Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500457

నాంపల్లి గాంధీభవన్‌లో మంత్రి ఉత్తమ్‌ పుట్టినరోజు

Jun 20, 2024 13:13:41
Hyderabad, Telangana
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా గురువారం కాంగ్రెస్ నాయకులు బిజ్జి శత్రు ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, కుమార్ రావ్, లీగల్ సెల్ జాతీయ నాయకులు దామోదర్ రెడ్డి, జి.రాజ్‌కుమార్ యాది, విషు, నాని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BBhoomi
Dec 23, 2025 06:12:27
Secunderabad, Telangana:

Nihao China VS UPI One World: కొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే చైనా.. ఇప్పుడు విదేశీ ప్రయాణికుల కోసం ఈ మధ్యే నిహావో చైనా అనే కొత్త మొబైల్ యాప్ ప్రారంభించింది. ఈ యాప్ భారత్ లో అందుబాటులో ఉన్న యూపీఐ పిన్ వరల్డ్ సర్వీసుతో చాలా మంది దాన్ని పోల్చుతున్నారు. ఈ రెండు సర్వీసుల ముఖ్య ఉద్దేశ్యం విదేశీ పర్యాటకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడమే అయినప్పటికీ.. వాటి విధానం.. ఫీచర్లు, ఉపయోగంలో భారీగా తేడాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నిహావో చైనా యాప్ ఏంటో..?యూపీఐ వన్ వరల్డ్ ఏంటి?.. ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటో?.. తెలుసుకుందాం.

నిహావో చైనా యాప్ అంటే ఏమిటి?

నిహావో చైనా యాప్.. అనేది చైనాను సందర్శించే విదేశీ ప్రయాణికుల కోసం రూపొందించిన ఒక ఆల్-ఇన్-వన్ మొబైల్ యాప్. చైనాలో గూగుల్.. ఉబెర్.. వాట్సాప్ వంటి అంతర్జాతీయ యాప్‌లు పనిచేయవు. దీంతో అక్కడికి వెళ్లే పర్యాటకులకు నావిగేషన్.. కమ్యూనికేషన్.. చెల్లింపులు వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యలకు పరిష్కారంగా చైనా ప్రభుత్వం నిహావో చైనా యాప్‌ను తీసుకొచ్చింది.

ఈ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు.. మ్యాప్‌లు.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వివరాలు.. బస్సు–మెట్రో సమాచారం.. లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి అనేక సర్వీసులను ఒకే చోట పొందవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ట్రాన్స్ క్షన్స్ చేసుకోవచ్చు. అక్కడి భాష గురించి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానిక సర్వీసులను ఉపయోగించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అంతేకాదు వీసా సమాచారం, ఈ సిమ్ వివరాలు, పర్యాటక గైడ్ లైన్స్, ట్యాక్స్ రీఫండ్ సమాచారం వంటి ఇతర సౌకర్యాలను కూడా ఈ యాప్ అందిస్తుంది. ఈ యాప్ ద్వారా చైనాలో ప్రయాణం, నివాసం మరింత సులభంగా మారుతుంది.

UPI వన్ వరల్డ్ అంటే ఏమిటి?

UPI వన్ వరల్డ్ అనేది భారత్ వచ్చే విదేశీ ప్రయాణికుల కోసం రూపొందించిన డిజిటల్ చెల్లింపు సర్వీసు. ఇది ఒక ప్రత్యేక యాప్ కాదు.. కానీ UPI వ్యవస్థలో భాగంగా పనిచేసే సదుపాయం కల్పిస్తుంది. ఈ యాప్ ద్వారా విదేశీ పర్యాటకులు భారత్ లో తాత్కాలిక UPI IDని పొందుతారు. వారు తమ అంతర్జాతీయ బ్యాంక్ అకౌంట్స్ లేదా కార్డులను ఉపయోగించి మన దేశంలో UPI ద్వారా ట్రాన్స్ క్షన్స్ చేసుకోవచ్చు. హోటళ్లలో, రెస్టారెంట్లలో, దుకాణాల్లో, టాక్సీల్లో నగదు అవసరం లేకుండా సులభంగా డిజిటల్ పేమెంట్స్ చేయడానికి ఈ యాప్ సహాయపడుతుంది. విదేశీ కరెన్సీ మార్పిడి అవసరాన్ని తగ్గించడం ద్వారా పర్యాటకులకు ఇది చాలా అనుకూలంగా మారింది. భారతదేశాన్ని మరింత పర్యాటక స్నేహపూర్వక గమ్యస్థానంగా మార్చడంలో UPI వన్ వరల్డ్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పవచ్చు.

 

నిహావో చైనా vs UPI వన్ వరల్డ్: తేడాలు ఏమిటి?

నిహావో చైనా ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్. UPI వన్ వరల్డ్ అనేది ట్రాన్స్ క్షన్స్ చేసే సర్వీస్ మాత్రమే. నిహావో చైనా యాప్‌లో చెల్లింపులతో పాటు మ్యాప్‌లు, ట్రాన్స్ లేషన్, రవాణా, eSIM, టికెట్ బుకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది మొత్తం ప్రయాణ అనుభవాన్ని కవర్ చేస్తుంది. UPI వన్ వరల్డ్ ప్రధానంగా డిజిటల్ చెల్లింపులకే పరిమితమని చెప్పాలి. ఇది భారతదేశంలో ఉన్నప్పుడు విదేశీ ప్రయాణికులు సులభంగా పేమెంట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇతర ట్రావెల్ సంబంధించి సర్వీసులు ఇందులో ఉండవు.

Also Read: 8th Pay Commission: కొత్త పే స్కేల్‌పై రచ్చ.. ఆందోళనలో ఉద్యోగులు.. అసలు ఈ వివాదమేంటి? ఎంప్లాయిస్‌ డిమాండ్ ఏంటి..?

భారత్‌లో ఇలాంటి యాప్‌పై డిమాండ్:

నిహావో చైనా యాప్ విడుదలైన తర్వాత.. భారత్‌లో కూడా విదేశీ పర్యాటకుల కోసం ఇలాంటి ఆల్-ఇన్-వన్ యాప్ ఉండాలనే డిమాండ్ సోషల్ మీడియాలో పెరిగింది. కేవలం చెల్లింపులకే పరిమితం కాకుండా.. మ్యాప్‌లు, ట్రాన్స్‌పోర్ట్, ట్రాన్స్ లేషన్, ట్రావెల్ గైడ్ వంటి అన్ని ఫీచర్లు ఒకే యాప్‌లో ఉండాలని పలువురు సూచిస్తున్నారు. భారత్ కూడా ఇలాంటి సమగ్ర యాప్‌ను ప్రారంభిస్తే.. విదేశీ పర్యాటకులకు దేశం మరింత ఆకర్షణీయంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: EPS Pension: రూ. 1000 నుంచి రూ. 7500కు పెన్షన్ పెంపు... ప్రభుత్వం కీలక అప్‌డేట్..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
comment0
Report
BBhoomi
Dec 23, 2025 05:33:41
Secunderabad, Telangana:

EPFO New Guidelines: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈపీఎఫ్ఓ. ఈపీఎస్ కాంట్రిబ్యూషన్లలో ఉన్న తప్పులను సరిదిద్దుకునేందుకు ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ తాజాగా కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. తప్పుగా లేదా అసంపూర్ణంగా జమ అయిన పెన్షన్ విరాళాల కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించడం, పెన్షన్ క్లెయిమ్‌లను సులభతరం చేయడం ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యంగా EPFO పేర్కొంది.

ఇప్పటివరకు అనేక సందర్భాల్లో పెన్షన్‌కు అర్హత లేని ఉద్యోగుల పేర్లపై EPS కాంట్రిబ్యూషన్లు జమ కావడం.. అలాగే అర్హత ఉన్న ఉద్యోగులకు సంబంధించిన విరాళాలు జమ కాకపోవడం వంటి లోపాలు చోటుచేసుకున్నాయని EPFO గుర్తించింది. ఈ కారణంగా పెన్షన్ సేవా కాలం లెక్కింపు.. క్లెయిమ్ ప్రాసెసింగ్.. తుది పరిష్కారాల్లో తీవ్ర జాప్యాలతోపాటు అయోమయం ఏర్పడింది. ఈ కేసులను వివిధ ఫీల్డ్ ఆఫీసులు వేర్వేరు విధానాల్లో నిర్వహించడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఒకే విధమైన, స్పష్టమైన ప్రక్రియ అవసరమని EPFO భావించి ఈ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.

పెన్షన్‌కు అర్హత లేని ఉద్యోగుల విషయంలో... తప్పుగా EPS కు జమ చేసిన మొత్తాన్ని EPFO తిరిగి లెక్కిస్తుంది. ఆ మొత్తానికి సంబంధిత కాలానికి వర్తించే వడ్డీని కూడా జోడిస్తుంది. మినహాయింపు లేని సంస్థలలో, ఈ మొత్తం పెన్షన్ ఖాతా నుంచి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు ట్రాన్స్ ఫర్ అవుతుంది. అలాగే, ఉద్యోగి రికార్డులో నమోదైన తప్పుడు పెన్షన్ సర్వీస్ కాలాన్ని పూర్తిగా తొలగిస్తారు. మినహాయింపు పొందిన సంస్థల విషయంలో.. ఈ మొత్తాన్ని వడ్డీతో కలిసి సంబంధిత PF ట్రస్ట్‌కు బదిలీ చేసి.. ఉద్యోగి పెన్షన్ సర్వీసును రద్దు చేస్తారు.

Also Read: 8th Pay Commission: కొత్త పే స్కేల్‌పై రచ్చ.. ఆందోళనలో ఉద్యోగులు.. అసలు ఈ వివాదమేంటి? ఎంప్లాయిస్‌ డిమాండ్ ఏంటి..?

అదే సమయంలో.. పెన్షన్‌కు అర్హత ఉన్నప్పటికీ తప్పుగా EPS నుంచి మినహాయించిన ఉద్యోగుల విషయంలో కూడా స్పష్టమైన విధానాన్ని EPFO ఖరారు చేసింది. అలాంటి ఉద్యోగులకు బకాయిలుగా ఉన్న EPS కాంట్రిబ్యూషన్లను వడ్డీతో సహా లెక్కించి, మినహాయింపు లేని సంస్థలైతే PF ఖాతా నుంచి పెన్షన్ ఖాతాకు బదిలీ చేస్తారు. ఉద్యోగి పెన్షన్ సేవా కాలం, అవసరమైతే నాన్-కంట్రిబ్యూటరీ కాలాన్ని కూడా రికార్డుల్లో చేర్చుతారు. మినహాయింపు పొందిన సంస్థలలో అయితే సంబంధిత PF ట్రస్ట్ ఈ మొత్తాన్ని EPFOకి బదిలీ చేస్తుంది.

ఖచ్చితమైన అకౌంటింగ్ కోసం అవసరమైన చోట నిధుల భౌతిక బదిలీలు తప్పనిసరిగా జరుగుతాయని EPFO స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా అన్ని ఫీల్డ్ ఆఫీసుల్లో ఒకే విధంగా అమలు అవుతాయని.. దీని వల్ల ఉద్యోగుల పెన్షన్ హక్కులు మరింత భద్రమవుతాయని తెలిపింది. మొత్తంగా.. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో EPS లోపాల కారణంగా తలెత్తే పెన్షన్ సమస్యలు తగ్గి, ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత స్పష్టమైన పెన్షన్ రికార్డులు లభిస్తాయని EPFO చెబుతోంది.

Also Read: EPS Pension: రూ. 1000 నుంచి రూ. 7500కు పెన్షన్ పెంపు... ప్రభుత్వం కీలక అప్‌డేట్..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Dec 23, 2025 04:28:22
Secunderabad, Telangana:

RBI Repo Rate Cut: హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరోసారి భారీ ఊరట కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక పాలసీ రేట్లపై సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా ఆర్‌బీఐ అడుగులు వేయవచ్చని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) విడుదల చేసిన తాజా నివేదిక సూచిస్తోంది. వచ్చే ఫిబ్రవరి 2025లో జరగనున్న మానీటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా కొనసాగుతోంది. ఆర్‌బీఐ మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే.. రెపో రేటు నేరుగా 5 శాతానికి దిగి వస్తుంది. ఇది రెపో రేటుకు అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గేందుకు దారి తీస్తుంది. ముఖ్యంగా హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతో కుటుంబ బడ్జెట్‌పై ఉన్న భారం కొంతమేర తగ్గుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యూబీఐ నివేదిక ప్రకారం.. ద్రవ్యోల్బణ పరిస్థితులు క్రమంగా నియంత్రణలోకి వస్తుండటం ఆర్‌బీఐకి అనుకూలంగా మారుతోంది. అంతర్గత ధరల ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వడ్డీ రేట్లలో మరింత కోతకు అవకాశం ఉందని పేర్కొంది. బంగారం ధరల వల్ల వచ్చే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇంకా మితంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

Also Read: 8th Pay Commission: కొత్త పే స్కేల్‌పై రచ్చ.. ఆందోళనలో ఉద్యోగులు.. అసలు ఈ వివాదమేంటి? ఎంప్లాయిస్‌ డిమాండ్ ఏంటి..?

ఇదే క్రమంలో 2026 ఫిబ్రవరి లేదా ఏప్రిల్‌లో జరిగే ద్వైమాసిక మానీటరీ పాలసీ సమీక్షలో కూడా మరోసారి 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని యూబీఐ అంచనా వేస్తోంది. అగ్రెసివ్ పాలసీ వైఖరి కొనసాగితే.. 2026 ఫిబ్రవరి సమావేశంలో తుది దశ వడ్డీ కోత జరిగి రెపో రేటు 5 శాతానికి చేరుకోవచ్చని నివేదిక తెలిపింది. అయితే ఇది చివరి తగ్గింపు అవుతుందా? లేదా అంతకంటే దిగువకు కూడా వెళ్లే అవకాశముందా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదని పేర్కొంది.

ఇటీవలే డిసెంబర్‌లో జరిగిన మానీటరీ పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో బ్యాంకులు కూడా తమ రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. అదే విధంగా వచ్చే ఫిబ్రవరిలో మరోసారి రేటు కోత జరిగితే, రుణగ్రహీతలకు మరింత ప్రయోజనం కలగనుంది. ముందున్న పాలసీ సమావేశాల్లో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI).. దేశ ఆర్థిక వృద్ధి రేటు (GDP) వంటి అంశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తం మీద చూస్తే.. వడ్డీ రేట్ల తగ్గింపుల పరంపర కొనసాగితే.. రాబోయే కాలంలో రుణగ్రహీతలకు మరింత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: EPS Pension: రూ. 1000 నుంచి రూ. 7500కు పెన్షన్ పెంపు... ప్రభుత్వం కీలక అప్‌డేట్..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

 

0
comment0
Report
BBhoomi
Dec 23, 2025 03:50:15
Secunderabad, Telangana:

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల మధ్య 8వ వేతన సంఘానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఈసారి ప్రధానంగా కనీస వేతనం ఎలా నిర్ణయించాలి? ఫిట్‌మెంట్ కారకం ఎంత ఉండాలి? అనే అంశాలపై దృష్టి కేంద్రీకృతమైంది. ప్రస్తుతం అమలులో ఉన్న వేతన నిర్ణయ విధానం కాలానికి అనుగుణంగా లేదని, నేటి జీవన వ్యయాలను పూర్తిగా ప్రతిబింబించడంలేదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి.

వేతన సంఘం TORల్లో ఏముంది?

వేతన సంఘానికి నిర్దేశించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR) ప్రకారం.. జీతాలు.. అలవెన్సులు.. ఇతర ప్రయోజనాలను సమగ్రంగా సమీక్షించి అవసరమైన మార్పులను సూచించడం కమిషన్ ప్రధాన బాధ్యత. ఈ ప్రక్రియలో మారుతున్న పని విధానాలు.. విభాగాల వారీ అవసరాలు.. ప్రభుత్వ ఆర్థిక భారం వంటి అంశాలను సమతుల్యం చేయాలని TOR స్పష్టం చేస్తుంది. అలాగే.. ప్రభుత్వ సేవలను ప్రతిభావంతులకు ఆకర్షణీయంగా మార్చడం.. ఉద్యోగుల్లో సామర్థ్యం, బాధ్యతాభావం పెరిగేలా జీత నిర్మాణం ఉండాలనే అంశాన్ని కూడా TORలో ప్రత్యేకంగా పేర్కొన్నారు.

కనీస వేతన సూత్రంపై ఈ వివాదం ఎందుకు ?

TORలో కనీస వేతనాన్ని ఏ సూత్రం ఆధారంగా నిర్ణయించాలనే అంశంపై స్పష్టత లేకపోవడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. పాత కాలానికి చెందిన ప్రమాణాల ఆధారంగా మాత్రమే వేతనాలను నిర్ణయించడం సమంజసం కాదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత జీవన పరిస్థితులు.. ఖర్చుల సరళి పూర్తిగా మారిపోయాయని.. అందుకే కొత్త సూత్రం అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఏంటి?

ఇటీవలి సమావేశాల్లో NC-JCM ఉద్యోగుల పక్షం 8వ వేతన సంఘానికి కనీస వేతనంపై సమగ్ర ప్రతిపాదన ఇవ్వాలని నిర్ణయించింది. కనీస వేతనం కేవలం ఆహారం.. దుస్తుల ఖర్చులకు మాత్రమే పరిమితం కాకూడదని వారు స్పష్టం చేశారు. కనీస వేతనాన్ని నిర్ణయించేటప్పుడు ఈ అంశాలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి:

-పెద్దవారి రోజువారీ కేలరీ అవసరాలు

-కుటుంబ సభ్యుల సంఖ్య

-ఆహారం, దుస్తులు, ఇతర ఆహారేతర అవసరాల గురించి

-రేషన్ దుకాణాలు, సహకార మార్కెట్లలో వాస్తవ ధరల గురించి

-పండుగలు, సామాజిక బాధ్యతలకు అయ్యే ఖర్చులు

-మొబైల్, ఇంటర్నెట్, డిజిటల్ సేవలు వంటి సాంకేతిక అవసరాలు

-సాంకేతికత ఇక నుంచి విలాసం కాదని.. అది ప్రాథమిక అవసరంగా మారిందని ఉద్యోగ సంఘాలు స్పష్టంగా చెబుతున్నాయి.

7వ వేతన సంఘంతో పోలిస్తే కొత్త ప్రతిపాదన ఎలా భిన్నంగా ఉంది?

7వ వేతన సంఘం కనీస వేతనాన్ని 1957లో జరిగిన 15వ భారత కార్మిక సమావేశం ప్రమాణాల ఆధారంగా నిర్ణయించింది. ఆ సూత్రం ప్రకారం ఉద్యోగి.. అతని లేదా ఆమె జీవిత భాగస్వామి.. 14 ఏళ్ల లోపు ఇద్దరు పిల్లల అవసరాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ విధానం గౌరవనీయమైన జీవన ప్రమాణాలకు సరిపోతుందని అప్పట్లో భావించారు. అయితే.. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, వై-ఫై వంటి ఆధునిక అవసరాలకు సంబంధించిన ఖర్చులు అప్పట్లో ప్రత్యేకంగా లెక్కించలేదు. ఈ లోటును 8వ వేతన సంఘంలో సరిదిద్దాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

Also Read: EPFO Pension Nomination Rules: అవివాహిత ఉద్యోగులు ఎవరిని నామినేట్ చేయాలి? EPF రూల్స్ ఏం చెబుతున్నాయ్...?

8వ వేతన సంఘం ప్రస్తుత స్థితి ఎలా ఉంది?

ప్రస్తుతం 8వ వేతన సంఘానికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. దాని పరిధి.. ప్రాధాన్యతలపై చర్చలు సాగుతున్నాయి. తుది సిఫార్సులు రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. కనీస వేతనం, పే మ్యాట్రిక్స్, ఫిట్‌మెంట్ కారకం వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలు గట్టిగా తమ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే వేతన సవరణ వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ శాఖలు అంతర్గతంగా సన్నాహాలు మొదలుపెట్టాయి.

ఫిట్‌మెంట్ కారకంపై ఉద్యోగుల అంచనాలు ఎలా ఉన్నాయి?

ఫిట్‌మెంట్ కారకం అంశం కూడా ఉద్యోగుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 6వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ కారకం సుమారు 1.86గా ఉండగా, 7వ వేతన సంఘం దానిని 2.57కి పెంచి కనీస ప్రాథమిక జీతాన్ని రూ. 18,000గా నిర్ణయించింది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఇంకా ఎక్కువ ఫిట్‌మెంట్ కారకం ఉండాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అయితే.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గృహ ఖర్చులు, పిల్లల విద్య, వైద్య వ్యయాలు, సాంకేతిక జీవనశైలి ఖర్చులు దీనికి ప్రధాన కారణాలుగా వారు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల వాస్తవ అవసరాల మధ్య సమతుల్యత సాధించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.

Also Read: EPFO EDLI Scheme: PF హోల్డర్లకు రూ.7 లక్షల ఉచిత జీవిత బీమా.. క్లెయిమ్ చేసే ప్రక్రియను ఇక్కడ తెలుసుకోండి..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Dec 23, 2025 03:23:11
Secunderabad, Telangana:

 EPS Pension Key Update: ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS–95) కింద కనీస పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 1,000 నుంచి రూ. 7,500కు పెంచాలనే అంశంపై మరోసారి చర్చలు తెరపైకి వచ్చాయి. ఈ పెంపు విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్ వేదికగా స్పష్టమైన వివరణ ఇచ్చింది. లక్షలాది మంది పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా కనీస పింఛను పెంచాలని డిమాండ్ చేస్తూ వస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తెలిపిన కారణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

EPS–95 పథకం ప్రారంభమైనప్పటి నుంచి కనీస పెన్షన్ మొత్తంపై పెన్షనర్లలో అసంతృప్తి ఉంది. పెరిగిన జీవన వ్యయం, వైద్య ఖర్చులు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో రూ. 1,000 పెన్షన్‌తో జీవించడం అసాధ్యమని పెన్షనర్ల సంఘాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ కారణంగానే కనీస పెన్షన్‌ను రూ. 7,500కు పెంచాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ డిమాండ్‌ను అమలు చేయడంలో ఉన్న ఆర్థిక సమస్యలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరించింది.

పెన్షన్ పెంపు విషయంలో ప్రధాన అడ్డంకి నిధుల లభ్యతేనని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. కనీస పెన్షన్‌ను రూ. 7,500కు పెంచితే, ప్రభుత్వంపై ఏటా వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం EPS–95 పథకానికి వచ్చే కాంట్రిబ్యూషన్లు, చెల్లించాల్సిన పెన్షన్ మొత్తాల మధ్య సమతుల్యత సున్నితంగా ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పెన్షన్ మొత్తాన్ని ఒక్కసారిగా భారీగా పెంచితే, ఈ సమతుల్యత పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

ఈపీఎస్–95 ఒక నిర్దిష్ట ప్రయోజన పథకం అని ప్రభుత్వం గుర్తు చేసింది. అంటే.. ఈ పథకంలో ఉన్న నిధుల ఆధారంగానే పెన్షన్లు చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో కూడా పెన్షనర్లకు నిరంతరంగా చెల్లింపులు జరగాలంటే ఫండ్ నిలకడగా ఉండటం అత్యంత అవసరం. కనీస పెన్షన్‌ను గణనీయంగా పెంచితే, ఫండ్ త్వరగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని, దాంతో పథకం మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రభుత్వం హెచ్చరించింది.

Also Read: EPFO Pension Nomination Rules: అవివాహిత ఉద్యోగులు ఎవరిని నామినేట్ చేయాలి? EPF రూల్స్ ఏం చెబుతున్నాయ్...?

ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకానికి భారీగా సబ్సిడీ ఇస్తోందని, కనీస పెన్షన్ కొనసాగించేందుకు బడ్జెట్ నుంచి అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే, పెన్షన్ మొత్తాన్ని మరింత పెంచాలంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు అవసరమవుతాయని.. ఇది దేశ ఆర్థిక లోటుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశంపై ఆర్థిక శాఖ, కార్మిక శాఖ మధ్య విస్తృత చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.

పెన్షన్ పెంపు అంశాన్ని పరిశీలించిన పలు కమిటీలు.. నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారని కేంద్రం తెలిపింది. పెన్షనర్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, దేశ ఆర్థిక స్థితి, పథకం భవిష్యత్తు రెండింటినీ సమతుల్యంగా చూడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే అన్ని కోణాల్లో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకునే ప్రక్రియకు సమయం పడుతోందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం రూ. 7,500 కనీస పెన్షన్ పెంపుపై తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టచేసింది. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలనలో ఉన్నట్లు తెలిపింది. దీనికోసం చర్చలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

Also Read: EPFO EDLI Scheme: PF హోల్డర్లకు రూ.7 లక్షల ఉచిత జీవిత బీమా.. క్లెయిమ్ చేసే ప్రక్రియను ఇక్కడ తెలుసుకోండి..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

 

0
comment0
Report
BBhoomi
Dec 23, 2025 03:03:46
Secunderabad, Telangana:

Gold Price Today: దేశీయ మార్కెట్లలో డిసెంబర్ 23వ తేదీ మంగళవారం బంగారం, వెండి ధరలు స్వల్ప పెరుగుదలతో దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే ఈ రోజు ధరల్లో స్వల్ప మార్పు మాత్రమే కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ఒక్క గ్రాముపై రూ.1 పెరిగి 10 గ్రాముల ధర రూ.1,36,160కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం కూడా గ్రాముకు రూపాయి పెరిగి 10 గ్రాములకు రూ.1,24,810గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి 10 గ్రాములకు రూ.1,02,120కు చేరింది.

ఇదిలా ఉండగా.. బంగారం ధరలు దేశీయంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూనే ముందుకు సాగుతున్నాయి. డిసెంబర్ 23 మంగళవారం నాడు పసిడి ధరలు మరోసారి ఆల్‌టైమ్ హైని తాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,740గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,400గా ఉంది. వెండి ధర కూడా భారీగా పెరిగి కిలో రూ.2,14,825 స్థాయికి చేరింది.

బంగారం ధరలు ఒక్కసారిగా ఎగసిపడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి రికార్డు స్థాయికి చేరడమే అని చెప్పాలి. డాలర్ విలువ బలహీనపడటం కూడా బంగారం ధరలకు మద్దతుగా మారింది. అమెరికా కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో తొలిసారిగా ఒక ఔన్స్ (సుమారు 31.2 గ్రాములు) బంగారం ధర 4,400 డాలర్ల మార్కును దాటింది. అక్టోబర్ 20న ఔన్స్ బంగారం ధర 4,383 డాలర్ల వద్ద ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేయగా, కొంతకాలం తగ్గుముఖం పట్టిన తర్వాత డిసెంబర్ మూడో వారం నుంచి మళ్లీ బలమైన ర్యాలీ ప్రారంభమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 4,450 డాలర్ల ఎగువన ట్రేడవుతూ మార్కెట్ అంచనాలను మించిపోతోంది.

Also Read: Gold Price Prediction: 2050 నాటికి 10 గ్రాముల బంగారం ఎంత ఉంటుంది? ఇప్పుడు బంగారం కొనాలా? లేదా ఇల్లు కట్టుకోవాలా? నిపుణుల సలహా ఇదే..!!

ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 4,477.7 డాలర్ల వరకు చేరి మరో రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది మొత్తంగా చూసుకుంటే బంగారం ధర దాదాపు 75 శాతం వరకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావిస్తూ భారీగా కొనుగోళ్లు చేస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బంగారంతో పాటు వెండి కూడా దూకుడు చూపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్స్‌కు 68.96–68.98 డాలర్ల స్థాయిలో ట్రేడవుతూ చరిత్రాత్మక గరిష్ఠాలను నమోదు చేసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి వెండి ధరలు ఏకంగా 128 శాతం వరకు పెరిగాయి. పరిశ్రమల డిమాండ్ పెరగడం, సరఫరాలో ఒత్తిడి వంటి అంశాలు వెండి ధరలను పైకి నెట్టుతున్నాయి.

ధరలు ఈ స్థాయిలో పెరగడంతో బంగారు, వెండి ఆభరణాల కొనుగోలు సామాన్యులకు కష్టంగా మారుతోంది. భారతీయులకు బంగారం ఒక భావోద్వేగ అంశమే అయినప్పటికీ, పెరుగుతున్న ధరల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గుతున్నాయని బంగారు వ్యాపారులు చెబుతున్నారు. అదే పరిస్థితి వెండి ఆభరణాలు ఇతర వెండి వస్తువుల కొనుగోళ్లపైనా కనిపిస్తోంది. ధరల భారం పెరగడంతో చాలా మంది వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

  Also Read:  Financial Planning Tips 2026: మహిళలూ 2026 జనవరి 1 నుంచి ఈ మూడు నిర్ణయాలు తీసుకుంటే..మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
Dec 22, 2025 14:49:51
0
comment0
Report
HDHarish Darla
Dec 22, 2025 09:35:59
Hyderabad, Telangana:

World Most Dangerous Snake: పాము అంటేనే భయం.. అలాంటిది అది కరవకుండానే, మీ దగ్గరకు రాకుండానే చంపగలదంటే ఎంత ప్రమాదకరమో ఊహించండి! సాధారణంగా పాములు కాటు వేసి విషాన్ని ఎక్కిస్తాయి. కానీ, 'మొజాంబిక్ స్పిట్టింగ్ కోబ్రా' అనే పాము మాత్రం ఏకంగా గాలిలోకి విషాన్ని వెదజల్లి శత్రువులను హతమారుస్తుంది.

ఈ వింతైన, భయంకరమైన పాముకు సంబంధించిన ఆసక్తికరమైన, భీతి గొలిపే నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాము తన శత్రువును వేటాడేందుకు లేదా ఆత్మరక్షణ కోసం తన కోరల ద్వారా విషాన్ని ఫౌంటెన్ లాగా బయటకు చిమ్ముతుంది. 

ఇది ఏకంగా 9 అడుగుల దూరం వరకు విషాన్ని పిచికారీ చేయగలదు. ఈ పాము తన విషాన్ని ఎప్పుడూ ఎదుటి ప్రాణి కళ్లను లక్ష్యంగా చేసుకునే చిమ్ముతుందట. విషం చిమ్మేటప్పుడు ఇది తన తలను వేగంగా కదిలిస్తుంది. దీనివల్ల విషం ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి, ఖచ్చితంగా శత్రువు కళ్లలోకి ప్రవేశించేలా చేస్తుంది.

కంటికి పడితే అంధత్వమే!
ఒకవేళ ఈ పాము చిమ్మిన విషం కళ్లలో పడితే ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. కళ్లలోకి విషం వెళ్లగానే తీవ్రమైన మంట, చికాకు మొదలవుతాయి. సకాలంలో సరైన చికిత్స అందకపోతే, కంటి కణాలు పూర్తిగా దెబ్బతిని ఆ వ్యక్తి శాశ్వతంగా అంధుడు అయ్యే ప్రమాదం ఉంది.

శరీర భాగాలు కుళ్లిపోతాయి.. 
దీని విషం కేవలం కళ్లకే కాదు, చర్మానికి కూడా చాలా ప్రమాదకరం. దీని విషం 'సైటోటాక్సిక్' రకానికి చెందినది. ఇది చర్మ కణాలను, కణజాలాలను వేగంగా నాశనం చేస్తుంది. విషం సోకిన చోట తీవ్రమైన వాపు రావడం, గాయాలు కావడం, చివరకు ఆ శరీర భాగం కుళ్ళిపోయేలా చేస్తుంది.

హెచ్చరిక: ఈ పాము ఆఫ్రికా ఖండంలోని మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడమో లేదా అంధత్వానికి గురికావడమో జరుగుతోంది. ప్రకృతిలో అత్యంత తెలివైన, ప్రమాదకరమైన పాముల్లో ఇది ఒకటి.

Also Read: Movie Release This Week: 2025లో చివరిగా థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే! ఏది 'ఛాంపియన్' అవుతుందో?

Also Read: Naga Chaitanya Become Father: తాత కాబోతున్న అక్కినేని నాగార్జున..నాగచైతన్య-శోభిత కాదంట! నాగార్జున రియాక్షన్ ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 22, 2025 08:23:58
Hyderabad, Telangana:

Tollywood Movie Release This Week: 2025 సంవత్సరం సినీ ప్రేక్షకులకు ఎన్నో మధుర జ్ఞాపకాలను, విభిన్న అనుభూతులను మిగిల్చింది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని చిత్రాలు నిరాశపరిస్తే, చిన్న సినిమాలు అద్భుత విజయాలను సాధించి ఆశ్చర్యపరిచాయి. ఇక ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలికేందుకు, డిసెంబర్ 25న (క్రిస్మస్ సందర్భంగా) బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైన సినిమాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

తెలుగు సినిమాల సందడి..
ఛాంపియన్:
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ఇది. ఫుట్‌బాల్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారు. స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు దీని నిర్మాణంలో భాగమయ్యాయి.

శంబాల: 'హారర్.. సస్పెన్స్.. ఎమోషన్' - ఇదే ఈ సినిమా ప్రధాన బలం. ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఊహించని ట్విస్టులు ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈషా: హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్. తన శరీరాన్ని పరాయి ఆత్మ ఆక్రమించినప్పుడు ఒక వ్యక్తి ఎదుర్కొనే భయంకర సంఘర్షణను ఇందులో చూపించారు. త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు.

దండోరా: శివాజీ, నవదీప్, నందు వంటి సీనియర్, యంగ్ హీరోల కాంబినేషన్‌లో వస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది.

పతంగ్: గాలిపటాల పండుగ నేపథ్యం, విభిన్నమైన కథాంశంతో వస్తున్న యూత్‌ఫుల్ మూవీ. సురేష్ బాబు సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ కీలక పాత్ర పోషించడం విశేషం.

బ్యాడ్ గాళ్స్ : '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ఫేమ్ ఫణి ప్రదీప్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం యూత్ ఫుల్ అంశాలతో క్రిస్మస్ కానుకగా వస్తోంది.

డబ్బింగ్ చిత్రాలు..
>
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ప్రధానపాత్రలో రూపొందిన చిత్ర 'వృషభ'. ఈ మలయాళ డబ్బింగ్ చిత్రం తెలుగులో తల్లిదండ్రులు సెంటిమెంట్ డ్రామాగా రూపొందింది. మోహన్‌లాల్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు.
> కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'మార్క్'. ఇదొక పవర్‌ఫుల్ క్రైమ్ డ్రామా. సుదీప్ ఇందులో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

ఎప్పుడు విడుదల?
పైన పేర్కొన్న సినిమాలన్నీ ఈ ఏడాది చివరి పండుగ అయిన క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఈ ఏడాది చివర్లో అటు స్పోర్ట్స్ డ్రామాలు, ఇటు హారర్ థ్రిల్లర్లు, అటు కమర్షియల్ ఎంటర్టైనర్లతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించబోతోంది. మరి ఈ భారీ పోటీలో ప్రేక్షకుల మనసు గెలిచి 'ఛాంపియన్' గా నిలిచే సినిమా ఏదో చూడాలి!

Also Read: Naga Chaitanya Become Father: తాత కాబోతున్న అక్కినేని నాగార్జున..నాగచైతన్య-శోభిత కాదంట! నాగార్జున రియాక్షన్ ఇదే!

Also Read: Telangana Free Bus Scheme: మహిళలకు శుభవార్త..ఇకపై బస్సుల్లో ఆధార్‌కార్డు అవసరమే లేదు..ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Dec 22, 2025 07:58:03
Secunderabad, Telangana:

Gold Price Record 2025-Gold Outlook 2026: బులియన్ మార్కెటే కాదు.. పసిడి ప్రియులు కూడా 2025 ఏడాదిని అంత సులభంగా మర్చిపోరు. ఎందుకంటే 2025వ సంవత్సరంలో పెరిగినంత బంగారం ధరలు.. గత చరిత్రను చూస్తే ఏనాడూ ఇంతగా పెరగలేదు. ఈ ఏడాది వరుస రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోయింది. దాదాపు 46ఏళ్ల తర్వాత అంటే 1979 తర్వాత బంగారం ధర ఇంతగా పెరిగడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. స్పాట్ గోల్డ్ ధర 2025 అక్టోబర్ లో ఔన్సుకు 4,381 డాలర్ల స్థాయికి తాకి సరికొత్త ఆల్ టైం హైని క్రియేట్ చేసింది. ఈ ఏడాది మొదటి నుంచి బంగారం ధర 45సార్లకు పైగా పెరిగి కొత్త గరిష్టాలను తాకింది. ఒక ఏడాదిలో ఎంత పెరిగిందనేది ఈ ర్యాలీ తీవ్రతను బట్టి అర్థం చేసుకోవచ్చు.

 36 రోజుల్లోనే పరుగులు పెట్టిన పసిడి:

కేవలం 36రోజుల్లోనే పసిడి ధర పరుగులు పెట్టింది. 3,500 డాలర్ల నుంచి ఏకంగా 4,381 డాలర్లకు చేరడం మార్కెట్ ను ఆశ్చర్యపరిచింది. పసిడి ప్రియులు నోరెళ్లబెట్టేలా చేసింది. తక్కువ సమయంలోనే దాదాపు 14శాతం వరకు లాభాన్ని అందించింది. బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. 1979 తర్వాత బంగారం చూపిన అత్యంత బలమైన వార్షిక ప్రదర్శన అని చెబుతున్నారు. ఇంతటి దూకుడు వెనక అసలు కారణాలు ఎన్నో ఉన్నాయి. ఒక కారణమని స్పష్టంగా చెప్పలేమంటున్నారు.

Also Read: Gold: ప్రతినెలా చిట్టీ కట్టి బంగారం కొనడం మంచిదా? లేదంటే లోన్ తీసుకుని బంగారం కొంటే లాభమా?

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు:

అయితే ఒక కారణం మాత్రం చెప్పుకోవచ్చు. అదే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు. నవంబర్ నెల సీపీఐ ద్రవ్యోల్బణ డేటా 2.7శాతం నమోదు అవ్వడంతో రానున్న కాలంలో ఫెడ్ రేట్ల కోతలు తప్పవన్న నమ్మకంతో మార్కెట్ బలపడింది. వడ్డీ రేట్ల తక్కినట్లయితే బంగారం వంటి రాబడి ఇవ్వని ఆస్తులపై డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలోనే డాలర్ సూచిక బలహీనడపడుతుంది. ఫలితంగా బంగారం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

సెంట్రల్ బ్యాంకులు భారీ బంగారం కొనుగోలు:

మరో కీలకమైన అంశం ఏంటంటే.. సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం. చైనా, రష్యా వంటి దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను భారీగా పెంచుకుంటున్నాయి. డాలర్ పై ఆధారపడకూదన్న వ్యూహంలోనే భాగంగా ఈ దేశాలు భారీగా బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. మధ్య ప్రాచ్యం, యూరప్ లో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులతోపాటు వాణిజ్య యుద్ధాల భయం వంటివి ఇన్వెస్టర్లకు బంగారం వైపు ఆకర్షితులను చేస్తున్నాయి.

Also Read: Gold Price Prediction: 2050 నాటికి 10 గ్రాముల బంగారం ఎంత ఉంటుంది? ఇప్పుడు బంగారం కొనాలా? లేదా ఇల్లు కట్టుకోవాలా? నిపుణుల సలహా ఇదే..!!

ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం:

అయితే ప్రపంచ మార్కెట్‌లో బంగారం 4,350 డాలర్లను దాటిన ప్రభావం భారత మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపించింది. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,000 నుంచి రూ.1,15,000 వరకు చేరి ఆల్‌టైమ్ హైను తాకింది. కేవలం ఒక నెల వ్యవధిలోనే దేశీయంగా బంగారం ధరలు 6 నుంచి 7 శాతం వరకు పెరిగాయి. వివాహాల సీజన్, పండుగలు సమయాల్లో బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అధిక ధరలు సామాన్య వినియోగదారులపై భారంగా మారుతున్నాయి. దిగుమతి సుంకాలు, హాల్‌మార్కింగ్ నిబంధనలు కూడా ప్రీమియంలను పెంచుతున్నాయి.

భవిష్యత్తులో భారీగా పెరిగే ఛాన్స్?

భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయని చూస్తే.. 2026లో కూడా బంగారంపై బుల్లిష్ దృక్పథమే కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోతలు కొనసాగితే బంగారం 4,000 నుంచి 4,500 డాలర్ల పరిధిలో స్థిరపడే అవకాశం ఉంది. అయితే మధ్య మధ్యలో లాభాల స్వీకరణ కారణంగా 10–15 శాతం దిద్దుబాట్లు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, బంగారం బుల్ మార్కెట్ ఇంకా ముగియలేదనే అభిప్రాయం బలంగా ఉంది.

గోల్డ్‌మన్ సాచ్స్ వంటి ప్రముఖ బ్రోకరేజీలు 2026 చివరి నాటికి బంగారం ఔన్సుకు 4,900 నుంచి 5,000 డాలర్ల స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నాయి. జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా ఇదే తరహా బుల్లిష్ టార్గెట్లను ఇస్తున్నాయి. ఇదే సమయంలో వెండి కూడా బంగారంతో పాటు ర్యాలీలో దూసుకుపోతోంది. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, AI ఆధారిత డేటా సెంటర్ల డిమాండ్ వెండికి అదనపు బలం ఇస్తోంది. మొత్తం మీద, 2025–26 కాలం విలువైన లోహాలకు స్వర్ణయుగంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Dec 22, 2025 07:09:38
Hyderabad, Telangana:

Akkineni Akhil Become Father: అక్కినేని కుటుంబంలో త్వరలో ఓ శుభవార్త వినబోతున్నామంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. కింగ్ నాగార్జున త్వరలోనే తాతగా ప్రమోషన్ పొందబోతున్నారని, అక్కినేని వారసుడు రాబోతున్నాడని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే, తండ్రి కాబోయేది నాగచైతన్యనా? లేక అఖిలా? అనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

చైతూనా..అఖిలా? అసలు ప్రచారం ఏంటి?
మొదట్లో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే ప్రచారం జరిగింది. శోభిత గర్భవతి అంటూ కొన్ని వార్తలు షికారు చేశాయి. అయితే, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత నుండి గానీ, చైతూ నుండి గానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. పైగా ఆ వార్తల్లో నిజం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అఖిల్ అక్కినేని - జైనాబ్ జంటపై పడింది.

ఈ ఏడాది జూన్ నెలలో అఖిల్, జైనాబ్‌ల వివాహం ఘనంగా జరిగింది. చైతూ కంటే ముందే అఖిల్ తండ్రి కాబోతున్నాడనే రూమర్స్ ఇప్పుడు ఫిలిం నగర్‌లో జోరుగా వినిపిస్తున్నాయి.

నాగార్జున అదిరిపోయే రియాక్షన్!
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక హెల్త్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జునను మీడియా ప్రతినిధులు ఈ ప్రశ్న అడిగారు. "మీరు త్వరలోనే తాతగా ప్రమోట్ అవ్వబోతున్నారట.. నిజమేనా?" అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. నాగార్జున తనదైన శైలిలో చిరునవ్వుతో స్పందించారు. 

"సరైన సమయం వచ్చినప్పుడు నేనే అధికారికంగా చెబుతాను" అని నవ్వుతూ నాగార్జున సమాధానమిచ్చి వెళ్ళిపోయారు. నాగార్జున ఈ వార్తలను ఖండించకపోవడం విశేషం. దీంతో అక్కినేని ఇంట్లో ఏదో శుభవార్త ఉందనే అనుమానం అభిమానుల్లో మరింత బలపడింది.

అఖిల్‌కు కలిసి రానున్న 'లెనిన్'?
వ్యక్తిగత జీవితంలో శుభవార్తలు వినిపిస్తున్నా, వృత్తిపరంగా అఖిల్ ఇంకా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన చివరిసారిగా హీరోగా నటించిన 'ఏజెంట్' చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై  బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. 

ప్రస్తుతం అఖిల్ తన తదుపరి చిత్రం 'లెనిన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో అయినా అఖిల్ కమర్షియల్ సక్సెస్ అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వారసుడి రాకతో అఖిల్‌కు అదృష్టం కలిసి వచ్చి, కెరీర్ కూడా ఊపందుకుంటుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: Nara Brahmani Cricket: క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న మంత్రి నారా లోకేష్ భార్య..బర్త్‌డే రోజు బ్యాట్ పట్టిన నారా బ్రాహ్మణి!

Also Read: Telangana Free Bus Scheme: మహిళలకు శుభవార్త..ఇకపై బస్సుల్లో ఆధార్‌కార్డు అవసరమే లేదు..ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 22, 2025 05:39:36
Hyderabad, Telangana:

Mahalakshmi Smart Card Telangana: తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల' పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఇకపై ఆధార్ కార్డులు చూపించి, జీరో టికెట్లు తీసుకోవాల్సిన శ్రమ తప్పుతుంది.

స్మార్ట్ కార్డుల అవసరం ఏంటి?
ప్రస్తుతం మహిళలు ఆధార్ కార్డు చూపించి కండక్టర్ వద్ద నుండి జీరో టికెట్ పొందుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ కార్డుల్లో పాత ఫోటోలు ఉండటంతో కండక్టర్లకు ప్రయాణికులను గుర్తించడం కష్టమవుతోంది. గుర్తింపు విషయంలో మహిళలకు, కండక్టర్లకు మధ్య రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల గొడవలు జరుగుతున్నాయి. 

ప్రతి ఒక్కరికీ టికెట్ కొట్టడం వల్ల రద్దీ సమయంలో కండక్టర్లపై పనిభారం పెరుగుతోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతోంది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రయాణం మరింత స్మార్ట్..
త్వరలో అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం ద్వారా మహిళలందరికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తారు. బస్సు ఎక్కినప్పుడు ఈ కార్డును చూపితే సరిపోతుంది. కండక్టర్ వద్ద నుండి ప్రత్యేకంగా జీరో టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం కార్డు ట్యాప్ చేయడం లేదా చూపించడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.

ఆర్టీసీకి లాభాల పంట..కొత్త బస్సుల రాక!
ఆదివారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. మహాలక్ష్మి పథకం అమలు వల్ల ఆర్టీసీకి రూ. 255 కోట్ల లాభం చేకూరిందని వారు తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 2,800, వరంగల్‌కు 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే తీసుకురానున్నారు. అర్హులైన మహిళలందరికీ వీలైనంత త్వరగా ఈ స్మార్ట్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎలా పొందాలి?
ఈ కార్డుల పంపిణీ ప్రక్రియ, దరఖాస్తు విధానంపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాలు లేదా ఆన్‌లైన్ ద్వారా వీటిని పొందే అవకాశం కల్పించనున్నారు.

Also Read: Asia Cup U19 Final: ఆసియా కప్ ఫైనల్..టీమ్ఇండియాపై పాకిస్థాన్ భారీ విజయం..191 రన్స్ తేడాతో భారత్ పరాజయం!

Also REad: Nara Brahmani Cricket: క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న మంత్రి నారా లోకేష్ భార్య..బర్త్‌డే రోజు బ్యాట్ పట్టిన నారా బ్రాహ్మణి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top