Youth Congress Protest: అంతర్జాతీయ ఏఐ సదస్సులో యువజన కాంగ్రెస్ చేసిన ఆందోళనపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యువజన కాంగ్రెస్ నాయకులు చేసిన నిరసనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. అంతర్జాతీయ వేడుకలో ఇలాంటి చర్యలు సహించరానివని పేర్కొన్నారు. దేశ పరువుపోయేలా ఇలా చేయడం సరికాదని ప్రకటించారు. ఇంపాక్ట్ సమ్మిట్‌ను రాజకీయ నాటకాల కోసం ఇలా వాడుకోవడం విచారకరమని తెలిపారు.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ నాయకుల ఆందోళనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అంతర్జాతీయ సదస్సులో భారతదేశ పరువుపోయేలా యువజన కాంగ్రెస్ వ్యవహరించిందని వారు ఇద్దరూ ఖండించారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు అని హితవు పలికారు. అంతర్జాతీయ వేదికలను నిరసనకు పాల్పడడం దారుణంగా పేర్కొన్నారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
యువజన కాంగ్రెస్ తీరు సిగ్గుచేటు
'ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ చేసిన చర్య సిగ్గుచేటు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా దేశాన్ని అవమానించేలా ప్రవర్తించరాదు. రాజకీయంగా ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ప్రపంచం ముందు మాత్రం ఐక్యతగా ఉండాలి' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హితవు పలికారు.
దేశం ప్రతిష్టకు భంగపాటు
'యువజన కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం 'ఇంపాక్ట్ సమ్మిట్ 2026'ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరం. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడంతో ప్రపంచ దేశాల ముందు మన దేశం ప్రతిష్ట దెబ్బతింటుంది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే. కానీ ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయి. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా దానికి వేదిక కాదు. వారి సొంత పార్టీ రేవంత్ రెడ్డి అదే ఏఐ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యువజన కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రం' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read: BJP Attack: గుంటూరు కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ దాడి.. వైఎస్ షర్మిల ఖండన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Bhadrachalam Talambralu: సీతారాముల కల్యాణం చూడడానికి రెండు కళ్లు చాలవు. భద్రాచలంలో జరిగే కల్యాణం దేశంలోనే అద్భుతమైన ఘట్టం. ఆ కల్యాణంలో సీతారాములపై వేసిన తలంబ్రాలు భక్తుల ఇళ్లకే దక్కనున్నాయి. భక్తుల ఇంటికే భద్రాచలం సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు రానున్నాయి. తెలంగాణ ఆర్టీసీ అందిస్తున్న ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవచ్చు. రూ.151 చెల్లిస్తే భద్రాచలం తలంబ్రాలు వస్తాయి. ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకుందాం.
Also Read: AI Impact Summit: యూత్ కాంగ్రెస్ ఆందోళనపై కేటీఆర్, వైఎస్ జగన్ ఖండన
ఆన్ లైన్‌లో..
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (తెలంగాణ ఆర్టీసీ) సిద్ధమైంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి తెలంగాణ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన తలంబ్రాల ప్యాకెట్లు పొందాలనుకునే భక్తులు www.tgartclogistics.co.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
ఆఫ్‌లైన్‌లో..
తెలంగాణ ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకుని చిరునామా అందించాలి. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు తెలంగాణ ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది.
భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో శనివారం ఆర్టీసీ వీసీ, ఎండీ వై నాగిరెడ్డి ఆవిష్కరించారు. 'నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని మూడేళ్ల కిందట తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది' అని ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
మూడేళ్లలో లక్షలాది మందికి
ఆర్టీసీ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. మూడేళ్లలో లక్షలాది మంది భక్తులకు తలంబ్రాలను ఆర్టీసీ సంస్థ అందజేసింది' ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వివరించారు. భద్రాద్రిలో మార్చి 27వ తేదీన అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ వేడుకకు వెళ్లలేని భక్తులు ఆర్టీసీ అందించే తలంబ్రాలను వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ సూచిస్తోంది.
ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో..
రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని ఎండీ నాగిరెడ్డి చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తాం. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440069లలో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ సీటీఎం (మార్కెటింగ్, కమర్షియల్) శ్రీధర్, లాజిస్టిక్ ఏటిఏం రాజన్, భాను తదితరులు పాల్గొన్నారు.
Also Read: BJP Attack: గుంటూరు కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ దాడి.. వైఎస్ షర్మిల ఖండన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Punjab Latest Telugu News: దేశ రాజధాని ఢిల్లీ లక్ష్యంగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని ఉగ్ర సంస్థలు పనిచేస్తున్నాయి. రాజధాని లక్ష్యంగా జరుగుతున్న లష్కరే తోయిబా (LeT) భారీ కుట్రను పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో పాటు జమ్ము కాశ్మీర్ ప్రాంతాల్లో రెండు శక్తివంతమైన ఐఈడీ బాంబులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది..
అమృత్‌సర్‌లోని రాయ్యా పోలీస్ కు సంబంధించిన పోస్ట్ దగ్గర్లోని శుక్రవారం ఒక అనుమానాస్పద బ్యాగును స్థానికులు గుర్తించారు. పోలీసులకు వెంటనే సమాచారం అందించడంతో.. అక్కడికి బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది.. ఆ బ్యాగులో ప్రమాదకరమైన ఐఈడీ ఉన్నట్లు నిర్ధారించిన అధికారులు... ప్రోటోకాల్ ప్రకారం దానిని సురక్షితంగా నిర్వీర్యం చేసినట్లు ప్రకటించారు. అంతేకాకుండా కొంతమంది భద్రత బలగాలు అక్కడే ఉన్న ప్రాంతాల్లో శోధాలు కూడా నిర్వహించినట్లు తెలిసింది.
మరోవైపు జమ్ము కాశ్మీర్ లో కూడా ఇదే తరహా ప్రమాదకరమైన ఐఈడీ లభ్యమైనట్లు తెలుస్తోంది. సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా నెట్వర్క్ సహాయంతో ఈ పేలుడు పదార్థాలను చేరవేసి ఉండవచ్చని భద్రత అధికారులు అనుమానిస్తున్నారు.. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రత్యేకమైన దాడులకు మాస్టర్ ప్లాన్ చేస్తున్నారని ఇంటిలిజెంట్ హెచ్చరికతో భద్రత సంస్థలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.. ఈ ఐఈడీల రికవరీకి.. ఢిల్లీ ఉగ్రవాదుల హెచ్చరికలకు నేరుగా సంబంధాలు ఉన్నాయో లేదో ఇంకా సరైన స్పష్టత రానప్పటికీ.. ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి..
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
ముఖ్యంగా రద్దీ ఉండే ప్రాంతాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రాత్మక కట్టడాల వద్ద నిగాను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో శాంతి ఉండకుండా ప్రయత్నిస్తున్నారని.. ప్రజలు తప్పకుండా ఈ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.. అనుమానంగా ఎవరైనా కనిపిస్తే తప్పకుండా అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మీ దగ్గర అనుమానంగా కనిపించే బ్యాగులు ఉన్న వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు..
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rajasthan Latest Sad News: రాజస్థాన్‌లోని బలోరు జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల గదిలో తాత్కాలికంగా నిర్మించిన ఇటుకల బ్లాక్ బోర్డు కూలి ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.. ఈ ఘటన సాయల పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. యధావిధిగాని ఆరోజు ఆ చిన్నారి క్లాస్‌కి అటెండ్ అయింది.. ఇంతలోనే ఊహించని ప్రమాదం చోటు చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది..
పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. బావత్రా గ్రామంలోని మరుధర్ శిక్షణ సంస్థాన్ అనే ప్రైవేటు పాఠశాలలో ప్రీతి అనే ఆరేళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది.. శుక్రవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటూ ఉంది.. గోడకు ఆనుకొని ఉన్న భారీ ఇటుకల బ్లాక్ బోర్డ్ ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆ చిన్నారిపై కూలిపోయింది.. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి ఇటుకల కింద చిక్కుకు పోయింది.. ఆమెపై బ్లాక్ బోర్డుకు సంబంధించిన ఇటుకలన్నీ కుప్పలు తెప్పలు పడిపోయాయి...
వెంటనే స్పందించిన పాఠశాలకు సంబంధించిన టీచర్స్, ఇతర కొంతమంది స్థానికులు శిథిలాల కింద బాలికను వెతికి.. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.. మృతురాలు బన్వర్లాల్ మెగావాల్ కుమార్తెగా పోలీసులు తెలిపారు.. ఈ ప్రమాదం పాఠశాల భవన నిర్మాణం నాణ్యతను ప్రశ్నించేలా చేస్తుంది. పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం.. పాఠశాల గదులన్నీ నాణ్యత లేకుండా నిర్మించారట.. కేవలం ఐదు నుంచి ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఇటుకల గోడపై వెదురు కర్రలు పెట్టి.. పైనుంచి ఒక తార్పాలిన్ కవర్ కప్పి ఏర్పాటు చేశారట.. బ్లాక్ బోర్డులను కూడా ఇటుకల సహాయంతో తయారుచేసి ఉంచారట.. ఈ నాణ్యత లేని నిర్మాణమే చిన్నారి ప్రాణాలను బలి తీసింది.
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
ప్రమాదం జరిగిన వెంటనే పాఠశాల నిర్వహకులు అక్కడి నుంచి పరార్ అయిపోయారు.. పోలీసులు వారికోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.. సమాచారం అందుకున్న ఇతర ఉన్నతాధికారులు కూడా ఘటన స్థలానికి చేరుకొని ప్రత్యేకమైన దర్యాప్తును ప్రారంభించారు. దీనిపై జిల్లా విద్యాశాఖ కూడా విచారణ కమిటీ నియమించింది.. భవన నిర్మాణ నాణ్యతను విస్మరించి.. వందలాదిమంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి స్కూల్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Congress Shirtless Protest Telugu News: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన షర్టు లెస్ నిరసన వెనక పెద్ద కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చేపట్టిన ఈ నిరసనను.. ఆ కార్యకర్తలు నేపాల్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన జెన్ జీ ఉద్యమం నుంచి ప్రేరణ పొందినట్లు శుక్రవారం ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. షర్ట్ లెస్ నిరసన చేయడం ఇదే మొదటిసారిగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు యూత్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంది.. కానీ ఈ తరహాలో నిరసనలు చేపట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమ్మిట్ కు ప్రపంచ దేశాల నేతలతో పాటు అనేక టెక్ కంపెనీలకు సంబంధించిన దిగ్గజ వ్యాపారాలు వస్తున్న సమయంలో ఈ ఆందోళన చోటుచేసుకుంది. ఈ సమయంలో నిరసనకారులు చొక్కాలు విప్పి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సదస్సు వేదిక వద్ద కొద్దిసేపు అలజడి సృష్టించారు.. అయితే వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైన విచారణ కూడా చేపడుతున్నట్లు తెలుస్తోంది. నిరసనకారుల తీరు చూస్తుంటే కేవలం సాధారణ ఆందోళన కాదని.. దీని వెనక పెద్ద ప్లానే ఉందని పోలీసుల ఆరోపిస్తున్నారు.
నేపాల్ యువత చేపట్టిన ఉద్యమం అక్కడ రాజకీయ అస్థిరతకు దారి తీసిన తరుణంలోనే.. భారత్‌లో కూడా ఇలాంటి వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతుందని పోలీసులు కోర్టుకు నివేదించారు.. అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్న సమయంలో ఎటువంటి నిరసనలు చేపట్టడం ద్వారా దేశ ప్రతిష్టలను దిగజార్చేలా కుట్రలు పన్నారని వారి పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలాంటి సమయంలో ప్రత్యేకమైన నిరసనలు చేపట్టడం వల్ల పార్టీకి కూడా బూస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఉపాయంతోనే.. ఇలా షర్ట్ లెస్ నిరసన కార్యక్రమం చేపట్టారని తెలుస్తోంది.
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పలు అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ.. ఈ వినూత్న ప్రదర్శనకు దిగిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే పోలీసులు దీనిని భద్రతపరమైన ఉల్లంఘన గా పరిగణిస్తున్నారు. అయితే, ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరులైన సంగతి తెలిసిందే. పోలీసులు వీటిని ఆధారంగా చేసుకుని కోర్టులో ప్రత్యేకమైన సాక్షాలు సమర్పించారు. ప్రస్తుతం ఈ కేసు పై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో పోలీసులు కూడా మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు.
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Sharmila Condemns BJP Attack: ఢిల్లీలో ఏఐ సదస్సులో కాంగ్రెస్ యువజన కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధం జరుగుతోంది. అర్ధనగ్న ప్రదర్శనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. దేశంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై బీజేపీ శ్రేణులు దాడి చేశారు. ఈ క్రమంలోనే ఏపీలోని గుంటూరు కాంగ్రెస్ ఆఫీస్‌పై బీజేపీ నాయకులు ముట్టడించారు. అంతే కాకుండా రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Also Read: Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళన.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మాజీ ఎస్సై మృతి
ఏఐ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ దాడులు చేసింది. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడి రచ్చరచ్చ చేశారు. రాళ్లు, కోడిగుడ్లతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి కార్యకర్తలు, నాయకులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీపై కూడా దాడికి యత్నించడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోటాపోటీ నినాదాలతో అక్కడ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
తమ కార్యాలయంపై బీజేపీ దాడి చేయడాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. గుంటూరులోని కాంగ్రెస్ కార్యాలయాన్ని బీజేపీ ముట్టడించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 'ఎక్స్' వేదికగా ఆమె స్పందిస్తూ.. బీజేపీ కార్యకర్తలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'హింసకు మారుపేరు బీజేపీ ఢిల్లీలో ఏదో జరిగిందని ఆంధ్రప్రదేశ్ గల్లీలో పార్టీ ఆఫీసులపై దాడులా? ఇదేం ప్రజాస్వామ్యం? ఇదెక్కడి దారుణం? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై బీజేపీ గుండాల దాడులు పిరికిపంద చర్య. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాకోర్టులో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. దేశంలో ప్రశ్నించే హక్కును బీజేపీ కాలరాస్తుంది. మోదీ ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగంలో నిరసన తెలపడం నేరమైంది. ప్రతిపక్షంపై దాడులు చేయడమంటే దేశ ప్రతిష్టను మరింతగా దిగజార్చడమే. మత ఛాందసవాదుల వికృత చేష్టలను శాంతియుతంగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం' అని వైఎస్ షర్మిల ప్రకటన విడుదల చేశారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Xiaomi 17 Series Launch Date In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీల్లో ఒకటైన షియోమి అంతర్జాతీయ మార్కెట్‌లో తమ కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ షియోమి 17, షియోమి 17 అల్ట్రా పేర్లతో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటిని కంపెనీ గత ఏడాది సెప్టెంబర్ నెలలో చైనాలో ప్రవేశపెట్టారు. అయితే, అంతర్జాతీయంగా విడుదలకు ముందే ఈ రెండు మోడల్స్‌కు సంబంధించిన ఫీచర్ ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి..
ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌ను అంతర్జాతీయంగా ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మోడల్‌ల విడుదలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని షియోమి ఇంకా వెల్లడించలేదు.. కానీ లీక్ అయిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి నెలలోనే అందుబాటులోకి తీసుకువచ్చే ఛాన్సులున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ చాలా ప్రీమియం ఫీచర్స్ తో విడుదల కాబోతోంది. ముఖ్యంగా కంపెనీ కస్టమర్లకు 24 నెలల పాటు క్వాలిటీ అస్యూరెన్స్ ప్లాన్ ను కూడా అందించబోతోంది. మొదట ఆరు నెలల్లో ఉచిత స్క్రీన్ రిప్లేస్మెంట్‌ను అందిస్తోంది. అంటే అనుకోకుండా స్క్రీన్ డామేజ్ అయితే.. కంపెనీ ఫ్రీగా కొత్త స్క్రీన్ అందిస్తుంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ వివిధ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీని మొదటి స్టోరేజ్ బేరియంట్ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. అంటే దీని బేస్ వేరియంట్ రూ.1 లక్ష నుంచి ప్రారంభమవుతుంది. ఇక 512 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.1.18 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఇదే స్మార్ట్‌ఫోన్ సిరీస్ లోని ఆల్ట్రా మోడల్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మొదటగానే రూ.1.61 లక్షలతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఇక ఇదే మోడల్‌లోని హై ఎండ్ వేరియంట్ రూ.1.82 లక్షలతో విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ తెలుపుతో పాటు ఆకుపచ్చ, నీలం రంగుల్లో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీకయ్యాయి..Xiaomi 17 Ultra స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 6.9-అంగుళాల 1.5K LTPO AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి.
అంతేకాకుండా ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ పై విడుదల చేయబోతోంది. అలాగే వెనక భాగంలో ఇది ఎంతో శక్తివంతమైన త్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో ప్రధాన కెమెరా ను కలిగి ఉంటుంది. అదనంగా మరో రెండు 50-మెగాపిక్సెల్ కెమెరాలు కూడా లభిస్తాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Redmi 7a Launch Date In India News: ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ Redmi మార్కెట్‌లోకి త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ Redmi A7 పేరుతో తీసుకురాబోతోంది. ఇప్పటికే థాయిలాండ్ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్ నుంచి ప్రత్యేకమైన సర్టిఫికేషన్ కూడా పొందినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మార్కెట్లోకి రెడ్మి 7ఏ ప్రో కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి రెండు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. అయితే, Redmi 7ఏ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
త్వరలో విడుదల కాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ 26020RNB4A మోడల్ నెంబర్‌తో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ 5G, GSM, LTE కనెక్టివిటీ వంటి ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అంతేకాకుండా ఈ Redmi A7 HD+ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల LCD డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన Unisoc T7250 ప్రాసెసర్‌తో లాంచ్ కాబోతోంది. దీంతో పాటు కంపెనీ ఎంతో ప్రత్యేకమైన 6,000mAh బ్యాటరీతో పాటు 15W ఛార్జింగ్ సపోర్టుతో విడుదల కాబోతోంది.
ఈ Redmi A7 స్మార్ట్‌ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ Poco C81 Pro రీ బ్రాండ్ వెర్షన్‌లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది కూడా భారత మార్కెట్‌లోకి త్వరలోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన HD+ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు శక్తివంతమైన Unisoc T7250 ప్రాసెసర్‌తో లాంచ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గత ఏడాది పోకో కంపెనీ Poco C85 5G స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. దీనిని డిసెంబర్ నెలలో అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇంకా మార్కెట్‌లోకి విక్రయాల్లో అందుబాటులో లేదు..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్
అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ 25128PC17G మోడల్ నెంబర్‌తో విడుదలైంది. ఇది కూడా చాలా ప్రత్యేకమైన 5G LTE, GSM వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా HD+ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల LCD ప్యానెల్ స్క్రీన్‌తో అందుబాటులో ఉంది. అలాగే ఇది Android 15 ఆధారంగా HyperOS 3 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 6,000mAh బ్యాటరీ సపోర్టును కూడా అందిస్తోంది. అలాగే 15W ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన Unisoc T7250 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Neal Katyal: ట్రంప్ టారిఫ్‌లకు సుప్రీంకోర్టు బ్రేక్.. భారత సంతతి లాయర్ ఊహించని విజయం.. ఎవరో తెలుసా?
Neal Katyal Telugu News: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి ఆ దేశ సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.. అతను గత కొద్ది రోజుల నుంచి తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలను తప్పుపడుతూ సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పును అందించింది. వివిధ ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన భారీ దిగుమతి సుంకాలను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.. ఈ చారిత్రాత్మక కేసులో ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించిన భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది నీల్ కత్యాల్ విజయం సాధించి.. ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఒక అద్భుతమైన తీర్పులో భాగంగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఉండడం విశేషం.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ వినియోగించి విదేశీ వస్తువులపై ఊహించని టారిఫ్‌లను విధిస్తూ వచ్చారు. అయితే, ఈ పన్నులను విధించే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని.. అధ్యక్షుడికి లేదని చిన్న వ్యాపారుల తరఫున నీల్ కత్యాల్ కోర్టులో వాదించారు.. ఇలా సుదీర్ఘ కాలం పాటు వాదించడంతో.. కోర్టు ఏకీభవించి.. 6-3 మెజారిటీతో ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఊహించని తీర్పు ఇచ్చింది..
నీల్ కాత్యాల్ ఓ భారత సంతతికి సంబంధించిన వ్యక్తి.. అతను చికాగోలోని ఓ ప్రాంతంలో జన్మించారు.. ఆయన తల్లి వైద్యురాలు, తండ్రి ఇంజనీర్.. అమెరికా న్యాయ శాస్త్ర రంగంలో ఆయనకు విశేష గుర్తింపు ఉంది.. అమెరికా సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 50 కి పైగా కేసులను వాదించిన ఘనత ఆయనది.. అంతేకాకుండా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో అమెరికా యాక్టింగ్ సోలిసిటర్ జనరల్ గా కూడా పనిచేశారు.. అలాగే ట్రంప్ విధించిన ముస్లిం దేశాల ప్రయాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా కూడా.. ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. అంతేకాకుండా ఆయన అనేక ప్రసిద్ధ బుక్కులను కూడా రాసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు అమెరికాలో విశేషమైన గుర్తింపు పొంది.
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
ఈ విజయంపై కాత్యాల్ మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ విలువల విజయమని.. అమెరికాలో పన్నులు విధించే అధికారం ప్రజాప్రతినిధుల సభకు మాత్రమే ఉంటుందని.. కానీ ఏ ఒక్క వ్యక్తికి ఉండదని.. అధ్యక్షులు శక్తివంతులే కావచ్చు.. కానీ మన రాజ్యాంగం అంతకంటే శక్తివంతమైందని ఆయన తెలిపారు.. మరోవైపు ఈ తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తూ.. ఇది దేశ ప్రయోజనాలకు విఘాతం అని ఆయన మీడియా ముఖంగా అన్నారు..
Also Read: Delhi News: ఢిల్లీలో హై అలర్ట్.. ఎర్రకోట, దేవాలయాలే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Allu Sirish Pre Wedding Party Photos: అల్లు వారి కుటుంబంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అల్లు శిరీష్ వివాహ వేడుకల సందర్భంగా అల్లు అర్జున్ తన నివాసంలో ఏర్పాటు చేసిన స్పెషల్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు శిరీష్-నయనికల వివాహం మార్చి 6న జరగనున్న నేపథ్యంలో, అల్లు వారింట్లో వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోదరుడి కోసం ఒక గ్రాండ్ డిన్నర్ పార్టీని హోస్ట్ చేశారు.
పార్టీ విశేషాలు..
ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. చాలా కాలం తర్వాత మెగా, అల్లు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్‌లోని పలువురు సన్నిహిత మిత్రులు, సెలబ్రిటీలు ఈ పార్టీలో సందడి చేశారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటిచెప్పింది.
పెళ్లి ముచ్చట్లు..
ఇటీవలే అల్లు శిరీష్ తన స్నేహితుల కోసం గోవాలో ఘనంగా బ్యాచిలర్ పార్టీని నిర్వహించుకున్నారు. పెళ్లి పనుల్లో భాగంగా శిరీష్ తన మావయ్య, మెగాస్టార్ చిరంజీవిని కలిసి తొలి శుభలేఖను అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. శిరీష్ తన ప్రియురాలు నయనికతో గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 6న జరగబోయే ఈ వివాహ వేడుక కోసం అల్లు అరవింద్ ఫ్యామిలీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే మరిన్ని ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమాలు (సంగీత్, మెహందీ) మొదలుకానున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Supreme Court Ruling On Tariffs Today: అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కారు విధించిన అధిక టారిఫ్‌లు రద్దయ్యాయి. అయితే, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, వెంటనే మరో కొత్త ఉత్తర్వుపై సంతకం చేశారు. దీని ప్రకారం, భారత్ సహా అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ఇక నుంచి 10 శాతం సుంకాలు వర్తించనున్నాయి.
భారత్‌పై టారిఫ్‌ల ప్రస్థానం
భారత్‌పై అమెరికా విధించిన సుంకాల పరిణామాలు గమనిస్తే మన దేశానికి ఇది పెద్ద ఊరటగానే కనిపిస్తోంది. ట్రంప్ అధికారంలోకి రాగానే భారత్‌పై 25 శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో మరో 25 శాతం కలిపి మొత్తం 50 శాతానికి పెంచారు.
ఇటీవల జరిగిన చర్చల ఫలితంగా ఈ సుంకాలు 50 శాతం నుండి 18 శాతానికి దిగివచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, వైట్‌హౌస్ ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం భారత్‌పై ఇక నుంచి కేవలం 10 శాతం టారిఫ్‌లు మాత్రమే అమలులో ఉంటాయి.
కొత్త ఉత్తర్వుల ముఖ్యాంశాలు..
ఈ 10 శాతం సుంకాలు ఫిబ్రవరి 24 నుండి అమల్లోకి వస్తాయి. ప్రాథమికంగా ఇవి 150 రోజుల పాటు అమల్లో ఉంటాయని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఇది కేవలం తాత్కాలిక ఊరట మాత్రమేనని, గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం మళ్లీ పాత సుంకాలను అమలు చేసేందుకు ఉన్న చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు.
స్విట్జర్లాండ్, జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో గతంలో 15 నుండి 20 శాతం సుంకాలపై ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఆ దేశాలన్నీ కూడా కేవలం 10 శాతం సుంకాలనే చెల్లించాల్సి ఉంటుంది.
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు భారత్ వంటి దేశాలకు వాణిజ్య పరంగా పెద్ద వెసులుబాటును కల్పించింది. అయితే, ట్రంప్ యంత్రాంగం మళ్లీ సుంకాలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో, ఈ 150 రోజుల గడువు ముగిసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Delhi Latest Telugu News: భారతదేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉగ్రవాద ముప్పును పొంచి ఉందన్న నిగవర్గాల హెచ్చరికలతో భద్రతా దళాలు హై అలెర్ట్ ప్రకటించాయి.. పాకిస్తాన్ కేంద్రంగా పనులు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) ఢిల్లీలో పలుచోట్ల దాడులకు ప్లాన్ చేసినట్లు ఇంటిలిజెంట్ వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా మతపరమైన ప్రదేశాలతో పాటు చారిత్రాత్మక కట్టడాల వద్ద దాడులకు ప్రత్యేకమైన ప్లాన్లను వేసినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
నిఘవర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. ఎర్రకోట సమీపంలోని పలు ప్రాంతాలతో పాటు అత్యంత రద్దీగా ఉండే చాందిని చౌక్ లోని ప్రసిద్ధ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని IED పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీన ఇస్లామాబాదులోని ఒక మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా.. LeT ఈ దాడులకు పాల్పడడానికి చూస్తోందని నిఘాధికారులు వెల్లడించారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాలతో పాటు కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నాయని నిఘవర్గాలు తెలిపాయి.
నిఘాధికారుల హెచ్చరికతో ఢిల్లీ పోలీసులతో పాటు భద్రత బలగాలు పాత ఢిల్లీలోని పరిసరాల్లో నిఘాను ముమ్మరం చేశాయి.. దేవాలయాలతో పాటు పర్యాటక ప్రాంతాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దుల్లో కూడా నిఘాను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. మతపరమైన స్థలాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో నిరంతరం యాంటీ సబొటేజ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా ఇతర వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారు కోరారు. ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశాయి. అంతేకాకుండా ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్టు నడుస్తోంది.
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lunar Eclipse impact on Holi: 2026 మార్చి 3న హోలీ పండుగ రోజే సంవత్సరంలోనే సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుండటం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని, సందేహాలను కలిగిస్తోంది. ఈ ఏడాది మార్చి 3న హోలీ పండుగ, చంద్రగ్రహణం ఒకేరోజు రావడం విశేషం. ఇది ఈ సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన గ్రహణంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో హోలీ వేడుకలపై గ్రహణ ప్రభావం ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు. పండుగ జరుపుకోవచ్చా? గ్రహణ సమయాలు ఏమిటి? అనే విషయాలపై పండితుల సూచనలతో కూడిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:
చంద్రగ్రహణం సమయాలు (మార్చి 3, 2026)
జోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రహణ మధ్యాహ్నం 3:19 నిమిషాలకు ప్రారంభం కానుంది. అలాగే సాయంత్రం 6:46 నిమిషాలకు గ్రహణ ముగియనుంది. మొత్తం గ్రహణం వ్యవధి సుమారు 3 గంటల 27 నిమిషాలుగా ఉండనుంది. అయితే ఈ గ్రహణ బింబ దర్శనం మాత్రం 59 నిమిషాల పాటు స్పష్టంగా కనిపించనుంది.
హోలీ ఎప్పుడు జరుపుకోవాలి?
గ్రహణ ప్రభావం మధ్యాహ్నం నుండి ప్రారంభం కానున్నందున, పండుగ జరుపుకునే వారు సమయ పాలన పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఉదయం 11:00 గంటలలోపు హోలీ సంబరాలు పూర్తి చేసుకోవడం మంచిది. సూతక కాలం (గ్రహణానికి ముందు సమయం) దృష్ట్యా ఉదయం 9:00 గంటలకే దేవాలయాలను మూసివేయాలని నిర్ణయించారు.
గ్రహణ నియమాలు - సూతక కాలం జాగ్రత్తలు..
శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో కొన్ని పనులకు దూరంగా ఉండాలని చెబుతారు.
1) సూతక కాలంలో విగ్రహాలను తాకడం లేదా దైవ కార్యాలు చేయడం నిషిద్ధం.
2) గ్రహణ సమయంలో భోజనం చేయడం, ప్రయాణాలు చేయడం మంచిది కాదని నమ్మకం.
3) గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణ సమయంలో బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ కనిపిస్తుంది. భారతదేశంలో పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కొంత మేర కనిపించే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాక్, ఇరాన్ వంటి దేశాల్లోనూ ఈ ఖగోళ వింత దర్శనమివ్వనుంది. హోలీ రంగుల పండుగ అయినప్పటికీ, గ్రహణ నియమాలను పాటిస్తూ ఉదయాన్నే వేడుకలు జరుపుకోవడం శ్రేయస్కరమని ఆధ్యాత్మిక పండితులు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Venkateswara Swamy Pics In AP Legislative Council: ఏపీ శాసనమండలిలో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ వైకాపా సభ్యులు ప్రదర్శించిన తీరుపై మంత్రులు, కూటమి సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, హెరిటేజ్ సంస్థపై చర్చ జరపాలంటూ వైకాపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా ఎమ్మెల్సీలు శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటాలను చేతబూని సభలో ఆందోళనకు దిగారు.
దైవ చిత్రపటాల ప్రదర్శన
ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పాలవలస విక్రాంత్, వరుదు కల్యాణి తదితరులు శ్రీవారి ఫోటోలను పట్టుకుని పోడియం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. సభలోకి దైవ చిత్రపటాలను తీసుకురావడం శాసనసభ చరిత్రలోనే ఇదే మొదటిసారి అని కూటమి సభ్యులు విమర్శించారు.
దేవుడిని రాజకీయాల్లోకి లాగడంపై మంత్రి నారా లోకేశ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందించారు. "హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు" అని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. నిరసనగా ఆయన తన హెడ్‌ఫోన్‌ను బెంచికేసి కొట్టారు.
వైకాపా సభ్యులు బూట్లు, చెప్పులు ధరించి శ్రీవారి చిత్రపటాలను పట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సభ వాయిదా పడ్డాక ఆ చిత్రపటాలను టేబుల్‌పైనే పడేసి వెళ్లడంపై మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొత్స వాదన
సభ ముగిసిన తర్వాత విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాము బూట్లు వేసుకుని ఫోటోలు పట్టుకోలేదని వాదించారు. అయితే, వైకాపా ఎమ్మెల్సీలు బూట్లతో ఉన్న వీడియోలు బయటపడటంతో, అవి కృత్రిమంగా సృష్టించిన వీడియోలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
అతి తక్కువ సమయం సాగిన సభ
శుక్రవారం మండలి కేవలం 5 నిమిషాల పాటు మాత్రమే సాగింది. ఉదయం గందరగోళం మధ్య వాయిదా పడిన సభ, మధ్యాహ్నం ప్రారంభమైన నిమిషంలోనే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.
కూటమి నేతల ఫిర్యాదు
సభలో జరిగిన పరిణామాలపై మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు భేటీ అయ్యారు. ఛైర్మన్ మోషేనురాజును కలిసి వైకాపా సభ్యుల తీరుపై నిరసన తెలిపారు. బీజేపీ పక్ష నేత సోము వీర్రాజు ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ పోరాటాల్లో దేవుడి చిత్రపటాలను వాడటం, అదీ సభలో బూట్లు ధరించి ప్రదర్శించడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై వైకాపా క్షమాపణ చెప్పాలని కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mercury Transit Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. అంతేకాకుండా ఈ గ్రహాన్ని అత్యంత శక్తివంతమైన గ్రహంగా భావిస్తారు.. కాబట్టి సంచారం కారణంగా ఏర్పడే ప్రభావం మొత్తం అన్ని రాశులు ప్రభావితమవుతూ ఉంటాయి. అతి త్వరలోనే శని గ్రహం నక్షత్ర సంచారం కూడా చేయబోతోంది. ముఖ్యంగా బుధుడి సొంత నక్షత్రంగా పరిగణించే రేవతి నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. మే 17వ తేదీన భాద్రపాద నక్షత్రం నుంచి ఈ రేవతి నక్షత్రంలోకి సంచారం చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో శని బుధ గ్రహాల ప్రభావం కొన్ని రాశుల వారిపై పడబోతోంది. దీంతో ఆయారాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో.. విశేషమైన ప్రయోజనాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.
ఈ రాశుల వారికి లాభాలే లాభాలు..
సింహరాశి
రేవతి నక్షత్రంలోకి శని సంచారం చేయడం కారణంగా సింహ రాశి వారికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు స్నేహితులతో పాటు ఇతర మీకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఇష్టమైన వారి సపోర్టు లభించి.. ఆర్థికంగా కూడా ప్రయోజనాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో చాలావరకు లాభసాటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఈ సమయంలో అద్భుతమైన ఆసక్తి పెరుగుతుంది.
ధనస్సు రాశి
బుధుడి నక్షత్రంలోకి మే 17వ తేదీన శని ప్రవేశించడం వల్ల ధనస్సు రాశి వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కెరీర్ పరంగా ఎన్నో రకాల అవకాశాలు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకు భవిష్యత్తులో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తి సంబంధిత సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం ఈ సమయంలో చాలావరకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా కలుగొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి కాస్త ఉపశమనం కూడా లభిస్తుంది. వీరికి లాటరీ కూడా లభించే ఛాన్స్ ఉంది.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు శని నక్షత్ర మార్పుల వల్ల అనేక రంగాల్లో వస్తున్న సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభించబోతోంది. కష్టపడి పని చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పదోన్నతులతో పాటు కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా వీరు కెరీర్ పరంగా చాలా వరకు స్థిరపడే అవకాశాలున్నాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకపోవడం చాలా మంచిది. దీంతోపాటు సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ప్రయాణాలు కూడా సాధ్యమవుతాయి. భవిష్యత్తులో అద్భుతమైన ప్రయోజనాలు పొందే చాన్సులు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!