Realme 15 5G Price Cut: రియల్ మీ కంపెనీ గత సంవత్సరం విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్స్‌లో Realme 15 5G మొబైల్ ఒకటి. ఇది అద్భుతమైన బ్యాటరీతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఈ మొబైల్ ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Realme 15 5G మొబైల్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Realme 15 5G స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల (17.27 cm) 1.5K HyperGlow 4D Curve+ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 6500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి కంపెనీ ప్రత్యేకమైన దీనికి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను కూడా అందిస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7300+ 5G (4nm) చిప్‌సెట్ ప్రాసెసర్పై రన్ అవుతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఈ మొబైల్ చాలా సహాయపడుతుంది. కాబట్టి ఎక్కువగా గేమింగ్ చేసేవారు దీనిని కొనుగోలు చేయొచ్చు.
ఈ Realme 15 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 7000mAh Titan బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే ఈ బ్యాటరీని చార్జ్ చేసేందుకు ప్రత్యేకంగా 80W Ultra చార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది. దీంతోపాటు ఈ మొబైల్ వెనక భాగంలో 50MP మెయిన్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అయితే ఇది చాలా ప్రత్యేకమైన Sony IMX882 సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు అదనంగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే ఫ్రంట్ భాగంలో ఎంతో అద్భుతమైన 50MP AI సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన 4k రికార్డింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ 128 sGB స్టోరేజ్‌తో పాటు 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. దీంతోపాటు ఇందులో IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో బేస్ వేరియంట్ మొబైల్ ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ఆరు శాతం ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.28,999తో లభిస్తోంది. ఇక ఈ మొబైల్‌ను మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,400 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.26 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను కేవలం రూ.2,999 లోపే పొందవచ్చు. అయితే, ఈ బోనస్ అనేది పాత మొబైల్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. కండిషన్ బాగుంటేనే ఈ స్మార్ట్‌ఫోన్‌పైన పేర్కొన్న ధరకు పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Bharat Gaurav Train Yatra: వేసవికాలం భారతదేశమంతటా ఎండలు భగభగమంటాయి. ఎక్కడా చూసినా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. మరి అలాంటి సమయంలో మంచుకొండల్లో ఉంటే ఎలా ఉంటుంది మస్తుంటుంది కదా? అలాంటి మంచుకొండల్లో దైవచింతనలో మునిగిపోతే ఇంకా అద్భుతమే. అలాంటి సదుపాయాన్ని భారత రైల్వే శాఖ కల్పిస్తోంది. కశ్మీర్, వైష్ణోదేవి యాత్రకు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించి భారత్ గౌరవ రైలు నడవనుంది. చల్లటి ప్రదేశాల్లో శక్తివంతమైన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: YS Jagan: తిరుమల వివాదంపై మండలిలో చంద్రబాబును కడిగేయండి: వైఎస్ జగన్
ఏప్రిల్‌లో ప్రత్యేక భారత్ గౌరవ్ రైలు ద్వారా కుటుంబ విహారానికి వెళ్లే వారికి కాశ్మీర్ హాలిడే స్పెషల్ అందిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. అన్ని వయసుల వారితో పాటు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక చింతనలో గడిపే వృద్ధులకు వైష్ణో దేవి యాత్రలను ప్రవేశపెడుతున్నట్లు సౌత్ స్టార్ రైలు ప్రొడక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టూర్ ఆపరేటింగ్ హెడ్ రమేష్ అయ్యంగార్లతో కలిసి ఆయన టూర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
Also Read: Tirumala: గుండు చేయించుకున్న దర్శకుడు కె.రాఘవేంద్ర రావు.. ఎందుకో తెలుసా?
భారత గౌరవ రైలు యాత్ర ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభం కానుంది. కాశ్మీర్ హాలిడే స్పెషల్ వైష్ణో దేవి యాత్ర రైలులో ప్రయాణించే వారికి అన్ని రకాల సౌకర్యాలతోపాటు, లగేజ్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ, మెడికల్ ఫెసిలిటీ అన్ని రకాల ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు, పర్యాటకులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంది. యాత్ర బుకింగ్ ఐఆర్‌సీటీసీలో అందుబాటులో లేదని స్పష్టం చేశారు.
Also Read: KTR: మూడు ముక్కలు చేసినా హైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే!: కేటీఆర్
బుకింగ్ ఎలా..?
ఈ యాత్ర పూర్తిగా భారత మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన సౌత్ స్టార్ రైలు టూరిజం ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. యాత్ర సీట్లు బుక్ చేసుకోవడానికి 93550 21516లో లేక తమ వెబ్‌సైట్ www.tourtimes.in లో బుక్ చేసుకోవాలి. లేదంటే హైదరాబాద్ బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలోని ఉన్న వారి కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. ఈ యాత్ర బుకింగ్ రేట్లు 33 శాతం రాయితీతో ఉన్నాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YSRCP Meeting: 'అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మండలిలో మంచి సంఖ్యా బలం ఉండడంతో ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలి. తిరుమల లడ్డూ వివాదంపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి' అని వైఎస్సాఆర్‌సీపీ ఎమ్మెల్సీలకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. 'లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారు. వైఎస్సార్‌సీపీపై నిరంతరం బురద జల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. లడ్డూ వ్యవహారంలో సమాధానం చెప్పాల్సింది, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందీ చంద్రబాబే' అని స్పష్టం చేశారు.
Also Read: Tirumala: గుండు చేయించుకున్న దర్శకుడు కె.రాఘవేంద్ర రావు.. ఎందుకో తెలుసా?
'చంద్రబాబు హయాంలోనే ట్యాంకర్ల సరఫరా జరిగింది. రిజెక్ట్ అయినా నెయ్యి మళ్లీ చంద్రబాబు హయాంలోనే టీటీడీలోకి వచ్చింది. సీబీఐ సిట్ ఛార్జిసీటుకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే' అని వైఎస్సార్‌సీపీ వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనంతా స్కామ్‌ల మయం. విశాఖలో రూ.5 వేల కోట్ల భూమిని చంద్రబాబు తన బంధువుకు కట్టబెట్టారు. గతంలో ఏనాడూ అలా జరగలేదు.. ఏ ముఖ్యమంత్రి ఇలా బరి తెగించలేదు. వీటన్నింటినీ మండలిలో గట్టిగా నిలదీయాలి' అని మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు భారీ శుభవార్త.. నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం?
శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ..'తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. పార్టీ నాయకులపై దాడులు, అక్రమ కేసులు.. ఇవన్నీ కూడా లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే' అని ఎమ్మెల్సీలతో మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 'చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని గుళ్లలో పూజలు చేసినా చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు' అని చెప్పారు. 'ఒక అబద్ధం సృష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైఎస్సార్‌సీపీకి ఏమాత్రం సంబంధం లేదు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Also Read: Govt Employees: ప్రభుత్వానికి ఉద్యోగుల సంచలన లేఖ.. పీఆర్‌సీ, పెండింగ్ డీఏల కోసం ఆల్టిమేటం
'ప్రజల తరఫున గొంతు వినిపించకూడదనే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీని గుర్తించడం లేదు. అసెంబ్లీలో బలం తక్కువ.. అక్కడ మన గొంతు వినపడకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండగా.. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. శాసనమండలిలో బలం ఉండడంతో మాట్లాడే అవకాశం వస్తుంది. మైక్ ఇస్తారు కాబట్టి ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Xiaomi 18 Pro Max Price: ప్రముఖ Xiaomi స్మార్ట్ ఫోన్ కంపెనీ సెప్టెంబర్ నెలలో చైనా మార్కెట్‌లోకి తమ Xiaomi 18 సిరీస్‌ను విడుదల చేసింది. ఇది మొత్తం మూడు మోడల్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో మరో మోడల్ Xiaomi 18 Ultra స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే, ఇటీవలే లీకైన ఫీచర్స్ ఏంటో? ఇది ఎప్పుడు విడుదల కాబతుందో? భారత మార్కెట్‌లో లాంచింగ్ తేదీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Xiaomi 18 స్మార్ట్ ఫోన్ సిరీస్ భారత మార్కెట్‌లో అతి త్వరలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న Xiaomi 17, 17 Pro స్మార్ట్‌ఫోన్స్ 6.3-అంగుళాల డిస్ప్లేలను కలిగి ఉన్నాయి. ఇక ఇటీవల లీకైన వివరాల ప్రకారం.. Xiaomi 18 6.4-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది అద్భుతమైన కాంపాక్ట్ డిజైన్ తో పాటు ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే Xiaomi 18 Pro స్మార్ట్ ఫోన్ 6.4-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇందులో కొన్ని స్పెషల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Xiaomi 18 స్మార్ట్‌ఫోన్ సిరీస్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా అందిస్తోంది. అలాగే మొత్తం అతి త్వరలో విడుదల కాబోయే నాలుగు మోడల్స్ (Xiaomi 18, 18 Pro, 18 Pro Max, 18 Ultra) 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఇటీవల లీకైన వివరాల ప్రకారం.. Xiaomi 18 Pro, 18 Pro Max స్మార్ట్‌ఫోన్స్ డ్యూయల్ 200-మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రో మోడల్‌లోని రెండవ కెమెరా పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ ప్రీమియం డిస్ప్లే సెటప్‌ను కూడా అందించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ మోడల్స్ Qualcomm Snapdragon 8 Elite Gen 6 చిప్‌సెట్ ప్రాసెసర్పై రన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అల్ట్రా మోడల్ మొబైల్ మాత్రం Snapdragon 8 Elite Gen 6 Pro ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
K Raghavendra Rao Head Shave: సినీ పరిశ్రమలో తన ఇంద్రజాలంతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన అలనాటి దర్శకుడు కె రాఘవేంద్ర రావు కొత్త లుక్‌లో కనిపించారు. ఎప్పుడూ తెల్ల గడ్డంతోపాటు తెల్ల వస్త్రాలు ధరించి ఉండే రాఘవేంద్ర రావు గడ్డం తీసి.. గుండు చేయించుకున్నారు. తిరుమల పర్యటనకు వెళ్లిన ఆయన తలనీలాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గుండులో ఆయనను కొందరు గుర్తుపట్టలేకపోయారు. రాఘవేంద్ర రావు గుండు దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Also Read: KTR: మూడు ముక్కలు చేసినా హైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే!: కేటీఆర్
తిరుమల శ్రీవారిని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. రాఘవేంద్ర రావు కుటుంబానికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు ఇచ్చారు. దర్శనానంతరం ఆలయం వెలుపల రాఘవేంద్ర రావును కొందరు చూసి ఆశ్చర్యపరిచారు. ఎప్పుడూ ప్రత్యేక లుక్‌లో ఉండే ఆయన గుండు, గడ్డం తీసి కనిపించడంతో రాఘవేంద్ర రావును కొందరు గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత కొందరు గుర్తుపట్టి అతడితో ఫొటోలు దిగారు.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు భారీ శుభవార్త.. నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం?
భారీ విరాళం
తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తుల సౌకర్యార్థం టీటీడీకి భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన జస్పెర్ అనే భక్తుడు ఆలయానికి 5 అత్యాధునిక బ్యాటరీ వాహనాలను విరాళంగా అందించారు. ఈ వాహనాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుమలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. ఒక్కో వాహనం విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని తెలిపారు. పర్యావరణ హితంగా, ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా ఉండే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు భక్తుల రవాణాకు ఎంతో దోహదపడతాయని చెప్పారు. తిరుమల కొండపైకి వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు నడవడానికి ఇబ్బంది పడకుండా ఆలయ పరిసరాల్లో ఈ వాహనాలు ఉచితంగా సేవలు అందిస్తాయని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
Also Read: Govt Employees: ప్రభుత్వానికి ఉద్యోగుల సంచలన లేఖ.. పీఆర్‌సీ, పెండింగ్ డీఏల కోసం ఆల్టిమేటం
సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు
తిరుమల పవిత్రతపై జరుగుతున్న రాజకీయ యుద్ధంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కేరళకు చెందిన సీపీఐ నాయకుడు విమల్‌తో కలిసి తిరుమ శ్రీవారిని దర్శించుకున్న నారాయణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నేతలు చేస్తున్న విమర్శలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తమ పరిధిలో తాము ఉండాలని హితవు పలికారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుల నమ్మకాన్ని బజారున పడేయద్దని సూచించారు. 'రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోండి కావాలంటే కత్తులతో దాడి చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ భక్తుల మనోభావాలను మాత్రం దెబ్బతీయకండి' సీపీఐ నారాయణ విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hydra Demolition Latest Telugu News: నగరంలో చెరువులతో పాటు ప్రభుత్వ భూములు, అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా ఏమాత్రం ఆగడం లేదు.. ముఖ్యంగా అక్రమ కట్టడాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రాధికారులు మరోసారి తమ ప్రతాపం చూపారు.. గురువారం ఉదయం మాదాపూర్ ఖానామెట్ పరిధిలో సర్వేనెంబర్ 55లో ఉన్న అర్ధనారీశ్వర ఆలయ ప్రాంగణంలో వెలసిన దుకాణాలను అధికారులు భారీ పోలీస్ బందోబస్తుల మధ్య కూల్చివేశారు.
అయితే ఈ కూల్చివేతకు సంబంధించిన సమాచారం ఆలయ కమిటీ సభ్యులతో పాటు అర్చకులు, స్థానికులకు తెలియడంతో అక్కడికి వారి చేరుకొని అధికారులను అడ్డుకున్నారు.. అంతేకాకుండా JCB వాహనాల ముందు బయటాయించి నిరసన వ్యక్తం చేయడం అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.. అధికారులు, స్థానికులకు మధ్య జరిగిన చిన్న తోపులాటతో ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా స్థానికులతో కిక్కిరిసిపోయింది.
హైడ్రా అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆలయ నిర్వాహకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాధితులు ఈ సమయంలో రెండు ప్రధాన అంశాలు లేవనెత్తారు.. కనీసం ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చివేతను చేపట్టారని వారి ఆరోపించారు. అలాగే ఈ భూమికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో స్టే అమల్లో ఉందని.. న్యాయస్థాన ఆదేశాలను కూడా ఖాదర్ చేయకుండా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని వారు వాపోతున్నారు..
మరోవైపు అధికారులు అక్రమ కట్టడాలను తొలగించడంలోనే భాగంగా ఈ చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని.. ప్రభుత్వానికి సంబంధించిన భూముల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని వారి స్పష్టం చేశారు.. భారీగా ఘటన స్థలంలో మొహరించిన పోలీసులు.. నిరసనకారులను చెదరగొట్టి కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Shriya Saran Kathak Desire: దశాబ్ద కాలానికి పైగా తన అందం, అభినయంతో దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఏలిన సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ మనసులో ఓ తీరని కోరిక ఉందట. కెరీర్ ప్రారంభించి పాతికేళ్లు కావస్తున్నా, ఇప్పటికీ ఆ కల నెరవేరలేదని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించిన శ్రియ, పెళ్లై పాప పుట్టిన తర్వాత కూడా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు.
నృత్యంపై మక్కువ
శ్రియ కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక అద్భుతమైన కథక్ నృత్యకారిణి కూడా. సినిమాల్లో ఆమె చేసే డ్యాన్స్ మూమెంట్స్ చూసి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు. అయితే, తనలోని అసలైన డ్యాన్సర్‌ను వెండితెరపై పూర్తిస్థాయిలో ప్రదర్శించే అవకాశం ఇంతవరకు రాలేదని ఆమె పేర్కొన్నారు.
ఆ డ్రీమ్ రోల్ ఏంటంటే?
"నాకు డ్యాన్స్ అంటే ప్రాణం. ఒక నృత్యకారిణి జీవిత ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొనే సవాళ్లను ప్రతిబింబించేలా ఉండే ఒక డ్యాన్స్ సెంట్రిక్ మూవీ (Dance-centric film) చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. గత 25 ఏళ్లుగా అలాంటి పవర్‌ఫుల్ పాత్ర కోసం ఎదురుచూస్తున్నాను, కానీ ఆ అవకాశం ఇంకా తలుపు తట్టలేదు" అని శ్రియ వెల్లడించారు.
పెళ్లి తర్వాత తన వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ శ్రియ అందంలోనూ, ఫిట్‌నెస్‌లోనూ నేటి తరం హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్నారు. సహాయ నటిగా 'RRR' వంటి చిత్రాల్లో మెరిసినా, తనలోని కళాకారిణిని సంతృప్తి పరిచే ఆ ఒక్క పాత్ర కోసం ఆమె ఆశగా వేచి చూస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఎంతటి స్టార్ హోదా ఉన్నా, మనసుకి నచ్చిన పని చేసే అవకాశం రాకపోతే ఆ వెలితి అలాగే ఉంటుందని శ్రియ మాటలు బట్టి అర్థమవుతోంది. మరి ఈ సీనియర్ బ్యూటీ కల ఏ దర్శకుడు నెరవేరుస్తాడో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అరచేతుల వైకుంఠం చూపి అధికారం దక్కించుకుందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మరోవైపు బీజేపీ 12 ఏళ్లుగా తెలంగాణకు 12 పైసల పని కూడా చేయలేదు. అది 'పూజకు పనికిరాని పువ్వు'' అని ఎద్దేవా చేశారు. వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి అనే నానుడిని గుర్తు చేస్తూ.. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని కేటీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు పోయినా.. బీఆర్‌ఎస్ పార్టీకి వెన్నెముక కార్యకర్తలేనని స్పష్టం చేశారు.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు భారీ శుభవార్త.. నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం?
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానం పలికిన అనతరం మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరినా.. కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా కేసీఆర్ నాయకత్వంలోనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. 'హైదరాబాద్‌లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నంబర్ వన్ కోటగా నిలిచింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లినా.. బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. శేరిలింగంపల్లిలోని 24 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేసే సత్తా బీఆర్‌ఎస్ పార్టీకి ఉంది' అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Govt Employees: ప్రభుత్వానికి ఉద్యోగుల సంచలన లేఖ.. పీఆర్‌సీ, పెండింగ్ డీఏల కోసం ఆల్టిమేటం
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలే సుల్తాన్‌బజార్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో దోపిడీలు, చందానగర్‌లో జ్యువెలరీ షాపులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు కుదేలయ్యాయని, కొత్త కొలువులు రాకపోగా ఉన్నవి పోయే పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
త్వరలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత పటిష్టం చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే లేడని భయపడవద్దని.. అందరికీ అండగా తాను, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు ఉంటారని తెలిపారు. ఏ అవసరమొచ్చినా తాము అందుబాటులో ఉంటామని గులాబీ శ్రేణులకు హామీ ఇచ్చారు. 'తప్పుడు ఓటు వేస్తే ఐదేళ్ల పాటు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి' అని ప్రజలకు కేటీఆర్ విన్నవించారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan Balakrishna In Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఒక ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. టాలీవుడ్‌లోని ఇద్దరు అగ్ర కథానాయకులు, రాజకీయ దిగ్గజాలు అయిన నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఛాంబర్‌కు వెళ్లి పలకరింపు
సాధారణంగా అధికారిక కార్యక్రమాల్లో ఈ ఇద్దరు నేతలు ఎదురుపడినప్పుడు పలకరించుకోవడం సహజం. అయితే, ఈసారి బాలకృష్ణ నేరుగా అసెంబ్లీలోని పవన్ కళ్యాణ్ ఛాంబర్‌కు వెళ్లి ఆయనతో సమావేశమవ్వడం విశేషం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరిద్దరూ ఇలా ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే తొలిసారి.
చర్చకు వచ్చిన అంశాలు
సుమారు కొంతసేపు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గమైన హిందూపురంలోని పెండింగ్ పనులు, తాజా అభివృద్ధి కార్యక్రమాలపై బాలయ్య డిప్యూటీ సీఎంతో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్' టాక్ షోలో పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చినప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఈ ఇద్దరు 'పవర్ ప్యాక్డ్' నేతలు కలిసి కనిపించడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సినిమా వెండితెరపైనే కాకుండా, రాజకీయాల్లోనూ ఈ ఇద్దరు నేతలు ఒకే తాటిపై నడుస్తూ ప్రభుత్వ అభివృద్ధి అజెండాలో భాగస్వాములవ్వడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Realme 16 Pro Price Cut: ఎప్పటినుంచో మంచి స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా ప్రీమియం బడ్జెట్ రేంజ్‌లో.. అయితే, మీకు సమయం రానే వచ్చేసింది. ముఖ్యంగా రియల్ మీ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన ప్రీమియం మొబైల్ అత్యంత తక్కువ ధరలోనే పొందవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రియల్‌మీ 16 ప్రో మొబైల్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై ఎన్నో రకాల స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మార్కెట్లో రియల్‌మీ 16 ప్రో స్మార్ట్ ఫోన్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. 6.7 అంగుళాల AMOLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 120Hz లేదా 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఎండలో కూడా ఈ మొబైల్ డిస్ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ మొబైల్ వెనక భాగంలో చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50MP Sony సెన్సార్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా వేరియంట్స్‌ను బట్టి అదనంగా 32MP లేదా 50MP పెరిస్కోప్ లెన్స్ కెమెరా కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫ్రంట్ భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 లేదా 7+ Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ తో పాటు మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్‌గా చేయొచ్చు. ఇందులో కంపెనీ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 512 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 5200mAh బ్యాటరీతో లభిస్తోంది.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని సులభంగా చార్జ్ చేసేందుకు ఎంతో ప్రత్యేకమైన 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తుంది. దీనివల్ల కేవలం 20 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అవుతుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అదేవిధంగా ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ రూ.39,999తో అందుబాటులో ఉంది. అలాగే ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా ఈ మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రూ.2 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ అనుసంధానం ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసినప్పటికీ కూడా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్ ను ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి పేమెంట్ చేస్తే ఏకంగా రూ.36 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్ని పోను మొబైల్ కేవలం రూ.3,999 లోపే పొందవచ్చు. ఇక ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ పై ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Electricity Workers Protest Telugu Latest News: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జగిత్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగులు రణభేరీ మోగించారు.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..గురువారం జిల్లా కేంద్ర విద్యుత్ భవన్ వద్ద విద్యుత్ కార్మికులంతా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు సంబంధించిన వివిధ విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉద్యోగులంతా మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో తమ విధులను పక్కనపెట్టి.. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రత్యేకమైన నిరసన వ్యక్తం చేశారు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేపట్టారు.. ఈ సందర్భంగా మీడియాతో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మాట్లాడారు.. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్రం వ్యవహరిస్తూ వస్తుందని.. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న సూపరింటెండెంట్ ఇంజనీర్ సుదర్శనం మాట్లాడుతూ.. కేంద్రం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలు కేవలం యజమానులకు మాత్రమే లాభం చేకూర్చేలా ఉన్నాయని.. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులకు, ఉద్యోగులకు ఇవి ఏవిధంగా పనికి రావని.. అలాగే కొంతమంది ఉద్యోగులకు ఇవి శాపంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న కార్మిక చట్టాలను ఇలా నీరుగార్చడం అత్యంత దుర్మార్గమని.. ఈ చట్టాలు అమల్లోకి వస్తే, ఉద్యోగుల భద్రతకు ప్రశ్నార్ధకంగా మారుతుందని.. వెంటనే కేంద్ర ప్రభుత్వం వీటిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించడంపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్త చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టుపెట్టే ప్రయత్నాలు అడ్డుకుంటామని ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది విద్యుత్ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకవేళ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకుండా చట్టాలను సవరించకపోతే.. రాబోయే రోజుల్లో.. ఊహించని స్థాయిలో అన్నిచోట్ల ఆందోళన ఉదృతం చేస్తామని ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు.
Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Japanese Instant Cheesecake Hack: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక 'స్వీట్' హ్యాక్ తెగ వైరల్ అవుతోంది. అదే జపనీస్ ఇన్స్టంట్ చీజ్‌కేక్. సాధారణంగా చీజ్‌కేక్ తయారు చేయాలంటే ఓవెన్, గుడ్లు, క్రీమ్ చీజ్ వంటి ఎన్నో పదార్థాలు కావాలి. కానీ, ఈ వైరల్ పద్ధతిలో కేవలం రెండు పదార్థాలతో, అదీ వండాల్సిన అవసరం లేకుండానే నోరూరించే డెజర్ట్‌ను సిద్ధం చేయవచ్చు. వంటరాని వారు కూడా ఎంతో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ రెసిపీ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
కావలసిన పదార్థాలు..
గ్రీక్ పెరుగు (Greek Yogurt): ఒక కప్పు.
బిస్కెట్లు: ఓరియో (Oreo) లేదా బిస్కాఫ్ (Biscoff) వంటి మీకు నచ్చిన 5-6 బిస్కెట్లు.
తయారీ విధానం..
స్టెప్ 1: ఒక చిన్న గిన్నె లేదా కప్పు తీసుకుని అందులో గ్రీక్ యోగర్ట (పెరుగు)ను వేయండి.
స్టెప్ 2: ఇప్పుడు బిస్కెట్లను తీసుకుని, పెరుగులో ఒకదాని పక్కన ఒకటి నిలువుగా (Vertical) అమర్చండి. బిస్కెట్లు పూర్తిగా పెరుగులో మునిగిపోయేలా మెల్లగా నొక్కండి.
స్టెప్ 3: దీనిపై మూత పెట్టి కనీసం 6 గంటలు లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచండి.
అసలు మ్యాజిక్ ఇక్కడే..
ఫ్రిజ్‌లో ఉంచిన సమయంలో, బిస్కెట్లు పెరుగులోని తేమను గ్రహించి చాలా మృదువుగా మారుతాయి. పెరుగు కూడా గట్టిపడి, చీజ్‌కేక్‌కు ఉండాల్సిన 'క్రీమీ' ఆకృతిని పొందుతుంది. మరుసటి రోజు కప్పు నుండి దీనిని బయటకు తీస్తే, అచ్చం బేకరీలో దొరికే సాఫ్ట్ చీజ్‌కేక్ లాగే కనిపిస్తుంది.
గ్యాస్ లేదా ఓవెన్ వాడాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో ఖరీదైన క్రీమ్ చీజ్ అవసరం లేకుండానే అదే రుచిని ఆస్వాదించవచ్చు. బ్యాచిలర్స్ లేదా పిల్లలు కూడా దీన్ని ఈజీగా చేసేయొచ్చు. తక్కువ శ్రమతో కొత్తగా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ జపనీస్ ఇన్స్టంట్ చీజ్‌కేక్ హ్యాక్ ఒక బెస్ట్ ఆప్షన్. మీరూ ఒకసారి ట్రై చేసి చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPFO Digital Reforms 2026: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కోట్లాది మంది చందాదారులకు విప్లవాత్మకమైన వార్తను అందించింది. ఇకపై పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం మొబైల్ రీఛార్జ్ చేసినంత సులభం కాబోతోంది. 2026 ఏప్రిల్ నాటికి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా నేరుగా పీఎఫ్ నిధులను పొందే సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని తొలగించి, సాంకేతికతను జోడించడం ద్వారా EPFO తన సేవలను ఆధునీకరిస్తోంది.
కొత్త మొబైల్ యాప్ ప్రత్యేకతలు
కార్మిక మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తున్న ఈ కొత్త యాప్ ద్వారా చందాదారులు కింది సదుపాయాలను పొందవచ్చు. తమ ఖాతాలో ఎంత నగదు ఉందో సులభంగా చూడవచ్చు. అర్హత కలిగిన మొత్తాన్ని విత్‌డ్రా చేయడానికి కేవలం తమ UPI PIN ఉపయోగిస్తే సరిపోతుంది. నిధులు నేరుగా లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలోకి సురక్షితంగా బదిలీ అవుతాయి.
ఎందుకు ఈ మార్పు?
ప్రతి సంవత్సరం EPFOకి 5 కోట్లకు పైగా క్లెయిమ్‌లు వస్తున్నాయి. ఈ రద్దీని తగ్గించడానికి ఆటోమేటెడ్ వ్యవస్థ అవసరమని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం డబ్బులు చేతికి అందడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా చూడటానికి ప్రస్తుతం 100 డమ్మీ ఖాతాలతో ప్రయోగాత్మక పరిశీలనలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం చందాదారులు UAN పోర్టల్ లేదా UMANG యాప్‌ను ఉపయోగిస్తున్నారు. 2026 నుండి రాబోయే కొత్త యాప్ వీటికి అదనం. దీనివల్ల చందాదారులకు సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి. బ్యాంకులతో సమానంగా డిజిటల్ సేవల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
EPFOకి స్వయంగా బ్యాంకింగ్ లైసెన్స్ లేదు, కాబట్టి నిధుల బదిలీ ప్రక్రియను సులభతరం చేయడానికి బ్యాంకులతో అనుసంధానం చేస్తూ ఈ UPI గేట్‌వేను రూపొందిస్తున్నారు.
ఏప్రిల్ 2026 నుండి ఈ విధానం అమల్లోకి వస్తే, అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఇది సామాన్య ఉద్యోగులకు డిజిటల్ ఇండియా అందించే అతిపెద్ద కానుకగా మారుతుంది.
Also Read: Super Over Rules In Cricket: సూపర్ ఓవర్ రూల్స్ తెలుసా? అది టై అయితే విజేతని ఎలా డిసైడ్ చేస్తారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook