Nampally Bomb Threat: అట్టుడికిన భాగ్యనగరం.. నాంపల్లి కోర్టు పరిధిలో బాంబు..పోలీసులు హైఅలర్ట్!
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
School Holiday Tomorrow: దేశంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడమే కాకుండా చలిగాలుల తీవ్రత భారీగా పెరుగుతుంది. అదే విధంగా ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం భారీగా పెరుగుతున్న క్రమంలో అనేక రాష్ట్రాల్లోని స్కూళ్లకు ప్రభుత్వాలు సెలవును ప్రకటించాయి. అయితే డిసెంబరు 19న ఏఏ రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డిసెంబరు 19న గోవా రాష్ట్రం విముక్తి దినోత్సవం జరుపుకోనున్న కారణంగా అక్కడ పబ్లిక్ హాలీడే కానుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు సెలవు రానుంది. 1961లో పోర్చుగీస్ పాలన ముగింపు సందర్భంగా విముక్తి దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
ఉత్తర భారతదేశంలో దాదాపు చాలా రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కారణంగా చాలా వరకు స్కూళ్లకు సెలవును ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లోని పాఠశాలలు మూసివేత కానున్నాయి. మరోవైపు జమ్మూ & కాశ్మీర్‌లో కూడా శీతాకాల సెలవులను పొడిగించారు. జనవరి 4 వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి.
ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారుతూనే ఉంది. AQI 450 కంటే ఎక్కువగా చేరుకుంది. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం GRAP స్టేజ్ 4ని అమలు చేసింది. దీంతో తదుపరి నోటీసు వచ్చేంత వరకు స్కూళ్లు కార్యాలయాలు తెరవడానికి వీల్లేదంటూ కఠినమైన ఆర్డర్స్ జారీ చేసింది. నోయిడాలో కూడా ఇదే పరిస్థితి. కొన్ని స్కూళ్లకు వరుస సెలవులు ప్రకటించారు.
తమిళనాడులో విద్యార్థులు తమ హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాస్తున్నారు. ఇవి పూర్తి అవ్వగానే క్రిస్మస్, న్యూఇయర్‌తో కలిసి దాదాపుగా 12 రోజులు సెలవులు ఇవ్వనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Actress Chaitra Kidnap: ప్రముఖ సీరియల్ నటి చైత్ర ఆర్. కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. తన ఏడాది కుమార్తె సంరక్షణను దక్కించుకోవడానికి ఆమె భర్త హర్షవర్ధన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక అందిన సమాచారం. అయితే ఇందులో నిజనిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కలహాలే కారణమా?
సీరియల్ నటి చైత్ర సోదరి లీలా ఆర్. ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. చైత్ర, హర్షవర్ధన్‌లకు 2023లో పెళ్లి చేసుకున్నారు. అయితే, గత ఏడెనిమిది నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో వారు విడివిడిగా ఉంటున్నారు. చైత్ర తన ఏడాది కుమార్తెతో కలిసి బెంగళూరులోని మాగడి రోడ్డులో నివసిస్తుండగా, హర్షవర్ధన్ హాసన్‌లో ఉంటున్నాడు.
పక్కా ప్లాన్‌తో కిడ్నాప్?
డిసెంబర్ 7న షూటింగ్ పని మీద మైసూర్‌కు వెళ్తున్నానని చైత్ర తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే ఈ కిడ్నాప్ ఆమె భర్త పన్నిన ముందస్తు వ్యూహమని పోలీసులు అనుమానిస్తున్నారు. హర్షవర్ధన్ తన సహచరుడు కౌశిక్‌కు రూ. 20,000 అడ్వాన్స్‌గా ఇచ్చి ఈ కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మైసూర్ రోడ్ మెట్రో స్టేషన్ వద్ద చైత్రను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని బిడది మార్గం గుండా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.
బిడ్డను ఇస్తేనే విడుదల.. బెదిరింపు కాల్స్!
కిడ్నాప్ జరిగిన కొద్దిసేపటికే (ఉదయం 10:30 గంటలకు) చైత్ర ఎలాగోలా తన స్నేహితుడు గిరీష్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం హర్షవర్ధన్ నేరుగా చైత్ర తల్లికి ఫోన్ చేసి అసలు విషయం బయటపెట్టాడు. చైత్ర సురక్షితంగా ఉండాలంటే.. తన కుమార్తెను చెప్పిన ప్రదేశానికి తీసుకురావాలని హర్షవర్ధన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
లేదంటే చైత్రను వదిలిపెట్టేదే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడట. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు హర్షవర్ధన్, వర్ధన్ ఎంటర్‌ప్రైజెస్ యజమాని, ఒక సినీ నిర్మాత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Snake Dance Video: నాగిని పాటకు పాము డ్యాన్స్! ఒక్క రోజులోనే 2 కోట్ల వ్యూస్..విపరీతంగా వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Realme Neo 8 Turbo 5G Launch Date In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Realme మీ తమ మరో కొత్త టర్బో సిరీస్ మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ 2026 సంవత్సరం లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం. విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీని ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ Realme Neo 8 Turbo పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Realme Neo 8 Turbo స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన 6.8-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. దీంతోపాటు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన కెమెరా సెట్ అప్ ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇది మోస్ట్ పవర్ఫుల్ లెన్స్‌తో 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ మొబైల్ హైయ్యండ్ మోడల్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండబోతోంది. దీంతోపాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 8000 mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఇవే కాకుండా ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్ HD+ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతోంది. దీంతోపాటు ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకమైన ప్రొటెక్షన్ గ్లాస్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఇక ఇందులో ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ కూడా లభిస్తోంది. Realme Neo 8 Turbo స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఇతర కెమెరా వివరాల్లోకి వెళ్తే.. అదనంగా ఈ మొబైల్‌కి 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా లభిస్తుంది. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన 8000 mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనికి చాలా ప్రత్యేకమైన 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తుంది.. ఇక ఈ మొబైల్ ను కంపెనీ Realme UI 7.0తో Android 16 ఆపరేటింగ్ సిస్టంతో విడుదల చేస్తుంది.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!
Realme నియో 8 టర్బో స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన విడుదల తేదీ వివరాల్లోకి వెళితే.. కంపెనీ ఈ మొబైల్‌కు సంబంధించిన విడుదల, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ అధికారిక సమాచారం ప్రకారం ఈ మొబైల్ ను మొదటగా చైనాలో 2026 సంవత్సరం రెండవ నెలలో లేదా మూడవ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలో విడుదల చేసిన తర్వాతే ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPS-95 Pension Hike Update: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ కనీస నెలవారీ పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 1,000 నుండి రూ. 7,500కి పెంచాలని ఎంతో కాలంగా పోరాడుతున్నారు. అయితే ఈ పెన్షన్ పెంపు ప్రక్రియ ఎందుకు సాధ్యం కావడం లేదనే విషయంపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పార్లమెంటులో స్పష్టత ఇచ్చింది. ఎంపీ రాజేష్ రంజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రభుత్వం పెన్షన్ పెంపుదలకు ఎదురవుతున్న సవాళ్లను వివరించింది.
పెన్షన్ పెంచకపోవడానికి ప్రధాన కారణాలు ఇవే..
పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి మోదీ ప్రభుత్వం ప్రధానంగా మూడు కారణాలను ప్రస్తావించింది. EPS-95 అనేది ఒక సామాజిక భద్రతా పథకం. ఇందులో వచ్చే ప్రయోజనాలు పూర్తిగా ఫండ్‌కు అందే సహకారంపై ఆధారపడి ఉంటాయి. అంటే, జమ అయ్యే నిధులను బట్టే పెన్షన్ చెల్లింపులు జరుగుతాయి.
నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ఈ ఫండ్‌ను ఆడిట్ చేస్తారు. 2019 మార్చి నాటి లెక్కల ప్రకారం.. ఈ పెన్షన్ ఫండ్‌లో భారీ లోటు ఉన్నట్లు గుర్తించారు. ఈ లోటు కారణంగా పెన్షన్ మొత్తాన్ని ఎక్కువకు పెంచడం ఆర్థికంగా సాధ్యం కాదని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
అదే విధంగా పెన్షన్‌ను జీవన వ్యయ సూచికతో అనుసంధానించడం లేదా కరువు భత్యం (డీఏ) కల్పించడంపై గతంలో ఒక కమిటీ అధ్యయనం చేసింది. అయితే పెన్షన్ ఫండ్ వాస్తవిక స్థితిని బట్టి ఇది ఆచరణాత్మకమైనది కాదని ఆ కమిటీ తేల్చిచెప్పింది.
EPS నిధి ఎలా సమకూరుతుంది?
ఉద్యోగుల పెన్షన్ నిధి ప్రధానంగా యజమాని మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారంతో ఏర్పడుతుంది. ఉదాహరణకు కంపెనీ యజమాని తరఫున ఉద్యోగి ప్రాథమిక వేతనం నుంచి 8.33% సహకారం అందితే.. కేంద్ర ప్రభుత్వం నుంచి 1.16 శాతం ఇవ్వాల్సి ఉంది. అయితే ఉద్యోగి కనీస వేతనం రూ.15,000 ఉన్న నేపథ్యంలో వారి పెన్షన్ రూ.7,500 పెంచడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. ప్రస్తుతం ఉన్న రూ. 1,000 కనీస పెన్షన్‌ను నిర్ధారించడానికి ప్రభుత్వం ఇప్పటికే అదనపు బడ్జెట్ సపోర్ట్ అందిస్తోందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో పెన్షన్ రూ.7,500 పెరుగుదల ఇప్పట్లో లేనట్టే అని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chandrababu Naidu Business Reformer Award: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. భారత్‌లోనే అత్యంత ఫేమస్ ఆర్థిక దినపత్రిక 'ది ఎకనామిక్ టైమ్స్' ఏటా అందించే ప్రతిష్టాత్మక అవార్డ్ ఫంక్షన్‌ను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి గానూ 'బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్' (Business Reformer of the Year) అవార్డుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎంపికయ్యారు.
అవార్డుకు ఎంపికయ్యేందుకు ప్రధాన కారణాలు..
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న చొరవను 'ది ఎకనామిక్ టైమ్స్' అవార్డ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాల (Ease of Doing Business) అమలుకు ఈ అవార్డు దక్కింది. కీలకమైన పారిశ్రామిక సంస్కరణలు చేపట్టడం ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలను ఆకర్షించి, ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో విజయం సాధించడం వంటి వాటిని ఆధారంగా చేసుకొని సీఎం చంద్రబాబును 'బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపిక చేశారు.
హేమాహేమీలతో కూడిన జ్యూరీ..
దేశంలోని అత్యున్నత స్థాయి పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన జ్యూరీ ఈ ఎంపిక చేసింది. దీనికి డెలాయిట్ సంస్థ సలహాదారుగా వ్యవహరించింది. జ్యూరీలోని సభ్యులుగా ఉన్న ప్రముఖుల్లో.. సునీల్ భారతి మిట్టల్ (భారతీ గ్రూప్ చైర్మన్), సజ్జన్ జిందాల్ (జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్), ఉదయ్ కోటక్ (కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు), డాక్టర్ దేవిశెట్టి (నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు), నోయెల్ టాటా (టాటా ట్రస్ట్స్ చైర్మన్), అభిషేక్ మను సింఘ్వి (సీనియర్ న్యాయవాది) ఉన్నారు.
గతంలో విజేతల జాబితా ఇలా ఉంది..
'బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్' ప్రతిష్టాత్మక అవార్డును గతంలో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖులు అందుకున్నారు. ఇప్పటి వరకు అవార్డు అందుకున్న ప్రముఖులు వీరే..
2024: అశ్విని వైష్ణవ్ (కేంద్ర మంత్రి)
2023: ఎస్. జైశంకర్ (విదేశాంగ మంత్రి)
2021: నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి)
2019: దేవేంద్ర ఫడణవిస్ (మహారాష్ట్ర మాజీ సీఎం)
అవార్డు ప్రదానోత్సవం ఎప్పుడు..
వచ్చే ఏడాది అనగా 2026 మార్చిలో నిర్వహించనున్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంగా రాష్ట్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, పార్టీ శ్రేణులు సీఎం చంద్రబాబుకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read: Snake Dance Video: నాగిని పాటకు పాము డ్యాన్స్! ఒక్క రోజులోనే 2 కోట్ల వ్యూస్..విపరీతంగా వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shani Dev Blessing Effect On Zodiac Telugu: నవంబర్ 28వ తేదీన శని గ్రహం మీన రాశిలో హీరోగమనం నుంచి సక్రమ మార్గంలోకి వచ్చింది. 2026 సంవత్సరం జూలై 26 వరకు ఇదే స్థితిలో శని గ్రహం కొనసాగుతూ ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని నూతన సంవత్సరంలో రాగి పాదాలతో కొనసాగబోతోంది. కొన్ని కొన్ని సందర్భాల్లో శనిగ్రహం బంగారంతో పాటు వెండి పాదాలతో ముందుకు కొనసాగుతుంది. అలాంటిది 2026 సంవత్సరంలో ఈ గ్రహం రాగి పాదాలతో కదులుతోంది. శని గ్రహం రాగి పాదాలతో కదలడం వల్ల కృషికి ఫలితాలను అందిస్తుంది. అంటే ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎలాంటి పనులు చేసిన తప్పకుండా అద్భుతమైన విజయాలు సాధించుతారు. అంతేకాకుండా కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని సంవత్సరాలతో పోలిస్తే 2026 సంవత్సరం శనిపరంగా చాలా మంచిది. ఈ సమయంలో శని రాగి పాదాలతో కదలడంతో అద్భుతమైన లాభాలు పొందబోతున్న రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశుల వారికి బోలెడు లాభాలు..
మకర రాశి 2026 సంవత్సరంలో మకర రాశి వారికి శని అనుగ్రహం లభించబోతోంది. ముఖ్యంగా రాగి పాదాలతో కదలడం వల్ల వీరికి అద్భుతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా విశేషమైన ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా భాగస్వామితో సంబంధాలు చాలా మధురంగా మారతాయి. అలాగే శత్రువులపై అఖండ విజయాలు సాధించుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆస్తుల కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో కొత్త పెట్టుబడుల నుంచి ఊహించని ఆదాయం పొందగలుగుతారు. అలాగే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అద్భుతమైన సమయంగా మారుతుంది.
మిథున రాశి
2026 సంవత్సరం మిధున రాశి వారికి కూడా గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది. ముఖ్యంగా శని రాగి పాదాలతో ముందుకెళ్లడం వల్ల వీరికి పురోగతిపరంగా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా స్థిరత్వం కూడా లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఈ సమయంలో బయటపడే అవకాశాలున్నాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా మారుతాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అదృష్టం సహకరించి ఎన్నో రకాల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అదృష్టం పెరిగి భారీ మొత్తంలో ఇతరులనుంచి డబ్బులు కూడా పొందగలుగుతారు.
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
కన్యారాశి
కన్యా రాశి వారికి శని రాగి పాదాలతో ముందుకు వెళ్లడం వల్ల చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి ఉద్యోగాలు వ్యాపారాలపరంగా చాలావరకు కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఇతరుల సహకారం పొంది.. కార్యాలయాల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. వ్యాపారాల్లో కూడా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. కొత్త కొత్త బాధ్యతలు లభిస్తాయి. వీరికి సమాజంలో గౌరవంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక ఎప్పటినుంచో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న కన్య రాశి వారికి శని వీటి నుంచి విముక్తి కలిగించబోతున్నాడు. ప్రణాళికల బద్ధంగా పనులు చేయడం వల్ల అద్భుతమైన సంపాదనను పొందగలుగుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించింది. ఇది మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు.
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant Anaconda Latest Video Viral: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వింత పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా కొంతమంది వీటిని చూసి ఇతరులకు షేర్ కూడా చేస్తున్నారు. చాలామంది పాముల వీడియోలు అంటే ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అయితే తాజాగా "Jay Prehistoric Pets" అనే ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఒక పాములకు సంబంధించిన షార్ట్ వీడియో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏంటో? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది ఎన్నో రకాల వింత జంతువులను చూసి ఉంటారు. మరి కొంతమంది సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పాములకు సంబంధించిన వీడియోలు చూస్తున్నారు. వీడియోలో కూడా అత్యంత పెద్ద అనకొండ పామును చూడొచ్చు. చాలామంది వీడియోలో కనిపించే అతి భారీ అనకొండ పరిమాణం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అందరికీ జయ్ బ్రూవర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన ఓ వన్యప్రాణి నిపుణులు. అయితే అతను రోజు పెంచుకుంటున్న పాములకు కావలసిన ఆహారాన్ని అందిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాటిని శుభ్రం చేయడం వంటివి కూడా చేస్తాడు. ఇలాంటి సమయాల్లోనే వీడియోలు తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఇలా పోస్ట్ చేసిన వీడియోనే ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో.. జయ్ బ్రూవర్ అత్యంత ప్రమాదకరమైన ఓ అనకుండా పాము తోకను పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఆ పాము ముందుకు కదలడం కూడా మీరు క్లియర్‌గా గమనించవచ్చు. అతను ఆ పాము తోక పట్టుకున్నప్పటికీ.. ఆ పాము ముందుకు పాకుతూ ఉండడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే, ఈ వీడియోలో ఆయన.. నా అనకొండ నీ అనకొండ కంటే పెద్దది అంటూ మాట్లాడడం మీరు చూడొచ్చు. ఆ పాము ఎంతో పెద్దదిగా ఉన్నప్పటికీ.. ఆయనపై ఏమాత్రం దాడి చేయకుండా కేవలం నేలపై పాకుతూ ఉండడం మీరు చూడొచ్చు. అయితే ఇది పెంపుడు పాము కావడంతో అతనిపై దాడి చేయలేకపోతుందని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు భావిస్తున్నారు.
సాధారణంగా ఈ వీడియోలో కనిపించిన దానికంటే అనకొండ పాములు మరింత పొడుగు ఉంటాయి. అంతేకాకుండా అత్యంత భారీ శరీరాన్ని కలిగి ఉంటాయి. ఇవి టన్నుల సంఖ్యలో బరువుంటాయి. పెద్ద పెద్ద జంతువులను సైతం ఎంతో సులభంగా ఆహారంగా చేసుకుని తింటూ ఉంటాయి. అందుకే చాలామంది వీటిని పెంచుకునేందుకు భయపడుతూ ఉంటారు. అలాగే ఇవి కేవలం అమెజాన్ అడవులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఈ పాములను పట్టుకొని పరిశోధన శాలల్లో ఉంచి.. వాటిపై పరిశోధనలు కూడా చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook