Mercury And Venus Transit Effect On Zodiac Telugu: ఫిబ్రవరి నెల కంటే మార్చి నెల మరింత ప్రత్యేకమైనదిగా భావించవచ్చు ఎందుకంటే ఈ సమయంలో బుధుడితో పాటు శుక్రుడి శక్తివంతమైన కలయిక జరుగుతుంది. కాబట్టి ఈ నెలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మార్చి 15వ తేదీ తెల్లవారుజామున 12 గంటల సమయంలో బుధుడు, శుక్రుడు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన దృష్టి రాజయోగం ఏర్పడుతుంది.
తెలివితేటలు, వ్యాపారం, వాక్కుకు, అధిపతి అయిన బుధుడు.. ప్రేమ, సంపద, శ్రేయస్సుకు అధిపతి అయిన శుక్రుడి కలయికతో కొన్ని రాశులు ప్రభావితమవుతాయి. ముఖ్యంగా ఈ రాశుల వారికి జీవితంపై సానుకూలమైన ప్రభావం పడుతుంది. ఆర్థికంగా లాభాలు కలగడమే కాకుండా కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక హోదా కూడా మెరుగుపడుతుంది. దీంతోపాటు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్!
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు స్థానికంగా కొత్త లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఏర్పడిన యోగ ప్రభావం వల్ల వీరికి సృజనాత్మకత పెరుగుతుంది ముఖ్యంగా కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. సాహిత్య, మీడియా రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన విజయాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరు భారీ మొత్తంలో ఆదాయ వనరులు కూడా పొందగలుగుతారు.
మిథున రాశి
మిథున రాశి వారికి సంభాషణలో మాధుర్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాలతో పాటు ఉద్యోగాల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడి.. జీవితంలో అద్భుతమైన లాభాలు పొందుతారు.
కన్యారాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా వ్యాపారాల్లో పెద్ద పెద్దగా లాభాలు రావడం ప్రారంభమౌతాయి. ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా పాత అప్పుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. అలాగే కుటుంబ వాతావరణంలో అందం కూడా రెడ్డి అవుతుంది. ఈ సమయంలో హోదా కూడా పెరుగుతుంది.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా ఎన్నో రకాల అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రేమ సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Telangana Pension Hike: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతోపాటు 420 హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి రెండున్నరేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు అరకొరగా అమలు చేస్తోంది. వాటిలో మహిళలకు ఇచ్చిన హామీలు అసలుకే అమలు కావడం లేదు. హామీలు అమలు చేయకపోవడంతో దాని ప్రభావం ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రజలు స్పష్టమైన తీర్పునివ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి హామీలు అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పింఛన్‌లు పెంచబోతున్నట్లు సమాచారం.
Also Read: IND vs ZIM: చెపాక్‌లో భారత్ చేతిలో జింబాబ్వే చిత్తు.. టీ20 ప్రపంచకప్ సెమీస్ ఆశలు సజీవం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్లను రూ.2 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని రెండున్నరేళ్లలో అమలు చేయలేదు. ఇప్పుడు ఆ పింఛన్‌ల పెంపును కొంత పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రూ.500 పింఛన్ పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఇస్తున్న రూ.2,016 పెన్షన్‌ను రూ. 2,516కు పెంచే అవకాశం ఉంది.
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
పింఛన్ల పెంపుపై మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పెంచిన పెన్షన్లు ఏప్రిల్ లేదా మే నెల నుంచి పింఛన్‌దారుల ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని రూ.4,000 వరకు పెంచాల్సి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దశలవారీగా పెంచాలని భావిస్తోంది. ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఏకమొత్తంలో కాకుండా యేటా రూ.500 చొప్పున పెంచుకుంటూ వెళ్లాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించుకుంది.
Also Read: Cardiac Arrest: తొమ్మిదేళ్ల బాలికకు గుండెపోటు.. పాఠశాలలో కుప్పకూలి హఠాన్మరణం
కొత్త పెన్షన్లు
రాష్ట్రంలో ప్రస్తుతం 42.7 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరో 5 నుంచి 10 లక్షల మందికి కూడా పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంది. కొత్త పింఛన్ల జారీ ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఆర్థిక భారం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.4 వేలకు పింఛన్లను పెంచితే ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుంది. దీంతో పెన్షన్లను రూ.500 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించగా.. దీనివలన ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని ఆర్థిక శాఖ లెక్కలు వేస్తోంది.
అకస్మాత్తుగా పింఛన్ పెంచాలని నిర్ణయించడం వెనుక రాజకీయ కారణం ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుంటే పరువు పోతుందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆసరా ఫించన్ల పెంపును ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని చూస్తోంది.
ఇప్పటికే చర్చలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో సంక్షేమ రంగానికి, ముఖ్యంగా విద్యా, వైద్యంతో పాటు ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం పెద్దపీట వేయబోతోంది. ఇప్పటికే అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారని, మంత్రివర్గంలో కూడా దీనిపై ప్రాథమిక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.4,016 పెన్షన్‌ను కూడా దశలవారీగా పెంచే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jupiter Right Path Effect On Zodiac News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహాన్ని అత్యంత శుభప్రదమైన గ్రహాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. దీనిని నానంతో పాటు సంపద పిల్లలు వివాహం అదృష్టానికి సూచికగా పరిగణిస్తారు. ప్రస్తుతం బృహస్పతి మిథున రాశిలో తిరోగమన దశలో ఉన్నాడు. ఈ గ్రహం తీరోగమనంలో ఉంటే దాదాపు సంవత్సరం అదే దశలో కొనసాగుతూ ఉంటుంది. అలాంటిది మార్చి 11వ తేదీన ఉదయం పూట ఎనిమిది గంటల సమయంలో మిధున రాశిలో సక్రమ మార్గంలోకి రాబోతోంది. ఈ గ్రహం సక్రమ మార్గంలోకి రావడం వల్ల మళ్లీ అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి కెరీర్ తో పాటు వ్యాపారాలపరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కూడా తొలగిపోయి.. భారీ మొత్తంలో లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.
ఈ రాశులవారికి ఊహించని ప్రయోజనాలు:
మేషరాశి
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది. ముఖ్యంగా పనుల్లో కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా.. పదోన్నతులు కూడా పొందే అవకాశాలు. వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా మారుతాయి. పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అలాగే విశ్వాసం కూడా విపరీతంగా పెరిగి.. అనుకోని అద్భుతమైన లాభాలు పొందుతారు.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో మంచి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. ఆర్థికంగా భారీ మొత్తంలో లాభాలు పండగలుగుతారు. దీంతోపాటు ఉపాధిలో పురోగతి కూడా కనిపిస్తుంది. ఇంట్లో కూడా విపరీతమైన శాంతి నెలకొంటుంది. చదువులపై విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారు కొత్త స్కిల్స్ కూడా నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. వెడ్డింగ్ లో ఉన్న పనులు కూడా క్రమంగా పూర్తవుతాయి.
కన్య రాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు కెరీర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు రావడం ప్రారంభమౌతాయి. పనుల్లో విజయాలు సాధించడమే కాకుండా మానసికంగా ఆనందాన్ని పొందుతారు. వ్యాపారాల్లో కూడా లాభాలు పొందగలిగే అవకాశాలున్నాయి. ఆధ్వర్యంలో సంబంధాలు మెరుగుపడడమే కాకుండా కుటుంబంలో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. పాత అసంపూర్ణ పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా బృహస్పతి సంచారం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ముఖ్యంగా కష్టపడి పనులు చేయడం వల్ల సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు రెండు లాభసాటిగా మారుతాయి. సామాజికంగా కీర్తి, ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ సపోర్టుతో ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. వృత్తి సంబంధిత నిర్ణయాలు కూడా తీసుకొని.. ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
మీన రాశి
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అన్ని రకాల సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు సాగుతాయి. పనుల్లో పదోన్నతులు లభించడమే కాకుండా వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా శ్రేయస్సు కూడా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడి.. విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో చదువుల్లో బాగా రాణించగలుగుతారు.. దీంతోపాటు జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees Salary Cut: 'అధికారులు అయ్యాక బాధ్యత మరిచిపోయి మనిషిగా పతనం కావద్దు.. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే బాధ్యత మీదేనని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరేనని ప్రకటించారు. 'నేను మెకానికల్‌గా మిమ్మల్ని కలవలేదు.. ఎమోషనల్, అటాచ్‌మెంట్‌తో కలిశా. కార్యాలయానికి వెళ్లేముందు ఎస్ఆర్ శంకరన్‌ను తలచుకోవాలి' అని రేవంత్ రెడ్డి సూచించారు. పేదవారికి సాయం చేసేముందు తల్లితండ్రులను గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేశారు. 'తల్లితండ్రులను గౌరవించాలి. తల్లితండ్రులను పట్టించుకోని వాళ్ల జీతంలో 10 నుంచి 15 శాతం కోత పెట్టేలా అసెంబ్లీలో చట్టం చేయబోతున్నాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Also Read: IND vs ZIM: చెపాక్‌లో భారత్ చేతిలో జింబాబ్వే చిత్తు.. టీ20 ప్రపంచకప్ సెమీస్ ఆశలు సజీవం
గ్రూప్ 1, గ్రూప్ 2 నూతన అధికారుల శిక్షణా కార్యక్రమం ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. శిక్షణను విజయవంతం గా పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలిపిన అనంతరం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'ప్రజా పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సేవలు అందించబోతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని అంగీకరించరు. రాంజీ గోండు, కొమరం భీం రాజ్యాల కోసం పోరాటం చేయలేదు.. ఆధిపత్యం చలాయిస్తున్న వారిపై తిరుగుబాటు చేశారు. కాకతీయ సామ్రాజ్యంపై సమ్మక్క సారలమ్మ తిరుగుబాటు చేశారు. అందుకే వారు వనదేవతలుగా గౌరవించబడుతున్నారు' అని రేవంత్ రెడ్డి వివరించారు.
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సమాన అవకాశాల కోసం వారు అమరవీరులయ్యారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అధికారులుగా బాధ్యతలు సేకరిస్తున్న మీరు ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల స్ఫూర్తి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. '6 లక్షల మంది పోటీపడితే 582 మంది గ్రూప్ 1,775 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారు. 15 ఏళ్ల పాటు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మే గ్రూప్ 1 నిర్వహించి ఆకాంక్షలను నెరవేర్చింది' అని తెలంగాణ సీఎం వివరించారు.
'టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేశాం. గ్రూప్ పరీక్షలపై అవగాహన ఉన్న వారిని చైర్మన్‌గా, సభ్యులుగా నియమించాం. ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్‌లలో అమ్మేందుకు అవకాశం లేకుండా చేశాం. గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన ఆనందం 24 గంటలు లేకుండా గిట్టని వాళ్లు కోర్టుకు వెళ్లారు. అభ్యర్థులు ఒక్క తప్పు చేయలేదు.. మెరిట్ మీద ఎంపిక అయ్యారని ప్రభుత్వం భావించి సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొట్లాడింది' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Traffic Diversions Hyderabad: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, ముగ్ధ జంక్షన్ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 27 (శుక్రవారం) నుండి బంజారాహిల్స్ రోడ్ నెం.2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. ఫలితంగా ఈ మార్గాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున, పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
NFCL నుండి జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వారు.. సాగర్ సొసైటీ (ముగ్ధ) వద్ద రద్దీగా ఉంటే.. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, రోడ్ నెం.5, వెంకటగిరి ఎక్స్ రోడ్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు.
రోడ్ నెం.36 & 45 నుండి పంజాగుట్ట వైపు వెళ్లే వారు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి వెంకటగిరి రోడ్ నెం.2, యూసుఫ్ గూడ బస్తీ, మైత్రీవనం మీదుగా అమీర్‌పేట్ వైపు వెళ్లడం ఉత్తమం.
రోడ్ నెం.1 (KCP) నుండి వచ్చేవారు.. కేబీఆర్ పార్క్ వైపు వెళ్లకుండా రోడ్ నెం.10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ గుండా రోడ్ నెం.45 వైపు వెళ్లవచ్చు.
మాసబ్ ట్యాంక్ నుండి వచ్చేవారు: విరించి హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్లవచ్చు.
వాహనదారులకు ముఖ్య సూచనలు..
సాధ్యమైనంత వరకు ఉదయం 8:30 – 11:00, సాయంత్రం 5:00 – 9:00 మధ్య ఈ మార్గాల్లో ప్రయాణాలను వాయిదా వేసుకోండి. తాజా ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం Google Maps వంటి నావిగేషన్ యాప్స్ తప్పనిసరిగా వాడండి. నిర్మాణ పనుల దృష్ట్యా భారీ వాహనాలకు రద్దీ సమయాల్లో ఈ మార్గాల్లో అనుమతి ఉండదు. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను గమనిస్తూ వారికి సహకరించండి.
అత్యవసర సమాచారం కోసం..
ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయండి లేదా సోషల్ మీడియా వేదికలు @HYDTP ద్వారా అప్‌డేట్స్ పొందండి. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పనులకు పౌరులందరూ సహకరించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) కోరారు.
Also REad: TTD Online Frauds: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక..వెలుగులోకి వచ్చిన భారీ మోసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TDP MLA MS Raju: 'హిందూ మత ఆచారాలు, సాంప్రదాయాలు, భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముందు నుంచి ఆనవాయితిగా వస్తోంది. నిన్నటి రోజు పులివెందుల నందిపల్లి గ్రామంలో నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకానికి వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడ పూజారి ఇచ్చిన తీర్థాన్ని స్వీకరించకుండా కిందికి వదిలేశారు' అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. 'గోత్ర నామాలు చెప్పకుండా అవహేళన చేయడం, అగ్నిగుండంలోకి వేయాల్సిన వస్తువుల్ని తిరిగి మళ్లీ పూజారికి ఇవ్వడం. ఇవన్నీ భగవంతుడి మీద ఎటువంటి భక్తి లేదనడానికి వైఎస్ జగన్ తీరు నిదర్శనం' అని విమర్శించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ' ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా టీటీడీలో ఏ రోజు పట్టువస్త్రాలు కుటుంబ సమేతంగా ఇవ్వలేదు. ఐదేళ్ల కాలంలో దాదాపు 2000 ఆలయాల మీద దాడులు జరగడం, అడుగడుగునా హిందుత్వాన్ని, హిందూ మతాన్ని హేళన చేస్తూ వ్యవహరించారు. నిన్న పులివెందులలో ప్రపంచం మొత్తం లైవ్‌లో చూస్తుండగా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి మహా పాపం చేశారు' అని ఆరోపించారు.
కచ్చితంగా ఆ దేవ దేవుడు వైఎస్ జగన్‌కు శిక్ష విధిస్తాడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శాపించారు. 'వైఎస్సార్‌సీపీ హయాలో హిందూ మతం మీద గౌరవం లేనటువంటి వ్యక్తుల్ని, హిందూ మత విశ్వాసాల మీద, వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసం లేనటువంటి వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్‌గా నియమించారు. టీటీడీ అప్రతిష్ట పాలు కావడానికి వైఎస్ జగన్ ఎంతటి కారణమో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకి, వెంకటేశ్వర స్వామికి తెలుసు' అని తెలిపారు 'హిందూ మతం మీద ఒక కక్షపూరిత వైఖరితో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. జగన్‌కు నిజంగా భగవంతుడి మీద నమ్మకం, గౌరవం లేనప్పుడు గుడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది?' అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రశ్నించారు. హిందువుల మత ఆచారాల్ని అగౌరవపరిచేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని.. ఇప్పటికైనా మాజీ సీఎం వైఎస్ జగన్ తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
eKYC Mandatory Before March 31 Details: మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేవిధంగా ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అయితే మీకు కూడా గ్యాస్ సబ్సిడీ వచ్చినట్లయితే దానికి మీరు ఒక విషయం ముందుగా తెలుసుకోండి. మార్చి 31 లోపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకోలేని వారికి గ్యాస్ సబ్సిడీ ఆగిపోయే ఛాన్స్ ఉంది. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మీ ఫోన్లో ఆయిల్ కంపెనీ యాప్ ద్వారా మీరు సులభంగా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీనికి ఆధారం ఫేస్ RD యాప్ సహాయంతో ఇంటి నుంచే కేవైసీ చేసుకోండి. ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రక్రియ ఎంతో సులభంగా జరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే 18002333555 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి, లేకపోతే మీ డిస్ట్రిబ్యూటర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్..
ఇది ఇండియన్ ఆయిల్, హెచ్ పీ, భారత్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు వర్తిస్తుంది. ఈ కేవైసీ అంటే బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. లేకపోతే మీ దగ్గరలో ఉన్న మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ వెళ్లి కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జీలు కూడా వసూలు చేయరు.
అధికారిక వెబ్‌సైట్...
ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి మీరు అధికారిక https://pmuy.gov.in/e-kyc.html . వెబ్‌సైట్ కూడా ఉంది. ఇందులో వివరాలు చెక్ చేయవచ్చు. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం 9 సిలిండర్లకు గ్యాస్ సబ్సిడీ అందిస్తుంది. మార్చి 31వ తేదీ లోపు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే రిఫండ్ వస్తుంది. లేకపోతే శాశ్వతంగా సబ్సిడీ రద్దు అయ్యే అవకాశం ఉంది.
ఇక మార్చి 1వ తేదీ గ్యాస్ ధరల సవరణ జరుగుతుంది. ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ ఆయిల్ ధరలు సవరణ చేస్తూ ఉంటాయి. గత ఐదేళ్లుగా చూస్తే డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం LPG గ్యాస్ సిలిండర్ ద్వారా ఢిల్లీలో రూ.853, ముంబై రూ. 852, చెన్నై రూ. 868 ఉంది అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర గత ఐదేళ్లలో పోలిస్తే కేవలం మూడుసార్లు మాత్రమే సవరించారు.
ఇక హైదరాబాదులో ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ద్వారా 14.2 కేజీలు రూ. 905 ఉంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 19 కేజీలు మాత్రం రూ. 1961 ఉంది. గత కొన్ని నెలలతో పోలిస్తే పెద్దగా ఎలాంటి ధరల మార్పు జరగలేదు . ఇక అర్హులైన వారికి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లభిస్తుంది. నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు రిఫండ్ చేస్తుంది ప్రభుత్వం.
Also Read: రైలు ప్రయాణీకులు బిగ్ అలెర్ట్.. మార్చి 1 నుంచి మారనున్న రూల్స్, తెలుసుకోకపోతే మీకే నష్టం..!
Also Read: టోల్ గేట్ ముందు టెన్షన్ వద్దు.. 30 సెకన్లలో FASTag బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Railway Rules Changing from March 1: ప్రతిరోజు కొన్ని వేల రైళ్లు రాకపోకలు చేస్తూ ఉంటాయి. మన దేశంలో ప్రధానంగా అతిపెద్ద రవాణా ఇండియన్ రైల్వే. లక్షలాది మంది ప్రయాణికులకు తమ గమ్య స్థానాలకు ఇది చేరవేస్తుంది. సుదీర్ఘ ప్రయాణాన్ని అతి తక్కువ సమయంలోనే తక్కువ టికెట్ ధరలతో వెళ్లవచ్చు. అయితే, ఇటీవల కాలంలో రైల్వే ప్రయాణికులకు అనుగుణంగా ఎన్నో మార్పులు చేస్తూనే ఉంది భారతీయ రైల్వే. కొత్త రైళ్లు, కారిడర్లు ప్రకటించడం చూశాం. దీంతోపాటు మార్చి 1వ తేదీ నుంచి కొత్త రైల్వే రూల్స్ మారాయి. UTS యాప్ అనేది పూర్తిగా తొలగించేసి.. RailOne యాప్ తో భర్తీ చేశారు. ఇది రైలు ప్రయాణికులు ముందుగా తెలుసుకోవాలి.
సాధారణంగా రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలంటే అనేక ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆఫ్ లైన్ అయితే రైల్వే స్టేషన్ వెళ్లి అక్కడ కౌంటర్లలో బుక్ చేసుకుంటారు. అయితే రోజువారీ ప్రయాణం చేసేవారికి RailOne App బెస్ట్. రైలు ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా ప్లాట్ ఫారం టికెట్ వంటివి ఉంటాయి. అయితే మార్చి 1వ తేదీ నుంచి UTS App అందుబాటులో ఉండదు. కేవలం RailOne యాప్ మాత్రమే ప్రయాణికులు ఉపయోగించాల్సి ఉంటుంది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైలు వన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీ క్రెడియన్షియల్స్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ జనరల్ టికెట్, ప్లాట్ ఫామ్ టికెట్, రిజర్వేషన్ సులభంగా ఈ సింగల్ యాప్ ద్వారా మీరు యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటి నుంచి రైలు టికెట్ బుక్ చేయడానికి ,స్టేటస్ చెక్ చేయడానికి, రెండు మూడు యాప్స్ డౌన్‌లోడ్ చేయాల్సిన పనిలేదు. RailOne యాప్ తో మీకు కావాల్సిన సేవలు లభిస్తాయి. జనరల్ టికెట్ మీ మొబైల్ డివైజ్ ద్వారా ఈ యాప్ లోనే బుక్ చేసుకుంటారు. ప్రతిరోజు రాకపోకలు చేసే వారికి రైల్వే వన్ యాప్ తప్పనిసరి.
పెద్ద మొత్తంలో రైల్వే కౌంటర్ల వద్ద క్యూ కట్టి రైల్ టికెట్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. సులభంగా రైల్వే యాప్ తో ఇది సాధ్యమవుతుంది. RailOne యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలి. ఇందులో కేవలం టికెట్ బుకింగ్ మాత్రమే కాదు రిజర్వేషన్, లైవ్ ట్రైన్ స్టేటస్, లొకేషన్ ట్రాకింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఒక్క యాప్ ద్వారా అనేక బెనిఫిట్స్ లభిస్తున్నాయి.
RailOne App లో టికెట్ బుక్ చేసుకునే విధానం..
రైల్ వన్ యాప్ ఓపెన్ చేయండి. అక్కడ మీ జర్నీ ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత అన్ రిజర్వ్డ్ జనరల్ టికెట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మీకు జీపీఎస్ కూడా ఆన్ చేసుకునే సౌలభ్యం ఉంది. తద్వారా లోకేషన్ కూడా డిటెక్ట్ అయిపోతుంది. మీకు ఏ టైం కావాలి కూడా ఎంపిక చేసుకోవచ్చు. మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు సరిగ్గా వివరాలు నమోదు చేశారా? ఒకసారి చెక్ చేసుకోండి. చివరగా చెల్లింపులు చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. అప్పుడు నేరుగా మీ ఫోన్‌కు మై టికెట్ సెక్షన్లో టికెట్ వచ్చేస్తుంది. దాని పీడీఎఫ్ ఫార్మాట్లో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: టోల్ గేట్ ముందు టెన్షన్ వద్దు.. 30 సెకన్లలో FASTag బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Snake in Cabbage Video Watch Here: ప్రస్తుతం మార్కెట్ నుంచి తెచ్చుకునే కూరగాయల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సాధారణంగా కూరగాయల అన్నాక క్రిములు.. కీటకాలు, చిన్న చిన్న పురుగులు రావడం సర్వసాధారణం. కానీ మనం రోజు తినే క్యాబేజీలో ఏకంగా పాము ప్రత్యక్షమవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రమాదకరమైన పాము క్యాబేజీలోకి వెళ్తున్న దృశ్యాలు చూసి నేటిజెన్లు షాక్ అయిపోతున్నారు. ఇంతకీ ఈ వీడియో నిజమేనా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఒక క్యాబేజీ లోపల పొరల మధ్య ఒక చిన్న పాము నక్కి ఉండడం మీరు క్లియర్ గా ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఈ పాము క్యాబేజీ చిన్న చిన్న ఆకుల పొరల మధ్యలో ఉండడం.. దాని తోక భాగం మాత్రం బయటికి కనిపించేలా ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఈ పాము క్యాబేజీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం కూడా గమనించవచ్చు. అయితే, ఇలాంటి కూరగాయలను తీసుకువచ్చే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మార్కెట్లోని ఒకటికి రెండుసార్లు చూసి కొనుగోలు చేయడం మంచిది.. లేదంటే వీటిని పట్టుకునే క్రమంలో దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.
ఈ వీడియోని చూసిన కొంతమంది నిపుణులు స్పందిస్తూ వస్తున్నారు.. ముఖ్యంగా క్యాబేజీ లాంటి ఆకుకూరలతో పాటు కొన్ని రకాల కూరగాయలు కొనుగోలు చేసిన తర్వాత శుభ్రం చేసే క్రమంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందట. ముఖ్యంగా వీటిని కొనుగోలు చేసే సమయంలోనే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి.. రంధ్రాలు కలిగిన వాటిని కొనుగోలు చేయకపోవడం చాలా మంచిదని వారు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాబేజీ లాంటి కూరగాయలను నేరుగా కోయకుండా.. ఒక్కొక్క పొరను విడదీసి చూసుకొని మరి జాగ్రత్తగా కోసుకోవడం మంచిది.
అలాగే మార్కెట్లలో ఈ క్యాబేజీని కొనుగోలు చేసిన తర్వాత తప్పకుండా వన్డే క్రమంలో గోరువెచ్చని నీటిలో శుభ్రం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఏవైనా క్రిమి కీటకాలు లేదా మరేమైనా పురుగులు ఉంటే చనిపోయే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలా పాములు ఆహారం లభించలేకపోవడం కారణంగా.. పొలాల్లో చేరి.. ఇలాంటి ఆహారాలతో కడుపు నింపుకుంటున్నాయి. ఇటీవల వివిధ కూరగాయలను తింటున్న పాములకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది మాత్రం ఇది అసలైన వీడియో కాదని.. ఎవరో కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎడిట్ చేసి పోస్ట్ చేశారని చెబుతున్నారు. ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా ఈ వీడియో నిజమైంది కాదని తెలింది.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Hair Video Here: ప్రకృతిలో మనకు తెలిసిన వింతలు ఎన్నో జరుగుతూ ఉంటాయి.. కొన్నిసార్లు మనం చూసే దృశ్యాలు ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా భయాందోళన కూడా సృష్టిస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి దృశ్యాలకు సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కూడా ఉంది. అయితే, ఈ పాము అన్ని పాములు కంటే చాలా భిన్నంగా ఉంది. అంతేకాకుండా చాలా ప్రత్యేకంగా కూడా కనిపిస్తూ ఉంది. సాధారణ పాములకు జుట్టు ఉండదు.. కానీ ఈ వీడియోలో కోబ్రాకు జుట్టు ఉన్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ వింత వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. అత్యంత ప్రమాదకరమైన కోబ్రా పాము పడగవిప్పి ఉండడం మీరు గమనించవచ్చు.. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ పాము పడగ వెనక భాగంలో మనుషుల జుట్టు లాంటి నల్లటి వెంట్రుకలు కనిపిస్తూ ఉన్నాయి. గాలికి ఆ జుట్టు అటు ఇటు ఊగడం మీరు క్లియర్‌గా చూడొచ్చు. పాము పడక విప్పినప్పుడు ఆ నల్లటి జుట్టు దాని తల నుంచి కిందకు వేలాడుతూ ఉండడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. సాధారణంగా పాములు ఎలాంటి జుట్టును కలిగి ఉండవు. కానీ ఈ వీడియోలో మాత్రం అత్యంత ప్రమాదకరమైన పాముకు జుట్టు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ వింత దృశ్యాన్ని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కొందరు ఇది నిజమైన పామేనా అని అనుమానం వ్యక్తం చేస్తుంటే. మరి కొంతమంది అయితే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన వీడియో అని కామెంట్లు రాస్తూ వస్తున్నారు. అలాగే మరికొందరైతే పురాణాల్లో ఇలాంటి పాముల గురించి ప్రస్తావించారని.. ఇలా జుట్టు ఉన్న పాములు అనేక కథల్లో ఉన్నాయని వింత వింతగా కామెంట్లలో చెబుతూ వస్తున్నారు. మరి కొంతమంది అయితే.. ఎవరో కావాలని పాము తల భాగంలో వెంట్రుకలను పెట్టారని అంటున్నారు.
శాస్త్రీయంగా చూస్తే.. పాములకు ఎలాంటి జుట్టు ఉండే అవకాశం లేదట.. అలాంటిది ఈ పాము కు జుట్టు ఉండడం ఆశ్చర్యమేస్తుంది కదూ.. సాధారణంగా పాముల శరీర భాగం క్లియర్ గా పరిశీలిస్తే.. పొలుసులుగా ఉంటుంది.. కానీ ఈ వీడియోలో పాము స్మూత్ గా కనిపించడం చూసి.. చాలామంది ఇది ఎడిటింగ్ చేసిన వీడియో అని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత.. ఇలా ప్రమాదకరమైన పాములకు వింత వింత వస్తువులను జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra In Shoe Video Watch Here: ప్రతి ఒక్కరికి ఇంటి బయట లేదా వరండాల్లో తప్పకుండా చెప్పులు విడిచే అలవాటు ఉంటుంది.. ఈ అలవాటు మీకు కూడా ఉందా? అయితే, ఈ వీడియో మీ కోసమే. షూ రాక్‌లోని దాక్కున్న ఓ భారీ నాగుపాము కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కోబ్రా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. షూ పెట్టుకునే రాక్ లో దర్శనమిచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం ఎక్కడి నుంచైనా బయటికి వెళ్లి ఇంటికి రాగానే చెప్పులు లేదా షూస్ ను తప్పకుండా పక్కనే ఉన్న స్టాండ్‌లో పెట్టుకుంటూ ఉంటా. అయితే అలా పెట్టిన స్టాండ్ లో ఉన్న షూలో అత్యంత ప్రమాదకరమైన కోబ్రా కనిపించింది.. ఓ వ్యక్తి ఆ షూను వేసుకుందామని వెళ్లగా అక్కడ ఊహించని దృశ్యాలు అతనికి కనిపించాయి.. షూ లోపల ఒక నాగుపాము దూరి ఉంది.. ఆ పాము నెమ్మదిగా అందులో నుంచి బయటికి రావడం ఆయన గమనించారు.. వెంటనే అతను అతని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడంతో వారు ఆ పామును చూసేందుకు అక్కడికి వచ్చారు..
ఈ వీడియోలో కనిపిస్తున్న గ్రే కలర్ షూలోపల నాగుపాము తన శరీరాన్ని చుట్టుకొని ఉండటం మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ పాము నెమ్మదిగా షూ లోపలి నుంచి బయటికి పాకుతూ కింద ఉన్న ఇతరు చెప్పుల వైపుగా వెళ్తోంది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి షూ వేసుకోక ముందే పాము కనిపించింది.. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది అనవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ పామును గమనించకపోతే తప్పకుండా దాని కాటు బారిన పడేవాడు.
ముఖ్యంగా వర్షాకాలంలో లేదా ఎండాకాలంలో విష సర్పాలు ఇలా ఆహ్వానం కోసం ఇళ్లలోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంటి లోపల ఎక్కువగా వస్తువులు ఉన్న చోటికి ఇలాంటి పాములు వస్తూ ఉంటాయి. కాబట్టి అడవికి దగ్గరగా ఉండేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంటి బయట ఉన్న వస్తువులు ఒకటికి రెండుసార్లు చూసి వాటిని పట్టుకోవడం మంచిది. లేదంటే ఇలాంటి విషపూరితమైన పాము కాటున పడాల్సి వస్తుందని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Employee Bonus Telugu Latest News: ప్రస్తుత కాలంలో కంపెనీ లాభాల కోసం ఎంప్లాయిస్‌పై ఊహించని ఒత్తిడి పెడుతుంటే.. ఒక చైనీస్ కంపెనీ మాత్రం తన ఉద్యోగుల పట్ల అపారమైన ప్రేమను చాటుకుంది. తమ వార్షిక లాభాల్లో పెద్ద భాగాన్ని ఉద్యోగులకే బోనస్ గా ప్రకటించి వార్తల్లో నిలిచాడు ఆ కంపెనీ యజమాని.. చైనాకు చెందిన హెనాన్ కువాంగ్‌షాన్ క్రేన్ కంపెనీ ఉద్యోగులకు ఏకంగా 180 మిలియన్ యువాన్ల బోనస్ ను పంపిణీ చేశారు. ఇప్పటికీ ఇంత ఊహించని స్థాయిలో బోనస్ ప్రకటించిన కంపెనీలో ఈ కంపెనీ నిలిచిపోయింది.
అయితే, కంపెనీకి సంబంధించిన యజమాని బోనస్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా సెలబ్రేట్ చేశారు. కంపెనీ నిర్వహించిన వార్షిక వేడుకలో సుమారు 7000 మంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై భారీ టేబుల్ ల మీద నగదు కట్టలను కుప్పలుగా పేర్చారు. సుమారు 80 కోట్లను అక్కడక్కడే నగదు రూపంలో పంపిణీ చేయడం విశేషం.. అంతేకాకుండా ఉద్యోగులకు ఒక ఆసక్తికరమైన టాస్కులు కూడా పెట్టారు.. వేదికపై ఉన్న నగదును వారు చెప్పిన సమయంలో ఎంత లెక్కపెట్టగలిగితే.. ఆ మొత్తాన్ని వారి ఇంటికి తీసుకెళ్లవచ్చు అని తెలిపారు. దీంతో ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా నగదు కట్టలను చేతిలోకి తీసుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
2025 సంవత్సరం ఈ కంపెనీ సుమారు 270 మిలియన్ల యువాన్ల లాభాలు పొందినట్లు సమాచారం. ఇందులో దాదాపు 70 శాతం మొత్తాన్ని అంటే 180 మిలియన్ యువాన్లను ఉద్యోగులకు బోనస్ రూపంలో ఇవ్వడం ఇప్పుడు విశేషం.. కంపెనీ చైర్మన్ పీజున్ మాట్లాడుతూ.. యువత ప్రస్తుతం కారులోన్లతో పాటు ఇంటి లోన్లతో సతమతమవుతున్నారు.. వారికి మా వంతుగా కొంత ఉపశమనం కలిగించాలన్నదే కంపెనీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు..
Also Read: Garikapati Narasimha Rao: లివింగ్ రిలేషన్ ఒక కొత్త దరిద్రం.. మంథనిలో గరికిపాటి సంచలన వ్యాఖ్యలు!
గతంలో కూడా ఈ కంపెనీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు భారీ గిఫ్ట్లను అందించింది. దీంతో ఈ యజమానికి డబ్బులు పంచెయ్ బాస్‌గా పేరు ఉంది. కేవలం గిఫ్టులతో పాటు వస్తువులకు పరిమితం కాకుండానే.. ఈ కంపెనీకి సంబంధించిన బాస్ నేరుగా నగదును చేతిలో పెడతారు. దీనివల్ల ఉద్యోగులకు వస్తువుల కంటే ఎక్కువగా నగదుతో ఉపయోగముంటుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తారని కంపెనీలోని కొంతమంది అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Also Read: Garikapati Narasimha Rao: లివింగ్ రిలేషన్ ఒక కొత్త దరిద్రం.. మంథనిలో గరికిపాటి సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook