Chaturgraha Raja Yoga Effect On Zodiac Telugu: ఫిబ్రవరి 23వ తేదీ గ్రహాలకు అధిపతి అయిన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశిలో ఇప్పటికే రాహువుతో బుధుడు, సూర్యుడు, శుక్రుడు సంయోగం జరిపి ఎంతో శక్తివంతమైన ఎన్నో శక్తివంతమైన రాజయోగాలను ఏర్పాటు చేశాయి. అయితే, కుజుడు ఆ రాశిలోకి ప్రవేశించడం వల్ల చతుర్గ్రహ రాజయోగం ఏర్పడబోతోంది. జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ధైర్యంతో పాటు.. ఊహించని బలం లభిస్తుంది. అదే ఈ గ్రహం ఆ శుభ స్థానంలో ఉంటే వ్యక్తి జీవితంలో పెద్ద మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది. కోరుకున్న కోరికలు నెరవేరకుండా ఉంటాయి. కాబట్టి కుజుడు జాతకంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాడు. అయితే, ఈ సమయంలో కొన్ని రాశుల వారికి కుజుడి అనుగ్రహం లభించబోతోంది. దీంతో ఆయారాశుల వారికి చాలా మేలు జరుగుతుంది.
ఈ రాశులవారికి బంపర్ ప్రయోజనాలు:
మేషరాశి
ముఖ్యంగా కుజుడి ప్రభావంతో మేష రాశి వారికి ఎప్పుడు కలగని లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జీవితంలో ఇది గోల్డెన్ సమయం కాబోతోంది. ముఖ్యంగా కుజుడి అనుగ్రహం వల్ల ఎన్నో రకాల ధన లాభాలు కలుగుతాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు కొత్త క్లైంట్లు కూడా లభిస్తారు. అంతేకాకుండా ధైర్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా కొన్ని నిర్ణయాలు సులభంగా తీసుకోగలుగుతారు.
వృషభరాశి
కుజుడి సంచార ప్రభావంతో వృషభ రాశి వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. దీని కారణంగా జీవితం మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెరీర్ పరంగా ఆగిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా వాటిల్లో ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీరు ఈ సమయంలో కొత్త ఆస్తుల్లో పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు. కోర్టు కేసులు ఉన్న వ్యక్తులకు మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. అనేక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసే వ్యక్తులకు కలిసి రాబోతోంది. ఉద్యోగాల్లో మెరుగుదల కనిపించడమే కాకుండా పనులన్నీ ఎంతో సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ బాస్ దృష్టిలో మీరు ఒక మంచి వ్యక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయం మార్గాల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సృష్టిస్తారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయం చాలా ఉత్తమమైనదిగా భావించవచ్చు. కుజుడి సంచార ప్రభావంతో వీరికి ఎప్పుడు కలగని ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. ఆస్తులపరంగా విపరీతమైన లాభాలు కలుగుతాయి. మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కొన్ని రకాల శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీపై మీకు విశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. మీ జీవితంలో ఎన్నో సమస్యలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Allu Sirish Pre Wedding Party Photos: అల్లు వారి కుటుంబంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అల్లు శిరీష్ వివాహ వేడుకల సందర్భంగా అల్లు అర్జున్ తన నివాసంలో ఏర్పాటు చేసిన స్పెషల్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు శిరీష్-నయనికల వివాహం మార్చి 6న జరగనున్న నేపథ్యంలో, అల్లు వారింట్లో వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోదరుడి కోసం ఒక గ్రాండ్ డిన్నర్ పార్టీని హోస్ట్ చేశారు.
పార్టీ విశేషాలు..
ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. చాలా కాలం తర్వాత మెగా, అల్లు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్‌లోని పలువురు సన్నిహిత మిత్రులు, సెలబ్రిటీలు ఈ పార్టీలో సందడి చేశారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటిచెప్పింది.
పెళ్లి ముచ్చట్లు..
ఇటీవలే అల్లు శిరీష్ తన స్నేహితుల కోసం గోవాలో ఘనంగా బ్యాచిలర్ పార్టీని నిర్వహించుకున్నారు. పెళ్లి పనుల్లో భాగంగా శిరీష్ తన మావయ్య, మెగాస్టార్ చిరంజీవిని కలిసి తొలి శుభలేఖను అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. శిరీష్ తన ప్రియురాలు నయనికతో గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 6న జరగబోయే ఈ వివాహ వేడుక కోసం అల్లు అరవింద్ ఫ్యామిలీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే మరిన్ని ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమాలు (సంగీత్, మెహందీ) మొదలుకానున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Supreme Court Ruling On Tariffs Today: అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కారు విధించిన అధిక టారిఫ్‌లు రద్దయ్యాయి. అయితే, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, వెంటనే మరో కొత్త ఉత్తర్వుపై సంతకం చేశారు. దీని ప్రకారం, భారత్ సహా అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ఇక నుంచి 10 శాతం సుంకాలు వర్తించనున్నాయి.
భారత్‌పై టారిఫ్‌ల ప్రస్థానం
భారత్‌పై అమెరికా విధించిన సుంకాల పరిణామాలు గమనిస్తే మన దేశానికి ఇది పెద్ద ఊరటగానే కనిపిస్తోంది. ట్రంప్ అధికారంలోకి రాగానే భారత్‌పై 25 శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో మరో 25 శాతం కలిపి మొత్తం 50 శాతానికి పెంచారు.
ఇటీవల జరిగిన చర్చల ఫలితంగా ఈ సుంకాలు 50 శాతం నుండి 18 శాతానికి దిగివచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, వైట్‌హౌస్ ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం భారత్‌పై ఇక నుంచి కేవలం 10 శాతం టారిఫ్‌లు మాత్రమే అమలులో ఉంటాయి.
కొత్త ఉత్తర్వుల ముఖ్యాంశాలు..
ఈ 10 శాతం సుంకాలు ఫిబ్రవరి 24 నుండి అమల్లోకి వస్తాయి. ప్రాథమికంగా ఇవి 150 రోజుల పాటు అమల్లో ఉంటాయని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఇది కేవలం తాత్కాలిక ఊరట మాత్రమేనని, గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం మళ్లీ పాత సుంకాలను అమలు చేసేందుకు ఉన్న చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు.
స్విట్జర్లాండ్, జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో గతంలో 15 నుండి 20 శాతం సుంకాలపై ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఆ దేశాలన్నీ కూడా కేవలం 10 శాతం సుంకాలనే చెల్లించాల్సి ఉంటుంది.
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు భారత్ వంటి దేశాలకు వాణిజ్య పరంగా పెద్ద వెసులుబాటును కల్పించింది. అయితే, ట్రంప్ యంత్రాంగం మళ్లీ సుంకాలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో, ఈ 150 రోజుల గడువు ముగిసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Delhi Latest Telugu News: భారతదేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉగ్రవాద ముప్పును పొంచి ఉందన్న నిగవర్గాల హెచ్చరికలతో భద్రతా దళాలు హై అలెర్ట్ ప్రకటించాయి.. పాకిస్తాన్ కేంద్రంగా పనులు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) ఢిల్లీలో పలుచోట్ల దాడులకు ప్లాన్ చేసినట్లు ఇంటిలిజెంట్ వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా మతపరమైన ప్రదేశాలతో పాటు చారిత్రాత్మక కట్టడాల వద్ద దాడులకు ప్రత్యేకమైన ప్లాన్లను వేసినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
నిఘవర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. ఎర్రకోట సమీపంలోని పలు ప్రాంతాలతో పాటు అత్యంత రద్దీగా ఉండే చాందిని చౌక్ లోని ప్రసిద్ధ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని IED పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీన ఇస్లామాబాదులోని ఒక మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా.. LeT ఈ దాడులకు పాల్పడడానికి చూస్తోందని నిఘాధికారులు వెల్లడించారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాలతో పాటు కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నాయని నిఘవర్గాలు తెలిపాయి.
నిఘాధికారుల హెచ్చరికతో ఢిల్లీ పోలీసులతో పాటు భద్రత బలగాలు పాత ఢిల్లీలోని పరిసరాల్లో నిఘాను ముమ్మరం చేశాయి.. దేవాలయాలతో పాటు పర్యాటక ప్రాంతాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దుల్లో కూడా నిఘాను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. మతపరమైన స్థలాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో నిరంతరం యాంటీ సబొటేజ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా ఇతర వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారు కోరారు. ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశాయి. అంతేకాకుండా ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్టు నడుస్తోంది.
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lunar Eclipse impact on Holi: 2026 మార్చి 3న హోలీ పండుగ రోజే సంవత్సరంలోనే సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుండటం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని, సందేహాలను కలిగిస్తోంది. ఈ ఏడాది మార్చి 3న హోలీ పండుగ, చంద్రగ్రహణం ఒకేరోజు రావడం విశేషం. ఇది ఈ సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన గ్రహణంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో హోలీ వేడుకలపై గ్రహణ ప్రభావం ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు. పండుగ జరుపుకోవచ్చా? గ్రహణ సమయాలు ఏమిటి? అనే విషయాలపై పండితుల సూచనలతో కూడిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:
చంద్రగ్రహణం సమయాలు (మార్చి 3, 2026)
జోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రహణ మధ్యాహ్నం 3:19 నిమిషాలకు ప్రారంభం కానుంది. అలాగే సాయంత్రం 6:46 నిమిషాలకు గ్రహణ ముగియనుంది. మొత్తం గ్రహణం వ్యవధి సుమారు 3 గంటల 27 నిమిషాలుగా ఉండనుంది. అయితే ఈ గ్రహణ బింబ దర్శనం మాత్రం 59 నిమిషాల పాటు స్పష్టంగా కనిపించనుంది.
హోలీ ఎప్పుడు జరుపుకోవాలి?
గ్రహణ ప్రభావం మధ్యాహ్నం నుండి ప్రారంభం కానున్నందున, పండుగ జరుపుకునే వారు సమయ పాలన పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఉదయం 11:00 గంటలలోపు హోలీ సంబరాలు పూర్తి చేసుకోవడం మంచిది. సూతక కాలం (గ్రహణానికి ముందు సమయం) దృష్ట్యా ఉదయం 9:00 గంటలకే దేవాలయాలను మూసివేయాలని నిర్ణయించారు.
గ్రహణ నియమాలు - సూతక కాలం జాగ్రత్తలు..
శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో కొన్ని పనులకు దూరంగా ఉండాలని చెబుతారు.
1) సూతక కాలంలో విగ్రహాలను తాకడం లేదా దైవ కార్యాలు చేయడం నిషిద్ధం.
2) గ్రహణ సమయంలో భోజనం చేయడం, ప్రయాణాలు చేయడం మంచిది కాదని నమ్మకం.
3) గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణ సమయంలో బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ కనిపిస్తుంది. భారతదేశంలో పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కొంత మేర కనిపించే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాక్, ఇరాన్ వంటి దేశాల్లోనూ ఈ ఖగోళ వింత దర్శనమివ్వనుంది. హోలీ రంగుల పండుగ అయినప్పటికీ, గ్రహణ నియమాలను పాటిస్తూ ఉదయాన్నే వేడుకలు జరుపుకోవడం శ్రేయస్కరమని ఆధ్యాత్మిక పండితులు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Venkateswara Swamy Pics In AP Legislative Council: ఏపీ శాసనమండలిలో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ వైకాపా సభ్యులు ప్రదర్శించిన తీరుపై మంత్రులు, కూటమి సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, హెరిటేజ్ సంస్థపై చర్చ జరపాలంటూ వైకాపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా ఎమ్మెల్సీలు శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటాలను చేతబూని సభలో ఆందోళనకు దిగారు.
దైవ చిత్రపటాల ప్రదర్శన
ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పాలవలస విక్రాంత్, వరుదు కల్యాణి తదితరులు శ్రీవారి ఫోటోలను పట్టుకుని పోడియం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. సభలోకి దైవ చిత్రపటాలను తీసుకురావడం శాసనసభ చరిత్రలోనే ఇదే మొదటిసారి అని కూటమి సభ్యులు విమర్శించారు.
దేవుడిని రాజకీయాల్లోకి లాగడంపై మంత్రి నారా లోకేశ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందించారు. "హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు" అని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. నిరసనగా ఆయన తన హెడ్‌ఫోన్‌ను బెంచికేసి కొట్టారు.
వైకాపా సభ్యులు బూట్లు, చెప్పులు ధరించి శ్రీవారి చిత్రపటాలను పట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సభ వాయిదా పడ్డాక ఆ చిత్రపటాలను టేబుల్‌పైనే పడేసి వెళ్లడంపై మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొత్స వాదన
సభ ముగిసిన తర్వాత విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాము బూట్లు వేసుకుని ఫోటోలు పట్టుకోలేదని వాదించారు. అయితే, వైకాపా ఎమ్మెల్సీలు బూట్లతో ఉన్న వీడియోలు బయటపడటంతో, అవి కృత్రిమంగా సృష్టించిన వీడియోలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
అతి తక్కువ సమయం సాగిన సభ
శుక్రవారం మండలి కేవలం 5 నిమిషాల పాటు మాత్రమే సాగింది. ఉదయం గందరగోళం మధ్య వాయిదా పడిన సభ, మధ్యాహ్నం ప్రారంభమైన నిమిషంలోనే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.
కూటమి నేతల ఫిర్యాదు
సభలో జరిగిన పరిణామాలపై మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు భేటీ అయ్యారు. ఛైర్మన్ మోషేనురాజును కలిసి వైకాపా సభ్యుల తీరుపై నిరసన తెలిపారు. బీజేపీ పక్ష నేత సోము వీర్రాజు ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ పోరాటాల్లో దేవుడి చిత్రపటాలను వాడటం, అదీ సభలో బూట్లు ధరించి ప్రదర్శించడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై వైకాపా క్షమాపణ చెప్పాలని కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mercury Transit Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. అంతేకాకుండా ఈ గ్రహాన్ని అత్యంత శక్తివంతమైన గ్రహంగా భావిస్తారు.. కాబట్టి సంచారం కారణంగా ఏర్పడే ప్రభావం మొత్తం అన్ని రాశులు ప్రభావితమవుతూ ఉంటాయి. అతి త్వరలోనే శని గ్రహం నక్షత్ర సంచారం కూడా చేయబోతోంది. ముఖ్యంగా బుధుడి సొంత నక్షత్రంగా పరిగణించే రేవతి నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. మే 17వ తేదీన భాద్రపాద నక్షత్రం నుంచి ఈ రేవతి నక్షత్రంలోకి సంచారం చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో శని బుధ గ్రహాల ప్రభావం కొన్ని రాశుల వారిపై పడబోతోంది. దీంతో ఆయారాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో.. విశేషమైన ప్రయోజనాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.
ఈ రాశుల వారికి లాభాలే లాభాలు..
సింహరాశి
రేవతి నక్షత్రంలోకి శని సంచారం చేయడం కారణంగా సింహ రాశి వారికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు స్నేహితులతో పాటు ఇతర మీకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఇష్టమైన వారి సపోర్టు లభించి.. ఆర్థికంగా కూడా ప్రయోజనాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో చాలావరకు లాభసాటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఈ సమయంలో అద్భుతమైన ఆసక్తి పెరుగుతుంది.
ధనస్సు రాశి
బుధుడి నక్షత్రంలోకి మే 17వ తేదీన శని ప్రవేశించడం వల్ల ధనస్సు రాశి వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కెరీర్ పరంగా ఎన్నో రకాల అవకాశాలు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకు భవిష్యత్తులో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తి సంబంధిత సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం ఈ సమయంలో చాలావరకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా కలుగొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి కాస్త ఉపశమనం కూడా లభిస్తుంది. వీరికి లాటరీ కూడా లభించే ఛాన్స్ ఉంది.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు శని నక్షత్ర మార్పుల వల్ల అనేక రంగాల్లో వస్తున్న సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభించబోతోంది. కష్టపడి పని చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పదోన్నతులతో పాటు కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా వీరు కెరీర్ పరంగా చాలా వరకు స్థిరపడే అవకాశాలున్నాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకపోవడం చాలా మంచిది. దీంతోపాటు సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ప్రయాణాలు కూడా సాధ్యమవుతాయి. భవిష్యత్తులో అద్భుతమైన ప్రయోజనాలు పొందే చాన్సులు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Andhra Pradesh Weather Report: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతుంటే, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన పరిస్థితులు వర్ష సూచనను మోసుకొస్తున్నాయి. వేసవి కాలం రాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్న తరుణంలో, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చల్లని కబురు అందించబోతోంది. రానున్న 48 నుండి 72 గంటల్లో ఏపీలోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుండటంతో ప్రధానంగా ఈ క్రింది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై జల్లులు కురిసే వీలుంది.
ఫిబ్రవరిలోనే భానుడి భగభగలు
వర్షాల ప్రభావం కొంత ఉన్నప్పటికీ, పగటి ఉష్ణోగ్రతలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మార్చిలో ఉండాల్సిన వేడి ఒక నెల ముందుగానే ప్రారంభమైంది. సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలులో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం తీవ్రతకు అద్దం పడుతోంది. రాయలసీమ వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
జాగ్రత్తలు తప్పనిసరి!
వాతావరణ మార్పుల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు పలు సూచనలు చేసింది. వర్షం పడే సమయంలో పొలాల్లో ఉండేవారు, ప్రయాణికులు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ ఉండరాదు. పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగినన్ని నీళ్లు తాగుతూ జాగ్రత్తగా ఉండాలి. అల్పపీడనం వల్ల కురిసే వర్షాలు ప్రస్తుతానికి వేడి నుండి ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత పెరిగే ఉక్కపోత మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Retirement Benefits: ప్రభుత్వ పరిపాలనలో కీలకంగా ఉన్న ఉద్యోగులు తమ సమస్యలు, డిమాండ్లు మాత్రం పరిష్కరించుకోవడం లేదు. డీఏతోపాటు పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందడం లేదు. ఉద్యోగంలో ఉన్న సమయంలో తాము పొదుపు చేసుకున్న డబ్బులు రిటైరయ్యాక రావడం లేదు. తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఉద్యోగ లోకం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తూ.. చూస్తూ ఓ మాజీ ఉద్యోగి ప్రాణం పోయింది. ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్సై మైసయ్య మృతి చెందడంపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్ 10 హలీమ్ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
'ప్రభుత్వ నిర్లక్ష్యంతో రిటైర్మెంట్ డబ్బుల కోసం ఎదురుచూస్తూ మాజీ ఎస్సై మృతి చెందడం బాధాకరం. సరెండర్ లీవ్స్ లేవు.. 'ఆరోగ్య భద్రత' అటకెక్కింది.. స్టేషన్ల నిర్వహణకు నిధుల్లేవు. మాజీ ఎస్సై మైసయ్య మృతి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే!' అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్సై మైసయ్య మృతిపై పోలీసుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
'విశ్రాంత ఏఆర్ ఎస్సై మైసయ్య రిటైర్మెంట్ బకాయిలు అందక, ఆసుపత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. జీవిత కాలం ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన ఒక పోలీస్ అధికారి దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 'ఫిబ్రవరి 2026లో రిటైర్ అయిన మైసయ్యకి సుమారు రూ.60 లక్షల వరకు రిటైర్మెంట్ బకాయిలు రావాలి. ఏడాదవుతున్నా ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది' అని వివరించారు. 'భార్యాభర్తలిద్దరూ అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో కనీసం బిల్లులు కట్టుకోలేని దయనీయ స్థితికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెట్టింది. చివరకు బిల్లు కట్టలేక తోటి విశ్రాంత పోలీసు అధికారులు చందాలు వేసి మృతదేహాన్ని ఇంటికి పంపాల్సిన పరిస్థితి రావడం ఈ ప్రభుత్వ చేతకానితనానికి.. అమానవీయ కోణానికి అద్దం పడుతోంది. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే' అని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
'ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగులను బకాయిలు ఇవ్వకుండా ఏడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరోవైపు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల కూడా కర్కశంగా వ్యవహరిస్తోంది. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్న పోలీస్ కుటుంబాలకు ఈ ప్రభుత్వం నరకం చూపిస్తోంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'పోలీసులకు ఆర్థికంగా అండగా నిలిచే సరెండర్ లీవ్స్ బిల్లులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. వాళ్ల కష్టానికి, శ్రమకు దక్కాల్సిన డబ్బులను ప్రభుత్వం ఇవ్వకపోవడం అత్యంత శోచనీయం' అని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఆరోగ్య భద్రత స్కీమ్‌ను రేవంత్ రెడ్డి అటకెక్కించాడు. ఆసుపత్రులకు వెళితే ఈ స్కీమ్ కింద వైద్యం అందక పోలీస్ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ కుటుంబాలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించేది. నేడు వైద్యం అందక ఎంతోమంది పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం సిగ్గుచేటు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్‌కు నెలవారీ అలవెన్సులు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. దిక్కులేక స్టేషన్ అధికారులు తమ సొంత జేబుల నుంచి అప్పులు చేసి మరీ స్టేషన్లను నెట్టుకొస్తున్న దౌర్భాగ్య పరిస్థితి. జీవితకాలం సేవలందించి రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఇస్తున్న బహుమతి ఇదేనా? ఎస్సై మైసయ్య మరణం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు రాక వైద్యం చేయించుకోలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు.
మరణించిన ఎస్సై మైసయ్య కుటుంబానికి రావాల్సిన బకాయిలతో పాటు, ప్రత్యేక నష్ట పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఆయన భార్యకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. 'పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. సరెండర్ లీవ్స్, ఆరోగ్య భద్రత, స్టేషన్ మెయింటెనెన్స్ నిధులను తక్షణమే పునరుద్ధరించాలి' అని రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rahul Chahar Ishani Divorce: భారత క్రికెటర్ రాహుల్ చాహర్, తన భార్య ఇషానీ జోహార్‌తో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన వీరి వివాహ బంధం ముగియడంపై రాహుల్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. గత కొద్ది కాలంగా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత స్పిన్నర్ రాహుల్ చాహర్, తన వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇషానీ జోహార్‌తో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
రాహుల్ తన విడాకుల నిర్ణయం గురించి ఓ సందేశాన్ని పంచుకున్నారు. "నేను చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను. అప్పట్లో నన్ను నేను, నా విలువలను, జీవితం వైపు నా దిశను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను" అని రాహుల్ పేర్కొన్నారు. గత 15 నెలలుగా కోర్టు ప్రక్రియల ద్వారా వెళ్తున్న సమయంలో సహనం, నిజాయితీ ప్రాముఖ్యతను తెలుసుకున్నట్లు ఆయన వివరించారు.
"నేను ఈ బంధాన్ని కోపంతోనో, విచారంతోనో ముగించడం లేదు. పూర్తి స్పష్టతతో ముందుకు సాగుతున్నాను. కొన్ని సంబంధాలు కేవలం మనకు జీవిత పాఠాలు నేర్పడానికే వస్తాయి" అని రాహుల్ రాసుకొచ్చారు.
ఈ విడాకులను ఒక ముగింపుగా కాకుండా కొత్త ప్రారంభంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆత్మగౌరవం, ప్రశాంతత, భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతానని, తన మనసులో ఎలాంటి చేదు అనుభవాలను ఉంచుకోవాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు.
రాహుల్ - ఇషానీ బంధం నేపథ్యం..
2019లో జైపూర్ వేదికగా రాహుల్, ఇషానీ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2022లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. సుమారు నాలుగు ఏళ్ల సహజీవనం (నిశ్చితార్థం నుండి) తర్వాత వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 9న వీరి వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉండగా, అంతకంటే ముందే చట్టపరంగా విడిపోయారు.
మైదానంలో స్పిన్ మ్యాజిక్ చేసే రాహుల్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు, క్రికెట్ వర్గాలు గౌరవిస్తున్నాయి.
Also Read: Money Attract Plants: ఇంట్లో ఈ 7 మొక్కలు ఉంటే.. సిరిసంపదలకు కొదవ ఉండదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Top Haleem Spots Hyderabad: హైదరాబాద్ వంటలంటే ఒక క్రేజ్. ఎంతో రుచికరమైన హైదరాబాద్ వంటకాలకు ప్రపంచ దేశాధినేతలు లొట్టలు వేసుకుని తింటారు. అలాంటి హైదరాబాద్ వంటకాల్లో ఒకటైన హలీమ్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ప్రతి రంజాన్ మాసంలో హలీమ్ విక్రయాలు ప్రారంభమవుతాయి. నెల రోజుల పాటు హలీమ్ విక్రయాలు హైదరాబాద్‌లో భారీగా జరుగుతుంటాయి. బిర్యానీకి తోడు హలీమ్‌ను కూడా అత్యధికంగా తింటుంటారు.
Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్
హలీమ్ అంటే..
వాస్తవంగా హలీమ్ వంట ఇరాన్ నుంచి వచ్చింది. నిజాం కాలంలో రంజాన్ ఉపవాసాల సందర్భంగా హలీమ్‌ను తినేవారు. కాలక్రమంలో ఇతర మతస్తులు కూడా హలీమ్‌ను తినడం ప్రారంభించారు. హలీమ్ రుచి విశ్వవ్యాప్తం కావడంతో అన్ని వర్గాల ప్రజలు హలీమ్‌ను రుచి చూస్తున్నారు. మటన్, చికెన్‌తోపాటు ఎంతో విలువైన మసాలాలు, బాదం, పిస్తా, కాజుతోపాటు గోధుమలు, బియ్యం, నాణ్యమైన నెయ్యితో హలీమ్‌ను తయారుచేస్తారు. కొన్ని గంటల పాటు ఉడికించడంతో హలీమ్ తయారవుతుంది. హలీమ్ ఎంతో బలవర్ధకమైన ఆహారం. హలీమ్ తింటే బలంగా.. ధృడంగా తయారవుతారు.
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
ఇంతటి ఖ్యాతి.. ఘన చరిత్ర కలిగిన హలీమ్ విక్రయాలతో హైదరాబాద్‌లో వేల కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతుంటుంది. బిర్యానీ స్థాయిలో హలీమ్ విక్రయాలు జరుగుతుంటాయి. హైదరాబాద్‌లో ప్రతి గల్లీ గల్లీకి హలీమ్ లభిస్తుంటుంది. ఎవరు చేసినా ఎంత చేసినా హలీమ్ ఒకటే పద్ధతి ఉంటుంది. కాకపోతే హలీమ్ తయారీలో వాడే పదార్థాలు ఏ స్థాయిలో వాడతారు? ఎలా చేస్తారనేది దానిపై దాని రుచి ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్‌లో అత్యంత రుచిగా.. నాణ్యమైన పదార్థాలతో తయారు చేసే హలీమ్ కేంద్రాలు కొన్ని ఉన్నాయి. హైదరాబాద్‌లో టాప్ 10 హలీమ్ అందించే హోటళ్లు ఉన్నాయి. ఆ హోటళ్ల వివరాలు తెలుసుకుందాం.
పిస్తా హౌస్: రంజాన్ అంటే.. హలీమ్ అంటేనే పిస్తా హౌస్ గుర్తుకువస్తుంది. అంతలా ప్రసిద్ధి పొందిన పిస్తా హౌస్ ఎంతో రుచిగా ఉంటుంది. హైదరాబాద్‌లో మొదట పిస్తా హైస్ ఒకటే హోటల్ ఉండేది. చార్మినార్ సమీపంలో భారీ స్థాయిలో హలీమ్‌ను పిస్తా హౌస్ అందించేది. అక్కడి నుంచే నగరవ్యాప్తంగా ఔట్‌లెట్లు ఏర్పాటుచేసి వాటి ద్వారా హలీమ్‌ను నగర ప్రజలకు అందించేది. పిస్తా హౌస్ ఇప్పుడు నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్రాంచ్‌లు ఏర్పాటుచేసింది. నగర నలువైపులా పిస్తాహైస్‌కు బ్రాంచ్‌లు ఉండగా.. దేశ విదేశాల్లో కూడా ఉన్నాయి.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం
సర్వీ హోటల్: హలీమ్‌ను అత్యంత రుచిగా అందించే రెండో హోటల్ సర్వీ. ఇక్కడి హలీమ్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సర్వీ హోటల్‌కు రెండు బ్రాంచులు ఉన్నాయి.
పాతబస్తీలో..
హలీమ్‌ను రుచికరంగా అందించే హోటళ్లు అత్యధికంగా పాతబస్తీలో ఉన్నాయి. వాటిలో చార్మినార్ సమీపంలో ఉన్న హోటల్ షాదాబ్, నయాబ్ హోటళ్లల్లో కూడా హలీమ్ రుచికరంగా ఉంటుంది. ఇక్కడి హోటల్‌లలో నెయ్యి బదులుగా షోర్వా లాంటి పదార్థం వేస్తారు. పాత కాలం నుంచి హలీమ్‌పై షోర్వా పోస్తుంటారు. కానీ ఇప్పుడు నెయ్యి వాడుతున్నారు.
ఇతర హోటళ్లు..
టౌలిచౌకిలోని షాగౌస్‌లో అద్భుతంగా హలీమ్ ఉంటుంది. ఇప్పుడు షాగౌస్‌కు లక్డీకాపూల్‌లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. హిమాయత్‌నగర్‌లోని కేఫ్ బహర్‌లో కూడా హలీమ్‌కు మంచి గుర్తింపు ఉంది. మాసాబ్‌ట్యాంక్‌లోని కేఫ్ త్రిబుల్ ఫైవ్ హలీమ్ అంటే క్రేజ్ వేరు. ఇక బిర్యానీకి ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బావర్చి హలీమ్ కూడా బాగుంటుంది. ఖైరాతాబాద్‌లోని హిల్‌స్టార్, ప్యారడైజ్, మలక్‌పేట్ పేషావర్ హోటల్, నాంపల్లిలోని సుబాన్ బేకరి వంటి హోటల్‌లో కూడా హలీమ్ రుచికరంగా ఉంటుంది.
టాప్ 10 హలీమ్ కేంద్రాలు ఇవే..
- పిస్తా హైస్ - హైదరాబాద్ నగరవ్యాప్తంగా
- సర్వీ హోటల్ - హైదరాబాద్ బంజారాహిల్స్‌లో
- కేఫ్ 555 - మాసబ్ ట్యాంక్
- షాగౌస్ హోటల్ - టౌలిచౌకి, లక్డీకాపూల్
- లక్కీ రెస్టారెంట్ - నాగోల్
- కేఫ్ బహార్ - హిమాయత్‌నగర్
- హిల్‌స్టార్- ఖైరతాబాద్
- ప్యారడైజ్ - హైదరాబాద్ నగరవ్యాప్తంగా
- పెషావర్ - మలక్‌పేట
- సుభాన్ బేకరీ - నాంపల్లి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pm Modi Latest Telugu News: దేశ రాజధాని లోని అత్యంత కీలకమైన లోక్ కళ్యాణ్ మార్గ్ పరిసరాల్లో ఉన్న మూడు ప్రధాన మురికి వాడాలను తొలగించేందుకు కేంద్రం ప్రత్యేకమైన కసరత్తును ప్రారంభించింది. ప్రధానమంత్రి అధికారిక నివాసానికి.. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నివాసిత ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్న వారంతా తమ ఇళ్ళను ఖాళీ చేయాలని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా ఇప్పటికే ఆయా ప్రాంతాలను అధికారులు కూడా సందర్శించినట్లు సమాచారం.
రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న మసీదు క్యాంపు తో పాటు డిఐడి, బాయ్ రాం క్యాంప్, జుగ్గిప్రియ క్లస్టర్లలో సుమారు 717 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి.. అయితే కేంద్ర అభివృద్ధి కార్యాలయం నుంచి ఈ నివాసితులకు పునరావాస నోటీసులను కూడా జారీ చేసింది.. అయితే నోటీసులో ఉన్న గడువులోగా ఖాళీ చేయాలని కోరింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది..
ఈ నివాసితులకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ సావ్దా ఘేవ్రా కాలనీలో ప్లాట్లను కూడా కేటాయించారు.. అయితే ఈ కొత్త ప్రాంతం ప్రస్తుత నివాసానికి సుమారు 45 కిలోమీటర్ల దూరం ఉండడం గమనార్హం.. ఈ ఉరికివాడకు సంబంధించిన భూమి కేంద్ర ప్రభుత్వానికి చెందిందని అధికారులు స్పష్టం చేయడంతో ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 2024 సంవత్సరంలో ఎల్డిఓ తో పాటు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా ఓ ప్రత్యేకమైన సర్వేను నిర్వహించారు.. ఈ సర్వేలో అర్హత పొందిన కుటుంబాలకే పునరావాస ప్యాకేజీ కింద ప్లాట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు..
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా చలికాలంలో ఇళ్లను ఖాళీ చేసి సుదూర ప్రాంతాలకు వెళ్లడం కష్టమని వారు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత నవంబర్లో ఈ పునరావాస నోటీసులను సవాలు చేస్తూ కొందరు ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు సమాచారం.. అయినప్పటికీ మార్చు ఆరవ తేదీ వరకు ఖాళీ చేసి కొత్తగా కేటాయించిన ఫ్లాట్లలోకి మారాలని తాజా ఆదేశాలు అందాయి.. భద్రతతో పాటు ఆ ప్రాంతంలోని అభివృద్ధిలో భాగంగా ఈ ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Telugu News Today: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మాంసం షాపులపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మీర్పేట్ నంది హిల్స్ టీచర్స్ కాలనీలో శుక్రవారం వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కొన్ని షాపుల్లో అధికారులు ఊహించని స్థాయిలో మాంసాలను విక్రయిస్తున్నట్లు తేలింది.
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర్య స్రవంతి ఫిర్యాదు మేరకు ఈ ప్రత్యేకమైన తనిఖీలను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాలనీలోని పలు మటన్ తో పాటు చికెన్ షాపులను పరిశీలించగా విస్తుకుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్కడున్న అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.. ముఖ్యంగా ఓ మటన్ షాపులో ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన మటన్ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సదర్ షాపుకు కనీస అనుమతులు లేకపోవడంతో షాపును సీజ్ చేసి యజమానిని కోర్టుకు పంపించారు..
మరికొన్ని షాపుల్లో కూడా ప్రత్యేకమైన తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ షాపుల్లో నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను యదేచ్చగా వినియోగించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో ఆయా షాపుల నిర్వాహకులకు అధికారులు భారీ జరిమానాలు విధించారు.. ఈ అంశంపై జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయించడం తీవ్ర నేరమని.. ఇలాంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ సమస్యలు ఉన్న మా కమిటీ తక్షణమే స్పందిస్తుందని.. ప్రజల ఆరోగ్యం కోసం 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు.
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
అదే ప్రాంతంలో ఉన్న మరికొన్ని షాపుల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొంతమంది అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.. ఆ షాపుల్లో కూడా నిర్వాహకులు తాజా మాంసం విక్రయించలేం లేదని తేలింది.. కాబట్టి మీరు కూడా మాంసం కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా దానిని ఒకటికి రెండుసార్లు పరిశీలించడం చాలా మంచిది. లేదంటే మీరు కూడా కుళ్లిపోయిన మాంసం కొనుగోలు చేసి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook