Student Hundi Letter: సాధారణంగా గుడికి వెళ్లే వారిలో ఎక్కువ మంది దేవుడికి తమ కష్టాలను చెప్పుకోవడానికి.. తమ కోరికలను నెరవేర్చాలని వేడుకునేందుకు వెళ్తారు. ఇక కొందరు తాము కోరుకున్న కోరికలు నెరవేరితే తలనీలాలు సమర్పించడం, హుండీలో డబ్బులు వేయడం, విరాళాలు ఇవ్వడం, గుడిలో అభివృద్ధి పనులు చేపట్టడం, దేవుడికి నగలు, పట్టుబట్టలు, అభిషేకాలు, విశిష్ట పూజలు నిర్వహిస్తామని మొక్కుకుంటారు. కానీ ఓ విద్యార్థి రాసిన చీటీ వైరల్ గా మారింది.
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
ఇక తమ కోరికలను ఒక పేపర్‌లో రాసి హుండీలో వేసిన వారు చాలా మంది ఉన్నారు. హుండీ లెక్కింపు చేపట్టినప్పుడు అలాంటి లేఖలు బయటపడి వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఏలూరు జిల్లాలోని ఓ ఆలయంలో దొరికిన లేఖలో ఉన్న డిమాండ్లు, కోరికలు చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఇటీవల మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు ముగియడంతో.. స్వామి వారి వద్ద ఏర్పాటు చేసిన హుండీలను అధికారులు లెక్కించారు. అయితే ఆ హుండీలో ఒక విద్యార్థి రాసిన కోరికల లేఖ వెలుగు చూడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం
ఆ లేఖలో ఆ విద్యార్థి దేవుడిని కోరికలు కోరుకున్నాడు. ఆ కోరికలు నెరవేర్చితే తాను ఏం చేస్తానో కూడా వివరించాడు. తాను ఇటీవల రాసిన పరీక్షల్లో 9 సీజీపీఏ (సుమారు 85 శాతం నుంచి 95 శాతం) మార్కులు వచ్చేలా చూడాలని స్వామిని వేడుకున్నాడు. పాసయ్యాక సంవత్సరానికి రూ.20 లక్షల ప్యాకేజీతో కూడిన ఉద్యోగం కూడా కావాలని కోరాడు. సాధారణంగా ఇలా పరీక్షల్లో మార్కులు, మంచి ఉద్యోగం కావాలని అందరూ కోరుకుంటారు. ఇవన్నీ నెరవేర్చాలని అలా చేస్తే తాను ఏం చేస్తానో కూడా చెబుతూ దేవుడికే ఆఫర్ ఇచ్చాడు. తన రెండు కోరికలు నెరవేరితేనే స్వామివారికి అభిషేకం నిర్వహించి.. నూతన వస్త్రాలు సమర్పిస్తానని ఒక పేపర్‌పై రాసి ఆ హుండీలో వేశాడు.
Also Read: KTR: సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు: కేటీఆర్
తనకు మార్కులు, ఉద్యోగం ఇస్తేనే.. దేవుడికి మొక్కులు చెల్లిస్తానని ఒక రకమైన ఆఫర్ ప్రకటించాడని అర్థం అవుతోంది.ఇక ఈ లేఖ ఇప్పుడు ఆలయ అధికారుల వద్దకు చేరగా.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. భక్తులు తమ కోరికలను దేవుడికి చెప్పడం సర్వసాధారణమే అయినప్పటికీ.. ఇలా రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవడం వింతగా ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లెటర్ వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. దేవుడికే ఆఫర్ ఇస్తున్నాడని కొందరు అంటుంటే.. ఇదో రకమైన లంచం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Plants Attract Money: ఇంట్లో సానుకూల శక్తిని నింపి, ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో వాస్తు మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని రకాల మొక్కలు కేవలం అందం కోసమే కాకుండా, ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి. సంపదను, ప్రశాంతతను ఆకర్షించే ఆ 7 మొక్కలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తులసి మొక్క
హిందూ ధర్మంలో తులసికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనిని ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలకు ఇది మంచి ఔషధం. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తులసి కోట వద్ద దీపం వెలిగిస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది.
మనీ ప్లాంట్
పేరుకు తగ్గట్టుగానే ఇది ఆర్థిక శ్రేయస్సుకు చిహ్నం. వాస్తు ప్రకారం దీనిని ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం శుభప్రదం. దీనికి ఎక్కువ సంరక్షణ అవసరం లేదు, నీళ్లలో కూడా సులభంగా పెరుగుతుంది.
స్నేక్ ప్లాంట్
ఆధునిక గృహాలంకరణలో ఇది ప్రాచుర్యం పొందింది. ఇది గాలిలోని మలినాలను తొలగించి, రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఇంటికి సానుకూలతను తెస్తుంది. బెడ్‌రూమ్‌లో ఉంచడానికి ఇది ఉత్తమమైన మొక్క.
స్పైడర్ ప్లాంట్
సన్నని వేలాడే ఆకులతో ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. గాలిని శుద్ధి చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని హ్యాంగింగ్ పాట్స్‌లో నాటడం వల్ల ఇంటికి కొత్త కళ వస్తుంది.
జాడే మొక్క
దీనిని 'ఫ్రెండ్షిప్ ట్రీ' లేదా 'లక్కీ ప్లాంట్' అని కూడా పిలుస్తారు. దీని మందపాటి ఆకులు సంపద ప్రవాహానికి చిహ్నంగా భావిస్తారు. దీనిని ఆఫీసు డెస్క్ లేదా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉంచడం వల్ల విజయం, అదృష్టం వరిస్తాయి.
ఘోస్ట్ ప్లాంట్
లేత తెలుపు లేదా గులాబీ రంగులో ఉండే ఈ మొక్క చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వాస్తు ప్రకారం ఇది ఇంటికి శాంతిని, సమతుల్యతను చేకూరుస్తుంది. దీనికి సూర్యరశ్మి ఎక్కువగా ఉండాలి, నీరు తక్కువగా పోసినా సరిపోతుంది.
కలాంచో
రంగురంగుల పువ్వులతో పూచే ఈ మొక్క ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని పెంపొందించడంలో ఇది తోడ్పడుతుంది.
వాస్తు దోషాలను నివారించి, ఇంట్లో ప్రశాంతత నెలకొనాలంటే ఈ మొక్కలను సరైన దిశలో నాటడం మంచిది. అయితే, ఎండుతున్న మొక్కలను ఇంట్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించడం ముఖ్యం.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని మతవిశ్వాసాల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mohsin Naqvi Bangladesh: టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంపై ఆ దేశ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) మాటలు నమ్మి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చారిత్రాత్మక తప్పిదం చేసిందని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. దాని వల్ల జట్టు 2026 టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశాన్ని చేజార్చుకుందని బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అస్రాఫుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వేసిన పన్నాగంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ అమీనుల్ ఇస్లామ్ చిక్కుకున్నారని సయ్యద్ అస్రాఫుల్ హక్ ఆరోపించారు.
"పీసీబీ ఛైర్మన్ నఖ్వీ మాయమాటలకు మా బోర్డు చీఫ్ అమీనుల్ ప్రభావితమయ్యారు. అమీనుల్ అమాయకత్వం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు, కానీ ఫలితంగా మనం ప్రపంచకప్‌కు దూరమయ్యాం" అని సయ్యద్ విమర్శించారు.
గతంలో జగన్మోహన్ దాల్మియా హయాంలో బంగ్లాదేశ్ క్రికెట్‌కు భారత్ నుంచి ఎంతో గౌరవం, మద్దతు లభించేవని ఆయన గుర్తు చేశారు. భారత క్రికెట్ బోర్డుతో సత్సంబంధాలు అవసరమని, కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు భారత్‌కు వ్యతిరేకంగా ఉండటం వల్ల మనం నవ్వులపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో భద్రతా సమస్యలు ఉన్నాయన్న సాకుతో మ్యాచులను శ్రీలంకకు మార్చాలని కోరడం సరైన కారణం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
అసలు ఏం జరిగింది?
భారత్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టుకు భద్రతా పరమైన ముప్పు ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. తమ మ్యాచులను తటస్థ వేదిక అయిన శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని (ICC) కోరింది. అయితే, భారత్‌లో భద్రతా ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్నాయని గుర్తించిన ఐసీసీ, బంగ్లాదేశ్ కోరికను తిరస్కరించింది. దీంతో బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది.
బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్
బంగ్లాదేశ్ తప్పుకోవడంతో ఆ జట్టు స్థానాన్ని ఐసీసీ స్కాట్లాండ్‌కు కేటాయించింది. మరోవైపు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో చర్చల అనంతరం, టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌పై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేదా ఆంక్షలు విధించబోమని ఐసీసీ ప్రకటించింది. పాకిస్థాన్ జిత్తులకు బంగ్లాదేశ్ చిత్తయ్యిందని, క్రికెట్ పరిపాలనలో దౌత్యపరమైన వైఫల్యం వల్ల ఆటగాళ్లు, అభిమానులు భారీ మూల్యం చెల్లించుకున్నారని సయ్యద్ అస్రాఫుల్ హక్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pakistan Prime Minister Insult Telugu: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో జరిగిన మొదటి ఘాజా బోర్డు ఆఫ్ పీస్ సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ప్రాముఖ్యతను చాటుకోవాలని వెళ్లిన ప్రధానికి.. చివరికి అక్కడ చేదు అనుభవాలే మిగిలాయి. సదస్సు జరుగుతున్న సమయంలో ఆయన ఏకాకిగా.. ఒక ప్రాధాన్యత లేని ప్రధానిగా కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. ఆయన ఆ స్టేజ్ పై ఒక సాధారణ వ్యక్తి లా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోస్‌తో పాటు కొన్ని వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..
సదస్సు అనంతరం నిర్వహించిన గ్రూప్ ఫోటో స్టేషన్‌లో పాకిస్తాన్ ప్రధాని నిర్వాహకులు పక్కకు నెట్టేయడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి.. డోనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ప్రముఖంగా నిలబడగా.. షరీఫ్ మాత్రం వెనుక వరుసలో ఎక్కడో మూలన కనబడని చోటులో నిలబడాల్సి వచ్చింది. సౌదీ అరేబియా తో పాటు ఇండోనేషియా వంటి దేశాల నేతలకు దక్కిన ప్రాధాన్యత కూడా పాకిస్తాన్‌కు దక్కలేదంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
సదస్సు సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వైపు చూపిస్తూ.. లేచి నిలబడండి అని.. అనగాని ఆయన వెంటనే సీటు నుంచి లేచి నిలబడ్డారు.. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు నేటిజన్లు ఆయనను ట్రంప్ చేతిలో కీలుబొమ్మ అంటూ కామెంట్ చేస్తున్నారు.. అలాగే ఆ ప్రధాని నిలబడిన సమయంలోనే ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీని గొప్ప వ్యక్తి.. మంచి మిత్రుడు అని కొనియాడారు.. దీంతో పాకిస్తాన్ ప్రధాని ముఖం వెలవెలబోయింది..

పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ సమావేశంలో శతవిధాలుగా ప్రయత్నించారు.. ట్రంప్ శాంతికి చిహ్నమని.. దక్షిణాసియా రక్షకుడని ఆకాశానికి ఎత్తాడు.. గత ఏడాది భారత్ పాక్ కాల్పుల విరమణ కు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని ప్రశంసల వర్షం కురిపించారు.. అయితే, ఈ పొగడ్తలు రంపు పై పెద్దగా ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది.
గాజాలోని శాంతి స్థాపన కోసం అంతర్జాతీయ సైనిక దళాలను పంపే విషయంలో పాకిస్తాన్ వెనకడుగు వేయడమే ఈ దూరానికి ప్రధాన కారణమని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇండోనేషియాsతో పాటు ఈజిప్టు వంటి దేశాలు సైన్యాన్ని పంపేందుకు అంగీకరించగా.. పాకిస్తాన్ మాత్రం ద్వంద వైఖరిని అవలంబిస్తోంది.. ఫలితంగా ట్రంప్ పరిపాలనలో పాకిస్తాన్ తన పరాభవాన్ని కోల్పోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ఈ పర్యటన పాకిస్తాన్ దౌత్యపరమైన వైఫల్యానికి నిదర్శనంగా మారిందని చర్చ జరుగుతోంది.
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Accenture Sensational Decision: ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కంపెనీ యాక్సెంచర్ (Accenture) తమ ఉద్యోగులకు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.. ముఖ్యంగా ఈ సంస్థలో పనిచేసే సీనియర్ సిబ్బందికి కొన్ని ప్రత్యేకమైన సూచనలను చేసింది. ఇకనుంచి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ వినియోగం ఉద్యోగుల పనితీరు గుర్తింపుతో పాటు ప్రమోషన్స్ కు ముడి పెడుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇటీవలే ఈ కంపెనీ సుమారు 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
కంపెనీ ఇటీవల జారీ చేసిన కీలక అంశాల్లోకి వెళ్తే.. అసోసియేట్ డైరెక్టర్లతోపాటు సీనియర్ మేనేజర్ స్థాయిలో ఉద్యోగులు వారు రోజు చేసే పనుల్లో భాగంగా తప్పకుండా వినియోగించాల్సి ఉంటుందట.. ఎవరైనా వీటిని వినియోగించకపోతే వారికి సంబంధించిన లీడర్షిప్ తొలగించే అవకాశాలు ఉన్నట్లు సంస్థ స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా సంస్థలు ఇతర ప్రమోషన్స్ కు కూడా అర్హులు కారని తెలిపింది.
అంతేకాకుండా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎంతవరకు వాడుతున్నారో తెలుసుకోవడానికి ప్రత్యేకమైన టూల్స్ ను కూడా తీసుకువచ్చినట్లు తెలిపింది. సంస్థ సొంతంగా రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రిఫైనరీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఉద్యోగుల లాగిన్ వివరాలతో పాటు.. వారు Ai టూల్స్‌ను ఎంతవరకు వినియోగిస్తున్నారనేది ట్రాక్ చేయబోతున్నారట.. అలాగే భవిష్యత్తులో ఈ కంపెనీకి సంబంధించిన పని విధానం కూడా పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయని సీఈఓ జూలీ స్వీట్ తెలిపారు. దీనికోసం ఉద్యోగుల నైపుణ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీకి అనుగుణంగా తీర్చిదిద్దడం అత్యవసరమని ఆమె వెల్లడించారు.
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
అయితే, అమెరికా ప్రభుత్వ ప్రాజెక్టులపై పనులు చేసే వారికి.. ఐరోపాలోని 12 దేశాలకు సంబంధించిన సిబ్బందికి ఈ నిబంధనలు వర్తించవని కంపెనీ తెలిపింది. కేవలం యాక్సెంచర్ మాత్రమే కాకుండా.. గూగుల్ తో పాటు మైక్రోసాఫ్ట్ మెట్ట వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇదే బాటలో ముందుకెళ్తున్నారు.. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాడకం తప్పనిసరి చేసింది.. AI స్కిల్స్ లేని వారు వెనకబడిపోయే అవకాశాలు ఉన్నాయని.. సంస్థల ఉత్పత్తిని పెంచడానికి ఇప్పుడు ఇది తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు..
Also Read: Tirumala Issue: 'మేం కాదు తిరుమల వివాదంలో చంద్రబాబు క్షమాపణలు కోరాలి': బొత్స సత్యనారాయణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Red Sand Boa Snake Myth: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఫరూఖ్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ స్థలంలో ఒక వింత పాము కలకలం రేపింది. స్థానికంగా పనిచేస్తున్న షఫీ అనే వ్యక్తికి ఈ అరుదైన 'ఎర్ర ఇసుక బోవా' కంటపడటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
రెండు తలల పాము రహస్యం
చూడటానికి రెండు వైపులా తలలు ఉన్నట్లు కనిపించే ఈ పాముపై ఎన్నో ఏళ్లుగా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అసలు వాస్తవాలు ఇవే. నిజానికి రెండు తలలు ఉండవు, ఈ పాము తోక భాగం కూడా తల లాగే మొద్దుబారి ఉంటుంది. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇది తన తోకను తలలా చూపిస్తూ భ్రమింపజేస్తుంది. ఇది ఏమాత్రం విషపూరితమైన పాము కాదు. చాలా నెమ్మదిగా కదులుతుంది.
ఈ పాము ఇంట్లో ఉంటే అదృష్టం అని, క్షుద్రపూజలు చేస్తే ధన వర్షం కురుస్తుందని, లైంగిక పటిమ పెంచే మందుల్లో వాడతారని అనేక అపోహలు ఉన్నాయి. ఈ కారణాల వల్లే స్మగ్లర్లు దీన్ని పట్టుకుని కోట్లాది రూపాయలకు విదేశాల్లో విక్రయిస్తుంటారు.
అటవీ శాఖ చర్యలు
సమాచారం అందుకున్న ఫలక్‌నుమా పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పామును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ జాతి పాములను వేటాడటం, బంధించడం లేదా అమ్మడం వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం నేరం.
ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న పామును పరీక్షించిన అనంతరం నిర్మానుష్య అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమాచారం అందించిన షఫీని అధికారులు అభినందించారు. ఇలాంటి అరుదైన జీవులు కనిపిస్తే వాటిని చంపడం గానీ, అక్రమంగా తరలించడం గానీ చేయవద్దు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించడం బాధ్యతాయుతమైన పౌరుల లక్షణం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chandrababu Apology: 'తిరుమల అంశం మేము క్షమాపణ చెప్పడం కాదు. ముందు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని శాసనమండలి చైర్మన్‌కు చెప్పాం. మండలి చైర్మన్ మమ్మల్ని క్షమాపణ చెప్పమని అడగలేదు. కూటమి నేతలు చెప్పిన విషయాలు చైర్మన్ మాకు చెప్పారు. మా వాదన మేము చెప్పాం' అని బొత్స సత్యనారాయణ తెలిపారు. 'సభ సజావుగా జరగాలి.. కూటమి నాయకులకు మంచి బుద్ది ప్రసాదించాలని కోరాం' అని చిట్‌చాట్‌లో బొత్స చెప్పారు.
Also Read: Schools Close: రేపు స్కూళ్లు, కాలేజ్‌లు బంద్.. ఎక్కడ? ఎందుకంటే?
శాసనమండలిలో శుక్రవారం జరిగిన పరిణామాలపై ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. చిట్‌చాట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో వెంకటేశ్వరస్వామి ఫొటోలు ప్రదర్శించిన నేపథ్యంలో నెలకొన్న తీవ్ర వివాదంపై స్పందించారు. 'తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేశాడు. దానికి ముందు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. మండలిలో ఎక్కడ మా సభ్యులు చెప్పులు ధరించలేదు. స్వయంగా నేనే చెప్పులు తీసేయండి అని చెప్పా' అని బొత్స సత్యనారాయణ వివరించారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో కూటమి పార్టీలు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెప్పులు వేసుకుని దేవుడిని అవమానించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు.
Also Read: KCR Birthday Gift: ఐదుకు 5 క్లీన్ స్వీప్ విజయాలు కేసీఆర్ బర్త్ డే కానుక: కాంగ్రెస్ ఎమ్మెల్యే
'తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగింది ఎవరు? తిరుమల లడ్డూలో పంది కొవ్వు, జంతు కొవ్వు అని మాట్లాడింది ఎవరు?' అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 'సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా మాట్లాడారు. ఉదయం లేచిన దగ్గర నుంచి బొట్టు పెట్టుకొని తిరిగేది మేం. టీడీపీ నాయకులు ఎవరు మొహంపైన అయినా బొట్టు ఉందా?' అని నిలదీశారు. దేవ దేవుడిపై మాకు నమ్మకం ఉందని ప్రకటించారు. 'వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్నారు అనేది అవాస్తవం. చెప్పులు వేసుకొని మా వాళ్లు దేవుడు ఫొటో పట్టుకోలేదు' అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం
'గోవిందా అనే నామం చాలా పవిత్రమైన నామం. అదేనామంతో నేడు మండలిలోకి వెళ్లా. కనీసం ఆ నామంతో కూటమి ప్రభుత్వం మనస్సు మారుతుందేమో అని నమ్మాం. మండలిలో చెప్పులు బూట్లు వేసుకుని ఆ దేవదేవుడు ఫొటో పట్టుకొని మీము సభలోకి వెళ్లలేదు. మేము చంద్రబాబు లాగా చెప్పులు బూట్లు వేసుకుని స్వామివారి ఫొటో పట్టుకొని సభలోకి వెళ్లలేదు. స్వామి ఫొటో తీసుకొని రక్షించు గోవిందా అని మాత్రమే వెళ్లాం' అని బొత్స సత్యనారాయణ వివరించారు. ఈ మంత్రులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక హెరిటేజ్ సంస్థను నడుపుతున్నారా? తమకు నమ్మకం కుదరటం లేదని పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తున్నారని మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPS-95 Pension Hike 2026: లక్షలాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఈపీఎఫ్‌వోలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కనీస పెన్షన్ పెంపు, వేతన పరిమితి పెంపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు, పార్లమెంట్‌లో జరిగిన చర్చల నేపథ్యంలో త్వరలోనే కేంద్రం నుండి అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.
కనీస పెన్షన్ రూ.9 వేలకు?
ప్రస్తుతం ఈపీఎస్-95 కింద కనీస పెన్షన్ నెలకు రూ.1,000 మాత్రమే అందుతోంది. దీనిని కనీసం రూ.3,000 నుంచి రూ.9,000 వరకు పెంచాలని కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం సుమారు 47 లక్షల మంది పెన్షనర్లు నెలకు రూ.9 వేల కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పార్లమెంట్‌లో మాట్లాడుతూ, పెన్షన్ పెంపుపై వినతులు అందాయని, అయితే ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
వేతన పరిమితి రూ.25,000కు?
పీఎఫ్ కంట్రిబ్యూషన్ కోసం ప్రస్తుతం ఉన్న బేసిక్ శాలరీ లిమిట్ రూ.15,000ను సవరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పరిమితిని రూ.25,000 లేదా రూ.30,000కు పెంచే అవకాశం ఉంది. ఒకవేళ వేతన పరిమితి పెరిగితే, పెన్షన్ ఫండ్‌కు జమ అయ్యే సొమ్ము పెరిగి, ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్ మొత్తం గణనీయంగా పెరుగుతుంది.
ఒకవేళ ప్రభుత్వం వేతన పరిమితిని రూ.25,000కు పెంచితే, సర్వీస్ కాలం ఆధారంగా పెన్షన్ ఇలా ఉండవచ్చు. 10 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు నెలకు సుమారు రూ.3,570 పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 35 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు నెలకు సుమారు రూ.12,500 వరకు పెన్షన్ పొందే వీలుంటుంది.
సుప్రీంకోర్టు డెడ్‌లైన్
ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఈ గడువు ముగిసేలోగా కేంద్రం తీసుకోబోయే నిర్ణయం కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. వేతన పరిమితి పెరిగితే చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినప్పటికీ, పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మాత్రం భారీగా పెరగనుంది. దీనిపై కేంద్రం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read; Free Bus Scheme Smart Cards: మహిళలకు శుభవార్త..ఉచిత బస్సులో కీలక మార్పులు..బడ్జెట్‌లో భారీగా నిధులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP RTE Admission 2025-26 Notification: ఆంధ్రప్రదేశ్‌లోని పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం విద్యా హక్కు చట్టం (RTE) కింద 2026-27 విద్యా సంవత్సరానికి ఉచిత ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఏపీ ప్రభుత్వం ఈ గొప్ప అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో మొదటి తరగతిలో ఉచితంగా ప్రవేశం పొందవచ్చు.
2026 - 27 విద్యా సంవత్సరానికి గానూ ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. సీట్ల కేటాయింపు (25% కోటా) మొత్తం కేటాయించిన సీట్లలో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. ఎస్సీ (SC) 10%, ఎస్టీ (ST) 4%.. బీసీ, మైనారిటీలు & ఇతరులు 6%.. అనాథలు, దివ్యాంగులు & హెచ్‌ఐవీ బాధిత పిల్లలు 5 శాతం సీట్లు కేటాయించారు.
అర్హత ప్రమాణాలు..
గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి వార్షిక ఆదాయం రూ.1.20 లక్షల లోపు ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల లోపు ఉండాలి.
వయస్సు: జూన్ 1, 2026 నాటికి కనీసం 5 ఏళ్లు నిండి ఉండాలి.
స్టేట్ సిలబస్: జూన్ 2, 2020 – మే 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.
CBSE సిలబస్: ఏప్రిల్ 1, 2020 – మార్చి 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.
కావలసిన పత్రాలు..
దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ క్రింది డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి. పిల్లల పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (Birth Certificate), ఆధార్ కార్డు (తప్పనిసరి), కుల ధృవీకరణ పత్రం (Caste Certificate), ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate), ఫోటో, నివాస ధృవీకరణ పత్రం వంటివి తప్పనిసరి.
దరఖాస్తు చేసుకునే విధానం..
అర్హులైన తల్లిదండ్రులు ఈ మార్గాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా అప్లై చేయవచ్చు. లేదంటే సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయం సందర్శించవచ్చు. అలాగే మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయం ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు. ఏవైనా సందేహాలుంటే 1800 425 899 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
Also Read: Free Bus Scheme Smart Cards: మహిళలకు శుభవార్త..ఉచిత బస్సులో కీలక మార్పులు..బడ్జెట్‌లో భారీగా నిధులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ration Card Update Only 7 Days Left: మన దేశవ్యాప్తంగా వైట్ రేషన్ కార్డు పై సరుకులను పేద కుటుంబాలకు అందిస్తాయి. ప్రధానంగా బీపీఎల్ ఈ రేషన్ కార్డు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు రేషన్ కార్డు ద్వారా వివిధ పథకాలను పొందుతారు. ప్రతి నెల బియ్యం, పప్పులు ఇతర సామాగ్రి కూడా రేషన్ కార్డుల నుంచి పొందుతారు. అయితే ఈ రేషన్ కార్డుకు కుటుంబ సభ్యులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేకపోతే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఉచిత రేషన్ అందించారు. 2026 ఫిబ్రవరి 28వ లోపు మీరు ఈ పని పూర్తి చేసుకోవాలి . ఫుడ్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ఈ కీలక హెచ్చరికలు చేసింది. అయితే లబ్ధిదారులు ఈకేవైసీ ఫిబ్రవరి 28వ తేదీ లోపు పూర్తి చేయకపోతే వారికి ఉచిత రేషన్ అందించబడదు అని హెచ్చరిస్తుంది. అంటే ఈ కేవైసీ 28 ఫిబ్రవరి లోపు పూర్తి చేయటం మంచిది ..
ఈకేవైసీ ఎందుకు?
అసలు చాలామందికి రేషన్ కార్డుకు ఈ కేవైసీ ఎందుకు అనే సందేహం కూడా వచ్చింది. అయితే ప్రభుత్వ పథకాలు కేవలం అర్హులైన వారికి అందించడానికి ఈకేవైసీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే చనిపోయిన వారు ఇక ఆ జాబితా నుంచి తొలగిస్తారు. ఆధార్ వెరిఫికేషన్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేస్తారు. అనర్హులైన వారి పేర్లను తొలగిస్తారు.
ఇంట్లో నుంచి ఈకేవైసీ పూర్తి చేయండి..
మీరు ఇంట్లో నుంచే ఈకేవైసీ పూర్తి చేసే విధానానికి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనికి ఈపీడీఎస్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి అక్కడ మీరు 'లింక్ ఆధార్ రేషన్ కార్డ్ లేదా ఈ కేవైసీ' ని సెలెక్ట్ చేయండి. మీ రేషన్ కార్డు నెంబర్ ఆధార్ వివరాలు నమోదు చేయండి. అప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ఈ కేవైసీ పూర్తవుతుంది.
అయితే ఒకవేళ మీ రేషన్ కార్డు ఈకేవైసీ ఆన్‌లైన్‌లో పూర్తి చేయకపోతే మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ షాప్ కి వెళ్ళండి. అక్కడ ఈ కేవైసీకి సంబంధించిన వివరాలు నమోదు చేయించండి. మీ ఇతర కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు కూడా నమోదు చేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికి మీ థంబ్ ప్రింట్ డీలర్ Epos మెషిన్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనికి డీలర్ మీ వద్ద నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు. వెంటనే ఈకేవైసీ ప్రక్రియను ఫిబ్రవరి 28వ తేదీలోపు పూర్తి చేయండి.
Also Read: రైల్వే ప్రయాణీకులకు బిగ్ రిలీఫ్.. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ బుకింగ్ మరింత సులభతరం..!
Also Read: బాగల్‌కోట్‌లో శివాజీ జయంతి ఊరేగింపు ఉద్రిక్తం.. రాళ్ల దాడులు, వాహనాలకు నిప్పు వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Real Nagamani Video Watch Here: మీ అందరికీ నాగమణి వజ్రం ఎలా ఉంటుందో తెలుసా? ఇది నాగుపాము తలపై రాత్రి సమయాల్లో అద్భుతమైన కాంతితో మెరుస్తూ ఉంటుంది. దీనిని పూర్వీకులు అత్యంత రహస్యమైన రత్నంగా భావించేవారు. ఇది కేవలం నాగుపాముల తలపై మాత్రమే పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా పూర్వీకులు ఎక్కువగా నాగుపాము తలభాగం నుంచి తీసిన రత్నాన్ని ధరిస్తూ ఉండేవారు. అంతేకాకుండా దానిని చూపుడు వేలుకు పెట్టుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని వారు నమ్ముతూ ఉండేవారు. ముఖ్యంగా రాజులైతే బంగారంతో కలిపి ఉంగరంలా తయారు చేసుకొని ధరించేవారు.. ఇలా ధరిస్తే అనారోగ్య సమస్యలు ఏవైనా దూరం అవ్వడమే కాకుండా.. రాజ్యంలో కరువు కాటకాలు రాకుండా ఉండేవని నమ్ముతూ ఉండేవారు.
పురాణాల్లో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అత్యంత అరుదైన నాగమణి వజ్రాలు కొన్ని శక్తివంతమైన పాముల తల భాగంలో మాత్రమే తయారవుతాయట.. అంతేకాకుండా ఇలాంటి రత్నం కలిగిన పాములు చీకటి ప్రదేశాల్లో కాంతిని కలిగి ఉంటాయని కొన్ని పుస్తకాల్లో పేర్కొన్నారు. అలాగే నాకు పాముల తల పై భాగంలో ఈ రత్నాలు సాధారణంగానే తయారవుతాయని సమాచారం.. ఇక సైంటిఫిక్‌గా చూస్తే.. ఈ వజ్రాలు నాగుపాము తలపై భాగంలో విషం గడ్డ కట్టడం వల్ల.. ఏర్పడుతుందట.. అంతేకాకుండా మరి కొంతమందైయితే నాగదేవతలు కొన్ని శక్తివంతమైన పాములకు అందించిన వరంగా కూడా నమ్ముతూ ఉంటారు..
రియల్ నాగమణులు ఇప్పటికీ ఉన్నాయా అంటే? ఉన్నాయని సందేహం కలుగుతోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియో దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. సాధారణంగా చీకట్లో పాములు కనిపించకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు.. ఓ పాము దగ్గర కాంతివంతమైన మెరుపు మీరు చూడొచ్చు. అంతేకాకుండా అది అడగ విప్పిన సమయంలో రత్నం దగదగా మెరవడం మీరు క్లియర్‌గా ఈ వీడియోలో వీక్షించవచ్చు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
గత కొన్ని రోజుల నుంచి నాగమణి స్టోన్‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అవుతున్నారు.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూసి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కంగు తింటున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో @SsBolgSsBolg అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.. నాగమణి అని ట్యాగు పెట్టి పోస్ట్ చేయడం విశేషం. ఇలాంటి ఘటనలు చాలా రేర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
20-foot Anaconda Video Watch Here: ప్రకృతి ఒడిలో ఎన్ని రకాల వింతలు ఉన్నాయో.. అన్ని రకాల ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి.. ముఖ్యంగా ఆమెజాన్ వంటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు వస్తుందో చెప్పడం ఎవరి సాధ్యం కాదు. తాజాగా కొంతమంది పర్యాటకులు ప్రయాణం చేస్తున్న సమయంలో కొన్ని అద్భుతమైన దృశ్యాలను చూశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో పడవపై ప్రయాణం చేస్తున్న కొంతమంది పర్యాటకులకు ఊహించని ఒక ఘటన ఎదురైంది.. దాదాపు 20 అడుగులకు పైగానే పొడవున్న భారీ అనకొండ పాము నీటిలో ఈదుతూ.. అది నేరుగా వారి వైపు దూసుకు రావడం మీరు గమనించవచ్చు.. సాధారణంగా పాములను చూస్తేనే భయపడుతూ ఉంటారు.. అలాంటిది కొండచిలువకు సంబంధించిన భారీ సర్పంచ్ ఒక్కసారిగా ఉన్నట్టుండి నీటిలో పడవలు ఈదుతున్న వారి వైపుకు దూసుకు వస్తే ఎలా ఉంటుంది?
ఆ భారీ సర్పం నీటి అలలు సైతం దాటుతూ అత్యంత వేగంగా పడవ వైపుకు రావడం వీడియోలో మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. పడవకు అతి సమీపంలోనే ఆ అనకొండ పాము ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా కడప దగ్గరికి వచ్చి.. ఆ ప్రయాణికులపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే, ఆ పడవలో ఉన్న కొంతమంది ప్రయాణికులు ఈ దృశ్యాలను వారి స్మార్ట్‌ఫోన్స్‌లో చిత్రీకరించారు. ఆ పాము అతి సమీపంలోకి రావడం, దీంతో పడవలు ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
ఈ వీడియోను అన్‌సీన్ వైల్డ్ లైఫ్ అమెజాన్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను కొన్ని లక్షల మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించగా.. వేల సంఖ్యలో దీనికి లైక్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఆ పడవలో ఉండే అందరి ప్రయాణికులు ప్రాణాలు పోయేవని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ వీడియో చూసిన మరికొంతమంది మాత్రం ఇది నిజమైన వీడియో కాదని ఎవరో కావాలని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ వినియోగించి సృష్టించారని కామెంట్లు చేస్తున్నారు. ప్రకృతి అందాలను చూసేతందుకు వెళ్లాలనుకునేవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Pax Silica India Telugu News: భారత్ మరో ముందడుగు వేసింది.. అమెరికా రూపొందించిన ప్యాక్స్ సిలికా కూటమిలో మన దేశం అధికారికంగా చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తో పాటు సెమీ కండక్టర్లు, కీలక ఖనిజాల సరఫరాను మరింత బలోపేతం చేసే లక్ష్యంలో ఈ కూటమిని అమెరికా రూపొందించింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ప్యాక్స్ సిలికా ప్రకటనపై సంతకం చేసింది. ఇంతకీ ప్యాక్స్ సిలికా అంటే ఏంటి? ఇది భారత్ కి ఎలా ఉపయోగపడుతుందని అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్యాక్స్ సిలికా అంటే ఏమిటో తెలుసా? (what is pax silica)
గత సంవత్సరం డిసెంబర్లో అమెరికా ప్యాక్స్ సిలికా కూటమిని ప్రారంభించింది.. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే సెమీ కండక్టర్లతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ సాంకేతికతకు అవసరమైన అన్ని రకాల ముడి పదార్థాల సరఫరాలో చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం అన్నమాట.. ప్యాక్స్ అంటే లాటిన్ భాషలో శాంతి అని.. ఇక సిలికా అంటే చిప్ తయారీకి వాడే సిలికాన్ అని అర్థం.. అంటే సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ఆర్థిక భద్రతను, శాంతిని కాపాడుకోవడమే దీని ప్రధాన లక్ష్యం..
ఈ కూటమి ఒప్పందం కారణంగా భారతదేశ టెక్నాలజీ సరఫరాల గొలుసులో భాగంగా కీలక భాగస్వామిగా మారే అవకాశాలున్నాయి.. విదేశీయంగా చిప్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి.. అత్యాధునిక టు నానోమీటర్ చిప్పులను రూపొందించడానికి ఈ భాగస్వామ్యం ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా విద్యుత్ వాహనాలు.. రక్షణ పరికరాల్లో వాడే అరుదైన ఖనిజాల సరఫరాలో అంతరాయం కలగకుండా సభ్య దేశాల నుంచి సహకారమందుతుంది. ఈ రంగంలో సుమారు 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరమవుతారని.. ఆ డిమాండ్ ను భారత్ తీర్చగలుగుతుందని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా గూగుల్ కంపెనీకి చెందిన CEO సుందర్ పిచాయ్‌తో పాటు అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. భారత్ చేరికతో ఈ కూటమి మరింత శక్తివంతమైందని.. ఇది కేవలం అన్ని దేశాల అవసరాలను తీర్చడమే కాకుండా.. వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మారుతుందని అమెరికా రాయబారి తెలిపారు.. భారత్తో కలిసి ఈ కూటమిలో జపాన్‌తో పాటు యునైటెడ్ కింగ్డమ్, దక్షిణ కొరియా ఆస్ట్రేలియా వంటి పది దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అతి త్వరలోనే మరికొన్ని దేశాలు కూడా ఇందులో కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Free Bus Scheme Smart Cards: మహిళలకు శుభవార్త..ఉచిత బస్సులో కీలక మార్పులు..బడ్జెట్‌లో భారీగా నిధులు!
Mahalakshmi Free Smart Cards: తెలంగాణలో మహిళలకు అత్యంత ప్రజాదరణ పొందిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. రద్దీని తగ్గించడం, టికెట్ జారీ ప్రక్రియను సులభతరం చేయడంపై సర్కార్ దృష్టి సారించింది.
బడ్జెట్‌లో రూ.7,000 కోట్ల ప్రతిపాదనలు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను మహాలక్ష్మి పథకం సజావుగా సాగడానికి టీజీఎస్ఆర్టీసీ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి రూ.7,000 కోట్లు కేటాయించాలని కోరింది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా 680 కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ.241 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బస్టాండ్లు, డిపోల ఆధునీకరణకు రూ.442 కోట్లు, బస్ పాస్ రాయితీల కోసం రూ.358 కోట్లు కేటాయించాలని నివేదికలో పేర్కొంది.
జూన్ 2 నుంచి 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు'
ప్రస్తుతం ఉచిత ప్రయాణం కోసం మహిళలు ఆధార్ కార్డు చూపుతున్నారు. అయితే, ఆధార్‌లో ఫోటోలు స్పష్టంగా లేకపోవడం వల్ల కండక్టర్లతో తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా స్మార్ట్ కార్డులను తీసుకువస్తున్నారు. ఈ కార్డుపై ప్రయాణికురాలి పేరు, పుట్టిన తేదీతో పాటు ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది.
బస్సు ఎక్కగానే కండక్టర్ దగ్గర ఉండే మిషన్ ద్వారా ఈ కార్డును స్కాన్ చేస్తే సరిపోతుంది. జీరో టికెట్ తీసుకోవడం మరింత సులభమవుతుంది. ఈ ఏడాది జూన్ 2వ తేదీ (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నుంచి ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. కార్డుల తయారీ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లు విడుదల చేసింది.
మహిళలకు కలిగే ప్రయోజనాలు..
ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు, స్మార్ట్ కార్డు ఉంటే సరిపోతుంది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ వల్ల టికెట్ జారీ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే బస్సుల్లో రద్దీ తగ్గి, ప్రయాణం సుఖమయంగా మారుతుంది. ఈ కొత్త మార్పుల వల్ల మహాలక్ష్మి పథకం మరింత పారదర్శకంగా అమలు కావడమే కాకుండా, ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గడానికి, ప్రయాణికుల ఇబ్బందులు తొలగడానికి దోహదపడనుంది.
Also REad: AP Crime News: కోరిక తీర్చాలని వదినను బలవంతపెట్టిన మరిది..యాసిడ్‌తో దాడికి యత్నం..చివరికి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook