తెలంగాణలో 11062 పోస్టులకు 2.79 లక్షల దరఖాస్తులు ప్రారంభమయ్యాయి
Hayathnagar_Khalsa, Telangana:తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానున్న డీఎస్సీ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల ఆన్లైన్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు, 11062 పోస్టులకు 2 లక్షల 79 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, మరికొద్దిసేపట్లో అభ్యర్థులు పరీక్షకు చేరుకుంటారు. ఈ పరీక్షల ప్రారంభ కాలం, ఈ డిఎస్సి పరీక్ష ఉదయం 9:15 నుండి 11:30 వరకు నిర్వహించబడుతుంది మరియు మధ్యాహ్నం 144 సెక్షన్ విధించబడింది మరియు జిరాక్స్ సెంటర్లు లేవు సమీపంలో.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
జీ మీడియాకు అడ్వర్టైజర్ల బ్రహ్మరథం.. ఫిఫా ప్రపంచకప్ 2026తో అమాంతం పెరిగిన జీ నెట్వర్క్ యాడ్లు
Mumbai, Maharashtra:Z Media Advertisements: ఫిఫా వరల్డ్ కప్ 2026 హక్కులు దక్కించుకున్న జీ మీడియాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడమే కాకుండా జీ మీడియా వాణిజ్య ప్రకటనలతోనూ దూసుకెళ్తోంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను భారతదేశ ప్రజలకు అందిస్తున్న జీ మీడియాకు వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అత్యధిక వీక్షణలు పొందుతుండడంతో జీ మీడియాలో వాణిజ్య ప్రకటనలు వేసేందుకు అంతర్జాతీయ బ్రాండ్లు క్యూలు కడుతున్నాయి. టీవీ స్పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోలో 95 శాతానికి పైగా ప్రీమియం అడ్వర్టైజింగ్ ఇన్వెంటరీ ఇప్పటికే అమ్ముడైపోవడం విశేషం.
Kiara Advani Remuneration: 'తబాహీ' సాంగ్‌లో కియారా అద్వానీ అందాలు అరబోత..ఆ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందో తెలుసా?
Hyderabad, Telangana:Kiara Advani Remuneration For Toxic Movie: 'రాకింగ్ స్టార్' యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్'. 'కేవీఎన్ ప్రొడక్షన్స్' సంస్థ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్, ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమాలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఒక సాంగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ట్రెండింగ్‌లో 'తబాహి'..కియారా బోల్డ్ లుక్!
బుధవారం (జులై 9) ఈ సినిమా నుంచి 'తబాహి' అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గతంలో ఎన్నడూ లేనంత రొమాంటిక్, బోల్డ్ లుక్‌లో కనిపించి అందాలు ఆరబోసింది. సినిమాలో యాక్షన్, హింసతో పాటు రొమాన్స్ కూడా ఓ రేంజ్లో ఉండబోతుందని ఈ పాటతో క్లారిటీ వచ్చేసింది. యూట్యూబ్‌లో విడుదలైన నిమిషాల వ్యవధిలోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.
కియారా కెరీర్లో ఇదే అత్యధికం..
'తబాహి' సాంగ్ నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా కోసం కియారా అద్వానీ తీసుకున్న పారితోషికంపై సరికొత్త చర్చ మొదలైంది. ఈ చిత్రంలో తన పాత్ర డిమాండ్ మేరకు గ్లామరస్‌గా నటించినందుకు గానూ ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా లెవెల్లో కియారాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, నిర్మాతలు ఆమె అడిగినంత మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమా కోసం కియారా ఏకంగా రూ.15 కోట్లు అందుకుందట. 'గేమ్ ఛేంజర్' సినిమా కోసం కియారా సుమారు రూ.5 నుంచి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంది. దానితో పోలిస్తే 'టాక్సిక్' చిత్రానికి ఆమె రెమ్యునరేషన్ ఏకంగా డబుల్ అయింది. కియారా సినీ కెరీర్లోనే ఇదే అత్యధిక పారితోషికం కావడం విశేషం.
బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న కియారా అద్వానీ, ఈ భారీ పారితోషికంతో భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే స్టార్ హీరోయిన్ల లీగ్‌లోకి అధికారికంగా చేరిపోయింది.
Also Read: హీరోయిన్ జాన్వీ కపూర్ కాబోయే భర్త ఇతనే! ఎట్టకేలకు ప్రియుడి పేరును బయటపెట్టిన బ్యూటీ!
Also Read: "ఆ హీరో ముద్దు పెట్టుకుంటూ అక్కడ చేయి పెట్టాడు"..'పోటుగాడు' హీరోయిన్ షాకింగ్ కామెంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు..పండగే పండగ!
Hyderabad, Telangana:Telangana Bandh Holidays: తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు జూలై నెలలో ఊహించిన విధంగా సెలవులు రానున్నాయి. సాధారణంగా జూలైలో ఎలాంటి పండుగలు, ప్రభుత్వ సెలవులు ఉండవు. కేవలం ఆదివారాలు, రెండో శనివారం మాత్రమే సెలవులు ఉన్నాయి. రేపు అనగా జూలై 10న విద్యార్థి సంఘాల బంద్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడనున్నాయి.
అయితే తాజాగా జూలై నెలలో రెండో శనివారం సెలవును కూడా ఇటీవలే రద్దు చేయగా.. జూలై నెలలో అత్యధికంగా 27 రోజుల పాటు విద్యాసంస్థల పనిదినాలను ప్రభుత్వం ప్రకటించింది. అయినా తాజాగా బంద్ మరి ఇతర సెలవులు నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడనున్నాయి.
గత వారం బీసీ సంఘాల డిమాండ్ల పరిష్కారానికి బంద్ నిర్వహించిన తర్వాత.. ఇప్పుడు జూలై 10న తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంధువులను పిలుపునివ్వడమే అందుకు కారణంగా తెలుస్తోంది. సాధారణంగా జూలై నెల వచ్చిందంటే విద్యార్థులకు ఎలాంటి పండగ హాలిడేలు దొరకవు. కానీ, తెలంగాణలో మాత్రం ఈసారి ఊహించిన విధంగా అదనపు సెలవులు రానున్నాయి. వేరువేరు డిమాండ్లతో బీసీ సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్‌లకు పిలుపునివ్వడమే అందుకు కారణంగా తెలుస్తుంది.
జులై 10న వామపక్ష విద్యార్థి సంఘాల బంద్..
బీసీ సంఘాల బంధు ముగిసిన వారం రోజులకే మరో బంద్ తెరపైకి వచ్చింది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్న పలు సంస్థలు పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు, జులై 10న బంద్‌ను పిలుపునిచ్చాయి. హైదరాబాదులో సమావేశమైన విద్యార్థుల సంఘాల నాయకులు ఈ మేరకు కార్యచరణ రూపొందించి పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.
జులై 10 శుక్రవారం నాడు విద్యాసంస్థలు స్వచ్చందంగా ఇబ్బందులు పాటించాలని, అవాంఛనీయ పరిస్థితులు రాకుండా యాజమాన్యాలు, తల్లిదండ్రులు సహకరించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు వీకెండ్ కు ముందు మరో అదనపు సెలవు దొరకనుంది. అయితే జూలై 11న రెండో శనివారం కావడం వల్ల కొన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉండనుంది. కానీ, కొన్ని విద్యాసంస్థలు మాత్రం జూన్‌లో ఇచ్చిన సెలవుల నేపథ్యంలో దీన్ని రద్దు చేసినట్లు గతంలో ప్రకటించారు. జూలై 12న ఆదివారం.. ఈ విధంగా రెండో శనివారం లభించే వాళ్లకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చినట్లు ఉంది.
బంద్‌లతో పార్టీ నెలలో వర్షాల కారణంగా అదనపు సెలవులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఊపొందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫానుగా మరి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. గత ఏడాది కూడా భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు వరుసగా అత్యవసర సెలవులు ప్రకటించింది. ఏడాది కూడా అదే పరిస్థితి రిపీట్ అయితే, జులై నెలలో విద్యార్థులకు మరిన్ని సడన్ హాలిడేస్ దొరికే అవకాశం ఉంది.
Also REad: పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కోసం 'ఓజీ' సినిమా నుంచి గిఫ్ట్! తమన్ సంచలన నిర్ణయం!
Also REad: రైల్వే ప్రయాణికలకు గుడ్‌న్యూస్..ఇకపై కేవలం రూ.200లకే స్లీపింగ్ పాడ్స్‌లో విశ్రాంతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Prashna Ravan: హిందూ దేవతలను దూషించిన వాళ్లకు వైసీపీ సపోర్ట్..ఏపీ సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్!
Nunna, Vijayawada, Andhra Pradesh:CM Chandra Babu On Prashna Ravan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు హిందూ దేవదేవతలను దూషించిన కారణంగా ఇటీవలే యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఆయనపై తాజాగా రాజ్యద్రోహం కేసు నమోదైన సంగతి కూడా అందరికి తెలిసిందే. అయితే తాజాగా అతన్ని సపోర్ట్‌గా నిలిచిన వైసీపీ అధినేత జగన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు చురకలు అంటించారు.Insomnia Symptoms: రాత్రివేళ నిద్ర రావడం లేదా? పగటిపూట విపరీతంగా నిద్ర వస్తుందా? అయితే ఇది ఆరోగ్య సమస్యే!
Hyderabad, Telangana:Insomnia Disorder Symptoms: నిద్రలేమి అనేది ఇటీవలి కాలంలో లక్షలాది మందిని పీడిస్తున్న ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఉద్యోగుల్లో పని ఒత్తిడి, రాత్రివేళ మొబైల్స్, ల్యాప్‌టాప్ వినియోగం వంటివి అధికంగా వాడడం వల్ల మానసిక ఒత్తిడి కారణంగా చాలా మంది నిద్ర సరిపోకపోవడం లేదా నిద్ర లేకపోవడం వంటి వాటి వల్ల బాధపడుతుంటారు. దీని వల్ల పగిటిపూట నిద్రమత్తు, అలసట, ఏకాగ్రత లోపించడం వంటివి దాపురించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..సాధారణ వ్యక్తి ప్రతిరోజూ 7 నుండి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. నిద్రలేమి అనేది మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, భావోద్వేగ సమతుల్యతపై ప్రభావం చూపుతుంది. పగటిపూట నిద్రమత్తుగా లేదా అలసటగా అనిపించడం నిరంతర నిద్రలేమిలోని ఒక సాధారణ లక్షణంగా పరిగణిస్తారు.
పగటిపూట తరచుగా నిద్రమత్తుగా ఉండటం అనేది కేవలం నిద్రలేమికి మాత్రమే లక్షణం కాదని వైద్యుల చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో, ఇది స్లీప్ అప్నియా, నార్కోలెప్సీ లేదా ఇతర నిద్ర సంబంధిత రుగ్మతలకు కూడా సంకేతం కావచ్చు. అందువల్ల, ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే, వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని డాక్టర్లు సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు మొబైల్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించడం వల్ల వెలువడే నీలి కాంతి, మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. దీనివల్ల నిద్ర ఆలస్యం అయి, రాత్రిపూట సరైన నిద్ర పట్టదు. ఫలితంగా మరుసటి రోజు నిద్రమత్తు, తలనొప్పి, చిరాకు, పని చేసేటప్పుడు ఏకాగ్రత లోపం వంటివి సంభవించవచ్చు.
నిద్రలేమి దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, ఆందోళన, కుంగుబాటు వంటి వాటి ప్రమాదాన్ని పెంచుతుందని అనేక అధ్యయనాలు సూచించాయి. అందువల్ల, నిద్రను నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఆరోగ్యకరమైన నిద్ర కోసం కొన్ని సాధారణ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం, రాత్రి భోజనం తర్వాత ఎక్కువగా టీ లేదా కాఫీ తాగకపోవడం, నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నిశ్శబ్ద వాతావరణంలో నిద్రపోయే అలవాటును పెంపొందించుకోవడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి.
పగటిపూట నిద్రమత్తు అనేది వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలను ఆపరేట్ చేసేటప్పుడు, లేదా అధిక ఏకాగ్రత అవసరమయ్యే పనులు చేసేటప్పుడు ప్రమాదకరంగా ఉంటుంది. అందువల్ల, ఈ సమస్యను సాధారణమైనదిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా, దాని మూల కారణాన్ని గుర్తించి, తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం అని వైద్యులు సలహా ఇస్తున్నారు.
మానవ శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. రాత్రిపూట నాణ్యమైన నిద్ర లభించినప్పుడే శరీరం, మెదడు మరుసటి రోజు పూర్తిగా విశ్రాంతి పొంది, ఉత్తమంగా పనిచేయగలవు. అందువల్ల, మీరు రాత్రిపూట నిరంతరం నిద్రపోవడంలో ఇబ్బంది పడుతుంటే, సొంతంగా మందులు వాడటానికి బదులుగా నిద్ర నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించడం సురక్షితమైన మార్గం.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం ప్రజలకు అవగాహన కోసం మాత్రమే పొందుపరిచింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
ALso Read: Yoga Day 2026: రోజూ యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
Also Read: Fathers Day 2026: మనకు అన్నీ నేర్పించిన నాన్న కోసం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
పోక్సో కేసులో కీలక పరిణామం.. నిందితుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
Baddipadaga, Telangana:Bandi Bhageerath POCSO Case: బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బండి సాయి భగీరథ్‌కు భారీ ఊరట లభించింది. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోక్సో కేసులో బండి భగీరథ్‌కు పలు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే పోక్సో కేసులో బెయిల్ రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా పోక్సో కేసులో బెయిల్ రాదు. కానీ బండి భగీరథ్‌కు బెయిల్ రావడం కొంత వివాదంగా మారే అవకాశం ఉంది.
Xiaomi 18 Pro: ఐఫోన్, సాంసంగ్‌లకు చుక్కలు చూపించేలా షామీ కొత్త ఫ్లాగ్షిప్.. ఫీచర్లు లీక్!
Hyderabad, Telangana:Xiaomi 18 Pro Leak: టెక్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ షామీ 18 ప్రో (Xiaomi 18 Pro) స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబోతోంది. అలాగే దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ప్రముఖ టెక్ పోర్టల్ గిజ్మోచైనా (Gizmochina) అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ యాపిల్, సాంసంగ్ వంటి దిగ్గజాలకు ఫోన్లకు పోటీగా అద్భుతమైన ఫీచర్లతో పాటు అత్యాధునిక సాంకేతికతతో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రీమియం కెమెరా సెటప్..
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని కెమెరాగా భావించవచ్చు.. లీక్ అయిన సమాచారం ప్రకారం.. షామీ 18 ప్రో వెనుక భాగంలో డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో ప్రత్యేకమైన సామర్థ్యం కలిగిన కొత్త LOFIC ప్రైమరీ సెన్సార్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 3x ఆప్టికల్ జూమ్‌తో పాటు అద్భుతమైన మాక్రో సపోర్ట్‌తో కూడిన 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. వైడ్ షాట్ల కోసం మరో 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఇది ఒక గొప్ప వరం కాబోతున్నట్లు తెలుస్తోంది.
పవర్ఫుల్ పర్ఫార్మెన్స్..
పనితీరు (Performance) పరంగా చూస్తే.. ఈ ఫోన్లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 (Snapdragon 8 Elite Gen 6) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. ఇది అత్యాధునిక 2nm ప్రాసెసింగ్ టెక్నాలజీపై పనిచేస్తుందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. దీనివల్ల ఫోన్ వేగం పెరగడమే కాకుండా.. బ్యాటరీ వినియోగం కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఇందులో AI హార్డ్‌వేర్ బటన్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.
అదిరిపోయే డిజైన్..
షామీ 18 ప్రో మోడల్ దాదాపు 6.9-ఇంచుల 2K ఫ్లాట్ LTPO OLED డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అల్ట్రా-నారో బెజెల్స్‌తో పాటు పెద్ద రౌండెడ్ కార్నర్స్ ఉంటాయి. ఈ డిస్ప్లేలో ప్రత్యేకంగా ప్రైవసీ ప్రొటెక్షన్ టెక్నాలజీని వాడుతున్నట్లు సమాచారం.. దీనివల్ల పక్కన ఉన్నవారు మీ ఫోన్ స్క్రీన్‌ను సైడ్ యాంగిల్ నుంచి చూడలేరు. స్క్రీన్ ప్రొటక్షన్ కోసం అత్యంత అద్భుతమైన డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
7,000mAh భారీ బ్యాటరీ..
సాధారణంగా ఫ్లాగ్షిప్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు.. కానీ Xiaomi ఈసారి ఆ అంచనాలను తలకిందులు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లో ఏకంగా 7,000mAh నుంచి 8,500mAh సామర్థ్యం గల సరికొత్త సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ బరువు పెరగకుండా.. స్లిమ్‌గా ఉండేలా ఈ టెక్నాలజీ సహాయపడుతుంది. దీనికి తోడు 100W లేదా 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు సూపర్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!a
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Talliki Vandanam 2026: ఇదే లాస్ట్ ఛాన్స్..ఈ పనులు చేయకపోతే 'తల్లికి వందనం' డబ్బులు కట్..జాగ్రత్త మరీ!
Vijayawada, Andhra Pradesh:Talliki Vandanam List 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చేసింది. స్కూళ్లు, ఇంటర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ కావాల్సిన ఈ ఏడాది నిధుల విషయంలో ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. జూలై 15 నుంచి 'తల్లికి వందనం' నిధులను అకౌంట్లోకి జమ చేయనున్న నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారులు తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని నియమాలను వెల్లడించింది. వాటిలో అలసత్వం వహిస్తే నిధులు అకౌంట్లోకి జమ కావని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అకౌంట్లోకి డబ్బు పడాలంటే ఇవి తప్పనిసరి!
'తల్లికి వందనం' పథకం కింద అకౌంట్లోకి డబ్బు జమ కావాలంటే ముందుగా మీ బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ కార్డు లింక్ చేయాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఎన్పీసీఐ మ్యాపింగ్‌ను కూడా పూర్తి చేయించుకోవాలి. మీ ఖాతా ఉన్న బ్యాంకు వద్దకు వెళితే ఈ రెండు పనులను పూర్తి చేస్తారు. అది కూడా ఈ రెండు పనులు జూలై 15 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోపు ఈ రెండు పనులు పూర్తి చేయడంలో విఫలమైతే డబ్బు మీ ఖాతాల్లోకి జమ కాదు.
పైన చెప్పిన రెండు పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల పథకం డబ్బు మీ అకౌంట్లోకి జమ కావడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే ఏదైనా ఓ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండడంతో పాటు ప్రతి ఏడాది ఒక్కసారైనా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందజేసే ఏ పథకానికైనా కేవైసీ అనేది ఎంతో ముఖ్యం. కేవైసీ పూర్తి చేసిన ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జాబితా విడుదల..
గత నెలలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాది తల్లికి వందనం పథకం గురించి ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది. వీలైనంత త్వరగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బును జమ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే ఈ పథకానికి అర్హులైన వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. జూలై 15న ఏర్పాటు చేయనున్న పేరెంట్-టీచర్ మీటింగ్ తర్వాత ఈ డబ్బును ఖాతాల్లో జమ చేయనున్నారు.
Also Read: గర్ల్స్ హాస్టల్ గదిలో విషాదం..పడుకున్న విద్యార్థుల్ని కాటేసిన పాము..ఒకరు మృతి!
Also Read: రైల్వే ప్రయాణికలకు గుడ్‌న్యూస్..ఇకపై కేవలం రూ.200లకే స్లీపింగ్ పాడ్స్‌లో విశ్రాంతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
iQOO Z11 Lite 5G జూలై 24న లాంచ్.. 6500mAh భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు!
Hyderabad, Telangana:Iqoo Z11 Lite 5g Price: భారత మార్కెట్లోకి ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) మరో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. గతేడాది జూన్‌లో విడుదలైన iQOO Z10 Lite మంచి సక్సెస్ కావడం వల్ల.. దానికి సీక్వెల్‌గా iQOO Z11 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయబోతున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. జూలై 24న ఈ ఫోన్ భారత మార్కెట్లో అడుగుపెట్టబోతున్నట్లు ఐకూ ఇండియా తన X ఖాతా ద్వారా తెలిపింది.. అయితే, అధికారిక లాంచ్‌కు ముందే ప్రముఖ టిప్‌స్టర్ ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. అయితే, లీక్ అయిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పవర్ఫుల్ ప్రాసెసర్..
లీక్ అయిన సమాచారం ప్రకారం.. iQOO Z11 Lite 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (MediaTek Dimensity 6300) చిప్సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జి57 (Mali-G57 MC2) GPUను అందించారు. ఇది బడ్జెట్ ధరలో అద్భుతమైన పనితీరును అందిచే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ పరంగా.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజినల్ ఓఎస్ 6 (OriginOS 6)తో రన్ కావడం విశేషం. అలాగే ఇది వివిధ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది.
6,500mAh భారీ బ్యాటరీ..
ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీగా భావించవచ్చు. గత మోడల్ Z10 Liteలో 6,000mAh బ్యాటరీ ఉండగా.. ఈ కొత్త Z11 Liteలో దానిని ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీకి అప్‌గ్రేడ్ చేశారు. అంతేకాకుండా ఛార్జింగ్ స్పీడ్‌ను కూడా 15W నుంచి 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు పెంచారు. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవ్వడమే కాకుండా.. బ్యాటరీ బ్యాకప్ కూడా సుదీర్ఘ కాలం పాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
డిస్ప్లే, కెమెరా సెటప్..
వినియోగదారులకు మెరుగైన విజువల్ అనుభూతిని కలిగించేందుకు ఇందులో 6.74 అంగుళాల IPS LCD డిస్ప్లేను అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో పాటు అద్భుతమైన స్ట్రాంగ్ డిస్ల్పేతో అందుబాటులోకి రాబోతోంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
నోటిఫికేషన్ రింగ్ లైట్..
ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాలు తెలుపుతున్నాయి. అమెజాన్ ఇండియా లిస్టింగ్ ప్రకారం.. ఇది సోలార్ ఫ్లేమ్ (Solar Flame) కలర్ వేరియంట్లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో నిలువుగా ఉండే కెమెరా మాడ్యూల్ కింద ఒక Circular LED రింగ్ లైట్‌ను కూడా అందించిన్నట్లు తెలుస్తోంది. ఇది నోటిఫికేషన్లు లేదా కాల్స్ వచ్చినప్పుడు మిని లైట్-అప్ అలర్ట్ సిస్టమ్‌లా మెరుస్తూ ప్రీమియం లుక్‌ను అందిస్తుందని సమాచారం.. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.22,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
షుగర్ పేషంట్లకు గుడ్ న్యూస్.. ఇక నుంచి వారానికి ఒక్కసారి ఇన్సులిన్ తీసుకుంటే చాలు..!!
Secunderabad, Telangana:Diabetes Insulin : భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 101 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. చాలా మంది మధుమేహ రోగులు ప్రస్తుతం ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. అధిక ధర కారణంగా కొందరు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడానికి సంకోచిస్తున్నారు.
డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నార్డిస్క్ అటువంటి వారికి తీపి కబురందించింది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నార్డిస్క్ మధుమేహ రోగులకు ఒక శుభవార్తను అందించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి బేసల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ అయిన అవిక్లిని ఇది భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనిని వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వృద్ధులు కూడా ఈ మందును ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం.. ఇన్సులిన్ వాడే చాలా మంది మధుమేహ రోగులు ప్రతిరోజూ ఇంజెక్షన్లు తీసుకోవలసి వస్తుంది. అయితే.. అవిక్లితో వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల చికిత్సను కొనసాగించే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత బేసల్ ఇన్సులిన్ కంటే ఇది మెరుగ్గా పనిచేస్తుందని, దేశవ్యాప్తంగా 4,500 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఈ ఇంజెక్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నామని నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా తెలిపారు. భారతదేశంలో దీనిని ప్రారంభించడంతో.. ఈ ఔషధం ఇప్పుడు మొత్తం ఏడు దేశాలలో అందుబాటులో ఉందని విక్రాంత్ చెప్పారు.
Also Read: జనం అడిగారా?..ఆ ఉచిత పథకాలు ఎవరి కోసం? తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..!!
Also Read: ఉచిత వైద్యం ఉద్యోగుల హక్కు.. జీతాల్లో EHS కోతపై తెలంగాణ హైకోర్టు సీరియస్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
కలెక్టరేట్లో హైడ్రామా.. పురుగుల మందు డబ్బాతో మహిళ నిరసన.. అసలేం జరిగింది?
Hyderabad, Telangana:Jagtial Collectorate: జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన భూమిని సాగు చేసుకోనివ్వకుండా.. కొందరు అడ్డుకుంటున్నారంటూ.. న్యాయం కోసం ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్‌కు చేరుకుని నిరసనకు దిగడం పెద్ద కలకలం రేపింది. అసలు ఏం జరిగి ఉంటుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బాధితురాలి ఆవేదన..
బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన నిహారిక అనే మహిళకు అదే గ్రామంలో 30 గుంటల పట్టా భూమి ఉంది.. ఆ భూమిని సాగు చేసుకునేందుకు ఆమె సిద్ధమైంది. అయితే, తన సొంత భూమిని చదును చేసుకునేందుకు ప్రయత్నించగా.. స్థానిక సర్పంచ్ భర్త రవి అడ్డుకుంటున్నట్లు బాధితురాలు ఆరోపించారు. ట్రాక్టర్లను సైతం అడ్డుకుంటూ.. పనులు జరగకుండా నిలిపివేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల పేర్లు చెపుతూ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని.. వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని కన్నీరుమున్నీరయ్యారు.
కలెక్టరేట్లో హైడ్రామా..
స్థానికంగా అధికారులకు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకపోవడంతో, న్యాయం కోసం చివరి ప్రయత్నంగా నిహారిక జగిత్యాల కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ముందుగా తన సమస్యపై అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగారు.. అధికారులు, పాలకులు స్పందించి.. తనకు న్యాయం చేయకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ.. ఆమె ఆందోళనకు దిగడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
అయితే, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన టౌన్ పోలీసులు.. మహిళ చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తఈ ఘటనపై జగిత్యాల టౌన్ పోలీసులు తక్షణమే స్పందించారు. బాధితురాలు నిహారిక ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించినట్లు తెలిపారు. వెల్దుర్తి గ్రామంలోని సదరు భూ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సాగు పనులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. న్యాయం చేస్తామని పోలీసులు భరోసా ఇవ్వడంతో బాధితురాలు ఊపిరి పీల్చుకుంది. కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ హైడ్రామా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
కవిత ఆరోపణలపై బీజేపీ ఎంపీ అరవింద్ స్పందన.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్
Nizamabad, Telangana:Nizamabad: 'బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీశ్ రావు మీద చేసిన స్వయంగా కేసీఆర్ కుటుంబసభ్యురాలు, ఇంటి మనిషి కవిత చేసిన అవినీతి, క్విడ్ ప్రోకో ఆరోపణల మీద సీబీఐ వెంటనే విచారణ జరిపించాలి' అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కవిత చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని తెలంగాణ ముఖ్యమంత్రిని ఎంపీ అర్వింద్ కోరారు. బీఆర్ఎస్ పార్టీ నిధులు, క్విడ్ ప్రో కో లావాదేవీలు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్తో జరిగినట్లు ఆరోపించిన ఒప్పందాలు, ఫీనిక్స్ సంస్థకు రాజకీయ అండ, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లకు భూముల కేటాయింపులపై కవిత చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు స్పందించిన బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్వపురి అర్వింద్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీశ్ రావులపై విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కవిత చేసిన ఈ ఆరోపణలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవని తెలిపారు. కవిత ఆరోపణలపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్వతంత్ర సీబీఐ దర్యాప్తు జరిపించాలని రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్, ఈ కార్ రేసులో కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. 'కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద దర్యాప్తును సీబీఐకి అప్పగించడంలో జరిగిన జాప్యం, ఈ-కార్ రేసులో అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలున్నా విచారణ చేపట్టకుండా కేటీఆర్‌ని రక్షించడం, ఫోన్ టాపింగ్ కుంభకోణం బాధ్యులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోపోవడంతో రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు ఇప్పటికే శంకిస్తున్నారు' అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్వపురి అర్వింద్ డిమాండ్ చేశారు. పూర్తి పారదర్శకతతో నిజానిజాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రిని ఓ ప్రకటనలో అర్వింద్ కోరారు.
Oppo Reno 16 సిరీస్ సేల్ షురూ.. భారీ లాంచ్ ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఇవే!
Hyderabad, Telangana:Oppo Reno 16 Series Sale Begins: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) గత వారం భారత మార్కెట్లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసిన రెనో 16 సిరీస్ స్మార్ట్ఫోన్ల విక్రయాలు ఈ రోజ నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 16 (Oppo Reno16)తో పాటు ఒప్పో రెనో 16సి (Oppo Reno16c) మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు భారీ బ్యాటరీ, అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లపై కంపెనీ భారీ లాంచ్ ఆఫర్లను, డిస్కౌంట్లను కూడా ప్రకటించింది.
మార్కెట్లో ఒప్పో రెనో 16 సిరీస్ ధరలు..
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు మోడళ్లలోనూ వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లను ఒప్పో కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఒప్పో రెనో 16 (Oppo Reno 16) సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.61,999తో అందుబాటులోకి వచ్చింది. ఇక రెండవ వేరియంట్ 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్‌తో ధర రూ.67,999తో లభిస్తోంది.
ఇక ఒప్పో రెనో 16సి (Oppo Reno 16c) ధరలకు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. మొదటి స్టోరేజ్ వేరియంట్ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ ధర రూ.46,999తో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్ 8GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్‌తో ధర రూ.49,999తో అందుబాటులోకి వచ్చింది. అలాగే చివరి వేరియంట్ 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ ధర రూ.55,999తో లభిస్తోంది. అంతేకాకుండా వీటిపై అద్బుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు కూడా లభిస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
లాంచ్ ఆఫర్ల వివరాలు..
ఈ స్మార్ట్ఫోన్లు జూలై 9 నుంచి ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు రిటైల్ స్టోర్లలో కొనుగోలు ప్రారంభమైంది. మొదటి సేల్ సందర్భంగా కస్టమర్ల కోసం కంపెనీ పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ఒప్పో ప్రకటించింది. కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లు లేదా UPI పేమెంట్స్ చేసి కొనుగోలు చేసేవారికి 10 శాతం వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎటువంటి అదనపు వడ్డీ లేకుండా 18 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ స్కీమ్‌తో కూడా ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసేవారికి గరిష్టంగా రూ.5,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీతో కలిసేదే లేదు: కవిత
Laxmidevipally, Kothagudem, Telangana:Kothagudem: బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము అమరవీరుల కుటుంబాలకు పంచాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేది లేదని సంచలన ప్రకటన చేశారు. తాను మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీతో భయం లేదంటూనే ఈసీకి వెయ్యికి పైగా కంప్లైంట్స్ ఇచ్చారని బీఆర్ఎస్పై మండిపడ్డారు.
కొత్తగూడెంలో నిర్వహించిన రెండో విడత బొగ్గుబాయి యాత్రలో భాగంగా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతోపాటు తన పార్టీకి సంబంధించిన వ్యవహారంపై స్పందించారు. 'టీఆర్ఎస్ అనే పేరు నాకు రాకుండా ఉండాలని కుట్రలు చేస్తున్నారు. నా ప్రజా పోరాటాలను ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్, బీజేపీలతో చేతులు కలుపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక నీతి, నియమం అంటూ ఏమీ లేవా?' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'డబ్బు ఉంటే సోషల్ మీడియా, మీడియాను కొనుగోలు చేసి మా వార్తలు రాకుండా చేయాలని చూస్తున్నారా? పార్టీని జోడెద్దుల మాదిరిగా నడపాల్సిన వాళ్లే అంబోతుల్లాగా సిగ్గు లేని వ్యవహారాలు చేస్తున్నారు' అని మండిపడ్డారు.
'తల్లి, చెల్లె అనే సభ్యత మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు. సభ్యత మరిచి తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదు.. కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతాం బిడ్డా' అని గులాబీ పార్టీ సోషల్ మీడియాకు హెచ్చరించారు. తమ పార్టీకి సంబంధించిన వార్తలు రాసే వారికి సిగ్గు వదిలి గుంటనక్క ఫోన్లు చేస్తూ రాయవద్దని చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఒక పార్టీ తన విధానాలు చెప్పుకుంటూ ప్రజా పోరాటాలు చేసుకునే హక్కు లేదా? మేము ఉద్యమకారుల గురించి పోరాటం చేస్తే ఆ వార్తలు రాకుండా ఫోన్లు చేసి అడ్డుకున్నారు. అంటే మీరు ఉద్యమకారులకు అన్యాయం చేస్తే...మేము పోరాటం చేయటం మీకు సమస్యగా మారిందా?' అని బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు.
'అసలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న రూ.1,400 కోట్లు క్విడ్ ప్రొకో ద్వారా వచ్చినవి కావా? ఆ డబ్బును అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పంచాలి' అని కవిత డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ ఒంటరిగా ధైర్యంగా పోరాటం చేస్తే ఇన్ని కుట్రలు చేస్తారా? అని నిలదీశారు. 'ప్రజల కోసం పోరాటం చేయాలంటే ప్రజాబలం, గుండె బలం ఉండాలి. దమ్ముంటే నాతో పాటు ప్రజా సమస్యల పోరాటం విషయంలో పోటీ పడండి' అని బీఆర్ఎస్ పార్టీకి సవాల్ చేశారు.
ఈ సందర్భంగా తన సోదరుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. 'కేటీఆర్ తన మిత్రుడు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు క్విడ్ ప్రొకో ద్వారా అక్రమ పర్మిషన్లు ఇచ్చారు' అని సంచలన ప్రకటన చేశారు. 'కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అనకొండ అయిన హరీశ్ రావునే బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతోంది. ఇక ఆ పార్టీ జీవితంలో బాగుపడని స్పష్టమైంది' అని శాపనార్థాలు పెట్టారు. 'చేసిన అవినీతి, పెద్ద ఆయనకు అంటించిన అవినీతి మరకలు చాలవన్నట్లుగా మూడు నెలలు మంత్రి పదవి కావాలంట?' అని మాజీ మంత్రి హరీశ్ రావుపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Krait In Girl Hostel: గర్ల్స్ హాస్టల్ గదిలో విషాదం.. పడుకున్న నలుగురు విద్యార్థుల్ని కాటేసిన పాము..ఒకరు మృతి!
Lohardaga, Jharkhand:Krait In Jharkhand Girl Hostel: జార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలో ఉన్న ఒక రెసిడెన్షియల్ పాఠశాల బాలికల హాస్టల్లో ఘోరం చోటు చేసుకుంది. వసతి గృహంలో రాత్రి నిద్రిస్తున్న విద్యార్థినుల గదిలోకి విషపూరితమైన కట్లపాము (krait) ప్రవేశించింది. నిద్రిస్తున్న అమ్మాయిల్లో నలుగురిని ఈ పాము కాటేసింది. అందులో 12 ఏళ్ల బాలిక మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఆ గదిలోకి పాము ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏం జరిగిందంటే?
జార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాల గర్ల్స్ హాస్టల్లో ఈ ఘోరం జరిగింది. రాత్రి పూట విద్యార్థినులు నిద్రిస్తున్న వేళ అనుకోకుండా కట్లపాము గదిలోకి ప్రవేశించినట్లు సహా విద్యార్థినులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలిక మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చేరారని పోలీసులు గురువారం వెల్లడించారు.
ఈ ఘటన మంగళవారం రాత్రి కురు పోలీస్ స్టేషన్ పరిధిలోని రోచో మహువాటోలిలో ఉన్న 'సన్వాసిర హైయర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్'లో జరిగింది. "పాము నలుగురు విద్యార్థినులను కాటేసింది, వారిలో ఒకరు మరణించారు. ఇద్దరు విద్యార్థినులు లోహర్దగా సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరొకరిని రాంచీలోని రిమ్స్ (RIMS)కు తరలించారు" అని కురు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అజిత్ కుమార్ తెలిపారు.
మంగళవారం రాత్రి భోజనం తర్వాత విద్యార్థినులు గ్రౌండ్ ఫ్లోర్‌లోని తమ హాస్టల్ గదికి వెళ్లారని పాఠశాల ప్రతినిధి ఒకరు చెప్పారు. "ఏడుగురు విద్యార్థినులు నిద్రిస్తున్న గదిలోకి 'క్రైట్' (కట్లపాము) పాము ప్రవేశించి, వారిలో ఒకరిని కాటేసింది. ఆమె కేకలు వేయడంతో మిగిలిన వారు నిద్రలేచారు, కానీ అప్పటికే అది మరో ముగ్గురిని కాటేసింది" అని ఆయన పేర్కొన్నారు.
మరణించిన బాలికను స్నేహ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలౌడి నవటోలికి చెందిన వర్ష ఒరాన్‌గా గుర్తించారు. పాము హాస్టల్ గదిలోకి ఎలా వచ్చిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదని పాఠశాల అధికారి తెలిపారు.
Also Read: రైల్వే ప్రయాణికలకు గుడ్‌న్యూస్..ఇకపై కేవలం రూ.200లకే స్లీపింగ్ పాడ్స్‌లో విశ్రాంతి!
ALso Read: వినియోగదారులకు కీలక అలర్ట్.. రూ.100 కరెన్సీ నోట్‌పై ఆర్బీఐ కీలక ప్రకటన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
