Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500004
Lockdown In India 2026: దేశంలో మరోసారి లాక్‌డౌన్? విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్! 25 రాష్ట్రాల్...
HDHarish Darla
Mar 26, 2026 09:22:29
Hyderabad, Telangana

Corona Lockdown In India 2026: ఓ పక్క జరుగుతున్న యుద్ధాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే..ఇప్పుడు మరో ముప్పు మానవాళిని తరుముకొస్తుంది. కరోనా సంక్షోభం ముగిసి దాదాపుగా 5 ఏళ్లు గడిచినా..ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రజల్లో భయందోళలను రేకెత్తిస్తోంది. అమెరికాలో బిఏ.3.2 అనే కరోనా కొత్త వేరియంట్‌ను కనుగొన్న నేపథ్యంలో ఇప్పుడు మరో విపత్తు రాబోతోందని సంకేతం కనిపిస్తోంది. 

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదిక ప్రకారం.. కరోనా వైరస్ కొత్త సూపర్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని మరోసారి వెంటాడుతోంది. ఇందులో షాకింగ్ న్యూస్ ఏమిటంటే, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిపై కూడా ఈ వైరస్ బలంగా పనిచేసి శరీర సామర్థ్యాన్ని బలహీన పరుస్తుందట. ఈ క్రమంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఇప్పుటికే అమెరికాలో BA.3.2 అనే కొత్త వేరియంట్ వేగంగా వ్యాపి చెందుతోంది. ఈ వేరియంట్ ఒక రకమైన ఒమిక్రాన్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వేరియంట్‌ను మొదటగా 2024లో దక్షిణాఫ్రికాలో గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. 

అమెరికాతో పాటు ఈ కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు అనేక దేశాలకు వ్యాపిస్తుందట. ప్రపంచవ్యాప్తంగా 25 కంటే ఎక్కువ రాష్ట్రాలలో దీని రోగులను గుర్తించినట్లు సమాచారం. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఈ భయంకరమైన వైరస్ రోగులపైనే కాకుండా ప్రపంచంలోని విమానాశ్రయాల్లోని మురుగునీటి నమూనాలలో కూడా వైరస్ శాంపిల్స్ లభించాయట. ఇప్పుడిదే విషయం ప్రపంచానికి వణుకు పుట్టిస్తోంది.

శాస్త్రవేత్తల సంచలన ప్రకటన!
కరోనా బిఏ.3.2 స్పైక్ ప్రోటీన్‌లో సుమారు 70 నుండి 75 మార్పులు కనుగొన్నట్లు తెలిపింది. ఈ స్పైక్ ప్రోటీన్లు వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించేందుకు సహాయపడతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ మార్పుల కారణంగా, ఈ రకమైన వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా ఈ వైరస్ నశింపజేస్తుందని సమాచారం. 

కొత్త కరోనా ప్రమాదకరమా?
ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. ఈ కొత్త వేరియంట్ అంత తీవ్రమైనది కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది జనాన్ని ఊరట కల్పించే వార్త. కొత్త వైరస్ బారిన పడిన కొందరు రోగులు ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి కూడా చేరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న వైరస్ రకం మరీఅంతగా ప్రాణాంతకమైన వేరియంట్ కాదని స్పష్టం చేశారు. ఏది ఏమైనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా సంక్షోభం ఇప్పటికీ మన నుంచి తొలగి పోలేదని, భవిష్యత్తులో కొత్త రకం పుట్టుకొచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నివారించడం అత్యంత ముఖ్యం. వైరస్ వ్యాప్తి చెందేందుకు ఎంత అవకాశం తక్కువ  ఉంటే అది రూపాంతరం చెందేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఫ్లూ, ఆర్‌ఎస్‌వి వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులు కూడా పెరుగుతున్న క్రమంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని తెలుస్తోంది.

Also Read: Petrol Bunk Scams: పెట్రోల్ బంకుల్లో భారీగా పెరిగిన మోసాలు..ఆయిల్ కొట్టించే ముందు ఇవి సరిచూసుకోండి..జాగ్రత్త!

Also Read: Krunal Pandya News: ఆ అమ్మాయి కారణంగా విడిపోయిన పాండ్యా సోదరులు? అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన బ్యూటీ ఎవరు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Mar 26, 2026 10:33:33
Hyderabad, Telangana:

Energy Emergency India News: పశ్చిమాసియాలోని ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలపై పడుతోంది. కొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితి చేయిదాటిపోయింది. ఇరాన్‌లోని హోర్ముజ్ జలసంధిని మూసివేసిన కారణంగా ఆసియాలోని అనేక దేశాలలో చమురు సంక్షోభానికి దారితీసింది. ఆసియాలోని అనేక దేశాలు ఈ ద్వారం గుండా చమురు దిగుమతులు చేసుకునే క్రమంలో అవి నిలిచిపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

గత 26 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతున్న క్రమంలో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చమురు కొరత నేపథ్యంలో పలు ఆసియా దేశాలు ముందస్తు చర్యలు మొదలుపెట్టాయి. మరోవైపు భారతదేశంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా లేనప్పటికీ.. మనం కరోనా కాలం నాటి పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయినా కొన్ని దేశాలు మాత్రం అత్యవసర పరిస్థితి విధించేందుకు సిద్ధమయ్యాయి. 

భారత్‌లో పరిస్థితి ఏంటి?
భారతదేశంలో ఇంకా ఇంధన సంక్షోభం ప్రారంభం కాలేదు. అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతుల కారణంగా అనేక నగరాల్లోని పెట్రోల్ పంపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గ్యాస్, ఆయిల్ సంక్షోభం వస్తుందనే అపోహ ప్రజల్లో వ్యాపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఇంధన అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. భారతదేశం ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య 27 నుండి 41కి పెరిగింది. 

పాకిస్తాన్
చమురు సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ రంగ ఉద్యోగులు కేవలం 4 రోజులు మాత్రమే పని చేస్తారని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలను రెండు వారాల పాటు మూసివేసినట్లు సమాచారం. పాకిస్తాన్ చమురు దిగుమతులలో దాదాపు 90 శాతం నిలిచిపోయాయి. ఈ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.350కి పెరిగాయి. 

బంగ్లాదేశ్
దేశంలో ఇంధన నిల్వలు కేవలం 9 నుంచి 14 రోజులకు మాత్రమే సరిపోతాయని బంగ్లాదేశ్‌లోని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం తెలిపింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించింది. పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహించడంతో పాటు ప్రతిరోజూ ఐదు గంటల విద్యుత్ కోతను అమలు చేశారు. వస్త్ర రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

శ్రీలంక
శ్రీలంకలో ప్రభుత్వ సెలవులను తప్పనిసరి చేశారు. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు వారానికి 15 లీటర్ల పరిమితిని విధించారు. ఎవరూ అదనపు ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా చూసేందుకు 'క్యూఆర్ ఆధారిత ఫ్యూయల్ పాస్ వ్యవస్థ'ను అమలు చేశారు.

థాయ్‌లాండ్ 
థాయ్‌లాండ్‌లో ప్రభుత్వ రంగాలలో ఇంటి నుండి పని చేయాలని, విదేశాలకు ప్రయాణించవద్దని ఆదేశాలు జారీ చేశారు. 

వియత్నాం
వియత్నాంలో ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించగా.. ఇక్కడ రిమోట్ వర్కింగ్ విధానాన్ని పరిశీలిస్తున్నారు.

తైవాన్
తైవాన్ వద్ద కేవలం 11 రోజులకు సరిపడా LNG నిల్వలు మాత్రమే ఉన్నాయి. 

ఇండోనేషియా
ఏప్రిల్ నుంచి అమలు చేయనున్న హైబ్రిడ్ మోడల్‌లో క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ విషయంలో త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఫిలిప్పీన్స్ అత్యవసర పరిస్థితి
ఫిలిప్పీన్స్ దేశంలో 'జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి'ని ప్రకటించారు. ఇంధన నిల్వలు కేవలం 45 రోజులకు మాత్రమే సరిపోతాయని ప్రజలకు తెలియజేశారు. 

జపాన్
జపాన్ దేశం తన నిల్వల నుండి చమురును మరోసారి మార్కెట్‌లోకి విడుదల చేయాలని IEAను కోరింది.

దక్షిణ కొరియా
దక్షిణ కొరియా దేశంలో ప్రభుత్వ సంస్థలలో వెహికల్ నంబరు ఆధారిత నియంత్రణ విధానాన్ని అమలు చేస్తోంది.

ALso Read: Lockdown In India 2026: దేశంలో మరోసారి లాక్‌డౌన్? విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్! 25 రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు!

Also Read; Petrol Bunk Scams: పెట్రోల్ బంకుల్లో భారీగా పెరిగిన మోసాలు..ఆయిల్ కొట్టించే ముందు ఇవి సరిచూసుకోండి..జాగ్రత్త!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 26, 2026 08:35:20
Hyderabad, Telangana:

Petrol Bunk Scams In India: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలకు బంకుల వెంట బారులు తీరుతున్నారు. అయితే ఇదే అదునుగా తీసుకొని కొందరు పెట్రోల్ పంపు యజమానులు స్కామ్స్‌కు పాల్పడుతున్నారు. తక్కువ క్వాలిటీ కలిగిన పెట్రోల్‌, డీజిల్‌ను ప్రజలకు విక్రయిస్తున్నట్లు పలు ప్రాంతాల్లో బయటపడింది. ఇదే అనుమానం మనలో చాలా మందికి ఉంటుంది. మన వాహనాలకు కొట్టించేది మంచిదా? లేదా కల్తీదా? అని తరచూ డౌట్ వస్తుంటుంది. అయితే అలాంటి మోసాలను ఇప్పుడు ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

మనలో చాలామంది వాహనదారులు భరోసాకు వెళ్తారు. మనకు తెలిసిన పెట్రోల్ బంకు అని రూ.100, 200, 500 లాంటి రౌండ్ ఫిగర్ నంబర్స్ విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తారు. అయితే అందుకు బదులుగా రూ. 110, 210, 310 లేదా 510 లాంటి బేసి సంఖ్యలు కలిగిన నంబర్స్‌ విలువైన పెట్రోల్, డీజిల్ పొందడం ఉత్తమం. ఈ విధంగా ఇంధనం కొట్టిస్తే మిషన్లలో సెట్ చేసిన ముందస్తు మోసాల నుంచి వినియోగదారులు తప్పించుకునే అవకాశం ఉంది. 

అయితే, ఇప్పుడు అలాంటి కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేసే వ్యక్తి విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రజలు తామెంతో తెలివైన వాళ్లు అనుకొని కొన్ని పొరపాట్లు చేస్తున్నారని అతను వెల్లడించాడు. అయితే రౌండప్ నంబర్స్‌తో పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడం వల్ల కొంతమేర వ్యత్యాసం ఉంటే అవకాశం ఉందని చెప్పాడు. అదే విధంగా పెట్రోల్ లేదా డీజిల్ వంటి ఇంధనాల క్వాలిటీని చెక్ చేసుకున్న తర్వాతే తమ వాహనాల్లో నింపుకోవాలని సూచించాడు. 

క్వాలిటీ ఇలా తెలుసుకోవాలి!
పెట్రోల్ లేదా డీజిల్ స్వచ్ఛతను కొలవడానికి అత్యంత నమ్మదగిన మార్గం పంపు మిషెన్‌పై ఉన్న 'డెన్సిటీ'. ఇది పెట్రోల్‌ కోసం 720 నుండి 775 మధ్య డెన్సిటీ ఉండాలి. అదే విధంగా డీజిల్ డెన్సిటీ కూడా 820 నుండి 860 మధ్య ఉండాల్సి ఉంది. అయితే ఆ రెండు విలువల మధ్య ఉంటేనే ఆ ఇంధనాలు స్వచ్ఛతగా ఉన్నట్లు అర్థం. ఆ విలువల కంటే ఎక్కువ లేదా తక్కువ చూపించినా.. అందులో క్వాలిటీ కోల్పోయిందన్న మాట. ప్రతిరోజూ పెట్రోల్ బంక్ యజమానులు ఈ డెన్సిటీ పరీక్షలు నిర్వహించి వాటి విలువలు అప్‌డేట్ చేయాల్సిఉంది.

అదే విధంగా పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించే ముందు తప్పనిసరిగా జీరో వాల్యూ ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి. అదే విధంగా పెట్రోల్ కొట్టించే ముందు మీటర్ రీడింగ్ 0, 1, 2, 3.. అలా ఆరోహణ క్రమంలో వెళ్తూ ఉండాలి. ఒకవేళ మీటర్ రీడింగ్ 5 నుంచి 10 అలా వ్యత్యాసం లేకుండా వెళ్తుంటే ఆ సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందని నిర్ధారించుకోవాలి. 

Also Read: Krunal Pandya News: ఆ అమ్మాయి కారణంగా విడిపోయిన పాండ్యా సోదరులు? అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన బ్యూటీ ఎవరు?

Also Read: Mahesh Babu Trisha Affair: విజయ్‌తో కాదు..మహేష్ బాబుతో హీరోయిన్ త్రిష అఫైర్! తెలుగు డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

986
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 26, 2026 08:34:01
Hyderabad, Telangana:

 15 Foot King Cobra Video Watch Now: ప్రకృతిలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో కింగ్ కోబ్రా ఒకటి.. అది పడక విప్పితే చాలు.. వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే సామాన్యులే కాదు.. వన్యప్రాణి సంరక్షకులు సైతం షాక్ అయిపోవాల్సిందే.  ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఏకంగా 15 అడుగుల పొడవున్న భారీ కోబ్రాను స్నేక్యాచార్ బంధిస్తున్న దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోలో ఉన్న పాములు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.. కోబ్రాల్లో ఇంత భయంకరమైన పాములు కూడా ఉంటాయా? అని చూసిన వారి సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా పాములను పట్టుకున్న తర్వాత వాటిని సురక్షితంగా అడవిలో విడిచి పెట్టడానికి సంచుల్లో బంధిస్తూ ఉంటారు.. అయితే, ఈ వీడియోలో కనిపిస్తున్న కింగ్ కోబ్రా మాత్రం అంత తేలికగా లొంగిపోవడం లేదు.. స్నేక్ క్యాచర్ దానిని సంచిలో వేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అది మెరుపు వేగంతో తప్పించుకోవడానికి ప్రయత్నించడం మీరు కళ్లకు కట్టినట్లు చూడొచ్చు.. అతనిపై దాడి చేసేందుకు కూడా ఆ పాము ప్రయత్నిస్తోంది.. ఇది చూస్తుంటేనే భయం వేస్తుంది.. దాని భారీ శరీరంతో పాటు.. అది చేసే కదలికలు సోషల్ మీడియా వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తుంది.

ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికి వైరల్ అవ్వడం ప్రారంభమైంది.. ఈ పాము పరిమాణం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.. అది పామా లేక కొండచిలువనా అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. స్నేక్ క్యాచర్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. ప్రాణాలకు తెగించి రక్షిస్తున్నారు.. అని కొందరు ప్రశంసిస్తున్నారు.. ముఖ్యంగా ఆ కోబ్రా సంచి నుంచి పదేపదే బయటికి వస్తు..స్నేక్ క్యాచర్‌కు చుక్కలు చూపించడం ఈ వీడియోలో హైలెట్‌గా నిలిచింది..

 
 
 
 
 

ఇలాంటి విష సర్పాలు కనిపించినప్పుడు సొంత ప్రయోగాలు చేయవద్దని.. వెంటనే వన్యప్రాణి సంరక్షణ అధికారులకు లేదా స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించడం మంచిదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఒక్క చిన్న పొరపాటు జరిగిన ప్రాణాలకు ప్రమాదం వాటిలే అవకాశాలు ఉందని వారు తెలుపుతున్నారు. ఏది ఏమైనా 15 అడుగుల ఈ నల్ల త్రాచు వీడియో ఇప్పుడు యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1019
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 26, 2026 07:51:48
Hyderabad, Telangana:

 Toddler playing With Snake Video Watch: సోషల్ మీడియా యుగంలో నిత్యం ఏదో ఒక వింత వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది.. అయితే, తాజాగా ఇన్స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం ఎవరికైనా గుండె ఆగినంత పని అవుతుంది.. ఒక చిన్నారి ఏకంగా విష సర్పంతో ఆడుకుంటూ.. దానిని మెడలో వేసుకున్న దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను సైతం షేక్ చేస్తున్నాయి. నిజానికి ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది..

వైరల్ అవుతున్న రీల్‌లో ఒక చిన్న పాప తన ఎత్తు ఉన్న ఒక పాముతో ఎంతో ప్రేమగా పట్టుకొని ఉండడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సాధారణంగా పాము పేరు వింటేనే పెద్దవారు ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు.. కానీ ఆ చిన్నారి మాత్రం ఆ పామును ఒక బొమ్మల పట్టుకొని ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఏమాత్రం భయం లేకుండా ఆ పామును పట్టుకొని.. దాన్ని తన మెడలో చుట్టూ వేసుకొని అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తుంది. ఆ పాము కూడా చిన్నారికి ఎలాంటి హాని చేయకుండా ఉండడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే లక్షలాది వ్యూస్‌తో పాటు వేల సంఖ్యలో కామెంట్లతో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ఆ చిన్నారి ధైర్యం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.. ప్రకృతిలో మమేకం అవడం అంటే ఇదేనేమో అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తుంటే.. మరి కొంతమంది ఇది అత్యంత ప్రమాదకరం.. వ్యూస్ కోసం తల్లిదండ్రులు పిల్లల ప్రాణాలను పణంగా పెట్టడమేంటని కామెంట్లు చేస్తున్నారు. పాము ఎప్పుడు ఇలా ప్రవర్తిస్తుందో చెప్పలేమని.. చిన్నపిల్లలను ఇలాంటి వాటికి దూరంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు..

 
 
 
 
 

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం సాహసాలు చేయడం ప్రాణాంతకమని వన్యప్రాణి సంరక్షకులు హెచ్చరిస్తున్నారు.. అది విషమున్న పాము అయిన.. కాకపోయినా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని.. ఇలాంటి చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.. షేర్ చేసిన కొద్ది నిమిషాలకే బీభత్సంగా వైరల్ అవ్వడం విశేషం.

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1094
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 26, 2026 07:02:05
Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Temple VIPs Rush: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో తిరుమల కిటకిటలాడుతోంది. వారికి సినీ ప్రముఖులు కూడా తిరుమలకు పోటెత్తుతున్నారు. తిరుమల గిరులు ప్రముఖుల రాకతో సందడిగా మారాయి. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే తిరుమలలో  పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. సినీ నటీనటులు శర్వానంద్‌, మాళవిక నాయర్‌, సంపత్‌ రాజ్‌తోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్రకుమార్‌, బోండా ఉమ తదితరులు దర్శించుకున్నారు.

Also Read: Lavanya Drunk: తప్ప తాగి హీరో రాజ్‌ తరుణ్‌ మాజీ లవర్‌ నానా రచ్చ.. తిరగబడ్డ గ్రామస్తులు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోండా ఉమా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాళ నరేంద్ర కుమార్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తమ బైకర్‌ సినిమా విడుదల సందర్భంగా ఆ చిత్రబృందం తిరుమల ఆలయాన్ని సందర్శించింది.

Also Read: Harish Rao: 'తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాడు': హరీశ్ రావు

బైకర్‌ సినిమా హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్‌తోపాటు చిత్రబృందం గురువారం శ్రీవారిని దర్శించుకుంది. త్వరలో విడుదల కాబోతున్న బైకర్‌ సినిమా విజయవంతం కావాలని కోరుతూ చిత్రబృందం మొక్కులు చెల్లించుకుంది. తిరుమల ఆలయం వెలుపల సినీ ప్రముఖులను చూసేందుకు అభిమానులు, భక్తులు ఎగబడ్డారు. ఇక లక్కీ భాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి తిరుమల స్వామిని దర్శించుకున్నారు. విలక్షణ నటుడు సంపత్ రాజ్ కూడా తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు.

తిరుమలలో హోటళ్లు బంద్‌
గ్యాస్ సమస్య తిరుమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్‌ లేక తిరుమలలోని హోటళ్లు మూతపడుతున్నాయి. సిలిండర్లు లభించక దాదాపు 50 హోటళ్లు మూతపడ్డాయని సమాచారం. హోటళ్లు మూతపడడం కారణంగా తిరుమలలోని అన్నప్రసాద కేంద్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. పెద్ద ఎత్తున భక్తులు అన్నప్రసాద కేంద్రాలకు వచ్చి ఆహారం తీసుకుంటున్నారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతోపాటు వివిధ సత్రాల్లోని అన్నప్రసాదాల కేంద్రాలు భక్తులతో నిండిపోతున్నాయి. దీంతో టీటీడీకి కూడా గ్యాస్‌ కష్టాలు ఎదురవుతున్నాయి. నిత్యం 6 టన్నుల గ్యాస్‌ కావాల్సి ఉండగా.. ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ కావాల్సినంత గ్యాస్‌ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో తిరుమలలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1065
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 25, 2026 18:34:58
Sangareddy, Telangana:

Lavanya Catches In Drunk and Drive: యువ నటుడు రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లు రాజ్‌ తరుణ్‌తో తన ప్రేమ వ్యవహారాలతోపాటు డ్రగ్స్‌.. ఇతర వ్యవహారాలతో వార్తల్లో నిలిచిన ఆమె తాజాగా మద్యం సేవించి గ్రామస్తులను ఢీకొట్టింది. మద్యం సేవించి వాహనం నడుపుతుండగా అడ్డదిడ్డంగా కారు నడిపి పలువురిని ఢీకొట్టగా గ్రామస్తులు తిరగబడ్డారు. తాగి ఢీకొట్టడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: YS Jagan: ఇక రోజూ చంద్ర‌బాబుకు సినిమా చూపిస్తా..! పాద‌యాత్రపై వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన

మద్యం మత్తులో ఉన్న సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో వెళ్తూ ఓ ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఢీకొట్టిన అనంతరం ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా మల్లేపల్లి గ్రామస్తులు ఆగ్రహంతో ఆమె కారును అడ్డగించారు. ఢీకొట్టడంతో క్షమాపణలు చెప్పాలని గ్రామస్తులు కోరగా.. వారితో లావణ్య వాగ్వాదానికి దిగింది. తాగి ఢీకొట్టడమే కాకుండా తమపైనే తిరగబడడంతో లావణ్యపై గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు.

Also Read: Petrol Shortage: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన

ఎంతకీ క్షమాపణలు చెప్పకుండా వాగ్వాదానికి దిగిన లావణ్యపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీశారు. అయితే పోలీసులతోనూ లావణ్య వాగ్వాదం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమెకు బ్రీత్‌ ఎనలైజర్‌తో తనిఖీ చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో లావణ్యపై డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆమె కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలిచారు. ఢీకొట్టిన సమయంలో లావణ్య కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.

Also Read: Harish Rao: 'తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాడు': హరీశ్ రావు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో లావణ్య పట్టుబడడం వైరల్‌గా మారింది. గ్రామస్తులతో ఆమె వాగ్వాదం చేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. లావణ్య తీరుపై గ్రామస్తులు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. అయితే లావణ్య ఇలా వివాదాల్లో చిక్కడం తొలిసారి కాదు. గతంలో డ్రగ్స్‌ వ్యవహారంలో కూడా లావణ్య పేరు మార్మోగింది. అనంతరం రాజ్‌ తరుణ్‌తో ప్రేమ వ్యవహారం తీవ్ర రచ్చకు దారితీసిన విషయం తెలిసిందే. రాజ్‌ తరుణ్‌తో వేరొకరితో సత్సంబంధాలు కలిగిన లావణ్య అనంతరం కొందరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరల్తో వాగ్వాదానికి దిగింది. ఆమె చేసిన రచ్చ మామూలుది కాదు. ఇప్పటికీ పలు టీవీ షోల్‌లో లావణ్యకు సంబంధించిన వ్యవహారాలు ట్రెండింగ్‌లో ఉంటాయి. ఇప్పుడు మద్యం సేవించి కారు నడుపుతూ గ్రామస్తులను ఢీకొట్టడం.. అనంతరం గ్రామస్తులు, పోలీసులతో గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1014
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 25, 2026 13:40:46
Hyderabad, Telangana:

Harish Rao vs Revanth Reddy: తలకిందకు పెట్టి కాళ్లు పైకి పెట్టి రేవంత్‌ రెడ్డి తపస్సు చేసినా.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. రేవంత్‌ రెడ్డి మళ్లీ సీఎం కావడం కలే అని తెలిపారు. సిద్దిపేటలో ఎవరో ఎందుకు? రేవంత్ రెడ్డే తనపై పోటీకి దిగాలని సవాల్‌ చేశారు. డీలిమిటేషన్ ఎప్పుడో జరగాలి. సీట్లు పెరిగి.. మహిళా రిజర్వేషన్ అమలు జరిగితే స్వాగతిస్తాం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు తెలిపారు.

Also Read: Jeevan Reddy: కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం మీడియాతో బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు చిట్‌చాట్‌ చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతోనే తేటతెల్లమైందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అతితక్కువ నిధులు అంటే 2 శాతం నిధులు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది? అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచింది. గ్యారంటీలను తుంగలో తొక్కింది కనుకే బడ్జెట్ పేపర్లు చించేశాo. చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపాం' అని వివరించారు. రేవంత్‌ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

Also Read: YS Jagan: ఇక రోజూ చంద్ర‌బాబుకు సినిమా చూపిస్తా..! పాద‌యాత్రపై వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన

'ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీని అభినందించే వాళ్లం కదా. ఇంకో వారం పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పొడిగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అన్ని అంశాలపై చర్చ జరగాలంటే మరో వారం పాటు  అసెంబ్లీ జరగాలి. సభ జరుగుతున్న తీరు అస్సలు బాలేదు. ఈరోజు రెండు ముఖ్యమైన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని కేటీఆర్ అడిగిన ప్రశ్నకు, 16 నోటిఫికేషన్‌లు, 16,978 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం సమాధానం చెప్పిందని వెల్లడించారు.

Also Read: Petrol Shortage: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన

'కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు 50,785 మందికి నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటుంది. ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. 98 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి మళ్లించారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ , ఎస్టీలకు కేటాయించిన నిధులను 2 శాతం మాత్రమే ఈ ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు.

అసెంబ్లీ నడిపించడంలో రేవంత్‌ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు మండిపడ్డారు. 'అసెంబ్లీ సభా నియమాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. చనిపోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు చెక్ ఇచ్చేందుకు 3 గంటలు సభను వాయిదా వేశారు. రోజు జీరో అవర్ తీసుకుంటామని చెప్పి, రెండు రోజుల నుంచి జీరో అవర్ తీసుకోవడం లేదు' వివరించారు.

'తల కింద పెట్టి కాలు పైకి పెట్టిన రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాలేడు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. దక్షిణ భారతదేశానికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ తక్కువగా వస్తున్నాయి. చిన్నచూపు ఉంది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే బీఆర్ఎస్ పార్టీకి లాభమే' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

982
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 25, 2026 13:05:32
Hyderabad, Telangana:

 Snake Baba Viral Video Latest: ఆధ్యాత్మికతకు, వింతలకు పెట్టింది పేరు మన దేశం.. రోజుకో రకమైన బాబాలు పుట్టుకొస్తూ.. భక్తులను ఎంతగానో ఆశ్చర్యపరిస్తూ ఉంటారు.. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ బాబా తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా రాక తప్పదు.. ఈయన అందరి బాబాల్లాగా కాకుండా.. కుదురుగా ఒకే చోట కూర్చోడు.. పోనీ నడుచుకుంటూ వెళ్తాడా అంటే అది కూడా లేదు.. కేవలం పాములాగా పాకుతూ ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణిస్తూ ఉంటాడు.. ప్రస్తుతం ఈ పాము బాబాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి..

సాధారణంగా సాధువులతో పాటు బాబాలు కాషాయపు వస్త్రాలు ధరించి పాదయాత్రలు చేయడం లేదా ధ్యానంలో ఉండటం మనం తరచుగా అక్కడక్కడ చూస్తూ ఉంటాం.. కానీ ఈ సరికొత్త బాబా శైలి అందరికంటే భిన్నమే.. ఈయన నేలపై పడుకుని.. పాము ఏ విధంగా అయితే పాకుతూ వెళ్తుందో.. అదే రీతిలో అతను కూడా వేగంగా పాకతో వెళ్తాడు. దారిలో తనను చూసేవారు భయపడతారా లేదా నవ్వుతారా అనే సంబంధం లేకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోవడమే ఈ బాబా అసలైన స్పెషాలిటీ..

ఈ బాబా ఇలా పాకడం వెనక ఉన్న రహస్యం ఏంటని సోషల్ మీడియా వినియోగదారులు ఆరా తీస్తున్నారు.. కొంతమంది భక్తులు మాత్రం ఇది ఒక రకమైన తపస్సు అని... ఇలా చేయడం వల్ల లోకంలోని పాపాలు తొలగిపోతాయని నమ్ముతున్నారు.. అయితే, ఈ బాబా ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు! అనే వివరాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.. కానీ ఆయన వెళ్తున్న దారిలో జనాలు గుంపుగా చేరి..ఈ వింతను ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు..

 
 
 
 
 

ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు తమదైన శైలిలో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.. మార్కెట్లోని కొత్త మోడల్ బాబా వచ్చాడు.. ఇక భక్తుల కష్టాలు తీరిపోయినట్లే.. కొందరు సర్కాస్టిగ్గా కామెంట్ చేయగా.. నడిచి వెళ్తే అలిసిపోతాడేమోనని.. ఇలా పాకుతూ వెళ్తున్నారేమో అని కొంతమంది ఫన్నీగా స్పందిస్తూ వస్తున్నారు.. మనుషులుగా పుట్టి ఇలా పాముల ప్రవర్తించడం.. కలికాలం అంటే ఇదే.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ పాము బాబాకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వైరల్ అవుతుంది..

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1093
comment0
Report
HDHarish Darla
Mar 25, 2026 13:03:34
Hyderabad, Telangana:

Hardik Krunal Pandya Latest News: టీమ్ ఇండియా స్టార్ ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా సోదరుడు, ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు క్రునాల్ పాండ్యా పుట్టినరోజు సందర్భంగా (మార్చి 24) పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే బర్త్‌డే రోజు సొంత తమ్ముడి వల్లే క్రునాల్ కలత చెందాడని అంటున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పాండ్యా బ్రదర్స్ తమ జట్లతో కలిసి ప్రాక్టీస్ మొదలెట్టేశారు. అయితే క్రునాల్ పాండ్యా పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు హార్దిక్ పాండ్యా శుభాకాంక్షలు తెలపకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయని చర్చ జరుగుతోంది.

క్రునాల్ పాండ్యా పుట్టినరోజున, అతని భార్య పంఖురి శర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసి అతనికి శుభాకాంక్షలు తెలిపారు. "నీ మనసు, నీ ప్రేమ, అన్నీ నాకు తెలుసు. ఆ విషయాన్ని నీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. నువ్వు చాలా అందమైన జీవితాన్ని గడిపావు. కుటుంబం, క్రికెట్‌తో సహా ప్రతీదాన్నీ నువ్వు ప్రశాంతంగా, ధైర్యంగా నిర్వహిస్తావు," అని పంఖురి శర్మ పోస్ట్ చేసింది.

భార్య పంఖురి శర్మ పెట్టిన ఎమోషనల్ పోస్ట్‌కు భర్త కృనాల్ పాండ్యా కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ క్రమంలో కృనాల్ పాండ్యా సోదరుడు హార్దిక్ పాండ్యా అసలు ఎక్కడున్నాడనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే ప్రతి ఏటా కృనాల్ పాండ్యా పుట్టినరోజున అందరూ సంతోషంగా కలిసి ఉంటారు. కానీ ఈసారి హార్దిక్ పాండ్యా కనీసం విషెస్ చెప్పలేదని ఫ్యాన్స్ అంటున్నారు. 

హార్దిక్ పాండ్యా వదిన పంఖురి శర్మ పోస్ట్ చేసిన ఫోటో తర్వాత, 'హార్దిక్ పాండ్యా ఎక్కడ?', 'అతను క్రునాల్ పాండ్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదు?' వంటి ప్రశ్నలను అభిమానులు అడుగుతున్నారు. ఈలోగా, హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించగా, అతను క్రునాల్ పాండ్యాకు ఒక్క శుభాకాంక్షలు కూడా చెప్పలేదని స్పష్టమవుతోంది.

ఒకప్పుడు వాళ్లిద్దరూ తమ పుట్టినరోజులను కలిసి జరుపుకునేవారు. చాలా కార్యక్రమాలలో ఇద్దరూ కలిసే కనిపించేవారు. కానీ హార్దిక్ జీవితంలోకి మహికా శర్మ వచ్చినప్పటి నుండి, ఆ ఇద్దరు సోదరుల మధ్య మనస్పర్థలు వచ్చాయని వదంతులు వస్తున్నాయి. పాండ్యా సోదరుల మధ్య పెద్ద గొడవ జరిగిందని సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. కానీ ఈ గొడవకు ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. 

Also Read: Mahesh Babu Trisha Affair: విజయ్‌తో కాదు..మహేష్ బాబుతో హీరోయిన్ త్రిష అఫైర్! తెలుగు డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

ALso Read: Lockdown In India 2026: భారత్‌లో మరోసారి లాక్‌డౌన్! ప్రధాని మోదీ కీలక ప్రకటన..దేశంలో లాక్‌డౌన్ వస్తుందా? లేదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

989
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 25, 2026 12:56:11
Hyderabad, Telangana:

 Funny Video Watch Here: సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం ఎక్కడో ఒకచోట వింత ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ కొరత భయంతో ప్రజలు బంకుల ముందు క్యూ కట్టిన తరుణంలో... ఒక యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను కడుపుబ్బ నవ్విస్తోంది. భవిష్యత్తులో పెట్రోల్ దొరకదేమో అన్న ఆందోళనతో అతని ఏకంగా ఒక పెద్ద ప్లాస్టిక్ బ్రాహ్మణు నెత్తిమీద పెట్టుకొని పెట్రోల్ బంకుకు చేరుకున్నాడు. ఇప్పుడు ఈ దృశ్యాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.

దేశంలో ఇంధన కొరత ఏర్పడబోతుందన్న ప్రచారంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీంతో నగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.. బైకులతో పాటు కార్లతో రహదారులు కిక్కిరిసిపోయాయి. గంట తరబడి వేచి చూస్తున్న.. పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఉత్కంఠ భరిత వాతావరణం లో ఒక యువకుడు ఇచ్చిన ఎంట్రీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా అక్కడే ఉన్న యువకులు ఈ ఘటన చూసి నవ్వుతూ ఉండిపోయారు..

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

సాధారణంగా పెట్రోల్ కొరత ఉందంటే బాటిల్ లేదా చిన్న క్యాన్లతో రావడం చూస్తూ ఉంటాం కానీ ఈ యువకుడు ఒక అడుగు ముందుకేసి ఇంటి వద్ద ఉండే పెద్ద ప్లాస్టిక్ దమ్మును తీసుకువచ్చాడు బంకు వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో తన వంతు వచ్చే వరకు ఆ డ్రమ్మును తన తలపైనే పెట్టుకొని క్యూలో నిలబడ్డాడు పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి ఆ డ్రమ్ములోని పెట్రోల్ కొట్టాలని అడగడం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూశారు..

 
 
 
 
 

అక్కడే ఉన్న కొంతమంది వాహనదారులు ఈ వింత దృశ్యాన్ని చూసి తమ స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇంకేముంది గంటల వ్యవధిలోనే ఈ వీడియో మిలియన్స్ వ్యూస్ సంపాదించుకుంది. ఇతని ముందుచూపు మామూలుగా లేదని కొంతమంది కామెంట్లు చేస్తూ వస్తుంటే.. మరి కొంతమంది తమ్ముడు ఆ డ్రమ్ము నిండా పెట్రోల్ కొట్టిస్తే దాన్ని నెత్తి మీద మోసుకెళ్తావా అని మరికొందరు ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1081
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 25, 2026 12:44:58
Tadepalli, Andhra Pradesh:

YS Jagan Padayatra: 'ఎన్నికల్లో ఏ హామీ నిలబెట్టుకోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. జగన్‌ పథకాలన్నింటినీ రద్దు చేశారు. సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ పథకాల్లోనూ పచ్చి మోసం. ఉన్న పలావూ పోయింది. బిర్యానీ మాట ఒట్టిదైంది' అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌‌ జగన్‌ ఎద్దేవా చేశారు. 'రెండేళ్లలోనే రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప. రూ.3.37 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి పథకాలు మాత్రం అమలు చేయలేదు. సంక్షేమం అంతకన్నా లేదు' అని చంద్రబాబు పాలనను విమర్శించారు. తెచ్చిన అప్పంతా ఏమై పోతోంది? అని సందేహం వ్యక్తం చేశారు.

Also Read: Petrol Shortage: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన

అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అనంతరం కీలక ప్రసంగం చేశారు. 'చూస్తుండగానే చంద్రబాబు పాలన రెండేళ్లు పూర్తయ్యింది. ఇంకా మూడేళ్లు ఉంది. ఒకటిన్నర సంవత్సరం ఎలాగోలా ముగుస్తుంది. ఆ తర్వాత నా పాద‌యాత్ర ప్రారంభమవుతుంది. పాద‌యాత్ర‌లో ప్ర‌తిరోజూ చంద్ర‌బాబుకు సినిమా చూపిద్దాం' అని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. రెడ్‌ బుక్‌కు,అన్యాయ‌ పాల‌న‌కు టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింది! చంద్రబాబుకు భయపడే రోజులు లేవు' అని స్పష్టం చేశారు.

Also Read: Jeevan Reddy: కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు

'ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. ఎక్కడికక్కడ యథేచ్ఛ దోపిడీ పర్వం సాగుతోంది. లిక్కర్‌ మాఫియా, ఇసుక, మట్టి, ల్యాటరైట్‌ ఇలా దేన్నీ వదిలి పెట్టడం లేదు. అంతా దోపిడి. ఈ ప్రభుత్వంలో పాలన అనేది లేకుండా పోయింది' అని చంద్రబాబు పాలనపై వైఎస్‌ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. విద్య, వైద్యం, వ్యవసాయం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు చదువులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 'గవర్నమెంట్‌ స్కూళ్లలో గణనీయంగా తగ్గిన పిల్లలు. ఆరోగ్యశ్రీలో వైద్యం నిలిపివేసిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులు. గిట్టుబాటు ధరల్లేక రైతుల, వ్యవసాయం విలవిల. కూటమి ప్రభుత్వానికి ఓటమి తప్పదు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ జోష్యం చెప్పారు.

Also Read: Gold Man: స్వర్ణాభరణాల్లో తిరుమల శ్రీవారితోనే పోటీ.. 25 కిలోల బంగారంతో గోల్డ్‌ మెన్‌ సందడి

మళ్లీ వచ్చే అధికారంలో జగన్‌-2లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. నియోజకవర్గాల పెంపు శుభవార్త అని సీట్ల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సీట్లు గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, ఎంపీ సీట్ల పెంపుతో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని ప్రకటించారు. గట్టిగా పని చేసే వారికి, పటిమ ఉన్న వారికి ప్రోత్సాహం. నాయకులుగా ఎదిగేందుకు కార్యకర్తలకు అవకాశం. వారికి పూర్తి ప్రోత్సాహకారిగా ఉంటాం. అవకాశం ఇస్తాం' అని పార్టీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1032
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 25, 2026 12:37:21
Hyderabad, Telangana:

 Roti On Bike Silencer Video Watch Here: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనుషుల ఆలోచనలు కూడా వింతగా మారుతూ వస్తున్నాయి.. సాధారణంగా వంట చేయాలంటే పొయ్యి లేదా గ్యాస్ స్టవ్ అవసరం ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండా కేవలం బైక్ సైలెన్సర్ ఉపయోగించి ఓ మహిళ రొట్టెలు కాల్చడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది.. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది అక్షరాల నిజం.. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎల్పిజి కోరత కారణంగా చాలామంది ఇలాంటి వింత వింత ఆలోచనలతో ముందుకు వస్తున్నారు..

ప్రస్తుతం ఇంస్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్ వేదికలో ఈ వీడియో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక యువతి తన బైక్ పక్కనే పిండి ముద్దతో కూర్చుని ఉండడం మీరు చూడొచ్చు. ఆమె రొట్టెలను ఒత్తిన తర్వాత.. పక్కనే స్టార్ట్ చేసి ఉన్న బైక్ సైలెన్సర్ పై ఆ రొట్టెలను వేసింది. ఇంజన్ రన్ అవుతుండడంతో సైలెన్సర్ నుంచి వచ్చే విపరీతమైన వేడికి ఆ రొట్టె క్రమంగా కాలడం మీరు ఈ వైరల్ అవుతున్న వీడియోలో గమనించవచ్చు.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఆ రొట్టె రెండు వైపులా చక్కగా కాలిపోయింది..

ఆ యువతి కేవలం రొట్టె కాల్చడమే కాకుండా..తన ముందే ప్లేటు పట్టుకొని కూర్చున్న తన కుమారుడికి ఆ రొట్టెను వడ్డించింది.. ఆ బాలుడు కూడా ఏమీ తెలియనట్లు ఆ రొట్టెను తినడానికి సిద్ధం అవ్వడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అయితే, ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు..ఇదేం ఐడియా రా బాబోయ్.. ఇలాంటివి ఎలా తడతాయని? కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపోతున్నారు..

 
 
 
 
 

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

అయితే ఈ వీడియో కేవలం వినోదం కోసం చేసిందా లేదా నిజంగానే వంట చేశారా అన్నది పక్కన పెడితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైలెన్సర్ నుంచి కార్బన్ మొనాక్సిడైడ్ వంటి విషపూరితమైన వాయువులు విడుదలవుతాయి.. అవి నేరుగా ఆహార పదార్థాలకు అంటుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. సైలెన్సర్ పై ఉండే ఇంధన అవశేషాలు ఆహారంలో కలిస్తే క్యాన్సర్ కారకంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వైద్యులు తెలుపుతున్నారు. 

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1047
comment0
Report
Advertisement
Back to top