Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500033
Jupiter Favorite Zodiac: బృహస్పతికి ఇష్టమైన రాశులు.. వీరి నుదుటిపై బంగారం పూత పూసిన బ్రహ్మదేవుడు!
DDDharmaraju Dhurishetty
Feb 25, 2026 07:20:10
Hyderabad, Telangana

Jupiter's Favorite Zodiac Signs Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని సంపద, జ్ఞానం, విద్య, ఆనందంతో పాటు శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. ఈ గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే కెరీర్‌ పురోగతికి, ఆర్థిక శ్రేయస్సుకు ఎలాంటి డోకా ఉండదు.. అంతేకాకుండా అనేక రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఇదే గ్రహం అశుభ స్థానంలో ఉంటే అనేక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా నష్టాలు కూడా కలుగుతాయి. అలాగే వృత్తిపరమైన జీవితంలో ఇబ్బందులు కూడా తలెత్తే ఛాన్స్‌లు ఉన్నాయి. 

జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిది గ్రహాల్లో బృహస్పతిని దేవతలకు గురువుగా చెప్పుకుంటారు. అందుకే దేవతలకు గురువుగా కూడా పిలుస్తారు. ఆ గ్రహం అనుగ్రహం ఉంటే వ్యక్తులకు తెలివితేటలు విపరీతంగా పెరగడమే కాకుండా ఆదాయం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అలాగే అనుకున్న పనుల్లో ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అయితే, ఈ గ్రహం అనుగ్రహం కొన్ని రాశులవారికి ఎల్లప్పుడు లభిస్తాయి. దీని కారణంగా ఆయా రాశులవారికి భారీ మొత్తంలో డబ్బు లభిస్తుంది. 

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
కర్కాటక రాశి 
బృహస్పతి ప్రభావంతో కర్కాటక రాశివారికి ఎల్లప్పుడు సానుకూల లాభాలు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందం కూడా పొందుతారు. అదృష్టం రెట్టింపు అవ్వడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా విదేశీ వ్యాపారాలు చేసేవారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారు మంచి పదోన్నతలు కూడా పొందుతారు. 

సింహ రాశి 
సింహ రాశివారికి సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. అలాగే వీరికి గురు గ్రహం అనుగ్రహం కూడా ఎల్లప్పుడు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు నాయకత్వ లక్షణాలతో పాటు అద్భుతమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. దీంతో పాటు వీరికి అపారమైన ప్రజాదరణ కూడా లభిస్తుంది. ముఖ్యంగా బృహస్పతి అనుగ్రహం వల్ల సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

కర్కాటక రాశి
బృహస్పతి అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్పకుంటారు. అయితే, ఈ గ్రహ ప్రభావం ఎల్లప్పుడు కర్కాటక రాశివారిపై కూడా ఉంటుంది. దీని కారణంగా వీరికి అనేక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. సంపదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి బృహస్పతి ప్రభావంతో జీవితంలో అనుకున్న పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటె ఇప్పుడు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వీరు స్థిరమైన ఆన్తులను కూడా సొంతం చేసుకుంటారు. వైవాహికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా చాలా రోజుల తర్వాత మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారికి ఎల్లప్పుడు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Feb 25, 2026 08:11:10
Hyderabad, Telangana:

Vijay Rashmika Wedding Unseen Pics: టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

ఉదయ్‌పూర్‌లో సందడి
ఉదయ్‌పూర్‌లోని ప్రతిష్టాత్మకమైన ఐటీసీ మెమెంటోస్ (ITC Mementos) హోటల్‌లో వీరి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24న నిర్వహించిన సంగీత్ ఈవెంట్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎంతో ఉత్సాహంగా సాగింది.

వైరల్ అవుతున్న 'ప్రేమ జ్ఞాపకాలు'
పెళ్లి వేదిక వద్ద అతిథుల మొబైల్ ఫోన్లు, వీడియోలపై కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. హోటల్ ప్రాంగణంలో విజయ్, రష్మికల ఏడేళ్ల ప్రేమ ప్రయాణానికి సంబంధించిన అరుదైన ఫోటోలను ప్రదర్శనకు ఉంచారు.

వీరిద్దరూ కలిసి విదేశాలకు వెళ్ళినప్పటి ఫోటోలతో పాటు, 'గీత గోవిందం' షూటింగ్ సమయంలో బస్సులో దిగిన ఐకానిక్ ఫోటో కూడా ఈ గ్యాలరీలో ఉండటం విశేషం. షూటింగ్ స్పాట్స్‌లో వారు గడిపిన క్షణాల నుంచి నేటి వరకు వారి బంధం ఎలా బలపడిందో ఈ ఫోటోలు ప్రతిబింబిస్తున్నాయి.

పెళ్లి ఏర్పాట్లలో ప్రత్యేకతలు
ఈ వివాహాన్ని అత్యంత గోప్యంగా ఉంచేందుకు ఇరు కుటుంబాలు కొన్ని కఠిన నియమాలను పాటిస్తున్నాయి. వివాహ ఆచారాలు జరుగుతున్నప్పుడు ఎలాంటి వీడియోలు తీయకుండా నిషేధం విధించారు. పెళ్లి వేదికపై డ్రోన్ కెమెరాలు ఎగురవేయడానికి అనుమతి లేదు. ఈ రాయల్ వెడ్డింగ్‌లో భోజనాల విషయానికి వస్తే.. పక్కా సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ వంటకాలకు పెద్దపీట వేస్తున్నారు.

పెళ్లి వేడుకల ప్రైవసీ దెబ్బతినకుండా ఉండేందుకు, వివాహం ముగిసే వరకు హోటల్‌లో యూట్యూబర్‌లకు ఎలాంటి బుకింగ్స్ ఇవ్వడం లేదని సమాచారం. రేపు జరగనున్న ఈ పెళ్లి వేడుకతో విజయ్, రష్మికలు అధికారికంగా దంపతులు కానున్నారు. వీరిద్దరి 'కొత్త జీవితం' కోసం అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read: AP Housing Scheme: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త..ఇళ్ల స్కీమ్ డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!

Also Read: Nara Lokesh On Jagan: "పులివెందుల MLAకి భారీ ఆఫర్..మ్యాచ్ టికెట్ నేనే ఇప్పిస్తా!" ఏపీ మంత్రి నారా లోకేష్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 25, 2026 08:10:53
Hyderabad, Telangana:

Iqoo Z11x Launch Date In India Telugu: ప్రీమియం ఫీచర్స్‌తో ప్రాముఖ్యత స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ iQOO నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ కంపెనీ iQOO Z11x పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఇటీవలే చైనాలో కూడా విడుదల చేసింది. గ్లోబల్‌ మార్కెట్‌లో త్వరలోనే లాంచ్‌ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Geekbenchలో ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మోడల్‌ నెంబర్‌ కూడా కనిపించింది. ఇది I2507 మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో అభిషేక్ యాదవ్ (@yabhishekhd) అనే టిప్‌ స్టార్‌ ఫీచర్స్‌ను లీక్ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 చిప్‌సెట్  ప్రాసెసర్‌తో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది Mali-G615 MC2 GPUతో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది.. 

iQOO Z11x స్మార్ట్‌ఫోన్‌ కొన్ని డేటాబేస్‌లో V2547A మోడల్ నంబర్‌తో అందుబాటులో ఉంచిన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ 6.76-అంగుళాల పూర్తి HD+ టచ్‌స్క్రీన్‌ డిస్ల్పేను కలిగి ఉంటుంద. అంతేకాకుండా ఈ సిరీస్‌లో iQOO Z11 టర్బో స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే కంపెనీ చైనాలో ప్రారంభించిన్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని కంపెనీ మొత్తం నాలుగు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో హై ఎండ్‌ వేరియంట్‌ 16GB+1TB స్టోరేజ్‌తో లభించబోతోంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఈ iQOO Z11 టర్బో స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన 6.59-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS 6 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రన్‌ అవుతుంది. అలాగే ఇది వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగంలో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఎంతో శక్తివంతమైన 7,600mAh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 25, 2026 07:49:04
Hyderabad, Telangana:

AC Power Consumption: వేసవి కాలం వస్తోందంటే చాలు.. అందరి చూపు ఏసీల వైపు వెళ్తుంది. అయితే, ఏసీ ఇచ్చే చల్లని గాలి ఎంత హాయిగా ఉంటుందో, వచ్చే కరెంటు బిల్లు అంతకంటే ఎక్కువగా భయపెడుతుంది. అందుకే కొత్త ఏసీ కొనే ముందు లేదా వాడుతున్న ఏసీ బిల్లు తగ్గించుకోవాలంటే కొన్ని లెక్కలు తప్పనిసరి. 1 టన్ను ఏసీ ఎంత కరెంటును వినియోగిస్తుందో, బిల్లును ఎలా ఆదా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

1 టన్ను ఏసీ గంటకు ఎంత ఖర్చు?
సాధారణంగా ఏసీ వినియోగం అనేది దాని రకాన్ని బట్టి మారుతుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీ గంటకు సగటున 0.9 నుండి 1.5 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. ఇన్వర్టర్ ఏసీ అయితే గది ఉష్ణోగ్రతను బట్టి కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేస్తుంది కాబట్టి గంటకు 0.6 నుండి 1.2 యూనిట్ల లోపే ఖర్చవుతుంది.

కరెంటు బిల్లు లెక్క ఇలా..
మీ ఏసీ గంటకు సగటున 1 యూనిట్ కరెంటును వాడుతుందని అనుకుందాం. యూనిట్ ధర రూ.8 అనుకుంటే.. 1 గంట ఖర్చు రూ.8 ఉంటుంది. రోజుకు 8 గంటలు వాడితే రూ.64.. ఈ విధంగా నెలవారీ ఖర్చు (30 రోజులకు) సుమారు రూ.1,920 ఉంటుంది.

BEE స్టార్ రేటింగ్ (3 Star, 5 Star) ఎంత ఎక్కువగా ఉంటే విద్యుత్ ఆదా అంత ఎక్కువగా ఉంటుంది. ఏసీని 18°C దగ్గర నడిపితే కంప్రెసర్ నిరంతరం పనిచేసి బిల్లు ఎక్కువగా వస్తుంది. దీనిని 24°C - 26°C మధ్య ఉంచడం వల్ల కరెంటు ఆదా అవుతుంది. గది కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉండాలి. గాలి బయటకు వెళ్తుంటే ఏసీపై ఒత్తిడి పెరిగి కరెంటు ఎక్కువగా కాలుతుంది. ఏసీ ఫిల్టర్లను రెగ్యులర్‌గా శుభ్రం చేయకపోతే గాలి రాక కంప్రెసర్ కష్టపడాల్సి వస్తుంది.

AC కొనే ముందు ఇవి తప్పక చూడండి
1) గది పరిమాణానికి తగ్గట్టుగా ఏసీని ఎంచుకోవాలి. పెద్ద గదిలో చిన్న ఏసీ పెడితే గది చల్లబడదు, పైగా బిల్లు విపరీతంగా వస్తుంది.

2) ఎక్కువ గంటలు ఏసీ వాడే వారు ఇన్వర్టర్ ఏసీని ఎంచుకోవడం ఉత్తమం.

3) స్మార్ట్ ఫీచర్లు: టైమర్, స్లీప్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్న ఏసీలు విద్యుత్ ఆదాకు తోడ్పడతాయి.

4) చివరిగా ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్‌ను కూడా తక్కువ స్పీడ్‌లో నడపడం వల్ల చల్లని గాలి గది అంతా త్వరగా వ్యాపించి, ఏసీపై భారం తగ్గుతుంది.

Also Read: AP Housing Scheme: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త..ఇళ్ల స్కీమ్ డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!

Also Read: Nara Lokesh On Jagan: "పులివెందుల MLAకి భారీ ఆఫర్..మ్యాచ్ టికెట్ నేనే ఇప్పిస్తా!" ఏపీ మంత్రి నారా లోకేష్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
TKTA Kiran Kumar
Feb 25, 2026 07:47:04
Hyderabad, Telangana:

Telangana Rain Alert: తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (Weather Department) అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశమూ ఉన్నట్లు వెల్లడించింది. ప్రత్యేకంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఈ వర్షాలు వ్యవసాయానికి కొంత మేలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, పంట కోత దశలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో తేమ శాతం కొంత ఎక్కువగా ఉండవచ్చు. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదయ్యే అవకాశముంది. వర్ష ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో గాలుల వేగం స్వల్పంగా పెరిగే సూచనలు ఉన్నాయి. మరోవైపు వర్షాలు పడే ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. అటు ఈదుగు గాలులకు ఇప్పటికే తెలంగాణ పూతకు వచ్చిన మామిడి పిందెలు నేల రాలాయి. దీంతో రైతన్నలు లబోదిబో మంటున్నారు. పిందె దశలో వర్షాల వలన ఈ సారి మామిడి పంట దిగుబడి పై ఎక్కువ ప్రభావం పడే అవకాశాలున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. 

Read more:​ Top 10 Richest Actors: మన దేశంలో అత్యంత ధనవంతులైన హీరోలు వీళ్లే.. ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే.

Read more:​ Chiranjeevi Sankranthi Hits:‘మన శంకర వరప్రసాద్ గారు’ సహా సంక్రాంతి బరిలో హిట్టైన చిరంజీవి మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Feb 25, 2026 07:24:06
Secunderabad, Telangana:

Kethireddy Mass Warning: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లిన నేతలపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి అండగా నిలవాల్సిన సమయంలో పక్కకు తప్పకుని..ఇప్పుడు అవకాశాల కోసం మళ్లీ పార్టీ పంచనా చేరాలనుకోవడం అస్సలు  అంగీకారయోగ్యం కాదన్నారు.  మన దగ్గర సంపాదించుకుని.. పక్క పార్టీల్లోకి వెళ్లి.. ఇప్పుడు బంధుత్వాలు, స్నేహం పేరుతో మళ్లీ వైసీపీ వైపు చూస్తామంటే.. గేటు దగ్గరే ముఖంపై చెప్పుతో కొడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గతంలో పదవులు అనుభవించి..  ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారిన తరువాత కూటమి వైపు చేరిన నాయకులపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ధర్మవరంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందుతూ..  కష్టకాలం వచ్చినప్పుడు దూరంగా వెళ్లిన నేతల వైఖరిపై కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి అండగా నిలవాల్సిన సమయంలో పక్కకు తప్పుకుని, ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం తిరిగి రావాలనుకోవడం అస్సలు అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వదిలిన వారికి తిరిగి చోటు లేదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. మన దగ్గర ఉంది సంపాదించుకుని.. ఇప్పుడు పదవుల కోసం వెళ్లిన నా కొడుకులను మళ్లీ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తి లేదు. బంధుత్వాలు, స్నేహం పేరుతో మళ్లీ వైసీపీ వైపు చూస్తామంటే.. గేటు దగ్గరే ముఖంపై చెప్పుతో కొడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. 

రాజకీయాల్లో నైతికత, విధేయత అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, ఎదురుగా నిలబడి పోరాడే ప్రత్యర్థులను గౌరవించగలమేమోగానీ, లోపలుండి నష్టపరిచిన వారిని మాత్రం క్షమించలేమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీపై విశ్వాసం కోల్పోయి, స్వప్రయోజనాల కోసం వెళ్లిన నాయకులు మళ్లీ చేరాలని ప్రయత్నిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సూచించారు. వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టే రాజకీయాలకు తాము లొంగబోమని స్పష్టం చేశారు.

Also Read: AC Price Hike 2026: ఏసీ కొనుగోలుదారులకు అలర్ట్.. భారీగా పెరగనున్న ధరలు..!!  

అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కష్టకాలంలో తోడుగా ఉన్నవారే నిజమైన బలమని, అలాంటి వారికే భవిష్యత్తులో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. పదవుల కోసం మారే నాయకుల కంటే, సిద్ధాంతాల కోసం నిలిచే కార్యకర్తలే పార్టీకి శక్తి అని అన్నారు.

పార్టీ భవిష్యత్తు విధేయత మరియు క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుందని, నమ్మకద్రోహానికి పాల్పడిన వారికి తలుపులు తెరవబోమని కేతిరెడ్డి తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలతో పార్టీ అంతర్గత పరిస్థితులపై చర్చ మరింత వేగం పుంజుకుంది. రాజకీయ నిబద్ధత, నైతిక విలువలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి.

Also Read: Gold Silver Rate: బంగారం.. వెండిపై  చైనా కీలక ప్రకటన.. ధరలు భారీగా తగ్గే అవకాశం..?  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 25, 2026 06:24:54
Hyderabad, Telangana:

Motorola Edge 60 Fusion Price Cut: మోటరోలా (Motorola) బ్రాండ్‌కి సంబంధించిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. దీనిపై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ముఖ్యంగా స్పెషల్‌ బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఈ Motorola Edge 60 Fusion 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌తో పాటు ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో ప్రారంభించారు. ముఖ్యంగా ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల p-OLED Quad Curved డిస్ప్లేను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ Dimensity 7400 (4nm) చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతమైన పనితీరును అందిస్తుంది. అంతేకాకుండా శక్తివంతమైన 50MP మెయిన్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది Sony LYT-700C సెన్సార్, OIS సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఇక అదనంగా 13MP అల్ట్రావైడ్, మాక్రో లెన్స్ కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. 

ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 32MP సెల్ఫీ కెమెరాను ఫ్రంట్‌ భాగంలో ఉంటుంది. ఇందులో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 5500mAh భారీ బ్యాటరీతో పాటు 68W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 (Hello UI) ఆపరేటింగ్‌ సిస్టంపై రన్‌ అవుతుంది. అలాగే దీనికి 3 ఏళ్ల పాటు OS అప్‌డేట్స్‌తో పాటు 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తున్నట్లు కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. ఇది ప్రీమియం వేగన్ లెదర్ ఫినిషింగ్, IP68/69 వాటర్‌తో పాటు డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో రన్‌ అవుతుంది. ఇందులో ప్రత్యేకంగా Moto AI ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్, మ్యాజిక్ కాన్వాస్, స్టైల్ సింక్ వంటి అద్బుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని సాధారణ వేరియంట్‌ MRP ధర రూ.24,999లతో లభిస్తోంది. అలాగే ఈ  Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెషల్ ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో కేవలం రూ.19,999కే లభిస్తోంది. అయితే, బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,900 వరకు తగ్గింపు లభిస్తుంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తుంది. దీనిని వినియోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.15,950 వరకు బోనస్‌తో పాటు అదనంగా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ  Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.4,999 లోపే సొంతం చేసుకోవచ్చు. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RGRenuka Godugu
Feb 25, 2026 05:42:21
Hyderabad, Telangana:

Trump Claims Shehbaz Sharif Would Have Died: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ సింధూర్‌పై ఈసారి కొత్త రకమైన వాదనకు దిగారు. భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధంతో పాటు మొత్తంగా తన 10 నెలల అధికారంలో 8 యుద్ధాలు తాను ఆపానని బుధవారం పునరుద్ఘాటించారు. 2026 స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ పాక్ యుద్ధం తర్వాత కూడా ఆయన ఎన్నో సార్లు భారత్ యుద్ధం తానే ఆపాను అని.. లేకపోతే అణుయుద్ధం జరిగేదని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బుధవారం రోజు కూడా ఆయన ఈ ప్రసంగంలో భారత్ ఆపరేషన్ సింధూర్‌లో నేను ఆపకపోతే పాకిస్తాన్ ప్రధాని షాబాద్‌ షరీఫ్ చనిపోయేవాడని ఈ యుద్ధంలో 35 మిలియన్ల మంది దానే కాపాడినట్లు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

10 నెలల్లో ..8 యుద్ధాలు ఆపాను..
యుద్ధం సమయంలో 35 మిలియన్ల మంది మరణించే వారని స్వయానా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్‌ షరీఫ్ తనకు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఘర్షణలో తాను జోక్యం చేసుకోకపోతే సైనిక చర్యను ఆపి ఉండకపోతే శభాష్ షరీఫ్ ప్రాణాలతో ఉండేవాడు కాదని పేర్కొన్నారు. నేను దాదాపు పది నెలల్లో 8 యుద్ధాలు ఆపాను. కాంబోడియా- థాయిలాండ్ ,ఇజ్రాయిల్- హమాస్, ఇజ్రాయిల్ -ఇరాన్‌, భారత్ పాకిస్తాన్, సెర్బియా -కొసావా, రువాండా-కాంగో, అర్మేనియా-అజర్‌బైజాన్‌ మధ్య యుద్దాలను తానే పరిష్కరించానని ఆయన ప్రకటించారు.

 ఆపరేషన్స్ సింధూర్‌ సమయంలో భారత్ పాక్ ఇద్దరూ ప్రధాన మంత్రులతో తాను మాట్లాడినట్లు.. యుద్ధం ఆపకపోతే ఇరు దేశాలపై 200 శాతం టారీఫ్‌ విధిస్తానని చెప్పానన్నారు.  ఇరుదేశాలతో వాణిజ్యం ఒప్పందాలు కుదరవన్నానని ఆయన ప్రకటించారు. దీంతో ఈ ప్రధానులు దిగొచ్చినట్లు ఆయన పేర్కొంటున్నారు. 

 

 

ఆపరేషన్‌ సింధూర్‌ ఎలా ఆగింది?
అయితే భారతదేశ మాత్రం ఈ వైఖరిని గతంలో కూడా తిరస్కరించింది. గత సంవత్సరం పహాల్గాం ఉగ్ర దాడుల తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో భారత్ పాకిస్తాన్ మధ్య మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మూడో వ్యక్తి జోక్యం లేదని ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం పాత్ర ఎవరిది లేదని తోసి పుచ్చింది.

అమెరికా పాత్ర ఏది?
భారత్ పాకిస్తాన్ యుద్ధం మధ్యలో మధ్యవర్తిత్వం ఏది జరగలేదు. అమెరికా ఏ పాత్ర పోషించలేదు అని దౌత్య భాషలో జయశంకర్ కూడా దీనిపై స్పందించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా ఈ కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే నెలలో ఫిబ్రవరి 19వ తేదీ కూడా ట్రంప్‌ 8 దేశాల యుద్ధాలను ఆపానని ప్రకటించారు. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో ఎనిమిది జెట్స్‌ కులాయి అని ఈసారి సంఖ్యను కూడా మార్చారు.

ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఇటీవలె కుదిరింది. ఆ తర్వాత ట్రంప్‌ వైఖరి కూడా మారింది. ఇది వరకు భారత్‌ పాక్‌ యుద్ధంలో ఏ దేశానికి పైచేయి అనే సంగతి ఆయన ఎన్నడూ నేరుగా చెప్పనేలేదు. కానీ, తాజాగా పాకిస్తాన్‌ ప్రధాని చనిపోయి ఉండేవాడు అని చెప్పడం గమనార్హం. ఇక పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది అమాయక టూరిస్టులో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత సైనికులు ప్రధానంగా 9 టెర్రర్ అటాక్ ప్రదేశాలను గుర్తించి వాటిపై దాడిచేశారు. ఇందులో పిఓకే విస్తృత తనిఖీలు కూడా నిర్వహించింది. అయితే ఎయిర్ చీఫ్ మార్షల్ మన S-400 పాకిస్తాన్‌ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసిందని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read:​ మరో బాంబు పేల్చిన ట్రంప్‌.. గ్లోబల్‌ టారీఫ్స్‌ 15 శాతానికి పెంపు, భారత్‌కు ఇదే వర్తిస్తుందంటూ క్లారిటీ..!

Also Read:​ సుప్రీం తీర్పిచ్చిన ఏం మారతాడు? ఏదీ మారదు.. భారత్ సుంకాలు కడుతూనే ఉంటుందని ట్రంప్ ఎద్దేవా! అదనంగా మరో 10 శాతం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 25, 2026 03:42:18
Tamil Nadu:

VK Sasikala Political Party: దక్షిణ భారతదేశంలో కీలకంగా ఉన్న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా పరోక్షంగా తమిళనాడు రాజకీయాల్లో భాగమైన చిన్నమ్మ అంటే వీకే శశికళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ఏఐడీఎంకే అధినేత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ప్రాణ స్నేహితురాలిగా ఉన్న శశికళ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే ఈసారి కొత్త రాజకీయ పార్టీని పెట్టి సంచలనం సృష్టించారు.

Also Read: TDP: గోదారోళ్ల ప్రేమాప్యాయతల్లో మునిగిన నారా లోకేశ్.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అందరూ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండగా.. ఈ క్రమంలోనే తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి సంచలనం సృష్టించారు. త్వరలోనే పార్టీ పేరును అధికారికంగా వెల్లడిస్తానని ప్రకటించారు.

Also Read: YS Sharmila: తిరుమల అంశంలో వైఎస్సార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: వైఎస్‌ షర్మిల

తమిళ ప్రజల ఆరాధ్య దైవం జయలలిత 78వ జయంతిని పురస్కరించుకుని శశికళ తన రాజకీయ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించారు. రామనాథపురంలో శశికళ కొత్త పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన జెండా, ఆ జెండాపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ఫొటోలు ఉన్నాయి. ఈ జెండా ఆవిష్కరణతో తాను జయలలిత అసలైన వారసురాలినని శశికళ ప్రకటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వీకే శశికళ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తన రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు. జయలలిత సెంటిమెంట్‌ను వాడుకుంటూ ఆమె ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జయలలిత మృతి అనంతరం జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచి శశికళ బహిష్కరణకు గురయిన విషయం తెలిసిందే. కొన్నాళ్లు జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ బరిలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే మళ్లీ అధికారం సొంతం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో.. ఇక్కడ విజయం కోసం అన్నాడీఎంకే సరికొత్త వ్యూహం నడుపుతోంది. బీజేపీ మద్దతుతో ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుని అధికారం కైవసం చేసుకోవాలని ప్రణాళిక వేస్తోంది. ఈ క్రమంలో జయలలిత ఫొటోతో శశికళ రంగంలోకి దిగడంతో అన్నాడీఎంకేకు భారీ షాక్‌ తగిలింది. శశికళ రాజకీయ ప్రవేశంతో ఎవరి ఓట్లు చీలుతాయనేది ఆసక్తికరంగా మారింది. జయలలిత ఫొటో వాడకంతో అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆమె రాజకీయ అడుగులు ఎటు ఉంటాయో.. ఆమెను ఎవరు నడిపిస్తున్నారో అనే వార్తలు చర్చనీయాంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 25, 2026 03:12:41
Manikonda, Telangana:

Youtuber Akhil Reddy Love Tragedy: హైదరాబాద్‌లో మరో ప్రేమకథ విషాదంగా మారింది. ప్రేమించిన యువకుడు తనను నిరాకరించడంతో ఆమె తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. ప్రేమించిన యువకుడు ఓ యూట్యూబర్‌ కాగా.. ప్రేమించిన యువతి ఇప్పుడిప్పుడే యూట్యూబర్‌గా రాణిస్తోంది. మూడేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమాయణంలో భేదాభిప్రాయాలు రావడంతో ఒకరికొకరు విడిపోయారు. విడిపోయినా కూడా తనకు అతడే కావాలని పట్టుబట్టినా కూడా ఆ యూట్యూబర్‌ ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో హైదరాబాద్‌లో యూట్యూబర్ల ప్రేమ విషాదం నింపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Adulterated Milk Tragedy: పాలు కాదు కాలకూట విషం.. రాజమండ్రిలో ఆరేళ్ల బాలుడు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన కోమలి (21) హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న చిత్రపురి కాలనీలో నివసిస్తోంది. తన మామ ఇంట్లో ఉంటూ కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతోంది. పార్ట్ టైమ్‌లో యూట్యూబ్ వీడియోలు చేస్తుండేది. అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్‌గా రాణిస్తున్న అఖిల్ రెడ్డితో కోమలికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమించుకున్న వారిద్దరూ కొన్ని నెలల కిందట విడిపోయారు.

Also Read: TDP: గోదారోళ్ల ప్రేమాప్యాయతల్లో మునిగిన నారా లోకేశ్.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయం

ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో బ్రేకప్ చెప్పుకొని విడిపోయిన కోమలి మాత్రం తనకు అఖిల్‌ కావాలని పట్టుబడుతోంది. అఖిల్ రెడ్డితో విడిపోయినందుకు కోమలి మనస్తానికి గురై కొన్ని నెలల కిందట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు ఆమె ప్రాణాలు కాపాడారు. ఈ క్రమంలో అఖిల్‌ రెడ్డితో పెళ్లి వ్యవహారం మాట్లాడగా అతడు తిరస్కరించాడు. తనను కాదన్నా కూడా అఖిల్‌ను మర్చిపోలేక కోమలి రెండు రోజుల కిందట మళ్లీ ఫోన్ చేసింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాగం జరిగింది.

గొడవ పెద్దవడమే కాకుండా అఖిల్‌ తనను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో కోమలి సోమవారం చిత్రపురి కాలనీలోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని కోమలి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై యూట్యూబర్‌ అఖిల్‌ రెడ్డిని పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. అతడితో కూడా వివరాలు సేకరించనున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 25, 2026 02:42:54
Rajamahendravaram, Andhra Pradesh:

AP Milk Tragedy: ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ పాలు పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కల్తీ పాలతో తలెత్తిన అనారోగ్య సమస్యలతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. తాజాగా నిన్న ఆరేళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. ఇక కల్తీ పాలతో అస్వస్థతకు గురవుతున్న సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురవగా వారిని ఆస్పత్రికి తరలించి సత్వరమే వైద్యం అందిస్తున్నారు. అంతేకాకుండా వారికి కూడా అన్నీ పరీక్షలు చేయిస్తున్నాయి.

రాజమండ్రిలో కల్తీ పాల‌ విషాదాలు కొనసాగుతున్నాయి. అనూరియా బాధితుల సంఖ్య 12 నుంచి 15కు  చేరుకుంది. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా.. ఏడుగురు నిలకడగా ఉన్నారు. ఈనెల 15వ తేదీన పాల వ్యాపారి గణేశ్వరరావు యథావిధిగా రోజు మాదిరి రాజమండ్రిలోని పలు కుటుంబాలకు పాలు పోశాడు. మొత్తం 110 ఇళ్లకు పాలు పోయగా ఆ కుటుంబాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వరుసగా అస్వస్థతకు గురవడం.. పలువురు మరణించడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా 315 మంది రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేయగా వారిలో
మరో ఇద్దరు కిడ్నీ వ్యాధుల వారిని పడినట్లుగా వైద్యులు గుర్తించారు.

వైద్య పరీక్షల్లో వారు అనారోగ్యానికి గురయ్యారని నిర్ధారణ కావడంతో బాధితులను ఆసుపత్రుల్లో  చేర్చారు. కల్తీ పాలు తాగిన వారిలో నిన్న ఆరేళ్ల బాలుడు మరణించడంతో ఇప్పటివరకు అధికారులు ప్రకటించిన మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.‌ విశాఖ నుంచి సీనియర్ నేఫ్రాలజిస్ట్ డాక్టర్ రవి రాజ్ బృందం కల్తీ పాల బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

కల్తీ పాలతో తీవ్ర అస్వస్థతకు గురయిన బాధితులకు చెన్నై, ముంబై నుంచి కూడా మందులు (మెడిసిన్స్) తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాల కేంద్రంలోని ఫ్రీజర్‌లో ఇథలీన్ గ్లైకాల్ అనే కెమికల్ లీకేజ్ కారణంగానే పాలు కల్తీ జరిగినట్లు అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. బ్యాక్టీరియల్ పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపిన శాంపిల్స్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. కల్తీ పాలకు కారణమైన వ్యాపారి గణేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు కల్తీ పాల బాధితులకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంపై విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణపై ప్రభుత్వం వేటు వేసింది. కొత్త సూపరింటెండెంట్ గా డాక్టర్ కెనడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 25, 2026 02:19:57
Hyderabad, Telangana:

Telangana RTC Employees: అధికారంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ప్రమాద బీమా పెంచామని గొప్పలు చెబుతున్నా వాస్తవంగా అది కంటి తుడుపు చర్యగా ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌ రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను నిలదీస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. మార్చి 13తో సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆర్టీసీ ఉద్యోగులు హెచ్చరించారు.

దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలపై తెలంగాణ ‌ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉద్యమం ప్రారంభించారు. చలో సచివాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టగా.. మంగళవారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో భారీ నిరన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ధర్నాలో ఆర్టీసీ జేఏసీ నాయకులు రేవంత్ రెడ్డికి డెడ్‌లైన్‌ విధించారు. మార్చి 13వ తేదీలోగా తమ దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలు, డిమాండ్‌లను రేవంత్‌రెడ్డి పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడించి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. 

ఈ ధర్నాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మద్దతు పలికి ఉద్యోగులకు అండగా నిలిచారు. వారి సమస్యలు, డిమాండ్లు వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని సీపీఐ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల కంటే ఆర్టీసీ కార్మికులకు తక్కువ వేతనం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తానని చెప్పారు. ఆర్థిక భారం లేని బెనిఫిట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ప్రక్రియను రేవంత్‌ రెడ్డి రెండేళ్లయినా మొదలుపెట్టలేదని గుర్తుచేశారు. మార్చి 13వ తేదీలోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మార్చి 18వ తేదీ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెనుకాడబోమని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. 'అధికారంలోకి వచ్చాక 2017 వేతన సవరణ అమలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఏరియర్స్‌ను మాత్రం ఇంకా చెల్లించలేదు. ఆర్టీసీకి రావాల్సిన రూ.2,150 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి' అని జేఏసీ వైస్‌ చైర్మన్‌ థామస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

రేవంత్ రెడ్డితో తాడోపేడో
భారీ స్థాయిలో జరిగిన ఈ మహాధర్నాకు పెద్ద ఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. వీరి నిరసనకు ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. అయితే ఈ ధర్నాతో రేవంత్‌ రెడ్డి మాత్రం దిగిరాకపోతే ఆర్టీసీ ఉద్యోగులు బస్సులు బంద్‌ చేసి సమ్మెకు దిగే అవకాశం ఉంది. గతంలోనే సమ్మెకు పిలుపునిస్తే రేవంత్‌ రెడ్డి ఉద్యోగులతో చర్చలు.. కమిటీల పేరుతో కాలయాపన చేసిన విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, సమస్యలు పరిష్కరించకపోవడంతో అన్నీ వర్గాల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 25, 2026 01:51:29
Undavalli, Andhra Pradesh:

Nara Lokesh Dinner Politics: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సరికొత్త సంప్రదాయం ప్రారంభించింది. పార్టీకి పట్టుగొమ్మలుగా ఉన్న క్యాడర్‌లో ఉత్సాహం నింపేలా మంత్రి నారా లోకేశ్‌ సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. కార్యకర్తలు, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకునే టీడీపీ తాజాగా లోకేశ్‌ చేస్తున్న పనితో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో లోకేశ్‌ గోదారోళ్ల ప్రేమాప్యాయతల్లో మునిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Bandi Sanjay: 'రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కూల్చబోతున్నారు: బండి సంజయ్

ఆత్మీయ ఆతిథ్యానికి చిరునామా అయిన గోదావరి జిల్లా పరిధి కాకినాడ, అమలాపురం పార్లమెంటు కూటమి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తమ నివాసంలో మంగళవారం గోదావరి జిల్లా టీడీపీ నాయకులకు విందు ఇచ్చారు. రాజకీయాలు లేకుండా హాయిగా.. ఆనందోత్సాహాలతో ఈ విందు జరిగింది. గోదావరి జిల్లాలకు వెళితే ఎంత చక్కటి ఆతిథ్యం ఇస్తారో.. అదే అతిథి మర్యాదలతో ఆత్మీయ కలయిక ఏర్పడింది.

గోదావరి జిల్లాకే ప్రత్యేకమైన రుచులు, చిత్రాలు, ప్రతిమలతో టీడీపీ నాయకులకు మంత్రి లోకేశ్‌ ఆతిథ్యం ఇచ్చి సత్కరించారు. సరదా వ్యాఖ్యలతో.. నవ్వులతో ఈ విందు సాగింది. ఈ క్రమంలోనే అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగికి మూడు నెలల్లో పెళ్లి చేయాలని, సంబంధాలు చూడాలని గోదావరి ప్రజాప్రతినిధులను నారా లోకేశ్‌ కోరారు. ఈ సందర్భంగా విందులో ప్రేమ పెళ్లిళ్ల గురించి ఆసక్తికరమైన చర్చ సాగింది. ప్రేమించి, ఇరుపక్షాలనూ ఒప్పించి పెళ్లి చేసుకున్నామని..ప్రేమ వివాహమే మా జీవితాలకు వెలుగునిచ్చిందని ఎంపీ సానా సతీష్ బాబు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తమ ప్రేమ పోరాటాలను, పెళ్లి విజయాలను చెప్పారు.

ఇక విందులో కొందరు ప్రజాప్రతినిధులు తమ పరిధిలో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం కోసం మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తులు చేశారు. ఆఖరులో విందుకు హాజరైన ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులకు నారా లోకేశ్‌ మంగళగిరి పట్టుచీరలను బహూకరించారు.

తమ కుటుంబాలతో హాజరైన అతిథులు వీరే..
ఎంపీలు: సానా సతీష్ బాబు, జీఎం హరీష్ బాలయోగి
ఎమ్మెల్యేలు
వరుపుల సత్యప్రభ (ప్రత్తిపాడు), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ సిటీ), పంతం వెంకటేశ్వరరావు (కాకినాడ రూరల్ జనసేన), జ్యోతుల వెంకట అప్పారావు నెహ్రూ (జగ్గంపేట), వాసంశెట్టి సుభాష్ (రామచంద్రాపురం), దాట్ల సుబ్బరాజు (ముమ్మిడివరం), అయితాబత్తుల ఆనందరావు (అమలాపురం), దేవ వరప్రసాద్ (రాజోలు జనసేన), గిన్ని సత్యనారాయణ (పి గన్నవరం జనసేన), బండారు సత్యానందరావు (కొత్తపేట), వేగుళ్ల జోగేశ్వరరావు (మండపేట)
ఎమ్మెల్సీలు: పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, పిడుగు హరిప్రసాద్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 24, 2026 17:59:26
Warangal, Telangana:

Warangal: 'దేవాదుల ప్రాజెక్ట్ విజిట్ చేయగానే సీఎం రివ్యూ చేశారు. మేము తట్టిలేపితేనే రేవంత్ రెడ్డి నిద్రలేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెబుతూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గోదావరి జలాలపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు. అయితే మైక్ కట్ చేయొద్దు.. కెమెరా తిప్పొద్దని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలో ఒక్క ఎకరా సేకరించలేదని, అదనంగా సాగునీరు అందించలేదని ఆరోపించారు.

వరంగల్‌లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని బీఆర్ఎస్ పార్టీ బృందంతో కలిపి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. మంత్రుల మాటలకు, రేవంత్ రెడ్డి మాటలకు పొంతనలేదని తెలిపారు. ఈ ప్రభుత్వానికి డేట్ లు, డెడ్ లైన్ లు మాత్రమే మారుతున్నాయని ఎద్దేవా చేశారు.

'గోదావరి మీద మాట్లాడదామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసురుతున్నారు. గోదావరిపై 8 బ్యారేజ్ లు కట్టింది మేము, ఆయన ఏం మాట్లాడుతాడు?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. గోదావరి నీళ్లను పొలాలకు మళ్లించింది మేము, మీరు ఏం చేశారని నిలదీశారు. కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు చాలెంజ్ చేశారు.

'మంత్రి ఉత్తమ్ మాట్లాడుతుంటే వద్దని రేవంత్ రెడ్డి వారించాడు. నీళ్ల మంత్రిని కూడా మాట్లాడనీయని రేవంత్ రెడ్డి మమ్మల్ని మాట్లాడనిస్తాడా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు సందేహం వ్యక్తం చేశారు. 'దేవాదుల 90శాతం పూర్తి చేశాం, 10శాతం మాత్రమే పెండింగ్ ఉంది. త్వరలో దేవాదుల ప్రాజెక్ట్ పూర్తిచేయాలి' అని డిమాండ్ చేశారు. 'వరంగల్ ను హెల్త్ సిటీ చేయాలని కేసీఆర్ పనిచేశారు. పేదల కోసం కేసీఆర్ హెల్త్ సిటీ నిర్మిస్తే, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కోసం పనిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం రేవంత్ రెడ్డిది, పేదల కోసం పనిచేసే ఆలోచన కేసీఆర్ ది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై నిర్లక్ష్యం మంచిది కాదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

'కేసీఆర్ కు పేరు వస్తుందని పనులు చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి ప్రారంభం కావట్లేదు. 2000 పడకల ఆస్పత్రి కలగానే మిగిలిపోయేలా ఉంది. జూన్ లో ప్రారంభిస్తామని చెప్తున్నారు, ఉద్యోగాల కోసం కేబినెట్ అనుమతి కూడా తీసుకోలేదు. వైద్య అధికారులు, సిబ్బంది నియామకమే పూర్తి కాలేదు. కావలసిన వైద్య పరికరాలు కూడా ఇప్పటివరకు తేలేదు. ఓపీ సేవలు ప్రారంభించి, 24 అంతస్తుల ఆస్పత్రిని బస్తీ దవాఖానా చేస్తారా...?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

'రెండేళ్లు ఓపిక పట్టాం. ఇక నిలదీస్తాం, గల్లా పట్టి అడుగుతాం. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే బీ ఆర్ ఎస్ నిరసన దీక్షలకు దిగుతుంది. వరంగల్ ఎంజీఎంలో ఏడాదిన్నరగా గుండె శస్త్ర చికిత్సలు ఆగిపోయాయి. ఎంజీఎంలో 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లు పెట్టాం. ఇప్పుడు ఒక్కటి కూడా పనిచేయట్లేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. 'మేము ఇచ్చిన వాటిని కూడా సరిగా నడపడం చేతకావట్లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 24, 2026 17:55:50
Hyderabad, Telangana:

Bandi Sanjay Kumar: 'ఎమ్మెల్యేలంతా నారాజ్ లో ఉన్నారు నియోజకవర్గాలకు నిధులివ్వడం లేదు. కాంగ్రెస్ లో ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాన్ని ఇతరులకు ఇవ్వరు సొంత పార్టీ నేతలే ఆ ప్రభుత్వాన్ని కూల్చుతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గ్యారంటీ లేదు. కాంగ్రెస్ నేతలే అవినీతిమయమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలని బీజేపీ కోరుకోవడం లేదు. ప్రజాస్వామ్యబద్దంగా పాలన కొనసాగించాలని ఆశిస్తోంది' అని బండి సంజయ్ తెలిపారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల, కౌన్సిలర్ల పరిచయ కార్యక్రమం హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. 'ఇకపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయం తథ్యం' అని ధీమా వ్యక్తం చేశారు. 'కాంగ్రెస్ పార్టీలో లొల్లి స్టార్ట్ అయ్యింది. కర్నాటకలో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవులు కావాలని రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తెలంగాణలోనూ రెండు జిల్లాల్లో ఎమ్మెల్యేలు కర్నాటక తరహాలో మంత్రి పదవులు కావాలని అసమ్మతి సమావేశాలు పెట్టుకున్నారు. ప్రస్తుత మంత్రులు అవినీతికి పాల్పడుతూ కాంగ్రెస్ ను భ్రష్టు పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు లేఖలు రాసి రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది' అని కాంగ్రెస్ పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'2028లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మనందరం పనిచేద్దాం' బీజేపీ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. 'ప్రతి కార్యకర్తకు బీజేపీ కార్యాలయం పవిత్రమైన దేవాలయం. పార్టీ కంటే నేనే గొప్ప అనుకున్న వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారు. బండి సంజయ్ అనే నేను పార్టీలో లేకుంటే నన్ను కక్కులు కూడా దేకవు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు

'కరీంనగర్ లో కార్యకర్తల కష్టం, నాయకుల స్ట్రాటజీతోనే మేయర్ కలను సాకారం చేసుకోగలిగాం. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుమ్కక్కై కుట్రలు చేసినా అధిగమించగలిగాం. ఆ పార్టీలు దిగజారి కుట్రలు చేసినా విజయం సాధించాం. రేవంత్ రెడ్డి కూడా తన స్థాయికి దిగజార్చుకుని బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా కుట్ర చేశారు. ప్రజాతీర్పుకు భిన్నంగా రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చేసిన కుట్రలపై కొందరు కార్పొరేటర్లే తిరుగుబాటు చేసి స్వచ్ఛందంగా మేయర్ ఎన్నికలో తటస్థంగా నిలిచి సహకరించారు' అని బండి సంజయ్ వివరించారు. కరీంనగర్ మేయర్ గెలుపు ఊత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పనిచేద్దామని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కైవసం చేసుకుందామని చెప్పారు. 'ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను మూడు ముక్కలు చేసి అందులో ఒక దానికి ఎంఐఎం పార్టీకి దారాధత్తం చేయాలని చూస్తున్నారు' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top