Back
గోలేటిలో వైభవంగా ప్రసాద, అన్న వితరణ కార్యక్రమం
Gollet, Telangana
రెబ్బెన మండలలోని పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్లోని ప్రధాన కూడలి అంబేద్కర్ చౌరస్తా వద్ద గల శ్రీ లక్ష్మీ తిరుమల వినాయక మండపం వద్ద నిర్వాహక కమిటీ సభ్యులు శుక్రవారం ప్రసాదం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గోలేటి, కైరిగూడ,రెబ్బెన, పులికుంట తదితర గ్రామపంచాయతీల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై గణనాధుని ఆశీస్సులు పొంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు రెబ్బెన తుంగెడ నవేగం ఎడవెల్లి తదితర గ్రామపంచాయతీలలో ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Gollet, Telangana:
గణపతి నిమజ్జనం సందర్భంగా పలు వినాయక మండల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన శోభాయాత్రలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గోలేటి టౌన్షిప్ లోని బెల్లంపల్లి ఏరియా జిఎం కార్యాలయం నుంచి గోలేటి విలేజ్ బస్టాండ్ వరకు బాజా భజంత్రీలతో భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. ముఖ్యంగా లక్ష్మీ తిరుమల గణపతి శోబయాత్రలో చిన్నారులు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. గణపతి విగ్రహాలను ట్రాక్టర్ల పైన, వ్యాన్ల పైన అందంగా అలంకరించి గోలేటి టౌన్షిప్ వీధిలో గుండా ఊరేగింపు నిర్వహించారు. శోభయాత్ర అందరిని అలరించి
7
Report
Gollet, Telangana:
తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణపతిని నిమజ్జనం చేయడానికి భక్తులు శుక్రవారం రాత్రి చేపట్టిన శోభయాత్ర అలరించింది. గోలేట్ టౌన్ షిప్ గోలేటి విలేజ్ తదితర ప్రాంతాల నుండి సింగరేణి ప్రధాన రహదారి గుండా నిమజ్జనానికి వెళుతున్న గణపతి శోభాయాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాల చేశారు ముఖ్యంగా భాజా భజంత్రీలతో, ఏకరూప దుస్తులతో, నృత్యాలు చేసుకుంటూ వెళ్తుండడంతో వీధులన్నీ సందడిగా మారాయి. పిల్లలు పెద్దలు మహిళలు అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంతో గణపతి శోబయాత్రలో పాల్గొన్నారు.
14
Report
Gollet, Telangana:
గత వారం పది రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు పగలు రాత్రి తేడా లేకుండా గడిపిన ప్రజలకు గురువారం రాత్రి వెన్నెల (చందమామ) కనిపించడంతో సంబరపడుతున్నారు." చందమామను చూసి ఎన్నాలైంది" అంటూ పరస్పరం చర్చించుకోవడం కనిపించింది. గత కొద్ది కాలంగా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో భారీ, అతి భారీ, జడివానలతో ఇబ్బందికరంగా గడిపిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు బుధ గురువారాల్లో వర్షం రాకపోవడం ఊరటనిచ్చింది గణపతి మండపాల వద్ద పూజలకు సైతం వెళ్లలేని పరిస్థితి ఉండగా బుధ,గురువారాల్లో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
14
Report
Gollet, Telangana:
గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతు ఏఐటీసీ అనుబంధ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం రెబ్బెన ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భోగే. ఉపేందర్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రెబ్బెన మండల కార్యదర్శి రత్నం. దేవాజి మాట్లాడుతూ కార్మికులకు 19 వేల వేతనం ఇవ్వాలని, సహజ మరణానికి 5 లక్షల బీమా చెల్లించాలని,మూడు జతల యూనిఫాం ఇవ్వాలని, జి పి ద్వారానే ట్రాక్టర్ డ్రైవర్లకు లైసెన్స్ ఇప్పించాలని అన్నారు.
14
Report
Gollet, Telangana:
రెబ్బన మండలంలోని పలు గ్రామాలలో కొలువుదీరిన వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాల సందడి నెలకొంది. ఈనెల ఆరవ తేదీన వినాయక నిమజ్జనం ఉండటంతో పలువురు నిర్వాహన కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు స్వచ్ఛందంగా ఎవరికి తోచినంత వారు విరాళాలు అందించి కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తున్నారు గతంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తుండేవారు కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా సెల్ఫోన్, మెమొరీ కార్డుల ద్వారా భక్తి పాటలు వేస్తున్నారు.
4
Report
Gollet, Telangana:
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏడ తెరిపి లేని వర్షాలతోజన జీవనం స్థంభించిపోతుంది. గత 10 రోజుల నుండి ప్రతీ రోజు ఏదో ఒక సమయం లో భారీ వర్షం కురవడం పరిపాటిగా మారింది. అయితే భారీ వర్షాలు కురిస్తి వెంటనే వాగులు వంకలు పారడం,గంట తర్వాత మామూలు పరిస్థితి ఏర్పడటం తెలసిందే కానీ ముసురు వానలు అలా కాదు నిరంతరాయంగాచినకులు పడుతుండడంతో చేన్లలో పనులు, భవన నిర్మాణ సంబంధిత పనులు ముందుకు సాగవు.అదే పనిగా ముసురు వాన పడుతుండటంతోరోజు కూలి, నాలి చేసుకుని జీవించే ప్రజలు ఆకలితో ఆలమటించే పరిస్థితులు దాపురిస్తున్నాయి.
14
Report
Gollet, Telangana:
మండల కేంద్రమైన రెబ్బెనతోపాటు పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి సుమారు మూడు గంటల పాటు భారీ వర్షం దంచుకొట్టింది. సుమారు రాత్రి ఒంటిగంటకు ప్రారంభమైన వాన దాదాపు మూడు గంటల పాటు కురిసింది. ఈ వానతో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మండలంలోని గోలేటి, పులికుంట, గోలేటి క్రాస్ రోడ్, నంబాల, గంగాపూర్, కాగజ్ నగర్ క్రాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు అయింది.
14
Report
Gollet, Telangana:
ఆదివారం ఉదయం ఎర్రటి ఎండ కాయంగానే వర్షం కురవగా తర్వాత రెండు గంటలకు 20 నిమిషాల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈరోజు రెబ్బెన మండలంలోని పలు గ్రామాల్లో గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేస్తుండగా వర్షం పడటంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా భక్తులు కూడా అన్నదాన కార్యక్రమానికి వెళ్లడానికి వర్షం అడ్డంకిగా మారింది ఈ వానతో మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లాయి.
14
Report
Gollet, Telangana:
గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన రెబ్బెన మండల ప్రజలకు ఆదివారం విచిత్ర పరిస్థితి ఎదురైంది ఉదయం సుమారు 11:30 గంటలకు ఒకవైపు ఎర్ర నిండా కాస్తుండగానే మోస్తారు వర్షం కురవడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతకాలం ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురవగా ఆదివారం ఉదయం అలాంటి పరిస్థితి ఏమీ లేకుండానే ఎండలోనే వర్షం కురవడం విచిత్రంగా అనిపించింది. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, అడవుల ఆక్రమణ, నరికివేత కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనీ పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
14
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన గోలేటిటౌన్షిప్ లో శుక్రవారం ఉదయం సుమారు 11:30 గంటలకు భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా గురువారం మాత్రం తెరిపినిచ్చింది. గురువారం సాయంత్రం గోలేటిలో నిర్వహించిన సంతకు కూరగాయలు ఇతర వస్తువులు తీసుకున్నారు. అయితే గురువారం రాత్రి కూడా వర్షం రాలేదు దీంతో రైతులు చైన్లలోకి వెళ్లి పనులు చేస్తుండగా ఉదయం సుమారు 11:30 గంటలకు 20 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది.
14
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం వినాయక చవితి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లోనీ వినాయక మండపాలలో కొలువైన గణపతులకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేకంగా వినాయక చవితి పూజలు నిర్వహించారు.మండలంలోని రెబ్బెన, నవేగం కొండపల్లి,తుంగెడ వంకులం,పులికుంట, గోలేటి, నంబాల, నారాయణపూర్ తదితర గ్రామాలలో భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకున్నారు. గోలేటి లోని అంబేడ్కర్ సెంటర్లో ఏర్పాటుచేసిన వినాయకుని ప్రతిమ పలువురిని అలరించింది.
14
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ లో బుధవారం వినాయక చవితి కులాహలం మొదలైంది. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు అందమైన పూలు, పత్రి, మారేడు కాయలు, వెదురు కొమ్మలు, దోసకాయలు తదితర పూజా సామాగ్రి దుకాణాలు పెట్టారు. ముఖ్యంగా మట్టి గణపతుల విగ్రహాలు ఆకట్టుకోవడంతో పలువురు భక్తులు వాటిని కొనుగోలు చేసి ఇండ్లకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ప్రతి వాడలో గణపతి మండపాలను అందంగా అలంకరిస్తున్నారు.
14
Report
Gollet, Telangana:
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలాన్ని ముసురువాహనలు వీడటం లేదు మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కూడా మండలంలో ముసురు వాన కురుస్తూనే ఉంది. గోలేటి పులి కుంట నంబాల కైరిగూడ గంగాపూర్ నారాయణపూర్ కిష్టాపూర్ గ్రామాల్లో ముసురు వాన నిరంతరంగా పడుతూనే ఉంది బుధవారం నిర్వహించుకోవాల్సిన వినాయక చవితి మండపాల ముస్తాబుకు ఈ వాన ఎంతో ఆటంకం కలిగించింది. బుధవారం ఉదయం సుమారు 9 గంటలకు ఆకాశం మేఘవృతమై అరగంట పాటు భారీ వర్షం కురిసింది.
14
Report
Gollet, Telangana:
బుధవారం జరుపుకోనున్న వినాయక చవితి పండగను పురస్కరించుకొని వినాయకులను ప్రతిష్టించడానికి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మండపాలను ముస్తాబు చేస్తున్నారు. పలుచోట్ల ఆర్థిక స్తోమత కలిగిన ఉత్సవ కమిటీలు వేలాది రూపాయలు వెచ్చిస్తుండగా మరికొన్ని చోట్ల స్తోమతను బట్టి మండపాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా మండపాలను అరటి బోదెలు, కొబ్బరి ఆకులు, పుష్పాలతో మండపాలను అలంకరిస్తున్నారు అదేవిధంగా రాత్రిపూట వెలుగులు విరజిమ్మే విధంగా రంగురంగుల విద్యుత్ బుగ్గలను అమరుస్తున్నారు.
14
Report