Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500004
IPL Commentators Salary: ఐపీఎల్ కామెంట్రీకి జీతం ఎంతో తెలుసా? క్రికెటర్ల ఏడాది సంపాదన నెల రోజుల్లో వ...
HDHarish Darla
Mar 20, 2026 10:36:31
Hyderabad, Telangana

IPL Commentators Salary Per Match: మరో వారంలో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్ కేవలం ఆటగాళ్లు, ఫ్రాంఛైజీలు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కే కాకుండా మ్యాచ్‌ వ్యాఖ్యాతలకు కూడా కోట్లు డబ్బు వచ్చివాలనుంది. ఆటగాళ్ల గ్రౌండ్‌లో బౌండరీలతో స్టేడియంలో ప్రేక్షకులను ఉత్సాహ పరుస్తుంటే.. టీవీల్లో చూసేవారికి మాత్రం కామెంటేటర్స్ (వ్యాఖ్యాతలు) ఉత్సాహాన్ని నింపుతారు. అయితే కామెంటరీ బాక్స్‌లో వ్యాఖ్యాతలుగా ఉన్న వారికి ఎంత జీతం వస్తుందో తెలుసా? నిజం తెలిస్తే అవాక్కవాల్సిందే. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)ను ప్రపంచంలోనే అత్యంత ధనిక టీ20 లీగ్‌గా పరిగణిస్తారు. ఈ లీగ్ ద్వారా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఏటా వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తుంది. టీమ్ ఫ్రాంఛైజీలతో పాటు స్టార్ క్రికెటర్లు, మ్యాచ్‌లను టెలికాస్ట్ చేసే ఛానల్స్ భారీ మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తారు. సాధారణంగా దృష్టి ఆటగాళ్లపైనే ఉన్నప్పటికీ, ప్రత్యక్ష మ్యాచ్‌లకు జీవం పోసే వ్యాఖ్యాతల జీతాలు కూడా తక్కువేమీ కావు. 

ప్రేక్షకులకు మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడం బుల్లితెరలో ఉండే కామెంటేటర్ల బాధ్యత. ఆటగాళ్లలోని ఒత్తిడి, ఉత్సాహం, వ్యూహం, మానసిక స్థితిని ప్రేక్షకులు అర్థం చేసుకోగలిగే రీతిలో తెలియజేయడం వ్యాఖ్యాతల బాధ్యతగా వస్తుంది. అందుకే వారి అనుభవం, భాషపై పట్టు, ఆటపై అవగాహన ఆధారంగా వారికి భారీ జీతం చెల్లిస్తారు.

హిందీ వ్యాఖ్యాతల జీతం ఎంతంటే?
కొన్ని జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. హిందీ వ్యాఖ్యాతలకు ఒక్కో ఐపీఎల్ సీజన్‌కు రూ.60 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. అలాగే జూనియర్ వ్యాఖ్యాతలకు ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.35,000 చెల్లిస్తున్నట్లు తెలిసింది. తెలుగుతో పాటు ఇతర తమిళ, కన్నడ వ్యాఖ్యాతలకు కూడా అనుభవాన్ని బట్టి సుమారు రూ.35,000 నుంచి రూ.1 లక్ష వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది.

ఐపీఎల్ ప్రసారాల్లో ఆంగ్ల వ్యాఖ్యాతలకు భారీగా డిమాండ్ ఉంది. వారి అంతర్జాతీయ గుర్తింపు, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల కారణంగా వారికి అధిక జీతాలు చెల్లిస్తారు. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఒక్కో సీజన్‌కు సుమారు రూ.4.17 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.

గవాస్కర్ తర్వాత ఆ స్థాయిలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్, వెస్టిండీస్ మాజీ పేసర్ ఇయాన్ బిషప్ వంటి వ్యాఖ్యాతలకు ఒక్కో ఐపీఎల్ సీజన్‌కు రూ.4.17 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. వారి కామెంట్రీ స్టైల్, అంతర్జాతీయ అనుభవం, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే సామర్థ్యం వారికి ఈ స్థాయి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.

కామెంట్రీ అనేది కేవలం మ్యాచ్ వివరణ మాత్రమే కాదు. అది ప్రేక్షకుల భావోద్వేగాలతో మమేకమయ్యే ఒక స్వరం. ఒక మంచి వ్యాఖ్యాత మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చగలడు. అందుకే ఐపీఎల్ వంటి లీగ్‌లో వ్యాఖ్యాతల ఎంపికకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది. ఐపీఎల్‌లో ఆటగాళ్ల మైదానంలో బౌండరీలు దంచికొడుతుంటే.. వ్యాఖ్యాతలు  తమ మాటలతో దానికి మరింత వాల్యూ జోడిస్తారు. అందుకే వారికి కూడా కోట్ల రూపాయల పారితోషికం లభిస్తుంది. స్టార్ ఆటగాళ్లలాగే, స్టార్ వ్యాఖ్యాతలు కూడా ఐపీఎల్ వంటి వేదికలపై కీలక పాత్ర పోషిస్తారని చెప్పవచ్చు.

Also Read: Petrol Price Today: దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్ ధర..లీటరుకు రూ.2.09 పెంచిన కంపెనీలు..ఎక్కడెక్కడంటే?

Also Read: LPG ATM Gurugram: యుద్ధం వేళ సామాన్యులకు గుడ్‌న్యూస్..గ్యాస్ సిలిండర్లకు ATM..2 నిమిషాల్లో గ్యాస్ రీఫిల్ అయిపోతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 20, 2026 10:24:37
Tirupati, Andhra Pradesh:

YS Jagan Ugadi: హిందూత్వంపై తమ నాయకుడు వైఎస్‌ జగన్‌పై తీవ్ర విమర్శలు చేసే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బీఆర్‌ నాయుడు ఉగాది పండుగ రోజు ఏం చేశారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా నిలదీశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సతీ సమేతంగా ఉగాది పండుగను చేసుకుంటుంటే ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. మాట్లాడితే జగన్‌ మతంపై వివాదం సృష్టించే ముగ్గురిపై ఆర్‌కే రోజా తీవ్ర విమర్శలు చేశారు.

Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!

తిరుపతిలో జరిగిన ఓ సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి రోజా హాట్‌ కామెంట్స్‌ చేశారు. 'ఉగాది రోజున వైఎస్ జగన్ ,వైఎస్ భారతీ గారు కుటుంబ సమేతంగా  పండుగ చేసుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా బీఆర్ నాయుడు ఏం చేశారు? ఈ గాడిదలు నిన్న ఎక్కడికి పోయాయి? ఏమి చేస్తున్నాయి?' అని ఆర్‌కే రోజా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య కలసి ఎందుకు ఉగాది చేసుకోలేదు? అని నిలదీశారు.

Also Read: Devuni Kadapa: ఉగాది ప్రత్యేకం.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లిం భక్తులు

'ఉగాది రోజు చంద్రబాబు ఆయన భార్యతో కలసి ఎందుకు చేసుకోలేదు? పండుగ రోజు లేకుండా చంద్రబాబు భార్య హెరిటేజ్‌లో కూర్చుని పాలు పిసుకుతున్నారా?' అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'సిగ్గు లేని బీఆర్ నాయుడు రాజకీనామా చేయకుండా ఉన్నాడు‌‌. తిరుమలకు ఒక మహిళతో, షిరిడీకి మరో మహిళలతో పోతాడు. తిరుమలలో ఉగాది పండుగను ఎందుకు చేయలేదు? బీఆర్ నాయుడు ఎక్కడికి పోయాడు?' అని ప్రశ్నించారు.

Also Read: Telangana CM Gift: ఉగాది పండుగ కానుక ప్రకటించిన తెలంగాణ సీఎం.. రైతులకు అదిరిపోయే వార్త

'నిన్న (ఉగాది పండుగ రోజు) ఈ ముగ్గరు గాడిదలు గాస్తున్నారా? కుటుంబ సమేతంగా వచ్చి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పక పోవడానికి ఏమిటి వీళ్లకు రోగం' అని రోజా సెల్వమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్, భారతి సంతోషంగా ఉగాది పండుగను చేసుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. ఆడబిడ్డ నిధి రూ.1,500 ఇస్తామని మహిళలను మోసం చేస్తున్నాడు అంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డారు. 'కూటమి ప్రభుత్వంలో ఆశ కార్యకర్తలు, రైతులు, మహిళలు ఏ ఒక్కరు సంతోషంగా లేదు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు' అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

989
comment0
Report
HDHarish Darla
Mar 20, 2026 09:24:25
Hyderabad, Telangana:

Premium Petrol Price Hike Today: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ధరలపై ప్రత్యక్షగా ప్రభావం చూపుతోంది. ముడిచమురు ధరగా భారీగా పెరిగిన నేపథ్యంలో భారత్‌లోని పెట్రోలియం సంస్థలు కూడా ప్రీమియం ధరలను భారీగా పెంచేశాయి. నేటి నుంచి అనగా మార్చి 20 నుంచి స్పీడ్, పవర్ పెట్రోల్ కోసం అదనంగా చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడింది.

కొత్త పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. 'స్పీడ్', 'పవర్' వంటి ప్రీమియం పెట్రోల్ ధరలను పెట్రోలియం కంపెనీలు అమాంతం పెంచేశాయి. స్పీడ్, పవర్ పెట్రోల్‌పై ఇప్పుడు లీటరుకు రూ.2.09 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపుతో ఇంతకు ముందు రూ.111.68గా ఉన్న ధరలు రూ.113.77కు చేరాయి. అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. 

పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగాయి?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ ముడిచమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడిచమురు ధరల పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరలు కూడా పెరుగుతున్నాయి. ఆయా దేశాల మధ్య యుద్ద తీవ్రత పెరగడం వల్ల చమురు ఉత్పత్తి, పంపిణీపై ప్రభావం చూపింది. గత కొద్ది రోజులుగా ముడిచమురు ఉత్పత్తి చేసే విద్యుత్ ప్లాంట్లపై దాడులు పెరిగాయి. ఇది ప్రపంచ చమురు మార్కెట్‌లో భారీగా అస్థిరతను సృష్టించినట్లు అయ్యింది.

మరోవైపు మధ్యప్రాచ్యం నుంచి ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా అయ్యే హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాలపై ఇరాన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఏవైనా అంతరాయాలు ఏర్పడితే, చమురు సరఫరాలపై మరింత తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి అవసరమైన ముడిచమురు రవాణాలో 20 శాతం ఈ మార్గంలో జరుగుతుంది. ఇరాన్ - ఇజ్రాయెల్ సంఘర్షణ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..పెన్షన్ రూ.7,500 పెంపుపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం..లోక్‌సభలో మంత్రి క్లారిటీ!

Also Read: Nora Fatehi Controversy Song: బూతు పాట, బూతు డ్యాన్స్‌లపై వివాదం..ఎట్టకేలకు మాట్లాడిన 'బాహుబలి' హీరోయిన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

1036
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 20, 2026 09:15:29
Hyderabad, Telangana:

Iqoo Z11 Launch Date: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఐకూ మార్కెట్‌లోకి వచ్చే వారం iQOO Z11 స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ను కూడా వెల్లడించింది.. చైనాలో ఈ మోడల్‌లో పాటు కొత్త iQOO Z11x మోడల్‌ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఈ మోడల్‌ కూడా భారత మార్కెట్‌లోకి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, రాబోయే మోడల్స్‌ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

iQOO Z11 ఫోన్‌తో పాటు iQOO Z11x స్మార్ట్‌ఫోన్‌లు మార్చి 26న చైనాలో విడుదల కానున్నాయని కంపెనీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. iQOO Z11 ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన 9,020 mAh బ్యాటరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది చాలా ప్రత్యేకమైన 165 Hz గేమింగ్ డిస్‌ప్లేతో వస్తున్న కంపెనీ తెలిపింది.. iQOO Z11లో 6.83-అంగుళాల 1.5K OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని, అలాగే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16 GB వరకు ర్యామ్‌తో పాటు 512 GB వరకు స్టోరేజ్‌తో లాంచ్‌ కాబోతోంది. 

ఈ iQOO Z11 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6తో అందుబాటులోకి రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు వరకు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ భారత మార్కెట్‌లోకి విడుదలైతే.. 6GB RAM వేరియంట్‌ కలిగిన మోడల్‌ ధర రూ. 18,999 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 8 GB ర్యామ్‌తో ధర రూ. 20,999 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక చివరి వేరియంట్‌ 256 GB వేరియంట్ ధర రూ. 22,999తో లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ వివిధ రంగుల్లో విడుదల కానుంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

iQOO Z11 ఫోన్‌  6.76-అంగుళాల (1,080 x 2,344 పిక్సెల్స్) LCD డిస్ల్పేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ OS 6 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో విడుదల కాబోతోంది. దీని వెనక భాగంలోని ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అదనంగా 2-మెగాపిక్సెల్ బోకె కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇందులో వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1084
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 20, 2026 08:27:54
Hyderabad, Telangana:

Samsung Galaxy A57 5g Price: సాంసంగ్‌  గెలాక్సీ A57 త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. అయితే, లాంచింగ్‌కి ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. ఈ మొబైల్ చాలా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ గతంలో విడుదల చేసిన మోడల్స్‌ కంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపించబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

సాంసంగ్ గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్‌ లీక్‌ అయిన వివరాలను బట్టి చూస్తే.. ఇది మార్చి నెలాఖరులో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది.. విడుదలకు ముందే, ఈ ఫోన్‌కు సంబంధించిన ఒక హ్యాండ్స్-ఆన్ వీడియో కూడా లీక్ అయింది. అయితే, ఈ వీడియోను మారుఫ్ మీర్జాయెవ్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియోలో స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ను స్పష్టంగా చూడొచ్చు. ఈ గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్‌లో ఎక్సినోస్ 1680 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత UI 8.5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది.  

సాంసంగ్ గెలాక్సీ A57 లీక్‌ అయిన ఫీచర్స్‌:
సాంసంగ్ గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లీక్‌ అయిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కూడిన 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉంటాయని, ఇది ఒక ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్‌గా నిలుస్తుందని ఇప్పటికే సోషల్ మీడియాల్లో వార్తలు విపరీతంగా వస్తున్నాయి.. ఈ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ కూడా అందుబాటులో ఉంది.. ఇది చూడడానికి సన్నని డిజైన్‌ను కలిగి ఉండడమే కాకుండా.. 6.9mm మందంతో అందుబాటులో ఉంది.. 

గెలాక్సీ A57 5G కెమెరాకు సంబంధించిన వివరాలు కూడా ఇటీవలే సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి.. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగంలో 50MP ప్రధాన కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే అదనంగా 13MP కెమెరా సెన్సార్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో మూడవ సెన్సార్ 5MP మాక్రో కెమెరా కూడా లభిస్తోంది. ఈ ఫోన్‌లో ఉన్న కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ కూడా చేసుకునే సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌లో ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో పాటు 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతున్నట్లు సమాచారం. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1058
comment0
Report
HDHarish Darla
Mar 20, 2026 07:37:17
New Delhi, Delhi:

EPS-95 Pension Hike 2026: దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగులకు ముఖ్యగమనిక. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లోని ముఖ్యమైన ఈపీఎస్-95 కింద కనీస పెన్షన్‌ను పెంచాలని ఎప్పటినుంచో పెన్షనర్లు డిమాండ్ చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టతనిచ్చింది. 

గత వారం పార్లమెంటులో పెన్షనర్ల చిరకాల డిమాండ్‌ను ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ లేవనెత్తారు. ఈపీఎఫ్ పెన్షన్ సవరణ కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి ప్రభుత్వానికి ఏమైనా ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించారు. ఈ సిఫార్సులను అధ్యయనం చేశారా అనే విషయాలతో సహా ఐదు కీలక ప్రశ్నలు అడిగారు. దీనిపై కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సమాధానమిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే EPS-95 పథకం కింద నెలకు రూ.1,000 కనీస పింఛను అందిస్తోందని మంత్రి మన్సుఖ్ మాండవీయా తెలియజేశారు. ప్రతి ఏడాది EPSకు ప్రభుత్వం '1.16%' వాటాను అందిస్తోందని కార్మిక శాఖ మంత్రి పునరుద్ఘాటించారు. లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలో కూడా EPFO, EPS-95 కింద కనీస పింఛను పెంపుపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. పింఛను పెంపు అమలు, నిధుల స్థిరత్వం వంటి కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించింది.

పెన్షనర్ల నెలవారి అవసరాలను తీర్చడానికి నెలకు రూ.1,000 కనీస పింఛను సరిపోదని పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే, పింఛను నిధికి సంబంధించిన ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్ బాధ్యతలను సమాకాలీనం చేసేందుకు ఏ పెంపు అయినా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈపీఎస్-95 పెన్షన్ కింద రూ.1,000 నుంచి రూ.7,500కి పెంపు ఇప్పట్లో లేదనే సంకేతాలను మంత్రి లోక్‌సభ వేదికగా స్పష్టం చేశారు. 

(గమనిక: ఈ పోస్ట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించింది. ఇది ఎలాంటి ప్రభుత్వ జీతాల పెంపు లేదా పింఛను పెంపునకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. తాజా, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సంప్రదించమని సిఫార్సు చేస్తున్నాము.)

Also Read: LPG ATM Gurugram: యుద్ధం వేళ సామాన్యులకు గుడ్‌న్యూస్..గ్యాస్ సిలిండర్లకు ATM..2 నిమిషాల్లో గ్యాస్ రీఫిల్ అయిపోతుంది!

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్! పెన్షన్ రూ.7,500 పెంపుపై మోదీ సర్కార్ కీలక ప్రకటన.. లోక్‌సభ సాక్షిగా..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

953
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 20, 2026 07:27:58
Hyderabad, Telangana:

Kallur Donkey Race Telugu Latest News: రాయలసీమ గడ్డకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది.. అద్భుతమైన సంప్రదాయాలకు పెట్టింది పేరు.. ఆధునిక కాలంలో యంత్రాలను వినియోగించి పనులు చేయడం పెరిగినప్పటికీ.. మూగజీవాల అవసరం తగ్గుతున్నా.. తమ మూలాలను మర్చిపోని కర్నూలు వాసులు ఒక అరుదైన వేడుకను దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం కల్లూరులోని చౌడేశ్వరి దేవి ఆలయం వద్ద నిర్వహించే గాడిదల బురద పరుగు పందెం స్థానిక సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తూ వస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ వింత ఆచారానికి దాదాపు 150 ఏళ్ల ఘన చరిత్ర ఉన్నట్లు సమాచారం.. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. మానవులకు ఎంతగానో అండగా నిలిచిన మూగజీవాల పట్ల కృతజ్ఞత చాటుకునేందుకు యాదవులతో పాటు అక్కడ ఉండే రైతులంతా ఈ ఉత్సవాన్ని నిర్హహిస్తారు. ఇందులో భాగంగా గాడిదను కేవలం భారం మోసే జంతువుగా చూడకుండా.. కష్టాల్లో పాలుపంచుకునే కుటుంబ సభ్యుడిగా భావించడం ఇక్కడి విశేషం..

ఉగాది తర్వాతి రోజున నగరం నడివొడ్డున ఉన్న చౌడేశ్వరి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అంతేకాకుండా ప్రాంగణంలో మోకాలోతు బురదలో గాడిదలు పరుగులు తీస్తుంటే.. యువకులు ఎంతో ఉత్సాహంగా వాటిని వెంటాడుతూ ప్రత్యేకమైన మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాకుండా గంగానమ్మకు ప్రతిరూపమైన ఈ మట్టిలో చేసే ప్రదక్షిణ వల్ల రాబోయే సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, పాడి పశువులకు ఎలాంటి వ్యాధులు సోకవని.. పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉంటారని భక్తుల భక్తుల నమ్మకం..

అలాగే డప్పు వాయిద్యాలు, యువకుల డ్యాన్స్‌ల మధ్య గాడిదలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కేవలం కర్నూలులోనే జరిగే ఈ బురద పందేలను చూడటానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరిలి వస్తారని స్థానికులు చెబుతున్నారు. తమ పూర్వీకులు అందించిన ఈ వారసత్వాన్ని కాపాడుకోవడం వారి బాధ్యత.. గాడిద అంటే ఓర్పుకు నిదర్శనం.. యంత్రాలు ఎన్ని వచ్చినా మా నమ్మకం మాత్రం మారదని స్థానిక రజక సంఘం ప్రతినిధులు గర్వంగా చెబుతున్నారు.

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1059
comment0
Report
HDHarish Darla
Mar 20, 2026 06:40:20
Gurugram, Haryana:

LPG ATM Gurugram News: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశం గ్యాస్ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు ఒక శుభవార్తను తెలియజేశారు. దేశంలో మొదటిసారిగా LPG గ్యాస్ సిలిండర్ ATMను హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో ప్రారంభించారు. కేవలం 2-3 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్లు రీఫిల్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. 

భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL) పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రారంభించిన ఈ మెషీన్, తేలికపాటి కాంపోజిట్ సిలిండర్లను అందిస్తుంది. అయితే ఈ LPG గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ ప్రక్రియ 24x7 గంటలపాటు అందుబాటులో ఉంటుందని యాజమాన్యం తెలియజేసింది. ఈ సౌకర్యం వినియోగదారులకు వేగవంతమైన, సురక్షితమైన, సులభమైన గ్యాస్ రీఫిల్స్ చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. 

NCRలో ఎల్‌పిజి గ్యాస్ ఏటిఎమ్‌ను ప్రవేశపెట్టిన మొదటి నగరంగా గురుగ్రామ్ నిలిచింది. సోహ్నాలోని సెక్టార్ 33లో ఉన్న సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో ఏర్పాటు చేసిన ఈ ATM సమీప నివాస ప్రాంతాలలో ఆటోమేటెడ్, కాంటాక్ట్‌లెస్ గ్యాస్ పంపిణీని అందిస్తుంది.

ఈ LPG ఏటిఎం ఫైబర్‌తో తయారు చేసిన కాంపోజిట్ సిలిండర్లను అందిస్తుంది. ప్రస్తుతం గృహోపకరాణాల్లో వినియోగిస్తున్న ఇనుప సిలిండర్ల కంటే చాలా తేలికైనవి. రోజూ వాడే సిలిండర్ బరువు సుమారు 31 కిలోలు ఉండగా, ఒక కాంపోజిట్ సిలిండర్ కేవలం 15 కిలోల బరువు ఉండి, అంతే పరిమాణంలో గ్యాస్‌ను నిల్వ చేస్తుంది. కాంపోజిట్ సిలిండర్ల ప్రధాన ప్రయోజనం వాటి పారదర్శకత. దీనివల్ల వినియోగదారులు వారి సిలిండర్లలో గ్యాస్ స్థాయిని సులభంగా చూసి తెలుసుకోవచ్చు. గ్యాస్ స్థాయిని తనిఖీ చేయడానికి సిలిండర్‌ను ఎత్తడం లేదా ఊపడం వంటి అవసరం ఉండదు.

LPG ఏటిఎం నుండి గ్యాస్ పొందే ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంగా కొనసాగుతుంది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ఓటిపిని ధృవీకరించుకున్న తర్వాత, ఖాళీ సిలిండర్‌పై ఉన్న క్యూఆర్ లేదా బార్‌కోడ్‌ను స్కాన్ చేసి, యుపీఐ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి చెల్లిస్తారు. ఆ తర్వాతే యంత్రం రీఫిల్ చేసిన సిలిండర్‌ను అందిస్తుంది.

ఈ ఏటీఎం మెషీన్ రోజుకు 24 గంటలు పనిచేస్తుంది. అలాగే ఒకేసారి 10 సిలిండర్ల వరకు నిల్వ చేయగలదు. నిల్వ 2 సిలిండర్లకు చేరినప్పుడు, సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి ఆటోమేటిక్ హెచ్చరిక అందుతుంది. దీనివల్ల సకాలంలో రీఫిల్స్ జరుగుతాయి. వినియోగదారులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవను అందించే లక్ష్యంతో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఎల్పీజీ ఏటీఎం ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ఇలాంటి ఎల్పీజీ ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Also Read: Shraddha Kapoor Marriage: రష్మిక తర్వాత పెళ్లిపీటలెక్కనున్న మరో హీరోయిన్! లవర్‌తో ఎక్కడ పడితే అక్కడ ఇలా!

Also Read: Nora Fatehi Controversy Song: బూతు పాట, బూతు డ్యాన్స్‌లపై వివాదం..ఎట్టకేలకు మాట్లాడిన 'బాహుబలి' హీరోయిన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1069
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 20, 2026 06:19:28
Hyderabad, Telangana:

Snake in Assembly Video Watch: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ఒక పాము ప్రత్యక్షం కావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఉత్కంఠభరితమైన చర్చలు, రాజకీయ వేడితో నిండి ఉన్న సభ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.. అయితే, ఈ పాము ఎలా వచ్చిందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా అసెంబ్లీ సమావేశాల వేళ భారీ బందోబస్తు, పోలీసుల పహారా ఉంటుందని అందరికీ తెలిసిందే.. శుక్రవారం ఉదయం సభా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో.. అసెంబ్లీ ఆవరణలోని గార్డెన్ సమీపంలో ఒక పాము పాకుతూ కనిపించింది. అటుగా వెళ్తున్న సిబ్బంది దానిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు, మీడియా ప్రతినిధులు అలర్ట్ అయ్యారు. సుమారు మూడు అడుగుల పొడవున్న ఆ పాము పొదల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. 

అయితే, అక్కడే ఉన్న కొంతమంది అధికారులు పామును చూసి భయపడి దూరంగా వెళ్తుండగా.. అక్కడ విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాసం చేసి పట్టుకునేందుకు ప్రయత్నించారు.. ఏమాత్రం భయపడకుండా.. చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నారు. ఆతని దగ్గర ఎలాంటి పాములను పట్టుకునే పరికరాలు లేకపోయినప్పటికీ, తనకున్న అవగాహనతో పాముకు గాయం కాకుండా.. అలాగే తనకు ప్రమాదం కలగకుండా ఎంతో సింపుల్‌గా ఆ పామును పట్టుకుని రక్షించారు. 

వీడియో ఇది నొక్కి చూడండి..

కానిస్టేబుల్ ఎంతో సులభంగా పట్టుకోవడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ప్రాణాలకు తెగించి పామును పట్టుకున్న ఆ కానిస్టేబుల్‌ను ఉన్నత అధికారులతో పాటు మీడియా ప్రతినిధులు  అభినందించారు. పామును పట్టుకున్న తర్వాత దానిని ఒక సంచిలో భద్రపరిచి.. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆ పామును జన సంచారం లేని ఓ ప్రదేశంలో అధికారులు సురక్షితంగా విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.. అయితే, గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో పాము బయటికి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1012
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 20, 2026 05:46:31
Hyderabad, Telangana:

Chaturgrahi Yoga 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహగమనాలు మానవ జీవితంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో మనందరికీ తెలిసిందే.  అయితే, ఈ నెలలో అరుదైన ఖగోళ సంఘటన చోటు చేసుకోబోతోంది. సుమారు 500 ఏళ్ల తర్వాత చైత్ర నవరాత్రుల సమయంలో ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి రాజయోగం ఏర్పడబోతోంది. మీనరాశిలో సూర్యుడు బుధుడు శుక్రుడు రాహు గ్రహాల కలయిక కారణంగా ఈ శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. మార్చి చివరివారాల నుంచి ప్రారంభమయ్యే ఈ రాజయోగం నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారి జాతకంలో అనేక మార్పులు రాబోతున్నాయి.

అదృష్టం పొందబోయే రాశులు ఇవే..
మేషరాశి 

చతుర్గ్రాహి రాజయోగం వల్ల మేష రాశి వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారి ప్రయత్నాలు ఫలించడమే కాకుండా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు కూడా లభించి జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే సూచనలు ఉన్నాయి.

మిథున రాశి 
చతుర్గ్రాహి రాజయోగం వల్ల గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో భారీ లాభాలు కలిగే సూచనలున్నాయి. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా.. కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కూడా లభించబోతోంది. అంతేకాకుండా ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు వృత్తిపరంగా ఉద్యోగాలపరంగా ఈ సమయంలో అనేకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ సమయంలో తప్పకుండా అద్భుతమైన పరిష్కారం లభించబోతోంది. కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. భాగస్వామ్య జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి.

ధనస్సు రాశి 
ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో ధనస్సు రాశి వారికి అఖండ విజయాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రాజకీయ లేదా సామాజిక రంగాల్లో ఉన్నవారికి పదవియోగం కూడా ఉండబోతోంది. పాత బాకీల నుంచి డబ్బులు వసూలు అవ్వడమే కాకుండా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతున్నారు. అలాగే ధార్మిక కార్యక్రమాల పట్ల విపరీతమైన ఆసక్తి కూడా పెరగబోతా ఉంది. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1079
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 20, 2026 05:35:24
Hyderabad, Telangana:

Mani Kanchana Yoga Effect On Zodiac Telugu: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల ఏర్పడే యోగాలు మానవ జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకువస్తూ ఉంటాయి. 2026 సంవత్సరం బుధుడు తో పాటు గురు గ్రహాల కదలికలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన మణికాంచన రాజయోగం కూడా ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఎన్నో రకాల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా అద్భుతమైన కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు అనుకున్న పనుల్లో అద్భుతమైన సంపాదన కూడా లభించబోతోంది. 

మణికాంచన రాజయోగం ఎఫెక్ట్..
వృషభ రాశి 
మణికాంచన రాజయోగం ప్రభావంతో వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించడమే కాకుండా వ్యాపారాల్లో ఒప్పందాలు లాభసాటిగా మారతాయి. అంతేకాకుండా అనవసర ఖర్చులకు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది..

సింహరాశి 
సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. కెరీర్‌లో ఊహించని విజయాలు కూడా సాధించబోతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో అహంకారం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. దీని కారణంగా వీరికి సమాజంలో మంచి గుర్తింపు కూడా లభించబోతోంది. 

తులారాశి 
మణికాంచన రాజయోగ ప్రభావంతో తులా రాశి వారికి ఆర్థికంగా చాలా వరకు కలిసి రాబోతోంది. ముఖ్యంగా కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అలాగే ఇతరులపై అద్భుతమైన విజయాలు కూడా సాధించగలుగుతారు. సొంత నిర్ణయాలతో ముందుకెళ్లడం శ్రేయస్కరమని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి.

మకర రాశి 
మకర రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఎంతో సులభంగా విముక్తి లభించబోతోంది.. ముఖ్యంగా వీరు ఈ సమయంలో పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎంతో ఓపికగా పనిచేయడం వల్ల మంచి గుర్తింపు కూడా పొందగలుగుతారు. దీంతోపాటు తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోవడం మానుకుంటే చాలా మంచిది. ఈ సమయంలో వీరికి అంతా బాగానే ఉంటుంది..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1097
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 19, 2026 17:57:19
Nunna, Vijayawada, Andhra Pradesh:

Ugadi Celebrations In Vijayawada: 'మన సంస్కృతీ సంప్రదాయాలు మనకు విలువలు నేర్పుతాయి. విలువలతో జీవనం గడిపేవారికి ఉన్న ఆనందం ఎవరికీ ఉండదు. విలువలు లేని చోట ఏమీ మిగలదు' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 'ఇక్కడ ఉండే మనకంటే విదేశాల్లోని తెలుగువారు మన సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్నారు. విదేశాల్లో తెలుగు సంస్కృతీ సంప్రదాయాల అంబాసిడర్లుగా ప్రవాసాంధ్రులు మారారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలన్నదే నా సంకల్పం' అని చంద్రబాబు ప్రకటించారు.

Also Read: Devuni Kadapa: ఉగాది ప్రత్యేకం.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లిం భక్తులు

గురువారం జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. 'మన పండుగలు, ఆచారాల్లోనే సైన్సు ఉంది. వాస్తు లాంటి శాస్త్రాలు, సూర్య నమస్కారం లాంటి ఆచారాలు ఇలాంటివే. యోగా, నేచురోపతి లాంటి వైద్యం కూడా ప్రకృతి నుంచి వచ్చిందే. ఆరోగ్యం, ఆనందం, సంపద వీటి వల్లే సాధ్యం అవుతుంది. సమీప భవిష్యత్తులో పూర్తి సాంకేతికతతో పాలన జరిగే అవకాశం ఉంటుంది' అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణం ఇలా వేర్వేరు పరిస్థితులను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం వచ్చిందని చెప్పారు.

Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!

'2047 నాటికి అగ్రస్థాయిలో తెలుగు జాతి ఉండాలనే సంకల్పం మనం అంతా తీసుకోవాలి. సంజివనీ ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఓ ముఖ్యమైన ముందడుగు వేశాం. డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వ్యక్తిగత ఔషధాలను కూడా అందించే పరిస్థితి వస్తుంది. 2024కు ముందు ఐదేళ్లు ఎవరూ సంతోషంగా పండుగలు కూడా జరుపుకునే పరిస్థితి లేదు' అని సీఎం చంద్రబాబు తెలిపారు.  ఒక వ్యక్తి కారణంగా ఎక్కడ చూసినా భయం, విధ్వంసం, దారుణాలు జరిగాయని వైఎస్‌ జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడి, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు.

Also Read: Telangana CM Gift: ఉగాది పండుగ కానుక ప్రకటించిన తెలంగాణ సీఎం.. రైతులకు అదిరిపోయే వార్త

రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి ఆర్దిక, సామాజిక, ఆరోగ్య భద్రత అందించాలన్నదే తమ లక్ష్యం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'భారత్ అంటే ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండే సంప్రదాయం ఉంది. ఇంట్లోని పెద్ద వాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. కొందరు స్వార్ధంతో తల్లికి, చెల్లెలికి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే మళ్లీ ఉమ్మడి కుటుంబాలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నాం. పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీతో మళ్లీ జనాభాను పెంచేలా చర్యలు చేపడుతున్నాం. తల్లికి వందనం ద్వారా ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఆర్దిక సహకారం అందిస్తున్నాం' అని వివరించారు.

'అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలకు రూ.20 వేల చొప్పున ఇచ్చాం. శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకువచ్చాం. 56 కోట్ల ప్రయాణాలు జరిగాయి. దివ్యాంగ శక్తి ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం' అని సీఎం చంద్రబాబు చెప్పారు. అర్చకులకు రూ.15 వేల చొప్పున వేతనం ఇస్తున్నాం, ఇమామ్‌లు మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలన్న లభ్యంతో పనిచేస్తున్నట్లు గుర్తుచేశారు.

'పేదల జీవన ప్రమాణాలు కూడా పెంచేలా పీ4 కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. సంపన్నులైన 10 శాతం మంది సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మందిని ఆదుకునేలా ఈ కార్యక్రమం చేపట్టాం. నేను పనిచేసేది 5 కోట్ల మంది తెలుగు ప్రజల కోసం. అందరి జీవన ప్రమాణాలు మెరుగు పర్చటం  కోసం.. సమాజంలో అట్టడుగున ఉండిపోయిన పేదలకు చేయూతను ఇచ్చి పైకి తీసుకువచ్చేలా కార్యాచరణ చేపట్టాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

'సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రంగా ప్రాంతీయ ఎకనామిక్ కారిడార్లు తీసుకువచ్చాం. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రహదారులు, రైల్వేలైన్లు అనుసంధానం చేసి లాజిస్టిక్స్ వ్యవస్థను అభివృద్ధి చేస్తాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఇప్పటి వరకూ రూ.1,943 కోట్లు ఇచ్చాం' అని సీఎం చంద్రబాబు వివరించారు. గత పాలకులు పైసా కూడా వారికి పరిహారం ఇవ్వలేదని విమర్శిస్తూనే.. అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కావాలంటే పోలవరం పూర్తి కావాలని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకంటే ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1034
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 19, 2026 15:21:18
Hyderabad, Telangana:

Chiranjeevi Education Charity: సినిమాలు చేస్తూనే సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే తపనతో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి సేవా కార్యక్రమాలు చేసే వారిలో సినీ నటుడు చిరంజీవి ముందుంటారు. తాజాగా ఉగాది పండుగ రోజు మరో సేవా కార్యక్రమానికి సంబంధించి చిరంజీవి ప్రకటించారు. రక్తదానంతోపాటు విద్యాదానం చేస్తానని మెగాస్టార్‌ ప్రకటన చేశారు. భవిష్యత్‌లో విద్యా దానానికి సంబంధించిన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు.

Also Read: Devuni Kadapa: ఉగాది ప్రత్యేకం.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లిం భక్తులు

ఉగాది పండుగ సందర్భంగా జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా అదే మాదిరి విద్యాదానం చేస్తానని తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు సంబంధించి శుభవార్త ప్రకటించారు. భవిష్యత్తులో విద్యాదానంపై దృష్టి సారిస్తానని చిరంజీవి తెలిపారు. 'రక్తం కొరతతో ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు నన్ను కదిలించాయి. అందుకే 1998లో బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించి అభిమానులను రక్తదానానికి ప్రేరేపించా. ఈ సమయంలో ఐ బ్యాంక్ సేవలను కూడా ప్రారంభించి అత్యవసర సమయంలో ప్రాణదాతగా నిలిచేలా వ్యవస్థను తీర్చిదిద్దా' అని మెగాస్టార్‌ చిరంజీవి వెల్లడించారు. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ సేవలను అక్కడితో ఆపాలని ఎప్పుడూ అనుకోలేదని.. ఇప్పుడు విద్యా రంగంలో సేవలు అందించే దిశగా అడుగులు వేయాలని ఆలోచిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.

Also Read: Telangana CM Gift: ఉగాది పండుగ కానుక ప్రకటించిన తెలంగాణ సీఎం.. రైతులకు అదిరిపోయే వార్త

తమిళ స్టార్‌ హీరో సూర్య‌ స్థాపించిన అగరం ఫౌండేషన్ స్ఫూర్తిగా పేదలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు చిరంజీవి ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకే పరిమితం కాకుండా.. ఎక్కడ విద్య అవసరం ఉంటుందో అక్కడ తాను సహాయం అందించేలా కృషి చేస్తానని వెల్లడించారు. త్వరలోనే తాను ఈ విద్యా పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తానని చిరంజీవి వివరించారు.

Also Read: BRS Party Panchangam: రేవంత్‌ రెడ్డి వైఫల్యాలతో బీఆర్‌ఎస్‌ పార్టీకి రెట్టింపు బలం.. తెలంగాణ భవన్‌లో ఉగాది పంచాంగం

చిరంజీవి సేవా కార్యక్రమాలు
దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న చిరంజీవి తన సంపాదనలో కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్‌ ఏర్పాటుచేసి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ట్రస్ట్‌ ద్వారా పేదలకు వైద్యం, ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇక కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సహాయం అందించారు. చిరంజీవి ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలను ఆయన కుమారుడు, సినీ నటుడు రామ్ చ‌ర‌ణ్‌ పర్యవేక్షణ వేస్తున్నారు. ట్రస్ట్ కార్యకలాపాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1073
comment0
Report
Advertisement
Back to top