హయత్ నగర్ లో రిలయన్స్ డిజిటల్ షోరూం ప్రారంభించిన సినీనటి నభా నటేష్
హయత్‌నగర్‌లోని కొత్త రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ను సినీనటి నభా నటేష్ ఈ రోజు ప్రారంభించారు. 1 లక్ష రూపాయల పైగా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులతో ఫోటోలు తీసి, వారికి వస్తువులు అందించారు. నభా నటేష్ మాట్లాడుతూ, ఈ స్టోర్ ప్రారంభం తనకు చాలా సంతోషంగా ఉందని, ప్రముఖ నటితో మీట్ & గ్రీట్ష్లో పాల్గొనేవారికి ప్రత్యేక సంతకం చేసిన వస్తువులు అందించామన్నారు. కొత్త స్టోర్‌లో, బ్యాంక్ కార్డ్‌లపై 10% వరకు తక్షణ తగ్గింపుతో ఎర్లీ బర్డ్ ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Weight Loss Tips Without Gym: నేటి కాలంలో అధిక బరువు (Obesity) అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గడం అనగానే అందరికీ గుర్తొచ్చేది కఠినమైన డైటింగ్, గంటల తరబడి జిమ్‌లో వ్యాయామం. కానీ, మన జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, ఆకలితో అలమటించకుండానే నేచురల్‌గా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు చూద్దాం.
1. జీవక్రియ (Metabolism) మెరుగుపరచుకోండి
బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించేది మీ శరీర జీవక్రియే. రోజంతా తగినంత నీరు త్రాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు (Toxins) బయటకు వెళ్లిపోతాయి. ఇది కేలరీలను వేగంగా ఖర్చు చేయడంలో సహాయపడుతుంది. భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల ఆకలి తగ్గుతుంది, దీనివల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు.
2. ఆహారం తీసుకునే పద్ధతి మార్చండి
మనం ఏమి తింటున్నామనే దానికంటే, ఎలా తింటున్నామనేది ముఖ్యం. ఆహారాన్ని బాగా నమిలి, ఆస్వాదిస్తూ తినండి. ఇలా చేయడం వల్ల మీ కడుపు నిండిందనే సంకేతం మెదడుకు త్వరగా అందుతుంది. మీ డైట్లో ఫైబర్ (పీచు పదార్థం), ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇవి కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి, అనవసరమైన చిరుతిళ్లపై వ్యామోహాన్ని తగ్గిస్తాయి.
3. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి
బరువు తగ్గడానికి తగినంత నిద్ర చాలా అవసరం. మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరం కండరాలను మరమ్మతు చేస్తుంది. నిద్ర లేమి వల్ల ఆకలిని ప్రేరేపించే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి, మీరు ఎక్కువగా తినే ప్రమాదం ఉంది. రోజుకు కనీసం 7-8 గంటల గాఢ నిద్ర అవసరం.
4. నడకను అలవాటు చేసుకోండి
ప్రత్యేకంగా వ్యాయామం చేయకపోయినా, రోజూవారీ పనుల్లో చురుగ్గా ఉండటం మంచి ఫలితాలను ఇస్తుంది. లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు నడవడం వంటి చిన్న మార్పులు కూడా కేలరీలను ఖర్చు చేయడంలో సహాయపడతాయి.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: School Holiday: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..విద్యార్థులు ఫుల్ ఖుషీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kalvakuntla kavitha emotional in the legislative council: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం సంచనలంగా మారారు.తరచుగా బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యంగా హరీష్ రావును టార్గెట్ చేసుకుని ఫైర్ అవుతున్నారు. అదే విధంగా ఎక్కడ అవకాశం దొరికిన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కల్వకుంట్ల కవిత శాసన మండలిలో సమావేశాలకు హజరయ్యారు. కవిత భావోద్వేగంకు గురయ్యారు. తనపై కొంత మంది కక్ష తో పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
LIVE: Speaking in Legislative Council https://t.co/hrMrPXGDHJ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 5, 2026
అంతేకాకుండా తెలంగాణలో బతుకమ్మ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసేటప్పుడు కూడా తనపై చాలా మంది తప్పుడు ప్రచారం చేశారన్నారు. తనపై ఈడీ, సీబీఐ దాడులు చేసినప్పుడు పార్టీ అండగా ఉండలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత మంది చేసిన తప్పులను ప్రశ్నించడంతోనే తనపై కుట్రలు చేసి పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారని కవిత మండలిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ కారులు, అసువులు బాసిన అమరులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నీళ్లు ,నిధులు, నియామకాల విషయంలోకూడా గత బీఆర్ఎస్ తో పాటు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కూడా పూర్తిగా మోసపూరితంగా వ్యవహరించాయన్నారు.
శాసనమండలిలో సమ్మక్క, సారాలమ్మ గురించి మాట్లాడుతూ.. ఇదే తన చివరి ప్రసంగమంటూ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా సమ్మక్క, సారక్క వైదిక చిహ్నాలను చెక్కారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read more: Phone tapping case: సీఎం రేవంత్‌కు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ఇది వారి సంప్రదాయాలకు విరుద్దమన్నారు. సమ్మక్క - సారక్క జాతరకు దేవాదాయ శాఖ పర్యవేక్షణ అనేది ఎంత వరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మక్క,సారక్క జాతరలో అమ్మవార్లు అడవి నుంచి రావడం సాంప్రదాయమని గిరిజన, ఆదివాసీ సంప్రదాయాలకు విరుద్దంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. కవిత శాసన మండలిలో కన్నీళ్లు పెట్టుకొవడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ామారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Chicken Price Increase 2026: నాన్‌వెజ్ ప్రియులకు 2026 సంవత్సరం చేదు వార్తతో ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న మాంసం ధరలు ఒక్కసారిగా పుంజుకుని, వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నాయి.
మార్కెట్లో ప్రస్తుత ధరల పరిస్థితి
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వివిధ రకాల కోడి మాంసం ధరల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ చికెన్ ధర (స్కిన్ లెస్) కిలో రూ.300, లైవ్ కోడి కిలోకి ధర రూ. 170, ఫారం కోడి కిలో రూ. 180, నాటు కోడి కిలో రూ. 300, కోడి గుడ్డు ధర (ఒక్కటి)రూ.8కి మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ధరలు పెరగడానికి కారణాలేంటి?
సాధారణంగా డిసెంబర్ నెలలో కిలో చికెన్ ధర రూ.240 నుండి రూ.250 మధ్య ఉండగా.. జనవరి మొదటి వారంలోనే 'ట్రిపుల్ సెంచరీ' (కిలో ధర రూ.300) కొట్టడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. పండగ సీజన్ కావడంతో విందు వినోదాల కోసం చికెన్ వినియోగం విపరీతంగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయి.
ఏపీలోని పాయకరావుపేట, నక్కపల్లి వంటి ప్రధాన పౌల్ట్రీ కేంద్రాల నుండి ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతులు జరుగుతున్నాయి. స్థానిక అవసరాలకు సరిపడా స్టాక్ లేకపోవడం వల్ల వ్యాపారులు ధరలను పెంచాల్సి వచ్చింది.
గతంలో బర్డ్‌ఫ్లూ వంటి కారణాలతో ధరలు పడిపోయినప్పుడు కోళ్ల ఫారాల యజమానులు నష్టపోయారు. కానీ ఇప్పుడు ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మాంసమే కాకుండా, పేదల ప్రోటీన్ ఆహారమైన గుడ్డు ధర కూడా రూ.8 కి చేరడం మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతోంది.
"చికెన్ తినాలంటేనే భయమేస్తోంది, పండగ పూట ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ ఈ రేట్లు చూస్తుంటే కూరగాయలతోనే సరిపెట్టుకోవాలేమో" అని వినియోగదారులు వాపోతున్నారు.
చివరిగా ఒక్క ముక్కలో చెప్పాలంటే.. సంక్రాంతి ముగిసే వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పండుగ తర్వాత సరఫరా మెరుగుపడితేనే ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
Also Read: School Holiday: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..విద్యార్థులు ఫుల్ ఖుషీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th Pay Commission New Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా చర్చకు వస్తున్న అంశం 8వ వేతన సంఘం. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకోసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి, ఉద్యోగుల జీతాలు, భత్యాలు, పెన్షన్లను సమీక్షిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. దీంతో 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది.
అయితే.. ఇప్పటికే ప్రభుత్వం 8వ వేతన సంఘానికి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR)లను 2025 నవంబర్‌లో ఆమోదించినప్పటికీ, వేతన సంఘం తన సిఫార్సులను సమర్పించడానికి సాధారణంగా 18 నెలల వరకు సమయం పడుతుంది. అంటే 2026లోనే కొత్త వేతనాలు అమలవుతాయన్నది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ లోపు కేంద్ర క్యాబినెట్ సిఫార్సులను ఆమోదించే వరకు ఉద్యోగులు 7వ వేతన సంఘం ప్రకారమే జీతాలు, పెన్షన్లు అందుకుంటూ ఉంటారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం డియర్నెస్ అలవెన్స్ (డీఏ). గత వేతన సంఘాల అనుభవం చూస్తే, కొత్త వేతన సంఘం అమలయ్యే సమయంలో ప్రభుత్వం మొత్తం కాలానికి సంబంధించిన బకాయిలను చెల్లించింది. ఇందులో పెరిగిన ప్రాథమిక వేతనం, అలవెన్సులు, పెన్షన్ ప్రయోజనాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కొత్తగా నిర్ణయించే ఫిట్మెంట్ కారకం ఆధారంగా లెక్కిస్తారు. అందువల్ల 8వ వేతన సంఘం అమలయ్యాక ఉద్యోగులకు భారీ మొత్తంలో అరియర్స్ వచ్చే అవకాశం ఉందన్న ఆశలు బలంగా ఉన్నాయి.
డీఏ విషయంలో మరో ముఖ్యమైన అంశం ఉంది. కొత్త వేతన సంఘం అమలైన వెంటనే అప్పటివరకు సేకరించిన మొత్తం డీఏను ప్రాథమిక జీతంలో విలీనం చేస్తారు. ఆ తర్వాత డీఏ మళ్లీ సున్నా నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం జూలై 1, 2025 నుంచి డీఏ 58 శాతానికి చేరుకుంది. తదుపరి డీఏ పెంపు జనవరి 1, 2026న జరగాల్సి ఉంది. కొత్త వేతన సంఘం అమలయ్యే వరకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలులోకి వచ్చిన తర్వాత మొత్తం డీఏ ప్రాథమిక జీతంలో కలిసిపోతుంది.
ఈ విధానం ఉద్యోగులకు ఒక్కసారిగా లాభమిచ్చినా, ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయంలో డీఏ సున్నా నుంచి ప్రారంభమవడం వల్ల ఆదాయం మీద ఒత్తిడి పడుతుందన్న ఆందోళన ఉద్యోగుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రత్యామ్నాయ సూచనలతో ముందుకొచ్చాయి. ఆల్ ఇండియా NPS ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ మాట్లాడుతూ.. 2028 నాటికి డీఏ సుమారు 74 శాతానికి చేరితే, మొత్తం డీఏను తొలగించకుండా, అందులో 50 శాతాన్ని మాత్రమే ప్రాథమిక జీతంలో విలీనం చేయాలని సూచించారు. మిగిలిన 24 శాతం డీఏను కొనసాగిస్తే, ద్రవ్యోల్బణ భారం ఉద్యోగులపై ఒక్కసారిగా పడదని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే కనీస వేతనాన్ని నిర్ణయించేటప్పుడు ఫిట్మెంట్ కారకాన్ని 2.64గా నిర్ణయించాలని, కుటుంబ యూనిట్ పరిమాణాన్ని మూడు నుంచి ఐదుకు పెంచాలని కూడా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం గత వేతన సంఘాల ఫార్ములానే కొనసాగిస్తుందా, లేక ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పించే మధ్యస్థ మార్గాన్ని ఎంచుకుంటుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
8వ వేతన సంఘం అమలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక మలుపుగా మారనుంది. జీతాలు, డీఏ, అరియర్స్ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు లక్షలాది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి. అందుకే ఈ అంశంపై ఉద్యోగుల్లో ఉత్కంఠ, ఆసక్తి మరింత పెరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Gustavo Petro warning by Trump: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అరెస్టు చేసిన తర్వాత లాటిన్ అమెరికా ప్రాంతం మొత్తం తీవ్ర ఉద్రిక్తతకు లోనవుతోంది. ఈ సైనిక చర్య ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలకు దారి తీసిన వేళ, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక దేశాధ్యక్షుడిని బహిరంగంగా హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈసారి ట్రంప్ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను లక్ష్యంగా చేసుకున్నారు.
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రచురించిన కథనం ప్రకారం, మదురో అరెస్టు అనంతరం ట్రంప్ కొలంబియా అధ్యక్షుడిని ఉద్దేశించి జాగ్రత్తగా ఉండాలి అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇలా హెచ్చరించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా పెట్రోపై ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ హెచ్చరిక మరింత తీవ్రతను సంతరించుకుంది. వాషింగ్టన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, “గుస్తావో పెట్రో కొకైన్ తయారీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఉన్నాడు. కొలంబియాలో కొకైన్ తయారు చేసి అమెరికాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అందుకే అతను తన ప్రాణాల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, మదురో అరెస్టును ప్రకటించిన సందర్భంలోనే ట్రంప్ మెక్సికో, క్యూబా దేశాలపై కూడా పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వెనిజులాపై దాడి మెక్సికోను ఉద్దేశించి కాదని చెబుతూనే, మాదకద్రవ్యాల ముఠాలపై కఠిన చర్యలు అవసరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కొలంబియా, క్యూబా నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు.ట్రంప్ వ్యాఖ్యలకు లాటిన్ అమెరికా దేశాల నుంచి వెంటనే ప్రతిస్పందన వచ్చింది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ పార్డో ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, వెనిజులాపై అమెరికా సైనిక చర్యను తీవ్రంగా ఖండించారు. ఇది సార్వభౌమ దేశంపై జరిగిన దురాక్రమణగా అభివర్ణించారు. వెనిజులా ప్రభుత్వం, ప్రజలపై అన్ని రకాల దాడులను తక్షణమే నిలిపివేయాలని అమెరికాను కోరారు.
కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా స్పందిస్తూ, అమెరికా చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమాధికారంపై నేరుగా చేసిన దాడిగా పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రాంతాన్ని మానవతా సంక్షోభం వైపు నెట్టివేస్తాయని హెచ్చరించారు. వాషింగ్టన్ విధానాలు శాంతికి కాకుండా అస్థిరతకు దారి తీస్తున్నాయని ఆయన విమర్శించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా కూడా అమెరికా దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు హింస, గందరగోళం నిండిన ప్రపంచానికి తొలి అడుగుగా మారతాయని హెచ్చరించారు. చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ శాంతియుత పరిష్కారం కోసం పిలుపునిచ్చారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కెయిన్ అమెరికా చర్యలను నేరపూరిత దాడిగా అభివర్ణించారు.
ఉరుగ్వే ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అమెరికా సైనిక జోక్యాన్ని ఎప్పటిలాగే తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. మొత్తం మీద, మదురో అరెస్టు తర్వాత ట్రంప్ తీసుకుంటున్న దూకుడు వైఖరి లాటిన్ అమెరికా మొత్తాన్ని ఒక కొత్త రాజకీయ సంక్షోభం వైపు నడిపిస్తున్నదన్న అభిప్రాయం బలపడుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
School Holiday Tomorrow: భారతదేశ వ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తర భారతంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 5, 2026 (సోమవారం) నాడు కూడా స్కూళ్లకు అధికారులు సెలవును ప్రకటించాయి. ఇంతకీ ఏయే రాష్ట్రాల్లో పాఠశాలలు మూసివేతగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా తీవ్రమైన చలి, వాటి తీవ్రమైన గాలుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు అనగా జనవరి 5 (సోమవారం) అన్ని స్కూళ్లకు సెలవును ప్రకటించారు. అలాగే చలితీవ్రత కారణంగా పంజాబ్ రాష్ట్రంలో స్కూళ్లకు జనవరి 7 వరకు సెలవులకు ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో శీతాకాలపు సెలవులను జనవరి 15 వరకు రాష్ట్రప్రభుత్వం స్కూళ్లకు సెలవును ప్రకటించింది. చలిగాలుల కారణంగా హర్యానా రాష్ట్రంలో జనవరి 15 వరకు స్కూల్స్ క్లోజ్ అవ్వనున్నాయి. అలాగే రాజస్థాన్‌లో జనవరి 5న, అస్సాంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో జనవరి 6 వరకు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్‌లో కఠిన నిబంధనలు:
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ (CBSE/ICSE తో సహా) పాఠశాలలు జనవరి 5 వరకు సెలవులను ప్రకటించారు. ముఖ్యంగా నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా ప్రయాణాలు ప్రమాదకరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దక్షిణ భారతదేశంలో పరిస్థితి..
ఉత్తర భారతం చలితో వణుకుతుంటే, దక్షిణ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ శీతాకాలపు సెలవులు ఇప్పటికే ముగియడంతో, జనవరి 5వ తేదీన పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయి.
గమనిక: వాతావరణ పరిస్థితుల ఆధారంగా సెలవుల పొడిగింపుపై నిర్ణయాలు జిల్లా కలెక్టర్ల స్థాయిలో చివరి నిమిషంలో మారే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక వార్తలు లేదా పాఠశాల యాజమాన్యం ఇచ్చే అధికారిక సమాచారాన్ని అనుసరించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijay Thalapathy Net Worth: దశాబ్దాల కాలంగా కోలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలుతున్న విజయ్ దళపతి, ఇప్పుడు వెండితెరపై తన చివరి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం 'జన నాయకుడు' (తమిళంలో జన నాయగన్) సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి (TVK పార్టీ) వెళ్తున్న విజయ్ సంపాదన, విలాసవంతమైన జీవితంపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.
రాజభవనం లాంటి ఇల్లు
చెన్నైలోని నీలాంకరై తీర ప్రాంతంలో విజయ్‌కు ఒక అద్భుతమైన విల్లా ఉంది. దాని విలువ దాదాపుగా రూ. 80 కోట్ల విలువ ఉంటుందని అంచనా. అమెరికన్ నటుడు టామ్ క్రూజ్ ఇంటి స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు సమాచారం. అధునాతన స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, ఆటోమేటెడ్ లైటింగ్, ప్రశాంతమైన వాతావరణం ఈ ఇంటి సొంతం.
గ్యారేజీలో విలాసవంతమైన కార్లు
హీరో విజయ్‌కు కార్లంటే అమితమైన ఇష్టమట. ఆయన వద్ద ఉన్న కార్ల సేకరణ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు విలువ దాదాపుగా రూ.6 కోట్లకు పైగా ఉంటుందట. అలాగే రూ. 1 కోటి విలువైన మెర్సిడెస్-బెంజ్ GL-క్లాస్, రూ.95 లక్షలు విలువైన BMW X5 కారు విజయ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఆడి, మినీ కూపర్ వంటి మరికొన్ని లగ్జరీ కార్లు కూడా ఆయన గ్యారేజీలో ఉన్నాయట.
సంపాదన, మొత్తం ఆస్తి
దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో విజయ్ ఒకరు. తన చివరి చిత్రాలకు ఆయన ఒక్కో సినిమాకు దాదాపు రూ.150 కోట్లు తీసుకుంటున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అనేక నివేదికల ప్రకారం.. విజయ్ నికర ఆస్తి విలువ సుమారు రూ.500 కోట్ల పైమాటే ఉంటుందని అంచనా.
సినిమాలకు గుడ్‌బై..రాజకీయాల్లోకి ఎంట్రీ
హీరో విజయ్ స్థాపించిన తమిళనాడు వెట్రీ కజగం (TVK) పార్టీపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాల్లో సంపాదించిన పాపులారిటీని, ఆస్తులను ఇప్పుడు ప్రజా సేవ కోసం వెచ్చించేందుకు ఆయన సిద్ధమయ్యారు. 'జన నాయకుడు' సినిమాతో చివరగా థియేటర్లలో సందడి చేసి, ఆపై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దీన్ని చూసిన టాలీవుడ్ ప్రేక్షకులు ఇది నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'భగవంత్ కేసరి' రీమేక్ అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Business Ideas: బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మీరు బంగారు ఆభరణాలను ధరించాలని మోజుపడుతున్నారా అయితే ఒకప్పుడు వేలల్లో పలికిన తులం బంగారం, ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంది. కనీసం ఒక చిన్న నెక్లెస్ కొనుగోలు చేయాలన్న మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చయ్య పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు ఇంత ఖరీదైన డిజైన్స్ ఉన్న బంగారం నెక్లెస్ ధరించి బయటకు వెళితే సేఫ్టీ కూడా ఉండదు. దొంగల కన్ను పడిందంటే మీ నెక్లెస్ మాయం అవడం ఖాయం.
ఎందుకంటే ధరలు లక్షల్లోకి వెళ్లిపోయాయి ఈ సమయంలో దొంగలు ఎంత రిస్క్ తీసుకునేందుకు ఆయన ఏమాత్రం వెనుకాడరు. ప్రస్తుతం బంగారం ధర విపరీతంగా పెరిగిపోయిన ఈ నేపథ్యంలో అంత ఖరీదైన బంగారు నగలను ధరించి బయటకు వెళితే ప్రాణాపాయం ఉందనే మాట కూడా నిజమే అని చెప్పవచ్చు. ఇటీవల నగరంలో చైన్ స్నాచింగ్ కేసుల్లో మహిళలు తీవ్రంగా గాయపడిన సంఘటనలు చూడవచ్చు. అయితే మరి మీకు నచ్చిన ఎంపిక చేసుకున్న చక్కటి నగలను ఇక మీరు ధరించలేము అని బాధపడుతున్నారా అయితే దీన్నే మీరు ఒక చక్కటి వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.
వన్ గ్రామ్ గోల్డ్ దీనికి చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. మార్కెట్లో ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ వన్ గ్రామ్ గోల్డ్ అనేది పూర్తిగా తక్కువ ధరతో లభించే ఒక ఇమిటేషన్ జ్యువెలరీ. కేవలం 100 రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మధ్యలో లభిస్తాయి. ఉదాహరణకు మీరు వడ్డానం లాంటి పెద్ద నగను ధరించాలి అనుకున్నట్లయితే వన్ గ్రామ్ గోల్డ్ ధరించడం ద్వారా మీ కోరిక తీర్చుకోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ చేయడం ద్వారా ప్రస్తుతం చక్కటి ఆదాయం లభించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలు 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
మార్కెట్లో లభిస్తున్న ట్రెండీ డిజైన్స్ అలాగే గొలుసులు, నెక్లెస్‌లు, ట్రెండీ చెవి కమ్మలు వంటివి హోల్‌సేల్ మార్కెట్లో కొనుగోలు చేసి మీరు రిటైల్ గా విక్రయించినట్లయితే చక్కటి ఆదాయం పొందవచ్చు. మీరు ఈ బిజినెస్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఒక లేడీస్ ఎంపోరియం ప్రారంభించి అందులో అన్ని వస్తువులతో పాటు ఈ వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి లాభాలను పొందవచ్చు.
మీకు హోల్‌సేల్ మార్కెట్లో వీటి ధర చాలా తక్కువగా లభిస్తుంది. మీరు వీటి పైన దాదాపు 50 శాతం నుంచి 60 శాతం వరకు ప్రాఫిట్ మార్జిన్ పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు 100 రూపాయలకు ఒక చైన్ కొనుగోలు చేస్తే దానిని 150 రూపాయలు నుంచి 160 రూపాయల వరకు అమ్మవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rare Yellow Python Video Watch: నివాస ప్రాంతాల్లో తరచుగా పాముల సంచారం సాధారణ ప్రజలను ఎంతగానో భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది. గత కొన్ని ఏళ్ల నుంచి అడవుల్లో వివిధ కారణాలవల్ల వనరుల కోరత ఏర్పడడం వల్ల చాలా ప్రాణులు అడవుల నుంచి బయటికి వచ్చి జనాలు నివసించే ప్రాంతాల్లో సంచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పాములు కూడా జనాలు తిరిగే ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. వీటిని పట్టుకోవడానికి కొంతమంది స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా పట్టుకుంటున్న సందర్భంలో వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా పాత ఇంటి పైకప్పు కింద భాగంలో సంచారం చేస్తున్న భారీ కొండచిలువను పట్టుకునే క్రమంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరితమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ గ్రామంలో నివాస ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పెంపుడు కోళ్లతో పాటు, కుక్కలు, దూడలు మాయమవడం ప్రారంభమయ్యాయి. అయితే స్థానికులు దీనిని చూసి అడవి నుంచి గ్రామంలో పెద్ద అడవి జంతువు ఏదైనా సంచారం చేస్తూ.. చంపి ఆహారంగా తింటున్నావని అనుకున్నారు. కానీ పాత రేకుల షెడ్డు పైకప్పు పై భారీ కొండచిలువ కనిపించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు. వెంటనే వారు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
అయితే, ఆ గ్రామంలో సంచారం చేసిన పాము దాదాపు 9 మీటర్ల పొడవు ఉండడం.. పసుపు రంగులో ఉండడం మీరు ఈ వీడియోలో కనిపించడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా అరుదైన కొండచిలువ ఎంతో భయానకంగా కనిపిస్తోంది. ఇది మనిషి అంత లావుగా ఉండడం కూడా మీరు చూడొచ్చు. అయితే, పైకప్పుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఈ కొండచిలువ ఉండడంతో దానిని అక్కడి నుంచి బయటికి తీసుకువచ్చేందుకు చాలామంది శ్రమ పడటం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. ఎంతో శ్రమపడి ఆ ప్రమాదకరమైన పాములు పైనుంచి కిందికి తీసుకువచ్చారు.
ఈ సమయంలో పాము తనని తాను రక్షించుకోవడానికి.. పై కప్పు కింద ఉన్న ఇనుప చట్కాలను చుట్టుకొని ఉండిపోయింది.. దీని కారణంగా వారు దానిని బయటికి తీసుకువచ్చేందుకు శ్రమ పడాల్సి వచ్చింది. అయితే, అతి కష్టం మీద దాని తోక పట్టుకొని లాగే ప్రయత్నాన్ని చేశారు. ఇలా నెమ్మదిగా ఆ పామును కిందికి తీసుకు వచ్చిన తర్వాత ఒక పెద్ద సంచిలో ఈ భారీ పామును బంధించడం మీరు చూడొచ్చు. ఇలా బంధించిన పామును సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rahu Transit 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో రాహు గ్రహాన్ని చాయాగ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా దీనిని నీడ గ్రహంగా కూడా చెప్పుకుంటారు. అన్ని గ్రహాలతో పోలిస్తే ఈ గ్రహం ఎప్పుడు కీడు ప్రభావాన్ని అన్ని రాశుల వారిపై చూపుతూ ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం జనవరి 25వ తేదీన ఏడు గంటల సమయంలో శతభిషా నక్షత్రం మూడవ స్థానంలోకి సంచారం చేయబోతోంది. ఇలా సంచారం చేయడం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తే.. మరికొన్ని రాశుల వారికి కీడు ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా రాహు శతభిషా నక్షత్రంలోని మూడవ దశలోకి ప్రవేశించడం వల్ల నాలుగు రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ సమయంలో ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, రాహువు నక్షత్ర సంచారంతో ఏ రాశుల వారికి చాలా మేలు జరుగుతుందో తెలుసుకోండి.
ఈ రాశులవారికి జాక్‌పాట్!
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహువు సంచారం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. కార్యాలయాల్లో సొంత గుర్తింపు లభించడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బు సంపాదించడానికి వీరు వివిధ మార్గాలను కూడా ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఖర్చులు కూడా పెరగవచ్చు.
కన్యారాశి
కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకు రాహు సంచార ప్రభావంతో గణనీయమైన లాభాలు రావడం ప్రారంభమవుతాయి. కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా ఉద్యోగాల్లో ఊహించని మార్పులు వస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు పదోన్నతులు కూడా కలుగుతాయి. అంతేకాకుండా కమ్యూనికేషన్, మీడియా రంగాల్లో బలాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభాలనందిస్తుంది.
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
తులారాశి
రాహు గ్రహం సంచారంతో తులారాశి వారికి బోలెడు లాభాలు కలిగే అవకాశాలున్నాయి. వీరికి అదృష్టం ప్రకాశించి అన్ని సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవితం ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణించగలిగి అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. గందరగోళం తొలగిపోయి.. అనేక రకాల సమస్యల నుంచి ఒక ఉపశమనం కలుగుతుంది.
మీన రాశి
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే కోరికలు కూడా నెరవేరుతాయి. చాలా కాలంగా ఉన్న ఎన్నో రకాల పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. దీంతోపాటు ఈ సమయంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mana Shankara Vara Prasad Garu Trailer: మెగాస్టార్ అభిమానులు ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చేసింది. సంక్రాంతి బరిలో ఉన్న చిరు కొత్త మూవీ 'మన శంకరవరప్రసాద్' ట్రైలర్ వచ్చేసింది. ఈ థియేట్రికల్ ట్రైలర్‌ను మూవీ యూనిట్ తిరుపతిలో విడుదల చేసింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవిని సరికొత్త కోణంలో చూపిస్తూ, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సిద్ధం చేశారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
ట్రైలర్ హైలైట్స్:
చిరంజీవి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ అభిమానులకు 'శంకర్ దాదా' రోజులను గుర్తుచేస్తున్నాయి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో మెరవడం సినిమాకు పెద్ద అసెట్‌గా మారింది.
వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందని మేకర్స్ అంటున్నారు. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ కూడా జోడించి అనిల్ ఈ సినిమాను మలిచినట్లు కనిపిస్తోంది.
ప్రమోషన్ల జాతర: పల్లె నుంచి పట్నం వరకు!
'మన శంకర వర ప్రసాద్' మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిత్ర యూనిట్, ఆదివారం సాయంత్రం తిరుపతిలో భారీ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక రేపటి నుంచి ప్రమోషన్లు ఊపందుకోనున్నాయి. పల్లె నుంచి పట్నం వరకు ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహించేందుకు చిత్రబృందం రెడీ అయ్యింది.
ఈ క్రమంలో రేపు అనగా జనవరి 5న నెల్లూరులో సెలబ్రేషన్స్‌తో మొదలుపెట్టి ఆ తర్వాత జనవరి 6న విశాఖపట్నం, జనవరి 7న హైదరాబాద్, జనవరి 8న తాడేపల్లిగూడెం, జనవరి 9న అనంతపూర్, జనవరి 10న వరంగల్, జనవరి 11న బెంగళూరులో ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
విడుదల ఎప్పుడు?
మరో 9 రోజుల్లో, అంటే జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. థియేటర్లలో మెగా సందడి మొదలు కావడానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్బస్టర్లుగా నిలవగా, ఇప్పుడు ట్రైలర్ సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేసింది. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ మళ్ళీ తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో 'మన శంకరవరప్రసాద్ గారు' సంక్రాంతి విజేతగా నిలుస్తుందని చిత్రయూనిట్ చెబుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook