Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500033
Rainbow Python Video: గుడ్లు పెట్టిన పాము.. కెమెరామెన్‌పై ఎందుకు దాడి చేసిందో తెలుసా?.. వీడియో..
DDDharmaraju Dhurishetty
Dec 24, 2025 09:12:39
Hyderabad, Telangana

Huge Rainbow Python Video: అన్ని జీవులు మాతృ ప్రేమను కలిగి ఉంటాయి. చాలామంది మనుషులు మాత్రమే తల్లులు బిడ్డలను ప్రేమిస్తాయని అనుకుంటూ ఉంటారు.. కానీ ప్రపంచంపై ఉన్న ప్రతి ఒక జీవి తప్పకుండా వాటి పిల్లల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూనే ఉంటుంది. తన పిల్లలను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగడుతూ ఉంటాయి. ఎందుకు నిదర్శనమే ఓ భారీ రెయిన్బో పైథాన్ వీడియో.. ఇందులో తన గుడ్లను రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రముఖ వన్యప్రాణి సంరక్షకుడు జే బ్రూవర్ తన యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ గా మారింది. 

ఈ వీడియో వివరాల్లోకి వెళితే..  జే బ్రూవర్ పాములను బంధించిన బాక్సును ఓపెన్ చేస్తాడు. అయితే, ఇదే సమయంలో తన వెంట కెమెరామెన్ కూడా ఉంటాడు. అతడు ఆ తెల్ల పెట్టేలో ఉన్న భారీ రెయిన్బో పైథాన్‌, దాని కింద ఉన్న గుడ్లను చూపించమని అడగ్గా.. కెమెరామెన్ దానికి దగ్గరగా వెళ్లి వీడియోను రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, కెమెరామెన్ తన గుడ్లపై దాడి చేస్తుండని అనుకొని.. అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సమయంలోనే హఠాత్తుగా కెమెరామెన్ వైపు విరుచుకుపడుతుంది. ఆ పాము తన నోరును పెద్దగా చేసుకుని వేగంగా దాడికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

జే నిత్యం తన ప్రయోగశాలలో ఉన్న పాముల ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తూ ఉంటాడు. ముఖ్యంగా గుడ్లు పాములను చాలా ప్రత్యేకమైన పద్ధతిలో పరీక్షించి.. వ్యాధికి గురైన పాములకు చికిత్స అందిస్తూ ఉంటాడు. అయితే గుడ్లు పెట్టే సమయంలో కూడా కొన్ని పాములు ఎంతో కోపంగా ఉంటాయి. అలాగే వాటిని రక్షించుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ పాము కూడా తన గుడ్లకు హాని కలిగించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వాటిని ఎవరూ ముట్టుకోకుండా ఉండడానికి.. దాని దగ్గరికి వచ్చిన ప్రతి జీవి పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. 

ముఖ్యంగా రెయిన్బో పైథాన్ పాములు గుడ్లు పెట్టి మాత్రమే పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాయి. అయితే, ఈ వీడియోలో కూడా పాము తన గుడ్లను రక్షించుకోవడం క్లియర్‌గా చూడొచ్చు. దీనికి సంబంధించిన దృశ్యాలను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు తల్లి ప్రేమ గొప్పదని కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Dec 24, 2025 10:49:56
Hyderabad, Telangana:

Rajasthan Jalore Panchayat Smart Phone Ban: ప్రపంచం 5G, 6G వేగంతో దూసుకుపోతుంటే.. రాజస్థాన్‌లోని కొన్ని గ్రామాల్లో మాత్రం కాలం వెనక్కి వెళ్తోంది. జలోర్ జిల్లాలోని భిన్మల్ ప్రాంతానికి చెందిన సుమారు 15 గ్రామాల్లో మహిళలు, యువతులు స్మార్ట్‌ఫోన్లు వాడటంపై స్థానిక పంచాయతీ నిషేధం విధించింది. ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఎక్కడ? ఎప్పటి నుంచి అమలు?
రాజస్థాన్‌లోని 'చౌదరి కమ్యూనిటీ'కి చెందిన సుంధమాత పట్టి పంచాయతీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 26, 2026 నుండి ఈ కఠిన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఘాజీపూర్, రాజ్‌పూర్, ఖాన్‌పూర్ వంటి మొత్తం 15 గ్రామాల్లో ఈ ఆంక్షలు వర్తిస్తాయి.

Also REad: TTD Senior Citizen Darshan: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..వారికి అరగంటలో దర్శనం..వెంటనే భోజనం సౌకర్యం?! టీటీడీ కీలక ప్రకటన!

జలోర్ పంచాయతీ విధించిన కఠిన నిబంధనలు ప్రకారం.. మహిళలు కెమెరా ఉన్న ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించకూడదు. కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి వీలుండే కీప్యాడ్ ఫోన్లను మాత్రమే వాడాలట. వివాహాలు, శుభకార్యాలు లేదా పొరుగువారి ఇళ్లకు వెళ్లేటప్పుడు మహిళలు మొబైల్ ఫోన్లను వెంట తీసుకెళ్లకూడదు. అయితే చదువుకునే విద్యార్థినులకు మాత్రం కొన్ని పరిమితులను విధించారు. కళాశాల లేదా పాఠశాలకు వెళ్లే అమ్మాయిలు చదువు కోసం కేవలం ఇంటి లోపల మాత్రమే స్మార్ట్‌ఫోన్ వాడాలి. ఇంటి గడప దాటితే ఫోన్ చేతిలో ఉండకూడదు.

ఈ నిషేధానికి కారణాలు ఏంటి?
పంచాయతీ పెద్దల వాదన ప్రకారం స్మార్ట్‌ఫోన్ల వల్ల సమాజానికి ముప్పు పొంచి ఉందట. స్మార్ట్‌ఫోన్ల వాడకం వల్ల గ్రామస్తులు పట్టణ సంస్కృతికి అలవాటు పడి, స్థానిక ఆచారాలను విస్మరిస్తున్నారని వారి అభిప్రాయం. మహిళలు తమ పని కోసం పిల్లలకు ఫోన్లు ఇచ్చి వెళ్లడం వల్ల వారి కళ్లు దెబ్బతింటున్నాయని, పిల్లలు తప్పుదోవ పడుతున్నారని వారు వాదిస్తున్నారు.

వెల్లువెత్తుతున్న నిరసనలు
ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళా హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. "ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే" అని వారు ఆరోపిస్తున్నారు. డిజిటల్ ఇండియా కాలంలో మహిళలను సాంకేతికతకు దూరం చేయడం వారి అభివృద్ధిని కుంటుపరచడమేనని విమర్శిస్తున్నారు. ఈ మధ్యయుగపు ఆలోచనలపై ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? లేదా ఈ పంచాయతీ తీర్పు అలాగే కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: Mobile Recharge Increase: న్యూఇయర్‌లో మొబైల్ యూజర్లకు భారీ షాక్..20 శాతం పెరగనున్న రీఛార్జ్ ధరలు..ఎందుకో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 24, 2025 10:26:04
Hyderabad, Telangana:

Mobile Recharge Increase 2026: కొత్త సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ సామాన్యుడిపై మరో ఆర్థిక భారం పడనుంది. దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు రీఛార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. 16 శాతం నుండి 20 శాతం వరకు ధరల పెంపు ఉండవచ్చని సమాచారం. 2026 జనవరి ప్రారంభంలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఏ ప్లాన్ ధర ఎంత పెరగొచ్చు? (అంచనా)
టెలికాం వర్గాల సమాచారం ప్రకారం.. ఒక్కో రీఛార్జ్‌పై దాదాపు రూ. 60 నుండి రూ. 100 వరకు అదనపు భారం పడనుందట. ప్రముఖ కంపెనీల ప్రస్తుత, పెరగబోయే ధరల అంచనా ధరలు ఇక్కడ ఉన్నాయి. 

కంపెనీ ప్లాన్ వివరాలు ప్రస్తుత ధర పెరగబోయే ధర (అంచనా)
ఎయిర్‌టెల్ 28 రోజులు (బేసిక్ 5G) ₹319 ₹419
జియో 28 రోజులు (బేసిక్) ₹299 ₹359
జియో 28 రోజులు (5G ప్లాన్) ₹349 **₹429
వొడాఫోన్ ఐడియా 28 రోజులు (1GB/రోజు) ₹340 ₹419
వొడాఫోన్ ఐడియా 56 రోజులు (2GB/రోజు) ₹579 ₹699

ధరల పెంపునకు కారణం ఏంటి?
ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. టెలికాం కంపెనీలు తమ ఒక్కో వినియోగదారుడి నుండి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 5G నెట్‌వర్క్ విస్తరణ కోసం చేసిన భారీ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి టారిఫ్ ధరల పెంపు అనివార్యమని కంపెనీలు భావిస్తున్నాయి.

వినియోగదారులకు సూచన
ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, డేటా ప్లాన్ల ధరలన్నీ ఒకేసారి పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ధరలు పెరగకముందే దీర్ఘకాలిక ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా కొంత కాలం పాటు ఈ అదనపు భారం నుండి తప్పించుకోవచ్చు.

Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..జీతాల పెంపు అప్పటి నుంచే..ఎంత శాతం పెరుగుతుందంటే?

Also Read: January 2026 Holidays: జనవరిలో సెలవుల జాతర..13 రోజులు సెలవులే సెలవులు..పండగలతో ఫుల్ ఎంజాయ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 24, 2025 08:44:21
Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Senior Citizen Darshan Free: కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది నెలల తరబడి ఎదురుచూస్తుంటారు. అయితే కొందరికి ఇప్పటికీ అతని సేవలో తరించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందులోనూ ఆ దర్శనం ఉచితంగా కేవలం అరగంటలో దర్శనం అయిపోతుందంటే భక్తులు ఎగిరి గంతేస్తారు. ఇప్పుడదే విషయంపై సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. 

శ్రీవారి దర్శనం కోసం 65 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా అది కూడా ఏరోజుకు ఆ రోజు టికెట్ లేకుండా దర్శనం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇదే విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రంగా స్పందించింది. వృద్ధుల కోసం కొత్తగా 'ఉచిత దర్శన పథకం' ప్రారంభమైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేసింది.

ఏం జరిగిందంటే?
గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సందేశం విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అందులో ఏముందంటే, "65 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత దర్శన పథకం ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు దర్శనం ఉండనుంది. ఎస్-1 కౌంటర్ వద్ద ఐడీ కార్డు చూపిస్తే చాలు.. కేవలం 30 నిమిషాల్లో దర్శనం పూర్తవుతుందని" అందులో రాసుంది. అయితే దర్శనం పూర్తయిన వెంటనే వృద్ధులకు ఉచిత భోజనం, వేడి పాలు అందిస్తారని.. ఏవైనా సహాయం కోసం 87722 77777 నంబర్‌ను సంప్రదించవచ్చని ఓ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుతోంది.

టీటీడీ ఖండన - అసలు నిజం ఇదీ!
ఈ వైరల్ మెసేజ్‌పై టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. భక్తులు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. వృద్ధుల కోసం ఎలాంటి కొత్త ఉచిత దర్శన పథకాన్ని టీటీడీ ప్రస్తుతానికి ప్రారంభించలేదు. వృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెలా ఒక నిర్దిష్ట కోటాను ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే విడుదల చేస్తుంది. ఆ టికెట్లు ఉన్న వారికి మాత్రమే ప్రత్యేక లైన్ ద్వారా దర్శనం కల్పిస్తారు.

హెచ్చరిక: సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక మెసేజ్‌లను చూసి నేరుగా తిరుమలకు వచ్చి ఇబ్బంది పడొద్దని భక్తులకు సూచించారు.

భక్తులు ఏం చేయాలి?
శ్రీవారి దర్శనం, టికెట్లు లేదా ఇతర సేవల గురించి సరైన సమాచారం కోసం కేవలం ఈ మార్గాలనే నమ్మాలని టీటీడీ కోరింది. అధికారిక వెబ్‌సైట్ లేదా టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలు ఉంది. 

ముఖ్య సూచన: తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. భక్తులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..జీతాల పెంపు అప్పటి నుంచే..ఎంత శాతం పెరుగుతుందంటే?

Also REad: January 2026 Holidays: జనవరిలో సెలవుల జాతర..13 రోజులు సెలవులే సెలవులు..పండగలతో ఫుల్ ఎంజాయ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RGRenuka Godugu
Dec 24, 2025 08:33:07
Hyderabad, Telangana:

BP Control Foods: మన దేశంలో బీపీ పేషెంట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. షుగర్, బీపీతో బాధపడుతున్నారు ఉన్నారు. వీరి డైట్‌లో కొన్ని ఫుడ్స్‌ చేర్చుకోవాలి. తద్వారా బీపీ నియంత్రణలో ఉంటుంది. అయితే కొన్ని వేదికల ప్రకారం మనం తీసుకునే ఫుడ్స్ ద్వారా కూడా బీపీ నియంత్రించవచ్చు. బీట్‌రూట్‌ బ్లడ్‌ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. ఇది 24 గంటలు పైగా దీని ప్రభావం ఉంటుంది. అయితే రెగ్యులర్ డైట్ లో ఎలాంటి ఫుడ్స్ చేర్చుకోవాలి తెలుసుకుందాం. 

కొవ్వు చేప..
 కొవ్వు చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సాల్మన్, మేకరల్‌, సార్డినైన్‌, ట్రౌట్‌ చేపలు తినాలి.  ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తనాళాలు కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఈ చేపలు తీసుకోవడం వల్ల నైట్రైట్స్ రక్తనాళాల్లో కలిసి పోతాయి. బీపీ నియంత్రణలో ఉంటాయి.

 ఆకుకూరలు..
 ఆకుకూరల్లో పాలకూర, కాలే వంటివి తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. రక్తనాళాలకు ఉపశమనం కలిగిస్తాయి. మన శరీరంలో ఉండే అధిక సోడియం సమతులం చేస్తుంది. డైట్ లో ఈ ఆకుకూరలు చేర్చుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

 బెర్రీ పండ్లు..
బెర్రీ జాతికి చెందిన పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. స్ట్రాబెరీ, బ్లూబెర్రీ పండ్లు తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలకు ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు రక్తపోటుని నియంత్రిస్తాయి. బెర్రీ పండ్లు తాజావి లేదా ఫ్రోజెన్‌ చేసినవి స్నాక్ లో తీసుకోవచ్చు.

 కీవీ పండు..
 కొన్ని నివేదికల ప్రకారం కీవీ పండులో కూడా బ్లడ్‌ ప్రెజర్ నియంత్రించే గుణం ఉంటుంది. వీటిలో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన రక్తనాళాలకు సహాయపడతాయి. నైట్రిక్ ఆక్సైడ్ పెంచుతుంది. ఆక్సిడేటివ్స్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. ఈ కీవీ పండు పుల్లగా తీపిగా ఉంటాయి. రెగ్యులర్ గా తాజాగా తినవచ్చు.

ఇవి మాత్రమే కాదు శనగలు, బీన్స్ వంటివి కూడా డైట్లో చేర్చుకోవాలి. వీటిని వారంలో ప్రతిరోజు ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. హైబీపీతో బాధపడుతున్న వాళ్ళు ఈ తృణధాన్యాలు కూడా తీసుకోవడం వల్ల ఫైబర్ పుష్కలంగా అందుతుంది. రక్తప్రసరణ మెరుగు చేస్తుంది. రక్తనాళాల పనితీరును మెరుగు చేస్తుంది. రెగ్యులర్‌గా ఏదో విధంగా వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Read more:  ఈ 5 ఆయుర్వేదిక్ ఇంటికి చిట్కాలు 2025లో ఎక్కువమంది ఫాలో అయ్యారు..!

Read more: ఈ 5 కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే పండ్లు.. ఎలాంటి క్రీములు అవసరం లేదు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Dec 24, 2025 07:29:18
Secunderabad, Telangana:

Bangladesh Dependence on India: భారత్, బంగ్లాదేశ్ ల మధ్య వాణిజ్య సంబంధాలు దశాబ్దాలుగా బలంగా కొనసాగుతున్నాయి. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు అనేక కీలక రంగాల్లో పరస్పరం ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ రోజువారీ జీవితం, పరిశ్రమలు, ఆహార భద్రతకు అవసరమైన అనేక వస్తువుల కోసం భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే ఇటీవలి కాలంలో ద్వైపాక్షిక సంబంధాల్లో వచ్చిన ఒత్తిడి, అలాగే బంగ్లాదేశ్‌లోని అంతర్గత రాజకీయ అస్థిరత ఈ వాణిజ్య ప్రవాహాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. సరఫరా గొలుసుల్లో అంతరాయం ఏర్పడితే.. అక్కడి ప్రజల రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం పడే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్ నుంచి దిగుమతి చేసుకునే కీలక వస్తువులు:

గోధుమలు.. బంగ్లాదేశ్ ఆహార భద్రతకు అత్యంత కీలకం. భారత్ నుంచి పెద్ద ఎత్తున గోధుమలు దిగుమతి అవుతుంటాయి. నిషేధానికి ముందు కాలంలో మాత్రమే భారత గోధుమల దిగుమతుల విలువ సుమారు 734 మిలియన్ డాలర్లకు పైగా ఉండగా.. ఇది లక్షల టన్నుల పరిమాణంలో జరిగింది. నిషేధం తరువాత కొంతమేర మినహాయింపులతో మాత్రమే సరఫరా కొనసాగింది.

బియ్యం: విషయంలో కూడా భారతదేశం ప్రధాన సరఫరాదారే. బాస్మతి కాకుండా సాధారణ బియ్యం రకాలను బంగ్లాదేశ్ తన దేశీయ అవసరాలు, ప్రభుత్వ నిల్వల కోసం భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది.

చక్కెర మరో ముఖ్యమైన ఉత్పత్తి. ఆహార తయారీ పరిశ్రమతో పాటు గృహ వినియోగానికి కూడా ఇది అవసరం. ఒకే సంవత్సరంలో భారతదేశం నుంచి బంగ్లాదేశ్‌కు వందల మిలియన్ డాలర్ల విలువైన చక్కెర ఎగుమతి జరిగింది.

రోజువారీ వంటలో ఉపయోగించే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి వంటి కూరగాయలు కూడా ప్రధానంగా భారత్ నుంచే వస్తాయి. వీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే, బంగ్లాదేశ్‌లో ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి.

అదే విధంగా సుగంధ ద్రవ్యాలు, ఇతర ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు కూడా భారత ఎగుమతుల్లో ముఖ్యమైన భాగం. ఇవి అక్కడి వినియోగదారుల అవసరాలతో పాటు ఆహార పరిశ్రమను నిలబెడతాయి.

పరిశ్రమలకు కీలకమైన భారతీయ సరఫరాలు:

బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు పత్తి వెన్నెముక లాంటిది. భారతదేశం నుంచి వెళ్లే మొత్తం పత్తి ఎగుమతుల్లో సుమారు మూడవ వంతు బంగ్లాదేశ్‌కే చేరుతుంది. ఇది అక్కడి గార్మెంట్ రంగానికి కీలక ఆధారం. ఇదే కాకుండా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్‌లు, ఉక్కు, విద్యుత్ పరికరాలు వంటి పారిశ్రామిక వస్తువులు కూడా భారత్ నుంచే పెద్ద ఎత్తున దిగుమతి అవుతాయి. మందులు, వైద్య పరికరాలు విషయంలోనూ భారతదేశం బంగ్లాదేశ్‌కు ప్రధాన సరఫరాదారుగా ఉంది.

భారతదేశంపై బంగ్లాదేశ్ ఆధారపడటానికి కారణాలు:

భౌగోళికంగా బంగ్లాదేశ్‌కు భారతదేశంతో 4,300 కి.మీ.లకు పైగా సరిహద్దు ఉంది. ఇది దాదాపు 94 శాతం భూసరిహద్దు భారత్‌తోనే పంచుకుంటుంది. ఈ సమీపత వల్ల రవాణా ఖర్చులు తక్కువగా ఉండటం, సరఫరా వేగంగా చేరడం బంగ్లాదేశ్‌కు పెద్ద లాభం. అందుకే చౌకగా, త్వరగా లభించే భారతీయ వస్తువులపై అక్కడి ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడుతోంది.

Also Read: 8th Pay Commission: కొత్త పే స్కేల్‌పై రచ్చ.. ఆందోళనలో ఉద్యోగులు.. అసలు ఈ వివాదమేంటి? ఎంప్లాయిస్‌ డిమాండ్ ఏంటి..?

వాణిజ్యం, అభివృద్ధిపై ప్రభావం:

ఇటీవలి సంవత్సరాల్లో భారత్–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 16 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. బంగ్లాదేశ్ భారత్‌కు ఎగుమతులు చేస్తున్నప్పటికీ, దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉంది. గత ఎనిమిదేళ్లలో భారత్ బంగ్లాదేశ్‌కు సుమారు 8 బిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయాన్ని అందించింది. రహదారులు, రైల్వేలు, పోర్టులు వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషించింది.

ఈ సహకారం వల్ల షేక్ హసీనా పాలన కాలంలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. మొత్తం GDP, తలసరి ఆదాయం రెండూ భారీగా పెరిగాయి. అందుకే భారత్‌తో వాణిజ్య సంబంధాల్లో వచ్చే ఏ చిన్న అంతరాయం కూడా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read: EPS Pension: రూ. 1000 నుంచి రూ. 7500కు పెన్షన్ పెంపు... ప్రభుత్వం కీలక అప్‌డేట్..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Dec 24, 2025 07:16:01
Hyderabad, Telangana:

8th Pay Commission Salary Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరల భారంతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక భారీ ఊరట లభించబోతోంది. 2025 డిసెంబరు 31 నాటికి 7వ వేతన సంఘం పదవీకాలం ముగియనుండటం వల్ల అందరి దృష్టి ఇప్పుడు 8వ వేతన సంఘం అమలుపైనే ఉంది. దీని ద్వారా వేతనాలు, కరువు భత్యం (DA), పెన్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.

నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని సవరించాల్సి ఉంటుంది. ప్రస్తుత 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 2025లో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి సంబంధించిన విధివిధానాలను ఆమోదించినట్లు సమాచారం. కొత్త వేతన సంఘం అనగా 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుండి అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

జీతాలు ఎంత పెరగొచ్చు? (అంచనా)
గతంలో ఏర్పాటైన 6వ, 7వ వేతన సంఘాల గణాంకాలను పరిశీలిస్తే.. రాబోయే 8వ వేతన సంఘం సిఫారసు చేయనున్న జీతాల పెంపు ఏ స్థాయిలో ఉండబోతుందో ఒక అంచనాకు రావచ్చు. 

వేతన సంఘం పెంపు శాతం (సుమారుగా)
6వ వేతన సంఘం 40%
7వ వేతన సంఘం 23% - 25%
8వ వేతన సంఘం (అంచనా) 20% - 35%

ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి.

జీతం ఎప్పటి నుండి చేతికి అందుతుంది?
8వ వేతన సంఘం జనవరి 2026 నుండి అమల్లోకి వచ్చినప్పటికీ, పెరిగిన జీతం వెంటనే చేతికి అందకపోవచ్చు. ఎందుకంటే,  కమిషన్ సిఫార్సులను సమర్పించిన తర్వాత కేంద్ర మంత్రివర్గం వాటిని ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో పెరిగిన జీతాలు, పెన్షన్లు 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అమలులో జాప్యం జరిగినప్పటికీ, జనవరి 1, 2026 నుండి లెక్కగట్టి అరియర్స్ రూపంలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం వివిధ వర్గాల నుండి సేకరించిన అంచనాలపై ఆధారపడి ఉంటుంది. అధికారిక పెంపుదల, నిబంధనల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ నోటిఫికేషన్ చూడటం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.

Also Read: January 2026 Holidays: జనవరిలో సెలవుల జాతర..13 రోజులు సెలవులే సెలవులు..పండగలతో ఫుల్ ఎంజాయ్!

Also Read: Nara Brahmani Cricket: క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న మంత్రి నారా లోకేష్ భార్య..బర్త్‌డే రోజు బ్యాట్ పట్టిన నారా బ్రాహ్మణి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 24, 2025 06:36:43
Hyderabad, Telangana:

School Holidays In January 2026: మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది (2026 సంవత్సరం)లోకి అడుగుపెట్టబోతున్నాం. సాధారణంగా కొత్త సంవత్సరం రాగానే అందరూ చూసేది క్యాలెండర్. అయితే రాబోయే జనవరి నెలలో ఎక్కువ పబ్లిక్ హాలీడేలు ఉండడం వల్ల సెలవుల పరంగా విద్యార్థులకు, ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. పండగలు, ఆప్షనల్ హాలిడేస్, ఆదివారాలు అన్నీ కలిపి జనవరిలో దాదాపు 13 రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ క్రమంలో 2026 జనవరిలో ఏఏ రోజులు సెలవులు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

న్యూఇయర్ వేడుకలు..
జనవరి 1 (గురువారం): న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆప్షనల్ హాలిడే ఉంది. చాలా విద్యాసంస్థలు కూడా దీనికి సెలవు ప్రకటిస్తాయి.
జనవరి 3 (శనివారం): హజ్రత్ అలీ పుట్టినరోజు సందర్భంగా ఆప్షనల్ హాలిడే.
జనవరి 4 (ఆదివారం): సాధారణ సెలవు.

Also Read: Naga Chaitanya Become Father: తాత కాబోతున్న అక్కినేని నాగార్జున..నాగచైతన్య-శోభిత కాదంట! నాగార్జున రియాక్షన్ ఇదే!

సంక్రాంతి సందడి
తెలుగు వారి పెద్ద పండుగే కాకుండా తమిళనాడు, కర్ణాటకలో సంక్రాంతిని ఘనంగా జరుపుకొంటారు. ఈసారి సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రానున్నాయి. జనవరి 10న రెండో శనివారం కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవు ఉండనుంది. ఆ తర్వాత జనవరి 11న ఆదివారం కావున సాధారణ సెలవు కానుంది. 

అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14, 15, 16 (బుధ, గురు, శుక్ర).. అనగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగల నాడు వరుసగా మూడు రోజులు సెలవు రానుంది. ఏపీలో ఈ మూడ్రోజులు సాధారణ సెలవులు కాగా, తెలంగాణలో 16వ తేదీన (కనుమ) ఆప్షనల్ హాలిడేగా ఉంది.

జనవరి 17 (శనివారం): షబ్-ఈ మేరాజ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే.

జనవరి 18 (ఆదివారం): సాధారణ సెలవు.

గమనిక: విద్యార్థులకు జనవరి 10 నుండి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉండే అవకాశం ఉంది.

రిపబ్లిక్ డే, లాంగ్ వీకెండ్..
నెల ఆఖర్లో మరో లాంగ్ వీకెండ్ మనకు స్వాగతం పలుకుతోంది. జనవరి 23న శుక్రవారం నాడు శ్రీపంచమి (వసంత పంచమి) సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉండనుంది. అలాగే జనవరి 25న ఆదివారం కావడం వల్ల ఆ రోజున సాధారణ సెలవు కానుంది.

జనవరి 26 (సోమవారం): రిపబ్లిక్ డే (నేషనల్ హాలీడే). ఆది, సోమవారాలు వరుసగా సెలవులు రావడంతో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది మంచి అవకాశం. ఈ విధంగా జనవరి నెలలో అత్యధికంగా 13 రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. 

Also Read: Movie Release This Week: 2025లో చివరిగా థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే! ఏది 'ఛాంపియన్' అవుతుందో?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Dec 24, 2025 04:59:39
Secunderabad, Telangana:

PM Jan Aushadhi VS Dawa India: నేడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డయాబెటిస్, హైపర్ టెన్షన్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, లివర్ సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో దేశంలో అధిక ధరల కారణంగా చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు అవసరమైన ఔషధాలను కొనుగోలు చేయలేకపోతున్నారు. భారతదేశంలో వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో.. తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందించడమే లక్ష్యంగా రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకొచ్చాయి. అవే పీఎం జన ఔషధి కేంద్రాలు, దావా ఇండియా స్టోర్లు. రెండింటి ఉద్దేశం ఒకటే అయినా.. నిర్వహణ విధానం, ధరల నిర్ణయం, విస్తరణ విధానంలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి.

పీఎం జన ఔషధి అంటే ఏమిటి?

ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. 2008లో ప్రారంభమైంది. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేత్రుత్వంలో విస్త్రుతంగా అమలు అవుతోంది. భారతదేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దారి తీసిన ప్రధాన కార్యక్రమాల్లో ఇది ఒకటి. ఈ జన ఔషధి ఔషధాలు అధిక ఖర్చుతో కూడిన బ్రాండ్ ఔషధాలకు బదులుగా ప్రజలకు తక్కువ ధరకే లభించడం వల్ల వారిపై ఉన్న వైద్య ఖర్చుల భారాన్ని కూడా తగ్గిస్తున్నాయి. గ్రామీణ, అర్బన్ పేద ప్రజలు కూడా తక్కువ ధరలకే నాణ్యమైన ఔషధాలను కొనుగోలు చేసే అవకాశం లభించింది. ఈ స్కీమును దీనిని Bureau of Pharma PSUs of India (BPPI) నిర్వహిస్తోంది.

ఈ కేంద్రాల్లో ప్రధానంగా జెనరిక్ మందులు విక్రయిస్తారు. అంటే బ్రాండ్ పేరు లేకుండా.. అదే ఫార్ములాతో తక్కువ ధరకు ఔషధాలు లభిస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,000కు పైగా జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. ఇవి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించాయి. దేశంలో అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ లో ఉన్నాయి. తర్వాత కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోనూ వేగంగా విస్తరిస్తున్నాయి.

దవా ఇండియా అంటే ఏమిటి?

దవా ఇండియా ఒక ప్రైవేట్ ఫార్మసీ చైన్. దీనిని డాక్టర్ సుజయ్ సన్‌దర్ స్థాపించారు. దవా ఇండియా కూడా జెనరిక్ మందులనే విక్రయిస్తుంది. కానీ ఇది పూర్తిగా ఫ్రాంచైజీ మోడల్ మీద నడుస్తుంది. ప్రస్తుతం దావా ఇండియా స్టోర్లు 15కిపైగా రాష్ట్రాల్లో ఉన్నాయి. వేగంగా విస్తరిస్తూ, మెట్రో నగరాలు, టియర్-2, టియర్-3 పట్టణాలపై ఎక్కువ దృష్టి పెడుతోంది. సాధారణ దుకాణాలతో పోలిస్తే జనరిక్ షాపుల్లో మెడిసిన్స్ ధర తక్కువగా ఉంటాయి. అందుకే ప్రజలు జనరిక్ మెడికల్ షాపులను వెతుక్కుంటూ వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే దావా ఇండియా ఏర్పడింది. ఈ కంపెనీ ఉత్పత్తులు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. దవా ఇండయా స్టోర్లు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. జనరిక్ ఔషధాలు, ఓటీసీ, సౌందర్య సాధనాలు, న్యూట్రాస్యూటికల్స్, ప్రొటీన్ సప్లిమెంట్స్, ఆయుర్వేద ఉత్పత్తుల విభాగంలో దవా ఇండియా సేవలను అందిస్తోంది. ముఖ్యంగా జనరిక్ ఔషధాలను తక్కువ ధరలకు అందించడం దీనికి ప్రధాన లక్ష్యం.

Also Read: Ayushman Bharat Card: ఆయుష్మాన్ కార్డు ఎలా పొందాలి? దరఖాస్తు చేసుకోవడం ఎలా ? రూ. 5లక్షల ఉచిత వైద్యం పొందేందుకు మీరు అర్హులా? కాదా? ఇలా తెలుసుకోవచ్చు..!!

ఈ రెండింటిలో ఔషధాల ధరలు ఎందులో తక్కువ?

-ధరల విషయంలో రెండు కూడా బ్రాండ్ మందుల కంటే 50శాతం నుంచి 90శాతం వరకు తక్కువ ధరలకు ఔషధాలను అందిస్తాయి.

-పీఎం జన ఔషధి మందులు ప్రభుత్వ నియంత్రణలో ఉండటం వల్ల సాధారణంగా అత్యల్ప ధరలు ఉంటాయి.

-దవా ఇండియా మందులు కూడా చౌకగానే ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో జన ఔషధి కంటే స్వల్పంగా ఎక్కువ ఉండొచ్చు.

-అయితే దవా ఇండియా స్టోర్లలో ఒకే చోట అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం కొంతమందికి సౌకర్యంగా ఉంటుంది.

ఔషధాల నాణ్యతలో తేడా ఉందా?

ఈ రెండు వేదికల్లో విక్రయించే మందులు భారత ఔషధ నియంత్రణ సంస్థల అనుమతితో తయారవుతాయి. పీఎం జన ఔషధి మందులు ప్రభుత్వ పర్యవేక్షణలో తయారవుతాయి. దవా ఇండియా కూడా WHO-GMP ప్రమాణాలు పాటించే తయారీదారుల నుంచే మందులు తీసుకుంటుంది. అందువల్ల నాణ్యత పరంగా పెద్దగా తేడా లేదు. బ్రాండ్ పేరు మాత్రమే మారుతుంది.

అవుట్‌లెట్స్ ఎక్కడ ఎక్కువ?

-పీఎం జన ఔషధి: గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో విస్తృతంగా ఉన్నాయి.

-దవా ఇండియా: నగరాలు, అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

Also Read: Sukanya Samriddhi Scheme: ఏ వయస్సున్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది? అర్హతలు ఏంటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి..?

సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?

-వైద్య ఖర్చులు భారీగా తగ్గుతాయి.

-దీర్ఘకాలిక వ్యాధుల మందులు చౌకగా లభిస్తాయి.

-ప్రభుత్వ, ప్రైవేట్ ఎంపికలు రెండూ అందుబాటులో ఉంటాయి.

-ఆరోగ్య భద్రత పెరుగుతుంది.

మీకు తక్కువ ధరకే మెడిసిన్స్ లభ్యం కావాలంటే.. పీఎం జన ఔషధి మంచిది. సులభంగా లభ్యత, ప్రైవేట్ సర్వీస్ అనుభవం కావాలంటే దవా ఇండియా అనుకూలం. రెండు కూడా సామాన్యుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన వ్యవస్థలే అని చెప్పాలి.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Dec 24, 2025 03:24:05
Secunderabad, Telangana:

Gold Rate Today: పసిడి, వెండి ధరలు ఊహించని రీతిలో పెరుగుతూ.. రోజుకో సరికొత్త గరిష్ట రికార్డులను నమోదు చేస్తున్నాయి. గత కొంత కాలంగా అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోతపై పెరుగుతున్న అంచనాలు.. డాలర్ కదలికలు..ఇవన్నీ కలిసి విలువైన లోహాలపై పెట్టుబడులను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ తాజా గణాంకాల ప్రకారం.. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,560కు చేరుకుని ఆల్‌టైమ్ రికార్డును సృష్టించింది. గత రోజు ధరతో పోలిస్తే ఇది రూ.2,400 పెరిగింది. అలాగే 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.2,200 పెరిగి రూ.1,27,010 వద్ద స్థిరపడింది. ఈ ధరలు సామాన్య కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇస్తున్నాయి.

వెండి పరిస్థితి మరింత ఆందోళన కలిగించేలా ఉంది. కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.3,100 పెరిగి రూ.2,34,100కు చేరి చరిత్రాత్మక గరిష్ఠాన్ని తాకింది. గత కొన్ని నెలలుగా వెండి ధరల్లో కొనసాగుతున్న ర్యాలీ ఇప్పుడు వేగం పెంచుకుంది. అమెరికా – వెనెజువెలా మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు.. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత వాతావరణం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

డాలర్ విలువలో మార్పులు కూడా బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. డాలర్ బలహీనపడినప్పుడు పెట్టుబడిదారులు సురక్షిత ఆశ్రయంగా బంగారాన్ని ఎంచుకుంటారు. ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెరగడంతో బంగారం మీద డిమాండ్ మరింత పెరిగింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడిన సందర్భాల్లోనూ ధరల ఊగిసలాట కనిపిస్తోంది.

Also Read: China Gold Reserve: రెండో అతిపెద్ద ఆవిష్కరణ.. ఆసియాలో భారీగా బంగారు సంపదను కనుగొన్న చైనా.. ఎక్కడంటే..?

ఈ ఏడాది పెట్టుబడుల విషయానికి వస్తే.. బంగారంతో పోలిస్తే వెండి పెట్టుబడులు అధిక లాభాలను ఇచ్చినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. పారిశ్రామిక అవసరాల కోసం వెండిపై డిమాండ్ గణనీయంగా పెరగడం, సరఫరా పరిమితంగా ఉండడం వల్ల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్ ఎనర్జీ రంగాల్లో వెండి వినియోగం పెరగడం ధరలకు మరింత బలం ఇస్తోంది.

బంగారం ధరలు ఈ స్థాయికి చేరుకోవడంతో సామాన్యులు ఆభరణాల కొనుగోలును వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడింది. వెండి ధర కూడా ఏడాది కాలంలో దాదాపు రెట్టింపుకు పైగా పెరగడం విశేషం. ఈ పరిస్థితులు కొనసాగితే, రానున్న రోజుల్లో విలువైన లోహాల ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read:  Gold Price Prediction: 2050 నాటికి 10 గ్రాముల బంగారం ఎంత ఉంటుంది? ఇప్పుడు బంగారం కొనాలా? లేదా ఇల్లు కట్టుకోవాలా? నిపుణుల సలహా ఇదే..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
RGRenuka Godugu
Dec 24, 2025 02:38:52
Hyderabad, Telangana:

RRB Group D Recruitment 2026: రైల్వే భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఎలక్ట్రిక్, మెకానికల్, ట్రాఫిక్ విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనుంది. ఎన్నో రోజులుగా కేంద్ర ప్రభుత్వ కొలువు కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు ఇది బంపర్ ఛాన్స్. దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో కలిపి 22 వేల గ్రూప్ డీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఆర్‌ఆర్‌బీ ప్రధానంగా పూర్తిస్థాయి నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదల కానుంది. దీనికి అర్హత 18 నుంచి 33 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. 2026 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు కేంద్ర బలగాల్లో 25 వేలకు పైగా పోస్టుల భర్తీకి కూడా ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 22 వేల గ్రూప్ డీ లెవెల్ 1 పోస్టుల భర్తీ చేయనుంది. ఎన్నో రోజులుగా రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. మొత్తంగా 11 వేల వేకెన్సీలు పూర్తిగా ట్రాక్ మెయింటెనెన్స్‌ గ్రేడ్ 4 పోస్టులకు కేటాయించారు.

 రైల్వే షార్ట్‌ నోటిఫికేషన్ ప్రకారం ట్రాక్ మెయింటెనెన్స్‌ గ్రేడ్ 4, పాయింట్స్‌మెన్‌ బీ అసిస్టెంట్ రోల్స్ లలో ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ డిపార్ట్‌మెంట్‌లలో వారికి భర్తీ చేయనున్నారు. వీరికి మొదట్లో రూ.18 వేల జీతం ప్రారంభంలో ఉంటుంది.

 అర్హత..
 ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు. పదో తరగతి గుర్తింపు పొందిన బోర్డు నుంచి పొంది ఉండాలి. ఐటిఐ సర్టిఫికెట్ లేదా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. ఇక వీరి వయసు 18 నుంచి 32 మధ్యలో ఉండాలి 

 అప్లై చేసుకునే విధానం..
 రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్ డీ పోస్టులు 2026 దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ లో ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా RRB వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ హోం పేజీలో 'CEN 2026 గ్రూప్ డి' ఆప్షన్ ఎంపిక చేసుకుని మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ మీ వివరాలు నమోదు చేసి, స్కాన్ చేసిన ఫోటో, సిగ్నేచర్ కూడా అప్‌లోడ్ చేయాలి. చివరిగా నిర్దిష్ట ఫీజు చెల్లించి ప్రింట్ అవుట్ తీసి భద్రపరుచుకోవాలి. 

 ఎంపిక ప్రక్రియ..
ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ పోస్టులకు 90 నిమిషాల కంప్యూటర్ బెస్ట్ పరీక్ష ఉంటుంది. మొత్తం 100 మార్కులకు జనరల్ సైన్స్ ,మ్యాథమెటిక్స్ నుంచి ఒక్కొక్కటి 25 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 30 ప్రశ్నలు. జనరల్ అవేర్‌నెస్, కరెంట్ ఎఫైర్స్ 20 మార్కుల ప్రశ్నలు ఉంటాయి.

 శారీరిక పరీక్ష..
 పురుషులకు 100 మీటర్ల దూరాన్ని 35 కిలోల బరువుతో రెండు నిమిషాలు అధిగమించాలి. 1000 మీటర్ల పరుగు పందెం 4:15 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక స్త్రీలు 100 మీటర్ల దూరం 20 కిలోల బరువుతో రెండు నిమిషాల్లో అధిగమించాలి. 1000 మీటర్ల పరుగు పందెం 5: 42 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

Read more: రైలు ప్రయాణీకులకు బ్యాడ్‌న్యూస్‌.. భారీగా టిక్కెట్‌ ఛార్జీల పెంపు..! ఏసీ, నాన్‌ఏసీ ధరలు ఇవే..!

Read more: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. డిసెంబర్‌ 31 స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Dec 23, 2025 12:16:47
Secunderabad, Telangana:

Business Ideas: ఆర్థికంగా ఎదగాలన్న బలమైన సంకల్పంతో ఉన్నవారికి ఉద్యోగం చేస్తే వచ్చే జీతం సరిపోదు. ఆదాయం వచ్చినంత వేగంగా ఖర్చులు, అవసరాలు, బాధ్యతలు, పొదుపులు అన్నీ పోయిన తర్వాత.. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అందుకే అదనపు ఆదాయ మార్గం తప్పనిసరిగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఈ అవసరాన్ని గ్రహించిన కొందరు ఫ్రీలాన్సింగ్ వైపు అడుగులు వేస్తే.. మరికొందరు ఆన్‌లైన్ వ్యాపారాలు లేదా రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో అవకాశాలు వెతుక్కుంటారు. ప్రతి ఒక్కరూ తమ ఆసక్తులు, నైపుణ్యాలను బట్టి ఒక సైడ్ బిజినెస్‌ను ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

ఈ క్రమంలో మరో లాభదాయకమైన.. కానీ చాలా మందికి పూర్తిగా తెలియని మార్గం అగ్రి–బిజినెస్. ముఖ్యంగా గంధపు చెట్ల సాగు ఒక దీర్ఘకాలిక పెట్టుబడిగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశముంది. గంధపు చెక్కకు మన దేశంలోనే కాదు.. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా భారీ విలువ ఉంది. ప్రత్యేకమైన సువాసన, ఔషధ, ఆధ్యాత్మిక ఉపయోగాల కారణంగా దీనికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అయితే ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే సహనం, ప్రణాళిక, సరైన సంరక్షణ చాలా కీలకం.

గంధపు తోటల సాగు ప్రారంభించాలంటే ముందుగా సరైన భూమిని ఎంపిక చేసుకోవాలి. ఉష్ణమండల లేదా ఉపఉష్ణమండల వాతావరణం గంధపు చెట్లకు అనుకూలంగా ఉంటుంది. నేల రకం, వాతావరణ పరిస్థితులు దిగుబడిపై నేరుగా ప్రభావం చూపుతాయి. మంచి నాణ్యత గల విత్తనాలు లేదా మొలకలను ఎంపిక చేయడం అత్యంత ముఖ్యం. సాధారణంగా వీటిని ముందుగా నర్సరీల్లో పెంచి, తర్వాత తోటల్లో నాటుతారు. నీటిపారుదల, తెగుళ్ల నియంత్రణ, క్రమమైన కత్తిరింపు వంటి సంరక్షణ చర్యలు చెట్ల ఆరోగ్యానికి, నూనె అధికంగా ఉన్న హార్ట్‌వుడ్ అభివృద్ధికి అవసరం దోహదపడుతుంది.

Also Read: 8th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. 2026లో రిటైర్ అవుతున్నారా? మీకు పెన్షన్ ఎంత వస్తుంది?

గంధపు చెక్క సాగు తక్షణ లాభాలు ఇచ్చే వ్యాపారం కాదు. ఇది దీర్ఘకాలిక దృష్టితో చేయాల్సిన పెట్టుబడి. చెట్లు పూర్తిగా పరిపక్వం చెందడానికి సాధారణంగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. సేంద్రీయ పద్ధతులు అనుసరిస్తే ఈ కాలాన్ని కొంత తగ్గించవచ్చు. చెట్లు పెరిగే కొద్దీ వాటి నుంచి ప్రత్యేకమైన సువాసన రావడం మొదలవుతుంది. ఆ దశలో జంతువులు, అక్రమంగా చెట్లు నరికి వేయే వారి నుంచి రక్షణ అవసరం అవుతుంది. ఇసుకతో నిండిన ప్రాంతాలు లేదా తీవ్రమైన మంచు వాతావరణం మినహా, గంధపు చెట్లు చాలా ప్రాంతాల్లో బతికే సామర్థ్యం కలిగి ఉంటాయి.

లాభాల విషయానికి వస్తే, గంధపు చెక్క వ్యాపారం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఒక పూర్తిగా పెరిగిన చెట్టు నుంచి సంవత్సరానికి లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కొద్ది చెట్లతోనే మంచి ఆదాయం సాధించవచ్చు. పెద్ద స్థాయిలో సాగు చేసినవారికి ఇది కోట్ల రూపాయల వ్యాపారంగా మారే అవకాశమూ ఉంది.

అయితే.. ఈ రంగంలోకి అడుగుపెట్టే ముందు ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా తెలుసుకోవాలి. గంధపు చెట్లను నాటుకోవడం చట్టబద్ధమైనదే అయినప్పటికీ, వాటి అమ్మకం ప్రభుత్వం నియంత్రణలో ఉంటుంది. అటవీ శాఖ అనుమతితోనే చెట్ల విక్రయం జరగాలి. అందువల్ల, చట్టపరమైన ప్రక్రియలను పాటిస్తూ ముందుకెళ్లినప్పుడే ఈ అగ్రి–బిజినెస్ నిజమైన లాభాలను అందిస్తుంది.

Also Read: RBI Repo Rate Cut: లోన్‌ తీసుకునేవారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్బీఐ.. EMIల తగ్గనున్నాయ్..పూర్తి వివరాలివే..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Dec 23, 2025 10:43:27
Secunderabad, Telangana:

Union Budget 2026: 2026-27 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే ముందు కేంద్రం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి బడ్జెట్ రూపకల్పనలో సామాన్య ప్రజల అభిప్రాయలను నేరుగా చేర్చాలన్న ఉద్దేశ్యంతో.. పౌరుల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానిస్తోంది. పన్నులు, ద్రవ్యోల్బణం, ఉపాధి, అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలు వంటి అంశాలపై ప్రజలు.. ఇప్పుడు తమ అభిప్రాయాలను డైరెక్టుగా ప్రభుత్వానికి తెలియజేసే అవకాశాన్ని కల్పించింది. ఈ సౌకర్యం  MyGov వేదిక ద్వారా అందుబాటులో ఉంది.

ప్రతి ఏడాది బడ్జెట్ కు సంబంధించి సాధారణ ప్రజల్లో అనేక ఆశలు, అంచనాలు ఉంటాయి. కొందరు పన్నుల భారాన్ని తగ్గించాలని కోరుకుంటే.. ఇంకొందరు ధరల పెరుగుదల నియంత్రణపై దృష్టి పెట్టాలని కోరుతుంటారు. అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు మద్దతు ధరలు, మధ్య తరగతి కుటుంబాలకు ఊరట కల్పించే అంశాలను కూడా ప్రజల చర్చల్లో ముందుగా ఉంటాయి. అయితే ఇలాంటి అభిప్రాయాలను ప్రభుత్వానికి నేరుగా తెలిపేందుకు సరైన వేదిక ఉండకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ముందడుగు వేసింది.

Also Read: 8th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. 2026లో రిటైర్ అవుతున్నారా? మీకు పెన్షన్ ఎంత వస్తుంది?

బడ్జెట్ మరింత సమగ్రంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలంటే.. పౌరుల అభిప్రాయం కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సాధారణ పౌరులు గొంతు వినిపించాలి అనే ఐడియాతో  MyGov ఫ్లాట్ ఫామ్ ద్వారా సూచనలకు ఆహ్వానిస్తోంది. ఈ వేదిక ద్వారా ప్రజలు తమ ఆలోచనలు.. సమస్యలు.. సలహాలు నేరుగా పంచుకునే ఛాన్స్ ఉంది. ఇక ప్రభుత్వానికి మీ సూచలను ఎలా పంపించాలన్న విషయం చాలా సులభంగా ఉంది.

-ముందుగా  MyGov.in అనే అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

-హోం పేజీలో కిందికి స్క్రోల్ చేస్తే పాల్గొనండి.. దేశ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనండి అనే కేటగిరి కనిపిస్తుంది.

-అక్కడ చర్చించు ( Discuss) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

-ఇప్పుడు కేంద్ర బడ్జెట్ 2026-27కు సంబంధించి ప్రత్యేక బ్యానర్ కనిపిస్తుంది.

-దానిపై క్లిక్ చేసి తర్వాత.. మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి.

-లాగిన్ అయ్యాక ఒక కామెంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను పంచుకోవచ్చు.

Also Read: RBI Repo Rate Cut: లోన్‌ తీసుకునేవారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్బీఐ.. EMIల తగ్గనున్నాయ్..పూర్తి వివరాలివే..!!

మరింత సులభంగా చేయాలనుకుంటే నేరుగా  MyGov.in వెబ్ సైట్లోని బడ్జెట్ సూచనల పేజీకి వెళ్లి లాగిన్ అయిన తర్వాత మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. అదే విధంగా  MyGov.in మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని.. యాప్ ద్వారానే ప్రభుత్వానికి నేరుగా సలహాలు పంపించే ఛాన్స్ ఉంది. పోర్టల్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. జనవరి 16వ తేదీ వరకు ప్రజలు తమ సూచనలు సమర్పించవచ్చు. ఆ తర్వాత వాటిని పరిశీలించి బడ్జెట్ సన్నాహాల్లో ఉపయోగించే ఛాన్స్ ఉంటుంది.

ప్రతి ఏడాది మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. 2026 ఫిబ్రవరి 1 ఆదివారం వచ్చినా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదే రోజున బడ్జెట్ సమర్పించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటికే బడ్జెట్ కు సంబంధించిన ప్లాన్స్ ప్రారంభం అయ్యాయి. మందుస్తు బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక మంత్రి, ఆర్థిక నిపుణులు, పలు రంగాల ప్రతినిధులు, రైతుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. వీరితోపాటు ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యే ఛాన్స్ లభించడం విశేషమని చెప్పాలి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
IPInamdar Paresh
Dec 23, 2025 10:04:21
Hyderabad, Telangana:

Couple kissing and hugs in delhi metro video: ఇటీవల కాలంలో కొంత మంది యువతీ, యువకులు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. కామంతో మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అసలు వారు చేస్తున్న పనులు చూస్తుంటే చుట్టుపక్కల ఉన్న వారు భయంతో పారిపోతున్నారు. బస్టాండ్ లు , రైల్వేలు, మెట్రోలు, పబ్లిక్ ప్రదేశాల్లో కామంతో  పాడుపనులు చేస్తున్నారు.  ఒకరికి మరోకరుముద్దులు పెట్టుకుంటూ, హగ్ లు చేసుకుంటున్నారు.

 

రన్నింగ్ కారుల్లో, బైక్ ల మీద పాడుపనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట బాగా వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇటీవల మెట్రోలు , రైల్వేలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ మెట్రొలో జరిగిన ఘటన నెట్టింట బాగా వైరల్గా మారింది.  

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతీ, యువకులు డొర్ వద్ద నిలబడ్డారు. యువకుడు అమ్మాయి వెనకాల నిల్చొని ఆమెను కామంతో రెచ్చగొట్టాడు. ఆమెకు ముద్దులు పెడుతూ, హగ్ చేసుకున్నాడు. యువతి కూడా తానేం తక్కువనాఅన్నట్లుయువకుడ్ని వాటేసుకుని అతడి కామదాహన్ని తీర్చింది.

Read more:Doctor assaults Patient Video: ఓర్నాయనో చికిత్స కోసం వస్తే.. రోగిని చావబాదిన డాక్టర్.. వీడియో వైరల్..

మొత్తంగా ఇద్దరు కూడా చుట్టుపక్కల జనాలు ఉన్నారన్న మినిమం విషయంకూడా మర్చిపోయి రోడ్డుపైన పశువుల్లా మారి రొమాన్స్ చేసుకున్నారు. వీరి యవ్వారంను కొంత మంది సీక్రెట్ గా రికార్డుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ఇంత బరితెగింపు ఏంటని ఫైర్ అవుతున్నారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Dec 23, 2025 06:12:27
Secunderabad, Telangana:

Nihao China VS UPI One World: కొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే చైనా.. ఇప్పుడు విదేశీ ప్రయాణికుల కోసం ఈ మధ్యే నిహావో చైనా అనే కొత్త మొబైల్ యాప్ ప్రారంభించింది. ఈ యాప్ భారత్ లో అందుబాటులో ఉన్న యూపీఐ పిన్ వరల్డ్ సర్వీసుతో చాలా మంది దాన్ని పోల్చుతున్నారు. ఈ రెండు సర్వీసుల ముఖ్య ఉద్దేశ్యం విదేశీ పర్యాటకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడమే అయినప్పటికీ.. వాటి విధానం.. ఫీచర్లు, ఉపయోగంలో భారీగా తేడాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నిహావో చైనా యాప్ ఏంటో..?యూపీఐ వన్ వరల్డ్ ఏంటి?.. ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటో?.. తెలుసుకుందాం.

నిహావో చైనా యాప్ అంటే ఏమిటి?

నిహావో చైనా యాప్.. అనేది చైనాను సందర్శించే విదేశీ ప్రయాణికుల కోసం రూపొందించిన ఒక ఆల్-ఇన్-వన్ మొబైల్ యాప్. చైనాలో గూగుల్.. ఉబెర్.. వాట్సాప్ వంటి అంతర్జాతీయ యాప్‌లు పనిచేయవు. దీంతో అక్కడికి వెళ్లే పర్యాటకులకు నావిగేషన్.. కమ్యూనికేషన్.. చెల్లింపులు వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యలకు పరిష్కారంగా చైనా ప్రభుత్వం నిహావో చైనా యాప్‌ను తీసుకొచ్చింది.

ఈ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు.. మ్యాప్‌లు.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వివరాలు.. బస్సు–మెట్రో సమాచారం.. లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి అనేక సర్వీసులను ఒకే చోట పొందవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ట్రాన్స్ క్షన్స్ చేసుకోవచ్చు. అక్కడి భాష గురించి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానిక సర్వీసులను ఉపయోగించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అంతేకాదు వీసా సమాచారం, ఈ సిమ్ వివరాలు, పర్యాటక గైడ్ లైన్స్, ట్యాక్స్ రీఫండ్ సమాచారం వంటి ఇతర సౌకర్యాలను కూడా ఈ యాప్ అందిస్తుంది. ఈ యాప్ ద్వారా చైనాలో ప్రయాణం, నివాసం మరింత సులభంగా మారుతుంది.

UPI వన్ వరల్డ్ అంటే ఏమిటి?

UPI వన్ వరల్డ్ అనేది భారత్ వచ్చే విదేశీ ప్రయాణికుల కోసం రూపొందించిన డిజిటల్ చెల్లింపు సర్వీసు. ఇది ఒక ప్రత్యేక యాప్ కాదు.. కానీ UPI వ్యవస్థలో భాగంగా పనిచేసే సదుపాయం కల్పిస్తుంది. ఈ యాప్ ద్వారా విదేశీ పర్యాటకులు భారత్ లో తాత్కాలిక UPI IDని పొందుతారు. వారు తమ అంతర్జాతీయ బ్యాంక్ అకౌంట్స్ లేదా కార్డులను ఉపయోగించి మన దేశంలో UPI ద్వారా ట్రాన్స్ క్షన్స్ చేసుకోవచ్చు. హోటళ్లలో, రెస్టారెంట్లలో, దుకాణాల్లో, టాక్సీల్లో నగదు అవసరం లేకుండా సులభంగా డిజిటల్ పేమెంట్స్ చేయడానికి ఈ యాప్ సహాయపడుతుంది. విదేశీ కరెన్సీ మార్పిడి అవసరాన్ని తగ్గించడం ద్వారా పర్యాటకులకు ఇది చాలా అనుకూలంగా మారింది. భారతదేశాన్ని మరింత పర్యాటక స్నేహపూర్వక గమ్యస్థానంగా మార్చడంలో UPI వన్ వరల్డ్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పవచ్చు.

 

నిహావో చైనా vs UPI వన్ వరల్డ్: తేడాలు ఏమిటి?

నిహావో చైనా ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్. UPI వన్ వరల్డ్ అనేది ట్రాన్స్ క్షన్స్ చేసే సర్వీస్ మాత్రమే. నిహావో చైనా యాప్‌లో చెల్లింపులతో పాటు మ్యాప్‌లు, ట్రాన్స్ లేషన్, రవాణా, eSIM, టికెట్ బుకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది మొత్తం ప్రయాణ అనుభవాన్ని కవర్ చేస్తుంది. UPI వన్ వరల్డ్ ప్రధానంగా డిజిటల్ చెల్లింపులకే పరిమితమని చెప్పాలి. ఇది భారతదేశంలో ఉన్నప్పుడు విదేశీ ప్రయాణికులు సులభంగా పేమెంట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇతర ట్రావెల్ సంబంధించి సర్వీసులు ఇందులో ఉండవు.

Also Read: 8th Pay Commission: కొత్త పే స్కేల్‌పై రచ్చ.. ఆందోళనలో ఉద్యోగులు.. అసలు ఈ వివాదమేంటి? ఎంప్లాయిస్‌ డిమాండ్ ఏంటి..?

భారత్‌లో ఇలాంటి యాప్‌పై డిమాండ్:

నిహావో చైనా యాప్ విడుదలైన తర్వాత.. భారత్‌లో కూడా విదేశీ పర్యాటకుల కోసం ఇలాంటి ఆల్-ఇన్-వన్ యాప్ ఉండాలనే డిమాండ్ సోషల్ మీడియాలో పెరిగింది. కేవలం చెల్లింపులకే పరిమితం కాకుండా.. మ్యాప్‌లు, ట్రాన్స్‌పోర్ట్, ట్రాన్స్ లేషన్, ట్రావెల్ గైడ్ వంటి అన్ని ఫీచర్లు ఒకే యాప్‌లో ఉండాలని పలువురు సూచిస్తున్నారు. భారత్ కూడా ఇలాంటి సమగ్ర యాప్‌ను ప్రారంభిస్తే.. విదేశీ పర్యాటకులకు దేశం మరింత ఆకర్షణీయంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: EPS Pension: రూ. 1000 నుంచి రూ. 7500కు పెన్షన్ పెంపు... ప్రభుత్వం కీలక అప్‌డేట్..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
comment0
Report
christmas
Advertisement
Back to top