Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
Pushapa 2 stampede: పుష్ప 2 తొక్కిసలాటకు ఏడాది.. శ్రీ తేజ్ హెల్త్ కండీషన్ చెబితే ఎవరు పట్టించుకోవట్ల...
IPInamdar Paresh
Dec 04, 2025 07:13:45
Hyderabad, Telangana

Allu Arjun pushpa 2 movie stampede sritej health condition latest update: అల్లు అర్జున్ మూవీ పుష్ప2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. అనేక రికార్డుల్ని తిరగరాసింది.  అదే విధంగా ఈ మూవీ ప్రీమియర్ షోను చూసేందుకు వచ్చిన  ఒక కుటుంబంలో మాత్రం పెనువిషాదంను నింపింది. పుష్ప2 ప్రీమియర్ షోను సంధ్యథియేటర్ లో చూసేందుకు వచ్చిన ఒక కుటుంబం మాత్రం విషాదంలో మునిగిపోయింది. పుష్ప2 చూసేందుకు తన ఫ్యామిలీతో వచ్చిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

ఈ ఘటన జరిగి ఈరోజుతో (డిసెంబర్ 4) ఏడాది గడుస్తున్న ఇప్పటికి కూడా ఒంటి నిండా పైపులు, కనీసం శ్వాస, ఆహరం కూడా తీసుకొలేని స్థితిలో శ్రీతేజ్ ఉన్నాడు. ఆరునెలల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నరాలు చాలా వరకు చిట్లి పోవడంవల్ల ప్రతిరోజు అనేక రకాల థెరపీలు, ట్రీట్మెంట్ కొనసాగుతునే ఉంది.

ఏడాది గడుస్తున్న కూడా ఆకుటుంబం ఇంకా దుఃఖంలో కూరుకుపోయి ఉంది. శ్రీతేజ్ కు.. ద్రవాహారాన్ని పంపించేందుకు గ్సాస్ట్రోస్టోమీ పైపు అమర్చారు. దీనివల్ల శ్వాసకూడా తీసుకోలేడు. దీని వల్ల గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్‌ ను అమర్చారు. 

మెదడు కణాలు, పలు నరాలు దెబ్బతీనడం వల్ల  ఇప్పటికి సికింద్రాబాద్‌లోని ఆసియా ట్రాన్స్‌కేర్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో ట్రిట్మెంట్ తీసుకుంటున్నాడు. దీనికి నెలకు 90 నుంచి 95 వేలు ఖర్చవుతుందని తండ్రి చెబుతున్నాడు. ఇప్పటికే పుష్ప 2 మూవీ టీమ్.. పిల్లల పేరుమీద రూ.2 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారని శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ చెప్పారు. ఆ మొత్తానికి నెల నెలా బ్యాంకు వడ్డీ  ఆస్పత్రి ఖర్చులకే సరిపోతుందని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Read more: Balakrishna About Jai Balayya: అమ్మ కడుపులోనే జై బాలయ్య విన్నాను..బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..

ప్రతి నెలకు రూ.2 లక్షలు,  బాబు కాళ్లకు ఆపరేషన్‌ చేయించినప్పుడు అదనంగా రూ.3 లక్షలు ఖర్చయ్యాయని తెలిపాడు. అయితే..  ఇదే విషయమై అల్లు అర్జున్‌కు గుర్తు చేసేందుకు ఆయన మేనేజర్‌ కాంతారావును సంప్రదించగా.. కనీసం పట్టించుకోలేదని తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన బిడ్డకు వివిధ థెరపీల ఖర్చులకు సాయం అందించాలని శ్రీతేజ్ కుటుంబం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ టీమ్ ను వేడుకుంటున్నాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
IPInamdar Paresh
Dec 04, 2025 08:21:26
Hyderabad, Telangana:

Madras High Court stay orders on bala krishna akhanda 2 thandavam: బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా అఖండ 2 తాండవం రిలీజ్ కు ముందే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అఖండ 2 తాండవం రేపు డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఏపీలో టికెట్లపై పెంపుపై గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. దీంతో అభిమానులు బాలయ్య మూవీని ఎప్పుడెప్పుడు చూడాలో అని పూనకాలతో ఊగిపోతున్నారు.ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు బాలయ్య సినిమాకు బిగ్ షాక్ ఇచ్చింది.

ఈ చిత్రం విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే విధించింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనంఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  అయితే..ఈరోస్ సంస్థ, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మధ్య రచ్చ కాస్త కోర్టుకు ఎక్కింది.

14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి తమకు రూ. 28 కోట్లు రావాల్సి ఉందని, ఆ మొత్తం చెల్లించే వరకు 'అఖండ 2' సినిమాను నిలిపివేయాలని ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.  దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

'అఖండ 2' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటనే ఈ కొత్త సంస్థను కూడా ప్రారంభించారని, కాబట్టి పాత బకాయిలకు వారే బాధ్యత వహించాలని ఈరోస్ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. 

Read more: Pushapa 2 stampede: పుష్ప 2 తొక్కిసలాటకు ఏడాది.. శ్రీ తేజ్ హెల్త్ కండీషన్ చెబితే ఎవరు పట్టించుకోవట్లేదు..

ఈ క్రమంలో బాలయ్య మూవీని ఎటువంటి రూపంలో కూడా విడుదల చేయోద్దని, థియేటర్లు, ఓటీటీ, సాటిలైట్ హక్కులు, డిస్ట్రిబ్యూటషన్లకు కూడా స్టే విధిస్తు మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే..ఈ మూవీపై ఇటు అఖండ 2 మూవీ టిమ్ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో కొన్ని గంటల ముందు మా బాలయ్య మూవీకి ఏంటీ ఈ అడ్డంకులు అంటూ అభిమానులు తెగ  టెన్షన్ పడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RGRenuka Godugu
Dec 04, 2025 03:19:13
Hyderabad, Telangana:

 AVM Saravanan Passes Away: చిత్ర సినిమాలో విషాదం నెలకొంది. భారతీయ సినీ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్‌ ఈరోజు మృతి చెందారు. 86 ఏళ్ల వయసులో ఈ లెజండరీ నిర్మాత వృద్ధాప్య సమస్యల వల్ల కన్నుమూశారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎం శరవణన్‌ అందరికంటే ప్రత్యేకమే. అందరికీ సుపరిచితమే.. ఏవీఎం సంస్థను తన తండ్రి ఏవీ మెయ్యప్పన్‌ చెట్టియార్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన శివాజీ చిత్రానికి భారీ పెట్టుబడులతో అంతర్జాతీయంగా తమిళ సినిమాకు ద్వారాలు తెరిచిన ప్రముఖుడు .

ఎల్లప్పుడూ తెల్లటి దుస్తులు.. మొదటి ఫై బొట్టు.. ఆయన సున్నితమైన మాటలతో ప్రత్యేక పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎవరితో మాట్లాడిన రెండు చేతులు జోడించి అప్యాయతగా పలకరించే ఏవీఎం అధినేత ఇక లేరు. ఏవీఎం సినిమా నిర్మాణలకు ప్రత్యేక పేరుగాంచింది. ప్రముఖ నటులు అయినా రజినీకాంత్ ,కమలహాసన్ కూడా చిత్ర సీమకు పరిచయం చేసింది ఈ ఏవీఎం సంస్థ. ఈ సంస్థను 1946 లోనే ఏర్పాటు ఆయన తండ్రి ఏవీ మెయ్యప్పన్‌ ప్రారంభించగా.. ఆ తర్వాత శరవణన్‌ సంస్థ అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. ఏవీఎం సంస్థ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.. అనేక సీరియల్స్‌ కూడా తీశారు. వాటిని ఇతర భాషల్లోకి కూడా డబ్బింగ్‌ చేశారు. ఏవీఎం సంస్థ అంటేనే ఎంతో మంది ట్యాలెంటెడ్ నటులను, టెక్నీషియన్లు చిత్రసీమకు అందించింది అనే పేరు కలిగింది. ప్రస్తుతం ఈ ఏవీఎం సంస్థ బాధ్యతలను ఆయన కుమారుడు ఎం ఎస్ కుగన్‌ చూసుకుంటున్నారు.

Also Read:​ వాహనదారులకు బిగ్‌ షాక్‌.. 100 శాతం రాయితీ ఫేక్‌, అది వారికి మాత్రమే..!

Also Read:​ పీఎఫ్‌ ఖాతాదారులకు అలెర్ట్‌.. ఇక ఆ డెడ్‌లైన్‌ పొడగించే అవకాశమే లేదు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

152
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 03, 2025 08:19:35
Hyderabad, Telangana:

Bajaj Pulsar 125 Flipkart Discount Latest Offers:  ఎప్పటి నుంచో అత్యంత తగ్గింపు ధరకే బజాజ్ పల్సర్ 125 మోటర్‌ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు సమయం రానే వచ్చేసింది. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన ఈ బజాజ్ పల్సర్ 125 (BAJAJ Pulsar 125) మోటర్‌ సైకిల్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బైక్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ బైక్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో? ఇది ఏయే ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిందో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బజాజ్ పల్సర్ 125 (BAJAJ Pulsar 125) మోటర్‌ సైకిల్ 124.4 cc ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంజన్‌ 4-స్ట్రోక్, 2-వాల్వ్, ట్విన్ స్పార్క్ BSVI DTS-i ఫీచర్స్‌ ఫీచర్స్‌తో లభిస్తోంది. ఈ మోటర్‌ సైకిల్ ఇంజన్‌ 8.68 kW పవర్‌తో పాటు 10.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఫ్రంట్‌ టైర్‌కి డిస్క్ బ్రేక్ (Disc Brake) సిస్టమ్‌ కూడా లభిస్తోంది. వెనక చక్రానికి డ్రమ్ బ్రేక్ (Drum Brake) కూడా అందుబాటులో ఉంది. ఇవి రెండు యాంటీ-స్కిడ్ బ్రేకింగ్‌ సిస్టమ్‌పై పని చేస్తాయి.

ఈ మోటర్‌ సైకిల్‌ ట్యూబ్‌లెస్ టైర్లు (Tubeless Tyres)తో అందుబాటులోకి వచ్చింది. దీని వెనక భాగం నైట్రాక్స్ షాక్ అబ్జార్బర్స్ సస్పెన్షన్ (Suspension)తో మార్కెట్‌లోకి విడుదలైంది. ఇందులో సెమీ-డిజిటల్ కన్సోల్ (Semi-Digital) కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్‌కి హైలెట్‌గా డిజైన్ హైలైట్ స్టైలిష్ కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్‌ లభిస్తోంది. దీంతో పాటు సింగిల్ సీట్ (Single Seat) టైప్‌ డిజైన్‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది హాలోజెన్ హెడ్‌ల్యాంప్, LED DRLsతో వస్తోంది. 

Also Read: D-Mart కంటే 40 శాతం తగ్గింపుతో వస్తువులు లభించేది ఇక్కడే!

ఇక హైదరాబాద్ ఆన్‌రోడ్, ఆఫ్‌ రోడ్‌ ధర వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం Bajaj Pulsar 125 Carbon Fibre Single Seat వేరియంట్ ధర మార్కెట్‌లో ఎక్స్-షోరూమ్ ధర రూ. 85,414 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, RTOతో పాటు ఇతరులు ఛార్జిలు కలుపుకుని రూ.10,249 వరకు ఛార్జ్‌ అవుతాయి. అలాగే ఇన్సూరెన్స్ రూ.7,221 కలుపుకుని హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ రూ. 1,01,834కు లభిస్తుంది. ఇక ఇదే మోటర్‌ సైకిల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.7 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో కేవలం ఈ బైక్‌ రూ.94,834కే పొందవచ్చు. 

Also Read: D-Mart కంటే 40 శాతం తగ్గింపుతో వస్తువులు లభించేది ఇక్కడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

199
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 03, 2025 08:19:12
Hyderabad, Telangana:

HMD XploraOne Price: ఈ డిజిటల్ యుగంలో మార్కెట్‌లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్స్‌తో చిన్నవారితో పాటు పెద్దవారికి కూడా ఎంతో అవసరమవుతున్నాయి. ముఖ్యంగా చదువుకునే యువకు స్మార్ట్‌ఫోన్స్‌కు ఇప్పుడు అత్యవసర వస్తువుగా మారింది. చాలా మంది వీటి ద్వారానే పరీక్షలకు ప్రిపేర్‌ కూడా అవుతున్నారు. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్‌ కంపెనీ HMD మార్కెట్‌లోకి అతి త్వరలోనే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని ప్రత్యేకమైన చిన్న పిల్లల కోసం లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

HMD కంపెనీ Xploraతో కంపెనీ భాగస్వామ్యంతో పిల్లల కోసం అద్భుతమైన ఫీచర్స్‌తో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది HMD XploraOne పేరుతో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో లాంచ్‌ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని కంపెనీ కేవలం పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రత్యేకంగా కాలింగ్‌ ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన టెక్స్టింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ దృష్టి మరల్చే యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇందులో ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియా యాక్సెస్‌ కూడా ఉండే అవకాశాలు లేవని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ తల్లిదండ్రులకు పూర్తి యాక్సిస్‌ కూడా లభిస్తుంది. దీని వల్ల ఫోన్‌ మొత్తాన్ని నియంత్రించే ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో లొకేషన్‌ ట్రాకింగ్‌ ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫీచర్స్‌ను టిప్‌స్టర్ @smashx_60 అనే సోషల్ మీడియా అకౌంట్‌ నుంచి విడుదలకు ముందే లీక్‌ చేశారు. 

Also Read: D-Mart కంటే 40 శాతం తగ్గింపుతో వస్తువులు లభించేది ఇక్కడే!

HMD XploraOne స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది 3.2-అంగుళాల QVGA IPS డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా వెనక భాగంలో స్పెషల్‌గా  2-మెగాపిక్సెల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇది చాలా శక్తివంతమైన Unisoc T127 చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ 64MB ర్యామ్‌తో పాటు 128MB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు మోస్ట్ పవర్‌ఫుల్ 2000mAh బ్యాటరీని ప్యాక్‌తో లాంచ్‌ అయ్యింది. ఇందులో కంపెనీ ఛార్జింగ్‌ కోసం టైప్-C పోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, స్పెషిఫికేషన్స్‌ కంపెనీ త్వరలోనే వెల్లడించబోతోంది.

Also Read: D-Mart కంటే 40 శాతం తగ్గింపుతో వస్తువులు లభించేది ఇక్కడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

113
comment0
Report
Dec 02, 2025 16:00:57
227
comment0
Report
IPInamdar Paresh
Dec 02, 2025 15:53:04
Hyderabad, Telangana:

Jana sena party clarify on pawan kalyan statement: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల కోనసీమలో చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారిన విషయం తెలిసిందే. గతంలో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎంతో పచ్చగా ఉండేవన్నారు.కానీ ఇప్పుడు తలలు తీసేసినట్లు ఉన్నాయన్నారు.  రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయేందుకు గోదావరి జిల్లాల పచ్చదనమే కారణమన్నారు. తెలంగాణ  నేతలు గోదావరి జిల్లాల్లోపచ్చదనం బాగుంటుందని అనేవారని, దిష్టితగిలినట్లు ఉందని వెటకారంగా మాట్లాడారు.ఈ వ్యాఖ్యలపై దుమారం రాజుకుంది.

దీనిపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సినిమాటో గ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనిచ్చేదనిలేదన్నారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ బేషరతుగా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ గొడవ కాస్త తారాస్థాయికి చేరడంతో ప్రస్తుతం పవన్ సారీ చెప్పాలని పలువురు నేతలు కూడా హల్చల్ చేస్తున్నారు.ఏకంగా పవన్ ఆస్తులు అంటూ..ఏపీ,తెలంగాణ ప్రజల మధ్య కాంట్రవర్సీ రాజేసేలా ట్రోల్స్ చేస్తున్నారు.

దీనిపై తాజాగా.. జనసేన పార్టీ రియాక్ట్ అయ్యింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో చేసిన వ్యాఖ్యల్నికొంతమంది కావాలని ఉద్దేష పూర్వకంగా వక్రీకరించారని చెబుతు ఒకప్రకటన విడుదల చేసింది.

Read more: Komati Reddy Venkat Reddy: నీ సినిమాలు ఆడనివ్వం.!. పవన్ కళ్యాణ్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఇరు తెలుగు స్టేట్స్ ల మధ్య సోదర భావం ఉన్న ఈ తరుణంలో పవన్ వ్యాఖ్యల్ని కావాలని వక్రీకరించోద్దని జనసేన పార్టీ కీలక అప్పీల్ చేసింది.ఈ నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ ల మధ్య హాట్ టాపిక్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

151
comment0
Report
IPInamdar Paresh
Dec 02, 2025 14:29:45
Hyderabad, Telangana:

Akhanda 2 thandavam movie ticket prices hike in Andhra Pradesh: బాలయ్య అభిమానులు ప్రస్తుతం అఖండ 2 మూవీని ఎప్పుడు చూస్తామా అంటూ పూనకాలతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఎక్కడ చూసిన బాలయ్య అఖండ 2 తాండవం మూవీ గురించి తెగ చర్చించుకుంటున్నారు. బాలయ్య, బొయపాటి కాంబినేషన్ చూస్తే న్యూటన్  సైతం దబిడి దిబిడి కావాల్సిందే అంటూ సెటైర్ లు వేస్తున్నారు. న్యూటన్ ఒకవేళ బతికి ఉంటే.. బాలయ్య,బోయపాటిలు ఆయనకే సవాల్ విసిరే వారని కూడా తెగ రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలో అభిమానులు ఎంతగానో జోష్ తో ఎదురు చూస్తున్న బాలయ్య అఖండ 2 తాండవం మూవీ డిసెంబర్ 5 న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ చంద్రబాబు నాయుడు సర్కారు మూడు రోజుల ముందు టికెట్ల విషయంలో కీలకనిర్ణయం తీసుకుంది. 

 నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వస్తున్న అఖండ 2 : తాండవం సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతే కాకుండా.. 

అదే విధంగా.. ఈ టికెట్ ధరను రూ.600  జీఎస్టీతో పాటుగా నిర్ణయించారు. రోజుకు ఐదు షోలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్‌ షోలకు  ఏపీ సర్కారు పర్మిషన్ ఇచ్చింది.

Read more: Star Actress: ఆ డైరెక్టర్ నడుము చూపించమన్నాడు.!. షాకింగ్ నిజం రివీల్ చేసిన ప్రభాస్ మూవీ నటి..

దీనితో పాటు.. పెంచిన ధరలు విడుదల తేదీ అంటే.. డిసెంబర్‌ 5  నుంచి పది రోజుల పాటు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో జారీ చేసింది. దీంతో బాలయ్య అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. మూడు రోజుల ముందే బాలయ్య మూవీ కోసం ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

152
comment0
Report
IPInamdar Paresh
Dec 02, 2025 13:51:13
Hyderabad, Telangana:

Imran Khan Health Stable But Facing Mental Torture says Uzma khanum: పాకిస్థాన్ లో గత కొన్ని రోజులుగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే చంపేశారని వార్తలు సంచలనంగా మారాయి. దీనికి బలం చేకూర్చే విధంగా పాక్ అధికారులు కనీసం వారి కుటుంబ సభ్యుల్ని కూడా జైల్లోకి అనుమతించలేదు. అంతేకాకుండా.. ఇమ్రాన్ సానుభూతిపరులు, అభిమానులు, కుటుంబ సభ్యులు నిరసనలకు దిగిన కూడా పాక్ సర్కారు పట్టించుకోలేదు. దీని వెనుక ఏదో కుట్ర కోణం ఉందని, ఇమ్రాన్ ఖాన్ ను చంపేసి ఉంటారని చాలా మంది బలంగా నమ్మారు. దీంతో ఈరోజు రావల్పిండిలో  ఇమ్రాన్ ఖాన్ సానుభూతి పరులు నిరసనలకు దిగారు.

 

దీంతో  పాక్ ప్రభుత్వం 144 సెకన్ కూడా విధించింది.ఈ క్రమంలో పాక్ సర్కారు ఇమ్రాన్ ఖాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ ను జైల్లోకి అనుమతించింది. దీంతో కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ మరణంపై వస్తున్నరూమర్స్ కు తెరపడింది. ఇమ్రాన్ ఖాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ ను జైల్లోకి అధికారులు అనుమతించారు. దీంతో ఆమె కొద్దిసేపు ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడారు. తన సోదరుడితో భేటీ తర్వాత ఉజ్మాఖాన్ జైలు బైట తన సోదరుడి జైల్లో బతికే ఉన్నాడని చెప్పారు. అయితే..ఈ ప్రకటనతో ఆయన మరణ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ సోదరి ఉజ్మాఖాన్ మాట్లాడుతూ..

ఇమ్రాన్ ఖాన్ జనాదరణకు పాక్ ప్రభుత్వంవణికిపోతుందని చెప్పుకొచ్చింది.అందుకే ఆయన్ను ఏకాకిని చేసి, దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి తెస్తున్నాని ఆరోపణలు గుప్పించింది. కానీ జైల్లో మాత్రం తన సోదరుడ్ని తీవ్రంగా మానసికంగా హింసిస్తున్నారని ఉజ్మాఖాన్ పలు విషయాల్ని వెల్లడించారు. అయితే.. అసలు ఇన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ లేరని వస్తున్న రూమర్స్ వేళ.. ఆయన బతికే ఉన్నారన్న వార్తలు విని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more: Imran khan Death rumours: ఇమ్రాన్ ఖాన్ మరణంపై వార్తలు.. రావల్పిండిలో హైటెన్షన్.. 144 సెక్షన్..

ఎప్పటికైన ఆయన మరల తిరిగి వస్తారని ఇమ్రాన్ ఖాన్ పై తమకున్న అభిమానంను చాటుకుంటున్నారు.  మరోవైపు.. 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్.. 2022లో అవిశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయిన తర్వాత..అనూహ్యంగా నమోదైన అవినీతి కేసుల కింద 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

157
comment0
Report
Advertisement
Back to top