Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

విమానంలో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Jun 20, 2024 06:13:41
Hyderabad, Telangana

శంషాబాద్ విమానాశ్రయం నుండి కౌలాలంపూర్‌కు బయలుదేరిన తర్వాత, పైలట్ కుడి వైపు ఇంజిన్‌లో సాంకేతిక సమస్యను గుర్తించాడు, పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ATCని సంప్రదించాడు మరియు ఈ విమానంలో 130 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌తో ఇంజన్‌ మంటలను చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Mar 02, 2026 13:47:19
Hyderabad, Telangana:

Black Rice Telugu News: సాధారణంగా మనమంతా తెల్ల బియ్యం తింటూ ఉంటాం.. కానీ మార్కెట్లో వివిధ రకాల రంగుతో కూడిన బియ్యాలుంటాయి. అందులో నలుపు రంగు బియ్యం ఒకటి. నిజంగా నలుపు రంగు బియ్యాన్ని ఆహారంగా వినియోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన పూర్వీకులు ఎక్కువగా ఈ రంగు బియ్యాన్ని వినియోగించేవారు. రోజు మధ్యాహ్నం భోజనం తో పాటు రాత్రి డిన్నర్ లో ఈ విజయాన్ని వినియోగిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ బియ్యంలో కొన్ని రకాల అద్భుతమైన పోషకాలు కూడా లభిస్తాయని వారు చెబుతున్నారు.

బ్లాక్ రైస్ రోజు తినడం వల్ల శరీరానికి అధిక మోతాదులో ఆంథోసైనిన్ (Anthocyanin) అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లభిస్తుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

బ్లాక్ రైస్ తో కలిగే లాభాలు ఇవే..
గుండె ఆరోగ్యం 
ముఖ్యంగా బ్లాక్ రైస్ తినడం వల్ల గుండె ఆరోగ్యం చాలావరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయట. అంతేకాకుండా ఇందులో లభించే కొన్ని గుణాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి.. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పూర్తిగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గుండెపోటు సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు తప్పకుండా బ్లాక్ రైస్ తీసుకోవాల్సి ఉంటుంది.

బరువు తగ్గడానికి..
ఇందులో లభించే అద్భుతమైన పీచు పదార్థం శరీరంలోని జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగుపరిచేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల శరీర బరువు కూడా ఎంతో సులభంగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే రోజు ఉదయాన్నే తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి లభిస్తుంది.. దీనివల్ల ఎక్కువ తినాలని కోరికలు కూడా తగ్గుతాయి.. దీంతో శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. 

మధుమేహం నియంత్రణ 
ముఖ్యంగా ఈ అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తంలోని చక్కర స్థాయిలను ఒక్కసారిగా పెంచకుండా ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వైట్ రైస్ కు బదులుగా దీనిని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

లివర్ డిటాక్స్..
నల్లబియ్యం లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయడమే కాకుండా కాలయాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఇందులోని లభించే కొన్ని అద్భుతమైన గుణాలు కాలయంలో పేరుకుపోయిన మలిన పదార్థాలను బయటికి పంపించేందుకు ఎంతగానో సహాయ పడతాయి. అంతేకాకుండా తీవ్ర కాలయ వ్యాధుల బారిన పడకుండా కూడా కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 02, 2026 13:46:00
Thiruvananthapuram, Kerala:

Velugumatla Bhoodan Houses Demolish: పేదోడి ఇళ్లు, భూములపై పడి విధ్వంసం సృష్టిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి.. రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌ తగిలింది. ఖమ్మంలో చేపట్టిన ఇళ్ల కూల్చివేత దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం రాజకీయంగా రచ్చకు దారితీసింది. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడాన్ని సీపీఐ (ఎం) అగ్ర నాయకులు, కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు. బుల్డోజర్‌ పాలన అని అభివర్ణించారు. తెలంగాణలో విధ్వంసం చేస్తూ.. కేరళలో ప్రజలకు న్యాయం చేస్తామనడం కాంగ్రెస్‌కు సిగ్గుచేటు అని తీవ్రంగా విమర్శించారు.

Also Read: Annaram Barrage: అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?: కేటీఆర్‌

ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్‌ భూముల్లో అక్కడి పేదలు ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు. అకస్మాత్తుగా తెల్లవారుజామున భారీ పోలీస్‌ బందోబస్తుతో వచ్చిన అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో ఆ ఇళ్లను కూల్చివేశారు. 700 ఇళ్లకు పైగా కూల్చివేయగా.. దాదాపు 3 వేల మంది పేదలు నిరాశ్రయులుగా మారాయి. ఈ కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ కేరళం సీఎం పినరయి విజయన్ స్పందించారు. 'ఎక్స్‌' వేదికగా సంచలన ప్రకటన చేశారు.

Also Read: Govt Teachers: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పది నిమిషాలు లేట్‌ అయితే జీతం కట్‌!

తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని కేరళం సీఎం పినరయి విజయన్‌ విమర్శించారు. ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం 700 ఇళ్లను కూల్చివేసి, 3,000 మందిని నిరాశ్రయులను చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మోడల్ బుల్డోజర్ రాజ్యాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో అణగారిన వర్గాలపై కాంగ్రెస్ చేస్తున్న దాడులకు సమాధానం చెప్పాలని కేరళం సీఎం సవాల్‌ చేశారు. తెలంగాణలో అణగారిన వర్గాల ఇళ్లను కూల్చి.. కేరళంలో మాత్రం ప్రజలతో నిలబడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం అవమానం.. సిగ్గుచేటు అని కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు.

Also Read: Free Bus Scheme: ఫ్రీ బస్సుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఉత్తర్వులు జారీ!

కేరళం ముఖ్యమంత్రి విమర్శలు చేయడంతో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పినరయి విజయన్‌ స్పందనతో ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారనుంది. పినరయి విమర్శలతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి బుల్డోజర్‌ పాలన నడిపిస్తున్నాడని చేస్తున్న విమర్శలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి అండగా నిలిచింది. ఇళ్ల విధ్వంసాన్ని కళ్లారా చూసిన ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వారికి భరోసా ఇచ్చారు. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేశాక.. అక్కడ పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 02, 2026 13:35:54
Hyderabad, Telangana:

Rahu And Ketu Retrograde 2026 Effect On Zodiac Telugu: హోలీ పండుగ  తానే వచ్చేసింది.. అయితే ఈ పండగకు అన్నింటికంటే చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ హోలీ పండుగ రోజు నాలుగు ప్రధాన గ్రహాలు తిరోగమనంలో ఉండబోతున్నాయి. ముఖ్యంగా అంతుచిక్కని గ్రహాలుగా పరిగణించే రాహు, కేతువు గ్రహాలు ఈరోజు తిరోగమనం చేయబోతున్నాయి. అలాగే బృహస్పతి గ్రహం కూడా హీరోగమనం చేయబోతోంది. చాలా ఏళ్ల తర్వాత ఈ అరుదైన యాదృచ్ఛికం ఏర్పడబోతోంది. ముఖ్యంగా హోలీ పండుగ రోజునే ఈ మూడు గ్రహాలు ఉన్నట్టుండి తిరోగమనం చేయడం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కలుగబోతోంది.

హోలీ పండగ రోజు అద్భుతమైన లాభాలు పొందే రాశులు..
వృషభరాశి 
ముఖ్యంగా వృషభరాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. క్రమంగా ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిన డబ్బులు కూడా తిరిగివచ్చే సూచనలు ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారు మంచి క్లైంట్లను కూడా పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు కుటుంబ వాతావరణంలో కూడా అద్భుతమైన మెరుగుదల కనిపించబోతోంది. అలాగే ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

మిథున రాశి 
మిధున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా ఫలప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి పొందడమే కాకుండా.. వాటి నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందుతారు. అలాగే అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా పూర్తిగా పరిపూర్ణమవుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చదువుకోవాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా రాహువు కేతువు, బృహస్పతి గ్రహాల ప్రభావంతో హోలీ పండుగ నుంచి ఎన్నో రకాల అనుకూలమైన లాభాలు కలుగుతాయి. కెరీర్పరంగా కొత్త అవకాశాలు కూడా లభించబోతున్నాయి. అకస్మాత్తుగా పెద్ద ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలున్నాయి. పదోన్నతులు లభించడమే కాకుండా ఈ సమయంలో ఎన్నో రకాల శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు.

తులారాశి 
తులా రాశి వారికి ఎన్నో రకాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఆకస్మిక ఆర్థిక లాభాలు లభించడమే కాకుండా.. కొత్త ఆదాయ వనరుల పొంది వాటి నుంచి భారీ లాభాలు పొందుతారు. ఇక ఏవైనా పనులు అసంపూర్ణంగా ఉంటే.. వాటిని ఎంతో సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సమయంలో ఎంతో సులభంగా పరిష్కారం లభించబోతోంది. అంతేకాకుండా సృజనాత్మకత పెరిగి కొన్ని పనుల్లో రాణించగలుగుతారు..

మకర రాశి 
మకర రాశి వారికి ఈ మూడు ప్రభావం అద్భుతమైన ఆనందాన్ని అందించబోతోంది. ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు చాలా అద్భుతంగా ఆలోచించి తీసుకోగలుగుతారు. ఏమైనా బకాయలు ఇతరులకు ఇచ్చినవి తిరిగి పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు కూడా లభించవచ్చు. ఇది భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసే వ్యక్తులు స్థిరమైన వృద్ధి పొందగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం కలగబోతోంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Mar 02, 2026 12:39:33
New Delhi, Delhi:

Iran War Impact On Indian Economy: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలకే పరిమితం కాకుండా, భారత సామాన్యుడి జేబుపై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే పప్పుల నుంచి పెట్రోల్ వరకు అన్నింటికీ 'రెక్కలు' రావడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్ వంటి వర్ధమాన ఆర్థిక వ్యవస్థలపై ఈ యుద్ధ ప్రభావం బహుముఖంగా ఉండబోతోంది. రవాణా మార్గాల్లో ఆటంకాలు, పెరిగిన బీమా ఖర్చులు అంతిమంగా వినియోగదారుడిపైనే భారం మోపనున్నాయి.

వంటగదిపై యుద్ధ ప్రభావం 
భారత్ ఏటా సుమారు 5-6 మిలియన్ టన్నుల కంది, మినుము, పెసర పప్పులను ఆఫ్రికా, కెనడా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా ఖర్చులు పెరిగి, దేశీయంగా పప్పుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మన బాస్మతి బియ్యానికి ఇరాన్ అతిపెద్ద కొనుగోలుదారు. యుద్ధ ఉద్రిక్తతల వల్ల కొత్త ఆర్డర్లు నిలిచిపోయాయి. దీనివల్ల ఎగుమతిదారులు నష్టపోయే ప్రమాదం ఉంది.

పెట్రోల్, డీజిల్ భారం
భారత్ తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇరాన్ యుద్ధం తీవ్రమైతే హార్ముజ్ జలసంధి గుండా రవాణా కష్టమవుతుంది. దీనివల్ల బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, పండ్లు, కూరగాయలతో సహా అన్ని వస్తువుల ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి.

యుద్ధం కారణంగా ఎగుమతి-దిగుమతి రంగాలు గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. సముద్ర మార్గాల మార్పు (కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ప్రయాణం) వల్ల నౌకల ప్రయాణ దూరం పెరిగి, షిప్పింగ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరుగుతాయి. ఇది భారతీయ కంపెనీల లాభాలను తగ్గించడమే కాకుండా, దేశంలో ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.

Also Read: Operation Epic Fury Iran: ఇరాన్‌ను వణికించిన అమెరికా ఆయుధ సంపత్తి..యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా వాడిన మారణాయుధాలు ఇవే!

Also Read: PCB Fine 50 Lakh: టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్..ఒక్కో ఆటగాడికి రూ.50 లక్షలు జరిమానా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 02, 2026 12:13:15
:

Iran War Impact On Cryptocurrency: ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లతో పాటు క్రిప్టో కరెన్సీ రంగంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జియోటస్ సీఈఓ విక్రం సుబ్బురాజ్ విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ ఆస్తుల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత యుద్ధ మేఘాల నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో క్రిప్టో మార్కెట్ స్థిరంగా ఉన్నప్పటికీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మార్చి 1 నాటికి బిట్‌కాయిన్ సుమారు 66,000 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ప్రస్తుతం 65,000 డాలర్ల స్థాయి బిట్‌కాయిన్‌కు అత్యంత కీలకం. ఒకవేళ ధర దీనికంటే దిగువకు పడిపోతే, అది వేగంగా 60,000 డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. పైకి వెళ్లాలంటే 67,000 - 68,000 డాలర్ల రేంజ్‌ను దాటాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకునే సత్తా పెరిగితేనే బిట్‌కాయిన్ 70,000 డాలర్ల మార్కును చేరుకోగలదు.

మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న అంశాలు..
ఫిబ్రవరి 27న అమెరికా స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల నుండి సుమారు 27.5 మిలియన్ల డాలర్ల నిధులు బయటకు వెళ్లాయి. ఇది సంస్థాగత పెట్టుబడిదారులు ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉన్నారని సూచిస్తోంది. అలాగే మార్చి 17-18 తేదీల్లో జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం కీలకం కానుంది. వడ్డీ రేట్లపై వచ్చే అంచనాలు మార్కెట్ దిశను నిర్ణయిస్తాయి. యుద్ధ భయంతో చమురు ధరలు 10 శాతం పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఇది సాధారణంగా క్రిప్టో వంటి రిస్క్ ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఆల్ట్‌కాయిన్ల పరిస్థితి (మార్చి 1 నాటికి)..
ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తుందా? లేదా? అనే అంశంపై పాలీమార్కెట్ వంటి ప్రిడిక్షన్ ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 529 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.4,400 కోట్లు) ట్రేడింగ్ జరగడం గమనార్హం. భౌగోళిక రాజకీయ రిస్క్‌ను అంచనా వేయడానికి ట్రేడర్లు ఈ వేదికలను ఒక సూచికగా వాడుకుంటున్నారు.

పెట్టుబడిదారులకు సూచన..
ప్రస్తుతం మార్కెట్ విపరీతమైన ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి డెరివేటివ్స్ ట్రేడర్లు కట్టుదిట్టమైన రిస్క్ మేనేజ్‌మెంట్ పాటించాలి. లాభాల కంటే మూలధనాన్ని కాపాడుకోవడం ఈ సమయంలో అత్యంత ముఖ్యం. యుద్ధ పరిస్థితులు చల్లారే వరకు క్రిప్టో మార్కెట్ ఒక పరిధిలోనే కదిలే అవకాశం ఉంది. అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం అవసరం.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం నిపుణుల అభిప్రాయం మేరకు పొందుపరిచింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. ఏదైనా రంగంలో పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Gambhir On Sanju Samson: శాంసన్ ఒక్కడి వల్లే టీమ్ గెలవలేదు..అసలైన హీరో అతనే: కోచ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు!

Also REad: Operation Epic Fury Iran: ఇరాన్‌ను వణికించిన అమెరికా ఆయుధ సంపత్తి..యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా వాడిన మారణాయుధాలు ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 02, 2026 11:33:05
Hyderabad, Telangana:

Air Conditioner Power Saving Tips: వేసవి కాలంలో ఏసీ వాడకం పెరగడం వల్ల కరెంట్ బిల్లు భారీగా వచ్చే అవకాశం ఉంది. అయితే, నిపుణులు సూచిస్తున్న కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే, రోజులో ఎక్కువ సమయం ఏసీ వాడినా విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు. వేసవి వేడి నుండి ఉపశమనం పొందేందుకు ఏసీ వాడటం తప్పనిసరి. కానీ బిల్లు భయంతో చాలా మంది ఏసీ వేయడానికి వెనుకాడతారు. ఈ కింది పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో చల్లదనాన్ని పొందవచ్చు.

1) చాలా మంది ఏసీ ఆన్ చేయగానే 16 లేదా 18 డిగ్రీల వద్ద పెడతారు. దీనివల్ల కంప్రెషర్ ఎక్కువ సేపు పనిచేసి కరెంట్ బిల్లు పెరుగుతుంది. నిపుణుల సూచన ప్రకారం ఏసీని 24°C నుండి 26°C మధ్య ఉంచడం ఉత్తమం. ఈ ఉష్ణోగ్రత వద్ద ఏసీ తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటుంది.

2) ఏసీ ఆన్ చేసినప్పుడు గదిలోని కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో చూసుకోండి. బయటి వేడి గాలి లోపలికి రాకుండా ఉంటే, గది త్వరగా చల్లబడుతుంది. దీనివల్ల ఏసీ ఎక్కువ సేపు కష్టపడాల్సిన అవసరం ఉండదు.

3) ఏసీ వేసినప్పుడు తక్కువ స్పీడ్‌లో సీలింగ్ ఫ్యాన్ వేయడం వల్ల చల్లని గాలి గది అంతా త్వరగా వ్యాపిస్తుంది. దీనివల్ల గది మూలమూలలా చల్లదనం అందుతుంది. ఏసీపై భారం తగ్గుతుంది.

4) ఏసీ ఫిల్టర్లలో దుమ్ము చేరితే కూలింగ్ సరిగ్గా రాదు. ఫలితంగా ఏసీ ఎక్కువ కరెంట్‌ను వాడుకుంటుంది.

5) ప్రతి 15 రోజులకు ఒకసారి ఏసీ ఫిల్టర్లను తీసి శుభ్రం చేయడం వల్ల ఏసీ పనితీరు మెరుగుపడటమే కాకుండా కరెంట్ ఆదా అవుతుంది.

చాలా మంది ఏసీని కేవలం రిమోట్‌తో ఆఫ్ చేసి వదిలేస్తారు. కానీ, స్విచ్ బోర్డు వద్ద మెయిన్ బటన్ ఆఫ్ చేయకపోతే కొద్దిపాటి విద్యుత్ వినియోగం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వాడనప్పుడు ప్లగ్ వద్ద ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి.

రాత్రి పూట నిద్రపోయేటప్పుడు టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. గది చల్లబడిన తర్వాత ఆటోమేటిక్‌గా ఏసీ ఆఫ్ అయ్యేలా చూసుకుంటే అనవసరమైన విద్యుత్ ఖర్చును అరికట్టవచ్చు. కొత్తగా ఏసీ కొనేవారు ఇన్వర్టర్ ఏసీ, 5-స్టార్ రేటింగ్ ఉన్న మోడళ్లను ఎంచుకోవడం వల్ల కరెంట్ బిల్లును 30% నుండి 40% వరకు తగ్గించుకోవచ్చు.

Also Read: Gambhir On Sanju Samson: శాంసన్ ఒక్కడి వల్లే టీమ్ గెలవలేదు..అసలైన హీరో అతనే: కోచ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు!

Also Read: PCB Fine 50 Lakh: టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్..ఒక్కో ఆటగాడికి రూ.50 లక్షలు జరిమానా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 02, 2026 10:34:36
Hyderabad, Telangana:

Gautam Gambhir On Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్‌పై భారత్ సాధించిన విజయంపై టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన సంజూ శాంసన్ (97* పరుగులు) ఇన్నింగ్స్‌ను మెచ్చుకుంటుంటే.. గంభీర్ మాత్రం ఈ మ్యాచ్ క్రెడిట్ మరోకరికి ఇచ్చాడు. 

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన చావో-రేవో లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన టీమ్ఇండియా సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. విండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజింగ్‌లో సంజు శాంసన్ (97 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, కోచ్ గంభీర్ దృష్టిలో మాత్రం శివమ్ దూబే పోషించిన పాత్ర వెలకట్టలేనిదని చెప్పుకొచ్చాడు.

టీమ్ఇండియా 195 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరిలో ఉత్కంఠ నెలకొంది. హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత, భారత్ గెలవడానికి 10 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉంది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే వరుసగా రెండు ఫోర్లు బాది ఒత్తిడిని తగ్గించాడు.

గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే..
"సాధారణంగా పెద్ద స్కోర్లు చేసిన వారే వార్తల్లో నిలుస్తారు. కానీ నాకు మాత్రం శివమ్ దూబే కొట్టిన ఆ రెండు ఫోర్లు, సంజు చేసిన 97 పరుగులంతే ముఖ్యం. ఆ రెండు బౌండరీలు పడకపోతే ఈరోజు మనం సంజు ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకునేవాళ్లం కాదు. ఇది ఒక జట్టుగా ఆడిన ఆట. చిన్న ఇన్నింగ్స్ అయినా, కీలక సమయంలో ఇచ్చే సహకారమే మ్యాచ్ ఫలితాన్ని మారుస్తుంది" అని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు.

మ్యాచ్ హైలైట్స్
తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ లో టీమ్ఇండియా కేవలం 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టపోయి 199 రన్స్ రాబట్టింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అలాగే శివమ్ దూబే కీలక సమయంలో బాదిన ఫోర్లు భారత్‌ను విజయతీరాలకు చేర్చాయి.

సెమీఫైనల్ బెర్త్ ఖరారు
ఈ విజయంతో టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లోకి చేరింది. సెమీస్‌లో భారత్ తన పాత ప్రత్యర్థి ఇంగ్లాండ్‌తో తలపడనుంది. సంజు శాంసన్ ఫామ్, దూబే ఫినిషింగ్ టచ్ చూస్తుంటే ఈసారి కప్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ వ్యాఖ్యలు జట్టులో ప్రతి ఒక్కరి ప్రాధాన్యతను గుర్తుచేశాయి. స్టార్ ప్లేయర్ల స్కోర్లతో పాటు, క్లిష్ట సమయంలో వచ్చే చిన్న సహకారాలే టోర్నీలను గెలిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

Also Read: PCB Fine 50 Lakh: టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్..ఒక్కో ఆటగాడికి రూ.50 లక్షలు జరిమానా!

Also Read: Operation Epic Fury Iran: ఇరాన్‌ను వణికించిన అమెరికా ఆయుధ సంపత్తి..యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా వాడిన మారణాయుధాలు ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 02, 2026 09:54:16
Hyderabad, Telangana:

Belly Fat Burning Exercises At Home: బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు ఇబ్బంది పడుతున్నారా? అలాంటి వారు ప్రతిరోజూ ఇంట్లో ఈ 5 వ్యాయామాలు చేయాలి. వీటితో మీ బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల దాకా చాలా మంది ఊబకాయం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అధిక బరువు వల్ల వివిధ సమస్యలు వస్తాయి. దీంతో బరువు తగ్గడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అనేక రకాల అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది.

ఊబకాయం
ఊబకాయం తగ్గించుకునేందుకు రోజువారీ వ్యాయామం, డైటింగ్ చాలా ముఖ్యం. కానీ బరువు తగ్గడం అంత తేలికైన విషయమైతే కాదు. దీనికి ఎంతో శ్రమ, నిబద్ధత అవసరం. అయితే మనలో చాలా మందికి పొట్ట కొవ్వు పెరిగిపోతుంది. నడుము, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించడం చాలా కష్టతరంగా మారింది. 

అయితే అలాంటి వారు కేవలం నడుము చుట్టూ ఉన్న కొవ్వును కరిగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. కానీ, శరీరం మొత్తం వ్యాయామాలు చేయడం ద్వారా మాత్రమే బరువు క్రమంగా తగ్గగలరు. అయితే అలాంటి వారికి కేవలం 20 రోజుల్లో నడుము చుట్టూ ఉన్న కొవ్వును కరిగించేందుకు వ్యాయామాలు ఉన్నాయి. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ జిమ్ కోచ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 20 రోజుల్లో నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించేందుకు వ్యాయామాల విశేషాలను పంచుకున్నారు. 

20 రోజుల్లో కొవ్వును కరిగించే వ్యాయామాలు
ఈ వ్యాయామాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30 సార్లు చొప్పున మూడు సెట్లు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Front Leg Raises
ముందుగా తిన్నగా నిలబడి రెండు చేతులను మీ ముందు చాచాలి. ఇప్పుడు ఒక్కో కాలును వీలైనంత పైకి లేపుతూ, అదే సమయంలో చేతులను కిందకు, పైకి కదిలించాలి. దీనివల్ల కాళ్లు, చేతుల్లోని కండరాలు దృఢంగా మారతాయి.

Under Leg Claps
నిలబడి రెండు చేతులను పక్కలకు చాచాలి. ఒక కాలును పైకి లేపి, ఆ కాలు కింద రెండు చేతులు కలిసేలా తీసుకువచ్చి మళ్లీ వెనక్కి వెళ్లాలి. ఇదే విధంగా రెండు కాళ్లతో ప్రత్యామ్నాయంగా 30 సార్లు చేయాలి.

Standing Cross Knee to Elbow
రెండు చేతులను తల వెనుక ఉంచి నిలబడాలి. కుడి కాలును మోకాలి వరకు పైకి ఎత్తుతూ, ఎడమ మోచేయి ఆ మోకాలిని తాకేలా శరీరాన్ని కొద్దిగా వంచాలి. తర్వాత ఎడమ కాలు-కుడి మోచేయికి ఇదే విధంగా చేయాలి. ఇది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది.

Standing Toe Touch
రెండు కాళ్ల మధ్య కొద్దిగా దూరం ఉంచి నిలబడాలి. రెండు చేతులను పైకి ఎత్తి, నెమ్మదిగా ముందుకు వంగుతూ వేళ్లతో నేలను లేదా కాలి బొటనవేళ్లను తాకాలి. మళ్లీ నెమ్మదిగా పైకి లేచి సాధారణ స్థితికి రావాలి. ఇది వెన్నెముక సాగే గుణాన్ని పెంచుతుంది. నడుము కొవ్వును కరిగిస్తుంది.

Standing Side Bends
రెండు కాళ్లను కొద్దిగా వెడల్పుగా ఉంచి నిలబడాలి. చేతులను తల వెనుక ఉంచి, తుంటి భాగం నుండి శరీరాన్ని కుడి వైపుకు, ఆ తర్వాత ఎడమ వైపుకు నెమ్మదిగా వంచాలి. నడుము పక్క భాగాల్లో ఉన్న కొవ్వును తగ్గించడానికి ఇది ఉత్తమమైన వ్యాయామం.

గమనిక: ఈ వ్యాయామాలు చేసేటప్పుడు శ్వాస ప్రక్రియపై దృష్టి పెట్టాలి. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా వెన్నునొప్పి ఉన్నవారు నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే వీటిని ప్రారంభించాలి. వ్యాయామంతో పాటు హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల 20 రోజుల్లో స్పష్టమైన మార్పును గమనించవచ్చు.

Also Read: PCB Fine 50 Lakh: టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్..ఒక్కో ఆటగాడికి రూ.50 లక్షలు జరిమానా!

Also Read: Operation Epic Fury Iran: ఇరాన్‌ను వణికించిన అమెరికా ఆయుధ సంపత్తి..యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా వాడిన మారణాయుధాలు ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 02, 2026 09:39:13
Tallagadda, Telangana:

Kaleshwaram Project: తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు మేడిగడ్డ బ్యారేజ్‌ కూలిపోయిందని ప్రచారం చేయగా.. ఇప్పుడు అన్నారం బ్యారేజీను కూల్చే ప్రయత్నం చేస్తున్నారా? అని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా? అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్‌ నిలదీశారు.

Also Read: Govt Teachers: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పది నిమిషాలు లేట్‌ అయితే జీతం కట్‌!

అన్నారం బ్యారేజ్‌ వద్ద ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. ఈ అంశంపై స్పందిస్తూ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం' అని ప్రకటించారు. బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Also Read: Free Bus Scheme: ఫ్రీ బస్సుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఉత్తర్వులు జారీ!

ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాని మాజీ మంత్రి కేటీఆర్‌ కోరారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజి పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రమాదంలోకి నెడుతోందని మండిపడ్డారు. ఇది కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రే అని ప్రకటించారు.

Also Read: Gold Fruad: మేడమ్‌ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు

'పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుంది. తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని స్పష్టం చేశారు. 'అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు. తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 02, 2026 09:03:04
Hyderabad, Telangana:

Moto G57 Power 5g Price Cut Telugu: ప్రముఖ మొబైల్ కంపెనీ మోటరోలా నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్ విడుదలవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో లాంచ్ అయిన moto g57 power 5G స్మార్ట్‌ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. అయితే, ఇది ఇప్పుడు హోలీ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌లో భాగంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో? ఇది ఎలాంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మోటోరోలా (Motorola) నుంచి  విడుదలైన moto g57 power 5G స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్స్ ను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది ఎంతో ప్రత్యేకమైన 6.72 అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే ఇది డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం చాలా ప్రత్యేకమైన Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రాసెసర్ వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచంలోనే మొట్టమొదటి Snapdragon 6s Gen 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకమైన 5జి కనెక్టివిటీ తో పాటు గేమింగ్, మల్టీ టాస్కింగ్ చేసేందుకు  వీలుంటుంది.. కాబట్టి బాగా గేమ్స్ ఆడుకోవాలని ఈ మొబైల్ చాలా ఉపయోగపడుతుంది. 

అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 7000 mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఫుల్ బ్యాటరీ చార్జ్ చేస్తే ఏకంగా రెండు నుంచి మూడు రోజుల వరకు ప్లే బ్యాక్‌ను అందిస్తుంది. ఇక కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం దీనికి 33W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక వెనక భాగంలోని కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇందులో వెనుక భాగంలో ఎంతో శక్తివంతమైన Sony LYTIA 600 సెన్సార్‌తో కూడిన 50 MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 8 MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో 8 MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. దీంతోపాటు లేటెస్ట్ Android 16 (Hello UI) ఆపరేటింగ్ సిస్టంతో లభిస్తోంది..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్

ప్రస్తుతం భారతదేశంలో ఈ మొబైల్ వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే  (8GB/128GB) స్టోరేజ్ బేరియంట్ ధర మార్కెట్లో రూ.14,999గా ఉంది.. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధానే యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి.. రూ.1,600 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

అలాగే సాధారణ ఎస్బిఐ బ్యాంకు తోపాటు హెచ్డీఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ చేసి.. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఏకంగా రూ.13 వేల బోనస్‌తో పాటు అదనంగా.. రూ.1 వెయ్యి బోనస్ కూడా లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.999 లోపే హోలీ సందర్భంగా సొంతం చేసుకోవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 02, 2026 08:44:15
Hyderabad, Telangana:

Moto G35 5g Price Cut In India Telugu: బడ్జెట్ ధరలో ఏదైనా మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశం గా భావించవచ్చు.. ఎందుకంటే హోలీ సందర్భంగా ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి రూ.10 వేల లోపే 5G స్మార్ట్ ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తుంది. ముఖ్యంగా మోటరోలా బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని ఒక మొబైలైతే, ఎప్పుడు పొందలేని స్పెషల్ ఆఫర్స్‌తో లభిస్తోంది. అయితే, ఏ మొబైల్ అత్యంత చీప్ ధరకు లభిస్తుందో? దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

హోలీ సందర్భంగా Moto G35 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫీస్‌తో లభిస్తోంది.. అయితే, ఈ మొబైల్ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది 6.72-అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను కలిగి ఉండడమే కాకుండా చాలా ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్టుతో అందుబాటులో ఉంది.  అలాగే ఈ మొబైల్ డిస్ప్లే ఎంతో శక్తివంతమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 (Corning Gorilla Glass 3) ప్రొటెక్షన్ సపోర్టుతో అందుబాటులో ఉంది. దీంతోపాటు ఇది చాలా ప్రత్యేకమైన Unisoc T760 (6nm) Octa-core Processor ప్రాసెసర్ తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్ మార్కెట్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళితే.. ఇందులోని వెనక కెమెరా 50MPతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అదనంగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 16 MP కెమెరాతో లభిస్తుంది. ఇక ఇది ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. అలాగే ఇది Android 14 (Hello UI) ఆపరేటింగ్ సిస్టంతో లభిస్తోంది. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన హైలెట్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ప్రీమియం వేగన్ లెదర్ (Vegan Leather) ఫినిష్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఇది చాలా ప్రత్యేకమైన Dolby Atmos సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ లభిస్తున్నాయి.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ ధర మార్కెట్‌తో రూ.12,999తో అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో హోలీ సందర్భంగా కొనుగోలు చేసే వారికి.. అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ ను వినియోగించు కొనుగోలు చేసే వారికి.. రూ.650 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా లభిస్తుంది. హోలీ సందర్భంగా మీ దగ్గర ఉన్న ఏదైనా పాత మొబైల్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తే.. ఏకంగా రూ.11 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.1,999 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరెన్నో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వాటన్నిటిని తెలుసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్‌ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 02, 2026 08:22:26
Hyderabad, Telangana:

Iran Israel War Telugu News: మిడిలిస్ట్ దేశాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గడ్డి హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.. అమెరికాతో తిరిగి చర్చలు జరిపే ఆలోచన తమకు లేదని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. అలాగే అతను మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను తెలియజేశారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గత కొన్ని రోజుల నుంచి ఇరాన్, అమెరికా మధ్య దౌత్య పరమైన సంబంధాలను మెరుగుపరచడానికి.. ఇరాన్ నుంచి చర్చల కోసం ప్రతిపాదనలు వెళ్లాయన్న వార్తలను ఇరాన్ దేశ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ తీవ్రంగా ఖండించారు. అమెరికాతో మేము చర్చలు కోరుకున్నామన్న.  వార్తలు కేవలం కల్పితమేనని.. అలాంటి ప్రతిపాదనలు మా వైపు నుంచి అస్సలు వెళ్లలేదని.. అలాగే భవిష్యత్తులోనూ వెళ్లే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా తన వైఖరి మార్చుకోనంత వరకు సంప్రదింపులకు తావు లేదని ఆయన తేల్చి చెప్పారు..

ఈ సందర్భంగా ఆయన డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానంపై విరుచుకుపడ్డారు. ఇజ్రాయిల్ ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు పావులు కదపటం ప్రపంచానికే మంచిది కాదని విమర్శించారు. ఇజ్రాయిల్ ఆధిపత్యం కాంక్షను నెరవేర్చడానికి ట్రంప్ తన దేశ సైనికుల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నాడని.. తన అనాలోచిత నిర్ణయాలతో అమెరికా సైనికులను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.. ఇవే కాకుండా ఈ సందర్భంగా ఆయన వివిధ అంశాలపై కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.

Also Read:​ Iran -Israel - US War: ఇరాన్ భీకర దాడుల ఎఫెక్ట్.. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పారిపోయాడా..?

అమెరికా తన ఆకాంక్షల ద్వారా ఇరాన్ ను లొంగ తీసుకోవాలని చూస్తోందని.. కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన తెలిపారు.. అగ్రరాజ్యాధిపతి భ్రమలో బ్రతుకుతున్నారని.. బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గే దేశం ఇరాన్ కాదని.. వాస్తవ పరిస్థితులను గ్రహించకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాకే నష్టం చేకూరుస్తాయని.. ఆయన అన్నారు.. పశ్చిమ ఆసియాలో ఇజ్రాయిల్ దుందుడుగు చర్యలకు అమెరికా సత్తా పలకడాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంటుంది.

Also Read:​ Iran -Israel - US War: ఇరాన్ భీకర దాడుల ఎఫెక్ట్.. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పారిపోయాడా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Mar 02, 2026 08:07:47
Lahore, Punjab:

PCB Fines Pakistani Players: ఇటీవలే జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి పాకిస్థాన్ క్రికెట్ జట్టు వైదొలగిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆటగాళ్లపై రూ.50 లక్షల జరిమానా విధించినట్లు జాతీయ మీడియాలో వార్తాకథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీ ఈవెంట్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకోలేకపోవడంతో పాక్ జట్టు‌లోని ఒక్కో ఆటగాడిపై రూ.50 లక్షల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. 

వెలువడిన కొన్ని నివేదికల ప్రకారం.. T20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్స్‌కు చేరుకోలేకపోవడం వల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ దేశ ఆటగాళ్లపై కొరడా ఝళిపించింది. ఒక్కో ఆటగాడు పాకిస్థాన్ కరెన్సీలో 50 లక్షల పాకిస్తానీ రుపియా అనగా భారత కరెన్సీ ప్రకారం ఒక్కో ఆటగాడు రూ.16.28 లక్షలను బోర్డుకు జరిమానా కట్టాల్సి ఉంది. అయితే టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలోనే టీమ్ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు ఓటమి పాలవ్వడం వల్ల  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మ్యాచ్ ఓటమి కారణంగా టోర్నీలో గెలుపు ఆశలు చెమ్మగిల్లినట్లు వెల్లడించింది.

పాకిస్థాన్ జట్టు మరోసారి నాకౌట్ స్టేజ్‌కు చేరుకోలేకపోయింది. ఆ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కోసం ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, టీమ్ఇండియా సిద్ధమవుతున్నాయి. గ్రూప్ మ్యాచ్‌ల్లో పాక్ జట్టులో పోటీతత్వం కనిపించినా.. చివరికి ఓటమి పాలవ్వడం వల్ల నాకౌట్ దశకు చేరుకోలేకపోయిందని నివేదికలు అంటున్నాయి. సూపర్-8 దశలో కూడా తీవ్ర ఒత్తిడికి లోనయ్యి మ్యాచ్‌లను చేతులారా చేజార్చుకుందని చెబుతున్నాయి. 

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. దీని వల్ల పాకిస్తాన్ జట్టు గెలుపు అవకాశాలు భారీగా కుప్పకూలిపోయాయి. ఒకవేళ ఆ మ్యాచ్ జరిగి ఉంటే ఫలితం వేరేలా ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అదిలా ఉండగా ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఓటమి పాలవ్వగా.. అప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకున్నట్లు అయ్యింది. చివరిగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రన్‌రేట్ ఆధారంగా గెలిచి ఉండాల్సింది. కానీ, లంక బ్యాటర్లు పాక్ సెమీస్ చేరే అవకాశాన్ని నీరుగార్చారు. 

దీంతో టీ20 ప్రపంచకప్ మొత్తంగా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది. వారి ప్రదర్శన కారణంగా తీవ్ర అసంతృప్తి నడుము ఆటగాళ్లకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అయితే టోర్నీలో పాక్ ప్రయాణం ముగిసినప్పటికీ, టోర్నమెంట్ మొత్తం ప్రదర్శన నిరాశ కలిగించింది. సెమీ-ఫైనల్స్ చేరుకోలేకపోవడం ప్రపంచ వేదికపై ఆ జట్టు ప్రదర్శనల చుట్టూ పరిశీలనను తీవ్రతరం చేసింది. ఇప్పుడు ఆ జట్టు ఆటగాళ్లపై జరిమానా విధించడం పట్ల ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

Also Read: Operation Epic Fury Iran: ఇరాన్‌ను వణికించిన అమెరికా ఆయుధ సంపత్తి..యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా వాడిన మారణాయుధాలు ఇవే!

Also Read: AP SSC Digital Automation: పదో తరగతి పరీక్షల్లో డిజిటల్ విప్లవం.. ఆటోమేషన్ పద్ధతిలో ఇన్విజిలేటర్ల నియామకం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 02, 2026 07:58:25
Hyderabad, Telangana:

B-2 Bomber Plane Telugu News: ప్రస్తుతమున్న యుద్ద తంత్రంలో టెక్నాలజీ కీలకమైన పాత్ర పోషిస్తుంది.. ఇదే అసలైన ఆయుధంగా మారింది.. శత్రువు కు కనబడకుండానే వారిని దెబ్బతీయడం యుద్ద నీతిలో అత్యున్నత స్థాయిగా అందరూ భావిస్తారు. ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ.. దశాబ్దాలుగా గగనతలంలో తిరుగులేని రారాజుగా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అమెరికాకు చెందిన బీటు స్పిరిట్ స్టెల్త్ బాంబర్.. ప్రపంచ రక్షణ చరిత్రలో ఇదొక అద్భుతంగా భావించవచ్చు.. ఈ విమానం కేవలం బాంబర్ మాత్రమే కాదు శత్రువుల పాలిట ఒక కంటికి కనిపించే మృత్యువుగా భావించవచ్చు..

B-2 బాంబర్ అతిపెద్ద బలం దాని స్టెల్త్ టెక్నాలజీ.. దీని అద్భుతమైన ఫ్లయింగ్ వింగ్ డిజైన్ కారణంగా రేడియో తరంగాలు దానిని తాకి తిరిగి వెళ్ళలేవు.. దీంతో ఆత్యాధునిక రాడార్లు కూడా దీని ఉనికిని అస్సలు గుర్తించలేవని యుద్ధ నిపుణులు చెబుతున్నారు.. ఆకాశంలో ఒక చిన్న పక్షుల మాత్రమే రాడార్స్ స్క్రీన్ పై కనిపిస్తూ.. నిశ్శబ్దంగా లక్ష్యాన్ని చేరుకోవడం దీని అసలైన ప్రత్యేకత.. అంతేకాకుండా శత్రువులపై గురి చూసి ఎక్కు పెట్టడమే దీని అసలైన పని.

ఈ యుద్ధ విమానం విధ్వంసానికి మారుపేరని యుద్ధ నిపుణులు చెబుతున్నారు.. దాదాపు 20 టన్నుల బరువున్న అనుబాంబులను ఇది ఎంతో సులభంగా మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా శత్రువుల బంకర్లను ఛేదించే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ వంటి భారీ బాంబులను కూడా ఇది ఎంతో సింపుల్ గా ప్రయోగిస్తుంది.. 50వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ.. భూమిపై ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో నేలమట్టం చేయగలుగుతుంది. అంతేకాకుండా ఎంతటి  గమ్యానైనా చేరుకోగలుగుతుంది..

B-2 బాంబర్ పరిధి సామాన్యమైనది కాదని యుద్ద నిపుణులు తెలుపుతున్నారు. ఒక్కసారి ఇంధనం నింపితే ఏకధాటిగా 9,600 కిలోమీటర్ల వరకు సింపుల్‌గా ప్రయాణిస్తుంది.. గాలిలోనే ఇంధనాన్ని నింపుకునే సదుపాయం ఉండడంతో ప్రపంచంలో ఏ మూల ఉన్న లక్ష్యాన్ని అయినా.. అమెరికాలోని తన బేస్ నుంచి వెళ్లి ధ్వంసం చేసి తిరిగి రాగల సామర్థ్యం దీనికి ఉంటుంది.. అంతేకాకుండా గురి చూసి ఎక్కువ పెడితే తప్పకుండా అది ధ్వంసం అవ్వాల్సిందే.. శత్రువులకు బాంబు పడిన శబ్దం వినిపించే వరకు.. తమపై దాడి జరుగుతుందన్న విషయం కూడా తెలియదు.. అంతటి నిశ్శబ్ద విధ్వంసం దీని సొంతం..

Also Read:​ Iran -Israel - US War: ఇరాన్ భీకర దాడుల ఎఫెక్ట్.. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పారిపోయాడా..?

ఒక్కొక్క విమానం తయారీకి దాదాపు రెండు బిలియన్ డాలర్ల ఖర్చవుతుంది అంటే.. దీని విలువ అర్ధం చేసుకోవచ్చు ఎంత మొత్తం అని.. అమెరికా గగనతల ఆధిపత్యానికి వెన్నుముకగా నిలుస్తున్న బీటు స్పిరిట్ యుద్ధ రంగంలో టెక్నాలజీకి ఇదొక పరాకాష్టం.. అందుకే దీనిని ఆకాశంలో అజయ్ మృత్యుపాశం అని పిలుస్తారు..

Also Read:​ Iran -Israel - US War: ఇరాన్ భీకర దాడుల ఎఫెక్ట్.. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పారిపోయాడా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 02, 2026 07:27:40
Amaravathi, Andhra Pradesh:

AP Govt Teachers Salary Cut: ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఇకపై ఆలస్యంగా పాఠశాలలకు వస్తే మాత్రం వేతనాల్లో కోత పడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నాళ్లు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చేలా గ్రేస్‌ పీరియడ్‌ అవకాశం ఉంది. ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు జీతం కట్‌ చేస్తామని ప్రభుత్వం ఆదేశించింది. ఉపాధ్యాయుల హాజరు నిబంధనలను పాఠశాల విద్యా శాఖ కఠినతరం చేసింది.

Also Read: Free Bus Scheme: ఫ్రీ బస్సుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఉత్తర్వులు జారీ!

ఉపాధ్యాయులు పాఠశాలలకు ఉదయం 9 గంటల తరువాత వస్తే ఆలస్యంగా (లేట్ ఇన్) ప్రభుత్వం ఇకపై వేతనాల్లో కోత పడేలా విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల వెసులుబాటు సమయం (గ్రేస్ పీరియడ్) ఉన్నప్పటికీ అది నెలలో ఒకట్రెండు రోజులు మాత్రమేనని స్పష్టం చేసింది. ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం పాఠశాలకు వచ్చేవారు ఒంటి గంట లోపు రావాలని.. ఆ తర్వాత హాజరు నమోదు చేస్తే లేట్ ఇన్ అని వస్తుంది.

Also Read: Gold Fruad: మేడమ్‌ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు

ఉదయం పాఠశాలకు హాజరై.. మధ్యాహ్నం సెలవు పెట్టిన టీచర్లు మధ్యాహ్నం 12.30 గంటల కంటే ముందుగా ఔట్ టైం నమోదు చేస్తే వేగంగా వెళ్లిపోయినట్లు విద్యా శాఖ గుర్తించింది. ఉపాధ్యాయులు చేస్తున్న టీచర్లు అలా చేయకుండా జీతం నుంచి కోత పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. నెలలో రెండు రోజులు మాత్రమే ఇలా చేస్తే సరిపోతుంది. అంతకు మించి అలా చేస్తే ఉపాధ్యాయుల వేతనాల్లో కోత పడే అవకాశం ఉంది.

ప్రాథమిక పాఠశాలల్లో సాయంత్రం 3.30 గంటల కంటే ఒక నిమిషం ముందు, ఉప ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం 4 గంటల కంటే ఒక్క నిమిషం ముందు ఔట్ టైం నమోదు చేసినా అది ఏర్లీ ఔట్‌ పరిగణిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఎవరైనా ఉదయం ఇన్‌ టైమ్‌ నమోదు చేసి.. ఔట్ టైం నమోదు చేయకపోతే ఉదయం హాజరు నమోదు చేసిన వెంటనే పాఠశాల ప్రాంగణాన్ని విడిచి వెళ్లి పోయినట్లుగా పరిగణించింది. దీంతో ఉపాధ్యాయులు ఇకపై ఆలస్యంగా వెళ్లినా.. తొందరగా వెళ్లినా ఉపాధ్యాయులు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే జీతం కట్‌ అవుతుంది.

ప్రభుత్వ టీచర్ల ఆగ్రహం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వస్తే జీతం కట్‌ చేసే ప్రభుత్వం మరి తమ డిమాండ్లు, సమస్యలు పరిష్కారంలో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే చర్యలు తీసుకునే ప్రభుత్వం మరి ఆలస్యంగా ఇచ్చే జీతాలు, ఆలస్యంగా ఇచ్చే డీఏలు, ఆలస్యంగా ఇచ్చే ఐఆర్‌, ఆలస్యంగా ఇచ్చే పీఆర్‌సీ, ఆలస్యంగా ఇచ్చే ఏరియర్లు, ఆలస్యంగా ఇచ్చే మెడికల్ బిల్లులు, ఆలస్యంగా ఇచ్చే రిటైర్డ్ బెనిఫిట్స్ వీటికి ఎవరు బాధ్యులు? అని టీచర్లు నిలదీస్తున్నారు. ఇవన్నీ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ప్రభుత్వం ఇచ్చిన రోజు మాత్రమే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఉద్యోగులపై చర్యలు తీసుకునే నైతిక అర్హత ఉంటుందని ప్రభుత్వ టీచర్లు చెబుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top