Solar Eclipse 2026 Time In India: ఈ ఏడాదిలో సంభవించబోయే మొదటి సూర్యగ్రహణం రేపు (ఫిబ్రవరి 15, 2026) ఏర్పడనుంది. ఈ గ్రహణం విశేషాలు, సమయాలు, భారత్‌లో దీని ప్రభావంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు దీనిని ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యంగా అభివర్ణిస్తున్నారు. ఈ గ్రహణం సమయంలో సూర్యుడు ఒక మెరిసే ఉంగరంలా కనిపిస్తాడు.
సూర్యగ్రహణం అంటే ఏమిటి?
సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకాంతి భూమిపై పడకుండా చంద్రుని నీడ అడ్డుకుంటుంది. ఈ స్థితిని సూర్యగ్రహణం అంటారు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పకుండా, కేవలం మధ్య భాగాన్ని మాత్రమే కప్పి ఉంచడం వల్ల సూర్యుడు ఒక అగ్ని వలయంలా కనిపిస్తాడు. దీనినే వార్షిక సూర్యగ్రహణం అంటారు.
గ్రహణం సమయాలు
భారత కాలమానం ప్రకారం.. గ్రహణం ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 12:31 గంటలకు ప్రారంభంకానుంది. గ్రహణ కాలం సుమారు 2 నిమిషాల 20 సెకన్ల పాటు అగ్ని వలయంగా కనిపిస్తుంది. సాయంత్రం వేళకు గ్రహణం పూర్తిగా తొలగిపోతుంది.
భారతదేశంలో కనిపిస్తుందా?
అయితే ఈ అగ్ని వలయ సూర్యగ్రహణం భారత్‌లో నేరుగా కనిపించదు. అంటార్కిటికాలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దక్షిణ ఆఫ్రికా, చిలీ, అర్జెంటీనా వంటి దేశాల్లో దీనిని వీక్షించవచ్చు. భారతదేశంలోని కొన్ని అత్యంత దక్షిణ ప్రాంతాల్లో చాలా స్వల్పంగా పాక్షిక గ్రహణం కనిపించే అవకాశం ఉంది, కానీ అగ్ని వలయ దృశ్యం మాత్రం కనిపించదు.
సూతక కాలం, నియమాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యగ్రహణానికి 12 గంటల ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. సూతక కాలంలో, గ్రహణ సమయంలో శుభకార్యాలు నిషిద్ధం. పండితుల ప్రకారం.. ఈ సమయంలో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీయడం, ఆహారం తీసుకోవడం వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకూడదని మరియు పదునైన వస్తువులను వాడకూడదని పెద్దలు చెబుతుంటారు.
రాశులపై ప్రభావం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహణాలు వ్యక్తుల రాశిచక్రాలపై ప్రభావం చూపుతాయి. ఈ గ్రహణం ఫాల్గుణ అమావాస్య నాడు ఏర్పడుతుండటంతో కొన్ని రాశుల వారు ఆర్థిక, మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
భారత్‌లో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి సూతక కాల నియమాలను పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత, మతపరమైన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఖగోళ దృశ్యాన్ని ఇష్టపడే వారు ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ 'రింగ్ ఆఫ్ ఫైర్'ను వీక్షించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Tata Motors EV Offers: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ అదిరిపోయే శుభవార్త అందించింది. పర్యావరణ హితమైన వాహనాలను ప్రోత్సహించే దిశగా, ఫిబ్రవరి నెలలో తన ఎలక్ట్రిక్ వాహనాలపై (EVs) భారీ తగ్గింపులను ప్రకటించింది. మోడల్‌ను బట్టి ఏకంగా రూ.3.80 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. భారత ఈవీ మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్, ఈ నెలలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.
ఈ నెలకు సంబంధించి అత్యధిక తగ్గింపు టాటా కర్వ్ EV పైనే ఉంది. గరిష్టంగా ₹3.80 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. పాత స్టాక్ (మోడల్ ఇయర్) ఉన్న వాహనాలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. కేవలం కర్వ్ మాత్రమే కాకుండా, మిగిలిన ప్రధాన ఈవీలపై కూడా టాటా ఆకర్షణీయమైన ధరలను అందిస్తోంది.
నెక్సాన్ EV ఫ్యామిలీ ఈవీ సెగ్మెంట్లో టాప్ లో ఉండే ఈ కారుపై కూడా మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే పంచ్ EV మైక్రో ఎస్‌యూవీ విభాగంలో క్రేజ్ సంపాదించుకున్న పంచ్ ఈవీపై ఈ నెల ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. చివరిగా టియాగో EV బడ్జెట్ ఈవీ ప్రియులకు ఇది ఒక మంచి అవకాశం.
డిస్కౌంట్లు ఎలా నిర్ణయిస్తారు?
ఈ తగ్గింపులు అన్ని కార్లపై ఒకేలా ఉండవు, కింద పేర్కొన్న అంశాలపై ఆధారపడి ఉంటాయి. 2024 లేదా అంతకంటే పాత మోడల్ ఇయర్ స్టాక్ (MY24) వాహనాలపై డిస్కౌంట్లు అత్యధికంగా ఉంటాయి. ఆఫర్లు నగరాలు, డీలర్‌షిప్‌ల ఆధారంగా స్వల్పంగా మారుతుంటాయి. అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా లభించే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ కారు ఎందుకు కొనాలి?
పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే ఈవీ ఖర్చు చాలా తక్కువే కాకుండా కాలుష్యం లేని ప్రయాణాన్ని అందిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులను కల్పిస్తున్నాయి.
మీరు టాటా ఎలక్ట్రిక్ కారు కొనే ఆలోచనలో ఉంటే, మీ సమీప టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సందర్శించి అక్చువల్ స్టాక్, ఫైనల్ ప్రైస్ గురించి తెలుసుకోవడం ఉత్తమం. ఈ నెలలో లభించే భారీ తగ్గింపులను వినియోగించుకుని లక్షల రూపాయలు ఆదా చేసుకోండి.
Also Read: Solar Eclipse 2026: రేపే సూర్యగ్రహణం..సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసా? భారతదేశంలో ప్రభావం ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Congress Party Rebels: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన రెబెల్స్‌కు మంత్రి సీతక్క అలియాస్ ధనసరి అనసూయ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచిన వారిని తాను క్షమించనని ప్రకటించారు. 'వెన్నుపోటు రాజకీయాలు చేసిన వాళ్లను సహించేది లేదు. సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరం. వెన్నుపోటు రాజకీయాలు ఎవరు చేశారో మాకు తెలుసు. పద్ధతి మార్చుకోండి..ఇదే చివరి హెచ్చరిక' అని సీతక్క హెచ్చరించారు.
Also Read: Telangana: తెలంగాణ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక.. దౌర్జన్యం చేస్తున్న కాంగ్రెస్
ములుగు మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ భిక్షపతితోపాటు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన అనంతరం మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ను గెలిపించిన కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని ఆలోచించి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింత నిప్పుల చంద్రకళను ఎన్నుకున్నట్లు వివరించారు. 'అందరికీ చైర్ పర్సన్ కావాలని ఉంటుంది.. కానీ ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. అవకాశాలు రానివారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి' అని కాంగ్రెస్ కార్యకర్తలకు సీతక్క భరోసా ఇచ్చారు. 'వెన్నుపోటు రాజకీయాలతో ములుగు మున్సిపాలిటీలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. వెన్నుపోటు రాజకీయాలు చేసిన వాళ్లను సహించేది లేదు' అని స్పష్టం చేశారు.
Also Read: India vs Pakistan: పాకిస్థాన్ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయం
'సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరం. వెన్నుపోటు రాజకీయాలు ఎవరు చేశారు మాకు తెలుసు. పద్ధతి మార్చుకోండి.. ఇదే చివరి హెచ్చరిక' అని సీతక్క తెలిపారు. 'ములుగు పట్టణ అధ్యక్షుడు చింత నిప్పుల భిక్షపతికి గతంలో ఎన్ని ఒత్తిడిలు వచ్చిన పార్టీ మారలేదు. మనిషిలో చిత్తశుద్ధి ఉంది. కమిట్‌మెంట్‌తో పని చేశాడు. ములుగు జిల్లా మాజీ అధ్యక్షుడు నల్లెల కుమార్ అన్నలాంటివారు. ఆయన కుమారుడు నల్లెల భరత్‌కు ఇంకా చాలా వయసు ఉంది.. మంచి అవకాశాలు వస్తాయి' అని సీతక్క ఓదార్చారు.
Also Read: Revanth Reddy: బంజారాలకు తెలంగాణ సీఎం శుభవార్త.. నల్లమలలో సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రం
'మనల్ని ఓడగొట్టేందుకు రియల్ ఎస్టేట్ మాఫియా పనిచేసింది. కోట్లు కుమ్మరించినా ప్రజలు మనకే పట్టం కట్టారు. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నా' అని సీతక్క తెలిపారు. తనకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని.. అందరూ తనకు సమానమేనని ప్రకటించారు. అన్ని ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే విజయం మనదే అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Married Woman sales her husband to his lover for 15 crores in Bhopal: ఇటీవల భార్యభర్తల బంధం మరీ ప్రశ్నార్థకంగామారింది. ఒకప్పుడు పెళ్లిళ్లు చేసుకుని ఒకరితో మరోకరు అన్యోన్యంగా ఉండేవారు. ఏదైన గొడవలు జరిగితే నాలుగు గోడల మధ్య సర్దుకుని పోయేవారు . కానీ ఇప్పుడు ప్రతిదానికి గొడవలు పడుతున్నారు. చిన్న చిన్న గొడవలకే డైవర్స్ వరకు వెళ్తున్నారు. కొంత మంది హత్యలు చేయడం లేదా సుపారీలు ఇచ్చి చంపించడం చేస్తున్నారు. మరికొంత మంది ఈ బాధలుభరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇంకొంత మంది అయితే పెళ్లి చేసుకుని వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తమ సంబంధంకు అడ్డువస్తే ఏ పనిచేయడానికి కైన వెనుకాడటంలేదు.
పెళ్లై, పిల్లలు ఉన్న, 20 ఏళ్ల పాటు కలిసున్న వారితో కూడా విడిపోతున్నారు.ఈ క్రమంలో భోపాల్ లో జరిగిన ఒక దంపతుల గొడవ వార్తలలో నిలిచింది. భోపాల్ లో ఒక మహిళ తన 23 ఏళ్ల రిలేషన్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. అంతేకాకుండా రూ. 1.5 కోట్లకు తన మొగుడ్ని అతని ప్రియురాలికి అప్పగించింది. గతంలో టాలీవుడ్ లో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన శుభలగ్నం మూవీలో ఆమని తన భర్త జగపతి బాబును అతని ప్రియురాలికి అమ్మేస్తుంది. అచ్చం ఈ మూవీ సీన్ భోపాల్ లో రిపీట్ అయ్యింది.
23 ఏళ్ల క్రితం భోపాల్ కు చెందిన భార్యాభర్తలకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయనకు 42 ఏళ్లు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, తన భర్త ఆయనతో పాటు పని చేస్తున్న 54 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఇకతనభార్యతో ఉండలేదని భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
వీరిని కోర్టు కౌన్సెలింగ్ నిర్వహించింది. కానీ డైవర్స్ కావాలని భర్త పట్టుపట్టాడు. దీంతో భార్య తనకు 1. 5 కోట్లిస్తే డైవర్స్ ఇస్తానని చెప్పింది. ఈ డిమాండ్ కు భర్త,అతని ప్రియురాలు అంగీకరించడంతో ఒప్పందం జరిగింది.తన భార్యకు ఒక డూప్లెక్స్ ఇల్లు ఇవ్వడంతో పాటు, రూ.27 లక్షల నగదు చెల్లించారు. దీంతో ఫ్యామిలీ కోర్టులో వీరి డైవర్స్ కు మార్గం సుగమమైంది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంకా ఎన్ని అరాచకాలు చూడాలని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Preethi Mukundan In Chiru Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ముఖ్యంగా డైరెక్టర్ బాబీతో చేయబోయే సినిమాలో చిరంజీవి కూతురి పాత్ర కోసం ఒక ఆసక్తికరమైన పేరు వినిపిస్తోంది.
'వాల్తేరు వీరయ్య' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కీలకమైన కూతురి పాత్ర కోసం చాలా రోజులుగా సెర్చ్ జరుగుతోంది.
రేసులో నిలిచిన భామలు
ఈ సినిమాలో చిరు కూతురిగా నటించే ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపించాయి. మొదట 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత 'ఛాంపియన్' ఫేమ్ అనస్వర రాజన్ దాదాపు ఖరారైందని అందరూ భావించారు.
ఫైనల్ రేసులో ప్రీతీ ముకుందన్!
తాజా సమాచారం ప్రకారం.. కృతి శెట్టి లేదా అనస్వర రాజన్ కాకుండా, ప్రీతీ ముకుందన్ ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా 'కన్నప్ప' సినిమాలో నటించిన ప్రీతీ ముకుందన్ తన అందం, నటనతో మెప్పించింది. మెగాస్టార్ సినిమాలో కూతురిగా నటించడం అంటే అది కెరీర్ కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మెగాస్టార్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' సోషియో ఫాంటసీ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఇది రాబోతోంది.'విశ్వంభర' తర్వాత బాబీ దర్శకత్వంలో చేసే సినిమా పట్టాలెక్కనుంది. ఇందులో చిరంజీవిని మళ్లీ వింటేజ్ మాస్ లుక్‌లో చూపించేందుకు బాబీ ప్లాన్ చేస్తున్నారు.
'మన శంకరవరప్రసాద్ గారు'తో కామెడీ, వింటేజ్ మ్యానరిజమ్స్‌తో అలరించిన చిరు, బాబీ సినిమాలో తండ్రి పాత్రలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. ప్రీతీ ముకుందన్ ఈ మెగా ఆఫర్‌తో స్టార్ హీరోయిన్ రేసులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
MLC Nagababu Support Kova Bun Vali: కర్నూలుకు చెందిన 'కోవా బన్' వ్యాపారి షేక్ వలీకి జరిగిన అవమానంపై టాలీవుడ్ నటుడు, ఏపీ ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. కేవలం లైకుల కోసం చిరు వ్యాపారి పొట్ట కొట్టడం సరికాదని మండిపడుతూ, వలీకి తన వంతుగా ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకుంటున్న వలీని కొందరు యూట్యూబర్లు కావాలనే టార్గెట్ చేస్తూ, ఆహార నాణ్యతపై అనుమానాలు రేకెత్తించేలా వీడియోలు చేయడం సోషల్ మీడియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.
నాగబాబు ఆర్థిక సాయం
ఈ వివాదం కారణంగా వలీ తీవ్ర మానసిక వేదనకు గురవ్వడమే కాకుండా, శివరాత్రి వంటి కీలక సమయాల్లో వ్యాపారం చేసుకోలేకపోయారు. వలీ పరిస్థితిని తెలుసుకున్న నాగబాబు, ఆయనను నేరుగా కలిసి రూ.25,000 చెక్కును అందజేశారు. "చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుంది, ఎవరూ భయపడాల్సిన పనిలేదు" అని నాగబాబు ధైర్యం చెప్పారు.
యూట్యూబర్లకు హితవు
మరోవైపు చిరు వ్యాపారులను వేధించే వారిపై నాగబాబు తీవ్రంగా స్పందించారు. ఆహార నాణ్యతను పరీక్షించడానికి 'ఫుడ్ సేఫ్టీ అధికారులు' ఉన్నారని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. పొట్టకూటి కోసం కష్టపడే సామాన్యులను భయభ్రాంతులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
చిరువ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది
పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవాబన్ను అమ్ముకుంటున్న సాధారణ పౌరుడుని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదు. ఈ సంఘటన తర్వాత చాలామంది చిరువ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన కారణంగా శివరాత్రికి తాను వ్యాపారం… pic.twitter.com/HbsnzrcaxR
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 15, 2026
ఈ ఘటనపై ఇప్పటికే లోకేష్, అచ్చెన్నాయుడు వంటి మంత్రులు స్పందించిన విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు. ఈ వివాదాన్ని మతపరమైన కోణంలో చూడవద్దని, ఇది ఒక సామాన్య వ్యాపారికి జరిగిన అన్యాయమని ఆయన కోరారు. దేశంలో కోట్లాది మంది చిరు వ్యాపారులపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు.
యూట్యూబ్ రేటింగ్స్ కోసం సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో, ఒక సెలబ్రిటీ హోదాలో నాగబాబు ముందుకు వచ్చి సాయం చేయడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వలీకి అండగా నిలవడం అంటే కోట్ల మంది చిరు వ్యాపారులకు భరోసా ఇవ్వడమేనని నాగబాబు వ్యాఖ్యానించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
South Coast Railway Zone: ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast Railway - SCoR) ఏర్పాటుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1, 2026ని 'అపాయింటెడ్ డే'గా ప్రకటించి, కొత్త జోన్‌ను కార్యరూపంలోకి తీసుకురావడానికి రైల్వే శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్ పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. మరో ఆరు వారాల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కొత్త జోన్ పరిధిలోకి వచ్చే విభాగాలు
ప్రస్తుతం సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుండి కొన్ని విభాగాలు విడిపోయి విశాఖ జోన్‌లో కలుస్తాయి. విశాఖ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు తూర్పు కోస్తా జోన్‌లోని కొంత భాగం ఇందులో చేరుతుంది. ఇకపై దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే మిగులుతాయి.
ఇందులో కొంత మార్పు ఏంటంటే రాయచూరు-వాడి మధ్య లైన్ సికింద్రాబాద్ జోన్‌లోనే కొనసాగుతుంది. మోటుమర్రి-కొండపల్లి మధ్య ఉన్న 46 కి.మీ మార్గం విజయవాడ డివిజన్‌లోకి వస్తుంది.
రాష్ట్రానికి కలిగే లాభాలు..
కొత్త జోన్ ఏర్పాటు కేవలం పరిపాలనా పరమైన మార్పు మాత్రమే కాదు, ఇది ఏపీ అభివృద్ధికి కీలకం కానుంది. జోన్‌లో ప్రారంభమయ్యే కొత్త రైళ్లుతో ఏపీలోని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మరిన్ని కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
నిర్ణయాధికారాలు స్థానికంగానే ఉండటం వల్ల రైల్వే ప్రాజెక్టులు, లైన్ల విస్తరణ పనులు వేగవంతం అవుతాయి. అంతేకాకుండా కొత్త జోన్ వల్ల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్ట్‌లకు రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల సరుకు రవాణా సామర్థ్యం పెరిగి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది.
ప్రస్తుత పరిస్థితి
విశాఖలో జోన్ కార్యాలయానికి సంబంధించిన భవన నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపు, సాంకేతిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరులోగా కేంద్రం నుంచి అధికారిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావడం ఏపీ ప్రజల విజయంగా భావించవచ్చు. దీనివల్ల రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, పారిశ్రామికంగా కూడా ఏపీ ముందడుగు వేయనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gravton Motors Partnership: స్వదేశీ ఇంజినీరింగ్ సామర్థ్యంతో.. ప్రాక్టికల్ పనితీరుతో సత్తా చాటుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ గ్రావ్టన్ మోటార్స్ ఈషా మహా శివరాత్రి వేడుకలకు అధికారికంగా భాగస్వామిగా ఎంపికైంది. కోయంబత్తూర్‌లోని ఈశా యోగా సెంటర్‌లో జరిగిన మహాశివరాత్రి 2026 వేడుకలకు అధికారిక ఈవీ మొబిలిటీ భాగస్వామిగా గ్రావ్టన్ మోటార్స్ భాగమైంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన రాత్రంతా జరిగిన మహా శివరాత్రి వేడుకలకు ముందు నుంచే వాలంటీర్ల రవాణా అవసరాల కోసం గ్రావ్టన్ క్వాంటా వాహనాల ప్రత్యేక ఫ్లీట్‌ను ఏర్పాటుచేసిందివ. విశాలమైన ఈశా క్యాంపస్‌లో వేలాది మంది వాలంటీర్లు సమర్థవంతమైన, సులభమైన, పర్యావరణహిత ప్రయాణానికి క్వాంటాపై ఈషా యోగా సెంటర్‌కు గ్రావ్టన్ మోటర్స్ ఆధారపడింది.
ఒకే దృక్పథంలో ఉన్న రెండు సంస్థలు ఈ సహకారం కేవలం వాహనాల సరఫరా మాత్రమే కాదు ఇది సుస్థిరతపై రెండు సంస్థల దృక్పథాల కలయికగా మారింది. ఈశా యోగా సెంటర్‌లో ఎద్దుల బండి సేవలు, స్వదేశీ పశువుల పరిరక్షణ వంటి తక్కువ ప్రభావం కలిగిన వ్యవస్థలు సంప్రదాయం, ఆధునికత కలిసి బాధ్యతాయుతంగా ఎలా నడవగలవో చూపిస్తున్నాయి. గ్రావ్టన్ క్వాంటా వాహనం స్వీయంగా అభివృద్ధి చేసిన బీఎల్‌డీసీ మోటార్, ఆధునిక ఎల్‌ఎంఎఫ్‌పీ బ్యాటరీ సాంకేతికతతో భారతీయ రహదారులు, బరువులు, దూరాలను తక్కువ పర్యావరణ ప్రభావంతో ఎదుర్కొనేలా రూపుదిద్దుకుంది.
ఈ రెండు సంస్థలలోనూ ఒకే నమ్మకం ఉంది. నిజమైన ఆవిష్కరణ మనుషులు, జంతువులు, పర్యావరణంతో బాధ్యతతో పని చేస్తున్నాయి. నిజ జీవిత అవసరాలకు ఈవీలు సరిపోనున్నాయి. క్వాంటా ఇప్పటికే కఠినమైన వాస్తవ పరిస్థితుల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. దీర్ఘదూర ప్రయాణాలు, రోజువారీ వ్యవసాయ, గ్రామీణ వినియోగంలో రైతులు దీన్ని విశ్వసనీయ వర్క్‌హార్స్‌గా ఉపయోగిస్తున్నారు. దృఢమైన నిర్మాణం, బరువు మోయగల సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చు ఇవన్నీ కలిసి మహాశివరాత్రి సమయంలో ఈశా యోగా సెంటర్ వంటి విస్తృత ప్రదేశాల్లో ఉపయోగానికి అనుకూలంగా మారుస్తాయి.
ఈ పార్టనర్‌షిప్ లక్ష్యాలు
==> క్యాంపస్‌లో, పరిసర ప్రాంతాల్లో ఇంధన ఆధారిత వాహనాలపై ఆధారాన్ని తగ్గించడం
==> అధిక వినియోగ పరిస్థితుల్లో ఈవీల ప్రాక్టికల్, విస్తృత వినియోగ అవకాశాలను చూపించడం
==> పెద్ద స్థాయి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకల్లో సుస్థిర రవాణా ఎలా సమర్థవంతంగా కలిసిపోగలదో ప్రదర్శించడం
రియల్ స్టోరీస్, రియల్ ఇంపాక్ట్ అనే విధానానికి అనుగుణంగా.. మహాశివరాత్రి ఏర్పాట్ల సమయంలో క్వాంటాను వినియోగించే వాలంటీర్లు, గ్రౌండ్ టీమ్ సభ్యుల అనుభవాలను గ్రావ్టన్ రియల్ ఫార్మర్స్ డాక్యుమెంట్ చేయనుంది. ఈ కంటెంట్ కేవలం వాహన పనితీరును మాత్రమే కాకుండా దేశంలో అత్యంత క్లిష్టమైన, భారీ స్థాయి ఈవెంట్లలో ఒకటైన ఈ వేడుకకు సేవలందిస్తున్న వారి అనుభవాలను కూడా ప్రతిబింబిస్తుంది. తాజా సమాచారం కోసం అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను సందర్శించవచ్చు: www.instagram.com/gravton_motors/
మహాశివరాత్రి తర్వాత
ఈశా-గ్రావ్టన్ భాగస్వామ్యం మహాశివరాత్రి వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా దీర్ఘకాలిక సుస్థిర మొబిలిటీ ప్రయాణానికి ఆరంభంగా భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఈషా, గ్రావ్టన్ సంస్థలకు దృడమైన అనుబంధం ఏర్పడనుంది.
ఈశా-గ్రావ్టన్ భాగస్వామ్యం లక్ష్యాలు
==> పట్టణానికి మాత్రమే కాకుండా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈవీలపై అవగాహన, అంగీకారాన్ని వేగవంతం చేయడం
==> మరిన్ని సంస్థలు, సముదాయాలు శుభ్రమైన రవాణా పరిష్కారాలను అన్వేషించేలా ప్రేరేపించడం
==> ఈవీలు కేవలం నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా సేవకు అనువైన విశ్వసనీయ సాధనాలుగా నిలుస్తాయని ఒక బలమైన కథనాన్ని నిర్మించడం
మీడియా ప్రశ్నలు, భాగస్వామ్యాలు లేదా మహాశివరాత్రి 2026లో గ్రావ్టన్ ఈవీ మొబిలిటీ భాగస్వామ్యంపై మరిన్ని వివరాల కోసం www.gravton.com ను సందర్శించండి లేదా info@gravton.com కు మెయిల్ చేయండి. డీలర్‌షిప్‌కు సంబంధించిన వివరాల కోసం www.gravton.com/dealership/ ను సందర్శించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th Pay Commission Fraud: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న కొత్త వేతన సంఘం మరింత ఆలస్యమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఉద్యోగ వర్గాలు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. జనవరి 2026 నుంచి అమలు కావాల్సిన కొత్త వేతన సంఘం అతీగతీ లేదు. పాలకవర్గం నియమించి తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులను కొందరు అమాయకంగా మోసం చేస్తున్నారు. ఉద్యోగుల ఆశలను తమ పెట్టుబడిగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఏపీకే ఫైల్స్, వాట్సప్ సందేశాలతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: Maha Shivaratri: మహా శివరాత్రి తర్వాతి రోజు ఏం చేయాలి? ఉపవాసం తర్వాతి రోజు ఏం తినాలి?
ఎనిమిదో వేతన సంఘంలో జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పింఛన్‌దారులను సైబర్ నేరస్తులు సులువుగా మోసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. 8వ వేతన సంఘం ప్రకారం జీతం ఎంత పెరుగుతుందో కచ్చితంగా అంచనా (క్యాలికులేట్) వేసి చెబుతామంటూ వాట్సప్‌లో సందేశాలు పంపుతున్నారు. మీకు పెరిగే జీతాన్ని అంచనా వేసి చెబుతామంటూ నేరగాళ్లు వాట్సప్‌లో సందేశం పెడుతూనే.. ‘8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్’, ‘శాలరీ రివిజన్ టూల్’ పేరుతో ఏపీకే ఫైల్స్‌ను జత చేస్తున్నారు.
Also Read: BRS Clean Sweep: బీఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్.. కేసీఆర్‌కు గూడెం మహిపాల్ రెడ్డి గిఫ్ట్
ఆ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడంతో ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించిన వివరాలు అన్నీ సైబర్ నేరస్తులకు చిక్కుతున్నారు. ఏపీకే ఫైల్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. ఫోన్ యజమాని వ్యక్తిగత డేటా, బ్యాంకుల సమాచారం, ఎస్‌ఎంఎస్, ఓటీపీలు అన్నీ కూడా మోసగాళ్లకు చేరిపోతాయి. దీంతో ఉద్యోగులు, పింఛన్‌దారులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి నగదు బదిలీ జరుగుతున్నాయి. తమ అకౌంట్లు ఖాళీ అవుతుండడంతో ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: Mahabubnagar: చరిష్మా లేని రేవంత్ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు అంటే?
8వ వేతన సంఘం పేరిట మోసాలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలా చోట్ల పలు కేసులు నమోదవడంతోపాటు సైబర్ నేరాల నియంత్రణకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వాట్సాప్ ద్వారా ఎలాంటి ఏపీకే ఫైల్స్ పంపదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త సైబర్ స్కామ్‌పై జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతోపాటు పింఛన్‌దారులను ప్రభుత్వం హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IND vs PAK LIVE Updates: టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్‌గా ఉన్న భారత జట్టు వరుస విజయాలతో దూకుడు మీద ఉండగా.. అదే ఉత్సాహంతో పాకిస్థాన్‌తో తలపడింది. కొలంబో వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో తక్కువ పరుగులు చేసి టీమిండియా అందరినీ విస్మయానికి గురిచేసింది. డబుల్ సెంచరీ కూడా సాధించకపోవడంతో భారత్‌పై పాకిస్తాన్ పైచేయి సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.
Also Read: KT Rama Rao: ఎవరు వచ్చినా.. రాకపోయినా సింగరేణి కోసం పోరాడుతాం: కేటీఆర్
పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. భారీ ఇన్నింగ్స్ నిర్మించేందుకు బరిలోకి దిగిన భారత జట్టుకు తొలి ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతుండగా.. నాలుగు బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఒక్క పరుగు సాధించకుండానే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శతకం బాదుతాడని అందరూ లెక్కలు వేసుకుంటున్న సమయంలో ఒక్క పరుగు చేయకుండా ఔటవడం భారత అభిమానులను షాక్‌కు గురిచేసింది. దాన్నుంచి తేరుకున్న ఇషాన్ కిషన్ సంచలన ప్రదర్శన చేశాడు. 44 బంతుల్లో 77 పరుగులు చేశాడు. బాదిన షాట్లన్నీ బౌండరీ లైన్ దాటాయి. మూడు సిక్సర్లు బాదిన ఇషాన్ ఏకంగా పది ఫోర్లు బాది దూకుడుగా ఆడాడు.
Also Read: IND Vs PAK Playing 11: టీ20 వరల్డ్ కప్‌లో హైఓల్టేజ్ ఫైట్.. భారత్ Vs పాక్ తుది జట్లు ఇవే..!
అనంతరం వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నిలకడగా ఆడి 29 బంతుల్లో 32 పరుగులు సాధించగా.. యువ క్రికెటర్ తిలక్ వర్మ 25 పరుగులు చేశాడు. నిలకడగా సాగుతున్న వారి భాగస్వామ్యాన్ని సైమా విడగొట్టాడు. తిలక్ వర్మ తర్వాత మైదానంలోకి వచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తొలి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బాబర్ ఆజమ్‌కు క్యాచ్ ఇచ్చేశాడు. దీంతో భారత అభిమానులు నిర్ఘాంతపోయారు. స్టార్ బ్యాటర్ గోల్డెన్ డకౌట్ అవడంతో భారీ స్కోర్ నమోదవుతుందనుకుంటే ఆశలు సన్నగిల్లాయి.
Also Read: Revanth Reddy: బంజారాలకు తెలంగాణ సీఎం శుభవార్త.. నల్లమలలో సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రం
భారత స్కోర్ నిలకడగా ఆడుతుండగా.. పాకిస్థాన్ బౌలర్లు పొదుపుగా బంతులు వేసి స్కోర్ బోర్డును నియంత్రించారు. శివమ్ దూబే 27 పరుగులు చేసి రనౌట్ అవగా.. రింకూ సింగ్ 11 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ ఆఖరి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి ఔటయ్యాడు. సైమ్ ఆయూబ్ వరుసగా రెండు వికెట్లతో మరో వికెట్ తీయగా.. సల్మాన్, షాహిదీ అఫ్రిది, ఉస్మాన్ తారీఖ్ ఒక్కో వికెట్ తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sevalal Maharaj In Nallamala Forest: నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యద్భుతంగా పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 'తెలంగాణలోని అన్ని తండాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలి. దీనికోసం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలి' అని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. కనెక్టివిటీ కోసం బీటీ రోడ్డుతో పాటు ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాల, పంచాయతీ భవనం ఉండాలని తెలిపారు.
Also Read: Mahabubnagar: చరిష్మా లేని రేవంత్ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు అంటే?
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 'ఆదివాసీలకు ఆదిలాబాద్‌లో నాగోబా దేవాలయం, మేడారంలో సమ్మక్క - సారలమ్మ పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజారాలకు ప్రత్యేక క్షేత్రం లేదు. దీనికోసం నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించడంతో అక్కడ బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా, గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి' అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Also Read: KT Rama Rao: ఎవరు వచ్చినా.. రాకపోయినా సింగరేణి కోసం పోరాడుతాం: కేటీఆర్
'మానవజాతి శాంతి మార్గంలో చెడును విడిచి, భక్తితో సన్మార్గంలో నడవాలని బోధించిన సంత్ సేవాలాల్ దేశంలో 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, పునర్నిర్మాణంలో లంబాడా సోదరుల పాత్ర ఎవరూ మరువలేనిది. వారికి సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంలో సముచిత స్థానం, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది' అని తెలంగాణ సీఎం గుర్తుచేశారు. 'ప్రతి తండాలో పాఠశాల భవనం, పంచాయతీ భవన నిర్మాణానికి స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలి. తాగునీరు, విద్యుత్ అందించాలి. అటవీ ప్రాంతాల్లో ఉండే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కరెంట్ లేని చోట సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ గిరిజనులకు ప్రాధాన్యతనిస్తున్నాం' అని ముఖ్యమంత్రి తెలిపారు.
Also Read: Maha Shivaratri: మహా శివరాత్రి తర్వాతి రోజు ఏం చేయాలి? ఉపవాసం తర్వాతి రోజు ఏం తినాలి?
'తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తోంది. పేదలకు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవు. చదువు లేని కారణంగా చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారు. అందుకే నిరుపేదలు చదువుకోవడానికి కావలసిన అన్ని వసతులు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది' అని తెలంగాణ సీఎం వివరించారు. నిర్దిష్టమైన ప్రణాళికలతో కష్టపడి చదువుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sant Sevalal Maharaj Jayanthi: సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కొత్తగూడెంలో బీఆర్ఎస్ తన మద్దతు సీపీఐకి ప్రకటించిందని వెల్లడించారు. 'సింగరేణి దోచుకుంటున్న కాంగ్రెస్‌ను ఆపేందుకే సీపీఐకి మద్దతు ఇస్తామని చెప్పాం. కానీ వారిపై ఏమి ఒత్తిడి ఉందో తెలియదు. పొత్తుకు ఎందుకు ఒప్పుకుందో వాళ్లకే తెలియాలి' అని తెలిపారు.
Also Read: 8th Pay Commission: 8వ వేతన సంఘంపై సైబర్ మోసం.. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ అలర్ట్
హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. వాటిలో పాల్గొన్న అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాలు, మున్సిపల్ రాజకీయ పరిస్థితులపై స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి సింగరేణి దోపిడీలో భాగస్వాములై సంస్థను నష్టపరిచేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సీపీఐ, కాంగ్రెస్ ఇప్పటికే పొత్తులో ఉన్నాయని కొత్తగూడెంలో మేయర్ పదవి పంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని పేర్కొన్నారు. ఏఐటీయూసీ వంటి సీపీఐకి అనుబంధ సంస్థ కూడా ఈ పొత్తును ఎందుకు అంగీకరించిందో తెలియదని.. దాని వెనుక ఏ ఒత్తిళ్లు పని చేశాయో తాను చెప్పలేనని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read: Maha Shivaratri: మహా శివరాత్రి తర్వాతి రోజు ఏం చేయాలి? ఉపవాసం తర్వాతి రోజు ఏం తినాలి?
'ఎవరూ కలిసి వచ్చినా.. రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కుల కోసం గతంలో ఎట్లా పోరాడామో భవిష్యత్తులో కూడా అలాగే పోరాడుతాం' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 'రాష్ట్రంలో దాదాపు 34 చోట్ల హంగ్ పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, ప్రలోభపెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపించడం, గుండాలను ఉపయోగించడం వంటి చర్యలు జరుగుతున్నాయి' అని కాంగ్రెస్ దౌర్జన్యాలు కేటీఆర్ వివరించారు.
Also Read: BRS Clean Sweep: బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్.. కేసీఆర్‌కు గూడెం మహిపాల్ రెడ్డి గిఫ్ట్
'మా తండాల్లో మా రాజ్యం ఉండాలి అనేన నినాదాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యరూపంలోకి తీసుకువచ్చి గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేశారు. గిరిజన గూడాలు, కోయ గూడాలు, లంబాడా తండాలకు ప్రాధాన్యం ఇస్తూ 3,146 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారు. వేలాది గిరిజన యువతకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా అవకాశాలు కల్పించారు. దాదాపు 30 వేల మంది వార్డు సభ్యులు గిరిజన వర్గాల నుంచి ఎదిగారు. ఇదంతా కేసీఆర్ కృషితోనే సాధ్యమైంది' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
Also Read: Mahabubnagar: చరిష్మా లేని రేవంత్ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు అంటే?
'ఒకే రోజు సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల భూమి హక్కులను రక్షించింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కొమురం భీమ్ నాయకత్వంలో జరిగిన జల్, జంగల్, జమీన్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ అడవులు, భూములు, నీళ్ల విషయంలో న్యాయం చేస్తూ గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాం' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
గిరిజన పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కాలేజీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అని ప్రకటించారు.
రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి గిరిజన యువతకు మెరుగైన అవకాశాలు కల్పించామని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 'గిరిజన యువతకు ప్రభుత్వ సబ్సిడీలు, వడ్డీ లేని రుణాలు అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాం. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు కూడా అందించి ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇచ్చాం. బంజారాహిల్స్‌లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణం ద్వారా గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని, రాష్ట్రవ్యాప్తంగా సేవాలాల్ భవనాల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేశాం' అని కేటీఆర్ వివరించారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక గిరిజనులకు అండగా నిలబడతామని మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Poco C81 Pro Price Cut: చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో త్వరలో మార్కెట్లోకి తమ కొత్త సిరీస్ మొబైల్ విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ సీసీరీస్లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది పోకో c81 ప్రో పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది పోకో సి85 తేడాది డిసెంబర్‌లో భారత్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి అప్డేటెడ్ వెర్షన్‌లోనే ఈ కొత్త మొబైల్ సిరీస్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పోకో C81 ప్రో స్మార్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో లీకై విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. దీనిని కంపెనీ 25128PC17G మోడల్ నెంబర్‌తో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.. ఈ స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన Unisoc T7250 ప్రాసెసర్‌వై రన్ అవుతుంది. అంతేకాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న Poco C85 5G స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ ఎంతో ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల LCD ప్యానెల్ డిస్ప్లే ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన 6,000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కోసం కంపెనీ 15W చార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. దీంతోపాటు Android 15 ఆధారంగా HyperOS 3 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే త్వరలో విడుదల కాబోయే సిరీస్.. Redmi A7 Pro రీబ్రాండెడ్ వెర్షన్‌గా విడుదల అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ Poco C81 Pro స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే అదనంగా మరో కెమెరాను కలిగి ఉండబోతోంది. ఇక ఫ్రంట్ భాగంలో వీడియో కాలింగ్ కోసం.. కంపెనీ ఇందులో 8-మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందించింది. అయితే, ఇప్పటికి పోకో సి85 మాత్రమే అందుబాటులో ఉంది.. అతి త్వరలోనే పోకో కంపెనీ పోకో ఎక్స్ 8 ప్రో మాక్స్‌తో పాటు ఎక్స్ 8 ప్రోను కూడా విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిని ముందుగా చైనాలో విడుదల చేసి ఆ తర్వాత భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook