ప్రస్తుతం పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. ఒక చిన్న తప్పిదం కూడా పెద్ద యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ ప్రాంతంపై కన్నేసి ఉంది.

\n

Also Read:  Gold: ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలుదారు.. రష్యా  బంగారం మాస్టర్‌ ప్లాన్‌తో ప్రపంచదేశాల గుండెల్లో పెరిగిన దడ..!!  

\n

\n

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

\n","url":"https://pinewz.com/telugu/story/telangana/sangareddy-israel-iran-war-another-war-begins-will-the-islamic-state-in-iran-collapse-1772263023946","datePublished":"2026-02-28T07:17:04+05:30","dateModified":"2026-02-28T07:17:04+05:30"}

ప్రస్తుతం పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. ఒక చిన్న తప్పిదం కూడా పెద్ద యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ ప్రాంతంపై కన్నేసి ఉంది.

\n

Also Read:  Gold: ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలుదారు.. రష్యా  బంగారం మాస్టర్‌ ప్లాన్‌తో ప్రపంచదేశాల గుండెల్లో పెరిగిన దడ..!!  

\n

\n

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

\n","keywords":"news by pincode, pin news,local news, treading news, latest news, hyperlocal news sites, hyperlocal news app, best news app, local news in hindi, zee newz, ram mandir","image":{"@type":"ImageObject","url":"https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_700x400/public/2026/02/28/560399-isreal.jpg?itok=gyaiIfU9","height":900,"width":1200},"datePublished":"2026-02-28T07:17:04+05:30","dateModified":"2026-02-28T07:17:04+05:30","author":{"@type":"Person","name":"Bhoomi"},"publisher":{"@type":"Organization","name":"Hyper local PWA","logo":{"@type":"ImageObject","url":"https://images2.pinewz.com/images/logo-big.png","width":600,"height":60}}}

ప్రస్తుతం పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. ఒక చిన్న తప్పిదం కూడా పెద్ద యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ ప్రాంతంపై కన్నేసి ఉంది.

\n

Also Read:  Gold: ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలుదారు.. రష్యా  బంగారం మాస్టర్‌ ప్లాన్‌తో ప్రపంచదేశాల గుండెల్లో పెరిగిన దడ..!!  

\n

\n

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

\n","thumbnailUrl":"https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_700x400/public/2026/02/28/560399-isreal.jpg?itok=gyaiIfU9","uploadDate":"2026-02-28T07:17:03+05:30","dateModified":"2026-02-28T07:17:04+05:30","datePublished":"2026-02-28T07:17:04+05:30","contentUrl":"NOT AVAILABLE","url":"https://pinewz.com/telugu/story/telangana/sangareddy-israel-iran-war-another-war-begins-will-the-islamic-state-in-iran-collapse-1772263023946","isFamilyFriendly":"http://schema.org/True","requiresSubscription":"http://schema.org/False","inLanguage":"en-hi","publisher":{"@type":"Organization","name":"pinewz","url":"https://pinewz.com/","logo":{"@type":"ImageObject","url":"https://images2.pinewz.com/images/logo-big.png","width":"512","height":"512"}}}
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sangareddy502313
Israel-Iran War: మరో యుద్ధం మొదలు.. ఇరాన్‌లో ఇస్లామిక్‌ రాజ్యం కూలిపోతుందా?
BBhoomi
Feb 28, 2026 07:17:04
Lakshmapur, Telangana

Israel Attacks Iran: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. శనివారం ఉదయం ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు చేసినట్లు సమాచారం. టెహ్రాన్ లోని కీలక ప్రాంతాల్లో బాంబులు పేలినట్లు పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కార్యాలయం సమీపంలో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడులను ఇజ్రాయెల్ కూడా ధ్రువీకరించింది. తాము ఇరాన్ పై దాడులకు పాల్పడినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. 

మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ పై దాడి చేసినట్లు సమాచారం వెలువడటంతో ప్రాంతీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ చర్య తర్వాత దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో పొగ మేఘాలు కమ్ముకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దాడి అనంతరం ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగించారు. ఇరాన్ ప్రతీకారంగా క్షిపణి దాడులకు దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ప్రజలను అప్రమత్తం చేయడానికి యుద్ధ అత్యవసర పరిస్థితిని అమల్లోకి తీసుకొచ్చారు. మరోవైపు టెహ్రాన్‌లో పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇరాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఈ పరిణామాలు జరుగుతున్న వేళ.. అమెరికా కూడా అప్రమత్తంగా ఉంది. యునైటేడ్ స్టేట్స్  ఇప్పటికే తన పౌరులను ఇజ్రాయెల్ విడిచిపెట్టాలని సూచించింది. జెరూసలేం లోని అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందికి కూడా భద్రతా కారణాల వల్ల వెంటనే వెళ్లిపోవాలని సూచించినట్లు సమాచారం. బెన్-గురియన్ విమానాశ్రయం నుంచి త్వరితగతిన ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.

Also Read: Business Ideas: ఈ పంట వేస్తే డబ్బుతో పాటు పుణ్యం కూడా గ్యారెంటీ.. తక్కువ సమయంలోనే బిగ్ రిజల్ట్..!!  

ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా-ఇరాన్ చర్చలు కొనసాగుతున్నప్పటికీ, స్పష్టమైన పరిష్కారం దిశగా ముందడుగు పడలేదు. గతంలో అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు విఫలమైతే కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఇరాన్ నుంచి ప్రత్యక్ష దాడి జరిగితే అమెరికా కూడా ఈ ఘర్షణలోకి దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు.  ఇది కేవలం రెండు దేశాల మధ్య పరిమిత ఘర్షణగా మిగిలిపోతుందా? లేక ప్రాంతీయ యుద్ధంగా విస్తరించి మధ్య ఆసియా మొత్తం అస్థిరతలోకి జారుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు విశ్లేషకులు ఇరాన్‌లో అంతర్గత ఒత్తిళ్లు పెరిగితే రాజకీయ వ్యవస్థపై కూడా ప్రభావం పడవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. ఒక చిన్న తప్పిదం కూడా పెద్ద యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ ప్రాంతంపై కన్నేసి ఉంది.

Also Read:  Gold: ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలుదారు.. రష్యా  బంగారం మాస్టర్‌ ప్లాన్‌తో ప్రపంచదేశాల గుండెల్లో పెరిగిన దడ..!!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Feb 28, 2026 08:19:14
Anantapur, Andhra Pradesh:

Anantapur Kajjikayalu Dispute News: అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా భూతగాదాలు, దొంగతనాల కేసులతో బిజీగా ఉండే పోలీసులకు, ఈసారి ఊహించని విధంగా 'కజ్జికాయల పంచాయితీ' ఎదురైంది. 

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల కోసం ఒక ఇంటికి ముగ్గురు అల్లుళ్లు వచ్చారు. అత్తగారు ముగ్గురు అల్లుళ్లకు మర్యాదలు చేసే క్రమంలో జరిగిన ఒక చిన్న పొరపాటు పెద్ద వివాదానికి దారితీసింది.

అసలేం జరిగింది?
అత్తగారు చేసిన పిండివంటల్లో కజ్జికాయలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే, వడ్డించే సమయంలో పెద్దల్లుడు, రెండో అల్లుడికి కజ్జికాయలు పెట్టి, చిన్నల్లుడిని గమనించకుండా వదిలేశారు. దీనిని తీవ్ర అవమానంగా భావించిన చిన్నల్లుడు, "నాకు మాత్రం మర్యాద చేయరా? ఇదేం న్యాయం?" అంటూ అత్తగారితో వాగ్వాదానికి దిగాడు.

ఇంట్లో వాళ్లు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో, పరిస్థితి చేయి దాటిపోతోందని భయపడిన అత్తగారు ఏకంగా డయల్ 100కు ఫోన్ చేసి పోలీసుల సాయం కోరారు. సమాచారం అందుకున్న స్థానిక కానిస్టేబుల్ రాజగోపాల్ తక్షణమే ఆ ఇంటికి చేరుకున్నారు. అక్కడ చిన్నల్లుడు తన ఆవేదనను పోలీసుల ముందు వెళ్లగక్కాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న రాజగోపాల్‌ గారు.. చమత్కారంతో కూడిన చాకచక్యంతో సమస్యను పరిష్కరించారు:

ఇంట్లో ఉన్న కజ్జికాయలన్నింటినీ తెప్పించి, ముగ్గురు అల్లుళ్లకు సమానంగా వడ్డించి చిన్నల్లుడి కోపాన్ని చల్లార్చారు. అల్లుళ్లందరినీ సమానంగా చూడాలని అత్తగారికి, చిన్న చిన్న విషయాలకు గొడవ పడొద్దని అల్లుళ్లకు హితవు పలికారు.

పోలీస్ గ్రూప్‌లో వైరల్ అయిన సెల్ఫీ
సమస్య పరిష్కారమైన తర్వాత, ఆ ముగ్గురు అల్లుళ్లతో కలిసి కానిస్టేబుల్ రాజగోపాల్ ఒక సెల్ఫీ దిగారు. దానిని తన ఉన్నతాధికారుల వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తూ.. "చిన్నల్లుడికి కజ్జికాయలు పెట్టలేదట.. ఇప్పుడు అందరికీ సమానంగా పంచి సమస్యను సర్దిచేశాను" అని రిపోర్ట్ పంపారు. దీనిని చూసిన తోటి పోలీసులు నవ్వు ఆపుకోలేకపోయారు. "అంత కష్టపడి పంచావు కదా.. కనీసం నువ్వైనా ఒక కజ్జికాయ తిన్నావా రాజగోపాల్?" అంటూ సరదాగా కామెంట్లు చేశారు.

గంభీరమైన విధుల్లో ఉండే పోలీసులకు ఇలాంటి 'స్వీట్' కేసులు అప్పుడప్పుడు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంటాయి. ఏదేమైనా, చిన్నల్లుడి అలిక తీరడంతో ఆ కుటుంబంలో మళ్లీ పండుగ వెలుగులు నిండాయి.

Also Read: Sangeetha Vijay Net Worth: విజయ్ Vs సంగీత: కోట్ల రూపాయల సామ్రాజ్యం..విడాకుల వేళ వెలుగులోకి ఆసక్తికర విషయాలు!

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ భారీ పెంపు? నెలకు రూ.12,500 వరకు పెరిగే అవకాశం..లెక్కలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 28, 2026 07:59:49
Hyderabad, Telangana:

Samsung Galaxy M56 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సాంసంగ్ M సిరీస్ మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని మొబైల్స్ అయితే హాట్ కేకుల అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా Samsung Galaxy M56 5G మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా చాలా శక్తివంతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఈ మొబైల్ పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ వివరాలేంటో? ఏయే డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ Samsung Galaxy M56 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లోకి విడుదలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన 6.73 అంగుళాల Full HD+ Super AMOLED Plus డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి Corning Gorilla Glass Victus+  ప్రొటెక్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన Exynos 1480 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ చేయాలనే యువతకు ఎంతగానో సహాయపడుతుంది. 

ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే ఇది ఆరేళ్లపాటు మేజర్ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ను అందిస్తుంది. దీంతోపాటు ఎన్నో రకాల సెక్యూరిటీ అప్డేట్లను కూడా కంపెనీ అందించబోతున్నట్లు క్లైమ్ చేసింది. ఇక ఈ మొబైల్ వెనుక భాగంలో OIS తో కూడిన మెయిన్ 50MP కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 8MP (అల్ట్రా వైడ్) + 2MP (మాక్రో) ట్రిపుల్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఫ్రంట్ భాగంలో 12MP సెల్ఫీ కెమెరా కూడా లభించడం విశేషం. ఇక ఇందులో కంపనీ ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్ వంటి గెలాక్సీ AI ఫీచర్లను కూడా అందిస్తోంది.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీ, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఇది రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. మొదటి స్టోరేజ్ వేరియంట్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కేవలం రూ.27,999తో లభిస్తోంది. ఇక రెండవ స్టోరేజ్ వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్‌తో రూ.30,999కే అందుబాటులో ఉంది. అయితే, స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని వినియోగిస్తే.. దీని బేస్ వేరియంట్ కేవలం రూ.20,070కే పొందవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర

దీనిపై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి దీనిని కొనుగోలు చేస్తే.. రూ.18,950 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఇక ఈ మొబైల్ కేవలం రూ.2 వేల లోపే ఈ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ బోనస్ అనేది తప్పకుండా మీరు ఎక్స్చేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 28, 2026 07:41:49
Hyderabad, Telangana:

Vivo T4 Pro 5G Price Cut: మార్కెట్‌లో వివో మొబైల్స్‌కి కూడా అద్భుతమైన డిమాండ్ ఉంది.. ముఖ్యంగా గతంలో లాంచ్ అయిన Vivo T4 Pro 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపు ధరలకే లభిస్తుంది. ఇది ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉండడం వల్ల ఎక్కువగా యువత కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గేమింగ్ చేసే యువతైతే ఈ మొబైల్‌ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని సమాచారం. అయితే, ఇది పర్ఫామెన్స్ పరంగా చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఎక్కువగా విక్రయం అవుతున్నాయి. మీరు కూడా ఎప్పటినుంచో ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? హోలీ సందర్భంగా దీనిపై అద్భుతమైన స్పెషల్ తీసుకుంటా అందుబాటులో ఉన్నాయి. 

ఫ్లిప్‌కార్ట్‌లో Vivo T4 Pro 5G మొబైల్ చాలా తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్ తో లభిస్తుంది.. ఇది 6.77 అంగుళాల FHD+ Quad Curved AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్, 5000 nits పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్టుతో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇది ఎండలో కూడా చాలా స్పష్టంగా కనిపించేందుకు అద్భుతమైన డిస్ప్లేన్ కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 7 Gen 4 (4nm) చిప్‌సెట్ ప్రాసెసర్‌తో లాంచ్ అయింది. అలాగే గేమింగ్ తో పాటు మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ Vivo T4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. దీంతోపాటు ఫ్రంట్ భాగంలో 32MP హై-రిజల్యూషన్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఎంతో ప్రత్యేకమైన 6500mAh భారీ బ్యాటరీ, 90W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది.. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అయితే, ఈ మొబైల్ వివిధ వేరియంట్ లలో అందుబాటులో ఉన్న.. బేస్ వేరియంట్ మాత్రం చాలా ప్రత్యేకమైన తగ్గింపుతో లభిస్తోంది. 

ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ఇది పెద్ద అవకాశంగా భావించవచ్చు. Vivo T4 Pro 5G స్మార్ట్‌ఫోన్  (8GB + 128GB) వేరియంట్ ధర రూ.26,249  నుంచి ప్రారంభమవుతుంది. అయితే, దీనిని బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధానం యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు తో పాటు ఫ్లిప్‌కార్ట్‌ ఎస్బిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.2 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతోపాటు మరింత తగ్గింపు ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలంటే ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీ దగ్గర ఉన్న ఏదైనా పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్‌.. చేసి దీనిని కొనుగోలు చేస్తే ఏకంగా రూ.25 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ Vivo T4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.1,200 లోపే పొందవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 28, 2026 07:34:41
Hyderabad, Telangana:

Vijay Sangeetha Net Worth: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారనే వార్తలతో పాటు, వీరిద్దరి భారీ ఆస్తిపాస్తుల వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సుమారు 26 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విజయ్-సంగీత జంట విడిపోతుండటం అభిమానులను కలవరపెడుతోంది. చెన్నైలోని చెంగల్‌పట్టు కుటుంబ న్యాయస్థానంలో సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

విడాకులకు దారితీసిన కారణాలు 
విజయ్ భార్య దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. 2021 ఏప్రిల్‌లో విజయ్‌కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని తెలిసిందని, ఇది తనను మానసిక క్షోభకు గురిచేసిందని సంగీత పేర్కొన్నారు. సదరు నటి విజయ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా ఆయన అభ్యంతరం చెప్పలేదని ఆరోపించారు. అలాగే 2021 నుండి విజయ్ కుటుంబానికి భావోద్వేగంగా దూరమయ్యారని, తామిద్దరం విడివిడిగా జీవిస్తున్నామని ఆమె వివరించారు.

ఎవరి సంపాదన ఎంత?
విజయ్, సంగీత ఇద్దరూ భారీ సంపదను కలిగి ఉన్నారు. నివేదికల ప్రకారం వీరి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. హీరో విజయ్ సినిమాల ద్వారా ప్రతి సినిమాకు రూ.120 కోట్లు అలాగే ప్రకటనలను కలుపుకొని మొత్తంగా రూ.600 కోట్ల సంపద నికర విలువ ఉంది. దీంతో పాటు హీరో విజయ్‌కు నీలంకరైలోని సముద్రతీర విలాసవంతమైన బంగ్లా ఉంది. మరోవైపు తన భార్య సంగీత సోర్నలింగం తన కుటుంబం నుంచి వ్యాపారాల ద్వారా ఆమెకు రూ.400 కోట్ల సంపద ఉంది. ఈమెకు లండన్, చెన్నైలో ఆస్తిపాస్తులు ఉన్నాయి.

ఉమ్మడి ఆస్తి విషయానికొస్తే.. వీరిద్దరి మొత్తం నికర విలువ దాదాపు రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా. ఆర్థికంగా విజయ్ పైచేయి సాధించినప్పటికీ, సంగీత కూడా శ్రీలంకకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె కావడంతో ఆమెకు స్వతంత్రంగా భారీ ఆస్తి ఉంది.

అభిమానిగా మొదలై.. భార్యగా మారి!
వీరి ప్రేమకథ ఒక సినిమాని తలపిస్తుంది. 1996లో 'పూవే ఉనక్కగా' సినిమా సక్సెస్ తర్వాత, విజయ్‌ను అభినందించడానికి లండన్ నుండి వచ్చిన ఒక అభిమానిగా సంగీత ఆయనను కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారి, 1999 ఆగస్టు 25న వారు వివాహం చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

విజయ్ ఇటీవలే తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఈ కీలక సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఈ ఒడిదుడుకులు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న ఈ జంట, రూ.1,000 కోట్ల సంపద ఉన్నప్పటికీ, మనస్పర్థల కారణంగా విడిపోతుండటం విచారకరం.

Also Read: Thalapathy Vijay Divorce: విడాకుల వేళ హీరో విజయ్‌పై 7 ప్రధాన అభియోగాలు.."ఆ హీరోయిన్ కోసమే తెగించి ఈ పని చేశాడు"?

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ భారీ పెంపు? నెలకు రూ.12,500 వరకు పెరిగే అవకాశం..లెక్కలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 28, 2026 07:05:06
Hyderabad, Telangana:

EPS-95 Pension Hike Update: EPS 95 పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్‌ను పెంచాలనే డిమాండ్‌పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కార్మిక సంఘాల ఒత్తిడి, పార్లమెంటులో ప్రభుత్వ వివరణలు, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పెన్షన్ లెక్కలు ఎలా మారబోతున్నాయో వివరాలను తెలుసుకుందాం.

ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ రూ.1,000 ను రూ.9,000 కి పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. దీనిపై ప్రభుత్వం, ఉన్నత న్యాయస్థానాల నుండి అందుతున్న తాజా సమాచారం పెన్షనర్లలో ఆశలు రేకెత్తిస్తోంది.

పార్లమెంటులో ప్రభుత్వం ఏం చెప్పింది?
ఇటీవల లోక్‌సభలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పెన్షన్ పెంపుపై కీలక వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రూ.15,000 జీత పరిమితిపై యజమాని 8.33%, కేంద్రం 1.16% వాటా చెల్లిస్తున్నాయి. కనీస పెన్షన్‌ను 9 రెట్లు పెంచి రూ.9,000 చేయాలంటే పెన్షన్ ఫండ్‌పై భారీ భారం పడుతుంది. ఫండ్ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

జీత పరిమితి సవరణే కీలకం
పెన్షన్ పెరగాలంటే EPFO జీత పరిమితి పెరగడం చాలా ముఖ్యం. 2014లో ఈ పరిమితిని రూ.6,500 నుండి రూ.15,000 కి పెంచారు. 2026 ప్రారంభంలో, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నాలుగు నెలల్లోపు EPFO జీత పరిమితిని సవరించాలని ఆదేశించింది. కొత్త కార్మిక కోడ్‌లు అమల్లోకి వస్తే, ఈ పరిమితి రూ.25,000 నుండి రూ.30,000 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రైవేట్ ఉద్యోగులకు కనీస జీత పరిమితి రూ.25,000 కు పెరిగితే, కనీస సర్వీస్ ఉన్న వారికి కూడా పెన్షన్ మూడు రెట్లు పెరిగి రూ.3,570 అవుతుంది. పూర్తి సర్వీస్ ఉన్న వారికి రూ.12,500 వరకు లభించే అవకాశం ఉంది.

ముఖ్య గమనిక: ఇవి ప్రస్తుత ప్రతిపాదనలు, కోర్టు ఆదేశాల ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జీత పరిమితిని సవరించిన తర్వాతే ఖచ్చితమైన వివరాలు వెల్లడవుతాయి.

ALso Read: Thalapathy Vijay Divorce: విడాకుల వేళ హీరో విజయ్‌పై 7 ప్రధాన అభియోగాలు.."ఆ హీరోయిన్ కోసమే తెగించి ఈ పని చేశాడు"?

Also Read: Lunar Eclipse Baby Birth: చంద్రగ్రహణ సమయంలో పుడితే అదృష్టమా? వారి వ్యక్తిత్వం, భవిష్యత్తు ఎలా ఉంటుందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 28, 2026 06:31:50
Hyderabad, Telangana:

Thalapathy Vijay Divorce Allegations: తమిళ సినీ పరిశ్రమలో (కోలీవుడ్) అత్యంత విషాదకరమైన, సంచలనాత్మక వార్త ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. స్టార్ హీరో, 'దళపతి' విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల అంశం మలుపులు తిరుగుతోంది. సంగీత కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో విజయ్‌పై చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. 

సుమారు 26 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత, విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఆమె విజయ్‌పై ఏడు తీవ్రమైన అభియోగాలను మోపారు. ముఖ్యంగా ఒక స్టార్ హీరోయిన్‌తో విజయ్‌కు ఉన్న సంబంధమే ఈ విడాకులకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నట్లు సమాచారం.

సంగీత మోపిన 7 కీలక అభియోగాలు?!
1) 2021 ఏప్రిల్‌లో విజయ్‌కు ఒక నటితో సంబంధం ఉందనే విషయం తనకు తెలిసిందని, ఆమెతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లారని సంగీత ఆరోపించారు.

2) తన తప్పును సరిదిద్దుకోమని కోరినప్పటికీ, విజయ్ ఆ నటితో సంబంధాన్ని కొనసాగిస్తూ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

3) భర్త వేరొకరితో సన్నిహితంగా ఉండటం వల్ల తాను, తన పిల్లలు సమాజంలో తలదించుకోవాల్సి వచ్చిందని, ఇది తనకు అపారమైన మానసిక బాధను కలిగించిందని తెలిపారు.

4) ఈ విషయంపై నిలదీసినందుకు తనను ఇంట్లోనే నిర్బంధించి, తన స్వేచ్ఛను హరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

5) ఇంటి ఖర్చుల విషయంలో, డబ్బు విషయంలో తనపై కఠినమైన ఆంక్షలు విధించారని ఆరోపించారు.

6) మాటలతో నిరంతరం వేధిస్తూ, అనవసరమైన గొడవలు పెట్టుకుంటూ తనను వేదనకు గురిచేశారని తెలిపారు.

7) గత రెండు సంవత్సరాలుగా విజయ్ తనతో కలిసి ఉండటం లేదని, వేరే నివాసంలో ఉంటున్నారని సంగీత తన పిటిషన్‌లో వివరించారు.

ఏప్రిల్ 20న కోర్టు విచారణ
ఈ ఆరోపణల నేపథ్యంలో చెంగల్పట్టు కోర్టు విజయ్‌కు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 20, 2026న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, సంగీత తన పిటిషన్‌లో ఆ నటి పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

అయితే విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న (TVK పార్టీ) కీలక సమయంలో ఇలాంటి వార్తలు రావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. విజయ్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని వారు సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు.

(గమనిక: ఈ సమాచారం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సోషల్ మీడియా, న్యూస్ కథనాల ఆధారంగా రూపొందించబడింది. దీనిపై అధికారికంగా విజయ్ లేదా ఆయన ప్రతినిధులు ఇంకా స్పందించాల్సి ఉంది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Lunar Eclipse Baby Birth: చంద్రగ్రహణ సమయంలో పుడితే అదృష్టమా? వారి వ్యక్తిత్వం, భవిష్యత్తు ఎలా ఉంటుందంటే?

Also Read: AP Mission vatsalya scheme: ఏపీ ప్రభుత్వం తీపి కబురు..నెలనెలా వారి అకౌంట్లోకి రూ.1,750..అర్హతలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 28, 2026 06:04:50
Hyderabad, Telangana:

Baby Born On Lunar Eclipse Day: భారతీయ సంస్కృతిలో, జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా చంద్రగ్రహణ సమయంలో జన్మించిన పిల్లల భవిష్యత్తు, వారి స్వభావం ఎలా ఉంటుందనే విషయంపై అనేక ఆసక్తికరమైన నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. మార్చి 3, 2026న సంభవించబోయే చంద్రగ్రహణం నేపథ్యంలో, ఈ సమయంలో జన్మించే శిశువుల జీవితంపై జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణను తెలుసుకుందాం.

మార్చి 3న ఫాల్గుణ పౌర్ణమి నాడు సింహ రాశి, పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. దాదాపు 3 గంటల 27 నిమిషాల పాటు సాగే ఈ సుదీర్ఘ గ్రహణ సమయంలో జన్మించే పిల్లల గురించి జ్యోతిష్య పండితులు చెబుతున్న విశేషాలు ఇవే.

సున్నితమైన మనస్తత్వం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు మనస్సుకు కారకుడు. గ్రహణ సమయంలో చంద్రుని ప్రభావం వల్ల ఆ సమయంలో జన్మించే పిల్లలు అత్యంత భావోద్వేగ, సున్నిత స్వభావం కలవారిగా ఉంటారు. వీరు ఇతరుల బాధలను త్వరగా అర్థం చేసుకుంటారు. నమ్మకానికి మారుపేరుగా నిలుస్తారు, ఎవరినీ అంత సులభంగా మోసం చేయరు.

అపారమైన మేధస్సు
చంద్రగ్రహణ సమయంలో పుట్టిన పిల్లలు అసాధారణమైన ఆలోచనా శక్తిని కలిగి ఉంటారని నమ్మకం. పరిశోధనలు, సృజనాత్మక రంగాలు, లోతైన విశ్లేషణ అవసరమైన వృత్తుల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. తమ పట్టుదలతో సమాజంలో ఉన్నత స్థానాన్ని, ప్రత్యేక గుర్తింపును పొందుతారు. వీరు సాధారణంగా అదృష్టవంతులుగా పరిగణిస్తారు.

వీరు కొన్ని రకాల మానసిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడం లేదా చిన్న విషయాలకే ఆందోళన చెందడం వంటివి జరగవచ్చు. వీరికి చిన్నప్పటి నుండి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సానుకూల వాతావరణం లభిస్తే ప్రపంచ స్థాయిలో గొప్ప విజయాలను సాధించగలరు.

గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన జాగ్రత్తలు
గ్రహణ కిరణాలు గర్భస్థ శిశువుపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే నమ్మకంతో మన పెద్దలు కొన్ని నియమాలు సూచించారు. గ్రహణ సమయంలో గర్భిణీలు నేరుగా కిరణాల బారిన పడకుండా ఇంట్లోనే ఉండటం మంచిది. కత్తెర్లు, సూదులు వంటి పదునైన వస్తువులను వాడకూడదని చెబుతారు. ఈ సమయంలో దైవ ప్రార్థన లేదా ధ్యానం చేయడం వల్ల ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుందని నమ్మకం.

చంద్రగ్రహణ సమయంలో జన్మించడం అనేది ఒకరి వ్యక్తిత్వంపై కొంత ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నప్పటికీ.. పిల్లల భవిష్యత్తు అనేది ప్రధానంగా వారికి అందే విద్య, పెంపకం, వారు పెరిగే వాతావరణంపైనే ఆధారపడి ఉంటుంది.

Also Read:  Nara Lokesh Janhvi Kapoor: నారా లోకేష్ చేసిన పనికి NTR హీరోయిన్ జాన్వీ కపూర్ ఫిదా..గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్!

Also Read: Ayesha Meera Case: 18 ఏళ్ల తర్వాత ముగియని పోరాటం..తెనాలిలో ఆయేషా మీరా శరీర అవశేషాల ఖననం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 28, 2026 05:15:56
Hyderabad, Telangana:

Holi Lucky Zoidac Telugu: మార్చికి సంబంధించిన పౌర్ణమి మూడవ తేదీన వచ్చింది. దీనినే హోలీకా పౌర్ణమి కూడా అంటారు. పౌర్ణమి తెల్లవారి రోజే హోలీ పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ పండగకి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకోబోతోంది. ఎందుకంటే సూర్యుడితో పాటు బుధుడి కలయిక కుంభరాశిలో జరిగే.. ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా సూర్యుడు శుక్రుడి కలయిక జరిగి ఎంతో ప్రత్యేకమైన శుక్రాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది. దీంతో ఈ హోలీ పండుగ రోజు నుంచి కొన్ని రాశుల వారికి అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా.. ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయి. సమాజంలో ఊహించని స్థాయిలో గౌరవం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పోలిక పౌర్ణమి నుంచి కొన్ని రాశుల వారు అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు.

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేషరాశి 
మేష రాశి వారికి ఈ రెండు శక్తివంతమైన రాజయోగాల ప్రభావంతో ఆదాయంతో పాటు విపరీతమైన లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు కలగడమే కాకుండా.. కెరీర్ పరంగా కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న అన్ని రకాల పనులు ఎంతో సులభంగా పూర్తవుతాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో విజయాలు సాధించగలుగుతారు.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఐదవ స్థానంలో ఈ రెండు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీనివల్ల తులా రాశి వారికి ప్రేమతో పాటు పిల్లలు, విద్యా సంబంధిత విషయాల్లో మేలు జరుగుతుంది. అలాగే ఈ సమయంలో పిల్లలకు సంబంధించిన అంశాల్లో కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటారు. ప్రేమ జీవితం అద్భుతంగా మెరుగుపడడమే కాకుండా.. వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడవచ్చు.. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది.

మకర రాశి 
మకర రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా వీరికి కమ్యూనికేషన్ నైపుణ్యం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో మంచి మెరుగుదల కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పదోన్నతులు లేదా కొత్త ఒప్పందాల సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని రంగాల్లో పెట్టిన పెట్టుబడులు భారీ మొత్తంలో తిరిగి రాబోతున్నాయి. కుటుంబంలో కూడా ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.

బుధాదిత్య, శుక్రాదిత్య  రాజయోగాల ప్రాముఖ్యత..
జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండింటిని చాలా శక్తివంతమైనవి, శుభప్రదమైనవిగా భావిస్తారు. ఈ యోగాలు జాతకంలో శుభ స్థానంలో ఉన్న రాశుల వారికి తెలివితేటలతో పాటు సంపాదన వృత్తిపరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆకర్షణ కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో ఘననీయమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అలాగే వీరికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం పెరగడమే కాకుండా భౌతిక సౌకర్యంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని పొందగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
BBhoomi
Feb 28, 2026 04:57:28
Lakshmapur, Telangana:

China Currency Explainer: చైనా కరెన్సీ యువాన్ గత కొన్ని నెలలుగా గణనీయంగా బలపడుతూ అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో చర్చకు దారి తీసింది. చైనా రికార్డు స్థాయి వాణిజ్య మిగులు నమోదు చేయడంతో..  ఎగుమతిదారులు భారీగా డాలర్లను మార్కెట్లో విక్రయించారు. డాలర్ల సరఫరా పెరగడంతో యువాన్ సహజంగానే బలపడింది. అయితే ఒక దశలో ఆన్‌షోర్ మార్కెట్‌లో యువాన్ దాదాపు మూడు సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకడం గమనార్హం.

అయితే కరెన్సీ బలపడటం అనేది ప్రతి సందర్భంలోనూ ఆర్థిక వ్యవస్థకు లాభదాయకం కాదు. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఎగుమతులపై ఆధారపడుతుంది. యువాన్ విలువ అధికమైతే, అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఉత్పత్తులు ఖరీదైనవిగా మారి పోటీ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో People's Bank of China (PBOC) వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. విదేశీ మారక ద్రవ్య ఫార్వార్డ్ ఒప్పందాలపై అమలులో ఉన్న 20 శాతం రిస్క్ రిజర్వ్ నిబంధనను సున్నాకు తగ్గించింది.

ఈ నిర్ణయం సాంకేతికంగా కనిపించినప్పటికీ.. దాని ప్రభావం విస్తృతంగా ఉంది. ఈ మార్పు వల్ల ఆర్థిక సంస్థలకు డాలర్లు కొనుగోలు చేయడం మరింత సులభమైంది. ఫలితంగా డాలర్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఏర్పడింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆఫ్‌షోర్ యువాన్ స్వల్ప బలహీనతను చవిచూసింది. మార్కెట్ దీనిని స్పష్టమైన సంకేతంగా అర్థం చేసుకుంది. చైనా యువాన్ వేగంగా పెరగడం కంటే స్థిరంగా, నియంత్రితంగా కదలాలని కోరుకుంటోంది.

చైనా తీసుకున్న ఈ చర్య గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపింది. చైనా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండటంతో.. దాని కరెన్సీ విధానంలో మార్పులు ప్రపంచ ఫారెక్స్ మార్కెట్లలో చురుకుదనాన్ని పెంచాయి. డాలర్ బలపడుతుందనే అంచనాలు పెరిగాయి. డాలర్ బలపడితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.  విదేశీ పెట్టుబడుల ప్రవాహాలు కూడా మారే అవకాశం ఉంటుంది.

Also Read: Business Ideas: ఈ పంట వేస్తే డబ్బుతో పాటు పుణ్యం కూడా గ్యారెంటీ.. తక్కువ సమయంలోనే బిగ్ రిజల్ట్..!!  

అంతేకాదు.. చైనా లోహాలు, ఇంధన వనరుల అతిపెద్ద వినియోగదారుగా ఉండటంతో కమోడిటీ మార్కెట్లపై కూడా ప్రభావం పడుతుంది. కరెన్సీ మార్పుల కారణంగా ధరల్లో అస్థిరత పెరిగే ఛాన్స్ లేకపోలేదు. పెట్టుబడిదారుల సెంటిమెంట్ కూడా మారుతుంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థలు తీసుకునే విధాన నిర్ణయాలు గ్లోబల్ నిధుల దిశను ప్రభావితం చేస్తాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ చర్య యువాన్ బలహీనతపై భయం వల్ల తీసుకున్నది కాదు. అతివేగంగా పెరుగుతున్న ర్యాలీని నియంత్రించడానికి, అస్థిరతను తగ్గించడానికి ఇది ఒక సమతుల్య చర్య అని చెబుతున్నారు. చైనా ఇప్పుడు కరెన్సీ స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తోందని ఇది సూచిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా ప్రాధాన్యం దృష్ట్యా, అక్కడి చిన్న మార్పులు కూడా అంతర్జాతీయ మార్కెట్లలో పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయని వెల్లడించారు.

Also Read:  Gold: ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలుదారు.. రష్యా  బంగారం మాస్టర్‌ ప్లాన్‌తో ప్రపంచదేశాల గుండెల్లో పెరిగిన దడ..!!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
comment0
Report
BBhoomi
Feb 28, 2026 04:35:03
Lakshmapur, Telangana:

Fact Check: ఆన్ లైన్ ద్వారా వార్తలు తెలుసుకునేవారి సంఖ్య రోజురోజూకు పెరుగుతోంది. ప్రపంచంలో ఏ మూలన..ఏం జరిగినా సోషల్ మీడియాలో సెకన్లలో వైరల్ అవుతుంటాయి. ఇదే సమయంలో ఫేక్ న్యూస్ కూడా ఎక్కువగా సర్క్యూలేట్ అవుతున్నాయి. ఆ వార్తలు నిజమా కాదా అని ఆలోచించకుండానే వాటిని షేర్ చేస్తుంటారు చాలా మంది. ఏఐ టెక్నాలజీతో వీడియోలు, ఆడియోలు కూడా ఎడిట్ చేసి.. వాస్తవ విరుద్ధ కథనాలు వాటికి జోడించి వైరల్ చేస్తున్నారు. తాజాగా ఆర్బిఐ పాత నాణేలకు రూ. 34లక్షల నగదు ఇస్తుందంటూ సోషల్ మీడియాలో ఆర్బిఐకి సంబంధించిన ఓ లేఖ వైరల్ అవుతోంది.  అలా వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత ..అసలు వాస్తవం ఏంటి..తెలుసుకుందాం. 

సోషల్ మీడియా వేదికలపై ఇటీవల ఒక నకిలీ లేఖ విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ లేఖలో పాత నాణేలను ఇచ్చినట్లయితే రూ.34 లక్షల వరకు నగదు అందిస్తామని పేర్కొంటూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రకటన పూర్తిగా మోసపూరితమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ లేఖకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.

వైరల్ అవుతున్న ఆ లేఖలో ముందుగా రూ.700 ఫారమ్ ఫీజు, అదనంగా రూ.12,150 డెలివరీ ఛార్జీలు చెల్లించాలని సూచిస్తున్నారు. ఈ మొత్తం చెల్లించిన తరువాతే రూ.34 లక్షల నగదు అందిస్తామని చెప్పడం ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా కుంభకోణమని, ఇలాంటి వాగ్దానాలను నమ్మరాదని కేంద్రం హెచ్చరించింది.

ఆర్బీఐ ఎప్పుడూ వ్యక్తుల నుండి ఫీజులు వసూలు చేయడం లేదా వ్యక్తిగత వివరాలు కోరుతూ ఈ-మెయిల్లు, లేఖలు పంపడం చేయదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ పేరును ఉపయోగించి కొంతమంది మోసగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపింది. ముఖ్యంగా త్వరగా డబ్బు వస్తుందనే ఆశ చూపించడం ద్వారా సామాన్యులను వలలో వేయడం ఈ స్కామ్‌ల లక్షణమని అధికారులు పేర్కొన్నారు.

Also Read: Business Ideas: ఈ పంట వేస్తే డబ్బుతో పాటు పుణ్యం కూడా గ్యారెంటీ.. తక్కువ సమయంలోనే బిగ్ రిజల్ట్..!!  

ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో లేదా మెసేజ్‌ల ద్వారా వచ్చే ఆఫర్లను వెంటనే నమ్మకుండా, అధికారిక వెబ్‌సైట్లు లేదా సంబంధిత సంస్థల ప్రకటనలను పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయడం, తెలియని ఖాతాలకు డబ్బు బదిలీ చేయడం, వ్యక్తిగత బ్యాంక్ వివరాలు పంచుకోవడం వంటి చర్యలను పూర్తిగా నివారించాలి.

ముఖ్యంగా అధిక లాభాలు లేదా భారీ నగదు వాగ్దానాలు చేసే ప్రకటనల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ప్రభుత్వ సంస్థల పేర్లు వినిపించినంత మాత్రాన అవి నిజమని భావించకూడదు. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించడం ఉత్తమ మార్గం. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి సైబర్ మోసాలను అరికట్టడం సాధ్యమవుతుంది.

Also Read:  Gold: ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలుదారు.. రష్యా  బంగారం మాస్టర్‌ ప్లాన్‌తో ప్రపంచదేశాల గుండెల్లో పెరిగిన దడ..!!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 03:46:31
Visakhapatnam, Andhra Pradesh:

Celebrity Cricket League: సినీ తారలంతా క్రికెట్‌ బ్యాట్‌, బంతి పట్టుకుని మైదానంలో దిగనున్నారు. ఇన్నాళ్లు తెరపై ఆడిన సినిమా స్టార్లు, నటీనటులు ఇప్పుడు గ్రౌండ్‌లో ఆడబోతున్నారు. హైదరాబాద్‌లో ఉండే సినీ తారలు విశాఖపట్టణానికి తరలివస్తున్నారు. రెండు రోజుల పాటు సినీ తారల క్రికెట్‌ మ్యాచ్‌ సందడిగా జరగనుంది. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విశేషాలు ఇలా ఉన్నాయి. వైజాగ్‌లో జరగనున్న మ్యాచ్‌ల వివరాలు తెలుసుకుందాం.

Also Read: Gold Fruad: మేడమ్‌ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు

మధురవాడ ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో ఈనెల 28వ తేదీ నుంచి మార్చి 1వ తేదీల్లో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రముఖ నటులు శ్రీకాంత్, తరుణ్ తెలిపారు. హోటల్ డాల్ఫిన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వివరాలు వెల్లడించారు. హీరోలు సుధీర్ బాబు, ఓంకారం, అశ్విన్ బాబు, అయ్యప్ప శర్మ, ప్రిన్స్, ఖయ్యూం, ప్రభు, ఈటీవీ ప్రభాకర్, నిఖిల్, సామ్రాట్, నందకిషోర్ నందకిశోర్, పవన్ సాయి, సాంబతో కలిసి క్రికెట్ పోటీల  వివరాలను వెల్లడించారు.

టాలీవుడ్ నటులు, టీవీ నటులతో రెండేసి టీంలు.. పోలీసులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులతో ఒక్కో టీం చొప్పున మొత్తం ఏడు జట్ల నుంచి 110 సెలబ్రిటీలు క్రికెట్‌ లీగ్‌లో ఆడబోతున్నట్లు సినీ హీరోలు తెలిపారు. టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో వచ్చే ఆదాయాన్ని పేద పిల్లల చదువు, ముఖ్యమంత్రి సహాయ నిధి, దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తారని ప్రకటించారు. విశాఖను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని.. అందులో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వైజాగ్‌లో జరుగుతోందని వెల్లడించారు. 

రెండు రోజుల పాటు అలరించనున్న సెలబ్రిటీ లీగ్‌ను ఉచితంగా చూడవచ్చు. విశాఖ ప్రజలు సినీ నటీనటుల క్రికెట్‌ లీగ్‌ను ఉచితంగా తిలకించే  వినియోగించుకోవాలని కోరారు. సెలబ్రిటీ లీగ్ నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ.. క్రికెట్ పోటీల నిర్వహణలో వెన్నంటి ఉండి నడిపిస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సూచనతో ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఐపీఎల్ తరహాలో సెలబ్రిటీ మ్యాచ్‌లను డిజైన్ చేశామని తెలిపారు. విశాఖపట్టణం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, నగర పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ ఎంతగానో సహకారంతో సీసీఎల్‌ విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 03:17:35
Hyderabad, Telangana:

Banjara Hills Police: మేడమ్‌ వద్ద బంగారు కడ్డీలు ఉన్నాయని చెప్పి ఓ వ్యక్తి బంగారం దుకాణానికి వచ్చి మోసానికి పాల్పడ్డాడు. 'మా మేడమ్‌ వద్ద భారీగా బంగారు కడ్డీలు ఉన్నాయి.. బ్లాక్‌మనీని వైట్‌ చేసుకునేందుకు ఆభరణాలు కొనాలనుకుంటున్నారు’ అంటూ నమ్మించాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆ వ్యాపారి కుమార్తెను నమ్మించి  కేజీ బంగారు నగలతో ఉడాయించిన ఘరానా మోసగాడిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లో స్వర్ణ కావ్యం పేరుతో ఆభరణాల షాపు నిర్వహిస్తున్న పాలకుర్తి లక్ష్మీకావ్యకు ఈనెల 17వ తేదీన శ్రీనాథ్‌ రాఠీ అలియాస్‌ అంకిత్‌ (31) అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను ప్రముఖ వ్యాపారి సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డి పీఏనంటూ పరిచయం చేసుకున్నాడు. పింకీ రెడ్డి కుటుంబం వద్ద భారీగా బంగారం బిస్కెట్లు ఉన్నాయని.. వీటిని ఇచ్చి ఆభరణాలుగా మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపాడు. వీటితోపాటు బ్లాక్‌ మనీని వైట్‌ మనీగా మార్చుకునేందుకు మీ దుకాణంలో ఆభరణాలు కొనుగోలు చేస్తే మీ ట్రాన్సాక్షన్స్‌ కూడా పెరిగి బ్యాంక్‌ లోన్లు వస్తాయని నమ్మబలికాడు.

ఈ మేరకు లక్ష్మీకావ్యను కలిసిన శ్రీనాథ్‌ రాఠీ, అతడి అనుచరులు కృష్ణ, మనోజ్‌ అనే వ్యక్తులు మొదట 16 తులాల బంగారు నగలు తీసుకుని రెండు చెక్కులు ఇవ్వడంతో పాటు మరుసటిరోజు 160 గ్రాముల బంగారం బిస్కెట్‌ ఇచ్చారు. రెండు రోజుల తర్వాత ఇలా 30 తులాల ఆభరణాలు తీసుకుని ఆ మేరకు బంగారం బిస్కెట్‌ ఇచ్చారు. మూడోసారి 50 తులాల బంగారం ఆభరణాలు తీసుకుని మరుసటిరోజు దానికోసం రూ.9లక్షలు ఇచ్చి నమ్మకం కలిగించాడు.

ఇదే క్రమంలో ఈనెల 25వ తేదీన కిలో బంగారు ఆభరణాలు తీసుకున్న శ్రీనాథ్‌ రాఠీ మరుసటి రోజు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లోని లీలా హోటల్‌లో కృష్ణ అనే యువకుడితో 1800గ్రాముల బంగారం కడ్డీ పంపించాడు. అతడు తెచ్చిన బంగారం కడ్డీపై అనుమానం రావడంతో పరీక్ష కోసం పంపించగా అది నకిలీ అని తేలింది. దీంతో గురువారం రాత్రి బాధితురాలు లక్ష్మీకావ్య బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 02:19:15
Hyderabad, Telangana:

BRS Party: 'తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి పేద వర్గాల పైన పగబట్టాడు. పేదల ఇండ్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నాడు' అని రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పేదల ఇండ్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నారు. పేదల ఇండ్లు కూల్చడం చాలా అమానుషం. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో అనేక మంది పేదల ఇండ్లు కూల్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగానే ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. లగచర్ల గిరిజన భూముల్ని అంతే బలవంతంగా లాక్కున్నే ప్రయత్నం చేశారు' అని కాంగ్రెస్‌ వైఫల్యాలను వివరించారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఖమ్మం జిల్లా కేంద్రంలో 600 మంది నిరుపేదల  ఇండ్లు కూల్చారు. గాంధీ సరోవర్ పేరుతో 50 వేల ఇండ్లు కూల్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లను కూలగొట్టే పనిగా పెట్టుకుంది' అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుచరిస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.

'ఖమ్మంలో ఇంత జరుగుతుంటే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మాట్లాడే విధానం సిగ్గేస్తుంది. పట్టాలు ఉన్నాయి అని చెప్పినప్పటికీ ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చారు. భూదాన్ భూములను ఎవరికి కట్టబెట్టేందుకు ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది' అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. 'కుమ్మెర జాతరలో అమానుష ఘటన జరిగింది. పోలీస్ వ్యవస్థలో దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకులు చెప్తేనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నారు' అని చెప్పారు. ఇంతటి దారుణమైన పరిస్థితి తెలంగాణలో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో పేద వర్గాల వారికి న్యాయం దక్కడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. కుమ్మెర జాతర విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు తుల ఉమ, సుమిత్రానంద్, లోక బాపు రెడ్డి, మంజులా రాణి పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 01:57:46
Hyderabad, Telangana:

Hyderabad: గంజాయి బ్యాచ్‌ వాహనం ఢీకొట్టడంతో విధి నిర్వహణలో భాగంగా అడ్డుకున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అనంతరం కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. సౌమ్య మరణంతో ఎక్సైజ్‌ శాఖలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబానికి ఆసరాగా ఉన్న సౌమ్య మృతితో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం సౌమ్య కుటుంబానికి ఆర్థిక సహాయంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. తాజాగా ఆ కుటుంబానికి ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అండగా నిలిచింది. 

సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్‌ శాఖ అసోసియేషన్ సభ్యులు తమ ఒక రోజు పెన్షన్ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. సౌమ్య కుటుంబానికి రూ.2.80 లక్షల చెక్కును పింఛన్‌దారులు అందించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సౌమ్య కుటుంబసభ్యులకు అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టకాలంలో ఉన్న ఒక సహోద్యోగి కుటుంబానికి విశ్రాంత ఉద్యోగులు తమ పెద్ద మనసుతో అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.

అంకితభావంతో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.కోటి ఆర్థిక సాయంతో పాటు ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందనిమంత్రి జూపల్లి కృష్ణారావు  గుర్తుచేశారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఎక్సైజ్ సిబ్బంది కృషిని ప్రభుత్వం గుర్తిస్తుందని.. వారికి అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు ముకుంద రెడ్డి, ప్రతినిధులు విష్ణు స్వరూప్ రెడ్డి, నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సౌమ్య కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీల ప్రక్రియకు మోక్షం లభించనుందని మంత్రి జూపల్లి వెల్లడించారు. వారం రోజుల్లోగా సుమారు 2,500 మంది కానిస్టేబుళ్ల బదిలీలను పూర్తి చేస్తామని.. అనంతరం ఇతర హోదాల్లోని అధికారుల బదిలీలను దశలవారీగా చేపడతామని మంత్రి వివరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో చిన్నారి మృతి చెందడంపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top