Rahu Transit 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు గ్రహాన్ని నీడ గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం సెప్టెంబర్ రెండవ తేదీన కదలికలు జరపబోతోంది. చాలాకాలం సాధారణంగా ఉన్న ఈ గ్రహం మళ్లీ కదలికలు జరపడం విశేషం. అంతకుముందే మే 18వ తేదీన రాహు కుంభరాశిలోకి ప్రవేశించి దాదాపు 18 నెలల పాటు అదే రాశిలో సంచార దశలో కొనసాగుతాడు. అయితే, ఫలితంగా అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించని ఫలితాలు లభిస్తాయి. రాహు కుంభరాశి లోనే ఉండడం వల్ల జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ఆర్థికంగా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి
రాహువు ఎఫెక్ట్‌తో వృషభ రాశి వారికి అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగాల్లో పెద్ద ప్రమోషన్స్ లభించడమే కాకుండా.. అనేక అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు కూడా రావడం ప్రారంభమవుతాయి. దీంతోపాటు భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి పరిష్కారం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం కలగబోతోంది.
మిథున రాశి
రాహువు ప్రభావంతో మిధున రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఎంతో సులభంగా పూర్తవుతాయి. పనుల కోసం సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాలు కూడా లాభసాటిగా మారవచ్చు. రాహు ప్రభావంతో ఆర్థికంగా అద్భుతమైన పురోగతి లభించే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి కూడా లభించబోతోంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులపై కూడా ఈ సమయంలో రాహువు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పనిలో అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా సువర్ణ అవకాశాలు కూడా కలుగుతాయి. ఆర్థిక పునాదులు కూడా చాలా బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రణాళికలు విజయవంతం అవ్వడమే కాకుండా భారీ లాభాలను తెచ్చిపెట్టబోతున్నాయి.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా రాహు ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీంతోపాటు కొత్త ఉద్యోగాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా మారే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో కుంభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
AP Irrigation Dept: వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం పలు విజ్ఞప్తులు చేసింది. మైక్రో ఇరిగేషన్ నిధులు విడుదల చేయాలని కోరింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేసిన పథకాల కింద కేంద్ర వాటాగా రావాల్సిన మొత్తం రూ.695 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిగిలిన కేంద్ర వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Also Read: Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళన.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మాజీ ఎస్సై మృతి
తిరుమల ఆలయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం సందర్శించారు. తిరుమలకు వచ్చిన ఆయనను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యాంశాలపై చర్చించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమ కార్యక్రమాల అమలు, కేంద్ర పథకాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై ఇరు మంత్రులు విస్తృతంగా చర్చించారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
రాష్ట్రంలో రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, నిధులు, వివిధ పథకాల అమలుపై కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ఆదాయ వృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు దిశగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతోందని వివరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న మైక్రో ఇరిగేషన్ పథకానికి సంబంధించిన కేంద్ర వాటా నిధుల విడుదల అంశాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేసిన పథకాల కింద కేంద్ర వాటాగా మొత్తం రూ.695 కోట్లు రావాల్సి ఉండగా.. కేవలం రూ.50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, ఇంకా రూ.645 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిగిలిన కేంద్ర వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం మరో రూ.400 కోట్లు సెంట్రల్ షేర్ నిధులు విడుదల చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఈ నిధులను ఆర్‌కేవీవై- పీడీఎంసీ పథకం మంజూరు చేయాలని తెలిపారు. మైక్రో ఇరిగేషన్ విస్తరణతో నీటి వనరుల సమర్థ వినియోగం, సాగు వ్యయాల తగ్గింపు, రైతుల ఆదాయ వృద్ధి సాధ్యమవుతాయని చెప్పారు. త్వరితగతిన నిధుల విడుదలకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Free Govt Schemes: మనదేశంలో పథకాలు ఎన్నో లాభాలు పేదవారికి అందిస్తున్నాయి. ప్రధానంగా రైతులు, మహిళలు, పేద వర్గాలకు చెందిన వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చాలామందికి ఈ పథకాల గురించి తెలియక లాభాలను కోల్పోతున్నారు. ఆయుష్మాన్ భారత్ నుంచి పీఎం కిసాన్, మహిళలకు సంబంధించిన పథకాలు ఉన్నాయి. వీటితో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆ ఏడు పథకాలు ఏంటో తెలుసుకుందాం ..
ఆయుష్మాన్ భారత్..
ఆయుష్మాన్ భారత్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగకరం. రూ. 5 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య చికిత్స పొందుతారు. అర్హత గల కుటుంబాలకు ఇందులో సర్జరీ, క్యాన్సర్, గుండె సమస్యలు కూడా చికిత్స లభిస్తుంది. మీకు ఆయుష్మాన్ కార్డు లేకపోతే అధికారిక వెబ్‌సైట్లో మీరు మీ అర్హతను తెలుసుకొని పొందవచ్చు. దీంతో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు చికిత్స ఉచితం తీసుకోవచ్చు. దీనికి ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన...
ఇల్లు లేని వారికి సొంతింటిని కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు రూ. 2.67 లక్షల వరకు సబ్సిడీ హోమ్ లోన్ లో లభిస్తుంది. డబ్బును నేరుగా జమ చేస్తారు. దీంతో మీ ఈఎంఐ భారం తగ్గుతుంది.
ముద్ర లోన్...
ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకం. మహిళలకు సొంతంగా వ్యాపారాలు చేసే వారికి ఇది బెస్ట్ ఇందులో రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తారు. శిశు, కిషోర్, తరుణ్ మూడు కేటగిరీల్లో లోన్ అందిస్తారు. దీనికి ఎలాంటి తనఖా లేకుండా లోన్ సులభంగా పొందవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన...
మీకు పదేళ్ల లోపు అమ్మాయి ఉంటే ఈ పథకం ఒక వరం అని చెప్పవచ్చు. ఇందులో అత్యధిక స్థాయిలో వడ్డీ రేట్లు లభిస్తాయి. మెచ్యూరిటీ సమయానికి మీరు ఎక్కువ మొత్తంలో డబ్బు పొందవచ్చు. 100 శాతం ఎలాంటి టాక్స్ కూడా విధించారు. మీ పాప విద్య లేదా పెళ్లికి ఎంతగానో ఉపయోగపడతాయి.
నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP)..
చాలామంది డబ్బులు లేకుండా విద్యార్థులు పాఠశాల చదువును మధ్యలోనే ఆపేస్తారు. అయితే ఈ ఎన్‌ఎస్‌పీ పోర్టల్ అనేక స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. స్కూలు నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు సులభంగా ఇందులో స్కాలర్‌షిప్ పొందవచ్చు. మైనారిటీ, వెనుకబడిన కులాలకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తుంది. ఆన్‌లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పీఎం ఉజ్వల యోజన..
పీఎం ఉజ్వల యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఉచిత సిలిండర్ లభిస్తుంది. ఎల్‌పీజీ కనెక్షన్ పొందిన తర్వాత సిలిండర్ కూడా సబ్సిడీ ధరలో పొందవచ్చు. ఈ స్కీమ్ లో మీ అడ్రస్ ప్రూఫ్ తో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ లేని వారు పొందవచ్చు.
పీఎం కిసాన్..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ చేస్తుంది. మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతులు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇది వారి సాగు ఖర్చులకు ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: విద్యార్థులకు UGC కీలక అలెర్ట్.. ఆ 32 యూనివర్సిటీలు ఫేక్, ఆంధ్రప్రదేశ్‌లో రెండు..!
Also Read: మరో బాంబు పేల్చిన ట్రంప్.. గ్లోబల్ టారీఫ్స్ 15 శాతానికి పెంపు, భారత్‌కు ఇదే వర్తిస్తుందంటూ క్లారిటీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Central Government DA Hike 2026: హోలీ పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. 2026 మార్చి మొదటి వారంలో కరవు భత్యం (DA) పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
7వ వేతన సంఘం గడువు ముగిసి, 8వ వేతన సంఘంపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరల దృష్ట్యా కేంద్రం ఏడాదికి రెండుసార్లు డీఏను సవరిస్తుంది. ఈ ఏడాది జనవరి నుండి వర్తించే మొదటి సవరణను హోలీ కానుకగా మార్చిలో ప్రకటించనున్నారు.
డీఏ పెంపు అంచనాలు
ప్రస్తుత గణాంకాల ప్రకారం.. డీఏ పెంపు వివరాలు ఇలా ఉండవచ్చు. ప్రస్తుత డీఏ 58 శాతం (డిసెంబర్ 2025 నాటికి) ఉండగా.. సుమారు 2 శాతం ఆశించిన పెంపు లభించే అవకాశం ఉంది. ఈ పెంపుతో మొత్తం కరవు భత్యం 60 శాతం మార్కును చేరుకుంటుంది.
8వ వేతన సంఘం - కీలక మార్పులు
7వ వేతన సంఘం కాలపరిమితి 2025 డిసెంబర్‌తో ముగియడంతో, అందరి దృష్టి ఇప్పుడు 8వ వేతన సంఘంపైనే ఉంది. నిబంధనల ప్రకారం.. కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న కరవు భత్యాన్ని (ఈసారి అది 60% ఉండవచ్చు) ప్రాథమిక జీతంలో విలీనం చేస్తారు.
విలీనం తర్వాత కొత్త వేతన నిర్మాణంలో డీఏ మళ్లీ 0% నుండి లెక్కిస్తారు. దీనివల్ల ఉద్యోగుల ప్రారంభ జీతం భారీగా పెరుగుతుంది. ఈసారి 2 శాతం పెంపు తక్కువగా అనిపించినా, గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.
2000 జనవరి: కేవలం 1 శాతం పెంపు.
2007, 2018: 2 శాతం చొప్పున పెంపు.
ఈ స్వల్ప శాతం పెంపు కూడా బకాయిలు, పెన్షన్లపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపుతుంది.
ఎవరికి ప్రయోజనం?
ఈ నిర్ణయం వల్ల సుమారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. మార్చిలో ప్రకటించినప్పటికీ, ఈ పెంపు జనవరి 1, 2026 నుండి పాత బకాయిలతో సహా అందుతుంది.
హోలీ పండుగకు ముందే ఈ ప్రకటన వస్తే ఉద్యోగుల ఇళ్లలో పండుగ వెలుగులు రెట్టింపు కావడం ఖాయం. 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావడం వల్ల భవిష్యత్తులో వేతనాలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NZ Vs PAK Super 8 Match Result: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 పోరులో తొలి మ్యాచ్‌కే వర్షం అడ్డంకిగా మారింది. కొలంబో వేదికగా జరగాల్సిన పాకిస్థాన్ - న్యూజిలాండ్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. సూపర్-8 రౌండ్‌లో అత్యంత ఆసక్తికరంగా సాగుతుందనుకున్న కివీస్-పాక్ సమరం వరుణుడి ధాటికి నిలిచిపోయింది. కొలంబోలో భారీ వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
టాస్ పడింది.. కానీ ఆట సాగలేదు!
మ్యాచ్ ప్రారంభానికి ముందు వాతావరణం అనుకూలంగా ఉండటంతో టాస్ వేశారు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆటగాళ్లు మైదానంలోకి వచ్చేలోపే భారీ వర్షం మొదలైంది. గంటల తరబడి వర్షం తగ్గకపోవడంతో గ్రౌండ్ మొత్తం నీటితో నిండిపోయింది. మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు.
ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఇరు జట్లు చెరొక పాయింట్ పంచుకున్నాయి. దీనివల్ల రెండు జట్లకు సెమీఫైనల్ దారులు కొంత కష్టమయ్యాయి. సెమీస్‌కు చేరుకోవాలంటే పాకిస్థాన్, న్యూజిలాండ్ తమ తదుపరి రెండు మ్యాచుల్లో ఖచ్చితంగా గెలవడమే కాకుండా, రన్ రేట్ కోసం భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.
కీలకమైన సూపర్-8 దశలో ఇలా పాయింట్లు పంచుకోవాల్సి రావడం ఇరు జట్ల కెప్టెన్లను నిరాశకు గురిచేసింది. వరుణుడు శాంతిస్తేనే తదుపరి మ్యాచులు సాఫీగా సాగే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs South Africa Super 8 Preview: టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత ఉత్కంఠభరితమైన పోరుకు సమయం ఆసన్నమైంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న భారత్ వర్సెస్ సౌతాఫ్రికా సూపర్-8 మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఓ అంచనా తెలిసిపోయింది.
గత వరల్డ్ కప్ ఫైనలిస్టుల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ పోరు ఫైనల్‌ను తలపిస్తోంది. అయితే ఫామ్ కోల్పోయి తడబడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంలో మార్పులు ఉంటాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఓపెనింగ్ జోడీ మారదా?
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో సంజూ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దీనిపై ప్రశ్నించగా.. "అభిషేక్‌ను తీసేయమంటారా? లేక తిలక్ వర్మను పక్కన పెట్టమంటారా?" అని ఎదురు ప్రశ్నిస్తూ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. దీన్ని బట్టి మేనేజ్‌మెంట్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌ల జోడీనే కొనసాగించేలా కనిపిస్తోంది.
జట్టు బలాబలాలు..
నంబర్ 3లో తిలక్ వర్మ, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబేలతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
మరోవైపు స్పిన్ విభాగంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టులోకి పునరాగమనం చేయనున్నారు. అతనికి తోడుగా వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్‌తో సౌతాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కుల్దీప్, వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉన్నా ప్రస్తుతానికి అక్షర్ వైపే మొగ్గు ఉంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పేస్ భారాన్ని పంచుకోనున్నారు.
విమర్శలపై కెప్టెన్ స్పందన
తక్కువ స్కోర్లు నమోదవ్వడంపై వస్తున్న విమర్శలను సూర్య తోసిపుచ్చారు. "ప్రతి మ్యాచ్‌లోనూ 240 పరుగులు ఆశించడం కష్టం. ఇక్కడి వికెట్లు భిన్నంగా ఉన్నాయి. గ్రూప్ దశ పరిస్థితులకు తగ్గట్టే మేము రాణిస్తున్నాం, పవర్‌ప్లేలో 40-50 పరుగులు వస్తున్నప్పుడు ఆందోళన అవసరం లేదు" అని సూర్య ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
టీమిండియా అంచనా ప్లేయింగ్-11..
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (C), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
గతేడాది ఫైనల్‌లో తగిలిన గాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తుంటే, పటిష్టమైన సౌతాఫ్రికాను ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పని. మరి అహ్మదాబాద్ పిచ్ ఎవరికి సహకరిస్తుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bhadrachalam Talambralu: సీతారాముల కల్యాణం చూడడానికి రెండు కళ్లు చాలవు. భద్రాచలంలో జరిగే కల్యాణం దేశంలోనే అద్భుతమైన ఘట్టం. ఆ కల్యాణంలో సీతారాములపై వేసిన తలంబ్రాలు భక్తుల ఇళ్లకే దక్కనున్నాయి. భక్తుల ఇంటికే భద్రాచలం సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు రానున్నాయి. తెలంగాణ ఆర్టీసీ అందిస్తున్న ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవచ్చు. రూ.151 చెల్లిస్తే భద్రాచలం తలంబ్రాలు వస్తాయి. ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకుందాం.
Also Read: AI Impact Summit: యూత్ కాంగ్రెస్ ఆందోళనపై కేటీఆర్, వైఎస్ జగన్ ఖండన
ఆన్ లైన్‌లో..
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (తెలంగాణ ఆర్టీసీ) సిద్ధమైంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి తెలంగాణ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన తలంబ్రాల ప్యాకెట్లు పొందాలనుకునే భక్తులు www.tgartclogistics.co.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
ఆఫ్‌లైన్‌లో..
తెలంగాణ ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకుని చిరునామా అందించాలి. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు తెలంగాణ ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది.
భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో శనివారం ఆర్టీసీ వీసీ, ఎండీ వై నాగిరెడ్డి ఆవిష్కరించారు. 'నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని మూడేళ్ల కిందట తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది' అని ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
మూడేళ్లలో లక్షలాది మందికి
ఆర్టీసీ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. మూడేళ్లలో లక్షలాది మంది భక్తులకు తలంబ్రాలను ఆర్టీసీ సంస్థ అందజేసింది' ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వివరించారు. భద్రాద్రిలో మార్చి 27వ తేదీన అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ వేడుకకు వెళ్లలేని భక్తులు ఆర్టీసీ అందించే తలంబ్రాలను వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ సూచిస్తోంది.
ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో..
రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని ఎండీ నాగిరెడ్డి చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తాం. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440069లలో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ సీటీఎం (మార్కెటింగ్, కమర్షియల్) శ్రీధర్, లాజిస్టిక్ ఏటిఏం రాజన్, భాను తదితరులు పాల్గొన్నారు.
Also Read: BJP Attack: గుంటూరు కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ దాడి.. వైఎస్ షర్మిల ఖండన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Punjab Latest Telugu News: దేశ రాజధాని ఢిల్లీ లక్ష్యంగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని ఉగ్ర సంస్థలు పనిచేస్తున్నాయి. రాజధాని లక్ష్యంగా జరుగుతున్న లష్కరే తోయిబా (LeT) భారీ కుట్రను పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో పాటు జమ్ము కాశ్మీర్ ప్రాంతాల్లో రెండు శక్తివంతమైన ఐఈడీ బాంబులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది..
అమృత్‌సర్‌లోని రాయ్యా పోలీస్ కు సంబంధించిన పోస్ట్ దగ్గర్లోని శుక్రవారం ఒక అనుమానాస్పద బ్యాగును స్థానికులు గుర్తించారు. పోలీసులకు వెంటనే సమాచారం అందించడంతో.. అక్కడికి బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది.. ఆ బ్యాగులో ప్రమాదకరమైన ఐఈడీ ఉన్నట్లు నిర్ధారించిన అధికారులు... ప్రోటోకాల్ ప్రకారం దానిని సురక్షితంగా నిర్వీర్యం చేసినట్లు ప్రకటించారు. అంతేకాకుండా కొంతమంది భద్రత బలగాలు అక్కడే ఉన్న ప్రాంతాల్లో శోధాలు కూడా నిర్వహించినట్లు తెలిసింది.
మరోవైపు జమ్ము కాశ్మీర్ లో కూడా ఇదే తరహా ప్రమాదకరమైన ఐఈడీ లభ్యమైనట్లు తెలుస్తోంది. సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా నెట్వర్క్ సహాయంతో ఈ పేలుడు పదార్థాలను చేరవేసి ఉండవచ్చని భద్రత అధికారులు అనుమానిస్తున్నారు.. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రత్యేకమైన దాడులకు మాస్టర్ ప్లాన్ చేస్తున్నారని ఇంటిలిజెంట్ హెచ్చరికతో భద్రత సంస్థలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.. ఈ ఐఈడీల రికవరీకి.. ఢిల్లీ ఉగ్రవాదుల హెచ్చరికలకు నేరుగా సంబంధాలు ఉన్నాయో లేదో ఇంకా సరైన స్పష్టత రానప్పటికీ.. ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి..
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
ముఖ్యంగా రద్దీ ఉండే ప్రాంతాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రాత్మక కట్టడాల వద్ద నిగాను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో శాంతి ఉండకుండా ప్రయత్నిస్తున్నారని.. ప్రజలు తప్పకుండా ఈ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.. అనుమానంగా ఎవరైనా కనిపిస్తే తప్పకుండా అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మీ దగ్గర అనుమానంగా కనిపించే బ్యాగులు ఉన్న వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు..
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Youth Congress Protest: అంతర్జాతీయ ఏఐ సదస్సులో యువజన కాంగ్రెస్ చేసిన ఆందోళనపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యువజన కాంగ్రెస్ నాయకులు చేసిన నిరసనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. అంతర్జాతీయ వేడుకలో ఇలాంటి చర్యలు సహించరానివని పేర్కొన్నారు. దేశ పరువుపోయేలా ఇలా చేయడం సరికాదని ప్రకటించారు. ఇంపాక్ట్ సమ్మిట్‌ను రాజకీయ నాటకాల కోసం ఇలా వాడుకోవడం విచారకరమని తెలిపారు.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ నాయకుల ఆందోళనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అంతర్జాతీయ సదస్సులో భారతదేశ పరువుపోయేలా యువజన కాంగ్రెస్ వ్యవహరించిందని వారు ఇద్దరూ ఖండించారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు అని హితవు పలికారు. అంతర్జాతీయ వేదికలను నిరసనకు పాల్పడడం దారుణంగా పేర్కొన్నారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
యువజన కాంగ్రెస్ తీరు సిగ్గుచేటు
'ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ చేసిన చర్య సిగ్గుచేటు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా దేశాన్ని అవమానించేలా ప్రవర్తించరాదు. రాజకీయంగా ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ప్రపంచం ముందు మాత్రం ఐక్యతగా ఉండాలి' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హితవు పలికారు.
దేశం ప్రతిష్టకు భంగపాటు
'యువజన కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం 'ఇంపాక్ట్ సమ్మిట్ 2026'ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరం. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడంతో ప్రపంచ దేశాల ముందు మన దేశం ప్రతిష్ట దెబ్బతింటుంది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే. కానీ ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయి. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా దానికి వేదిక కాదు. వారి సొంత పార్టీ రేవంత్ రెడ్డి అదే ఏఐ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యువజన కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రం' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read: BJP Attack: గుంటూరు కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ దాడి.. వైఎస్ షర్మిల ఖండన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rajasthan Latest Sad News: రాజస్థాన్‌లోని బలోరు జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల గదిలో తాత్కాలికంగా నిర్మించిన ఇటుకల బ్లాక్ బోర్డు కూలి ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.. ఈ ఘటన సాయల పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. యధావిధిగాని ఆరోజు ఆ చిన్నారి క్లాస్‌కి అటెండ్ అయింది.. ఇంతలోనే ఊహించని ప్రమాదం చోటు చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది..
పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. బావత్రా గ్రామంలోని మరుధర్ శిక్షణ సంస్థాన్ అనే ప్రైవేటు పాఠశాలలో ప్రీతి అనే ఆరేళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది.. శుక్రవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటూ ఉంది.. గోడకు ఆనుకొని ఉన్న భారీ ఇటుకల బ్లాక్ బోర్డ్ ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆ చిన్నారిపై కూలిపోయింది.. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి ఇటుకల కింద చిక్కుకు పోయింది.. ఆమెపై బ్లాక్ బోర్డుకు సంబంధించిన ఇటుకలన్నీ కుప్పలు తెప్పలు పడిపోయాయి...
వెంటనే స్పందించిన పాఠశాలకు సంబంధించిన టీచర్స్, ఇతర కొంతమంది స్థానికులు శిథిలాల కింద బాలికను వెతికి.. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.. మృతురాలు బన్వర్లాల్ మెగావాల్ కుమార్తెగా పోలీసులు తెలిపారు.. ఈ ప్రమాదం పాఠశాల భవన నిర్మాణం నాణ్యతను ప్రశ్నించేలా చేస్తుంది. పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం.. పాఠశాల గదులన్నీ నాణ్యత లేకుండా నిర్మించారట.. కేవలం ఐదు నుంచి ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఇటుకల గోడపై వెదురు కర్రలు పెట్టి.. పైనుంచి ఒక తార్పాలిన్ కవర్ కప్పి ఏర్పాటు చేశారట.. బ్లాక్ బోర్డులను కూడా ఇటుకల సహాయంతో తయారుచేసి ఉంచారట.. ఈ నాణ్యత లేని నిర్మాణమే చిన్నారి ప్రాణాలను బలి తీసింది.
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
ప్రమాదం జరిగిన వెంటనే పాఠశాల నిర్వహకులు అక్కడి నుంచి పరార్ అయిపోయారు.. పోలీసులు వారికోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.. సమాచారం అందుకున్న ఇతర ఉన్నతాధికారులు కూడా ఘటన స్థలానికి చేరుకొని ప్రత్యేకమైన దర్యాప్తును ప్రారంభించారు. దీనిపై జిల్లా విద్యాశాఖ కూడా విచారణ కమిటీ నియమించింది.. భవన నిర్మాణ నాణ్యతను విస్మరించి.. వందలాదిమంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి స్కూల్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Congress Shirtless Protest Telugu News: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన షర్టు లెస్ నిరసన వెనక పెద్ద కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చేపట్టిన ఈ నిరసనను.. ఆ కార్యకర్తలు నేపాల్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన జెన్ జీ ఉద్యమం నుంచి ప్రేరణ పొందినట్లు శుక్రవారం ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. షర్ట్ లెస్ నిరసన చేయడం ఇదే మొదటిసారిగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు యూత్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంది.. కానీ ఈ తరహాలో నిరసనలు చేపట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమ్మిట్ కు ప్రపంచ దేశాల నేతలతో పాటు అనేక టెక్ కంపెనీలకు సంబంధించిన దిగ్గజ వ్యాపారాలు వస్తున్న సమయంలో ఈ ఆందోళన చోటుచేసుకుంది. ఈ సమయంలో నిరసనకారులు చొక్కాలు విప్పి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సదస్సు వేదిక వద్ద కొద్దిసేపు అలజడి సృష్టించారు.. అయితే వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైన విచారణ కూడా చేపడుతున్నట్లు తెలుస్తోంది. నిరసనకారుల తీరు చూస్తుంటే కేవలం సాధారణ ఆందోళన కాదని.. దీని వెనక పెద్ద ప్లానే ఉందని పోలీసుల ఆరోపిస్తున్నారు.
నేపాల్ యువత చేపట్టిన ఉద్యమం అక్కడ రాజకీయ అస్థిరతకు దారి తీసిన తరుణంలోనే.. భారత్‌లో కూడా ఇలాంటి వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతుందని పోలీసులు కోర్టుకు నివేదించారు.. అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్న సమయంలో ఎటువంటి నిరసనలు చేపట్టడం ద్వారా దేశ ప్రతిష్టలను దిగజార్చేలా కుట్రలు పన్నారని వారి పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలాంటి సమయంలో ప్రత్యేకమైన నిరసనలు చేపట్టడం వల్ల పార్టీకి కూడా బూస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఉపాయంతోనే.. ఇలా షర్ట్ లెస్ నిరసన కార్యక్రమం చేపట్టారని తెలుస్తోంది.
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పలు అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ.. ఈ వినూత్న ప్రదర్శనకు దిగిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే పోలీసులు దీనిని భద్రతపరమైన ఉల్లంఘన గా పరిగణిస్తున్నారు. అయితే, ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరులైన సంగతి తెలిసిందే. పోలీసులు వీటిని ఆధారంగా చేసుకుని కోర్టులో ప్రత్యేకమైన సాక్షాలు సమర్పించారు. ప్రస్తుతం ఈ కేసు పై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో పోలీసులు కూడా మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు.
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Sharmila Condemns BJP Attack: ఢిల్లీలో ఏఐ సదస్సులో కాంగ్రెస్ యువజన కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధం జరుగుతోంది. అర్ధనగ్న ప్రదర్శనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. దేశంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై బీజేపీ శ్రేణులు దాడి చేశారు. ఈ క్రమంలోనే ఏపీలోని గుంటూరు కాంగ్రెస్ ఆఫీస్‌పై బీజేపీ నాయకులు ముట్టడించారు. అంతే కాకుండా రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Also Read: Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళన.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మాజీ ఎస్సై మృతి
ఏఐ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ దాడులు చేసింది. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడి రచ్చరచ్చ చేశారు. రాళ్లు, కోడిగుడ్లతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి కార్యకర్తలు, నాయకులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీపై కూడా దాడికి యత్నించడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోటాపోటీ నినాదాలతో అక్కడ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
తమ కార్యాలయంపై బీజేపీ దాడి చేయడాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. గుంటూరులోని కాంగ్రెస్ కార్యాలయాన్ని బీజేపీ ముట్టడించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 'ఎక్స్' వేదికగా ఆమె స్పందిస్తూ.. బీజేపీ కార్యకర్తలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'హింసకు మారుపేరు బీజేపీ ఢిల్లీలో ఏదో జరిగిందని ఆంధ్రప్రదేశ్ గల్లీలో పార్టీ ఆఫీసులపై దాడులా? ఇదేం ప్రజాస్వామ్యం? ఇదెక్కడి దారుణం? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై బీజేపీ గుండాల దాడులు పిరికిపంద చర్య. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాకోర్టులో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. దేశంలో ప్రశ్నించే హక్కును బీజేపీ కాలరాస్తుంది. మోదీ ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగంలో నిరసన తెలపడం నేరమైంది. ప్రతిపక్షంపై దాడులు చేయడమంటే దేశ ప్రతిష్టను మరింతగా దిగజార్చడమే. మత ఛాందసవాదుల వికృత చేష్టలను శాంతియుతంగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం' అని వైఎస్ షర్మిల ప్రకటన విడుదల చేశారు.