Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500033
Kendra Trikona Raj Yoga: మార్చి 28వ తేదీ వరకు కేంద్ర త్రికోణ రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి గోల్డె...
DDDharmaraju Dhurishetty
Mar 07, 2026 05:51:09
Hyderabad, Telangana

Kendra Trikona Raj Yoga Effect On Zodiac Telugu: మార్చి 2న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనిని ఒక ప్రత్యేకమైన సంచారంగా భావిస్తారు. శని ఇప్పటికే అదేమైనా రాశిలో సంచార దశలో ఉన్నాడు. అయితే శుక్రుడి రాకతో రెండు గ్రహాలు కలయిక జరిగింది. దీనినే జ్యోతిష్య పరిభాషలో సంయోగంగా పిలుస్తారు. అయితే, ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం ఏర్పడడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా దీనివల్ల జీవితంలో సౌకర్యాలు పెరగడమే కాకుండా.. కెరీర్లో పురోగతి లభించి, ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. దీంతోపాటు ఈ సమయంలో మూడు రాశుల వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా ఎన్నో రకాల అద్భుతమైన లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కేంద్ర త్రికోణ రాజయోగం ఎఫెక్ట్..
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడితో పాటు శని గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉంటే కేంద్ర త్రికోణ రాజయోగ ప్రభావం అంత ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి అపారమైన సంపాదన అందిస్తుంది. దీంతోపాటు ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలను అందించే అవకాశాలున్నాయి. మార్చి 26వ తేదీ వరకు రెండు గ్రహాలు సంయోగ దశలోనే ఉంటాయి. దీంతో అప్పటివరకు ఆయారాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.

మేషరాశి 
మేష రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగ ప్రభావం అద్భుతమైన ప్రయోజనాలనుందిస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయి. నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసే వారికి కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. ఈ సమయంలో కుటుంబ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వివాహానికి అర్హులైన వ్యక్తులకు మంచి లాభాలు కలుగుతాయి. దీంతోపాటు భాగస్వామ్య జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 

వృషభ రాశి 
వృషభ రాశి వారికి జీవితంలో సానుకూలమైన మార్పులను తీసుకువస్తుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొత్త ఆధార్ వనరులు కూడా లభిస్తాయి. ముఖ్యంగా జీతాలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే అద్భుతమైన పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారవేత్తలకు ఈ సమయంలో లాభాలు రావడం కూడా వస్తాయి. కొంతకాలంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు పరిష్కారం కూడా లభిస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

ధనస్సు రాశి 
కేంద్ర త్రికోణ రాజయోగ ప్రభావం వల్ల ధనస్సు రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలను పొందగలుగుతారు. ఆరోగ్యం కూడా చాలావరకు బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇళ్లతో పాటు వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా జీవితంలో సానుకూలమైన మార్పులను పొందడమే కాకుండా.. అద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతారు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Mar 07, 2026 07:18:19
Ahmedabad, Gujarat:

India Vs New Zealand Final Playing 11: మరికొద్ది గంటల్లో టీ20 ప్రపంచకప్ 2026 విజేత ఎవరో తేలిపోనుంది! అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం అనగా మార్చి 8వ తేదీ జరగనున్న ఈ సూపర్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌ను 'ప్లేయింగ్ XI' ఎంపిక తీవ్రంగా కలవరపెడుతోంది.

సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించినప్పటికీ, భారత బౌలింగ్ విభాగంలో కొన్ని లొసుగులు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ టీమ్‌కు ఆందోళన కలిగిస్తోంది.

ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నప్పటికీ, సెమీఫైనల్‌లో వరుణ్ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో బౌలింగ్ సంధించి ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. వరుణ్ ప్రతి బంతికి అతిగా ఆలోచిస్తూ తన మార్క్‌ను కోల్పోతున్నాడనే వాదన వినిపిస్తుంది. వికెట్ కీపర్ సంజూ శాంసన్ అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

అహ్మదాబాద్ పిచ్ - సిరాజ్ రాక!
నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ నల్లరేగడి, ఎర్రమట్టి మిశ్రమంతో తయారు చేశారు. ఇది బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున, భారత్ అదనపు పేసర్‌ను ఆడించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే మైదానంలో సౌతాఫ్రికా పేసర్లను వాడి సక్సెస్ అయింది. అదే ఫార్ములాను భారత్ అనుసరిస్తే వరుణ్ స్థానంలో సిరాజ్ జట్టులోకి రావచ్చు.

వాషింగ్టన్ సుందర్ అవసరమేనా?
కివీస్ జట్టులో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. వారిని అడ్డుకోవడానికి ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కీలకం కాగలడు. అయితే, సుందర్‌ను తీసుకోవాలంటే ఇన్-ఫామ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడం అసాధ్యం. కాబట్టి వరుణ్ స్థానంలో సుందర్‌ను ఆడించే అవకాశాలూ ఉన్నాయి.

వరుణ్ చక్రవర్తి విఫలమవుతున్న నేపథ్యంలో, అనుభవం ఉన్న కుల్దీప్ యాదవ్ పేరును కూడా మేనేజ్‌మెంట్ పరిశీలిస్తోంది. పెద్ద మ్యాచ్‌ల్లో కుల్దీప్ మ్యాజిక్ జట్టుకు ప్లస్ అవుతుందని కొందరు భావిస్తున్నారు.

భారత్ ముందున్న సవాళ్లు..
టీమ్ఇండియా ఐదో బౌలర్ కష్టాలు ఎదురుకానున్నాయి. శివమ్ దూబే ఎకానమీ రేట్ (14.12) ఆందోళనకరంగా ఉంది. ఐదో బౌలర్ కోటా పూర్తి చేయడం ఇప్పుడు తలనొప్పిగా మారింది. సాధారణంగా గెలిచే జట్టును మార్చడానికి మేనేజ్‌మెంట్ ఇష్టపడదు. ఈ సెంటిమెంట్‌ను పాటిస్తే వరుణ్‌కు మరో అవకాశం దక్కవచ్చు.

ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌లో పిచ్ కండిషన్స్, న్యూజిలాండ్ బ్యాటర్ల బలాబలాలను బట్టి రోహిత్ శర్మ అండ్ కో తుది నిర్ణయం తీసుకోనుంది. వరుణ్ తన స్పిన్ మ్యాజిక్‌ను మళ్లీ ప్రదర్శిస్తాడా లేక సిరాజ్/కుల్దీప్ రంగ ప్రవేశం చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

Also Read: IND Vs ENG Match Turning Moment: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో కీలక మలుపు..ఈ మూడు జరగకపోయి ఉంటే టీమ్ఇండియా ఓడిపోయేది!

Also Read: Pakistan Cricketer Controversy: శ్రీలంక హోటల్‌లో అసభ్యంగా ప్రవర్తించిన క్రికెటర్ ఇతడే..పాక్ బోర్డుకు దిమ్మతిరిగే న్యూస్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 07, 2026 06:43:40
Kandy, Central Province:

Pakistan Cricketer Controversy Post: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక వచ్చిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అటు సూపర్-8 దశ నుంచి పాక్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇప్పుడు ఆ జట్టు ఆటగాడు హోటల్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బయటపడింది. 

పాక్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ సల్మాన్ మీర్జా మహిళా హౌస్ కీపింగ్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. శ్రీలంకలోని కాండీలోని ఒక హోటల్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగితో ఆటగాడు సల్మాన్ మీర్జా అసభ్యంగా ప్రవర్తించాడని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్తాన్ పేసర్ సల్మాన్ మీర్జా.. వాటిని ఖండించారు. అవి పూర్తిగా నిరాధారమైన వార్తలని స్పష్టం చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. పూర్తిగా అవాస్తవం అని పేర్కొంది. ఈ ఆరోపణల వల్ల తమ ఆటగాడి ప్రతిష్టను దెబ్బతీసేందుకు వ్యాప్తి చేసిన నకిలీ వార్తలు అని బోర్డు పేర్కొంది.

అయితే తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని పేసర్ సల్మాన్ మీర్జా సోషల్ మీడియాలో తనను తాను సమర్థించుకున్నారు. పాకిస్తాన్ క్రికెటర్ ఈ వార్తలను ఖండిస్తూనే.. చౌకబారు జర్నలిజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ లో సల్మాన్ మీర్జా ఈ విధంగా స్పందించారు. "వార్తల్లో పూర్తిగా అసంబద్ధమైన కథనం ప్రసారం అవుతోంది. ఈ రకమైన చౌక జర్నలిజాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ మీడియా సంస్థ కూడా ధృవీకరణ లేకుండా అలాంటి వార్తలను ప్రచురించకూడదు" అని పోస్ట్ పెట్టాడు.

సల్మాన్ మీర్జా ఈ పోస్ట్‌లో.. తనపై తప్పుడు వార్తలు ప్రచురించిన ఛానెల్, జర్నలిస్టుల పేర్లను కూడా ప్రస్తావించారు. వీటిపై తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సల్మాన్ హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రభుత్వం నుండి తక్షణమే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "#PakistanCricketBoard ఇప్పటికే ఈ నిరాధారమైన వార్తలను తిరస్కరించడం సహా ఖండించింది. నేను ARY న్యూస్ జర్నలిస్ట్ షాహిద్ హష్మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఇటువంటి చెత్త వార్తలను వెంటనే ఆపేయాలి. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని సల్మాన్ మీర్జా రాసుకొచ్చారు.

అంతకుముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. సంబంధిత ప్రచారాన్ని మొదలుపెట్టిన జర్నలిస్టు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. "మా ఆటగాళ్ల వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దానిని ఒక ఎజెండాలో భాగంగా వ్యాప్తి చేయడం మంచి పద్ధతి కాదు. దీనికి కారణమైన రిపోర్టర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకుంటే PCB అటువంటి తప్పుడు, హానికరమైన కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటుంది" అని పాక్ బోర్డు స్పష్టం చేసింది. 

శ్రీలంకలోని కాండీలోని జట్టు హోటల్‌లో బస చేస్తున్నప్పుడు ఒక మహిళా సిబ్బందితో పాక్ ఆటగాళ్లలో ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడని వార్తలు వచ్చాయి. అయితే పాక్ కు చెందిన ARY న్యూస్ తమ నివేదికలో ఆ క్రికెటర్ సల్మాన్ మీర్జా అంటూ పేర్కొంది. దీంతో ఆధారాలు లేకుండా తన పేరును ఎలా ఆరోపిస్తారంటూ క్రికెటర్ సల్మాన్ మీర్జా స్పందించారు.

Also Read: Talliki Vandanam Scheme: 'తల్లికి వందనం' డబ్బు జమ కాలేదా? వాళ్లకి త్వరలోనే అకౌంట్లోకి..మంత్రి లోకేష్ హామీ!

Also Read: IND Vs ENG Match Turning Moment: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో కీలక మలుపు..ఈ మూడు జరగకపోయి ఉంటే టీమ్ఇండియా ఓడిపోయేది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 07, 2026 06:05:07
Hyderabad, Telangana:

Iqoo 15r Price Cut: భారత మార్కెట్‌లోకి విడుదలయ్యే iQOO స్మార్ట్ ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంటుంది ఇవి తక్కువ ధరల్లోనే అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా గేమింగ్ చేసేందుకు ఎంతగానో వీలుంటుంది. అందుకే చాలామంది ఈ మొబైల్స్ ని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో ఇదే బ్రాండ్‌లో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ స్టోరీ మీకోసమే.  ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఈ బ్రాండ్ కు సంబంధించిన కొన్ని మొబైల్‌పై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 

ముఖ్యంగా iQOO 15R (Triumph Silver) స్మార్ట్‌ఫోన్స్ అత్యంత అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ఫిబ్రవరి 24వ తేదీన భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, అప్పటినుంచి ఇప్పటివరకు ఈ మొబైల్ ఎన్నో రకాల స్పెషల్ తీసుకుంట ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.

iQOO 15R స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. 6.59-ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 5000 nits పీక్ బ్రైట్‌నెస్ ప్రాసెసర్ తో లభిస్తోంది. ఎండలో కూడా డిస్ప్లే బాగా కనిపించేందుకు స్పెషల్ బ్రైట్నెస్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా మరెన్నో డిస్ప్లే ఫీచర్స్ లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 5 (3nm) ప్రాసెసర్‌తో విడుదలైంది. గేమింగ్స్ ఆడుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మల్టీ టాకింగ్ చేసే సమయంలో లాగ్ అవ్వకుండా చాలా వరకు సహాయపడుతుంది. అలాగే ఇది వివిధ స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. 

ఈ మొబైల్ వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది Sony LYT-700V, OIS సెన్సార్‌తో 50MP కెమెరాతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో లభిస్తుంది. దీంతోపాటు ఫ్రంట్ భాగంలో 32MP కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 7,600mAh (సిలికాన్ ఆనోడ్ బ్యాటరీ) బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. సుమారు 63 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. అలాగే ఇది Android 16 ఆధారితం OS OriginOS 6 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ Triumph Silver కలర్ వేరియంట్ గ్లాస్ బ్యాక్‌తో ప్రత్యేకమైన ప్రీమియం లుక్కున అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో SuperComputing Chip Q2 కూడా అందుబాటులో ఉంది. గేమింగ్ సమయంలో స్టేబుల్ ఫ్రేమ్ రేట్స్‌తో పాటు తక్కువ లాగిన్ ఉంటుంది. అలాగే ఇది నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ తో పాటు ఆరేళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను కూడా అందిస్తుంది. iQOO 15R బేస్ వేరియంట్ ధర మార్కెట్‌లో MRP రూ.53,999 నుంచి ప్రారంభమవుతుంది.  అయితే, ఇప్పుడే అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి కేవలం రూ.44,989 లభిస్తోంది. ఇక దీనిని అమెజాన్‌లో హెచ్డిఎఫ్సి లేదా యాక్సిస్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.4,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.40 వేల లోపే పొందవచ్చు. 

అంతేకాకుండా ఈ మొబైల్‌ను ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన బోనస్ కూడా లభిస్తుంది. ఇందులో భాగంగా మీ దగ్గర ఉన్న ఏదైనా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే  ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.38 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.2 వేల లోపే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్ పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 06, 2026 16:43:20
Hyderabad, Telangana:

Hyderabad: వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శుక్రవారం 'అలైడ్ అండ్ హెల్త్‌ కేర్ ఇండస్ట్రీ సమ్మిట్' ఘనంగా జరిగింది. యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు, అకడమిక్ రంగానికి, పారిశ్రామిక అవసరాలకు మధ్య ఒక బలమైన వారధిగా నిలిచింది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు, వ్యాక్సిన్ తయారీ కేంద్రాలు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లకు చెందిన ప్రతినిధులతో పాటు 40కి పైగా జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థలు పాల్గొన్నాయి.

అపోలో హాస్పిటల్స్, కిమ్స్, మెడికవర్, సిటిజన్ హాస్పిటల్స్, జైస్ వంటి అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులు హాజరై విద్యార్థులతో ముఖాముఖి చర్చలు చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ చామకూర మల్లారెడ్డి ప్రోత్సాహంతో జరిగిన ఈ కార్యక్రమంలో తరగతి గది అభ్యాసాన్ని వాస్తవ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చడం, అలైడ్ హెల్త్‌ కేర్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మారుతున్న ఆరోగ్య రంగ అవసరాలకు తగ్గట్టుగా హెల్త్‌ కేర్ వర్కర్స్ ఫోర్స్ సిద్ధం చేయడం వంటి అంశాలపై నిపుణులు చర్చించారు.

భవిష్యత్ అవకాశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులను అంతర్జాతీయ హెల్త్‌ కేర్ మార్కెట్‌కు సిద్ధం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సదస్సు ముగింపులో విద్యార్థులకు వివిధ సంస్థలలో ఇంటర్న్‌ షిప్ మరియు ప్లేస్‌మెంట్ అవకాశాలను కల్పించడంపై స్పష్టమైన హామీ లభించింది. ఈ సదస్సుతో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన నిపుణులను అందించడంలో మల్లారెడ్డి యూనివర్సిటీ తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. ఈ సదస్సుకు కేబీకే గ్రూప్ చైర్మన్, మెధాజెన్ ఏఐ సీఈవో డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ వీఎస్‌కే రెడ్డి, డీన్స్ డాక్టర్ ఎస్. అపర్ణ, డాక్టర్ ఎం. సుజీర్ బాషా అధికారులు సమన్వయం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 06, 2026 16:15:52
Hyderabad, Telangana:

Retirement Benefits: 'ప్ర‌తి నెల వెయ్యి మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. నెల‌కు రూ.వెయ్యి కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వ‌స్తోంది. అయినా స‌మ‌న్వ‌యం చేసుకుని ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నాం. ప్ర‌భుత్వ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చే బాధ్య‌త ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ది. అక్ర‌మాల‌ను అరిక‌ట్టి ఖ‌జానాకు నిధులు తీసుకువ‌స్తే ప‌ది మందికి స‌హాయం అందుతుంది' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'గ‌తంలో జాగీరుదారులు, జ‌మీందార్ల ద‌గ్గ‌ర వేలాది ఎక‌రాల భూములు ఉండేవి. అసైన్డ్ భూముల విష‌యంలో ప్ర‌భుత్వం అన్నిర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంది. పంచ‌డానికి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భూములు లేవు. ప్ర‌భుత్వానికి ఆర్థిక వెసులుబాటు ప‌రిమితంగా ఉంది. దారిద్ర్య రేఖ లో ఉన్న జాతి ముందుకు న‌డ‌వాలంటే విద్య అవ‌స‌రం' అని తెలంగాణ సీఎం తెలిపారు.

Also Read: Virosh Gold: విజయ్, రష్మిక పెళ్లిలో 257 తులాల బంగారం.. ఇక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?

హైదరాబాద్‌లోని శిల్పా క‌ళా వేదిక‌లో నిర్వహించిన మాదిగ ఉద్యోగుల కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో తెలంగాణ సీఎం కీలక ప్రసంగం చేశారు. 'మాట‌లు, మూట‌ల‌తో అయితే మేం ఎన్నిక‌ల్లో గెలిచేవాళ్లం కాదు. చాలా కాలం నుంచి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం న‌లుగుతోంది. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలా అయితే సాధించుకోవాల‌నే త‌ప‌న‌తో కొంద‌రు ప్రాణ త్యాగాలు చేశారు' అని తెలంగాణ సీఎం తెలిపారు.  'ఎన్నో చిక్కుముడులు, క‌మిష‌న్లు, త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ స‌మ‌స్య‌ను ప్ర‌త్య‌క్షంగా నేను చూస్తూ వ‌స్తున్నా. మీరు కోట్లాడిన ప్ర‌తి సంద‌ర్భంలో నా చేత‌నైనా సాయం చేస్తూ వ‌చ్చా. నాకు మ‌హాభార‌తంలో క‌ర్ణుడు, బార్బ‌రీకుడు అనే పాత్ర‌లు ఇష్టం. కర్ణుడికి అవ‌మానం జ‌రిగిన‌ప్పుడు పోరాటం చేశారు.. మిత్ర‌ధ‌ర్మాన్ని నేర‌వేర్చాడు. నేను కూడా మిత్ర‌ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించా. మాదిగ‌ల‌కు నేను అండ‌గా నిల‌బ‌డ్డా' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Also Read: Golden Duck: ఇది నిజంగా బంగారు బాతు.. పొట్ట కోస్తే పది గ్రాముల బంగారం లభ్యం

'ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు.. బ‌ల‌హీనుల ప‌ట్ల నిల‌బ‌డి కొట్లాడ‌టం అనే గొప్ప ల‌క్ష‌ణం ఉన్న‌వాడు. వ‌ర్గీక‌ర‌ణలో న్యాయం ఉంది. మీరు బ‌ల‌హీనులు కాబ‌ట్టే నేను మీకు అండ‌గా నిల‌బ‌డ్డా. రాజ‌కీయ‌ప‌ర‌మైన ఒత్తిడి వ‌చ్చినా మాదిగ‌ల ప‌క్క‌న నిల‌బ‌డ్డా' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'నా ప్ర‌య‌త్నంలో  మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు, అధికారులు స‌మ‌య‌స్పూర్తిని చూపించి అండ‌గా నిల‌బ‌డ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల త‌ర్వాత వ‌ర్గీక‌ర‌ణ‌ను అమ‌లు చేసిన మొద‌టి రాష్ట్రం మ‌న‌దే. వ‌ర్గీక‌ర‌ణ అన్ని స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం చూపించ‌క‌పోచ్చు' అని వివరించారు.

'ప్ర‌మోష‌న్లు, ఉన్న‌త విద్య‌, భూములు , లిడ్ క్యాప్ భూములను కాపాడుకోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం పెద్ద విష‌యం కాదు. ముందుండి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న‌ప్పుడు వెనుక నుంచి జ‌రిగే దాడుల‌ను మీరు ఆపాలి. వెన‌క నుంచి జ‌రిగే దాడుల విష‌యంలో మీ జాతి నాకు అండ‌గా ఉండాలి' అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండి స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.

'ప్ర‌భుత్వానికి క‌ళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడ‌ర్లు నా ప్ర‌భుత్వ ఉద్యోగులే. 99 రోజుల ప్ర‌జా పాల‌న‌.. ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మాన్ని తీసుకున్నాం. ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నాం. ప్ర‌తిపేద వాడికి రేష‌న్ కార్డు అందాలంటే మీరు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి. స‌న్న బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి కోసం పేద‌లు ఎదురు చూస్తున్నారు' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'అత్యంత వెనుక‌బాటు త‌నంలో మాదిగ జాతి ఉంది.. ప్ర‌భుత్వ. ఉద్యోగులు వాళ్ల‌కు అండ‌గా ఉండాలి. సంక్షేమం, అభివృద్ధి ని అందించాల‌న్న‌దే మా సంకల్పం' అని ప్రకటించారు.

'నా ద‌గ్గ‌ర ఉన్న విద్యా శాఖ‌ల‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నా. నాణ్య‌మైన విద్య కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాం. ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో చ‌దువుకునే విద్యార్థుల‌కు కాస్మోటిక్ , డైట్ ఛార్జీలు పెంచాం. విద్య ఒక్క‌టే మీ జీవితంలో మార్పు తీసుకువ‌స్తుంది. అవ‌కాశం వ‌స్తే ప‌ది మందికి సాయం చేస్తార‌నే మంచి పేరు మీరు, నేను తెచ్చుకోవాలి' అని రేవత్‌ రెడ్డి తెలిపారు. 'మీ జాతి కోసం ఏం చేయాలో అన్ని చేస్తాం..మీ హ‌క్కుల‌ను చ‌ట్ట‌బ‌ద్దం చేసి కాపాడుతాం' అని తెలంగాణ సీఎం వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 06, 2026 15:22:24
Lanzhou, Gansu:

Golden Duck Viral News: సాధారణంగా.. మాట వరుసకు బంగారు బాతు అంటారు. కొందరి జీవితం ఎలాంటి కష్టం.. శ్రమ లేకుండా హాయిగా.. విలాసవంతంగా జీవిస్తుంటే వారిది బంగారు బాతులాంటి జీవితం అంటుంటారు. అన్నీ పక్షుల్లో బాతు కూడా ఒకటి. కానీ బాతునే బంగారు బాతు అనడానికి కారణం తాజాగా జరిగిన ఓ సంఘటన చెబుతుంది. గుడ్డు పెట్టే బంగారు బాతు మాదిరి ఓ చోట నిజంగంటే బాతు బంగారం పెట్టింది. అయితే అది తన పొట్టలో దాచుకుంది. కోసుకుని కూర వండేదామనుకున్న యజమానికి బంగారం లభించింది. బాతు పొట్టలో దాదాపు పది గ్రాముల బంగారం లభించిన వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? దాని వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

Also Read: IND vs ENG Highlights: ఇంగ్లాండ్‌ ఇంటికి.. ఉత్కంఠ విజయంతో టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లోకి భారత్‌

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఉన్న లాంగ్‌హుయ్ కౌంటీలో లియు అనే గ్రామస్తుడు బాతును పెంచుకునేవాడు. ఫిబ్రవరిలో తాను పెంచుకుంటున్న బాతును కోసి కూర వండుకుని తినాలని భావించాడు. బెకబెక మంటూ బాతు అరవగా అయినా కూడా లియు బాతును కోశాడు. అనంతరం కోసి బాతును శుభ్రం చేస్తున్న సమయంలో బంగారం కనిపించింది. చిన్న చిన్న బంగారు ముక్కలు అక్కడ పడడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడ పడిన లోహం లియు బంగారం అని గుర్తించాడు. అది బంగారమా? కాదా అని అనుమానం వ్యక్తం చేస్తూ.. ఇంట్లోనే వాటిని కరిగించాడు. దీంతో ఆ ముక్కలు కరిగిపోయి బంగారం ద్రావణం వచ్చింది. అది చూసి బంగారమే అని లియు గుర్తించాడు. నిజమైన బంగారం కావడంతో తన పంట పండిందని లియు సంబరపడ్డాడు. బంగారం మొత్తం విలువ పది గ్రామాలు ఉంటుందని చైనా మీడియా చెప్పుకొచ్చింది.

Also Read: Virosh Gold: విజయ్, రష్మిక పెళ్లిలో 257 తులాల బంగారం.. ఇక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?

బాతుల పెంపకం చేసే లియూ తాము పెంచుకున్న ఓ బాతును కోసి కూర వండేందుకు సిద్ధమయ్యాడు. ముక్కలుగా చేసే సమయంలో అనూహ్యంగా దాని పొట్టలో బంగారం ముక్కలు కనిపించాయి. మొత్తం ముక్కల బరువు 10 గ్రాములు ఉంటాయి. వాటి అంచనా విలువ 12,000 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 1.6 లక్షలు). ఇది చూసి లియూ సంబరపడ్డాడు. జాక్‌పాట్ తగిలిందని సంతోషపడ్డాడు. అయితే బాతులో బంగారం ఎక్కడిదని చర్చ జరుగుతోంది.కోళ్ల జాతికి చెందిన బాతులు ఆరు బయట ఉండే చిరు గింజలు, వివిధ ఆహార పదార్థాలు తింటూ ఉంటాయి. ఆహారం తీసుకునేటప్పుడు చిన్న చిన్న రాళ్లు వంటివి తింటుంటాయి. ఆ క్రమంలో బంగారం ముక్కలు కూడా బాతు తిని ఉంటుందని తెలుస్తోంది. అయితే బాతులో బంగారం లభించడంపై లియు తండ్రి హర్షం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Mar 06, 2026 11:10:45
Velgapudi, Andhra Pradesh:

Lokesh On Talliki Vandanam: ఏపీలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం పథకంపై అర్హులైన వారందరికీ ఆర్ధిక సాయం అందిస్తామని అన్నారు. అర్హత ఉన్నా పథకం డబ్బు అందని వారి వివరాలను ఇవ్వాలని మంత్రి లోకేష్ కోరారు. నేడు శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో విద్యార్థులైన 67,01,653 మంది రూ.8,454 కోట్ల మేర సాయం అందజేసినట్లు మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ప్రకటించారు. అర్హులందరికీ తప్పనిసరిగా సాయం అందించాలనేది తమ ప్రజా ప్రభుత్వ నిర్ణయమని ఆయన తెలిపారు. తల్లికి వందనం పథకం కింద యూడైస్ ప్రకారం రాష్ట్రంలో లబ్ధిదారులుగా నమోదైన విద్యార్థుల సంఖ్యపై కౌన్సిల్‌లో వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

దీనికి మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ.. యూడైస్ గణాంకాల ప్రకారం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో 79,51,903 మంది విద్యార్థులు ఈ పథకంలో నమోదయ్యారని తెలిసింది. ఈ పథకం కింద రూ.8,454 కోట్ల మేర సాయం అందించాని మంత్రి లోకేష్ వివరించారు. 67,01,653 మంది విద్యార్థులకు వర్తించిందని, యూడైస్ లో 86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటూ ప్రతిపక్ష వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. యూడైస్‌లో నమోదైన విద్యార్థుల్లో అర్హులందరికీ(84.27%) తల్లికి వందనం పథకం ద్వారా సాయం అందించినట్లు పేర్కొన్నారు.

వైసీపీ పరిపాలనలో యూడైస్‌లో 81,72,224 మంది విద్యార్థులు నమోదైనా.. కేవలం 42,33,098 మందికి మాత్రమే, అనగా 52 శాతం మంది విద్యార్థులకు మాత్రమే సాయం అందించారని మంత్రి లోకేష్ శాసనమండలిలో వెల్లడించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 85 శాతం మందికి సాయం అందిస్తుందని పేర్కొన్నారు.  

2020-21 అకాడమిక్ ఇయర్ చూస్తే సుమారుగా 83 లక్షల మంది ఉండగా.. కేవలం 44 లక్షల మంది విద్యార్థులకే ఇచ్చారని విద్యాశాఖ మంత్రి లోకేష్ విమర్శించారు. 2021-22 ఏడాదిలో 82 లక్షల మంది ఉంటే.. 43 లక్షల మందికి, అలాగే 2022-23లో 80 లక్షల మంది ఉండగా.. కేవలం 42 లక్షల మందికే ఇచ్చారని లోకేష్ చెప్పారు. జగన్ ప్రభుత్వ హయాంలో 52 శాతం మంది విద్యార్థులకు ఇస్తే.. ప్రజా ప్రభుత్వంలో 84.27 శాతం మంది లబ్ధిదారులకు అకౌంట్లో డబ్బు విడుదల చేసినట్లు చెప్పారు.

అయితే ఈ క్రమంలో తల్లికి వందనం పథకం కింద సాయం అందని విద్యార్థుల వివరాలు అందజేస్తే.. వారికి కూడా అకౌంట్లో డబ్బు జమ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.  మరోవైపు పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

ALso REad: AP Social Media Ban: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాపై నిషేధం..కేవలం వారికే మాత్రమే..సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం!

Also Read: Swarna Grama Swarna Ward Bill: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..పేరు మార్పుతో ప్రమోషన్ల పండుగ..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 06, 2026 10:30:17
Hyderabad, Telangana:

India vs Pakistan 2026 Latest News: గత కొన్ని నెలల నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు రీనా శర్మ చేసిన తాజా అంచనాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి.. గ్రహాల స్థితిగతులతో పాటు ఖగోళ మార్పులను విశ్లేషించిన ఆమె.. మార్చి 21న పాకిస్తాన్‌పై భారత దాడి చేసే అవకాశము ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి. 

ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు అంచనాల ప్రకారం.. కేవలం భారత్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ ను చుట్టుముట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. మార్చి 21న జరిగే ఈ పరిణామాలతో మన దేశ సరిహద్దులు శాశ్వతంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆమె తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి భారత్‌లో విలీనం కావడం ఈ తేదీ నుండే ప్రారంభమవుతుందని ఆమె వీడియోలో పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. 

రీనా శర్మ చెప్పిన విషయాలు ఇంతలా చర్చకు దారి తీయడం వెనక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు. గతంలో ఆమె చెప్పిన కొన్ని అంచనాలు నిజమయ్యాయని.. అందులో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదవి నుంచి దిగిపోతారని ఆమె ముందే ఊహించారు. అంతేకాకుండా ఇరాన్ పై దాడులు జరుగుతాయని ఆమె చేసిన విశ్లేషణ కూడా వాస్తవ రూపం దాల్చిన సంగతి తెలిసిందే.. ప్రస్తుత గ్రహగతులను బట్టి ఆమె చెబుతున్న మార్చి 21వ తేదీ పై సోషల్ మీడియా వినియోగదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read: Fuel Prices: భారత్‌కు రష్యా బిగ్ హెల్ప్.. ఇక పెట్రోల్ ధరలు పెరగనట్లేనా?

జ్యోతిష్య శాస్త్రం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని మనందరికీ తెలిసిందే. రక్షణ నిపుణులు, భారత ప్రభుత్వం నుంచి ఇలాంటి దాడులకు సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటనలు కూడా చేయలేదు.. అయితే సరిహద్దుల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే భారత సైన్యం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది.. కానీ రీనా శర్మ చెప్పినట్లుగా బౌగోళిక మార్పులు సంభవిస్తాయా లేదా అనేది.. తప్పకుండా కాలమే నిర్ణయిస్తుందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు తెలుపుతున్నారు.

Also Read: Fuel Prices: భారత్‌కు రష్యా బిగ్ హెల్ప్.. ఇక పెట్రోల్ ధరలు పెరగనట్లేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 06, 2026 10:17:17
Hyderabad, Telangana:

Iran Mass Warning Latest Telugu News: అంతర్జాతీయ వేదికపై ఇరాన్ మరోసారి గళమెత్తింది.. అమెరికా ఇజ్రాయిల్ దేశాల దూకుడు పై ఊహించని స్థాయిలో విమర్శలు చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 (Raisina Dialogue 2026) లో పాల్గొన్న ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబీదే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇంతకీ ఆయనేమన్నారు? ఆయన మాట్లాడిన అంశాల్లో నిజం ఎంత? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబీదే తమ దేశంపై జరుగుతున్న దాడులను తిప్పి కొట్టడానికి స్థాయిత పోరాటం తప్ప.. మరో ఎలాంటి మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా ఆయన ఇటీవల జరిగిన నౌక ఘటనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత మిత్రుల ఆహ్వానం మేరకే ఇరాన్ కు చెందిన IRIS Dena నౌక ఈ ప్రాంతానికి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఆ నౌకలో ఎలాంటి ఆయుధాలు లేవని.. అది కేవలం శాంతియుత ప్రయాణంలో ఉందని స్పష్టం చేశారు.. 

అలాంటి నిరాయుధ నౌకపై అమెరికన్లు దాడి చేయడం అత్యంత దారుణం అన్నారు.. గతంలో నాజీ జర్మనీ ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో.. నేడు అమెరికా చర్యలు అలాగే ఉన్నాయి.. అంటూ ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా మీడియాతో పలు అంశాలను కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అలాగే భారత్ వేదికగా అమెరికాను నాజీలతో పోల్చడం దౌత్య పరంగా ప్రాధాన్యతను సంతరించుకుందని నిపుణులు భావిస్తున్నారు. 

Also Read: Fuel Prices: భారత్‌కు రష్యా బిగ్ హెల్ప్.. ఇక పెట్రోల్ ధరలు పెరగనట్లేనా?

చివరిగా ఆయన మాట్లాడుతూ.. మా మనుగడ కోసం.. అలాగే మా ఆత్మగౌరవం కోసం అమెరికాతో పాటు ఇజ్రాయిల్‌తో పోరాటం తప్ప మాకు వేరే ప్రత్యామ్నాయం కనబడటం లేదని.. మా దేశంలో ఉన్న చివరి సైనికుడుతో పాటు చివరి బుల్లెటి వరకు మేము ప్రతిఘటిస్తూనే ఉంటామని.. వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన మీడియా ముఖంగా తెలిపారు.. సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఇరాన్ ఈ వేదిక ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది. ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

Also Read: Fuel Prices: భారత్‌కు రష్యా బిగ్ హెల్ప్.. ఇక పెట్రోల్ ధరలు పెరగనట్లేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 06, 2026 09:43:19
Camaguey, Camaguey:

Donald Trump Cuba Warnings: పశ్చిమాసియాలో ఇరాన్ లక్ష్యంగా అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ తర్వాత తమ తదుపరి లక్ష్యం క్యూబా అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి క్యూబా ప్రభుత్వం ముప్పుగా పరిణమించిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుత సైనిక చర్యల ప్రాధాన్యతలను ఆయన వివరించారు.

ఇరాన్‌పై పైచేయి?!
ఇజ్రాయెల్ దళాలతో కలిసి అమెరికా సైన్యం ఇరాన్‌పై మెరుపు దాడులు చేస్తోందని ట్రంప్ వెల్లడించారు. కేవలం మూడు రోజుల్లోనే ఇరాన్‌కు చెందిన 24 యుద్ధ నౌకలను అమెరికా తుడిచిపెట్టేసిందని, ఆ దేశ నౌకాదళం దాదాపుగా నిర్వీర్యమైందని ఆయన ప్రకటించారు. అమెరికాకు ఉన్న బలమైన వైమానిక దళాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఇరాన్‌కు లేదని, అందుకే వారి సైనిక కేంద్రాలు వేగంగా కుప్పకూలుతున్నాయని పేర్కొన్నారు.

వరుస దాడులతో ఇరాన్ గజగజ వణుకుతోందని, ఆ దేశ అధికారులు శాంతి చర్చల కోసం తమను సంప్రదిస్తున్నారని ట్రంప్ తెలిపారు. కొత్త అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపింది. అయితే "సమయం మించిపోయింది" అని తాను వారికి స్పష్టం చేసినట్లు ట్రంప్ చెప్పారు. టెహ్రాన్ (ఇరాన్ రాజధాని) భవిష్యత్తును మార్చడంలో ఆ దేశ దౌత్యవేత్తలే తమకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

"తదుపరి లక్ష్యం క్యూబా"
పశ్చిమాసియాలో ఆపరేషన్ ముగిసిన వెంటనే అమెరికా దృష్టి క్యూబా వైపు మళ్లుతుందని ట్రంప్ హెచ్చరించారు. క్యూబా ప్రభుత్వం అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, దానిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.

పశ్చిమాసియా యుద్ధం తర్వాత అమెరికా విదేశాంగ ప్రాధాన్యతల్లో భారీ మార్పులు ఉంటాయని, అందులో క్యూబా అంశం మొదటి వరుసలో ఉంటుందని వివరించారు. ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే, అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించి అటు పశ్చిమాసియాలోనూ, ఇటు లాటిన్ అమెరికాలోనూ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Also Read: AP Social Media Ban: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాపై నిషేధం..కేవలం వారికే మాత్రమే..సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం!

Also Read: IND Vs ENG Match Turning Moment: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో కీలక మలుపు..ఈ మూడు జరగకపోయి ఉంటే టీమ్ఇండియా ఓడిపోయేది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 06, 2026 09:43:08
Hyderabad, Telangana:

42 Teeth Record Telugu Latest News: సాధారణంగా ప్రతి మనిషికి కేవలం 32 పళ్ళు మాత్రమే ఉంటాయని మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న సంగతి తెలిసిందే.. అప్పుడప్పుడు కొందరికి ఒకటి రెండు పళ్ళు ఎక్కువ ఉండడం లేదా తక్కువ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ మలేషియా కు చెందిన ఓ యువకుడికి మాత్రం తన నోటిలో ఏకంగా 42 దంతాలు ఉన్నాయి. అవును మీరు విన్నది నిజమే.. ఈ వ్యక్తికి ఏకంగా అన్ని పనులు ఉండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా గిన్నిస్ వరల్డ్ రికార్డులు చోటు దక్కింది. 

మలేషియా కు చెందిన 33 ఏళ్ల ప్రతాప్ మునియాండి ప్రస్తుతం ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారారు. ప్రపంచంలోనే అత్యధిక దంతాలు కలిగిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే కాకుండా.. ఆయన నోటిలోని దంతాల ఫోటోను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో నోరంతా దంతాలే కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఇలా 42 దంతాలతో జన్మించడం చాలా అరుదని కొంతమంది నిపుణులు కూడా చెబుతున్నారు.

ప్రతాప్ తన నోటిలో ఎన్ని పళ్ల ఉంటాయని విషయాన్ని చాలా కాలం గుర్తించలేకపోయినట్లు తెలుస్తోంది. 2001లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న సమయంలో మాటల మధ్యలో తన నోటి నిర్మాణం కాస్త భిన్నంగా ఉందని ఆయన గమనించారు. ఈ అనుమానంతోనే ప్రతాప్ వెంటనే డెంటిస్టులను సంప్రదించి.. ప్రత్యేకంగా ఎక్స్రే ను తీయించుకున్నారు.. సాధారణంగా మనిషి 32 పళ్ల కంటే పది పళ్లు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు నిర్ధారించడంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు..

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

అయితే, 42 పళ్లతో ఉండడాన్ని వైద్య పరిభాషలో హైపర్ డోంటియా అని పిలుస్తారట.. అంటే ఉండాల్సిన దానికంటే దంతాలు ఎక్కువగా ఉండటం అని అర్థం. అయితే, ప్రతాప్ విషయంలో ఆ అదనపు పళ్లు ఆయనకు ఎలాంటి నొప్పి లేదా ఇబ్బందిని కలిగించకపోవడం విశేషం.. అలాగే ఇటీవలే ప్రతాప్ మీడియాతో కూడా మాట్లాడారు.. నాకు ఇన్ని పళ్లు ఉన్నాయని తెలియగానే ఆశ్చర్యపోవడంతో పాటు ఆందోళనకు గురయ్యాడని.. ఇప్పుడు ఈ పళ్ళతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషమని ఆయన తెలిపారు.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 06, 2026 09:31:06
Bengaluru, Karnataka:

Social Media Ban For Under 16: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో 2026–27 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సాంకేతికత, సామాజిక భద్రతపై పలు కీలక ప్రకటనలు చేశారు. మొబైల్ ఫోన్ల మితిమీరిన వినియోగం వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకోబోతోంది.

కర్ణాటక రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. డిజిటల్ వ్యసనం నుండి చిన్నారులను రక్షించడం, వారి విద్యాభ్యాసంపై దృష్టి మరలకుండా చూడటం వంటి  వాటి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏఐ (AI) హబ్‌గా బెంగళూరు
రాష్ట్ర రాజధానిని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మరింత బలోపేతం చేసేందుకు భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. ఇస్రో, కియోనిక్స్, ఐఐఎస్సీ సహకారంతో బెంగళూరులో ఒక అత్యాధునిక రోబోటిక్స్, ఏఐ ఇన్నోవేషన్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దాదాపుగా రూ.16 కోట్ల వ్యయంతో బయోటెక్నాలజీ, నాస్కామ్ సహకారంతో రెండు కొత్త ఎక్సలెన్స్ సెంటర్లను స్థాపించనున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన 17వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.4,48,004 కోట్లుగా మొత్తం వ్యయాన్ని అంచనా వేశారు. అయితే సెప్టెంబర్ 2025లో జీఎస్టీ రేట్ల మార్పుల తర్వాత ఆదాయ వృద్ధి 10 శాతం నుండి 4 శాతానికి పడిపోయిందని సీఎం పేర్కొన్నారు. దీనివల్ల వచ్చే ఏడాది రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.15,000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పన్ను ఆదాయంలో కర్ణాటక దేశానికే అగ్రగామిగా ఉన్నప్పటికీ, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన వాటాలో అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు.

బెంగళూరులో పట్టణ వరదలను అరికట్టడానికి ప్రపంచ బ్యాంకు నిధులతో రూ.5,000 కోట్ల వ్యయంతో ఐదేళ్ల విపత్తు నిర్వహణ ప్రాజెక్టును చేపట్టనున్నారు. బెంగళూరు శివార్లలో నివాస ప్రాంతాల్లోకి వచ్చే చిరుతపులులను రక్షించి, పునరావాసం కల్పించడానికి బన్నెర్‌ఘట్ట బయోలాజికల్ పార్క్‌లో రూ.5 కోట్లతో ప్రత్యేక సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు.

పారదర్శకతను పెంచేందుకు ఎక్సైజ్ శాఖలో బదిలీల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారు. గ్రూప్-సి అధికారుల కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ కౌన్సెలింగ్ పద్ధతిని ఇప్పుడు ఉన్నతాధికారుల బదిలీలకు కూడా వర్తింపజేయనున్నారు. సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అటు సంక్షేమ పథకాలను, ఇటు అత్యాధునిక సాంకేతిక అభివృద్ధిని సమతుల్యం చేస్తూ 'దూరదృష్టి'తో రూపొందించినట్లు చెప్పుకొచ్చారు.

Also Read: IND Vs ENG Match Turning Moment: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో కీలక మలుపు..ఈ మూడు జరగకపోయి ఉంటే టీమ్ఇండియా ఓడిపోయేది!

Also Read: Morning Routine For Peace: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే ఆపేయండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top