Snakes Video Latest: సాధారణంగా పాము కనిపిస్తేనే వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అలాంటిది పదుల సంఖ్యలో విషపూరితమైన పాములు ఆ బాలుడి చేతిలో ఉన్న ఏమాత్రం భయం లేకుండా వాటితో ఆడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది. ప్రకృతికి, మానవునికి మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని చాటి చెప్పేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్లలో రాసుకాస్తున్నారు..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్న అబ్బాయి పదుల సంఖ్యలో ఉన్న పాములను చేతిలో పట్టుకొని ఉండడం మీరు గమనించవచ్చు. ఆ పిల్లాడు ఎంతో చాకచక్యంగా ఆ పాములను.. భయమన్నదే లేకుండా వాటి తోకలను పట్టుకొని ఒకచోటు నుంచి మరోచోటికి ఎంతో ఉత్సాహంగా గెంతులు వేస్తూ ఉన్నాడు. సాధారణంగా మనుషుల అలికిడి తగిలితేనే దాడి చేసే పాములు.. ఈ పిల్లాడి విషయంలో మాత్రం ఎంతో శాంతంగా ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి.. ఆ చిన్నారి చేస్తున్న పనులకు పాములు ఏమాత్రం స్పందించకపోవడమే కాకుండా.. అతనితో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నట్లు కనిపిస్తోంది..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. నిజంగా ఈ పిల్లాడు అత్యంత ధైర్యవంతుడని కొంతమంది కామెంట్లు చేస్తూ వస్తుంటే.. ఇది అత్యంత ప్రమాద.. తల్లిదండ్రులు ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని మరికొంతమంది వన్యప్రాణి సంరక్షకులు సూచిస్తూ ఉన్నారు. అలాగే ఈ పాములు విషపూరితమైనవా.. కాదా అనే చర్చ కూడా విపరీతంగా నడుస్తూ వస్తోంది. అయితే ఆ పిల్లాడి విశ్వాసంతో పాటు.. పాములతో అతను వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. అవి అతనికి ఎప్పటినుంచో అలవాటుగా ఉన్నట్లు అర్థమవుతుంది..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
ఈ వీడియో చూసిన వన్యప్రాణి సంరక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పాములు సహజంగానే తమ రక్షణ కోసం దాడి చేస్తాయని.. చిన్నపిల్లలను ఇలాంటి ప్రమాదకరమైన జీవుల దగ్గరకు వదలడం ప్రాణాపాయానికి దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. వీడియో వైరల్ కోసం ఇలాంటి సాహసాలు చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందింది అనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతూ షేర్ల వర్షం కురిపిస్తోంది.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
IPL 2026 Full Schedule News: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను విడుదల చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు ఫుల్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. మిగిలిన మ్యాచ్‌ల వేదికలతో పాటు ఇతర వివరాలను ఆ షెడ్యూల్‌లో పొందుపరిచింది.
తొలి షెడ్యూల్ మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు ప్లాన్ చేయగా.. ఇప్పుడు రెండో ఫేజ్ కోసం 2026 ఏప్రిల్ 13 నుంచి మే 24 మధ్య 12 వేదికలలో 50 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే రెండో షెడ్యూల్ విడుదల చేసే క్రమంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను మే 31న నిర్వహించనున్నట్లు తెలియజేసింది. అయితే ప్లేఆఫ్స్ గురించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు హోమ్ గ్రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఫైనల్ మ్యాచ్‌కు వేదిక కానుంది.
దేశంలో రాబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది బీసీసీఐ విడతలుగా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. భారత ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకోవడం ద్వారా బీసీసీఐకి అవసరమైన సెక్యూరిటీ, లాజిస్టికల్ ప్రణాళికలతో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లను దేశంలోనే సురక్షితంగా నిర్వహించేలా పక్కాగా ప్లాన్ చేసింది.
రెండో దశ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక పోరుతో తిరిగి ప్రారంభమవుతుంది. టోర్నీ రెండవ భాగంలో ఎనిమిది డబుల్-హెడర్ మ్యాచ్‌లు ఉండబోతున్నాయి. మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు, అలాగే సాయంత్రపు మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
సాంప్రదాయానికి భిన్నంగా మార్చి 28న బెంగళూరులో జరగాల్సిన సీజన్ ఆరంభ మ్యాచ్‌కు సంబంధించిన ఆరంభోత్సవాలను బీసీసీఐ రద్దు చేసింది. గతేడాది టైటిల్ వేడుకల సందర్భంగా బెంగళూరు నగరంలో జరిగిన ఘోర తొక్కిసలాట బాధితుల నివాళులర్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ సీజన్‌ను ఘనంగా ముగించేందుకు మే 31న జరిగే ఫైనల్‌కు ఒక భారీ ముగింపు వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vemulawada Rajanna Temple News: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు గురువారం రోజున ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ స్వామివారిని దర్శనమిచ్చారు. సీతారాముల కళ్యాణ్ ఉత్సవాల సంబరాల్లో భాగంగా అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.
నవరాత్రులు ఎనిమిదవ రోజు వేకువ జామునే శ్రీ సీతారామ స్వామి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైన అభిషేకం నిర్వహించారు. వేదమంత్రాల సాక్షిగా స్వామివారికి విశేషమైన అర్చనలు చేశారు. అనంతరం శ్రీ రామచంద్ర మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు..
మరోవైపు ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని క్షేత్రానికి పాలకుడైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. అభిషేకానంతరం స్వామి వారి పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. శివకేశవుల అద్వైత క్షేత్రమైన వేములవాడలో అటు శివుడికి ఇటు రామయ్యకు ఏకకాలంలో జరుగుతున్న ఈ పూజల్లో పాల్గొనడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు.
Also Read: 10 వేల మంది పోలీసులతో రాజా సింగ్ ర్యాలీ.. శోభాయాత్రలో హై టెన్షన్..
నవరాత్రుల సందర్భంగా ఆలయ యాగశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పుణ్యాహవచనం పఠించిన అనంతరం మూలమంత్ర హోమం, స్వామివారి పరివార దేవతల హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు యాగశాల ప్రవేశం చేసి.. అగ్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ హోమ క్రతువుల నుంచి వెలుబడిన పవిత్రమైన ధూమంతో దేవాలయం మరింత పుణ్యమైంది గా మారిందని అర్చకులు చెబుతున్నారు. రామ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Dhurandhar The Revenge: ‘దురందర్ 2’లో ప్రధాని మోడీ.. దావూద్ లదే రోల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Energy Emergency India News: పశ్చిమాసియాలోని ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలపై పడుతోంది. కొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితి చేయిదాటిపోయింది. ఇరాన్‌లోని హోర్ముజ్ జలసంధిని మూసివేసిన కారణంగా ఆసియాలోని అనేక దేశాలలో చమురు సంక్షోభానికి దారితీసింది. ఆసియాలోని అనేక దేశాలు ఈ ద్వారం గుండా చమురు దిగుమతులు చేసుకునే క్రమంలో అవి నిలిచిపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
గత 26 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతున్న క్రమంలో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చమురు కొరత నేపథ్యంలో పలు ఆసియా దేశాలు ముందస్తు చర్యలు మొదలుపెట్టాయి. మరోవైపు భారతదేశంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా లేనప్పటికీ.. మనం కరోనా కాలం నాటి పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయినా కొన్ని దేశాలు మాత్రం అత్యవసర పరిస్థితి విధించేందుకు సిద్ధమయ్యాయి.
భారత్‌లో పరిస్థితి ఏంటి?
భారతదేశంలో ఇంకా ఇంధన సంక్షోభం ప్రారంభం కాలేదు. అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతుల కారణంగా అనేక నగరాల్లోని పెట్రోల్ పంపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గ్యాస్, ఆయిల్ సంక్షోభం వస్తుందనే అపోహ ప్రజల్లో వ్యాపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఇంధన అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. భారతదేశం ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య 27 నుండి 41కి పెరిగింది.
పాకిస్తాన్
చమురు సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ రంగ ఉద్యోగులు కేవలం 4 రోజులు మాత్రమే పని చేస్తారని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలను రెండు వారాల పాటు మూసివేసినట్లు సమాచారం. పాకిస్తాన్ చమురు దిగుమతులలో దాదాపు 90 శాతం నిలిచిపోయాయి. ఈ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.350కి పెరిగాయి.
బంగ్లాదేశ్
దేశంలో ఇంధన నిల్వలు కేవలం 9 నుంచి 14 రోజులకు మాత్రమే సరిపోతాయని బంగ్లాదేశ్‌లోని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం తెలిపింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించింది. పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహించడంతో పాటు ప్రతిరోజూ ఐదు గంటల విద్యుత్ కోతను అమలు చేశారు. వస్త్ర రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
శ్రీలంక
శ్రీలంకలో ప్రభుత్వ సెలవులను తప్పనిసరి చేశారు. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు వారానికి 15 లీటర్ల పరిమితిని విధించారు. ఎవరూ అదనపు ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా చూసేందుకు 'క్యూఆర్ ఆధారిత ఫ్యూయల్ పాస్ వ్యవస్థ'ను అమలు చేశారు.
థాయ్‌లాండ్
థాయ్‌లాండ్‌లో ప్రభుత్వ రంగాలలో ఇంటి నుండి పని చేయాలని, విదేశాలకు ప్రయాణించవద్దని ఆదేశాలు జారీ చేశారు.
వియత్నాం
వియత్నాంలో ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించగా.. ఇక్కడ రిమోట్ వర్కింగ్ విధానాన్ని పరిశీలిస్తున్నారు.
తైవాన్
తైవాన్ వద్ద కేవలం 11 రోజులకు సరిపడా LNG నిల్వలు మాత్రమే ఉన్నాయి.
ఇండోనేషియా
ఏప్రిల్ నుంచి అమలు చేయనున్న హైబ్రిడ్ మోడల్‌లో క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ విషయంలో త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఫిలిప్పీన్స్ అత్యవసర పరిస్థితి
ఫిలిప్పీన్స్ దేశంలో 'జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి'ని ప్రకటించారు. ఇంధన నిల్వలు కేవలం 45 రోజులకు మాత్రమే సరిపోతాయని ప్రజలకు తెలియజేశారు.
జపాన్
జపాన్ దేశం తన నిల్వల నుండి చమురును మరోసారి మార్కెట్‌లోకి విడుదల చేయాలని IEAను కోరింది.
దక్షిణ కొరియా
దక్షిణ కొరియా దేశంలో ప్రభుత్వ సంస్థలలో వెహికల్ నంబరు ఆధారిత నియంత్రణ విధానాన్ని అమలు చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Corona Lockdown In India 2026: ఓ పక్క జరుగుతున్న యుద్ధాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే..ఇప్పుడు మరో ముప్పు మానవాళిని తరుముకొస్తుంది. కరోనా సంక్షోభం ముగిసి దాదాపుగా 5 ఏళ్లు గడిచినా..ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రజల్లో భయందోళలను రేకెత్తిస్తోంది. అమెరికాలో బిఏ.3.2 అనే కరోనా కొత్త వేరియంట్‌ను కనుగొన్న నేపథ్యంలో ఇప్పుడు మరో విపత్తు రాబోతోందని సంకేతం కనిపిస్తోంది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదిక ప్రకారం.. కరోనా వైరస్ కొత్త సూపర్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని మరోసారి వెంటాడుతోంది. ఇందులో షాకింగ్ న్యూస్ ఏమిటంటే, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిపై కూడా ఈ వైరస్ బలంగా పనిచేసి శరీర సామర్థ్యాన్ని బలహీన పరుస్తుందట. ఈ క్రమంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఇప్పుటికే అమెరికాలో BA.3.2 అనే కొత్త వేరియంట్ వేగంగా వ్యాపి చెందుతోంది. ఈ వేరియంట్ ఒక రకమైన ఒమిక్రాన్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వేరియంట్‌ను మొదటగా 2024లో దక్షిణాఫ్రికాలో గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.
అమెరికాతో పాటు ఈ కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు అనేక దేశాలకు వ్యాపిస్తుందట. ప్రపంచవ్యాప్తంగా 25 కంటే ఎక్కువ రాష్ట్రాలలో దీని రోగులను గుర్తించినట్లు సమాచారం. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఈ భయంకరమైన వైరస్ రోగులపైనే కాకుండా ప్రపంచంలోని విమానాశ్రయాల్లోని మురుగునీటి నమూనాలలో కూడా వైరస్ శాంపిల్స్ లభించాయట. ఇప్పుడిదే విషయం ప్రపంచానికి వణుకు పుట్టిస్తోంది.
శాస్త్రవేత్తల సంచలన ప్రకటన!
కరోనా బిఏ.3.2 స్పైక్ ప్రోటీన్‌లో సుమారు 70 నుండి 75 మార్పులు కనుగొన్నట్లు తెలిపింది. ఈ స్పైక్ ప్రోటీన్లు వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించేందుకు సహాయపడతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ మార్పుల కారణంగా, ఈ రకమైన వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా ఈ వైరస్ నశింపజేస్తుందని సమాచారం.
కొత్త కరోనా ప్రమాదకరమా?
ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. ఈ కొత్త వేరియంట్ అంత తీవ్రమైనది కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది జనాన్ని ఊరట కల్పించే వార్త. కొత్త వైరస్ బారిన పడిన కొందరు రోగులు ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి కూడా చేరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న వైరస్ రకం మరీఅంతగా ప్రాణాంతకమైన వేరియంట్ కాదని స్పష్టం చేశారు. ఏది ఏమైనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా సంక్షోభం ఇప్పటికీ మన నుంచి తొలగి పోలేదని, భవిష్యత్తులో కొత్త రకం పుట్టుకొచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నివారించడం అత్యంత ముఖ్యం. వైరస్ వ్యాప్తి చెందేందుకు ఎంత అవకాశం తక్కువ ఉంటే అది రూపాంతరం చెందేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఫ్లూ, ఆర్‌ఎస్‌వి వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులు కూడా పెరుగుతున్న క్రమంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Petrol Bunk Scams In India: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలకు బంకుల వెంట బారులు తీరుతున్నారు. అయితే ఇదే అదునుగా తీసుకొని కొందరు పెట్రోల్ పంపు యజమానులు స్కామ్స్‌కు పాల్పడుతున్నారు. తక్కువ క్వాలిటీ కలిగిన పెట్రోల్, డీజిల్‌ను ప్రజలకు విక్రయిస్తున్నట్లు పలు ప్రాంతాల్లో బయటపడింది. ఇదే అనుమానం మనలో చాలా మందికి ఉంటుంది. మన వాహనాలకు కొట్టించేది మంచిదా? లేదా కల్తీదా? అని తరచూ డౌట్ వస్తుంటుంది. అయితే అలాంటి మోసాలను ఇప్పుడు ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలామంది వాహనదారులు భరోసాకు వెళ్తారు. మనకు తెలిసిన పెట్రోల్ బంకు అని రూ.100, 200, 500 లాంటి రౌండ్ ఫిగర్ నంబర్స్ విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తారు. అయితే అందుకు బదులుగా రూ. 110, 210, 310 లేదా 510 లాంటి బేసి సంఖ్యలు కలిగిన నంబర్స్ విలువైన పెట్రోల్, డీజిల్ పొందడం ఉత్తమం. ఈ విధంగా ఇంధనం కొట్టిస్తే మిషన్లలో సెట్ చేసిన ముందస్తు మోసాల నుంచి వినియోగదారులు తప్పించుకునే అవకాశం ఉంది.
అయితే, ఇప్పుడు అలాంటి కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేసే వ్యక్తి విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రజలు తామెంతో తెలివైన వాళ్లు అనుకొని కొన్ని పొరపాట్లు చేస్తున్నారని అతను వెల్లడించాడు. అయితే రౌండప్ నంబర్స్‌తో పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడం వల్ల కొంతమేర వ్యత్యాసం ఉంటే అవకాశం ఉందని చెప్పాడు. అదే విధంగా పెట్రోల్ లేదా డీజిల్ వంటి ఇంధనాల క్వాలిటీని చెక్ చేసుకున్న తర్వాతే తమ వాహనాల్లో నింపుకోవాలని సూచించాడు.
110 , 210 या 320 का तेल डलवाने से तेल फ्रॉड नहीं रुकेगा
ये भाई जरूरी बात बता रहे है pic.twitter.com/OK4t1VPAFt
— HELL WALA (@hellwala) November 12, 2025
క్వాలిటీ ఇలా తెలుసుకోవాలి!
పెట్రోల్ లేదా డీజిల్ స్వచ్ఛతను కొలవడానికి అత్యంత నమ్మదగిన మార్గం పంపు మిషెన్‌పై ఉన్న 'డెన్సిటీ'. ఇది పెట్రోల్ కోసం 720 నుండి 775 మధ్య డెన్సిటీ ఉండాలి. అదే విధంగా డీజిల్ డెన్సిటీ కూడా 820 నుండి 860 మధ్య ఉండాల్సి ఉంది. అయితే ఆ రెండు విలువల మధ్య ఉంటేనే ఆ ఇంధనాలు స్వచ్ఛతగా ఉన్నట్లు అర్థం. ఆ విలువల కంటే ఎక్కువ లేదా తక్కువ చూపించినా.. అందులో క్వాలిటీ కోల్పోయిందన్న మాట. ప్రతిరోజూ పెట్రోల్ బంక్ యజమానులు ఈ డెన్సిటీ పరీక్షలు నిర్వహించి వాటి విలువలు అప్‌డేట్ చేయాల్సిఉంది.
అదే విధంగా పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించే ముందు తప్పనిసరిగా జీరో వాల్యూ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అదే విధంగా పెట్రోల్ కొట్టించే ముందు మీటర్ రీడింగ్ 0, 1, 2, 3.. అలా ఆరోహణ క్రమంలో వెళ్తూ ఉండాలి. ఒకవేళ మీటర్ రీడింగ్ 5 నుంచి 10 అలా వ్యత్యాసం లేకుండా వెళ్తుంటే ఆ సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందని నిర్ధారించుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
15 Foot King Cobra Video Watch Now: ప్రకృతిలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో కింగ్ కోబ్రా ఒకటి.. అది పడక విప్పితే చాలు.. వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే సామాన్యులే కాదు.. వన్యప్రాణి సంరక్షకులు సైతం షాక్ అయిపోవాల్సిందే. ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఏకంగా 15 అడుగుల పొడవున్న భారీ కోబ్రాను స్నేక్యాచార్ బంధిస్తున్న దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోలో ఉన్న పాములు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.. కోబ్రాల్లో ఇంత భయంకరమైన పాములు కూడా ఉంటాయా? అని చూసిన వారి సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా పాములను పట్టుకున్న తర్వాత వాటిని సురక్షితంగా అడవిలో విడిచి పెట్టడానికి సంచుల్లో బంధిస్తూ ఉంటారు.. అయితే, ఈ వీడియోలో కనిపిస్తున్న కింగ్ కోబ్రా మాత్రం అంత తేలికగా లొంగిపోవడం లేదు.. స్నేక్ క్యాచర్ దానిని సంచిలో వేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అది మెరుపు వేగంతో తప్పించుకోవడానికి ప్రయత్నించడం మీరు కళ్లకు కట్టినట్లు చూడొచ్చు.. అతనిపై దాడి చేసేందుకు కూడా ఆ పాము ప్రయత్నిస్తోంది.. ఇది చూస్తుంటేనే భయం వేస్తుంది.. దాని భారీ శరీరంతో పాటు.. అది చేసే కదలికలు సోషల్ మీడియా వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తుంది.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికి వైరల్ అవ్వడం ప్రారంభమైంది.. ఈ పాము పరిమాణం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.. అది పామా లేక కొండచిలువనా అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. స్నేక్ క్యాచర్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. ప్రాణాలకు తెగించి రక్షిస్తున్నారు.. అని కొందరు ప్రశంసిస్తున్నారు.. ముఖ్యంగా ఆ కోబ్రా సంచి నుంచి పదేపదే బయటికి వస్తు..స్నేక్ క్యాచర్‌కు చుక్కలు చూపించడం ఈ వీడియోలో హైలెట్‌గా నిలిచింది..
ఇలాంటి విష సర్పాలు కనిపించినప్పుడు సొంత ప్రయోగాలు చేయవద్దని.. వెంటనే వన్యప్రాణి సంరక్షణ అధికారులకు లేదా స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించడం మంచిదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఒక్క చిన్న పొరపాటు జరిగిన ప్రాణాలకు ప్రమాదం వాటిలే అవకాశాలు ఉందని వారు తెలుపుతున్నారు. ఏది ఏమైనా 15 అడుగుల ఈ నల్ల త్రాచు వీడియో ఇప్పుడు యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Toddler playing With Snake Video Watch: సోషల్ మీడియా యుగంలో నిత్యం ఏదో ఒక వింత వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది.. అయితే, తాజాగా ఇన్స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం ఎవరికైనా గుండె ఆగినంత పని అవుతుంది.. ఒక చిన్నారి ఏకంగా విష సర్పంతో ఆడుకుంటూ.. దానిని మెడలో వేసుకున్న దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను సైతం షేక్ చేస్తున్నాయి. నిజానికి ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది..
వైరల్ అవుతున్న రీల్‌లో ఒక చిన్న పాప తన ఎత్తు ఉన్న ఒక పాముతో ఎంతో ప్రేమగా పట్టుకొని ఉండడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సాధారణంగా పాము పేరు వింటేనే పెద్దవారు ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు.. కానీ ఆ చిన్నారి మాత్రం ఆ పామును ఒక బొమ్మల పట్టుకొని ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఏమాత్రం భయం లేకుండా ఆ పామును పట్టుకొని.. దాన్ని తన మెడలో చుట్టూ వేసుకొని అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తుంది. ఆ పాము కూడా చిన్నారికి ఎలాంటి హాని చేయకుండా ఉండడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే లక్షలాది వ్యూస్‌తో పాటు వేల సంఖ్యలో కామెంట్లతో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ఆ చిన్నారి ధైర్యం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.. ప్రకృతిలో మమేకం అవడం అంటే ఇదేనేమో అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తుంటే.. మరి కొంతమంది ఇది అత్యంత ప్రమాదకరం.. వ్యూస్ కోసం తల్లిదండ్రులు పిల్లల ప్రాణాలను పణంగా పెట్టడమేంటని కామెంట్లు చేస్తున్నారు. పాము ఎప్పుడు ఇలా ప్రవర్తిస్తుందో చెప్పలేమని.. చిన్నపిల్లలను ఇలాంటి వాటికి దూరంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు..
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం సాహసాలు చేయడం ప్రాణాంతకమని వన్యప్రాణి సంరక్షకులు హెచ్చరిస్తున్నారు.. అది విషమున్న పాము అయిన.. కాకపోయినా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని.. ఇలాంటి చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.. షేర్ చేసిన కొద్ది నిమిషాలకే బీభత్సంగా వైరల్ అవ్వడం విశేషం.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tirumala Temple VIPs Rush: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో తిరుమల కిటకిటలాడుతోంది. వారికి సినీ ప్రముఖులు కూడా తిరుమలకు పోటెత్తుతున్నారు. తిరుమల గిరులు ప్రముఖుల రాకతో సందడిగా మారాయి. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే తిరుమలలో పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. సినీ నటీనటులు శర్వానంద్, మాళవిక నాయర్, సంపత్ రాజ్‌తోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్రకుమార్, బోండా ఉమ తదితరులు దర్శించుకున్నారు.
Also Read: Lavanya Drunk: తప్ప తాగి హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ నానా రచ్చ.. తిరగబడ్డ గ్రామస్తులు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోండా ఉమా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాళ నరేంద్ర కుమార్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తమ బైకర్ సినిమా విడుదల సందర్భంగా ఆ చిత్రబృందం తిరుమల ఆలయాన్ని సందర్శించింది.
Also Read: Harish Rao: 'తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాడు': హరీశ్ రావు
బైకర్ సినిమా హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్‌తోపాటు చిత్రబృందం గురువారం శ్రీవారిని దర్శించుకుంది. త్వరలో విడుదల కాబోతున్న బైకర్ సినిమా విజయవంతం కావాలని కోరుతూ చిత్రబృందం మొక్కులు చెల్లించుకుంది. తిరుమల ఆలయం వెలుపల సినీ ప్రముఖులను చూసేందుకు అభిమానులు, భక్తులు ఎగబడ్డారు. ఇక లక్కీ భాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి తిరుమల స్వామిని దర్శించుకున్నారు. విలక్షణ నటుడు సంపత్ రాజ్ కూడా తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు.
తిరుమలలో హోటళ్లు బంద్
గ్యాస్ సమస్య తిరుమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ లేక తిరుమలలోని హోటళ్లు మూతపడుతున్నాయి. సిలిండర్లు లభించక దాదాపు 50 హోటళ్లు మూతపడ్డాయని సమాచారం. హోటళ్లు మూతపడడం కారణంగా తిరుమలలోని అన్నప్రసాద కేంద్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. పెద్ద ఎత్తున భక్తులు అన్నప్రసాద కేంద్రాలకు వచ్చి ఆహారం తీసుకుంటున్నారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతోపాటు వివిధ సత్రాల్లోని అన్నప్రసాదాల కేంద్రాలు భక్తులతో నిండిపోతున్నాయి. దీంతో టీటీడీకి కూడా గ్యాస్ కష్టాలు ఎదురవుతున్నాయి. నిత్యం 6 టన్నుల గ్యాస్ కావాల్సి ఉండగా.. ఇండియన్ ఆయిల్ సంస్థ కావాల్సినంత గ్యాస్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో తిరుమలలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lavanya Catches In Drunk and Drive: యువ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లు రాజ్ తరుణ్‌తో తన ప్రేమ వ్యవహారాలతోపాటు డ్రగ్స్.. ఇతర వ్యవహారాలతో వార్తల్లో నిలిచిన ఆమె తాజాగా మద్యం సేవించి గ్రామస్తులను ఢీకొట్టింది. మద్యం సేవించి వాహనం నడుపుతుండగా అడ్డదిడ్డంగా కారు నడిపి పలువురిని ఢీకొట్టగా గ్రామస్తులు తిరగబడ్డారు. తాగి ఢీకొట్టడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: YS Jagan: ఇక రోజూ చంద్రబాబుకు సినిమా చూపిస్తా..! పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
మద్యం మత్తులో ఉన్న సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో వెళ్తూ ఓ ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఢీకొట్టిన అనంతరం ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా మల్లేపల్లి గ్రామస్తులు ఆగ్రహంతో ఆమె కారును అడ్డగించారు. ఢీకొట్టడంతో క్షమాపణలు చెప్పాలని గ్రామస్తులు కోరగా.. వారితో లావణ్య వాగ్వాదానికి దిగింది. తాగి ఢీకొట్టడమే కాకుండా తమపైనే తిరగబడడంతో లావణ్యపై గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు.
Also Read: Petrol Shortage: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన
ఎంతకీ క్షమాపణలు చెప్పకుండా వాగ్వాదానికి దిగిన లావణ్యపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీశారు. అయితే పోలీసులతోనూ లావణ్య వాగ్వాదం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమెకు బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో లావణ్యపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆమె కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలిచారు. ఢీకొట్టిన సమయంలో లావణ్య కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.
Also Read: Harish Rao: 'తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాడు': హరీశ్ రావు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో లావణ్య పట్టుబడడం వైరల్‌గా మారింది. గ్రామస్తులతో ఆమె వాగ్వాదం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లావణ్య తీరుపై గ్రామస్తులు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. అయితే లావణ్య ఇలా వివాదాల్లో చిక్కడం తొలిసారి కాదు. గతంలో డ్రగ్స్ వ్యవహారంలో కూడా లావణ్య పేరు మార్మోగింది. అనంతరం రాజ్ తరుణ్‌తో ప్రేమ వ్యవహారం తీవ్ర రచ్చకు దారితీసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్‌తో వేరొకరితో సత్సంబంధాలు కలిగిన లావణ్య అనంతరం కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరల్తో వాగ్వాదానికి దిగింది. ఆమె చేసిన రచ్చ మామూలుది కాదు. ఇప్పటికీ పలు టీవీ షోల్‌లో లావణ్యకు సంబంధించిన వ్యవహారాలు ట్రెండింగ్‌లో ఉంటాయి. ఇప్పుడు మద్యం సేవించి కారు నడుపుతూ గ్రామస్తులను ఢీకొట్టడం.. అనంతరం గ్రామస్తులు, పోలీసులతో గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి