Rajahmundry Milk Tragedy: ఏపీలోని రాజమండ్రిలో కల్తీ పాలు తాగి దాదాపు ఏడు మంది దాకా మృతిచెందడంతో ఏపీతోపాటు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. పాలను కూడా కల్తీ చేస్తున్న దుర్మార్గులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాలు తాగాలంటేనే భయమేస్తోంది. కల్తీ పాల ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు పాల కేంద్రాలను పరిశీలిస్తున్నారు. పాల సేకరణ, పాల తయారీ, డెయిరీలను పరిశీలిస్తుండగా.. ఓ చోట కల్తీ పాలు తయారుచేస్తున్న పాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. దీంతో తెలంగాణ పోలీసులు ఆ వ్యాపారిని అరెస్ట్ చేసి పాలను సీజ్ చేశారు. మరో చోట డెయిరీలో పేలుడు సంభవించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Adulterated Milk Tragedy: పాలు కాదు కాలకూట విషం.. రాజమండ్రిలో ఆరేళ్ల బాలుడు మృతి
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న స్థావరంపై ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. కడ్తాల్ మండలంలోని రావిచేడు గ్రామంలో శ్రీశైలం అనే వ్యక్తి పాల సేకరణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతో కల్తీపాల తయారు చేస్తున్నాడు. ముడి సరుకులతో పాలను విక్రయిస్తున్నాడు. షాద్‌నగర్‌లో కల్తీ పాలు తయారు చేసే ముడి పదార్థాలు లూజ్ షుగర్, కాఫీ క్రీమ్, సాల్ట్‌ను కొనుగోలు చేసి కేంద్రంలో డెయిరీకి సరఫరా చేసేవాడు. సమాచారం తెలుసుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు రావిచెడ్ గ్రామంలో శ్రీశైలం ఇంటిపై దాడి చేసి కృత్రిమంగా పాలను తయారు చేసే కేంద్రాన్ని గుర్తించారు. పాలతో పాటు వాహనాన్ని సీజ్ చేసి.. నిర్వాహకుడు శ్రీశైలాన్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కడ్తాల్ సీఐ గంగాధర్ తెలిపారు.
Also Read: Save Punarvika: చిన్నారి పునర్వికకు నారా లోకేశ్ అండ.. రూ.6 కోట్ల భారీ విరాళం
జనగామ జిల్లా పాల డైరీలో పేలుడు
జనగామ జిల్లా రఘునాథపల్లి గోవర్ధనగిరి గ్రామంలో ఉన్న శక్తి మిల్క్ డెయిరీలో పేలుడు సంభవించింది. మిల్క్ డెయిరీలో బాదం మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రామ్ గోపాల్ రెడ్డి, వివేక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. బాదం మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌లోని కంప్రెషర్‌లో సాంకేతిక సమస్య కారణంగా పేలుడు జరిగినట్టుగా తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Garikapati Narasimha Rao Telugu Latest News: ప్రస్తుతం సమాజంలో యువత అనుసరిస్తున్న కొన్ని ఇతర దేశాలకు సంబంధించిన పాశ్చాత్య ధోరణులపై ప్రముఖ ప్రవచనకర్త, సహస్రావధాని గరికిపాటి నరసింహారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. పెద్దపల్లి జిల్లా మంథనిలోని బుధవారం రాత్రి ఏర్పాటుచేసిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రసంగిస్తూ.. లివింగ్ రిలేషన్షిప్ సాంస్కృతిపై కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వేదికగా గరికపాటి ఏమన్నారు? చర్చనీ అంశానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ వంటి కొన్ని ప్రధాన నగరాల్లో లీవింగ్ రిలేషన్షిప్ అనే ఒక కొత్త దరిద్రం మొదలైందని గరికపాటి వ్యాఖ్యానించారు.. పెళ్లి అనే పవిత్ర బంధం లేకుండా ఒక అబ్బాయి తో పాటు ఒక అమ్మాయి కలిసి ఉండడం భారతీయ సాంస్కృతికి విరుద్ధమని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.. ఇటువంటి పద్ధతులు సమాజానికి ఏ మాత్రం మంచివి కాదని.. వీటిని ప్రతి ఒక్కరు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.. అంతేకాకుండా ఇలాంటి ధోరణి వల్ల చాలామంది యువత చెడిపోతున్నారని ఆయన అన్నారు.
అంతేకాకుండా ప్రస్తుత కాలంలో యువత అంతా ప్రేమ పేరుతో తప్పుదోవ పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లికి ముందే కలిసి ఉండడం అనేది ప్రేమ కాదని.. అది కేవలం కా**మం మాత్రమేనని ఆయన కుండలు బద్దలు కొట్టి చెప్పారు. ప్రేమకు ఇష్టానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు.. ప్రేమ అనేది విశ్వవ్యాప్తమైనదని.. చాలా పవిత్రమైందని తెలిపారు. ఇష్టమనేది వ్యక్తికి సంబంధించిన తాత్కాలిక భావన మాత్రమేనని ఆయన అన్నారు..
ఇలాంటి వికృత పోగడాలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత సమాజంపై తప్పకుండా ఉందన్నారు.. యువత తమ బాధ్యతలను గుర్తించి విలువతో కూడిన జీవనాన్ని గడపాలని ఆయన కోరారు.. మన సాంప్రదాయాలను గౌరవించినప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.. మంథనిలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు స్థానికులు పాల్గొని గరికపాటి ప్రవచనాలను ఎంతో ఆసక్తిగా విన్నారు. అంతేకాకుండా అక్కడి పెద్దలు ఆయనకు ప్రత్యేకమైన సత్కారం కూడా చేశారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rabies Latest Telugu News: మనం ఎంతో ప్రాణంగా పెంచుకునే పెంపుడు జంతువులే కొన్నిసార్లు మన మన ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నో చోటుచేసుకున్నాయి.. సాధారణంగా కరిస్తే రేబిస్ వస్తుందని భయపడుతూ ఉంటా.. కానీ ఒక పెంపుడు కుక్క కేవలం నాకడం వల్ల మహిళ తన చేతులతో పాటు కాళ్ళను పోగొట్టుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పెంపుడు కుక్క నాకడం వల్ల ఆ యువతి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
లండన్ కు చెందిన మంజీత్ సంఘ అనే మహిళ అనూహ్యమైన రీతిలో ప్రాణాపాయం ఎదురయింది.. గత కొద్ది రోజుల క్రితం ఆమె కాలిపై చిన్న గాయమైంది.. అయితే ఆమె పెంచుకుంటున్న కుక్క ఆ గాయాన్ని నాకేసింది.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలకు గురై.. ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది.. వైద్యులు ఆమెను పరీక్షించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.. దీనిని విన్న ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇలా జరిగి ఉంటుంది? దీనికి కారణాలు ఏంటి అని వెతుక్కోగా.. అసలు విషయం బయటపడింది..
కుక్క నాకడం వల్ల ఆమె రక్తంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరి సెస్పిస్ అని తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు దారితీసింది.. దీనివల్ల ఆమె శరీరం అంతర్గతంగా పూర్తిగా దెబ్బ తింటూ వచ్చింది. ఆమె ఏకంగా 32 వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉంది.. చికిత్స సమయంలో ఆమె పలుమార్లు గుండెపోటుకు గురైనట్లు కూడా వైద్యులు చెప్పారు. ఇన్ఫెక్షన్ శరీరం మొత్తం పాకకుండా ఉండడానికి వైద్యులు తప్పని పరిస్థితుల్లో ఆమె రెండు కాళ్లతో పాటు రెండు చేతులను తొలగించాల్సి వచ్చింది.
సాధారణంగా కొన్ని కుక్కల నోటిలో ఉండే రకరకాల బ్యాక్టీరియాలు మానవ రక్తంలోకి చేరినప్పుడు సెప్సిస్ లాంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి.. ఇది చాలా అరుదైనప్పటి.. శరీరానికి గాయాలు ఉన్నప్పుడు పెంపుడు జంతువులను దగ్గరకు రానివ్వడం లేదా అవి గాయాలు నాకడం వంటి పరిస్థితుల్లో ఇలాంటి జబ్బు వస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. తన జీవితంలో జరిగిన ఈ విషాదాన్ని హెచ్చరికగా ఉండాలని ఆమె పంచుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Nellore Municipal Corporation: నెల్లూరు నగర కార్పొరేషన్‌పై టీడీపీ జెండా ఎగిరింది. నెల్లూరు మేయర్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం కార్పొరేషన్ మేయర్ ఎన్నిక చేపట్టారు. ఈ సమావేశానికి ముందుగా తెలుగుదేశం పార్టీ మద్దతు కౌన్సిలర్లు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి అక్కడ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి 34 మంది కార్పొరేటర్లు కార్పొరేషన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మేయర్ ఎన్నిక నిర్వహించారు.
Also Read: Collectors Transfer: మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో 10 జిల్లాల కలెక్టర్లు బదిలీ
నెల్లూరు మేయర్‌గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను డిప్యూటీ మేయర్ రవికుమార్ యాదవ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను మిగిలిన కౌన్సిలర్లు ఆమోదించడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు గైర్హాజరు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు ప్రకటించారు. మేయర్ ఎన్నిక పత్రాన్ని ఆమెకు అందజేశారు. 9 నెలల కాలం దేవరకొండ సుజాత నెల్లూరు మేయర్‌గా కొనసాగనన్నారు. మేయర్‌గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు దేవరకొండ సుజాత కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు నగరం మేయర్ సుజాత ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌పై తెలుగుదేశం జెండా ఎగరవేసిన కార్పొరేటర్‌లందరికీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Pawan Kalyan: జనసేన నాయకత్వంపై పవన్ కల్యాణ్ ఫైర్.. కౌంటర్ ఏదంటూ నిలదీత
ఎమ్మెల్యే సమన్వయం
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కార్పొరేటర్లు భేటీ సయ్యారు. ఎన్నికల సందర్భంగా సమాలోచనలు చేశారు. మేయర్ ఎన్నికపై కార్పొరేటర్లకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఎన్నిక సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు చేపట్టారు.
వైసీపీ నుంచి టీడీపీకి
నెల్లూరు నగర కార్పొరేషన్‌కు 2021 నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 54 డివిజన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అనంతరం వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. గతేడాది డిసెంబర్‌లో అప్పటి మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవగా.. దానికి ముందుగానే మేయర్ రాజీనామా చేశారు. దీంతో రెండు నెలలుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ మేయర్ పాలన కొనసాగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మేయర్ ఎన్నిక నిర్వహించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Privacy Display Feature: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ప్రైవసీ అనేది ఒక సవాలుగా మారుతూ వస్తోంది. ముఖ్యంగా బస్సులతో పాటు రైళ్లలో లేదా రద్దీగా ఉండే ప్రదేశాల్లో మనం ఫోన్ వాడుతుంటే.. మన పక్కన ఉండేవారు మన స్క్రీన్‌లో తొంగి చూడడం ఒక అలవాటైపోయింది. చాలామంది ఇది ఇబ్బందిగా మారుతూ వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రముఖ దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ సాంసంగ్ తమ లేటెస్ట్ ప్రీమియం ఫోన్ సాంసంగ్ గెలాక్సీ s26 అల్ట్రా వినూత్న ఫీచర్‌తో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో పాటు ప్రైవసీ ఫీచర్‌ని కూడా కలిగి ఉంటుంది.
ప్రైవసీ డిస్ప్లే ఫీచర్‌ను సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. సాంసంగ్ గాలక్సీ s26 అల్ట్రా లో ఈ ప్రత్యేకమైన ఫీచర్ అందుబాటులో ఉంది.. సాధారణంగా మనం ఫోన్ చూసినప్పుడు మన పక్కనున్న వారికి కూడా స్క్రీన్ కొన్ని సందర్భాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ కొత్త టెక్నాలజీ తో.. ఫోను నేరుగా చూసే వినియోగదారుడికి మాత్రమే స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. పక్కనుంచి చూసేవారికి స్క్రీన్ చీకటిగా కనిపించడమే కాకుండా మసక మసకగా కనిపిస్తూ ఉండడం విశేషం..
స్క్రీన్ నుంచి వచ్చే కాంతి కేవలం 90 డిగ్రీల కోణంలో మాత్రమే ప్రసరించేలా ఈ డిస్ప్లేని రూపొందించినట్లు సాంసంగ్ కంపెనీ వెల్లడించింది. దీనివల్ల సైడ్ యాంగిల్స్ నుంచి చూసేవారికి ఏమి కనిపించదు. అంతేకాకుండా దానినే సైడ్ నుంచి స్పష్టంగా చూస్తే మసకగా కూడా కనిపించే అవకాశాలున్నాయి.. ఈ స్మార్ట్ ఫోన్ను నిలువుగా పట్టుకున్న.. సినిమాలు చూసేటప్పుడు అడ్డంగా తిప్పిన ప్రైవసీ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
అంతేకాకుండా వ్యక్తిగత చాట్ తో పాటు బ్యాంకింగ్ యాప్స్, పిన్ నెంబర్స్, పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు పక్కన వారికి కనిపించకుండా ఇది అద్భుతమైన రక్షణగా నిలుస్తుందని సాంసంగ్ కంపెనీ గతంలోనే వెల్లడించింది. గజంలో ఇలాంటి ప్రైవసీ కోసం విడిగా స్క్రీన్ గార్డులను కొనుక్కునేవారు.. కానీ సాంసంగ్ ఇప్పుడు ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ తో పాటు హార్డ్వేర్ ల కలయికతో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. హైఎండ్ ఫీచర్లతో పాటు భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే వారికి సాంసంగ్ గాలక్సీ s26 అల్ట్రా వరంగల్ కంటే ఎక్కువని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
District Collectors Tranfers: తెలంగాణలో తరచూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతుండగా.. తాజాగా మరోసారి బదిలీలు జరిగాయి. ఈ సారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి పెద్ద ఎత్తున కలెక్టర్ల మార్పులు చేర్పులు జరిగాయి. కీలకమైన జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ.. ఇతరులకు బాధ్యతలు అప్పగించారు. వాటిలో జనగామ, గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Save Punarvika: చిన్నారి పునర్వికకు నారా లోకేశ్ అండ.. రూ.6 కోట్ల భారీ విరాళం
తెలంగాణలో మరోసారి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాగునీటి శాఖ నుంచి రాహుల్ బొజ్జాను, ఆర్థిక శాఖ నుంచి సందీప్‌కుమార్ సుల్తానియాను, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ నుంచి ముషారఫ్ అలీ ఫరూఖీని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఫార్ములా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కుమార్‌కు విపత్తు నిర్వహణ శాఖ నుంచి బదిలీ చేయగా.. ఎలాంటి పోస్టు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ ఫార్ములా కేసులో ప్రాసిక్యూషన్‌కు డీవోపీటీ అనుమతిచ్చిన నేపథ్యంలో ఆయనకు ఎలాంటి పోస్టు ఇవ్వలేదు.
Also Read: Milk Tragedy: తెలంగాణలో కల్తీపాలు తయారీ.. డబ్బు కోసం వ్యాపారి కక్కుర్తి
కొత్త జిల్లా కలెక్టర్లు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా అనురాగ్ జయంతి నియామకం. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ స్థానం నుంచి బదిలీ
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్. జనగామ కలెక్టర్ నుంచి బదిలీ
నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్. వికారాబాద్ కలెక్టర్ నుంచి బదిలీ
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శబరీశ్. హనుమకొండ కలెక్టర్ నుంచి బదిలీ
కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా చిత్రా మిశ్రా నియామకం. ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ నుంచి బదిలీ
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారీ నియామకం
మెదక్ కలెక్టర్‌గా ప్రతీమ సింగ్ నియామకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా అంకిత్ నియామకం
హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పేయ్
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తా
విద్యుత్ శాఖలో కీలకమైన జీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా ఉన్న ముషారఫ్‌ను బదిలీ చేసి జితేశ్ వి పాటిల్‌కు బాధ్యతలు అప్పగింత
కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా పమేలా సత్పత్తి బదిలీ. కరీంనగర్ కలెక్టర్ బాధ్యతల నుంచి తొలగించి కొత్త బాధ్యతలు అప్పగింత
సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్‌కు అదనంగా ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా బాధ్యతలు
బదిలీలు వీరే..
సంజయ్ కుమార్, సబ్యసాచి ఘోష్, దానకిశోర్, ఎన్ శ్రీధర్, రాహుల్ బొజ్జా, ఈ శ్రీధర్, గౌరవ్ ఉప్పల్, బీ విజేంద్ర, అద్వైత్ కుమార్ సింగ్, ఎం హనుమంత రావు, సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ, రాహుల్ పాజ్, భవేశ్ మిశ్రా, కాత్యాయని దేవి, ఫణీంద్ర రెడ్డి, మంద మకరాండు, ఫైజన్ అహ్మద్, శివేంద్ర ప్రతాప్, పర్మార్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్, ఉమా శంకర్ ప్సాద్, జీ శ్యామల్ ప్రసాద్ లాల్, చంద్రయ్య, వైవీ గణేశ్, అబ్దుల్ హమీద్, వి వెంకటేశ్వర్లు, ఖీమ్యా నాయక్, విద్యసాగర్, సురేందర్ బదిలీలయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Vijay Rashmika Wedding Gift News: ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్న ఆ శుభఘడియ రానే వచ్చింది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వైవాహిక బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పూర్ వేదికగా, అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.
రెండు సంప్రదాయాల కలయిక
ఈ వివాహ వేడుకలో ప్రత్యేకత ఏమిటంటే, ఇటు తెలుగు, అటు కొడవ (కూర్గ్) సంప్రదాయాలను గౌరవిస్తూ వేడుకలు నిర్వహించారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు శాస్త్రోక్తంగా, హిందూ సంప్రదాయం ప్రకారం ముహూర్తం జరిగింది. పట్టు వస్త్రాల్లో వధూవరులు చూడముచ్చటగా మెరిసిపోయారు. రష్మిక పుట్టిన గడ్డ అయిన కూర్గ్ ఆచారాల ప్రకారం.. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మరోసారి వివాహ తంతు నిర్వహించనున్నారు.
తెల్లవారుజాము నుంచే పెళ్లి పనులు మొదలయ్యాయి. గులాబీ రేకులు, సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీటితో వధూవరులకు మంగళ స్నానాలు చేయించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు.
వరుడి తరపున ఖరీదైన కానుక
పెళ్లి వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు రష్మికకు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం.. వరుడి తరపు వారు పెళ్లి కుమార్తెకు కళ్లు చెదిరే బంగారు గాజులను బహుమతిగా అందజేశారు.
'విరోష్' ప్రేమాయణం..
'గీత గోవిందం' సినిమాతో మొదలైన వీరి పరిచయం, 'డియర్ కామ్రేడ్' సమయానికి ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూడవ చిత్రం 'రణబాలి' షూటింగ్ దశలో ఉండగానే, ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటవ్వడం విశేషం. రష్మిక కెరీర్ ఆరంభం నుండి విజయ్ ఆమెకు అండగా నిలవగా, రష్మిక కూడా దేవరకొండ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తోంది.
Also Read: VI Recharge Plan 140: మొబైల్ యూజర్లకు తీపికబురు.. కేవలం రూ.140 లకే 28 రోజుల అన్‌లిమిటెడ్ కాలింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
FIIs Investment: నెలల తరబడి కొనసాగిన విక్రయాల తర్వాత విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ భారత మార్కెట్ వైపు మళ్లినట్టు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 2026లో వారు నికరంగా సుమారు 2.44 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఇది గత 17 నెలల్లో నమోదైన అతిపెద్ద నెలవారీ ఇన్‌ఫ్లోగా భావిస్తున్నారు. మార్కెట్లు అస్థిరంగా ఉన్న సమయంలో వచ్చిన ఈ మార్పు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఇది దీర్ఘకాలిక ట్రెండ్ మార్పా, లేక తాత్కాలిక విరామమా అనేది ఇంకా స్పష్టంగా లేదు.
ఈ మొత్తం పెట్టుబడిలో దాదాపు 2.14 బిలియన్ డాలర్లు సెకండరీ మార్కెట్‌లోకి వచ్చాయి. మిగతా సుమారు 299 మిలియన్ డాలర్లు ప్రైమరీ మార్కెట్ ద్వారా ప్రవేశించాయి. సెప్టెంబర్ 2024 తర్వాత ఇదే అతిపెద్ద ఇన్‌ఫ్లోగా గుర్తిస్తున్నారు. అయినప్పటికీ.. గత రెండేళ్లలో జరిగిన భారీ విక్రయాలతో పోలిస్తే ఇది పరిమిత స్థాయి కొనుగోలు మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు. 2024–25 మధ్యకాలంలో FIIలు సుమారు 46 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. మెరుగైన రాబడులు, తక్కువ మూల్యాంకనాల కారణంగా చైనా, తైవాన్, దక్షిణ కొరియా వంటి మార్కెట్లకు నిధులు మళ్లాయి.
ఫిబ్రవరిలో దేశీయ సూచీలు స్థిరంగానే కొనసాగాయి. BSE Sensex, NIFTY 50 దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో ఎంపిక చేసిన కొనుగోళ్లు కనిపించాయి. ఇది పెట్టుబడిదారులు పూర్తిగా తిరిగి వచ్చారని చెప్పడానికి ఇంకా సమయం ఉందని సూచిస్తుంది. ఐటీ రంగం మాత్రం ఇంకా ఒత్తిడిలోనే ఉంది. ఫిబ్రవరి తొలి పక్షంలోనే FIIలు సుమారు 1.21 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ షేర్లను విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా AI ర్యాలీ ప్రభావం, సాంకేతిక రంగంపై అనిశ్చితి వంటి అంశాలు ఈ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ధరలు ఎలా ఉన్నాయో చూడండి..!!
మరోవైపు, కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత మార్కెట్‌లో మూల్యాంకనాలు ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి. లార్జ్‌క్యాప్ షేర్లు సమయ దిద్దుబాటు పొందగా.. మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. రాబోయే 12–18 నెలల్లో కంపెనీల లాభాలు స్థిరపడితే విదేశీ కొనుగోళ్లు మరింత బలపడే అవకాశం ఉంది. ఫిబ్రవరి ఇన్‌ఫ్లోలు మార్కెట్‌కు సానుకూల సంకేతమే అయినప్పటికీ.. దీన్ని పూర్తి స్థాయి ట్రెండ్ మార్పుగా పరిగణించడం ఇప్పటికీ తొందరపాటు అవుతుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తుతం భారత మార్కెట్‌ను మళ్లీ మూల్యాంకనం చేస్తున్న దశలో ఉన్నట్లు చెబుతున్నారు.
Also Read: Gold Silver Rate: బంగారం.. వెండిపై చైనా కీలక ప్రకటన.. ధరలు భారీగా తగ్గే అవకాశం..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Janasena Party: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిపి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, 100 మంది వరకు కార్పొరేషన్, మార్కెట్ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారు. వీరెవరూ కూడా ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడం లేదని ప్రచారం సాగుతోంది. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ సొంత పార్టీ నేతల మీటింగ్‌లో వారిపై మండిపడ్డారు. ఓ దశలో సమావేశం నుంచి వెళ్లిపోయారు. అయినా జనసేన నేతల్లో మార్పు రాలేదని ప్రచార సాగుతోంది.
Also Read: AP Cabinet Expansion: త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ.. రేసులో ఎవరెవరు ఉన్నారో తెలుసా?
కాకినాడ జిల్లాకు సంబంధించి ఎంపీ ఉదయ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పనితీరుపై తరుచు విమర్శలు వస్తున్నాయి. రూరల్ కి చెందిన వైసిపి ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్, మాజీమంత్రి, రూరల్ ఇంచార్జ్ కురసాల కన్నబాబు వరుస సమావేశాలు పెట్టి.. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డు విషయంలో కన్నబాబు ఎన్నో విమర్శలు చేశారు. కానీ ఒక్క విమర్శకు కూడా ఎంపీ లేదంటే ఎమ్మెల్యే కౌంటర్ ఇవ్వలేదని జనసైనికులు సైతం అంగీకరిస్తున్నారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మధ్య దూరం పెరిగిందని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ సంక్రాంతి పర్యటనలో ఎంపీ కనపడలేదు. కాకినాడ గ్రీన్ యూరియా ప్లాంట్ కి ఆయన వచ్చినప్పుడు ఎడమొహం పెడమొగంగానే ఉన్నారు. ఇక రూరల్ ఎమ్మెల్యేను స్వయంగా కడపకు పిలిపించి మరీ అధినేత క్లాస్ తీసుకున్నారు.
Also Read: YS Jagan: మంత్రి వాసంశెట్టిపై పాలు పోసిన మాజీ సీఎం వైఎస్ జగన్
తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, నిడదవోలు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు, పి గన్నవరం నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నిడదవోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుల దుర్గేష్ మంత్రిగా ఉన్నారు. ఆయన పనితీరును సీఎం చంద్రబాబు సైతం ప్రశంసిస్తున్నారు. మంత్రి దుర్గేష్ అధినేత పవన్ కు తలలో నాలుకలా ఉన్నారు. టిడిపి, బిజెపి, జనసేన ఆయన పనితీరు పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆ రెండు జిల్లాల్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు, కాకినాడ జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ పనితీరు మాత్రం సంతృప్తికరంగా లేదని అధినేతకు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం పంపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైసిపి నాయకులు ఉద్యమాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని, కూటమి ప్రజా ప్రతినిధులను తూర్పార పెడుతున్నారు. అయినా వీరు ఎవరూ కౌంటర్ ఇవ్వడం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి మినహా జనసేన నుంచి ఎలాంటి కౌంటర్ రావడంలేదని వైసీపీ సైతం అంగీకరిస్తోంది.
ఇప్పటికే కాకినాడ ఎంపీ, రూరల్ ఎమ్మెల్యే తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను పవన్ పిలిపించి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లాలో పార్టీ కీలక నేతకు కూడా ఆయన క్లాస్ తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పెత్తనంపై ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు దంపతులు నేరుగా రూరల్ ఎమ్మెల్యే నానాజీని టార్గెట్ చేసి ఆయన తమకు ఎలాంటి కార్యక్రమాలు చెప్పడం లేదు. తమను అవమానిస్తున్నారంటూ పార్టీ రూరల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ వివాదం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా వైసీపీ నేతలు చంద్రబాబు, పవన్ లను టార్గెట్ చేసి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు పరుష పదజాలంతో దూషించారు. అయినప్పటికీ అదే సామాజివర్గానికి చెందిన జనసేన ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఒకింత అసంతృప్తి కూడా వ్యక్తమౌతోంది. కుల రాజకీయాలకు ఇచ్చే ప్రాధాన్యత పార్టీకి ఇవ్వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అధిష్టానం మందలించిన తర్వాతే రూరల్ ఎమ్మెల్యే మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించడం ఇప్పుడు చర్చగా మారింది. ప్రభుత్వంలో చంద్రబాబును విమర్శించినా, తనను విమర్శించినా ఒకటే. ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే, ఎంపీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. అన్ని నేనే చూసుకోవాలా..? మీకు పట్టదా..? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు తమ పనితీరు మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రతిపక్షం ముందు పార్టీ చులకన అయిపోతుందని జనసేన సీనియర్ కార్యకర్తలు చెబుతున్నారు.
మరోవైపు కొందరు జనసేన నేతల పనితీరుపై విమర్శలు రావడం, వారి అనుచరులు బహిరంగంగా దందాలు చేయడం, దాడులకు పాల్పడటం వంటి సంఘటనలు చేస్తుండడంతో పార్టీ కి మైనస్ గా మారుతోంది అన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల అనుచరుల పనితీరుపై జిల్లా ఇంటిలిజెన్స్ వర్గాలు అటు సీఎం చంద్రబాబు, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నివేదికలు పంపాయి. అయినప్పటికీ వారిలో మార్పు లేదని చెబుతున్నారు. రైతు కొద్ది గుర్రం అన్న సామెత చందాన ప్రజా ప్రతినిధుల అనుచరులు వారి నాయకుల తరహాలోనే వ్యవహరిస్తున్నారు అంటూ మహిళలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలు అధినేత పవన్ మహిళల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రెస్ నోట్ లు విడుదల చేసారు. అయినప్పటికీ ఓ ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరులుగా ఉన్న ఇద్దరు నాయకులు మహిళల పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర దుమారమే రేపింది. ఇప్పటివరకు దానిపై చర్యలు లేకపోవడంతో మహిళలు కూడా మండిపడుతున్నారు. పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరిలో మార్పు వస్తుందా.. లేక అధినేత మారుతారా అన్న చర్చ ఇప్పుడు ఉమ్మడి తూర్పులో జోరుగా సాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
VI Recharge Plan 140 Details: ఫీచర్ ఫోన్ వినియోగదారులకు వోడాఫోన్ ఐడియా (Vi) తీపి కబురు అందించింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ HMD తో చేతులు కలిపి 'సూపర్ సేవర్ ఆఫర్' పేరుతో అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి నెలా రీఛార్జ్ ఖర్చులతో ఇబ్బంది పడే సామాన్యులకు ఇది గొప్ప ఉపశమనంగా మారనుంది.
ఏమిటీ ఆఫర్?
సాధారణంగా 28 రోజుల కాలపరిమితి ఉన్న అపరిమిత కాలింగ్ ప్లాన్ ధర రూ.199 వరకు ఉంటుంది. కానీ ఈ ప్రత్యేక ఆఫర్ కింద, వినియోగదారులు అదే ప్రయోజనాలను కేవలం రూ.140 కే పొందవచ్చు. అంటే ప్రతి రీఛార్జ్ మీద మీరు దాదాపు రూ.59 వరకు ఆదా చేసుకోవచ్చు.
రూ.140 ప్లాన్ ప్రయోజనాలు:
వ్యాలిడిటీ: 28 రోజులు.
కాలింగ్: అపరిమిత ఉచిత కాల్స్ (Unlimited Calling).
డేటా: 2GB హై-స్పీడ్ డేటా.
SMS: 300 ఉచిత సందేశాలు.
ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది?
ఈ ఆఫర్ ఎంపిక చేసిన కొత్త ఫీచర్ ఫోన్‌లను కొనుగోలు చేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ మోడల్స్ ఇవే.. HMD 100, HMD 101, Nokia 105 Classic వంటి మొబైల్స్‌లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
ఆఫర్ పొందడం ఎలా? (ముఖ్యమైన నిబంధనలు)
పైన పేర్కొన్న మూడు మోడళ్లలో ఏదో ఒక కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయాలి. కొత్త Vi SIM కార్డును తీసుకుని, మొదటి రీఛార్జ్ (FRC) రూ.140 తో చేయాల్సి ఉంటుంది. ఈ సిమ్ కార్డును కేవలం ఆ కొత్త HMD లేదా నోకియా ఫోన్‌లోనే వాడాలి. ఒకవేళ సిమ్‌ను తీసి వేరే స్మార్ట్‌ఫోన్‌లో వేస్తే ఆఫర్ ప్రయోజనాలు నిలిచిపోతాయి. డిసెంబర్ 24, 2025 తర్వాత కొనుగోలు చేసిన ఫోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఆఫర్ వ్యాలిడిటీ: ఈ ప్రత్యేకమైన ప్రమోషనల్ ఆఫర్ జూన్ 30, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరలో ఫోన్ కబుర్లు చెప్పుకోవాలనుకునే వారికి ఇది నిజంగా బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vasamsetti Subhash: ఏపీ క్యాబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాసంశెట్టి సుభాష్ పలు వివాదాలతో వార్తల్లో ఉంటారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా తన సొంత నియోజకవర్గం రామచంద్రపురంలో నిర్వహించిన సంబరాల్లో డాన్సులు చేసిన వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ నేరుగా స్పందించడంతో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి వ్యవహార శైలిని తప్పు బడుతూ చేసిన కామెంట్స్ మరో మలుపు తిరిగాయి.
Also Read: AP Cabinet Expansion: త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ.. రేసులో ఎవరెవరు ఉన్నారో తెలుసా?
రెండు రోజుల క్రితం తాడేపల్లిలో భీమవరంకు చెందిన పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మాజీ సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు బరితెగించారని పలు ఉదాహరణలు చెప్పారు. ఇందులో భాగంగా రామచంద్రపురం లో జరిగిన సంక్రాంతి సంబరాలను ప్రస్తావిస్తూ మంత్రి సుభాష్ అశ్లీల రికార్డింగ్ డ్యాన్స్ లో పాల్గొన్నారని జగన్ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వీడైతే ఏకంగా అసలు అశ్లీల డాన్సులు చేస్తూ చిందులేశాడని అన్నారు. అయితే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం జగన్ మాట్లాడిన విధానం తిరిగి ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా మారింది. సాక్షాత్తు ఒక మంత్రిని వాడు... వీడు అనడం బడుగు బలహీన వర్గాలకు చిన్న చూపా అని మంత్రి సుభాష్ ప్రశ్నించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆయన వర్గీయులు, వర్గీయులు సైతం మంత్రిని వాడు... వీడు అనడంపై మండిపడుతున్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన బీసీ మంత్రి సుభాష్ పై జగన్ అలా కామెంట్ చేసి అవమానించడంతో రానున్న రోజుల్లో తాము ఏంటో చూపిస్తామని కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు మంత్రి సుభాష్ డాన్స్ చేసింది మహిళ గెటప్ లో ఉన్న జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ తో అని జగన్ కామెంట్స్ తర్వాత వెలుగులోకి వచ్చింది. తాను ఎవరితో డాన్స్ చేశానో తెలియకుండా మాజీ సీఎం జగన్ ఎవరో రాసిచ్చింది చదివారని మంత్రి సుభాష్ మండిపడుతున్నారు. కళాకారులకు రికార్డింగ్ డాన్సులకూ తేడా తెలియడం లేదని.. కనీసం మాజీ మంత్రి రోజాను అడిగినా చెప్పేవారని అంటున్నారు. తాము బలవంతం పెడితేనే మంత్రి సుభాష్ తమతో రెండు స్టెప్పులు వేసారని జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ సైతం ప్రకటించాడు.
ఇక ఏపీలో అరాచక పరిస్థితులు జంగిల్ రాజ్ తరహాలో ఉన్నాయని పలు ఉదాహరణలు చెబుతూ.. మాజీ సీఎం జగన్ రామచంద్రాపురంలో మంత్రి డ్యాన్సులు వ్యవహారాన్ని ప్రస్తావించారు. అయితే ఈ విషయంలో మంత్రిని అవమానించేలా వాడు మాట్లాడటమే ఎక్కువగా రచ్చ అవుతోంది. దీనిపై మంత్రి సుభాష్ తో పాటు ఆయన అనుచరులు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఇది మంత్రి సుభాష్ కు పరోక్షంగా కలిసి వచ్చే అంశం అవుతుందా అనే చర్చ సైతం మొదలైంది. బడుగు బలహీన వర్గాలను జగన్ అవమానించారు అనే అంశాన్ని టిడిపి ప్రజల్లోకి తీసుకువెళుతుంది. దీంతోపాటు ఇదే వ్యవహారంలో జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ సైతం జగన్ వ్యాఖ్యలను బహిరంగంగా తప్పుపట్టారు. ఈ అంశాలు గమనిస్తే మంత్రి సుభాష్ ఈ విషయంలో టిడిపికి ప్లస్ పాయింట్ గా మారినట్లుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు మంత్రి సుభాష్ పై వివాదాలు... పనితీరు ర్యాంకింగ్ లో వెనుకబాటు.. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ముద్ర వంటివి మైనస్ గా ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే.. మంత్రి సుభాష్ ఉద్దేశ పూర్వకంగానే డాన్సర్ లో పాల్గొన్నట్లుగా చర్చ జరుగుతోంది. గతంలో వైసీపీ మంత్రులు డాన్సులు చేసినప్పుడు ఎలా ట్రోల్ అయ్యారో అందరికీ తెలిసిందే. అయితే తాను కూడా డాన్స్ లో పాల్గొంటే తనను కూడా ట్రోల్ చేస్తారని.. తద్వారా తన అనుచరులు లేదా సామాజిక వర్గం నుంచి మద్దతు ఉంటుందనే వ్యూహాన్ని కూడా మంత్రి సుభాష్ అవలంబించారా అనే చర్చ సైతం జరుగుతోంది. మరోవైపు జగన్ మాటలతో అవమానం సుభాష్ పై పాలు పోసినట్లు అయ్యిందనే చర్చ సైతం జరుగుతోంది. మొత్తం మీద సీఎం చంద్రబాబు క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేస్తే మంత్రి సుభాష్ ను తప్పించడం ఖాయం అనే ప్రచారం సైతం జోరుగా ఉంది. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యల వ్యవహారంతో వైసీపీ విమర్శలను మంత్రి సుభాష్ ధీటుగానే తిప్పికొట్టినట్లుగా కనిపిస్తోంది. దీంతో జగన్ కామెంట్స్ మంత్రి సుభాష్ కు పరోక్షంగా కలిసి వచ్చినట్లుగానే చర్చ జరుగుతుంది. తదుపరి ఏం జరుగుతుందో చూడాలి మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Saturn And Sun Conjunction Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడితో పాటు శని గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రెండు గ్రహాలను శాస్త్రంలో తండ్రి కొడుకులు గా పరిగణిస్తారు ఈ రెండు గ్రహాల మధ్య శత్రుత్వం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రత్యేకమైన సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. మార్చి 25వ తేదీన సూర్యుడితో పాటు శని గ్రహ సంయోగం జరిగింది దీని కారణంగా మొత్తం అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడింది.. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సూర్యుడు అనుగ్రహం అందిస్తే.. మరికొన్ని రాశుల వారికి శని దుష్ప్రభావాలను అందిస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారిపై తీవ్ర దశ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆయారాశుల వారికి ఈ సమయంలో కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశుల వారిపై దుష్ప్రభావం:
మేష రాశి
సూర్యుడు శని కలయిక కారణంగా మేష రాశి వారికి ఈ సమయంలో కొన్ని రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు బాస్‌తో పాటు ఇతర అధికారులతో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం పై కూడా ఆందోళన చెందాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు సూర్యుడు శని రెండు గ్రహాల కలయికతో వ్యక్తిగత జీవితంలో అనేక సమస్య లేదు రావచ్చు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఆటంకాలు రావడం ప్రారంభమవుతాయి.. అలాగే భాగస్వామ్య వ్యాపారాల్లో తీవ్ర నష్టాలు కూడా సంభవిస్తాయి.. ముఖ్యంగా కమ్యూనికేషన్ దెబ్బతినడం కారణంగా కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు మరింత దెబ్బతింటాయి.. భాగస్వామితో ఎంతో ఓపికగా మాట్లాడడం మంచిది. అవసరమైన ఖర్చులు కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది.
కన్యారాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు సూర్యుడు శని సంయోగంతో కొన్ని రకాల కీడు సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. శత్రువులు మీకు నష్టం కలిగించే పనులు చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడమే కాకుండా కొన్ని పనుల్లో ఎంతో ఆ జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా వీరు చట్టపరమైన కేసుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు వృత్తి వ్యాపారాల పరంగా కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభించకపోవడంతో మానసికంగా ఒత్తిడికి గురవుతారు. అలాగే ఈ సమయంలో తీవ్ర నిరాశ చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఉద్యోగాలు మారాలనుకుంటున్న వ్యక్తులు తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.. కుటుంబంలో ఆస్తి కోసం గొడవలు కూడా తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎంతో ఓపికగా ఉండి కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్నో రకాల తీవ్ర సమస్యలకు దారి తీయవచ్చు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Silver Trading: బుధవారం అంతర్జాతీయ లోహాల మార్కెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ డెరివేటివ్స్ ట్రేడింగ్ వేదిక CME Group నిర్వహించే CME Globexలో సాంకేతిక లోపం తలెత్తడంతో బంగారం, వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. మధ్యాహ్నం సుమారు 12:15 గంటలకు (CT) ట్రేడింగ్ ఆగిపోవడంతో పెట్టుబడిదారుల్లో అనేక సందేహాలు వెల్లువెత్తాయి.
అయితే ఈ సాంకేతిక సమస్యల సమయంలో ఎక్స్చేంజ్‌లు సాధారణంగా మార్కెట్‌ను స్థిరంగా ఉంచేందుకు ట్రేడింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తాయి. ఇది ధరలను నియంత్రించేందుకు కాదు. తప్పు ఆర్డర్లు, సిస్టమ్ లోపాలు లేదా అసాధారణ హెచ్చుతగ్గులను నివారించేందుకు తీసుకునే జాగ్రత్త చర్య అని చెప్పాలి. మొదట సహజ వాయువు మార్కెట్‌ను పునఃప్రారంభించి.. ఆ తర్వాత బంగారం, వెండి కాంట్రాక్టులను తిరిగి ప్రారంభించారు.
సాధారణ పెట్టుబడిదారుడి దృష్టిలో ట్రేడింగ్ నిలిపివేత అనేది ధరలు తప్పనిసరిగా పెరుగుతాయని లేదా పడిపోతాయని సూచించదు. అయితే మార్కెట్ అకస్మాత్తుగా ఆగిపోతే అనిశ్చితి పెరుగుతుంది. తిరిగి ప్రారంభమైన వెంటనే వాల్యూమ్ ఒక్కసారిగా పెరగడం లేదా షార్ట్ కవరింగ్ జరగడం వల్ల పదునైన హెచ్చుతగ్గులు సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో ట్రేడర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారు.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ధరలు ఎలా ఉన్నాయో చూడండి..!!
గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెండి ధరలు గణనీయంగా పెరిగిన సందర్భం కూడా ఉంది. అప్పట్లో షార్ట్ పొజిషన్లు చిక్కుకోవడంతో ధరలు వేగంగా పెరిగాయి. అయితే చరిత్ర ప్రతిసారి పునరావృతం కావాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ ఆర్థిక వాతావరణం, డాలర్ బలం, పెట్టుబడిదారుల భావోద్వేగాలు కీలక పాత్ర పోషిస్తాయి.
మార్కెట్ తిరిగి తెరుచుకున్న తర్వాత భారీ కొనుగోళ్లు, షార్ట్ కవరింగ్ లేదా అంతర్జాతీయ అనిశ్చితి పెరిగితే బంగారం, వెండి ధరలు బుల్లిష్ ధోరణి కనబరచవచ్చు. మరోవైపు ట్రేడింగ్ సాధారణ స్థితిలోకి వస్తే, పెద్ద పెట్టుబడిదారులు కొత్త పొజిషన్లు తీసుకోకపోతే లేదా అమెరికన్ డాలర్ బలపడితే ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.ముఖ్యంగా, ఒక్క సంఘటన ఆధారంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తమ వ్యూహాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కానీ స్వల్పకాలిక ట్రేడర్లు మాత్రం అస్థిరతకు సిద్ధంగా ఉండాలి. మార్కెట్ నిజమైన దిశ ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైన తర్వాత వాల్యూమ్.. ట్రెండ్ ఆధారంగా స్పష్టమవుతుంది.
Also Read: Gold Silver Rate: బంగారం.. వెండిపై చైనా కీలక ప్రకటన.. ధరలు భారీగా తగ్గే అవకాశం..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahalaxmi Raja Yoga Effect On Zodiac Telugu: కుజుడు చంద్రుని అనుకూల స్థానం ఎంతో శక్తివంతమైన రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఇది ఆకస్మిక ఆర్థిక లాభాలతో పాటు ప్రమోషన్లు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా మార్చి 16వ తేదీన గ్రహాలకి అధిపతి, ధైర్యానికి కారకుడైన కుజుడు, మనసుకు కారకుడైన చంద్రుడు సంయోగం చేయబోతున్నాయి. దీంతో ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. సాధారణంగా ఈ రాజయోగానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మహాలక్ష్మి రాజయోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి అపారమైన ధన లాభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఆయారాశుల వారికి అన్ని రకాల సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి.. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టే వారికి చాలా అనుకూలంగా ఈ సమయం మారుతుంది. అయితే, మార్చి 16వ తేదీ నుంచి మహాలక్ష్మి రాజయోగంతో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే, లాభాలు!
వృషభ రాశి
మహాలక్ష్మి రాజయోగం వృషభరాశి వారికి గణనీయమైన ఫలితాలను అందించబోతోంది. ముఖ్యంగా జీవితంలో ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. వ్యాపారాల్లో గణనీయమైన లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తులకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త ప్రణాళికలతో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అలాగే కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించబోతోంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ప్రమోషన్స్ లభించడమే కాకుండా గణనీయంగా జీతాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు స్నేహితుల సపోర్టుతో మానసిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే విపరీతంగా ఆనందం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాత ప్రణాళికల్లో.. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చిక రాశి
కుజుడు చంద్రుడి అద్భుతమైన సంయోగంతో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగంతో వృశ్చిక రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా సానుకూలమైన మార్పులు ప్రారంభమవుతాయి. అలాగే సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో సరైన నిర్ణయాలు కూడా తీసుకుని అద్భుతమైన ముందడుగు వేస్తారు. కుటుంబంలో ఈ సమయంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
ధనస్సు రాశి
మహాలక్ష్మి రాజయోగంతో ధనస్సు రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. కుటుంబ జీవితంలో ఏవైనా అపార్ధాలు ఉంటే ఈ సమయంలో పూర్తిగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. ఎంతో ఓపికగా ఉంటూ.. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. అలాగే పెద్ద సమస్యల నుంచి ఉపశమనం కలగబోతోంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bill Gates: మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి అంతర్జాతీయ వార్తల్లో చర్చకు దారి తీశారు. బాలలపై లైంగిక నేరాల కేసుల్లో నిందితుడు జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్ స్టీన్ ఫైల్ బయటకు పొక్కడంతో బిల్ గేట్స్ గతంలో చేసిన తప్పులను ఒప్పుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. దివంగత ఆర్థికవేత్త.. లైంగిక నేర కేసుల్లో నిందితుడిగా నిలిచిన Jeffrey Epsteinతో గతంలో తనకు ఉన్న పరిచయంపై ఆయన బహిరంగంగా స్పందిస్తూ తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘Bill & Melinda Gates Foundation’ సిబ్బందితో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో గేట్స్ ఈ అంశంపై స్పష్టంగా మాట్లాడారు. ఎప్‌స్టీన్‌తో గడపడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పిదమని.. ఆ నిర్ణయం సంస్థ విలువలకు విరుద్ధమైందని ఆయన అంగీకరించారు.
సమావేశంలో భావోద్వేగానికి లోనైన గేట్స్.. నా నిర్ణయం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలి. ఈ విషయానికి పూర్తి బాధ్యత నాదే అని అన్నారు. ఫౌండేషన్ ప్రతిష్ఠ ఎంతో కీలకమని, ఇటువంటి వివాదాలు దాతలు, భాగస్వాములు, సిబ్బందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్‌తో సంబంధం కొనసాగించడం ఒక తీవ్రమైన తీర్మాన దోషమని, ఆ సమయంలో తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు తనకు విచారం ఉందని చెప్పారు.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ధరలు ఎలా ఉన్నాయో చూడండి..!!
ఇటీవల United States Department of Justice విడుదల చేసిన పత్రాల్లో ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఈమెయిల్ ముసాయిదాలు బయటకు రావడంతో వివాదం మళ్లీ ముదిరింది. వాటిలో గేట్స్‌పై పరోక్షంగా కొన్ని ఆరోపణలు ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను గేట్స్ ఖండిస్తూ తాను ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్‌తో ఉన్న పరిచయం తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలిగించిందని, కానీ అక్రమ చర్యలకు తాను పాల్పడలేదని తెలిపారు.
ఫౌండేషన్ తరఫున ఎప్‌స్టీన్ లేదా అతని అనుబంధులతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్–2026లో గేట్స్ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన హాజరు కాలేదని తెలియజేశారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పలువురు ప్రముఖుల పేర్లు బయటపడటంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా మరింత చర్చనీయాంశమైంది.
Also Read: Gold Silver Rate: బంగారం.. వెండిపై చైనా కీలక ప్రకటన.. ధరలు భారీగా తగ్గే అవకాశం..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook