Snake Repellent Plants: వేసవి కాలం మొదలైందంటే చాలు.. ఎండ వేడికి తట్టుకోలేక పాములు తమ బొరియల నుండి బయటకు వచ్చి చల్లటి ప్రదేశాల కోసం వెతుకుతుంటాయి. ఈ క్రమంలో అవి మన ఇళ్లలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అయితే, ఎటువంటి రసాయనాలు వాడకుండా, కేవలం కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా పాములను మన దరిదాపుల్లోకి రాకుండా చేయవచ్చు.
ప్రకృతి మనకు ప్రసాదించిన కొన్ని మొక్కలకు పాములను తరిమికొట్టే శక్తి ఉంది. వీటిలో అత్యంత శక్తివంతమైనది సర్పగంధ. ఈ మొక్కలు వెదజల్లే ఘాటైన వాసన సరీసృపాలకు అస్సలు పడదు.
సర్పగంధ
పాములను నిరోధించడంలో ఈ మొక్క అగ్రస్థానంలో ఉంటుంది. ఈ మొక్క ఆకులు, వేర్లు మిరియాల వంటి ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. పాములు ఈ వాసనను తట్టుకోలేక ఆ ప్రాంతం నుండి దూరంగా వెళ్లిపోతాయి. దీని వేర్లు, గింజలలో రెసర్పైన్, సర్పెంటైన్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి పాముల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి, అందుకే అవి ఈ మొక్క దరిదాపుల్లోకి రావడానికి భయపడతాయి. ఈ మొక్క వేళ్లను కిటికీలు లేదా తలుపుల దగ్గర కడితే పాములు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు.
నిమ్మగడ్డి
నిమ్మగడ్డి నుండి వచ్చే సిట్రస్ వాసన మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ పాములకు మాత్రం అది తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇంటి చుట్టూ కంచెలా నిమ్మగడ్డిని పెంచడం వల్ల పాముల బెడద తప్పుతుంది.
తులసి, బంతి పువ్వులు..
మన పెరట్లో సాధారణంగా పెంచే మొక్కలు కూడా పాములను అడ్డుకుంటాయి. బంతి పూల వేర్లు, ఆకుల నుండి వచ్చే ఒక రకమైన ఘాటైన వాసన సరీసృపాలకు నచ్చదు. అలాగే తులసి మొక్క నుండి వెలువడే ఔషధ గుణాలు కలిగిన వాసన కీటకాలతో పాటు పాములను కూడా దూరంగా ఉంచుతుంది.
రసాయనాలతో కూడిన స్ప్రేలు వాడటం కంటే, ఇలాంటి సహజసిద్ధమైన మొక్కలను కుండీల్లో లేదా పెరట్లో పెంచడం వల్ల మీ ఇల్లు సురక్షితంగా ఉండటమే కాకుండా పచ్చదనంతో కళకళలాడుతుంది. వేసవిలో పాముల భయం లేకుండా ఉండాలంటే ఇప్పుడే మీ ఇంట్లో ఒక సర్పగంధ మొక్కను నాటండి!
Also REad: AP Mission vatsalya scheme: ఏపీ ప్రభుత్వం తీపి కబురు..నెలనెలా వారి అకౌంట్లోకి రూ.1,750..అర్హతలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Janhvi Kapoor On Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చాటుకున్న మానవత్వంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్నారిని కాపాడేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక 'SMA టైప్-1' అనే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన జన్యు వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి సోకిన పిల్లల కండరాలు బలహీనపడి, శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ చిన్నారి ప్రాణం నిలవాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'జోల్గెన్స్మా' అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, దీని ధర అక్షరాలా రూ.16 కోట్లు.
మానవత్వం చాటుకున్న దాతలు, మంత్రి
అంత భారీ మొత్తాన్ని భరించే స్తోమత లేని ఆ చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయం కోరారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన అనేక మంది దాత
లు సుమారు రూ.10 కోట్ల వరకు విరాళాలు అందించారు.
ఇంకా రూ.6 కోట్లు తక్కువ కావడంతో, విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మిగిలిన రూ.6 కోట్లు అందేలా చూసే బాధ్యత తనదేనని ఆయన ట్విట్టర్ (X) వేదికగా హామీ ఇచ్చారు. "చిన్నారి పునర్విక చేస్తున్న పోరాటం అభినందనీయం.. ఆమెకు మేమున్నామంటూ" ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.
ప్రశంసించిన జాన్వీ కపూర్
మంత్రి లోకేశ్ స్పందించిన తీరుపై బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్పందించారు. లోకేశ్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. "మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఇది నిజంగా ప్రశంసనీయమైన కార్యం" అంటూ కొనియాడారు.
జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒక చిన్నారి ప్రాణం కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావడం, ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి లోకేశ్ తీసుకున్న చొరవపై నెటిజన్లు సైతం "రియల్ హీరో" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
Also Read: AP Mission vatsalya scheme: ఏపీ ప్రభుత్వం తీపి కబురు..నెలనెలా వారి అకౌంట్లోకి రూ.1,750..అర్హతలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Venus Transit 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని సంపదతో పాటు ప్రేమ, వివాహం, విలాసవంతం, ఆనందం, ఐశ్వర్యానికి సూచికగా చెప్పుకుంటారు. శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే జీవితంలో సంతోషం విపరీతంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉండవు.. అలాగే బ్యాంకు బాలన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అందుకే ఈ గ్రహాన్ని అత్యంత శుభగ్రహంగా పరిగణిస్తారు. ఇంత ప్రత్యేకత కలిగిన శుక్రుడు మార్చి 2 తెల్లవారుజామున ఒకటి గంటలకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 26వ తేదీ వరకు కూడా అదే రాశిలో సంచార దశలో ఉంటాడు. దీనివల్ల ఎంతో ప్రత్యేకమైన మాలవ్య రాజయోగం ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో మూడు రాశుల వారికి ఆదాయ వనరులతో పాటు లగ్జరీ లైఫ్ లభిస్తుంది. దీంతో పాటు పెద్ద మొత్తంలో కొత్త కొత్త బాధ్యతలు కూడా పొందగలుగుతారు. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అయితే ఇంతటి ప్రత్యేకత కలిగిన శుక్రుడు వల్ల ఏ రాశుల వారు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశుల వారికి ఊహించని జాక్పాట్..
మేషరాశి
ముఖ్యంగా మేష రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. మార్చి రెండవ తేదీ నుంచి వీరికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే డబ్బులపరమైన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఎంతో సులభంగా పూర్తి అవుతాయి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. విదేశాల్లో కూడా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమతో పాటు వైవాహిక జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. జీవితంలో ఊహించని స్థాయిలో ముందుకు వెళ్తారు. అలాగే ఆందోళన చెందకుండా ధైర్యంతో ఇతరులపై పై చేయి సాధిస్తారు..
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ సమయం చాలా ఉత్తమంగా ఉండబోతోంది. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉన్నత పొజిషన్స్‌లో ఉన్న వ్యక్తులకు కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే నాణ్యతతో కూడిన స్కిల్స్ నేర్చుకుంటారు. ముఖ్యంగా టీం లీడర్ చేసే వ్యక్తులందరికీ ఎంతో కొంత లాభం చేకూరుతుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతోంది. చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితంలో ఊహించని స్థాయిలో ఫలితాలు పొందగలుగుతారు. అంతేకాకుండా గతంలో పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆకస్మికంగా ఊహించని స్థాయిలో డబ్బులు లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ఇక ఈ సమయంలో భారీ మొత్తంలో ఆస్తులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు మనసు ఆధ్యాత్మికతవైపు వెళుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శాంతి విపరీతంగా పెరగడమే కాకుండా.. కుటుంబ సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ రాశి వారికి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pakistan And Afghanistan War Telugu: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తాళిబండ్ల నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్ దళాలకు.. పాక్ సైన్యానికి మధ్య వరుసగా కాల్పులు జరుగుతున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అయితే, ఈ సరిహద్దు ఘర్షణలు కేవలం భద్రతాపరమైన అంశాలే కాకుండా.. ఇప్పుడు పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో కూడా ఊహించని మార్పులకు సంకేతంగా మారుతున్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ఈ పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పట్టును మరింత బలపరుస్తున్నాయని.. అలాగే ఈ సమయంలోనే ఇస్లామాబాదులోని ఎన్నికైన ప్రభుత్వాన్ని నామమాత్రంగా మారుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రతిసారి పాకిస్తాన్లో సైన్యం పాత్ర కీలకంగా మారుతూ వస్తుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జాతీయ భద్రత పేరుతో జనరల్ అసిమ్ మునీర్ ఒక ప్రత్యేకమైన నిర్ణయాత్మక శక్తిగా మారారు. విదేశీ వ్యవహారాల నుంచి రక్షణ వ్యూహాల వరకు అన్ని సైన్యం అడుగుతోనే ముందుకు వెళుతున్నాయి. ఇది చూస్తుంటే మునీర్ కు సైనిక దళాల పైనే కాకుండా దేశ పరిపాలనపై కూడా తిరుగులేని పట్టు లభించిందని స్పష్టంగా అర్థమవుతుంది.
మరోవైపు ఇస్లామాబాదులోని ఎన్నికైన నాయకత్వం ఈ పరిణామాల వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తెలిసినప్పటికీ.. సరిహద్దు ఘర్షణలు అదుపు చేయడానికి కానీ.. ఆఫ్ఘనిస్తాన్తో చర్చలు జరపడం వంటి అంశాలపై ప్రభుత్వానికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా పోయింది.. సైన్యం తీసుకునే నిర్ణయాలకు కేవలం ఆమోదం ముద్ర వేయడానికి ప్రభుత్వం పరిమితమవుతోంది. దీని కారణంగా ప్రజల్లో ఎన్నికైన నేతల పట్ల నమ్మకం సన్నగిల్లి.. దేశం మరోసారి పరోక్ష సైనిక పాలనలోకి వెళ్లే ప్రమాదం కనిపిస్తూ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఒకప్పుడు ఆఫ్గానిస్తాన్ తాలిబన్లకు వెన్నుదన్నుగా పాకిస్తాన్ సైన్యం నిలిచేది.. ఇప్పుడు వారే ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారారు.. సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు ఇరుదేశాల మధ్య తీవ్ర విభేదాలను పెంచుతున్నాయి. ఈ అశాంతి సాకుగా చూపి... విపక్షాలను అణిచివేయడానికి.. పౌర హక్కులను సైన్యం కాలరాయడానికి ప్రయత్నిస్తోందని కొంతమంది అంతర్జాతీయ పరిశీలకులు కూడా ఈ అంశాలపై విశ్లేషిస్తున్నారు. మొత్తానికి పాక్ ఆఫ్గాన్ సరిహద్దు ఘర్షణలు జనరల్ ఆ సి మునీర్ అధికారాన్ని స్థిరపరచడమే కాకుండా.. పాకిస్తాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలహీనపరిచే దిశగా ముందుకు సాగుతోందని స్పష్టమవుతోంది.
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
AP Mission vatsalya scheme: ఏపీ ప్రభుత్వం తీపి కబురు..నెలనెలా వారి అకౌంట్లోకి రూ.1,750..అర్హతలు ఇవే!
Mission Vatsalya Scheme in AP: ఆంధ్రప్రదేశ్‌లోని అనాథ, నిరాశ్రయులైన పిల్లలకు ప్రభుత్వం గొప్ప ఊరటనిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న 'మిషన్ వాత్సల్య' పథకం కింద అర్హులైన పిల్లలకు నెలకు రూ.1,750 వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ గురించి ఇక్కడ తెలుసుకోండి.
నిరాశ్రయులైన పిల్లల చదువు, సంరక్షణ బాధ్యతలను స్వీకరించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ ద్వారా ఈ నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.
కోర్సుల వారీగా లభించే సాయం..
విద్యార్థులు చదివే చదువును బట్టి ప్రభుత్వం అందించే నెలవారీ భృతి మారుతుంటుంది. పాఠశాల విద్య (10వ తరగతి వరకు) ఐటీఐ, డిప్లోమా చదివే విద్యార్థులకు నెలకు రూ.1,250.. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి నెలకు రూ.1,500.. ప్రొఫెషనల్ కోర్సులు (మెడికల్, ఇంజినీరింగ్ మొదలైనవి) చేసే విద్యార్థులకు నెలకు రూ.1,750.. చదువు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే ఈ ఆర్థిక సాయం అందుతుంది.
ఎవరు అర్హులు?
ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే కింది నిబంధనలు పాటించాలి. తీవ్రవాద హింస, సరిహద్దు కాల్పులు లేదా అంతర్గత అల్లర్ల కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థలో తప్పనిసరిగా చదువుతూ ఉండాలి. పిల్లలు నిరాశ్రయులు లేదా అనాథలని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలాలి.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
అర్హులైన వారు కింది పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా స్థానిక ఎమ్మార్వో (MRO) లేదా ఎంపీడీవో (MPDO) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత గ్రామ/వార్డు సచివాలయ అధికారులు మీ ఇంటికి వచ్చి పరిశీలన జరుపుతారు. అధికారులు నివేదిక సమర్పించిన తర్వాత మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
కావాల్సిన పత్రాలు..
1) అనాథ ధృవీకరణ పత్రం (Orphan Certificate).
2) ఆధార్ కార్డు.
3) బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్.
4) ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate).
5) విద్యాసంస్థ జారీ చేసిన బోనఫైడ్ సర్టిఫికేట్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
King Cobra Snake Meeting: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో నాగుపాముతో ఒక సభ్యుడు నిరసన తెలపడం కలకలం రేపింది. నిడదవోలు పట్టణంలోని 20వ వార్డులో తరచుగా ఇళ్లలోకి, కాలనీల్లోకి పాములు ప్రవేశిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. పాముల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు స్పందించరా? అంటూ నిలదీస్తూ అతడు మీటింగ్‌లోకి నాగుపామును తీసుకొచ్చాడు. ఈ సంఘటన వైరల్‌గా మారింది.
Also Read: KTR On Kavitha: లిక్కర్ స్కామ్‌లో చెల్లెమ్మ కవితకు న్యాయం జరిగింది.. కేటీఆర్ హర్షం
తమ వార్డులో పాములు సంచరిస్తుండడంతో.. ప్రజలు ప్రాణభయంతో ఉన్నారని.. సమస్యను ఆరు నెలలుగా చెబుతున్నా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల కష్టాలు వివరించేలా నాగుపామును డబ్బాలోకి తీసుకొచ్చారు. తాచు పాము ఉన్న డబ్బాను సమావేశానికి తీసుకొచ్చిన తన వార్డులోని కష్టాలను అనిల్ కుమార్ కళ్లకు కట్టేలా వివరించారు.
Also Read: YSRCP MLCs Dharna: ఏపీ శాసనమండలిలో రచ్చరచ్చ.. తిరుమల వివాదంపై వైఎస్సార్‌సీపీ ధర్నా
సమావేశంలో కూర్చున్న తన చైర్ పక్కనే నాగుపాము డబ్బాను ఉంచుకున్నారు. పాముని చూసిన ఇతర సభ్యులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి చర్యలు సరైనవి కాదని చైర్మన్ భూపతి ఆదినారాయణ చెప్పడంతో సిబ్బంది పామును బయటకు తరలించారు. తమ వార్డులో ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోయి పాముల బెదడ తీవ్రంగా ఉందని ఎన్నిసార్లు చెప్పినా శుభ్రం చేయించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అనిల్ కుమార్ తెలిపారు. పాముల భయం ఎలా ఉంటుందో స్వయంగా చూపించడానికి తాను ఇలా పామును మీటింగ్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారుల హామీ ఇవ్వడంతో పాము రగడ సద్దుమణిగింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన మున్సిపాలిటీ మెజారిటీ సభ్యులు పార్టీ మారడంతో ప్రస్తుతం జనసేన ఖాతాలో నిడదవోలు మున్సిపాలిటీ ఉంది. ప్రస్తుతం మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి మంత్రి సొంత నియోజకవర్గంలో ఇలా సమస్య ఉండడం తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రిగా ఉన్నా కూడా నిడదవోలు అభివృద్ధి చెందడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hair Whorl Significance: మన పెద్దలు తరచుగా "తల మీద రెండు సుడులు (గుండ్లు) ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయి" అని సరదాగా లేదా భయపెడుతూ అనడం మనం వినే ఉంటాం. సాముద్రిక శాస్త్రం ప్రకారం తల మీద ఉండే ఈ సుడులు ఒక వ్యక్తి స్వభావం, భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.
సాముద్రిక శాస్త్రం ప్రకారం మనిషి శరీర నిర్మాణం, పుట్టుమచ్చలు, తల మీద ఉండే సుడుల ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. తల మీద ఉండే ఈ వృత్తాకార సుడులు ఆ వ్యక్తి ప్రేమ జీవితం, కెరీర్, ఆరోగ్య స్థితిగతులను సూచిస్తాయి.
తల మధ్యలో ఒకే సుడి ఉంటే..
సాముద్రిక శాస్త్రం ప్రకారం.. తల మధ్యలో ఒకే సుడి ఉన్నవారు చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వీరు చాలా దయగలవారు, ప్రశాంతంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోరు. ఏ నిర్ణయమైనా ఆచి తూచి తీసుకుంటారు, కాబట్టి వీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సఫలమవుతాయి.
తలపై ఒక వైపు సుడి ఉంటే
తల మీద ఒక పక్కగా సుడి ఉన్నవారు అత్యంత నమ్మకస్తులు. వీరికి ఏదైనా పని అప్పగిస్తే పూర్తి బాధ్యతతో పూర్తి చేస్తారు. స్నేహమైనా, ప్రేమయినా చాలా నిజాయితీగా ఉంటారు. అవతలి వారిని మోసం చేయాలనే ఆలోచన వీరికి ఉండదు.
రెండు సుడులు ఉంటే అశుభమా?
సాముద్రిక శాస్త్రం ప్రకారం తలపై రెండు సుడులు ఉండటం అంత శుభప్రదంగా పరిగణించరు. ఇలాంటి వారు కొంచెం మొండి స్వభావం కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటారు. వీరి మనసు ఒకచోట స్థిరంగా ఉండదు. దీనివల్ల వృత్తి జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం లోపించవచ్చు.
రెండు వివాహాలు జరుగుతాయనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే అయినప్పటికీ, వీరి చంచల మనస్తత్వం వల్ల వైవాహిక జీవితంలో తరచుగా విభేదాలు లేదా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
చిన్న చిన్న సుడులు లేదా మచ్చలు
తల మీద చాలా చిన్న మచ్చలు లేదా సుడులు ఉన్నవారు మానసికంగ చాలా చురుగ్గా ఉంటారు. వీరి మెదడు చాలా పదునైనది. కెరీర్‌లో త్వరగా విజయం సాధిస్తారు. వీరు మనసులో స్వచ్ఛంగా ఉన్నప్పటికీ, తరచుగా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల వీరు ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు.
(ముఖ్య గమనిక: పైన పేర్కొన్న విషయాలు సాముద్రిక శాస్త్రం, లోకంలో ఉన్న నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయి. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఒక వ్యక్తి భవిష్యత్తు అనేది వారి ప్రవర్తన, కష్టపడే తత్వంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Bhavan: 'ప్రజల విశ్వాసం గులాబీ జెండాపైనే.. నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రానికి కావాలి. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగురుతుంది' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి అరాచకమే జోడెడ్లుగా రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు.
Also Read: KTR On Kavitha: లిక్కర్ స్కామ్‌లో చెల్లెమ్మ కవితకు న్యాయం జరిగింది.. కేటీఆర్ హర్షం
అలంపూర్ నియోజకవర్గ నూతన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లను పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో శుక్రవారం సన్మానించారు. ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామి రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడుతో కలిసి సన్మానించిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. ఆలంపూర్, అయిజ, గద్వాల, వడ్డేపల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు అందించిన మద్దతు విశేషమని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నడిగడ్డలో మాత్రం ప్రజల విశ్వాసం ఇప్పటికీ బీఆర్ఎస్‌పైనే ఉందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. సర్పంచ్ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం పార్టీ బలాన్ని నిరూపిస్తోందని వెల్లడించారు.
Also Read: Pension Hike: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో వరం.. త్వరలో పింఛన్ల పెంపు?
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 'నాగర్‌కర్నూల్‌లో రెండు నెలల పాప మరణ ఘటన, కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ వంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు ప్రజలను రోడ్డున పడేసిన దారుణ చర్యలు' అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెడ్లలా ముందుకు సాగాయని తెలిపారు. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో అవినీతి, అరాచకం జోడెడ్లుగా మారాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
Also Read: Salary Cut: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం హెచ్చరిక.. జీతంలో 10- 15 శాతం కట్
'చెక్ డ్యామ్‌లు పేల్చడం, పల్లె ప్రకృతి వనాల్లో చెట్ల నరుకులు వంటి చర్యలు రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. రైతు బంధు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో రైతులను తీవ్రంగా నిరాశపరిచింది' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 'ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ నిజ స్వరూపం అర్థమైంది. నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం వ్యాపించాలి' అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి ప్రజల సమస్యలపై అంకితభావంతో పనిచేసే నాయకుడని, ఎమ్మెల్యే విజయుడు కూడా అదే తత్వాన్ని కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తుందని ముందుగానే హెచ్చరించిన కేటీఆర్, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోసారి కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Miracle Babies: 6 కోట్లలో ఒకరికి జరిగే అద్భుతం.. ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చిన 24 ఏళ్ల మహిళ..
Miracle Babies Latest Telugu News: చైనాలో వైద్యరంగంలోని అరుదైన ఘటన చోటుచేసుకుంది.. ఓ యూనివర్సిటీ హాస్పిటల్లో షిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల దిలి (Dilie) అనే మహిళ ఒకేసారి ఐదుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. ఈ ప్రసవానికి చైనాలోని ప్రముఖ వుహాన్ యూనివర్సిటీ ఆసుపత్రి వేదిక ఆపడం విశేషం.. అయితే, ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయని అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం కొంతమందిలో మాత్రమే ఇలా అయిదుగురు బిడ్డలకు జన్మనిచ్చే సామర్థ్యం కలిగి ఉంటారని వారు అంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా కవలలు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ సహజ సిద్ధంగా ఐదుగురు బిడ్డలు జన్మించడం అనేది అత్యంత అరుదని వైద్యులు చెబుతున్నారు. వైద్య శాస్త్రాన్ని పునులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎటువంటి కృత్రిమ పద్ధతులు లేకుండా ఇలా ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం ఆరుకోట్ల ప్రసవాల్లో కేవలం ఒక్కరికి మాత్రమే ఉంటుందని తెలిపారు. తమ నలభై ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇటువంటి అరుదైన ప్రసవం చేయడం ఇదే తొలిసారి అని.. కొంతమంది వైద్య నిపుణులు సంతోషం వ్యక్తం చేశారు..
ఈ క్లిష్టమైన ప్రసవాన్ని విజయవంతం చేసేందుకు సుమారు 20 మందికి పైగా వైద్య నిపుణులతో పాటు నర్సులు శ్రమించాల్సి వచ్చిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దిలీకి పుట్టిన ఐదుగురు బిడ్డలు నలుగురు అమ్మాయిలతో పాటు ఒక అబ్బాయి ఉన్నట్లు వారు వెల్లడించారు. పుట్టిన ఈ బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారని. ప్రస్తుతం వారి అనారోగ్యాన్ని నిరంతరం పర్యావేక్షిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాధారణంగా ముగ్గురు నుంచి అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కడుపులో ఉండడంవల్ల గర్భిణీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు గురవాల్సి వస్తుంది. ముఖ్యంగా వీరిలో రక్తపోటుతో పాటు శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి.. ముందస్తు ప్రణాళికలతో వైద్య బృందం ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆ ఐదుగురు చిన్నారులకు మిరాకిల్ బేబీస్ అని పేర్లు కూడా పెడుతున్నారు..
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Realme Narzo Power 5G Launches India March 5: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ వచ్చే నెలలో భారత్ మార్కెట్‌లోకి మరో అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది ఎంతో శక్తివంతమైన జంబో బ్యాటరీతో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని కంపెనీ 10,001 mAh బ్యాటరీతో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌మే P4 పవర్ 5G పేరుతో విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ప్రాసెసర్‌తో పాటు ఎంతో శక్తివంతమైన కెమెరా సెటప్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తమ Realme Narzo Power 5G మొబైల్‌ను మార్చి 5వ తేదీన భారతదేశంలో విడుదల చేయబోతున్నట్లు తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన ఫీచర్స్‌ను కూడా షేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 10,001 mAh బ్యాటరీ కలిగి ఉండబోతుంది. అంతేకాకుండా ఈ మొబైల్ 38 గంటల పాటు స్టాండ్ బైతో పాటు 185 గంటలకు పైగా మ్యూజిక్ ప్లే బ్యాక్‌ను అందిస్తుంది. యూట్యూబ్ వీడియోలు చూస్తే.. దాదాపు 32 గంటల పాటు ప్లే బ్యాక్ అందిస్తున్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది. అలాగే 72 గంటలకు పైగా కాలింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తున్నట్లు తెలిపింది.
ఇక ఈ Realme Narzo Power 5G స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ చార్జింగ్ కోసం ఇందులో కంపెనీ 27 W వైర్డ్ ఛార్జింగ్, 27 W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టును అందిస్తుంది. అంతేకాకుండా కేవలం 36 నిమిషాల్లో మాత్రమే 50 శాతం వరకు చార్జ్ చేస్తుంది. అలాగే ఇది వివిధ రంగుల్లో మార్కెట్లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో పాటు హైపర్‌విజన్ ప్లస్ AI చిప్‌పై రన్ కాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇది 6.78-అంగుళాల హైపర్‌గ్లో 4D కర్వ్ ప్లస్ డిస్ప్లేతో విడుదల కాబోతోంది. ఈ మొబైల్ అద్భుతమైన ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రియల్‌మే UI 7.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
రియల్‌మీ నార్జో పవర్ 5G (Realme Narzo Power 5G) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళితే.. ఇది చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్ని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఇది ప్రత్యేకమైన ఫోర్ కే రికార్డుకు సపోర్ట్ అందిస్తుంది. దీంతో పాటు AI హైపర్ క్లారిటీ, AI హైపర్ మోషన్, AI ఆల్వేస్-ఆన్ HDR, AI స్మార్ట్ రిప్లై, AI స్టైల్‌మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మూడు సంవత్సరాల వరకు కంపెనీ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రత్యేకమైన కొత్త ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Delhi Liquor Scam: మద్యం కుంభకోణం సాకుతో దేశంలో ప్రధానంగా కొట్లాడుతున్న రాజకీయ పార్టీలు, నాయకులను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆ ప్రయత్నాలతో బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయిందని గుర్తుచేశారు. ఇదే విధంగా తమ నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా ఒక అబద్ధమని ప్రకటించారు. చివరికి సత్యమే గెలుస్తుందని తెలిపారు. కానీ ఆరోపణలకు ప్రాధాన్యమిస్తూ.. న్యాయ ప్రక్రియ కంటే మీడియా ధోరణితో తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని తెలిపారు.
Also Read: Pension Hike: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో వరం.. త్వరలో పింఛన్ల పెంపు?
మద్యం కుంభకోణంలో కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'మద్యం కుంభకోణం అనే సాకుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ (AAP) ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసుతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం భారత రాష్ట్ర సమితి పార్టీ. కవితకి ఈరోజు కోర్టులో న్యాయం జరిగింది' అని కేటీఆర్ ప్రకటించారు. 'ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని, కల్పితమని త్వరలోనే తేలిపోతుంది' అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Salary Cut: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం హెచ్చరిక.. జీతంలో 10- 15 శాతం కట్
'సత్యం గెలిచే వరకు, కాంగ్రెస్, బీజేపీలు చేసే బాధ్యతారహితమైన ఆరోపణలను మనం చూశాం. అసత్యపూరిత.. కుట్రపూరిత కేసులను ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు' అని బీజేపీ, కాంగ్రెస్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దురదృష్టవశాత్తూ సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యమిస్తూ.. న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ నవ భారతంలో అలవాటుగా మారిపోయింది' అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ చివరికి, న్యాయమే గెలుస్తుంది అని ప్రకటించారు.
మద్యం కుంభకోణంలో జైలులో గడిపిన చెల్లెమ్మ కవిత కూడా బయటపడడంతో కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కవితకు న్యాయం జరిగిందని ప్రత్యేకంగా గుర్తుచేశారు. కవిత కేసు నుంచి బయటపడడంతో కేసీఆర్ కుటుంబం పూర్తి సంతోషంలో ఉంది. రాజకీయంగా వేధించడంలో భాగంగా కవితను ఇరికించారని మొదటి నుంచి కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ చెబుతోంది. చెబుతున్నట్టుగానే కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. మరి తండ్రిపై తీవ్ర విమర్శలు చేసిన కవిత ఇప్పుడు కేసు నుంచి బయటపడడంతో రాజకీయంగా పునరాలోచన చేస్తారా? లేదా? అనేది ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుపైనే తండ్రి, బీఆర్‌ఎస్ పార్టీతో కవిత విభేదించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Planetary Parade 2026 Telugu News: రేపు సాయంత్రం ఆకాశంలో మహా అద్భుతం జరగబోతోంది. ఎన్నో గ్రహాల అరుదైన కదలికల దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. విశ్వంలో జరిగే అరుదైన ఖగోళ సంఘటనల్లో ఒకటైన ప్లానెటరీ పరేడ్ ఫిబ్రవరి 28వ తేదీన సంభవించబోతోంది. ఈ అద్భుతమైన ఘట్టంలో సౌర కుటుంబంలోని ప్రత్యేకమైన ఆరు గ్రహాలు ఒకే వరుసలో కొలువుదీరబోతున్నాయి. ఈ వరుసలో భాగంగా బృహస్పతితో పాటు శుక్రుడు, బుధుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ వంటి ప్రధాన గ్రహాలు ఒకే వరసలో ఉండడం విశేషం.. అయితే, ఇది భారతదేశంలో కనిపిస్తుందా? వీటిని ఎలా చూడొచ్చు? వీటివల్ల మనుషులపై ప్రభావం ఏదైనా ఉంటుందా? అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శాస్త్రవేత్తలు సమాచారం ప్రకారం.. సూర్యాస్తమయం అయిన 30 నుంచి 60 నిమిషాల తర్వాత ఈ అద్భుతం స్పష్టంగా ఆకాశంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆకాశం నిర్మలంగా ఉంటే.. ఎటువంటి పరికరాల సహాయం లేకుండానే పశ్చిమ దిశలో కొన్ని గ్రహాలను మనం నేరుగా సులభంగా వీక్షించవచ్చు. అయితే, ఆకాశంలో వచ్చే మేఘాల కారణంగా ఈ అద్భుతమైన దృశ్యం కనిపించకపోవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రేపు వాతావరణం బట్టి ఈ దృశ్యాలు కనిపిస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది..
రేపు కొన్ని ప్రధాన గ్రహాలను నేరుగా చూడొచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆకాశం ఎత్తులో ప్రకాశవంతంగా బృహస్పతి గ్రహం ఉంటుంది.. కాబట్టి దీనిని సులభంగా వీక్షించవచ్చని వారు అంటున్నారు. అంతేకాకుండా బుధుడితో పాటు శుక్రుడు, శని గ్రహాలు కూడా భూమికి చాలా దగ్గరగా కనిపిస్తాయని వారు చెబుతున్నారు. టెలిస్కోప్‌తో ఎవరైనాతో పాటు నెఫ్యూన్ వంటి భూమికి చాలా దూరంలో ఉన్న గ్రహాలను చూడొచ్చు. అంతేకాకుండా వీటిని చూడడానికి బైనాక్యులర్ల సహాయం కూడా అవసరమవుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు..
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఇవి భారత్ లో కనిపిస్తాయా?
ఈ అద్భుతమైన దృశ్యాలు భారత్‌లో కూడా కనిపిస్తాయని కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖగోళ ప్రేమికులైతే సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల మధ్య ఈ గ్రహాల అమరికను చూడవచ్చని వారు తెలుపుతున్నారు. పట్టణాల్లో కాంతి, కాలుష్యం తక్కువ ఉన్న ప్రదేశాల నుంచి లేదా భవనాల పైకప్పుల నుంచి పశ్చిమ దిశగా చూస్తే ఈ గ్రహాలు వరుసగా కనిపిస్తాయని వారు అంటున్నారు.. ముఖ్యంగా రేపు శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు.. పక్కనే ఉన్న బుధ గ్రహాన్ని గుర్తించడం కూడా ఎంతో సులభం అవుతుంది.. మార్చి మూడవ తేదీన జరగబోయే సంపూర్ణ చంద్ర గ్రహణానికి ముందు ఈ గ్రహాల పెరేడ్ జరగడం విశేషమని కొంతమంది ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అరుదైన ఘటన మళ్లీ చూడడానికి ఏళ్ల తరబడి వేచి చూడాల్సి ఉంటుందని వారు అంటున్నారు. అయితే, వీటి ప్రభావం జ్యోతిష్య శాస్త్రం పరంగా చూస్తే.. కొన్ని రాశుల వారిపై పడే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tomorrow School Holiday: తమిళనాడులోని తంజావూరు జిల్లా విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా యంత్రాంగం తీపి కబురు అందించింది. తంజావూరు జిల్లాలో మాసిమాగం పండుగను పురస్కరించుకుని, జిల్లా కలెక్టర్ ప్రియాంక పంకజం మార్చి 2 (సోమవారం) నాడు స్థానిక సెలవు (లోకల్ హాలీడే) ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా మూడు రోజులు సెలవులు లభించనున్నాయి.
సెలవుల వివరాలు ఇవే..
ఫిబ్రవరి 28 నాడు శనివారం వారాంతపు సెలవు కావడం ఆ తర్వాత మార్చి 1న ఆదివారం వరుస సెలవులు రానున్నాయి. ఈ క్రమంలో మార్చి 2న స్థానిక జిల్లా యంత్రాంగం మాసిమాగం సందర్భంగా స్థానిక సెలవు ప్రకటించారు.
అయితే ప్రస్తుతం పబ్లిక్ పరీక్షల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 12వ తరగతి (ఇంటర్మీడియట్) విద్యార్థులకు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. మార్చి 2న ప్రకటించిన ఈ సెలవును భర్తీ చేసేందుకు, మార్చి 14 (శనివారం) నాడు జిల్లావ్యాప్తంగా పనిదినంగా (వర్కింగ్ డే) ప్రకటించారు.
మార్చి నెలలో ఇతర ప్రభుత్వ సెలవులు..
తంజావూరు జిల్లాలోనే కాకుండా, సాధారణంగా మార్చి నెలలో మరికొన్ని ప్రభుత్వ సెలవులు కూడా ఉన్నాయి. మార్చి 3న మంగళవారం నాడు ఉగాది (తెలుగు నూతన సంవత్సరం), మార్చి 21 శనివారం రంజాన్.. మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా సెలవులు రానున్నాయి.
పరీక్షల సన్నద్ధత..
వరుస సెలవులు దొరకడంతో పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చదువుకోవడానికి ఈ మూడు రోజుల విరామం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs West Indies Super 8 Scenarios: టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఆసన్నమైంది. పదేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ వేదికగా భారత్-వెస్టిండీస్ జట్లు తలపడబోతున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌ను కేవలం ఒక పోరుగా కాకుండా, 'వర్చువల్ క్వార్టర్ ఫైనల్'గా పరిగణిస్తున్నారు. అయితే, ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం గ్రూప్-1లో సెమీఫైనల్ బెర్త్ కోసం తీవ్ర పోటీ నెలకొంది.
వెస్టిండీస్: 2 మ్యాచ్‌లు - 2 పాయింట్లు (NRR: +1.791)
భారత్: 2 మ్యాచ్‌లు - 2 పాయింట్లు (NRR: -0.100)
గెలిచిన జట్టు 4 పాయింట్లతో నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. కానీ మ్యాచ్ జరగకుండా నిలిచిపోతేనే అసలు సమస్య మొదలవుతుంది.
ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఐసీసీ నిబంధనల ప్రకారం.. సూపర్-8 దశలో ఏదైనా మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దయితే, రెండు జట్లకూ చెరో 1 పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు భారత్, వెస్టిండీస్ రెండూ తలా 3 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఈ స్థితిలో సెమీఫైనల్ విజేతను నెట్ రన్ రేట్ (NRR) ఆధారంగా నిర్ణయిస్తారు.
ప్రస్తుత గణాంకాల ప్రకారం వెస్టిండీస్ (+1.791) భారత్ (-0.100) కంటే చాలా మెరుగైన స్థానంలో ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే, నెట్ రన్ రేట్ వెస్టిండీస్‌కు అనుకూలంగా ఉండటంతో వారు సెమీస్‌కు చేరుకుంటారు. భారత్ టోర్నీ నుండి నిష్క్రమించాల్సి వస్తుంది.
వాతావరణం ఎలా ఉండబోతోంది?
భారత అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం మార్చి 1న కోల్‌కతాలో వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆకాశం నిర్మలంగా ఉండి, మ్యాచ్ పూర్తిస్థాయిలో (20 ఓవర్లు) జరిగే అవకాశం మెండుగా కనిపిస్తోంది.
భారత్ ముందున్న సవాల్..
భారత్ ఈ మ్యాచ్‌లో కేవలం గెలవడమే కాదు, వెస్టిండీస్‌పై పైచేయి సాధించి గతంలో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలించే ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై భారత్ తన స్పిన్ మ్యాజిక్‌తో వెస్టిండీస్‌ను కట్టడి చేయగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: TTD Online Frauds: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక..వెలుగులోకి వచ్చిన భారీ మోసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola Edge 60 Stylus Price Cut: అత్యంత తక్కువ ధరలోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ హోలీ సందర్భంగా మీకోసం కొన్ని అద్భుతమైన ఆఫర్స్‌తో స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తోంది. ముఖ్యంగా గత ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి విడుదలైన మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ (Motorola Edge 60 Stylus) స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ (Motorola Edge 60 Stylus) స్మార్ట్‌ఫోన్ సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ ఎంతో ప్రత్యేకమైన 6.67-అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లే తో విడుదల చేసింది. దీంతోపాటు ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ సపోర్టుతో అందుబాటులో ఉంది. అలాగే ఈ మొబైల్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది Sony LYT-700C సెన్సార్, OIS సపోర్ట్ తో కూడిన 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు అదనంగా 13MP అల్ట్రావైడ్, మాక్రో లెన్స్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. వీడియో కాలింగ్ కోసం ఈ కెమెరా ఎంతగానో సహాయపడుతుంది.
అలాగే ఈ Motorola Edge 60 Stylus మొబైల్‌కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళ్తే.. 5000 mAh బ్యాటరీ, 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆధారిత Hello UI ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే ప్రత్యేకమైన NFC, బ్లూటూత్ 5.4, Wi-Fi 6E కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో ఇన్-బిల్ట్ స్టైలస్ పెన్. దీనితో మీరు స్క్రీన్‌పై నోట్స్ రాసుకోవచ్చు, బొమ్మలు గీయవచ్చు లేదా ఫొటోలను ఎడిట్ ఎంతో సులభంగా చేసుకోవచ్చు. అలాగే ఇది IP68 రేటింగ్‌తో వచ్చింది.. నీటిలో పడినప్పటికీ ఏమాత్రం పాడవకుండా ఉంటుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
భారతదేశంలో దీనిని కంపెనీ MRP రూ.28,999 ధరతో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడే దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి 28 శాతం ప్రత్యేకమైన ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.20,899 లోపే పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా.. ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన ఆక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
అంతేకాకుండా ఈ Motorola Edge 60 Stylus మొబైల్‌పై ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఏదైనా మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.20 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ బోనస్ను మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే.. కేవలం ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రూ.899లోపే పొందవచ్చు. అలాగే మరింత తగ్గింపు ధరకు పొందడానికి ఇతర ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
