Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
Retired Employees: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రిటైర్డ్ ఉద్యోగుల అండ
RKRavi Kumar Sargam
Feb 28, 2026 01:57:46
Hyderabad, Telangana

Hyderabad: గంజాయి బ్యాచ్‌ వాహనం ఢీకొట్టడంతో విధి నిర్వహణలో భాగంగా అడ్డుకున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అనంతరం కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. సౌమ్య మరణంతో ఎక్సైజ్‌ శాఖలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబానికి ఆసరాగా ఉన్న సౌమ్య మృతితో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం సౌమ్య కుటుంబానికి ఆర్థిక సహాయంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. తాజాగా ఆ కుటుంబానికి ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అండగా నిలిచింది. 

సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్‌ శాఖ అసోసియేషన్ సభ్యులు తమ ఒక రోజు పెన్షన్ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. సౌమ్య కుటుంబానికి రూ.2.80 లక్షల చెక్కును పింఛన్‌దారులు అందించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సౌమ్య కుటుంబసభ్యులకు అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టకాలంలో ఉన్న ఒక సహోద్యోగి కుటుంబానికి విశ్రాంత ఉద్యోగులు తమ పెద్ద మనసుతో అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.

అంకితభావంతో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.కోటి ఆర్థిక సాయంతో పాటు ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందనిమంత్రి జూపల్లి కృష్ణారావు  గుర్తుచేశారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఎక్సైజ్ సిబ్బంది కృషిని ప్రభుత్వం గుర్తిస్తుందని.. వారికి అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు ముకుంద రెడ్డి, ప్రతినిధులు విష్ణు స్వరూప్ రెడ్డి, నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సౌమ్య కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీల ప్రక్రియకు మోక్షం లభించనుందని మంత్రి జూపల్లి వెల్లడించారు. వారం రోజుల్లోగా సుమారు 2,500 మంది కానిస్టేబుళ్ల బదిలీలను పూర్తి చేస్తామని.. అనంతరం ఇతర హోదాల్లోని అధికారుల బదిలీలను దశలవారీగా చేపడతామని మంత్రి వివరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో చిన్నారి మృతి చెందడంపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 28, 2026 03:46:31
Visakhapatnam, Andhra Pradesh:

Celebrity Cricket League: సినీ తారలంతా క్రికెట్‌ బ్యాట్‌, బంతి పట్టుకుని మైదానంలో దిగనున్నారు. ఇన్నాళ్లు తెరపై ఆడిన సినిమా స్టార్లు, నటీనటులు ఇప్పుడు గ్రౌండ్‌లో ఆడబోతున్నారు. హైదరాబాద్‌లో ఉండే సినీ తారలు విశాఖపట్టణానికి తరలివస్తున్నారు. రెండు రోజుల పాటు సినీ తారల క్రికెట్‌ మ్యాచ్‌ సందడిగా జరగనుంది. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విశేషాలు ఇలా ఉన్నాయి. వైజాగ్‌లో జరగనున్న మ్యాచ్‌ల వివరాలు తెలుసుకుందాం.

Also Read: Gold Fruad: మేడమ్‌ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు

మధురవాడ ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో ఈనెల 28వ తేదీ నుంచి మార్చి 1వ తేదీల్లో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రముఖ నటులు శ్రీకాంత్, తరుణ్ తెలిపారు. హోటల్ డాల్ఫిన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వివరాలు వెల్లడించారు. హీరోలు సుధీర్ బాబు, ఓంకారం, అశ్విన్ బాబు, అయ్యప్ప శర్మ, ప్రిన్స్, ఖయ్యూం, ప్రభు, ఈటీవీ ప్రభాకర్, నిఖిల్, సామ్రాట్, నందకిషోర్ నందకిశోర్, పవన్ సాయి, సాంబతో కలిసి క్రికెట్ పోటీల  వివరాలను వెల్లడించారు.

టాలీవుడ్ నటులు, టీవీ నటులతో రెండేసి టీంలు.. పోలీసులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులతో ఒక్కో టీం చొప్పున మొత్తం ఏడు జట్ల నుంచి 110 సెలబ్రిటీలు క్రికెట్‌ లీగ్‌లో ఆడబోతున్నట్లు సినీ హీరోలు తెలిపారు. టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో వచ్చే ఆదాయాన్ని పేద పిల్లల చదువు, ముఖ్యమంత్రి సహాయ నిధి, దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తారని ప్రకటించారు. విశాఖను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని.. అందులో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వైజాగ్‌లో జరుగుతోందని వెల్లడించారు. 

రెండు రోజుల పాటు అలరించనున్న సెలబ్రిటీ లీగ్‌ను ఉచితంగా చూడవచ్చు. విశాఖ ప్రజలు సినీ నటీనటుల క్రికెట్‌ లీగ్‌ను ఉచితంగా తిలకించే  వినియోగించుకోవాలని కోరారు. సెలబ్రిటీ లీగ్ నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ.. క్రికెట్ పోటీల నిర్వహణలో వెన్నంటి ఉండి నడిపిస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సూచనతో ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఐపీఎల్ తరహాలో సెలబ్రిటీ మ్యాచ్‌లను డిజైన్ చేశామని తెలిపారు. విశాఖపట్టణం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, నగర పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ ఎంతగానో సహకారంతో సీసీఎల్‌ విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 03:17:35
Hyderabad, Telangana:

Banjara Hills Police: మేడమ్‌ వద్ద బంగారు కడ్డీలు ఉన్నాయని చెప్పి ఓ వ్యక్తి బంగారం దుకాణానికి వచ్చి మోసానికి పాల్పడ్డాడు. 'మా మేడమ్‌ వద్ద భారీగా బంగారు కడ్డీలు ఉన్నాయి.. బ్లాక్‌మనీని వైట్‌ చేసుకునేందుకు ఆభరణాలు కొనాలనుకుంటున్నారు’ అంటూ నమ్మించాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆ వ్యాపారి కుమార్తెను నమ్మించి  కేజీ బంగారు నగలతో ఉడాయించిన ఘరానా మోసగాడిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లో స్వర్ణ కావ్యం పేరుతో ఆభరణాల షాపు నిర్వహిస్తున్న పాలకుర్తి లక్ష్మీకావ్యకు ఈనెల 17వ తేదీన శ్రీనాథ్‌ రాఠీ అలియాస్‌ అంకిత్‌ (31) అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను ప్రముఖ వ్యాపారి సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డి పీఏనంటూ పరిచయం చేసుకున్నాడు. పింకీ రెడ్డి కుటుంబం వద్ద భారీగా బంగారం బిస్కెట్లు ఉన్నాయని.. వీటిని ఇచ్చి ఆభరణాలుగా మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపాడు. వీటితోపాటు బ్లాక్‌ మనీని వైట్‌ మనీగా మార్చుకునేందుకు మీ దుకాణంలో ఆభరణాలు కొనుగోలు చేస్తే మీ ట్రాన్సాక్షన్స్‌ కూడా పెరిగి బ్యాంక్‌ లోన్లు వస్తాయని నమ్మబలికాడు.

ఈ మేరకు లక్ష్మీకావ్యను కలిసిన శ్రీనాథ్‌ రాఠీ, అతడి అనుచరులు కృష్ణ, మనోజ్‌ అనే వ్యక్తులు మొదట 16 తులాల బంగారు నగలు తీసుకుని రెండు చెక్కులు ఇవ్వడంతో పాటు మరుసటిరోజు 160 గ్రాముల బంగారం బిస్కెట్‌ ఇచ్చారు. రెండు రోజుల తర్వాత ఇలా 30 తులాల ఆభరణాలు తీసుకుని ఆ మేరకు బంగారం బిస్కెట్‌ ఇచ్చారు. మూడోసారి 50 తులాల బంగారం ఆభరణాలు తీసుకుని మరుసటిరోజు దానికోసం రూ.9లక్షలు ఇచ్చి నమ్మకం కలిగించాడు.

ఇదే క్రమంలో ఈనెల 25వ తేదీన కిలో బంగారు ఆభరణాలు తీసుకున్న శ్రీనాథ్‌ రాఠీ మరుసటి రోజు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లోని లీలా హోటల్‌లో కృష్ణ అనే యువకుడితో 1800గ్రాముల బంగారం కడ్డీ పంపించాడు. అతడు తెచ్చిన బంగారం కడ్డీపై అనుమానం రావడంతో పరీక్ష కోసం పంపించగా అది నకిలీ అని తేలింది. దీంతో గురువారం రాత్రి బాధితురాలు లక్ష్మీకావ్య బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 02:19:15
Hyderabad, Telangana:

BRS Party: 'తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి పేద వర్గాల పైన పగబట్టాడు. పేదల ఇండ్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నాడు' అని రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పేదల ఇండ్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నారు. పేదల ఇండ్లు కూల్చడం చాలా అమానుషం. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో అనేక మంది పేదల ఇండ్లు కూల్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగానే ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. లగచర్ల గిరిజన భూముల్ని అంతే బలవంతంగా లాక్కున్నే ప్రయత్నం చేశారు' అని కాంగ్రెస్‌ వైఫల్యాలను వివరించారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఖమ్మం జిల్లా కేంద్రంలో 600 మంది నిరుపేదల  ఇండ్లు కూల్చారు. గాంధీ సరోవర్ పేరుతో 50 వేల ఇండ్లు కూల్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లను కూలగొట్టే పనిగా పెట్టుకుంది' అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుచరిస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.

'ఖమ్మంలో ఇంత జరుగుతుంటే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మాట్లాడే విధానం సిగ్గేస్తుంది. పట్టాలు ఉన్నాయి అని చెప్పినప్పటికీ ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చారు. భూదాన్ భూములను ఎవరికి కట్టబెట్టేందుకు ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది' అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. 'కుమ్మెర జాతరలో అమానుష ఘటన జరిగింది. పోలీస్ వ్యవస్థలో దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకులు చెప్తేనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నారు' అని చెప్పారు. ఇంతటి దారుణమైన పరిస్థితి తెలంగాణలో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో పేద వర్గాల వారికి న్యాయం దక్కడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. కుమ్మెర జాతర విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు తుల ఉమ, సుమిత్రానంద్, లోక బాపు రెడ్డి, మంజులా రాణి పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 01:22:07
Hyderabad, Telangana:

Telangana Cops: శాంతిభద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు విధుల్లో మహిళా పోలీసులు పోషిస్తున్న పాత్రలను తెలంగాణ సీఎం ప్రశంసించారు. పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా పోలీసుల సవాళ్లు, వారి అభివృద్ధికి కావాల్సిన సూచనలను ఒక పుస్తక రూపంలోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. శాంతిభద్రతల విభాగంలోనే కాకుండా అన్ని విభాగాల్లోనూ మహిళల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.

హైదరాబాద్‌లోని బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించిన 'తెలంగాణ మహిళా పోలీస్ సదస్సు' ప్రత్యేక సంచికతోపాటు రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ 2025 వార్షిక పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) శివధర్ రెడ్డి, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్త్, అవినీతి నిరోధక శాఖ ఇన్-చార్జ్ డైరెక్టర్, సీఐడీ అడిషనల్ డీజీపీ చారుసిన్హా, టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్, ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం మాట్లాడుతూ.. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ మరియు వారి వృత్తిపరమైన ఎదుగుదల విషయంలో తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయి ఫలితాలను పరిశీలించాలని, మన రాష్ట్రంలో మహిళా పోలీసుల నాయకత్వ పటిమను పెంచేందుకు అవసరమైన నూతన విధానాలను రూపొందించాలని సూచించారు.

మహిళా సిబ్బందికి వృత్తిరీత్యా ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్‌ శాఖకు సీఎం చెప్పారు. పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విశ్రాంతి గదులు, శిశు సంరక్షణ కేంద్రాలు, బందోబస్తు సమయాల్లో సంచార మరుగుదొడ్లు, గస్తీ విధులకు అనువుగా ద్విచక్ర వాహనాలను సమకూర్చడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీస్‌ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్త్ ముఖ్యమంత్రికి వివరించారు.

శాంతిభద్రతల విభాగంలోనే కాకుండా, సాయుధ బలగాలు, బెటాలియన్లలోనూ మహిళల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరముందని సీఎం గుర్తుచేశారు. సివిల్ పోలీస్ విభాగంలో అమలవుతున్న 33 శాతం రిజర్వేషన్ తరహాలోనే ఇతర విభాగాల్లోనూ మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల బాధ్యతలను మహిళా అధికారులకు అప్పగించడం ద్వారా పాతకాలపు మూస ధోరణులను చెరిపివేయాలని మహిళా పోలీస్ సదస్సు అభిప్రాయపడిందని వెల్లడించారు. శిక్షణా కాలం నుంచే లింగ సమానత్వం, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేలా సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. విధి నిర్వహణలో సౌకర్యవంతంగా ఉండేలా యూనిఫాం ప్రమాణాలను సమీక్షించేందుకు డీజీపీ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ కమిషనర్ ఎన్. శ్వేత, సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కె. మూర్తి, ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె. శిల్పవల్లితో పాటు పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు ఎన్. వెంకటేశ్వర్లు, పి. మధుకర్ స్వామి, జి. కవిత, కె.ఆర్.కె ప్రసాద్ రావు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 27, 2026 14:31:19
Velgapudi, Andhra Pradesh:

AP Legislative Council: 'ఇద్దరు ఎమ్మెల్సీలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా వేసుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ మా వైఎస్సార్‌సీపీలో లేరు. అలాంటి వారితో వాయిదా తీర్మానం ఇప్పించింది మీరు కాదా? ఎవరు ప్రోద్బలంతో ఆ తీర్మానం ఇచ్చారో మీకు తెలుసు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే తీర్మానం ఇప్పించారు' అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డైరీ వ్యవహారాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

Also Read: KTR: మళ్లీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్‌

కేజీ నెయ్యి రూ.340 నుంచి రూ.648కి పెంచింది ఎవరు? అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తమకు ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవు... పార్టీ పాలసీలు మాత్రమే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు తన ప్రాపకం  కోసమే... బిల్‌గేట్స్‌ని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చారు. జాతీయ మీడియాలో బిల్‌గేట్స్ అనైతిక వ్యవహారాలు రాస్తుంటే.. ఏపీకి పిలిచి ఏం సందేశం ఇస్తున్నారు?' అని నిలదీశారు.

'బిల్‌గేట్స్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒరిగిందేమిటి? తన ప్రాపకం కోసం చంద్రబాబు ఏమైనా చేయొచ్చని బిల్‌గేట్స్ పర్యటనతో అర్థమవుతుంది. కాపులను బీసీల్లో చేర్చాలని అంశం మీద శాసనమండలిలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఎందుకు ప్రశ్న వేశారు? ఎందుకు మళ్లీ ప్రశ్నను ఉపసంహరించుకున్నారో చెప్పాలి' అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 'మా సభ్యుడు తోట త్రిమూర్తులు కూడా ఈ ప్రశ్నలో ఇంప్లీడ్ అవ్వాలనుకున్నారు. టీటీడీ నెయ్యి వ్యవహారంతో పాటు అన్ని అంశాల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం' అని పునరుద్ఘాటించారు.

'మండలిలో  మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ చక్రవర్తి  ఎవరి ప్రోద్బలంతో వాయిదా తీర్మానం ఇచ్చారు? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తేడా ఆటల పోటీలకు సంబంధించి మాకు ఇలాంటి సమాచారం ఇవ్వలేదు. మండలి బీఏసీ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు రాలేదు. ఇది సరైన సాంప్రదాయం కాదు' అని సమావేశాల నిర్వహణపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. సాంప్రదాయాలకు భిన్నంగా పనిచేస్తే ఎవరికీ తలవంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

'రాష్ట్రంలో రెడ్‌బుక్, ఎల్లో బుక్ కాకుండా.. బ్లూ బుక్ రాజ్యాంగం నడిస్తే బాగుంటుంది. నాకు లోకేష్ మీద కోపం లేదు.. ప్రేమ లేదు. పాపం లోకేష్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నాడు. రాజకీయాల్లో చాలా చూడాల్సి ఉంది. శత్రువు కూడా బలపడాలని కోరుకునే వ్యక్తిని నేను. తెలుగుదేశం పార్టీలో అయ్యన్నపాత్రుడు వెనకాల ఎవరైనా గోతులు తీస్తున్నారేమో? అందుకే ఆయన అలా మాట్లాడి ఉంటారు' అని చిట్‌చాట్‌లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 27, 2026 14:23:04
Tenali, Andhra Pradesh:

Ayesha Meera Case Update: ఏపీని ఒకప్పుడు కుదిపేసిన ఆయేషా మీరా హత్య కేసులో నేడు ఒక కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఆమె శరీర అవశేషాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో తెనాలిలో నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. 

విజయవాడలో దారుణ హత్యకు గురైన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా శరీర అవశేషాలను సీబీఐ (CBI) నేడు ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. 2019లో కేసు రీ-ఇన్వెస్టిగేషన్, రీ-పోస్టుమార్టం నిమిత్తం సమాధి నుంచి వెలికితీసిన ఈ అవశేషాలను, నేడు మధ్యాహ్నం 2 గంటలకు తెనాలి చెంచుపేటలోని ఖబరస్థాన్‌లో ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఖననం చేయనున్నారు. ఈ అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సంఘాలు, తెనాలి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అసలేం జరిగింది?
2007, డిసెంబర్ 27: విజయవాడ శివార్లలోని పద్మ లేడీస్ హాస్టల్ బాత్‌రూమ్‌లో ఆయేషా మీరా శవమై కనిపించింది. ఆమెను అత్యాచారం చేసి, పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు తేలింది. పోలీసులు ఈ కేసులో సత్యం బాబు అనే వ్యక్తిని నిందితుడిగా చూపారు. కోర్టు అతనికి కఠిన కారాగార శిక్ష విధించింది.

2017 - సత్యం బాబు విడుదల 
మానవ హక్కుల సంఘాల పోరాటం.. ఆయేషా తల్లిదండ్రుల వాదన (సత్యం బాబు నిరపరాధి అని వారు నమ్మారు) తర్వాత హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేస్తూ, పోలీసుల దర్యాప్తు తీరును తప్పుపట్టింది.

2018లో ఏపీ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా ఆయేషా శరీర అవశేషాలపై పంటి గుర్తులు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. ఒక రాజకీయ కుటుంబ వారసుడిని కూడా విచారించారు.

తండ్రి ఇక్బాల్ బాషా ఆవేదన
తన కుమార్తె అవశేషాలను అందుకునే ముందు ఆయేషా తండ్రి ఇక్బాల్ బాషా మీడియా ముందు భావోద్వేగంగా మాట్లాడారు. ఆయన లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు ఇవే.. 18 ఏళ్లు గడిచినా అసలైన నిందితులు ఎవరో తేలలేదని, సీబీఐ, సిట్ (SIT) అధికారులు ఆధారాలను సరిగ్గా సేకరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసుపై మళ్లీ విచారణ జరిపించాలని కోరారు. ఆ రాత్రి హాస్టల్‌లో ఏం జరిగిందో ఇప్పటికీ మిస్టరీగానే ఉందని ఆవేదన చెందారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చి, తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఆయేషా పేరుతో ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, పేద మహిళలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

ఒక తండ్రిగా తన బిడ్డను భగవంతుడు మళ్లీ తిరిగి ఇవ్వలేడని, కానీ నిందితులను పట్టుకున్నప్పుడే ఆయేషా ఆత్మకు శాంతి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయేషా మీరా కేసు దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్, దర్యాప్తు లోపాలపై పెద్ద చర్చకే దారితీసింది.

Also Read: Nara Lokesh Janhvi Kapoor: నారా లోకేష్ చేసిన పనికి NTR హీరోయిన్ జాన్వీ కపూర్ ఫిదా..గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్!

Also Read: School Holiday: రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవు..వరుసగా 3 రోజులు నాన్‌స్టాప్ హాలీడేస్..ఎక్కడెక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 27, 2026 12:08:43
Nunna, Vijayawada, Andhra Pradesh:

Janhvi Kapoor On Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చాటుకున్న మానవత్వంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్నారిని కాపాడేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక 'SMA టైప్-1' అనే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన జన్యు వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి సోకిన పిల్లల కండరాలు బలహీనపడి, శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ చిన్నారి ప్రాణం నిలవాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'జోల్గెన్స్మా' అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, దీని ధర అక్షరాలా రూ.16 కోట్లు.

మానవత్వం చాటుకున్న దాతలు, మంత్రి
అంత భారీ మొత్తాన్ని భరించే స్తోమత లేని ఆ చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయం కోరారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన అనేక మంది దాతలు సుమారు రూ.10 కోట్ల వరకు విరాళాలు అందించారు.

ఇంకా రూ.6 కోట్లు తక్కువ కావడంతో, విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మిగిలిన రూ.6 కోట్లు అందేలా చూసే బాధ్యత తనదేనని ఆయన ట్విట్టర్ (X) వేదికగా హామీ ఇచ్చారు. "చిన్నారి పునర్విక చేస్తున్న పోరాటం అభినందనీయం.. ఆమెకు మేమున్నామంటూ" ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.

ప్రశంసించిన జాన్వీ కపూర్
మంత్రి లోకేశ్ స్పందించిన తీరుపై బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్పందించారు. లోకేశ్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. "మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఇది నిజంగా ప్రశంసనీయమైన కార్యం" అంటూ కొనియాడారు.

జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒక చిన్నారి ప్రాణం కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావడం, ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి లోకేశ్ తీసుకున్న చొరవపై నెటిజన్లు సైతం "రియల్ హీరో" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

Also Read: AP Mission vatsalya scheme: ఏపీ ప్రభుత్వం తీపి కబురు..నెలనెలా వారి అకౌంట్లోకి రూ.1,750..అర్హతలు ఇవే!

Also Read: School Holiday: రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవు..వరుసగా 3 రోజులు నాన్‌స్టాప్ హాలీడేస్..ఎక్కడెక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 27, 2026 11:21:02
Hyderabad, Telangana:

Venus Transit 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని సంపదతో పాటు ప్రేమ, వివాహం, విలాసవంతం, ఆనందం, ఐశ్వర్యానికి సూచికగా చెప్పుకుంటారు. శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే జీవితంలో సంతోషం విపరీతంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉండవు.. అలాగే బ్యాంకు బాలన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అందుకే ఈ గ్రహాన్ని అత్యంత శుభగ్రహంగా పరిగణిస్తారు. ఇంత ప్రత్యేకత కలిగిన శుక్రుడు మార్చి 2 తెల్లవారుజామున ఒకటి గంటలకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 26వ తేదీ వరకు కూడా అదే రాశిలో సంచార దశలో ఉంటాడు. దీనివల్ల ఎంతో ప్రత్యేకమైన మాలవ్య రాజయోగం ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో మూడు రాశుల వారికి ఆదాయ వనరులతో పాటు లగ్జరీ లైఫ్ లభిస్తుంది. దీంతో పాటు పెద్ద మొత్తంలో కొత్త కొత్త బాధ్యతలు కూడా పొందగలుగుతారు. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అయితే ఇంతటి ప్రత్యేకత కలిగిన శుక్రుడు వల్ల ఏ రాశుల వారు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశుల వారికి ఊహించని జాక్పాట్..
మేషరాశి 

ముఖ్యంగా మేష రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. మార్చి రెండవ తేదీ నుంచి వీరికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే డబ్బులపరమైన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఎంతో సులభంగా పూర్తి అవుతాయి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. విదేశాల్లో కూడా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమతో పాటు వైవాహిక జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. జీవితంలో ఊహించని స్థాయిలో ముందుకు వెళ్తారు. అలాగే ఆందోళన చెందకుండా ధైర్యంతో ఇతరులపై పై చేయి సాధిస్తారు..

మిథున రాశి 
మిథున రాశి వారికి ఈ సమయం చాలా ఉత్తమంగా ఉండబోతోంది. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉన్నత పొజిషన్స్‌లో ఉన్న వ్యక్తులకు కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే నాణ్యతతో కూడిన స్కిల్స్ నేర్చుకుంటారు. ముఖ్యంగా టీం లీడర్ చేసే వ్యక్తులందరికీ ఎంతో కొంత లాభం చేకూరుతుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతోంది. చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితంలో ఊహించని స్థాయిలో ఫలితాలు పొందగలుగుతారు. అంతేకాకుండా గతంలో పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆకస్మికంగా ఊహించని స్థాయిలో డబ్బులు లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ఇక ఈ సమయంలో భారీ మొత్తంలో ఆస్తులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు మనసు ఆధ్యాత్మికతవైపు వెళుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శాంతి విపరీతంగా పెరగడమే కాకుండా.. కుటుంబ సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ రాశి వారికి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 27, 2026 11:11:43
Hyderabad, Telangana:

Pakistan And Afghanistan War Telugu: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తాళిబండ్ల నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్ దళాలకు.. పాక్ సైన్యానికి మధ్య వరుసగా కాల్పులు జరుగుతున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అయితే, ఈ సరిహద్దు ఘర్షణలు కేవలం భద్రతాపరమైన అంశాలే కాకుండా.. ఇప్పుడు పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో కూడా ఊహించని మార్పులకు సంకేతంగా మారుతున్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ఈ పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పట్టును మరింత బలపరుస్తున్నాయని.. అలాగే ఈ సమయంలోనే ఇస్లామాబాదులోని ఎన్నికైన ప్రభుత్వాన్ని నామమాత్రంగా మారుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రతిసారి పాకిస్తాన్లో సైన్యం పాత్ర కీలకంగా మారుతూ వస్తుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జాతీయ భద్రత పేరుతో జనరల్ అసిమ్ మునీర్ ఒక ప్రత్యేకమైన నిర్ణయాత్మక శక్తిగా మారారు. విదేశీ వ్యవహారాల నుంచి రక్షణ వ్యూహాల వరకు అన్ని సైన్యం అడుగుతోనే ముందుకు వెళుతున్నాయి. ఇది చూస్తుంటే మునీర్ కు సైనిక దళాల పైనే కాకుండా దేశ పరిపాలనపై కూడా తిరుగులేని పట్టు లభించిందని స్పష్టంగా అర్థమవుతుంది.

మరోవైపు ఇస్లామాబాదులోని ఎన్నికైన నాయకత్వం ఈ పరిణామాల వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తెలిసినప్పటికీ.. సరిహద్దు ఘర్షణలు అదుపు చేయడానికి కానీ.. ఆఫ్ఘనిస్తాన్తో చర్చలు జరపడం వంటి అంశాలపై ప్రభుత్వానికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా పోయింది.. సైన్యం తీసుకునే నిర్ణయాలకు కేవలం ఆమోదం ముద్ర వేయడానికి ప్రభుత్వం పరిమితమవుతోంది. దీని కారణంగా ప్రజల్లో ఎన్నికైన నేతల పట్ల నమ్మకం సన్నగిల్లి.. దేశం మరోసారి పరోక్ష సైనిక పాలనలోకి వెళ్లే ప్రమాదం కనిపిస్తూ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్‌.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఒకప్పుడు ఆఫ్గానిస్తాన్ తాలిబన్లకు వెన్నుదన్నుగా పాకిస్తాన్ సైన్యం నిలిచేది.. ఇప్పుడు వారే ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారారు.. సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు ఇరుదేశాల మధ్య తీవ్ర విభేదాలను పెంచుతున్నాయి. ఈ అశాంతి సాకుగా చూపి... విపక్షాలను అణిచివేయడానికి.. పౌర హక్కులను సైన్యం కాలరాయడానికి ప్రయత్నిస్తోందని కొంతమంది అంతర్జాతీయ పరిశీలకులు కూడా ఈ అంశాలపై విశ్లేషిస్తున్నారు. మొత్తానికి పాక్ ఆఫ్గాన్ సరిహద్దు ఘర్షణలు జనరల్ ఆ సి మునీర్ అధికారాన్ని స్థిరపరచడమే కాకుండా.. పాకిస్తాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలహీనపరిచే దిశగా ముందుకు సాగుతోందని స్పష్టమవుతోంది.

Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్‌.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 27, 2026 10:52:20
Hyderabad, Telangana:

Snake Repellent Plants: వేసవి కాలం మొదలైందంటే చాలు.. ఎండ వేడికి తట్టుకోలేక పాములు తమ బొరియల నుండి బయటకు వచ్చి చల్లటి ప్రదేశాల కోసం వెతుకుతుంటాయి. ఈ క్రమంలో అవి మన ఇళ్లలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అయితే, ఎటువంటి రసాయనాలు వాడకుండా, కేవలం కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా పాములను మన దరిదాపుల్లోకి రాకుండా చేయవచ్చు. 

ప్రకృతి మనకు ప్రసాదించిన కొన్ని మొక్కలకు పాములను తరిమికొట్టే శక్తి ఉంది. వీటిలో అత్యంత శక్తివంతమైనది సర్పగంధ. ఈ మొక్కలు వెదజల్లే ఘాటైన వాసన సరీసృపాలకు అస్సలు పడదు.

సర్పగంధ
పాములను నిరోధించడంలో ఈ మొక్క అగ్రస్థానంలో ఉంటుంది. ఈ మొక్క ఆకులు, వేర్లు మిరియాల వంటి ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. పాములు ఈ వాసనను తట్టుకోలేక ఆ ప్రాంతం నుండి దూరంగా వెళ్లిపోతాయి. దీని వేర్లు, గింజలలో రెసర్పైన్, సర్పెంటైన్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి పాముల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి, అందుకే అవి ఈ మొక్క దరిదాపుల్లోకి రావడానికి భయపడతాయి. ఈ మొక్క వేళ్లను కిటికీలు లేదా తలుపుల దగ్గర కడితే పాములు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు.

నిమ్మగడ్డి
నిమ్మగడ్డి నుండి వచ్చే సిట్రస్ వాసన మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ పాములకు మాత్రం అది తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇంటి చుట్టూ కంచెలా నిమ్మగడ్డిని పెంచడం వల్ల పాముల బెడద తప్పుతుంది.

తులసి, బంతి పువ్వులు..
మన పెరట్లో సాధారణంగా పెంచే మొక్కలు కూడా పాములను అడ్డుకుంటాయి. బంతి పూల వేర్లు, ఆకుల నుండి వచ్చే ఒక రకమైన ఘాటైన వాసన సరీసృపాలకు నచ్చదు. అలాగే తులసి మొక్క నుండి వెలువడే ఔషధ గుణాలు కలిగిన వాసన కీటకాలతో పాటు పాములను కూడా దూరంగా ఉంచుతుంది.

రసాయనాలతో కూడిన స్ప్రేలు వాడటం కంటే, ఇలాంటి సహజసిద్ధమైన మొక్కలను కుండీల్లో లేదా పెరట్లో పెంచడం వల్ల మీ ఇల్లు సురక్షితంగా ఉండటమే కాకుండా పచ్చదనంతో కళకళలాడుతుంది. వేసవిలో పాముల భయం లేకుండా ఉండాలంటే ఇప్పుడే మీ ఇంట్లో ఒక సర్పగంధ మొక్కను నాటండి!

Also REad: AP Mission vatsalya scheme: ఏపీ ప్రభుత్వం తీపి కబురు..నెలనెలా వారి అకౌంట్లోకి రూ.1,750..అర్హతలు ఇవే!

Also Read: Hair Whorl Superstition: తల మీద రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు జరుగుతాయా? సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోంది?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top