Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

Kedi Movie Director: డైరెక్టర్ సందీర్ రెడ్డి వంగా గురువు మృతి..నాగార్జున 'కేడీ' మూవీ డైరెక్టర్ అంత్యక్రియలు పూర్తి!

HDHarish Darla
Dec 19, 2025 13:41:17
Kedi Movie Director Kiran Kumar Passed Away: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గురువారం విషాదం చోటుచేసుకుంది. అక్కినేని నాగార్జున నటించిన 'కేడీ' చిత్ర దర్శకుడు కిరణ్ కుమార్ మృతి చెందగా.. తాజాగా ఆయన స్వస్థలం అనంతపురంలో అంత్రక్రియలను కుటుంబసభ్యులు నిర్వహించారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BBhoomi
Dec 19, 2025 13:46:17
Secunderabad, Telangana:

Karmayogi Awas Yojana 2025: సొంతిల్లు అనేది ప్రతి ఒకరి కల. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు రూపాయి రూపాయి కూడబెట్టేవాళ్లేందరో ఉన్నారు. ముఖ్యంగా సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు నేటి రోజుల్లో సొంతిల్లు అనేది కలగానే మిగులుతోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ సొంతిటి కల నెరవేర్చుకోవడం సవాలుగానే ఉంటుంది. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలు, మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇల్లుకొనుగోలు చేయడం అనేది చాలా మందికి సాధ్యం అవ్వడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చే విధంగా ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ కర్మయోగి ఆవాస్ యోజన 2025 పేరుతో కొత్త గృహ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నవారితోపాటు రిటైర్ట్ ఉద్యోగులు కూడా ఈ స్కీమ్ ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.

 ఈ స్కీం పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు.. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, ప్రభుత్వ బ్యాంకులు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో పనిచేసే సిబ్బందిని కూడా అర్హులుగా చేర్చింది. ఢిల్లీలోని నరేలా సబ్ సిటీలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 1,168 ప్లాట్లను ఈస్కీమ్ కింద విక్రయించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు మార్కెట్ ధరలతో పోల్చినట్లయితే సుమారు 25శాతం తక్కువ తగ్గింపు ధరకే ఇల్లు అందిస్తుండటం ఈ స్కీమ్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.

ఇక డీడీఏ అన్ని కేటగిరీ ఫ్లాట్లపై ఈ డిస్కౌంట్స్ అందిస్తోంది. 1BHK, 2BHK, 3BHK ఫ్లాట్లు ఈ స్కీమ్ కింద అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ తర్వాత సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధర సుమారు రూ. 34లక్షలు ఉంది. డబుల్ బెడ్ రూం అయితే రూ. 80 లక్షలు, త్రిబుల్ బెడ్ రూం లగ్జరీ ఫ్లాట్ అయితే రూ. 1.15కోట్ల నుంచి రూ. 1.27కోట్ల మధ్య ఉండనున్నట్లు డీడీఏ తెలిపింది. ఇవి ప్రస్తుత మార్కెట్ ధరలతో పోల్చినట్లయితే తక్కువగా ఉండటంతో ఉద్యోగుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Also Read: 8th Pay Commission: 2028లో 8వ వేతన సంఘం అమలు చేస్తే.. మీ జీతాలు ఎంత పెరుగుతాయ్? నోరెళ్లబెట్టే లెక్కలు..!!

ఈ స్కీములో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. దరఖాస్తుదారుడికి ఇప్పటికే ఢిల్లీలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇల్లు లేదా స్థలం ఉన్నా కూడా అర్హత కోల్పోరు. అంటే ఇప్పటికే సొంతిల్లు ఉన్నవారు కూడా ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఫ్లాట్లను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది డీడీఏ.

ఇక ఈ కర్మయోగి ఆవాస్ యోజన 2025 కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 19, 2025 నుంచి ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న అర్హులైన ఉద్యోగులు డిడిఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ఈ పథకం కీలక అడుగుగా నిలుస్తోంది. ఇలాంటి గృహ పథకాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తే ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read:  Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్డేట్.. వారందరికీ బిగ్ రిలీఫ్.. పూర్తి వివరాలు ఇవే..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Dec 19, 2025 13:02:33
Secunderabad, Telangana:

Gold Price Prediction 2050 in india: బంగారానికి మెరుపు ఎక్కువే.. పరుగు ఎక్కువే. ఎంత ప్రకాశిస్తుందో అంతే వేగంగా పరుగెడుతోంది. బంగారం.. అమ్మో బంగారం అనే స్థాయికి చేరుకుంది. సామాన్య ప్రజలకు బంగారం అంటేనే గుండెలో ఏదోరకమైన దడ పుడుతోంది. డబ్బునొడికి కూడా కాస్త టెన్షనే పెట్టిస్తోంది. 2025లో బంగారం ధరలు దాదాపు 60శాతానికి మించి పెరిగింది. నిజానికి బంగారం అనేది సురక్షితమైన, నమ్మదగ్గ పెట్టుబడి ఆప్షన్ గా పరిగణిస్తుంటారు. దాని ఆకర్షణ, ధర పెరుగుదల పరిమితం కాదు. ఆర్ధిక అనిశ్చితి సమయంలో బంగారం మనకు తోడుగా నిలుస్తుంది. అందుకే గత 25ఏళ్లుగా బంగారం సగటున 14.6శాతం వార్షిక రాబడిని ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. సాంప్రదాయ పొదుపు పథకం లేదా బ్యాంక్ డిపాజిట్ కంటే చాలా ఎక్కువ రెట్లు అనిచెప్పాలి.

గత 25ఏండ్లలో బంగారం ధర ఎంత పెరిగింది?

2000అక్టోబర్ నెలలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 4,400గా ఉంది. 25 సంవత్సరాల తర్వాత అంటే 2025లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.33 లక్షలకు చేరుకుంది. అంటే ఏడాదికి 14.6శాతం వ్రుద్ది రేటును సూచిస్తుంది. పరుగులు పెడుతున్న బంగారం ధరను ద్రుష్టిలో ఉంచుకుని 25ఏళ్ల తర్వాత మీ పిల్లలు తమ బంగారు ఆభరణాలు ఎంత ధరకు లభిస్తాయని మీరేప్పుడైనా ఆలోచించారా? 25ఏళ్ల తర్వాత అంటే 2025లో 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం.

2050 నాటికి బంగారం ఎంతకు చేరుకోవచ్చు?

రాబోయే 25ఏండ్లకు బంగారం ధరలు ఈ రేటుతో (14.6 CAGR) పెరిగినట్లయితే.. 10 గ్రాములకు దాదాపు రూ. 40లక్షలు అవుతుంది. మీ దగ్గర రూ. కోటి ఉంటే మీరు 25 గ్రాముల బంగారాన్ని మాత్రమే కొంటారు. అంటే 25 తులాలు మాత్రమే కొనుగోలు చేస్తారు. 25 తులాలు అంటే గాజులు, చిన్న నెక్లెస్, లాంగ్ చైన్, నల్లపూసలు ఇవి మాత్రమే చేయించుకోవచ్చు. అయితే ఈ లెక్కలు కేవలం అంచనాలు మాత్రమే అని గుర్తించుకోండి.

బంగారం ధరలు వడ్డీరేట్లు, డాలర్ స్థితి, కేంద్ర బ్యాంకు విధానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితి వంటి అనేక దేశీయ, ప్రపంచ అంశాలపై ఆధారపడి, ముడిపడి ఉంటాయి. అందువల్ల 2050లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 40లక్షల కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది.

Also Read:  Financial Planning Tips 2026: మహిళలూ 2026 జనవరి 1 నుంచి ఈ మూడు నిర్ణయాలు తీసుకుంటే..మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!!

బంగారం ధర పెరుగుదలకు కారణాలేంటి?

గత 25 సంవత్సరాలుగా, స్టాక్ మార్కెట్ లేదా బాండ్లు వంటి ఆస్తులు తమ ప్రకాశాన్ని కోల్పోయినప్పుడల్లా, బంగారం తన ఉనికిని నిలుపుకుంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ హెచ్చుతగ్గుల సమయంలో పెట్టుబడిదారులకు బంగారం ఎల్లప్పుడూ నమ్మకమైన, సురక్షితమైన స్వర్గధామంగా ఉంటుంది. కేంద్ర బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారుల స్థిరమైన కొనుగోళ్లు కూడా దాని ధరలకు మద్దతు ఇచ్చాయి. అందుకే బంగారం ధరలు భారీగా పెరిగాయి.

ఇల్లు కట్టుకోవాలా? బంగారం కొనుక్కోవాలా?

2050 నాటికి బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 40లక్షలకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలా లేదంటే ఇల్లు కట్టుకోవాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక స్థితి ఆధారంగా తీసుకోవాలంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే మీరు ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటూ స్థిరమైన ఆదాయం కలిగి ఉన్నట్లయితే.. మీరు ముందుగా ఇల్లు కట్టుకోవడం బెస్ట్ అనిచెబుతున్నారు.

Also Read: Gold Loan Rules: RBI పెట్టిన మెలిక.. మీకు గోల్డ్ ఉన్నా లోన్‌ రాకపోవచ్చు.. షాక్‌ అవ్వదు.. పూర్తి డీటెయిల్స్ ఇవే..!!

ఎందుకంటే ఇల్లు అనేది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు.. జీవన అవసరం. అద్దె ఖర్చు తగ్గడంతోపాటు కుటుంబానికి భద్రత, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒకవేళ ఇప్పటికే స్వంత ఇల్లు ఉన్నవారయితే భవిష్యత్ ఆర్థిక భద్రత కోసమైతే బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎందుకంటే బంగారం ద్రవ్యోల్బణానికి ఎదురుగా నిలిచే ఆస్తిగా భావిస్తారు. దీర్ఘకాలంలో విలువను మరింత పెంచుతుంది. 2050లో రూ. 40లక్షలు అనే సంఖ్య పెద్దగా అనిపించినా.. అప్పటి రూపాయి విలువ తగ్గడం, జీవన ఖర్చులు పెరగడం వంటి అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కేవలం ధర అంచనాల ఆధారంగా మాత్రమే కాకుండా అవసరం, భవిష్యత్ లక్ష్యాలను ద్రుష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

మరో ఉత్తమ నిర్ణయం ఏంటంటే.. మీ దగ్గర ఉన్న డబ్బుతో ఇల్లు కట్టుకుని.. మిగిలిన డబ్బును దశలవారీగా బంగారంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే.. జీవన భద్రతతోపాటు భవిష్యత్ కు ఆర్థిక రక్షణ కూడా సాధ్యం అవుతుంది. ఏది ఏకమైనప్పటికీ ముందుగా గూడు తర్వాతే ఆర్భాటాలు, హంగులు, బంగారాలు.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 19, 2025 11:28:17
Siddipet, Telangana:

House Mortgage: మెడికల్‌ కళాశాలలో వైద్య విద్య చదివేందుకు ఆర్థిక కష్టాలు ఎదురవడంతో ఓ విద్యార్థిని మాజీ మంత్రి హరీశ్‌ రావును కలవగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ విద్యార్థికి రుణం మంజూరు చేయించేందుకు హరీశ్‌ రావు ఏకంగా తన ఇంటినే తాకట్టుపెట్టారు. ఇంటిని తాకట్టు పెట్టడంతో వచ్చిన రుణం డబ్బులను ఆ విద్యార్థినికి బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు అందించారు. అంతేకాకుండా రూ.లక్ష హాస్టల్‌ ఫీజు చెల్లించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.

Also Read: Aata Show Auditions: డ్యాన్సర్లకు గోల్డెన్‌ ఛాన్స్‌.. ఆట 2.0 డ్యాన్స్‌ షో ఆడిషన్లు ఎప్పుడో తెలుసా?

సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె కొంక మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసింది. పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో పీజీ సీటు పొందింది. ప్రభుత్వ కన్వీనర్ కోటాలోనే సీటు వచ్చినప్పటికీ మూడేళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ.7.50 లక్షల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ ఫీజు చెల్లింపునకు ఈనెల 18వ తేదీ చివరి గడువు కావడంతో డబ్బు కోసం తీవ్రంగా ప్రయత్నించారు.

Also Read: KT Rama Rao: యాదాద్రి నర్సన్న స్వామి ఆశీస్సులతో కేసీఆర్ సీఎం అవుతారు: కేటీఆర్

బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా అప్పటికే తమ ఇంటిపై లోన్‌ ఉండడంతో రామచంద్రం తన కుమార్తె వైద్య విద్యకు డబ్బు సమకూర్చలేకపోయాడు. అన్నీ ఆర్థిక మార్గాలు మూసుకుపోవడంతో అంత డబ్బు చెల్లించలేక తండ్రీ కుమార్తె మనోవేదనకు గురయ్యారు. ఏదైనా ఆస్తులు తాకట్టు పెడితే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో తమ గోడును సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావును కలిశారు. గతంలో తన కూతుళ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు సహాయం చేసిన మాజీ మంత్రి హరీశ్‌ రావును మరోసారి రామచంద్రం తన కుటుంబంతో వచ్చి కలిశారు. విషయం తెలియగానే వెంటనే హరీశ్‌ రావు స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని తాకట్టు పెట్టి మూడేళ్లకు సరిపడా దాదాపు రూ.20 లక్షల విద్యా రుణాన్ని కొంక మమతకు మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు.

Also Read: BRS Party: సిరిసిల్ల గడ్డ.. గులాబీ అడ్డా! కేటీఆర్‌ దెబ్బకు కాంగ్రెస్‌ గిలగిల

మొదటి సంవత్సరం హాస్టల్‌కు సంబంధించి రూ.లక్ష ఫీజును కూడా మాజీ మంత్రి హరీశ్‌ రావు చెల్లించారు. హాస్టల్ ఫీజుకు ఎలాంటి అప్పు చేయొద్దని వచ్చే ఏడాది కూడా రూ.లక్ష సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో విద్యార్థిని కుటుంబసభ్యులు హరీశ్‌ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తన ఇద్దరు కుమార్తెల ఎంబీబీఎస్‌ విద్యకు సహాయం చేసిన హరీశ్‌ రావు ఇప్పుడు పీజీకి కూడా సహాయం చేయడంతో మాజీ మంత్రి హరీశ్‌ రావుకు రామచంద్రం కుటుంబం రుణపడి ఉంటుందని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Dec 19, 2025 09:40:35
Hyderabad, Telangana:

1 Rupee Coin Under Pillow: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయట పడొచ్చని.. పండితులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లోని అనేక దోషాలను తగ్గించుకోవచ్చు. సాధారణంగా నిద్ర పోయే సమయంలో మన దగ్గర నీళ్లు, సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి మీరు నిద్రపోయేటప్పుడు దిండు కింద రూపాయిని కూడా పెట్టుకోండి. అదేంటి అనుకుంటున్నారా..

హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయట పడొచ్చని.. పండితులు చెబుతూ ఉంటారు. చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో చాలా దోషాలను తగ్గించుకోవచ్చు.

సాధారణంగా నిద్ర పోయే సమయంలో మన దగ్గర నీళ్లు, సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి మీరు నిద్రపోయేటప్పుడు రూపాయిని కూడా పెట్టుకోండి. అదేంటి అనుకుంటున్నారా? వాస్తు శాస్త్రంలో రూపాయికి ఎంతో విలువ ఉంది. వాస్తు శాస్త్రంలో రూపాయి నాణెం రెమిడీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఒక రూపాయి నాణెం తీసుకుని ప్రతి నిద్రపోయే సమయంలో దిండు కింద పెట్టుకుని పడుకోండి. దీని వలన నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తుల ప్రభావం దూరమై.. పాజిటివ్ ఎనర్జీ పడుతుంది. అంతే కాకుండా అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

దిండు కింద రూపాయి నాణెం పెట్టుకుని నిద్రించడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి దూరం అవుతాయట. ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమై.. ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఇలా చేయడం వల్ల డబ్బు పరంగా ఉన్న చిక్కులు కూడా దూరమవుతాయని కొందరి విశ్వాసం.

ఈ పరిహారం ప్రతీ నెలా ఒక్కసారి చేయవచ్చు. రాత్రి పూట నిద్రపోయేటప్పుడు దిండు కింద రూపాయి నాణెం పెట్టుకుని నిద్రించాలి. తరువాతి రోజు ఆ నాణెంను పారే నది, చెరువు వంటి వాటిల్లో వదిలేయవచ్చు. ఇలా చేస్తే ధనలాభం కలుగుతుందని అంటున్నారు పండితులు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం మత విశ్వాసాలు, నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.) 

Also REad: Chicken vs Sprouts Protein: చికెన్ Vs మొలకలు..రెండింటిలో ప్రొటీన్ కింగ్ ఎవరు? ఎందులో శక్తి ఎక్కువో తెలుసా?

Also Read: School Holidays: ఏపీ, తెలంగాణల్లో 8 రోజులు సెలవులు..డిసెంబరు 21 నుంచి 28 వరకు స్కూళ్లకు సెలవులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 19, 2025 08:17:39
Hyderabad, Telangana:

Moong Sprouts vs Chicken Protein: ఆరోగ్యంగా ఉండాలన్నా, కండరాలు దృఢంగా మారాలన్నా మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేవి మాంసాహారంలో చికెన్, శాఖాహారంలో మొలకెత్తిన గింజలు. అయితే, ఈ రెండింటిలో దేని ద్వారా మన శరీరానికి ఎక్కువ ప్రోటీన్ అందుతుందో మీకు తెలుసా? చికెన్, మొలకల మధ్య ఉన్న పోషక విలువల వ్యత్యాసాన్ని ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం.

ప్రోటీన్ ఎందుకు ముఖ్యం?
శరీరానికి సరైన మొత్తంలో ప్రోటీన్ అందితే కండరాలు బలంగా తయారవుతాయి. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడమే కాకుండా, దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

100 గ్రాముల చికెన్ vs 100 గ్రాముల మొలకలు
మీరు తీసుకునే పరిమాణాన్ని బట్టి ప్రోటీన్ లభ్యత మారుతుంది. 100 గ్రాముల చికెన్, 100 గ్రాముల మొలకెత్తిన గింజలు మధ్య పోలిక ఇలా ఉంది.

ఆహారం (100 గ్రాములు) ప్రోటీన్ పరిమాణం అదనపు ప్రయోజనం
చికెన్ 31 గ్రాములు కండరాల పుష్టికి
మొలకలు (పెసలు) 7.02 గ్రాములు ఫైబర్ (పీచు పదార్థం)

చికెన్: మాంసాహారుల ఛాయిస్
మీరు గరిష్ట ప్రోటీన్ పొందాలనుకుంటే చికెన్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో ప్రోటీన్ సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు, కండరాలు పెంచాలనుకునే వారికి చికెన్ బ్రెస్ట్ మంచి ఆహారంగా మారింది.

మొలకలు: శాఖాహారుల సంజీవని
శాఖాహారులు ప్రోటీన్ కోసం ఎక్కువగా మొలకెత్తిన పెసలు తింటారు. చికెన్ తో పోలిస్తే ఇందులో ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పటికీ, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది.

మీరు అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవాలనుకుంటే చికెన్ మొదటి స్థానంలో ఉంటుంది. అయితే కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా ఇతర పోషకాలు, ఫైబర్ కూడా కావాలనుకుంటే మొలకలు తీసుకోవడం ఉత్తమం. శాఖాహారులు మొలకలతో పాటు సోయాబీన్స్, పనీర్ వంటివి కూడా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వారంలో కొన్ని రోజులు చికెన్, మరికొన్ని రోజులు మొలకలు తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

(గమనిక: పైన పేర్కొన్న సమచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: School Holiday: స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..మళ్లీ రేపు స్కూళ్లకు సెలవు..పబ్లిక్ హాలీడే అంట!

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు ముఖ్యగమనిక..రూ.7,500 పెన్షన్ పెంపుపై పార్లమెంట్‌లో మోదీ సర్కార్ క్లారిటీ ఇచ్చేసింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 19, 2025 07:33:51
Hyderabad, Telangana:

Lamborghini Manufacturing Video: ప్రతి మిడిల్ క్లాస్‌ సూపర్‌కార్ కొనుగోలు చేయాలని కలలు కంటూ ఉంటాడు. కానీ వీటి ధర కోట్లాది రూపాయలు ఉండడం వల్ల కొనడం సామాన్యులకు సాధ్యం కాదు.. ఇదిలా ఉంటే కేరళకు చెందిన ఓ 26 ఏళ్ల యువకుడు బిబిన్ మాత్రం తన లగ్జరీ కారు కలను సాకారం చేసుకున్నాడు. తన దగ్గర ఉన్న ఐరన్‌ స్క్రాప్‌తో ఏకంగా లంబోర్గిని హురాకాన్ వంటి మోస్ట్ పవర్‌ఫుల్‌ లగ్జరీ కారును తయారు చేశాడు. ఇప్పుడు ఈ కారుకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

రాత్రి పగలు కష్టపడి..
బిబిన్ వృత్తిరీత్యా చిన్న జాబ్‌ చేస్తూ.. తీరికగా ఉన్న సమయాల్లో కష్టపడి అద్భుతం సృష్టించాడు. గత మూడు సంవత్సరాల నుంచి  రాత్రి సమయాల్లో ఎంతో శ్రమించి..కేవలం రూ. 1 లక్షల పెట్టుబడితో మాత్రమే.. ఏకంగా లంబోర్గిని హురాకాన్ కారును తయారు చేశాడు. ఈ కారు తయారీలో మారుతి ఆల్టో స్క్రాప్‌ ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆ యువకుడు వీడియోలో తెలిపారు.

మారుతి సుజుకి ఆల్టో కారుకు సంబంధించిన ఇంజన్‌తో కారుకు ప్రాణం పోశాడు.. అంతేకాకుండా ఈ ఆల్టోకు సంబంధించిన చక్రాలు, మరికొన్ని విడిభాగాలను కూడా వినియోగించారని తెలిపారు. మరికొన్ని విడిభాగాలను ఆ యువకుడే ఎంతో కష్టపడి తయారు చేశారని వెల్లడించాడు. అలాగే ఇందులో ప్రత్యేకమైన బటర్‌ఫ్లై డోర్స్ కోసం వైపర్ మోటార్‌ను కూడా వినియోగించినట్లు తెలిపారు. ఈ డోర్స్‌ కేవలం ఒకే బటన్‌ నొక్కితే.. తలుపులు తెరుచుకోవడం ఇప్పుడు అందిరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఈ కారు 80 శాతం మాత్రమే పూర్తి చేశారని.. ఇంటీరియర్ పనులు ఇంకా మిగిలి ఉన్నాయని అతను తెలిపారు. 

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

బిబిన్‌కు ఉన్న నైపుణ్యాన్ని చూసి.. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది ఆతని వీడియోల కింద.. మీరు ఇలాంటి కొనలేకపోతే.. "మీరే తయారు చేసుకోవచ్చు." అని కామెంట్స్‌ కూడా పెడుతున్నారు. స్క్రాప్‌ను అద్భుతమైన పార్ట్స్‌గా మార్చుకుని.. "ఎంతో పట్టుదలతో ఇలా లగ్జరీ కారును తయారు చేసిన నువ్వు భవిష్యత్‌లో బాగా ఎదుగుతావ్‌" అని మరికొంతమంది కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Dec 18, 2025 13:42:25
Hyderabad, Telangana:

School Holiday Tomorrow: దేశంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడమే కాకుండా చలిగాలుల తీవ్రత భారీగా పెరుగుతుంది. అదే విధంగా ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం భారీగా పెరుగుతున్న క్రమంలో అనేక రాష్ట్రాల్లోని స్కూళ్లకు ప్రభుత్వాలు సెలవును ప్రకటించాయి. అయితే డిసెంబరు 19న ఏఏ రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

డిసెంబరు 19న గోవా రాష్ట్రం విముక్తి దినోత్సవం జరుపుకోనున్న కారణంగా అక్కడ పబ్లిక్ హాలీడే కానుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు సెలవు రానుంది. 1961లో పోర్చుగీస్ పాలన ముగింపు సందర్భంగా విముక్తి దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. 

ఉత్తర భారతదేశంలో దాదాపు చాలా రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కారణంగా చాలా వరకు స్కూళ్లకు సెలవును ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లోని పాఠశాలలు మూసివేత కానున్నాయి. మరోవైపు జమ్మూ & కాశ్మీర్‌లో కూడా శీతాకాల సెలవులను పొడిగించారు. జనవరి 4 వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. 

ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారుతూనే ఉంది. AQI 450 కంటే ఎక్కువగా చేరుకుంది. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం GRAP స్టేజ్ 4ని అమలు చేసింది. దీంతో తదుపరి నోటీసు వచ్చేంత వరకు స్కూళ్లు కార్యాలయాలు తెరవడానికి వీల్లేదంటూ కఠినమైన ఆర్డర్స్ జారీ చేసింది. నోయిడాలో కూడా ఇదే పరిస్థితి. కొన్ని స్కూళ్లకు వరుస సెలవులు ప్రకటించారు.

తమిళనాడులో విద్యార్థులు తమ హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాస్తున్నారు. ఇవి పూర్తి అవ్వగానే క్రిస్మస్, న్యూఇయర్‌తో కలిసి దాదాపుగా 12 రోజులు సెలవులు ఇవ్వనున్నారు. 

Also Read: Rashmika Party: పెళ్లికి ముందు ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చిన హీరోయిన్ రష్మిక..శ్రీలంకలో సీక్రెట్ పార్టీ..ఫొటోలు వైరల్!

Also Read: Nattamai Rani Daughter: ఒకప్పుడు అల్లాడించిన హీరోయిన్..ఇప్పుడు కూతురు రాబోతుంది..అప్సరస ఏ మాయ చేసిందో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top