Rajahmundry Milk Tragedy: రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం..మరో 12 మంది పరిస్థితి విషయం..ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ!
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Karimnagar Rtc Goa Package Telugu: వేసవికాలం సందర్భంగా కరీంనగర్ డిపో2 తమ ప్రయాణికులకు అదిరిపోయే కానుకను సిద్ధం చేసింది.. అతి తక్కువ ధరలోనే ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు విహారయాత్రలకు కలిపి గోవా టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను కరీంనగర్ డిపో మేనేజర్ శ్రీనివాస్ వెల్లడించారు. అతి తక్కువ ధరలోనే మంచి టూర్‌కి వెళ్లాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశమని ఆయన తెలిపారు. అయితే ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన అన్ని రకాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ టూర్ లో భాగంగా సందర్శించి ప్రాంతాలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఈ టూర్ కేవలం గోవాకు మాత్రమే పరిమితం కాకుండా మధ్య మార్గంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను కూడా కవర్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఉడిపి శ్రీకృష్ణమఠంతోపాటు కొల్లూరు మూకాంబిక అమ్మవారి దర్శనం చేయించి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద శివుని విగ్రహం మురుడేశ్వర్ను కూడా కవర్ చేయబోతున్నట్లు ఈ టూర్ ప్యాకేజీలో పేర్కొన్నారు. అంతేకాకుండా గోకర్ణ క్షేత్ర దర్శనం కూడా చేయించపోతున్నట్లు వెల్లడించారు.
వీటన్నిటిని చూసుకున్న తర్వాత.. నేరుగా గోవాలోని ప్రముఖ బీచులతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ యాత్ర మార్చి ఆరవ తేదీ నుంచి సాయంత్రం గంటలకు ప్రారంభమవుతుంది. కరీంనగర్ నుంచి ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన బస్సు మొదలవుతుందని డిపో మేనేజర్ తెలిపారు.. యాత్ర ముగించుకొని మార్చి పదవ తేదీన తిరిగి కరీంనగర్ చేరుకుంటుంది. మొత్తం యాత్ర దాదాపు నాలుగు రోజులకు పైగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు..
Also Read: Iran-US War News: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు.. US నావల్ బేస్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడి!
ఇక ఈ యాత్రకు సంబంధించిన టికెట్ ధర వివరాల్లోకి వెళితే.. పెద్దలకు కేవలం రూ.5,500 నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. దీంతోపాటు పిల్లలకు రూ.4,150 ఉంటుందని డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.. ఇక బుకింగ్ సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎవరైతే ఈ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారో.. వారు తప్పకుండా ముందుగానే టికెట్లను కరీంనగర్ బస్ స్టేషన్ లో లేదా 9398658062 నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అతి తక్కువ ధరలోనే టూర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్న వారికి ఈ ప్యాకేజీ అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు..
Also Read: Iran-US War News: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు.. US నావల్ బేస్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Israel-iran War Latest Telugu News: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి.. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న ప్రచ్చన్న యుద్ధం శనివారం బహిరంగ యుద్ధం గా మారింది. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ దళాలు ఇరాన్లోని పాలు ప్రధాన నగరాలపై బాంబులతో ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.. ఈ బీకర దాడుల్లో దక్షిణ ఇరాన్లోని హార్మోజ్గాన్ ప్రావిన్స్‌లో ఉన్న మినాబ్ (Minab) నగరంలో ఒక ప్రాథమిక పాఠశాల పూర్తిగా కూలిపోయింది..
ఇజ్రాయిల్ వైమానిక దళం మినాబ్ నగరంలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తూ వస్తోంది. అయితే, ఈ సమయంలో ఒక మిస్సైల్ అక్కడ ఉన్న ఎలిమెంటరీ గర్ల్స్ స్కూల్‌ను నేరుగా తాకడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భాగంగా పాఠశాల భవనం పూర్తిగా నేలమట్టమై దాదాపు 24 మందికి పైగా విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శితిలాల కింద మరికొంతమంది విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దాడి నుంచి కొంతమంది విద్యార్థులు తప్పించుకున్నారు..
ఘటనా స్థలం వద్ద పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.. తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చేస్తున్న ఆర్తనాధాలతో మినాబ్ నగరం దద్దరిల్లిపోయింది.. పిల్లలు చదువుకునే పాఠశాలలే లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం అమానుషం అంటూ స్థానికులు కూడా ఊహించని స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి తల్లిదండ్రులు చేరుకొని శిథిలాల కింద ఉన్న పిల్లలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు..
Also Read: Iran-US War News: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు.. US నావల్ బేస్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడి!
ఇరాన్ అను సామర్థ్యాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను ప్రకటించారు. టెహ్రాన్, ఇస్ఫహాన్, కరాజ్ వంటి ప్రధాన నగరాల్లో క్షిపణుల కేంద్రాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.. దీనికి ప్రతి చర్యక ఇరాన్ కూడా ఇజ్రాయిల్ పై ప్రత్యేకమైన డ్రోన్ల ఎదురుదాడిని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే వారి దగ్గర ఉన్న శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులతో కూడా ఎదురుదాడిని ప్రారంభించింది.. అయితే ఈ స్కూల్ పై జరిగిన దాడుల నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కొన్ని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి..
Also Read: Iran-US War News: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు.. US నావల్ బేస్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Samarlakota Blast News: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరి కెనాల్ సమీపంలో ఉన్న 'సూర్యశ్రీ ఫైర్ వర్క్స్' బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా సంభవించిన భారీ విస్ఫోటంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా శ్మశానవాటికను తలపిస్తోంది.
ప్రమాద తీవ్రత - భయానక దృశ్యాలు
పేలుడు ధాటికి వచ్చిన శబ్దం సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పక్క గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాల భవనం స్లాబ్‌కు పగుళ్లు వచ్చేంతగా ప్రకంపనలు వచ్చాయి. మరణించిన 18 మందిలో ఎక్కువ మంది మహిళా కూలీలే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మరో 8 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
విస్ఫోటం ఎంత ధాటిగా జరిగిందంటే.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఘటనాస్థలిలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటం స్థానికులను కలచివేస్తోంది.
కారణం అదేనా?
అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ఈ పరిశ్రమలో, అనుమతించిన పరిమితికి మించి నిల్వ ఉంచిన బాణసంచా నిల్వల వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం
ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు హోం మంత్రి వంగలపూడి అనిత హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరారు. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. బాణసంచా తయారీలో నిబంధనల ఉల్లంఘనలే ఈ విస్ఫోటానికి కారణమనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Virosh Wedding Unseen Friend: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులతో పాటు ఫోటోల్లో కనిపిస్తున్న ఆ 'మూడవ వ్యక్తి' ఎవరా అని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు.
టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ పెళ్లి ఫోటోల్లో నూతన జంట పక్కనే ఒక వింత వ్యక్తి కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఎవరా మూడో వ్యక్తి?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలను 'అన్‌సీన్ ఫ్రెండ్' అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఈ వ్యక్తి కొన్ని చోట్ల మంత్రాలు చదువుతున్నట్లు, మరికొన్ని చోట్ల నూతన జంటను ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.పెళ్లి తర్వాత విజయ్, రష్మికలు వెళ్తున్న వింటేజ్ కారులో కూడా ఈ వ్యక్తి వారి మధ్యలోనే కూర్చుని ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అసలు విషయం ఏంటంటే..
ఈ 'అన్‌సీన్ ఫ్రెండ్' తన అద్భుతమైన ఫోటోషాప్ నైపుణ్యంతో సెలబ్రిటీల ఫోటోల్లో తాను కూడా ఉన్నట్లు క్రియేట్ చేస్తూ ఫన్నీ పోస్ట్‌లు పెడుతుంటారు. విజయ్-రష్మిక పెళ్లి ఫోటోల్లో కూడా అలాగే డిజిటల్ ఎడిటింగ్ ద్వారా తనను తాను జొప్పించి, సరదాగా అభినందనలు తెలిపారు.
వివాహం అనంతరం రష్మిక తన భర్త విజయ్ గురించి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. "నా భర్త విజయ్ దేవరకొండ నాకు నిజమైన ప్రేమ, శాంతి అంటే ఏంటో నేర్పించారు. నా కలలకు ధైర్యాన్ని ఇచ్చి, నన్ను ఎప్పుడూ నమ్మారు. ఆయన భార్య కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ప్రతి విజయం, ఆనందం ఇప్పుడు ఆయనతో పంచుకోవడం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది" అని రాసుకొచ్చింది.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "అసలు ఆ కారులో అతనికి చోటు ఎలా దొరికింది?" అని కొందరు సరదాగా కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఎడిటింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి 'విరోష్' పెళ్లి ఫోటోలు ఈ మూడో వ్యక్తి పుణ్యమా అని మరింత వైరల్ అయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bujji Bahubali In New York City: సాధారణంగా పుట్టే శిశువులు కేవలం 2.5 నుంచి 3.5 కిలోల బరువు ఉంటారు.. అలాగే ఒక్కొక్కరికి కొన్ని సందర్భాల్లో 2.0 నుంచి 2.5 కిలోల బరువు ఉన్న శిశువులు కూడా జన్మిస్తూ ఉంటారు. కానీ న్యూయార్క్ లోని ఒక బలబీముడు జన్మించాడు. ఏకంగా 5.9 కిలోల బరువుతో పుట్టిన ఈ చిన్నారిని చూసి డాక్టర్లతో పాటు సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత బరువుతో జన్మించడం చూసి కొంతమంది ఇది అసాధ్యమని అంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలంటే మనం ఎప్పుడు తెలుసుకుందాం..
న్యూయార్క్‌లోని ఇతాకాలో ఉన్న కాయుగా మెడికల్ సెంటర్లో టెర్రికా, షాన్ అనే ఇద్దరు దంపతులకు ఈ జంబో బాబు జన్మించాడు. పుట్టినప్పుడే ఈ బాబు సాధారణ శిశువుల కంటే రెట్టింపు బరువుతో ఉండడంతో.. అతనికి నవజాత శిశువుల బట్టలు ఏమాత్రం సరిపోవటం లేదని వైద్యులు తెలిపారు.. ప్రస్తుతానికి ఈ బుజ్జి బాహుబలి కి ఆరు నెలల వయస్సు కలిగిన పిల్లల దుస్తులతో పాటు డైపర్లతోనే సరిపెట్టడం విశేషం.. ఈ బుజ్జి బాబు అందరూ శిశువులకంటే అద్భుతమైన శరీర ఆకృతిని కలిగి ఉన్నాడు.
అదే సమయంలో అదే ఆసుపత్రిలో మరో శిష్యు కూడా జన్మించింది. అయితే, ఆ శిశువు బరువు కేవలం 1.8 కిలోలు మాత్రమే ఉంది. ఈ ఇద్దరు శిశువులను పక్కపక్కనే పడుకోబెట్టి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. 5.9 కిలోల బరువు బాబుతో పాటు పక్కనే 1.8 కిలోల శిశువు చాలా చిన్నదిగా కనిపించడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కొంతమంది అయితే ఈ బాబుకు జంబో బాబు అని కూడా పేరు పెట్టారు.. ఇక మరికొంతమంది అయితే.. బాహుబలి బాబు అని పిలుస్తున్నారు.
Also Read: Iran-US War News: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు.. US నావల్ బేస్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడి!
బాబు బరువును చూసి అందరూ ఆశ్చర్య పోయినప్పటికీ చరిత్రలో ఇంతకంటే భారీ బరువుతో పుట్టిన శిశువులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రపంచ రికార్డు ప్రకారం 1955లో ఇటలీలో ఒక శిశువు ఏకంగా 9.97 కిలోల బరువుతో జన్మించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఇంతకంటే తక్కువ బరువున్న శిశువులు కూడా జన్మించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నమోదైన అత్యంత బరువైన శిశువుగా అదే కొనసాగుతూ వస్తోంది. ఏది ఏమైనా న్యూయార్క్‌లో పుట్టిన ఈ బుజ్జి బాహుబలి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అలాగే తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అధికారులు కూడా తెలిపారు.
Also Read: Iran-US War News: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు.. US నావల్ బేస్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Iran-US War Telugu News: ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా కూటమి మధ్య ఉద్రిక్తతలు చివరి దశకు చేరుకున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయిల్ ముందస్తు దాడులు ప్రారంభించగా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాండ్లు భారీ సైనిక చర్యలు ఉంటాయని ప్రకటించారు. ఈ పరిణామం లో మధ్య ప్రాచుర్యం మొత్తం యుద్ధక్షేత్రంగా మారింది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియక గందరగోళం ఏర్పడింది. అలాగే ఇప్పటికే మిడిల్ లిస్టులో కొన్ని దేశాల్లో యుద్ధ జ్వాలలు కూడా ప్రారంభమయ్యాయి.
తమ దేశంపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇరాన్ ప్రతీకార చర్యలు చేపట్టింది.. ఖతార్‌తో పాటు బహ్రెయిన్‌లోని అమెరికా నావికాదళ స్థావరాలను (US Naval Bases) లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను సంధించింది.. అయితే, దీనికి సంబంధించిన సమాచారం అధికారికంగా ఇంకా ఇరాన్ వెల్లడించలేదు. కానీ మిడిలిస్ట్ లోని కొన్ని వార్త సంస్థలు మాత్రం ఈ సమాచారాన్ని కొద్ది గంటల క్రితమే బయటికి వెల్లడించాయి..
ఖతార్‌లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ వైపు వచ్చిన మిస్సైల్స్‌ను రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇక బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై కూడా దాడికి ప్రయత్నం జరిగినట్లు సమాచారం.. ఇదిలా ఉంటే పరిస్థితి తీవ్రతను గమనించిన ఖతార్ పాలకులు తక్షణమే నేషనల్ ఎమర్జెన్సీ ని కూడా ప్రకటించారు. తదుపరి దాడులు జరిగే అవకాశం ఉందన్న నికావర్గాల హెచ్చరికలతో తమ వైమానిక మార్గం పూర్తిగా మూసివేసినట్లు ప్రకటించింది. అలాగే అమెరికా ఎంబసీలు తమ సిబ్బందిని సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఆదేశించింది.
మరోవైపు ఇరాన్ అను కేంద్రాలతో పాటు మిస్సైల్ తయారీ కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు దాడులు కొనసాగిస్తూ వస్తోంది. ఖతార్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతూ వస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన సరఫరా పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ఇప్పటికే క్రషింగ్ రిటాల్యుయేషన్ ఉంటుందని హెచ్చరించడంతో గల్ఫ్ దేశాలని హై అలర్ట్ లో ఉన్నాయి.
Also Read: రష్మిక టూ శ్రీలీల సౌత్ యంగ్ బ్యూటీలు ఏం చదువుకున్నారో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Anantapur Kajjikayalu Dispute News: అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా భూతగాదాలు, దొంగతనాల కేసులతో బిజీగా ఉండే పోలీసులకు, ఈసారి ఊహించని విధంగా 'కజ్జికాయల పంచాయితీ' ఎదురైంది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల కోసం ఒక ఇంటికి ముగ్గురు అల్లుళ్లు వచ్చారు. అత్తగారు ముగ్గురు అల్లుళ్లకు మర్యాదలు చేసే క్రమంలో జరిగిన ఒక చిన్న పొరపాటు పెద్ద వివాదానికి దారితీసింది.
అసలేం జరిగింది?
అత్తగారు చేసిన పిండివంటల్లో కజ్జికాయలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే, వడ్డించే సమయంలో పెద్దల్లుడు, రెండో అల్లుడికి కజ్జికాయలు పెట్టి, చిన్నల్లుడిని గమనించకుండా వదిలేశారు. దీనిని తీవ్ర అవమానంగా భావించిన చిన్నల్లుడు, "నాకు మాత్రం మర్యాద చేయరా? ఇదేం న్యాయం?" అంటూ అత్తగారితో వాగ్వాదానికి దిగాడు.
ఇంట్లో వాళ్లు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో, పరిస్థితి చేయి దాటిపోతోందని భయపడిన అత్తగారు ఏకంగా డయల్ 100కు ఫోన్ చేసి పోలీసుల సాయం కోరారు. సమాచారం అందుకున్న స్థానిక కానిస్టేబుల్ రాజగోపాల్ తక్షణమే ఆ ఇంటికి చేరుకున్నారు. అక్కడ చిన్నల్లుడు తన ఆవేదనను పోలీసుల ముందు వెళ్లగక్కాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న రాజగోపాల్ గారు.. చమత్కారంతో కూడిన చాకచక్యంతో సమస్యను పరిష్కరించారు:
ఇంట్లో ఉన్న కజ్జికాయలన్నింటినీ తెప్పించి, ముగ్గురు అల్లుళ్లకు సమానంగా వడ్డించి చిన్నల్లుడి కోపాన్ని చల్లార్చారు. అల్లుళ్లందరినీ సమానంగా చూడాలని అత్తగారికి, చిన్న చిన్న విషయాలకు గొడవ పడొద్దని అల్లుళ్లకు హితవు పలికారు.
పోలీస్ గ్రూప్‌లో వైరల్ అయిన సెల్ఫీ
సమస్య పరిష్కారమైన తర్వాత, ఆ ముగ్గురు అల్లుళ్లతో కలిసి కానిస్టేబుల్ రాజగోపాల్ ఒక సెల్ఫీ దిగారు. దానిని తన ఉన్నతాధికారుల వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తూ.. "చిన్నల్లుడికి కజ్జికాయలు పెట్టలేదట.. ఇప్పుడు అందరికీ సమానంగా పంచి సమస్యను సర్దిచేశాను" అని రిపోర్ట్ పంపారు. దీనిని చూసిన తోటి పోలీసులు నవ్వు ఆపుకోలేకపోయారు. "అంత కష్టపడి పంచావు కదా.. కనీసం నువ్వైనా ఒక కజ్జికాయ తిన్నావా రాజగోపాల్?" అంటూ సరదాగా కామెంట్లు చేశారు.
గంభీరమైన విధుల్లో ఉండే పోలీసులకు ఇలాంటి 'స్వీట్' కేసులు అప్పుడప్పుడు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంటాయి. ఏదేమైనా, చిన్నల్లుడి అలిక తీరడంతో ఆ కుటుంబంలో మళ్లీ పండుగ వెలుగులు నిండాయి.
Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ భారీ పెంపు? నెలకు రూ.12,500 వరకు పెరిగే అవకాశం..లెక్కలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung Galaxy M56 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సాంసంగ్ M సిరీస్ మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని మొబైల్స్ అయితే హాట్ కేకుల అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా Samsung Galaxy M56 5G మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా చాలా శక్తివంతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఈ మొబైల్ పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ వివరాలేంటో? ఏయే డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ Samsung Galaxy M56 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లోకి విడుదలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన 6.73 అంగుళాల Full HD+ Super AMOLED Plus డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి Corning Gorilla Glass Victus+ ప్రొటెక్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన Exynos 1480 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ చేయాలనే యువతకు ఎంతగానో సహాయపడుతుంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే ఇది ఆరేళ్లపాటు మేజర్ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ను అందిస్తుంది. దీంతోపాటు ఎన్నో రకాల సెక్యూరిటీ అప్డేట్లను కూడా కంపెనీ అందించబోతున్నట్లు క్లైమ్ చేసింది. ఇక ఈ మొబైల్ వెనుక భాగంలో OIS తో కూడిన మెయిన్ 50MP కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 8MP (అల్ట్రా వైడ్) + 2MP (మాక్రో) ట్రిపుల్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఫ్రంట్ భాగంలో 12MP సెల్ఫీ కెమెరా కూడా లభించడం విశేషం. ఇక ఇందులో కంపనీ ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్ వంటి గెలాక్సీ AI ఫీచర్లను కూడా అందిస్తోంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీ, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఇది రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. మొదటి స్టోరేజ్ వేరియంట్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కేవలం రూ.27,999తో లభిస్తోంది. ఇక రెండవ స్టోరేజ్ వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్‌తో రూ.30,999కే అందుబాటులో ఉంది. అయితే, స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని వినియోగిస్తే.. దీని బేస్ వేరియంట్ కేవలం రూ.20,070కే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర
దీనిపై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి దీనిని కొనుగోలు చేస్తే.. రూ.18,950 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఇక ఈ మొబైల్ కేవలం రూ.2 వేల లోపే ఈ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ బోనస్ అనేది తప్పకుండా మీరు ఎక్స్చేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vivo T4 Pro 5G Price Cut: మార్కెట్‌లో వివో మొబైల్స్‌కి కూడా అద్భుతమైన డిమాండ్ ఉంది.. ముఖ్యంగా గతంలో లాంచ్ అయిన Vivo T4 Pro 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపు ధరలకే లభిస్తుంది. ఇది ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉండడం వల్ల ఎక్కువగా యువత కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గేమింగ్ చేసే యువతైతే ఈ మొబైల్‌ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని సమాచారం. అయితే, ఇది పర్ఫామెన్స్ పరంగా చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఎక్కువగా విక్రయం అవుతున్నాయి. మీరు కూడా ఎప్పటినుంచో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? హోలీ సందర్భంగా దీనిపై అద్భుతమైన స్పెషల్ తీసుకుంటా అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో Vivo T4 Pro 5G మొబైల్ చాలా తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్ తో లభిస్తుంది.. ఇది 6.77 అంగుళాల FHD+ Quad Curved AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్, 5000 nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్టుతో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇది ఎండలో కూడా చాలా స్పష్టంగా కనిపించేందుకు అద్భుతమైన డిస్ప్లేన్ కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 7 Gen 4 (4nm) చిప్‌సెట్ ప్రాసెసర్‌తో లాంచ్ అయింది. అలాగే గేమింగ్ తో పాటు మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ Vivo T4 Pro 5G స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. దీంతోపాటు ఫ్రంట్ భాగంలో 32MP హై-రిజల్యూషన్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఎంతో ప్రత్యేకమైన 6500mAh భారీ బ్యాటరీ, 90W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది.. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అయితే, ఈ మొబైల్ వివిధ వేరియంట్ లలో అందుబాటులో ఉన్న.. బేస్ వేరియంట్ మాత్రం చాలా ప్రత్యేకమైన తగ్గింపుతో లభిస్తోంది.
ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ఇది పెద్ద అవకాశంగా భావించవచ్చు. Vivo T4 Pro 5G స్మార్ట్‌ఫోన్ (8GB + 128GB) వేరియంట్ ధర రూ.26,249 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, దీనిని బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు తో పాటు ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.2 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతోపాటు మరింత తగ్గింపు ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీ దగ్గర ఉన్న ఏదైనా పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్.. చేసి దీనిని కొనుగోలు చేస్తే ఏకంగా రూ.25 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ Vivo T4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.1,200 లోపే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijay Sangeetha Net Worth: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారనే వార్తలతో పాటు, వీరిద్దరి భారీ ఆస్తిపాస్తుల వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సుమారు 26 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విజయ్-సంగీత జంట విడిపోతుండటం అభిమానులను కలవరపెడుతోంది. చెన్నైలోని చెంగల్‌పట్టు కుటుంబ న్యాయస్థానంలో సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
విడాకులకు దారితీసిన కారణాలు
విజయ్ భార్య దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. 2021 ఏప్రిల్‌లో విజయ్‌కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని తెలిసిందని, ఇది తనను మానసిక క్షోభకు గురిచేసిందని సంగీత పేర్కొన్నారు. సదరు నటి విజయ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా ఆయన అభ్యంతరం చెప్పలేదని ఆరోపించారు. అలాగే 2021 నుండి విజయ్ కుటుంబానికి భావోద్వేగంగా దూరమయ్యారని, తామిద్దరం విడివిడిగా జీవిస్తున్నామని ఆమె వివరించారు.
ఎవరి సంపాదన ఎంత?
విజయ్, సంగీత ఇద్దరూ భారీ సంపదను కలిగి ఉన్నారు. నివేదికల ప్రకారం వీరి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. హీరో విజయ్ సినిమాల ద్వారా ప్రతి సినిమాకు రూ.120 కోట్లు అలాగే ప్రకటనలను కలుపుకొని మొత్తంగా రూ.600 కోట్ల సంపద నికర విలువ ఉంది. దీంతో పాటు హీరో విజయ్‌కు నీలంకరైలోని సముద్రతీర విలాసవంతమైన బంగ్లా ఉంది. మరోవైపు తన భార్య సంగీత సోర్నలింగం తన కుటుంబం నుంచి వ్యాపారాల ద్వారా ఆమెకు రూ.400 కోట్ల సంపద ఉంది. ఈమెకు లండన్, చెన్నైలో ఆస్తిపాస్తులు ఉన్నాయి.
ఉమ్మడి ఆస్తి విషయానికొస్తే.. వీరిద్దరి మొత్తం నికర విలువ దాదాపు రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా. ఆర్థికంగా విజయ్ పైచేయి సాధించినప్పటికీ, సంగీత కూడా శ్రీలంకకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె కావడంతో ఆమెకు స్వతంత్రంగా భారీ ఆస్తి ఉంది.
అభిమానిగా మొదలై.. భార్యగా మారి!
వీరి ప్రేమకథ ఒక సినిమాని తలపిస్తుంది. 1996లో 'పూవే ఉనక్కగా' సినిమా సక్సెస్ తర్వాత, విజయ్‌ను అభినందించడానికి లండన్ నుండి వచ్చిన ఒక అభిమానిగా సంగీత ఆయనను కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారి, 1999 ఆగస్టు 25న వారు వివాహం చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విజయ్ ఇటీవలే తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఈ కీలక సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఈ ఒడిదుడుకులు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న ఈ జంట, రూ.1,000 కోట్ల సంపద ఉన్నప్పటికీ, మనస్పర్థల కారణంగా విడిపోతుండటం విచారకరం.
Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ భారీ పెంపు? నెలకు రూ.12,500 వరకు పెరిగే అవకాశం..లెక్కలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Israel Attacks Iran: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. శనివారం ఉదయం ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు చేసినట్లు సమాచారం. టెహ్రాన్ లోని కీలక ప్రాంతాల్లో బాంబులు పేలినట్లు పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కార్యాలయం సమీపంలో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడులను ఇజ్రాయెల్ కూడా ధ్రువీకరించింది. తాము ఇరాన్ పై దాడులకు పాల్పడినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ పై దాడి చేసినట్లు సమాచారం వెలువడటంతో ప్రాంతీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ చర్య తర్వాత దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో పొగ మేఘాలు కమ్ముకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దాడి అనంతరం ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగించారు. ఇరాన్ ప్రతీకారంగా క్షిపణి దాడులకు దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ప్రజలను అప్రమత్తం చేయడానికి యుద్ధ అత్యవసర పరిస్థితిని అమల్లోకి తీసుకొచ్చారు. మరోవైపు టెహ్రాన్‌లో పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇరాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఈ పరిణామాలు జరుగుతున్న వేళ.. అమెరికా కూడా అప్రమత్తంగా ఉంది. యునైటేడ్ స్టేట్స్ ఇప్పటికే తన పౌరులను ఇజ్రాయెల్ విడిచిపెట్టాలని సూచించింది. జెరూసలేం లోని అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందికి కూడా భద్రతా కారణాల వల్ల వెంటనే వెళ్లిపోవాలని సూచించినట్లు సమాచారం. బెన్-గురియన్ విమానాశ్రయం నుంచి త్వరితగతిన ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
Also Read: Business Ideas: ఈ పంట వేస్తే డబ్బుతో పాటు పుణ్యం కూడా గ్యారెంటీ.. తక్కువ సమయంలోనే బిగ్ రిజల్ట్..!!
ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా-ఇరాన్ చర్చలు కొనసాగుతున్నప్పటికీ, స్పష్టమైన పరిష్కారం దిశగా ముందడుగు పడలేదు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు విఫలమైతే కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఇరాన్ నుంచి ప్రత్యక్ష దాడి జరిగితే అమెరికా కూడా ఈ ఘర్షణలోకి దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య పరిమిత ఘర్షణగా మిగిలిపోతుందా? లేక ప్రాంతీయ యుద్ధంగా విస్తరించి మధ్య ఆసియా మొత్తం అస్థిరతలోకి జారుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు విశ్లేషకులు ఇరాన్‌లో అంతర్గత ఒత్తిళ్లు పెరిగితే రాజకీయ వ్యవస్థపై కూడా ప్రభావం పడవచ్చని అభిప్రాయపడుతున్నారు.
#WATCH | Tehran, Iran | Israel has launched a preventative missile attack against Iran, the Israeli defence minister said; visuals of the aftermath of the strike in Iran as a plume of smoke billows into the sky
The U.S. participated in the (Iran) attack and was also carrying out… pic.twitter.com/tzfR1WnDhO
— ANI (@ANI) February 28, 2026
ప్రస్తుతం పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. ఒక చిన్న తప్పిదం కూడా పెద్ద యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ ప్రాంతంపై కన్నేసి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ భారీ పెంపు? నెలకు రూ.12,500 వరకు పెరిగే అవకాశం..లెక్కలు ఇవే!
EPS-95 Pension Hike Update: EPS 95 పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్‌ను పెంచాలనే డిమాండ్‌పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కార్మిక సంఘాల ఒత్తిడి, పార్లమెంటులో ప్రభుత్వ వివరణలు, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పెన్షన్ లెక్కలు ఎలా మారబోతున్నాయో వివరాలను తెలుసుకుందాం.
ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ రూ.1,000 ను రూ.9,000 కి పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. దీనిపై ప్రభుత్వం, ఉన్నత న్యాయస్థానాల నుండి అందుతున్న తాజా సమాచారం పెన్షనర్లలో ఆశలు రేకెత్తిస్తోంది.
పార్లమెంటులో ప్రభుత్వం ఏం చెప్పింది?
ఇటీవల లోక్‌సభలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పెన్షన్ పెంపుపై కీలక వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రూ.15,000 జీత పరిమితిపై యజమాని 8.33%, కేంద్రం 1.16% వాటా చెల్లిస్తున్నాయి. కనీస పెన్షన్‌ను 9 రెట్లు పెంచి రూ.9,000 చేయాలంటే పెన్షన్ ఫండ్‌పై భారీ భారం పడుతుంది. ఫండ్ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.
జీత పరిమితి సవరణే కీలకం
పెన్షన్ పెరగాలంటే EPFO జీత పరిమితి పెరగడం చాలా ముఖ్యం. 2014లో ఈ పరిమితిని రూ.6,500 నుండి రూ.15,000 కి పెంచారు. 2026 ప్రారంభంలో, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నాలుగు నెలల్లోపు EPFO జీత పరిమితిని సవరించాలని ఆదేశించింది. కొత్త కార్మిక కోడ్‌లు అమల్లోకి వస్తే, ఈ పరిమితి రూ.25,000 నుండి రూ.30,000 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రైవేట్ ఉద్యోగులకు కనీస జీత పరిమితి రూ.25,000 కు పెరిగితే, కనీస సర్వీస్ ఉన్న వారికి కూడా పెన్షన్ మూడు రెట్లు పెరిగి రూ.3,570 అవుతుంది. పూర్తి సర్వీస్ ఉన్న వారికి రూ.12,500 వరకు లభించే అవకాశం ఉంది.
ముఖ్య గమనిక: ఇవి ప్రస్తుత ప్రతిపాదనలు, కోర్టు ఆదేశాల ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జీత పరిమితిని సవరించిన తర్వాతే ఖచ్చితమైన వివరాలు వెల్లడవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Thalapathy Vijay Divorce Allegations: తమిళ సినీ పరిశ్రమలో (కోలీవుడ్) అత్యంత విషాదకరమైన, సంచలనాత్మక వార్త ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. స్టార్ హీరో, 'దళపతి' విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల అంశం మలుపులు తిరుగుతోంది. సంగీత కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో విజయ్‌పై చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి.
సుమారు 26 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత, విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఆమె విజయ్‌పై ఏడు తీవ్రమైన అభియోగాలను మోపారు. ముఖ్యంగా ఒక స్టార్ హీరోయిన్‌తో విజయ్‌కు ఉన్న సంబంధమే ఈ విడాకులకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నట్లు సమాచారం.
సంగీత మోపిన 7 కీలక అభియోగాలు?!
1) 2021 ఏప్రిల్‌లో విజయ్‌కు ఒక నటితో సంబంధం ఉందనే విషయం తనకు తెలిసిందని, ఆమెతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లారని సంగీత ఆరోపించారు.
2) తన తప్పును సరిదిద్దుకోమని కోరినప్పటికీ, విజయ్ ఆ నటితో సంబంధాన్ని కొనసాగిస్తూ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
3) భర్త వేరొకరితో సన్నిహితంగా ఉండటం వల్ల తాను, తన పిల్లలు సమాజంలో తలదించుకోవాల్సి వచ్చిందని, ఇది తనకు అపారమైన మానసిక బాధను కలిగించిందని తెలిపారు.
4) ఈ విషయంపై నిలదీసినందుకు తనను ఇంట్లోనే నిర్బంధించి, తన స్వేచ్ఛను హరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
5) ఇంటి ఖర్చుల విషయంలో, డబ్బు విషయంలో తనపై కఠినమైన ఆంక్షలు విధించారని ఆరోపించారు.
6) మాటలతో నిరంతరం వేధిస్తూ, అనవసరమైన గొడవలు పెట్టుకుంటూ తనను వేదనకు గురిచేశారని తెలిపారు.
7) గత రెండు సంవత్సరాలుగా విజయ్ తనతో కలిసి ఉండటం లేదని, వేరే నివాసంలో ఉంటున్నారని సంగీత తన పిటిషన్‌లో వివరించారు.
ఏప్రిల్ 20న కోర్టు విచారణ
ఈ ఆరోపణల నేపథ్యంలో చెంగల్పట్టు కోర్టు విజయ్‌కు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 20, 2026న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, సంగీత తన పిటిషన్‌లో ఆ నటి పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
అయితే విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న (TVK పార్టీ) కీలక సమయంలో ఇలాంటి వార్తలు రావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. విజయ్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని వారు సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు.
(గమనిక: ఈ సమాచారం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సోషల్ మీడియా, న్యూస్ కథనాల ఆధారంగా రూపొందించబడింది. దీనిపై అధికారికంగా విజయ్ లేదా ఆయన ప్రతినిధులు ఇంకా స్పందించాల్సి ఉంది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: AP Mission vatsalya scheme: ఏపీ ప్రభుత్వం తీపి కబురు..నెలనెలా వారి అకౌంట్లోకి రూ.1,750..అర్హతలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
