Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500033
Russells Viper Video: మెట్ల కింద భారీ రక్తపింజర.. ఎలా పట్టుకున్నారో..ఈ వీడియోలో చూడండి..
DDDharmaraju Dhurishetty
Feb 10, 2026 11:36:55
Hyderabad, Telangana

Russells Viper Video Watch Here: ఇటీవలే ఓ నివాసిత ప్రదేశంలో అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర పాము ప్రత్యక్షమై స్థానికులను తీవ్రభయాందోళనకు గురిచేసింది. ఇంట్లోని మెట్ల కింద ఉన్న చిన్న చిన్న వస్తువుల మధ్య దాగి ఉన్న పామును ఒక వన్యప్రాణి సంరక్షకుడు రెస్క్యూ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతుంది. సాధారణంగా అడవికి దగ్గరగా ఉండే ప్రదేశాలు ఇలా ప్రమాదకరమైన పాములు సంచారం చేయడం సర్వసాధారణమే. కానీ, వీరు ఎల్లప్పుడు ఇంటి పరిసరాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణానికే ముప్పు.. అయితే ఈ వీడియోలో అతను ఆ ప్రమాదకరమైన రక్తపింజర పాము (Russell’s Viper)ను ఎలా పట్టుకున్నాడో? దీనికి సంబంధించిన పూర్తి వీడియోకు సంబంధించిన సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇంటి లోపల మెట్ల కింద ఉన్న కొన్ని వస్తువుల్లో భారీ రక్తపింజర పాము ఉన్నట్లుండి యజమాని గుర్తించారు. అయితే వెంటనే అతను వన్యప్రాణి సంరక్షకుల బృందానికి సమాచారం అందించారు. ఆ స్నేక్ క్యాచర్ టీం వెంటనే అక్కడికి చేరుకొని ఆ పామును రెస్క్యూ చేపట్టేందుకు ప్రయత్నించారు.. అయితే ఈ రక్త పింజర పాము చాలా డేంజర్.. కాబట్టి దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకే వారు ఈ పాముకు చాలా దూరంగా ఉండేందుకు ప్రయత్నించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగింది. 

స్నేక్ క్యాచర్ ముందుగా ఆ పామును పట్టుకోవడానికి మెట్ల కింద ఉన్న వస్తువులను అటు ఇటు కలిపాడు.. వెంటనే వారికి ఒక గిన్నెలో రక్తపింజర పాము కనిపిస్తుంది. దానిని అతని దగ్గర ఉన్న స్నేక్ హుక్కుతో బయటికి తీసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో ఆ పాము దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఆ స్నేక్ క్యాచర్ ఎంతో ఓపికతో ఆ పామును బయటికి తీసి ఒక ప్లాస్టిక్ బకెట్‌లో వేసుకొని బయటికి ఎంతో జాగ్రత్తగా తీసుకువస్తాడు. ఆ తర్వాత అతను ఆ ప్రమాదకరమైన పామును ఎంతో తేలికగా ఒక ప్లాస్టిక్ డబ్బా నుంచి మరో ప్లాస్టిక్ డబ్బాలోకి మార్చుతాడు. 

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

ఇలా ఆ పామును డబ్బా మార్చే క్రమంలో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతను ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకొని.. డబ్బాలో బంధించే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో చుట్టుపక్కన ఉన్న వారంతా పామును చూసి ఆశ్చర్యపోతారు. భయంతో దూరంగా నిలబడడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఇలా డబ్బాలో బంధించిన పామును అక్కడి నుంచి ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Feb 10, 2026 11:49:39
Hyderabad, Telangana:

Oppo K14x 5G Price: ప్రముఖ  స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో మార్కెట్‌లోకి మరో అద్భుతమైన మొబైల్ను విడుదల చేసింది. ఇది ఒప్పో K14x 5G పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్‌తో లాంచ్ చేసింది. ఇది చాలా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా వివిధ కలర్ ఆప్షన్స్‌లో విడుదలైంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్ చాలా ప్రత్యేకమైన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది IP64-రేటెడ్‌తో వినిపిస్తోంది. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం మార్కెట్‌లో వేరియంటును బట్టి ధర అందుబాటులో ఉంది.. ముఖ్యంగా 128gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర రూ.14 వేల నుంచి ప్రారంభమవుతుంది. 

ఇక 6జిబి ర్యాంతో పాటు 128gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ. 16,000 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్లలో కూడా లభిస్తుంది. మొదటి సెల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ తీసుకున్న ఆఫర్స్ కూడా లభిస్తాయి. Oppo K14x 5G స్మార్ట్‌ఫోన్  6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. 

అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 6300 6nm ప్రాసెసర్‌తో లాంచ్ అయింది. అలాగే స్టోరేజ్‌ను పెంచుకోవడానికి మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. ఇది Android 16 ఆధారంగా ColorOS 16పై రన్ అవుతుంది. ఈ Oppo K14x 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన IP64 రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని వెనక భాగంలో ప్రత్యేకమైన సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. దీంతోపాటు అదనంగా 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా కూడా లభిస్తుంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఇక ఈ Oppo K14x 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది ప్రత్యేకమైన సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఒప్పో కంపెనీ 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇది ప్రత్యేకమైన 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఫీచర్లతో లభిస్తుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 10, 2026 10:37:26
Hyderabad, Telangana:

Pay Revision Commission: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే కరీంనగర్‌లో రిటైర్మెంట్‌ అయిన ఉద్యోగులు తమ ఇళ్ల గేట్లకు బోర్డులు, బ్యానర్లు ప్రదర్శించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌, పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు.

Also Read: Schools Holiday: రేపు తెలంగాణలో స్కూళ్లకు సెలవు.. ఉత్తర్వులు జారీ!

తెలంగాణలోని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో 3 లక్షల మందికిపైగా రెగ్యులర్ ఉద్యోగులు, 4 లక్షల మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 5 డీఏలను పెండింగ్‌లో ఉందని బండి సంజయ్‌ గుర్తుచేశారు. ఉద్యోగులు దాచుకున్న గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ బకాయిలను కూడా చెల్లించడం లేదని వివరించారు. 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని రెండున్నరేళ్లు అవుతున్నా ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయం అని చెప్పారు. కనీసం పీఆర్సీ రిపోర్ట్‌ను కూడా తెప్పించకపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఉందో అర్ధం చేసుకోవచ్చని లేఖలో బండి సంజయ్‌ ప్రస్తావించారు.

Also Read: Srisailam: శ్రీశైలం కొండపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. భక్తులు, శివస్వాముల ఆందోళన

'ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. 2024 నుంచి నేటి వరకు దాదాపు 13 వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. నేటి వరకు వారికి రావాల్సిన బెనిఫిట్స్‌, 5 డీఏలు చెల్లించకపోవడం ఎంతవరకు న్యాయం?' అని లేఖలో బండి సంజయ్‌ ప్రశ్నించారు. రిటైర్‌ తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురిచేస్తుండటం క్షమించరానిదని స్పష్టం చేశారు. జీవితాంతం ప్రభుత్వానికి ఊడిగిం చేసిన ఉద్యోగులు రిటైర్డ్ అయితే వారిని బెనిఫిట్స్‌ అన్నీ చెల్లించి సగౌరవంగా సన్మానించి పంపాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ వారి ఉసురు పోసుకోవడం అత్యంత శోచనీయం అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. బెనిఫిట్స్‌ అందక ఏడాది నుంచి 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు లోనై మరణించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చావులకు రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా? వారిపై ఆధారపడిన కుటుంబాలకు మీరేం సమాధానం చెబుతారు? అని రేవంత్‌ రెడ్డిని నిలదీశారు.

Also Read: Govt Employees: 33 ఏళ్ల సర్వీస్‌కే ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ రిటైర్మెంట్‌.. కొత్త సర్వీస్‌ రూల్స్‌పై ఆగ్రహం

'రిటైర్డ్ ఉద్యోగులతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయలకు చెల్లించాల్సిన బకాయిలన్నీ కలిపితే రూ.12 వేల కోట్లకుపైగా ఉన్నాయి. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లించడం భారంగా మారిందా?' అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలన్నీ చెల్లించాలని రేవంత్ రెడ్డిని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల తరఫున తాము పెద్దఎత్తున ఆందోళనలు  చేసేందుకూ వెనుకాడమని హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 10, 2026 09:54:57
Hyderabad, Telangana:

Hyderabad Schools Holiday: హైదరాబాద్‌లోని గాజులరామారం డివిజన్ పరిధిలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భూమి దాదాపు నాలుగు నుంచి ఐదు సెకండ్ల పాటు కనిపించింది. దీంతో స్థానికులంతా తీవ్రభయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా మెట్కాన్‌గూడ ప్రాంతంలో భారీ శబ్దంతో కూడిన ప్రకంపనులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో వారు ఇళ్ళ నుంచి బయటికి పరుగులు తీసినట్లు తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో తీవ్రభయాందోళనలు చెందారు. 

మీడియాతో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటల సమయంలో అకస్మాత్తుగా భూమి వెలపల నుంచి పెద్ద శబ్దం వినిపించిందని.. ఆ వెంటనే భూమి కనిపించినట్లు అనిపించడంతో వారంతా షాక్కు గురయ్యారని చెబుతున్నారు. అంతేకాకుండా ఇదే సమయంలో ఆ ప్రకంపనల దాటికి ఇంట్లో సామాన్లు కదడంతో పాటు పాత్రలు కింద పడిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని.. వారంతా రోడ్లపైకి వచ్చినట్లు తెలిపారు. 

మెట్కాన్‌గూడలోనైతే.. ఉన్నట్టుండి భారీ శబ్దం రావడంతో.. ఇంట్లో ఉన్న తలుపులతో పాటు కిటికీలు వణికి పోయినట్లు స్థానికులు చెబుతున్నారు.. ఇక కొంతమంది భూకంపమేనని భయపడి పిల్లలతో కలిసి బయటకు పరుగులు తీసిన సందర్భం కూడా వచ్చిందని వారు మీడియాకు తెలిపారు..

భూ ప్రకంపనల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్థానికంగా ఉన్న పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్త మైనట్లు తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు తక్షణమే సెలవులు ప్రకటించి.. విద్యార్థులను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.. అకస్మాత్తుగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఆ ప్రాంతంలో కాసేపు గందరగోల పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. పాఠశాలలో మళ్లీ 11వ తేదీన తెరుచుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Earthquake Hyderabad: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో.. భూ ప్రకంపనలు.. రోడ్లపైకి పరుగులు తీసిన జనం?

ప్రస్తుతం ఈ ఘటనపై స్థానికుల్లో పలు అనుమానాలు రేకెత్తుతూ వస్తున్నాయి.. ఈ భూప్రకంపనలనేవి ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చినవా? లేక సమీపంలో ఏమైనా భారీ పేలుడు పదార్థాలు ప్రయోగించడం వల్ల వచ్చిన శబ్దమా? అనే కోణంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.. అయితే, అధికారులు దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.. ముఖ్యంగా గనుల తవ్వకాల్లో వాడే జిలెటిన్ స్టిక్స్ పేలుళ్ల వల్ల కూడా ఇలాంటి శబ్దాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Earthquake Hyderabad: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో.. భూ ప్రకంపనలు.. రోడ్లపైకి పరుగులు తీసిన జనం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 10, 2026 08:12:51
Hyderabad, Telangana:

Realme Techlife 7.5 Kg Washing Machine Offers Price: రియల్‌మీ (realme) టెక్‌లైఫ్ 7.5 kg ఆటోమేటిక్ టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్ ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు సమయం రాని వచ్చేసింది. ఇది అత్యంత తగ్గింపు ధరితోనే అందుబాటులో ఉంది. ముఖ్యంగా దీనిపై ఎన్నో రకాల స్పెషల్ డిస్కౌంట్‌ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. 

రియల్‌మీ (realme) టెక్‌లైఫ్ 7.5 kg వాషింగ్ మిషన్ అత్యంత తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. అయితే, ఇది మార్కెట్‌లో ఇప్పుడు RMFA75A5G మోడల్ నెంబర్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో Fabric Safe Wash కూడా లభిస్తోంది. ఇది వాడడం వల్ల బట్టలను సున్నితంగా ఉంచుతుంది. ఇది ఫైవ్ స్టార్ రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. తక్కువ విద్యుత్తును వినియోగిస్తూ.. బట్టలను ఉతుకుతూ బిల్లును ఆదా చేస్తుంది. అలాగే ఇందులో 10 వాష్ ప్రోగ్రామ్స్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో డెనిమ్, డెలికేట్, మిక్స్, వింటర్ వేర్, రాపిడ్ వాష్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇందులో Fuzzy Logic ఫీచర్ కూడా లభిస్తుంది. దీనివల్ల బట్టల బరువును బట్టి నీటి పరిమాణంతో పాటు వాస్ సైకిల్‌ను ఆటోమేటిక్‌గా నిర్ణయిస్తుంది. ఈ వాషింగ్ మెషన్‌లో మెమరీ బ్యాకప్ ఫీచర్ కూడా లభిస్తుంది.. ఇది పవర్ కట్ అయినప్పుడు, మళ్లీ కరెంటు రాగానే ఆగిపోయిన చోటు నుండే వాషింగ్ మొదలవుతుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో MRP ధర రూ.19,990 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 40 శాతం తగ్గింపుతో కేవలం రూ.11, 990కే పొందవచ్చు. ఇవే కాకుండా మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగిస్తే భారీ డిస్కౌంట్‌లో ఈ వాషింగ్ మిషన్ ను సొంతం చేసుకోవచ్చు. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఈ వాషింగ్ మెషన్‌పై ఉన్న బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డుతో దీనిని కొనుగోలు చేసే క్రమంలో పేమెంట్ చేస్తే ఏకంగా రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసిన.. రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఎక్స్చేంజ్ బోనస్ వినియోగించే వారికి.. అదనంగా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.10 వేల లోపే సొంతం చేసుకోవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 10, 2026 07:48:11
Hyderabad, Telangana:

Earthquake Hyderabad Telugu News: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారి భూమి కనిపించడంతో స్థానిక ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు.. ముఖ్యంగా గాజులరామారం తో పాటు మెట్కాన్‌గూడెం, ఇతర పరిసర ప్రాంతాల్లో భూగర్భం నుండి ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఇళ్లలో ఉన్న సామాగ్రి మొత్తం కింద పడిపోయింది.. ఈ హఠాత్ పరిణామంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఈ స్థానికంగా నివసిస్తున్న జనాలంతా ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. 

మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పెద్ద శబ్దం వినిపించిందని.. ఆ వెంటనే భూమి కంపించినట్లు అనిపించిందని గాజులరామారం నివాసితులు తెలిపారు.. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే అక్కడ నివసించే వారంతా అప్రమత్తమై ఇళ్లలో నుంచి వీధులలోకి చేరుకున్నారు.. సుమారు మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగినట్లు సమాచారం.. ముఖ్యంగా భవనాల్లో నివసించే వారంతా ప్రకంపనల దాటికి తీవ్ర ఆందోళనలు చెందినట్లు తెలుస్తోంది.

ఇదే తరహా భూమి ప్రకంపనలు మెట్కాన్‌గూడెం పరిసర ప్రాంతాల్లో కూడా చోటుచేసుకున్నాయి.. ఈ ప్రాంతాల్లోన అయితే కిటికీలు, తలుపులు గజగజ వణికాయి.. ఒక్కసారిగా శబ్దం కూడా వచ్చినట్లు స్థానికులు వివరిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ఇళ్లలో సాధారణంగా ఉంచిన వస్తువులు కూడా కింద పడటంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చారని తెలుస్తోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.. భూమి కనిపించిన తీవ్రతను తెలుసుకునేందుకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపినట్లు కూడా సమాచారం.. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం మాత్రం ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. అలాగే భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. పాత భవనాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించినట్లు సమాచారం.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Feb 10, 2026 06:46:39
Gollet, Telangana:దేశంలోని కార్మిక, కర్షక వర్గానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల కు వ్యతిరేకంగా ఈనెల 12న చేపట్టే సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేయాలని ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు బి ఉపేందర్ కోరారు. మంగళవారం కార్మికులతో కలిసి గోలేటిలో సమ్మె పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. గతంలో కార్మికులకు అనుకూలంగా ఉన్న 44 జీవోలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈనెల 12న చేపట్టే సమ్మెకు సింగరేణి, ఔట్సోర్సింగ్, ఓబి కంపెనీ, ఆర్టీసీ కార్మికులు పూర్తి మద్దతు ఇచ్చి సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు,కార్మిక నాయకులు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ వెంకటేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు
0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 10, 2026 06:40:21
Hyderabad, Telangana:

Crime News In Telangana: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా గార్ల మండలం మంగలి తాండలో ఆస్తి ఓ యువకుడిని అతి కిరాతకుడిగా మార్చింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు.. తన సొంత అన్నకు పిల్లనిచ్చిన అత్తమామలపై విద్యుత్ షాక్ తో దాడికి పాల్పడడమే కాకుండా.. అడ్డం వచ్చిన తన వదినపై పెద్ద కత్తితో దాడికి తెగబడ్డాడు.. ఈ ఘటనలో అత్తప్ ప్రాణాలు కోల్పోగా.. మామ తృతిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు.. 

జరిగింది ఇదే..
పోలీసులతో పాటు స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. మంగలి తాండకు చెందిన రాజేష్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆస్తి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు.. రాజేష్ కు సొంత అన్నయ్య రమేష్ కు ఇప్పటికే పెళ్లయింది.. అయితే రమేష్ కు రెండో పెళ్లి జరగడం రాజేష్ కు అస్సలు నచ్చలేదట.. అన్నకు రెండో పెళ్లి చేస్తే తన ఆస్తిలో వాటా తగ్గిపోతుందని.. ఆ యువకుడు ఆలోచిస్తూ వచ్చాడు.. ఈ రెండో పెళ్లి జరగడానికి ప్రధాన కారణం తన అత్తమామలేనని భావించిన అతను.. వారిపై ఊహించని స్థాయిలో  పగ పెంచుకున్నారు..

బుధవారం అర్ధరాత్రి ఆ యువకుడు భారీగా మద్యం సేవించి అదే మత్తులో ఇంటికి వచ్చాడు.. గాఢ నిద్రలో ఉన్న అత్త కౌశల్యని, మామ అజ్మీరా రాందాసులను లక్ష్యంగా చేసుకున్నాడు రాజేష్ అనే యువకుడు.. ఎవరు ఊహించని విధంగా సినిమాలో క్రైమ్ తరహా అత్తమామలు ఇద్దరికీ కరెంటు వైర్ల ద్వారా షాక్ ఇచ్చాడు. ఈ ప్రమాదంలో కౌసల్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలేయగా.. మామ రామదాసు అదృష్టవశాత్తు తప్పించుకున్నారు.

మద్యం మత్తులో ఉన్న రాజేష్ అంతటితో ఆగకుండా తన వదినను కూడా చంపేయడానికి ప్రయత్నించాడు.. అడ్డం వచ్చిన ఆమెపై పెద్ద కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు.  ఈ సమయంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..

వెంటనే సమాచారం అందుకున్న డి.ఎస్.పి తిరుపతిరావు ఘటన స్థలాన్ని సందర్శించారు.. క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.. నిందితుడు రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్తి తగాదాలతో పాటు కుటుంబ కలహాలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడి పై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి మీడియాకు తెలిపారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 10, 2026 04:58:04
Hyderabad, Telangana:

Ruchaka Yoga Zodiac Effect On Zodiac Telugu: ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ నెలలోని మరో కొత్త వారం ప్రారంభమైంది. అయితే, ఈ రెండో వారానికి జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మకర రాశిలో కుజుడు ఉండడం వల్ల ఈ సమయంలో రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగంతో కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో పంచ మహాపురుష రాజయోగం కూడా ఏర్పడుతుంది. 

కొత్త వారంలో ఏర్పడిన రెండు రాజయోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి ఊహించని ధైర్యం పెరుగుతుంది. అలాగే నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగుతారు. దీనివల్ల వీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఊహించని ధన లాభాలు కూడా పొందుతారు. 

ఈ రాశులవారికి బంపర్‌ డబ్బు:
మేష రాశి 
మేషరాశి వారికి రుచక రాజయోగ ప్రభావం కారణంగా కెరీర్ పరంగా ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగాల్లో పదోన్నతులు లభించడమే కాకుండా.. కొత్త బాధ్యతలతో అద్భుతమైన గౌరవాన్ని కూడా పొందుతారు. దీంతోపాటు వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా రెట్టింపు పై కొన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. 

వృశ్చిక రాశి 
ఈ వారం వృశ్చిక రాశి వారికి రుచక రాజు యోగ ప్రభావంతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. అలాగే కొత్త భూములతో పాటు గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాహసోపేతమైన నిర్ణయాల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. సామాజిక గౌరవం పెరిగి.. అనుకున్నంత స్థాయిలో కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. దీంతోపాటు ప్రభావవంతమైన వ్యక్తులతో సహాయం పొందే అవకాశాలున్నాయి. అయితే, ఈ సమయంలో వీరు మాట్లాడే క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించడం మంచిది.

మకర రాశి 
మకర రాశి వారికి కుజుడి ప్రభావంతో ఏర్పడిన రుచక రాజయోగం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించడమే కాకుండా.  కొత్త ఉద్యోగ అవకాశాలు పొందే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా ఐరన్ తో పాటు వీరు ఇతర ఖనిజాలు, భూములు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వాసం కూడా అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది. దీంతో అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాదకరమైన పనులు చేసే క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే డ్రైవింగ్ చేసే సమయంలో కూడా జాగ్రత్త అవసరమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

NOTE:

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 10, 2026 04:48:57
Hyderabad, Telangana:

Venus Transit In Shatabhisha Effect Telugu: ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు రాశి సంచారాలు చేయబోతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 11వ తేదీన బుధవారం ఉదయం 8 గంటలకు శుక్రుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీ వరకు అదే రాశిలో సంచార దశలో ఉంటాడు. ఆ తర్వాత శుక్రుడు పూర్వాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. 

ఈ సమయంలో శుక్రుడి ప్రభావంతో కొన్నిరాశుల వారు ఆకస్మిక డబ్బు పొందగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విలాసం కూడా పెరిగి కొన్ని లగ్జరీ వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. సాంకేతికతతో పాటు వైద్యం పరిశోధన రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు అనుకొని అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే అద్భుతమైన సృజనాత్మకత పెరిగి జీవితంలో ముందుకు సాగుతారు.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
వృషభ రాశి 
వృషభ రాశి వారికి శుక్రుడు ఎల్లప్పుడూ అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి వీరికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. వీరు కొత్త నగలు లేదా కార్లు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇతర లగ్జరీ వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ఒత్తిడి పూర్తిగా తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మిథున రాశి 
మిథున రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది. దీని కారణంగా భారీ మొత్తంలో నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా మారడమే కాకుండా కొత్త ఆలోచనలతో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం వల్ల సమయం చాలా బాగుంటుంది. 

కుంభరాశి 
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు శతభిషా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి వ్యక్తిగత జీవితంలో ఊహించని స్థాయిలో సంతోషం పెరుగుతుంది. అలాగే ప్రేమ, వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా నష్టాల్లో నుంచి డబ్బులు తిరిగి పొందుతారు.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శుక్రుడి అద్భుతమైన ప్రభావంతో మేధో సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో వీరికి సృజనాత్మకత కూడా పెరిగి.. కళాకారులతో పాటు రచయితలకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ప్రపంచ సంబంధాలు మెరుగుపడి ఈ సమయం చాలా శుభప్రదంగా  మారుతుంది.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

NOTE:

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RGRenuka Godugu
Feb 10, 2026 03:47:03
Hyderabad, Telangana:

 Siddipet Lovers Suicide: ఈ మధ్య కాలంలో ఆత్మహత్య ఘటనలు పెరిగిపోతూ వస్తున్నాయి. స్ట్రెస్, ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని, భార్యాభర్తల మధ్య గొడవలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా సిద్దిపేట పెద్దలింగారెడ్డి శివారులో కూడా దారుణ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వాలెంటైన్స్ వీక్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరేమోనని తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకరాం.. శ్రవణ్ (24) ఇంటర్ పూర్తి చేసి జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇక చిన్నకోడూరు మండలంలోని గ్రామానికి చెందిన కల్పన( 17) లు కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కల్పన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.  వీరు నిన్న ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. ఇంటి నుంచి ఉదయం బయలుదేరి ఎంతకీ తిరిగి రాలేదు. రాత్రి 7 గంటల సమయంలో పెద్ద లింగారెడ్డి శివారులో ఇద్దరు ఉరేసుకొని వేలాడుతూ కనిపించారు. స్థానికులు సమాచారంతో సిద్ధిపేటలో కలకలం రేపింది.

 ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబాలకు వెంటనే సమాచారం కూడా అందించారు. అయితే వారి వద్ద ఆధార్ కార్డు, బుక్స్, ఒక చీర కూడా కల్పన బ్యాగ్‌లో లభించింది. అయితే ఆనవాళ్లు చూస్తుంటే వారి పెళ్లికి కూడా సిద్ధమైనట్లు సమాచారం. అయితే పెద్దలు అంగీకరించారని తీవ్ర మనస్థాపానికి గురై వారు ఈ దారుణ ఘటనకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.

అయితే, స్థానికుల ప్రకారం వీరు ఇద్దరు దూరపు బంధువులే అవుతారు. వీరి మధ్య ఆ బంధం ప్రేమకు దారితీసింది. కానీ, తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరు అని, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వారు పెళ్లి చేసుకోకుండా అని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది ఇలా ఉండగా కల్పనకు పెళ్లి కాని ఒక అక్క కూడా ఉంది. అది కూడా కారణమవ్వచ్చని స్థానికులు అంటున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు డెడ్ బాడీలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఆత్మహత్యకు సంబంధించిన అసలు కారణం మాత్రం బయటికి రావాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:​ మేడారం మహా జాతర..రేపు, ఎల్లుండి సెలవు ఇవ్వండి.. వీహెచ్‌పీ డిమాండ్‌..!

Also Read:​ Tragedy Love: విషాదంగా మారిన మైనర్ల ప్రేమ వ్యవహారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
IPInamdar Paresh
Feb 10, 2026 02:31:10
Hyderabad, Telangana:

Telangana municipal elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అసెంబ్లీకి ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోనట్లు మారాయి. ముఖ్యంగా అన్ని ప్రధాన పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక నేతల మధ్య డైలాగ్ వార్ ను మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బూతులు తిట్టుకుంటూ ఒకరిపై మరోకరు వాగ్బాణాలతో విరుచుకుపడ్డారు. మొత్తంగా తెలంగాణలో మరోసారి మున్సిపల్ ఎన్నికలు సమ్మర్ కు ముందే మరింత హీట్ ను పెంచాయి. రేపు(బుధవారం) తెలంగాణలో 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌ జరుగనుంది.

బ్యాలెట్‌ పేపర్ల ద్వారానే ఓటింగ్‌ను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు . ఈ ఎన్నికల రిజల్ట్స్ ఈ నెల 13న వెలవడనున్నాయి. తెలంగాణలో.. 2,996 వార్డులకు 8,203 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు నిలువగా.. 52.43 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకొనున్నారు. అయితే నిన్నటితో(సోమవారం) ప్రచారం ముగిసింది.

ఇక ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే అభ్యర్థుల తరపున మధ్యవర్తులు రంగంలోకి దిగినట్లు వార్తలువస్తున్నాయి. నేరుగా వారి ఇంటికి నగదు , లిక్కర్ ను సరఫరా చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారంట. ఇక మరోవైపు ఓటుకు రూ. 30 వేలు, గెలిపిస్తే క్యాండిడెట్ సగం తులం బంగారంను కూడా పలు చోట్ల ఆఫర్ చేశారని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Read more: Akbaruddin Owaisi: సీఎంలు ఎవరైన మా దగ్గరకు రావాల్సిందే.!. మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే..?

కొన్ని చోట్ల ఫర్నీచర్, ఇంట్లో ఉండే సామాన్లు,మొబైల్ ఫోన్ లు కూడా ఆఫర్ చేశారని సమాచారం. మొత్తంగా ఏదిచేసిన ఎన్నికల్లో గెలవాలని కొంత మంది అభ్యర్థులు భారీగా డబ్బుల్ని ఖర్చు చేస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 09, 2026 19:06:11
Hyderabad, Telangana:

Telangana Schools Holiday: కొత్త సంవత్సరంలో రెండో నెల రాగా.. ఈనెలలో అస్సలు సెలవులు లేవు. మొత్తం డ్రై డేగా ఉందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవులు వచ్చేశాయి. సంక్రాంతి పండుగ తర్వాత మళ్లీ భారీగా సెలవులు వస్తున్నాయి. మొత్తం నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. ఇప్పటివరకైతే అధికారికంగా వచ్చిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో రేపు సెలవు ఉంది. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఉండడంతో పోలింగ్‌ ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సెలవుకు సంబంధించిన ఉత్తర్వులు విడులయ్యాయి.

Also Read: Srisailam: శ్రీశైలం కొండపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. భక్తులు, శివస్వాముల ఆందోళన

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ సెలవులు ఉండనుంది. అయితే ఈ సెలవు తెలంగాణవ్యాప్తంగా కాకుండా పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండనుంది. ఎందుకంటే మున్సిపల్‌ ఎన్నికలు కావడంతో పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లు మూసి వేసి ఉండనున్నాయి. కొన్ని జిల్లాలు, పట్టణాల్లో మాత్రమే ఈ సెలవు వర్తించనుంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతున్నాయి.  116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనుండగా.. ఈ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రచారం ముగియగా ఎన్నికలు రేపు అంటే ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్నాయి. దీంతో విద్యాశాఖ అధికారులు ఫిబ్రవరి 11న సెలవు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో బుధవారం రోజున విద్యాసంస్థలు మూసి ఉండనున్నాయి.

Also Read: Govt Employees: 33 ఏళ్ల సర్వీస్‌కే ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ రిటైర్మెంట్‌.. కొత్త సర్వీస్‌ రూల్స్‌పై ఆగ్రహం

అయితే మరో మూడు సెలవులు కలిసి రానున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదీన వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా ప్రాంతాల్లో స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సెలవుకు సంబంధించి ఇంకా ఉత్తర్వులు వెలువడలేదు. ఆ రోజు సెలవు లభిస్తే మాత్రం అదనంగా రెండు సెలవులు కలిసి రానున్నాయి. ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 14వ తేదీ రెండో శనివారం కాగా, 15న ఆదివారం ఉంది. శుక్రవారం సెలవు వస్తే ఈ వారంలో మొత్తం నాలుగు రోజులు కానున్నాయి. దీంతో విద్యార్థులు పండుగ చేసుకునే అవకాశం ఉంది. ఇక రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు మాత్రం కొందరికి ఆనందం నింపుతుండగా.. మిగతా వారికి చేదు అనుభవం మిగిల్చనుంది.

Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే యూటర్న్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 09, 2026 17:58:02
Srisailam, Andhra Pradesh:

Srisailam Temple: మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న సమయంలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రశాంతంగా ఉండాల్సిన శ్రీగిరిపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ భక్తులతోపాటు శివస్వాములు క్యూలైన్‌లలో నిండిపోయారు. గంటల కొద్దీ దర్శనం కోసం క్యూలైన్‌లలో వేచి ఉండగా.. ఎంతకీ దర్శనానికి వదలకపోవడంతో శైవ భక్తుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో భక్తుల నిరసనలతో శ్రీశైలం క్షేత్రం మార్మోగింది.

Also Read: Govt Employees: 33 ఏళ్ల సర్వీస్‌కే ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ రిటైర్మెంట్‌.. కొత్త సర్వీస్‌ రూల్స్‌పై ఆగ్రహం

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యూలైన్స్ కంపార్ట్‌మెంట్‌లలో గంటల తరబడి దర్శనం కోసం వేచి ఉండడంతో పలువురు భక్తులు కళ్లు తిరిగిపడిపోయారు. చాలా మంది నీరసించిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగడానికి సరైన నీరు, వైద్య సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో శ్రీశైల ఆలయం వద్ద శివస్వాములు ఆందోళనకు దిగారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఏఎస్పీ యుగంధర్ బాబు, జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ ఉద్రిక్తత తగ్గలేదు.

Also Read: Harish Rao: కారు గుర్తు మీద గుద్దే ఓటుతో రేవంత్ రెడ్డికి గువ్వ పలగాలి: హరీశ్ రావు

భక్తుల రద్దీ నియంత్రణ పేరుతో పోలీసులు లాఠీలతో బెదిరింపులకు దిగారని శివదీక్ష భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పలువురు శివస్వాములు రాజగోపురం నుంచి దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగారు. శ్రీశైల ఆలయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని శివస్వాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం గందరగోళంగా మారడంతో శివభక్తులు, శివమాలధారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ నిబంధనలు కూడా ఈ పరిస్థితికి కారణమని శివస్వాములు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Revanth Reddy: మోరీ సమస్య వస్తే మోదీని కలుస్తారా? బీజేపీపై విరుచుకుపడ్డ రేవంత్‌ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top