CM Revanth Reddy: దేవుడిపై వివాదస్పద వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Kishan reddy: కేసీఆర్ ను మించిన మేధావీ రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖతర్నాక్ పంచ్ లు..
Bajaj Pulsar 125 Flipkart Discount Latest Offers: ఎప్పటి నుంచో అత్యంత తగ్గింపు ధరకే బజాజ్ పల్సర్ 125 మోటర్ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు సమయం రానే వచ్చేసింది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ బజాజ్ పల్సర్ 125 (BAJAJ Pulsar 125) మోటర్ సైకిల్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బైక్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ బైక్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో? ఇది ఏయే ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిందో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బజాజ్ పల్సర్ 125 (BAJAJ Pulsar 125) మోటర్ సైకిల్ 124.4 cc ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంజన్ 4-స్ట్రోక్, 2-వాల్వ్, ట్విన్ స్పార్క్ BSVI DTS-i ఫీచర్స్ ఫీచర్స్‌తో లభిస్తోంది. ఈ మోటర్ సైకిల్ ఇంజన్ 8.68 kW పవర్‌తో పాటు 10.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఫ్రంట్ టైర్‌కి డిస్క్ బ్రేక్ (Disc Brake) సిస్టమ్ కూడా లభిస్తోంది. వెనక చక్రానికి డ్రమ్ బ్రేక్ (Drum Brake) కూడా అందుబాటులో ఉంది. ఇవి రెండు యాంటీ-స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్‌పై పని చేస్తాయి.
ఈ మోటర్ సైకిల్ ట్యూబ్‌లెస్ టైర్లు (Tubeless Tyres)తో అందుబాటులోకి వచ్చింది. దీని వెనక భాగం నైట్రాక్స్ షాక్ అబ్జార్బర్స్ సస్పెన్షన్ (Suspension)తో మార్కెట్‌లోకి విడుదలైంది. ఇందులో సెమీ-డిజిటల్ కన్సోల్ (Semi-Digital) కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్‌కి హైలెట్‌గా డిజైన్ హైలైట్ స్టైలిష్ కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్ లభిస్తోంది. దీంతో పాటు సింగిల్ సీట్ (Single Seat) టైప్ డిజైన్‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది హాలోజెన్ హెడ్‌ల్యాంప్, LED DRLsతో వస్తోంది.
Also Read: D-Mart కంటే 40 శాతం తగ్గింపుతో వస్తువులు లభించేది ఇక్కడే!
ఇక హైదరాబాద్ ఆన్‌రోడ్, ఆఫ్ రోడ్ ధర వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం Bajaj Pulsar 125 Carbon Fibre Single Seat వేరియంట్ ధర మార్కెట్‌లో ఎక్స్-షోరూమ్ ధర రూ. 85,414 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, RTOతో పాటు ఇతరులు ఛార్జిలు కలుపుకుని రూ.10,249 వరకు ఛార్జ్ అవుతాయి. అలాగే ఇన్సూరెన్స్ రూ.7,221 కలుపుకుని హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ రూ. 1,01,834కు లభిస్తుంది. ఇక ఇదే మోటర్ సైకిల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.7 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో కేవలం ఈ బైక్ రూ.94,834కే పొందవచ్చు.
Also Read: D-Mart కంటే 40 శాతం తగ్గింపుతో వస్తువులు లభించేది ఇక్కడే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
HMD XploraOne Price: ఈ డిజిటల్ యుగంలో మార్కెట్‌లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్స్‌తో చిన్నవారితో పాటు పెద్దవారికి కూడా ఎంతో అవసరమవుతున్నాయి. ముఖ్యంగా చదువుకునే యువకు స్మార్ట్‌ఫోన్స్‌కు ఇప్పుడు అత్యవసర వస్తువుగా మారింది. చాలా మంది వీటి ద్వారానే పరీక్షలకు ప్రిపేర్ కూడా అవుతున్నారు. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్ కంపెనీ HMD మార్కెట్‌లోకి అతి త్వరలోనే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని ప్రత్యేకమైన చిన్న పిల్లల కోసం లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
HMD కంపెనీ Xploraతో కంపెనీ భాగస్వామ్యంతో పిల్లల కోసం అద్భుతమైన ఫీచర్స్‌తో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది HMD XploraOne పేరుతో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో లాంచ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని కంపెనీ కేవలం పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రత్యేకంగా కాలింగ్ ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన టెక్స్టింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ దృష్టి మరల్చే యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇందులో ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియా యాక్సెస్ కూడా ఉండే అవకాశాలు లేవని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ తల్లిదండ్రులకు పూర్తి యాక్సిస్ కూడా లభిస్తుంది. దీని వల్ల ఫోన్ మొత్తాన్ని నియంత్రించే ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫీచర్స్‌ను టిప్‌స్టర్ @smashx_60 అనే సోషల్ మీడియా అకౌంట్ నుంచి విడుదలకు ముందే లీక్ చేశారు.
Also Read: D-Mart కంటే 40 శాతం తగ్గింపుతో వస్తువులు లభించేది ఇక్కడే!
HMD XploraOne స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది 3.2-అంగుళాల QVGA IPS డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా వెనక భాగంలో స్పెషల్‌గా 2-మెగాపిక్సెల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇది చాలా శక్తివంతమైన Unisoc T127 చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ 64MB ర్యామ్‌తో పాటు 128MB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు మోస్ట్ పవర్‌ఫుల్ 2000mAh బ్యాటరీని ప్యాక్‌తో లాంచ్ అయ్యింది. ఇందులో కంపెనీ ఛార్జింగ్ కోసం టైప్-C పోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెషిఫికేషన్స్ కంపెనీ త్వరలోనే వెల్లడించబోతోంది.
Also Read: D-Mart కంటే 40 శాతం తగ్గింపుతో వస్తువులు లభించేది ఇక్కడే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jana sena party clarify on pawan kalyan statement: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల కోనసీమలో చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారిన విషయం తెలిసిందే. గతంలో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎంతో పచ్చగా ఉండేవన్నారు.కానీ ఇప్పుడు తలలు తీసేసినట్లు ఉన్నాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయేందుకు గోదావరి జిల్లాల పచ్చదనమే కారణమన్నారు. తెలంగాణ నేతలు గోదావరి జిల్లాల్లోపచ్చదనం బాగుంటుందని అనేవారని, దిష్టితగిలినట్లు ఉందని వెటకారంగా మాట్లాడారు.ఈ వ్యాఖ్యలపై దుమారం రాజుకుంది.
దీనిపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సినిమాటో గ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనిచ్చేదనిలేదన్నారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ బేషరతుగా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ గొడవ కాస్త తారాస్థాయికి చేరడంతో ప్రస్తుతం పవన్ సారీ చెప్పాలని పలువురు నేతలు కూడా హల్చల్ చేస్తున్నారు.ఏకంగా పవన్ ఆస్తులు అంటూ..ఏపీ,తెలంగాణ ప్రజల మధ్య కాంట్రవర్సీ రాజేసేలా ట్రోల్స్ చేస్తున్నారు.
దీనిపై తాజాగా.. జనసేన పార్టీ రియాక్ట్ అయ్యింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో చేసిన వ్యాఖ్యల్నికొంతమంది కావాలని ఉద్దేష పూర్వకంగా వక్రీకరించారని చెబుతు ఒకప్రకటన విడుదల చేసింది.
ఇరు తెలుగు స్టేట్స్ ల మధ్య సోదర భావం ఉన్న ఈ తరుణంలో పవన్ వ్యాఖ్యల్ని కావాలని వక్రీకరించోద్దని జనసేన పార్టీ కీలక అప్పీల్ చేసింది.ఈ నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ ల మధ్య హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Akhanda 2 thandavam movie ticket prices hike in Andhra Pradesh: బాలయ్య అభిమానులు ప్రస్తుతం అఖండ 2 మూవీని ఎప్పుడు చూస్తామా అంటూ పూనకాలతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఎక్కడ చూసిన బాలయ్య అఖండ 2 తాండవం మూవీ గురించి తెగ చర్చించుకుంటున్నారు. బాలయ్య, బొయపాటి కాంబినేషన్ చూస్తే న్యూటన్ సైతం దబిడి దిబిడి కావాల్సిందే అంటూ సెటైర్ లు వేస్తున్నారు. న్యూటన్ ఒకవేళ బతికి ఉంటే.. బాలయ్య,బోయపాటిలు ఆయనకే సవాల్ విసిరే వారని కూడా తెగ రచ్చ చేస్తున్నారు.
ఈ క్రమంలో అభిమానులు ఎంతగానో జోష్ తో ఎదురు చూస్తున్న బాలయ్య అఖండ 2 తాండవం మూవీ డిసెంబర్ 5 న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ చంద్రబాబు నాయుడు సర్కారు మూడు రోజుల ముందు టికెట్ల విషయంలో కీలకనిర్ణయం తీసుకుంది.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వస్తున్న అఖండ 2 : తాండవం సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతే కాకుండా..
అదే విధంగా.. ఈ టికెట్ ధరను రూ.600 జీఎస్టీతో పాటుగా నిర్ణయించారు. రోజుకు ఐదు షోలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షోలకు ఏపీ సర్కారు పర్మిషన్ ఇచ్చింది.
Read more: Star Actress: ఆ డైరెక్టర్ నడుము చూపించమన్నాడు.!. షాకింగ్ నిజం రివీల్ చేసిన ప్రభాస్ మూవీ నటి..
దీనితో పాటు.. పెంచిన ధరలు విడుదల తేదీ అంటే.. డిసెంబర్ 5 నుంచి పది రోజుల పాటు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో జారీ చేసింది. దీంతో బాలయ్య అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. మూడు రోజుల ముందే బాలయ్య మూవీ కోసం ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Imran Khan Health Stable But Facing Mental Torture says Uzma khanum: పాకిస్థాన్ లో గత కొన్ని రోజులుగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే చంపేశారని వార్తలు సంచలనంగా మారాయి. దీనికి బలం చేకూర్చే విధంగా పాక్ అధికారులు కనీసం వారి కుటుంబ సభ్యుల్ని కూడా జైల్లోకి అనుమతించలేదు. అంతేకాకుండా.. ఇమ్రాన్ సానుభూతిపరులు, అభిమానులు, కుటుంబ సభ్యులు నిరసనలకు దిగిన కూడా పాక్ సర్కారు పట్టించుకోలేదు. దీని వెనుక ఏదో కుట్ర కోణం ఉందని, ఇమ్రాన్ ఖాన్ ను చంపేసి ఉంటారని చాలా మంది బలంగా నమ్మారు. దీంతో ఈరోజు రావల్పిండిలో ఇమ్రాన్ ఖాన్ సానుభూతి పరులు నిరసనలకు దిగారు.
Imran Khan alive and well, says sister Uzma Khanum after visiting him in Rawalpindi's Adiala Jail. pic.twitter.com/D3aT5LzScQ
— Vikrant (@Vikspeaks1) December 2, 2025
దీంతో పాక్ ప్రభుత్వం 144 సెకన్ కూడా విధించింది.ఈ క్రమంలో పాక్ సర్కారు ఇమ్రాన్ ఖాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ ను జైల్లోకి అనుమతించింది. దీంతో కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ మరణంపై వస్తున్నరూమర్స్ కు తెరపడింది. ఇమ్రాన్ ఖాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ ను జైల్లోకి అధికారులు అనుమతించారు. దీంతో ఆమె కొద్దిసేపు ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడారు. తన సోదరుడితో భేటీ తర్వాత ఉజ్మాఖాన్ జైలు బైట తన సోదరుడి జైల్లో బతికే ఉన్నాడని చెప్పారు. అయితే..ఈ ప్రకటనతో ఆయన మరణ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ సోదరి ఉజ్మాఖాన్ మాట్లాడుతూ..
ఇమ్రాన్ ఖాన్ జనాదరణకు పాక్ ప్రభుత్వంవణికిపోతుందని చెప్పుకొచ్చింది.అందుకే ఆయన్ను ఏకాకిని చేసి, దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి తెస్తున్నాని ఆరోపణలు గుప్పించింది. కానీ జైల్లో మాత్రం తన సోదరుడ్ని తీవ్రంగా మానసికంగా హింసిస్తున్నారని ఉజ్మాఖాన్ పలు విషయాల్ని వెల్లడించారు. అయితే.. అసలు ఇన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ లేరని వస్తున్న రూమర్స్ వేళ.. ఆయన బతికే ఉన్నారన్న వార్తలు విని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read more: Imran khan Death rumours: ఇమ్రాన్ ఖాన్ మరణంపై వార్తలు.. రావల్పిండిలో హైటెన్షన్.. 144 సెక్షన్..
ఎప్పటికైన ఆయన మరల తిరిగి వస్తారని ఇమ్రాన్ ఖాన్ పై తమకున్న అభిమానంను చాటుకుంటున్నారు. మరోవైపు.. 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్.. 2022లో అవిశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయిన తర్వాత..అనూహ్యంగా నమోదైన అవినీతి కేసుల కింద 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Ranveer singh apologises controversy row on kantara chapter 1 controversy: రిషభ్ శెట్టి హీరోగా, దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ లను షేక్ చేసింది. ఈ మూవీలో రిషభ్, రుక్మిణి వసంత్ నటనకు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే.. ఈ మూవీలో కాంతారా దైవం అనుకరణను చూపించారు. ముఖ్యంగా కన్నడిగులు పంజూర్లీ దైవంను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. అందుకే మూవీ యూనిట్ ఇప్పటికే కాంతారా మూవీ రిలీజ్ అయ్యాక కూడా.. మూవీలో దైవంను ఎవరు కూడా ఇమిటేట్ చేయోద్దని, ఇది ఎంతో మంది మత విశ్వాసాలు, మనోభావాలకు చెందినదిగా మూవీ టీమ్ చెప్పింది.
అయితే.. ఇటీవల గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు వేడుకలు జరిగాయి. దీనిలో బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్, కాంతారా చాప్టర్ 1 హీరో రిషబ్ శెట్టి పాల్గొన్నారు. ఈ క్రమంలో రణ్ వీర్ సింగ్ చేసిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. రిషబ్ శెట్టిని రణ్ వీర్ సింగ్ ఎంతో ప్రశంసించారు .
అయితే.. ఈ మూవీలో క్లైమాక్స్ లో చాముండి దైవం ఆవహించినప్పుడు రిషభ్ శెట్టి అవుట్ స్టాండింగ్ నటనతో అదరగొట్టారన్నారు. కళ్లు పెద్దవిగా చేసి.. హీరో దెయ్యం పాత్ర రిషభ్లో ప్రవేశించినప్పుడు సీన్ లు బాగున్నాయని అన్నాడు. అంతేకాకుండా.. ఈ మూవీలో ఓ.. అన్న శబ్దంను కూడా మిమిక్రీ చేశారు. దీనిపై జోకులు కూడా వేశారు. ఈ క్రమంలో కన్నడిగులు పంజూర్లీ , చాముండీలను దైవంగా భావిస్తారు. తమ దైవాన్ని దెయ్యం అంటూ రణ్ వీర్ చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు.
మా ప్రాంతా ఇలవేల్పును అలా పోల్చడం సరికాదని రణ్‌వీర్‌సింగ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై రిషబ్ ఎక్కడా స్పందించలేదు. దీనిపై రణ్ వీర్ సింగ్ పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో తాజాగా.. రణ్ వీర్ సింగ్ ఇన్ స్టా వేదికగా కీలక ప్రకటన చేశారు. కాంతారా చాప్టర్ 1 మూవీలో.. రిషబ్ శెట్టి అద్భుతమైన నటుడు అని హైలైట్ చేయడమే నా మాటల్లోని ప్రధాన ఉద్దేశ్యమంటూ క్లారిటీ ఇచ్చారు. ఒక నటుడిగా ఆయన ప్రదర్శనను ఇలా తాను ఆ సీన్ ను ఇమిటేట్ చేసి చూపించినట్లు చెప్పుకొచ్చారు.
రిషబ్ శెట్టి అంటే తనకు ఎంతో గౌరవమని అదే విధంగా.. అందరి సంప్రదాయలు, నమ్మకాలను, దైవాలను గౌరవిస్తానని అన్నారు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నానంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్ చల్ గా మారింది. దీంతో ఈ కాంటవర్సీకి ఫుల్ స్టాప్ పడినట్లైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
komati reddy Venkat reddy fires on ap deputy cm pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీలోని కోనసీమలో పర్యటించారు.ఈ క్రమంలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోనసీమ పచ్చదనం, కొబ్బరి బొండాల దిగుబడి మొదలైన విషయాలపై మాట్లాడారు. అయితే.. దీనిలో భాగంగా కోనసీమల ఇటీవల పచ్చదనంపై తెలంగాణ వాళ్ల దిష్టి తగిలినట్లు ఉందని వెటకారంగా మాట్లాడారు. అందుకే ఇక్కడ పచ్చదనం ముందులా లేదంటూ సెటైర్ లు వేశారు.
ఈ కామెంట్స్ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. రెండు రాష్ట్రాల నేతల మధ్య ఈ అంశంపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పవన్ కు ఏకీపారేశారు. తెలంగాణ నుంచి కోనసీమకు ఎవరు వెళ్లడంలేదని, ఏపీ నుంచి కోనసీమ నుంచి హైదరాబాద్ కు ప్రజలు వస్తున్నారని కౌంటర్ లు ఇచ్చారు. బుర్రుండే పవన్ ఈ మాటలు మాట్లాడుతున్నాడా అంటూ మండిపడ్డారు.
ఇది కాస్త రెండు తెలుగు స్టేట్స్ ల మధ్య కాంట్రవర్సీగా మారింది. తాజాగా.. పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలపై సినిమాటో గ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు స్టేట్స్ ల మధ్య వివాదంనురాజేసేవిగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా.. ఈ కామెంట్స్ పై పవన్ వెంటనే సారీ చెప్పాలన్నారు.
తెలంగాణ ప్రజల్ని అవమానిస్తే ఊరుకోబోమన్నారు. పవన్ సారీ చెబితే... ఇక్కడ ఆయన సినిమాలు ఆడుతాయని,లేకుంటే ఒక్కసినిమా కూడా ఆడనివ్వమంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు మంత్రి వాకిడి శ్రీహరి కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వనరుల్ని దోచుకుని ఈ స్థాయికి వారు ఎదిగారన్నారు. మెచురిటీతో మాట్లాడాలని, మైలేజ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబుకాదని పవన్ పై మంత్రి వాకిడి శ్రీహరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Pak govt imposed 144 section in Rawalpindi over Imran khan supporters protest: గత కొన్నిరోజులుగా పాక్ లో ఒక్కసారిగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో పాక్ లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, మద్దతు దారులు పెద్ద ఎత్తున పాక్ లో నిరసనలకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే తమకు చూపించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు సైతం రావల్పిండిలోని అడియాలా జైలు వద్దకు వెళ్లి నిరసనలకు దిగారు. అయితే.. దీనిపై ఇటీవల జైలు అధికారులు, పాక్ ప్రభుత్వం మాత్రం ఈ వార్తలలో నిజంలేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు.
కానీ ఆయన వద్దకు మాత్రం కుటుంబ సభ్యుల్ని అనుమతించలేదు. ఇక్కడే అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక వేళ ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉంటే... అలాగైతే తమకు చూపించాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన ముఖాన్ని చూపించలేదని
దీనివల్ల ప్రజలలో అనుమానాలు మరింత పెరుగుతున్నాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, మద్దతుదారులు, రావల్పిండిలోని అడియాలా జైలువద్దకు చేరుకుని భారీగా నిరసనలు చేపట్టారు. పాక్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి జైల్లో ఉన్నారు.
గత నెల రోజులుగా ఆయనను చూసేందుకు కుటుంబ సభ్యులు జైలు అధికారులను కోరుతున్నారు. అయితే.. ఇటీవల భారీ పుకార్ల నేపథ్యంలో.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ స్థాయిలో రావల్పిండికి చేరుకుని నిరసనలకు దిగారు . దీంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తడంతో పాక్ ప్రభుత్వం రావల్పిండితో పాటు, పలు ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. రావల్పిండిలో సమావేశాలు, సిట్-ఇన్‌లు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read more: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడా..? చనిపోయాడా..? ఇంతకీ పాకిస్థాన్ లో ఏం జరుగుతోంది..!
ఈ సెక్షన్ డిసెంబర్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ను తమకు చూపిస్తే ఈ వివాదం ఉండదని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ కోరుతుంది. మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్‌ను ఎందుకు కలవనివ్వడంలేదని, దీని వెనకాల ఏదో కుట్ర జరిగిందని పార్టీ ప్రతినిధులు పాక్ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు పాక్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.