భూ తగాదాలో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు
Khammam, Telangana:ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదంలో అంగన్వాడీ టీచర్ అరుణపై ఆమె మరిది కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గుర్రం వెంకట్రావు-రాంబాబు అన్నదమ్ముల మధ్య భూ పంచాయితీ జరుగుతోంది. అరుణకు రుణమాఫీ అయిన పొలంలో వాటా కోరుతున్న రాంబాబు కుమారుడు సాయి కుమార్, అంగన్వాడీ సెంటర్‌కు వెళ్లి ఈ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు మంటలు ఆర్పి, బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ప్రకటన.. 'అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాం!'
Hyderabad, Telangana:Kannepalli Pumphouse: 'కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాం. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ప్రకటన చేశారు. 'కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటార్లు ప్రారంభం చేసి 150 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ కుట్ర, మోసాన్ని తెలంగాణ రైతులు గమనిస్తున్నారు' అని తెలిపారు. చేతగాకపోతే మాకు అప్పగించండి.. వారం రోజుల పాటు కేసీఆర్‌కు అప్పగిస్తే మొత్తం నీరు పారించి చూపుతాం' అని కాంగ్రెస్‌కు సవాల్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నట్లు ఏమైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని మరోసారి ప్రకటించారు.
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ అడిగినా.. మంత్రివర్గం అడిగినా తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్ అండర్ టేకింగ్ ఇస్తారని తెలిపారు. 'చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆడుతున్న నాటకం మాత్రమే. ఎన్డీఎస్ఏకు ఏ మాత్రం సంబంధం లేదు' అని స్పష్టం చేశారు. 'ఎస్ఎల్బీసీ విషయంలో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ జైలుకు పోవాలి. ఏడాది నుంచి మోటార్లను కనీసం ప్రారంభం చేయలేదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు' అని విమర్శించారు.
'మంత్రులు తెలంగాణ ఆత్మను కోల్పోయారు. శ్రీధర్ బాబు లాంటి వాళ్లు కూడా పదవీ భయంతో రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు' అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భూములను కాపాడేందుకు కన్నేపల్లి సిద్ధంగా ఉందని కేటీఆర్ అందరికీ కళ్లకు కట్టినట్లు చూపారని గుర్తుచేశారు. 'నలుగురు మంత్రులు మళ్లీ సొల్లు పురాణం తప్ప తెలంగాణ సోయితో మాట్లాడలేదు. రూ.లక్ష కాదు పది రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయారు. ప్రభుత్వం వేసిన కమిషన్ ను కోర్టు చెత్త బుట్టలో పడేసింది' అని వివరించారు.
'ఎల్‌నినో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన ఉద్దేశం ఇదే. ఎటువంటి కరువు నచ్చినా ప్రజలను బతికించడానికి ప్రాణహిత ఉపయోగపడుతుంది' అని కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి వివరించారు. 'బ్యారేజీల నుంచి ఇసుక తవ్వి వేల కోట్లు దండుకుంటున్నారు. విద్యుత్ బిల్లులకు భయపడి రైతుల పంట కొనాల్సి వస్తుందని, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం పంపులు నడపడం లేదు' అని ఆరోపించారు. ప్రజలకు అన్ని విషయాలు అర్థం అవుతున్నాయని.. సమయం వచ్చినపుడు తగిన నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
ప్రశ్నించే గొంతు నొక్కే కుట్రను వైస్సార్సీపీ సహించదు.. న్యాయ పోరాటం చేస్తాం: అంబటి రాంబాబు
Guntur, Andhra Pradesh:Ambati Rambabu vs Chandrababu: 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేసే కుట్ర జరుగుతోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై చట్టవ్యతిరేకంగా దౌర్జన్యకాండ కొనసాగుతోంది' అని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై వరుసగా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. అన్యాయంగా, అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచి వైఎస్సార్సీపీ న్యాయపరమైన పోరాటం చేస్తుందని ప్రకటించారు.
గుంటూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తూ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్, తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్‌పై వరుసగా కేసులు పెట్టి అరెస్టులు చేయడం చట్టవిరుద్ధం అని స్పష్టం చేశారు. తప్పు చేస్తే కోర్టులో నిరూపించాలి తప్ప.. కేసుల మీద కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
ప్రశ్న రావణ్‌కు పలుమార్లు బెయిల్ వచ్చినా మళ్లీ మళ్లీ అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు. రిమాండ్ ఇవ్వని కోర్టులను దాటేందుకు ఉగ్రవాద నిరోధక చట్టమైన ఉపాను ఒక యూట్యూబర్‌పై ప్రయోగించడం న్యాయ వ్యవస్థకే సవాల్ అని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకపోయినా అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ తాము అండగా నిలుస్తామని ప్రకటించారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ వేధింపుల కోసం చట్టాలను దుర్వినియోగం చేయడం సరికాదని కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు.
బాధితులనే నిందితులుగా మార్చే ఈ ధోరణిని వైఎస్సార్సీపీ సహించదని.. అందుకే ఎవరికి అన్యాయం జరిగినా పార్టీలకు అతీతంగా వారి తరపున పోరాడతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. తన ఇంటిపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 29న డీజీపీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందిస్తానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రతి చర్యను ప్రజల తరపున వైయస్సార్సీపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని సీనియర్ నాయకులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సునీల్
Dharmavaram, Andhra Pradesh:Actor Sunil Special Darshan In Tirumala Temple Watch Videoపర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి.. అధికారులకు తెలంగాణ సీఎం ఆదేశం
Hyderabad, Telangana:Telangana CM Review: పర్యాటకంగా హైదరాబాద్‌ను సరికొత్తగా తీర్చిదిద్దాలని.. పర్యాటకులను మరింతగా ఆకర్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. నగరంలోని కీలకమైన ప్రాంతాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. పురానాపూల్ బ్రిడ్జి, వికారాబాద్ ప్రాంతం కాకుండా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను తీర్చిదిద్దాలని తెలంగాణ సీఎం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష చేశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు. 'తారామతి బారామతిని పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలి. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. మంజీరా, దిల్కుషా గెస్ట్‌హౌస్‌లను ఆధునీకరించాలి. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలి' అని తెలంగాణ ముఖ్యమంత్రి సూచించారు. వికారాబాద్‌లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని.. యాదాద్రి తరహాలో టెంపుల్‌కి కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.
'అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలి. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్క్‌లు తీర్చిదిద్దాలి' అధికార యంత్రాంగానికి రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దాలని.. అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్ట్‌ల కోసం స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసుకొని పనులు ముమ్మరం చేయాలని చెప్పారు.
'పాతబస్తీలోని పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలి. అవకాశం ఉంటే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలి' అని రేవంత్ రెడ్డి సూచించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు సంబంధించి అధికారులను ఆరా తీసిన అనంతరం డిసెంబర్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌పై కసరత్తు ప్రారంభించాలని చెప్పారు. సమ్మిట్ కోసం శాఖల మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, టూరిజం సెక్రటరీ వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి తెలిపారు.
మంత్రి లేకుండానే..
పర్యాటక శాఖపై సమీక్ష చేసిన సమావేశంలో సంబంధిత శాఖ మంత్రి లేకపోవడం గమనార్హం. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు లేకుండానే పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేయడం చర్చనీయాంశంగా మారింది. సంబంధిత మంత్రులు లేకుండా ఆ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష చేయడం ఇటీవల వివాదాస్పదంగా మారుతున్న విషయం తెలిసిందే. మరి దీనిపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
తిరుమలలో అక్కినేని కుటుంబం.. 'లెనిన్' హిట్టు కోసం పూజలు
Dharmavaram, Andhra Pradesh:Akkineni Akhil Lenin Movie Team Visits Tirumala Temple A Head Movie Release On July 10thతిరుమలలో సినీ నటుడు మాధవన్ కుటుంబం
Dharmavaram, Andhra Pradesh:Actor Madhavan Tirumala Darshan Along With Family Watch Videoతిరుమలలో అక్కినేని కుటుంబం.. అఖిల్ 'లెనిన్' సక్సెస్ కోసం మొక్కులు
Tirupati Urban, Andhra Pradesh:Akkineni Family In Tirumala: సినీ పరిశ్రమలో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు సరైన విజయం పొందలేకపోయాడు. ఒక్క హిట్ కోసం అతడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో సరికొత్త కథాంశంతో 'లెనిన్' పేరుతో అఖిల్ సినిమా చేశాడు. ఈనెల 10వ తేదీన థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల అవుతున్న సందర్భంగా అక్కినేని కుటుంబం తిరుమల ఆలయాన్ని సందర్శించింది. తిరుమలలో అక్కినేని అఖిల్ మొక్కులు చెల్లించుకున్నాడు.
మూడేళ్ల విరామం తర్వాత అఖిల్ 'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన సినిమా విజయవంతం కావాలని తన కుటుంబంతో కలిసి అఖిల్ తిరుమలకు చేరుకున్నాడు. తన తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున, అక్కినేని అమలతోపాటు 'లెనిన్' సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తిరుమల వచ్చారు. సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని వారు దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలతోపాటు పట్టు శాలువాతో సత్కరించారు.
సినిమా విజయం సాధించాలని
దర్శనం అనంతరం మీడియాతో అక్కినేని నిఖిల్ మాట్లాడారు. 'లెనిన్ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ నచ్చేలా రూపొందించాం. ఈనెల 10వ తేదీన విడుదల కానున్న లెనిన్ సినిమా విజయం సాధించాలని తిరుమల వేంకటేశ్వర స్వామిని ప్రార్థించా' అని అఖిల్ వివరించాడు. ఇదే సినిమాలో నటించిన సునీల్ మరో సమయంలో స్వామిని దర్శించుకున్నాడు. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన ‘లెనిన్’ ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. వీరు తిరుమల దర్శనానికి ముందు రోజు అంటే ఆదివారం తిరుపతిలో లెనిన్ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జరిగింది. సందడిగా జరిగిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడని అక్కినేని కుటుంబంతోపాటు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుమలలో మాధవన్
సుప్రసిద్ధ నటుడు మాధవన్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబంతో కలిసి సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి.. దర్శానంతరం సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.
రతన్ టాటా అడుగుజాడల్లో.. సోషల్ మీడియాకు దూరం.. బిజినెస్‌లో టాప్ గేర్.. ఎవరీ మాయా టాటా..?
Secunderabad, Telangana:Maya Tata in Tata Group: టాటా గ్రూప్‌లో క్రమంగా ఒక కొత్త తరం నాయకత్వం ఆవిర్భవిస్తోంది. ఈ నేపథ్యంలో, రతన్ టాటా తమ్ముడు నోయల్ టాటా చిన్న కుమార్తె అయిన 37ఏళ్ల మాయా టాటాకు ట్రెంట్ లిమిటెడ్ వారి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ వెస్ట్‌సైడ్ లో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఆమె ఆన్లైన్ వ్యాపారం, అంతర్జాతీయ ఈ-కామర్స్ విస్తరణను పర్యవేక్షించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం ట్రెంట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్న నోయల్ టాటా ఈ ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఈ మార్పు చాలా ముఖ్యమైనదిగా మారింది. అయితే, మాయా టాటా నియామకంపై ట్రెంట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఎవరీ మాయా టాటా:
1989లో ముంబైలో జన్మించిన మాయా టాటా, యూకేలోని వార్విక్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ తర్వాత లండన్‌లో బిజినెస్ మేనేజ్మెంట్, ఫైనాన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా గ్రూప్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. టాటా డిజిటల్లో చేరకముందు, ఆమె టాటా క్యాపిటల్ వారి టాటా ఆపర్చునిటీస్ ఫండ్ లో పనిచేశారు.
నోయెల్ టాటా ముగ్గురు పిల్లలు టాటా సన్స్ టాటా ట్రస్ట్స్‌లో మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. వారు వివిధ అనుబంధ.. చిన్న ట్రస్టుల బోర్డులలో సభ్యులుగా ఉన్నారు. నెవిల్ సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులో కూడా సభ్యుడిగా ఉన్నారు. నివేదికల ప్రకారం.. ఇటీవల కంపెనీ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసిన నోయెల్ టాటా, టాటా డిజిటల్‌పై దృష్టి సారిస్తున్న తరుణంలో మాయా టాటా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితులలో.. ఆయన తన కుమార్తెను ఇప్పటికే మెరుగైన స్థితిలో ఉన్న కంపెనీకి మార్చాలని కోరుకుంటున్నట్లుగా ఉంది. మాయా సోదరుడు నెవిల్ టాటా ప్రస్తుతం ట్రెంట్ వారి స్టార్ బజార్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయన సోదరి టాటా గ్రూప్ హోటల్ వ్యాపారానికి బాధ్యత వహిస్తున్నారు.
ట్రెంట్ లిమిటెడ్‌కు వెస్ట్‌సైడ్ ఒక కీలకమైన వ్యాపార విభాగం. ఈ బ్రాండ్ కంపెనీ మొత్తం ఆదాయంలో సుమారు 40శాతం వాటాను అందిస్తుంది. ఏటా సుమారు 50 కొత్త వెస్ట్‌సైడ్ స్టోర్లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే.. ఇది 53 కొత్త స్టోర్లను ప్రారంభించింది.ఇటీవల, యూఏఈలో తన మొదటి అంతర్జాతీయ స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా వెస్ట్‌సైడ్ ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ భారతీయ ఫ్యాషన్ బ్రాండ్‌ను మరిన్ని దేశాలకు విస్తరించే ప్రణాళికలతో ట్రెంట్ ముందుకు సాగుతోంది.
వెస్ట్‌సైడ్‌తో పాటు, ట్రెంట్ జూడియో.. స్టార్ బజార్ వంటి ప్రముఖ రిటైల్ బ్రాండ్లను కూడా కలిగి ఉంది. 2025-26 ఆర్థిక ఏడాది చివరినాటికి కంపెనీ ఆదాయం సుమారు రూ. 19,700 కోట్లుగా అంచనా. ఇది దేశవ్యాప్తంగా 321 నగరాల్లో 1,286 స్టోర్ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది.
Also Read: ప్రపంచాన్ని షేక్ చేస్తున్న వింత మద్యం.. బ్రాందీ, విస్కీ కాదు.. అత్యధికంగా తాగేది దీనినే..!
Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్‌లో భారత్‌కు చెందినవి కూడా..!!
Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో
Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sri lanka Prison Clash: శ్రీ లంక జైలులో అల్లర్లు.. 25 మంది మృతి... 100 మందికి పైగా ఖైదీలకు తీవ్ర గాయాలు..
Hyderabad, Telangana:At Least 25 killed in srilanka: శ్రీలంక పశ్చిమ తీర పట్టణమైన నెగొంబోలోని ఒక జైలులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఖైదీల మధ్య గ్యాంగ్ వార్ వల్ల ఏకంగా 25 మంది చనిపోయాడు. దాదాపు 100 మందికి పైగా ఖైదీలు తీవ్రంగా గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో పోలీసు గార్డులు కూడా ఉన్నారు. కిక్కిరిసిన జైలులో ఖైదీల ప్రత్యర్థి వర్గాల మధ్య ఆదివారం ఘర్షణ జరగడంతో హింస మొదటగా చెలరేగింది. అల్లర్లకు పాల్పడిన ఖైదీలు జైలు నుంచి తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం రావడంతో, సోమవారం నాడు మరల అల్లర్లు చెలరేగాయి.
జైలు లోపల మాదకద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వర్గానికి, ఆ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్న మరో వర్గానికి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై మరోకరు దాడులుచేసుకున్నారు. అడ్డువచ్చిన పోలీసులు కూడా దాడులు చేశారు.
ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పిపొవడంతో అదనపు బలగాల్ని పోలీసులు రప్పించారు. పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), అల్లర్ల నియంత్రణ విభాగాలను మోహరించారు. శాంతిభద్రతలను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా, ముగ్గురు ఖైదీలను సోమవారం పల్లన్సేన జైలు శిబిరానికి తరలించారు.
ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. నెగొంబో జైలు లోపల, చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేయడంతో అధికారులు పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
Prashna Ravan: యూట్యూబర్ ఆఆ.. టెరరిస్టా? ప్రశ్న రావణ్‌పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు!
Vijayawada, Andhra Pradesh:Mumbai Rain Alert: ముంబై వరదల లాక్డౌన్..ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక..16 రైళ్లు, విమానాలు రద్దు!
Mumbai, Maharashtra:Mumbai Rain Alert News: ముంబైపై వరుణ దేవుడు పగపట్టినట్లు అయ్యింది. నగరవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కురిస వర్షాలు ఇప్పుడు వరదలుగా మారి పొంగి పొర్లుతున్నాయి. ఈ కుండపోత వర్షాల వల్ల ముంబై మహానగరంతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింపోయింది. రోడ్లు జలమయమవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వరద నీరు రైల్వే ట్రాక్‌లను ముంచెత్తాయి. ఇప్పటికే సాధారణ రైళ్లు రద్దు కాగా.. ఇప్పుడు లోకల్ రైళ్ల సర్వీసులకు పూర్తి అంతరాయం ఏర్పడింది. అలాగే ముంబై-పుణె మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోవడం సహా వాతావరణ శాఖ భారీ వర్షాల నడుమ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. అటు రైళ్లు, రోడ్డు మార్గాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడడం సహా ఇటు విమాన సర్వీసులు కూడా రద్దు చేయడంతో పాటు కొన్ని విమానాలను దారి మళ్లించారు.
ముంబై వెళ్లే డజన్ల కొద్దీ రైళ్లు రద్దు
మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ముంబై-పుణె రైలు మార్గం మూతపడింది. కర్జత్-లోనావాలా భోర్ ఘాట్ సెక్షన్‌లోని రెండు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అంతేకాకుండా, ముంబైకి రానుపోను వెళ్లే 20కి పైగా రైళ్లను రద్దు చేశారు. ముంబైకి జీవనాధారంగా భావించే లోకల్ రైళ్లు నిలిచిపోయాయి.
ముంబై వెళ్లే ఏ రైళ్లు రద్దుయ్యాయి?
ముంబైలో భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకలను నిలిపేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని.. ముంబై వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు అనేక రైళ్లు దారి మళ్లించగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు.
వర్షం కారణంగా ముంబై - పుణె మార్గంలో రద్దు చేసిన రైళ్లు జాబితా..
1. సి.ఎస్.ఎం.టి – పూణే (ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్) (22105)
2. పూణే జంక్షన్ – సోలాపూర్ (ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్) (12169)
3. సోలాపూర్ – పూణే జంక్షన్ (ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్) (12170)
4. పూణే – సి.ఎస్.ఎం.టి (ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్) (22106)
5. పూణే – సి.ఎస్.ఎం.టి (ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్) (12127)
6. సి.ఎస్.ఎం.టి – పూణే (ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్) (12128)
7. పూణే – సి.ఎస్.ఎం.టి (దక్కన్ ఎక్స్‌ప్రెస్) (11007)
8. సి.ఎస్.ఎం.టి – పూణే (దక్కన్ ఎక్స్‌ప్రెస్) (11008)
9. పూణే – సి.ఎస్.ఎం.టి (దక్కన్ క్వీన్) (12124)
10. సి.ఎస్.ఎం.టి – పూణే (దక్కన్ క్వీన్) (12123)
11. పూణే – సి.ఎస్.ఎం.టి (ప్రగతి ఎక్స్‌ప్రెస్) (12126)
12. సి.ఎస్.ఎం.టి – పూణే (ప్రగతి ఎక్స్‌ప్రెస్) (12125)
13. పూణే – సిఎస్‌ఎమ్‌టి (సింహగడ్ ఎక్స్‌ప్రెస్) (11010)
14. సిఎస్‌ఎమ్‌టి – పూణే (సింహగడ్ ఎక్స్‌ప్రెస్) (11009)
15. సిఎస్‌ఎమ్‌టి – ధూలే ఎక్స్‌ప్రెస్ (11015)
16. ధూలే – సిఎస్‌ఎమ్‌టి ఎక్స్‌ప్రెస్ (11012)
మరోవైపు భారీ వర్షాల తాకిడికి ముంబై - పుణే ఎక్స్‌ప్రెస్ రహదారిపై తీవ్రమైన పరిస్థితి ఏర్పడింది. సుమారు రూ.6,695 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ రహదారి భారీ వర్షాల కారణంగా మూతపడింది. ఆ మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. 13.3 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని 2026 మే 1న ప్రారంభించగా.. తొలిసారి వచ్చిన వర్షానికే అందులో లోపాలు బయటపడ్డాయి.
అలాగే భారీ వర్షాల కారణంగా రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు మాత్రమే కాకుండా నేషనల్ హైవే కూడా మూతపడింది. ముంబై - పుణే మధ్య కనెక్టివిటీగా ఉన్న జాతీయ రహదారిపై ప్రస్తుతం ఎలాంటి ప్రయాణం చేయవద్దని అధికారులు సూచించారు. పాత రహదారిని కూడా మూసివేయడంతో, భారీ వర్షాల సమయంలో ముంబై చేరుకోవడం సవాలుగా మారింది.
ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ నేపథ్యంలో విమానాశ్రయం రన్‌వే పై భారీగా వరద నీరు వచ్చి చేరింది. డజన్ల కొద్దీ విమానాలు గంటల తరబడి ఆలస్యమవుతున్నాయి. తక్కువ దృశ్యమానత కారణంగా, అనేక విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. నాలుగు విమానాలను రద్దు చేయగా, 13 విమానాలను దారి మళ్లించారు. ఢిల్లీ-ముంబై, ముంబై-ఇండోర్, ఇండోర్-ముంబై, ముంబై-ఢిల్లీ మార్గాల్లో 13కి పైగా విమానాలను రద్దు చేశారు.
Also Read: పెళ్లిలో వధువుని డ్యాన్స్ చేయోద్దన్న వరుడు..కోపంతో పెళ్లి క్యాన్సిల్!
Also Read: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Markapur Marriage Incident: పెళ్లిలో వధువుని డ్యాన్స్ చేయోద్దన్న వరుడు..కోపంతో పెళ్లి క్యాన్సిల్!
Sankavaram, Andhra Pradesh:Markapur Marriage Incident News: మరికాసేపట్లో మూడు ముళ్ళు పడాల్సి ఉంది. ఇరు కుటుంబాల్లో పెళ్లి భాజలు, బంధువుల కేరింతలతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. అంతలోని డాన్స్ విషయంలో వచ్చిన ఒకే ఒక్క చిన్న వివాదం వధూవరులు జీవితంలో ఊహించని మరుగు తిప్పింది. పెళ్లికూతురుని డాన్స్ చేయొద్దని వరుడు మందలించడంతో, పెళ్లి పీటల్లాగా వెళ్లాల్సిన వేడుక కాస్త ఊరేగింపులోనే అయిపోయింది. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో ఈ వింత ఉదంతం చోటుచేసుకుంది.
ఏం జరిగింది అంటే?
రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడికి, కంభం మండలం తురిమెళ్ళకు చెందిన యువతీతో పెద్దలు వివాహం నిర్ణయించారు. ఆదివారం ఉదయం ముహూర్తం కావడంతో.. శనివారం రాత్రి వధువు తరుపు వారు పెళ్లికూతురుతో సహా చిన్నగానిపల్లికి చేరుకున్నారు.
రాత్రివేళ ఇరువైపులా ఉన్న బంధుమిత్రులు, యువకులు ఉత్సాహంగా వధూవరులను వాహనం ఎక్కించి ఊరేగింపు ప్రారంభించారు. డీజే పాటలు మోతకు ఇరువైపుల వారి స్టెప్పులేస్తూ కేరింతల కొడుతూ ముందుకు సాగుతున్నారు.
డాన్స్ గొడవ..సీన్ రివర్స్!
ఊరేగింపు జోరుగా సాగుతున్న సమయంలో.. వధూవరులను కూడా డాన్స్ చేయాల్సిందిగా అక్కడున్న కొందరు కోరారు. దానికి వదులు ఎంత ఉత్సాహంగా సిద్ధమైంది. కానీ వరుడు మాత్రం తాను డాన్స్ చేసే ప్రసక్తి లేదని భేష్ నుంచి కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా అందరి ముందు వధువువైపు తిరిగి నువ్వు కూడా డాన్స్ చేయడానికి వీలు లేదు అని గట్టిగా మందలించాడు.
పెళ్లి కాకముందే అందరి ముందు కాబోయే భార్య వరుడు అలా కోప్పడడం వధువు తండ్రికి అసలు నచ్చలేదు. పెళ్లికి ముందే ఇంత అహంకారం చూపిస్తే ఇక పెళ్లయ్యాక నా కూతుర్ని ఇంకా ఎంత ఇబ్బంది పెడతాడు అని ఆయన మనస్థాపానికి గురైయ్యాడు.
పెళ్లి క్యాన్సిల్..
అంతే వధువు తండ్రి తక్షణమే నిర్ణయం తీసుకొని తన కుమార్తె వాహనం పైనుంచి కిందకి దించేశాడు. మాకు "ఈ పెళ్లి వద్దు" అని తెగేసి చెప్పి, బంధువులందరినీ తీసుకొని రాత్రి రాత్రి సొంతూరికి తిరుగు ప్రయాణం అయ్యారు.
సరిగ్గా ముహూర్తానికి ముందు పెళ్లి ఆగిపోవడంతో ఇరుపక్షలు వారు కూర్చుని కట్నకానుక లావాదేలిన సెటిల్ చేసుకున్నారు. అయితే అప్పటికే పెళ్లి ఏర్పాట్ల కోసం భారీగా ఖర్చు చేసిన వరుడు తరుపున వారు మాత్రం చేజేతులా చేసుకున్న తప్పుకు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
Also Read: Bus Accident Gadwal: ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి
Also Read: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Traffic Police: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నకిలీ నెంబర్ ప్లేట్ వాడితే ఇకపై జైలుకే..నగరంలో స్పెషల్ డ్రైవ్స్!
Hyderabad, Telangana:Hyderabad Fake Number Plate: హైదరాబాద్ నగరంలో నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న కిలాడి వాహనదారులపై పోలీసులు నిఘా పెట్టారు. ట్రాఫిక్ ఛలానా నుంచి తప్పించుకునేందుకు అలాగే కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడానికి కొంతమంది వాహనాల నంబర్ ప్లేట్ పెద్ద ఎత్తున మారుస్తున్నట్లు పోలీసులు దృష్టికి వచ్చింది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
వారం రోజుల్లో క్రిమినల్ కేసులు వాహనాలు సీస్
ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కి.. నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే గత వారం రోజుల్లో నగరంలోని ప్రధాన ప్రాంతాలైన టప్పాచబుత్రా, ఐఎస్ సదన్, టోలిచౌకి, అబిడ్స్, మలక్ పేట వంటి ఏరియాల్లో జరిపిన తనిఖీల్లో నకిలీ నెంబర్ ప్లేట్లతో దొరికిన వారికి పోలీసులు ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిబంధన ఉల్లంఘించిన పలు వాహనాలను కూడా అక్కడికక్కడే స్వాధీనం చేసుకున్నారు.
ఆ నంబర్ ప్లేట్లే తప్పనిసరి..
వాహనదారులు కేవలం ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను మాత్రమే ఉపయోగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. నెంబర్ ప్లేట్లపై ఫాంట్లు మార్చడం, అంకెలు స్పష్టంగా కనిపించకుండా చేయడం, నచ్చిన డిజైన్లు వేయటం, స్టిక్కర్లు అతికించడం లేదా ఎలాంటి అనధికారిక మార్పులు చేసిన అది చట్ట ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది.
నకిలీ నెంబర్ ప్లేట్స్ వాడే వారిపై జీరో టోలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు పోలీసులు తేల్చి చెప్పారు. నిబంధనలను మీరితే ఎంతటి వారైనా సరే, క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్డు భద్రతను పెప్పర్ దించేందుకు నేరాలు అరికట్టడానికి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. కాబట్టి వాహనదారులు అలర్ట్ గా ఉండటం మంచిది.
Also Read: Bus Accident Gadwal: ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి
Also Read: రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..రూ.100లకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ప్రపంచాన్ని షేక్ చేస్తున్న వింత మద్యం.. బ్రాందీ, విస్కీ కాదు.. అత్యధికంగా తాగేది దీనినే..!
Secunderabad, Telangana:Soju: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే మద్యపానం ఏది అని మిమ్మల్ని అడిగితే..మీరు విస్కీ , వోడ్కా లేదా రమ్ అని సమాధానం ఇస్తారు . కానీ మీరు చెప్పిన సమాధానం అస్సలు కరెక్టు కాదు. ఎందుకంటే.. గత 20 సంవత్సరాలుగా.. దక్షిణ కొరియా సాంప్రదాయ మద్యమైన సోజు, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే మద్యపానంగా నిలిచింది. ముఖ్యంగా.. జిన్రో సోజు బ్రాండ్ అనేక అంతర్జాతీయ బ్రాండ్లను అధిగమించి.. కొత్త అమ్మకాల్లో రికార్డులు నెలకొల్పుతోంది.ప్రపంచవ్యాప్తంగా కొరియన్ సంస్కృతికి పెరుగుతున్న కారణంగా.. సోజు ప్రజాదరణ ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా వేగంగా పెరుగుతోంది.
సోజు అంటే ఏమిటి? దానిని ఎలా తయారు చేస్తారు?
సోజు అనేది కొరియా జాతీయ మద్యం. ఇది నీటిలా స్వచ్ఛంగా ఉంటుంది. సాంప్రదాయకంగా దీనిని బియ్యంతో తయారు చేసినప్పటికీ, ఇప్పుడు జిన్సెంగ్, బార్లీ.. గోధుమల నుండి స్వేదనం ద్వారా కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీనిలో ఆల్కహాల్ శాతం సాధారణంగా 12 నుండి 25 శాతం వరకు ఉంటుంది. ఇది విస్కీ, వోడ్కాల కంటే తక్కువగా ఉంటుంది. కానీ బీర్, వైన్ కంటే ఎక్కువగా ఉంటుంది. దీని రుచి తియ్యగా, మృదువుగా ఉండి, తాగడానికి సులభంగా ఉంటుంది.
ప్రజాదరణకు కారణాలు ఏంటి?
సోజు ప్రజాదరణకు ప్రధాన కారణం కొరియన్ వేవ్. కె-డ్రామాలు, కె-పాప్ సంగీతంలో తరచుగా కనిపించే సోజు ఆకుపచ్చ సీసా, ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షించి, విస్తృతమైన ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాకుండా, దీనిలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండటం వల్ల మరుసటి రోజు హ్యాంగోవర్ తక్కువగా ఉంటుంది. అందుకే యువత దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. పీచ్, స్ట్రాబెర్రీ వంటి వివిధ రకాల పండ్ల రుచులలో ఇది లభించడం.. గ్రిల్ చేసిన మాంసం, వేయించిన చికెన్ వంటి వంటకాలతో ఇది అద్భుతంగా జతకలవడం కూడా దీని ప్రజాదరణకు కారణమని చెప్పాలి. అంతేకాదు ఇతర కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి.
భారతదేశంలో.. ముఖ్యంగా నగరాల్లోని యువతలో సోజు ప్రజాదరణ పొందుతోంది. పన్నులు, లభ్యత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, మారుతున్న మద్యపాన సంస్కృతిలో సోజు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది.ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ వంటి ప్రధాన నగరాల్లో యువతలో దీని ప్రజాదరణ వేగంగా పెరిగింది. దిగుమతి సుంకాలు, పరిమిత లభ్యత కారణంగా ఇది ఇంకా అన్నిచోట్లా సులభంగా అందుబాటులో లేనప్పటికీ.. మారుతున్న జీవనశైలి.. అంతర్జాతీయ వంటకాల పట్ల పెరుగుతున్న ఆసక్తి వల్ల దీనికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
లభ్యత పెరిగి, ధరలు పోటీగా మారితే, సోజు భారత మార్కెట్లో కూడా నిలదొక్కుకోగలదని నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఇది ఇకపై దక్షిణ కొరియాకే పరిమితం కాకుండా, ప్రపంచ పానీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.
Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్‌లో భారత్‌కు చెందినవి కూడా..!!
Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో
Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Neymar Jr Retirement: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ముగిసిన మరో శకం.. స్టార్ ఆటగాడు నెయ్‌మేర్ రిటైర్మెంట్..
Neymar Announces Retirement: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో మరో శకం ముగిసింది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ నెయ్‌మేర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా భావోద్వేగంగా.. "నేను ప్రయత్నించాను.. ఇప్పుడు అది ముగిసిపోయింది" అని అన్నాడు. రౌండ్ ఆఫ్ 16లో నార్వే చేతిలో బ్రెజిల్ బాధాకరంగా నిష్క్రమించిన తర్వాత నేమార్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి తన రిటైర్మెంట్ను ప్రకటించాడు.
బ్రెజిల్ తరపున ఆడిన అత్యంత ప్రసిద్ధ ఆటగాళ్లలో ఒకరైన నేమార్ జూనియర్, నార్వే చేతిలో తన జట్టు అనూహ్యంగా ఓడిపోవడంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఓటమి 2026 ఫీఫా ప్రపంచకప్ నుండి బ్రెజిల్‌ను నిష్క్రమించేలా చేసింది. ఈ ప్రకటనతో దేశం తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా 129 మ్యాచ్‌లలో 80 గోల్స్‌తో నేమార్ 16 ఏళ్ల కెరీర్ ముగిసింది. బ్రెజిల్ తరపున నేమార్ చివరి మ్యాచ్ మెట్‌లైఫ్ స్టేడియంలో ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఆడాడు. ఇదే వేదికపై అతను 2010లో అరంగేట్రం చేశాడు. బార్సిలోనా, పారిస్ సెయింట్-జెర్మైన్ మాజీ స్టార్ అయిన నేమార్, నార్వేపై పెనాల్టీ గోల్ చేసినప్పటికీ, అది బ్రెజిల్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించకుండా ఆపలేకపోయింది.
నార్వే చేతిలో బ్రెజిల్ ఓడిపోవడంతో నేమార్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఫైనల్ విజిల్ తర్వాత అతను ఏకధాటిగా ఏడుస్తున్న దృశ్యాలు అభిమానుల హృదయాలను ముక్కలు చేశాయి. అతని బ్రెజిల్ జట్టులోని పలువురు సహచరులు అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ బార్సిలోనా మాజీ ఆటగాడైన అతను పూర్తిగా కుంగిపోయాడు.
"నేను ప్రయత్నించాను, చాలా ప్రయత్నించాను. ఇప్పుడు అంతా ముగిసింది" అని ఆట తర్వాత అతను గ్లోబోతో అన్నాడు. "నేను ఇక్కడే మొదలుపెట్టాను. ఇక్కడే ముగించాను." బ్రెజిల్‌తో అతని ప్రయాణం ముగిసినప్పటికీ, నెయ్మార్ శాంటోస్ ఎఫ్‌సి క్లబ్‌తో తన కెరీర్‌ను కొనసాగిస్తూ, ప్రతి సీజన్లో తన భవిష్యత్తును సమీక్షించుకుంటున్నాడు.
నార్వే చేతిలో ఈ ఓటమి, ప్రపంచకప్‌లలో యూరోపియన్ ప్రత్యర్థులపై బ్రెజిల్ ఘోర పరాజయ పరంపరను సూచిస్తుంది. 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు, 2002 ఫైనల్లో జర్మనీని ఓడించినప్పటి నుండి యూరోపియన్ ప్రత్యర్థులను ఓడించలేదు. ఈ ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, కోచ్ కార్లో అన్సెలోట్టి మాట్లాడుతూ, ఆదివారం జరిగిన ప్రపంచ కప్ చివరి 16 ఓటమిని భవిష్యత్తుకు "ఇంధనంగా" ఉపయోగించుకోవాలని, వారి నిరాశాజనకమైన టోర్నమెంట్ "ఒక కొత్త శకానికి నాంది" అని నొక్కి చెప్పారు.
నార్వే తరఫున హాలాండ్ చివరి దశలో రెండు గోల్స్ సాధించాడు. అంతకుముందు బ్రెజిల్ ఆటగాడు బ్రూనో గిమారెస్ తీసుకున్న పెనాల్టీని ప్రత్యర్థి గోల్ కీపర్ అడ్డుకోవడం ఆ మ్యాచ్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఇంజరీ టైమ్‌లో నెయ్మార్ పెనాల్టీని విజయవంతంగా గోల్‌గా మలిచినప్పటికీ, అది కేవలం ఓదార్పునిచ్చే ఫలితంగా మాత్రమే మిగిలిపోయింది. బ్రెజిల్ జెర్సీ ధరించి ఆటగాడిగా అతనికి ఇదే చివరి సందర్భం కూడా.
"ఇలాంటి ఓటమిని జీర్ణించుకోవాల్సిందే. ఇది ఒక కొత్త ప్రయాణం. ఇకపై మేము మా స్థానాలను నిలబెట్టుకుంటూ, మెరుగుపడేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి" అని ఆన్సెలోట్టి పేర్కొన్నారు. బ్రెజిల్‌కు రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్ అందించే బాధ్యతతో ఏడాది క్రితమే ఆయన నియమితులయ్యారు.
2030లో జరగబోయే తదుపరి ప్రపంచకప్ వరకు ఆన్సెలోట్టికి ఒప్పందం ఉంది. టోర్నమెంట్ నుంచి బ్రెజిల్ త్వరగా నిష్క్రమించినప్పటికీ, తాను పదవి నుంచి తప్పుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
"ఇది ముగింపు అని నేను అనుకోవడం లేదు. ఇది ఒక కొత్త దశకు ఆరంభం అని భావిస్తున్నాను" అని ఆయన వెల్లడించారు. "నేటి మ్యాచ్ ఫలితాన్ని పరిగణనలోకి తీసుకున్నా సరే, ప్రస్తుతం ఉన్న జట్టుతో బ్రెజిల్ ఈ ప్రపంచకప్‌లో చివరి వరకు పోటీపడే సత్తా కలిగి ఉండేదని నా అభిప్రాయం." 2002లో జపాన్‌లో చివరిసారిగా టైటిల్ గెలిచిన బ్రెజిల్, తమ ఆరో ప్రపంచకప్ విజయం కోసం చేసే నిరీక్షణ ఇప్పుడు పావు శతాబ్దానికి పైగా కొనసాగనుంది.
Also Read: ఫీఫా వరల్డ్ కప్‌లో విచిత్ర సంఘటన..ఇంగ్లాండ్ ప్లేయర్లకు వయాగ్రా ఇచ్చారు! ఎందుకంటే?
Also Read: గ్రౌండ్లో కంటతడి పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ..క్యాప్ అందుకున్న తర్వాత భావోద్వేగం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
