాదవులతో పాటు అక్కడ ఉండే రైతులంతా ఈ ఉత్సవాన్ని నిర్హహిస్తారు. ఇందులో భాగంగా గాడిదను కేవలం భారం మోసే జంతువుగా చూడకుండా.. కష్టాల్లో పాలుపంచుకునే కుటుంబ సభ్యుడిగా భావించడం ఇక్కడి విశేషం..
ఉగాది తర్వాతి రోజున నగరం నడివొడ్డున ఉన్న చౌడేశ్వరి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అంతేకాకుండా ప్రాంగణంలో మోకాలోతు బురదలో గాడిదలు పరుగులు తీస్తుంటే.. యువకులు ఎంతో ఉత్సాహంగా వాటిని వెంటాడుతూ ప్రత్యేకమైన మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాకుండా గంగానమ్మకు ప్రతిరూపమైన ఈ మట్టిలో చేసే ప్రదక్షిణ వల్ల రాబోయే సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, పాడి పశువులకు ఎలాంటి వ్యాధులు సోకవని.. పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉంటారని భక్తుల భక్తుల నమ్మకం..
అలాగే డప్పు వాయిద్యాలు, యువకుల డ్యాన్స్‌ల మధ్య గాడిదలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కేవలం కర్నూలులోనే జరిగే ఈ బురద పందేలను చూడటానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరిలి వస్తారని స్థానికులు చెబుతున్నారు. తమ పూర్వీకులు అందించిన ఈ వారసత్వాన్ని కాపాడుకోవడం వారి బాధ్యత.. గాడిద అంటే ఓర్పుకు నిదర్శనం.. యంత్రాలు ఎన్ని వచ్చినా మా నమ్మకం మాత్రం మారదని స్థానిక రజక సంఘం ప్రతినిధులు గర్వంగా చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook