42 Teeth Record Telugu Latest News: సాధారణంగా ప్రతి మనిషికి కేవలం 32 పళ్ళు మాత్రమే ఉంటాయని మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న సంగతి తెలిసిందే.. అప్పుడప్పుడు కొందరికి ఒకటి రెండు పళ్ళు ఎక్కువ ఉండడం లేదా తక్కువ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ మలేషియా కు చెందిన ఓ యువకుడికి మాత్రం తన నోటిలో ఏకంగా 42 దంతాలు ఉన్నాయి. అవును మీరు విన్నది నిజమే.. ఈ వ్యక్తికి ఏకంగా అన్ని పనులు ఉండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా గిన్నిస్ వరల్డ్ రికార్డులు చోటు దక్కింది.
మలేషియా కు చెందిన 33 ఏళ్ల ప్రతాప్ మునియాండి ప్రస్తుతం ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారారు. ప్రపంచంలోనే అత్యధిక దంతాలు కలిగిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే కాకుండా.. ఆయన నోటిలోని దంతాల ఫోటోను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో నోరంతా దంతాలే కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఇలా 42 దంతాలతో జన్మించడం చాలా అరుదని కొంతమంది నిపుణులు కూడా చెబుతున్నారు.
ప్రతాప్ తన నోటిలో ఎన్ని పళ్ల ఉంటాయని విషయాన్ని చాలా కాలం గుర్తించలేకపోయినట్లు తెలుస్తోంది. 2001లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న సమయంలో మాటల మధ్యలో తన నోటి నిర్మాణం కాస్త భిన్నంగా ఉందని ఆయన గమనించారు. ఈ అనుమానంతోనే ప్రతాప్ వెంటనే డెంటిస్టులను సంప్రదించి.. ప్రత్యేకంగా ఎక్స్రే ను తీయించుకున్నారు.. సాధారణంగా మనిషి 32 పళ్ల కంటే పది పళ్లు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు నిర్ధారించడంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
అయితే, 42 పళ్లతో ఉండడాన్ని వైద్య పరిభాషలో హైపర్ డోంటియా అని పిలుస్తారట.. అంటే ఉండాల్సిన దానికంటే దంతాలు ఎక్కువగా ఉండటం అని అర్థం. అయితే, ప్రతాప్ విషయంలో ఆ అదనపు పళ్లు ఆయనకు ఎలాంటి నొప్పి లేదా ఇబ్బందిని కలిగించకపోవడం విశేషం.. అలాగే ఇటీవలే ప్రతాప్ మీడియాతో కూడా మాట్లాడారు.. నాకు ఇన్ని పళ్లు ఉన్నాయని తెలియగానే ఆశ్చర్యపోవడంతో పాటు ఆందోళనకు గురయ్యాడని.. ఇప్పుడు ఈ పళ్ళతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషమని ఆయన తెలిపారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Retirement Benefits: 'ప్రతి నెల వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. నెలకు రూ.వెయ్యి కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తోంది. అయినా సమన్వయం చేసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది. అక్రమాలను అరికట్టి ఖజానాకు నిధులు తీసుకువస్తే పది మందికి సహాయం అందుతుంది' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'గతంలో జాగీరుదారులు, జమీందార్ల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండేవి. అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుంది. పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు పరిమితంగా ఉంది. దారిద్ర్య రేఖ లో ఉన్న జాతి ముందుకు నడవాలంటే విద్య అవసరం' అని తెలంగాణ సీఎం తెలిపారు.
Also Read: Virosh Gold: విజయ్, రష్మిక పెళ్లిలో 257 తులాల బంగారం.. ఇక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
హైదరాబాద్‌లోని శిల్పా కళా వేదికలో నిర్వహించిన మాదిగ ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో తెలంగాణ సీఎం కీలక ప్రసంగం చేశారు. 'మాటలు, మూటలతో అయితే మేం ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు. చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోంది. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలా అయితే సాధించుకోవాలనే తపనతో కొందరు ప్రాణ త్యాగాలు చేశారు' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు, తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నా. మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చా. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు.. మిత్రధర్మాన్ని నేరవేర్చాడు. నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించా. మాదిగలకు నేను అండగా నిలబడ్డా' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: Golden Duck: ఇది నిజంగా బంగారు బాతు.. పొట్ట కోస్తే పది గ్రాముల బంగారం లభ్యం
'ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు.. బలహీనుల పట్ల నిలబడి కొట్లాడటం అనే గొప్ప లక్షణం ఉన్నవాడు. వర్గీకరణలో న్యాయం ఉంది. మీరు బలహీనులు కాబట్టే నేను మీకు అండగా నిలబడ్డా. రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా మాదిగల పక్కన నిలబడ్డా' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'నా ప్రయత్నంలో మంత్రి వర్గ సహచరులు, అధికారులు సమయస్పూర్తిని చూపించి అండగా నిలబడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం మనదే. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించకపోచ్చు' అని వివరించారు.
'ప్రమోషన్లు, ఉన్నత విద్య, భూములు , లిడ్ క్యాప్ భూములను కాపాడుకోవడం వంటి సమస్యలను పరిష్కరించడం పెద్ద విషయం కాదు. ముందుండి సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి జరిగే దాడులను మీరు ఆపాలి. వెనక నుంచి జరిగే దాడుల విషయంలో మీ జాతి నాకు అండగా ఉండాలి' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
'ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లు నా ప్రభుత్వ ఉద్యోగులే. 99 రోజుల ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రతిపేద వాడికి రేషన్ కార్డు అందాలంటే మీరు కష్టపడి పనిచేయాలి. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి కోసం పేదలు ఎదురు చూస్తున్నారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'అత్యంత వెనుకబాటు తనంలో మాదిగ జాతి ఉంది.. ప్రభుత్వ. ఉద్యోగులు వాళ్లకు అండగా ఉండాలి. సంక్షేమం, అభివృద్ధి ని అందించాలన్నదే మా సంకల్పం' అని ప్రకటించారు.
'నా దగ్గర ఉన్న విద్యా శాఖలను ప్రక్షాళన చేస్తున్నా. నాణ్యమైన విద్య కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు కాస్మోటిక్ , డైట్ ఛార్జీలు పెంచాం. విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకువస్తుంది. అవకాశం వస్తే పది మందికి సాయం చేస్తారనే మంచి పేరు మీరు, నేను తెచ్చుకోవాలి' అని రేవత్ రెడ్డి తెలిపారు. 'మీ జాతి కోసం ఏం చేయాలో అన్ని చేస్తాం..మీ హక్కులను చట్టబద్దం చేసి కాపాడుతాం' అని తెలంగాణ సీఎం వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Golden Duck Viral News: సాధారణంగా.. మాట వరుసకు బంగారు బాతు అంటారు. కొందరి జీవితం ఎలాంటి కష్టం.. శ్రమ లేకుండా హాయిగా.. విలాసవంతంగా జీవిస్తుంటే వారిది బంగారు బాతులాంటి జీవితం అంటుంటారు. అన్నీ పక్షుల్లో బాతు కూడా ఒకటి. కానీ బాతునే బంగారు బాతు అనడానికి కారణం తాజాగా జరిగిన ఓ సంఘటన చెబుతుంది. గుడ్డు పెట్టే బంగారు బాతు మాదిరి ఓ చోట నిజంగంటే బాతు బంగారం పెట్టింది. అయితే అది తన పొట్టలో దాచుకుంది. కోసుకుని కూర వండేదామనుకున్న యజమానికి బంగారం లభించింది. బాతు పొట్టలో దాదాపు పది గ్రాముల బంగారం లభించిన వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? దాని వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Also Read: IND vs ENG Highlights: ఇంగ్లాండ్ ఇంటికి.. ఉత్కంఠ విజయంతో టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఉన్న లాంగ్‌హుయ్ కౌంటీలో లియు అనే గ్రామస్తుడు బాతును పెంచుకునేవాడు. ఫిబ్రవరిలో తాను పెంచుకుంటున్న బాతును కోసి కూర వండుకుని తినాలని భావించాడు. బెకబెక మంటూ బాతు అరవగా అయినా కూడా లియు బాతును కోశాడు. అనంతరం కోసి బాతును శుభ్రం చేస్తున్న సమయంలో బంగారం కనిపించింది. చిన్న చిన్న బంగారు ముక్కలు అక్కడ పడడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడ పడిన లోహం లియు బంగారం అని గుర్తించాడు. అది బంగారమా? కాదా అని అనుమానం వ్యక్తం చేస్తూ.. ఇంట్లోనే వాటిని కరిగించాడు. దీంతో ఆ ముక్కలు కరిగిపోయి బంగారం ద్రావణం వచ్చింది. అది చూసి బంగారమే అని లియు గుర్తించాడు. నిజమైన బంగారం కావడంతో తన పంట పండిందని లియు సంబరపడ్డాడు. బంగారం మొత్తం విలువ పది గ్రామాలు ఉంటుందని చైనా మీడియా చెప్పుకొచ్చింది.
Also Read: Virosh Gold: విజయ్, రష్మిక పెళ్లిలో 257 తులాల బంగారం.. ఇక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
బాతుల పెంపకం చేసే లియూ తాము పెంచుకున్న ఓ బాతును కోసి కూర వండేందుకు సిద్ధమయ్యాడు. ముక్కలుగా చేసే సమయంలో అనూహ్యంగా దాని పొట్టలో బంగారం ముక్కలు కనిపించాయి. మొత్తం ముక్కల బరువు 10 గ్రాములు ఉంటాయి. వాటి అంచనా విలువ 12,000 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 1.6 లక్షలు). ఇది చూసి లియూ సంబరపడ్డాడు. జాక్‌పాట్ తగిలిందని సంతోషపడ్డాడు. అయితే బాతులో బంగారం ఎక్కడిదని చర్చ జరుగుతోంది.కోళ్ల జాతికి చెందిన బాతులు ఆరు బయట ఉండే చిరు గింజలు, వివిధ ఆహార పదార్థాలు తింటూ ఉంటాయి. ఆహారం తీసుకునేటప్పుడు చిన్న చిన్న రాళ్లు వంటివి తింటుంటాయి. ఆ క్రమంలో బంగారం ముక్కలు కూడా బాతు తిని ఉంటుందని తెలుస్తోంది. అయితే బాతులో బంగారం లభించడంపై లియు తండ్రి హర్షం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lokesh On Talliki Vandanam: ఏపీలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం పథకంపై అర్హులైన వారందరికీ ఆర్ధిక సాయం అందిస్తామని అన్నారు. అర్హత ఉన్నా పథకం డబ్బు అందని వారి వివరాలను ఇవ్వాలని మంత్రి లోకేష్ కోరారు. నేడు శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో విద్యార్థులైన 67,01,653 మంది రూ.8,454 కోట్ల మేర సాయం అందజేసినట్లు మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ప్రకటించారు. అర్హులందరికీ తప్పనిసరిగా సాయం అందించాలనేది తమ ప్రజా ప్రభుత్వ నిర్ణయమని ఆయన తెలిపారు. తల్లికి వందనం పథకం కింద యూడైస్ ప్రకారం రాష్ట్రంలో లబ్ధిదారులుగా నమోదైన విద్యార్థుల సంఖ్యపై కౌన్సిల్‌లో వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దీనికి మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ.. యూడైస్ గణాంకాల ప్రకారం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో 79,51,903 మంది విద్యార్థులు ఈ పథకంలో నమోదయ్యారని తెలిసింది. ఈ పథకం కింద రూ.8,454 కోట్ల మేర సాయం అందించాని మంత్రి లోకేష్ వివరించారు. 67,01,653 మంది విద్యార్థులకు వర్తించిందని, యూడైస్ లో 86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటూ ప్రతిపక్ష వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. యూడైస్‌లో నమోదైన విద్యార్థుల్లో అర్హులందరికీ(84.27%) తల్లికి వందనం పథకం ద్వారా సాయం అందించినట్లు పేర్కొన్నారు.
వైసీపీ పరిపాలనలో యూడైస్‌లో 81,72,224 మంది విద్యార్థులు నమోదైనా.. కేవలం 42,33,098 మందికి మాత్రమే, అనగా 52 శాతం మంది విద్యార్థులకు మాత్రమే సాయం అందించారని మంత్రి లోకేష్ శాసనమండలిలో వెల్లడించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 85 శాతం మందికి సాయం అందిస్తుందని పేర్కొన్నారు.
2020-21 అకాడమిక్ ఇయర్ చూస్తే సుమారుగా 83 లక్షల మంది ఉండగా.. కేవలం 44 లక్షల మంది విద్యార్థులకే ఇచ్చారని విద్యాశాఖ మంత్రి లోకేష్ విమర్శించారు. 2021-22 ఏడాదిలో 82 లక్షల మంది ఉంటే.. 43 లక్షల మందికి, అలాగే 2022-23లో 80 లక్షల మంది ఉండగా.. కేవలం 42 లక్షల మందికే ఇచ్చారని లోకేష్ చెప్పారు. జగన్ ప్రభుత్వ హయాంలో 52 శాతం మంది విద్యార్థులకు ఇస్తే.. ప్రజా ప్రభుత్వంలో 84.27 శాతం మంది లబ్ధిదారులకు అకౌంట్లో డబ్బు విడుదల చేసినట్లు చెప్పారు.
అయితే ఈ క్రమంలో తల్లికి వందనం పథకం కింద సాయం అందని విద్యార్థుల వివరాలు అందజేస్తే.. వారికి కూడా అకౌంట్లో డబ్బు జమ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India vs Pakistan 2026 Latest News: గత కొన్ని నెలల నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు రీనా శర్మ చేసిన తాజా అంచనాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి.. గ్రహాల స్థితిగతులతో పాటు ఖగోళ మార్పులను విశ్లేషించిన ఆమె.. మార్చి 21న పాకిస్తాన్‌పై భారత దాడి చేసే అవకాశము ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు అంచనాల ప్రకారం.. కేవలం భారత్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ ను చుట్టుముట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. మార్చి 21న జరిగే ఈ పరిణామాలతో మన దేశ సరిహద్దులు శాశ్వతంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆమె తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి భారత్‌లో విలీనం కావడం ఈ తేదీ నుండే ప్రారంభమవుతుందని ఆమె వీడియోలో పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
రీనా శర్మ చెప్పిన విషయాలు ఇంతలా చర్చకు దారి తీయడం వెనక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు. గతంలో ఆమె చెప్పిన కొన్ని అంచనాలు నిజమయ్యాయని.. అందులో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదవి నుంచి దిగిపోతారని ఆమె ముందే ఊహించారు. అంతేకాకుండా ఇరాన్ పై దాడులు జరుగుతాయని ఆమె చేసిన విశ్లేషణ కూడా వాస్తవ రూపం దాల్చిన సంగతి తెలిసిందే.. ప్రస్తుత గ్రహగతులను బట్టి ఆమె చెబుతున్న మార్చి 21వ తేదీ పై సోషల్ మీడియా వినియోగదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read: Fuel Prices: భారత్‌కు రష్యా బిగ్ హెల్ప్.. ఇక పెట్రోల్ ధరలు పెరగనట్లేనా?
జ్యోతిష్య శాస్త్రం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని మనందరికీ తెలిసిందే. రక్షణ నిపుణులు, భారత ప్రభుత్వం నుంచి ఇలాంటి దాడులకు సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటనలు కూడా చేయలేదు.. అయితే సరిహద్దుల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే భారత సైన్యం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది.. కానీ రీనా శర్మ చెప్పినట్లుగా బౌగోళిక మార్పులు సంభవిస్తాయా లేదా అనేది.. తప్పకుండా కాలమే నిర్ణయిస్తుందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు తెలుపుతున్నారు.
Also Read: Fuel Prices: భారత్‌కు రష్యా బిగ్ హెల్ప్.. ఇక పెట్రోల్ ధరలు పెరగనట్లేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Iran Mass Warning Latest Telugu News: అంతర్జాతీయ వేదికపై ఇరాన్ మరోసారి గళమెత్తింది.. అమెరికా ఇజ్రాయిల్ దేశాల దూకుడు పై ఊహించని స్థాయిలో విమర్శలు చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 (Raisina Dialogue 2026) లో పాల్గొన్న ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబీదే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇంతకీ ఆయనేమన్నారు? ఆయన మాట్లాడిన అంశాల్లో నిజం ఎంత? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబీదే తమ దేశంపై జరుగుతున్న దాడులను తిప్పి కొట్టడానికి స్థాయిత పోరాటం తప్ప.. మరో ఎలాంటి మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా ఆయన ఇటీవల జరిగిన నౌక ఘటనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత మిత్రుల ఆహ్వానం మేరకే ఇరాన్ కు చెందిన IRIS Dena నౌక ఈ ప్రాంతానికి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఆ నౌకలో ఎలాంటి ఆయుధాలు లేవని.. అది కేవలం శాంతియుత ప్రయాణంలో ఉందని స్పష్టం చేశారు..
అలాంటి నిరాయుధ నౌకపై అమెరికన్లు దాడి చేయడం అత్యంత దారుణం అన్నారు.. గతంలో నాజీ జర్మనీ ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో.. నేడు అమెరికా చర్యలు అలాగే ఉన్నాయి.. అంటూ ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా మీడియాతో పలు అంశాలను కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అలాగే భారత్ వేదికగా అమెరికాను నాజీలతో పోల్చడం దౌత్య పరంగా ప్రాధాన్యతను సంతరించుకుందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: Fuel Prices: భారత్‌కు రష్యా బిగ్ హెల్ప్.. ఇక పెట్రోల్ ధరలు పెరగనట్లేనా?
చివరిగా ఆయన మాట్లాడుతూ.. మా మనుగడ కోసం.. అలాగే మా ఆత్మగౌరవం కోసం అమెరికాతో పాటు ఇజ్రాయిల్‌తో పోరాటం తప్ప మాకు వేరే ప్రత్యామ్నాయం కనబడటం లేదని.. మా దేశంలో ఉన్న చివరి సైనికుడుతో పాటు చివరి బుల్లెటి వరకు మేము ప్రతిఘటిస్తూనే ఉంటామని.. వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన మీడియా ముఖంగా తెలిపారు.. సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఇరాన్ ఈ వేదిక ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది. ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..
Also Read: Fuel Prices: భారత్‌కు రష్యా బిగ్ హెల్ప్.. ఇక పెట్రోల్ ధరలు పెరగనట్లేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Donald Trump Cuba Warnings: పశ్చిమాసియాలో ఇరాన్ లక్ష్యంగా అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ తర్వాత తమ తదుపరి లక్ష్యం క్యూబా అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి క్యూబా ప్రభుత్వం ముప్పుగా పరిణమించిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుత సైనిక చర్యల ప్రాధాన్యతలను ఆయన వివరించారు.
ఇరాన్‌పై పైచేయి?!
ఇజ్రాయెల్ దళాలతో కలిసి అమెరికా సైన్యం ఇరాన్‌పై మెరుపు దాడులు చేస్తోందని ట్రంప్ వెల్లడించారు. కేవలం మూడు రోజుల్లోనే ఇరాన్‌కు చెందిన 24 యుద్ధ నౌకలను అమెరికా తుడిచిపెట్టేసిందని, ఆ దేశ నౌకాదళం దాదాపుగా నిర్వీర్యమైందని ఆయన ప్రకటించారు. అమెరికాకు ఉన్న బలమైన వైమానిక దళాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఇరాన్‌కు లేదని, అందుకే వారి సైనిక కేంద్రాలు వేగంగా కుప్పకూలుతున్నాయని పేర్కొన్నారు.
వరుస దాడులతో ఇరాన్ గజగజ వణుకుతోందని, ఆ దేశ అధికారులు శాంతి చర్చల కోసం తమను సంప్రదిస్తున్నారని ట్రంప్ తెలిపారు. కొత్త అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపింది. అయితే "సమయం మించిపోయింది" అని తాను వారికి స్పష్టం చేసినట్లు ట్రంప్ చెప్పారు. టెహ్రాన్ (ఇరాన్ రాజధాని) భవిష్యత్తును మార్చడంలో ఆ దేశ దౌత్యవేత్తలే తమకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
"తదుపరి లక్ష్యం క్యూబా"
పశ్చిమాసియాలో ఆపరేషన్ ముగిసిన వెంటనే అమెరికా దృష్టి క్యూబా వైపు మళ్లుతుందని ట్రంప్ హెచ్చరించారు. క్యూబా ప్రభుత్వం అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, దానిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
పశ్చిమాసియా యుద్ధం తర్వాత అమెరికా విదేశాంగ ప్రాధాన్యతల్లో భారీ మార్పులు ఉంటాయని, అందులో క్యూబా అంశం మొదటి వరుసలో ఉంటుందని వివరించారు. ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే, అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించి అటు పశ్చిమాసియాలోనూ, ఇటు లాటిన్ అమెరికాలోనూ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Social Media Ban For Under 16: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో 2026–27 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సాంకేతికత, సామాజిక భద్రతపై పలు కీలక ప్రకటనలు చేశారు. మొబైల్ ఫోన్ల మితిమీరిన వినియోగం వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకోబోతోంది.
కర్ణాటక రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. డిజిటల్ వ్యసనం నుండి చిన్నారులను రక్షించడం, వారి విద్యాభ్యాసంపై దృష్టి మరలకుండా చూడటం వంటి వాటి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏఐ (AI) హబ్‌గా బెంగళూరు
రాష్ట్ర రాజధానిని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మరింత బలోపేతం చేసేందుకు భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. ఇస్రో, కియోనిక్స్, ఐఐఎస్సీ సహకారంతో బెంగళూరులో ఒక అత్యాధునిక రోబోటిక్స్, ఏఐ ఇన్నోవేషన్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దాదాపుగా రూ.16 కోట్ల వ్యయంతో బయోటెక్నాలజీ, నాస్కామ్ సహకారంతో రెండు కొత్త ఎక్సలెన్స్ సెంటర్లను స్థాపించనున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన 17వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.4,48,004 కోట్లుగా మొత్తం వ్యయాన్ని అంచనా వేశారు. అయితే సెప్టెంబర్ 2025లో జీఎస్టీ రేట్ల మార్పుల తర్వాత ఆదాయ వృద్ధి 10 శాతం నుండి 4 శాతానికి పడిపోయిందని సీఎం పేర్కొన్నారు. దీనివల్ల వచ్చే ఏడాది రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.15,000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పన్ను ఆదాయంలో కర్ణాటక దేశానికే అగ్రగామిగా ఉన్నప్పటికీ, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన వాటాలో అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు.
బెంగళూరులో పట్టణ వరదలను అరికట్టడానికి ప్రపంచ బ్యాంకు నిధులతో రూ.5,000 కోట్ల వ్యయంతో ఐదేళ్ల విపత్తు నిర్వహణ ప్రాజెక్టును చేపట్టనున్నారు. బెంగళూరు శివార్లలో నివాస ప్రాంతాల్లోకి వచ్చే చిరుతపులులను రక్షించి, పునరావాసం కల్పించడానికి బన్నెర్‌ఘట్ట బయోలాజికల్ పార్క్‌లో రూ.5 కోట్లతో ప్రత్యేక సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు.
పారదర్శకతను పెంచేందుకు ఎక్సైజ్ శాఖలో బదిలీల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారు. గ్రూప్-సి అధికారుల కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ కౌన్సెలింగ్ పద్ధతిని ఇప్పుడు ఉన్నతాధికారుల బదిలీలకు కూడా వర్తింపజేయనున్నారు. సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అటు సంక్షేమ పథకాలను, ఇటు అత్యాధునిక సాంకేతిక అభివృద్ధిని సమతుల్యం చేస్తూ 'దూరదృష్టి'తో రూపొందించినట్లు చెప్పుకొచ్చారు.
Also Read: Morning Routine For Peace: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే ఆపేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Poco M7 Plus 5g Flipkart Discount Telugu: అత్యంత తక్కువ ధరలోనే ఎప్పటినుంచో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసం ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందిస్తోంది. సమ్మర్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ కొన్ని మొబైల్‌తో పాటు ఇతర ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి అద్భుతమైన ఆఫర్స్ లభించబోతున్నాయి. ముఖ్యంగా స్పెషల్ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండడం విశేషం. అయితే, ఏ మొబైల్ ఇప్పుడు అత్యంత తగ్గింపు ధరకే లభిస్తుందో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పోకో (POCO) కంపెనీ గతంలో విడుదల చేసిన Poco M7 Plus 5G మొబైల్ అత్యంత తగ్గింపు ధరికే లభిస్తుంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 6.9 అంగుళాల Full-HD+ IPS LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన క్వాల్‌కామ్ Snapdragon 6s Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్ తో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్‌తో పాటు గేమింగ్ చేసే వారికి ఇది అద్భుతమైన పనితీరునందిస్తుంది. దీంతోపాటు ముఖ్యంగా ఎక్కువ సేపు మొబైల్ వినియోగించే వారికి ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతగానో సహాయపడుతుంది.
Poco M7 Plus 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 7,000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రత్యేకమైన 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్, 18W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఎంతో స్పీడుగా బ్యాటరీ చార్జ్ చేయొచ్చు. ఈ మొబైల్ వెనుక భాగంలోకి వెళ్తే.. ఇది ఎంతో ప్రత్యేకమైన AI సపోర్ట్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. ఫ్రంట్ భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.
అలాగే ఇందులో కంపెనీ 2 ఏళ్ల మేజర్ OS అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఇది వివిధ స్టోరేజ్ ఆప్షన్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఇది 6GBతో పాటు 8gb ర్యామ్‌తో అందుబాటులో ఉంది. ఇందులో ప్రత్యేకంగా IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, 5G కనెక్టివిటీ స్పెషల్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్‌ను కంపెనీ MRP ధర రూ.16,999 లకు విక్రయిస్తోంది. అయితే, ఇప్పుడే ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి 12 శాతం తగ్గింపు కేవలం రూ.14,999కే పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై స్పెషల్‌గా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ప్రత్యేకమైన కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగిస్తే దాదాపు రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఏదైనా పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే, ఏకంగా రూ.13 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌లో మీరు కేవలం రూ.1,499 లోపే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Social Media Ban For Under 13 In AP: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చిన్న పిల్లలు (13 ఏళ్ల లోపు వారు) సోషల్ మీడియా వాడకంపై ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. 13 ఏళ్లలోపు పిల్లలకు ఏపీలో సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధించనుంది. అందుకు సంబంధించిన నిబంధనల ప్రక్రియను రాబోయో 90 రోజుల్లో ఖరారు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో పాటు 13 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
ఈ తరం డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్లు వినియోగిస్తూ సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. ఇలాంటి తీరుపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియా వినియోగం వల్ల 13 ఏళ్ల లోపు పిల్లల మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది.
ఇదే విషయమై కర్ణాటక ప్రభుత్వం కూడా తాజాగా 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషేధాన్ని విధించింది. ఇప్పుడు అదే బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాలో నిషేధాన్ని విధిస్తూ కీలక ప్రకటన చేసింది. రాబోయే 90 రోజుల్లో విధివిధానాలను ఖరారు చేసి మళ్లీ అసెంబ్లీలో ప్రస్తావిస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు.
అయితే ఇదే అంశంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పటికే లోక్‌సభలో (పార్లమెంటు) ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. చిన్న పిల్లల్లో పెరుగుతున్న ఇంటర్నెట్ వ్యసనాన్ని అరికట్టడానికి జాతీయ స్థాయిలో చట్టం రావాలని ఆయన ఆకాంక్షించారు.
పిల్లలకు సోషల్ మీడియా నిషేధానికి కారణాలు..
చిన్న వయస్సులోనే పిల్లలు సోషల్ మీడియాకు అలవాటు పడడం వల్ల వారిలో ఏకాగ్రత తగ్గడమే కాకుండా డిప్రెషన్, నిద్రలేమి వంటి సమస్యలు వస్తున్నాయి. వీటితో పాటు వారి చదువు మందగిస్తుంది. గంటల తరబడి సోషల్ మీడియా వినియోగం వల్ల చదువుపై దృష్టి తగ్గి..ఇతర కార్యక్రమాలపై ఆసక్తి పెరిగి పిల్లలు తప్పుదోవ పడుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
అలాగే సోషల్ మీడియాలో నియంత్రణ లేని కంటెంట్ అందుబాటులో ఉండడం వల్ల పిల్లలకు ఏది మంచి..ఏది చెడు అనే ఆలోచించే తత్వాన్ని కోల్పోతున్నారు. తల్లిదండ్రుల భయాన్ని వీడుతున్నారు. దీంతో పిల్లలు హింసాత్మక కంటెంట్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే తెలియని వ్యక్తుల పరిచయాలు, సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు కోల్పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా వల్ల వారి భద్రత ముప్పుగా మారే అవకాశం ఉంది.
ఈ నిర్ణయంతో పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టి.. తద్వారా వారిని తిరిగి ఆటపాటలు, పుస్తక పఠనం వైపు ఆలోచన మళ్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది. త్వరలోనే దీనిపై విద్యావేత్తలు, మానసిక నిపుణులతో చర్చించి సీఎం సహా అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs England Match Turning Moment: టీ20 ప్రపంచకప్‌లోని రెండో సెమీఫైనల్ చివరి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి, భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. గత నెల ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ టోర్నీ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. మార్చి 8వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే తాజాగా జరిగిన రెండో సెమిఫైనల్లో భారత జట్టు గెలవడానికి 3 ప్రధాన కారణాల గురించి ఇప్పుడు చర్చిద్దాం.
ముంబయిలోని వాంఖడే వేదికగా ఇంగ్లాండ్- భారత్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఎంతో రసవత్తరంగా జరిగింది. తొలి ఇన్నింగ్స్ వరకు మ్యాచ్ ఏకపక్షంగా భారత్ వైపు ఉందని అంతా భావించారు. అందుకు ప్రధాన కారణం భారత బ్యాటర్లు రాణించడం సహా 253 పరుగులను రాబట్టి ప్రత్యర్థి జట్టు ఇంగ్లాండ్‌కు భారీ టార్గెట్ నిర్దేశించడం.
253 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు అసాధ్యం అన్నట్లుగా కనిపించింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులు సాధించడం అంత తేలికైన స్కోరు కాదు. కానీ ఇంగ్లాండ్ లాంటి బలమైన ఆటను ఆడి మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చారు. జట్టు ప్రారంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ, జాకబ్ బెథెల్, విల్ జాక్స్ అద్భుతంగా రాణించారు. ఓవర్‌కు సగటున 12 పరుగులు చేశారు. అయితే ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో ఫైనల్‌కు చేరుకునే అవకాశాన్ని కోల్పోయారు.
భారతదేశం గెలుపునకు 3 ప్రధాన కారణాలు..
టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారత జట్టు మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరుకోవడానికి 3 ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1) టీమ్ఇండియా తొలుత బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంజు సామ్సన్ క్యాచ్‌ను పట్టుకోవడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో సంజూ కేవలం 15 పరుగుల వద్ద ఉన్నాడు. అప్పుడు ఆ క్యాచ్ పట్టి ఉండే భారత జట్టు 253 పరుగులు రాబట్టడం అసాధ్యంగా మారే అవకాశం ఉంది. కచ్చితంగా చెప్పాలంటే సంజూ శాంసన్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల ఇంగ్లాండ్ జట్టు టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2) ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్ అసలైన మ్యాచ్‌కి కీలక మలుపు. ఎందుకంటే అప్పటికే సూపర్-8లో పాకిస్థాన్ జట్టుపై ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో రెచ్చిపోయాడు. అయితే హ్యారీ బ్రూక్ క్యాచ్ పట్టేందుకు పెవీలియన్ వద్ద అక్షర్ పటేల్ దాదాపుగా 24 మీటర్లు పరిగెత్తిమరీ క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
అదేవిధంగా బ్రూక్ వెనుదిరిగిన వెంటనే విల్ జేక్స్ అద్భుతంగా రాణించాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతిని సిక్స్‌గా కొట్టడానికి ప్రయత్నించాడు. అతను బంతిని పరిగెత్తించి బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి సమీపంలో ఉన్న శివం దూబేకి ఇచ్చి క్యాచ్‌ను విజయవంతంగా తీసుకునేలా చేశాడు. విల్ జేక్స్ నిలబడి ఉంటే, ఇంగ్లాండ్ ఖచ్చితంగా మ్యాచ్ గెలిచి ఉండేది.
3) చివరిగా భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతను ఒక వికెట్ తీసుకుని 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా కేవలం 4 ఓవర్లలో 2 వికెట్లు తీసుకుని 38 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత జట్టు ఫైనల్ మ్యాచ్ కు చేరుకోవడానికి ఇదే ప్రధాన కారణం.
2026 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో వారు న్యూజిలాండ్‌తో తలపడనున్నారు. ఈ మ్యాచ్ మార్చి 8 ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rajanna Sircilla District Latest News: సోషల్ మీడియాలో పరిచయాలు యువతను ఎక్కడికి తీసుకెళ్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక అద్భుతమైన ఉదాహరణగా భావించవచ్చు. ఇంస్టాగ్రామ్ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ప్రియుడి విలాసాల కోసం ఓ యువతి ఏకంగా తన తల్లి బంగారాన్ని అమ్మి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ ఆ యువతీ ఎందుకు బంగారాన్ని అమ్మాల్సి వచ్చింది? అసలు ప్రియుడి యువతి మధ్య ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన ఓ యువతికి.. ఇంస్టాగ్రామ్ ద్వారా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు చాలా రోజుల క్రితం పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త పోను పోను ముదిరి ఇద్దరి మధ్య స్నేహంగా మారింది. ఈ క్రమంలో సదరు యువకుడు తన ప్రియురాలిని ఒక ఖరీదైన బైకు కొనివ్వాలని డిమాండ్ చేశాడు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం తోనే ఆ యువకుడు బైక్ కొనివ్వమని అడిగినట్లు సమాచారం.
ప్రియుడిపై ఉన్న అద్భుతమైన ప్రేమతో.. అతను అడిగిన కోరికను ఎలాగైనా తీర్చాలని ఆ యువతీ అనుకుంది.. అయితే ఆ యువతీ దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బులు లేకపోవడంతో.. కొద్దిరోజుల పాటు ఆలోచించింది. ఇంట్లో ఉన్న తన తల్లికి సంబంధించిన బంగారు ఆభరణాలపై ఈ సమయంలో కన్ను పడింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా తల్లి బంగారు ఆభరణాలను దొంగిలించి. వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో ప్రియుడికి అత్యంత ఖరీదైన బైకును కొనిచ్చింది..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఉన్న బంగారం నగలు కనిపించకపోవడంతో.. తల్లి ఎంతగానో కంగారు పడింది. అంతేకాకుండా చుట్టుపక్కల వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఒక్కసారిగా ఆందోళన చెందింది. చివరకు తన కూతురే ఈ పని చేసిందని ఆలస్యంగా గ్రహించి.. దిక్కుతోచని స్థితిలో ఎల్లారెడ్డి పేట పోలీసులను ఆశ్రయించింది. తన బంగారాన్ని రీకవరీ చేసి.. న్యాయం చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని. లేకుంటే ఇటువంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Shani Blessings 2026 Effect On Zodiac: జులై 26వ తేదీ నుంచి శని అనేక మార్పులు చేయబోతోంది. ముఖ్యంగా ఈరోజు నుంచి మీనరాశిలో వక్రగతిలోకి వెళ్ళబోతోంది. ఈ శని వక్ర కదలికలు దాదాపు 138 రోజుల పాటు కొనసాగుతాయి. అంటే డిసెంబర్ 11వ తేదీ వరకు శని ఇలాగే వక్రగతిలో ఉండబోతోంది. అయితే, ఈ సుదీర్ఘ కాలం పాటు కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం పరంగా శని గ్రహాన్ని కర్మలకు ఫలితాలను అందించే దేవుడిగా చెప్పుకుంటారు. అలాంటిది ఈ గ్రహ గమనంలో మార్పులు సంభవించడం కారణంగా కెరీర్‌తో పాటు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యంపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి
మేష రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. శని 12వ స్థానంలో సంచార దశలో ఉన్నాడు. దీని కారణంగా వీరికి ఒత్తిడితో పాటు సంక్లిష్టమైన పరిస్థితిలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతాయి. ఇతరులకు అప్పులు కూడా తిరిగి చెల్లిస్తారు. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు జీతాలు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త అదనపు బాధ్యతలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా జీవితంలో అద్భుతమైన అవకాశాలు కూడా పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు దిమ్మతిరిగే లాభాలు కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతోపాటు కొత్త పనులు చేయాలనుకుంటున్న వ్యక్తులకు లాభాలు రావడం ప్రారంభమవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులకు ఇది మంచి సమయం. అలాగే ఉద్యోగాలను వదిలి వ్యాపారాలకు రావాలనుకుంటున్న వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
మీన రాశి
మీన రాశి వారికి శని మూడవ స్థానంలో బలహీనంగా ఉన్నాడు. అయితే ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని రకాల శుభవార్తలు వినడమే కాకుండా.. ఆదాయం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఇల్లు లేదా కొత్త భూములు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవితంలో కూడా ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు వీరికి అనుకున్న పనుల్లో భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook