Russells Viper Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న తన కుమారుడిపైకి అత్యంత విషపూరితమైన పాము రక్తపింజరి దూసుకొచ్చింది. పాము తనపై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. 'నాన్న పాము' అంటూ ఆ కొడుకు ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లి తన నాన్నకు చెప్పాడు. అది చూసి విస్తుపోయిన తండ్రి పాము బారి నుంచి తన కొడుకుతోపాటు తన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆ తండ్రి భావించాడు. సాహసంతో అత్యంత విషపూరితమైన ఆ పాము నుంచి కుటుంబాన్ని కాపాడాడు. ఈ పోరాటంలో రక్తపింజరి చనిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Lack Of 108 Ambulance: ఏపీలో దారుణం.. 108 అంబులెన్స్ లేక ఎడ్లబండిపై భార్య తరలింపు
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఎర్రబోడ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వాచ్‌మెన్ రమేశ్ కుటుంబం నివసిస్తోంది. ఉదయం కావడంతో ఇంటి ముందు అతడి మూడేళ్ల కుమారుడు ఆడుకుంటూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అకస్మాత్తుగా అత్యంత విషపూరితమైన రక్తపింజరి అక్కడకు వచ్చింది. ఆటలో లీనమైన ఆ బాలుడు పామును పట్టించుకోలేదు. కానీ బుసలు కొడుతూ ఆ పాము దాడి చేసేందుకు ప్రయత్నించింది.
Also Read: Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. అదనంగా రూ.10 లక్షలు
అప్రమత్తమైన మూడేళ్ల బాలుడు వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయాడు. భయంతో అరుస్తూ తండ్రి రమేశ్ వద్దకు పరుగెత్తాడు. నాన్న పాము వచ్చిందని చెప్పడంతో ఆ కుటుంబం భయాందోళనకు గురయ్యింది. అప్రమత్తమైన వాచ్‌మెన్ వెంటనే పెద్ద కర్ర తీసుకుని బయటకు వచ్చాడు. కుటుంబాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించి పామును తరిమేందుకు ప్రయత్నించాడు. కర్రతో దాడి చేయడంతో రక్తపింజరి పాము తీవ్రంగా గాయపడి అక్కడే చనిపోయింది.
Also Read: Nara Lokesh: ఇందాపూర్ డెయిరీకి.. హెరిటేజ్‌కు సంబంధం లేదు: నారా లోకేశ్
పాము చనిపోవడంతో ఆ కుటుంబంతోపాటు అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆటలో లీనమైన కుమారుడిని పాము బారి నుంచి తండ్రి రమేశ్ తప్పించడంతో బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. అయితే తరచూ పాముల సంచారం పెరిగిపోయిందని.. ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉంటున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని పాముల బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనతో చిన్నపిల్లలను ఒంటరిగా బయట ఉండనివ్వొద్దని నిర్ణయం తీసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
HYDRAA Commissioner: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌లా పని చేస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేశారు. 'సున్నం చెరువులో 5 ఎకరాల భూమిని వదిలేసి మళ్లీ ఫెన్సింగ్ వేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్‌లో సర్వే నెంబర్ 29, 30 ప్రభుత్వ భూమిపై అసోసియేషన్ సభ్యులు ఆర్టీఏ పెట్టారు. 2017లో తమ ప్రభుత్వం కోట్ల రూపాయలతో చెరువులకు ఫెన్సింగ్ వేశాం. అల్లాపూర్ డివిజన్‌లో సున్నం చెరువు రూ.47 లక్షల తో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నివేదికతో ఫెన్సింగ్ వేస్తాం. ఇప్పుడు కమిషనర్ 5 ఎకరాలు వదిలేస్తున్నారు' అని ఆరోపించారు.
Also Read: Russells Viper: తీవ్ర విషపూరితమైన పాము నుంచి కొడుకును రక్షించిన తండ్రి
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. '2017లో అధికారులు ఇచ్చిన సమాచారం వదిలేసి 2014 ఇచ్చిన దానిని ప్రామాణికం తీసుకోవడం ఏమిటి? సున్నం చెరువుపై పూర్తి విచారణ జరపాలి' అని బీఆర్‌ఎస్ పార్టీ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా మేము భూమిని కాపాడాలని కోరుతుంటే ఏకంగా వదిలిపెడుతున్నారని హైడ్రా కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇంట్లో ఉన్న వారిని బయట పడేసి ఇండ్లు కూల్చారు. చదువుకునే పిల్లలను కూడా వేడుకుంటే వినలేదు. హైదరాబాద్‌లో ఉన్న టాప్ 10 బిల్డర్‌ను కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు.. స్పందించారు' అని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.
Also Read: Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. అదనంగా రూ.10 లక్షలు
'సున్నం చెరువు, మైసమ్మ చెరువును పట్టించుకోరు. ఐడీఎల్‌ను అభివృద్ధి చేస్తే అక్కడ లైట్స్ వెలగవు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై కక్ష సాధింపు చేస్తున్నారు. ఆల్విన్ కాలనీలో ఫెన్సింగ్ వేశారు. ఎవరు కూడా అక్కడ కబ్జా పెట్టలేదు.. అక్కడ పేదలు కూరగాయలు పెట్టుకునే అమ్ముకుంటే ఫెన్సింగ్ వేసి ఇబ్బంది పెట్టారు' అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిని ప్రభుత్వంతో మాట్లాడి ప్రజా వినియోగంలోకి తీసుకొని వచ్చానని గుర్తుచేశారు. ఐదు ఎకరాలు ఉన్న భూమి ఎందుకు వదిలేసి ఫెన్సింగ్ వేశారో ప్రజలకు హైడ్రా కమిషనర్ సమాధానం చెప్పాలని కోరారు.
Also Read: Lack Of 108 Ambulance: ఏపీలో దారుణం.. 108 అంబులెన్స్ లేక ఎడ్లబండిపై భార్య తరలింపు
'ప్రజల కట్టిన డబ్బుతో మీరు జీతం తీసుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. కమిషనర్ తీరుపై సెంట్రల్ విజిలెన్స్‌తోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం' అని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకటించారు. 'అల్లాపూర్‌లోని ముస్లిం శ్మశానవాటిక విషయంలో కమిషనర్ తానే ఇస్తానని చెప్పడం ఏమిటి? నువ్వు వచ్చి ఇస్తానని చెప్పడానికి నువ్వు ఏమైనా ముఖ్యమంత్రివా?' అని హైడ్రా కమిషనర్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 'హైదరాబాద్‌లో 90 శాతం పైగా భూములు భారీగా ఉన్నాయి. హైడ్రా అభివృద్ధికి ఎమ్మెల్యేగా సహకరిస్తా. కానీ పేదల జోలికి వస్తే ఊరుకోను' అని హెచ్చరించారు. సున్నం చెరువు పై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Malavya Yoga Effect On Zodiac Telugu: మార్చి 2026లో అనేక గ్రహాలు కదలికలు చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు అరుదైన నక్షత్రాల్లోకి ప్రవేశించబోతున్నాయి. ఈ సమయంలో శుక్రుడులాంటి అద్భుతమైన గ్రహం కదలికలు జరపడం విశేషం.. ముఖ్యంగా మార్చి రెండవ తేదీన శుక్రుడు కుంభరాశి నుంచి బయలుదేరి.. మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలోనే ఎంతో శుభప్రదమైన మాలవ్య రాజయోగం ఏర్పడబోతోంది. మార్చి 15వ తేదీన సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ సూర్యుడు, శుక్రుడు, శని గ్రహాల కలయిక జరుగుతుంది. ఇక ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన త్రిగ్రహి రాజయోగం ఏర్పడుతుంది. హోలీ సమయంలో ఈ గ్రహ కలయికల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. ఆర్థికంగా ఎంతో మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి ఊహించని రాశి ఫలాలు:
వృషభ రాశి
ముఖ్యంగా శుక్రుడు సంచార ఫలితంగా వృషభ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి శుక్రుడు ఉన్నత స్థానంలో ఉండడం వల్ల ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. మార్చి నెలలో అద్భుతమైన పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు.. ఈ సమయంలో విస్తరణలు కూడా జరుగుతాయి. కొత్త ఆదాయ వనరులు కూడా లభించడంతో.. కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. సన్నిహితుల సపోర్టుతో అన్ని రంగాల్లో బాగా రాణించగలుగుతారు.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అత్తిక స్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. పనుల్లో పాల్గొనే వ్యక్తులకు సృజనాత్మకత కూడా పెరుగుతుంది. గరిష్ట స్థాయిలో లాభాలు కూడా పొందుతారు. పనుల్లో ప్రశంసలు లభించడమే కాకుండా.. సామాజిక హోదా కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది.. పోటీ పరీక్షలు రాయాలనుకుంటున్న వ్యక్తులు ఈ సమయంలో మంచి జ్ఞానంతో.. పరీక్షలు రాసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబంలో శుభ సంఘటనలు ఏర్పడే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించడం వల్ల అనుకున్న విజయాలు కూడా సాధించగలుగుతారు. దీంతోపాటు ఆర్థికంగా చాలా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శుక్రుడు ప్రభావంతో అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే సామర్థ్యం కూడా విపరీతంగా పెరిగి అద్భుతమైన ప్రయోజనాలు ముందే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా గుర్తింపు పొందగలుగుతారు. విదేశీ వ్యాపారాలు చేస్తున్న వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్య పరిస్థితిని కూడా కొంతవరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
March Lucky Zodiac Sign 2026 Telugu: మార్చి నెల ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాబోయే మార్చి నెల చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా మార్చి రెండవ తేదీ నుంచి 5వ తేదీ మధ్య అనేక ప్రధాన గ్రహాలు నక్షత్ర మార్పులతో పాటు రాశి సంచారాలు జరుపుతాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన గ్రహాలు ఈ సమయంలో కదలికలు జరపడం విశేషం..మార్చి రెండున శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.. ఆ తర్వాత మూడో తేదీన కుజుడు శతభిషా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు.. ఆ తర్వాతిరోజే శుక్రుడు మళ్ళీ ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా మార్చి ఐదున సూర్యుడు పూర్వభాద్ర పాద నక్షత్రంలోకి, మార్చి ఐదున సూర్యుడు అదే నక్షత్రంలోకి సంచారం చేస్తాయి. ఈ సమయంలో అనేక గ్రహాలు సంచారం చేయడం కారణంగా.. కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మిథున రాశి
మిధున రాశి వారికి ఈ సమయంలో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గణనీయమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా.. కష్టపడి పనులు చేసే వారికి అద్భుతమైన ప్రశంసలు లభిస్తాయి. అలాగే ఈ సమయంలో బహుమతులు కూడా పొందవచ్చు.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు రెండింటిలోనూ పురోగతి సాధించే అవకాశాలున్నాయి. అలాగే కోపంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ.. కొన్ని రకాల మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తులారాశి
తులారాశి లో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఊహించని విజయాలు కలగడమే కాకుండా.. కెరీర్ పరంగా స్థిరత్వం చాలా వరకు పెరుగుతుంది. ముఖ్యంగా నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇంటర్వ్యూ లేదా పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడమే కాకుండా.. నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆర్థికంగా చాలా వరకు బలం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కొత్త అవకాశాలు లభించడమే కాకుండా.. పదోన్నతులు కూడా తిరిగి పొందుతారు. కొత్త కొత్త బాధ్యతలను పొంది జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం ఎంతో అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ముఖ్యంగా పదోన్నతులకు సంబంధించిన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఆర్థిక పరిస్థితులు బలంగా మారుతాయి. జీవితం మరింత సమతుల్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా అనుకుంటున్న పనులు కూడా చేయగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mumbai Dharavi Slum Business: ముంబైలో.. ఆకాశహర్మ్యాల నీడలో.. టిన్ షీట్లు.. ఆస్బెస్టాస్ పైకప్పులతో విస్తరించిన ఒక ప్రపంచం ఉంది. బయటివారికి అది మురికివాడ. కొందరికి బతుకుదెరువుకు బాసటగా నిలిచే ప్రదేశం. మరికొందరికి సినిమాలు.. నవలలు సృష్టించిన ఒక ప్రతీక. కానీ ఈ ఇరుకైన వీధుల్లో అడుగు పెట్టిన క్షణం నుంచి ఆ అభిప్రాయాలు ఒక్కొక్కటిగా కూలిపోతాయి. ఎందుకంటే ఇది కేవలం పేదరికం కథ కాదు. ఇది పట్టుదల, ప్రతిభ, వ్యాపార మేధస్సు, అసాధారణ జీవన శక్తి కథ.
ముంబైలో దాదాపుగా 593 పైచిలుకు ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాంతమే ధారవి. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది జనాభా నివసిస్తారు. నిజానికి ఇది ఒకప్పుడు మురికివాడ కాదు. 19వ శతాబ్దానికి ముందు ధారవి ప్రాంతం ఒక పెద్ద పల్లెటూరుగా ఉండేది. చేపలు పట్టుకుని బతికే కోలి కులస్తులు ఇక్కడ ఉండేవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కోలివాడ అని కూడా పిలిచేవారు. 1850 తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ముంబై నగరానికి రావడం మొదలైంది.
ఇలా వచ్చిన నిరుపేదలంతా ధారవిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. తొలి రోజుల్లో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ధారవి ప్రాంతానికి వచ్చి సెటిలయ్యారు. అందుకే ధారవిని చోటా తమిళనాడు అని కూడా అనేవారు. తర్వాతి కాలంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చారు. దీంతో ధారావీ ఒక మినీ ఇండియాగా మారిపోయింది.
ప్రఖ్యాత రచయిత Salman Rushdie.. ధారావిని అర్థం చేసుకోవాలంటే అక్కడ నెలల తరబడి జీవించాల్సిందే అని చెప్పారు. ఆయన చెప్పిన మాటలో సత్యం ఉంది. ఇక్కడి వాస్తవం ఒక రోజు పర్యటనతో కనిపించదు. ఇరుకైన గల్లీలు, తడి గోడలు, మూసుకుపోయిన కాలువలు.. ఇవి ఒక వైపు. మరోవైపు, అదే గల్లీలలో నడుస్తున్న కోట్ల రూపాయల వ్యాపారం. ఇది ఒక కాలువ.. కానీ అది బంగారంతో తయారు చేసింది అని ఇక్కడే జన్మించిన ప్లంబర్ రాజు హనుమంత అంటాడు. అతని మాటల్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే కేవలం 2.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. అంచనాల ప్రకారం వార్షిక టర్నోవర్ రూ. 9,000 కోట్లకు మించి ఉంటుంది.
ధారావిని సిటీ వితిన్ ఎ సిటీ అంటారు. ఎందుకంటే ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఇక్కడే పనిచేసి జీవితాన్ని ముగించే లక్షలాది మంది ఉన్నారు. కానీ ఈ చిన్న నగరం ముంబై మహానగరానికి ఒక గొప్ప శక్తి కేంద్రం. దక్షిణ ముంబైలోని Ballard Estate లేదా Bandra Kurla Complex లో ఒప్పందాలు కుదురుతుంటే, వాటి మూలాలు చాలాసార్లు ధారావి గల్లీల్లోనే మొదలవుతాయి. ఇక్కడ భూమి చవక అని అనుకోవడం పెద్ద పొరపాటు. నివాస గదులు నెలకు రూ. 3,000 నుంచి రూ. 7,000 వరకు ఉంటాయి. కొత్తగా ముంబైకి వచ్చే కార్మికులకు ఇది పెద్ద ఊరటగా అనిపిస్తుంది. ఇక్కడ నివసించాలంటే పోలీస్ వెరిఫికేషన్ అవసరం లేదు. ఎక్కువ ప్రశ్నలు అడిగేవారు ఉండరు. ఒకే షరతు నెలవారీ అద్దె నగదుగా చెల్లించాలి.
కానీ వాణిజ్య దుకాణాల విషయానికి వస్తే పూర్తిగా మారుతుంది. 1,200 నుంచి 1,800 చదరపు అడుగుల షాప్‌కు నెలకు రూ. 1.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రాథమిక సౌకర్యాలు లేకున్నా, వ్యాపారం బలంగా ఉండటం వల్లే ఈ రేట్లు. ప్రతి అంగుళం భూమి ఇక్కడ విలువైనదిగా మారింది. ధారావి ఆర్థిక హృదయం అంటే తోలు పరిశ్రమ. 19వ శతాబ్దం చివరలో ప్రారంభమైన ఈ వృత్తి ఇప్పటికీ ఇక్కడ ప్రధాన ఆధారం. వేలాది చిన్న వర్క్‌షాపుల్లో బ్యాగులు, జాకెట్లు, బూట్లు, సాడిల్స్ తయారవుతాయి. ఈ ఉత్పత్తులు యూరప్, అమెరికా మార్కెట్లకు చేరతాయి. ఒక్కో సంచిపై కార్మికుడికి రూ. 200–రూ. 300 లాభం వచ్చినా, భారీ ఉత్పత్తి వల్ల మంచి ఆదాయం వస్తుంది. కొందరు వ్యాపారులు రోజుకు రూ. 20,000 వరకు సంపాదిస్తారు.
తోలు కాన్పూర్, చెన్నై వంటి నగరాల నుంచి వస్తుంది. ఇక్కడి చేతివృత్తులవారు దానిని విలువైన ఉత్పత్తులుగా మారుస్తారు. ప్రభుత్వ మద్దతు, ఆధునిక యంత్రాలు ఉంటే గూచీ, ప్రాడా వంటి బ్రాండ్‌లకు పోటీ ఇవ్వగలమని స్థానిక శిల్పులు చెబుతారు. కేవలం తోలు మాత్రమే కాదు. కుంహర్వాడ ఆసియాలోనే అతిపెద్ద కుండల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్‌కు చెందిన కుటుంబాలు తరతరాలుగా ఇక్కడ మట్టి కళను కొనసాగిస్తున్నాయి. దీపాలు, పూలకుండలు, అలంకార వస్తువులు దేశమంతటా సరఫరా అవుతుంటాయి. దీపావళి సమయానికి ఇక్కడ పగలు-రాత్రి తేడా ఉండదు. అయితే ఫర్నేస్‌ల నుంచి వచ్చే పొగ కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇది ఈ విజయానికి ఉన్న మరో చేదు నిజం వంటిది.
ధారావి వీధుల్లో తెల్లవారుజామునే జీవితం మొదలవుతుంది. ఉదయం 2:30కే ఇడ్లీ, వడ తయారీ ప్రారంభమవుతుంది. 5 గంటలకల్లా వేల కిలోల ఆహారం సిద్ధమై ముంబై అంతటా పంపిణీ అవుతుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి వచ్చిన కుటుంబాలు ఈ ఆహార వ్యాపారాన్ని నడుపుతున్నాయి. ఇది నగరానికి కనిపించని కానీ కీలకమైన ఆర్థిక వ్యవస్థ అని చెప్పాలి. ఇంకా ఒక గొప్ప శక్తి.. రిసైక్లింగ్ పరిశ్రమ. ముంబై చెత్తలో దాదాపు 80శాతం ఇక్కడే పునర్వినియోగం అవుతుంది. రోజుకు వేల టన్నుల వ్యర్థాలు వర్గీకరిస్తారు. ప్లాస్టిక్‌ను శుభ్రపరచి, కట్ చేసి, ఎండబెట్టి మళ్లీ వినియోగానికి సిద్ధం చేస్తారు. ఇది ప్రమాదకరమైన పని.. పాత సూదులు, గాజు ముక్కలు గాయాలకు కారణమవుతాయి. అయినప్పటికీ లక్షలాది కుటుంబాల జీవనోపాధి దీనిపై ఆధారపడి ఉంది.
ధారావి విస్తీర్ణం బాంద్రా, మాహిమ్, మాతుంగా, సియోన్, కుర్లా, చునాభట్టి, కింగ్స్ సర్కిల్ ప్రాంతాల వరకు వ్యాపించింది. బాంద్రా స్టేషన్ పశ్చిమ వైపు విలాసవంతమైన బంగ్లాలు ఉంటే, తూర్పు వైపు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ధారావి ప్రారంభమవుతుంది. ఒకే నగరంలో రెండు విభిన్న ప్రపంచాలు. ఇప్పుడు పునరాభివృద్ధి ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. కొందరికి ఇది ఆశ. మరికొందరికి భయం. కొత్త భవనాలు నిర్మిస్తే ఉద్యోగాలు, గుర్తింపు కోల్పోతామేమో అన్న ఆందోళన ఉంది. భవనాలు మారవచ్చు, కానీ ధారావి ఆత్మ మారదు.. అని స్థానికులు అంటున్నారు.
ధారావి అంటే మురికివాడ మాత్రమే కాదు. అది శ్రమ, స్వప్నం, ఆత్మగౌరవం. ప్రతి రోజూ ముంబై నగరాన్ని తన భుజాలపై మోసే వేలాది కార్మికుల కథ. బయటివారికి ఇది కాలువలా కనిపించవచ్చు. కానీ లోపలికి వెళ్లి చూడగానే తెలుస్తుంది... ఇది నిజంగా బంగారంతో తయారైన ఒక ప్రపంచం అని.
Also Read: EPFO: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హయ్యర్ పెన్షన్ రీస్టార్ట్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Housing Scheme Release Date: ఏపీలో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) - గ్రామీణ్ 2.0 పథకం కింద కొత్త ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ నెలలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ప్రక్రియలో భాగంగా గత ఏడాది డిసెంబర్ వరకు దరఖాస్తులను స్వీకరించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన తుది దశకు చేరుకుంది. మార్చి 3 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి ఆమోదం తెలపనుంది. ఏప్రిల్ నెలలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు.
దరఖాస్తుల గణాంకాలు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10.42 లక్షల మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం (స్థలం ఉన్నవారు) 8.29 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. స్థలంతో పాటు ఇంటి కోసం దరఖాస్తు చేసినవారు 2.13 లక్షల మంది ఉన్నారు.
అందులో సామాజిక వర్గాల విభజన ఆధారంగా ఎస్సీలు 2.16 లక్షలు, ఎస్టీ 1.43 లక్షలు, దివ్యాంగులు 4,965తో పాటు ఇతర సామాజిక వర్గాల వారు 6.92 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుమారు 60 వేల దరఖాస్తులను వివిధ కారణాల వల్ల తిరస్కరించి, వారిని అనర్హులుగా ప్రకటించింది.
పథకం అమలు తీరు & ప్రాధాన్యత
నివాస స్థలం లేని పేదలకు 3 సెంట్ల స్థలం కేటాయించి, అందులో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. అలాగే ఇప్పటికే స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణ దశల వారీగా నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అత్యంత పేదలు, వితంతువులు, ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు మొదటి విడతలో ఇళ్లను కేటాయిస్తారు.
జిల్లాల వారీగా స్పందన
అత్యధిక దరఖాస్తులు వెల్లువచ్చిన జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా (77,353) మొదటి స్థానంలో ఉండగా, శ్రీకాకుళం (75,117), అన్నమయ్య (68,508) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ పథకం కోసం అత్యల్పంగా విశాఖపట్నం జిల్లా నుంచి కేవలం 7,433 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం అధికారులు పంపిన జాబితాపై కేంద్రం ఆమోదం ముద్ర వేయడమే తరువాయి. ఏప్రిల్ నుంచి ఏపీలో ఇంటి నిర్మాణాల సందడి మొదలుకానుంది.
Also Read: Holi Holidays: హోలీ సెలవులు వచ్చేస్తున్నాయి! ఏకంగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎక్కడెక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Employees And Pensioners: ఉద్యోగులు, పింఛన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉన్న ఉద్యోగి అనారోగ్యంతో.. ప్రమాదవశాత్తు ఎలా మరణించినా కూడా బాధిత కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు రూ.10 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి చెల్లించేలా తెలంగాణ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Also Read: Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలు.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశం దాదాపు ఐదు గంటలపాటు సాగింది. మంత్రిమండలిలో కూడా కీలక అంశాలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. మెట్రో రైల్ స్వాధీనంతోపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తదితర అంశాలపై మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది. మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. వాటిలో ఉద్యోగులకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి.
Also Read: Lack Of 108 Ambulance: ఏపీలో దారుణం.. 108 అంబులెన్స్ లేక ఎడ్లబండిపై భార్య తరలింపు
ప్రభుత్వ ఉద్యోగులు 60 ఏళ్లలోపు చనిపోతే వారికి రెగ్యులర్ బెనిఫిట్లతోపాటు అదనంగా రూ.10 లక్షలు వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం వస్తున్న ఆర్థిక ప్రయోజనాలకు అదనంగా రూ.10 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ప్రమాదాల విషయంపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు, పింఛనర్లకు భారం కాకుండా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు.
Also Read: Adulterated Milk: కల్తీపాల మృతులకు రూ.10 లక్షల పరిహారం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన
'తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, పింఛన్‌దారులు మొత్తం కలిపి 7.56 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగి చనిపోతే ఇప్పుడు చెల్లిస్తున్న బెనిఫిట్లకు అదనంగా రూ.10 లక్షలు ఇచ్చేలా పథకం తీసుకొస్తాం' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. 'ఇక డిజిటల్ హెల్త్ ఎంప్లాయ్ కార్డులు 17.7 లక్షల మంది ఉద్యోగులు, ఫింఛనర్లకు అందిస్తాం. దాదాపు అన్నీ వ్యాధులకు రాష్ట్రంలోని 652 ఆస్పత్రుల్లో వైద్య చికిత్స అందేలా ఏర్పాట్లు. త్వరలోనే ఎంప్యానల్ ఆస్పత్రుల్లో చికిత్సకు ఏర్పాట్లు' అని మంత్రి వెల్లడించారు. ఉద్యోగుల కనీస వేతనం (బేసిక్ పే) నుంచి 1.5 శాతం ట్రస్తుకు జమయ్యేలా మొత్తం రూ.528 కోట్లు సేకరిస్తాం. దీనికి ప్రభుత్వం మరో రూ.528 కోట్లు అందించి ట్రస్టు ఖాతాలో జమచేస్తాం. ఈ ట్రస్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణ ఉంటుంది’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.
Also Read: KTR Statement: నా పేరుతో ఎవరైనా సంఘాలు పెడితే ఊరుకోను: కేటీఆర్
మంత్రిమండలి తీసుకున్న తాజా నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ప్రయోజనం చేకూరనుండగా.. అసలైన డిమాండ్లు, సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉండడం.. కరువు భత్యం చెల్లింపు, వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ), రిటైర్మెంట్ బెనిఫిట్లపై మాత్రం మంత్రిమండలిలో చర్చ జరగలేదు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు కంటి తుడుపు చర్యగా ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఈ మంత్రిమండలి సమావేశంలోనూ తమకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోవడంపై ఉద్యోగ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. దీనిపై త్వరలోనే ఉద్యోగులు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Cabinet Decisions: హైదరాబాద్ మెట్రో రైలు, ఇళ్ల గణనతోపాటు బడ్జెట్ సమావేశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం మొదలైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొన్ని గంటల పాటు సాగింది.
Also Read: Lack Of 108 Ambulance: ఏపీలో దారుణం.. 108 అంబులెన్స్ లేక ఎడ్లబండిపై భార్య తరలింపు
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణనను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. నిర్ణిత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9వ తేదీ వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు వివరించారు. హౌజ్ లిస్టింగ్‌కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జన గణన ప్రక్రియలో పాలుపంచుకుంటారు. రెండో దశ జన గణన ప్రక్రియ వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరిలో చేపడుతారు. హైదరాబాద్ మెట్రోను ఎల్& టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
Also Read: Adulterated Milk: కల్తీపాల మృతులకు రూ.10 లక్షల పరిహారం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన
మెట్రో రైలు స్వాధీనం
ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మంత్రిమండలి చర్చించింది. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం చర్చించింది. గతేడాది రూ.2 వేల కోట్ల ఈక్విటీని.. ఏకమొత్తంగా ఎల్ అండ్ టీకి చెల్లించేలా రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకు వచ్చింది.
Also Read: KTR Statement: నా పేరుతో ఎవరైనా సంఘాలు పెడితే ఊరుకోను: కేటీఆర్
ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోనే ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయంతో మెట్రో రైలు స్వాధీనం ప్రక్రియ పూర్తి కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Nara Lokesh Comments On Jagan: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పర్యటన, హెరిటేజ్ సంస్థపై వస్తున్న విమర్శలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూనే, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక ఆసక్తికరమైన ఆఫర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"జగన్ వస్తానంటే టికెట్ నేనే ఇప్పిస్తా"
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించేందుకు విదేశాలకు వెళ్లడంపై వైసీపీ విమర్శించగా, లోకేష్ ఇలా స్పందించారు. "నాకు దేశభక్తి ఉంది, అందుకే ఇండియా మ్యాచ్ చూడటానికి వెళ్లాను. టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరితే మళ్లీ వెళ్తాను" అని స్పష్టం చేశారు. ఒకవేళ పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా మ్యాచ్ చూడాలని అనుకుంటే, ఆయనకు కూడా టికెట్ ఇప్పించి తనతో పాటు తీసుకెళ్తానని చమత్కరించారు.
హెరిటేజ్ వివాదంపై వివరణ
హెరిటేజ్ సంస్థకు, ఇందపూర్‌కు మధ్య ఉన్న సంబంధంపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. పన్నీర్, చీజ్ తయారీలో మాత్రమే హెరిటేజ్, ఇందపూర్ కలిసి పనిచేస్తున్నాయని, అది కేవలం వ్యాపారపరమైన ఒప్పందం మాత్రమేనని వివరించారు.
హెరిటేజ్ ఒక లిస్టెడ్ కంపెనీ అని పేర్కొంటూ.. "సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు కో-పార్టనర్‌కు (భాగస్వామి), కో-మాన్యుఫ్యాక్చరర్‌కు (తయారీదారు) తేడా తెలియకపోవడం విచారకరం" అని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వానికి సంబంధం లేదు!
ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థకు, ప్రభుత్వానికి ముడిపెట్టడం సరికాదని ఆయన ప్రశ్నించారు. మంత్రి లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. విమర్శలకు సమాధానం ఇస్తూనే, ప్రత్యర్థి పార్టీ నేతపై ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Holi Holidays: హోలీ సెలవులు వచ్చేస్తున్నాయి! ఏకంగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎక్కడెక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nara Lokesh Chit Chat: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి అంశంపై మరోసారి నారా లోకేశ్ స్పందించారు. కిలో నెయ్యి 360 రూపాయలకు ఎక్కడ దొరుకుతుందనేది చూపించండి అని మీడియాను నారా లోకేశ్ ప్రశ్నించారు. కిలో 360 రూపాయలకు దొరుకుతుంటే అది కల్తీ నెయ్యి అవుతుందని పేర్కొన్నారు. మామూలుగా మార్కెట్ లో కిలో నెయ్యి 1000 రూపాయలపైన ఉంటుందని తెలిపారు. అసెంబ్లీలో మీడియాతో లోకేశ్ చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు.
Also Read: KTR Statement: నా పేరుతో ఎవరైనా సంఘాలు పెడితే ఊరుకోను: కేటీఆర్
వైఎస్సార్‌సీపీ ప్రధానంగా ఆరోపిస్తున్న ఇందాపూర్ డెయిరీ అంశంపై లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందపూర్ డెయిరీ, హెరిటేజ్‌కు ఎటువంటి సంబంధం లేదని నారా లోకేశ్ స్పష్టం చేశారు. 'వైఎస్సార్‌సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఇంద్రపూర్ డెయిరీకి.. హెరిటేజ్ కో కంపెనీ అని చెప్పారు. అంత సీనియర్ నాయకుడికి కో కంపెనీ అనే పదం ఉండదు అనే విషయం తెలియదా? ఆయన ఇప్పటికైనా ఇందాపూరు డెయిరీ హెరిటేజ్ కో ప్యాకర్ మాత్రమే. హెరిటేజ్ లిస్టెడ్ కంపెనీ. మా మీద సెబీకి కూడా ఫిర్యాదు చేశారు. ఏమైనా ఆధారాలు ఇచ్చారా? నిరూపించారా?' అని లోకేశ్ ప్రశ్నించారు.
Also Read: BRS Party: గజినీలా మారిన రేవంత్ రెడ్డి.. చెప్పేదొకటి చేసేదొకటి: బీఆర్‌ఎస్ పార్టీ
'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సాక్షి, భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం నుంచి రూ.వెయ్యి కోట్లు లబ్ధి పొందారు. మేము ఇన్ని సంవత్చరాల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదు' అని నారా లోకేశ్ వివరించారు. ఈ సందర్భంగా క్రికెట్‌కు మ్యాచ్‌కు వెళ్లడంపై వైఎస్సార్‌సీపీ చేసిన ఆరోపణలు, విమర్శలపై లోకేశ్ స్పందిస్తూ.. 'క్రికెట్ మ్యాచ్‌లో ఇండియా ఫైనల్స్‌కు వెళ్తే మ్యాచ్ చూసేందుకు తప్పనిసరిగా వెళ్తా. అవసరమైతే పులివెందుల ఎమ్మెల్యే (వైఎస్ జగన్) వస్తానంటే ఆయనకు టికెట్ కూడా నేనే తీసుకుంటా' అని ప్రకటించారు.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
'శాసన మండలి జరగాలనుకుని అనుకున్న వాళ్లు నాలుగు రోజులు సభను ఎందుకు అడ్డుకుంటారు. ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కావాలని మండలిలో వైసీపీ సభ్యులు అడగడం ఏమిటి? ఈ విషయం మండలి సమావేశాలను అడ్డుకున్నప్పుడు వైసీపీ సభ్యులకు తెలియదా?' అని నారా లోకేశ్ ప్రశ్నించారు. 'యువగళం సమయంలో నేను అందరిని కలిసేవాడిని. రెండేళ్లు గ్యాప్ వచ్చింది. అందుకనే మళ్లీ అందరిని పిలిచి ఫ్యామిలీలతో భేటీ అవుతున్నా. అక్కడ అసలు రాజకీయాలు చర్చించడం లేదు' అని నారా లోకేశ్ తెలిపారు. 'తెలుగుదేశం పార్టీలో జూనియర్లు, సీనియర్లు మధ్య సమన్వయం పూర్తిగా ఉంది. టీడీపీలో నాతో సహా అందరూ ఎవరు బూత్‌లో వాళ్లు మెజారిటీ రావాలి. అప్పుడు మాత్రమే మనం పార్టీ నీ సంస్థాగతంగా బలోపేతం చేయాలి' అని నారా లోకేశ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bullock Cart Turn As Ambulance: ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్‌ల కొరత వేధిస్తోంది. తరచూ అంబులెన్స్‌లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ భర్త అనారోగ్యానికి గురయిన తన భార్యను ఎడ్లబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సమయానికి 108 అంబులెన్స్ అందుబాటులోకి రాక.. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అతడి భార్య కొనప్రాణంతో ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వైద్య వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపిన సంఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరులో చోటుచేసుకుంది.
Also Read: Adulterated Milk: కల్తీపాల మృతులకు రూ.10 లక్షల పరిహారం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో భయాందోళన చెందిన భర్త రామయ్య వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో 108 అందుబాటులో లేదని.. రావడానికి సమయం పడుతుందని తెలిపినట్లు సమాచారం. 108 అంబులెన్స్ త్వరగా వచ్చే అవకాశం లేకపోవడంతో తన భార్యను బతికించుకోవడానికి భర్త రామయ్య దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. నిమిషాలు గడుస్తున్నా సాయం అందకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి ఎడ్లబండిని తీసుకున్నాడు.
Also Read: Hyderabad Rain: హైదరాబాద్‌లో ఆకస్మిక వర్షం.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం
ఎద్దుల బండిపైనే ఆమెను పడుకోబెట్టి భర్త రామయ్య పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. సమయానికి తీసుకువచ్చి ఉంటే ఆమెకు సత్వరమే వైద్యం అందేది. ప్రస్తుతం తన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని భర్త రామయ్య తెలిపారు. ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ సదుపాయం అందకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
Also Read: KTR Statement: నా పేరుతో ఎవరైనా సంఘాలు పెడితే ఊరుకోను: కేటీఆర్
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఎద్దుల బండిపై ఆసుపత్రికి తీసుకురావడం ఇది ముమ్మాటికి అధికారుల వైఫ్యలమని పరిసర గ్రామాల ప్రజలు విమర్శలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 108 వాహనాల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపడంతో ఉన్నతాధికారులు స్పందించినట్లు సమాచారం. 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KTR Fan Associations: ఇన్నాళ్లు హీరో హీరోయిన్ల పేరిట సంఘాలు ఏర్పాటుచేసుకోగా.. అభిమానంతో సేవా సంస్థలు ఏర్పాటుచేసుకుని కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుండేవి. ఇప్పుడు కేటీఆర్‌పై కూడా కొన్ని సంఘాలు, సేవా సంస్థలు ఏర్పాటుచేస్తున్నారు. ఈ సంఘాల ఏర్పాటు తన దృష్టికి రావడంతో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అలా సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్‌ఎస్ పార్టీలోనే చేయాలని.. తన పేరిట ఎలాంటి సంఘాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
Also Read: Adulterated Milk: కల్తీపాల మృతులకు రూ.10 లక్షల పరిహారం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన
తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తన పేరుతో ఎలాంటి సంస్థను కూడా ఏర్పాటు చేసేందుకు తన అనుమతి లేదని స్పష్టం చేశారు. కొంతమంది 'కేటీఆర్ సేవా సమితి', కేటీఆర్ సేన పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతుండడం.. కేటీఆర్ పేరుతో ఇతర సంస్థలను ఏర్పాటు చేసుకున్న అంశాన్ని కొందరు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. సంఘాలు ఏర్పాటుచేసి కార్యక్రమాలు చేపడుతుండడం విని కేటీఆర్ విస్మయానికి గురయ్యారు.
Also Read: Hyderabad Rain: హైదరాబాద్‌లో ఆకస్మిక వర్షం.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం
ఈ నేపథ్యంలో తన పేరుతో ఎలాంటి సంస్థలకీ అనుమతి లేదని.. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి సంస్థలకు ఎటువంటి గుర్తింపు, అనుమతి లేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే కచ్చితంగా బీఆర్‌ఎస్ పార్టీ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ఆపేయాలని.. తనపై అభిమానం ఉన్నవాళ్లు ఎవరైనా బీఆర్‌ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని సూచించారు. ఇలా సంఘాలు ఏర్పాటుచేసి కొందరు అమాయకులను మోసం చేసే అవకాశం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తన పేరిట ఏర్పాటుచేసే సంస్థలు ఇకపైన కూడా కార్యక్రమాలు కొనసాగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
Also Read: BRS Party: గజినీలా మారిన రేవంత్ రెడ్డి.. చెప్పేదొకటి చేసేదొకటి: బీఆర్‌ఎస్ పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Zero Investment Business Ideas: నేటి డిజిటల్ యుగంలో సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి లక్షల రూపాయల పెట్టుబడి అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉన్న నైపుణ్యం, స్మార్ట్‌ఫోన్ లేదా లాప్‌టాప్ ఉంటే చాలు.. ఇంటి నుంచే నెలకు వేలల్లో ఆదాయం సంపాదించవచ్చు. సున్నా పెట్టుబడితో యువత ప్రారంభించగలిగే టాప్-5 బిజినెస్ ఐడియాలు ఇలా ఉన్నాయి.
ఫ్రీలాన్సింగ్
మీకు రాయడం, డిజైనింగ్ లేదా ఎడిటింగ్ వంటి నైపుణ్యాలు ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, డేటా ఎంట్రీలో ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయి. అప్‌వర్క్, ఫైవర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మీ సేవలను అందించవచ్చు.
సోషల్ మీడియా మేనేజ్‌మెంట్
ప్రస్తుతం ప్రతి చిన్న వ్యాపారానికి సోషల్ మీడియా ఉనికి చాలా ముఖ్యం. కంపెనీల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలను నిర్వహించడం, పోస్టులు క్రియేట్ చేయడం, కస్టమర్ల ప్రశ్నలకు స్పందించడం వంటి పనులను చేయాలి. క్లయింట్‌ను బట్టి నెలవారీ ఫిక్స్‌డ్ అమౌంట్ సంపాదించవచ్చు.
ఆన్‌లైన్ ట్యూషన్స్
మీకు ఏదైనా సబ్జెక్టుపై పట్టు ఉంటే, ఇంట్లో కూర్చునే విద్యార్థులకు బోధించవచ్చు. స్కూల్ పాఠాలతో పాటు మ్యూజిక్, యోగా, కోడింగ్ లేదా విదేశీ భాషలు నేర్పించవచ్చు. జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి యాప్స్ ద్వారా గ్లోబల్ లెవల్‌లో క్లాసులు చెప్పే అవకాశం ఉంది.
అఫిలియేట్ మార్కెటింగ్
ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలోని ఉత్పత్తులను ఇతరులకు రిఫర్ చేయడం ద్వారా కమిషన్ పొందవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల అఫిలియేట్ లింక్‌లను మీ సోషల్ మీడియా లేదా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయాలి. మీ లింక్ ద్వారా ఎవరైనా వస్తువు కొంటే మీకు కమిషన్ వస్తుంది.
యూట్యూబ్ / కంటెంట్ క్రియేషన్
మీరు ఏదైనా ఒక అంశంపై ఆసక్తికరమైన వీడియోలు చేయగలిగితే యూట్యూబ్ మంచి ఆదాయ వనరు. కుకింగ్, ట్రావెల్, టెక్నాలజీ రివ్యూలు లేదా ఎడ్యుకేషనల్ వీడియోలు మీ ఫోన్‌తోనే షూట్ చేసి అప్‌లోడ్ చేయవచ్చు. యాడ్స్, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ఆదాయం వస్తుంది.
ముఖ్య సూచన: ఈ వ్యాపారాల్లో రాణించడానికి డబ్బు కంటే 'సమయం', 'ఓపిక' చాలా ముఖ్యం. ప్రారంభంలో ఆదాయం తక్కువగా ఉన్నా, క్రమంగా మీ నైపుణ్యం పెరిగే కొద్దీ సంపాదన కూడా పెరుగుతుంది.
Also REad: Holi Holidays: హోలీ సెలవులు వచ్చేస్తున్నాయి! ఏకంగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎక్కడెక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook