ఉప్పొంగి ప్రవహిస్తున్న రాంనగర్ బ్రిడ్జి, ఇబ్బందుల్లో 33వ వార్డ్ ప్రజలు
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Happy Kanuma 2026 Wishes Quotes Telugu: పశువుల పండుగగా పిలిచే కనుమకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సంవత్సరం పొడవునా రైతన్నలతో కలిసి కష్టపడే మూగజీవుల పాత్ర విశేషమైంది. వీటి కష్టాన్ని గుర్తించుకొని కృతజ్ఞత భావంతో ఈ కనుమ పండుగను జరుపుకుంటారు. అయితే ఈరోజు పంట పొలాల్లో పనిచేసే మూగజీవులకు మెడలో గజ్జలు కట్టి పూలదండలు వేసి ఎంతో ఆనందంగా ముస్తాబు చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించి పూజలు చేస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగను పాడిపంటలు కలిగిన ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
శుభాకాంక్షలు:
పొలంపాకలోని పశువుల పాడి.. గుమ్మం నిండా సిరి సంపదల రాశులు.. కష్టానికి తోడుగా నిలిచే మూగజీవాల పండగ కనుమ.. ఈ మూగ జీవులన్నీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా రైతుకు సహాయపడేలా ఉండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు..
పల్లెల్లోని ముంగిట ముగ్గుల హరివిల్లులు.. పశువుల పాకలో మూగజీవుల గంటల సవ్వడి.. పాడిపంటల తోడుగా.. పల్లె మురిసే వేడుకగా.. మీ అందరికీ పేరుపేరునా కనుమ పండుగ శుభాకాంక్షలు..
నేలను దున్నిన నాగలికి.. మన పొట్టను నింపే మూగజీవులకి.. ఈ కనుమ పండగ వేళ కృతజ్ఞత తెలుపుకుందాం.. ప్రతి ఏడాదిలాగా మీ ఇంట పాడి పంటలు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..
గంగిరెద్దుల అద్భుతమైన ఆటలు.. గాలిపటాల కోలాహాలం.. కనుమ పండగ రైతుల్లో తెచ్చింది కొత్త ఉత్సాహం.. ఈ సంక్రాంతి ముగింపు వేడుక మీకు ఎంతో ఉత్సాహాన్ని అందించాలని కోరుకుంటూ.. మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..
రైతులకు ఒక వెన్నుముకగా నిలిచి.. మట్టిలోని అద్భుతమైన పంటలు పండించే.. నందివర్ధనాల వంటి పశుసంపదకు హారతి పట్టాల్సిన రోజు ఈ రోజు.. ఇంతటి శుభప్రదమైన రోజున అందరూ బాగుండాలని.. ప్రతి ఒక్కరికి సిరిసంపదలు కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..
కుండల్లో పాలు పొంగే సంక్రాంతి.. పాడి పెరిగే కనుమ.. ప్రతి ఇంత కలకాలం ఆనందోత్సాహాల మధ్య జరగాలని.. ఆ గౌరమ్మని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..
ఎల్లప్పుడూ ప్రకృతిని ప్రేమిద్దాం.. పశువులను దైవంగా పూజిద్దాం.. మన సాంస్కృతిని అన్ని తరాలకు అందిద్దాం.. ప్రతి ఏడాది కనుమ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుందాం.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు.
పల్లెటూర్లో చుట్టూ పలకరింపులు.. పిండి వంటల అద్భుతమైన ఘుమఘుమలు.. కనుమ అంటేనే మమతల కలయిక. ఈ పండగ మనందరి జీవితాల్లో మధుర జ్ఞాపకాలని నింపాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ కనుమ పండుగ ప్రత్యేకమైన శుభాకాంక్షలు..
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
నాగలి కట్టి కడుపు నింపుతున్న చేతులు చల్లగా ఉండాలి.. పాడి ఆవుల అంకెలు లోగిలి నిండాలి... రైతన్నలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి.. వ్యవసాయం చేసే ప్రతి ఒక రైతన్నకు కనుమ పండుగ శుభాకాంక్షలు.
భోగిమంటల నుంచి వచ్చే అద్భుతమైన వేడి.. సంక్రాంతి వెలుగుల జోడి.. కనుమ తెచ్చిన పాడి.. మీ అందరి ఇంట నిండాలి ఆనందాల కోడి.. మీ అందరికీ హృదయపూర్వక కనుమ శుభాకాంక్షలు..
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kanuma Festival 2026: తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. భోగిమంటలతో సంక్రాంతి నోములతో అలరించిన పండగ.. మూడవ రోజు కనుమగా రూపాంతరం చెందుతూ వస్తుంది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలు పండగగానే భావించకుండా.. మనుషులకు మూగజీవాలకు మధ్య ఉన్న విడదీయలేని బంధానికి ప్రతీకని పురాణాలు చెబుతున్నాయి.. ఏడాది పొడవునా రైతులకు అడుగడుగునా తోడుండే పశువులను గౌరవించుకునేందుకు ఈ గొప్ప పర్వదినం ప్రతి ఏడాది సంక్రాంతి మూడవ రోజున జరుపుకుంటారు. ఈ పండగను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా ఇప్పటికీ జరుపుకుంటూ వస్తున్నారు. అయితే కనుమ పండగ వెనక ఉన్న అసలైన చరిత్ర ఏంటో? ఈ పండగ ప్రాముఖ్యతను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కనుమ పండగ చరిత్ర నేపథ్యం లోకి వెళ్తే.. ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ లీలలకు సంబంధించిన పురాణ గాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. పురాణాల్లో తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రుడు గర్వాన్ని అణిచివేసేందుకు ఈరోజు శ్రీకృష్ణుడు గోకులం ప్రజలను ఇంద్రయాగానికి బదులుగా.. గోవర్ధనగిరిని పూజించమని ఆదేశిస్తాడు.. దీని ఆగ్రహానికి గురైన ఇంద్రుడు ప్రళయ వర్షాన్ని ఈ రోజునే కురిపిస్తాడు.. ఈ సమయంలో శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తేసి గోవులను ప్రజలను సురక్షితంగా కాపాడుతాడు. ఈ విజయానికి గుర్తుగానే ఆ ప్రజలు, పశువులు ఆనందోత్సాహాలతో ఈ కనుమ పండుగను జరుపుకుంటారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ పండగను జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుందని పూర్వీకులు చెబుతున్నారు.
అలాగే రైతులకు వ్యవసాయంలో ప్రధాన వెన్నుముకగా నిలిచే ఎద్దులతో పాటు పాలిచ్చే పశువులను గౌరవిస్తూ ఈరోజు దేవతా స్వరూపాలుగా భావించి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఉదయాన్నే రైతులందరూ నిద్రలేచి పశువులను చెరువు దగ్గరికి తీసుకెళ్లి వాటిని శుభ్రంగా కడిగి.. కొమ్ములకు మంచి మంచి రంగులను పూసి.. మెడలో గంటలు కట్టి అద్భుతంగా ముస్తాబు చేస్తారు. అంతేకాకుండా కొత్త బియ్యంతో వండిన పొంగలిని పశువులకు నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పశువుల పరువుల పందాలు కూడా నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
కనుమ పండుగ విశిష్టత, ప్రత్యేకమైన ఆచారాలు..
చాలామంది పెద్దవారు కనుమ నాడు కాకైనా కదలదని చెబుతూ ఉంటారు.. ఈరోజు ప్రయాణాలు చేయకూడదని ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. ప్రకృతి తో పాటు కుటుంబ సభ్యులతో ఇంట్లోనే కలిసి గడపాలని దీని అంతరార్థం.. కాబట్టి ఇప్పటికీ కొంతమంది ఎలాంటి ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే కనుమ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు.. కనుమ రోజు మినుములు కూడా తినడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములతో తయారుచేసిన గారెలు లేదా ఇతర పదార్థాలను తీసుకోవడం ఈ పండగ ప్రత్యేకత.. అంతేకాకుండా కనుమ పండగ రోజున కొన్ని పల్లెలు ధాన్యపుకు అంకులను ఇంటి గుమ్మానికి కట్టి.. పక్షులను ఇంట్లోకి ఆహ్వానిస్తారు.. ఇలా చేయడం ప్రకృతి పట్ల కృతజ్ఞత చాటిన వారు అవుతారని పూర్వికులు చెబుతున్నారు.
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rahu Effect 2026 Effect On Zodiac Telugu: శని గ్రహం తర్వాత అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహు ఒకటి. రాహువు గ్రహం కూడా చాలా నెమ్మదిగా రాశి మారుతూ ఉంటుంది. ఇది సంచారం చేయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల వరకు సమయం పడుతుంది. అయితే, శని గ్రహానికి ఎంత ప్రాముఖ్యత ఉందో రాహువు గ్రహానికి కూడా సంచారానికి అంతే ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహం సంచారం చేయడం కారణంగా కూడా మొత్తం అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారిపై కీడు ప్రభావం కూడా పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
రాహువు గ్రహాన్ని అత్యంత కీడు గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా దీనిని నీడ గ్రహంగా కూడా చెప్పుకుంటారు. దీని కదలిక ఎల్లప్పుడూ వ్యతిరేక దశలో మాత్రమే కొనసాగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు అశుభ ఫలితాలను మాత్రమే అందిస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహం వ్యక్తి జాతకాల్లో అశుభ స్థానంలో ఉంటే, జీవితంలో సమస్యలతో పాటు గందరగోళం ఏర్పడుతుంది. అలాగే అస్థిరత తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. జీవితాన్ని విధ్వాంసానికి దారితీస్తుంది. అదే ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే వ్యాపారాలు సమాజంలో ఊహించని వ్యక్తులకు వెతుకుతారు. అంతేకాకుండా విధిరాత పూర్తిగా మారుతుంది.
ఇదిలా ఉంటే 2026 సంవత్సరంలో రాహువు గ్రహం రెండుసార్లు రాశి మారబోతున్నాడు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.. ఆ తర్వాత డిసెంబర్ 5న మకర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశుల వారికి అశుభ ఫలితాలు గలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అలాగే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వృషభ రాశి
2026 సంవత్సరంలో రాహువు గ్రహం చేసే సంచారం వల్లభ వృషభరాశి వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యలతో పాటు ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా చాలా వరకు నష్టపోతారు ముఖ్యంగా ఏమైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేస్తున్న వ్యక్తులు కూడా ఈ సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా రాహువు ప్రభావం పడుతుంది దీని కారణంగా ఆందోళన పెరిగే అవకాశాలున్నాయి. వ్యాపారాల్లో నష్టాలు కూడా జరగవచ్చు. ఈ సమయంలో ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించిన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పనిచేసే వారికి అనేక సమస్యలు తలెత్తవచ్చు. ఇంట్లో గొడవలు జరగడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతారు.. ఈ సమయంలో కొత్త రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు.
కన్యా రాశి
కన్యారాశి వారికి కూడా రాహువు రెండుసార్లు సంచారం చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరు కోరికలు తీర్చుకోవడం మానుకుంటే మంచిదని.. ఇతరులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో ఆకస్మిక నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది..కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా రాహువు సంచార ప్రభావంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఒత్తిడి విపరీతంగా పెరిగివచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారాల్లో పెద్ద పెద్ద మార్పులు కూడా వచ్చే అవకాశాలుంటాయి. ముఖ్యంగా రాహు సంచార ప్రభావంతో అనేక విధాలుగా నష్టపోతారు.. ఈ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి.
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mars In Capricorn Effect On Zodiac 2026: జనవరి నెల సంచారాలపరంగా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే కుజుడు సూర్యుడు ఇదే నెలలో మకర రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇప్పటికే మకరంలోకి సూర్యుడు ప్రవేశించాడు. ఇదిలా ఉంటే జనవరి 16వ తేదీన కుజుడు కూడా మకరంలోకి సంచారం చేస్తాడు. దీని కారణంగా ఈ సమయంలో శుభయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా జనవరి 16వ తేదీ ఉదయం నాలుగు గంటల సమయంలో కుజుడు సంచారం చేయడం, సూర్య శుక్ర గ్రహాలతో కలయిక జరపడం వల్ల ఎంతో శక్తివంతమైన త్రిగ్రహ యోగం కూడా ఏర్పడబోతోంది. దీనివల్ల ఆయారాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జనవరి 17వ తేదీ తర్వాత మేషరాశి, కర్కాటక రాశి వారి జీవితాల్లో అనేకమైన మార్పులు సంభవిస్తాయి. అలాగే ఊహించని పురోగతి కూడా లభిస్తుంది. కుజుడి సంచారం మకర సంక్రాంతి తర్వాత ఏ రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్:
మేషరాశి
మేష రాశి వారికి పదవ స్థానంలో కుజుడి సంచారం జరగబోతోంది. దీని ఫలితంగా వీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా కొత్త బాధ్యతలను స్వీకరించడమే కాకుండా అనేక శుభ అవకాశాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో తప్పకుండా పదోన్నతులు కూడా కలుగుతాయి. అలాగే వ్యాపారాలు సమృద్ధిగా సాగుతాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి.. పనికి తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో సమతుల్యం ఏర్పడి.. ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి మొదటి స్థానంలో కుజుడు సంచారం చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే సూర్యుడు బుధుడు కలయిక జరగడం కారణంగా ఏర్పడిన ప్రభావం ఈ రాశి వారిపై పడుతోంది. ఫలితంగా వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే వీరు సంబంధాలను కూడా మెరుగుపరచుకుంటారు. కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా కెరీర్ పరంగా అద్భుతమైన ధైర్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో వీరికి అంతా శుభమే జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కుజుడు ఏడవ స్థానంలో ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ జీవితం చాలా అద్భుతంగా మారబోతోంది. అలాగే ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీరు మీ కుటుంబ సభ్యులకు అద్భుతమైన ఆనందకరమై క్షణాలు గడపగలుగుతారు. అలాగే కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. దీంతోపాటు వీరు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కష్టపడతారు.
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడి సంచారం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరి ఆలోచనలు ఎప్పుడూ ఎప్పుడూ లేనంతగా చాలా బలంగా మారుతాయి. దీనివల్ల సంబంధాల్లో బాగోద్వేగాలతో పాటు విశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే వృత్తి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలతో అద్భుతమై జీవితం గడుపుతున్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. నాయకత్వ లక్షణాలతో ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో ఎంతో మేలు జరగబోతోంది. అంతేకాకుండా మధురమైన క్షణాలను గడపగలుగుతారు.
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nellore Train Accident: నెల్లూరు జిల్లాలో గురువారం ఉదయం ఒక పెద్ద రైలు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అసలేం జరిగింది?
విజయవాడ నుండి సరుకుతో తిరుపతికి బయలుదేరిన ఈ గూడ్స్ రైలు, కావలి స్టేషన్ సమీపానికి చేరుకోగానే హఠాత్తుగా పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలుకు చెందిన రెండు వ్యాగన్లు (బోగీలు) పట్టాల నుండి పక్కకు పడిపోయాయి. అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రస్తుత పరిస్థితి..
ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. లోకో పైలట్ కూడా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం అందిన వెంటనే రైల్వే సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సహాయంతో పట్టాలు తప్పిన వ్యాగన్లను తొలగించి, ట్రాక్‌ను పునరుద్ధరించే పనులు యుద్ధప్రతిపాదికన జరుగుతున్నాయి.
రైళ్ల రాకపోకలకు అంతరాయం: ఈ ప్రమాదం కారణంగా విజయవాడ - నెల్లూరు - తిరుపతి మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లను సమీప స్టేషన్లలోనే నిలిపివేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Harish Rao Sajjanar: సజ్జనార్‌పై హరీష్ రావు ఆగ్రహం.."ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో!"
Cognizant Vizag: ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో కీలక ముందడుగు పడబోతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) విశాఖపట్నంలో తన తాత్కాలిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. జనవరి 26 నుండి సుమారు 800 మంది ఉద్యోగులతో ఈ కేంద్రం పని ప్రారంభించనుంది.
800 మంది ఉద్యోగులతో శ్రీకారం
హిల్-2లోని 'మహతి' బ్లాక్‌లో తాత్కాలిక కార్యాలయాన్ని కాగ్నిజెంట్ సిద్ధం చేసింది. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 500 మంది ఉద్యోగులను ఇప్పటికే విశాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో 300 మంది సీనియర్ ఉద్యోగులు కూడా ఇక్కడ చేరనున్నారు. కాపులుప్పాడలోని 22 ఎకరాల శాశ్వత క్యాంపస్‌లో భవిష్యత్తులో 25,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోంది.
ఫిబ్రవరిలో టీసీఎస్ (TCS)
కాగ్నిజెంట్ బాటలోనే మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా విశాఖలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. మిలీనియం టవర్స్-2లో తాత్కాలికంగా 2,000 మంది ఉద్యోగులతో ఫిబ్రవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
హిల్-3లో కేటాయించిన 21.76 ఎకరాల్లో త్వరలో శాశ్వత క్యాంపస్‌కు భూమిపూజ జరగనుంది. ఇప్పటికే టీసీఎస్ బోర్డులు ఏర్పాటు చేసి, జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది.
విశాఖకు క్యూ కడుతున్న ఇతర దిగ్గజాలు
కాగ్నిజెంట్, టీసీఎస్ మాత్రమే కాకుండా మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు విశాఖపై కన్నేశాయి. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ రంగంలో పేరుగాంచిన క్యాప్‌జెమినీ (Capgemini) సంస్థ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్చలు జరుపుతోంది. అలాగే ఆర్ఎంజేడ్ (RMZ) సంస్థ కూడా విశాఖలో అడుగుపెట్టే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న దావోస్ సదస్సులో ఈ కంపెనీల రాకపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Govt Employees DA Arrears: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో ఈ సంక్రాంతి కొత్త వెలుగులు నింపింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 60 నెలల కరువు భత్యం (DA) బకాయిలను ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. భోగి పండుగ రోజే నగదు ఖాతాల్లో జమ కావడంతో లక్షలాది మంది ఉద్యోగులు, పింఛనుదారులు పండుగను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకొంటున్నారు.
ఎవరికి ఎంత ప్రయోజనం?
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 2.25 లక్షల మంది సీపీఎస్ (CPS) ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పింఛనుదారులకు నేరుగా లబ్ధి చేకూరింది. సీపీఎస్ ఉద్యోగులు, పింఛనుదారులకు నేరుగా నగదు రూపంలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఒక్కో ఉద్యోగికి వారి అప్పటి మూలవేతనం (Basic Pay) ఆధారంగా రూ.30,000 నుండి రూ.60,000 వరకు లభించింది. అదే విధంగా రెగ్యులర్ ఉద్యోగులకు ఈ బకాయిలు వారి జీపీఎఫ్ (GPF) ఖాతాలకు మళ్లించారు.
బకాయిల లెక్క ఇలా..
ఈ బకాయిలు 2018, 2019 సంవత్సరాలకు సంబంధించినవిగా తెలుస్తోంది. వాటిలో 2018 కరువు భత్యం (DA) 30 నెలల బకాయిలు ఉండగా.. 2019 కరువు భత్యం 30 నెలల బకాయిలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ బకాయిలను ప్రస్తుత జీతంపై కాకుండా, 2018-19 కాలంలో ఉన్న అప్పటి మూలవేతనంపై లెక్కించి ప్రభుత్వం చెల్లించినట్లు సమాచారం.
పోలీసులకు 'సరెండర్ లీవు' కానుక
కేవలం సాధారణ ఉద్యోగులే కాకుండా, రాష్ట్రంలోని దాదాపు 55 వేల మంది పోలీసు ఉద్యోగులకు కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రావాల్సిన సరెండర్ లీవు బకాయిలను బుధవారం నాడే ఖాతాల్లో జమ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో ఏపీ పోలీసు అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.
గుత్తేదారులకు (Contractors) కూడా ఊరట
అభివృద్ధి పనులు చేపట్టిన గుత్తేదారులకు నాబార్డు, విదేశీ ఆర్థిక సాయం కింద రావాల్సిన రూ.1,243 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనివల్ల సుమారు 10 శాతం మంది గుత్తేదారులకు తక్షణ ఆర్థిక ఊరట లభించింది.
మొత్తంగా భోగి పండుగ నాడే సుమారు రూ.1,100 కోట్లు ఉద్యోగుల ఖాతాల్లోకి చేరడం విశేషం. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ సానుకూల స్పందనకు ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన పెండింగ్ సమస్యలను కూడా ప్రభుత్వం ఇదే రీతిన పరిష్కరిస్తుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KSRTC Employees 17 Percent Hike: దాదాపు మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ఉద్యోగులకు సంక్రాంతి పండుగ వేళ శుభవార్త అందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న జీతాల సవరణపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో రవాణా రంగ కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఎందుకు ఆలస్యమైంది?
సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో కాలానుగుణంగా జీతాల సవరణ జరుగుతుంది. అయితే KSRTCలో గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. చివరిసారి గత బీజేపీ ప్రభుత్వం 2020లో జీతాలను సవరించినప్పటికీ, కరోనా సంక్షోభం కారణంగా అప్పట్లో పెంపుదల ఆశించిన స్థాయిలో లేదు. ఆ తర్వాత 2023లో సవరణకు ప్రయత్నాలు జరిగినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
జీతాల పెంపు - కీలక వివరాలు:
ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఉద్యోగుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. గతంలో 15 శాతం పెంపు ఉండగా, ఈసారి ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుని 17 శాతం వరకు జీతాలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జీతాల పెంపు మార్చి 2027 నుండి అధికారికంగా అమలులోకి రానుందని విశ్వసనీయ సమాచారం. కానీ, ఈ పెంపుదల జనవరి 2026 నుండి వర్తించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కార్మిక సంఘాల డిమాండ్ ఇదే?
ప్రభుత్వం జనవరి 2026 నుండి పెంపును వర్తింపజేయాలని చూస్తుండగా, ఉద్యోగ సంఘాలు మాత్రం జనవరి 2024 నుండే ఈ పెంపును వర్తింపజేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం నుండి మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.
ఏకసభ్య కమిటీ సిఫార్సులు, కార్మిక సంఘాల చర్చల అనంతరం ఈ పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ, సంక్రాంతి పండుగ పూట జీతాల పెంపు ప్రకటన రావడం KSRTC కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది.
Also Read: Gruhalakshmi Yojana: మహిళలకు సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.4,000 జమ..ఎప్పటిలోగా ఇస్తారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Allu Arjun Lokesh Kanagaraj Movie: ఈ సంక్రాంతి వేళ సినీ ప్రియులకు అతిపెద్ద 'బ్లాక్ బస్టర్' శుభవార్త అందింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ హిట్ మెషిన్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక భారీ పాన్-ఇండియా చిత్రం పట్టాలెక్కబోతోంది. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఈ వార్తలను నిజం చేస్తూ, అల్లు అర్జున్ స్వయంగా ఒక పవర్ఫుల్ వీడియో ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను ధృవీకరించారు.
వీడియోలో 'సింహం'లా బన్నీ..
ఈ చిత్ర ప్రకటన కోసం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో అల్లు అర్జున్ రాచరికం, ఆధిపత్యానికి ప్రతీకగా 'సింహం'లా కనిపిస్తుండగా, అతని చుట్టూ మోసపూరితమైన 'నక్కలు' ఉన్నట్లు చూపించారు. లోకేష్ కనగరాజ్ మార్క్ ఇంటెన్స్ యాక్షన్, పదునైన స్క్రీన్ ప్లే ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయని ఈ వీడియో సంకేతాలిస్తోంది.
ప్రధాన ఆకర్షణలు ఇవే..
పాన్-ఇండియా లెవల్: ఈ చిత్రం కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా, హిందీతో పాటు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. అల్లు అర్జున్ స్టైల్, లోకేష్ కనగరాజ్ రా (Raw) అండ్ రస్టిక్ యాక్షన్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అతని నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ప్రధాన బలం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను #AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు.
I SAY 23
Goin on a spree
Low-Key G
Locked in mentally
That’s a guarantee !Excited about the new journey with the Maverick @Dir_Lokesh garu 🔥
& at last with brother @anirudhofficial ❤️🔥
Can’t wait for this one 🖤 pic.twitter.com/VtiCO5YsTs
— Allu Arjun (@alluarjun) January 14, 2026
భారీ అంచనాలతో..
లోకేష్ కనగరాజ్ తన సినిమాలతో ఒక సొంత యూనివర్స్ (LCU)ను సృష్టించారు. మరి అల్లు అర్జున్ సినిమా కూడా ఆ యూనివర్స్‌లో భాగమవుతుందా? లేదా ఇది ఒక కొత్త తరహా గ్యాంగ్‌స్టర్ డ్రామానా? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Makar Sankranti Sesame Sweet: భారతీయ సంస్కృతిలో సంక్రాంతి పండుగకు, నువ్వులకు విడదీయలేని బంధం ఉంది. ఈ రోజున నువ్వులను దానం చేయడం, నువ్వుల లడ్డూలు తినడం వెనుక అటు ఆధ్యాత్మిక పరమైన కథలు, ఇటు శాస్త్రీయమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.
'నువ్వుల' అసలు కథ..
సూర్య భగవానుడు తన కుమారుడైన శని దేవుని రాశి అయిన 'మకర రాశి'లోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి. తండ్రీకొడుకులైన సూర్యుడు, శనికి పురాణాల ప్రకారం పడదు. దీని వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది.
శాపం - విముక్తి: సూర్యుడికి తన కుమారుడు శనిపై కోపం వచ్చి, శని నివాసమైన 'కుంభ' రాశిని దహనం చేస్తాడు. దీంతో శని, అతని తల్లి ఛాయ తీవ్ర ఇబ్బందులు పడతారు.
నువ్వుల పూజ: యమధర్మరాజు మధ్యవర్తిత్వం వహించి సూర్యుడిని శాంతింపజేస్తాడు. సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి (మకర రాశి) వెళ్లినప్పుడు, అక్కడ అంతా కాలిపోయి కేవలం నల్ల నువ్వులు మాత్రమే మిగిలి ఉంటాయి. శని దేవుడు ఆ నువ్వులతోనే తన తండ్రికి స్వాగతం పలికి పూజిస్తాడు.
వరము: కుమారుడి భక్తికి మెచ్చిన సూర్యుడు.. "మకర సంక్రాంతి రోజున ఎవరైతే నల్ల నువ్వులతో నన్ను పూజిస్తారో, వారిపై శని ప్రభావం తగ్గుతుందని, వారికి సుఖశాంతులు లభిస్తాయని" వరమిచ్చాడట. అందుకే సంక్రాంతి నాడు నువ్వులకు అంత ప్రాధాన్యత ఏర్పడింది.
నువ్వులు - బెల్లం
సంక్రాంతి పండుగ చలికాలం మధ్యలో వస్తుంది. ఈ సమయంలో నువ్వులు, బెల్లం తీసుకోవడం వెనుక బలమైన ఆరోగ్య కారణాలు ఉన్నాయి. నువ్వులు, బెల్లం ప్రకృతిసిద్ధంగా వేడిని కలిగిస్తాయి. ఇవి చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. నువ్వులలో ఉండే నూనెలు, బెల్లంలో ఉండే ఐరన్ కలిపి తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో వచ్చే నీరసాన్ని తగ్గించి, తక్షణ శక్తిని ఇవ్వడంలో ఈ లడ్డూలు కీలకంగా పనిచేస్తాయి.
నువ్వుల దానంతో శని దోష నివారణ
శాస్త్రాల ప్రకారం మకర రాశికి అధిపతి శని దేవుడు. సంక్రాంతి రోజున నువ్వులను శని దేవుని ప్రసాదంగా భావిస్తారు. నువ్వులను దానం చేయడం వల్ల జాతకంలోని శని దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయని చెబుతారు. నువ్వుల లడ్డూలు తినడం వల్ల సూర్యుడి తేజస్సు, శని అనుగ్రహం రెండూ లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
మకర సంక్రాంతి నాడు మనం తినే నువ్వుల లడ్డూ కేవలం ఒక పిండి వంటకం మాత్రమే కాదు.. అది ఆరోగ్యానికి రక్షణ కవచం, మన ప్రాచీన సంప్రదాయాలకు ప్రతిబింబం.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించండి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Gruhalakshmi Yojana: మహిళలకు సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.4,000 జమ..ఎప్పటిలోగా ఇస్తారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook