దమ్మపేట- మద్దులగూడెంలోని పోతులమ్మ దేవాలయం వద్ద బోల్తా అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపు అతివేగంతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది.
ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ కావడాన్ని చూసిన ప్రజలు ఇళ్ల నుంచి బకెట్లు తీసుకుని ట్యాంకర్ వద్దకు చేరుకున్నారు. ట్యాంకర్‌లోని ఆయిల్‌ను పట్టుకునేందుకు లారీలు దూసుకెళ్లడంతో స్వల్ప ఘర్షణ కూడా చోటు చేసుకుంది. వంట నూనెల ధరలు మండిపోతుండటంతో దొరికినంత ఆయిల్ నింపుకునే ప్రయత్నం చేశారు స్థానికులు.