Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sangareddy502319
BRS Clean Sweep: బీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌.. కేసీఆర్‌కు గూడెం మహిపాల్‌ రెడ్డి గిఫ్ట్‌
RKRavi Kumar Sargam
Feb 13, 2026 08:54:10
Patancheruvu, Telangana

Gudem Mahipal Reddy Gift: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేసేలా బీఆర్‌ఎస్‌ పార్టీ కొన్ని సంచలన విజయాలను నమోదు చేసింది. వాటిలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీల ఫలితాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉండగా.. అన్నింటినీ బీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్‌ రెడ్డి పార్టీ ఫిరాయించి ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉన్నారు. తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీకి రావాలని చూస్తున్న గూడెం మహిపాల్‌ రెడ్డి అందులో భాగంగా మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ విజయానికి కృషి చేసినట్లు సమాచారం. ఈ ఫలితాలతో ఆయన తిరిగి బీఆర్‌ఎస్‌లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Municipal Election Results: ఈ మున్సిపాలిటీల్లో హంగ్‌.. హోరాహోరీ పోరులో ఎవరిదో పీఠం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు అసెంబ్లీ పరిధిలోని మొత్తం ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇస్నాపూర్‌, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీకి షాకింగ్‌ ఫలితాలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన గూడెం మహిపాల్‌ రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో తనదైన వ్యూహం రచించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను కాకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. దీంతో ఐదింటికి ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరింది. ఒక్క చోట కూడా అధికారంలోని కాంగ్రెస్‌ పార్టీ గెలకపోగా.. బీజేపీ అడ్రస్‌ లేదు.

Also Read: Bharat Gaurav Train: సమ్మర్‌లో మంచుకొండల్లో దైవ చింతన.. ఏప్రిల్ భారత్ గౌరవ్ రైలు షెడ్యూల్‌ ఇదే!

తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి..
అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించిన గూడెం మహిపాల్‌ రెడ్డి తన తప్పు తెలుసుకున్నట్టు కనిపిస్తోంది. తన నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను క్లీన్‌ స్వీప్‌ చేసి కేసీఆర్‌కు కానుకగా ఇచ్చినట్లు భావిస్తున్నారు. దీంతో తిరిగి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తన సోదరుడిని కేసీఆర్‌ వద్దకు పంపించి రాయబారం నడిపిన మహిపాల్‌ రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల విజయోత్సవంతో మళ్లీ కారెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామం గులాబీ పార్టీలో సరికొత్త జోష్‌ తీసుకువచ్చింది.

Also Read: Tirumala: గుండు చేయించుకున్న దర్శకుడు కె.రాఘవేంద్ర రావు.. ఎందుకో తెలుసా?

మున్సిపాలిటీల ఫలితాలు ఇవే
ఇస్నాపూర్ మున్సిపాలిటీ 26 వార్డులు
బీఆర్‌ఎస్‌ పార్టీ -12
కాంగ్రెస్‌ -10
స్వతంత్రులు -4

ఇంద్రేశం మున్సిపాలిటీ 18 వార్డులు
బీఆర్‌ఎస్‌ పార్టీ - 9
కాంగ్రెస్‌ -6
బీజేపీ - 2
స్వతంత్రులు -1

జిన్నారం మున్సిపాలిటీ 20 వార్డులు
బీఆర్‌ఎస్‌ పార్టీ - 8
కాంగ్రెస్‌ - 6
బీజేపీ - 4
స్వతంత్రులు - 2

గుమ్మడిదల మున్సిపాలిటీ 22 వార్డులు
బీఆర్‌ఎస్‌ పార్టీ -15
కాంగ్రెస్‌ -4
బీజేపీ -2
స్వతంత్రులు -1

గడ్డపోతారం మున్సిపాలిటీ 18 వార్డులు
బీఆర్‌ఎస్‌ పార్టీ -14
కాంగ్రెస్‌- 3
స్వతంత్రులు -1

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Feb 13, 2026 10:23:25
Hyderabad, Telangana:

Pakistan Hockey Team Difficulties: పాకిస్తాన్‌కి చెందిన హాకీ జట్టు ఆస్ట్రేలియాలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. హోటల్ బిల్లు చెల్లించలేక దీనమైన పరిస్థితుల్లో వీధుల్లో జట్టు కూర్చోవలసి వచ్చింది. FIH ప్రో లీగ్ రెండవ లెగ్ సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. జట్టు దగ్గర తగినంత డబ్బు లేకపోవడం కారణంగా.. టీంకు టీమే వీధుల్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఎదురయింది. అయితే వారు అక్కడ అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ హాకీ జట్టుకు సంబంధించిన వారంతా ఫోర్ స్టార్ హోటల్లో బస.. అయితే పాకిస్తాన్ హాకీ జట్టుకు సంబంధించిన అధికారులు, పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డ్ హోటల్ కోసం ప్రత్యేకమైన అడ్వాన్స్ ను చెల్లించినట్లు కూడా హాకీ జట్టుకు పేర్కొంది. అయితే, జట్టులో ఉన్న సభ్యులందరూ కాన్‌బెర్రా చేరుకున్న తర్వాత.. హోటల్ రిసెప్షన్ లో వారికి కేటాయించిన రూముల సమాచారాన్ని అడగ్గా...హోటల్ అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి బుకింగ్ చేయలేదని.. అలాగే అడ్వాన్స్ చెల్లించలేదని స్పష్టం చేశారు..

దీంతో వెంటనే అక్కడే ఉన్న పాకిస్తాన్ హాకీ జట్టు ప్రధాన కోచ్ తాహిర్ జమాన్ పాకిస్తాన్ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించాడు.  కానీ నిధుల కోరత కారణంగా.. గంటలు గడిచిన వారు పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు పొందలేకపోయారు.. ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చిన పాకిస్తాన్ హాకీ జట్టుకు విశ్రాంతి లేకపోవడం, తినడానికి తిండి లేకపోవడం, ఉండడానికి చోటు లేకపోవడం వంటి సమస్యలు వచ్చాయి.  అంతేకాకుండా వారు అక్కడి నుంచి ఓ చిన్న హోటల్‌కి వెళ్లారు.. అక్కడ ఒక్క గదిలోనే దాదాపు ముగ్గురు నుంచి నలుగురు ప్లేయర్స్ ఉండాల్సి వచ్చిందని సమాచారం. ఆ మరుసటి రోజు వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో మైదానానికి తిరిగి రావాల్సి వచ్చిందని తెలుస్తోంది. అక్కడ ఆస్ట్రేలియా చేతిలో 2-3 తేడాతో ఓడిపోయారు..

పాకిస్తాన్ హాకీ జట్టు అన్ని విధాల సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా తో పాటు జర్మనీ వంటి అగ్ర జట్ల కంటే ఈ జట్టు నిరంతరం వెనకబడుతూ వస్తోంది. ఇప్పటికే ఈ జట్టు రోలీ గుళ్లో ఆరు మ్యాచ్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.. కానీ కాన్‌బెర్రాలో జరిగిన సంఘటన ఆట కంటే ప్రభుత్వ వైఫల్యమే ఎక్కువగా కనిపిస్తోంది. హాకీ జట్టుకు సంబంధించిన అందరూ ప్లేయర్స్ అవమానాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.  అర్జెంటీనాలో జరిగిన ప్రో లీగ్ సమయంలో కూడా వీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

Also Read: Telangana Municipal Election Results 2026 LIVE: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ.. ఈ స్థానాల్లో ఇండిపెండెంట్స్ కీ రోల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 13, 2026 09:58:25
Nereducharla, Telangana:

Janasena First Win In Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన జోరును ప్రదర్శిస్తుండగా, అనూహ్యంగా జనసేన పార్టీ కూడా తెలంగాణ గడ్డపై బోణి కొట్టింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన ఈ పోరులో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్న తరుణంలో, సూర్యాపేట జిల్లాలో జనసేన అభ్యర్థి సాధించిన విజయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకుంది. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి ఘన విజయం సాధించారు.

నేరేడుచర్ల ఫలితం ఇలా..
మొత్తం 15 వార్డులున్న నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి.
కాంగ్రెస్: 09 వార్డులు (మెజారిటీ)
బీఆర్ఎస్: 05 వార్డులు
జనసేన: 01 వార్డు

నేరేడుచర్ల 14వ వార్డు నుంచి జనసేన తరఫున పోటీ చేసిన అర్రూరి విజయలక్ష్మి విజయం సాధించారు. ఈమె ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన అధ్యక్షుడు సరికొప్పుల నాగేశ్వరరావు సతీమణి.

336 స్థానాల్లో పోటీ.. ఎట్టకేలకు విజయం
తెలంగాణ వ్యాప్తంగా జనసేన పార్టీ మొత్తం 336 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. ప్రచార సమయంలో అనేక మలుపులు చోటు చేసుకున్నప్పటికీ, కనీసం ఒక్క స్థానంలోనైనా గెలవడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారని భారీగా ఆశించినప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. అయినప్పటికీ జనసైనికులు క్షేత్రస్థాయిలో కష్టపడి ఈ విజయాన్ని అందుకున్నారు.

రాష్ట్రవ్యాప్త ట్రెండ్
కాంగ్రెస్ హవా: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 శాతానికి పైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.

బీఆర్ఎస్ & బీజేపీ: ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కొన్ని పురపాలికల్లో గట్టి పోటీ ఇస్తుండగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును ప్రదర్శిస్తోంది.

చివరిగా.. నేరేడుచర్లలో సాధించిన ఈ చిన్న విజయం తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్తుకు పునాది అని కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ అప్రతిహత విజయాల మధ్య జనసేన ఖాతా తెరవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Also Read: Mahashivratri Benefits: మహాశివరాత్రి విశేషం.. ఆలయం నుండి ఈ వస్తువు తెచ్చుకుంటే మీ దారిద్య్రం తీరినట్లే!

Also Read: Pawan Kalyan Balakrishna Assembly: అసెంబ్లీలో పవన్-బాలయ్య సందడి..డిప్యూటీ సీఎం ఛాంబర్‌కు వెళ్లిన 'లెజెండ్'!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 13, 2026 09:56:54
Amaravati, Andhra Pradesh:

Nara Lokesh vs YSRCP: 'ముఖ్యమంత్రి  తల్లిని అంబటి రాంబాబు అవమానిస్తే వదిలిపెడతామా? ఒక తల్లిని అవమానిస్తూ మాట్లాడితే రెండు చిన్న మాటలు ఎలా అవుతాయి? సొంత తల్లిని, చెల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు, మాకు ఉన్నాయి. మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు' అని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 'మహిళలను మనం గౌరవించాలి. ఆ బాధ్యత మనందరిపై ఉంది. హౌస్ లోపల, బయట మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది' అని వివరించారు.

Also Read: BRS Clean Sweep: బీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌.. కేసీఆర్‌కు గూడెం మహిపాల్‌ రెడ్డి గిఫ్ట్‌

శాసనమండలిలో శాంతిభద్రతలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ మండలి వైఎస్సార్‌సీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయేల్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీకి చురకలు అంటిస్తూ లోకేశ్‌ ఉగ్రరూపం దాల్చారు. 'మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని అవమానించారు. ముఖ్యమంత్రి తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా?' అని ధ్వజమెత్తారు. 

Also Read: Municipal Election Results: ఈ మున్సిపాలిటీల్లో హంగ్‌.. హోరాహోరీ పోరులో ఎవరిదో పీఠం

ఈ సందర్భంగా నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. 'అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని అవమానించారు. అవునా, కాదా సమాధానం చెప్పాలి. అంబటి రాంబాబు వినియోగించిన పదాలను ఒక్కసారి గమనించాలి. ముఖ్యమంత్రి తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా?' అని ప్రశ్నించారు. 'మహిళలను మనం గౌరవించాలి. ఆ బాధ్యత మనందరిపై ఉంది. హౌస్ లోపల, బయట మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది' అని గుర్తుచేశారు. టీడీపీ కార్యకర్త వైఎస్ భారతీరెడ్డి గురించి మాట్లాడితే తక్షణమే చర్యలు తీసుకున్నాం. జైలుకు పంపించాం' అని నారా లోకేశ్‌ చెప్పారు.

Also Read: Bharat Gaurav Train: సమ్మర్‌లో మంచుకొండల్లో దైవ చింతన.. ఏప్రిల్ భారత్ గౌరవ్ రైలు షెడ్యూల్‌ ఇదే!

'మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి రెండు చిన్న మాటలు మాట్లాడారని చెబుతున్నారు. ఒక తల్లిని అవమానిస్తే చిన్న మాటలు ఎలా అవుతాయి? అలాంటి వ్యక్తిని సభ్యులు సమర్థిస్తే ఎలా?' అని నారా లోకేశ్‌ ప్రశ్నించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా మహిళలను కించపరిచే పదాలు వాడకూడదని సూచించారు. అలాంటివి పోత్సహించవద్దని కోరారు. తాము ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదని ప్రకటించారు.

'ఒక మహిళ గురించి మాట్లాడితే మేం భావోద్వేగానికి గురవుతాం. ఒక తల్లిని అవమానిస్తూ మాట్లాడితే రెండు చిన్న మాటలు ఎలా అవుతాయి? సొంత తల్లిని, చెల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు. మాకు ఉన్నాయి' అని వైఎస్సార్‌సీపీకి నారా లోకేశ్‌ చురకలు అంటించారు. 'మాకు బాధ్యత ఉంది. మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు. వైఎస్‌ జగన్ తల్లి, ఎవరి తల్లైనా, చెల్లైనా, అక్కైనా.. ఎవరి గురించైనా మాట్లాడితే ప్రజాప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అని స్పష్టం చేశారు. అది చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చెప్పారని తెలిపారు. 

'నెల్లూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీడీపీ మహిళ ఎమ్మెల్యే గురించి ఏం మాట్లాడారో చూశాం. దానికి సమాధానం లేదు. అంబటి రాంబాబు విషయంలో వైఎస్‌ జగన్ వెళ్లి ప్రెస్‌మీట్‌లో సింపుల్‌గా రెండు చిన్న మాటలు అన్నారని చెబుతాడు. అవి రెండు చిన్న మాటలా? ఒక తల్లిని అవమానిస్తే చిన్న మాటలా? నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడవచ్చా?' అని మండలిలో నారా లోకేశ్‌ నిలదీశారు. 

'టీడీపీ వారు ఎవరైనా మాట్లాడితే ఆధారాలు ఇవ్వండి, చర్యలు తీసుకుంటాం. టీడీపీ కార్యకర్త భారతీరెడ్డి గురించి చిన్న పోస్ట్ పెడితే చర్య తీసుకున్నాం. అదీ మా చిత్తశుద్ధి' అని నారా లోకేశ్‌ ప్రకటించారు. 'ఐదేళ్లు మీరు ఏం చేశారు? మా పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే ఏం చేశారు? సభలో మా తల్లిని అవమానిస్తే మీరు ఏం చేశారు?' అని వైఎస్సార్‌సీపీని ప్రశ్నించారు. అంబటి రాంబాబు ఇచ్చిన స్టేట్ మెంట్ తప్పా, ఒప్పా.. తేల్చి చెప్పాలని మంత్రి లోకేష్ నిలదీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 13, 2026 09:39:01
Hyderabad, Telangana:

Zimbabwe Vs Australia Match T20 World Cup: 2026 టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే పవర్‌హౌస్ ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. శ్రీలంకలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-బి పోరులో జింబాబ్వే అద్భుత విజయాన్ని అందుకుంది.

టీ20 ప్రపంచకప్‌ల చరిత్రలో ఆస్ట్రేలియాపై జింబాబ్వేకు ఇది రెండో విజయం. గతంలో 2007 తొలి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన ఆఫ్రికా జట్టు, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసింది.

జింబాబ్వే బ్యాటింగ్ - బెన్నెట్ మెరుపులు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వేకు బ్రియాన్ బెన్నెట్ వెన్నెముకగా నిలిచాడు. 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు రాబట్టారు. బెన్నెట్ 64 పరుగులతో అజేయంగా నిలవగా, కెప్టెన్ సికందర్ రజా కేవలం 13 బంతుల్లో 25 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు.

ఆసీస్ కుప్పకూలిన వేళ
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. పవర్‌ప్లే ముగిసేసరికి 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రావిస్ హెడ్ (17), జోష్ ఇంగ్లిస్ (8) త్వరగానే పెవిలియన్ చేరగా.. కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ ఖాతా తెరవకుండానే ఔటయ్యారు.

బ్లెస్సింగ్ ముజరబాని (4 వికెట్లు) తన వేగంతో ఆసీస్ బ్యాటర్లను వణికించగా, బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లు తీసి అతనికి సహకరించాడు. ముజరబాని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.

గ్రూప్-బి పాయింట్ల పట్టిక
ఈ విజయంతో జింబాబ్వే సూపర్-8 రేసులో ముందంజ వేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఇలా ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక రెండు మ్యాచ్‌లను నెగ్గి గ్రూప్-బి పాయింట్ల పట్టికలో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి రెండో స్థానంలో జింబాబ్వే (2 విజయాలు), ఆస్ట్రేలియా మూడో స్థానంలో, ఐర్లాండ్ నాలుగో స్థానం (2 ఓటములు), ఒమన్ ఐదో స్థానం(2 ఓటములు)లో కొనసాగుతున్నాయి.

ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి?
ఈ షాకింగ్ ఓటమితో ఆస్ట్రేలియా సూపర్-8 చేరాలంటే ఒమన్, శ్రీలంకతో జరిగే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెట్ రన్ రేట్ సానుకూలంగా ఉన్నప్పటికీ, ఒత్తిడిని అధిగమించడం ఆసీస్‌కు ఇప్పుడు సవాలుగా మారింది.

ఫ్లాష్ బ్యాక్: 2007 నాటి షాక్
2007 ప్రపంచకప్‌లో కూడా బ్రెండన్ టేలర్ (60 నాటౌట్) వీరోచిత పోరాటంతో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించింది. అప్పట్లో రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ వంటి దిగ్గజాలు ఉన్న జట్టును ఓడించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు 2026లో మరోసారి అదే స్థాయిలో సత్తా చాటారు.

Also Read: Rajasthan Royals New Captain: రాజస్థాన్ రాయల్స్ కొత్త సారథిగా రియాన్ పరాగ్?! సామ్‌సన్ వారసుడిగా యువ సంచలనం!

Also Read: Shriya Saran Kathak Dance: 25 ఏళ్లు అయ్యింది.. ఇంకా ఆ కోరిక ఇంకా నెరవేరలేదు..టాలీవుడ్ బ్యూటీ క్రేజీ కామెంట్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 13, 2026 09:12:20
Hyderabad, Telangana:

Mahashivratri Significance: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయానికి వెళ్లే భక్తులందరూ శివుడి అనుగ్రహం కోసం రకరకాల పూజలు చేస్తుంటారు. అయితే, పూజ అనంతరం ఆలయం నుండి ఒక ప్రత్యేకమైన వస్తువును ఇంటికి తెచ్చుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణతో పాటు శివలింగానికి చేసే అభిషేకం అత్యంత ఫలదాయకం. పూజ ముగిసిన తర్వాత కింద పేర్కొన్న వస్తువులను ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

అభిషేకించిన బిల్వ పత్రం (మారేడు దళం)
శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వ పత్రం. శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత ఆ మారేడు దళాన్ని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఈ పత్రాన్ని మీ బీరువాలో లేదా పర్సులో ఉంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలిగి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం.

పార్వతీ దేవి ప్రసాదం (సింధూరం, గాజులు)
శివరాత్రి నాడు శివ-పార్వతుల కళ్యాణ వైభవాన్ని స్మరించుకుంటారు. అమ్మవారికి సమర్పించిన సింధూరం, గాజులు లేదా పూలను ప్రసాదంగా తెచ్చుకుని ధరించాలి. దీనివల్ల వైవాహిక జీవితంలోని మనస్పర్థలు తొలిగి, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

తీర్థం లేదా అభిషేక జలం
శివుడికి అభిషేకం చేసిన పవిత్ర జలాన్ని కొద్దిగా ఇంటికి తెచ్చుకోవడం శ్రేష్ఠం. ఈ నీటిని ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు, ప్రతికూల శక్తులు నశిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మహాశివరాత్రి (ఫిబ్రవరి 15, 2026) నాడు భక్తితో శివుడిని ఆరాధించి, ఈ పవిత్ర వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా మానసికంగా కూడా ధైర్యం లభిస్తుంది.

గమనిక: ఈ సమాచారం కేవలం మత విశ్వాసాలు, లోకచారాలపై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. భక్తుల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం అందించడమైనది.

Also Read: KGBV Rats Bite News: KGBV హాస్టల్‌లో కలకలం..నిద్రిస్తున్న బాలికలను కొరికిన ఎలుకలు..11 మందికి గాయాలు!

Also Read: Rajasthan Royals New Captain: రాజస్థాన్ రాయల్స్ కొత్త సారథిగా రియాన్ పరాగ్?! సామ్‌సన్ వారసుడిగా యువ సంచలనం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 13, 2026 08:27:27
Balapur, Telangana:

BRS Party vs Congress: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు దాదాపు పూర్తయ్యాయి. అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా.. తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన విజయాలు నమోదు చేసుకుంది. బీజేపీ సింగిల్‌ డిజిట్‌కు పరిమితమవగా.. కవిత ఫార్వార్డ్‌ బ్లాక్‌ ఒక చోట గెలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దాదాపు పాతిక మున్సిపాలిటీల్లో మెజార్టీ ఎవరికీ రాలేదని తెలుస్తోంది.  కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ హోరాహోరీగా తలపడగా కొన్ని చోట్ల సమానంగా వార్డులు దక్కించుకోగా.. మరికొన్ని చోట్ల ఈ రెండు పార్టీలతోపాటు మిగతా పార్టీలు స్థానాలు దక్కించుకోవడంతో ఎవరికీ మెజార్టీ దక్కలేదు. ఆయా మున్సిపాలిటీలు హంగ్‌గా మారడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Also Read: Govt Employees: ప్రభుత్వానికి ఉద్యోగుల సంచలన లేఖ.. పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏల కోసం ఆల్టిమేటం

ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం 14 మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చిందని తెలుస్తోంది. జిన్నారం, జమ్మికుంట, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కోహీర్, అలంపూర్, జనగామ, ఇస్నాపూర్‌, జహీరాబాద్‌, అలియాబాద్, మంచిర్యాల, కేసముద్రం, దేవరకద్ర, అమరచింత మున్సిపాలిటీల్లో ఎవరికీ మెజార్టీ దక్కలేదు. ఈ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధికంగా వార్డులు దక్కించుకున్నా మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం సొంతం చేసుకునేందుకు మాత్రం మెజార్టీ దక్కలేదు.

Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు భారీ శుభవార్త.. నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం?

==> మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్‌ పార్టీ 4, బీజేపీ 1, స్వతంత్రులు ఒక చోట గెలిచారు.
==> సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్‌ పార్టీ 5, బీజేపీ 1, స్వతంత్రులు రెండు చోట్ల గెలుపు.
==> మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 16 స్థానాలు ఉండగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీ 8 చొప్పున వార్డులు గెలిచాయి.

ఎవరిదో పీఠం
ఈ మున్సిపాలిటీల్లో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రాజకీయం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ సమానంగా సీట్లు దక్కించుకున్న మున్సిపాలిటీల్లో ఏం జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. కాకపోతే మిగిలిన స్థానాల్లో గెలిచిన స్వతంత్ర కౌన్సిలర్లు కీలకంగా మారనున్నారు. హంగ్ రావడంతో ఆయా మున్సిపాలిటీల్లో క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. కౌన్సిలర్లు చేజారిపోకుండా.. ఇతర పార్టీల్లో చేరకుండా ఆయా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. హంగ్‌ వచ్చిన మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. ఎక్స్‌ అఫిషియో సభ్యుల ఓట్లతో మున్సిపాలిటీలను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరి బీఆర్‌ఎస్‌ పార్టీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 13, 2026 08:01:00
A.Konduru, Andhra Pradesh:

KGBV School Rats Bite News: ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) హాస్టల్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న బాలికలపై ఎలుకలు గుంపుగా దాడి చేయడంతో హాస్టల్ ప్రాంగణం ఒక్కసారిగా భీతావహంగా మారింది. ప్రభుత్వ హాస్టళ్లలో పారిశుధ్య లోపం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన అద్దం పడుతోంది. విద్యార్థినులు సురక్షితంగా ఉండాల్సిన చోట ఇలాంటి ప్రమాదం జరగడం తీవ్ర చర్చకు దారితీసింది.

ఘటన ఎలా జరిగింది?
ఫిబ్రవరి 13 తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరులోని హాస్టల్‌లో విద్యార్థినులు నిద్రిస్తుండగా, ఒక్కసారిగా ఎలుకలు వారిపై దాడి చేశాయి. బాలికల చేతులు, కాళ్లు, ముఖాలను ఎలుకలు కొరకడంతో వారు నొప్పితో, భయంతో కేకలు వేశారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది బాలికలకు గాయాలయ్యాయి. రక్తం రావడంతో సిబ్బంది వెంటనే స్పందించి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తీవ్రంగా స్పందించారు. హాస్టల్‌లో అపరిశుభ్రతకు కారణాలేంటి? ఎలుకల బెడద ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అనే అంశాలపై విచారణకు ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హాస్టల్‌లో పారిశుధ్యం మృగ్యమవ్వడం వల్లే ఎలుకలు పెరిగిపోయాయని స్థానికులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గాయపడిన బాలికలు ప్రస్తుతం కోలుకుంటున్నారని, వారికి యాంటీ-రాబిస్ వంటి అవసరమైన ఇంజెక్షన్లు ఇచ్చామని వైద్యులు తెలిపారు.

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు నిరుపేద విద్యార్థినులకు ఆసరాగా ఉండాలి. కానీ, ఇలాంటి ఘటనలు జరగడం వల్ల విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో అభద్రతాభావం ఏర్పడుతోంది. ప్రభుత్వం తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టళ్లలో పారిశుధ్య తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Also Read: School Holiday: మహాశివరాత్రికి సెలవుల జాతర..వరుసగా 3 రోజులు స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు..ఎప్పటి నుంచి?

Also Read: EPS-95 Pension Update: ఉద్యోగులకు ముఖ్యమైన అప్‌డేట్..47 లక్షల మందికి రూ.9,000 పెన్షన్..ప్రభుత్వం ఏం చెబుతోంది?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 13, 2026 07:52:05
Hyderabad, Telangana:

How Did Valentine's Day Start History In Telugu: వరల్డ్ వైడ్‌గా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వాలెంటెన్స్ డే రానే వచ్చేసింది.. గులాబీ పూలతో, ప్రత్యేకమైన గిఫ్టులతో, ప్రేమ కురిపించే శుభాకాంక్షలతో ఈరోజు ప్రేమికులంతా ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే, ఈ రోజు కేవలం ఒక వేడుక మాత్రమే కాదని చరిత్ర చెబుతోంది.. దీని వెనక గొప్ప త్యాగంతో పాటు సుదీర్ఘ చరిత్ర దాగి ఉందని మీ అందరికీ తెలుసా? అసలు ఈ వాలెంటెన్స్ డే ఎలా మొదలైంది? ఫిబ్రవరి 14వ తేదీన ఉన్న అసలైన ప్రాముఖ్యత ఏంటి? అనే అంశాలను ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం.

వాలెంటెన్స్ డేకు సంబంధించిన మూలాలు క్రీస్తు శకం మూడో శతాబ్దపు రోమన్ సామ్రాజ్యం నుంచి ఉన్నాయి.  అప్పట్లో రోమన్ సామ్రాజ్యాన్ని రెండవ క్లాడియస్ పరిపాలించేవాడు. అయితే ఈ రాజు ఒక వింత నిబంధన అమలు చేస్తూ వచ్చేవాడు. ఈ రోమన్ రాజు వివాహం చేసుకున్న పురుషుల కంటే.. ఒంటరిగా ఉన్న యువకులే యుద్దంలో సమర్థవంతంగా పోరాడుతారని ఎక్కువగా నమ్మేవారు. అందుకే తన రాజ్యంలో ఉన్న యువకులంతా ఎవరూ పెళ్లి చేసుకోకూడదని రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు..

కానీ ఆ సమయంలో సెయింట్ వాలెంటైన్ (Valentine) అనే ఒక క్రైస్తవ పాస్టర్ ఆ రాజు కళ్ళు కప్పి.. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని.. వివాహం ఒక పవిత్ర బంధం అని భావించి.. ఆయన ఆరాధ్యంలో ఉన్న రాజుకు తెలియకుండా ప్రేమికులకు రహస్యంగా వివాహాలు జరిపించేవారు.. ఆ వాలెంటైన్ చేస్తున్న పనులను క్లాడియస్ చక్రవర్తి గుర్తించారు. ఆయనను బంధించి మరణశిక్ష విధిస్తాడు.  అయితే ఆ పాస్టర్ జైల్లో ఉన్న సమయంలో అక్కడే ఉన్న జైలర్ కుమార్తెతో స్నేహం పెంచుకుంటారు. అయితే, ఆమెకు కంటిచూపు ఉండదు.. ఆ పాస్టర్ తన శక్తిని ఉపయోగించి ఆమెకు కంటి చూపు తెప్పిస్తారని చరిత్రకారులు చెబుతున్నారు. 

ఆ పాస్టర్ను ఉరి తీసే ముందు.. ఆమెకు ఒక లేఖను రాస్తూ.. దాని కింద ఫ్రమ్ యువర్ వాలెంటైన్ అని సంతకం చేశారు. అది ఫిబ్రవరి 14వ తేదీ రోజే జరిగింది.. క్రీస్తు శకం 496 లో గెలాసియస్ ఈరోజును అధికారికంగా.. సెయింట్ వాలెంటైన్స్ డేగా ప్రకటించారు.  ప్రాచీన రోమన్లు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే లౌపర్కాలియా పండగను క్రమంగా క్రైస్తవ మతంలోకి మార్చి.. వాలెంటెన్స్ డేగా నామకరణం చేశారు. 14వ శతాబ్ద సమయంలో బ్రిటన్‌తో పాటు ప్రాన్స్ దేశాలకు సంబంధించిన కవులు వాలెంటెన్స్ డే పై రచనలు చేసి.. ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశారు. దీంతో అప్పటినుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వ్యాలెంటెన్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Also Read: Telangana Municipal Election Results 2026 LIVE: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ.. ఈ స్థానాల్లో ఇండిపెండెంట్స్ కీ రోల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 13, 2026 07:37:44
Muhana, Rajasthan:

Rajasthan Royals Captain Riyan Parag: రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీ ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ జట్టు కొత్త కెప్టెన్‌గా నేడు అనగా ఫిబ్రవరి 13 సాయంత్రం నాటికి అధికారికంగా ఎంపిక కానున్నారు. యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా వంటి హేమాహేమీల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ పరాగ్ వైపు మొగ్గు చూపడం విశేషం. 2019లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి రాజస్థాన్ రాయల్స్‌తోనే ఉన్న రియాన్ పరాగ్‌పై ఫ్రాంచైజీకి ఉన్న నమ్మకం మరోసారి నిరూపితమైంది.

నాయకత్వ రేసులో పరాగ్ ముందంజ
రాజస్థాన్ రాయల్స్ థింక్ ట్యాంక్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ రేసులో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజా పేర్లు వినిపించినా.. ఫ్రాంచైజీతో పరాగ్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధం అతనికి ప్లస్ అయ్యింది. 2025 సీజన్ వేలానికి ముందు RR పరాగ్‌ను ఏకంగా రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది.

సంజు సామ్‌సన్ సంకేతాలు
గత సీజన్‌లో సంజు సామ్‌సన్ గాయపడినప్పుడు పరాగ్ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించడం ఒక ముందస్తు సూచనగా నిలిచింది. స్వయంగా సామ్‌సన్ కూడా భవిష్యత్తు నాయకత్వం గురించి గతంలోనే స్పష్టతనిచ్చారు. "నేను ఎప్పటికీ కెప్టెన్‌గా ఉండలేను, భవిష్యత్తు కోసం ఎవరైనా సిద్ధం కావాలి. రియాన్ పరాగ్ జట్టును నడిపించగలడని మేము నమ్ముతున్నాము" అని సామ్‌సన్ 2025లో పేర్కొన్నారు.

రియాన్ పరాగ్ కెరీర్‌లో 2024 సీజన్ ఒక మైలురాయిగా నిలిచింది. 16 మ్యాచ్‌ల్లో 52.09 సగటుతో, 149.22 స్ట్రైక్ రేట్‌తో 573 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో అతని అద్భుత ఫామ్ కారణంగా అదే ఏడాది టీమ్ ఇండియా తరపున టీ20, వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించనున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రియాన్ పరాగ్ రికార్డు సృష్టించబోతున్నాడు. 2008లో దివంగత షేన్ వార్న్ సారథ్యంలో మొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత, మళ్లీ ట్రోఫీని ముద్దాడని రాయల్స్.. పరాగ్ నేతృత్వంలో ఆ నిరీక్షణకు ముగింపు పలకాలని ఆశిస్తోంది.

రియాన్ పరాగ్ నిలకడ లేని ఆటగాడు అనే విమర్శల నుండి జట్టును నడిపించే స్థాయికి ఎదగడం ఒక గొప్ప ప్రయాణం. ఈ యువ కెప్టెన్ ఆధ్వర్యంలో రాజస్థాన్ రాయల్స్ 2026లో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.

Also REad: Pawan Kalyan Balakrishna Assembly: అసెంబ్లీలో పవన్-బాలయ్య సందడి..డిప్యూటీ సీఎం ఛాంబర్‌కు వెళ్లిన 'లెజెండ్'!

Also Read: School Holiday: మహాశివరాత్రికి సెలవుల జాతర..వరుసగా 3 రోజులు స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు..ఎప్పటి నుంచి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Faceboo

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 13, 2026 07:31:25
Jangaon, Telangana:

Jangaon Municipality Telugu News: జనగామ జిల్లా కేంద్రంలో మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.. మున్సిపల్ పీఠం ఎక్కేది ఎవరని అంశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా.. చివరకు ఇండిపెండెంట్ కౌన్సిలర్లే ఈ చదరంగంలో కింగ్ మేకర్లుగా మారబోతున్నారు. మున్సిపల్ పీఠం ప్రక్రియలో భాగంగా వీరే ఇప్పుడు క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు. 

ఈ మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ ఏ ఒక్క పార్టీకి లేకపోవడంతో ఇప్పుడు రెండు పార్టీలు స్వాతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం వేచి చూస్తూ ఉన్నాయి.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. నలుగురు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు.  ఇద్దరు స్వాతంత్రం అభ్యర్థులు ఇప్పటికే బీఆర్ఎస్ గూటికి చేరినట్లు ప్రచారం కూడా జరుగుతోంది... మిగిలిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టినట్లు అధికారిక సమాచారం.. దీంతో ఇరు పక్షాల మధ్య బాల పరీక్ష నువ్వా నేనా అన్నట్లుగా మారింది. రెండు వైపులా సరైన ఫిగర్ ఉండడంతో ఇప్పుడు మున్సిపల్ పీఠం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. 

తమ కౌన్సిలర్లు చేజారి పోకుండా ప్రధాన పార్టీలు ఇప్పటికే క్యాంపు రాజకీయాలను తెరలేపినట్లు తెలుస్తోంది. రహస్య ప్రాంతాల్లో చర్చలు, ప్రలోభాలతో పాటు బుజ్జగింపులతో జనగామ రాజకీయం గంట గంటకు రంగులు మారుతూ వస్తోంది. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఇప్పుడు అక్కడ ప్రతి ఓటు అత్యంత కీలకం.. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో ఎక్స్-అఫీషియో ఓట్లు కూడా కీలకం కానున్న  సమయంలో, పార్టీల వ్యూహకర్తలు లెక్కలు  సరి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఇక ఇందులో బిఆర్ఎస్ వ్యూహం ఏంటంటే.. తమ పాత బలాన్ని కాపాడుకుంటూ.. ఇండిపెండెంట్‌ల మద్దతుతో పీఠాన్ని నిలబెట్టుకోవడానికి చూస్తోంది.. కాంగ్రెస్ అధికార బలంతో పాటు అసంతృప్త కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకొని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

Also Read: Telangana Municipal Election Results 2026 LIVE: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ.. ఈ స్థానాల్లో ఇండిపెండెంట్స్ కీ రోల్

మొత్తానికి జనగామ మున్సిపాలిటీ భవిష్యత్తు ఇప్పుడు స్వాతంత్ర కౌన్సిలర్ల చేతిలో ఉండడం విశేషం.. వారు చివరి నిమిషంలో వేటు మొగ్గు చూపుతారో? ఎవరికి ఓటు వేస్తారో అనే అంశంపై చైర్మన్ ఎంపిక అనేది ఆధారపడి ఉంటుంది.. పట్టణ ప్రజలంతా ఈ రాజకీయ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లోనే ఈ రాజకీయ ఉత్కంఠకు స్థిరపడి అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Also Read: Telangana Municipal Election Results 2026 LIVE: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ.. ఈ స్థానాల్లో ఇండిపెండెంట్స్ కీ రోల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 13, 2026 05:02:20
Hyderabad, Telangana:

Rahu Transit 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు గ్రహాన్ని చాయాగ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం వ్యక్తుల జీవితాల్లో ఆకస్మిక కీర్తితో పాటు సంపదను తీసుకువస్తుంది. అయితే, ఈ గ్రహం నక్షత్ర సంచారం లేదా రాశి సంచారం చేసినప్పుడు మొత్తం 12 రాశుల ప్రభావితం అవుతాయి. మార్చి 29న రాహువు శతభిషా నక్షత్రం రెండో పాదంలోకి సంచారం చేస్తాడు. మే 31వ తేదీ వరకు ఇదే పాదంలో సంచార దశలో ఉంటాడు. నిజానికి రాహువు సంచారం కొన్ని రాష్ట్రాల వారికి లాభదాయకంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. నిజంగా ఈ సమయంలో నాలుగు రాశుల వారైతే జీవితంలో ఎన్నడు ఊహించని లాభాలు పొందబోతున్నారు. దీంతో ఈ రాశుల వారికి అనుకున్న ధన లాభాలు కూడా కలగబోతున్నాయి. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందుబోయే రాశులేవో తెలుసుకోండి.

ఈ రాశులవారికి లాభాలు:
మేష రాశి 
రాహువు సంచార ప్రభావంతో మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా లాభదాయకంగా ఉండబోతోంది. వీరు అనేక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఆలోచన శక్తి కూడా మరింత పెరుగుతుంది. దీని కారణంగా వీరు సానుకూలమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే అదృష్టం విపరీతంగా పెరిగి ఆధ్యాత్మిక వైపు అడుగులు వేస్తారు. తల్లిదండ్రుల సపోర్టు కూడా ఈ సమయంలో లభించబోతోంది. 

మిథున రాశి 
మిథున రాశి వారికి రాహువు నక్షత్ర సంచార మార్పుతో ఈ సమయం చాలా శుభప్రదంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆలోచనతో పాటు విప్లవాత్మకమైన మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. చట్టపరమైన విషయాల్లో కూడా వీరు ఊహించని విజయాల సాధిస్తారు. అంతేకాకుండా విభేదాలు కూడా చాలావరకు ముగిసే అవకాశాలు ఉన్నాయి. 

తులారాశి 
శతభిషా నక్షత్రం రెండవ పాదంలోకి రాహువు ప్రవేశించడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయి దీర్ఘకాలిక కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. డబ్బు సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.

మకర రాశి 
మకర రాశి వారికి రాహువు సంచార ప్రభావంతో అనేక రకాల కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో గణనీయమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా ఆకస్మికంగా ఉప్పందంటాయి. చదువుల్లో కూడా విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన దిమ్మతిరిగే లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 13, 2026 04:51:02
Hyderabad, Telangana:

First Solar Eclipse Zodiac Signs Prediction 2026 Telugu: ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 7వ తేదీన ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది ఖగోళ సంఘటన మాత్రమే కాదు.. ఈ సమయంలో చంద్రుడు రాశి సంచారం చేయడమే కాకుండా.. కొన్ని గ్రహాలు నక్షత్రం మార్పులు చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ సూర్యగ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యగ్రహణం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది.. సాయంత్రం ఏడు గంటలకు ఇది ముగుస్తోంది. ఇదే సమయంలో చంద్రుడు ఉదయం 9 గంటలకు శనిగ్రహం పాలించే కుంభంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత తొమ్మిది గంటల 15 నిమిషాలకు శతభిషా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. ఇలా డబుల్ సంచారం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనేకమార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రాశులవారికి బంపర్ ప్రయోజనాలు:
మేషరాశి 
చంద్రుడు రాశి సంచారంతో పాటు నక్షత్రం మార్పు కారణంగా మేష రాశి వారికి ఈ సమయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఎలాంటి ప్రణాళికలు అయినా విఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మానసిక ఆందోళన తో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలు అనేక సమస్యలకు దారి తీయవచ్చు. అంతేకాకుండా శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు చంద్రుని చంచారం మానసికంగా శారీరకంగా అలసటకు గురవుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గిపోతుంది. తల్లిదండ్రులు ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంతత కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దీనికి కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

తులారాశి 
తులారాశి వారికి ఈ సమయంలో అనేక రకాల అదనపు పనులు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కుటుంబంలో అనేక విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో రిస్కు తీసుకోవడం మంచిది కాదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పెద్ద లావాదేవీల  పరంగా రిస్కు తీసుకోవడం మంచిది కాదు. అంతేకాకుండా ఈ సమయంలో ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

కుంభరాశి 
కుంభరాశి వారికి చంద్రుడు సంసారం అనేక రకాల అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వైవాహిక జీవితంలో వాదనలకు దూరంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారికి ఈ సమయంలో పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరంగా మెరుగుపడే అవకాశాలున్నప్పటికీ.. భారీ మొత్తంలో ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్న వారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 12, 2026 15:26:48
Hyderabad, Telangana:

Bharat Gaurav Train Yatra: వేసవికాలం భారతదేశమంతటా ఎండలు భగభగమంటాయి. ఎక్కడా చూసినా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. మరి అలాంటి సమయంలో మంచుకొండల్లో ఉంటే ఎలా ఉంటుంది మస్తుంటుంది కదా? అలాంటి మంచుకొండల్లో దైవచింతనలో మునిగిపోతే ఇంకా అద్భుతమే. అలాంటి సదుపాయాన్ని భారత రైల్వే శాఖ కల్పిస్తోంది. కశ్మీర్‌, వైష్ణోదేవి యాత్రకు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి భారత్‌ గౌరవ రైలు నడవనుంది. చల్లటి ప్రదేశాల్లో శక్తివంతమైన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read: YS Jagan: తిరుమల వివాదంపై మండలిలో చంద్రబాబును కడిగేయండి: వైఎస్ జగన్

ఏప్రిల్‌లో ప్రత్యేక భారత్ గౌరవ్ రైలు ద్వారా కుటుంబ విహారానికి వెళ్లే వారికి కాశ్మీర్ హాలిడే స్పెషల్ అందిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. అన్ని వయసుల వారితో పాటు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక చింతనలో గడిపే వృద్ధులకు వైష్ణో దేవి యాత్రలను ప్రవేశపెడుతున్నట్లు సౌత్ స్టార్ రైలు ప్రొడక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టూర్ ఆపరేటింగ్ హెడ్ రమేష్ అయ్యంగార్లతో కలిసి ఆయన టూర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Also Read: Tirumala: గుండు చేయించుకున్న దర్శకుడు కె.రాఘవేంద్ర రావు.. ఎందుకో తెలుసా?

భారత గౌరవ రైలు యాత్ర ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభం కానుంది. కాశ్మీర్ హాలిడే స్పెషల్ వైష్ణో దేవి యాత్ర రైలులో ప్రయాణించే వారికి అన్ని రకాల సౌకర్యాలతోపాటు, లగేజ్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ, మెడికల్ ఫెసిలిటీ అన్ని రకాల ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు, పర్యాటకులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉంది. యాత్ర బుకింగ్ ఐఆర్‌సీటీసీలో అందుబాటులో లేదని స్పష్టం చేశారు.

Also Read: KTR: మూడు ముక్కలు చేసినా హైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే!: కేటీఆర్‌

బుకింగ్ ఎలా..?
ఈ యాత్ర పూర్తిగా భారత మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన సౌత్ స్టార్ రైలు టూరిజం ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. యాత్ర సీట్లు బుక్ చేసుకోవడానికి 93550 21516లో లేక తమ వెబ్‌సైట్ www.tourtimes.in లో బుక్‌ చేసుకోవాలి. లేదంటే హైదరాబాద్‌ బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలోని ఉన్న వారి కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. ఈ యాత్ర బుకింగ్ రేట్లు 33 శాతం రాయితీతో ఉన్నాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 12, 2026 14:18:52
Hyderabad, Telangana:

Realme 15 5G Price Cut: రియల్ మీ కంపెనీ గత సంవత్సరం విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్స్‌లో Realme 15 5G మొబైల్ ఒకటి. ఇది అద్భుతమైన బ్యాటరీతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఈ మొబైల్ ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Realme 15 5G మొబైల్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Realme 15 5G స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల (17.27 cm) 1.5K HyperGlow 4D Curve+ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 6500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి కంపెనీ ప్రత్యేకమైన దీనికి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను కూడా అందిస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7300+ 5G (4nm) చిప్‌సెట్ ప్రాసెసర్పై రన్ అవుతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఈ మొబైల్ చాలా సహాయపడుతుంది. కాబట్టి ఎక్కువగా గేమింగ్ చేసేవారు దీనిని కొనుగోలు చేయొచ్చు. 

ఈ Realme 15 5G స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 7000mAh Titan బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే ఈ బ్యాటరీని చార్జ్ చేసేందుకు ప్రత్యేకంగా 80W Ultra చార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది. దీంతోపాటు ఈ మొబైల్ వెనక భాగంలో 50MP మెయిన్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అయితే ఇది చాలా ప్రత్యేకమైన Sony IMX882 సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు అదనంగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే ఫ్రంట్ భాగంలో ఎంతో అద్భుతమైన 50MP AI సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన 4k రికార్డింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ 128 sGB  స్టోరేజ్‌తో పాటు 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. దీంతోపాటు ఇందులో IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో బేస్ వేరియంట్ మొబైల్ ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ఆరు శాతం ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.28,999తో లభిస్తోంది. ఇక ఈ మొబైల్‌ను మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,400 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్‌ బోనస్ కూడా అందుబాటులో ఉంది. ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.26 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను కేవలం రూ.2,999 లోపే పొందవచ్చు. అయితే, ఈ బోనస్ అనేది పాత మొబైల్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. కండిషన్ బాగుంటేనే ఈ స్మార్ట్‌ఫోన్‌పైన పేర్కొన్న ధరకు పొందవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top