Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500089
Komali Tragedy: యూట్యూబర్‌తో ప్రేమ విఫలం.. ప్రాణాలు తీసుకున్న మరో యూట్యూబర్‌ కోమలి
RKRavi Kumar Sargam
Feb 25, 2026 03:12:41
Manikonda, Telangana

Youtuber Akhil Reddy Love Tragedy: హైదరాబాద్‌లో మరో ప్రేమకథ విషాదంగా మారింది. ప్రేమించిన యువకుడు తనను నిరాకరించడంతో ఆమె తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. ప్రేమించిన యువకుడు ఓ యూట్యూబర్‌ కాగా.. ప్రేమించిన యువతి ఇప్పుడిప్పుడే యూట్యూబర్‌గా రాణిస్తోంది. మూడేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమాయణంలో భేదాభిప్రాయాలు రావడంతో ఒకరికొకరు విడిపోయారు. విడిపోయినా కూడా తనకు అతడే కావాలని పట్టుబట్టినా కూడా ఆ యూట్యూబర్‌ ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో హైదరాబాద్‌లో యూట్యూబర్ల ప్రేమ విషాదం నింపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Adulterated Milk Tragedy: పాలు కాదు కాలకూట విషం.. రాజమండ్రిలో ఆరేళ్ల బాలుడు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన కోమలి (21) హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న చిత్రపురి కాలనీలో నివసిస్తోంది. తన మామ ఇంట్లో ఉంటూ కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతోంది. పార్ట్ టైమ్‌లో యూట్యూబ్ వీడియోలు చేస్తుండేది. అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్‌గా రాణిస్తున్న అఖిల్ రెడ్డితో కోమలికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమించుకున్న వారిద్దరూ కొన్ని నెలల కిందట విడిపోయారు.

Also Read: TDP: గోదారోళ్ల ప్రేమాప్యాయతల్లో మునిగిన నారా లోకేశ్.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయం

ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో బ్రేకప్ చెప్పుకొని విడిపోయిన కోమలి మాత్రం తనకు అఖిల్‌ కావాలని పట్టుబడుతోంది. అఖిల్ రెడ్డితో విడిపోయినందుకు కోమలి మనస్తానికి గురై కొన్ని నెలల కిందట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు ఆమె ప్రాణాలు కాపాడారు. ఈ క్రమంలో అఖిల్‌ రెడ్డితో పెళ్లి వ్యవహారం మాట్లాడగా అతడు తిరస్కరించాడు. తనను కాదన్నా కూడా అఖిల్‌ను మర్చిపోలేక కోమలి రెండు రోజుల కిందట మళ్లీ ఫోన్ చేసింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాగం జరిగింది.

గొడవ పెద్దవడమే కాకుండా అఖిల్‌ తనను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో కోమలి సోమవారం చిత్రపురి కాలనీలోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని కోమలి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై యూట్యూబర్‌ అఖిల్‌ రెడ్డిని పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. అతడితో కూడా వివరాలు సేకరించనున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RGRenuka Godugu
Feb 25, 2026 05:42:21
Hyderabad, Telangana:

Trump Claims Shehbaz Sharif Would Have Died: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ సింధూర్‌పై ఈసారి కొత్త రకమైన వాదనకు దిగారు. భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధంతో పాటు మొత్తంగా తన 10 నెలల అధికారంలో 8 యుద్ధాలు తాను ఆపానని బుధవారం పునరుద్ఘాటించారు. 2026 స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ పాక్ యుద్ధం తర్వాత కూడా ఆయన ఎన్నో సార్లు భారత్ యుద్ధం తానే ఆపాను అని.. లేకపోతే అణుయుద్ధం జరిగేదని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బుధవారం రోజు కూడా ఆయన ఈ ప్రసంగంలో భారత్ ఆపరేషన్ సింధూర్‌లో నేను ఆపకపోతే పాకిస్తాన్ ప్రధాని షాబాద్‌ షరీఫ్ చనిపోయేవాడని ఈ యుద్ధంలో 35 మిలియన్ల మంది దానే కాపాడినట్లు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

10 నెలల్లో ..8 యుద్ధాలు ఆపాను..
యుద్ధం సమయంలో 35 మిలియన్ల మంది మరణించే వారని స్వయానా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్‌ షరీఫ్ తనకు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఘర్షణలో తాను జోక్యం చేసుకోకపోతే సైనిక చర్యను ఆపి ఉండకపోతే శభాష్ షరీఫ్ ప్రాణాలతో ఉండేవాడు కాదని పేర్కొన్నారు. నేను దాదాపు పది నెలల్లో 8 యుద్ధాలు ఆపాను. కాంబోడియా- థాయిలాండ్ ,ఇజ్రాయిల్- హమాస్, ఇజ్రాయిల్ -ఇరాన్‌, భారత్ పాకిస్తాన్, సెర్బియా -కొసావా, రువాండా-కాంగో, అర్మేనియా-అజర్‌బైజాన్‌ మధ్య యుద్దాలను తానే పరిష్కరించానని ఆయన ప్రకటించారు.

 ఆపరేషన్స్ సింధూర్‌ సమయంలో భారత్ పాక్ ఇద్దరూ ప్రధాన మంత్రులతో తాను మాట్లాడినట్లు.. యుద్ధం ఆపకపోతే ఇరు దేశాలపై 200 శాతం టారీఫ్‌ విధిస్తానని చెప్పానన్నారు.  ఇరుదేశాలతో వాణిజ్యం ఒప్పందాలు కుదరవన్నానని ఆయన ప్రకటించారు. దీంతో ఈ ప్రధానులు దిగొచ్చినట్లు ఆయన పేర్కొంటున్నారు. 

 

 

ఆపరేషన్‌ సింధూర్‌ ఎలా ఆగింది?
అయితే భారతదేశ మాత్రం ఈ వైఖరిని గతంలో కూడా తిరస్కరించింది. గత సంవత్సరం పహాల్గాం ఉగ్ర దాడుల తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో భారత్ పాకిస్తాన్ మధ్య మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మూడో వ్యక్తి జోక్యం లేదని ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం పాత్ర ఎవరిది లేదని తోసి పుచ్చింది.

అమెరికా పాత్ర ఏది?
భారత్ పాకిస్తాన్ యుద్ధం మధ్యలో మధ్యవర్తిత్వం ఏది జరగలేదు. అమెరికా ఏ పాత్ర పోషించలేదు అని దౌత్య భాషలో జయశంకర్ కూడా దీనిపై స్పందించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా ఈ కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే నెలలో ఫిబ్రవరి 19వ తేదీ కూడా ట్రంప్‌ 8 దేశాల యుద్ధాలను ఆపానని ప్రకటించారు. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో ఎనిమిది జెట్స్‌ కులాయి అని ఈసారి సంఖ్యను కూడా మార్చారు.

ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఇటీవలె కుదిరింది. ఆ తర్వాత ట్రంప్‌ వైఖరి కూడా మారింది. ఇది వరకు భారత్‌ పాక్‌ యుద్ధంలో ఏ దేశానికి పైచేయి అనే సంగతి ఆయన ఎన్నడూ నేరుగా చెప్పనేలేదు. కానీ, తాజాగా పాకిస్తాన్‌ ప్రధాని చనిపోయి ఉండేవాడు అని చెప్పడం గమనార్హం. ఇక పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది అమాయక టూరిస్టులో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత సైనికులు ప్రధానంగా 9 టెర్రర్ అటాక్ ప్రదేశాలను గుర్తించి వాటిపై దాడిచేశారు. ఇందులో పిఓకే విస్తృత తనిఖీలు కూడా నిర్వహించింది. అయితే ఎయిర్ చీఫ్ మార్షల్ మన S-400 పాకిస్తాన్‌ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసిందని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read:​ మరో బాంబు పేల్చిన ట్రంప్‌.. గ్లోబల్‌ టారీఫ్స్‌ 15 శాతానికి పెంపు, భారత్‌కు ఇదే వర్తిస్తుందంటూ క్లారిటీ..!

Also Read:​ సుప్రీం తీర్పిచ్చిన ఏం మారతాడు? ఏదీ మారదు.. భారత్ సుంకాలు కడుతూనే ఉంటుందని ట్రంప్ ఎద్దేవా! అదనంగా మరో 10 శాతం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 25, 2026 03:42:18
Tamil Nadu:

VK Sasikala Political Party: దక్షిణ భారతదేశంలో కీలకంగా ఉన్న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా పరోక్షంగా తమిళనాడు రాజకీయాల్లో భాగమైన చిన్నమ్మ అంటే వీకే శశికళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ఏఐడీఎంకే అధినేత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ప్రాణ స్నేహితురాలిగా ఉన్న శశికళ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే ఈసారి కొత్త రాజకీయ పార్టీని పెట్టి సంచలనం సృష్టించారు.

Also Read: TDP: గోదారోళ్ల ప్రేమాప్యాయతల్లో మునిగిన నారా లోకేశ్.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అందరూ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండగా.. ఈ క్రమంలోనే తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి సంచలనం సృష్టించారు. త్వరలోనే పార్టీ పేరును అధికారికంగా వెల్లడిస్తానని ప్రకటించారు.

Also Read: YS Sharmila: తిరుమల అంశంలో వైఎస్సార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: వైఎస్‌ షర్మిల

తమిళ ప్రజల ఆరాధ్య దైవం జయలలిత 78వ జయంతిని పురస్కరించుకుని శశికళ తన రాజకీయ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించారు. రామనాథపురంలో శశికళ కొత్త పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన జెండా, ఆ జెండాపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ఫొటోలు ఉన్నాయి. ఈ జెండా ఆవిష్కరణతో తాను జయలలిత అసలైన వారసురాలినని శశికళ ప్రకటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వీకే శశికళ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తన రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు. జయలలిత సెంటిమెంట్‌ను వాడుకుంటూ ఆమె ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జయలలిత మృతి అనంతరం జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచి శశికళ బహిష్కరణకు గురయిన విషయం తెలిసిందే. కొన్నాళ్లు జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ బరిలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే మళ్లీ అధికారం సొంతం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో.. ఇక్కడ విజయం కోసం అన్నాడీఎంకే సరికొత్త వ్యూహం నడుపుతోంది. బీజేపీ మద్దతుతో ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుని అధికారం కైవసం చేసుకోవాలని ప్రణాళిక వేస్తోంది. ఈ క్రమంలో జయలలిత ఫొటోతో శశికళ రంగంలోకి దిగడంతో అన్నాడీఎంకేకు భారీ షాక్‌ తగిలింది. శశికళ రాజకీయ ప్రవేశంతో ఎవరి ఓట్లు చీలుతాయనేది ఆసక్తికరంగా మారింది. జయలలిత ఫొటో వాడకంతో అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆమె రాజకీయ అడుగులు ఎటు ఉంటాయో.. ఆమెను ఎవరు నడిపిస్తున్నారో అనే వార్తలు చర్చనీయాంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 25, 2026 02:42:54
Rajamahendravaram, Andhra Pradesh:

AP Milk Tragedy: ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ పాలు పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కల్తీ పాలతో తలెత్తిన అనారోగ్య సమస్యలతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. తాజాగా నిన్న ఆరేళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. ఇక కల్తీ పాలతో అస్వస్థతకు గురవుతున్న సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురవగా వారిని ఆస్పత్రికి తరలించి సత్వరమే వైద్యం అందిస్తున్నారు. అంతేకాకుండా వారికి కూడా అన్నీ పరీక్షలు చేయిస్తున్నాయి.

రాజమండ్రిలో కల్తీ పాల‌ విషాదాలు కొనసాగుతున్నాయి. అనూరియా బాధితుల సంఖ్య 12 నుంచి 15కు  చేరుకుంది. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా.. ఏడుగురు నిలకడగా ఉన్నారు. ఈనెల 15వ తేదీన పాల వ్యాపారి గణేశ్వరరావు యథావిధిగా రోజు మాదిరి రాజమండ్రిలోని పలు కుటుంబాలకు పాలు పోశాడు. మొత్తం 110 ఇళ్లకు పాలు పోయగా ఆ కుటుంబాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వరుసగా అస్వస్థతకు గురవడం.. పలువురు మరణించడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా 315 మంది రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేయగా వారిలో
మరో ఇద్దరు కిడ్నీ వ్యాధుల వారిని పడినట్లుగా వైద్యులు గుర్తించారు.

వైద్య పరీక్షల్లో వారు అనారోగ్యానికి గురయ్యారని నిర్ధారణ కావడంతో బాధితులను ఆసుపత్రుల్లో  చేర్చారు. కల్తీ పాలు తాగిన వారిలో నిన్న ఆరేళ్ల బాలుడు మరణించడంతో ఇప్పటివరకు అధికారులు ప్రకటించిన మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.‌ విశాఖ నుంచి సీనియర్ నేఫ్రాలజిస్ట్ డాక్టర్ రవి రాజ్ బృందం కల్తీ పాల బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

కల్తీ పాలతో తీవ్ర అస్వస్థతకు గురయిన బాధితులకు చెన్నై, ముంబై నుంచి కూడా మందులు (మెడిసిన్స్) తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాల కేంద్రంలోని ఫ్రీజర్‌లో ఇథలీన్ గ్లైకాల్ అనే కెమికల్ లీకేజ్ కారణంగానే పాలు కల్తీ జరిగినట్లు అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. బ్యాక్టీరియల్ పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపిన శాంపిల్స్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. కల్తీ పాలకు కారణమైన వ్యాపారి గణేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు కల్తీ పాల బాధితులకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంపై విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణపై ప్రభుత్వం వేటు వేసింది. కొత్త సూపరింటెండెంట్ గా డాక్టర్ కెనడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 25, 2026 02:19:57
Hyderabad, Telangana:

Telangana RTC Employees: అధికారంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ప్రమాద బీమా పెంచామని గొప్పలు చెబుతున్నా వాస్తవంగా అది కంటి తుడుపు చర్యగా ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌ రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను నిలదీస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. మార్చి 13తో సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆర్టీసీ ఉద్యోగులు హెచ్చరించారు.

దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలపై తెలంగాణ ‌ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉద్యమం ప్రారంభించారు. చలో సచివాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టగా.. మంగళవారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో భారీ నిరన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ధర్నాలో ఆర్టీసీ జేఏసీ నాయకులు రేవంత్ రెడ్డికి డెడ్‌లైన్‌ విధించారు. మార్చి 13వ తేదీలోగా తమ దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలు, డిమాండ్‌లను రేవంత్‌రెడ్డి పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడించి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. 

ఈ ధర్నాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మద్దతు పలికి ఉద్యోగులకు అండగా నిలిచారు. వారి సమస్యలు, డిమాండ్లు వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని సీపీఐ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల కంటే ఆర్టీసీ కార్మికులకు తక్కువ వేతనం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తానని చెప్పారు. ఆర్థిక భారం లేని బెనిఫిట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ప్రక్రియను రేవంత్‌ రెడ్డి రెండేళ్లయినా మొదలుపెట్టలేదని గుర్తుచేశారు. మార్చి 13వ తేదీలోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మార్చి 18వ తేదీ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెనుకాడబోమని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. 'అధికారంలోకి వచ్చాక 2017 వేతన సవరణ అమలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఏరియర్స్‌ను మాత్రం ఇంకా చెల్లించలేదు. ఆర్టీసీకి రావాల్సిన రూ.2,150 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి' అని జేఏసీ వైస్‌ చైర్మన్‌ థామస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

రేవంత్ రెడ్డితో తాడోపేడో
భారీ స్థాయిలో జరిగిన ఈ మహాధర్నాకు పెద్ద ఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. వీరి నిరసనకు ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. అయితే ఈ ధర్నాతో రేవంత్‌ రెడ్డి మాత్రం దిగిరాకపోతే ఆర్టీసీ ఉద్యోగులు బస్సులు బంద్‌ చేసి సమ్మెకు దిగే అవకాశం ఉంది. గతంలోనే సమ్మెకు పిలుపునిస్తే రేవంత్‌ రెడ్డి ఉద్యోగులతో చర్చలు.. కమిటీల పేరుతో కాలయాపన చేసిన విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, సమస్యలు పరిష్కరించకపోవడంతో అన్నీ వర్గాల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 25, 2026 01:51:29
Undavalli, Andhra Pradesh:

Nara Lokesh Dinner Politics: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సరికొత్త సంప్రదాయం ప్రారంభించింది. పార్టీకి పట్టుగొమ్మలుగా ఉన్న క్యాడర్‌లో ఉత్సాహం నింపేలా మంత్రి నారా లోకేశ్‌ సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. కార్యకర్తలు, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకునే టీడీపీ తాజాగా లోకేశ్‌ చేస్తున్న పనితో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో లోకేశ్‌ గోదారోళ్ల ప్రేమాప్యాయతల్లో మునిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Bandi Sanjay: 'రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కూల్చబోతున్నారు: బండి సంజయ్

ఆత్మీయ ఆతిథ్యానికి చిరునామా అయిన గోదావరి జిల్లా పరిధి కాకినాడ, అమలాపురం పార్లమెంటు కూటమి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తమ నివాసంలో మంగళవారం గోదావరి జిల్లా టీడీపీ నాయకులకు విందు ఇచ్చారు. రాజకీయాలు లేకుండా హాయిగా.. ఆనందోత్సాహాలతో ఈ విందు జరిగింది. గోదావరి జిల్లాలకు వెళితే ఎంత చక్కటి ఆతిథ్యం ఇస్తారో.. అదే అతిథి మర్యాదలతో ఆత్మీయ కలయిక ఏర్పడింది.

గోదావరి జిల్లాకే ప్రత్యేకమైన రుచులు, చిత్రాలు, ప్రతిమలతో టీడీపీ నాయకులకు మంత్రి లోకేశ్‌ ఆతిథ్యం ఇచ్చి సత్కరించారు. సరదా వ్యాఖ్యలతో.. నవ్వులతో ఈ విందు సాగింది. ఈ క్రమంలోనే అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగికి మూడు నెలల్లో పెళ్లి చేయాలని, సంబంధాలు చూడాలని గోదావరి ప్రజాప్రతినిధులను నారా లోకేశ్‌ కోరారు. ఈ సందర్భంగా విందులో ప్రేమ పెళ్లిళ్ల గురించి ఆసక్తికరమైన చర్చ సాగింది. ప్రేమించి, ఇరుపక్షాలనూ ఒప్పించి పెళ్లి చేసుకున్నామని..ప్రేమ వివాహమే మా జీవితాలకు వెలుగునిచ్చిందని ఎంపీ సానా సతీష్ బాబు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తమ ప్రేమ పోరాటాలను, పెళ్లి విజయాలను చెప్పారు.

ఇక విందులో కొందరు ప్రజాప్రతినిధులు తమ పరిధిలో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం కోసం మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తులు చేశారు. ఆఖరులో విందుకు హాజరైన ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులకు నారా లోకేశ్‌ మంగళగిరి పట్టుచీరలను బహూకరించారు.

తమ కుటుంబాలతో హాజరైన అతిథులు వీరే..
ఎంపీలు: సానా సతీష్ బాబు, జీఎం హరీష్ బాలయోగి
ఎమ్మెల్యేలు
వరుపుల సత్యప్రభ (ప్రత్తిపాడు), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ సిటీ), పంతం వెంకటేశ్వరరావు (కాకినాడ రూరల్ జనసేన), జ్యోతుల వెంకట అప్పారావు నెహ్రూ (జగ్గంపేట), వాసంశెట్టి సుభాష్ (రామచంద్రాపురం), దాట్ల సుబ్బరాజు (ముమ్మిడివరం), అయితాబత్తుల ఆనందరావు (అమలాపురం), దేవ వరప్రసాద్ (రాజోలు జనసేన), గిన్ని సత్యనారాయణ (పి గన్నవరం జనసేన), బండారు సత్యానందరావు (కొత్తపేట), వేగుళ్ల జోగేశ్వరరావు (మండపేట)
ఎమ్మెల్సీలు: పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, పిడుగు హరిప్రసాద్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 24, 2026 17:59:26
Warangal, Telangana:

Warangal: 'దేవాదుల ప్రాజెక్ట్ విజిట్ చేయగానే సీఎం రివ్యూ చేశారు. మేము తట్టిలేపితేనే రేవంత్ రెడ్డి నిద్రలేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెబుతూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గోదావరి జలాలపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు. అయితే మైక్ కట్ చేయొద్దు.. కెమెరా తిప్పొద్దని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలో ఒక్క ఎకరా సేకరించలేదని, అదనంగా సాగునీరు అందించలేదని ఆరోపించారు.

వరంగల్‌లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని బీఆర్ఎస్ పార్టీ బృందంతో కలిపి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. మంత్రుల మాటలకు, రేవంత్ రెడ్డి మాటలకు పొంతనలేదని తెలిపారు. ఈ ప్రభుత్వానికి డేట్ లు, డెడ్ లైన్ లు మాత్రమే మారుతున్నాయని ఎద్దేవా చేశారు.

'గోదావరి మీద మాట్లాడదామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసురుతున్నారు. గోదావరిపై 8 బ్యారేజ్ లు కట్టింది మేము, ఆయన ఏం మాట్లాడుతాడు?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. గోదావరి నీళ్లను పొలాలకు మళ్లించింది మేము, మీరు ఏం చేశారని నిలదీశారు. కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు చాలెంజ్ చేశారు.

'మంత్రి ఉత్తమ్ మాట్లాడుతుంటే వద్దని రేవంత్ రెడ్డి వారించాడు. నీళ్ల మంత్రిని కూడా మాట్లాడనీయని రేవంత్ రెడ్డి మమ్మల్ని మాట్లాడనిస్తాడా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు సందేహం వ్యక్తం చేశారు. 'దేవాదుల 90శాతం పూర్తి చేశాం, 10శాతం మాత్రమే పెండింగ్ ఉంది. త్వరలో దేవాదుల ప్రాజెక్ట్ పూర్తిచేయాలి' అని డిమాండ్ చేశారు. 'వరంగల్ ను హెల్త్ సిటీ చేయాలని కేసీఆర్ పనిచేశారు. పేదల కోసం కేసీఆర్ హెల్త్ సిటీ నిర్మిస్తే, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కోసం పనిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం రేవంత్ రెడ్డిది, పేదల కోసం పనిచేసే ఆలోచన కేసీఆర్ ది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై నిర్లక్ష్యం మంచిది కాదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

'కేసీఆర్ కు పేరు వస్తుందని పనులు చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి ప్రారంభం కావట్లేదు. 2000 పడకల ఆస్పత్రి కలగానే మిగిలిపోయేలా ఉంది. జూన్ లో ప్రారంభిస్తామని చెప్తున్నారు, ఉద్యోగాల కోసం కేబినెట్ అనుమతి కూడా తీసుకోలేదు. వైద్య అధికారులు, సిబ్బంది నియామకమే పూర్తి కాలేదు. కావలసిన వైద్య పరికరాలు కూడా ఇప్పటివరకు తేలేదు. ఓపీ సేవలు ప్రారంభించి, 24 అంతస్తుల ఆస్పత్రిని బస్తీ దవాఖానా చేస్తారా...?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

'రెండేళ్లు ఓపిక పట్టాం. ఇక నిలదీస్తాం, గల్లా పట్టి అడుగుతాం. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే బీ ఆర్ ఎస్ నిరసన దీక్షలకు దిగుతుంది. వరంగల్ ఎంజీఎంలో ఏడాదిన్నరగా గుండె శస్త్ర చికిత్సలు ఆగిపోయాయి. ఎంజీఎంలో 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లు పెట్టాం. ఇప్పుడు ఒక్కటి కూడా పనిచేయట్లేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. 'మేము ఇచ్చిన వాటిని కూడా సరిగా నడపడం చేతకావట్లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 24, 2026 17:55:50
Hyderabad, Telangana:

Bandi Sanjay Kumar: 'ఎమ్మెల్యేలంతా నారాజ్ లో ఉన్నారు నియోజకవర్గాలకు నిధులివ్వడం లేదు. కాంగ్రెస్ లో ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాన్ని ఇతరులకు ఇవ్వరు సొంత పార్టీ నేతలే ఆ ప్రభుత్వాన్ని కూల్చుతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గ్యారంటీ లేదు. కాంగ్రెస్ నేతలే అవినీతిమయమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలని బీజేపీ కోరుకోవడం లేదు. ప్రజాస్వామ్యబద్దంగా పాలన కొనసాగించాలని ఆశిస్తోంది' అని బండి సంజయ్ తెలిపారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల, కౌన్సిలర్ల పరిచయ కార్యక్రమం హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. 'ఇకపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయం తథ్యం' అని ధీమా వ్యక్తం చేశారు. 'కాంగ్రెస్ పార్టీలో లొల్లి స్టార్ట్ అయ్యింది. కర్నాటకలో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవులు కావాలని రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తెలంగాణలోనూ రెండు జిల్లాల్లో ఎమ్మెల్యేలు కర్నాటక తరహాలో మంత్రి పదవులు కావాలని అసమ్మతి సమావేశాలు పెట్టుకున్నారు. ప్రస్తుత మంత్రులు అవినీతికి పాల్పడుతూ కాంగ్రెస్ ను భ్రష్టు పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు లేఖలు రాసి రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది' అని కాంగ్రెస్ పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'2028లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మనందరం పనిచేద్దాం' బీజేపీ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. 'ప్రతి కార్యకర్తకు బీజేపీ కార్యాలయం పవిత్రమైన దేవాలయం. పార్టీ కంటే నేనే గొప్ప అనుకున్న వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారు. బండి సంజయ్ అనే నేను పార్టీలో లేకుంటే నన్ను కక్కులు కూడా దేకవు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు

'కరీంనగర్ లో కార్యకర్తల కష్టం, నాయకుల స్ట్రాటజీతోనే మేయర్ కలను సాకారం చేసుకోగలిగాం. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుమ్కక్కై కుట్రలు చేసినా అధిగమించగలిగాం. ఆ పార్టీలు దిగజారి కుట్రలు చేసినా విజయం సాధించాం. రేవంత్ రెడ్డి కూడా తన స్థాయికి దిగజార్చుకుని బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా కుట్ర చేశారు. ప్రజాతీర్పుకు భిన్నంగా రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చేసిన కుట్రలపై కొందరు కార్పొరేటర్లే తిరుగుబాటు చేసి స్వచ్ఛందంగా మేయర్ ఎన్నికలో తటస్థంగా నిలిచి సహకరించారు' అని బండి సంజయ్ వివరించారు. కరీంనగర్ మేయర్ గెలుపు ఊత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పనిచేద్దామని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కైవసం చేసుకుందామని చెప్పారు. 'ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను మూడు ముక్కలు చేసి అందులో ఒక దానికి ఎంఐఎం పార్టీకి దారాధత్తం చేయాలని చూస్తున్నారు' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 24, 2026 17:50:58
Nunna, Vijayawada, Andhra Pradesh:

AP Congress Party: 'అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు కూటమి ప్రభుత్వ తీరు ఉంది. తిరుమల పవిత్రతపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన పాపాన్ని వైఎస్సార్‌కు చుట్టడం చంద్రబాబుకు భావ్యం కాదు. వైఎస్సార్‌సీపీ కల్తీ పనులు నాటి వైఎస్సార్‌ నుంచే అనడం ఎంతమాత్రం సబబు కాదు' అని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఖండించారు. అసెంబ్లీ వేదికగా వైఎస్సార్‌పై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ  తీవ్రంగా ఖండిస్తోందని ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌పై చేసిన వ్యాఖ్యలను సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

ఏపీ అసెంబ్లీలో తిరుమల నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ షర్మిల ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ అంశంలో వైఎస్సార్‌కు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. వైఎస్సార్‌ 7 కొండలను 2 కొండలు చేయాలని ఏనాడూ అనుకోలేదని.. జరిగిందంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేశారు. అప్పటి ప్రతిపక్షనాయకుడిగా బురద చల్లాలని చూసిందే మీరు అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతకు పెద్దపీఠ వేసింది ఆనాడు వైఎస్సార్‌ అని చెప్పారు. 7 కొండలు వెంకటేశ్వరుడివే అని 2007లో శాశ్వత జీఓ ఇచ్చి చరిత్ర సృష్టించారని వైఎస్‌ షర్మిల గుర్తుచేశారు.

'హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం ఉండకుండా కఠిన నిబంధనలు వైఎస్సార్‌ అమలు చేశారు. జీవో 746,747 తెచ్చి తిరుమలను దివ్య క్షేత్రంగా మార్చారు. తిరుమల లడ్డూ పవిత్రతకు రక్షణగా నిలబడ్డారు. లడ్డూకు పేటెంట్ రైట్ సాధించింది 2009లో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉండగానే. వెంకన్న ఆస్తులు అన్యాక్రాంతం అవ్వకుండా ప్రత్యేక చట్టం అమలు చేశారు' అని వైఎస్‌ షర్మిల వివరించారు. 'తిరుమలలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పెట్టారు. వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం కట్టారు. వేద పండిట్‌ల కోసం ఆనాడే వైఎస్సార్‌ ఆయుష్మాన్ భవ పథకం అమలు చేశారు. దళితులకు గోవిందుడు దగ్గరవ్వాలని అమలు చేసిన దళిత గోవిందం ఆనాడు వైఎస్సార్‌ తీసుకున్న గొప్ప నిర్ణయం' అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు.

'రాష్ట్రంలో మతాలకు అతీతంగా ప్రజలు ఈనాటికి వైఎస్సార్‌ను దేవుడిగా కొలుస్తున్నారంటే అది ఆయన పాలనకు నిదర్శనం. వైఎస్సార్‌సీపీ చేసిన అరాచకాలకు వైఎస్సార్‌కు సంబంధం లేదు. వైఎస్సార్‌ పాలన సంక్షేమ పాలన. వైసీపీ పాలన దోచుకు తిన్న పాలన' అని వైఎస్‌ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌ లేడని ప్రకటించారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ముమ్మాటికి  కాంగ్రెస్ మనిషి.. కడవరకు కాంగ్రెస్‌లోనే బతికిన మనిషి అని వైఎస్‌ షర్మిల చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 24, 2026 13:01:15
Hyderabad, Telangana:

Rahu Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహాన్ని అత్యంత ప్రమాదకరమైన నీడ గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ గ్రహాన్ని శనికి నీడ గ్రహంగా కూడా చెప్పుకుంటారు. ఇది 9 గ్రహాల్లో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. జాతకంలో రాహువు  శుభ స్థానంలో ఉంటే ఏమి కోరుకుంటే, అది జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ గ్రహం శుభ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు పేదవారు కూడా ధనవంతులవుతారు. అంటే అంతటి ప్రత్యేకత వేరే గ్రహానికి దేనికి లేదు. అయితే, రాహువు త్వరలోనే ప్రత్యేకమైన కదలికలు జరపబోతున్నాడు. ముఖ్యంగా ఏప్రిల్ 15వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి మంచి స్థానంలో ఉండబోతున్నాడు. దీని కారణంగా ఆయారాశుల వారికి ఎంతో మేలు జరగబోతోంది. ముఖ్యంగా రాహువు ప్రభావంతో మూడురాశుల వారికి అదృష్టం ఊహించని స్థాయిలో కలిసి రాబోతోంది. 

ఈ రాశులవారిపై రాహువు ఎఫెక్ట్‌:
మిథున రాశి 
రాహువు ప్రభావంతో మిథున రాశి వారికి విధిరాత పూర్తిగా మారబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి అదృష్టం విపరీతంగా లభించబోతోంది. దీనివల్ల వీరు ఎన్నో రకాల లాభాలు పొందబోతున్నారు. అలాగే ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వీరు సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది విదేశాలు వెళ్తారు. ఆర్థిక పరిస్థితులు బాగుండడమే కాకుండా కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కన్య రాశి 
కన్య రాశి వారికి రాహువు గ్రహ కదలికలతో జీవితాల్లో అనేక సమస్యల నుంచి ఉపశమనం లభించబోతోంది. అలాగే సవాళ్ల నుంచి కూడా పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎన్నో రకాల ముఖ్యమైన మార్పులు కూడా సంభవిస్తాయి. ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులకు మంచి జరుగుతుంది. అలాగే అదృష్టం కూడా అద్భుతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చులపై తగ్గినప్పటికీ ఆర్థిక అంశాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. కెరీర్లో పెద్దపెద్ద మార్పులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉద్యోగాలు కూడా మారడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కుంభరాశి 
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహువు ప్రభావంతో పెద్దపెద్ద మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా వీరు తీసుకునే నిర్ణయాలు చాలావరకు బాగుండబోతున్నాయి. శని ప్రభావం వల్ల వస్తున్న సమస్యలు కూడా రాహు ప్రభావం వల్ల కాస్త ఉపశమనం కలగవచ్చు. దీంతోపాటు గత కొన్ని సంవత్సరాలనుంచి ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే గత కొన్ని ఏళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో కాస్త ఉపశమనం కూడా కరుగుతుంది. ఇక ఈ సమయంలో తప్పకుండా కష్టపడి పని చేసే అంశాలపై దృష్టి పెట్టడం మంచిది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
PPINEWZ
Feb 24, 2026 11:40:40
Hyderabad, Telangana:

Water From Air Moisture Telugu News: వాతావరణం లో ఉన్న గాలిలోని తేమను వినియోగించి నీరు తయారు చేయవచ్చన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన ఇప్పుడు శాస్త్రీయంగా సహకారమైంది.. గత ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ప్రొఫెసర్ ఓమార్ యాఘీ అభివృద్ధి ఓ యంత్రం ఇప్పుడు గాల్లో నుంచి నీరును తీస్తోంది. వినూత్న సాంకేతికతతో రూపొందించిన యంత్రాన్ని వినియోగించి పొడి గాలి నుంచి రోజుకు 1000 లీటర్లకు పైగా స్వచ్ఛమైన నీటిని ఉత్పత్తి చేయవచ్చని ఆయన చెబుతున్నారు. అయితే ఈ యంత్రానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో?  దీనిని ఎలా రూపొందించారో? ఇది ఎలా పని చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

2020 సంవత్సరంలో అక్టోబర్ నెలలో డ్యానిష్ విండ్ ఎనర్జీ సంస్థ వెష్టాస్ ప్రతినిధులతో మాట్లాడిన సమయంలో.. విండ్ టర్బైన్ల ద్వారా గాలిలోని తేమను పీల్చుకొని తాగునీటిని తయారు చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ వారికి సూచించారు.. అప్పట్లో చాలామంది దీనిపై హేళన కూడా చేశారు. కొన్ని రోజులపాటు ఈ అంశంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ నేడు రెటిక్యులర్ కెమిస్ట్రీ అనే అద్భుతమైన శాస్త్రం ద్వారా అది సాధ్యమని ప్రొఫెసర్ ఒమర్ యాఘీ నిరూపించారు.

ప్రొఫెసర్ ఒమర్ ఇటీవల స్థాపించిన అటోకో అనే సంస్థ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అనే మాలిక్యులర్ స్పాంజీలను తయారు చేసింది. ఇవి గాలిలోని నీటిని సేకరించేందుకు క్రియాశీలక పాత్ర పోషించినట్లు తేలింది. ముఖ్యంగా ఇవి గాల్లోని నీటి అణువులతో పాటు కార్బన్ ను అత్యంత ఖచ్చితత్వంతో బంధిస్తాయి. సాధారణంగా గాలిలోని నీటిని తీయడం కాస్త కష్టంతో పాటు విద్యుత్ ఉపయోగం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ కొత్త ప్రత్యేకమైన పద్ధతిలో భాగంగా ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా రసాయన ఆకర్షణతో నీటిని సేకరిస్తారు.

Also Read: Maoist Ganapathi: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యం.. ఇప్పుడు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా?

ఈ యంత్రం ఎడారి ప్రాంతాల్లో ఉండే 20 శాతం కంటే తక్కువ తేమ ఉన్న గాలి నుంచి కూడా నీటిని సేకరించగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ యంత్రానికి విద్యుత్ గ్రిడ్ లేత పైపుల సహాయం అవసరం లేదు. కేవలం సూర్యరశ్మి ద్వారా వచ్చి వేడిని ఉపయోగించుకొని ఎంతో సులభంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నీటి కష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో గాలిలో నుంచి నీటిని ఉత్పత్తి చేసే ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే గేమ్ చేంజర్‌గా మారుతుంది. గాలిలో ఉన్న నీటి పరిమాణం ప్రపంచంలోని అన్ని నదులలోని నీటి కంటే ఆరు రేట్లు ఎక్కువ.. ఇప్పటికే భారతదేశానికి చెందిన కొన్ని క్లింటెక్ సంస్థలు ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తున్నాయి.

Also Read: Maoist Ganapathi: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యం.. ఇప్పుడు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 24, 2026 11:30:28
Hyderabad, Telangana:

Rajasthan Telugu Latest News: సాంప్రదాయ వృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి మెరుగుపరిచే దిశగా ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. పల్లె ప్రాంతాల్లో పశుపోషణను ప్రోత్సహించేందుకు గావ్ గ్వాలా యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గోవులను కాసే వారిని అధికారికంగా నియమించడమే కాకుండా.. వారికి ప్రతి నెల రూ.10 వేల గౌరవ వేతనాన్ని అందించబోతున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేని యువతకు ఇది ఒక గొప్ప ఉపాధిగా మారుతుంది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న పశు కాపారులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది..

ఈ పథకానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. దీనిని రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్ అధికారికంగా ప్రకటించారు. పురాతన కాలం నుంచి వస్తున్న సామాజిక గోసంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రతి 70 గోవులకు ఒక గోకాపరి నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ గ్రామంలో పశువుల సంఖ్య పెరిగితే దానికి అనుగుణంగా ఇద్దరూ లేదో ముగ్గురు కాపర్లను నియమించే అవకాశం ఉందన్నారు. ఎంపికైన ప్రతి గో సంరక్షకుడికి ప్రతినెల పదివేల చొప్పున వేతనం కూడా అందించబోతున్నారు.

ఈ పథకంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ వేతనాలను ప్రభుత్వం నేరుగా తన ఖజానా నుంచి కాకుండా ప్రజా భాగస్వామ్యంతో చెల్లించబోతున్నట్లు తెలిపింది. స్థానిక గ్రామస్తులతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థల నుంచి సేకరించిన విరాళాల ద్వారా ఈ నిధులను సమకూర్చబోతున్నట్లు తెలిపింది. దీనివల్ల సమాజంలో గోవుల పట్ల బాధ్యత పెరగడమే కాకుండా.. స్థానికంగా చాలామందికి ఉపాధి అందుతుందని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది.

Also Read: Maoist Ganapathi: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యం.. ఇప్పుడు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా?

అలాగే ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉండే బీడు భూములతో పాటు ఇతర ప్రభుత్వ భూములను కబ్జాకు గురికాకుండా కూడా కాపాడవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది. పశువు కాపర్లు.. ఆవులకు మేత అందించిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ ప్రదేశాల్లో వాటి విశ్రాంతి కోసం అక్కడే ఉంచుతారు. ఇదిలా ఉంటే మరోవైపు పశువుల సంరక్షణ మెరుగు పడుతుంది. దీంతోపాటు పాల ఉత్పత్తి పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలోని 14 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

Also Read: Maoist Ganapathi: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యం.. ఇప్పుడు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 24, 2026 08:57:36
Hyderabad, Telangana:

Motorola Edge 70 Fusion Launch Date In India Telugu: ఇప్పుడు భారత మార్కెట్లో మోటరోలా మొబైల్స్‌కి ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే చాలా తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌ బ్రాండ్లలో మోటరోలా కూడా ఒకటి. ఈ కంపెనీ విడుదల చేసే మొబైల్స్ చాలా తక్కువ ధరల్లోనే ప్రీమియం డిజైన్‌తో అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో లభిస్తూ ఉంటాయి. అయితే, దీనిని గుర్తించిన యువత ఎక్కువగా ఈ బ్రాండ్ కు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మోటరోలా కంపెనీ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్స్‌ను మార్కెట్లోని వినియోగదారులకు పరిచయం చేస్తూనే వస్తోంది. ఇదిలా ఉంటే.. మోటరోలా కంపెనీ అతి త్వరలోనే మరో స్మార్ట్ ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఏంటో? దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మోటరోలా కంపెనీ మార్కెట్లోకి తమ కొత్త ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాండింగ్ పేజీలో ప్రత్యక్షమవుతున్నాయి. దీనిని కంపెనీ వచ్చే నెలలోనే విడుదల చేయబోతున్నట్లు కూడా ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే, మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. ఇది డిజైన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్  స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లాంచింగ్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మార్చి రెండవ తేదీన అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా అప్పుడే వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ మొబైల్ మొత్తం నాలుగు రంగుల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాంటోన్ సిల్హౌట్ లెదర్ ఇన్‌స్పైర్డ్, పాంటోన్ బ్లూ సర్ఫ్ లెదర్ ఇన్‌స్పైర్డ్ కలర్స్ హైలెట్ అవుతాయి.ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని మొట్టమొదటిసారిగా కంపెనీ OIS సపోర్ట్‌తో సోనీ LYT-710 50-మెగాపిక్సెల్ కెమెరాతో విడుదల చేయబోతోంది..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

అలాగే ఈ మొబైల్ కెమెరా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉండబోతోంది. ముఖ్యంగా తక్కువ లైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫోటోలను అందించేందుకు స్పెషల్ ఫీచర్స్ కూడా లభిస్తాయి. దీంతోపాటు వీడియోల కోసం కొన్ని రకాల స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఫ్రంట్ భాగంలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఫోర్ కె రికార్డుకు కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీతో లాంచ్ కాబోతోంది. అలాగే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కూడా అందిస్తోంది. దీంతోపాటు మరెన్నో ఫీచర్స్ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన ధరను మార్చి రెండవ తేదీనే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 24, 2026 08:05:58
Hyderabad, Telangana:

Nirmala Sitharaman Telugu Latest News: గత కొద్ది రోజుల నుంచి బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న మిస్ సేలింగ్ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఖాతాదారులకు వారి అవసరంతో సంబంధం లేకుండా.. బ్యాంకింగ్ సేల్స్ విభాగం బలవంతంగా బీమా పాలసీలను విక్రయించడంపై మంత్రి బ్యాంకర్లను హెచ్చరించారు.. భారత రిజర్వు బ్యాంకు కేంద్ర బోర్డు సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో భాగంగా ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యల వెనక ఏం జరిగి ఉంటుంది? కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై పూర్తి సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలోని అన్ని బ్యాంకులు తమ ప్రధాన విధులను విస్మరిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. చాలా బ్యాంకులు తమకు వచ్చి లాభాల కోసం లేదా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే కమిషన్ల కోసం ఖాతాదారులపై ఒత్తిడి తెస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నట్లు ఆమె మీడియా సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. బ్యాంకులకు వచ్చే సర్వసాధారణ సామాన్యుడికి బీమా పాలసీలు అవసరమా లేదా అనేది చూడకుండా.. వాటిని బలవంతంగా అంటగట్టడం ఏమాత్రం సరికాదు.. ఇలాంటి పద్ధతులను తక్షణమే నిలిపివేయాలని ఆమె మీడియా ముఖంగా స్పష్టం చేశారు.

అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడుతూ బ్యాంకుల ప్రాథమిక బాధ్యతలను గుర్తు చేస్తూ పలు సూచనలు చేశారు.. ప్రజల నుంచి పొదుపును ప్రోత్సహించి డిపాజిట్లను పెంచడంపై బ్యాంకర్లు దృష్టి సాధించాలన్నారు. అంతేకాకుండా అర్హులైన వారికి ముఖ్యంగా చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలకు సకాలంలో రుణాలు అందేలా చూడాలని తెలిపారు. అలాగే వినియోగదారులకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులను నడపాలని సూచించారు.

Also Read: Maoist Ganapathi: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యం.. ఇప్పుడు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా?

రుణాల మంజూరు సమయంలోనే కస్టమర్లతో ఇన్సూరెన్స్ పేపర్లపై సంతకాలు చేయించుకోవడం, ఇన్సూరెన్స్ తీసుకుంటేనే లోన్ వస్తుందని బెదిరించడం వంటి చర్యలు చట్ట విరుద్ధమని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ గుర్తు చేశారు. ఇలాంటి అక్రమ విక్రయాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరిస్తుందని.. బ్యాంకులు తమ నైతిక విలువలను కాపాడుకోవాలని ఆమె తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం పెరగాలంటే.. అది కేవలం లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో పని చేయాలని నిర్మల సీతారామన్ బ్యాంకులకు చెప్పారు.

Also Read: Maoist Ganapathi: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యం.. ఇప్పుడు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
IPInamdar Paresh
Feb 24, 2026 07:36:47
Hyderabad, Telangana:

Man dies after risky snake stunt in navapur Mumbai: సోషల్ మీడియాలో ఇటీవల కొంత మంది ఫెమస్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. కొంత మంది క్రూర జంతువులు, జలపాతాలు, ఎత్తైన కొండల దగ్గరకు వెళ్లి రీల్స్ చేస్తున్నారు. అంతే కాకుండా తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి మరీ రీల్స్ చేస్తున్నారు. దీంతో వారి ప్రాణాలు కూడా కొన్నిసార్లు పొయిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి.  ముఖ్యంగా పాములకు ఇటీవల నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయని ఒకప్పుడు పాములంటే భయపడిన వారు కూడా ఇప్పుడు ఫోన్ లు తీసుకుని కోబ్రాల వీడియోలను రికార్డు చేస్తున్నారు.

 

ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రంమలో దాన్ని ముద్దులు పెట్టుకొవడం, మెడలో వేసుకొవడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ఇటీవల కొంత మంది పాము కాటుకు గురయ్యారు. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 ముంబైలోని విరార్ వెస్ట్‌లోని నవాపూర్‌లో  రాజు చందు బరాద్ అనే 40 ఏళ్ల  వ్యక్తి పామును పట్టుకున్నాడు. దాన్ని ఆతర్వాత మెడలో వేసుకుని స్టంట్ లకు దిగాడు. అందరి ముందు హీరోలా ఫోజులకు దిగాడు. అంతటితో ఆగకుండా దానికి ముద్దులు కూడా పెట్టాడు. అతగాడు తాగిన మైకంలో ఉన్నట్లు అక్కడి వారు చెబుతున్నారు.

ఇంతలోపాము అతని చెయి నుంచి విడిపించుని పలు మార్లు కాటు వేసింది. ఈ ఘటనతో అతను రెప్పపాటులో కుప్పకూలీపోయాడు. పాము చెట్లలోకి వెళ్లిపోయింది. అక్కడివారు అతడ్ని ఆస్పత్రికి తరలించారు.

Read more: Video Viral: ఓర్నాయనో.. పబ్లిక్‌లో రెచ్చిపోయిన యువతి.. ప్రియుడ్ని ఇష్టమున్నట్లు కొడుతూ.. వీడియో వైరల్..

కానీ అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మొత్తంగా కాపాడిన పాముతో డెంజర్ రిస్క్ చేసి దానిచేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు పోయేకాలం వస్తే ఇలానే చేస్తారు అంటూ తాగుబోతును తిట్టిపోస్తున్నారు.

0
comment0
Report
Advertisement
Back to top