Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?
RKRavi Kumar Sargam
Feb 20, 2026 14:18:12
Hyderabad, Telangana

Top Haleem Spots Hyderabad: హైదరాబాద్‌ వంటలంటే ఒక క్రేజ్‌. ఎంతో రుచికరమైన హైదరాబాద్‌ వంటకాలకు ప్రపంచ దేశాధినేతలు లొట్టలు వేసుకుని తింటారు. అలాంటి హైదరాబాద్‌ వంటకాల్లో ఒకటైన హలీమ్‌ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ప్రతి రంజాన్‌ మాసంలో హలీమ్‌ విక్రయాలు ప్రారంభమవుతాయి. నెల రోజుల పాటు హలీమ్‌ విక్రయాలు హైదరాబాద్‌లో భారీగా జరుగుతుంటాయి. బిర్యానీకి తోడు హలీమ్‌ను కూడా అత్యధికంగా తింటుంటారు.

Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్‌

హలీమ్‌ అంటే..
వాస్తవంగా హలీమ్‌ వంట ఇరాన్‌ నుంచి వచ్చింది. నిజాం కాలంలో రంజాన్‌ ఉపవాసాల సందర్భంగా హలీమ్‌ను తినేవారు. కాలక్రమంలో ఇతర మతస్తులు కూడా హలీమ్‌ను తినడం ప్రారంభించారు. హలీమ్‌ రుచి విశ్వవ్యాప్తం కావడంతో అన్ని వర్గాల ప్రజలు హలీమ్‌ను రుచి చూస్తున్నారు. మటన్‌, చికెన్‌తోపాటు ఎంతో విలువైన మసాలాలు, బాదం, పిస్తా, కాజుతోపాటు గోధుమలు, బియ్యం, నాణ్యమైన నెయ్యితో హలీమ్‌ను తయారుచేస్తారు. కొన్ని గంటల పాటు ఉడికించడంతో హలీమ్‌ తయారవుతుంది. హలీమ్‌ ఎంతో బలవర్ధకమైన ఆహారం. హలీమ్‌ తింటే బలంగా.. ధృడంగా తయారవుతారు.

Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ

ఇంతటి ఖ్యాతి.. ఘన చరిత్ర కలిగిన హలీమ్‌ విక్రయాలతో హైదరాబాద్‌లో వేల కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతుంటుంది. బిర్యానీ స్థాయిలో హలీమ్‌ విక్రయాలు జరుగుతుంటాయి. హైదరాబాద్‌లో ప్రతి గల్లీ గల్లీకి హలీమ్‌ లభిస్తుంటుంది. ఎవరు చేసినా ఎంత చేసినా హలీమ్‌ ఒకటే పద్ధతి ఉంటుంది. కాకపోతే హలీమ్‌ తయారీలో వాడే పదార్థాలు ఏ స్థాయిలో వాడతారు? ఎలా చేస్తారనేది దానిపై దాని రుచి ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్‌లో అత్యంత రుచిగా.. నాణ్యమైన పదార్థాలతో తయారు చేసే హలీమ్‌ కేంద్రాలు కొన్ని ఉన్నాయి. హైదరాబాద్‌లో టాప్‌ 10 హలీమ్‌ అందించే హోటళ్లు ఉన్నాయి. ఆ హోటళ్ల వివరాలు తెలుసుకుందాం.

పిస్తా హౌస్: రంజాన్‌ అంటే.. హలీమ్‌ అంటేనే పిస్తా హౌస్ గుర్తుకువస్తుంది. అంతలా ప్రసిద్ధి పొందిన పిస్తా హౌస్‌ ఎంతో రుచిగా ఉంటుంది. హైదరాబాద్‌లో మొదట పిస్తా హైస్‌ ఒకటే హోటల్‌ ఉండేది. చార్మినార్‌ సమీపంలో భారీ స్థాయిలో హలీమ్‌ను పిస్తా హౌస్‌ అందించేది. అక్కడి నుంచే నగరవ్యాప్తంగా ఔట్‌లెట్లు ఏర్పాటుచేసి వాటి ద్వారా హలీమ్‌ను నగర ప్రజలకు అందించేది. పిస్తా హౌస్‌ ఇప్పుడు నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్రాంచ్‌లు ఏర్పాటుచేసింది. నగర నలువైపులా పిస్తాహైస్‌కు బ్రాంచ్‌లు ఉండగా.. దేశ విదేశాల్లో కూడా ఉన్నాయి.

Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం

సర్వీ హోటల్‌: హలీమ్‌ను అత్యంత రుచిగా అందించే రెండో హోటల్‌ సర్వీ. ఇక్కడి హలీమ్‌ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సర్వీ హోటల్‌కు రెండు బ్రాంచులు ఉన్నాయి.

పాతబస్తీలో..
హలీమ్‌ను రుచికరంగా అందించే హోటళ్లు అత్యధికంగా పాతబస్తీలో ఉన్నాయి. వాటిలో చార్మినార్‌ సమీపంలో ఉన్న హోటల్ షాదాబ్, నయాబ్‌ హోటళ్లల్లో కూడా హలీమ్‌ రుచికరంగా ఉంటుంది. ఇక్కడి హోటల్‌లలో నెయ్యి బదులుగా షోర్వా లాంటి పదార్థం వేస్తారు. పాత కాలం నుంచి హలీమ్‌పై షోర్వా పోస్తుంటారు. కానీ ఇప్పుడు నెయ్యి వాడుతున్నారు.

ఇతర హోటళ్లు..
టౌలిచౌకిలోని షాగౌస్‌లో అద్భుతంగా హలీమ్‌ ఉంటుంది. ఇప్పుడు షాగౌస్‌కు లక్డీకాపూల్‌లో కూడా ఒక బ్రాంచ్‌ ఉంది. హిమాయత్‌నగర్‌లోని కేఫ్‌ బహర్‌లో కూడా హలీమ్‌కు మంచి గుర్తింపు ఉంది. మాసాబ్‌ట్యాంక్‌లోని కేఫ్‌ త్రిబుల్‌ ఫైవ్‌ హలీమ్‌ అంటే క్రేజ్‌ వేరు. ఇక బిర్యానీకి ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బావర్చి హలీమ్‌ కూడా బాగుంటుంది. ఖైరాతాబాద్‌లోని హిల్‌స్టార్‌, ప్యారడైజ్‌, మలక్‌పేట్‌ పేషావర్‌ హోటల్‌, నాంపల్లిలోని సుబాన్‌ బేకరి వంటి హోటల్‌లో కూడా హలీమ్‌ రుచికరంగా ఉంటుంది.

టాప్‌ 10 హలీమ్‌ కేంద్రాలు ఇవే..

  1. పిస్తా హైస్‌ - హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా
  2. సర్వీ హోటల్‌ - హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో
  3. కేఫ్ 555 - మాసబ్ ట్యాంక్
  4. షాగౌస్‌ హోటల్‌ - టౌలిచౌకి, లక్డీకాపూల్‌
  5. లక్కీ రెస్టారెంట్ - నాగోల్
  6. కేఫ్ బహార్ - హిమాయత్‌నగర్
  7. హిల్‌స్టార్‌- ఖైరతాబాద్‌
  8. ప్యారడైజ్‌ - హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా
  9. పెషావర్ - మలక్‌పేట
  10. సుభాన్ బేకరీ - నాంపల్లి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 20, 2026 15:17:16
Hyderabad, Telangana:

Retirement Benefits: ప్రభుత్వ పరిపాలనలో కీలకంగా ఉన్న ఉద్యోగులు తమ సమస్యలు, డిమాండ్లు మాత్రం పరిష్కరించుకోవడం లేదు. డీఏతోపాటు పెండింగ్‌ బిల్లులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పొందడం లేదు. ఉద్యోగంలో ఉన్న సమయంలో తాము పొదుపు చేసుకున్న డబ్బులు రిటైరయ్యాక రావడం లేదు. తమ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రాక ఉద్యోగ లోకం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం ఎదురుచూస్తూ.. చూస్తూ ఓ మాజీ ఉద్యోగి ప్రాణం పోయింది. ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్సై మైసయ్య మృతి చెందడంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?

'ప్రభుత్వ నిర్లక్ష్యంతో రిటైర్మెంట్ డబ్బుల కోసం ఎదురుచూస్తూ మాజీ ఎస్సై మృతి చెందడం బాధాకరం. సరెండర్ లీవ్స్ లేవు.. 'ఆరోగ్య భద్రత' అటకెక్కింది.. స్టేషన్ల నిర్వహణకు నిధుల్లేవు. మాజీ ఎస్సై మైసయ్య మృతి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే!' అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌ రావు ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్సై మైసయ్య మృతిపై పోలీసుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు.

Also Read: Student Letter: శివుడికే రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చిన విద్యార్థి.. హుండీలో లేఖ వైరల్‌

'విశ్రాంత ఏఆర్ ఎస్సై మైసయ్య రిటైర్మెంట్ బకాయిలు అందక, ఆసుపత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. జీవిత కాలం ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన ఒక పోలీస్ అధికారి దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. 'ఫిబ్రవరి 2026లో రిటైర్ అయిన మైసయ్యకి సుమారు రూ.60 లక్షల వరకు రిటైర్మెంట్‌ బకాయిలు రావాలి. ఏడాదవుతున్నా ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది' అని వివరించారు. 'భార్యాభర్తలిద్దరూ అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో కనీసం బిల్లులు కట్టుకోలేని దయనీయ స్థితికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెట్టింది. చివరకు బిల్లు కట్టలేక తోటి విశ్రాంత పోలీసు అధికారులు చందాలు వేసి మృతదేహాన్ని ఇంటికి పంపాల్సిన పరిస్థితి రావడం ఈ ప్రభుత్వ చేతకానితనానికి.. అమానవీయ కోణానికి అద్దం పడుతోంది. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు.

Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ

'ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగులను బకాయిలు ఇవ్వకుండా ఏడిపిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మరోవైపు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల కూడా కర్కశంగా వ్యవహరిస్తోంది. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్న పోలీస్ కుటుంబాలకు ఈ ప్రభుత్వం నరకం చూపిస్తోంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'పోలీసులకు ఆర్థికంగా అండగా నిలిచే సరెండర్ లీవ్స్ బిల్లులను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. వాళ్ల కష్టానికి, శ్రమకు దక్కాల్సిన డబ్బులను ప్రభుత్వం ఇవ్వకపోవడం అత్యంత శోచనీయం' అని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఆరోగ్య భద్రత స్కీమ్‌ను రేవంత్‌ రెడ్డి అటకెక్కించాడు. ఆసుపత్రులకు వెళితే ఈ స్కీమ్ కింద వైద్యం అందక పోలీస్ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ కుటుంబాలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించేది. నేడు వైద్యం అందక ఎంతోమంది పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం సిగ్గుచేటు' అని రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్‌కు నెలవారీ అలవెన్సులు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. దిక్కులేక స్టేషన్ అధికారులు తమ సొంత జేబుల నుంచి అప్పులు చేసి మరీ స్టేషన్లను నెట్టుకొస్తున్న దౌర్భాగ్య పరిస్థితి. జీవితకాలం సేవలందించి రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఇస్తున్న బహుమతి ఇదేనా? ఎస్సై మైసయ్య మరణం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు రాక వైద్యం చేయించుకోలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు.

మరణించిన ఎస్సై మైసయ్య కుటుంబానికి రావాల్సిన బకాయిలతో పాటు, ప్రత్యేక నష్ట పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఆయన భార్యకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. 'పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. సరెండర్ లీవ్స్, ఆరోగ్య భద్రత, స్టేషన్ మెయింటెనెన్స్ నిధులను తక్షణమే పునరుద్ధరించాలి' అని రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 20, 2026 14:52:00
Hyderabad, Telangana:

Rahul Chahar Ishani Divorce: భారత క్రికెటర్ రాహుల్ చాహర్, తన భార్య ఇషానీ జోహార్‌తో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన వీరి వివాహ బంధం ముగియడంపై రాహుల్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. గత కొద్ది కాలంగా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత స్పిన్నర్ రాహుల్ చాహర్, తన వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇషానీ జోహార్‌తో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

రాహుల్ తన విడాకుల నిర్ణయం గురించి ఓ సందేశాన్ని పంచుకున్నారు. "నేను చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను. అప్పట్లో నన్ను నేను, నా విలువలను, జీవితం వైపు నా దిశను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను" అని రాహుల్ పేర్కొన్నారు. గత 15 నెలలుగా కోర్టు ప్రక్రియల ద్వారా వెళ్తున్న సమయంలో సహనం, నిజాయితీ ప్రాముఖ్యతను తెలుసుకున్నట్లు ఆయన వివరించారు.

"నేను ఈ బంధాన్ని కోపంతోనో, విచారంతోనో ముగించడం లేదు. పూర్తి స్పష్టతతో ముందుకు సాగుతున్నాను. కొన్ని సంబంధాలు కేవలం మనకు జీవిత పాఠాలు నేర్పడానికే వస్తాయి" అని రాహుల్ రాసుకొచ్చారు.

ఈ విడాకులను ఒక ముగింపుగా కాకుండా కొత్త ప్రారంభంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆత్మగౌరవం, ప్రశాంతత, భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతానని, తన మనసులో ఎలాంటి చేదు అనుభవాలను ఉంచుకోవాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు.

రాహుల్ - ఇషానీ బంధం నేపథ్యం..
2019లో జైపూర్‌ వేదికగా రాహుల్, ఇషానీ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2022లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. సుమారు నాలుగు ఏళ్ల సహజీవనం (నిశ్చితార్థం నుండి) తర్వాత వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 9న వీరి వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉండగా, అంతకంటే ముందే చట్టపరంగా విడిపోయారు.

మైదానంలో స్పిన్ మ్యాజిక్ చేసే రాహుల్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు, క్రికెట్ వర్గాలు గౌరవిస్తున్నాయి.

Also Read: Money Attract Plants: ఇంట్లో ఈ 7 మొక్కలు ఉంటే.. సిరిసంపదలకు కొదవ ఉండదు!

Also Read: Ashraful Haque Bangladesh: "పాకిస్థాన్ మాయలో పడి నవ్వులపాలయ్యాం" బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాజీ అధికారి ఆవేదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 20, 2026 13:38:22
Hyderabad, Telangana:

Pm Modi Latest Telugu News: దేశ రాజధాని లోని అత్యంత కీలకమైన లోక్ కళ్యాణ్ మార్గ్ పరిసరాల్లో ఉన్న మూడు ప్రధాన మురికి వాడాలను తొలగించేందుకు కేంద్రం ప్రత్యేకమైన కసరత్తును ప్రారంభించింది. ప్రధానమంత్రి అధికారిక నివాసానికి.. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నివాసిత ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్న వారంతా తమ ఇళ్ళను ఖాళీ చేయాలని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా ఇప్పటికే ఆయా ప్రాంతాలను అధికారులు కూడా సందర్శించినట్లు సమాచారం.

రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న మసీదు క్యాంపు తో పాటు డిఐడి, బాయ్ రాం క్యాంప్, జుగ్గిప్రియ క్లస్టర్లలో సుమారు 717 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి.. అయితే కేంద్ర అభివృద్ధి కార్యాలయం నుంచి ఈ నివాసితులకు పునరావాస నోటీసులను కూడా జారీ చేసింది.. అయితే నోటీసులో ఉన్న గడువులోగా ఖాళీ చేయాలని కోరింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.. 

ఈ నివాసితులకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ సావ్దా ఘేవ్రా కాలనీలో ప్లాట్లను కూడా కేటాయించారు.. అయితే ఈ కొత్త ప్రాంతం ప్రస్తుత నివాసానికి సుమారు 45 కిలోమీటర్ల దూరం ఉండడం గమనార్హం.. ఈ ఉరికివాడకు సంబంధించిన భూమి కేంద్ర ప్రభుత్వానికి చెందిందని అధికారులు స్పష్టం చేయడంతో ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 2024 సంవత్సరంలో ఎల్డిఓ తో పాటు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా ఓ ప్రత్యేకమైన సర్వేను నిర్వహించారు.. ఈ సర్వేలో అర్హత పొందిన కుటుంబాలకే పునరావాస ప్యాకేజీ కింద ప్లాట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు..

Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ

ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా చలికాలంలో ఇళ్లను ఖాళీ చేసి సుదూర ప్రాంతాలకు వెళ్లడం కష్టమని వారు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత నవంబర్లో ఈ పునరావాస నోటీసులను సవాలు చేస్తూ కొందరు ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు సమాచారం.. అయినప్పటికీ మార్చు ఆరవ తేదీ వరకు ఖాళీ చేసి కొత్తగా కేటాయించిన ఫ్లాట్లలోకి మారాలని తాజా ఆదేశాలు అందాయి.. భద్రతతో పాటు ఆ ప్రాంతంలోని అభివృద్ధిలో భాగంగా ఈ ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 20, 2026 13:24:45
Hyderabad, Telangana:

Hyderabad Telugu News Today: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మాంసం షాపులపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మీర్పేట్ నంది హిల్స్ టీచర్స్ కాలనీలో శుక్రవారం వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కొన్ని షాపుల్లో అధికారులు ఊహించని స్థాయిలో మాంసాలను విక్రయిస్తున్నట్లు తేలింది. 

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర్య స్రవంతి ఫిర్యాదు మేరకు ఈ ప్రత్యేకమైన తనిఖీలను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాలనీలోని పలు మటన్ తో పాటు చికెన్ షాపులను పరిశీలించగా విస్తుకుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్కడున్న అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.. ముఖ్యంగా ఓ మటన్ షాపులో ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన మటన్ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సదర్ షాపుకు కనీస అనుమతులు లేకపోవడంతో షాపును సీజ్ చేసి యజమానిని కోర్టుకు పంపించారు..

మరికొన్ని షాపుల్లో కూడా ప్రత్యేకమైన తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ షాపుల్లో నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను యదేచ్చగా వినియోగించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో ఆయా షాపుల నిర్వాహకులకు అధికారులు భారీ జరిమానాలు విధించారు.. ఈ అంశంపై జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయించడం తీవ్ర నేరమని.. ఇలాంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ సమస్యలు ఉన్న మా కమిటీ తక్షణమే స్పందిస్తుందని.. ప్రజల ఆరోగ్యం కోసం 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు.

Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ

అదే ప్రాంతంలో ఉన్న మరికొన్ని షాపుల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొంతమంది అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.. ఆ షాపుల్లో కూడా నిర్వాహకులు  తాజా మాంసం విక్రయించలేం లేదని తేలింది.. కాబట్టి మీరు కూడా మాంసం కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా దానిని ఒకటికి రెండుసార్లు పరిశీలించడం చాలా మంచిది. లేదంటే మీరు కూడా కుళ్లిపోయిన మాంసం కొనుగోలు చేసి తీవ్ర అనారోగ్య సమస్యల  బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 20, 2026 11:11:05
Hyderabad, Telangana:

Plants Attract Money: ఇంట్లో సానుకూల శక్తిని నింపి, ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో వాస్తు మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని రకాల మొక్కలు కేవలం అందం కోసమే కాకుండా, ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి. సంపదను, ప్రశాంతతను ఆకర్షించే ఆ 7 మొక్కలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

తులసి మొక్క
హిందూ ధర్మంలో తులసికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనిని ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలకు ఇది మంచి ఔషధం. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తులసి కోట వద్ద దీపం వెలిగిస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది.

మనీ ప్లాంట్
పేరుకు తగ్గట్టుగానే ఇది ఆర్థిక శ్రేయస్సుకు చిహ్నం. వాస్తు ప్రకారం దీనిని ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం శుభప్రదం. దీనికి ఎక్కువ సంరక్షణ అవసరం లేదు, నీళ్లలో కూడా సులభంగా పెరుగుతుంది.

స్నేక్ ప్లాంట్
ఆధునిక గృహాలంకరణలో ఇది ప్రాచుర్యం పొందింది. ఇది గాలిలోని మలినాలను తొలగించి, రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఇంటికి సానుకూలతను తెస్తుంది. బెడ్‌రూమ్‌లో ఉంచడానికి ఇది ఉత్తమమైన మొక్క.

స్పైడర్ ప్లాంట్
సన్నని వేలాడే ఆకులతో ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. గాలిని శుద్ధి చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని హ్యాంగింగ్ పాట్స్‌లో నాటడం వల్ల ఇంటికి కొత్త కళ వస్తుంది.

జాడే మొక్క
దీనిని 'ఫ్రెండ్షిప్ ట్రీ' లేదా 'లక్కీ ప్లాంట్' అని కూడా పిలుస్తారు. దీని మందపాటి ఆకులు సంపద ప్రవాహానికి చిహ్నంగా భావిస్తారు. దీనిని ఆఫీసు డెస్క్ లేదా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉంచడం వల్ల విజయం, అదృష్టం వరిస్తాయి.

ఘోస్ట్ ప్లాంట్
లేత తెలుపు లేదా గులాబీ రంగులో ఉండే ఈ మొక్క చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వాస్తు ప్రకారం ఇది ఇంటికి శాంతిని, సమతుల్యతను చేకూరుస్తుంది. దీనికి సూర్యరశ్మి ఎక్కువగా ఉండాలి, నీరు తక్కువగా పోసినా సరిపోతుంది.

కలాంచో
రంగురంగుల పువ్వులతో పూచే ఈ మొక్క ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని పెంపొందించడంలో ఇది తోడ్పడుతుంది.

వాస్తు దోషాలను నివారించి, ఇంట్లో ప్రశాంతత నెలకొనాలంటే ఈ మొక్కలను సరైన దిశలో నాటడం మంచిది. అయితే, ఎండుతున్న మొక్కలను ఇంట్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించడం ముఖ్యం.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని మతవిశ్వాసాల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Ashraful Haque Bangladesh: "పాకిస్థాన్ మాయలో పడి నవ్వులపాలయ్యాం" బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాజీ అధికారి ఆవేదన!

Also Read: Snake Smuggling: పాముల్లో అరుదైనది..కోట్ల రూపాయల వ్యాపారం..ఎలాంటి వారైనా దీని గురించి తెలిస్తే అంతే సంగతులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 20, 2026 10:45:39
Keraniganj, Dhaka Division:

Mohsin Naqvi Bangladesh: టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంపై ఆ దేశ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) మాటలు నమ్మి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చారిత్రాత్మక తప్పిదం చేసిందని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. దాని వల్ల జట్టు 2026 టీ20 ప్రపంచకప్‌ ఆడే అవకాశాన్ని చేజార్చుకుందని బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అస్రాఫుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వేసిన పన్నాగంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ అమీనుల్ ఇస్లామ్ చిక్కుకున్నారని సయ్యద్ అస్రాఫుల్ హక్ ఆరోపించారు.

"పీసీబీ ఛైర్మన్ నఖ్వీ మాయమాటలకు మా బోర్డు చీఫ్ అమీనుల్ ప్రభావితమయ్యారు. అమీనుల్ అమాయకత్వం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు, కానీ ఫలితంగా మనం ప్రపంచకప్‌కు దూరమయ్యాం" అని సయ్యద్ విమర్శించారు.

గతంలో జగన్మోహన్ దాల్మియా హయాంలో బంగ్లాదేశ్ క్రికెట్‌కు భారత్ నుంచి ఎంతో గౌరవం, మద్దతు లభించేవని ఆయన గుర్తు చేశారు. భారత క్రికెట్ బోర్డుతో సత్సంబంధాలు అవసరమని, కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు భారత్‌కు వ్యతిరేకంగా ఉండటం వల్ల మనం నవ్వులపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో భద్రతా సమస్యలు ఉన్నాయన్న సాకుతో మ్యాచులను శ్రీలంకకు మార్చాలని కోరడం సరైన కారణం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అసలు ఏం జరిగింది?
భారత్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టుకు భద్రతా పరమైన ముప్పు ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. తమ మ్యాచులను తటస్థ వేదిక అయిన శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని (ICC) కోరింది. అయితే, భారత్‌లో భద్రతా ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్నాయని గుర్తించిన ఐసీసీ, బంగ్లాదేశ్ కోరికను తిరస్కరించింది. దీంతో బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది.

బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్
బంగ్లాదేశ్ తప్పుకోవడంతో ఆ జట్టు స్థానాన్ని ఐసీసీ స్కాట్లాండ్‌కు కేటాయించింది. మరోవైపు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో చర్చల అనంతరం, టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌పై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేదా ఆంక్షలు విధించబోమని ఐసీసీ ప్రకటించింది. పాకిస్థాన్ జిత్తులకు బంగ్లాదేశ్ చిత్తయ్యిందని, క్రికెట్ పరిపాలనలో దౌత్యపరమైన వైఫల్యం వల్ల ఆటగాళ్లు, అభిమానులు భారీ మూల్యం చెల్లించుకున్నారని సయ్యద్ అస్రాఫుల్ హక్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Also REad: Snake Smuggling: పాముల్లో అరుదైనది..కోట్ల రూపాయల వ్యాపారం..ఎలాంటి వారైనా దీని గురించి తెలిస్తే అంతే సంగతులు!

Also REad: EPS-95 Pension Hike: ఉద్యోగులు భారీ గుడ్‌న్యూస్..రూ.9000 వేలకు పెరగనున్న పెన్షన్..భారీగా పెంచేందుకు కేంద్రం కసరత్తు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 20, 2026 10:44:32
Abbeyville, Colorado:

Pakistan Prime Minister Insult Telugu: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో జరిగిన మొదటి ఘాజా బోర్డు ఆఫ్ పీస్ సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ప్రాముఖ్యతను చాటుకోవాలని వెళ్లిన ప్రధానికి.. చివరికి అక్కడ చేదు అనుభవాలే మిగిలాయి. సదస్సు జరుగుతున్న సమయంలో ఆయన ఏకాకిగా.. ఒక ప్రాధాన్యత లేని ప్రధానిగా కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. ఆయన ఆ స్టేజ్ పై ఒక సాధారణ వ్యక్తి లా ఉండిపోవాల్సి వచ్చింది.  ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోస్‌తో పాటు కొన్ని వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..

సదస్సు అనంతరం నిర్వహించిన గ్రూప్ ఫోటో స్టేషన్‌లో పాకిస్తాన్ ప్రధాని నిర్వాహకులు పక్కకు నెట్టేయడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి.. డోనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ప్రముఖంగా నిలబడగా.. షరీఫ్ మాత్రం వెనుక వరుసలో ఎక్కడో మూలన కనబడని చోటులో నిలబడాల్సి వచ్చింది.  సౌదీ అరేబియా తో పాటు ఇండోనేషియా వంటి దేశాల నేతలకు దక్కిన ప్రాధాన్యత కూడా పాకిస్తాన్‌కు దక్కలేదంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.

సదస్సు సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వైపు చూపిస్తూ.. లేచి నిలబడండి అని.. అనగాని ఆయన వెంటనే సీటు నుంచి లేచి నిలబడ్డారు.. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు నేటిజన్లు ఆయనను ట్రంప్ చేతిలో కీలుబొమ్మ అంటూ కామెంట్ చేస్తున్నారు.. అలాగే ఆ ప్రధాని నిలబడిన సమయంలోనే ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీని గొప్ప వ్యక్తి.. మంచి మిత్రుడు అని కొనియాడారు.. దీంతో పాకిస్తాన్ ప్రధాని ముఖం వెలవెలబోయింది..

పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ సమావేశంలో శతవిధాలుగా ప్రయత్నించారు.. ట్రంప్ శాంతికి చిహ్నమని.. దక్షిణాసియా రక్షకుడని ఆకాశానికి ఎత్తాడు.. గత ఏడాది భారత్ పాక్ కాల్పుల విరమణ కు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని ప్రశంసల వర్షం కురిపించారు.. అయితే, ఈ పొగడ్తలు రంపు పై పెద్దగా ప్రభావం చూపించినట్లు  తెలుస్తోంది.

గాజాలోని శాంతి స్థాపన కోసం అంతర్జాతీయ సైనిక దళాలను పంపే విషయంలో పాకిస్తాన్ వెనకడుగు వేయడమే ఈ దూరానికి ప్రధాన కారణమని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇండోనేషియాsతో పాటు ఈజిప్టు వంటి దేశాలు సైన్యాన్ని పంపేందుకు అంగీకరించగా.. పాకిస్తాన్ మాత్రం ద్వంద వైఖరిని అవలంబిస్తోంది.. ఫలితంగా ట్రంప్ పరిపాలనలో పాకిస్తాన్ తన పరాభవాన్ని కోల్పోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ఈ పర్యటన పాకిస్తాన్ దౌత్యపరమైన వైఫల్యానికి నిదర్శనంగా మారిందని చర్చ జరుగుతోంది.

Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 20, 2026 10:27:52
Hyderabad, Telangana:

Accenture Sensational Decision: ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కంపెనీ యాక్సెంచర్ (Accenture) తమ ఉద్యోగులకు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.. ముఖ్యంగా ఈ సంస్థలో పనిచేసే సీనియర్ సిబ్బందికి కొన్ని ప్రత్యేకమైన సూచనలను చేసింది. ఇకనుంచి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ వినియోగం ఉద్యోగుల పనితీరు గుర్తింపుతో పాటు ప్రమోషన్స్ కు ముడి పెడుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇటీవలే ఈ కంపెనీ సుమారు 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది. 

కంపెనీ ఇటీవల జారీ చేసిన కీలక అంశాల్లోకి వెళ్తే.. అసోసియేట్ డైరెక్టర్లతోపాటు సీనియర్ మేనేజర్ స్థాయిలో ఉద్యోగులు వారు రోజు చేసే పనుల్లో భాగంగా తప్పకుండా వినియోగించాల్సి ఉంటుందట.. ఎవరైనా వీటిని వినియోగించకపోతే వారికి సంబంధించిన లీడర్షిప్ తొలగించే అవకాశాలు ఉన్నట్లు సంస్థ స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా  సంస్థలు ఇతర ప్రమోషన్స్ కు కూడా అర్హులు కారని తెలిపింది. 

అంతేకాకుండా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎంతవరకు వాడుతున్నారో తెలుసుకోవడానికి ప్రత్యేకమైన టూల్స్ ను కూడా తీసుకువచ్చినట్లు తెలిపింది. సంస్థ సొంతంగా రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రిఫైనరీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఉద్యోగుల లాగిన్ వివరాలతో పాటు.. వారు Ai టూల్స్‌ను ఎంతవరకు వినియోగిస్తున్నారనేది ట్రాక్ చేయబోతున్నారట.. అలాగే భవిష్యత్తులో ఈ కంపెనీకి సంబంధించిన పని విధానం కూడా పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయని సీఈఓ జూలీ స్వీట్ తెలిపారు. దీనికోసం ఉద్యోగుల నైపుణ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీకి అనుగుణంగా తీర్చిదిద్దడం అత్యవసరమని ఆమె వెల్లడించారు.

Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ

అయితే, అమెరికా ప్రభుత్వ ప్రాజెక్టులపై పనులు చేసే వారికి.. ఐరోపాలోని 12 దేశాలకు సంబంధించిన సిబ్బందికి ఈ నిబంధనలు వర్తించవని కంపెనీ తెలిపింది. కేవలం యాక్సెంచర్ మాత్రమే కాకుండా.. గూగుల్ తో పాటు మైక్రోసాఫ్ట్ మెట్ట వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇదే బాటలో ముందుకెళ్తున్నారు.. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాడకం తప్పనిసరి చేసింది.. AI స్కిల్స్ లేని వారు వెనకబడిపోయే అవకాశాలు ఉన్నాయని.. సంస్థల ఉత్పత్తిని పెంచడానికి ఇప్పుడు ఇది తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు..

Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 20, 2026 10:05:19
Jangareddygudem, Andhra Pradesh:

Student Hundi Letter: సాధారణంగా గుడికి వెళ్లే వారిలో ఎక్కువ మంది దేవుడికి తమ కష్టాలను చెప్పుకోవడానికి.. తమ కోరికలను నెరవేర్చాలని వేడుకునేందుకు వెళ్తారు. ఇక కొందరు తాము కోరుకున్న కోరికలు నెరవేరితే తలనీలాలు సమర్పించడం, హుండీలో డబ్బులు వేయడం, విరాళాలు ఇవ్వడం, గుడిలో అభివృద్ధి పనులు చేపట్టడం, దేవుడికి నగలు, పట్టుబట్టలు, అభిషేకాలు, విశిష్ట పూజలు నిర్వహిస్తామని మొక్కుకుంటారు. కానీ ఓ విద్యార్థి రాసిన చీటీ వైరల్ గా మారింది.

Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ

ఇక తమ కోరికలను ఒక పేపర్‌లో రాసి హుండీలో వేసిన వారు చాలా మంది ఉన్నారు. హుండీ లెక్కింపు చేపట్టినప్పుడు అలాంటి లేఖలు బయటపడి వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఏలూరు జిల్లాలోని ఓ ఆలయంలో దొరికిన లేఖలో ఉన్న డిమాండ్లు, కోరికలు చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఇటీవల మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు ముగియడంతో.. స్వామి వారి వద్ద ఏర్పాటు చేసిన హుండీలను అధికారులు లెక్కించారు. అయితే ఆ హుండీలో ఒక విద్యార్థి రాసిన కోరికల లేఖ వెలుగు చూడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం

ఆ లేఖలో ఆ విద్యార్థి దేవుడిని కోరికలు కోరుకున్నాడు. ఆ కోరికలు నెరవేర్చితే తాను ఏం చేస్తానో కూడా వివరించాడు. తాను ఇటీవల రాసిన పరీక్షల్లో 9 సీజీపీఏ (సుమారు 85 శాతం నుంచి 95 శాతం) మార్కులు వచ్చేలా చూడాలని స్వామిని వేడుకున్నాడు. పాసయ్యాక సంవత్సరానికి రూ.20 లక్షల ప్యాకేజీతో కూడిన ఉద్యోగం కూడా కావాలని కోరాడు. సాధారణంగా ఇలా పరీక్షల్లో మార్కులు, మంచి ఉద్యోగం కావాలని అందరూ కోరుకుంటారు. ఇవన్నీ నెరవేర్చాలని అలా చేస్తే తాను ఏం చేస్తానో కూడా చెబుతూ దేవుడికే ఆఫర్ ఇచ్చాడు. తన రెండు కోరికలు నెరవేరితేనే స్వామివారికి అభిషేకం నిర్వహించి.. నూతన వస్త్రాలు సమర్పిస్తానని ఒక పేపర్‌పై రాసి ఆ హుండీలో వేశాడు.

Also Read: KTR: సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు: కేటీఆర్‌

తనకు మార్కులు, ఉద్యోగం ఇస్తేనే.. దేవుడికి మొక్కులు చెల్లిస్తానని ఒక రకమైన ఆఫర్ ప్రకటించాడని అర్థం అవుతోంది.ఇక ఈ లేఖ ఇప్పుడు ఆలయ అధికారుల వద్దకు చేరగా.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. భక్తులు తమ కోరికలను దేవుడికి చెప్పడం సర్వసాధారణమే అయినప్పటికీ.. ఇలా రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవడం వింతగా ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లెటర్ వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. దేవుడికే ఆఫర్ ఇస్తున్నాడని కొందరు అంటుంటే.. ఇదో రకమైన లంచం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 20, 2026 10:03:40
Shadnagar, Telangana:

Red Sand Boa Snake Myth: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ఫరూఖ్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ స్థలంలో ఒక వింత పాము కలకలం రేపింది. స్థానికంగా పనిచేస్తున్న షఫీ అనే వ్యక్తికి ఈ అరుదైన 'ఎర్ర ఇసుక బోవా' కంటపడటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రెండు తలల పాము రహస్యం
చూడటానికి రెండు వైపులా తలలు ఉన్నట్లు కనిపించే ఈ పాముపై ఎన్నో ఏళ్లుగా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అసలు వాస్తవాలు ఇవే. నిజానికి రెండు తలలు ఉండవు, ఈ పాము తోక భాగం కూడా తల లాగే మొద్దుబారి ఉంటుంది. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇది తన తోకను తలలా చూపిస్తూ భ్రమింపజేస్తుంది. ఇది ఏమాత్రం విషపూరితమైన పాము కాదు. చాలా నెమ్మదిగా కదులుతుంది.

ఈ పాము ఇంట్లో ఉంటే అదృష్టం అని, క్షుద్రపూజలు చేస్తే ధన వర్షం కురుస్తుందని, లైంగిక పటిమ పెంచే మందుల్లో వాడతారని అనేక అపోహలు ఉన్నాయి. ఈ కారణాల వల్లే స్మగ్లర్లు దీన్ని పట్టుకుని కోట్లాది రూపాయలకు విదేశాల్లో విక్రయిస్తుంటారు.

అటవీ శాఖ చర్యలు
సమాచారం అందుకున్న ఫలక్‌నుమా పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పామును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ జాతి పాములను వేటాడటం, బంధించడం లేదా అమ్మడం వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం నేరం. 

ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న పామును పరీక్షించిన అనంతరం నిర్మానుష్య అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమాచారం అందించిన షఫీని అధికారులు అభినందించారు. ఇలాంటి అరుదైన జీవులు కనిపిస్తే వాటిని చంపడం గానీ, అక్రమంగా తరలించడం గానీ చేయవద్దు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించడం బాధ్యతాయుతమైన పౌరుల లక్షణం.

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులు భారీ గుడ్‌న్యూస్..రూ.9000 వేలకు పెరగనున్న పెన్షన్..భారీగా పెంచేందుకు కేంద్రం కసరత్తు!

Also Read: Unhealthy Part Of Chicken: వారం వారం చికెన్ ఎక్కువగా తింటున్నారా? చికెన్‌లో ఈ భాగాలు తింటే ప్రమాదకరమే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 20, 2026 09:51:49
Amaravathi, Andhra Pradesh:

Chandrababu Apology: 'తిరుమల అంశం మేము క్షమాపణ చెప్పడం కాదు. ముందు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని శాసనమండలి చైర్మన్‌కు చెప్పాం. మండలి చైర్మన్ మమ్మల్ని క్షమాపణ చెప్పమని అడగలేదు. కూటమి నేతలు చెప్పిన విషయాలు చైర్మన్ మాకు చెప్పారు. మా వాదన మేము చెప్పాం' అని బొత్స సత్యనారాయణ తెలిపారు. 'సభ సజావుగా జరగాలి.. కూటమి నాయకులకు మంచి బుద్ది ప్రసాదించాలని కోరాం' అని చిట్‌చాట్‌లో బొత్స చెప్పారు.

Also Read: Schools Close: రేపు స్కూళ్లు, కాలేజ్‌లు బంద్‌.. ఎక్కడ? ఎందుకంటే?

శాసనమండలిలో శుక్రవారం జరిగిన పరిణామాలపై ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. చిట్‌చాట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో వెంకటేశ్వరస్వామి ఫొటోలు ప్రదర్శించిన నేపథ్యంలో నెలకొన్న తీవ్ర వివాదంపై స్పందించారు. 'తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేశాడు. దానికి ముందు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. మండలిలో ఎక్కడ మా సభ్యులు చెప్పులు ధరించలేదు. స్వయంగా నేనే చెప్పులు తీసేయండి అని చెప్పా' అని బొత్స సత్యనారాయణ వివరించారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో కూటమి పార్టీలు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెప్పులు వేసుకుని దేవుడిని అవమానించిన సందర్భాలు ఎన్నో  ఉన్నాయని గుర్తుచేశారు.

Also Read: KCR Birthday Gift: ఐదుకు 5 క్లీన్‌ స్వీప్‌ విజయాలు కేసీఆర్‌ బర్త్‌ డే కానుక: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

'తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగింది ఎవరు? తిరుమల లడ్డూలో పంది కొవ్వు, జంతు కొవ్వు అని మాట్లాడింది ఎవరు?' అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 'సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా మాట్లాడారు. ఉదయం లేచిన దగ్గర నుంచి బొట్టు పెట్టుకొని తిరిగేది మేం. టీడీపీ నాయకులు ఎవరు మొహంపైన అయినా బొట్టు ఉందా?' అని నిలదీశారు. దేవ దేవుడిపై మాకు నమ్మకం ఉందని ప్రకటించారు. 'వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్నారు అనేది అవాస్తవం. చెప్పులు వేసుకొని మా వాళ్లు దేవుడు ఫొటో పట్టుకోలేదు' అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం

'గోవిందా అనే నామం చాలా పవిత్రమైన నామం. అదేనామంతో నేడు మండలిలోకి వెళ్లా. కనీసం ఆ నామంతో కూటమి ప్రభుత్వం మనస్సు మారుతుందేమో అని నమ్మాం. మండలిలో చెప్పులు బూట్లు వేసుకుని ఆ దేవదేవుడు ఫొటో పట్టుకొని మీము సభలోకి వెళ్లలేదు. మేము చంద్రబాబు లాగా చెప్పులు బూట్లు వేసుకుని స్వామివారి ఫొటో పట్టుకొని సభలోకి వెళ్లలేదు. స్వామి ఫొటో తీసుకొని రక్షించు గోవిందా అని మాత్రమే వెళ్లాం' అని బొత్స సత్యనారాయణ వివరించారు. ఈ మంత్రులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక హెరిటేజ్ సంస్థను నడుపుతున్నారా? తమకు నమ్మకం కుదరటం లేదని పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తున్నారని మండిపడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 20, 2026 09:24:28
Hyderabad, Telangana:

EPS-95 Pension Hike 2026: లక్షలాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఈపీఎఫ్‌వోలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కనీస పెన్షన్ పెంపు, వేతన పరిమితి పెంపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు, పార్లమెంట్‌లో జరిగిన చర్చల నేపథ్యంలో త్వరలోనే కేంద్రం నుండి అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.

కనీస పెన్షన్ రూ.9 వేలకు?
ప్రస్తుతం ఈపీఎస్-95 కింద కనీస పెన్షన్ నెలకు రూ.1,000 మాత్రమే అందుతోంది. దీనిని కనీసం రూ.3,000 నుంచి రూ.9,000 వరకు పెంచాలని కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం సుమారు 47 లక్షల మంది పెన్షనర్లు నెలకు రూ.9 వేల కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పార్లమెంట్‌లో మాట్లాడుతూ, పెన్షన్ పెంపుపై వినతులు అందాయని, అయితే ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

వేతన పరిమితి రూ.25,000కు?
పీఎఫ్ కంట్రిబ్యూషన్ కోసం ప్రస్తుతం ఉన్న బేసిక్ శాలరీ లిమిట్ రూ.15,000ను సవరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పరిమితిని రూ.25,000 లేదా రూ.30,000కు పెంచే అవకాశం ఉంది. ఒకవేళ వేతన పరిమితి పెరిగితే, పెన్షన్ ఫండ్‌కు జమ అయ్యే సొమ్ము పెరిగి, ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్ మొత్తం గణనీయంగా పెరుగుతుంది.

ఒకవేళ ప్రభుత్వం వేతన పరిమితిని రూ.25,000కు పెంచితే, సర్వీస్ కాలం ఆధారంగా పెన్షన్ ఇలా ఉండవచ్చు. 10 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు నెలకు సుమారు రూ.3,570 పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 35 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు నెలకు సుమారు రూ.12,500 వరకు పెన్షన్ పొందే వీలుంటుంది.

సుప్రీంకోర్టు డెడ్‌లైన్
ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఈ గడువు ముగిసేలోగా కేంద్రం తీసుకోబోయే నిర్ణయం కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. వేతన పరిమితి పెరిగితే చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినప్పటికీ, పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మాత్రం భారీగా పెరగనుంది. దీనిపై కేంద్రం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

 

Also Read: Unhealthy Part Of Chicken: వారం వారం చికెన్ ఎక్కువగా తింటున్నారా? చికెన్‌లో ఈ భాగాలు తింటే ప్రమాదకరమే!

Also Read; Free Bus Scheme Smart Cards: మహిళలకు శుభవార్త..ఉచిత బస్సులో కీలక మార్పులు..బడ్జెట్‌లో భారీగా నిధులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 20, 2026 08:28:07
Nunna, Vijayawada, Andhra Pradesh:

AP RTE Admission 2025-26 Notification: ఆంధ్రప్రదేశ్‌లోని పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం విద్యా హక్కు చట్టం (RTE) కింద 2026-27 విద్యా సంవత్సరానికి ఉచిత ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఏపీ ప్రభుత్వం ఈ గొప్ప అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో మొదటి తరగతిలో ఉచితంగా ప్రవేశం పొందవచ్చు.
 
2026 - 27 విద్యా సంవత్సరానికి గానూ ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.  సీట్ల కేటాయింపు (25% కోటా) మొత్తం కేటాయించిన సీట్లలో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. ఎస్సీ (SC) 10%,  ఎస్టీ (ST) 4%.. బీసీ, మైనారిటీలు & ఇతరులు 6%.. అనాథలు, దివ్యాంగులు & హెచ్‌ఐవీ బాధిత పిల్లలు 5 శాతం సీట్లు కేటాయించారు.

అర్హత ప్రమాణాలు..
గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి వార్షిక ఆదాయం రూ.1.20 లక్షల లోపు ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల లోపు ఉండాలి.
వయస్సు: జూన్ 1, 2026 నాటికి కనీసం 5 ఏళ్లు నిండి ఉండాలి.
స్టేట్ సిలబస్: జూన్ 2, 2020 – మే 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.
CBSE సిలబస్: ఏప్రిల్ 1, 2020 – మార్చి 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.

కావలసిన పత్రాలు..
దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ క్రింది డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి. పిల్లల పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (Birth Certificate), ఆధార్ కార్డు (తప్పనిసరి), కుల ధృవీకరణ పత్రం (Caste Certificate), ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate), ఫోటో, నివాస ధృవీకరణ పత్రం వంటివి తప్పనిసరి.

దరఖాస్తు చేసుకునే విధానం..
అర్హులైన తల్లిదండ్రులు ఈ మార్గాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా అప్లై చేయవచ్చు. లేదంటే సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయం సందర్శించవచ్చు. అలాగే మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయం ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు. ఏవైనా సందేహాలుంటే 1800 425 899 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

Also Read: Free Bus Scheme Smart Cards: మహిళలకు శుభవార్త..ఉచిత బస్సులో కీలక మార్పులు..బడ్జెట్‌లో భారీగా నిధులు!

Also Read: TTD On Heritage Controversy: "వైసీపీ నాయకులకు నెయ్యికి, చీజ్‌కి తేడా తెలియదు" టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ధ్వజం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top