Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
KTR Statement: నా పేరుతో ఎవరైనా సంఘాలు పెడితే ఊరుకోను: కేటీఆర్
RKRavi Kumar Sargam
Feb 23, 2026 15:08:43
Hyderabad, Telangana

KTR Fan Associations: ఇన్నాళ్లు హీరో హీరోయిన్ల పేరిట సంఘాలు ఏర్పాటుచేసుకోగా.. అభిమానంతో సేవా సంస్థలు ఏర్పాటుచేసుకుని కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుండేవి. ఇప్పుడు కేటీఆర్‌పై కూడా కొన్ని సంఘాలు, సేవా సంస్థలు ఏర్పాటుచేస్తున్నారు. ఈ సంఘాల ఏర్పాటు తన దృష్టికి రావడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. అలా సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్‌ఎస్‌ పార్టీలోనే చేయాలని.. తన పేరిట ఎలాంటి సంఘాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

Also Read: Adulterated Milk: కల్తీపాల మృతులకు రూ.10 లక్షల పరిహారం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన

తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తన పేరుతో ఎలాంటి సంస్థను కూడా ఏర్పాటు చేసేందుకు తన అనుమతి లేదని స్పష్టం చేశారు. కొంతమంది 'కేటీఆర్ సేవా సమితి', కేటీఆర్ సేన పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతుండడం.. కేటీఆర్ పేరుతో ఇతర సంస్థలను ఏర్పాటు చేసుకున్న అంశాన్ని కొందరు కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. సంఘాలు ఏర్పాటుచేసి కార్యక్రమాలు చేపడుతుండడం విని కేటీఆర్‌ విస్మయానికి గురయ్యారు. 

Also Read: Hyderabad Rain: హైదరాబాద్‌లో ఆకస్మిక వర్షం.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం

ఈ నేపథ్యంలో తన పేరుతో ఎలాంటి సంస్థలకీ అనుమతి లేదని.. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి సంస్థలకు ఎటువంటి గుర్తింపు, అనుమతి లేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే కచ్చితంగా బీఆర్‌ఎస్‌ పార్టీ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ఆపేయాలని.. తనపై అభిమానం ఉన్నవాళ్లు ఎవరైనా బీఆర్‌ఎస్‌ పార్టీతో కలిసి పనిచేయాలని సూచించారు. ఇలా సంఘాలు ఏర్పాటుచేసి కొందరు అమాయకులను మోసం చేసే అవకాశం ఉందని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తన పేరిట ఏర్పాటుచేసే సంస్థలు ఇకపైన కూడా కార్యక్రమాలు కొనసాగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.

Also Read: BRS Party: గజినీలా మారిన రేవంత్‌ రెడ్డి.. చెప్పేదొకటి చేసేదొకటి: బీఆర్‌ఎస్‌ పార్టీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 23, 2026 16:43:39
Hyderabad, Telangana:

Telangana Cabinet Decisions: హైదరాబాద్‌ మెట్రో రైలు, ఇళ్ల గణనతోపాటు బడ్జెట్‌ సమావేశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్‌ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం మొదలైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొన్ని గంటల పాటు సాగింది.

Also Read: Lack Of 108 Ambulance: ఏపీలో దారుణం.. 108 అంబులెన్స్‌ లేక ఎడ్లబండిపై భార్య తరలింపు

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణనను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. నిర్ణిత షెడ్యూల్ ప్రకారం తొలి విడత  జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9వ తేదీ వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు వివరించారు. హౌజ్ లిస్టింగ్‌కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జన గణన ప్రక్రియలో పాలుపంచుకుంటారు. రెండో దశ జన గణన ప్రక్రియ వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరిలో చేపడుతారు. హైదరాబాద్ మెట్రోను ఎల్& టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Also Read: Adulterated Milk: కల్తీపాల మృతులకు రూ.10 లక్షల పరిహారం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన

మెట్రో రైలు స్వాధీనం
ఎల్‌ అండ్‌ టీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్‌ మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మంత్రిమండలి చర్చించింది. హైదరాబాద్‌ మెట్రో రైలును ఎల్‌ అండ్‌ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం చర్చించింది. గతేడాది రూ.2 వేల కోట్ల ఈక్విటీని.. ఏకమొత్తంగా ఎల్‌ అండ్‌ టీకి చెల్లించేలా రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకు వచ్చింది.

Also Read: KTR Statement: నా పేరుతో ఎవరైనా సంఘాలు పెడితే ఊరుకోను: కేటీఆర్

ఎల్‌ అండ్‌ టీ నుంచి హైదరాబాద్‌ మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోనే ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయంతో మెట్రో రైలు స్వాధీనం ప్రక్రియ పూర్తి కానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 23, 2026 16:16:08
Nunna, Vijayawada, Andhra Pradesh:

Nara Lokesh Comments On Jagan: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పర్యటన, హెరిటేజ్ సంస్థపై వస్తున్న విమర్శలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూనే, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక ఆసక్తికరమైన ఆఫర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

"జగన్ వస్తానంటే టికెట్ నేనే ఇప్పిస్తా"
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించేందుకు విదేశాలకు వెళ్లడంపై వైసీపీ విమర్శించగా, లోకేష్ ఇలా స్పందించారు. "నాకు దేశభక్తి ఉంది, అందుకే ఇండియా మ్యాచ్ చూడటానికి వెళ్లాను. టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరితే మళ్లీ వెళ్తాను" అని స్పష్టం చేశారు. ఒకవేళ పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా మ్యాచ్ చూడాలని అనుకుంటే, ఆయనకు కూడా టికెట్ ఇప్పించి తనతో పాటు తీసుకెళ్తానని చమత్కరించారు.

హెరిటేజ్ వివాదంపై వివరణ
హెరిటేజ్ సంస్థకు, ఇందపూర్‌కు మధ్య ఉన్న సంబంధంపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. పన్నీర్, చీజ్ తయారీలో మాత్రమే హెరిటేజ్, ఇందపూర్ కలిసి పనిచేస్తున్నాయని, అది కేవలం వ్యాపారపరమైన ఒప్పందం మాత్రమేనని వివరించారు.

హెరిటేజ్ ఒక లిస్టెడ్ కంపెనీ అని పేర్కొంటూ.. "సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు కో-పార్టనర్‌కు (భాగస్వామి), కో-మాన్యుఫ్యాక్చరర్‌కు (తయారీదారు) తేడా తెలియకపోవడం విచారకరం" అని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వానికి సంబంధం లేదు!
ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థకు, ప్రభుత్వానికి ముడిపెట్టడం సరికాదని ఆయన ప్రశ్నించారు. మంత్రి లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. విమర్శలకు సమాధానం ఇస్తూనే, ప్రత్యర్థి పార్టీ నేతపై ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Holi Holidays: హోలీ సెలవులు వచ్చేస్తున్నాయి! ఏకంగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎక్కడెక్కడంటే?

Also REad: Holi Lunar Eclipse: హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 లేదా మార్చి 4 ఎప్పుడు? గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 16:12:33
Velgapudi, Andhra Pradesh:

Nara Lokesh Chit Chat: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి అంశంపై మరోసారి నారా లోకేశ్‌ స్పందించారు. కిలో నెయ్యి 360 రూపాయలకు ఎక్కడ దొరుకుతుందనేది చూపించండి అని మీడియాను నారా లోకేశ్‌ ప్రశ్నించారు. కిలో 360 రూపాయలకు దొరుకుతుంటే అది కల్తీ నెయ్యి అవుతుందని పేర్కొన్నారు. మామూలుగా మార్కెట్ లో కిలో నెయ్యి 1000 రూపాయలపైన ఉంటుందని తెలిపారు. అసెంబ్లీలో మీడియాతో లోకేశ్‌ చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు.

Also Read: KTR Statement: నా పేరుతో ఎవరైనా సంఘాలు పెడితే ఊరుకోను: కేటీఆర్

వైఎస్సార్‌సీపీ ప్రధానంగా ఆరోపిస్తున్న ఇందాపూర్‌ డెయిరీ అంశంపై లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందపూర్‌ డెయిరీ, హెరిటేజ్‌కు ఎటువంటి సంబంధం లేదని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. 'వైఎస్సార్‌సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఇంద్రపూర్ డెయిరీకి.. హెరిటేజ్ కో కంపెనీ అని చెప్పారు. అంత సీనియర్ నాయకుడికి కో కంపెనీ అనే పదం ఉండదు అనే విషయం తెలియదా? ఆయన ఇప్పటికైనా ఇందాపూరు డెయిరీ హెరిటేజ్ కో ప్యాకర్ మాత్రమే. హెరిటేజ్ లిస్టెడ్ కంపెనీ. మా మీద సెబీకి కూడా ఫిర్యాదు చేశారు. ఏమైనా ఆధారాలు ఇచ్చారా? నిరూపించారా?' అని లోకేశ్‌ ప్రశ్నించారు.

Also Read: BRS Party: గజినీలా మారిన రేవంత్‌ రెడ్డి.. చెప్పేదొకటి చేసేదొకటి: బీఆర్‌ఎస్‌ పార్టీ

'వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సాక్షి, భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం నుంచి రూ.వెయ్యి కోట్లు లబ్ధి పొందారు. మేము ఇన్ని సంవత్చరాల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదు' అని నారా లోకేశ్‌ వివరించారు. ఈ సందర్భంగా క్రికెట్‌కు మ్యాచ్‌కు వెళ్లడంపై వైఎస్సార్‌సీపీ చేసిన ఆరోపణలు, విమర్శలపై లోకేశ్ స్పందిస్తూ.. 'క్రికెట్ మ్యాచ్‌లో ఇండియా ఫైనల్స్‌కు వెళ్తే మ్యాచ్ చూసేందుకు తప్పనిసరిగా వెళ్తా. అవసరమైతే పులివెందుల ఎమ్మెల్యే (వైఎస్‌ జగన్‌) వస్తానంటే ఆయనకు టికెట్ కూడా నేనే తీసుకుంటా' అని ప్రకటించారు.

Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?

'శాసన మండలి జరగాలనుకుని అనుకున్న వాళ్లు నాలుగు రోజులు సభను ఎందుకు అడ్డుకుంటారు. ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కావాలని మండలిలో వైసీపీ సభ్యులు అడగడం ఏమిటి? ఈ విషయం మండలి సమావేశాలను అడ్డుకున్నప్పుడు వైసీపీ సభ్యులకు తెలియదా?' అని నారా లోకేశ్‌ ప్రశ్నించారు. 'యువగళం సమయంలో నేను అందరిని కలిసేవాడిని. రెండేళ్లు గ్యాప్ వచ్చింది. అందుకనే మళ్లీ అందరిని పిలిచి ఫ్యామిలీలతో భేటీ అవుతున్నా. అక్కడ అసలు రాజకీయాలు చర్చించడం లేదు' అని నారా లోకేశ్ తెలిపారు. 'తెలుగుదేశం పార్టీలో జూనియర్లు, సీనియర్లు మధ్య సమన్వయం పూర్తిగా ఉంది. టీడీపీలో నాతో సహా అందరూ ఎవరు బూత్‌లో వాళ్లు మెజారిటీ రావాలి. అప్పుడు మాత్రమే మనం పార్టీ నీ సంస్థాగతంగా బలోపేతం చేయాలి' అని నారా లోకేశ్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 16:05:22
Punganur, Andhra Pradesh:

Bullock Cart Turn As Ambulance: ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్‌ల కొరత వేధిస్తోంది. తరచూ అంబులెన్స్‌లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ భర్త అనారోగ్యానికి గురయిన తన భార్యను ఎడ్లబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సమయానికి 108 అంబులెన్స్‌ అందుబాటులోకి రాక.. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అతడి భార్య కొనప్రాణంతో ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వైద్య వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపిన సంఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరులో చోటుచేసుకుంది.

Also Read: Adulterated Milk: కల్తీపాల మృతులకు రూ.10 లక్షల పరిహారం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో భయాందోళన చెందిన భర్త రామయ్య వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అయితే ఆ సమయంలో 108 అందుబాటులో లేదని.. రావడానికి సమయం పడుతుందని తెలిపినట్లు సమాచారం. 108 అంబులెన్స్‌ త్వరగా వచ్చే అవకాశం లేకపోవడంతో తన భార్యను బతికించుకోవడానికి భర్త రామయ్య దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. నిమిషాలు గడుస్తున్నా సాయం అందకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి ఎడ్లబండిని తీసుకున్నాడు. 

Also Read: Hyderabad Rain: హైదరాబాద్‌లో ఆకస్మిక వర్షం.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం

ఎద్దుల బండిపైనే ఆమెను పడుకోబెట్టి భర్త రామయ్య పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. సమయానికి తీసుకువచ్చి ఉంటే ఆమెకు సత్వరమే వైద్యం అందేది. ప్రస్తుతం తన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని భర్త రామయ్య తెలిపారు. ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ సదుపాయం అందకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

Also Read: KTR Statement: నా పేరుతో ఎవరైనా సంఘాలు పెడితే ఊరుకోను: కేటీఆర్

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఎద్దుల బండిపై ఆసుపత్రికి తీసుకురావడం ఇది ముమ్మాటికి అధికారుల వైఫ్యలమని పరిసర గ్రామాల ప్రజలు విమర్శలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 108 వాహనాల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపడంతో ఉన్నతాధికారులు స్పందించినట్లు సమాచారం. 108 అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 23, 2026 13:44:29
Hyderabad, Telangana:

Zero Investment Business Ideas: నేటి డిజిటల్ యుగంలో సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి లక్షల రూపాయల పెట్టుబడి అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉన్న నైపుణ్యం, స్మార్ట్‌ఫోన్ లేదా లాప్‌టాప్ ఉంటే చాలు.. ఇంటి నుంచే నెలకు వేలల్లో ఆదాయం సంపాదించవచ్చు. సున్నా పెట్టుబడితో యువత ప్రారంభించగలిగే టాప్-5 బిజినెస్ ఐడియాలు ఇలా ఉన్నాయి.

ఫ్రీలాన్సింగ్
మీకు రాయడం, డిజైనింగ్ లేదా ఎడిటింగ్ వంటి నైపుణ్యాలు ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, డేటా ఎంట్రీలో ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయి. అప్‌వర్క్, ఫైవర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మీ సేవలను అందించవచ్చు.

సోషల్ మీడియా మేనేజ్‌మెంట్
ప్రస్తుతం ప్రతి చిన్న వ్యాపారానికి సోషల్ మీడియా ఉనికి చాలా ముఖ్యం. కంపెనీల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలను నిర్వహించడం, పోస్టులు క్రియేట్ చేయడం, కస్టమర్ల ప్రశ్నలకు స్పందించడం వంటి పనులను చేయాలి. క్లయింట్‌ను బట్టి నెలవారీ ఫిక్స్‌డ్ అమౌంట్ సంపాదించవచ్చు.

ఆన్‌లైన్ ట్యూషన్స్
మీకు ఏదైనా సబ్జెక్టుపై పట్టు ఉంటే, ఇంట్లో కూర్చునే విద్యార్థులకు బోధించవచ్చు. స్కూల్ పాఠాలతో పాటు మ్యూజిక్, యోగా, కోడింగ్ లేదా విదేశీ భాషలు నేర్పించవచ్చు. జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి యాప్స్ ద్వారా గ్లోబల్ లెవల్‌లో క్లాసులు చెప్పే అవకాశం ఉంది.

అఫిలియేట్ మార్కెటింగ్
ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలోని ఉత్పత్తులను ఇతరులకు రిఫర్ చేయడం ద్వారా కమిషన్ పొందవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల అఫిలియేట్ లింక్‌లను మీ సోషల్ మీడియా లేదా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయాలి. మీ లింక్ ద్వారా ఎవరైనా వస్తువు కొంటే మీకు కమిషన్ వస్తుంది.

యూట్యూబ్ / కంటెంట్ క్రియేషన్
మీరు ఏదైనా ఒక అంశంపై ఆసక్తికరమైన వీడియోలు చేయగలిగితే యూట్యూబ్ మంచి ఆదాయ వనరు. కుకింగ్, ట్రావెల్, టెక్నాలజీ రివ్యూలు లేదా ఎడ్యుకేషనల్ వీడియోలు మీ ఫోన్‌తోనే షూట్ చేసి అప్‌లోడ్ చేయవచ్చు. యాడ్స్, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ఆదాయం వస్తుంది.

ముఖ్య సూచన: ఈ వ్యాపారాల్లో రాణించడానికి డబ్బు కంటే 'సమయం', 'ఓపిక' చాలా ముఖ్యం. ప్రారంభంలో ఆదాయం తక్కువగా ఉన్నా, క్రమంగా మీ నైపుణ్యం పెరిగే కొద్దీ సంపాదన కూడా పెరుగుతుంది.

Also Read: Holi Lunar Eclipse: హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 లేదా మార్చి 4 ఎప్పుడు? గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది!

Also REad: Holi Holidays: హోలీ సెలవులు వచ్చేస్తున్నాయి! ఏకంగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎక్కడెక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 23, 2026 12:57:45
Hyderabad, Telangana:

Holi Lunar Eclipse 2026: 2026లో హోలీ పండుగ తేదీల విషయంలో భక్తులలో కొంత గందరగోళం నెలకొంది. ముఖ్యంగా హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది? అనే వివరాలను జ్యోతిష్య నిపుణులు, పంచాంగం ప్రకారం ఇప్పుడు వివరాలను తెలుసుకుందాం.

సాధారణంగా ఫాల్గుణ పూర్ణిమ రోజున హోలికా దహన్ నిర్వహిస్తారు. ద్రిక్ పంచాంగ్ ప్రకారం.. హోలికా దహన్ 2026, మార్చి 3 (మంగళవారం)న జరుపుకోవాలి. సాయంత్రం 06:22 గంటల నుండి రాత్రి 08:50 గంటల వరకు ఈ ముహూర్తం ఉంది. 

ముఖ్యమైన తిథి సమయాలు..
పూర్ణిమ తిథి ప్రారంభం: మార్చి 2, సాయంత్రం 05:55 గంటలకు.
పూర్ణిమ తిథి ముగింపు: మార్చి 3, సాయంత్రం 05:07 గంటలకు.

చంద్రగ్రహణ ప్రభావం?
మార్చి 3న చంద్రగ్రహణం సంభవిస్తుండటంతో సూతక కాలం, పూజల విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రహణం కారణంగా మార్చి 3న శుభకార్యాలు నిషిద్ధమని భావించే వారు, హోలికా దహన పూజను మార్చి 2 సాయంత్రం నిర్వహించాలని కొన్ని మీడియా నివేదికలు, పండితులు సూచిస్తున్నారు. అయితే స్థానిక పంచాంగాలు, మీ ప్రాంతంలోని పండితుల సలహా మేరకు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

హోలికా దహన్ విశిష్టత (పురాణ గాథ)
హోలికా దహన్ అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం. రాక్షస రాజు హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు. తండ్రి హెచ్చరించినా ప్రహ్లాదుడు తన భక్తిని వీడడు. ప్రహ్లాదుడిని అంతం చేయడానికి హిరణ్యకశిపుడు తన సోదరి హోలిక సహాయం కోరతాడు. అగ్ని తనను ఏమీ చేయలేదనే వరం (శాలువా) ఉన్న హోలిక, ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని చితిపై కూర్చుంటుంది. విష్ణుమూర్తి కృపతో భక్త ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు, దుష్టబుద్ధి కలిగిన హోలిక అగ్నికి ఆహుతవుతుంది.

Also REad: Holi Holidays: హోలీ సెలవులు వచ్చేస్తున్నాయి! ఏకంగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎక్కడెక్కడంటే?

Also Read: Adilabad Open School: ఎగ్జామ్ హాల్‌లో విద్యార్థుల చేతుల్లో సెల్‌ఫోన్లు..ఆదిలాబాద్‌లో ఎగ్జామ్స్‌లో అసలు విషయం ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 12:44:08
Velgapudi, Andhra Pradesh:

Adulterated Milk Death: రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో కల్తీపాల వినియోగంతో మృతిచెందిన కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. కల్తీ పాలు తాగిన మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటిస్తూ మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Also Read: Hyderabad Rain: హైదరాబాద్‌లో ఆకస్మిక వర్షం.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం

ఘటన చాలా బాధాకరం
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాజమండ్రి కల్తీ పాల ఘటనలో బాధితులు వాంతులు, కడుపునొప్పి, డయాలసిస్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయి పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో వరలక్ష్మీ మిల్క్ డెయిరీ 106 కుటుంబాలకు రోజూ పాల సరఫరా చేస్తోంది. ఈ డెయిరీ నుంచి వచ్చిన పాలను తాగి అనారోగ్యం పాలయ్యారని అధికారులు నిర్ధారించారు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. 'కల్తీ పాల ఘటనలో నలుగురు చనిపోయారు. ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో 8 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు 70 ఏళ్లకు పైబడిన వారు, ఒకరు 58 ఏళ్ల వయసు వారు ఉన్నారు' అని సీఎం చంద్రబాబు వివరించారు.

Also Read: BRS Party: గజినీలా మారిన రేవంత్‌ రెడ్డి.. చెప్పేదొకటి చేసేదొకటి: బీఆర్‌ఎస్‌ పార్టీ

'బాధితుల నుంచి నమూనాలను తీసుకుని హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్స్‌కు పరీక్షల కోసం పంపించాం. డెయిరీ నిర్వాహకుడు అద్దాల గణేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని.. కాసులకు కక్కుర్తి పడి ఈ కల్తీ వ్యవహారానికి పాల్పడితే సీరియస్‌గా తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఎవరైనా కల్తీకి పాల్పడినా, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు... అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 

Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?

కల్తీపాల ఘటనపై సమీక్ష
రాజమహేంద్రవరంలో కల్తీ పాల వినియోగంతో స్థానికులు అస్వస్థతకు గురవడం, పలువురు మరణించారనే ఘటన తెలియగానే సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షించి ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యసాయంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. పాలు వినియోగించిన కుటుంబాల్లోని 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని.. మిగిలిన వారందరి నుంచి కూడా నమూనాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమండ్రి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 23, 2026 12:26:10
Hyderabad, Telangana:

Holi Holidays 2026: వసంతకాలం రాకతో వచ్చే రంగుల పండుగ 'హోలీ'కి రంగం సిద్ధమైంది. 2026లో హోలీ పండుగ సందర్భంగా వరుస సెలవుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ సమాచారం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. 

జ్యోతిష్య శాస్త్రం, క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి వారంలో పండుగ సంబరాలు జరగనున్నాయి. మార్చి 1 (ఆదివారం) వారాంతపు సాధారణ సెలవు ఉండగా.. మార్చి 2 (సోమవారం) హోలికా దహన్ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు.

అలాగే మార్చి 3 (మంగళవారం) ఇది సాధారణ వర్కింగ్ డే. అయితే, ఈ రోజును కూడా సెలవుగా ప్రకటించాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఒకవేళ స్థానిక ప్రభుత్వాలు దీనిని సెలవుగా ప్రకటిస్తే, విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తాయి. మార్చి 4వ తేదీన హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు..పలు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. 

దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా వంటి ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా ఐదు రోజుల వారాన్ని పాటిస్తాయి. కాబట్టి, శనివారం (ఫిబ్రవరి 28) నుంచే వీరికి సెలవులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో హోలీని ఘనంగా నిర్వహిస్తారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బృందావనం వంటి ప్రాంతాల్లో హోలీ ప్రాముఖ్యత దృష్ట్యా, యూపీ ప్రభుత్వం రెండు నుంచి మూడు రోజుల పాటు అధికారిక సెలవులను ఇచ్చే అవకాశం ఉంది.

గమనించాల్సిన ముఖ్య విషయాలు:
10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల షెడ్యూల్ ఉంటే, వారి సెలవుల జాబితాలో మార్పులు ఉండవచ్చు. ప్రైవేట్ పాఠశాలలు వారి సొంత సెలవుల జాబితాను కలిగి ఉంటాయి. కాబట్టి, తుది నిర్ణయం కోసం పాఠశాల డైరీ లేదా అధికారిక నోటీసులను గమనించాలి. 

స్థానిక పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు మార్చి 3న ప్రత్యేక సెలవు ప్రకటించే అధికారం కలిగి ఉంటారు. హోలీ సెలవులు కుటుంబంతో గడపడానికి మంచి సమయం. అయితే, పండుగ ఉత్సాహంతో పాటు పరీక్షల ప్రిపరేషన్‌ను కూడా బ్యాలెన్స్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also REad: Adilabad Open School: ఎగ్జామ్ హాల్‌లో విద్యార్థుల చేతుల్లో సెల్‌ఫోన్లు..ఆదిలాబాద్‌లో ఎగ్జామ్స్‌లో అసలు విషయం ఇదే!

Also REad: India Vs South Africa Match: టీమ్ఇండియాని దెబ్బేసిన జాన్సెన్, కేశవ్ మహారాజ్..సూపర్-8లో బోల్తా కొట్టిన సూర్యసేన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 12:16:03
Hyderabad, Telangana:

Sudden Heavy Rains: వేసవికాలం ఇంకా ఆరంభం కాకముందే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అకస్మాత్తుగా హైదరాబాద్‌లో వర్షం కురిసింది. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు చేసినట్టు హైదరాబాద్‌లో మధ్యాహ్నం పూట వర్షం కురిసింది. హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడింది. చిరుజల్లులతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ వర్షం కారణంగా వాహనదారులు కొంత ఇబ్బందులు పడ్డారు. రానున్న రెండు రోజుల్లో కూడా వర్షం పడతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Also Read: BRS Party: గజినీలా మారిన రేవంత్‌ రెడ్డి.. చెప్పేదొకటి చేసేదొకటి: బీఆర్‌ఎస్‌ పార్టీ

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, అబ్దుల్లాపూర్‌మెంట్, హయత్ నగర్ ప్రాంతాలలో మోస్తరు వర్షం కురిసింది. వేసవికాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నా నిన్నటి వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ ఈరోజు ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు ఏర్పడి ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి వాతావరణం చల్లగా మారింది. నల్లటి మబ్బులు కమ్ముకుని.. ఆహ్లాదంగా వాతావరణం ఉంది. ఇదే వాతావరణం మరో రెండు రోజులు కూడా ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా వర్షం పడుతోంది. మెదక్‌ జిల్లా దుబ్బాకలో కూడా వర్షం కురిసింది.

Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?

రానున్న రెండు రోజుల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడకక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అత్తాపూర్, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్ మీదుగా చెల్లాచెదురుగా తీవ్రమైన ఉరుములు మెరుపులు వచ్చాయ. చార్మినార్, బహదూర్‌పురా, బాలాపూర్, కిషన్‌బాగ్, చంద్రాయణగుట్ట, బార్కాస్‌ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుందని తెలుస్తోంది. పలు చోట్ల వడగళ్లు పడతాయని హెచ్చరించింది. రాబోయే రెండు గంటల్లో షేక్‌పేట, టోలిచౌకి, నాంపల్లిలో కూడా చెల్లాచెదురుగా వర్షాలు, ఉరుములు వీస్తాయి.

Also Read: Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 10:58:02
Hyderabad, Telangana:

Telangana Assembly Session: 'అతి తెలివితో రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు మొత్తం ఒక డ్రామాలా నడిపించారు. రేవంత్ రెడ్డి ఏ ఒక్క రోజు మున్సిపాలిటీల అభివృద్ధి గురించి చెప్పలేదు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తిగా, ఒక డాక్టర్‌గా రాజ్యాంగాన్ని నమ్ముకున్న వ్యక్తిగా అన్ని వాస్తవాలు ముందు పెడుతున్నా' అని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ముందు మాజీ మంత్రి హరీశ్‌ రావుకు సిట్ పేరుతో నోటీసులు ఇచ్చి మొదటి డ్రామాకు తెరలేపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమైనా ఉందా అంటే మన్ను లేదు మశానం లేదు. దావోస్ పేరుతో రేవంత్ రెడ్డి విహార యాత్రకు చేశాడు. మొత్తం 12 రోజుల పాటు వెళ్లి దావోసు నుంచి తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు గురించి చెప్పలేదు. ఇదే విషయం పెట్టుబడులపై శ్రీధర్ బాబు మాట్లాడుతాడో అనుకుంటే  ఆయన మాట్లాడలేదు. అందుకే రేవంత్ రెడ్డి దావోస్‌ పర్యటనను విహార యాత్ర అంటున్నా' అని ఎమ్మెల్యే సంజయ్‌ వెల్లడించారు.

Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'డైవర్ట్ పాలిటిక్స్‌లో భాగంగా తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చి రెండో డ్రామాకు తెరలేపారు. ప్రజల దృష్టి మరల్చడంలో రేవంత్ రెడ్డి ఆయనకు ఆయనే సాటి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పుడు మున్సిపాలిటీల్లో సభలు నిర్వహిస్తాడు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో సభలు. ఏదో ఒక రకంగా ప్రజలను రేవంత్ రెడ్డి మభ్య పెడుతున్నాడు' అని ఎమ్మెల్యే సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇతర పార్టీలతో అంటకాగేది రేవంత్ రెడ్డి. అలాంటిది బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి లింక్ పెడుతు వీణావాణిల గురించి నీచంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడారు' అని మండిపడ్డారు.

Also Read: Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రానికి ముమ్మాటికి జాతిపిత కేసీఆరే అని ఎమ్మెల్యే సంజయ్‌ ప్రకటించారు. 'ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు, తగిన సమయంలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు కేసీఆర్ ను తిట్టడం తప్పా, అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు. తప్పులు చేస్తే చెప్పండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రోజు తప్పులు చేస్తూనే ఉన్నాడు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సమస్యల పైన మాట్లాడే అవకాశం ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో నిజాయితీగా ప్రజల సమస్యలపై చర్చ చేయాలని కోరారు.

Also Read: Matrimonial Frauds: పెళ్లి పేరుతో పెట్రేగుతున్న మోసాలు.. అమ్మాయిలకు కీలక సూచన

'ఈ బడ్జెట్‌లో మహిళలు, రైతులకు, నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన హామీలకు నిధులు కేటాయించకపోతే వారందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం. బడ్జెట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డికి ఫేవరేట్ సబ్జెక్ట్ అయిన రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుదాం. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో తెలుసుకుంటే బావుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శ్రీరామ రక్ష అని రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాల్సిందే' అని ఎమ్మెల్యే సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ తెలిపారు.

'బడ్జెట్ సమావేశాల్లో మాకు మైక్ ఇవ్వమని చెప్పండి, జలాల పై చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి గజిని లాంటి వాడు, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈసారి అసెంబ్లీని గౌరవించి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్‌ను పార్టీ మారారని అనర్హత వేటు వేశారు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా స్పీకర్ వారిపై చర్యలు తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రచారం చేసినా చర్యలు తీసుకోలేదు' అని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 23, 2026 10:09:28
Adilabad, Telangana:

Adilabad Open School Cell Phone Exam: పరీక్షా హాల్ అంటే పుస్తకాలు, పెన్నులు, పేపర్లే కనిపిస్తాయి. కానీ, ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం దృశ్యం విభిన్నంగా మారింది. విద్యార్థులంతా తమ మొబైల్ ఫోన్లలో మునిగిపోయారు. పక్కనే ఇన్విజిలేటర్ ఉన్నా ఎవరూ వారిని ఆపడం లేదు. ఎందుకంటే.. వాళ్లంతా ఫోన్లలో పరీక్షలు రాస్తున్నారు!

తొలిసారిగా మొబైల్ ద్వారా పరీక్ష
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) చరిత్రలో ఒక సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే విద్యార్థుల కోసం నిర్వహించే బేస్‌లైన్ టెస్ట్‌ను ఈసారి సెల్‌ఫోన్ల ద్వారా నిర్వహించారు.

పరీక్షా విధానం ఇలా..
ఇన్విజిలేటర్లు ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను విద్యార్థులు తమ ఫోన్లలో స్కాన్ చేసి ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. విద్యార్థులు తమ ఫోన్ స్క్రీన్‌పైనే ఆప్షన్లను ఎంచుకుంటూ పరీక్ష రాశారు. ప్రత్యేకత ఏంటంటే, మొత్తం ఐదు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను విద్యార్థులు ఒకే రోజులో పూర్తి చేశారు.

పరీక్ష పూర్తయిన మరుక్షణమే ఫలితాలు కూడా ఫోన్ స్క్రీన్‌పైనే కనిపించాయి. దీనివల్ల రిజల్ట్స్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ డిజిటల్ పరీక్షను నిర్వహించారు. పదో తరగతి కోసం 418 మంది.. ఇంటర్మీడియట్ 245 మంది ఈ పరీక్షకు హజరయ్యారు.

సాధారణంగా పోటీ పరీక్షల్లో ఫోన్లను అనుమతించరు కానీ, ఓపెన్ స్కూల్ ప్రవేశాల కోసం ఈ వెసులుబాటు కల్పించడం విశేషం. రాబోయే రోజుల్లో అన్ని రకాల ప్రవేశ పరీక్షలకు ఫోన్లే సాధనంగా మారే అవకాశం ఉందని ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ తెలిపారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు పరీక్షల భారాన్ని తగ్గించడంలో ఈ ప్రయోగం సక్సెస్ అయిందనే చెప్పాలి.

Also Read: India Vs South Africa Match: టీమ్ఇండియాని దెబ్బేసిన జాన్సెన్, కేశవ్ మహారాజ్..సూపర్-8లో బోల్తా కొట్టిన సూర్యసేన!

Also Read: Weight Loss Bullet Coffee: బుల్లెట్ కాఫీ గురించి విన్నారా? రోజుకు ఒకటి తాగినా శరీరంలో కొవ్వును కట్ చేసేస్తుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 09:20:47
Hyderabad, Telangana:

VC Sajjanar: వివాహం చేసుకునే అంశంపై జరుగుతున్న మోసాలపై పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కీలక విజ్ఞప్తి చేశారు. పెళ్లిళ్ల పేరిట జరుగుతున్న మోసాలను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పెళ్లి చేసుకోబోయే యువతులకు సజ్జనార్‌ హెచ్చరికలు చేస్తూనే.. జాగ్రత్తలు చెప్పారు. పెళ్లి ఖరారు చేసుకున్న తర్వాత వ్యక్తిగత ఫొటోలు, న్యూడ్‌ వీడియోలు వంటివి తీసుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తారని వివరించారు. 'హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు అందరికీ తెలిసిందే. ప్రేమ పేరుతోనే కాదు, పెళ్లి కుదిరిన సంబంధాల మాటున కూడా కొందరు నమ్మించి యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఫిర్యాదులు ఎక్కువగా స్వీకరిస్తున్నారు' అని సజ్జనార్‌ తెలిపారు.

Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?

మోసాలు ఇలా..
సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై నిశ్చితార్థం చేసుకుంటున్నారు. పెళ్లి ఖాయమైంది కదా అనే నమ్మకంతో యువతులు వారికి దగ్గరవుతున్నారు. ఎలాగూ పెళ్లి కదా.. ఇప్పుడేంటి? అని మాయమాటలు చెప్పి, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, ఒంటరిగా శారీరకంగా లోబరుచుకుంటున్నారు. కోరిక తీరాక వారి అసలు రంగు బయటపడుతుంది. పెళ్లి పీటలే ఎక్కలేమని.. ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలని.. లేదంటే కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Also Read: Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

వేధింపులు, బెదిరింపులతోపాటు పరువు ఎక్కడ పోతుందోనని భయంతో చాలామంది యువతులు అలాంటి దుర్మార్గుల ఆగడాలను భరించేందుకు వెనకడుగు వేస్తున్నారని వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఇదే అదనుగా భావించి కట్నంగా ఆభరణాలు, నగదు డబ్బు డిమాండ్లు చేస్తున్నారని వివరించారు. పరువు పోతుందని భయపడి మౌనంగా ఉంటే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. నిరంతరం అలా సరే పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రతిష్టగా ఉంటాయని తెలిపారు.

Also Read: Team India: బ్యాటర్లు ఘోర వైఫల్యం.. సూపర్ -8లో భారత్ ఓటమికి ఐదు కారణాలు

పెళ్లి కుదిరిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు అని వీసీ సజ్జనార్‌ సూచించారు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయాలని చెప్పారు. పెళ్లికి ముందు ఏకాంతంగా కలవడాన్ని, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించాలని.. ధైర్యంగా తిరస్కరించాలని తెలిపారు. డబ్బు డిమాండ్ చేసినా.. బ్లాక్ మెయిల్ చేసినా భయపడవద్దని.. ఫిర్యాదు చేయాలని సజ్జనార్‌ సూచించారు. మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎలాంటి భయం లేకుండా ముందుకురావాలి కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సూచించారు. ఫిర్యాదు చేసినవారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతారని.. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ నెంబర్ 94906 16555కు, డయల్ 100కు ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ డీసీ సౌజన్య సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 09:09:21
Velgapudi, Andhra Pradesh:

Adulterated Milk Deaths: ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ పాలు సేవించిన ప్రజలు పెద్ద ఎత్తున తీవ్ర అస్వస్థతకు గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే నలుగురు మృతి చెందడంతో తీవ్ర సంచలనం రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో జరిగిన ఉదంతంపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీ వేదికగా కల్తీపాల సంఘటనపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. కల్తీ పాల ఘటనపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?

కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో వరలక్ష్మి డైరీ నుంచి పాల సరఫరా జరిగిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారని.. వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు
పురుషులు ఉన్నారని వెల్లడించారు. 'హైదరాబాద్ ల్యాబ్స్‌కు పాల నమూనాలు పంపాం. 194 సెక్షన్ కింద కేస్ నమోదైంది. డైరీ నిర్వాహకులు పోలీసుల కంట్రోల్‌లో ఉన్నారు' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. స్వర్ణ దేవాలయం చట్టం వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

Also Read: Harish Rao: మూసీ పునరుజ్జీవనం పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ: హరీశ్ రావు

సీఎం చంద్రబాబును కలిసిన మంత్రులు
కల్తీ పాల సంఘటనపై సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని మంత్రులు కలిశారు. తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అన్యమతస్తులకు డిక్లరేషన్ నిబంధన మరింత కఠినతరం చేయాలనే అంశంపై చర్చ జరిగింది. ప్రత్యేక చట్టం ద్వారా తప్పుచేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంది. ప్రత్యేక చట్టాన్ని టీటీడీకి కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వర్ణ దేవాలయం చట్టం వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది.

Also Read: Rs 151 Talambralu: రూ.151 చెల్లిస్తే భక్తుల ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

లడ్డూలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో రేపు 4 గంటలపాటు చర్చకు నిర్ణయం. రేపు ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్‌ రద్దు చేశారు. రేపు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయించారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే స్వల్ప అస్వస్థత కారణంగా పవన్‌కల్యాణ్‌ సభకు రాలేదు. రేపు సభకు వచ్చాక డిప్యూటీ సీఎం కూడా చర్చలో పాల్గొనే అవకాశం ఉంది.

Back to top