Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500033
Motorola Edge 60 Stylus: హోలీ అదిరిపోయే ఆఫర్‌.. మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!
DDDharmaraju Dhurishetty
Feb 27, 2026 06:59:55
Hyderabad, Telangana

Motorola Edge 60 Stylus Price Cut: అత్యంత తక్కువ ధరలోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌ హోలీ సందర్భంగా మీకోసం కొన్ని అద్భుతమైన ఆఫర్స్‌తో స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తోంది. ముఖ్యంగా గత ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి విడుదలైన మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ (Motorola Edge 60 Stylus) స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ (Motorola Edge 60 Stylus) స్మార్ట్‌ఫోన్ సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ ఎంతో ప్రత్యేకమైన 6.67-అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లే తో విడుదల చేసింది. దీంతోపాటు ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ సపోర్టుతో అందుబాటులో ఉంది. అలాగే ఈ మొబైల్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది Sony LYT-700C సెన్సార్, OIS సపోర్ట్ తో కూడిన 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు అదనంగా 13MP అల్ట్రావైడ్, మాక్రో లెన్స్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. వీడియో కాలింగ్ కోసం ఈ కెమెరా ఎంతగానో సహాయపడుతుంది. 

అలాగే ఈ Motorola Edge 60 Stylus మొబైల్‌కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళ్తే.. 5000 mAh బ్యాటరీ, 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆధారిత Hello UI ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే ప్రత్యేకమైన NFC, బ్లూటూత్ 5.4, Wi-Fi 6E కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో ఇన్-బిల్ట్ స్టైలస్ పెన్. దీనితో మీరు స్క్రీన్‌పై నోట్స్ రాసుకోవచ్చు, బొమ్మలు గీయవచ్చు లేదా ఫొటోలను ఎడిట్ ఎంతో సులభంగా చేసుకోవచ్చు. అలాగే ఇది IP68 రేటింగ్‌తో వచ్చింది.. నీటిలో పడినప్పటికీ ఏమాత్రం పాడవకుండా ఉంటుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

భారతదేశంలో దీనిని కంపెనీ MRP రూ.28,999 ధరతో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడే దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి 28 శాతం ప్రత్యేకమైన ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.20,899 లోపే పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా.. ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన ఆక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

అంతేకాకుండా ఈ Motorola Edge 60 Stylus మొబైల్‌పై ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఏదైనా మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.20 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ బోనస్ను మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే.. కేవలం ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రూ.899లోపే పొందవచ్చు. అలాగే మరింత తగ్గింపు ధరకు పొందడానికి ఇతర ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Feb 27, 2026 08:31:20
Thanjavur, Tamil Nadu:

Tomorrow School Holiday: తమిళనాడులోని తంజావూరు జిల్లా విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా యంత్రాంగం తీపి కబురు అందించింది. తంజావూరు జిల్లాలో మాసిమాగం పండుగను పురస్కరించుకుని, జిల్లా కలెక్టర్ ప్రియాంక పంకజం మార్చి 2 (సోమవారం) నాడు స్థానిక సెలవు (లోకల్ హాలీడే) ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా మూడు రోజులు సెలవులు లభించనున్నాయి.

సెలవుల వివరాలు ఇవే..
ఫిబ్రవరి 28 నాడు శనివారం వారాంతపు సెలవు కావడం ఆ తర్వాత మార్చి 1న ఆదివారం వరుస సెలవులు రానున్నాయి. ఈ క్రమంలో మార్చి 2న స్థానిక జిల్లా యంత్రాంగం మాసిమాగం సందర్భంగా స్థానిక సెలవు ప్రకటించారు. 

అయితే ప్రస్తుతం పబ్లిక్ పరీక్షల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 12వ తరగతి (ఇంటర్మీడియట్) విద్యార్థులకు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. మార్చి 2న ప్రకటించిన ఈ సెలవును భర్తీ చేసేందుకు, మార్చి 14 (శనివారం) నాడు జిల్లావ్యాప్తంగా పనిదినంగా (వర్కింగ్ డే) ప్రకటించారు.

మార్చి నెలలో ఇతర ప్రభుత్వ సెలవులు..
తంజావూరు జిల్లాలోనే కాకుండా, సాధారణంగా మార్చి నెలలో మరికొన్ని ప్రభుత్వ సెలవులు కూడా ఉన్నాయి. మార్చి 3న మంగళవారం నాడు ఉగాది (తెలుగు నూతన సంవత్సరం), మార్చి 21 శనివారం రంజాన్.. మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా సెలవులు రానున్నాయి.

పరీక్షల సన్నద్ధత..
వరుస సెలవులు దొరకడంతో పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చదువుకోవడానికి ఈ మూడు రోజుల విరామం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు.

Also Read: India Vs West Indies Super 8: టీమ్ఇండియాకు వర్షం గండం? భారత్-వెస్టిండీస్ మ్యాచ్ రద్దయితే సెమీస్ చేరేది ఎవరు?

Also Read: Rashmika Movies After Marriage: 'మిసెస్ దేవరకొండ'గా రష్మిక కొత్త ప్రయాణం.. పెళ్లి తర్వాత వెండితెరకు గుడ్ బై చెప్పనుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 27, 2026 07:05:57
Hyderabad, Telangana:

India Vs West Indies Super 8 Scenarios: టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఆసన్నమైంది. పదేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ వేదికగా భారత్-వెస్టిండీస్ జట్లు తలపడబోతున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌ను కేవలం ఒక పోరుగా కాకుండా, 'వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌'గా పరిగణిస్తున్నారు. అయితే, ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం గ్రూప్-1లో సెమీఫైనల్ బెర్త్ కోసం తీవ్ర పోటీ నెలకొంది.

వెస్టిండీస్: 2 మ్యాచ్‌లు - 2 పాయింట్లు (NRR: +1.791)
భారత్: 2 మ్యాచ్‌లు - 2 పాయింట్లు (NRR: -0.100)

గెలిచిన జట్టు 4 పాయింట్లతో నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. కానీ మ్యాచ్ జరగకుండా నిలిచిపోతేనే అసలు సమస్య మొదలవుతుంది.

ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఐసీసీ నిబంధనల ప్రకారం.. సూపర్-8 దశలో ఏదైనా మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దయితే, రెండు జట్లకూ చెరో 1 పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు భారత్, వెస్టిండీస్ రెండూ తలా 3 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఈ స్థితిలో సెమీఫైనల్ విజేతను నెట్ రన్ రేట్ (NRR) ఆధారంగా నిర్ణయిస్తారు. 

ప్రస్తుత గణాంకాల ప్రకారం వెస్టిండీస్ (+1.791) భారత్ (-0.100) కంటే చాలా మెరుగైన స్థానంలో ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే, నెట్ రన్ రేట్ వెస్టిండీస్‌కు అనుకూలంగా ఉండటంతో వారు సెమీస్‌కు చేరుకుంటారు. భారత్ టోర్నీ నుండి నిష్క్రమించాల్సి వస్తుంది.

వాతావరణం ఎలా ఉండబోతోంది?
భారత అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం మార్చి 1న కోల్‌కతాలో వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆకాశం నిర్మలంగా ఉండి, మ్యాచ్ పూర్తిస్థాయిలో (20 ఓవర్లు) జరిగే అవకాశం మెండుగా కనిపిస్తోంది.

భారత్ ముందున్న సవాల్..
భారత్ ఈ మ్యాచ్‌లో కేవలం గెలవడమే కాదు, వెస్టిండీస్‌పై పైచేయి సాధించి గతంలో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలించే ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై భారత్ తన స్పిన్ మ్యాజిక్‌తో వెస్టిండీస్‌ను కట్టడి చేయగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: Rashmika Movies After Marriage: 'మిసెస్ దేవరకొండ'గా రష్మిక కొత్త ప్రయాణం.. పెళ్లి తర్వాత వెండితెరకు గుడ్ బై చెప్పనుందా?

Also Read: TTD Online Frauds: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక..వెలుగులోకి వచ్చిన భారీ మోసం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 27, 2026 06:43:14
Srikakulam, Andhra Pradesh:

Srikakulam Diarrhea Cases: 'డయేరియాతో శ్రీకాకుళంలో చనిపోయింది ఒక్కరే.- బయటకు మాత్రం ముగ్గురు చనిపోయారు అని ప్రచారం చేస్తున్నారు' అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రకటించారు. డయేరియా వస్తే పదులు సంఖ్యలో చనిపోతారని.. కానీ శ్రీకాకుళంలో మాత్రం అలా జరగలేదని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ వచ్చి కేవలం 10 రోజులే అయ్యింది. మున్సిపల్ కమిషనర్ ఉదయం 6 గంటల నుండి  పని ప్రారంభిస్తారు. ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్  తప్పులేదు' అని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.

Also Read: YSRCP MLCs Dharna: ఏపీ శాసనమండలిలో రచ్చరచ్చ.. తిరుమల వివాదంపై వైఎస్సార్‌సీపీ ధర్నా

ఏపీ అసెంబ్లీలో శ్రీకాకుళం డయేరియా వ్యాప్తిపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. 'సచివాలయ వ్యవస్థ చాలా గొప్పది. అయితే గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థని సక్రమంగా ఉపయోగించలేదు. ఉన్నత చదువులు చదివిన వారి నెత్తిన వాలంటీర్లు తీసుకొచ్చి పెట్టారు. సచివాలయ సిబ్బంది మొత్తాన్ని ఆఫీసులోనే కూర్చోబెట్టారు.సచివాలయ సిబ్బందికి మొత్తం గ్రామాల్లో ఉన్న సమస్యల మీద కనీస అవగాహన లేదు. వాళ్లు ఏం చేయాలో వాళ్లకే తెలియదు' అని ఎమ్మెల్యే శంకర్‌ పేర్కొన్నారు.

Also Read: Pension Hike: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో వరం.. త్వరలో పింఛన్ల పెంపు?

'శ్రీకాకుళం నియోజకవర్గంలోని అన్ని  సచివాలయాల సిబ్బందితో రివ్యూ మీటింగ్ పెట్టా. నేనడిగే ప్రశ్నలకు వాళ్లు నోరేళ్లపెట్టారు. ధర్మాన ప్రసాదరావు రోడ్లు ఇన్నేళ్లు రాజకీయం చేసి కనీసం రోడ్లు డ్రైనేజీలు కూడా చేపించలేకపోయాడు' అని విమర్శించారు. పనులు చేయకుండానే కొట్లాది రూపాయలు తన అనునాయలకు  అక్రమంగా కట్టబెట్టాడని ఆరోపించారు. 'మొన్న జరిగిన ఎన్నికల్లో నాకు 52,000 మెజారిటీ వచ్చింది. ఈసారి 70 వేల మెజారిటీతో వస్తుంది రాసి పెట్టుకోండి' అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ధీమా వ్యక్తం చేశారు. 'తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు లాగా.. నేను కూడా శాశ్వతంగా ఎమ్మెల్యేగా గెలిచేందుకు కష్టపడి ప్రజలకు సేవ చేస్తా' అని తెలిపారు. తనకు మంత్రి పదవి కన్నా... ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయడం సంతృప్తినిస్తుందని చెప్పారు.

Also Read: IND vs ZIM: చెపాక్‌లో భారత్ చేతిలో జింబాబ్వే చిత్తు.. టీ20 ప్రపంచకప్ సెమీస్‌ ఆశలు సజీవం

శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డయేరియా బారినపడి ముగ్గురు చనిపోయారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలు ఆస్పత్రుల బారిన పడుతున్నారు. డయేరియాతో చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. డయేరియా వ్యాప్తిపై సమీక్ష చేసి అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేశారు. అయితే డయేరియా వ్యాప్తిపై కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిలదీసింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం.. అలసత్వం కారణంగానే శ్రీకాకుళంలో డయేరియా పెరిగిపోయిందని.. వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 27, 2026 06:25:48
Hyderabad, Telangana:

Rashmika Cinema Career After Marriage: నేషనల్ క్రష్ రష్మిక మందన్న జీవితంలో ఒక అందమైన మలుపు చోటుచేసుకుంది. 'కుమారి' నుంచి 'శ్రీమతి'గా మారి, మిసెస్ దేవరకొండగా కొత్త చాప్టర్ ప్రారంభించిన ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఆనందంతో పాటు అభిమానుల మదిలో ఒకే ప్రశ్న మెదులుతోంది.. "పెళ్లి తర్వాత రష్మిక మళ్ళీ ముఖానికి రంగు వేసుకుంటుందా?" అనే ప్రశ్న అందరిలోనూ కలిగింది.

ప్రస్తుతం చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు
రష్మిక ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉంది. ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే, ఆమె సినిమాలకు అంత సులభంగా దూరం కాదని స్పష్టమవుతోంది.

తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా 'రణబాలి'. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో చేస్తున్న 'మైసా' పాన్-ఇండియా యాక్షన్ మూవీలో రష్మిక ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌తో కలిసి 'కాక్ టైల్ 2' రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తుంది.

మారిన ట్రెండ్.. మారిన ఆలోచనలు
ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్లైతే కెరీర్ ముగిసినట్లే అనే భావన ఉండేది. కానీ నేడు సమంత, నయనతార, ఆలియా భట్ వంటి వారు పెళ్లి తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నారు. రష్మికకు ఉన్న డెడికేషన్ మరియు పాన్-ఇండియా లెవల్లో ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా, ఆమె కెరీర్ ఇప్పుడప్పుడే ముగిసే అవకాశం లేదు.

సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రష్మిక పెళ్లి తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇకపై వచ్చిన ప్రతి సినిమా చేయకుండా, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న, తన ఇమేజ్‌కు సరిపోయే సెలెక్టివ్ కథలను మాత్రమే ఎంచుకోవచ్చు. కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని నెలల పాటు షూటింగ్‌లకు విరామం ఇచ్చే అవకాశం ఉంది. పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ మునుపటి కంటే మరింత ఉత్సాహంగా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.

రష్మిక మందన్న కేవలం ఒక గ్లామర్ డాల్ మాత్రమే కాదు, అద్భుతమైన నటి కూడా. అందుకే ఆమె అభిమానులు తనను మళ్లీ వెండితెరపై చూడాలని కోరుకుంటున్నారు. బహుశా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నా, రష్మిక తన నటనతో మనల్ని అలరించడానికి మళ్లీ రావడం ఖాయంగా కనిపిస్తుంది!

Also Read: Attack On Somu Veerraju: ఏపీ శాసన మండలిలో రసాభాస..BJP ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి దాడికి వైసీపీ సభ్యుల యత్నం!

Also REad: IND Vs ZIM Playing 11: జింబాబ్వేతో నేడు చావోరేవో..స్టార్ బ్యాటర్ స్థానంలో సంజూకి చోటు?! టీమ్ఇండియా తుదిజట్టు ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 27, 2026 06:22:40
Velgapudi, Andhra Pradesh:

YSRCP MLCs Protest: రాజకీయ వివాదం సృష్టించేందుకు తెర మీదకు తీసుకువచ్చిన తిరుమల లడ్డూ వివాదంపై చర్చించాల్సిందేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై సభలో చర్చించాలని వైఎస్సార్‌సీపీ కోరుతోంది. ఇదే డిమాండ్‌పై సభ లోపల.. బయట నిరవధిక నిరసన చేస్తోంది. శుక్రవారం కూడా చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. దీంతో శాసనమండలిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Also Read: Pension Hike: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో వరం.. త్వరలో పింఛన్ల పెంపు?

శాసన మండలిలో జరిగిన  వ్యవహారంపై  చైర్మన్ మోషేన్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో తిరుమల లడ్డు అంశం పై చర్చ కొనసాగించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగించారు. వీరి ఆందోళనతో శాసనమండలి వాయిదా వేసినా కూడా మండలి చైర్మన్ పోడియం వద్ద వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Also Read: IND vs ZIM: చెపాక్‌లో భారత్ చేతిలో జింబాబ్వే చిత్తు.. టీ20 ప్రపంచకప్ సెమీస్‌ ఆశలు సజీవం

ఎట్టి పరిస్థితుల్లో సభలో  లడ్డు వ్యవహారంపై చర్చ కొనసాగించాలని డిమాండ్ చేశారు. మండలిలో లడ్డూపై చర్చ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు రోడ్డుపై బైఠాయింపు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ' తిరుపతి లడ్డూ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరగాలి.  కల్తీ నెయ్యి సరఫరాలో హెరిటేజ్  పాత్రపై అనుమానాలు ఉన్నాయి. - నెయ్యి సరఫరా వివరాలు బయట పెట్టాలి' అని డిమాండ్ చేశారు. 'మా  దగ్గర ఆధారాలు ఉన్నాయి. శాసనమండలిలో చర్చకు సిద్ధమని ప్రకటించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం తప్పించుకుంటోంది. అవసరమైతే న్యాయ విచారణకు సిద్ధం. హెరిటేజ్ సంస్థపై సమగ్ర దర్యాప్తు జరపాలి' అని ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌ కోరారు.

Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్‌.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. 'ఇందాపూర్ హెరిటేజ్ సంబంధాలపై చర్చ కోరుతూ పోరాటం చేస్తున్నాం. 23న జరిగిన బీఏసీ సమావేశంలో లడ్డుపై చర్చకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ శాసనమండలిలో ప్రకటన చేసి ప్రభుత్వం పారిపోతుంది. ఇందాపూర్ నిజాలు బయటపడతాయనే భయం ప్రభుత్వానికి ఉంది. లడ్డు అంశంపై ప్రభుత్వం వెనక్కి ఎందుకు తగ్గింది?' అని ప్రశ్నించారు. 'భక్తుల భావోద్వేగాలకు సంబంధించిన విషయంపై స్పష్టత లేదు. నిజాలు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ లడ్డు అంశంపై చర్చ జరిపే వరకు పోరాటం చేస్తాం' అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 27, 2026 05:32:42
Hyderabad, Telangana:

Telangana Pension Hike: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలతోపాటు 420 హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి రెండున్నరేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు అరకొరగా అమలు చేస్తోంది. వాటిలో మహిళలకు ఇచ్చిన హామీలు అసలుకే అమలు కావడం లేదు. హామీలు అమలు చేయకపోవడంతో దాని ప్రభావం ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రజలు స్పష్టమైన తీర్పునివ్వకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి హామీలు అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పింఛన్‌లు పెంచబోతున్నట్లు సమాచారం.

Also Read: IND vs ZIM: చెపాక్‌లో భారత్ చేతిలో జింబాబ్వే చిత్తు.. టీ20 ప్రపంచకప్ సెమీస్‌ ఆశలు సజీవం

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆసరా పెన్షన్లను రూ.2 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని రెండున్నరేళ్లలో అమలు చేయలేదు. ఇప్పుడు ఆ పింఛన్‌ల పెంపును కొంత పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రూ.500 పింఛన్‌ పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఇస్తున్న రూ.2,016 పెన్షన్‌ను రూ. 2,516కు పెంచే అవకాశం ఉంది.

Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్‌.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

పింఛన్ల పెంపుపై మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పెంచిన పెన్షన్లు ఏప్రిల్ లేదా మే నెల నుంచి పింఛన్‌దారుల ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని రూ.4,000 వరకు పెంచాల్సి ఉండగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం దశలవారీగా పెంచాలని భావిస్తోంది. ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఏకమొత్తంలో కాకుండా యేటా రూ.500 చొప్పున పెంచుకుంటూ వెళ్లాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించుకుంది.

Also Read: Cardiac Arrest: తొమ్మిదేళ్ల బాలికకు గుండెపోటు.. పాఠశాలలో కుప్పకూలి హఠాన్మరణం

కొత్త పెన్షన్లు
రాష్ట్రంలో ప్రస్తుతం 42.7 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరో 5 నుంచి 10 లక్షల మందికి కూడా పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంది. కొత్త పింఛన్ల జారీ ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఆర్థిక భారం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.4 వేలకు పింఛన్లను పెంచితే ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుంది. దీంతో పెన్షన్లను రూ.500 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించగా.. దీనివలన ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని ఆర్థిక శాఖ లెక్కలు వేస్తోంది.

అకస్మాత్తుగా పింఛన్‌ పెంచాలని నిర్ణయించడం వెనుక రాజకీయ కారణం ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుంటే పరువు పోతుందని భావించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆసరా ఫించన్ల పెంపును ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని చూస్తోంది.

ఇప్పటికే చర్చలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో సంక్షేమ రంగానికి, ముఖ్యంగా విద్యా, వైద్యంతో పాటు ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం పెద్దపీట వేయబోతోంది. ఇప్పటికే అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారని, మంత్రివర్గం‌లో కూడా దీనిపై ప్రాథమిక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.4,016 పెన్షన్‌ను కూడా దశలవారీగా పెంచే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 27, 2026 04:02:26
Hyderabad, Telangana:

Mercury And Venus Transit Effect On Zodiac Telugu: ఫిబ్రవరి నెల కంటే మార్చి నెల మరింత ప్రత్యేకమైనదిగా భావించవచ్చు ఎందుకంటే ఈ సమయంలో బుధుడితో పాటు శుక్రుడి శక్తివంతమైన కలయిక జరుగుతుంది. కాబట్టి ఈ నెలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మార్చి 15వ తేదీ తెల్లవారుజామున 12 గంటల సమయంలో బుధుడు, శుక్రుడు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన దృష్టి రాజయోగం ఏర్పడుతుంది. 

తెలివితేటలు, వ్యాపారం, వాక్కుకు, అధిపతి అయిన బుధుడు.. ప్రేమ, సంపద, శ్రేయస్సుకు అధిపతి అయిన శుక్రుడి కలయికతో కొన్ని రాశులు ప్రభావితమవుతాయి. ముఖ్యంగా ఈ రాశుల వారికి జీవితంపై సానుకూలమైన ప్రభావం పడుతుంది. ఆర్థికంగా లాభాలు కలగడమే కాకుండా కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక హోదా కూడా మెరుగుపడుతుంది. దీంతోపాటు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్!
వృషభ రాశి 
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు స్థానికంగా కొత్త లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఏర్పడిన యోగ ప్రభావం వల్ల వీరికి సృజనాత్మకత పెరుగుతుంది ముఖ్యంగా కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. సాహిత్య, మీడియా రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన విజయాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరు భారీ మొత్తంలో ఆదాయ వనరులు కూడా పొందగలుగుతారు.

మిథున రాశి 
మిథున రాశి వారికి సంభాషణలో మాధుర్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాలతో పాటు ఉద్యోగాల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడి.. జీవితంలో అద్భుతమైన లాభాలు పొందుతారు.

కన్యారాశి 
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా వ్యాపారాల్లో పెద్ద పెద్దగా లాభాలు రావడం ప్రారంభమౌతాయి. ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా పాత అప్పుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. అలాగే కుటుంబ వాతావరణంలో అందం కూడా రెడ్డి అవుతుంది. ఈ సమయంలో హోదా కూడా పెరుగుతుంది.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా ఎన్నో రకాల అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రేమ సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 27, 2026 03:49:35
Hyderabad, Telangana:

Jupiter Right Path Effect On Zodiac News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహాన్ని అత్యంత శుభప్రదమైన గ్రహాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. దీనిని నానంతో పాటు సంపద పిల్లలు వివాహం అదృష్టానికి సూచికగా పరిగణిస్తారు. ప్రస్తుతం బృహస్పతి మిథున రాశిలో తిరోగమన దశలో ఉన్నాడు. ఈ గ్రహం తీరోగమనంలో ఉంటే దాదాపు సంవత్సరం అదే దశలో కొనసాగుతూ ఉంటుంది. అలాంటిది మార్చి 11వ తేదీన ఉదయం పూట ఎనిమిది గంటల సమయంలో మిధున రాశిలో సక్రమ మార్గంలోకి రాబోతోంది. ఈ గ్రహం సక్రమ మార్గంలోకి రావడం వల్ల మళ్లీ అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి కెరీర్ తో పాటు వ్యాపారాలపరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కూడా తొలగిపోయి.. భారీ మొత్తంలో లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. 

ఈ రాశులవారికి ఊహించని ప్రయోజనాలు:
మేషరాశి 
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది. ముఖ్యంగా పనుల్లో కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా.. పదోన్నతులు కూడా పొందే అవకాశాలు. వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా మారుతాయి.  పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అలాగే విశ్వాసం కూడా విపరీతంగా పెరిగి.. అనుకోని అద్భుతమైన లాభాలు పొందుతారు.

వృషభ రాశి 
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో మంచి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. ఆర్థికంగా భారీ మొత్తంలో లాభాలు పండగలుగుతారు. దీంతోపాటు ఉపాధిలో పురోగతి కూడా కనిపిస్తుంది. ఇంట్లో కూడా విపరీతమైన శాంతి నెలకొంటుంది. చదువులపై విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారు కొత్త స్కిల్స్ కూడా నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. వెడ్డింగ్ లో ఉన్న పనులు కూడా క్రమంగా పూర్తవుతాయి. 

కన్య రాశి 
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు కెరీర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు రావడం ప్రారంభమౌతాయి. పనుల్లో విజయాలు సాధించడమే కాకుండా మానసికంగా ఆనందాన్ని పొందుతారు. వ్యాపారాల్లో కూడా లాభాలు పొందగలిగే అవకాశాలున్నాయి. ఆధ్వర్యంలో సంబంధాలు మెరుగుపడడమే కాకుండా కుటుంబంలో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. పాత అసంపూర్ణ పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా బృహస్పతి సంచారం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ముఖ్యంగా కష్టపడి పనులు చేయడం వల్ల సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు రెండు లాభసాటిగా మారుతాయి. సామాజికంగా కీర్తి, ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ సపోర్టుతో ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. వృత్తి సంబంధిత నిర్ణయాలు కూడా తీసుకొని.. ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.

మీన రాశి 
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అన్ని రకాల సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు సాగుతాయి. పనుల్లో పదోన్నతులు లభించడమే కాకుండా వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా శ్రేయస్సు కూడా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడి.. విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో చదువుల్లో బాగా రాణించగలుగుతారు.. దీంతోపాటు  జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 26, 2026 17:54:28
Hyderabad, Telangana:

Govt Employees Salary Cut: 'అధికారులు అయ్యాక బాధ్యత మరిచిపోయి మనిషిగా పతనం కావద్దు.. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే బాధ్యత మీదేనని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరేనని ప్రకటించారు. 'నేను మెకానికల్‌గా మిమ్మల్ని కలవలేదు.. ఎమోషనల్, అటాచ్‌మెంట్‌తో కలిశా. కార్యాలయానికి వెళ్లేముందు ఎస్ఆర్ శంకరన్‌ను తలచుకోవాలి' అని రేవంత్‌ రెడ్డి సూచించారు. పేదవారికి సాయం చేసేముందు తల్లితండ్రులను గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేశారు. 'తల్లితండ్రులను గౌరవించాలి. తల్లితండ్రులను పట్టించుకోని వాళ్ల జీతంలో 10 నుంచి 15 శాతం కోత పెట్టేలా అసెంబ్లీలో చట్టం చేయబోతున్నాం' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Also Read: IND vs ZIM: చెపాక్‌లో భారత్ చేతిలో జింబాబ్వే చిత్తు.. టీ20 ప్రపంచకప్ సెమీస్‌ ఆశలు సజీవం

గ్రూప్ 1, గ్రూప్ 2 నూతన అధికారుల శిక్షణా కార్యక్రమం ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. శిక్షణను విజయవంతం గా పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలిపిన అనంతరం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'ప్రజా పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సేవలు అందించబోతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని అంగీకరించరు. రాంజీ గోండు, కొమరం భీం రాజ్యాల కోసం పోరాటం చేయలేదు.. ఆధిపత్యం చలాయిస్తున్న వారిపై తిరుగుబాటు చేశారు. కాకతీయ సామ్రాజ్యంపై సమ్మక్క సారలమ్మ తిరుగుబాటు చేశారు. అందుకే వారు వనదేవతలుగా గౌరవించబడుతున్నారు' అని రేవంత్ రెడ్డి వివరించారు.

Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్‌.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సమాన అవకాశాల కోసం వారు అమరవీరులయ్యారని రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. అధికారులుగా బాధ్యతలు సేకరిస్తున్న మీరు ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల స్ఫూర్తి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. '6 లక్షల మంది పోటీపడితే 582 మంది గ్రూప్ 1,775 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారు. 15 ఏళ్ల పాటు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మే గ్రూప్ 1 నిర్వహించి ఆకాంక్షలను నెరవేర్చింది' అని తెలంగాణ సీఎం వివరించారు.

'టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేశాం. గ్రూప్ పరీక్షలపై అవగాహన ఉన్న వారిని చైర్మన్‌గా, సభ్యులుగా నియమించాం. ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్‌లలో అమ్మేందుకు అవకాశం లేకుండా చేశాం. గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన ఆనందం 24 గంటలు లేకుండా గిట్టని వాళ్లు కోర్టుకు వెళ్లారు. అభ్యర్థులు ఒక్క తప్పు చేయలేదు.. మెరిట్ మీద ఎంపిక అయ్యారని ప్రభుత్వం భావించి సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొట్లాడింది' అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 26, 2026 17:15:35
Chennai, Tamil Nadu:

India vs Zimbabwe Highlights: టీ 20 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియా దక్షిణాఫ్రికా రూపంలో ఎదురుదెబ్బ ఎదురవగా.. ఓటమి నుంచి గొప్పగా పుంజుకుని ఆడి జింబాబ్వేను చిత్తు చేసింది. భారీ పరుగులు సాధించిన భారత బ్యాటర్లు.. అనంతరం అదే స్థాయిలో బౌలర్లు రెచ్చిపోవడంతో జింబాబ్వే 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో జరిగిన సూపర్‌ 8 రెండో మ్యాచ్‌లో భారత్‌ అద్భుతంగా ఆడి సెమీస్‌లో ముందడుగు వేసింది.

చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఓపెనర్లు, మిడిలార్డర్‌ బ్యాటర్లు రాణించడంతో భారత్‌ భారీ స్కోర్‌ నమోదు చేసింది. డకౌట్ల గండాన్ని అధిరోహించిన అభిషేక్‌ శర్మ ఈ మ్యాచ్‌లో 30 బంతులకు 55 పరుగులు చేసి రాణించాడు. హార్దిక్‌ పాండ్యా 23 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసి నాటౌట్‌గా నిలిచాడు. సంజూ శామ్‌సన్‌ 24 స్కోర్‌తో పర్వాలేదనిపించగా.. ఇషాన్‌ కిషన్‌ (38), సూర్యకుమార్‌ యాదవ్‌ 33 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరులో తిలక్‌ వర్మ 44 పరుగులు ఆడి అదరగొట్టాడు. భారత బ్యాటింగ్‌ దళాన్ని జింబాబ్వే దెబ్బతీయలేకపోయింది. అతి కష్టంగా నాలుగు వికెట్లు తీసింది. రిచర్డ్‌ నరావా, బ్లెస్సింగ్‌ ముజరాబని, టినోటెండా మపోసా, సికిందర్‌ రజా తలా ఒక్కో వికెట్‌ తీశారు.

భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన జింబాబ్వే తడబడింది. సూపర్‌ 8 తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను భారీ తేడాతో ఓడించిన జింబాబ్వే బ్యాటర్లు ఎంతో ఉత్సాహంతో గ్రౌండ్‌లోకి దిగగా భారత బౌలర్ల దాడిని తట్టుకోలేకపోయారు. ఓపెనర్‌ బ్రియాన్‌ బెనెట్‌ అద్భుతమైన పోరాటం చేసినా మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో జట్టు ఓటమిని చవిచూసింది. రియాన్‌ బర్ల్‌ డకౌట్‌ కాగా.. డియాన్‌ మేర్స్‌ 6 పరుగులు చేశాడు. మరుమణి (2), కెప్టెన్‌ సికిందర్‌ రజా 31 పరుగులతో పర్వాలేదనిపించాడు. పవర్‌ ప్లే నుంచి పరుగులు తీయడానికి జింబాబ్వే బ్యాటర్లు కష్టపడ్డారు. భారత బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీయకపోయినా పరుగులను మాత్రం భారీగా నియంత్రించారు.

అద్భుతం చేసిన బౌలర్లు
జట్టును సెమీస్‌లో నిలిపేందుకు బ్యాటర్లు తమ వంతు కృషి చేయగా.. బౌలర్లు కూడా అదే స్థాయిలో అద్భుతం చేశారు. ఒక్క శివమ్‌ దూబే మినహా మిగతా బౌలర్లందరూ పరుగులు ఇవ్వలేదు. బ్యాటర్‌ను ఏమాత్రం ఊపిరి పీల్చుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేశారు. వికెట్లు వెంట వెంటనే తీయకున్నా పవర్‌ ప్లే నుంచి పరుగులను నియంత్రించారు. హర్ష్‌ దీప్‌ మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించగా.. వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే తలా ఒక్కో వికెట్‌ తీశారు.

0
comment0
Report
HDHarish Darla
Feb 26, 2026 16:05:30
Hyderabad, Telangana:

Traffic Diversions Hyderabad: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, ముగ్ధ జంక్షన్ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 27 (శుక్రవారం) నుండి బంజారాహిల్స్ రోడ్ నెం.2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. ఫలితంగా ఈ మార్గాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున, పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
NFCL నుండి జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వారు.. సాగర్ సొసైటీ (ముగ్ధ) వద్ద రద్దీగా ఉంటే.. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, రోడ్ నెం.5, వెంకటగిరి ఎక్స్ రోడ్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు.

రోడ్ నెం.36 & 45 నుండి పంజాగుట్ట వైపు వెళ్లే వారు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి వెంకటగిరి రోడ్ నెం.2, యూసుఫ్ గూడ బస్తీ, మైత్రీవనం మీదుగా అమీర్‌పేట్ వైపు వెళ్లడం ఉత్తమం.

రోడ్ నెం.1 (KCP) నుండి వచ్చేవారు.. కేబీఆర్ పార్క్ వైపు వెళ్లకుండా రోడ్ నెం.10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ గుండా రోడ్ నెం.45 వైపు వెళ్లవచ్చు.

మాసబ్ ట్యాంక్ నుండి వచ్చేవారు: విరించి హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్లవచ్చు.

వాహనదారులకు ముఖ్య సూచనలు..
సాధ్యమైనంత వరకు ఉదయం 8:30 – 11:00, సాయంత్రం 5:00 – 9:00 మధ్య ఈ మార్గాల్లో ప్రయాణాలను వాయిదా వేసుకోండి. తాజా ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం Google Maps వంటి నావిగేషన్ యాప్స్ తప్పనిసరిగా వాడండి. నిర్మాణ పనుల దృష్ట్యా భారీ వాహనాలకు రద్దీ సమయాల్లో ఈ మార్గాల్లో అనుమతి ఉండదు. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను గమనిస్తూ వారికి సహకరించండి.

అత్యవసర సమాచారం కోసం..
ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయండి లేదా సోషల్ మీడియా వేదికలు @HYDTP ద్వారా అప్‌డేట్స్ పొందండి. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పనులకు పౌరులందరూ సహకరించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) కోరారు.

Also Read: Attack On Somu Veerraju: ఏపీ శాసన మండలిలో రసాభాస..BJP ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి దాడికి వైసీపీ సభ్యుల యత్నం!

Also REad: TTD Online Frauds: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక..వెలుగులోకి వచ్చిన భారీ మోసం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 26, 2026 13:57:49
Velgapudi, Andhra Pradesh:

TDP MLA MS Raju: 'హిందూ మత ఆచారాలు, సాంప్రదాయాలు, భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి ముందు నుంచి ఆనవాయితిగా వస్తోంది. నిన్నటి రోజు పులివెందుల నందిపల్లి గ్రామంలో నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకానికి వెళ్లిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అక్కడ పూజారి  ఇచ్చిన తీర్థాన్ని స్వీకరించకుండా కిందికి వదిలేశారు' అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. 'గోత్ర నామాలు చెప్పకుండా అవహేళన చేయడం, అగ్నిగుండంలోకి వేయాల్సిన వస్తువుల్ని తిరిగి మళ్లీ పూజారికి ఇవ్వడం. ఇవన్నీ భగవంతుడి మీద ఎటువంటి భక్తి లేదనడానికి వైఎస్‌ జగన్‌ తీరు నిదర్శనం' అని విమర్శించారు.

అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ' ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా టీటీడీలో ఏ రోజు పట్టువస్త్రాలు కుటుంబ సమేతంగా ఇవ్వలేదు. ఐదేళ్ల కాలంలో దాదాపు 2000 ఆలయాల మీద దాడులు జరగడం, అడుగడుగునా హిందుత్వాన్ని, హిందూ మతాన్ని హేళన చేస్తూ వ్యవహరించారు. నిన్న పులివెందులలో ప్రపంచం మొత్తం లైవ్‌లో చూస్తుండగా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి మహా పాపం చేశారు' అని ఆరోపించారు.

కచ్చితంగా ఆ దేవ దేవుడు వైఎస్‌ జగన్‌కు శిక్ష విధిస్తాడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శాపించారు. 'వైఎస్సార్‌సీపీ హయాలో హిందూ మతం మీద గౌరవం లేనటువంటి వ్యక్తుల్ని, హిందూ మత విశ్వాసాల మీద, వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసం లేనటువంటి వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్‌గా నియమించారు. టీటీడీ అప్రతిష్ట పాలు కావడానికి వైఎస్‌ జగన్ ఎంతటి కారణమో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకి, వెంకటేశ్వర స్వామికి తెలుసు' అని తెలిపారు 'హిందూ మతం మీద ఒక కక్షపూరిత వైఖరితో వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. జగన్‌కు నిజంగా భగవంతుడి మీద నమ్మకం, గౌరవం లేనప్పుడు గుడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది?' అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రశ్నించారు. హిందువుల మత ఆచారాల్ని అగౌరవపరిచేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని.. ఇప్పటికైనా మాజీ సీఎం వైఎస్‌ జగన్ తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RGRenuka Godugu
Feb 26, 2026 13:07:07
Hyderabad, Telangana:

eKYC Mandatory Before March 31 Details: మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేవిధంగా ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అయితే మీకు కూడా గ్యాస్ సబ్సిడీ వచ్చినట్లయితే దానికి మీరు ఒక విషయం ముందుగా తెలుసుకోండి. మార్చి 31 లోపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకోలేని వారికి గ్యాస్ సబ్సిడీ ఆగిపోయే ఛాన్స్ ఉంది. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మీ ఫోన్లో ఆయిల్ కంపెనీ యాప్ ద్వారా మీరు సులభంగా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీనికి ఆధారం ఫేస్ RD యాప్ సహాయంతో ఇంటి నుంచే కేవైసీ చేసుకోండి. ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రక్రియ ఎంతో సులభంగా జరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే 18002333555 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి, లేకపోతే మీ డిస్ట్రిబ్యూటర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 

గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఆఫీస్‌..
 ఇది ఇండియన్ ఆయిల్, హెచ్ పీ, భారత్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు వర్తిస్తుంది. ఈ కేవైసీ అంటే బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. లేకపోతే మీ దగ్గరలో ఉన్న మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ వెళ్లి కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జీలు కూడా వసూలు చేయరు. 

అధికారిక వెబ్‌సైట్‌...
 ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి మీరు అధికారిక
https://pmuy.gov.in/e-kyc.html . వెబ్‌సైట్ కూడా ఉంది. ఇందులో వివరాలు చెక్ చేయవచ్చు. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం 9 సిలిండర్లకు గ్యాస్ సబ్సిడీ అందిస్తుంది. మార్చి 31వ తేదీ లోపు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే రిఫండ్ వస్తుంది. లేకపోతే శాశ్వతంగా సబ్సిడీ రద్దు అయ్యే అవకాశం ఉంది.

 ఇక మార్చి 1వ తేదీ గ్యాస్ ధరల సవరణ జరుగుతుంది. ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్‌ కంపెనీలు గ్యాస్ ఆయిల్ ధరలు సవరణ చేస్తూ ఉంటాయి. గత ఐదేళ్లుగా చూస్తే డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం LPG గ్యాస్ సిలిండర్ ద్వారా ఢిల్లీలో రూ.853, ముంబై రూ. 852, చెన్నై రూ. 868 ఉంది అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర గత ఐదేళ్లలో పోలిస్తే కేవలం మూడుసార్లు మాత్రమే సవరించారు.

ఇక హైదరాబాదులో ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ద్వారా 14.2 కేజీలు రూ. 905 ఉంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 19 కేజీలు మాత్రం రూ. 1961 ఉంది. గత కొన్ని నెలలతో పోలిస్తే పెద్దగా ఎలాంటి ధరల మార్పు జరగలేదు . ఇక అర్హులైన వారికి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లభిస్తుంది. నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు రిఫండ్ చేస్తుంది ప్రభుత్వం.

Also Read:​   రైలు ప్రయాణీకులు బిగ్‌ అలెర్ట్‌.. మార్చి 1 నుంచి మారనున్న రూల్స్‌, తెలుసుకోకపోతే మీకే నష్టం..!

Also Read:​  టోల్ గేట్ ముందు టెన్షన్ వద్దు.. 30 సెకన్లలో FASTag బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top